Kawasaki bikes
-
భారత్‌లో రూ.13.49 లక్షల బైక్ లాంచ్: బుకింగ్స్ షురూ
కవాసకి దేశీయ మార్కెట్లో 2025 నింజా 1100ఎస్ఎక్స్ లాంచ్ చేసింది. దీని ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ.. డెలివరీలు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.నింజా 1100ఎస్ఎక్స్ బైక్ లిక్విడ్ కూల్డ్, 1099సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 rpm వద్ద, 136 హార్స్ పవర్ & 7600 rpm వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.చూడటానికి కవాసకి నింజా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, షార్ప్ అండ్ అగ్రెసివ్ ఫ్రంట్ ఫెయిరింగ్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులో 4.3 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి వాటిని చూపిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ పవర్ మోడ్లు, హ్యాండిల్‌బార్ మౌంటెడ్ USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కవాసకి నింజా 1100ఎస్ఎక్స్ బైకుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే ధర పరంగా ట్రయంఫ్ రోడ్-బియాస్డ్ టైగర్ 900 జీటీ పోటీపడుతోంది. కాగా ఈ బైక్ కోసం కవాసకి డీలర్‌షిప్‌లలో రూ. 50,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. -
2025 కవాసకి కొత్త బైక్.. రేటెంతో తెలుసా?
కవాసకి ఇండియా తన జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైకును కొత్త కలర్ ఆప్షన్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 9.42 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పుడు లైమ్ గ్రీన్/ఎబోనీ/బ్లిజార్డ్ వైట్ అనే కొత్త రంగులో అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ 2024 మోడల్ కంటే రూ. 32,000 ఖరీదైనది.కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ 399సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్-ఫోర్ ఇంజన్ పొందుతుంది. ఇది 14500 rpm వద్ద 77 Bhp పవర్, 13000 rpm వద్ద 39 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.2025 కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ ట్విన్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, అప్స్వెప్ట్ టెయిల్ లాంప్, టెన్సిల్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ వంటివి పొందుతుంది. యూఎస్డీ ఫోర్క్, బ్యాక్-లింక్ మోనోషాక్ కలిగిన ఈ బైక్ 17 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. సుమారు 189 కేజీల బరువున్న కొత్త కవాసకి బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీ.నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ స్పోర్ట్, రోడ్, రెయిన్ లేదా కస్టమ్ అనే నాలుగు రైడ్ మోడ్‌లను పొందుతుంది. ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, కలర్డ్ టీఎఫ్టీ డిస్ప్లే వంటివి కూడా ఈ బైకులో చూడవచ్చు. ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కంపెనీ అధికారిక డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. -
రూ.1.32 లక్షల కవాసకి బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి బైక్ పేరు 'డబ్ల్యూ175 స్టీట్'. దీని ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 12000 తక్కువ ధరకే లభిస్తుంది. బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌లతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 177 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 13 హార్స్ పవర్, 13.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్.. కవాసకి డబ్ల్యూ175 స్టీట్ బైక్ హాలోజన్ హెడ్‌లైట్, అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటివి పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ తక్కువ ధర వద్ద విడులవడంతో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్..
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించింది. ఎంపిక చేసిన కొన్ని బైక్స్ మీద కంపెనీ రూ. 20,000 నుంచి రూ. 60,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 👉 కవాసకి వెర్సిస్ 650 అడ్వెంచర్ టూరర్ కొనుగోలుపై సంస్థ రూ. 20,000 తగ్గింపుని అందిస్తోంది. రూ. 7.77 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ డిస్కౌంట్ తరవాత రూ. 7.57 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. 👉 నింజా 650 స్పోర్ట్‌బైక్ కొనుగోలుపైన కవాసకి రూ. 35,000 తగ్గింపుని అందిస్తోంది. దీంతో రూ. 7.16 లక్షల ధర వద్ద ఉన్న ఈ బైకుని రూ. 6.81 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. 👉 కంపెనీ అందించే గరిష్ట మొత్తం రూ. 60,000. ఈ డిస్కౌంట్ కేవలం వల్కన్ S క్రూయిజర్‌పై మాత్రమే లభిస్తుంది. రూ. 7.10 లక్షల ఖరీదైన ఈ బైకుని డిస్కౌంట్ తరువాత రూ. 6.50 లక్షలకు కొనుగోలు చేసుకోవచ్చు. 👉 కంపెనీ ప్రస్తుతం ట్విన్ సిలిండర్ మోడళ్లపై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది. రానున్న రోజుల్లో సింగిల్ సిలిండర్ మోడల్స్ మీద కూడా మంచి తగ్గింపులను అందించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
కవాసాకి కొత్త బైక్ వచ్చేసింది: ధర వింటే షాకవుతారు!
2024 Kawasaki Z900RS: కవాసాకి ఇండియా Z900RS 2024 బైక్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధరను రూ. 16.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. జెడ్ 900ఆర్ఎస్ 2024 మోడల్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్ పెయింట్ థీమ్‌లో లభిస్తుంది. 2024 మోడల్ బైక్లోదాదాపు పాత ఫీచర్లనే అందించింది.ముందు భాగంలో రౌండ్ హెడ్‌లైట్, ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టియర్-డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, సింగిల్-పీస్ సాడిల్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్,, రెండు చివర్లలో స్పోక్-స్టైల్ కాస్ట్ వీల్స్. 2024 మోడల్బైక్లో ఫుల్-LED లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-ఛానల్ ABS, కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ , అసిస్ట్ , స్లిప్పర్ క్లచ్ మెకానిజంతో తీసుకొచ్చింది. హార్డ్‌వేర్‌లో ట్విన్ 300mm ఫ్రంట్ డిస్క్‌లు, సింగిల్ 250mm రియర్ రోటర్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ,రియర్ మోనోషాక్ ఉన్నాయి. ఇంజీన్ 948cc, ఇన్లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటి. సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడిన ఈ మోటార్ గరిష్టంగా 8,500rpm వద్ద 107bhp , 6,500rpm వద్ద 95Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఇంజన్ సరికొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.భారత మార్కెట్లో ట్రయంఫ్ బోన్నెవిల్లే T100 ,స్పీడ్ ట్విన్ వంటి వాటికి గట్టిపోటి ఇవ్వనుందని మార్కెట్ అంచనాలు. -
2023 కవాసకి వల్కాన్-ఎస్ లాంచ్, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే
సాక్షి, ముంబై: కవాసకి ఇండియా భారత మార్కెట్లో వినియోగదారుల కోసం 2023 వల్కన్ ఎస్ బైక్‌ను లాంచ్ చేసింది. మిడిల్‌వెయిట్ క్రూజర్ బైక్ వల్కన్ ఎస్ మోడల్‌తో పోలిస్తే 2023 వెర్షన్ బైక్‌ను కొన్ని అప్గ్రేడ్లతో విడుదల చేసింది. (2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్!) 2023 కవాసకి వల్కాన్ ఎస్ ఇంజీన్ 659 సీసీ ప్యార్లల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది. ఇది 7500rpm వద్ద 59.9bhp శక్తిని , 6600rpm వద్ద 62.4Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా జతచేసింది. 14 లీటర్ ఇంధన ట్యాంక్, 705 మిమీ సీట్ ఎత్తు, 18 అంగుళాల ఫ్రంట్వీల్స్, 17 అంగుళాల రియర్వీల్స్, 130 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్ ఛానల్ ABS (ప్రామాణికం)తో ఈ బైక్‌ను అందిస్తోంది. అయితే బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పులేవీలేవు. ఈ క్రూయిజర్ బైక్‌లో సింగిల్ పాడ్ హెడ్ ల్యాంప్, టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. 2023 కవాసకి వల్కాన్ ఎస్ ధర ఇండియాలో దీని రూ.7.10లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మెటాలిక్ మ్యాక్ కార్బన్ గ్రే కలర్ స్కీమ్‌లో మాత్రమే ఈ 2023 వెర్షన్ బైక్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 , బెనెల్లీ 502C ఈ సరికొత్త బైక్‌కి గట్టి పోటీ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (ఇదీ కూడా చదవండి: వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!) -
రూ. 16.47 లక్షల కొత్త కవాసకి బైక్
భారతీయ మార్కెట్లో కవాసకి ఇండియా కొత్త జెడ్900ఆర్ఎస్ (Z900RS) బైక్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 16.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది మన దేశానికీ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) రూపంలో వస్తుంది. కావున ధర దాని మునుపటి మోడల్ ఏజ్ఎక్స్-ఆర్ కంటే ఎక్కువగా ఉంటుంది. 2023 కవాసకి జెడ్900ఆర్ఎస్ బైక్ 948 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 107 బీహెచ్పీ పవర్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కొత్త జెడ్900ఆర్ఎస్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించేవిధంగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, క్రోమ్ ఫినిష్డ్ వీల్ రిమ్స్, క్రోమ్ ఎగ్జాస్ట్‌తో కూడిన మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ బైక్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్/మెటాలిక్ ఇంపీరియల్ రెడ్ & క్యాండీ టోన్ బ్లూ అనే రెండు కలర్స్‌లో లభిస్తుంది. (ఇదీ చదవండి: Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!) ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుంది. స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో సింగిల్ పీస్ సీటు పొందుతుంది. ఈ బైకులో ట్విన్ 300 మిమీ ఫ్రంట్ డిస్క్‌లు 250 మిమీ సింగిల్ రియర్ డిస్క్‌లు అమర్చబడి ఉంటాయి. డ్యూయల్-ఛానల్ ABS స్టాండర్డ్‌గా లభిస్తుంది. (ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ స్టార్ 'రామ్ చరణ్' ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?) -
భారత్‌లో రూ. 27.22 లక్షల కవాసకి బైక్ విడుదల: పూర్తి వివరాలు
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో రెండు కొత్త బైకులను విడుదల చేసింది. ఇందులో ఒకటి ZH2 కాగా, మరొకటి ZH2 SE. వీటి ధరలు వరుసగా రూ. 23 లక్షలు, రూ. 27.22 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు వాటి మునుపటి మోడల్స్ కంటే రూ. 30,000 ఎక్కువ. బుకింగ్‌లు డీలర్‌షిప్‌లో లేదా ఆన్లైన్లో చేయవచ్చు. కవాసకి ఈ రెండు కొత్త బైకులను ఒకే మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే కలర్ ఆప్షన్లో అందిస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే.. జెడ్హెచ్2, జెడ్హెచ్2 ఎస్ రెండూ కూడా 998 సీసీ ఇన్లైన్, ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ సూపర్ చార్జ్డ్ ఇంజిన్ కలిగి 197 బీహెచ్‌పి పవర్, 137 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 1,299కే కొత్త ఇయర్‌ఫోన్స్.. ఒక్క ఛార్జ్‌తో 40 గంటలు) కవాసకి లేటెస్ట్ బైక్స్ ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ TFT కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ రైడింగ్ మోడ్లు, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకుండా స్కైహుక్ టెక్నాలజీతో కవాసకి క్విక్ షిఫ్టర్ (KQS), కవాసకి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సస్పెన్షన్ (KECS), కవాసాకి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సస్పెన్షన్ (KECS) వంటివి కూడా ఇందులో ఉన్నాయి. -
ఈ కంపెనీ బైక్ ధరలు మరింత ప్రియం..!
ప్రముఖ రేసింగ్ బైక్‌ల తయారీదారు కవాసకీ పలు ఏంపిక చేయబడిన బైక్‌ల ధరలను గణనీయంగా పెంచనుంది. 2021 ఆగష్టు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఎంపిక చేయబడిన పలు బైక్‌ల కొత్త ధరలను కవాసకి ఇండియా ప్రకటించింది. ఎంట్రీ లెవల్ బైక్‌ల ధరల్లో కవాసకి ఏలాంటి మార్పు చేయలేదు. మిడిల్‌వెయిట్, లీటర్-క్లాస్ బైక్‌ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. మోడల్‌ను బట్టి 6000 నుంచి రూ.15,000 వరకు కవాసాకి బైక్ ధరలు పెరిగాయి. ఈ త్రైమాసికంలో ధరలను పెంచిన మొదటి ప్రీమియం బైక్ తయారీదారుగా కవాసాకి నిలిచింది. పలు కవాసకి బైక్‌ల నూతన ధరలు మోడల్ ప్రస్తుత ధర ఆగస్టు 1 నుంచి కొత్త ధర వ్యత్యాసం కవాసకి నింజా 650 రూ.6.54లక్షలు రూ. 6.61 లక్షలు రూ. 7000 కవాసకి జెడ్ 650 రూ.6.18లక్షలు రూ. 6.24 లక్షలు రూ. 6000 కవాసకి వెర్సిస్ 650 రూ.7.08 లక్షలు రూ. 7.15 లక్షలు రూ. 7,000 కవాసకి వల్కాన్ ఎస్ రూ. 6.04 లక్షలు రూ. 6.10 లక్షలు రూ. 6,000 కవాసకి డబ్య్లూ800 రూ. 7.19 లక్షలు రూ. 7.26 లక్షలు రూ.7,000 కవాసకి జెడ్900 రూ. 8.34 లక్షలు రూ. 8.42 లక్షలు రూ. 8,000 కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ రూ. 11.29 లక్షలు రూ. 11.40 లక్షలు రూ. 11,000 కవాసకి నింజా జెడ్ఎక్స్ -10 ఆర్ రూ. 14.99 లక్షలు రూ. 15.14 లక్షలు రూ. 15,000 కవాసకి వెర్సిస్ 1000 రూ. 11.44 లక్షలు రూ. 11.55 లక్షలు రూ.11,000 -
హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త హైబ్రిడ్ ఆధారిత పవర్‌ట్రెయిన్‌ను ఆటో దిగ్గజం కావసాకి తాజాగా ప్రదర్శించింది. తద్వారా భవిష్యత్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో కావసాకి మోటార్ సైకిళ్లను రూపొందించే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది. నిజానికి బైకులలో హైబ్రిడ్ టెక్నాలజీ అభివృద్ధి తొలి దశలో ఉన్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. పూర్తిస్థాయి కంబ్యూషన్ ఇంజిన్, పూర్తి ఎలక్ట్రిక్ ఇంజిన్ లేదా ఈ రెండింటి కలయికలో బైకులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు కావసాకి చెబుతోంది. జాతీయ రహదారులకు కంబ్యూషన్, సిటీలలో ఎలక్ట్రిక్, రేస్ ట్రాకులు తదితర అవసరాలకు ఈ రెండింటి కలయికతోకూడిన మోటార్ సైకిళ్ల తయారీపై దృష్టిపెట్టినట్లు తెలియజేసింది. చదవండి: (కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ) ఫోటోటైప్ మోటార్ పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ప్రోటోటైప్ మోటార్‌ను కావాసాకి తాజాగా ప్రదర్శించింది. కంబ్యూషన్ ఇంజిన్‌గానూ స్విచ్ఓవర్ చేసుకునేందుకు వీలు కలిగిఉన్న ఈ ప్రొటోటైప్ ద్వారా యూరోపియన్ మార్కెట్లకు అనువైన బైకులను రూపొందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. 2030కల్లా యూకేసహా యూరోప్‌లోని పలు నగరాలు కఠినతర యాంటీకంబ్యూషన్ చట్టాలను తీసుకువచ్చే ప్రణాళికల్లో ఉన్నాయి. దీంతో హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా బైకులను రూపొందించగలిగితే భారీ మార్కెట్‌కు అవకాశముంటుందని ఆటో రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు వీలుగా గిగాసెల్ నికెల్-మెటల్ హైబ్రిడ్(ఎన్ఐఎంహెచ్) టెక్నాలజీని కావసాకి అభివృద్ధి చేస్తోంది. దీనిని హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌లో వినియోగంపై పరిశీలనలు చేయనున్నట్లు తెలుస్తోంది. హెల్మెట్ ద్వారా హెల్మెట్ ఆధారిత వాయిస్ కమాండ్స్ విధానాన్ని సైతం కావసాకి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా హెల్మెట్ వాయిస్ యాక్టివేటెడ్ సిస్టమ్‌కు రూపకల్పన చేస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తద్వారా రైడర్లు చూపు తిప్పుకోకుండానే ఇంధనం, వాతావరణం, మీడియా లేదా మార్గనిర్దేశన తదితర సౌకర్యాలను అందించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ ఇటీవల తెలియజేసింది. -
‘900 సీసీ బైక్ అయినా చక్కని శబ్దం’
సాక్షి, న్యూఢిల్లీ: కుర్రకారు జోష్‌కు తగ్గట్టు జపాన్‌కు చెందిన కవసాకి మోటార్ తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బైక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. మంగళవారం ‘జడ్ 900 ఆర్ఎస్’ మోడల్లో బ్లాక్ కలర్ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 1970 ప్రాంతంలో ద్విచక్ర వాహనాల తయారీలో కొత్త ఒరవడి సృష్టించిన ఈ సంస్థ, అప్పటి థీమ్‌లను అనుసరించి ‘జడ్ 900 ఆర్ఎస్’ను తయారు చేయడం విశేషం. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన క్యాండీ టోన్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌కి మంచి ఆదరణ లభించినందునే నలుపు రంగు మోడల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియా కవసాకి మేనేజింగ్ డైరెక్టర్ యుటకా యంషితా చెప్పారు. జపాన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ సంఖ్యలో తయారు చేసిన ఆరెంజ్ కలర్ వేరియంట్‌కి భారతీయ సంపన్న వర్గాల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. 15.3 లక్షల రూపాయల (ఎక్స్ షోరూం) ధర గల ఈ బైక్ 900 సీసీ సామర్థ్యం కలిగి ఉందని ఆయన తెలిపారు. బైక్ నడిచేప్పుడు వాహనదారుడికి గొప్ప అనుభూతినిచ్చేందుకు ధ్వని ట్యూనింగ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలిపారు. తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నా లోతైన ఎగ్జాస్టర్ (సైలెన్సర్) వల్ల ఇంజన్ శబ్దం ఆస్వాదించవచ్చని అన్నారు. అప్పటి మోడళ్లలో ఒకటైన జడ్1 ను అనుకరించి కొత్త మోడళ్లకు రూపకల్ప చేసినట్టు యంషితా పేర్కొన్నారు. జడ్ 900 ఆర్ఎస్ ఫీచర్లు: నాలుగు సిలిండర్లు గల ఇంజిన్ కవసాకి ట్రాక్షన్ కంట్రోల్ ఎల్ఈడీ హెడ్ లైట్ మల్టీ ఫంక్షన్ ఎల్ఈడీ స్క్రీన్ -
కవసాకి సూపర్‌బైక్‌ల ధర భారీగా తగ్గింపు
పుణే : సూపర్‌బైక్‌లను తయారు చేసే కవసాకి కంపెనీ, స్థానికంగా తయారు చేసిన నింజా జెడ్ఎక్స్-10ఆర్, నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని స్థానికంగా రూపొందించడంతో, వీటి ధరలను కూడా భారీగా తగ్గించింది. నింజా జెడ్ఎక్స్-10ఆర్ ధరను రూ.12.80 లక్షలకు తగ్గించగా.. నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ను రూ.16.10 లక్షలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు బైక్‌ల పాత ధరలు రూ.18.80 లక్షలు, రూ.21.90 లక్షలుగా ఉన్నాయి. అంటే ఇరు బైక్‌లపై ఆరు లక్షల మేర ధరను కోత పెట్టింది. ఈ ధర తగ్గింపునకు కారణంగా స్థానికంగా వీటిని అసెంబుల్ చేయడమేనని కంపెనీ తెలిపింది. పుణేకు సమీపంలోని ఛకన్ లో వీటిని అసెంబుల్ చేసినట్టు చెప్పింది. ఈ రెండు బైక్‌ల బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కవసాకి డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్పెషల్ ప్రీ-ఆర్డర్ ధరలు జూలై చివరి వరకే ఉంటాయని, ఆ అనంతరం మళ్లీ ధరలను పెంచుతామని కంపెనీ వెల్లడించింది. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే వాటిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. కేటాయించిన ఉత్పత్తి అనంతరం బుకింగ్స్‌ను ముగుస్తాయని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా కవసాకి సూపర్‌బైక్‌లను కొనుగోలు చేయాలనుకుంటే, ఇదే సరియైన సమయమని కంపెనీ చెబుతోంది.కేఆర్టీ ఎడిషన్‌లో ఆకుపచ్చ రంగులో కొత్త నింజా జెడ్ఎక్స్-10ఆర్ అందుబాటులో ఉండగా... నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ కేవలం నలుపు రంగులో మాత్రమే లభ్యమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కవసాకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ వివిధ రంగుల ఆప్షన్లలో మూడు వేరియంట్లను ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చౌకైన ఫ్లాగ్షిప్ సూపర్‌బైక్ ఏదైనా ఉందా? అంటే అది జెడ్ఎక్స్-10ఆర్ అని కంపెనీ చెబుతోంది. ఈ మోటార్‌సైకిళ్లు 998సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రూపొందాయి. 197బీహెచ్పీ, 113.4 ఎన్ఎం టర్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో దీన్ని ఇంజిన్ రూపొందింది. కవసాకి లాంచ్ కంట్రోల్, కవసాకి ట్రాక్షన్ కంట్రోల్, కవసాకి బ్రేకింగ్ కంట్రోల్, క్విక్ సిఫ్టర్, కార్నర్ మేనేజ్మెంట్ ఫంక్షన్, ఏబీసీ వంటి ఫీచర్లు ఈ బైక్‌లలో ఉన్నాయి. -
జిల్జిగేల్మన్న కవసాకి బైక్స్
ఎన్నో రోజులుగా వస్తున్న ఊహాగానాలకు కవసాకి చెక్ పెట్టింది. దేశీయ టూ-వీలర్ మార్కెట్‌కు రెండు సరికొత్త బైక్స్‌ను ఆటో ఎక్స్పో 2018లో పరిచయం చేసింది. దానిలో ఒకటి నింజా హెచ్2 ఎస్ఎక్స్, మరొకటి హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈ బైక్స్. కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ ధర రూ.21.8 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈ ధర రూ.26.8 లక్షల నుంచి మొదలవుతోంది. సీబీయూ మార్గం ద్వారా నింజా హెచ్2 బైక్‌ను భారత్‌లో కంపెనీ విక్రయించనుంది. ఎస్ఎక్స్ రేంజ్ బైక్స్‌ను ఇటీవలే అంతర్జాతీయంగా కవసాకి తీసుకొచ్చింది. సూపర్ ఛార్జ్డ్ ఇంజిన్‌తో కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ రూపొందింది. స్పోర్ట్స్ టూరింగ్ సెగ్మెంట్లో వచ్చిన తొలి వాహనం ఇదే కావడం విశేషం. ఈ కొత్త కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ బైక్, హెచ్2 కంటే 18 కేజీలు ఎక్కువ బరువు ఉంది. ప్రతిరోజూ రైడింగ్ చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ సూపర్ ఛార్జ్డ్ ఇంజిన్‌ను కవసాకి అభివృద్ధి చేసింది. ఈ ఇంజిన్ కొత్త సిలిండర్ హెడ్, పిస్టోన్, క్రాంక్‌షాఫ్ట్, కామ్‌షాఫ్ట్, థొరెటెల్ బాడీని కలిగి ఉండనుంది. సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది రూపొందింది. నింజా హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈకి ఎల్ఈడీ కార్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. నింజా హెచ్2 ఎస్ఎక్స్లో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. దూరప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. నింజా హెచ్2 ఎస్‌ఎక్స్‌తో పాటు కవసాకి వాల్కన్ ఎస్ 650 క్రూయిజర్‌ను కూడా కవసాకి ప్రదర్శించింది. ఇటీవల లాంచ్‌చేసిన జడ్900, జడ్ఎక్స్-10ఆర్‌లను కూడా ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. -
కవాసాకి.. రెండు కొత్త లగ్జరీ బైకులు
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం కవాసాకి తాజాగా జడ్1000, నింజా 1000 పేరిట భారత్‌లో రెండు ప్రీమియం సూపర్‌బైక్‌లను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 12 లక్షలుగా (ఢిల్లీలో షోరూం ధర) ఉంటుంది. ఒక్కో మోడల్లో ఏటా కనీసం 100 బైక్‌లను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు కంపెనీ భారత విభాగం డిప్యూటీ ఎండీ నిస్కికావా షిగెటో తెలిపారు. అలాగే సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన మరో రెండు మోడల్స్ (జడ్ఎక్స్-14ఆర్, జడ్ఎక్స్-10ఆర్) అమ్మకాలు సుమారు 50 దాకా ఉండగలవని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. జడ్1000, నింజా 1000 బైక్‌లలో 1,043 సీసీ సామర్ధ్యం గల ఇంజిన్లు ఉంటాయి. వీటిని జపాన్ నుంచి నేరుగా దిగుమతి చేసుకుని పుణె, ఢిల్లీలోని కవాసాకి షోరూమ్‌లలో విక్రయిస్తారు. కంపెనీ ఇప్పటికే నింజా 300, నింజా 600 బైక్‌లను భారత్‌లో విక్రయిస్తోంది. వీటి రేటు రూ. 3.5 లక్షల నుంచి రూ. 5 లక్షల దాకా ఉంది.