జపాన్‌కు మేడ్ ఇన్ ఇండియా కారు | Made in India Jimny 5 Door in Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌కు మేడ్ ఇన్ ఇండియా కారు

Jan 31 2025 12:21 PM | Updated on Jan 31 2025 1:11 PM

Made in India Jimny 5 Door in Japan

భారతదేశంలో తయారవుతున్న వాహనాలకు.. విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు వాహనాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా 'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీకి చెందిన 'జిమ్నీ' (Jimny) జపాన్‌కు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది.

2023లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కనిపించిన మారుతి జిమ్నీ.. ప్రస్తుతం 5 డోర్ వెర్షన్ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఇదే ఇప్పుడు జపాన్‌లో విక్రయానికి సిద్ధమైంది. అంతే కాకుండా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి అత్యధికంగా ఎగుమతి చేసిన వాహనాల్లో ఇది రెండో మోడల్ అని తెలుస్తోంది.

జిమ్నీ 5 డోర్ కారు హర్యానాలోని గురుగ్రామ్‌లో.. మారుతి సుజుకి తయారీ కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది గ్లోబల్ ఆఫ్ రోడర్‌గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ఈ కారును కంపెనీ దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు జపాన్‌కు కూడా తరలించింది. మొత్తం మీద కంపెనీ ఇప్పటి వరకు 3.5 లక్షల కంటే ఎక్కువ జిమ్నీ కార్లు గ్లోబల్ మార్కెట్లో అమ్ముడయ్యాయి.

జిమ్నీ 5 డోర్ మోడల్ జపాన్‌లో ప్రారంభమైన సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టకేయుచి (Hisashi Takeuchi) మాట్లాడుతూ.. జపాన్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' జిమ్నీ 5-డోర్‌ను ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆగష్టు 2004లో కంపెనీ అత్యధికంగా ఎగుమతిచేసిన కార్లలో 'ఫ్రాంక్స్' తరువాత.. జిమ్నీ ఉంది. మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లలో అమ్మకాల పరంగా ఇది గొప్ప విజయం సాధించిందని అన్నారు.

జిమ్నీ 5 డోర్
రూ. 12.47 లక్షల ప్రారంభ ధర వద్ద మార్కెట్లో లాంచ్ అయిన మారుతి జిమ్నీ.. ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ విభాగంలో ఓ పాపులర్ మోడల్. కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ మోడల్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 105 హార్స్ పవర్, 134 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వంటివి పొందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement