కవసాకి నింజా హెచ్2 ఎస్‌ఎక్స్ బైక్
ఎన్నో రోజులుగా వస్తున్న ఊహాగానాలకు కవసాకి చెక్ పెట్టింది. దేశీయ టూ-వీలర్ మార్కెట్‌కు రెండు సరికొత్త బైక్స్‌ను ఆటో ఎక్స్‌పో 2018లో పరిచయం చేసింది. దానిలో ఒకటి నింజా హెచ్2 ఎస్‌ఎక్స్, మరొకటి హెచ్2 ఎస్‌ఎక్స్ ఎస్‌ఈ బైక్స్. కవసాకి హెచ్2 ఎస్‌ఎక్స్ ధర రూ.21.8 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. కవసాకి హెచ్2 ఎస్‌ఎక్స్ ఎస్‌ఈ ధర రూ.26.8 లక్షల నుంచి మొదలవుతోంది. సీబీయూ మార్గం ద్వారా నింజా హెచ్2 బైక్‌ను భారత్‌లో కంపెనీ విక్రయించనుంది. ఎస్‌ఎక్స్ రేంజ్ బైక్స్‌ను ఇటీవలే అంతర్జాతీయంగా కవసాకి తీసుకొచ్చింది.
సూపర్ ఛార్జ్‌డ్ ఇంజిన్‌తో కవసాకి హెచ్2 ఎస్‌ఎక్స్ రూపొందింది. స్పోర్ట్స్ టూరింగ్ సెగ్మెంట్‌లో వచ్చిన తొలి వాహనం ఇదే కావడం విశేషం. ఈ కొత్త కవసాకి హెచ్2 ఎస్‌ఎక్స్ బైక్, హెచ్2 కంటే 18 కేజీలు ఎక్కువ బరువు ఉంది. ప్రతిరోజూ రైడింగ్ చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ సూపర్ ఛార్జ్‌డ్ ఇంజిన్‌ను కవసాకి అభివృద్ధి చేసింది. ఈ ఇంజిన్ కొత్త సిలిండర్ హెడ్, పిస్టోన్, క్రాంక్‌షాఫ్ట్, కామ్‌షాఫ్ట్, థొరెటెల్ బాడీని కలిగి ఉండనుంది. సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది రూపొందింది. నింజా హెచ్2 ఎస్‌ఎక్స్ ఎస్‌ఈకి ఎల్‌ఈడీ కార్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. నింజా హెచ్2 ఎస్‌ఎక్స్‌లో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. దూరప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. నింజా హెచ్2 ఎస్‌ఎక్స్‌తో పాటు కవసాకి వాల్కన్ ఎస్ 650 క్రూయిజర్‌ను కూడా కవసాకి ప్రదర్శించింది. ఇటీవల లాంచ్‌చేసిన జడ్900, జడ్‌ఎక్స్-10ఆర్‌లను కూడా ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment