ఎన్టీపీసీకి సీమెన్స్ ట్రాన్స్ఫార్మర్ | Siemens CEO calls for removal of anti-Russian sanctions | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీకి సీమెన్స్ ట్రాన్స్ఫార్మర్

Published Fri, Apr 15 2016 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

ఎన్టీపీసీకి సీమెన్స్ ట్రాన్స్ఫార్మర్

ఎన్టీపీసీకి సీమెన్స్ ట్రాన్స్ఫార్మర్

హైదరాబాద్: సీమెన్స్ కంపెనీ ఎన్టీపీసీకి అతి పెద్ద మేడ్ ఇన్ ఇండియా సింగిల్ ఫేజ్ జనరేటర్ స్టెప్ అప్(జేఎస్‌యూ) ట్రాన్స్‌ఫార్మర్‌ను అందించనున్నది. ఈ జేఎస్‌యూ ట్రాన్స్‌ఫార్మర్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ... ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అధిక కెపాసిటీ ఉన్న విద్యుదుత్పత్తి సాధ్యమవుతుందని సీమెన్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 10 జేఎస్‌యూ ట్రాన్స్‌ఫార్మర్ల ఆర్డర్‌ను ఎన్‌టీపీసీ నుంచి పొందామని సీమెన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హరాల్డ్ గ్రిమ్ పేర్కొన్నారు. కర్నాటకలోని ఎన్‌టీపీసీకి చెందిన కుడ్‌గి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో ఈ జేఎస్‌యూ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమరుస్తారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement