Auto Expo 2018
-
నోయిడాలో ప్రారంభమైన ఆటోఎక్స్‌పో
-
కొత్త మారుతి స్విఫ్ట్ లాంచ్
గ్రేటర్ నోయిడా : స్విఫ్ట్ అభిమానుల ఎదురుచూపులకు స్వస్తి పలికిన మారుతీ సుజుకీ మూడో జనరేషన్‌కు చెందిన కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను నేడు ఆటో ఎక్స్పో 2018లో లాంచ్ చేసింది. ఈ కొత్త వెహికిల్ ధర రూ.5 లక్షల నుంచి ప్రారంభం. పాత మోడల్‌తోనే ఇప్పటికే పాపులర్ కారుగా పేరు తెచ్చుకున్న స్విఫ్ట్, కొత్త రూపకల్పనతో మరింత ఆకట్టుకోబోతుంది. ఈ కొత్త స్విఫ్ట్ పాత దానికి కంటే మరింత ప్రీమియంగా ఉండబోతుంది. 1.21 వీటీవీటీ పెట్రోల్ ఇంజిన్‌ను ఇది కలిగి ఉంది. పాత స్విఫ్ట్ కంటే 7.8 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఇది అందిస్తోంది. డీజిల్ డీడీఐఎస్ 190 ఇంజిన్‌ను కూడా ఇది కలిగి ఉంది. పాత దానికంటే 12.7 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఈ కొత్త స్విఫ్ట్ ఆఫర్ చేస్తోంది. ఆటో గేర్ స్విఫ్ట్ టెక్నాలజీతో ఇది రూపొందింది. 5వ జనరేషన్ హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై మారుతీ సుజుకీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు ఉన్నమోడల్స్కు పూర్తిగా భిన్నంగా, మోడరన్ లుక్స్‌లో, స్పోర్టీగా, మోర్ ప్రీమియంగా ఈ స్విఫ్ట్‌ను ప్రవేశపెడుతోంది. కొత్త స్విఫ్ట్ పొడవులో 10ఎంఎం చిన్నది. ప్రస్తుతమున్న మోడల్‌తో పోలిస్తే 40ఎంఎం వెడల్పు, 35ఎంఎం లోయర్, 20ఎంఎం లాంగర్ వీల్‌బేస్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. -
జిల్జిగేల్మన్న కవసాకి బైక్స్
ఎన్నో రోజులుగా వస్తున్న ఊహాగానాలకు కవసాకి చెక్ పెట్టింది. దేశీయ టూ-వీలర్ మార్కెట్‌కు రెండు సరికొత్త బైక్స్‌ను ఆటో ఎక్స్పో 2018లో పరిచయం చేసింది. దానిలో ఒకటి నింజా హెచ్2 ఎస్ఎక్స్, మరొకటి హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈ బైక్స్. కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ ధర రూ.21.8 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈ ధర రూ.26.8 లక్షల నుంచి మొదలవుతోంది. సీబీయూ మార్గం ద్వారా నింజా హెచ్2 బైక్‌ను భారత్‌లో కంపెనీ విక్రయించనుంది. ఎస్ఎక్స్ రేంజ్ బైక్స్‌ను ఇటీవలే అంతర్జాతీయంగా కవసాకి తీసుకొచ్చింది. సూపర్ ఛార్జ్డ్ ఇంజిన్‌తో కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ రూపొందింది. స్పోర్ట్స్ టూరింగ్ సెగ్మెంట్లో వచ్చిన తొలి వాహనం ఇదే కావడం విశేషం. ఈ కొత్త కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ బైక్, హెచ్2 కంటే 18 కేజీలు ఎక్కువ బరువు ఉంది. ప్రతిరోజూ రైడింగ్ చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ సూపర్ ఛార్జ్డ్ ఇంజిన్‌ను కవసాకి అభివృద్ధి చేసింది. ఈ ఇంజిన్ కొత్త సిలిండర్ హెడ్, పిస్టోన్, క్రాంక్‌షాఫ్ట్, కామ్‌షాఫ్ట్, థొరెటెల్ బాడీని కలిగి ఉండనుంది. సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది రూపొందింది. నింజా హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈకి ఎల్ఈడీ కార్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. నింజా హెచ్2 ఎస్ఎక్స్లో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. దూరప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. నింజా హెచ్2 ఎస్‌ఎక్స్‌తో పాటు కవసాకి వాల్కన్ ఎస్ 650 క్రూయిజర్‌ను కూడా కవసాకి ప్రదర్శించింది. ఇటీవల లాంచ్‌చేసిన జడ్900, జడ్ఎక్స్-10ఆర్‌లను కూడా ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. -
బీఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాండ్ టురిస్మోతో సచిన్
-
వావ్.. షో!
కార్ల పండుగ మొదలైంది. 14వ ఆటోఎక్స్‌పో గురువారం మధ్యాహ్నం గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో అధికారికంగా ప్రారంభమౌతుంది. అయితే మీడియా, కార్పొరేట్ ప్రతినిధులకు బుధవారం నుంచి అనుమతించారు. ప్రజలకు 914 వరకు అందుబాటులో ఉంటుంది.వాహన విడిభాగాల తయారీ కంపెనీల సంఘం(ఏసీఎంఏ), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), వాహన తయారీ కంపెనీల సంఘం (సియామ్) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈసారి షోలో కంపెనీలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పర్యావరణ అనుకూల టెకాల్నజీలకు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. దేశీ, విదేశీ కంపెనీలు వాటి ప్రొడక్టులను, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించాయి. మారుతీ సుజుకీ: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కాన్సెప్ట్ కాంపాక్ట్ కారు ఆవిష్కరించింది. దీని పేరు కాన్సెప్ట్ ప్యూచర్ ఎస్. ఇందులో ఎస్యూవీ ప్రత్యేకతలు ఉండటం విశేషం. కంపెనీ అలాగే ఈవీ కాన్సెప్ట్ ‘సర్వైవర్’ కారును కూడా ప్రదర్శించింది. ‘2020 నాటికి బీఎస్–6 ప్రమాణాలకు అనువైన ప్రొడక్టులను తయారుచేస్తాం. 2020లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. వీటిని దేశీయంగానే రూపొందిస్తాం’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవ తెలిపారు. హోండా: జపాన్‌కు చెందిన హోండా కంపెనీ మూడు కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఆల్ న్యూ అమేజ్, సీఆర్–వీ, సివిక్ సెడాన్ అనేవి ఇందులో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఆరు మోడళ్లను భారత్ మార్కెట్లోకి తెస్తామని కంపెనీ ప్రెసిడెంట్ టకహిరో హచిగో తెలిపారు. కంపెనీ అలాగే పలు ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. రెనో: ఫ్రాన్స్ కంపెనీ రెనో.. రెండు ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వెహకల్స్ను ఆవిష్కరించింది. ట్రెజోర్, జోయి ఇ–స్పోర్ట్ అనేవి వీటి పేర్లు. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి స్పష్టమైన పాలసీ కోసం ఎదురుచూస్తున్నాం. దీని ఆధారంగా భవిష్యత్ వ్యూహాలు ఉంటాయి’ అని రెనో ఇండియా పేర్కొంది. కంపెనీ అలాగే ఫార్ములా వన్ కారు ‘ఆర్.ఎస్.17’, క్విడ్ సూపర్ హీరో ఎడిషన్‌ను ప్రదర్శనకు ఉంచింది. హ్యుందాయ్: దక్షిణ కొరియాకు వాహన కంపెనీ తన ప్రీమియం కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ‘ఎలైట్ ఐ20’లో కొత్త వెర్షన్‌ను తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.5.34–రూ.9.15 లక్షలు. మూడేళ్లలో భారత్‌లో రూ.6,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వెహికల్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇక తన పాపులర్ మోడల్ శాంట్రోను ఈ ఏడాది దీపావళీకి మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముంది. సుజుకీ మోటార్‌సైకిల్: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తాజాగా 125 సీసీ స్కూటర్ బర్గ్మాన్ స్ట్రీట్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. అలాగే సబ్–1,000 సీసీ విభాగంలో జీఎస్ఎక్స్–ఎస్750 బైక్‌ను ప్రదర్శించింది. క్రూయిజర్ బైక్ ఇన్ట్రూడర్లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. కంపెనీ దాదాపు స్కూటర్, మోటార్‌సైకిల్, బిగ్ బైక్ సెగ్మెంట్లలో మొత్తంగా 17 మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది. హీరో మోటొకార్ప్: 200 సీసీ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ‘ఎక్స్‌పల్స్’ను, రెండు కొత్త 125 సీసీ స్కూటర్లను ఆవిష్కరించింది. పియా జియో: ఇటలీకి చెందిన పియాజియో 125 సీసీ బైక్ ‘అప్రిలియా ఎస్ఆర్’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.65,310 (ఎక్స్‌షోరూమ్ పుణే). కంపెనీ అలాగే వెస్పా స్కూటర్లను, ఇ–స్కూటర్ ఎలెట్రికాను ప్రదర్శనకు ఉంచింది. హోండా మోటార్‌సైకిల్: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా 160 సీసీ బైక్ ఎక్స్–బ్లేడ్‌ను ఆవిష్కరించింది. అలాగే దాదాపు 10 మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది. టీవీఎస్ మోటార్: టీవీఎస్ మోటార్ తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ‘క్రియానో’, 220 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ బైక్ ‘జెప్పెలిన్’ను ఆవిష్కరించింది. అలాగే అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ బైక్‌ను ప్రదర్శనకు ఉంచింది. యమహా: యమహా ఇండియా స్పోర్ట్స్ బైక్ వైజెడ్ఎఫ్–ఆర్15లో కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది. ధర రూ.1.25 లక్షలు . టాటా మోటార్స్: టాటా మోటార్స్ కంపెనీ లగ్జరీ ఎస్యూవీ, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగాల్లో వరుసగా హెచ్5ఎక్స్, 45ఎక్స్ అనే రెండు కాన్సెప్ట్ వెహికల్స్‌ను ఆవిష్కరించింది. వీటితోపాటు ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. కవాసకి: కవాసకి ఇండియా రెండు కొత్త బైక్స్ నింజా హెచ్2 ఎస్ఎక్స్ స్టాండర్డ్, నింజా హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈ స్పెషల్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.21.8 లక్షలు. ఎస్ఎంఎల్ ఇసుజు: ఎస్ఎంఎల్ ఇసుజు తాజాగా కార్గో విభాగంలో మూడు మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది. సామ్రాట్ జీఎస్ హెచ్డీ 19, సర్టాజ్ జీఎస్ సీఎన్జీ, సామ్రాట్ జీఎస్ ట్రిప్పర్ అనేవి వీటి పేర్లు. మెర్సిడెస్ బెంజ్!: జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ తాజాగా మేబ్యాక్ ఎస్650ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.2.73 కోట్లు. అలాగే కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ ఈక్యూతోపాటు దాదాపు 13 ప్రొడక్టులను ప్రదర్శనకు ఉంచింది. అశోక్ లేలాండ్: తొలి ఎలక్ట్రిక్ బస్సు సర్క్యూట్–ఎస్‌ను ఆవిష్కరించింది. వచ్చే 3–6 నెలల్లో అందుబాటులోకి రావొచ్చు. టయోటా: టయోటా కిర్లోస్కర్ మోటార్ ‘యారిస్’ సెడాన్ కారును ఆవిష్కరించింది. ఎఫ్‌సీవీ ప్లస్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. జేబీఎం: ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సు సరీస్ ‘ఎకో లైఫ్’ను ఆవిష్కరించింది. వీటి ధర రూ.2–3 కోట్ల మధ్యలో ఉండొచ్చు. మహీంద్రా: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆరు కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వాహనాలను ఆవిష్కరించింది. కియా మోటార్స్: దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఎస్పీ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంటులో తయారు చేయనుంది. భారత్‌లో కంపెనీ తొలి వాహనం ఇదే. బీఎండబ్ల్యూ: హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఐ8 రోడ్‌స్టర్, ఎలక్ట్రిక్ వెహికల్ ఐ3ఎస్‌లను ప్రదర్శనకు ఉంచింది. -
హోండా యాక్టివా 5జీ వచ్చేసింది...
ద్విచక్ర వాహన మార్కెట్లో బాగా ఫేమస్ అయిన హోండా యాక్టివా ఐదో జనరేషన్ వచ్చేసింది. కొత్త యాక్టివా 5జీని ఆటో ఎక్స్పో 2018లో హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు ఆవిష్కరించాయి. కొత్త డీలక్స్ వేరియంట్, ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, పొజిషన్ ల్యాంప్, కొత్త ఫ్రంట్ క్రోమ్ గార్నిష్‌తో ఈ ఐదవ జనరేషన్ యాక్టివాను మార్కెట్లోకి ఆవిష్కరించినట్టు హోండా చెప్పింది. ఈ కొత్త యాక్టివా 5జీ రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఒకటి డజెల్ యెల్లో మెటాలిక్, రెండు పెర్ల్ స్పార్టన్ రెడ్. అంతేకాక ఫ్రంట్ హుక్, సీట్ ఓపెనర్ స్విచ్‌తో 4-ఇన్-1 లాక్, కొత్త మఫ్లర్ ప్రొటెక్టర్లు కూడా ఉన్నాయి. మెకానిక్ పరంగా యాక్టివా 5జీ అలానే ఉండనుంది. 109సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్, బీఎస్-4 ఇంజిన్ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఈ కొత్త స్కూటర్ త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. -
ఆటో ఎక్స్పో 2018 ప్రీ ఈవెంట్
-
కొత్త ఆల్టో 800 ఎప్పుడొస్తుందో తెలుసా?
భద్రతకు పెద్ద పీట వేస్తూ కొత్త కొత్త ఫీచర్లతో ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో రకరకాల మోడల్స్ వాహన వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇగ్నిస్, బాలెనో, విటారా బ్రీజా కార్లను లాంచ్ చేసిన దేశీయ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ ఎంట్రీ-లెవల్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్‌పై ఎక్కువగా దృష్టిసారించింది. ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేందుకు సేఫ్టీ ఈక్విప్ మెంట్, ఎక్కువ ఫీచర్లతో కూడిన కొత్త ఆల్టో 800 ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2018 ఆటో ఎక్స్ పోలో ఈ కొత్త మారుతీ సుజుకీ ఆల్టో 800ను ప్రదర్శించబోతున్నారు. ఇగ్నిస్, బాలెనో మాదిరిగానే కొత్త జనరేషన్ ఆల్టోలోనూ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంటుందని తెలుస్తోంది. ఏబీఎస్, డ్యూయర్ ఎయిర్ బ్యాగ్స్ ను ఇది కల్పిస్తుందట. తమ మోడల్ కార్ల తయారీ రూపురేఖలనే మార్చుస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది. రెనాల్ట్ క్విడ్, డాట్సాన్ రెడీ-గో వంటి కంపెనీల నుంచి ఇప్పటికే మారుతీ సుజుకీ ఆల్టో తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆల్టో మోడల్ కంపెనీకి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్ట్ గా నిలిచింది. ఫిబ్రవరి అమ్మకాల్లోనూ ఇదే టాప్ లో ఉంది. జనవరి నెలలోనూ బెస్ట్-సెల్లింగ్ ట్యాగ్‌ను మారుతీ ఆల్టో పొందినట్టు సియామ్ తాజా డేటా కూడా పేర్కొంది. ఈ కారు విక్రయాలు జనవరిలో 22,998 యూనిట్లను నమోదుచేసుకున్నాయి. ఈ విక్రయాలను మరింత పెంచేందుకు కొత్త ఆల్టో 800ను కంపెనీ రూపొందిస్తోంది.