made in india
-
ఖండాంతరాలు దాటుతున్న మేడ్ ఇన్ ఇండియా కారు: ఇదే..
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'నిస్సాన్' (Nissan) బ్రాండ్ కారు 'మాగ్నైట్' (Magnite) సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో అక్టోబర్ 2024లో లాంచ్ అయింది. ఈ మోడల్ ఇప్పుడు ఖండాంతరాలు దాటడానికి సిద్ధమైంది. ఇండియాలో తయారైన అప్డేటెడ్ నిస్సాన్ మాగ్నైట్ త్వరలో లాటిన్ అమెరికా దేశాల్లో అమ్ముడవుతాయి.నిస్సాన్ ఇండియా జనవరి చివరిలో చెన్నై నుంచి దాదాపు 2,900 యూనిట్ల ఎల్‌హెచ్‌డి (లెఫ్ట్ హ్యండ్ డ్రైవ్) వేరియంట్ల మొదటి షిప్‌మెంట్‌ను ప్రారంభించింది. మరో 7,100 కార్లు త్వరలోనే ఎగుమతి అవుతాయని సమాచారం. మొత్తం మీద కంపెనీ భారత్ నుంచి 10,000 మాగ్నైట్ కార్లను ఎగుమతి చేయనుంది. ఈ కార్లు అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, సెంట్రల్ అమెరికా, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలకు వెళతాయి.ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో భారత్ కూడా దూసుకెళుతోంది. కాబట్టి చాలా దేశాల్లో మేడ్ ఇన్ ఇండియా కార్లను కోరుకుంటున్నారు. ఈ కారణంగా భారత్ ఎగుమతులకు కూడా కేంద్రం అయింది. ఇప్పటికే పలు కంపెనీలు దేశంలో తయారైన కార్లను విదేశాలకు తరలిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియన్ బ్రాండ్ కార్లను వినియోగించనున్నాయి.నిస్సాన్ కంపెనీ ఎగుమతి చేయడానికి సిద్ధం చేసిన మాగ్నైట్ కార్లు 'లైఫ్ హ్యాండ్ డ్రైవ్' ఆప్షన్ కలిగి ఉంటాయి. ఎందుకంటే.. ప్రపంచంలోని చాలా దేశాలలో ఉపయోగిస్తున్న కార్లు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆప్షన్ పొందాయి. కాబట్టి మన దేశంలో ఎగుమతికి సిద్ధం చేసిన కార్లను కూడా ప్రత్యేకంగా రూపొందించారు.నిస్సాన్ మాగ్నైట్ఇండియన్ మార్కెట్లో అక్టోబర్ 2024లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ కారు ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 11.50 లక్షల మధ్య ఉన్నాయి. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బూమరాంగ్ ఆకారపు డీఆర్ఎల్ వంటి వాటితో పాటు అప్డేటెడ్ గ్రిల్ కూడా ఈ కారులో చూడవచ్చు. ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందాయి.ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్ 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4 కలర్ యాంబియంట్ లైటింగ్, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.ఇదీ చదవండి: తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్!మాగ్నైట్‌లో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (72 పీఎస్ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్) లేదా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (100 పీఎస్ పవర్, 160 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజన్స్ ఉన్నాయి. ఇవి రెండూ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.ఫేస్‌లిఫ్టెడ్ నిస్సాన్ మాగ్నైట్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటో డిమ్మింగ్ IRVM, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
జపాన్‌కు మేడ్ ఇన్ ఇండియా కారు
భారతదేశంలో తయారవుతున్న వాహనాలకు.. విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు వాహనాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా 'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీకి చెందిన 'జిమ్నీ' (Jimny) జపాన్‌కు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది.2023లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కనిపించిన మారుతి జిమ్నీ.. ప్రస్తుతం 5 డోర్ వెర్షన్ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఇదే ఇప్పుడు జపాన్‌లో విక్రయానికి సిద్ధమైంది. అంతే కాకుండా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి అత్యధికంగా ఎగుమతి చేసిన వాహనాల్లో ఇది రెండో మోడల్ అని తెలుస్తోంది.జిమ్నీ 5 డోర్ కారు హర్యానాలోని గురుగ్రామ్‌లో.. మారుతి సుజుకి తయారీ కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది గ్లోబల్ ఆఫ్ రోడర్‌గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ఈ కారును కంపెనీ దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు జపాన్‌కు కూడా తరలించింది. మొత్తం మీద కంపెనీ ఇప్పటి వరకు 3.5 లక్షల కంటే ఎక్కువ జిమ్నీ కార్లు గ్లోబల్ మార్కెట్లో అమ్ముడయ్యాయి.జిమ్నీ 5 డోర్ మోడల్ జపాన్‌లో ప్రారంభమైన సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టకేయుచి (Hisashi Takeuchi) మాట్లాడుతూ.. జపాన్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' జిమ్నీ 5-డోర్‌ను ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆగష్టు 2004లో కంపెనీ అత్యధికంగా ఎగుమతిచేసిన కార్లలో 'ఫ్రాంక్స్' తరువాత.. జిమ్నీ ఉంది. మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లలో అమ్మకాల పరంగా ఇది గొప్ప విజయం సాధించిందని అన్నారు.జిమ్నీ 5 డోర్రూ. 12.47 లక్షల ప్రారంభ ధర వద్ద మార్కెట్లో లాంచ్ అయిన మారుతి జిమ్నీ.. ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ విభాగంలో ఓ పాపులర్ మోడల్. కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ మోడల్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 105 హార్స్ పవర్, 134 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వంటివి పొందుతుంది. -
అంతర్జాతీయంగా ‘భారత్ బ్రాండ్’కు గుర్తింపు
న్యూఢిల్లీ: ‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్‌తో అంతర్జాతీయంగా భారత్ బ్రాండ్‌కు ప్రచారం తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒక పథకం ప్రకటించే అవకాశం ఉందని, దీనిపై అత్యున్నత స్థాయి కమిటీ పనిచేస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. మేడ్ ఇన్ జపాన్, స్విట్జర్లాండ్ మాదిరే మేడ్ ఇన్ ఇండియాకు బలమైన బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలన్నది ఇందులోని ఉద్దేశమ్యని తెలిపారు. ‘‘స్విట్జర్లాండ్ గురించి చెప్పగానే వాచీలు, చాక్లెట్లు, బ్యాంకింగ్ రంగం గుర్తుకొస్తుంది. ఇదే మాదిరిగా మనం ఏమి చేయగలం అన్న దానిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మనకు మెరుగైన సామర్థ్యాలు కలిగిన టెక్స్టైల్స్ తదితర కొన్ని రంగాలకే ఈ పథకాన్ని పరిమితం చేయాలా? తదతర అంశాలపై దృష్టి సారించాం’’అని ఆ అధికారి తెలిపారు. భారత్ బ్రాండ్‌కు ప్రచారం కల్పించే విషయంలో నాణ్యత కీలక అంశంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలో ‘ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్’ (ఐబీఈఎఫ్) ఈ దిశగానే పనిచేస్తోంది. భారత ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయంగా అవగాహన, ప్రచారం కల్పించడం కోసం కృషి చేస్తుండడం గమనార్హం. ఇప్పుడు భారత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చే లక్ష్యంతో పథకంపై సమాలోచనలు చేస్తోంది. నాణ్యతే ప్రామాణికంగా ఉండాలి.. ‘‘భారత బ్రాండ్ బలోపేతానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. నాణ్యతలో నిలకడ, మన్నిక ప్రాధాన్యంగా ఉండాలి. ఉదాహరణకు అధిక నాణ్యతతో కూడిన జనరిక్ ఔషధాల తయారీతో భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అంతర్జాతీయంగా మంచి నమ్మకాన్ని గెలుచుకుంది’’అని స్వతంత్ర పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) పేర్కొంది. భారత్ ప్రతిష్ట కాపాడుకునేందుకు నాణ్యతలేని ఉత్పత్తుల సరఫరాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. -
విదేశాల్లో మేడిన్ ఇండియా టూవీలర్ల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారైన ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో 12.48 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. దేశీయంగా అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో తయారీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే విషయం. అలాగే టూవీలర్ల తయారీ విషయంలో భారత్ అనుసరిస్తున్న నాణ్యత, భద్రత ప్రమాణాలకు ఈ గణాంకాలు నిదర్శనం. 2024 జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో మోటార్‌సైకిళ్లు 13 శాతం వృద్ధితో 10,40,226 యూనిట్లు వివిధ దేశాలకు సరఫరా అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా ఏకంగా 83 శాతానికి ఎగసింది. స్కూటర్ల ఎగుమతులు 21 శాతం అధికమై 2,06,006 యూనిట్లుగా ఉంది. టూవీలర్స్ ఎగుమతుల్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, ఇండియా యమహా మోటార్, హీరో మోటోకార్ప్, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా టాప్‌లో కొనసాగుతున్నాయి. అగ్రస్థానంలో బజాజ్.. ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 5 శాతం వృద్ధితో ఏప్రిల్–జూలైలో 4,97,114 యూనిట్లు నమోదు చేసింది. ఇందులో 4,97,112 యూనిట్లు మోటార్‌సైకిళ్లు ఉండడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో 14 శాతం వృద్ధితో 3,13,453 యూనిట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ 76 శాతం దూసుకెళ్లి 1,82,542 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 28 శాతం అధికమై 79,082 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 33 శాతం ఎగసి 73,731 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 30 శాతం క్షీణించి 64,103 యూనిట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ 2 శాతం వృద్ధితో 28,278 యూనిట్లు, పియాజియో వెహికిల్స్ 56 శాతం దూసుకెళ్లి 9,673 యూనిట్ల ఎగుమతులను సాధించాయి. బైక్స్‌లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా, స్కూటర్స్‌లో హోండా, టీవీఎస్ మోటార్, ఇండియా యమహా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. -
మేక్ ఇన్ ఇండియా.. ప్రశంసించిన మోదీ
అంతర్జాతీయ వేదికపై భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో 'మేక్ ఇన్ ఇండియా' చొరవ అనన్య సామాన్యమని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపుతున్నాయో అని చెప్పే విషయాన్ని మై గవర్నమెంట్ ఇండియా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిని మోదీ రీ పోస్ట్ చేశారు.మై గవర్నమెంట్ ఇండియా తన ఎక్స్ ఖాతాలో ఫోటో షేర్ చేస్తూ.. లోకల్ క్రాఫ్ట్ నుంచి గ్లోబల్ ఇంపాక్ట్ వరకు మేడ్ ఇన్ ఇండియా సక్సెస్ స్టోరీ అని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులు అద్భుతమైన ఆదరణ పొందుతున్నాయి. సైకిల్స్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు ఇండియా వేగంగా దూసుకెళ్తోంది. అంటూ ట్వీట్ చేసింది.మేక్ ఇన్ ఇండియా అనేది భారతదేశంలో ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి మరియు సమీకరించడానికి.. పెట్టుబడులను ప్రోత్సహించడానికి కంపెనీలను రూపొందించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభమైన ఓ చొరవ. ఈ కార్యక్రమం ఉద్యోగ కల్పన, నైపుణ్య పెరుగుదల కోసం 25 ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకుంది. అంతే కాకుండా భారతదేశాన్ని ప్రపంచ రూపకల్పన, ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రారంభమైంది.2014లో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా.. తయారీ రంగం వృద్ధి రేటును సంవత్సరానికి 12 శాతం నుంచి 14 శాతానికి పెంచడం. 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో మిలియన్ల అదనపు ఉత్పాదక ఉద్యోగాలను సృష్టించడం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది. అనుకున్న విధంగానే తయారీ రంగంలో భారత్ వేగంగా దూసుకుపోతోంది. దీన్ని మోదీ ప్రశంసించారుఒకప్పుడు ఇండియా 80 శాతం మొబైల్ ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు 99.9 శాతం మనదేశంలోనే తయారవుతున్నాయి. యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా మొదలైన దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ ఎగుమతి అవుతున్నాయి. రక్షణ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, స్పేస్, ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్, సెమీ కండక్టర్ మొదలైన రంగాలలో గణనీయమైన పెట్టుబడులు సమకూరుతున్నాయి.బీహార్ రాష్ట్రంలో తయారైన బూట్లు.. రష్యన్ ఆర్మీ ఉపయోగిస్తోంది. ఇది కూడా మేక్ ఇన్ ఇండియా చొరవతో భాగమే. గతేడాది బీహార్ ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ జతల బూట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఈ కంపెనీల వల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు.A glimpse of how 'Make In India' is propelling India's economy onto the global stage! https://t.co/xCfE4WYwmW— Narendra Modi (@narendramodi) July 16, 2024 -
మేడిన్ ఇండియా రేంజ్ రోవర్
ముంబై: మేడిన్ ఇండియా రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు కొద్ది రోజుల్లో భారత రోడ్లపై పరుగు తీయనున్నాయి. దేశీయంగా వీటి తయారీ చేపట్టాలని టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ నిర్ణయించింది. 54 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ మోడళ్లు యూకే వెలుపల ఒక దేశంలో తయారు కానుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యూకేలోని సోలహల్ వద్ద ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంటులో తయారైన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా 121 మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా తయారైతే ఈ రెండు మోడళ్ల ధర 18–22 శాతం తగ్గనుందని కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల అమ్మకాలు పెరుగుతాయని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. టాటా మోటార్స్‌కు చెందిన పుణే ప్లాంటులో ఇప్పటికే రేంజ్ రోవర్ వెలార్, రేంజ్ రోవర్ ఇవోక్, జాగ్వార్ ఎఫ్–పేస్, డిస్కవరీ స్పోర్ట్ అసెంబుల్ అవుతున్నాయి. 2023–24లో దేశవ్యాప్తంగా జేఎల్ఆర్ ఇండియా 4,436 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 81 శాతం అధికం. -
డీఆర్డీవో తయారీ అస్సాల్ట్ రైఫిల్ ‘ఉగ్రమ్’
పుణే: కేంద్ర ప్రభుత్వ రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సొంతంగా అభివృద్ధి చేసిన అస్సాల్ట్ రైఫిల్ ఉగ్రమ్ను సోమవారం పరీక్షించింది. డీఆర్డీవోకు చెందిన పుణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్(ఏఆర్డీఈ)విభాగం భారత సైన్యం అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 4 కిలోల కంటే తక్కువ బరువుండే ప్రొటోటైప్ అస్సాల్ట్ రైఫిల్‌ను సోమవారం పరీక్షించారు. ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి గత మూడేళ్లుగా అస్సాల్ట్ రైఫిల్‌ను డిజైన్ చేసినట్లు ఏఆర్డీఈ డైరెక్టర్ ఎ.రాజు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రయోగాలు జరిపేందుకు ముందుగా స్వతంత్ర నిపుణుల కమిటీ పర్యవేక్షణలో ట్రయల్స్ ఉంటాయని చెప్పారు. -
భారత్‌లో.. ఈ నాలుగు అరుదైన వ్యాధులకు అయ్యే ట్రీట్మెంట్ ఖర్చు భారీగా తగ్గనుంది
భారత్ ఔషదాల తయారీలో అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ సంస్థల సహాయంతో భారతీయ ఔషధ కంపెనీలు కేవలం ఏడాదిలోనే నాలుగు అరుదైన వ్యాధులకు మందులను తయారు చేశారు. తద్వారా ఆ అరుదైన వ్యాధ్యులను నయం చేయించుకునేందుకు అయ్యే ఖర్చు దాదాపూ 100 రెట్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు టైరోసినిమియా టైప్ 1 చికిత్సకు ఏడాదికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.2.2 కోట్ల నుండి రూ.6.5 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు అదే ఖర్చు రూ. 2.5 లక్షలకు చేరింది. ఒకవేళ ఈ అనారోగ్య సమస్యకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే 10 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు ఈ వ్యాధితో మరణిస్తారు. మూడు ఇతర అరుదైన వ్యాధుల్లో..గౌచర్స్ వ్యాధి. ఈ అనారోగ్య సమస్య తలెత్తితే రక్తాన్ని ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడే ప్లీహము పరిమాణం పెరిగేలా చేస్తుంది. దీంతో ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. విల్సన్స్ వ్యాధి శరీరంలోని ఎర్ర రక్త కణాలు, నరాల కణాలను నిర్మించడంలో, రోగనిరోధక వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే రాగి తగ్గుతుంది. మెదడు పని తీరును ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. డ్రావెట్/లెనాక్స్ గాస్టాట్ సిండ్రోమ్.. దీని వల్ల బాధితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఖర్చులు కోట్ల నుంచి లక్షల్లోకి ఇప్పుడీ ప్రమాదకరమైన ఎలిగ్లుస్టాట్ క్యాప్సూల్స్‌తో గౌచర్స్ వ్యాధికి అయ్యే ఖర్చు సంవత్సరానికి రూ. 1.8-3.6 కోట్ల నుండి రూ. 3.6 లక్షలకు, విల్సన్స్ వ్యాధికి వినియోగించే ట్రియంటైన్ క్యాప్సూల్స్‌తో సంవత్సరానికి రూ.2.2 కోట్ల నుండి రూ. 2.2 లక్షలకు, డ్రావెట్‌కు కన్నబిడియోల్ (Cannabidiol) అనే సిరప్ ఖరీదు రూ. 7లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు అయ్యే సిరప్ రూ.1లక్షల నుంచి 5 లక్షల లోపు వరకు లభ్యమవుతుంది. 10 కోట్ల మందికిపైగా అరుదైన వ్యాధులు మన దేశంలో.. అంచనా ప్రకారం.. 8.4 కోట్ల నుంచి 10 కోట్ల మంది అరుదైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులలో దాదాపు 80 శాతం జన్యుపరమైనవి కాగా.. చిన్న వయస్సులోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. జన్ ఔషద కేంద్రాల్లో మెడిసన్ ఏడాది క్రితం బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలైన జెనారా ఫార్మా, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్, అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్లు 13 రకాల అరుదైన వ్యాధుల నివారణకై మెడిసిన్‌ను తయారు చేయడం ప్రారంభించాయి. నాలుగు వ్యాధులకు సంబంధించిన మందులు అభివృద్ధి చేశామని, మిగతా వాటికి సంబంధించిన మందులు త్వరలో అందజేస్తామని, జన్ ఔషధి కేంద్రాలకు కూడా మందులను అందజేసే యోచనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఫెనిల్‌కెటోనూరియా, హైపెరమ్మోనిమియా వ్యాధులకు ఇప్పటికే చౌకైన మందులు తయారు చేశారు. స్పైనల్ మస్కులర్ అట్రోఫీకి గురైన బాధితులు కండరాల కదలికను నియంత్రిస్తుంది. ముఖ్యంగా వెన్నుపూసలో ఉండే ఈ కణాల్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది. దీంతో ఈ వ్యాధికి గురైన బాధితులు ఏ పని చేసుకోలేరు. దీన్ని నయం చేసేందుకు వినియోగించే ఇంజక్షన్ ఖరీదు అక్షరాల రూ.16 కోట్లు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఖర్చును తగ్గించే పనిలో ఉన్నాయి భారత ప్రభుత్వం, ఫార్మా సంస్థలు పనిచేస్తున్నాయి. -
ఆనంద్ మహీంద్రా వాడే ఫోన్ ఏంటో తెలుసా?
తయారీలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మేడిన్ ఇండియా ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కళ్లకు కట్టినట్లు చూపించారు. టెక్ దిగ్గజం గూగుల్ కీలక ప్రకటన చేసింది. తమ ప్రీమియం ఫోన్ పిక్సెల్ సిరీస్‌ను భారత్‌లో తయారు చేయనున్నట్లు వెల్లడించింది. మేకిన్ ఇండియాలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టెర్లో తెలిపారు. ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గూగుల్ నిర్ణయంపై ఆనంద్ మహీంద్రా ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. అందులో మేడిన్ ఇండియా గురించి తన ఎదురైన తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవల,ఆనంద్ మహీంద్రా అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో కాల్స్ మాట్లాడేందుకు వీలుగా లోకల్ సిమ్ కొనుగోలు చేసేందుకు వెరిజాన్ స్టోర్‌కి వెళ్లారు. అక్కడ భారత్‌లో తయారైన ఐఫోన్ -15 కోసం సిమ్ కావాలని అడగ్గా సదరు సేల్స్ పర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతను వ్యక్తం చేసిన ఆశ్చర్యం నాకు ఆనందాన్ని కలిగించింది’ అంటూ ఇదే విషయాన్ని ట్వీట్లో పేర్కొన్నారు. I recently was in a Verizon store in the U.S to get a local sim and proudly informed the salesperson that my iPhone 15 was made in India. It was a particular pleasure to see his raised eyebrows! I also have a Google Pixel. I will switch to the India-made version when it’s out. So… https://t.co/QouFIOSu1M — anand mahindra (@anandmahindra) October 20, 2023 అంతేకాదు తన వద్ద గూగుల్ పిక్సెల్ ఫోన్ కూడా ఉంది. మేడిన్ ఇండియా ‘పిక్సెల్’ విడుదలయ్యాక దాన్నీ తీసుకుంటాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
భారత్‌లో ‘పిక్సెల్ సిరీస్’ స్మార్ట్ఫోన్ల తయారీలో గూగుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. పిక్సెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్‌లో తయారు చేయాలని నిర్ణయించింది. దేశీయ మార్కెట్‌తోపాటు విదేశాలకు వీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఈ మోడల్ ఫోన్లు చైనా, వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇటీవల విడుదలైన పిక్సెల్ 8 సిరీస్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదార్లను ఆకట్టుకుంటోంది. తొలుత పిక్సెల్ 8 మోడల్ ఫోన్లు మేడిన్ ఇండియా ట్యాగ్‌తో రానున్నాయి. పిక్సెల్ 8 ప్రో మోడల్ సైతం ఇక్కడ రూపొందే చాన్స్ ఉంది. దేశీయంగా పిక్సెల్ ఫోన్ల తయారీకై తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, భారత్‌కు చెందిన డిక్సన్ టెక్నాలజీస్ పోటీపడుతున్నట్టు సమాచారం. 2016 నుంచి అంతర్జాతీయంగా సుమారు 4 కోట్ల పిక్సెల్ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో ఒక కోటి యూనిట్లు గడిచిన 12 నెలల్లో అమ్ముడవడం విశేషం. వచ్చే ఏడాది నుంచి.. మేడిన్ ఇండియా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటాయని గూగుల్ డివైసెస్, సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టెర్లో గురువారం వెల్లడించారు. ఇందుకోసం అంతర్జాతీయ, దేశీయ ఒప్పంద తయారీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని గూగుల్ ఫర్ ఇండియా 2023 కార్యక్రమంలో పేర్కొన్నారు. గూగుల్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను దేశంలో తయారు చేయాలనే నిర్ణయం భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చడం, అలాగే ప్రత్యర్థి చైనాతో పోటీ పడాలనే భారత లక్ష్యానికి పెద్ద ప్రోత్సాహం. క్రోమ్‌బుక్స్‌ను భారత్‌లో తయారు చేసేందుకు పర్సనల్ కంప్యూటర్ల ఉత్పత్తిలో పేరెన్నికగల హెచ్‌పీ ఇటీవలే గూగుల్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. భారత్‌లో ఇప్పటికే యాపిల్.. కొన్నేళ్లుగా యాపిల్ తన తయారీ స్థావరాన్ని విస్తరించాలని కోరుకుంటోంది. ఇందుకోసం చైనా+1 విధానంలో భాగంగా భారత్‌లో పలు ఉపకరణాలను అసెంబ్లింగ్ చేస్తోంది. గత నెలలో ఐఫోన్ 15 విడుదల యాపిల్ ఇండియా తయారీ ప్రణాళికలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. భారత్‌లో, అలాగే చైనాలో ఉత్పత్తి అయిన ఐఫోన్స్‌ను ఒకే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారిగా యాపిల్ విడుదల చేయడం ఇందుకు కారణం. సాధారణంగా భారత్‌లో యాపిల్ తాజా మోడళ్ల ఉత్పత్తి చైనా కంటే కొన్ని నెలలు వెనుకబడి ఉంటుంది. 2025 నాటికి భారత్‌లో 25 శాతం ఐఫోన్లను తయారు చేయాలని యాపిల్ లక్ష్యంగా చేసుకుంది. -
కొత్త సినిమా ప్రకటించిన దర్శకధీరుడు.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మరో సినిమాను ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగుస్థాయిని ప్రపంచానికి చాటిచెప్పన దర్శకధీరుడు తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. భారతీయ సినిమా రంగంపై వస్తున్న బయోపిక్‌ను సమర్పించనున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. గత రెండు రోజులుగా రాజమౌళి నుంచి ఓ భారీ ప్రకటన చేయనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందరూ ఊహించినట్లుగానే ఓ భారీ సినిమాను ప్రజెంట్ చేస్తున్నట్లు వెల్లడించారు. భారతీయ సినిమా చరిత్రను తెలియజేస్తూ మేడ్ ఇన్ ఇండియా అనే చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా.. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు రాజమౌళి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజమౌళి ట్వీట్లో రాస్తూ.. 'నేను మొదట కథనం విన్నప్పుడు.. అది భావోద్వేగంగా నన్ను కదిలించింది. బయోపిక్‌ని రూపొందించడం చాలా కష్టం. కానీ భారతీయ సినిమా పితామహుడు గురించి ఆలోచించడం మరింత సవాలుతో కూడుకున్నది. మా అబ్బాయిలు అందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది.' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించనున్నారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే మనకు గుర్తొచ్చే పేరు దాదాసాహెబ్ ఫాల్కే. అతనిని భారత సినిమా పితామహుడు అని పిలుస్తారు. 1913లో విడుదలైన రాజా హరిశ్చంద్ర ఆయన నిర్మించిన తొలి ఇండియన్ సినిమా. ఆయన బయోపిక్‌ను సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి తన నెక్ట్స్ మూవీ మహేశ్ బాబుతో చేయనున్నారు. యాక్షన్ అడ్వంచర్‌గా రూపొందించనున్నట్లు తెలిసిందే. కానీ అందరూ ఈ సినిమా గురించే ప్రకటన చేస్తారని అనుకున్నారు. When I first heard the narration, it moved me emotionally like nothing else. Making a biopic is tough in itself, but conceiving one about the FATHER OF INDIAN CINEMA is even more challenging. Our boys are ready and up for it..:) With immense pride, Presenting MADE IN INDIA… pic.twitter.com/nsd0F7nHAJ — rajamouli ss (@ssrajamouli) September 19, 2023 -
Chandrayaan-3: ఇక అంగారకుడిపైకి అడుగు!
బెంగళూరు: దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తంచేశారు. భారత శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘చంద్రయాన్–3 విజయంతో అంగారకుడిపైకి వెళ్తాం. భవిష్యత్తులో శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం’ అని చెప్పారు. ఇది ఏ దేశానికైనా కష్టం ‘ఈ రోజు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా చంద్రుడిపైకి ప్రయాణం చేయడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. అదీగాక సాఫ్ట్ లాండింగ్ మరింత సంక్లిష్టమైన విషయం. అయితే, కేవలం రెండు మిషన్లతోనే భారత్ సుసాధ్యం చేసి చూపింది. మానవరహిత వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మాత్రమే చంద్రయాన్–1ను చేపట్టాం.’ అని సోమనాథ్ చెప్పారు. మేడిన్ ఇండియా మిషన్ ‘ చంద్రయాన్–2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. చంద్రయాన్–2 మిషన్‌లో పాలుపంచుకున్న చాలామంది కీలక శాస్త్రవేత్తలు చంద్రయాన్–3 మిషన్ బృందంలో పనిచేశారు. చంద్రయాన్–3లో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏ టెక్నాలజీ కంటే కూడా తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సర్లు మన వద్ద ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రపంచస్థాయి పరికరాలతో దేశీయంగా రూపొందించిన మేడిన్ ఇండియా మిషన్’ అని సోమనాథ్ చెప్పారు. -
ఎయిర్‌పాడ్స్ ఇక మేడ్ ఇన్ ఇండియా.. హైదరాబాద్‌లోనే తయారీ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కోసం వైర్లెస్ ఇయర్‌బడ్స్ (ఎయిర్‌పాడ్స్)ను ఫాక్స్‌కాన్ తమ హైదరాబాద్ ప్లాంటులో తయారు చేయనుంది. 2024 డిసెంబర్ నాటికి భారీ స్థాయిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ ప్లాంటుపై ఫాక్స్‌కాన్ దాదాపు 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఐఫోన్ల తర్వాత యాపిల్ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల్లో ఎయిర్పాడ్లు రెండో స్థానంలో ఉన్నాయి. ట్రూ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) మార్కెట్లో 36 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు, తమ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలిగితే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) చైర్మన్ యంగ్ లియు తెలిపారు. వార్షిక ప్రాతిపదికన భారత్‌లోని తమ విభాగం 10 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరు సాధించినట్లు వివరించారు. -
మేడిన్ ఇండియా ఈ-చిప్: 2024 చివరికల్లా మార్కెట్లోకి..
న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన (మేడ్ ఇన్ ఇండియా) తొలి ఈ–చిప్‌లు 2024 డిసెంబర్ నాటికి మార్కెట్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ఏడాదిలోపు నాలుగు నుంచి ఐదు వరకు సెమీకండక్టర్ ప్లాంట్లు దేశంలో ఏర్పాటు కావొచ్చని చెప్పారు. అమెరికాకు చెందిన కంప్యూటర్ మెమొరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీస్ 2.75 బిలియన్ డాలర్ల వ్యయంతో గుజరాత్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనను మంత్రి గుర్తు చేశారు. ఈ ప్లాంట్‌కు అనుసంధానంగా 200 చిన్న యూనిట్లు కూడా ఏర్పాటు అవుతాయని మంత్రి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత ప్రధాని మోదీ సంయుక్త ప్రకటన అనంతరం అశ్వని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మైక్రాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పన్ను నిబంధనలు, ఫ్యాక్టరీ డిజైన్, భూ కేటాయింపులపై ఒప్పందం కూడా పూర్తయినట్టు తెలిపారు. మైక్రాన్ టెక్నాలజీస్ నుంచి మొదటి చిప్ ఆరు త్రైమాసికాల తర్వాత మార్కెట్లోకి వస్తుందన్నారు. మైక్రాన్ ఏర్పాటు చేసే 2.75 బిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు సంబంధించి సంస్థ సొంతంగా రూ.825 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనుండడం గమనార్హం. ఈ ప్లాంట్‌తో మొత్తం 20వేల ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం విలువ బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అశ్వని వైష్ణవ్ తెలిపారు. సెమీకండక్టర్ పథకం సవరణ సెమీకండక్టర్ పథకాన్ని సవరించామని, కనుక గతంలో దరఖాస్తు చేసిన సంస్థలను మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరినట్టు మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. లేదా దరఖాస్తులు సవరించుకోవాలని సూచించినట్టు చెప్పారు. సవరించిన పథకం కింద సెమీకండక్టర్ ప్లాంట్ వ్యయంలో 50 శాతాన్ని కేంద్రమే ద్రవ్య ప్రోత్సాహకం కింద సమకూరుస్తోంది. గతంలో ఇది 30 శాతంగానే ఉండేది. -
టాటా ఐఫోన్! ఇక ఐఫోన్ 15 తయారీ ఇక్కడే..
iPhone 15 Manufacturing: దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయబోతోంది. భారత్‌లో రాబోయే ఐఫోన్ 15 (iPhone 15), 15 ప్లస్ (15 Plus) ఫోన్లను తయారు చేసేందుకు యాపిల్ (Apple) సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా తైవాన్‌కు చెందిన ఓ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంటోంది. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! టాటా సంస్థ భారత్‌లో యాపిల్ కోసం నాలుగో ఐఫోన్ తయారీ భాగస్వామిగా ఉంటుందని తైవాన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ ‘ట్రెండ్‌ఫోర్స్’ పేర్కొంది. టాటా భాగస్వామ్యంతో భారత్‌లో యాపిల్ మొత్తం ఐఫోన్లలో ఎంత శాతం ఉత్పత్తి చేయనుందో కచ్చితంగా తెలియదు. యాపిల్‌కు భారత్‌లో ఇప్పటికే విస్ట్రాన్, ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ అనే మూడు తయారీ భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. అదే విధంగా భారత్‌లో రెండు రిటైల్ స్టోర్లను యాపిల్ ప్రారంభించింది. టాటా గ్రూప్‌పై యాపిల్ దృష్టి ట్రెండ్‌ఫోర్స్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ల తయారీ కోసం భారత్‌లోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటిగా ఉన్న టాటా గ్రూప్‌పై యాపిల్ దృష్టి సారిస్తోంది. ఇది నిజమైతే ఐఫోన్ 15 తొలి షిప్మెంట్లు మొదట భారత్‌లోనే అందుతాయి. సాధారణంగా ఐఫోన్లు భారత్‌లోకి ఆలస్యంగా వస్తాయి. ఇక భారత్‌లోనే తయారైతే ఐఫోన్ 15 సిరీస్ ధరలు కూడా తక్కువ ఉండేందుకు దోహదం చేస్తుంది. దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో ఉనికిని విస్తరించాలని చూస్తున్న టాటా గ్రూప్‌నకు ఇది గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కోవిడ్ పరిమితులు, సప్లయి చైన్ సమస్యల కారణంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇటీవలి కాలంలో దాని తయారీ స్థావరాలను విస్తరించాలని చూస్తోంది. కంపెనీ ఇప్పటికే ఐఫోన్14, ఐఫోన్ SE, ఐఫోన్13లతో సహా కొన్ని ఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తోంది. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! -
ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్‌లో ఉత్పత్తి
ప్రీమియం ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 7 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. అంటే ఇది గతంలో కంటే మూడు రెట్లు అధికం. దీంతో స్మార్ట్‌ఫోన్ రంగంలో భారత్.. చైనా దాటి వేగంగా దూసుకెళ్తోంది. (New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!) ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ నుంచి పెగాట్రాన్ కార్ప్‌కి విస్తరించిన భాగస్వాముల ద్వారా యాపిల్ ఇప్పుడు దాదాపు 7 శాతం ఐఫోన్లను భారతదేశంలో తయారుచేస్తోంది. 2021లో 1 శాతం వాటాను కలిగి ఉన్న భారతదేశానికి ఇది గణనీయమైన పురోగతి. వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై ఆధారపడటాన్ని యాపిల్ తగ్గించి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. గత సంవత్సరం జెంగ్జౌలోని ఫాక్స్‌కాన్ ప్రధాన “ఐఫోన్ సిటీ” కాంప్లెక్స్‌లో గందరగోళం కారణంగా యాపిల్ ఉత్పత్తి అంచనాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. మరోవైపు భారత ప్రభుత్వం తయారీ రంగాన్ని పెంపొందించడానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో యాపిల్ చైనాను కాదని భారత్‌లో ఉత్పత్తిని పెంచింది. ఇదే దూకుడు కొనసాగితే 2025 నాటికి మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో నాలుగింట ఒక వంతు భారత్‌లోనే జరగనుంది. తన సప్లయి చైన్‌ను విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించిన యాపిల్ భారతదేశంలో ప్రోత్సాహకాల కోసం విజయవంతంగా లాబీయింగ్ చేసింది. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ కార్ప్, పెగాట్రాన్ సంస్థలతో జత కట్టింది. ఈ మూడు కలిసి భారత్‌లో దాదాపు 60,000 మందికి ఉపాధి కల్పించాయి. ఐఫోన్ 11 నుంచి తాజా ఐఫోన్ 14 వరకు మోడల్లను ఇక్కడ తయారు చేస్తున్నాయి. యాపిల్ తన మొదటి రెండు రిటైల్ స్టోర్లను వచ్చే వారం భారతదేశంలో ప్రారంభించనుంది. ఒకటి ఆర్థిక కేంద్రమైన ముంబైలో, మరొకటి దేశ రాజధాని న్యూఢిల్లీలో. యాపిల్ చీఫ్ టిమ్ కుక్ వీటిని ప్రారంభించేందుకు స్వయంగా వస్తారని తెలుస్తోంది. -
4జీ కనెక్టివితో పేటీఎం 3.0 సౌండ్‌బాక్స్
ముంబై: చెల్లింపుల ప్రక్రియను మరింత సురక్షితం, వేగవంతం చేసేందుకు పేమెంట్స్, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం 4జీ ఆధారిత సౌండ్‌బాక్స్ 3.0 ని ఆవిష్కరించింది. రియల్ టైమ్ పేమెంట్ పరిశ్రమలో అలర్టుల కోసం స్థిరమైన కనెక్టివిటీ ఉపయోగించి తయారుచేసిన మొట్టమొదటి 4జీ సౌండ్‌బాక్స్ ఇది. వాటర్ ప్రూఫ్ ఫీచర్ కలిగిన ఈ మేడిన్ ఇండియా ప్రాడెక్ట్ బ్యాటరీ జీవిత కాలం ఏడురోజులుగా ఉంది. పరిసర ప్రాంతాల్లో 4జీ నెట్వర్క్ పనిచేయకపోతే, చెల్లింపులకు ఎలాంటి అంతరాతయం కలగకుండా ఆటోమేటిక్‌గా 2జీకి కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఇందులో మొత్తం 11 భాషలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు స్వీకరించిన పేమెంట్స్‌పై కచ్చితమైన క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే 24 గంటల హెల్ప్‌లైన్, ఒక గంట కాల్ బ్యాక్ పాలసీ అందిస్తుంది. పేటీఎం మెర్క్యూ లెండింగ్ భాగస్వాముల ద్వారా తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. -
విదేశీ ఎగుమతికి సిద్దమైన బుజ్జి కారు, ఇదే!
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'సిట్రోయెన్' ఇప్పుడు తమ కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి సన్నద్ధమైపోయింది. కంపెనీ దీని కోసం చెన్నైలోని కామరాజర్ పోర్ట్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేసింది. సిట్రోయెన్ ఎగుమతులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. కంపెనీ విదేశీ ఎగుమతికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ మార్గం ద్వారా రవాణా చేస్తుంది. 2023 మార్చి 31న మొదటి బ్యాచ్ మేడ్-ఇన్-ఇండియా C3 హ్యాచ్‌బ్యాక్‌లు కామరాజర్ పోర్ట్ నుండి ASEAN, ఆఫ్రికా మార్కెట్లకు ఎగుమతి చేయడం జరిగింది. కంపెనీ తమ కార్లను ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, కంబోడియా, సింగపూర్, మలేషియా దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ప్రపంచ వ్యాప్తంగా తమ ఉనికిని చాటుకోవడానికి తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. సి2 ఎయిర్ క్రాస్ విడుదలతో దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొంది, ఇటీవల సి3 ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసి మరింత గొప్ప అమ్మకాలను పొందటానికి సన్నద్ధమవుతోంది. (ఇదీ చదవండి: మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్) చెన్నైలోని కామరాజర్ పోర్ట్ నుంచి రెనాల్ట్, నిస్సాన్, టయోటా, మారుతీ సుజుకి, ఇసుజు మోటార్స్ వంటి కంపెనీలు కూడా ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగింది. నిజానికి ఈ పోర్ట్ ఎగుమతుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. సిట్రోయెన్ సి3 ధర భారతీయ మార్కెట్లో రూ. 7.02 లక్షల నుంచి రూ. 9.35 లక్షల వరకు ఉంది. అయితే ఇందులో సి3 ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ. 13.34 లక్షల నుంచి రూ. 14.06 లక్షల వరకు ఉంది. కాగా సిట్రోయెన్ కొత్త సి3 ఎయిర్‌క్రాస్ మిడ్ సైజ్ SUV ఈ నెల 27న మార్కెట్లో విడుదలకానున్నట్లు సమాచారం. -
Interior: ప్రకృతితో మమేకం.. ప్రతిది నేచురల్‌గా..
ఒత్తిడిగా ఉన్నప్పుడు, ప్రశాంతత కావాలనుకున్నప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండాలన్న ఆరాటం పెరుగుతుంది. ఇంటి వాతావరణాన్నే అలా మార్చుకుంటే అనే ఆలోచన వస్తుంది. అలా ప్రకృతి ఇంటి అలంకరణలో భాగమై నేచురల్ థీమ్‌గా ఇలా సెటిల్ అయింది. పెద్ద పెద్ద బ్రాండ్లు ప్రకృతిని మరిపించే వస్తువులను తయారుచేయడానికి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మన దేశీ వస్తువులు కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’ ట్యాగ్‌తో హుందాగా ప్రపంచ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. కళాత్మక వస్తువులు రాజస్థాన్, జైపూర్ కళాకృతులు గ్లోబల్ ట్రెండ్‌గా ఆకట్టుకుంటున్నాయి. వీటి నుంచి కొత్త తరహా డిజైన్లనూ సృష్టిస్తున్నారు. కుషన్ కవర్లు, క్విల్ట్‌లు, టెర్రకోట వస్తువులు, బ్యాగ్‌లు, ఖరీదైన బొమ్మలు, సిరామిక్స్, కర్ర, మెటల్.. ఇలా ఇల్లు, వంటగది, తోట కోసం కళాఖండాల సేకరణ ఊపందుకుంటోంది. విషయమైన పింక్లే బ్రాండ్ సృష్టికర్త తన్వానీ మాట్లాడుతూ ‘మా కంపెనీ హోమ్ మేడ్ వస్తువుల తయారీని ఏడేళ్ల కిందటే మొదలుపెట్టింది. నాటి నుంచి ఏనాడూ వెనుదిరిగి చూసుకోనంత ముందుకు వెళ్తోంది’ అని చెబుతుంది. ఆన్లైన్లో నేచర్.. గతంతో పోల్చితే ప్రకృతి సిద్ధమైన వాటితో తయారైన వస్తువులను ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవడానికి వినియోగదారులు ఎక్కువ శాతం ఉత్సాహం చూపుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. వీటిలో బ్రాండ్ కన్నా ఆ వస్తువు కళాత్మకతపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టూ తెలుస్తోంది. ఖరీదైన వస్తువుగా! ‘సరసమైన ధరలకే సస్టైనబుల్ ఫర్నిషింగ్‌ను సృష్టించడం మా లక్ష్యం’ అంటున్నారు బెంగుళూరులో ది ఎల్లో డ్వెల్లింగ్ కంపెనీ అధినేత అభినయ సుందరమూర్తి. పత్తి, నార, గడ్డి, వెదురు వంటి సహజమైనవాటిని ఉపయోగించి ఫంక్షనల్ హోమ్ డెకర్ ఉత్పత్తులను రూపొందిస్తోందీ కంపెనీ. ఔట్‌డోర్, బాల్కనీలను డిజైన్ చేయడానికి మంచి శిల్పాలు, వెదురుతో చేసిన వస్తువులను అమర్చుతున్నారు. చదవండి: Samantha: దేవనాగరి చీరలో సమంత! సంపన్నుల బ్రాండ్.. కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్ కూడా..! Pratiksha Soni: మహాత్ముడే మాకు ఉపాధి కల్పించాడు.. బాపూజీ బాటలో.. -
74th Republic Day: గణతంత్ర పరేడ్‌లో... స్వదేశీ వెలుగులు
74వ గణతంత్ర వేడుకలు స్వదేశీ వెలుగులతో మెరవనున్నాయి. సంప్రదాయ గౌరవ వందనంలో బ్రిటిష్ కాలపు 25–పౌండర్ గన్స్ స్థానంలో స్వదేశీ 105 ఎంఎం తుపాకులు సగర్వంగా గర్జించనున్నాయి. పరేడ్‌లో ప్రదర్శించే ఆయుధాలన్నీ మన దేశంలో తయారైనవే! బ్రిటన్ వలస పాలన నీడల నుంచి బయటపడి పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా ఆత్మనిర్భర్ భారత్ సత్తాను సగర్వంగా చాటేలా గణతంత్ర వేడుకలను జరిపేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చైనాతో ఉద్రిక్తతల వేళ మన సాయుధ సత్తాను చాటడానికి కవాతులో మేడిన్ ఇండియా ఆయుధాలను ప్రదర్శించబోతున్నారు. ఇండిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని, ఆకాశ్, నాగ్ క్షిపణులతో పాటు బ్రహ్మోస్, అర్జున్ యుద్ధ ట్యాంకులు, ప్రచండ హెలికాప్టర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి... బ్రహ్మోస్ ప్రపంచంలో మొట్టమొదటి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. భారత రక్షణ అభివృద్ధి పరిశోధన రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మోస్‌ను విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, భూ ఉపరితలం... ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ప్రయాణించగలదు. వంద శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా గుర్తింపు పొందింది. శత్రు దేశాల రాడార్ల నుంచి కూడా సులభంగా తప్పించుకోగల ఈ క్షిపణి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అగ్ని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన క్షిపణి. కాలక్రమేణా ఆధునిక సాంకేతితతో రూపు మార్చుకుంటూ వచ్చింది. అగ్ని 5 వెర్షన్లను రూపొందించిన తర్వాత ఇటీవల అణ్వాయుధ సామర్థ్యంతో అగ్ని ప్రైమ్ ఖండాంతర క్షిపణిని తయారు చేశారు. 2 వేల కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. అర్జున్ ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది. ప్రచండ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించగలిగే తేలికపాటి హెలికాప్టర్. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) అభివృద్ధి చేసింది. సముద్రమట్టానికి 16,400 అడుగుల ఎత్తులో అలవోకగా టేకాఫ్, ల్యాండింగ్ ప్రత్యేకత. దీనితో రెండు శక్తిమంతమైన ఇంజిన్లు, అత్యంత ఆధునిక సౌకర్యాలుంటాయి. రాత్రి పూట కొండల మధ్య ప్రయాణించగలిగే సత్తాతో పాటు నిమిషానికి 800 రౌండ్లు కాల్పులు జరిపే సామర్థ్యముంది. చైనా డ్రోన్లను కూడా కూల్చివేయగలవు. నేలపై ఉన్న ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయగలవు. ఆకాశ్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత్ తొలి క్షిపణి ఆకాశ్. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. 95% పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందుకు పాతికేళ్లు పట్టింది. 2014లో వైమానిక దళానికి, 2015లో ఆర్మీకి అందజేశారు. వీటిని విదేశాలకు విక్రయించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. కే–9 వజ్ర స్వీయ చోదక శతఘ్ని వ్యవస్థ. 2018లో తొలిసారిగా ఆర్మీకి అందజేశారు. మైదాన ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా పని చేస్తుంది. ప్రస్తుతం లద్ధాఖ్ సరిహద్దుల్లో మోహరించారు. 155 ఎంఎం కెనాన్ కలిగిన ఈ శతఘ్ని 18 నుంచి 52 కి.మీ. దూరం దాకా గుళ్ల వర్షం కురిపించగలదు. దీనికున్న అత్యంత శక్తిమంతమైన ఇంజిన్ గంటకి 67 కి.మీ. వేగంతో పని చేస్తుంది. అర్జున్ ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది. రక్షణ రంగానికి స్వదేశీ హంగులు ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టాక రక్షణ రంగంలో స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడటం తగ్గించి దేశీయంగా తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. రష్యా వంటి దేశాల సాంకేతిక సహకారంతో దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి ముమ్మరమైంది. 2021లో సాయుధ బలగాలు తమకు కేటాయించిన నిధుల్లో 64% స్వదేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు వినియోగిస్తే గతేడాది 68% నిధులు వినియోగించాయి. ఆర్మీ అత్యధికంగా 72% నిధులను మేడిన్ ఇండియా ఆయుధాలపైనే వెచ్చించింది. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి విలువను 2025 కల్లా 2,500 కోట్ల డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం దిశగానూ వడివడిగా అడుగులు పడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్‌లో ఐఫోన్ల తయారీ..టాటా గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం
భారత్‌లో ఐఫోన్ల తయారీకి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు మనదేశంలో ఐఫోన్లను తైవాన్‌కు చెందిన కంపెనీలు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ సంస్థలు తయారు చేసి యాపిల్ సంస్థకు అందించేవి. ఈ తరుణంలో దేశీయ దిగ్గజ సంస్థ టాటా కంపెనీతో ఐఫోన్ల తయారీ కోసం యాపిల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం బెంగళూరుకు సమీపంలో విస్ట్రోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో మెజారిటీ వాటా దక్కించుకోవడానికి టాటా సన్స్ సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలు మరో రెండు నెలల్లో ఓ కొలిక్కి రానున్నాయి. విస్ట్రోన్-టాటా మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం.. టాటా సన్స్‌కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఐఫోన్ల తయారీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు యాపిల్‌తో టాటా సంస్థ సంబంధాల్ని బలోపేతం చేసుకుంటుంది. ఇప్పటికే తమిళనాడు హోసూర్ నగర పరిధిలో ఐఫోన్లో వినియోగించే విడి భాగాలను టాటా సన్స్ తయారు చేస్తున్నది. ఇటీవలే భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్లు ప్రారంభిస్తామని, ముంబైలో తొలి యాపిల్ స్టోర్ తెరుస్తామని ప్రకటించింది. -
మూసధోరణికి తెర
బెంగళూరు: దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగాలంటే భౌతిక, సామాజికపరమైన మౌలిక సదుపాయాలను రెండింటినీ బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ సాధిస్తున్న అద్భుతాలను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. మేడ్ ఇన్ ఇండియా, 5జీ టెక్నాలజీ 2014కు ముందు ఊహకందని విషయాలన్నారు. శుక్రవారం బెంగళూరులో మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వాలు పాత ఆలోచనా ధోరణిని పట్టుకొని వేలాడాయని, దేశ ఆకాంక్షల్లో వేగాన్ని విలాసంగా, గొప్ప స్థాయికి చేరుకోవడాన్ని రిస్క్‌గా భావించాయని విమర్శించారు. ఈ అభిప్రాయాన్ని తమ ప్రభుత్వం మార్చేసిందన్నారు. స్టార్టప్‌ల హబ్‌గా భారత్ పెట్టుబడులకు భారత్ ఒక నమ్మకమైన దేశంగా మారిందని మోదీ ఉద్ఘాటించారు. ‘‘కరోనా ప్రభావం ఉన్నప్పటికీ మూడేళ్లలో కర్ణాటక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఎఫ్‌డీఐ రాబట్టడంలో గతేడాది తొలి స్థానంలో నిలిచింది. ఐటీ, రక్షణ తయారీ, స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాల్లో దూసుకెళ్తోందని కొనియాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కర్ణాటక బలం అని స్టార్టప్ అంటే కేవలం ఒక కంపెనీ కాదని, కొత్తగా ఆలోచించడానికి, సాధించడానికి భావోద్వేగ అంశమని వివరించారు. విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నగర వ్యవస్థాపకుడు నాదప్రభు కెంపేగౌడ 108 అడుగుల ఎత్తయిన కంచు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. విగ్రహం బరువు 218 టన్నులు. ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్వాంజీ సుతార్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. విమానాశ్రయంలో .5,000 కోట్ల వ్యయంతో పచ్చదనానికి పెద్దపీట వేస్తూ పర్యావరణ హితంగా నిర్మించిన నూతన టెర్మినల్–2ను మోదీ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను బెంగళూరులోని క్రాంతివీరా సంగోలీ రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మైసూరు నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి రాకపోకలు సాగిస్తుంది. వందేభారత్ రైలుతో మైసూరు–బెంగళూరు–చెన్నై అనుసంధానం మరింత మెరుగవుతుందని, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని మోదీ చెప్పారు. ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించుకొనేవారి కోసం ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలును సైతం ప్రధానమంత్రి ప్రారంభించారు. ‘భారత్ గౌరవ్’ పథకంలో భాగంగా రైల్వే శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా ఈ రైలును నిర్వహిస్తాయి. ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలుతో కర్ణాటక, కాశీ సన్నిహితమవుతాయని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నేటి సవాళ్లకు గాంధీజీ బోధనలే సమాధానం: మోదీ దిండిగల్: సంఘర్షణల నుంచి వాతావరణ సంక్షోభాల వరకూ.. నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు జాతిపిత మహాత్మా గాంధీ బోధనలే సమాధానాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాగడానికి మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నామన్నారు. శుక్రవారం తమిళనాడులోని గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్‌లో పట్టభద్రులైన నలుగురు విద్యార్థులకు ప్రధాని బంగారు పతకాలు అందజేశారు. -
బిగాసస్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంత?
హైదరాబాద్: బిగాసస్ సరికొత్త బీజీ డీ15 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. పూర్తి మెటల్ బాడీతో భారత మార్కెట్ కోసం భారత్‌లోనే తయారు చేసిన స్కూటర్ ఇదని కంపెనీ తెలిపింది. ఒక్కసారి చార్జింగ్‌తో 115 కిలోమీటర్లు ప్రయాణించే డీ15 రోజువారీ కమ్యూటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. 16 అంగుళాల అలాయ్ వీల్స్‌తో బిగాసస్ నుంచి వచ్చిన తొలి స్కూటర్ ఇదే. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, 20కు పైగా బ్యాటరీ భద్రతా సదుపాయాలు, 77 సెంటీమీటర్ల పొడవైన సీట్, సైడ్ స్టాండ్ సెన్సార్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.99,999. చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన -
మెర్సిడెస్ ఈవీ,మేడ్ ఇన్ ఇండియా.. ఒకసారి చార్జింగ్ చేస్తే 857 కిలోమీటర్లు రయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో ఈక్యూఎస్ 580 4మేటిక్ తయారీ ప్రారంభించింది. జర్మనీ వెలుపల భారత్‌లోనే ఈ లగ్జరీ ఈవీని తయారు చేస్తున్నారు. కంపెనీ నుంచి భారత్‌లో రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇదే కావడం విశేషం. 14వ మేడిన్ ఇండియా మోడల్‌గా ఈక్యూఎస్ 580 4మేటిక్ నిలిచింది. ఏఆర్ఏఐ ధ్రువీకరణ ప్రకారం ఈ కారు ఒకసారి చార్జింగ్ చేస్తే 857 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారత్‌లో అత్యధిక దూరం ప్రయాణించే కారుగా ఇది స్థానం దక్కించుకుంది. ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లో 15 నిముషాల్లో 300 కిలోమీటర్లు ప్రయాణించ గలిగే స్థాయిలో చార్జింగ్ పూర్తి అవుతుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.55 కోట్లు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెన్నైలో ఈ కారును ఆవిష్కరించారు. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
మేడిన్ ఇండియా బొమ్మల హవా
చెన్నై: లెగో, బార్బీ లాంటి విదేశీ ఉత్పత్తులను పక్కన పెట్టి దేశీయంగా మన ఆటలు, బొమ్మలు, ఆట వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. బొంగరాలు, విక్రమ్ బేతాళ్ పజిళ్లు, ఇతరత్రా దేశీ థీమ్స్‌తో తయారవుతున్న ఆటవస్తువులపై పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. టాయ్స్ పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్దిష్ట నిబంధనలను తప్పనిసరి చేయడంతో కొన్ని రకాల బొమ్మలను దిగుమతి చేసుకోవడం కొంత తగ్గింది. అదే సమయంలో దేశీ టాయ్స్ తయారీ సంస్థలు కూడా వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాయి. మార్కెట్ లీడర్లయిన ఫన్‌స్కూల్, హాస్బ్రో, షుమీ లాంటి సంస్థలు ఆట వస్తువులు, గేమ్స్‌ను రూపొందిస్తున్నాయి. జన్మాష్టమి మొదలుకుని రామాయణం వరకు వివిధ దేశీ థీమ్స్ కలెక్షన్లను కూడా తయారుచేస్తున్నాయి. పిల్లలు ఆడుకునే సమయం కూడా అర్థవంతంగా ఉండాలనే ఆలోచనా ధోరణి కొత్త తరం పేరెంట్స్‌లో పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి హాట్ కేకులుగా అమ్ముడవుతున్నాయి. సంప్రదాయ భారతీయ గేమ్స్‌కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనే లభిస్తోందని ఫన్‌స్కూల్ వర్గాలు తెలిపాయి. దీంతో తాము బొంగరాలు, గిల్లీడండా (బిళ్లంగోడు) లాంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నాయి. తాము చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు, ఆటల్లాంటివి తమ పిల్లలకు కూడా పరిచయం చేయాలన్న ఆసక్తి సాధారణంగానే తల్లిదండ్రుల్లో ఉంటుందని, ఇది కూడా దేశీ గేమ్స్ ఆదరణ పొందడానికి కారణమవుతోందని హాస్బ్రో ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ బొమ్మలు, గేమ్స్ మొదలైనవి పూర్తిగా దేశీయంగానే తయారవుతున్నాయని, దీనితో స్థానికంగా కొనుగోళ్లు, తయారీకి కూడా ఊతం లభిస్తోందని వివరించాయి. తాము మోనోపలీ ఆటను తమిళంలో కూడా అందుబాటులోకి తెచ్చామని, దీన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని పేర్కొన్నాయి. అటు జన్మాష్టమి కలెక్షన్ ఆవిష్కరించిన ఆటవస్తువుల కంపెనీ షుమీ కొత్తగా దీపావళి కలెక్షన్‌ను కూడా ప్రవేశపెడుతోంది. 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే.. దేశీ టాయ్స్ మార్కెట్ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో సింహభాగం 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే ఉంటోంది. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 5 శాతం మేర వృద్ధి చెందుతుంటే మన మార్కెట్ మాత్రం 10–15 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. దీంతో వచ్చే రెండేళ్లలో మార్కెట్ పరిమాణం 2–3 బిలియన్ డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎంతో కాలంగా భారత్‌లో దేశీ ఆటవస్తువులు, బొమ్మలు, గేమ్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ తయారీ సంస్థలు ఇప్పుడు దాన్ని గుర్తిస్తున్నాయని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ శరద్ కపూర్ తెలిపారు. -
మేడిన్ ఇండియా ఐఫోన్ 14
న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టబోయే ఐఫోన్ 14ని చైనాతో పాటు భారత్‌లోనూ దాదాపు ఏకకాలంలో తయారుచేయడంపై టెక్ దిగ్గజం యాపిల్ కసరత్తు చేస్తోంది. చైనాలో ఉత్పత్తి మొదలుపెట్టిన రెండు నెలలకే తర్వాత భారత్‌లోనూ తయారీ ప్రారంభించాలని భావిస్తోంది. దీంతో చైనాలో తయారయ్యే ఐఫోన్ 14 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానుండగా.. మేడిన్ ఇండియా వెర్షన్ అక్టోబర్ ఆఖరు లేదా నవంబర్ నాటికి సిద్ధం కాగలదని భావిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అక్టోబర్ 24కే ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా చైనాలో ఉత్పత్తి చేసే ఐఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాక యాపిల్ ఆరు నుంచి తొమ్మిది నెలల తర్వాత భారత్‌లో తయారు చేస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో అమెరికా, చైనా ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడం, కోవిడ్‌పరమైన లాక్డౌన్లతో సమస్యలు తలెత్తడం వంటి అంశాల వల్ల చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ప్రత్యామ్నాయంగా భారత్‌లో తయారీ కార్యకలాపాలను పెంచుకోవడంపై యాపిల్ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రెండు దేశాల్లో తయారీ కార్యకలాపాల మధ్య జాప్యాన్ని గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఉంటున్న ఆరు నుంచి తొమ్మిది నెలల జాప్యాన్ని రెండు నెలలకు తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించాయి. భారత్‌లో తయారీని వేగవంతం చేసేందుకు సరఫరాదారులతో కూడా కంపెనీ చర్చలు జరుపుతోంది. ఏకకాలంలో ఉత్పత్తి.. భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీ 2017లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్, విస్ట్రన్, పెగాట్రాన్ సంస్థలు యాపిల్ కోసం ఐఫోన్ 13 ఫోన్లను దేశీయంగా తయారు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 47,000 కోట్ల విలువ చేసే ఐఫోన్లను భారత్ నుంచి ఎగుమతి చేయాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత మార్కెట్లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలూ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో యాపిల్ తమ ఉత్పత్తులను ఇరు దేశాల్లో (భారత్, చైనా) ఏకకాలంలో ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయని టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. తదుపరి ఐఫోన్ వెర్షన్ .. భారత్, చైనా నుంచి ఒకే సమయంలో రావచ్చని పేర్కొన్నాయి. ఇందుకోసం చైనా నుంచి విడిభాగాలను ఎగుమతి చేయడం, భారత్‌లో వాటిని అసెంబ్లింగ్ చేయడానికి సంబంధించిన ప్రక్రియను ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది నుంచే రెండు దేశాల్లో ఉత్పత్తి ఏకకాలంలో ప్రారంభించాలని యాపిల్, ఫాక్స్‌కాన్ భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా సాధ్యపడకపోవచ్చని ఇరు కంపెనీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దీర్ఘకాలికంగానైనా ఈ ప్రణాళికను అమలు చేయాలని అవి భావిస్తున్నట్లు వివరించాయి. ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయడమంటే చాలా కష్టతరమైన వ్యవహారమే. ఓవైపు వందలకొద్దీ సరఫరాదారులతో సమన్వయం చేసుకుంటూ మరోవైపు యాపిల్ విధించి కఠినతరమైన డెడ్లైన్లు, నాణ్యతా ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. చైనాకు దీటుగా ఐఫోన్ల ఉత్పత్తిని సాధించగలిగితే భారత్‌కు పెద్ద మైలురాయిగా మారగలదు. -
ఇండియన్ ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త!
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. భారత్ కేంద్రంగా ఐఫోన్ -14 ఫోన్లను తయారీ చేయాలని యాపిల్ సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పలు నివేదికల ప్రకారం..వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి భారత్‌లో 'మేడిన్ ఇండియా ఫోన్ల' ఉత్పత్తిని ప్రారంభించనుంది. జాతీయ, అంతర్జాతీయ కారణాల వల్ల దేశాల మధ్య ఏర్పడ్డ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో యాపిల్ సంస్థ భారత్‌లోనూ ఐఫోన్లను తయారు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి మన దేశంలో చెన్నై కేంద్రంగా యాపిల్ సంస్థ ఐఫోన్లను తయారు చేయిస్తుంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం లేదు. మరికొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల కానున్న ఐఫోన్-14సైతం విదేశాల్లో తయారీ చేసి.. అక్కడి నుంచి మనదేశానికి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దిగుమతి సమయం 6 నెలల నుంచి 9నెలల వరకు పట్టేది. తైవాన్ అంశంపై అమెరికా, చైనా మధ్య విభేదాలు, భారత్‌తో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో రానున్న రోజుల్లో ఐఫోన్లను ఆవిష్కరించి.. కొనుగోలు దారులకు చేరేందుకు మరింత సమయం పట్టనుంది. ఆ సమయాన్ని తగ్గిస్తూ భారత్‌లో ఐఫోన్-14ను తయారు చేయాలని చూస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకోసం చెన్నై ఫ్లాంట్‌లో ఐఫోన్ -14 ల తయారీపై యాపిల్‌తో పాటు ఫాక్స్ కాన్ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఐఫోన్-14తోపాటు దేశీయంగా తయారయ్యే ఇతర ఐఫోన్ ధరలు భారీగా తగ్గనున్నాయి.కాగా ఐఫోన్-14 మేడిన్ ఇండియాపై యాపిల్ సంస్థ స్పందించాల్సి ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి👉 యాపిల్ భారీ షాక్, ఉద్యోగులపై వేటు! -
నథింగ్ ఫోన్.. మేడిన్ ఇండియా
న్యూఢిల్లీ: భారత్‌లో విక్రయించే ప్రతి స్మార్ట్‌ఫోన్‌ను స్థానికంగా తయారు చేయనున్నట్టు టెక్నాలజీ కంపెనీ నథింగ్ ప్రకటించింది. ఆడియో ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ సంస్థ స్మార్ట్ఫోన్ల వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్టు ఈ ఏడాది మార్చిలో వెల్లడించింది. తమిళనాడులో స్మార్ట్ఫోన్లు ఉత్పత్తి కానున్నాయి. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌పై సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధిలో నథింగ్ నిమగ్నమైంది. తొలి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) జూలై 12న భారత్‌లో ఆవిష్కరించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్ మాజీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పే స్థాపించిన నథింగ్లో గూగుల్ పెట్టుబడి చేసింది. చదవండి: స్టార్టప్‌లకు రైల్వే నిధుల మద్దతు -
యాపిల్ కీలక నిర్ణయం..! ఐఫోన్-13 తయారీ భారత్‌లోనే.. ఎక్కడంటే..?
అమెరికాకు చెందిన టెక్ కంపెనీ యాపిల్ తన తాజా మోడల్ 'ఐఫోన్ 13' తయారీని భారత్‌లో ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా చొరవ మేరకు ఐఫోన్-13 స్మార్ట్ఫోన్లను తయారుచేయాలని యాపిల్ నిర్ణయం తీసుకుంది. సరికొత్త యాడ్-ఆన్ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్స్ చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి కానుంది. కొద్ది రోజుల క్రితమే ఐఫోన్-12ను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పుడు వీటితో పాటుగా యాపిల్ పోర్ట్‌ఫోలియోలోని ఐఫోన్ సిరీస్ స్మార్ట్ఫోన్లను తయారుచేయాలని యాపిల్ సన్నద్ధమైంది. ఐఫోన్ 13ను భారత్‌లో తయారు చేస్తోన్నందుకు సంతోషంగా ఉన్నామని యాపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. స్థానిక కస్టమర్స్ కోసం అందమైన డిజైన్, అద్భుతమైన ఫోటోలు, వీడియోల కోసం అధునాతన కెమెరా సిస్టమ్‌లు, A15 బయోనిక్ చిప్‌తో ఐఫోన్-13 తయారు చేస్తామని యాపిల్ పేర్కొంది. కాగా ఐఫోన్-13 సరికొత్త మోడల్ భారత్‌లోనే ఉత్పత్తి అవ్వడం విశేషం. గణనీయమైన వృద్ధి..! గత రెండు సంవత్సరాలలో యాపిల్ స్మార్ట్‌ఫోన్స్‌కు భారత్‌లో భారీ డిమాండ్ నెలకొంది. భారత్‌లో ముఖ్యంగా మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు ఉత్పత్తులను అందించే ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్స్‌లో ఐఫోన్ అమ్మకాలు భారీగా అమ్ముడయ్యాయి. ఇక భారత్‌లో యాపిల్ ఐఫోన్-13 స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి అవ్వడంతో ఈ ఫోన్ ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఐఫోన్-13 ధరల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా యాపిల్ తన స్మార్ట్ఫోన్ల అసెంబ్లీను చైనాలో, సాఫ్ట్వేర్ తదితర టెక్నాలజీ ఫీచర్స్‌ను కాలిఫోర్నియాలో తయారుచేస్తుంది. చదవండి: హెచ్చరిక..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి..లేకపోతే..! -
మన ఎగుమతులు భేష్
న్యూఢిల్లీ/సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల (రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన ఉత్పత్తులకు ప్రపంచమంతటా డిమాండ్ పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువుల కోసం దేశాలు ఎదురు చూస్తున్నాయని, మన సప్లై చైన్ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతోందని అన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని ప్రతి భారతీయుడు అందిపుచ్చుకుంటే లోకల్ గ్లోబల్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఏడాదిగా ప్రభుత్వం ఈ–మార్కెట్ ద్వారా రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసిందన్నారు. 1.25 లక్షల మంది చిన్నతరహా వ్యాపారవేత్తలు, దుకాణదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారని తెలిపారు. గతంలో బడా వ్యాపారులే ప్రభుత్వానికి సరుకులను విక్రయించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు చిన్న వ్యాపారులు, దుకాణదారులకు కూడా ఆ అవకాశం లభిస్తోందని వెల్లడించారు. భారతీయులంతా చేతులు కలిపితే ఆత్మనిర్భర్‌భారత్ లక్ష్యసాధన సులువేనన్నారు. ఆయుష్కు అద్భుత అవకాశాలు ఆయుష్ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరిస్తుండడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఈ రంగంలో స్టార్టప్‌లకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయుష్ పరిశ్రమ మార్కెట్ విలువ రూ.22,000 కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్లకు చేరిందన్నారు. మన ఉత్పత్తుల ప్రతిష్టను, గిరాకీని మరింత పెంచుకొనేలా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 126 ఏళ్ల వయసులో పద్మశ్రీ అందుకున్న యోగా గురువు స్వామి శివానంద జీవితం నుంచి దేశం ఎంతో స్ఫూర్తిని పొందుతోందని మోదీ అన్నారు. ప్రతి చుక్కనూ ఆదా చేసుకోవాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలు నిర్మించుకోవాలన్నారు. ఏప్రిల్ 1న పరీక్షా పే చర్చ ఏప్రిల్ 1న ఢిల్లీ తల్కటోరా స్టేడియంలో ‘పరీక్షా పే చర్చ’లో మోదీ విద్యార్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. పరీక్షల పండుగ జరుపుకుందామంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ మెట్ల బావి ప్రస్తావన తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఇటీవల బయటపడిన మెట్ల బావి గురించి మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మెట్లబావి పునరుద్ధరణకు ప్రజలు చూపిన చొరవను అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగినపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లు దక్షిణ కొరియాకు కూడా ఎగుమతి అవుతున్నాయంటూ ఆయన ప్రశంసించారు. -
భారతీయులకు టెక్ దిగ్గజం హెచ్‌పీ శుభవార్త!!
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ భారతీయులకు శుభవార్త చెప్పింది. దేశీయంగా హెచ్‌పీ ల్యాప్‌ట్యాప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లు తెలిపింది. దేశీయం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటీవ్(పీఎల్ఐ) స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పథకం సత్పలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పథకంలో భాగంగా హెచ్ పీ సంస్థ మన దేశంలో డెస్క్‌టాప్ లు, మినీ డెస్క్‌టాప్‌లు, డిస్ప్లే మానిటర్లు, ల్యాప్‌టాప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ గణాంకాల ప్రకారం..2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ మార్కెట్‌ను మరింత పెంచేందుకు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తుంది. హెచ్‌పీ ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చర్ కంపెనీ ఫ్లెక్స్ కంపెనీతో చేతులు కలిపింది. తమిళనాడులో చెన్నైకి చెందిన శ్రీపెరంబుదూర్‌లోని హెచ్‌పీ తయారీ యూనిట్లను పెంచేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు హెచ్‌పీ ఇండియా మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ కేతన్ పటేల్ అన్నారు. వాస్తవానికి హెచ్‌పీ భారత్‌లో కమర్షియల్ డెస్క్ టాప్‌లను తయారు చేస్తుంది. అయితే తాజా పెట్టుబడలతో హెచ్‌పీ ఎలైట్ బుక్స్, ప్రో బుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్‌తో పాటు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్నట్లు హెచ్ పీ వెల్లడించింది.. -
మేడిన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, పీసీలు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు సహా వివిధ రకాల పర్సనల్ కంప్యూటర్లను భారత్‌లో తయారు చేయడం ప్రారంభించినట్లు టెక్ దిగ్గజం హెచ్‌పీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాలు కూడా కొనుగోలు చేసే విధంగా వీటిలో కొన్ని ఉత్పత్తులకు అర్హతలు ఉన్నాయని పేర్కొంది. గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రభుత్వ విభాగాలు ఆర్డరు చేసేందుకు ఇవి అందుబాటులో ఉంటాయని హెచ్‌పీ ఇండియా మార్కెట్ ఎండీ కేతన్ పటేల్ తెలిపారు. ‘భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి చురుగ్గా పనిచేస్తున్నాం. కోట్ల కొద్దీ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మేకిన్ ఇండియా ప్రోగ్రాంకి అనుగుణంగా మేము దేశీయంగా తయారీని చేపట్టాము. మా తయారీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా స్వావలంబన భారత కల సాకారం కావడంలో అర్ధవంతమైన పాత్ర పోషించగలమని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కమర్షియల్ డెస్క్‌టాప్‌ల తయారీ కోసం ఫ్లెక్స్ సంస్థతో 2020 ఆగస్టులో హెచ్‌పీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి అనుగుణంగా తమిళనాడు రాజధాని చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లోని ఫ్లెక్స్ ప్లాంటులో పీసీలు, ల్యాప్‌టాప్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. తొలిసారిగా విస్తృత శ్రేణి .. హెచ్‌పీ ఎలీట్‌బుక్స్, హెచ్‌పీ ప్రోబుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్ వంటి విస్తృత శ్రేణి ల్యాప్‌టాప్‌లను భారత్‌లో తయారు చేయడం ఇదే తొలిసారని సంస్థ పేర్కొంది. డెస్క్‌టాప్ మినీ టవర్స్ (ఎంటీ), మినీ డెస్క్‌టాప్స్ (డీఎం), స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ (ఎస్ఎఫ్ఎఫ్) డెస్క్‌టాప్స్, ఆల్–ఇన్–వన్ పీసీలు మొదలైన వాటిని కూడా తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల ఆప్షన్లతో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు హెచ్‌పీ పేర్కొంది. ఫ్లెక్స్ ఫ్యాక్టరీ.. చెన్నై పోర్టుకు దగ్గర్లో ఉండటం వల్ల నిర్వహణపరమైన సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని, ల్యాప్‌టాప్‌లు..ఇతర పీసీ ఉత్పత్తులకు అవసరమైన ముడివస్తువులను సమకూర్చుకోవడం సులభతరంగా ఉంటుందని తెలిపింది. -
అమెరికాకూ మన ‘రెక్కలు’
ఇబ్రహీంపట్నం రూరల్: అమెరికాకు చెందిన ఎఫ్–16 రకం యుద్ధవిమానాలు మేడిన్ హైదరాబాద్, మేడిన్ ఇండియా రెక్కలు (ఫైటర్ వింగ్స్) తొడుక్కోనుండటం గర్వకారణమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. ఈ రెక్కల తయారీలో ఉపయోగించే పరికరాల్లో 70 శాతం భారత్‌వే కావడం విశేషమన్నారు. ఫైటర్ వింగ్స్ తయారీ కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు సాధించడం అభినందనీయమన్నారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఏరోస్పేస్ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్ భారత్‌లో తమ అనుబంధ సంస్థ టాటా–లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ఎంఏఎల్)ను ఎఫ్–16 యుద్ధవిమానాల రెక్కల తయారీ సహ భాగస్వామిగా లాంఛనంగా గుర్తించింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న టీఎల్ఎంఏఎల్ కేంద్రం తమ మొట్టమొదటి నమూనా యుద్ధవిమాన రెక్కను తయారు చేసి లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్‌కు అప్పగించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఈ రంగం ఐదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ విధానం ద్వారా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా, పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. ఏరోస్పేస్ రంగంలో 2020లో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవార్డు వచ్చిందని గుర్తుచేశారు. టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ ఎండీ సీఈఓ సుకరణ్‌సింగ్ మాట్లాడుతూ తమ భాగస్వామ్యంలో విజయవంతంగా ఫైటర్ వింగ్‌ను తయారు చేయగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో లాక్‌హీడ్ మార్టిన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ బ్లెయిర్, వైస్ ప్రెసిడెంట్ కంబాట్ ఎయిర్, ఇంటిగ్రేటెడ్ పైటర్ గ్రూప్ ఐమీ బర్నెట్, యుఎస్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్ ) జోయెల్ రీఫ్మాన్లు పాల్గొన్నారు. -
‘అక్టోబర్ 21 దేశ చరిత్రలో ఓ మైలురాయి’
-
‘అక్టోబర్ 21 దేశ చరిత్రలో ఓ మైలురాయి’
న్యూఢిల్లీ: కోవిడ్‌పై పోరాటంలో భారతదేశం చరిత్ర సృష్టించింది. మహమ్మారి కట్టడి కోసం ప్రారంభించిన టీకా కార్యక్రమంలో అక్టోబర్ 21(గురువారం) వరకు 100 కోట్ల టీకా డోసులు పంపిణీ పూర్తయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం నరేంద్ర మోదీ జాతీనుద్దేశించి ప్రసంగించారు. భారత్ వంద కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇది ప్రతీ భారతీయుడి విజయం అని.. దేశ సామర్థ్యానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘100 కోట్ల డోసులు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. దేశ సామర్థ్యానికి ప్రతీక. మన దేశం ఎంత సంకల్ప బద్ధంగా ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. గతంలో మనం విదేశాల నుంచి వ్యాక్సిన్ తెప్పించుకునేవాళ్లం. ఇప్పుడు విదేశాలకు టీకాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. శతాబ్ధి కాలంలో ఎన్నడూ చూడనటువంటి మహమ్మారి ప్రపంచం మీద దాడి చేసింది. ఈ మమమ్మారిని అడ్డుకునేందుకు భారత్ వ్యాక్సిన్లను ఎక్కడి నుంచి తీసుకువస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుతం 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాయి’’ అన్నారు. (చదవండి: ప్రపంచానికే పాఠాలు!) ‘‘కోవిడ్ మనకో సవాల్ విసిరింది.. భారత్ శక్తి ఏంటో చూపించాం. కరోనాపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని తొలి ఆయుధంగా మలుచుకున్నాం. భారత్‌ను ప్రపంచం ఇప్పుడు సురక్షిత దేశంగా చూస్తోంది. భారత్ వ్యాక్సిన్ హబ్‌గా మరింత మన్ననలు పొందుతోంది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేయడం అనేది అద్భుత విజయం. మన టెక్నాలజీ, సామర్థ్యానికి ప్రతీక’’ అన్నారు. (చదవండి: డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్ 90% రక్షణ) ‘‘కోవిన్ వల్ల టీకాలను సులభతరంగా, పారదర్శకంగా అందిస్తున్నాం. వ్యాక్సిన్ సరఫరాను సవాల్‌గా తీసుకున్నాం. అందరికి ఉచితంగా టీకా ఇచ్చాం. శాస్త్రీయ దృక్పథంతో వ్యాక్సిన్ పంపిణీ చేశాం. ప్రస్తుతం మేడిన్ ఇండియా వస్తువులకు ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసం, ఉత్సామం కనిపిస్తోంది. అయితే రక్షణ కవచం ఉందని నిర్లక్ష్యం వద్దు. కరోనా ఇంకా కొనసాగుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని పండుగలు జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి’’ అన్నారు మోదీ. చదవండి: శతకోటి సంబరం! -
‘మేడ్ ఇన్ ఇండియా’ బీఎమ్‌డబ్ల్యూ కార్‌పై ఓ లుక్కేయండి..!
Made In India BMW 530i M Sport Carbon Edition Launched: ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ‘మేడ్ ఇన్ ఇండియా’ చొరవలో భాగంగా కొత్త బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఎమ్ స్పోర్ట్ ‘కర్బన్ ఎడిషన్’ కారును ఆవిష్కరించింది. ఈ కారును చెన్నై ప్లాంట్‌లో బీఎమ్‌డబ్ల్యూ ఉత్పత్తి చేసింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలుదారులు ఈ కారును బుక్ చేసుకోవచ్చును. భారత మార్కెట్లో బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఎమ్ స్పోర్ట్ కర్బన్ ఎడిషన్ ధర రూ. 66,30,000 (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. చదవండి: హాట్‌కేకుల్లా అమ్ముడైన ఎమ్జీ ఆస్టర్..! కార్ ఫీచర్స్ ..! కర్బన్ ఎడిషన్ మోడల్ 5 సిరీస్ మోడల్లో కిడ్నీ గ్రిల్, ఫ్రంట్ ఆప్రాన్, సైడ్ వ్యూ మిర్రర్స్, రియర్ బూట్ లిడ్ స్పాయిలర్ లాంటివి కర్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. . అంతేకాకుండా 18-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ ను అమర్చారు. ఈ కారుకు ఆల్ఫైన్ వైట్ పెయింట్ వర్క్‌ను జోడించారు. కార్ ఇంటిరీయర్స్ విషయానికి వస్తే...బ్లాక్ డ్యూయల్ టోన్ థీమ్డ్ స్పోర్ట్ సీట్స్‌తో కారు మరింత ఆకర్షణీయంగా నిలవనుంది. 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, 16-స్పీకర్, 464-వాట్ హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 4జోన్ టెంపరేచర్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరాలను కారులో అమర్చారు. ఇంజిన్ విషయానికి వస్తే..! బీఎమ్‌డబ్ల్యూ స్టాండర్డ్ 530i ఎమ్ స్పోర్ట్ మోడల్ ఇంజిను కొత్త కార్బన్ ఎడిషన్ వెర్షన్లో కూడా అమర్చారు. 1998సీసీ సామర్థ్యంతో ఇన్-లైన్ నాలుగు సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనికి 8-స్పీడ్ స్పోర్ట్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.ఇంజిన్ 248 బీహెచ్పీ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. చదవండి: Facebook: ఫేస్బుక్ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...! -
మెర్సిడెజ్ బెంజ్.. మేడిన్ ఇండియా.. ధర ఎంతంటే?
Made-in-India Mercedes-Benz S-Class: లగ్జరీ కార్ల విభాగంలో మోస్ట్ పాపులర్ మోడల్ మెర్సిడెజ్ బెంజ్ సెడాన్ ధరలు భారీగా తగ్గాయి. విదేశాల నుంచి దిగుమతికి బదులుగా ఇక్కడే కార్లను తయారు చేస్తుండటంతో వాటి కార్ల ధరల్లో తగ్గుదల సాధ్యమైంది. ఇండియాలో తయారైన కార్లను 2021 అక్టోబరు 7న ఆ సంస్థ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సక్సెస్ మోడల్ మెర్సిడెజ్ బెంజ్ కార్లకు ఆది నుంచి ఇండియాలో డిమాండ్ ఉంది. సంపన్న వర్గాలు సెడాన్ సెగ్మెంట్లో బెంజ్ కారుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇటీవల మెర్సిడెజ్ బెంజ్ రిలీజ్ చేసిన ఎస్ క్లాస్ కార్లకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఇండియన్లకు మరింత చేరువయ్యేలా చర్యలు ప్రారంభించింది జర్మనీకి చెందిన మెర్సిడెజ్ బెంజ్. తగ్గిన ధర ఎక్స్ షోరూమ్‌కి సంబంధించి గతంలో మెర్సిడెజ్ బెంజ్ ఎస్ ధర రూ. 2.17 కోట్లు ఉండగా ఎస్ క్లాస్ 450 4 మ్యాటిక్ ధర రూ. 2.19 కోట్ల రూపాయలుగా ఉండేది. తాజాగా ఈ కార్ల ధరలు తగ్గిపోయాయి. ఎస్ క్లాస్ 450 4 మ్యాటిక్ ప్రారంభ ధర రూ. 1.62 కోట్లకు తగ్గిపోయింది. మరో మోడల్ ఎస్ క్లాస్ 350 డీ ధర రూ. 1.57 కోట్లకు తగ్గింది. కారణం గతంలో జర్మనీలో పూర్తిగా తయారైన కార్లనే (కంప్లీట్ బల్డిండ్ యూనిట్) ఇండియకు దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మకాలు జరిపే వారు, దీంతో దిగుమతి సుంకం భారం వినియోగదారులపై పడేది. తాజాగా బెంజ్ సంస్థ విడిభాగాలను ఇండియాకు తెప్పించి ఇక్కడే కార్లను (కంప్లీట్ నాక్అవుట్ యూనిట్) తయారు చేస్తోంది. దీంతో దిగుమతి సుంకం భారం లేకుండా పోయింది. ఫలితంగా ధరలు తగ్గాయి. అదే క్వాలిటీ జర్మీలో తయారు చేసినా ఇండియాలో కార్లను రూపొందించినా.. తమదైన నాణ్యతా ప్రమాణాలకు కచ్చితంగా పాటిస్తామని బెంజ్ సంస్థ అంటోంది. ప్రపంచ శ్రేణి కార్ల తరహాలోనే ఇండియన్ మేడ్ కార్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. Ranging from top of the class features to comfort and luxury like never before, experience sophistication in the new S-Class. With technology that brings the ultimate Mercedes-Benz experience, enjoy a Star that cares for what matters and is proudly made in India. #NewSClass pic.twitter.com/yodbhmfAue — Mercedes-Benz India (@MercedesBenzInd) October 7, 2021 చదవండి : బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్యువి 700 ఎస్యూవి సరికొత్త రికార్డు -
Vaccine: గేమ్ ఛేంజర్, కార్బెవాక్స్ వచ్చేస్తోంది!
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్‌కు చెందిన బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ వ్యాక్సిన్‌కు సంబంధించి మరో ఊరట లభించనుంది. దేశంలోనే అత్యంత సమర్ధతతో పాటు అత్యంత చౌకైన ధరకే ఈ వ్యాక్సిన్ లభించనుంది ఈ మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ 90 శాతం ప్రభావాన్ని కలిగి ఉంటుందని , కరోనా మహమ్మారిపై పోరాటంలో గేమ్‌ఛేంజర్‌గా ఉండనుందని భావిస్తున్నామని ప్రభుత్వసలహా ప్యానెల్ ఉన్నత సభ్యలొలకరు తెలిపారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్‌లోకి ప్రవేశిస్తోందని, అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చైర్పర్సన్ ఎన్‌కె అరోరా తెలిపారు. నోవావాక్స్ వ్యాక్సిన్ మాదిరిగానే ఉందని, కార్బెవాక్స్ 90 శాతం సమర్ధతను ప్రదర్శించనుందని తెలిపారు. అలాగే ఈ వ్యాక్సిన్ కూడా అన్నికోవిడ్-19 వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేస్తుందని తెలిపారు. అంతేకాదు భారీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున ఈ టీకా రెండు మోతాదుల ధర గణనీయంగా తక్కువ ధరకే లభించనుందని చెప్పారు. సుమారు రూ. 250 వద్ద చాలా తక్కువ ధరకు అందు బాటులోకి రానుందని పేర్కొన్నారు. సరసమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా భారతదేశంపై ఆధారపడే సమయం రానుందని డాక్టర్ అరోరా అన్నారు. అంతిమంగా ప్రపంచం టీకాల కోసం మనపై ఆధారపడిఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన పూణేకు చెందిన సీరం, అహ్మదాబాద్‌కు చెందిన కాడిల్లా ఫార్మా లాంటి భారతీయ ఔషధ పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. టీకాల కోసం ప్రతి ఒక్కరూ భారతదేశంవైపు చూస్తున్నారు. ఎందుకంటే చాలా పేద దేశాలు, తక్కువ ఆదాయ దేశాలకు వేరే మార్గం లేదు. ఈ రోజు టీకాలు కొనడం కంటే ఆయుధాలు కొనడం చాలా సులభమని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్ బయోటెక్ Edible oil: వినియోగదారులకు భారీ ఊరట -
ఏడాదిలోపే కోవిడ్ ఆయుధాలు సిద్ధం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దాడి ప్రారంభమై సంవత్సరం గడవకముందే దానిపై పోరాటానికి ఆయుధాలను సిద్ధం చేసిన భారతీయ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. దేశీయంగా కరోనా టీకాను రికార్డు సమయంలో రూపొందించారని ప్రశంసలు కురిపించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) సంస్థ శాస్త్రవేత్తలతో ప్రధాని శుక్రవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. సీఎస్ఐఆర్కు ప్రధాని ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. గతంలో విదేశాల్లో రూపొందించిన వాటిని పొందేందుకు భారత్ సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని అన్నారు. విదేశీ శాస్త్రవేత్తలతో కలిసి, సరిసమానంగా భారతీయ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారన్నారు. ఈ శతాబ్దంలో మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం కరోనా అని ప్రధాని పేర్కొన్నారు. అయితే, మానవాళి ఏదైనా సంక్షోభం ఎదుర్కొన్న ప్రతీసారి.. సైన్స్ దాన్ని ఎదుర్కోవడానికి మార్గం చూపిందని మనకు చరిత్ర చెబుతోందని వివరించారు. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్నే కాకుండా, దేశీయంగా కరోనా టెస్టింగ్ కిట్స్‌ను, కోవిడ్ చికిత్సకు ఔషధాలను రికార్డు సమయంలో భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించి, ‘ఆత్మనిర్భర్ భారత్’ను నిజం చేశారని ప్రశంసించారు. భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా కోవాగ్జిన్ కోవిడ్ టీకాను తయారుచేసిన విషయం తెల్సిందే. ఆక్సిజన్ ఉత్పత్తిని కూడా రికార్డు సమయంలో భారీగా పెంచామని గుర్తు చేశారు. ‘మీ కృషి, మీ అద్భుతమైన మేథ కారణంగానే ఈ భారీ యుద్ధాన్ని చేయగలుగుతున్నాం’అని సైంటిస్ట్లకు కృతజ్ఞతలు తెలిపారు. స్వయం సమృద్ధ భారత్, సుదృఢ భారత్ తమ లక్ష్యాలని, అయితే, ఈ కరోనా మహమ్మారి కారణంగా ఆ లక్ష్యసాధన కొంత ఆలస్యమవుతోందని వివరించారు. అయితే, కచ్చితంగా వాటిని సాధిస్తామన్నారు. ‘మన లక్ష్యాలెప్పుడూ భవిష్యత్తు కన్నా రెండడుగులు ముందుండాలి’అన్నారు. సుస్థిరాభివృద్ధి, స్వచ్ఛ విద్యుత్ తదితర అంశాల్లో భారత్ ప్రపంచ దేశాలకు మార్గం చూపుతోందని, సాఫ్ట్వేర్, శాటిలైట్ టెక్నాలజీలతో చాలా దేశాల అభివృద్ధిలో భాగం పంచుకుంటోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో వాతావరణ మార్పు మహమ్మారిని ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తల బృందం ఇప్పటినుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2016లో ప్రారంభించిన ‘అరోమా మిషన్’విజయంలో సీఎస్ఐఆర్ పాత్రను ప్రధాని గుర్తు చేశారు. -
మరో మేడిన్ ఇండియా వ్యాక్సిన్‌కు కేంద్రం ఒప్పందం
-
Vaccination: ఊరట, త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ కరోనా టీకా లక్ష్యంలో భాగాంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ (బీఈ) కోవిడ్ వ్యాక్సిన్ కోసం భారీ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ టీకాకోసం 1,500 కోట్లు రూపాయల మేర ముందస్తు డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ఆగస్టు - డిసెంబర్ మధ్య 30 కోట్ల డోసులను కంపెనీ ఉత్పత్తి చేయనుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవాగ్జిన్ తరువాత దేశంలో అందుబాటులోకి రానున్న రెండో మేడిన్ ఇండియా వ్యాక్సిన్ ఇదని పేర్కొంది. ఒకటి, రెండు దశల ప్రయోగాల్లో మంచి ఫలితాలను చూపించిన తరువాత బయోలాజికల్-ఇ వ్యాక్సిన్ ప్రస్తుతం ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌లో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే కొద్ది నెలల్లో ఈ టీకా అందుబాటులో ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అయిదు లేదా ఆరు కొత్త కోవిడ్-19 వ్యాక్సిన్లకు మద్దతు ఇవ్వాలన్న ప్రభుత్వ మిషన్‌లో భాగమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండో దశలో కరోనా విలయం, వ్యాక్సిన్ల కొరత, టీకా విధానంపై విమర్శల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2021 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు బయోలాజికల్ ఈ మోతాదులను తయారు చేసి నిల్వ చేస్తామని వెల్లడించింది. కాగా దేశంలో ఆగస్టునాటికి రోజుకు కోటి డోసుల వ్యాక్సిన్లు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే కోవాగ్జిన్, కోవీషీల్డ్ , స్పుత్నిక్-వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే విదేశాల్లో డబ్ల్యుహెచ్వో ఆమోదం లభించిన ఫైజర్, మోడర్నాలాంటి ఇతర విదేశీ వ్యాక్సిన్లకు కూడా శరవేగంగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : Vaccination : గుడ్‌న్యూస్ చెప్పిన డీసీజీఐ -
పాకిస్తాన్‌కు 4.5 కోట్ల కరోనా టీకా డోసులు
న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన కరోనా టీకాలు త్వరలో పాకిస్తాన్‌కు పంపిణీ కానున్నాయి. పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా 4.5 కోట్ల డోసుల్ని ఫిబ్రవరి–మే మధ్య పాక్‌కి భారత్ పంపనుంది. నిరుపేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించాలన్న ఉద్దేశంతో ఐక్య రాజ్యసమితి చేపట్టిన యునైటెడ్ గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూ నిజేషన్ (గవి) కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్‌కు మేడిన్ ఇండియా టీకా సరఫరా కానుంది. ఇప్పటికే భారత్ 65 దేశాలకు కరోనా టీకా పంపిణీ చేస్తోంది. గ్లోబల్ వ్యాక్సినేషన్లో భాగంగా కొన్ని దేశా లకు ఉచితంగా ఇస్తుంటే, మరికొన్ని దేశాల నుంచి డబ్బులు తీసుకొని పంపి స్తోంది. సార్క్ దేశాల్లో ఇప్పటివరకు పాకిస్తాన్ ఒక్కటే భారత్ నుంచి కోవిడ్–19 వ్యాక్సిన్‌ను తీసుకోలేదు. చదవండి: (అమ్మానాన్నలపై కేసు పెట్టిన కొడుకు) -
యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త. మరొకొద్ది రోజుల్లో మేడిన్ ఇండియా ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. దేశీయంగా భారీ ఆదరణకు నోచుకున్న ఐఫోన్ 12 ఇప్పుడు భారతదేశంలో స్థానికంగా తయారవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని విశ్లేషకులు, పరిశ్రమ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. దీంతో మేడిన్ ఇండియా ఐఫోన్12 తక్కువ ధరకే లభించనుందని భారతీయ ఐఫోన్ లవర్స్ భావిస్తున్నారు. స్థానిక వినియోగదారుల కోసం భారత్‌లో మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 12 మోడల్ ఫోన్ల తయారీని ప్రారంభించనుండటం చాలా గర్వంగా ఉందనీ కస్టమర్ల సంతోషం కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమైన ఉత్పత్తులు, సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో ఐఫోన్ 12 స్థానికంగా రూపొందడంతో తమ లాభాలు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నామని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ), సైబర్ మీడియా రీసెర్చ్ లిమిటెడ్. హెడ్ ప్రభు ప్రభు రామ్ చెప్పారు. అక్టోబర్ 2020 లో ప్రారంభించిన ఐఫోన్ 12 లో అధునాతన కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీతో పాటు సొగసైన ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్, ప్రకాశవంతమైన వీక్షణ అనుభవం, కొత్త సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ , ఓఎల్ఈడీ తో విస్తారమైన ఎడ్జ్-టు-ఎడ్జ్ సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్ప్లే లాంటివి కీలక ఫీచర్లుగా ఉన్నాయి. దీని ధర . రూ .69,990 . ఐఫోన్ ఎస్ఇతో సహా యాపిల్ 2017 లో భారతదేశంలో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. కొన్ని సంవత్సరాలుగా, ఐఫోన్ ఎక్స్ ఆర్, ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్ఈ 2020 తాజాగా ఐఫోన్ 12 తో సహా కొన్ని అధునాతన ఐఫోన్లను తయారు చేస్తోంది. వీటిని పలు దేశాలుకుఎగుమతి కూడా చేస్తుంది. కాగా యాపిల్ కాంట్రాక్ట్ తయారీదారు విస్ట్రాన్ కోలార్‌లోని తన నరసపుర యూనిట్లో అన్ని అవసరమైన క్లియరెన్స్‌తో మార్చి 8, 2021 నుంచి తిరిగి కార్యకలాపాలు ప్రారంభమైనాయి. బెంగుళూరు సమీపంలోని విస్ట్రాన్ కంపెనీలో జీతాల చెల్లింపు ఆలస్యం కావడంతో ఉద్యోగుల ఆందోళన విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే. -
ట్విటర్‌కు షాక్: దేశీ ట్విటర్ ‘కూ’ జోరు
సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్, ఖలిస్తాన్‌తో లింకులున్న ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ట్విటర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు ట్విటర్‌కు తాజాగా షాకిచ్చాయి. తాజాగా పలు ప్రభుత్వ కార్యాలయాలు స్వదేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ఆత్మనిర్భర్ అవార్డు గెల్చుకున్న ‘కూ’ వైపు అడుగులు వేశాయి. అంతేకాదు రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా కూ లో చేరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. భారతీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో తనతో కనెక్ట్ అవ్వాలంటూ గోయల్ ట్వీట్ చేశారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత ఏడాది నుంచే ఈ ప్లాట్ఫామ్లో సభ్యుడిగా ఉన్నారు. (రైతు ఉద్యమం : ఆ ఖాతాలకు షాక్) ట్విటర్ వ్యవహారంపై సీరియస్ అవుతున్న కేంద్రంతో పాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ,దాని అనుబంధ సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాలను మేడిన్ ఇండియా ట్విటర్ ప్లాట్ ఫామ్‌లోకి మార్చుకున్నాయి. డిజిటల్ ఇండియా, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి), ఇండియా పోస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్), డిజిలోకర్, కామన్ సర్వీసెస్ సెంటర్, ఉమాంగ్ యాప్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ( సీబీఐసీ, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు కూడా కూలో రిజిస్టర్ కావడం విశేషం. దేశంలోని అత్యున్నత ప్రభుత్వ ఆఫీసులు తమ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాయని కూ యాప్ సీఈఓ,సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ప్రకటించారు. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాజా పరిణామంతో 10 నెలల క్రితం లాంచ్ అయిన కూ యాప్ డౌన్లోడ్ల సంఖ్య క్రమంగా పుంజుకుంటోంది. I am now on Koo. Connect with me on this Indian micro-blogging platform for real-time, exciting and exclusive updates. Let us exchange our thoughts and ideas on Koo. 📱 Join me: https://t.co/zIL6YI0epM pic.twitter.com/REGioTdMfm — Piyush Goyal (@PiyushGoyal) February 9, 2021 -
రేపటి నుంచీ గ్లోబల్ హాలిడే అమ్మకాలు
న్యూఢిల్లీ, సాక్షి: గురువారం నుంచీ ప్రారంభంకానున్న గ్లోబల్ హాలిడే సీజన్లో భాగంగా ప్రొడక్టులను విక్రయించేందుకు దేశీ ఎగుమతిదారులు సిద్ధంగా ఉన్నట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. వార్షికంగా నిర్వహించే బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండేలలో భాగంగా ఈ నెల 26 నుంచి 30 వరకూ అమ్మకాలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. గ్లోబల్ సెల్లింగ్‌కు వీలుగా 70,000 మంది దేశీ ఎగుమతిదారులు తమ ప్రొడక్టులను లిస్టింగ్ చేసినట్లు పేర్కొంది. తద్వారా వేల కొద్దీ మేడిన్ ఇండియా ప్రొడక్టులను విక్రయానికి ఉంచినట్లు తెలియజేసింది. గతేడాది బ్లాక్ ఫ్రైడే సందర్భంగా 76 శాతం అధికంగా అమ్మకాలు నమోదుకాగా.. సైబర్ మండే రోజున సైతం 55 శాతం వృద్ధి కనిపించినట్లు ప్రస్తావించింది. గిఫ్ట్ ఐటమ్స్ ప్రపంచవ్యాప్తంగా తమ కస్టమర్లకు వేలకొద్దీ ప్రొడక్టులు అందుబాటులోకి రానున్నట్లు అమెజాన్ పేర్కొంది. స్టెమ్ టాయ్స్, ఫ్యాషన్ జ్యువెలరీ, టీ, తదితర పానీయాల దగ్గర్నుంచి.. బ్యూటీ ప్రొడక్ట్స్, లెదర్ జర్నల్స్, బ్యాగుల వంటి పలు గిఫ్టింగ్ ప్రొడక్టులను సైతం విక్రయానికి ఉంచినట్లు తెలియజేసింది. యూఎస్‌లో బ్లాక్ ఫ్రైడే నుంచి సైబర్ మండే వరకూ హాలిడే సీజన్ ప్రారంభమవుతుందని, దీనిలో భాగంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు బహుమతులను ఇస్తుంటారని వివరించింది. థ్యాంక్స్ గివింగ్ మర్నాడు సెలబ్రేట్ చేసుకునే బ్లాక్ ఫ్రైడేపై రిటైలర్లు అధికంగా దృష్టి సారిస్తుంటారని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక డీల్స్‌ను కంపెనీలు ప్రకటిస్తాయని తెలియజేసింది. పలు విభాగాలలో ఆరోగ్యం, పరిశుభ్రత, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, గృహ అవసరాలు తదితర విభాగాలలో మేడిన్ ఇండియా ప్రొడక్టులకు భారీ డిమాండ్ కనిపిస్తుంటుందని అమెజాన్ పేర్కొంది. యూఎస్, కెనడా, యూరోప్, జపాన్ తదితర దేశాల నుంచి ప్రొడక్టులకు ఆర్డర్లు లభిస్తుంటాయని తెలియజేసింది. దేశీయంగా పండుగల సీజన్ తదుపరి ప్రారంభమయ్యే యూఎస్ హాలిడే సీజన్ ఇక్కడి ఎగుమతిదారులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని అమెజాన్ ఇండియా గ్లోబల్ ట్రేడ్ డైరెక్టర్ అభిజిత్ కామ్రా పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు, చిన్న ఎగుమతిదారులకు కంపెనీ ఇన్వెంటరీ నిర్వహణ, లాజిస్టిక్ సొల్యూషన్స్ తదితర అంశాలలో సహకారాన్ని అందిస్తుందని తెలియజేశారు. 2015లో గ్లోబల్ సెల్లింగ్ కార్యక్రమాన్ని 100 మంది ఎగుమతిదారులతో ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం 70,000 మంది ఎగుమతిదారులకు విస్తరించినట్లు తెలియజేశారు. మొత్తంగా చూస్తే ఈ కార్యక్రమం ద్వారా ఎగుమతులు 2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. 2025కల్లా 10 బిలియన్ డాలర్ల బిజినెస్ అందుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. -
సరికొత్తగా ‘జియోపేజెస్’ మొబైల్ బ్రౌజర్
న్యూఢిల్లీ: సరికొత్తగా తీర్చిదిద్దిన దేశీ మొబైల్ బ్రౌజర్ ‘జియోపేజెస్’ను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది. ఇది ఎనిమిది భారతీయ భాషల్లో లభ్యమవుతుందని సంస్థ వెల్లడించింది. మరింత మెరుగైన బ్రౌజింగ్ అనుభూతిని ఇవ్వడంతో పాటు డేటా గోప్యతకు పెద్ద పీట వేస్తూ దీన్ని రూపొందించినట్లు వివరించింది. గూగుల్ ప్లేస్టోర్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జియో ప్రతినిధి తెలిపారు. వేగవంతంగా పేజ్ లోడింగ్, మెరుగ్గా మీడియా స్ట్రీమింగ్, ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ మొదలైన ప్రత్యేకతలు ఈ బ్రౌజర్లో ఉన్నాయని వివరించారు. (ఈ-కామర్స్ కంపెనీల టేకాఫ్ అదుర్స్ ) గత వెర్షన్‌కు 1.4 కోట్ల డౌన్లోడ్స్ ఉన్నాయని, వీటన్నింటినీ దశలవారీగా లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నామని పేర్కొన్నారు. ఇంగ్లీష్, తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో జియో పేజెస్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. జియోపేజెస్ బ్రౌజర్‌ను యూజర్లు తమకు కావల్సిన కంటెంట్ పొందేలా కస్టమైజ్ చేసుకునేందుకు కూడా వీలుంటుంది. రాష్ట్రాన్ని బట్టి స్థానికంగా ప్రాచుర్యం పొందిన సైట్లు.. స్క్రీన్‌పై కనిపిస్తాయి. గూగుల్, బింగ్, ఎంఎస్ఎన్, యాహూ వంటి సెర్చి ఇంజిన్లను డిఫాల్ట్ సెర్చి ఇంజిన్లుగా పెట్టుకునేలా హోమ్ స్క్రీన్ కూడా పర్సనలైజ్ చేసుకోవచ్చు. ‘ఇన్ఫర్మేటివ్ కార్డ్’ ఫీచరు ద్వారా వార్తలు, క్రికెట్ స్కోర్ మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. -
సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: ప్రస్తుత విధానాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ భారత్‌ను సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఐటీ సంస్థలు దృష్టి పెట్టాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సూచించారు. వినూత్నమైన మేడిన్ ఇండియా ఉత్పత్తులను అందించాలని పేర్కొన్నారు. దేశీ వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్లు, యాప్స్ రూపకల్పన ద్వారా కరోనా వైరస్‌పరమైన భారీ సవాళ్లను పరిశ్రమ అసాధారణ రీతిలో ఎదుర్కొందని ప్రశంసించారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఐటీ, కమ్యూనికేషన్స్ రంగంలోకి భారీ పెట్టుబడులు వచ్చాయని.. ప్రపంచమంతా భారత్‌ని విశ్వసించడమే ఇందుకు కారణమని ప్రసాద్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ రూపకల్పన పోటీల విజేతలను ప్రకటించిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీకన్సోల్ అనే వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ రూపొందించిన కేరళకు చెందిన టెక్జెన్సియా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఈ పోటీలో విజేతగా నిల్చింది. విజేతకు రూ. 1 కోటి ఆర్థిక సహాయం, అదనంగా మూడేళ్ల పాటు నిర్వహణ వ్యయాల కోసం రూ. 10 లక్షలు అందించడం జరుగుతుందని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సర్వ్ వెబ్స్, పీపుల్‌లింక్ యూనిఫైడ్ కమ్యూనికేషన్స్, ఇన్‌స్ట్రైవ్ సాఫ్ట్‌ల్యాబ్స్ సంస్థలు రూపొందించిన ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేయడానికి ఆస్కారమున్న సొల్యూషన్స్‌గా జ్యూరీ ఎంపిక చేసింది. వీటికి తలో రూ. 25 లక్షల మద్దతు లభించనుంది. -
యాప్‌ల దునియా.. మేడిన్ ఇండియా
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్ యూజర్లలో దేశభక్తి ఉప్పొంగుతోంది. స్వదేశీ యాప్‌లకు విశేష ఆదరణ లభిస్తోంది. గల్వాన్‌లో భారత సైన్యంపై చైనా దాడి అనంతరం దేశ రక్షణ దృష్ట్యా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. యువతను, పెద్దలను ఉర్రూతలూగించిన చైనా యాప్ టిక్‌టాక్‌తోపాటు మరో 58 యాప్‌లను నిషేధించడంతో ప్రత్యామ్నాయ యాప్‌ల కోసం అన్వేషణ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా స్వదేశీ యాప్‌లను గుర్తించి డౌన్లోడ్ చేసుకుంటున్న యూజర్ల సంఖ్య ప్రతిరోజూ గణనీయంగా పెరుగుతోంది. అంతా మేడిన్ ఇండియా.. ► టిక్‌టాక్, ఉయ్ చాట్, హెల్లో వంటి చైనా మొబైల్ అప్లికేషన్లకు ప్రత్యామ్నాయంగా మన దేశానికి చెందిన చింగారి, ట్రెల్, మోజ్, జోష్ వంటి యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ► స్వదేశీ యాప్‌లకు మేడిన్ ఇండియా అనే ట్యాగ్‌లైన్ ఉండటంతో వాటిని గుర్తించడం సులభంగా ఉంటోంది. ► ‘చింగారి మేడిన్ ఇండియా’ యాప్‌లో వీడియో, ఆడియో, షేరింగ్ వంటి ఆప్షన్లు ఉండటంతో ప్రజాదరణ పొందుతోంది. ► బెంగళూరుకు చెందిన బిస్వాత్మా నాయక్, మిస్టర్ సిద్ధార్థ్ గౌతమ్ అనే ప్రోగ్రామర్లు ఈ స్వదేశీ యాప్‌ను అభివృద్ధి చేశారు. ► టిక్‌టాక్ ఉన్న రోజుల్లో పాత చింగారి యాప్‌నకు పెద్దగా ఆదరణ లభించలేదు. ► వీడియో బ్లర్ అవుతోందని, సరిగా షేర్ కావడం లేదనే సాంకేతిక సమస్యలను యూజర్లు ఏకరువు పెట్టేవారు. ► ఇప్పుడు సాంకేతిక సమస్యలు అధిగమించడంతో చింగారి యాప్‌నకు క్రేజ్ పెరిగింది. ► వీడియో, ఆడియో, ఫొటో వంటి వాటితో షేరింగ్ ఆప్షన్లు గల స్వదేశీ యాప్‌లు ఇప్పుడు మన దేశంలో సత్తా చాటుతున్నాయి. ► చింగారి, ట్రెల్, మోజ్ వంటి స్వదేశీ యాప్‌లు కోటికి పైగా డౌన్ లోడ్స్ మైలు రాయిని దాటి రికార్డు సృష్టిస్తున్నాయి. ► ఇదే తరహాలో ‘జోష్’ యాప్ 50 లక్షల మందికి పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తుండటం విశేషం. -
‘ఎలిమెంట్స్’ యాప్‌ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ : తొలి దేశీయ సోషల్ మీడియా సూపర్ యాప్ ‘ఎలిమెంట్స్’ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. గురుపౌర్ణిమ రోజు ఈ యాప్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు.(చదవండి : ఒక్కరోజులో 24వేలకు పైగా కరోనా కేసులు) ఆత్మనిర్భర్ భారత్‌తో పట్టణాలు, గ్రామాల మధ్య సమన్వయం పెరుగుతుందని వెంకయ్యనాయుడు అన్నాడు. మేడిన్ ఇండియాపై అన్ని ప్రాంతాల్లో చైతన్యం వచ్చిందన్నారు. దేశంలోని వనరులను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
భారతీయ టెక్కీలకు మోదీ సరికొత్త చాలెంజ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లను రూపొందించేందుకు దేశ నలుమూలల ఉన్న సాఫ్ట్వేర్ టెక్కీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రకటించారు. ఇందులో పాల్గొనాలని దేశీయ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లను ప్రధాని మోదీ కోరారు. మెయిటీ (MeitY), అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతి ఆయోగ్‌ల సంయుక్తంగా ఈ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్ నిర్వహించనున్నాయి. (చదవండి : భారత్‌కు పెరుగుతున్న మద్దతు!) ‘ప్రస్తుతం యాప్స్ తయారు చేసే ఔత్సాహికులు చాలా మంది ఉన్నారు. టెక్, స్టార్టప్స్‌లో వరల్డ్ క్లాస్ మేడిన్ ఇండియా యాప్స్ తయారు చేయగల సత్తా ఉంది. వారి ఐడియాలు, ఉత్పత్తులకు ప్రోతాహం కల్పించేందుకు ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ ఛాలెంజ్ నిర్వహిస్తోంది. యాప్స్ విభాగంలో మీకు అనుభవం, టాలెంట్, ఆసక్తి, కొత్త ఐడియాలు సృష్టించగల ఉత్సాహం, ప్లాన్ ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చు’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక టెక్కీలు, స్టార్టప్‌లు మేడిన్ ఇండియా యాప్‌లను డెవలప్ చేసేందుకు ఈ చాలెంజ్ ఉపయోగపడుతుంది. ఇందులో గెలిచిన వారికి బహుమతులతోపాటు పేరు ప్రఖ్యాతులు కూడా దక్కనున్నాయి. ఆయా విభాగాల్లో డెవలప్ చేసే అత్యుత్తమ యాప్‌లకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల భారీ నగదు బహుమతులను ఔత్సాహికులు పొందవచ్చు. యాప్‌లు సులభంగా వాడుకునే విధంగా, పూర్తిగా సురక్షితమైన ఫీచర్లు కలిగి ఉండాలి. ఈ చాలెంజ్ వల్ల దేశంలో ఉన్న ఔత్సాహిక యాప్ డెవలపర్లు, స్టార్టప్‌ల నుంచి ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ చాలెంజ్‌కు చెందిన పూర్తి వివరాల కోసం innovate.mygov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ చాలెంజ్‌లో పాల్గొనాలనుకునే వారు తమ అప్లికేషన్లను జూలై 18, 2020లోపు సమర్పించాలి. -
రాష్ట్రాలకు 50 వేల ‘మేడ్ ఇన్ ఇండియా’ వెంటిలేటర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. కరోనాతో పోరాడటానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 50,000 ‘మేడ్ ఇన్ ఇండియా’ వెంటిలేటర్లను సరఫరా చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎమ్-కేర్స్ ఫండ్ నుంచి రూ .2,000 కోట్లు విడుదల చేసింది. అంతేకాక ఇప్పటివరకు 2,923 వెంటిలేటర్లను తయారు చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో ఇప్పటికే 1,340 వెంటిలేటర్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు ప్రకటించింది. వీటిలో మహారాష్ట్ర, ఢిల్లీలు కూడా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలోనే అత్యధిక కరోనా కేసులు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాలకు 275 చొప్పున వెంటిలేటర్లు పంపించినట్లు కేంద్రం తెలిపింది. ఇతర ప్రభావిత రాష్ట్రాలు గుజరాత్‌కు 175, బిహార్‌కు 100, కర్ణాటకకు 90 మరియు రాజస్థాన్‌కు 75 చొప్పున వెంటిలేటర్లు పంపినట్లు వెల్లడించింది. ('50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి') అంతేకాక వలస కూలీల సంక్షేమం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 1,000 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిధి వలస కూలీలకు వసతి, ఆహారం, వైద్య చికిత్స, రవాణా ఏర్పాట్ల కోసం ఉపయోగించాలని సూచించింది. దీనిలో అత్యధిక మొత్తాన్ని మహారాష్ట్రకు రూ. 181 కోట్లు, ఆ తరువాత ఉత్తర ప్రదేశ్‌కు రూ. 103 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత తమిళనాడుకు రూ. 83 కోట్లు, గుజరాత్‌కు రూ. 66 కోట్లు, ఢిల్లీకి రూ. 55 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 53 కోట్లు, బిహార్‌కు రూ. 51 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 50 కోట్లు, రాజస్థాన్‌కు రూ. 50 కోట్లు, కర్ణాటకకు రూ. 34 కోట్లు కేటాయించింది. (భారత్‌కు చేరిన అమెరికా వెంటిలేటర్లు) కరోనా వైరస్ కట్టడి కేంద్రం రాష్ట్రాలకు సహాయం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు వివిధ ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. -
రైల్వే ఇక మేడిన్ ఇండియా
న్యూఢిల్లీ : స్వదేశీ ఉత్పత్తుల్ని మాత్రమే వాడాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే దిగుమతులను సంపూర్ణంగా తగ్గించిందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. చైనాకు చెందిన సంస్థ నుంచి సిగ్నలింగ్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించిన తర్వాత ఇక రైల్వేలో దిగుమతులు సున్నా స్థాయికి చేరుకున్నాయని యాదవ్ చెప్పారు. రైల్వేలలో దిగుమతుల్ని నిలిపివేయడమే కాకుండా, రైల్వే ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేలా కృషి చేస్తున్నామన్నారు. రైల్వే టెండర్లకు ఇక స్వదేశీ సంస్థలకే ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేశారు. రైల్వేలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చైనా కంపెనీలపై నిషేధం విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అధిక భాగం స్వదేశీ బిడ్డర్లకే అవకాశం ఉంటుందని వెల్లడించారు. గత రెండు, మూడేళ్లుగా దిగుమతుల్ని తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు. -
ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న కేంద్రం
సాక్షి, న్యూడిల్లీ: ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పారామిలిటరీ క్యాంటీన్లలో దిగుమతి అయిన 1,000పైగా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉత్తర్వులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉపసంహరించుకుంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో అనేక వస్తువులు భారత్‌లోనే తయారైనట్లు వెల్లవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారామిలిటరీ క్యాంటీన్లు దేశీయ పరిశ్రమలకు మద్దతునిచ్చే క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి స్వదేశీ లేదా భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తామని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. (‘కరోనా వ్యాప్తిలో భారత్ అగ్రస్థానానికి వెళ్తుంది’) ఇటీవల క్యాంటీన్లలో దిగుమతి అయిన ఉత్పత్తులను పరిశీలించగా అందులో నిషేధించబడిన ‘నుట్రెల్లా, కిండర్ జాయ్, టిక్ టాక్, హార్లిక్స్, ఓట్స్, యురేకా ఫోర్బ్స్, టామీ హిల్ఫిగర్ షర్ట్స్, అడిడాస్ బాడీ స్ప్రే’లు వంటి బ్రాండ్లు ఉన్నట్లు గమనించారు. మైక్రోవేవ్ ఓవెన్లు వంటి ఇతర గృహోపకరణాల వస్తువులను కూడా తీసివేసింది. అంతేగాక స్కెచర్స్, ఫెర్రెరో, రెడ్‌బుల్, విక్టోరినాక్స్, సఫిలో (పోలరాయిడ్, కారెరా) సహా దిగుమతి చేసుకునే ఏడు సంస్థల ఉత్పత్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించింది. ఈ జాబితాలో ఉన్న భారత ఉత్పత్తులైన డాబర్, బజాజ్, ఉషాతో సహా అనేక భారతీయ ఉత్పత్తులను కూడా ఈ జాబితా నుంచి తొలగించినట్లు హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పందిస్తూ.. ‘‘మా అధికారి మంత్రిత్వ శాఖను సంప్రదించకుండానే దిగుమతి ఉత్పత్తులను తీసుకున్నారు. ఇండియా ఉత్పత్తులను కూడా నిషేధ బ్రాండ్లలో చేర్చిన సదరు సీనియర్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం. అంతేగాక పూర్వ జాబితాను పరిశీలించి దానిని సవరించాం. త్వరలో సవరించిన జాబితాను పంపిస్తాం’’ అని చెప్పారు. ఈ క్యాంటీన్ల మాతృసంస్థ కేంద్రీయ పోలీసు కళ్యాణ్ భండార్స్ అన్ని ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభజించారు. కేటగిరి1- భారతదేశంలో పూర్తిగా తయారైన ఉత్పత్తులను కలిగి ఉంది. కేటగిరీ 2- దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలతో ఉత్పత్తులు ఉన్నాయి, కానీ అవి భారతదేశంలో తయారు చేయబడతాయి లేదా సమావేశమవుతాయి. కేటగిరి 3 - పూర్తిగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. -
కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పారామిలిటరీ(సీఏపీఎఫ్) క్యాంటీన్లలో ఇక నుంచి కేవలం స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ ఆదేశాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఇకపై సీఏపీఎఫ్ క్యాంటీన్లలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు మాత్రమే లభించనున్నాయి. నిన్న(మంగళవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరూ స్థానిక వస్తువులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ మంత్రి అమిత్‌షా బుధవారం ట్వీట్ చేశారు. (రష్యా అద్యక్షుడి అధికార ప్రతినిధికి కరోనా ) 'మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులంతా స్థానిక ఉత్పత్తులపైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం భారత్‌ను రాబోయే రోజుల్లో ప్రపంచ నాయకత్వ మార్గంలోకి తీసుకెళుతుంది. సుమారు 10 లక్షల మంది సీఏపీఎఫ్ సిబ్బందితోపాటు వారి కుటుంబంలోని 50 లక్షల మంది సభ్యులు స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించనున్నారు'. అని తెలిపారు. కాగా కరోనాతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఊతమిచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. (కరోనా పాడుగాను.. ఎంత కష్టమొచ్చే ) పారామిలిటరీ క్యాంటీన్లు ప్రతి ఏటా రూ .2,800 కోట్ల అమ్మకాలను జరుపుతున్నాయి. సీఏపీఎఫ్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సాశాస్త్రా సీమా బాల్ (ఎస్ఎస్బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎన్జీ)తోపాటు అస్సాం రైఫిల్స్ ఉన్నాయి. వీరంతా భారతదేశంలో తయారైన వస్తువులను ప్రజలు ఉపయోగించాలని, ఇతరులు కూడా ఇలాగే చేయాలని హోంమంత్రి కోరారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!) -
‘నాన్న చనిపోతే పెద్దగా బాధ పడలేదు’
తన నాన్న చనిపోయినప్పుడు పెద్ద బాధ పడలేదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్. తన తండ్రిపై పెద్దగా అభిమానం కూడా లేదన్నారు. ఇటీవల ఆయన రాసిన ‘మేడ్ ఇన్ ఇండియా: ఎ మెమోయిర్’ బుక్‌లో ఈ విషయాలు వెల్లడించారు. ఇక తన నాన్నతో ఆయనకు ఉన్న రిలేషన్షిప్ గురించి సోమవారం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. తన తండ్రిని ఎప్పుడూ అభిమానించలేదని చెప్పుకొచ్చారు. (చదవండి : వారి పెళ్లి అయిపోయింది!!) ‘1995 సంవత్సరం నా జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆ ఏడాది నాకు తీపి, చేదు రెండు జ్ఞాపకాలను అందించింది. 1995 జనవరిలో మా నాన్న మృతి చెందారు. ఆయన మృతి నాకు పెద్దగా బాధ కలిగించలేదు. మిశ్రమ భావాలు నాలో కలిగాయి. మా నాన్నపై నాకు ఎప్పుడూ అభిమానం లేదు. ఆయన మాత్రం నాపై ప్రేమను చూపించాడు. అతను చనిపోయే ఐదు సంవత్సరాల ముందే మా ఇంటి నుంచి బయటికి వెళ్లారు. ఆ సమయంలో నాకు పెద్ద ఉపశమనం కలిగినట్లు భావించాను. కానీ ఆయన చనిపోయే రోజు అంబులెన్స్‌లో నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్తుంటే నాకు చాలా బాధ కలిగింది. నాన్నతో నా భావోద్వేగాలను పంచుకోవాలనుకున్నాను కానీ కుదర్లేదు’ అని మిలింద్ చెప్పుకొచ్చారు. ఇక తండ్రి మృతి చెందిన కొద్ది రోజులకు ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మ్యూజిల్ వీడియో‘ మేడ్ ఇన్ ఇండియా’ విడుదలైంది. దీనితో మిలింద్కు పాపులారిటీ పెరిగిపోయింది. దీని గురించి కూడా మిలింద్ వివరించారు. ‘ నాన్న మృతి చెందిన కొద్ది రోజులపై ‘ మేడ్ ఇన్న ఇండియా’ విడుదలైంది. అది నా జీవితాన్నే మార్చేసింది. ఆ మ్యూజిక్ వీడియోతో నా జీవితంలో శాంతి నెలకొంది. నన్ను సూపర్ మోడల్‌గా, హీరోగా నిలబెట్టింది. అందుకే నా జీవితంలో 1995 ముఖ్యమైన సంవత్సరం’ అని మిలింద్ వివరించారు. మిలిందర్ భాగోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ మీ తండ్రి పట్ల మీకు ఉన్న అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పారు. ఇలాంటి పోస్ట్ పెట్టాలందే ధైర్యం ఉండాలి’, మీ మనసు చెప్పింది మీరు రాశారు’ అని కామెంట్లు చేస్తున్నారు. మిలింగ్ సోమన్ 80, 90 దశకాల్లో టాప్ మోడల్. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. కామసూత్ర యాడ్‌లో అర్ధనగ్నంగా నటించి అప్పట్లో సంచలనం రేపారు. 53 ఏళ్ల మిలింద్.. తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
మన స్టెంట్లూ మంచివే!
న్యూఢిల్లీ: విదేశాల్లో తయారయ్యే ఖరీదైన కరొనరీ స్టెంట్లు బాగా పనిచేస్తాయని దేశంలోని చాలామంది వైద్యులు, రోగుల్లో ఒక నమ్మకం ఉంది. దీంతోపాటు దేశీయ కంపెనీలు తక్కువ ధరకే మార్కెట్లోకి తెచ్చే స్టెంట్లు సమర్ధంగా పనిచేయవనే అపోహ ఉంది. అయితే, సామర్ధ్యం, నాణ్యత విషయంలో ఖరీదైన విదేశీ స్టెంట్లతో పోటీ పడగలిగే స్థాయిలో దేశీయంగా తయారైన స్టెంట్లు ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయనంలో తాజాగా నిరూపితమయింది. న్యూఢిల్లీలోని బాత్రా హార్ట్ సెంటర్‌కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ ఉపేందర్ కౌల్, నెదర్లాండ్స్ ప్రొఫెసర్ పాట్రిక్ సెర్రుస్‌తో కలిసి ప్రపంచ ప్రఖ్యాత క్లినికల్ రీసెర్చి ఆర్గనైజేషన్(సీఆర్వో) సాయంతో టాలెంట్ పేరుతో ఓ సర్వే నిర్వహించారు. ఆ ఫలితాలను ఇటీవల అమెరికాలోని శాన్‌డియాగోలో జరిగిన నాన్ సర్జికల్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్–టీసీటీ (ట్రాన్స్ క్యాథెటర్ ఇంటర్వెన్షన్స్)లో వెల్లడించారు. సర్వేలో భాగంగా యూరోపియన్ దేశాలకు చెందిన బహుళజాతి సంస్థల స్టెంట్లు అమర్చిన 1,500 మంది రోగులను పరిశీలించారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే అబాట్ సంస్థ తయారీ ఎక్సియన్స్ స్టెంట్‌తో, భారత్‌లో ఎస్ఎంటీ సంస్థ రూపొందించే సుప్రాఫ్లెక్స్ స్టెంట్లను పోల్చి చూశారు. పనితనం, సురక్షితం విషయంలో ఎక్సియన్స్‌తో సుప్రాఫ్లెక్స్ ఏమాత్రం తీసిపోదని ధ్రువపరిచారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్టెంట్ల కంటే భారత్‌లో తయారైనవి అంత సురక్షితం, సమర్ధవంతం కావని వైద్యులు, రోగుల్లో ఉన్న అపోహ తప్పని తేల్చారు. దేశంలో తయారయ్యే స్టెంట్లు అంత సమర్ధవంతంగా పనిచేయవన్న అపోహలను తొలగించేందుకే అంతర్జాతీయంగా పేరున్న సంస్థలతో విదేశాల్లో సర్వే చేపట్టినట్లు డాక్టర్ కౌల్ వివరించారు. దేశీ, విదేశీ స్టెంట్లను వాడిన రోగులపై ఏడాదిపాటు జరిపిన అధ్యయనంలో భాగంగా కార్డియాక్ డెత్, టార్గెట్ వెస్సల్ ఎంఐ వంటి అంశాలు కూడా సమానంగా ఉన్నట్లు తేలిందన్నారు. గత ఏడాది కేంద్రం విదేశీ తయారీ కరొనరీ స్టెంట్ల ధరలపై పరిమితి విధించింది. ఫలితంగా రూ.1.30లక్షల వరకు ఉన్న విదేశీ స్టెంట్ల ధర రూ.35 వేలకు తగ్గిపోయింది. అంతేకాకుండా దేశీయ కంపెనీలు తయారు చేసిన స్టెంట్ల వినియోగం బాగా పెరిగిందని డాక్టర్ కౌల్ తెలిపారు. బహుళ జాతి సంస్థలు తయారు చేసే స్టెంట్ల ధర భారాన్ని మోయలేని దేశాల వారికి ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితం కానున్నాయన్నారు. మిగతా భారతీయ కంపెనీలు కూడా ఇటువంటి అధ్యయనాలు చేపట్టి.. విదేశీ తయారీ స్టెంట్లతో పోలిస్తే తమ స్టెంట్లు తీసిపోవని నిరూపించుకోవాలని కోరారు. గుండెలో మూసుకుపోయిన కరోనరీ ధమనుల్లో స్టెంట్లను అమర్చి రక్త ప్రవాహం సజావుగా సాగేలా చేస్తారు. -
రాబోతున్న హై-ఎండ్ గెలాక్సీ ఇక్కడిదే...
న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకి చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ ప్లాంటును ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ రెండు రోజుల క్రితం దీన్ని ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీలో శాంసంగ్ తర్వాత తీసుకురాబోతున్న హై-ఎండ్ గెలాక్సీ నోట్ 9ను తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల చివరిలో దీని తయారీని ప్రారంభించనున్నట్టు శాంసంగ్ సీనియర్ అధికారులు చెప్పారు. ఈ కొత్త తరం డివైజ్.. మేడిన్ ఇండియా ప్రొడక్ట్‌గా, గ్లోబలీ ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ‘నోయిడా ఫ్యాక్టరీలో అన్ని హై-ఎండ్ శాంసంగ్ మోడల్స్‌ను రూపొందించడం జరుగుతుంది. జూలై చివరి నుంచి గెలాక్సీ నోట్ 9 తయారీని ప్రారంభిస్తున్నాం. ఆగస్టు చివరిలో ఈ ఫోన్ దేశీయ మార్కెట్లోకి వస్తుంది’ అని సీనియర్ అధికారులు చెప్పారు. విస్తరించడానికి ముందు కంపెనీ ప్రొడక్షన్ అవుట్‌పుట్ 10 శాతం ఎగుమతి చేశామని, అంటే నెలకు 50 లక్షల యూనిట్లు ఎగుమతి చేసినట్టు చెప్పారు. ఈ సెల్ఫోన్లను రష్యా, దుబాయ్, తూర్పు యూరోపియన్ దేశాలు, ఆఫ్రికాలకు సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్లాంట్ విస్తరణతో దీన్ని నెలకు 70 లక్షల యూనిట్లకు చేయనున్నారు. 2020 నాటికి 30 శాతానికి ఎగుమతులను పెంచనున్నట్టు తెలిపారు. త్వరలోనే మేకిన్ ఇండియా ప్రొడక్ట్‌గా గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించబోతున్న గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ హై ఎండ్ ఫీచర్లు.. 1.8 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను, 64 జీబీ స్టోరేజ్‌ను, 2 టీబీ వరకు విస్తరణ మెమరీని, 6.0 అంగుళాల డిస్ప్లేను, 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండబోతుంది. -
గుర్తుపట్టలేనంతగా మారిన అనుష్క..
బాలీవుడ్ : వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సుయి ధాగా’. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ఆమె అభిమానులే కాక కోహ్లి అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్తగా కనిపిస్తున్న అనుష్క ఫొటోలను చూసిన అభిమానులు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ సారీ, రెడ్ బ్యాంగిల్స్ ధరించిన అనుష్క పూర్తిగా ఢిపరెంట్ లుక్‌లో ఉండటంతో అభిమానులు ఆమెని సరిగా పోల్చుకోలేకపోతున్నారు. ఇటీవలే విడుదలైన పరీలో అద్భుత నటనతో ఆకట్టుకున్న అనుష్క ప్రస్తుతం సుయి ధాగాలో డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నారు. వరుణ్ కూడా ఈ చిత్రంలో ఢిపరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు. యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమతా, మౌజీ పాత్రల్లో అనుష్క, వరుణ్ కనిపించనున్నారు. మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం వరుణ్ కుట్టుమిషన్, అనుష్క ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
160 కి.మీ వేగం.. ఇండియా రైలు రెడీ..!!
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా రూపుదిద్దుకున్న తొలి సెమీ హైస్పీడ్ రైలు త్వరలో పరుగులు తీయనుంది. గంటకు దాదాపు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు ముఖ్య నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. సెమీ హైస్పీడ్ రైలుకు ప్రీమియం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌గా తీసుకురానున్నారు. రూ. 100 కోట్ల వెచ్చించి రూపొందించిన రైలు అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. మొత్తం 16 పెట్టెలు ఉండే ఈ రైల్లో ఒక్కొ కోచ్ నిర్మాణానికి రూ. 6 కోట్లు ఖర్చు చేశారు. వీటన్నింటిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో తయారు చేశారు. అచ్చూ ఇదే డిజైన్‌తో దిగుమతి చేసుకునే రైలు పెట్టెలకు వీటికంటే 40 శాతం తక్కువ ఖర్చు అవుతుందని ఐసీఎఫ్ జనరల్ మేనజర్ చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పేరుతో సెమీ హైస్పీడ్ రైలు పరుగులు పెడుతుందని వెల్లడించారు. -
త్వరలోనే మేడిన్ ఇండియా ఫ్లైట్‌లో జర్నీ
న్యూఢిల్లీ : ఇక త్వరలోనే మీరు మేడిన్ ఇండియా విమానంలో ఎగరవచ్చు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన డార్నియర్ 228ను పౌర విమానాలుగా వాడేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అనుమతి ఇచ్చింది. 19 సీట్ల ఎయిర్‌క్రాఫ్ట్ అయిన డార్నియర్, ప్రస్తుతం రక్షణ దళాల కోసం వాడుతున్నారు. వాణిజ్యవసరాల కోసం దేశంలో రూపొందించిన తొలి విమానం ఇదే. డీజీసీఏ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కు సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ విమానాన్ని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, విమానయాన సంస్థలకు విక్రయిస్తోంది. ఉడాన్ స్కీమ్ కింద మోదీ ప్రభుత్వంలో వీటిని ప్రాంతీయ విమానాలుగా వాడుకోవచ్చని సీనియర్ ఏవియేషన్ అధికారి చెప్పారు. ఈ విమానాన్ని వాడుతున్న ఆపరేటర్లకు కొన్ని ప్రత్యేక ప్రోత్సహాకాలు అందిస్తామన్నారు. పౌర సేవలకు వినియోగించేందుకు నేపాల్, శ్రీలంక వంటి దేశాలకు కూడా ఈ విమానాన్ని అమ్మేందుకు హెచ్ఏఎల్ చూస్తోందని తెలిపారు. ఇది బహుళ అవసరాలకు వాడే తేలికైన విమానమని, ఈ విమానాన్ని ప్రత్యేకంగా యుటిలిటీ, కమ్యూటర్ ట్రాన్స్పోర్ట్, థర్డ్ లెవల్ సర్వీసెస్, ఎయిర్‌ట్యాక్సీ ఆపరేషన్స్, కోస్ట్ గార్డ్ డ్యూటీస్ వంటి వాటికోసం రూపొందించామని హెచ్ఏఎల్ చెప్పింది. పౌర సేవలకు ఉపయోగించేందుకు గత నెలలోనే కాన్పూర్ విమానశ్రయంలో ఈ విమానానికి పరీక్షలు కూడా నిర్వహించారు. -
ప్రభుత్వ షాపింగ్ లిస్టు చాలా పెద్దదే...
న్యూఢిల్లీ : మేడ్ ఇన్ ఇండియా మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోలకు ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చుచేసేందుకు సిద్ధమైంది. 83 తేలికపాటి తేజాస్ యుద్ధవిమానాలు, 15 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, 464 టీ-90 ట్యాంక్స్ కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్యానెల్ సోమవారం ఆమోదముద్ర వేసింది. తేజాస్ తయారీదారి హిందూస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఇప్పటికే 40 ఎయిర్క్రాప్ట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ ఏడాది అవి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు డెలివరీ కానున్నాయి. నిన్న ఆమోదముద్ర వేసిన తేజాస్ కొనుగోలుకు ప్రభుత్వం దాదాపు రూ.50,025 కోట్లు ఖర్చు చేయనుంది. ఆర్మీ, వైమానికదళం కోసం కొనుగోలు చేస్తున్న హెలికాప్టర్ల వ్యయం రూ.2,911 కోట్లు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తున్న ట్యాంకుల ఖర్చు రూ.13,448 కోట్లుగా ఉంది. అంతేకాక, భారత ఆర్మీ కోసం 598 మినీ మినీ మానవరహిత వైమానిక వాహనం లేదా డ్రోన్స్ కొనుగోలుకు కూడా డిఫెన్స్ అక్విషిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఎయిర్ ఫోర్స్ ఈ ఏడాది జూలైలో రెండు యుద్ధ విమానాల కొనుగోలుతో తేజాస్ స్క్వాడ్రాన్ల సంఖ్యను పెంచింది.తేజాస్‌లో లోపాలున్నప్పటికీ, ఈ ప్రొగ్రామ్‌ను ఎప్పటికీ ఉండేలా, యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు 2015లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే తేజాస్ యుద్ధవిమానాలను కొనుగోలు చేస్తూ స్క్వాడ్రాన్ల సంఖ్యను పెంచుతూ ఉంది. 83 తాజా తేజాస్ ఫైటర్స్‌తో మొత్తం ఈ జాబితా 120కు చేరుకోనుంది. ఈ డెలివరీ హెచ్ఏఎల్ ఉత్పత్తి సామర్థ్యంపై డెలివరీ ఆధారపడి ఉండనుంది.వీటి కోసం ప్రస్తుతం భారత వైమానిక దళం కొత్త పైలెట్లను నియమిస్తూ వారికి శిక్షణ కూడా ఇస్తోంది. -
ఎన్టీపీసీకి సీమెన్స్ ట్రాన్స్ఫార్మర్
హైదరాబాద్: సీమెన్స్ కంపెనీ ఎన్టీపీసీకి అతి పెద్ద మేడ్ ఇన్ ఇండియా సింగిల్ ఫేజ్ జనరేటర్ స్టెప్ అప్(జేఎస్‌యూ) ట్రాన్స్ఫార్మర్ను అందించనున్నది. ఈ జేఎస్‌యూ ట్రాన్స్ఫార్మర్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ... ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అధిక కెపాసిటీ ఉన్న విద్యుదుత్పత్తి సాధ్యమవుతుందని సీమెన్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 10 జేఎస్‌యూ ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్‌ను ఎన్టీపీసీ నుంచి పొందామని సీమెన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హరాల్డ్ గ్రిమ్ పేర్కొన్నారు. కర్నాటకలోని ఎన్టీపీసీకి చెందిన కుడ్గి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లో ఈ జేఎస్‌యూ ట్రాన్స్ఫార్మర్ను అమరుస్తారని వివరించారు. -
మెరిసిన ‘మేడిన్ ఇండియా’
‘నీ పేరు గూగుల్ అయినట్టూ, అన్నీ తెలిసినట్టూ మాట్లాడుతున్నావే...’ కుర్రకారులో చమత్కారంగా దొర్లే సంభాషణల్లో ఇదొకటి. నిజమే... ఇరవైయ్యేళ్ల క్రితం గూగుల్ ఆవిర్భవించి ఉండకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవి కాదని, మన అవగాహనకు ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వసిస్తున్నారు. అందులోని నిజానిజాల సంగతలా ఉంచి చాలా స్వల్ప కాలంలోనే అంతటి విశ్వసనీయతను సాధించడం అసాధారణం...అపూర్వం. సృజనాత్మకత లోనూ, ఉన్నత సాంకేతికతలోనూ అనునిత్యం ఆధిక్యతను సాధించాలన్న తపనే ఆ రంగంలో గూగుల్ సంస్థను అత్యున్నత శిఖరాగ్రంపై నిలబెట్టింది. అదిప్పుడు 1,600 కోట్ల డాలర్ల లాభాలతో ప్రపంచంలో ఉన్నతశ్రేణి టెక్నాలజీ కంపెనీగా వెలుగులీనుతోంది. అలాంటి సంస్థకు ఒక భారతీయుడూ, అందునా దక్షిణాదివాడూ అయిన సుందర్ పిచాయ్ సీఈఓ కాబోతున్నాడంటే సహజంగానే అందరూ గర్వపడతారు. ఇప్పటికే మరో రెండు పెద్ద సంస్థలకు భారతీయులు సారథ్యం వహిస్తున్నారు. నిరుడు మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగు తేజం సత్య నాదెళ్ల సారథ్యాన్ని స్వీకరించారు. అలాగే హ్యాండ్సెట్ల వ్యాపారంలో ఉన్న ప్రముఖ సంస్థ నోకియాకు రాజీవ్ సూరి సీఈఓగా ఎంపికయ్యారు. ఈ మూడు కార్పొరేట్ సంస్థలూ నిరుడు ఆర్జించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకుంటే అది ప్రపంచంలోని 140 దేశాల జీడీపీల కంటే ఎక్కువని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. నిరుడు ఈ మూడు సంస్థల ఆదాయాల మొత్తం 15,960 కోట్ల డాలర్లు! సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌ల ఎంపికతో సిలికాన్ వ్యాలీ ఏలుబడి భారతీయుల చేతుల్లోకి వచ్చినట్టయింది. భిన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎదిగిన యువత మెరుగైన చదువులకూ, ఉద్యోగాలకూ ఖండాంతరాలకు వెళ్లి తమ ప్రతిభాపాటవాలతో ఎదుగుతున్న వైనం ఎందరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. పరిధి చిన్నది కావొచ్చు, ఎన్నో పరిమితులుండవచ్చు...కానీ ఏదైనా బాధ్యతను అప్పగించినప్పుడు దాన్ని అధికారంగా, ఇంకా చెప్పాలంటే పెత్తనంగా భ్రమించి ప్రవర్తించేవారు చాలాచోట్ల కనిపిస్తారు. సహోద్యోగుల్లో స్ఫూర్తిని నింపి, ఉత్సాహం కలిగించి, కొత్త ఆలోచనలకు వారిని ప్రోత్సహించి, సృజనాత్మక ఆవిష్కరణలకు దోహదకారులుగా నిలవడం, నిజమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం అరుదుగా చూస్తాం. నిరుడు మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల అయినా, గూగుల్ సీఈఓ కాబోతున్న సుందర్ పిచాయ్ అయినా ఇలా అంకితభావంతో పనిచేయడంవల్లే ఎదగ గలిగారని వారి సన్నిహితులు చెబుతున్న మాటల్లో నిజం ఉంది. మెకిన్సీ కంపెనీలో కొంతకాలం పనిచేసి గూగుల్ ఆవిర్భవించినప్పుడు చేరిన సుందర్ పిచాయ్ గూగుల్‌కు పేరు తెచ్చిన వెబ్ బ్రౌజర్ క్రోమ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోసహా పలు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్‌లను రూపొందించడంలో, వాటిని జనావళికి చేరేయడంలో కీలక పాత్ర పోషించారు. గూగుల్ ప్రొడక్ట్‌లను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందకోట్లకు పైగా జనం నిత్యమూ ఉపయోగిస్తున్నారంటేనే వాటి ప్రయోజనం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. ఇలా కోట్లాదిమంది వినియోగంలో ఉన్న సాంకేతికతను అభివృద్ధి చేయడం దిశగా నిరంతరం ఆలోచిస్తూ పోతే తప్ప ఆ పనిలో నిమగ్నమై ఉండే సంస్థ మనుగడ సాధించలేదు. అపరిమితమైన పోటీ పెరిగిన వర్తమాన వాతావరణంలో ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా అట్టడుగుకు దిగజారే ప్రమాదం ఉంటుంది. గూగుల్‌కు చాలా ముందే వచ్చిన సంస్థలు అందుకు ఉదాహరణ. కేవలం ఇంటర్నెట్ దిగ్గజంగా ఉండటంతో సరిపెట్టుకోక, ఆ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తూ, ప్రపంచంలో ఏమూల ప్రతిభ కనబడినా సొంతం చేసుకుని, దాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు గూగుల్ కృషి చేస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో సైతం తనదైన ముద్రను చూపడంలో ముందుంది. ఏ వయసువారైనా, సాంకేతికత వినియోగంలో అంతగా ప్రవేశం లేకపోయినా ఎవరైనా సులభంగా వినియోగించేలా అప్లికేషన్లు రూపొందించడం గూగుల్ సాధించిన విజయం. ఐడియా చెబితే కోటి రూపాయలిస్తామని పోటీ పెట్టడం మొదలుకొని ఈ రెండు దశాబ్దాల్లోనూ గూగుల్ చేసిన పనులు చాలా ఉన్నాయి. గ్లోబల్ ఇంపాక్ట్ పేరుతో స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడమైనా...‘గూగుల్ ఉమన్ ఇన్ ఇంజనీరింగ్’ పేరిట అవార్డు నెలకొల్పడమైనా...మృత భాషలకు ప్రాణం పోసి అవి వర్థిల్లేందుకు భాషా నిపుణులనూ, పండితులనూ ఒకచోట చేర్చినా...గూగుల్ సైన్స్ ఫెయిర్ పేరుతో బాలబాలికల్లో సృజనాత్మకతను ప్రోత్సహించినా...గూగుల్‌ది విలక్షణ మార్గం. అవిచ్ఛిన్నంగా సాగే ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్న ముఖ్యుల్లో సుందర్ ఒకరు. వాస్తవానికి నిరుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సారథయ్యే ముందు ఆ పదవికి ఎంపిక కావొచ్చునని వినిపించిన పేర్లలో సుందర్ పిచాయ్ పేరూ ఉందంటే ఆయన నాయకత్వ పటిమపై మార్కెట్లో ఉన్న విశ్వాసం ఎటువంటిదో అర్థమవుతుంది. ఇన్నాళ్లూ తానే ఒక భారీ సంస్థగా, టెక్ దిగ్గజంగా పేరు ప్రఖ్యాతులు గడించిన గూగుల్... ఇకపై కొత్తగా ఏర్పడబోతున్న ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘అల్ఫాబెట్’ లోని పలు సంస్థల్లో ఒకటిగా ఒదిగి చిన్నబోతున్న తరుణంలో మనవాడు సీఈఓ అయ్యాడన్న అసంతృప్తి కొంతమందిలో ఉంది. కానీ సంస్థ పునర్వ్యవస్థీకరణ సమయంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో సుందర్ నియామకం కూడా ఒకటని గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ల్యారీ పేజ్ చెబుతున్నారు. ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలకు ఎందరో సృజనశీలురను, సత్తా ఉన్నవారిని అందించగలుగుతున్న మన దేశం అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉంటున్నది. సామాజిక వివక్ష, ఆర్ధిక అసమానతలవంటివి మాయమై...అందరికీ సమానావకాశాలు లభించినప్పుడే ఈ స్థితి మారుతుంది. అప్పుడు సుందర్ బహువచనమవుతుంది. -
మేడ్ ఇన్ ఇండియా యుఫోరియా స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్ : వైయు బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా యుఫోరియా ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. పూర్తిగా భారత్‌లోనే తయారుచేసిన ఈ ఫోన్ ధర రూ.6,999 అని వైయు వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. లక్ష ఫోన్లు అందుబాటులో ఉన్నాయని, అమెజాన్‌డాట్‌ఇన్‌లో ఈ నెల 21-23ల మధ్య వీటి విక్రయాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్ 4జీని కూడా సపోర్ట్ చేస్తుంది. -
మేడ్ ఇన్ ఇండియా సెల్కాన్ మొబైల్స్
హైదరాబాద్, బిజనెస్ బ్యూరో : సెల్ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్ మొబైల్స్ హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ప్లాంటును శుక్రవారం ప్రారంభించారు. తొలుత నెలకు 2 లక్షల ఫోన్లను అసెంబుల్ చేయనున్నారు. ఈ సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్ల స్థాయికి చేర్చనున్నారు. దేశీ యంగా తయారీతో మోడళ్ల ధర 7-8 శాతం తగ్గనుంది. ఇప్పటి వరకు మేడ్ ఇన్ చైనా పేరుతో వచ్చిన కంపెనీ ఫోన్లు ఇక నుంచి మేడ్ ఇన్ ఇండియాగా కూడా రానున్నాయని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. దక్షిణాదిన అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటవడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఇతర కంపెనీలూ దక్షిణాదికి వచ్చేం దుకు మార్గం సుగమం అయిందని అన్నారు. అన్ని మోడళ్లు ఇక్కడే.. ప్రస్తుతం నాలుగు బేసిక్ ఫోన్లను మేడ్చల్ ప్లాంటులో అసెంబుల్ చేస్తున్నారు. జూలై నుంచి స్మార్ట్ఫోన్లు కూడా వీటికి తోడవనున్నాయి. ఆరు నెలల్లో అన్ని మోడళ్లు ఇక్కడే అసెంబుల్ చేస్తామని గురు పేర్కొన్నారు. ‘నాణ్యతకు పెద్ద పీట వేస్తున్నాం. ల్యాబ్‌లో పరీక్షించాకే ఫోన్లను బయటకు తీసుకొస్తున్నాం. చైనాకు చెందిన నిపుణుల బృందం ఇక్కడే ఉండి తయారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇందుకు వ్యయం పెరిగినా భారత్‌లో తయారీని చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో సాగుతున్నాం’ అని చెప్పారు. మేడ్చల్‌తోపాటు ప్రతిపాదిత మొబైల్స్ తయారీ హబ్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంటుకు కలిపి రూ.250 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. మేడ్చల్ ప్లాంటులో 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 100 మంది శిక్షణలో ఉన్నారు. మరో 900 మందిని నియమించనున్నా రు. ప్లాంటు స్థాపించాలన్న తమ మూడేళ్ల కల నెరవేరిందని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని అన్నారు. నెలకు 7 లక్షల హ్యాండ్సెట్లు విక్రయిస్తున్నామని, దీన్ని 10 లక్షలకు తీసుకెళ్తామని చెప్పారు. మరిన్ని కంపెనీలు..: మొబైల్స్ తయారీ రంగంలో తెలంగాణలో ఇది ఆరంభం మాత్రమేనని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. సెల్కాన్ ప్లాంటు ఏర్పాటవడం గర్వంగా ఉందన్నారు. మరిన్ని మొబైల్ కంపెనీలు ప్లాంట్ల స్థాపనకు సుముఖంగా ఉన్నాయని చెప్పారు. ‘మొబైల్స్ తయారీ హబ్ ఏర్పాటుకు సీఎం కె.చంద్రశేఖర రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ సైతం సుముఖంగా ఉంది. మైక్రోమ్యాక్స్ ప్లాంటు రాబోతోంది. తైవాన్ కంపెనీలను ఆహ్వానించాం. కొరియా, జపాన్‌కు త్వరలో వెళ్తాం. మానవ వనరుల శిక్షణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది’ అని చెప్పారు. అనలాగ్ ఫ్యాబ్ యూనిట్ ఏర్పాటుకై యూఎస్‌కు చెందిన క్రికెట్ సెమికండక్టర్ కంపెనీతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. -
గ్లోబల్ తయారీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: ప్రధాని హోదాలో మోడీ తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై కార్పొరేట్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. దేశీ తయారీ రంగాన్ని అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన మోడీ ప్రణాళికను ప్రశంసించాయి. ఇండియాను అంతర్జాతీయ తయారీ, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దే బాటలో దేశ, విదేశీ ఇన్వెస్టర్లకు ప్రధాని మోడీ స్పష్టమైన సంకేతాలిచ్చారని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. మేక్ ఇండియా, మేడిన్ ఇండియా విజన్‌పై తమకు విశ్వాసం కలిగిందని పేర్కొన్నాయి. ఇందుకు అవసరమైన విధానాలు రూపొందించడం, అభివృద్ధి చర్యలను చేపట్టడం ద్వారా దేశీ తయారీ రంగానికి ప్రస్తుత ప్రభుత్వం జోష్‌నిస్తుందని ఫిక్కీ అభిప్రాయపడింది. ‘రండి.. ఇండియాలో తయారు చేయండి’ అంటూ ఆహ్వానించడం ద్వారా అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు మోడీ అత్యంత సానుకూల సందేశాలను పంపారని అసోచామ్ పేర్కొంది. యువతకు ప్రోత్సాహం: మెరుగైన పరిపాలన, నమ్మకం వంటి అంశాలు యువతకు ప్రోత్సాహాన్నిస్తాయని, వ్యాపార సంస్థలు కూడా భారీ లక్ష్యాలవైపు దృష్టిసారించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఫిక్కీ పేర్కొంది. దేశీ పరిశ్రమల సమాఖ్య సీఐఐ సైతం ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. తయారీ రంగం, పెట్టుబడులకు ప్రధాని మోడీ అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారని ప్రశంసించింది. జన ధన యోజన ఓకే.. స్వాగతించిన ఎస్బీఐ ముంబై: నరేంద్ర మోడి జన ధన యోజనను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వాగతించింది. ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధనకు ఇది ఇతోధికంగా తోడ్పడగలదని ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. ఆర్థిక సమ్మిళిత వృద్ధిలో భాగంగా ఇప్పటివరకూ 59 శాతం కుటుంబాలకే బ్యాంక్ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో జన ధన యోజన ఉపయోగకరమైనదేనని వెల్లడించారు. యూకే, ఆస్ట్రేలియా, జపాన్ తదితర ధనిక దేశాల్లో నగదు వినియోగం 2-6 శాతం మధ్యనే వుందని, డెబిట్ కార్డులతో కూడిన బ్యాం కు ఖాతాలు పెరిగితే మన దేశంలో కూడా నగదు వినియోగం బాగా తగ్గుతుందని ఆమె అన్నారు. ప్రధాని ప్రకటించిన తాజా స్కీము ద్వారా భవిష్యత్ బ్యాంకింగ్ వృద్ధికి సెల్యులర్ టెక్నాలజీని చక్కగా వినియోగించుకునే వీలు చిక్కుతుందన్నారు. ఆర్థిక వృద్ధికి తోడ్పాటు: యూఎస్ఐబీసీ వాషింగ్టన్: అందరికీ ఆర్థిక సేవలు అందించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ‘జన ధన యోజన’ పథకం .. మలి విడత సామాజిక, ఆర్థిక అభివృద్ధి దిశగా కీలకమైన అడుగని అమెరికా-భారత్ వ్యాపార మండలి (యూఎస్ఐబీసీ) అభివర్ణించింది. దేశ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమెరికన్ ఇన్వెస్టర్ల అభిమానాన్ని చూరగొంటున్నాయని యూఎస్ఐబీసీ తాత్కాలిక ప్రెసిడెంట్ డయాన్ ఫారెల్ పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ప్రయత్నాల్లో తమ వంతు సహకారాన్ని అందించేందుకు అమెరికన్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని ఆమె వివరించారు. బ్యాంకింగ్, బీమా, పింఛన్లు, అసెట్ మేనేజ్మెంట్ తదితర రంగాల సంస్థలతో కలిసి పనిచే యడాన్ని కొనసాగించాలని యూఎస్ఐబీసీ భావిస్తున్నట్లు ఆమె వివరించారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ విషయంలో భారత్ ముందు ప్రస్తుతం ఒక అద్భుతమైన అవకాశం ఉందని యూఎస్ఐబీసీ బోర్డు సభ్యుడు విజయ్ అద్వానీ అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న అత్యధిక భారతీయులకు ఆర్థిక సర్వీసులను అందుబాటులోకి తేవడం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం హర్షణీయమని చెప్పారు. -
18 భాషల్లో మోడీ అభినందనలు
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ తన దైనశైలిలో ప్రత్యేకతను చాటుకున్నారు. తెల్లటి దుస్తులు, తెల్ల గెడ్డం, ఎర్రటి తలపాగాతో వచ్చిన మోడీ .. శుక్రవారం నాడు ఎర్రకోటపై 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాధారంగా అయితే రెండు మూడు భాషల్లోనే దేశ ప్రజలకు అభినందనలు తెలియజేయటం ఇప్పటి వరకూ చూసి ఉంటాం. అయితే మోడీ మాత్రం 18 భాషల్లో దేశ ప్రజలకు అభినందనలు తెలిపి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్, మన జాతీయ భాష అయిన హిందీతో పాటు మరో పదహారు భాషల్లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలకు నమ్మకం కలిగించేలా పరిపాలన అందించడానికి కృషి చేస్తానని మోడీ హామీ ఇచ్చారు. యావత్ భారతావని వృద్ధి బాటలో పయనించాలని కోరుతూ.. ప్రతీ ఒక్క భారతీయుడు వర్ధిల్లాలని మోడీ తన ప్రసంగంలో ఆకాంక్షించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఓ బాలకుడు ఈ రోజు ఎర్రకోట నుంచి భారత త్రివర్ణ పతాకం ముందు తల వంచి నమస్కరించే అవకాశం వచ్చిందంటే అది భారత ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశమేనని మోడీ అన్నారు. ఇంతకుముందు పనిచేసిన అందరు ప్రధానమంత్రులకు, పాత ప్రభుత్వాలన్నింటికీ నా గౌరవ ప్రణామాలు అందజేస్తున్నాను. మనం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దీని ఆధారంగానే దేశం ముందుకెళ్తోంది. ఎర్రకోట నుంచి నేను ప్రతి ఒక్క పార్లమెంటేరియన్‌కు, ప్రతి ఒక్క పార్టీకి ప్రణామాలు చేస్తున్నానని మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. -
కమాన్.. మేకిన్ ఇండియా: మోడీ పిలుపు
దేశానికి ప్రధానమంత్రిగా కాదు.. ప్రధాన సేవకుడిగా మీ ముందుకు వచ్చానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తెల్లటి దుస్తులు, తెల్ల గెడ్డం, ఎర్రటి తలపాగాతో వచ్చిన మోడీ 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇచ్చారు. మన దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి లెక్కలేనంత మంది బలిదానాలు చేశారని, వాళ్ల జీవితం, యవ్వనమంతా జైళ్లలోనే గడిపేశారని అన్నారు. ఇలా ప్రాణాలు అర్పించిన, పోరాడిన అందరికీ శతకోటి వందనాలు అర్పించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. దేశం కోసం జీవితమంతా సాధన చేసే శ్రామికులను మనం అభినందించాలి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఓ బాలకుడు ఈ రోజు ఎర్రకోట నుంచి భారత త్రివర్ణ పతాకం ముందు తల వంచి నమస్కరించే అవకాశం వచ్చిందంటే అది భారత ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశమే. ఇంతకుముందు పనిచేసిన అందరు ప్రధానమంత్రులకు, పాత ప్రభుత్వాలన్నింటికీ నా గౌరవ ప్రణామాలు అందజేస్తున్నాను. ఈ దేశం పురాతన సాంస్కృతిక సంప్రదాయాల పునాదులపై నిలబడింది. ఇక్కడ వేదకాలంలో మనకు ఒకటే మంత్రం వినిపించేది. 'సంగచ్ఛత్వం సంగత్వం సంబో మనాఫి జానతాం ' మనం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ మూలమంత్రం ఆధారంగానే దేశం ముందుకెళ్తోంది. ఎర్రకోట నుంచి నేను ప్రతి ఒక్క పార్లమెంటేరియన్‌కు, ప్రతి ఒక్క పార్టీకి ప్రణామాలు చేస్తున్నాను. నాకు ఢిల్లీ అంటే ఏంటో తెలియదు. బయటనుంచి వచ్చాను. ఒక ఔట్‌సైడర్ ఢిల్లీ వచ్చి ఇన్సైడర్ వ్యూ చూశారు. నేను ఇక్కడ రాజకీయాలు చేయాలని రాలేదు. ఇక ప్రభుత్వం లోపల కూడా అనేక ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమతమ సొంత రాజ్యాలు నడిపిస్తున్నారు. ఒక శాఖ మరోశాఖతో కొట్టుకుంటోంది. ఏకంగా సుప్రీంకోర్టు వరకు ఒకే ప్రభుత్వంలో రెండు శాఖలు కొట్టుకుంటున్నాయి. ఒకే దేశానికి చెందిన ప్రజలు ఇలా చేస్తే దేశం ఎలా ముందుకెళ్తుంది? ఇలాంటి గోడలను పడగొట్టడానికి నేను ప్రయత్నం మొదలుపెట్టాను. మన దేశంలో పాప కొంచెం పెద్దదయ్యిందంటే చాలు.. బయటకెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, వెళ్లగానే ఫోన్ చెయ్యి అంటారు. అదే పిల్లాడిని అడుగుతున్నారా? ఎక్కడకు వెళ్తున్నావని, ఏం చేస్తున్నావని అడిగితే ఇన్ని అత్యాచారాలు జరిగేవా? ఇప్పుడు అత్యాచారాలు చేస్తున్నవాళ్లు కూడా ఎవరో ఒకళ్ల పిల్లలే కదా. వాళ్లమీద తల్లిదండ్రులు ముందునుంచి తగిన నియంత్రణలు పెడితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? దేశంలో జరుగుతున్న అత్యాచారాలు చూసి సిగ్గుతో తల వంచుకుంటున్నా. మన దేశంలో ఉన్న మావోయిస్టులు, ఉగ్రవాదులు కూడా ఎవరో ఒకళ్ల పిల్లలే కదా.. వాళ్ల తల్లిదండ్రులు కూడా తప్పుదోవ పట్టద్దని అడిగితే ఇన్ని ప్రాణాలు పోవు కదా! హింసాత్మక మార్గంలోకి వెళ్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే. మీ తల్లిదండ్రులు మీకు ఎంతో కొంత ఇచ్చారు. భుజాల మీద తుపాకులు పెట్టుకుని మీరు భూమాతను రక్తసిక్తం చేస్తారు. అదే భుజాల మీద నాగలి పెట్టుకుంటే అదే భూమాత పచ్చగా మారుతుంది. ఎందుకీ రక్తపాతం? అశోకుడు కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు. కానీ యుద్ధాలు వదిలి బుద్ధుడి మార్గం వైపు మళ్లారు. మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక ప్రభుత్వ కార్యాలయాలు సమయానికి తెరుచుకుంటాయని అంతా అన్నారు. కానీ దానివల్ల నాకు ఆనందం కాదు.. బాధ అనిపిస్తోంది. ఈ దేశంలో ప్రభుత్వాధికారులు సమయానికి ఆఫీసులకు వెళ్లడం అంటే పెద్ద వార్త అవుతుందా.. అవుతోందంటే మనమంతా బాధపడాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ల సామర్థ్యం చాలా ఎక్కువ ఉంది. చప్రాసీ నుంచి సెక్రటరీ వరకు అందరికీ శక్తి సామర్థ్యాలున్నాయి, వాటిని నేను మేల్కొలిపి దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇదే మాట నేను 16 మే నాడు చెప్పలేను. కానీ ఈ మూడు నెలల అనుభవంతో ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. దౌర్భాగ్యం ఏమిటంటే, మనం ఎక్కడైనా ఎవరి వద్దకైనా ఏదైనా పనిమీద వెళ్తే, 'ఇందులో నాకేమొస్తుంది' అంటారు. ఏమీ రాదనిపిస్తే, నాకేమిస్తావని అడుగుతారు. ఇదే మన దేశదుస్థితికి కారణం. ఇటీవలే కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. వాటిలో అనేక పతకాలు వచ్చాయి. అయితే ఈ పతకాలు తెచ్చినవాళ్లలో 39 మంది అమ్మాయిలున్నారు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెబుదాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అభివృద్ధి మాత్రమే మార్గం. సుపరిపాలన మాత్రమే మార్గం. ఈ రెండింటితోనే మనం ముందుకు వెళ్దాం. ప్రైవేటు ఉద్యోగులను అడిగితే ఉద్యోగం చేస్తున్నామంటారు. అదే ప్రభుత్వోద్యోగులైతే సేవ చేస్తున్నా అంటారు. ఈ భావాన్ని పునరుజ్జీవింపజేద్దాం. దేశ ప్రజలంతా ఒక్క అడుగు ముందుకు వేస్తే దేశం కోటీ 25 లక్షల అడుగులు ముందుకు వెళ్తుంది. ప్రధానమంత్రి జనధన యోజన అనే కార్యక్రమంతో దేశవాసులను పేదరికం నుంచి బయటకు తీసుకు రావాలి. దేశంలో చాలామందికి మొబైల్ ఫోన్లున్నాయి గానీ బ్యాంకు ఖాతాలు లేవు. ఈ పథకం కింద డెబిట్ కార్డుతో పాటు ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయల జీవిత బీమా కూడా అందిస్తాం. ఏ కుటుంబంలోనైనా ఏమైనా జరిగితే వాళ్లకు ఈ లక్ష రూపాయలు అండగా ఉంటాయి. మన దేశంలో ఎక్కువ మంది యువకులున్నారు. దేశానికి నైపుణ్యం ఉన్న వాళ్ల అవసరం ఉంది. 'స్కిల్ ఇండియా'ను మనం రూపొందించుకోవాలి. అందరూ రండి .. దేశాన్ని తయారుచేసుకుందాం. రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, వీళ్లందరూ దేశ నిర్మాతలు. ప్రపంచంలో ఎక్కడైనా చదవండి. కానీ నిర్మాణం ఇక్కడ చేయండి. 'కమ్.. మేక్ ఇన్ ఇండియా'. మేడిన్ ఇండియా అనే బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగాలి. మన దేశంలో శక్తి సామర్థ్యాలున్నాయి. ప్రపంచానికి చేసి చూపిద్దాం.. 'మేడిన్ ఇండియా'. ఏదైనా మనం విదేశాల నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవాలి? దిగుమతులు మానేసి.. ఎగుమతులు చేసే స్థితికి మనం రావాలి. ప్రతి ఒక్కళ్లూ మనం దిగుమతి చేసుకునే ఒక్కో వస్తువును సొంతంగా చేయడానికి ప్రయత్నించండి. రెండు విషయాల్లో మీరు రాజీ పడొద్దు. అందులో ఒక్కలోపం కూడా ఉండకూడదు. అలా ఉంటే విదేశాల నుంచి అవి తిరిగొస్తాయి. అలాగే పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడకూడదు. 'జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్'లా ఉండాలి. మన దేశాన్ని పాములు ఆడించుకునేవాళ్ల దేశమని అన్నారు. కానీ మన నైపుణ్యం గురించి వాళ్లకు తెలియదు. కంప్యూటర్లను మునివేళ్ల మీద ఆడించే సామర్థ్యం మనవాళ్లకు ఉంది. డిజిటల్ ఇండియాను రూపొందించాలి. దేశంలోని మారుమూల గ్రామంలో కూడా డిజిటల్ పాఠాలు చెప్పగలిగితే అప్పుడు ఉపయోగం ఉంటుంది. డాక్టర్లు చేరుకోలేని చోట టెలిమెడిసిన్ పనిచేస్తే.. దాని ఉపయోగం ఉంటుంది. మొబైల్ గవర్నెన్స్ మనం సాధించగలమా? పనులన్నింటినీ నడుచుకుంటూనే మొబైల్ గవర్నెన్స్ ద్వారా చేసుకోగలిగేలా ఉండాలి. మన దేశానికి పెట్రోలు దిగుమతులు తప్పనిసరి. కానీ వాటి తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నవి ఎలక్ట్రానిక్ పరికరాలే. వీటిని సొంతంగా చేసుకోగలిగితే దేశానికి బోలెడంత ఖర్చు మిగులుతుంది. ఒకప్పుడు రైళ్లు దేశాన్ని అనుసంధానం చేస్తాయని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఐటీ అలా అనుసంధానించాలి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు తదితరులు ముందు వరుసలో ఆశీనులయ్యారు. వెన్నునొప్పితో బాధపడుతున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా వేడుకలకు హాజరయ్యారు.