
ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారులో 4వ జనరేషన్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.64 లక్షల వరకు (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది.
ఈ కారును అభివృద్ధి చేయడంపై రూ. 1,450 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ అమ్మకాల్లో ప్రీమియం విభాగం వాటా 60 శాతంగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా 7 లక్షల యూనిట్లుగా ఉన్న ఈ సెగ్మెంట్ 2030 నాటికి పది లక్షల యూనిట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment