మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్
గ్రేటర్ నోయిడా : స్విఫ్ట్ అభిమానుల ఎదురుచూపులకు స్వస్తి పలికిన మారుతీ సుజుకీ మూడో జనరేషన్‌కు చెందిన కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను నేడు ఆటో ఎక్స్‌పో 2018లో లాంచ్ చేసింది. ఈ కొత్త వెహికిల్ ధర రూ.5 లక్షల నుంచి ప్రారంభం. పాత మోడల్‌తోనే ఇప్పటికే పాపులర్ కారుగా పేరు తెచ్చుకున్న స్విఫ్ట్, కొత్త రూపకల్పనతో మరింత ఆకట్టుకోబోతుంది. ఈ కొత్త స్విఫ్ట్ పాత దానికి కంటే మరింత ప్రీమియంగా ఉండబోతుంది.
1.21 వీటీవీటీ పెట్రోల్ ఇంజిన్‌ను ఇది కలిగి ఉంది. పాత స్విఫ్ట్ కంటే 7.8 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఇది అందిస్తోంది. డీజిల్ డీడీఐఎస్ 190 ఇంజిన్‌ను కూడా ఇది కలిగి ఉంది. పాత దానికంటే 12.7 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఈ కొత్త స్విఫ్ట్ ఆఫర్ చేస్తోంది. ఆటో గేర్ స్విఫ్ట్ టెక్నాలజీతో ఇది రూపొందింది. 5వ జనరేషన్ హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై మారుతీ సుజుకీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు ఉన్నమోడల్స్‌కు పూర్తిగా భిన్నంగా, మోడరన్ లుక్స్‌లో, స్పోర్టీగా, మోర్ ప్రీమియంగా ఈ స్విఫ్ట్‌ను ప్రవేశపెడుతోంది. కొత్త స్విఫ్ట్ పొడవులో 10ఎంఎం చిన్నది. ప్రస్తుతమున్న మోడల్‌తో పోలిస్తే 40ఎంఎం వెడల్పు, 35ఎంఎం లోయర్, 20ఎంఎం లాంగర్ వీల్‌బేస్‌ను ఇది ఆఫర్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment