Siemens company
-
పక్కా పన్నాగంతోనే స్కిల్ స్కామ్.. బాబు కనుసన్నల్లోనే కుంభకోణం
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు పక్కా కుట్రతోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్ ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 2014–15లో ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ కుట్రపూరితంగా షేల్ కంపెనీలు సృష్టించి ఫేక్ ఇన్వాయిస్లు అవినీతికి పాల్పడ్డారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట రూ.3,300కోట్ల ప్రాజెక్టును కేవలం కాగితాలపై సృష్టించడం... ప్రాజెక్టు చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371కోట్లు విడుదల చేయడం... షెల్ కంపెనీల ద్వారా తరలించడం...ఇలా కుట్ర అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది.ప్రజాధనం కొల్లగొట్టాలనే పక్కా పన్నాగంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ సృష్టికర్త... ఆ కుంభకోణంతో అక్రమంగా నిధులు పొందిన లబ్ధిదారూ రెండూ చంద్రబాబే’అని సీఐడీ సిట్ దర్యాప్తులో ఆధారాలతోసహా వెల్లడైంది. కుంభకోణం కుట్రదారు...అంతిమలబ్ధిదారుడు చంద్రబాబేనని నిగ్గు తేలి్చంది. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూపొందించారు. టీడీపీ నేత ఇల్లెందుల రమేశ్ ద్వారా డిజైన్‌టెక్, ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ సంస్థలు ఆయన్ని సంప్రదించాయి. దాంతో రాష్ట్ర కేబినేట్ ఆమోదం లేకుండానే ఏపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేశారు.ఆ సంస్థకు డైరెక్టర్‌గా తన సన్నిహితుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా గంటా సుబ్బారావును నియమించారు. ఏపీఎస్ఎస్డీసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎంటర్ ప్రైజస్, ఇన్నోవేషన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి సర్వే లేకుండానే కేవలం డిజైన్‌టెక్ కంపెనీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా ఆ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో డిజైన్‌టెక్ భాగస్వామిగా ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్‌ను ఆమోదించి... అందులో సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం నిధులు సమకూరుస్తాయని ఒప్పందంలో పేర్కొన్నారు.చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ...⇒ టీడీపీ ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది.. రూ 371 కోట్లు⇒ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ. 238.29 కోట్లు, ⇒ ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు.అంతా బాబు ముఠానే..ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే. లక్ష్మీనారాయణ, ఎండీ గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులను కట్టబెట్టారు.తద్వారా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికు ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించేలా పథకం రచించారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి విరుద్ధమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మావాళ్లే.. అడ్డగోలుగా నిధులు ఇచ్చేయండి ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ వాటా 10శాతం కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆరి్థక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత నోట్‌ఫైళ్లపై లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సీమెన్స్ కంపెనీకి రూ.371కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆరి్థక శాఖ అధికారులు ఆ నోట్‌ఫైళ్లలో స్పష్టం చేస్తూ ఆ నిధులు విడుదల చేశారు. నిధులు కొల్లగొట్టేందుకు గ్రీన్ చానల్ ఇక ఆ ప్రాజెక్ట్ నిధులను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. విద్యా శాఖతో నిమిత్తం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ నుంచి నేరుగా ఇంటర్ప్రైజస్– ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లు పంపాలని ఆదేశించారు. ఆ మేరకు డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లను వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించారు. పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది...ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లుఇన్వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లుమొత్తం రూ. 140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. -
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు
ఢిల్లీ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దూకుడు ప్రదర్శిస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో సిమెన్స్ కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై ,పూణేలలోని రూ.23 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.నకిలీ ఇన్ వాయిస్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. డీటీసీఎల్ ఎండీ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ ముకుల చండ్ ఆస్తులను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది. స్కిల్ కుంభకోణం కేసు..ప్రభుత్వంలో వణుకుస్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో పేరుతో చంద్రబాబు తన హయాంలో రూ. 240 కోట్లను షెల్ కంపెనీలకు తరలించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు గతంలోనే 13 చోట్ల ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు పెట్టినట్టు నిర్ధారించింది.రూ.370 కోట్ల ప్రాజెక్టును రూ.3,300 కోట్లకు పెంచేసి గోల్మాల్ చేసిన చంద్రబాబు ఇదే కేసులో 52 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించారు. తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ కేసు ఆధారంగా సిమెన్స్ కంపెనీ ఆస్తులను ఈడీ అటాట్ చేసింది. దీంతో స్కిల్ కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఈడీ తాజా అటాచ్‌మెంట్‌తో సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కలవరానికి గురవుతున్నారు. -
'స్కిల్' దొంగ బాబే
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో చంద్రబాబే అవినీతి తిమింగళం అని మరోసారి నిగ్గు తేలింది. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఆయన గారు సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యింది. అసలు జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్‌ను కాగితాలపై సృష్టించడం.. రూ.370 కోట్ల ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచడం.. సీమెన్స్ కంపెనీ పేరున జీవో జారీ చేసి, తన బినామీ కంపెనీ డిజైన్ టెక్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం.. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు రూ.271 కోట్లు విడుదల చేయడం.. షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులు తన నివాసానికే చేర్చడం.. పైగా అంతా పద్దతి ప్రకారం చేశామంటూ అడ్డగోలుగా వాదించడం.. మరోమారు చర్చకు వచ్చింది. సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ వంటి ఎన్నో కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన అక్రమ నిధుల తరలింపు కోసం ఏర్పాటు చేసుకున్న అవినీతి నెట్వర్క్ గుట్టును సీఐడీ ఛేదించడం.. స్కిల్ స్కామ్‌లో ఏసీబీ కోర్టు బాబుకు రిమాండ్ విధించడం.. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉండటంతో ఏసీబీ కోర్టు తీర్పులో, విచారణలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పడం చూస్తుంటే చంద్రబాబే అసలు దొంగ అని మరోసారి ఎలుగెత్తి చాటినట్లయింది. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ప్రాజెక్ట్‌ను రూపొందించిందీ ఆయనేనని, అక్రమంగా మళ్లించిన నిధులు చేరింది ఆయన నివాసానికే అన్నది సీఐడీ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. దాంతో సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. కీలక ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షీట్ నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కార్మీక శాఖ మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీ నంబర్ 7691గా ఆయన అక్కడ 52 రోజులు జ్యుడిíÙయల్ రిమాండ్‌లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత అనారోగ్య కారణాలను చూపిస్తూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజనరీగా వేసుకున్న ముసుగు తొలగి చంద్రబాబు ఏ–1 అన్న నిజం ప్రపంచానికి తెలిసింది. స్కిల్ స్కామ్ ఎలా సాగిందంటే.. సీమెన్స్ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టు ► డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్యాల శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ఆ కంపెనీకి ఏమాత్రం తెలియకుండానే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కని్వల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ► విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు. కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేశారు. తద్వారా సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. ► ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావును ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ► ఉన్నత విద్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించడానికి కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్‌భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి వ్యతిరేకమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ► సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు ► డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. టీడీపీ ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ► మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. అమెరికాకు శ్రీనివాస్.. దుబాయ్‌కి మనోజ్ ► అక్రమ నిధుల తరలింపు పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని దుబాయ్‌కు ఉడాయించారు. టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. ► కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ప్రాజెక్ట్ గురించి తెలియదన్న సీమెన్స్ ► సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ► తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని.. కేవలం ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) స్పష్టం చేసింది. సీఐటీడీ నివేదిక ఇవ్వక మునుపే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. ► ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. షెల్ కంపెనీల లావాదేవీల విషయాన్ని గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ శుక్రవారం జప్తు చేసింది. మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని ఇప్పటికే విచారించింది. పలువురిని అరెస్టు చేసింది. ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని కాగ్ కూడా నిగ్గు తేలి్చంది. ఈ వాస్తవాల కారణంగానే.. ఈ కేసు 2017లో నమోదైనందున చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు కూడా చెప్పడం గమనార్హం. న్యాయ నిపుణులు కూడా పాత కేసులకు పాత చట్టమే వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. నో రూల్స్.. రూ.371 కోట్లు ఇచ్చేయండి ► సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అయినా ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. ► అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని పీవీ రమేశ్ తన నోట్ ఫైల్లో పొందుపరిచారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా ఒప్పుకోలేదు. అయినప్పటికీ చంద్రబాబు.. గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. ► దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. అప్పటి సీఎం ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం 13 నోట్ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు 5 చోట్ల సంతకాలు చేశారు. -
సీమెన్స్ ఎనర్జీ బిజినెస్ విడదీత
న్యూఢిల్లీ: ఎనర్జీ బిజినెస్‌ను విడదీసే ప్రతిపాదనను పూర్తి చేసేందుకు దేశీయంగా సొంత అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం సీమెన్స్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు తెలియజేసింది. ఎనర్జీ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను పూర్తి చేయవలసిందిగా సీమెన్స్ లిమిటెడ్ బోర్డును ప్రమోటర్ సంస్థలు సీమెన్స్ యాక్టింగిసెల్షాఫ్ట్(జర్మనీ), సీమెన్స్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ బీవీ, సీమెన్స్ ఎనర్జీ హోల్డింగ్ బీవీసహా ప్రధాన ప్రమోటర్ సీమెన్స్ ఎనర్జీ యాక్టింగిసెల్షాఫ్ట్ కోరినట్లు కంపెనీ పేర్కొంది. ప్రతిపాదనపై పరిశీలన, విలువ నిర్ధారణ, తదితర అవసరమైన చర్యలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. వెరసి వెనువెంటనే పూర్తి అనుబంధ సంస్థ ఏర్పాటుకు బోర్డు నిర్ణయించినట్లు వివరించింది. ఎనర్జీ విడదీత వార్తలతో సీమెన్స్ షేరు ఎన్ఎస్ఈలో 6% జంప్‌చేసి రూ. 4,138 వద్ద ముగిసింది. -
న్యాయ వ్యవస్థను కించపరుస్తున్న లోకేశ్
మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ పేరుతో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, ఆధారాలతో సహా దొరికిన దొంగ చంద్రబాబు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా విమర్శించారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆధారాలు ఉన్నాయనే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. విజయవాడ న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టుల మెట్లు ఎక్కినా, ఆయనకు ఊరట లభించకపోవడంతో 50 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేశారని లోకేశ్ విమర్శించడం న్యాయ వ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని లోకేశ్ వ్యాఖ్యానించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏకంగా 13 ఫైళ్లలో సంతకాలు చేశారని గుర్తు చేశారు. తద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఆధారాలతోసహా వెలికి తీసిందన్నారు. ఆయన ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో అసెంబ్లీలో స్క్రీన్‌పై ప్రదర్శించి ప్రజలకు స్పష్టంగా వివరించామని చెప్పారు. ఇంతకంటే ఏం సాక్ష్యాలు కావాలని లోకేశ్‌ను ప్రశ్నించారు. మంత్రి అమర్నాథ్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘సీమెన్స్’ తిరుగులేని సాక్ష్యం ♦ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ స్పష్టం చేసింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు ఇది తిరుగులేని సాక్ష్యం. అసలు కేబినెట్ అనుమతి లేకుండానే ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు అవినీతికి నాంది పలికారు. ♦ స్కిల్ ప్రాజెక్ట్ పేరిట జారీ చేసిన జీవోకు విరుద్ధంగా ఒప్పందం చేసుకోవడం.. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం చేసుకుంటున్నట్టు మోసం చేయడం.. అనంతరం డిజైన్‌టెక్ అనే కంపెనీ ద్వారా త్రైపాక్షిక ఒప్పందంగా మార్చడం అంతా కూడా ప్రజాధనాన్ని దోచేందుకు వేసిన పన్నాగమే. ఇదంతా పూర్తి ఆధారాలతో బయటపడిన విషయాన్ని లోకేశ్ గుర్తించాలి. ♦నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు చెల్లించాలని చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం వాస్తవం కాదా? ఆ విధంగా చెల్లించిన నిధులు షెల్ కంపెనీల ద్వారా హైదారాబాద్ జూబ్లీ హిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరడం సీఐడీ దర్యాప్తులో వెల్లడి కావడం నిజం కాదా? ♦ అసలు చంద్రబాబుకు ఐటీ శాఖ ఎందుకు నోటీసులు జారీ చేసిందో సమాధానం చెప్పగలరా? ఐటీ శాఖ ప్రశ్నించడం వాస్తవం కాదా? ♦ స్కిల్ స్కామ్ కేసులో విచారణకు సీఐడీ నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి వాసుదేవ్ పార్థసానిలను ఎందుకు విదేశాలకు పంపించారో సమాధానం చెప్పగలవా లోకేశ్? ♦ అమరావతిలో తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణం, టిడ్కో ప్రాజెక్ట్‌ల టెండర్ల కేటాయింపులో కాంట్రాక్ట్ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నందుకే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు ఐటీ శాఖే వెల్లడించింది. తమకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బ్రాంచి అధికారులు నోటీసులు ఇవ్వాలి తప్ప.. ఢిల్లీ ఆఫీసు వారు కాదని చంద్రబాబు చేసిన వాదనను ఐటీ శాఖ కొట్టి పారేసింది. లెక్కల్లో చూపని రూ.118 కోట్ల ఆదాయానికి ఆధారాలు చూపాలని ఐటీ శాఖ ప్రశ్నించడం వాస్తవం కాదా లోకేశ్? మేనేజ్ చేయటంలో దిట్ట మీ బాబే ♦ 40 ఏళ్లుగా చంద్రబాబు కంటే బాగా వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ లేరు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారానే మీ బాబు చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, అడ్డదారిలో సీఎం పదవి దక్కించుకున్నారు. టీడీపీని, ఆ పార్టీ గుర్తును, ట్రస్ట్‌ను కూడా కొట్టేశారు. ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీతో కలసి అక్రమ కేసులు పెట్టించింది చంద్రబాబే అన్నది ప్రజలకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసిన విషయం తెలియదా లోకేశ్? వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ పెట్టిన అక్రమ కేసుల్లో టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయ్యారనే విషయం తెలియదా? బాబులా మేనేజ్ చేయాల్సిన అవసరం సీఎంకు, వైఎస్సార్సీపీకి లేదు. ♦ లోకేశ్ 35 రోజులు ఢిల్లీలో ఎందుకు ఉన్నారు. పైగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షానే తనను పిలిపించుకున్నారని అబద్దాలు చెప్పారు. కానీ ఆయన పదే పదే అడిగితేనే అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పడంతో అసలు బండారం బయటపడింది. అబద్ధాలు చెప్పడం, గోబెల్స్ ప్రచారంలో లోకేశ్ తన తండ్రి చంద్రబాబును మించిపోయారు. చంద్రబాబుకు లోకేశ్‌తోనే ముప్పు ♦ చంద్రబాబుకు ఏదైనా ముప్పు ఉంటే అది లోకేశ్‌తోనే ఉండొచ్చు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణం అయినట్టే.. ప్రస్తుతం చంద్రబాబుకు లోకేశ్ వెన్నుపోటు పొడిచే అవకాశాలున్నాయి. ♦చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా ఎందుకోసం? పోలీసుల కాల్ డేటాతో చంద్రబాబుకు ఏం సంబంధం? దర్యాప్తు అధికారులు విచారణ ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారులతో మాట్లాడతారు. ఆ కాల్ డేటాను టీడీపీకి ఎందుకు ఇవ్వాలి. జైలు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. జైల్లో చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్యులు 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే లోకేశ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరత్రా పేదలకు ప్రభుత్వం చేస్తున్న మేలును ఈ యాత్రలో వివరిస్తుంటే సర్వత్రా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని చూసి ఓర్వ లేకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప చంద్రబాబుకు ప్రజలకు మేలు చేయడం అన్నది తెలియదు. ఆయన ఒక్క ఎన్నికల్లో అయినా పొత్తు లేకుండా గెలిచారా? గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. చివరికి లోకేశ్‌ను కూడా గెలిపించుకోలేకపోయారు. -
నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు
సాక్షి, అమరావతి: అడుగడుగునా కుంభకోణాలతో ప్రజా ధనాన్ని దోచేసి అడ్డంగా దొరికిపోయి జైలులో కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆడుతున్న సరికొత్త నాటకం ‘నిజం గెలవాలి’ యాత్ర. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొన్న దగ్గర నుంచి చంద్రబాబు ఎన్నెన్నో డ్రామాలాడారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకొంటూ, అవినీతి తప్పితే మరే దృష్టీ లేకపోయినప్పటికీ, పైకి విజన్ ఉన్న నాయకుడిగా కలరింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్న ఆయన.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, పేదల నుంచి అసైన్మెంట్ భూములను కొల్లగొట్టడం వంటి పలు వ్యవహారాల్లోనూ చంద్రబాబు అన్ని నిబంధనలనూ ఉల్లంఘించినట్లు వెల్లడైంది. వీటిపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. టిడ్కో గృహాల నిర్మాణం, అమరావతిలో తాత్కాలిక కట్టడాల వ్యవహారంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ పలు అక్రమాలను వెలికితీసింది. తెలంగాణ సర్కారును దెబ్బతీసేందుకు చేసిన ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు రాత్రికి రాత్రి మకాం హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చిన చంద్రబాబు.. ఆ తర్వాత అమరావతి రాజధాని పేరుతో అనేక అక్రమాలకు తెరతీశారు. అదేమంటే.. దాడులు చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఎవరు? సీబీఐ ఎవరు అంటూ దర్యాప్తు సంస్థల పైనే çహూంకరించేవారు. అవినీతిలో బాబు ‘స్కిల్’ ఇది 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.371 కోట్లు కొల్లగొట్టారు. అందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ. 3,300 కోట్లతో ఒక నకిలీ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. సీమెన్స్ కంపెనీ 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం. ఈ కార్యక్రమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని సీమెన్స్ సంస్థ విస్పష్టంగా ప్రకటించింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులు జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు చెల్లించింది. ఇది తప్పని ఆరి్థక శాఖ అధికారులు చెప్పినా బాబు పట్టించుకోలేదు. ఆ నిధులను ఫోర్జరీ డాక్యుమెంట్లు, షెల్ కంపెనీల ద్వారా తరలించేశారు. వాటిలో రూ.241 కోట్లు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు నివాసానికే చేరినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై బాబు సీఎంగా ఉండగానే జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేశారు. సీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేసి, కొందరిని అరెస్టు కూడా చేసింది. ఇటీవల మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీఐడీ అధికారులు.. చంద్రబాబు ప్రమేయాన్ని బట్టబయలు చేశారు. 18 నోట్‌ఫైళ్లపై ఆయన సంతకాలు పెట్టినట్లు గుర్తించారు. అన్ని ఆధారాలతో ఆయన్ని అరెస్టు చేశారు. ఆధారాలు బలంగా ఉండటంతో ఆయన కూడా తాను నేరం చేయలేదని ఏ కోర్టులోనూ చెప్పడంలేదు. ఎంతసేపూ అరెస్టులో సాంకేతిక కారణాలంటూ కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలను కోర్టులు పట్టించుకోవడంలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు భూదోపిడీ కథ ఇదీ.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు బినామీ లింగమనేని రమేశ్‌కు చెందిన భూములు, బాబు సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్, మంత్రి నారాయణకు చెందిన భూములను ఆనుకొని వెళ్ళేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అదే అలైన్‌మెంట్‌ను సింగపూర్ కన్సల్టెన్సీతో ఖరారు చేయించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు, బినామీల భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేశ్ కరకట్ట నివాసాన్ని, హెరిటేజ్ ఫుడ్స్‌కు, నారాయణ బినామీలకు భూములు ఇచ్చారు. పార్టీలోనే అనుమానాలు ఇప్పటివరకు 155 మందికిపైగా చంద్రబాబు కోసం మృతి చెందారని ఆ పార్టీ ప్రకటించింది. అయితే, వీరంతా బాబు అరెస్టయ్యారన్న బాధతో చనిపోయారన్నది వాస్తవం కాదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. దీనిపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో చనిపోయిన వారిని చంద్రబాబు కోసం మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారని సామాన్య ప్రజానీకమూ చెబుతున్నారు. అందువల్లే ముందుగా పేర్లు ప్రకటిస్తే విమర్శలు వస్తాయన్న భయంతోనే జాబితా బయటపెట్టలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎవరిని పరామర్శించాలి, యాత్ర ఎక్కడి వరకు, ఎన్ని రోజులు చేయాలన్న విషయాలపై పార్టీ అధిష్టానానికే స్పష్టత లేదు. సాధారణ మరణాలను బాబు అరెస్టుకు ముడిపెట్టి, ఓ తప్పుడు కార్యక్రమాన్ని చేపట్టడం వల్లే ఇప్పుడీ అవస్థలు వచ్చాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి. ఈ యాత్ర పరిస్థితి కూడా అలాగే ఉంటే ఏం చేయాలోనని పారీ్టలో ఆందోళన నెలకొంది. ఫైబర్‌నెట్‌లో బాబు ‘సెట్టింగ్’ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టులోనూ బాబు అవినీతి వెల్లడైంది. రూ.330 కోట్ల మొదటి దశ ప్రాజెక్టును తన బినామీ వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పటివరకూ బ్లాక్ లిస్టులో ఉన్న ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. టెండర్ల టెక్నికల్ కమిటీలో హరికృష్ణకు స్థానం కల్పించారు. ఎల్1 గా వచ్చిన కంపెనీకి కాకుండా టెరాసాఫ్ట్‌కు టెండరు కట్టబెట్టారు. ఇలా చేయడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినా బాబు పట్టించుకోలేదు. 80 శాతం ప్రాజెక్టు పనులు నాసి రకంగా చేశారు. అలా కొల్లగొట్టిన నిధుల్లో రూ.144 కోట్లు చంద్రబాబుకు చేరినట్లు గుర్తించారు. అసైన్మెంట్ పేరుతో పేదలను దోచిన బాబు బ్యాచ్ అమరావతి ప్రాంతంలో అసైన్మెంట్ భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులను బాబు బ్యాచ్ భయపెట్టి, వాటి ద్వారా వందల కోట్లు దండుకున్న మోసమిది. అమారావతి పరిధిలో అసైన్డ్ భూములకు ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వదని చంద్రబాబు ప్రభుత్వం తొలుత ప్రచారం చేసింది. దాంతో ఆందోళన చెందిన అసైన్డ్ రైతుల వద్దకు బాబు బ్యాచ్ తమ ఏజెంట్లను పంపింది. అతి తక్కువ ధరకు దాదాపు 617 ఎకరాల అసైన్డ్ భూములు హస్తగతం చేసుకుంది. అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. భూ సమీకరణ ప్యాకేజీ ద్వారా ఈ బ్యాచ్ రూ.3,737 కోట్లు కొల్లగొట్టింది ఇలా అన్నింటా అడ్డంగా దొరికిపోతున్న చంద్రబాబు.. ఇప్పుడు నిజం గెలవాలంటూ ప్రజల్లో మరో ఎత్తుగడతో వస్తున్నారు. బాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందారంటూ కొందరు టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. అసలు వాస్తవమేంటంటే.. నిజం గెలిచింది కాబట్టే ఆయన జైలుకు వెళ్లారు. కానీ, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు కొత్త డ్రామాకు తెరలేపారు. చంద్రబాబు జైలుకు వెళ్లగానే, ఆయన కుమారుడు లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిపివేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయన మళ్లీ పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపించడంలేదు. చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలూ కనిపించడంలేదు. దీంతో బాబు సతీమణి భువనేశ్వరితో యాత్ర చేపట్టారు. బుధవారం నుంచి తిరుపతి జిల్లాలో బాబు సొంత గ్రామం నారావారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతోంది. భవనేశ్వరి మంగళవారం నారావారిపల్లెకు చేరుకున్నారు. అయితే, ఈ ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమంలో అన్నీ దాపరికాలే. యాత్ర ప్రారంభానికి ఒక రోజు ముందు కూడా యాత్ర సమాచారం, రూట్ మ్యాప్ వంటివి ప్రజలకే కాదు.. ఆ పార్టీ నాయకులకే తెలియవు. ఇప్పటివరకు షెడ్యూలే విడుదల చేయలేదు. మొదటిరోజు పాకాల మండలం నేండ్రగుంటలో ఒక పరామర్శ, ఆ తర్వాత కుదిరితే ఎక్కడైనా ఒక దళితవాడలో సహపంక్తి భోజనం, సాయంత్రం చంద్రగిరి మండలంలోని ఆగరాల వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులు చూచాయగా కార్యక్రమాలు గురించి మాట్లాడుకుంటున్నా ఇంతవరకు స్పష్టత లేదు. -
‘స్కిల్’ స్కామ్ మీ బాబు నిర్వాకమే
సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు ఎన్ని కట్టు కథలు చెబుతున్నా ‘స్కిల్’ కుంభకోణంలో చంద్రబాబు అవినీతి బండారాన్ని మాత్రం దాచలేకపోతున్నారు. అయ్యో.. అయ్యో మా చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయలేదు.. అదిగో జీవో.. ఇదిగో సీమెన్స్ ఒప్పందం.. అంటూ రామోజీ రోజూ పేజీలకు పేజీలు అభూతకల్పనలు ప్రచురిస్తున్నా ఈ కుంభకోణంలో అవినీతి దాగడం లేదు. సీఐడీనే కాదు.. కేంద్ర ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జీఎస్టీ విభాగాలు కూడా టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)లో అవినీతి బాగోతాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేశాయి. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా చంద్రబాబు, ఆయన ముఠా ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట నిధులు కొల్లగొట్టారని ఆధారాలతోసహా వెలికి తీశాయి. మరోవైపు అసలు ఈ ప్రాజెక్ట్ గురించే తమకు తెలియదని సీమెన్స్ కంపెనీ పదే పదే స్పష్టం చేస్తున్నా, ఏకంగా న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినా.. రామోజీరావు మాత్రం ససేమిరా అంటున్నారు. అదేమీ కుదరదు.. ‘మా ఈనాడే న్యాయస్థానం.. నేనే న్యాయమూర్తి’ అన్నట్లు తిమ్మిని బమ్మిని చేయాలని యత్నిస్తుండటం దిగజారుడు పాత్రికేయానికి నిదర్శనం. చంద్రబాబు కోసం జారేందుకు ఇక మేట్లే లేవు.. వదిలేసేందుకు ప్రమాణాలే లేవన్నట్టుగా ఈనాడు మరోసారి అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని మోసగించేందుకు యత్నించింది. అందుకే అసలు వాస్తవాలు మరోసారి.. ఒప్పందం గురించి మాకు తెలీదు: సీమెన్స్ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించి అసలు తమకు తెలియదని జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయం విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీఎస్ఎస్డీసీకి ఈ మెయిల్ ద్వారా తెలియజేయడంతోపాటు న్యాయస్థానంలో సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడం కంటే స్పష్టమైన, సాధికారికమైన సాక్ష్యం మరొకటి ఉండదు. అయినా సరే చంద్రబాబు కుదుర్చుకున్న నకిలీ ప్రాజెక్ట్ సరైందేనని నమ్మించేందుకు ఈనాడు పత్రిక పడరాని పాట్లు పడుతోంది. ఏపీ సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా స్కిల్ స్కామ్‌పై విచారణ చేస్తోంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని నిర్ధారించి, ఈ కుంభకోణంలో చంద్రబాబు ముఠా సభ్యులైన సీమెన్స్ ఇండియా ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ (ఆయన అవినీతి వ్యవహారంపై విచారించి సీమెన్స్ కంపెనీ ఆయన్ను తొలగించింది), డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్లతోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీమెన్స్ ఇండియా కంపెనీ ప్రస్తుత ఎండీ మాథ్యూ థామస్ ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం ఆధారంగానే డిజైన్‌టెక్ కంపెనీకి చెందిన రూ.32.31 కోట్ల బ్యాంకు ఖాతాలను ఈడీ అటాచ్ చేసింది. అందుకోసం జారీ చేసిన ‘ప్రొవిజనల్ ఆర్డర్ ఆఫ్ అటాచ్మెంట్’లో మాథ్యూ థామస్ వాంగ్మూలాన్ని ఈడీ సవివరంగా పేర్కొంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని.. అప్పటి సీమెన్స్ ఇండియా ఎండీగా ఉన్న సుమన్ బోస్ కుమ్మక్కు అయ్యారని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ ఆయన చెప్పిన విషయాలను వెల్లడించకుండా.. చంద్రబాబుకు అనుకూలంగా వక్రీకరిస్తూ ఈనాడు ప్రజలను మోసగించేందుకు యత్నించింది. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ అంతా సవ్యంగానే సాగిందని అవాస్తవాన్ని ప్రచురించింది. టీడీపీ ప్రభుత్వం తమ కంపెనీ పేరిట కుదర్చుకున్న ఒప్పందం నకిలీదని, తమకు అసలు ఆ ఒప్పందం గురించి తెలియదని మాథ్యూ థామస్ స్పష్టం చేశారు. కాదు.. కాదు.. అది అసలైన ఒప్పందమే అని నమ్మించేందుకు ఈనాడు తనకు అలవాటైన రీతిలో దిగజారుడు పాత్రికేయాన్ని మరోసారి ప్రదర్శించింది. అది నకిలీ ఒప్పందం ఓ హోల్‌సేలర్‌కు, డిస్ట్రిబ్యూటర్‌కు ఉన్న వ్యాపార లావాదేవీని ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ ఒప్పందంగా భ్రమింపజేసేందుకు ఈనాడు పడరాని పాట్లు పడింది. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఈ కుంభకోణం సూత్రధారి చంద్రబాబు పన్నిన పన్నాగంలో పాత్రధారైన సుమన్ బోస్ అందుకోసం తీసుకువచ్చిన డిస్ట్రిబ్యూటరే డిజైన్‌టెక్ కంపెనీ. అందుకే ఈ కేసులో సుమన్బోస్తోపాటు డిజైన్‌టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్‌ను సీఐడీతోపాటు ఈడీ కూడా అరెస్ట్ చేసింది. ఈ కేసులో వారిద్దరినీ అరెస్ట్ చేశారన్న వాస్తవాన్ని ఈనాడు తన వార్తా కథనంలో ఎక్కడా ప్రస్తావించ లేదు. అటువంటి సుమన్‌బోస్, వికాస్ కన్వేల్కర్ సృష్టించిన నకిలీ ఒప్పందాన్ని అసలైన ఒప్పందంగా నమ్మించేందుకు ఈనాడు కుయుక్తి పన్నడం విస్మయ పరుస్తోంది. ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ విధానమే లేదు అసలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఆర్థిక సహాయం) అన్న విధానమే సీమెన్స్ కంపెనీ ఏనాడూ అనుసరించలేదని కూడా మాథ్యూ థామస్ స్పష్టం చేశారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి సంస్థలకు కూడా గ్రాంట్ ఇన్ఎయిడ్ ఏనాడూ ఇవ్వలేదన్నారు. కానీ తమ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కై గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుందని నకిలీ ఒప్పందం సృష్టించారని చెప్పారు. అంటే టెండర్ల ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా నిధులు కొల్లగొట్టేందుకే చంద్రబాబు ముఠా ఈ కుతంత్రానికి పాల్పడింది. ఇక ఈ ప్రాజెక్ట్ కింద బిల్లుల చెల్లింపునకు సమర్పించిన ఇన్వాయిస్లు కూడా తమ కంపెనీవి కావని, అవి నకిలీవని మాథ్యూ థామస్ స్పష్టం చేశారు. సీమెన్స్ కంపెనీ సహజంగా అనురించే పద్ధతుల్లో ఇన్వాయిస్లు లేవని, సాఫ్ట్వేర్ వారీగా, హార్డ్‌వేర్ వారీగా రేటు ఎంత.. ఎంత డిస్కౌంట్ ఇచ్చారు.. అనే విషయాలే లేవన్నారు. అంటే సీమెన్స్ కంపెనీ పేరిట సృష్టించినవి నకిలీ ఇన్వాయిస్లేనన్నది స్పష్టమైందన్నారు. ఆయన చెప్పిన అంశాలను ఈనాడు ప్రచురించకుండా చంద్రబాబు అవినీతికి ముసుగు వేసేలా వక్రీకరించి తన క్షుద్ర పాత్రికేయాన్ని ప్రదర్శించింది. ఆ షెల్ కంపెనీలతో సీమెన్స్‌కు సంబంధం లేదు నిధులు కొల్లగొట్టేందుకు ‘నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను కూడా సుమన్ బోస్ తెరపైకి తెచ్చారని మాథ్యూ థామస్ చెప్పారు. సీమెన్స్ కంపెనీ ఏనాడు ఆ కంపెనీతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించలేదని తెలిపారు. కానీ ఆ కంపెనీని వెండార్‌గా చూపించారని.. ఆ కంపెనీ ద్వారా పరికరాలు సరఫరా చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి, సుమన్ బోస్ అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. ఆ విషయం సీమెన్స్ కంపెనీ అంతర్గత విచారణలో కూడా వెల్లడైందన్నారు. నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతోపాటు టాలెంట్ ఎడ్జ్, అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏసియా లిమిటెడ్, స్కిలర్ ఎంటర్ ప్రైజస్, డిజైన్ టెక్ కంపెనీలకు చెందిన యాజమానులతో సుమన్‌బోస్ కుమ్మక్కయ్యారని తమ విచారణలో నిగ్గు తేలిందని మాథ్యూ థామస్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సుమన్‌బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారని తాము గుర్తించామన్నారు. నిధులు అక్రమంగా మళ్లింపులో సాధనంగా వ్యవహరించిన ఫిష్ హాస్పిటాలిటీ, యాక్సన్ స్మార్ట్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యాక్స్ స్మార్ట్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, గోఫార్ అడ్వైర్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, అప్టస్ హెల్త్‌కేర్ లిమిటెడ్, బెన్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో సీమెన్స్ కంపెనీ ఏనాడూ ఎలాంటి లావాదేవీలను నిర్వహించలేదని మాథ్యూ థామస్ స్పష్టం చేశారు. సుమన్ బోస్ తన స్వార్థం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని విచారణలో ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యిందన్నారు. కానీ ఈనాడు పత్రిక ఆ విషయాలను ఎక్కడా ప్రచురించకపోవడం రామోజీరావు కుట్రపూరిత వైఖరికి నిదర్శనం. సీఐటీడీ మదింపే లేదు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తమ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి రిమాండ్ ఖైదీగా ఉండటంతో టీడీపీకి దిక్కుతోచడం లేదు. అందుకే కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ఆ పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. సీఐటీడీ మదింపు నివేదిక ఇచ్చిందంటూ అవాస్తవాలు ప్రచారంలోకి తెస్తున్నారు. టీడీపీ నేతలు, పచ్చ మీడియా లేవనెత్తిన రెండు ప్రశ్నలకు ప్రభుత్వం దీటుగా సమాధానం ఇచ్చింది. ప్రశ్న 1: ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ సీఐడీటీ కన్నా, ప్రైవేట్ సంస్థే ముద్దా.. సీఐడీటీ నివేదికను పరిగణనలోకి తీసుకోరా.. ఒక్కో క్లస్టర్‌కు రూ.559 కోట్లుగా సీఐటీడీ ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదు? వాస్తవం : స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కుంభకోణం కోసం చంద్రబాబు, ఆయన ముఠా సీఐటీడీ సంస్థను వాడుకున్నారు. వాస్తవంగా ఆ ప్రాజెక్ట్‌పై సీఐడీటీ ఎలాంటి మదింపు నివేదిక ఇవ్వనే లేదు. ఆ ప్రాజెక్ట్‌ను కనీసం పరిశీలించనూ లేదు. ఆ ప్రాజెక్ట్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు మంజూరు చేసిన తర్వాత ఆ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగంతో సీఐడీటీ పేరిట మదింపు నివేదికను తెరపైకి తెచ్చారు. ఈ అంశంలో అసలు వాస్తవాలను సీఐటీడీ సంస్థే వెల్లడించింది. ‘టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ అధికారులు, డిజైన్ టెక్ ప్రతినిధులు 2015 డిసెంబర్ 18న ఓ ప్రాజెక్ట్ నివేదిక కాపీని తీసుకువచ్చి సీఐటీడీ సంస్థను పరిశీలించమని కోరారు. ఆ కాగితాలను చూసి తాము అంచనా నివేదిక ఇచ్చాం. తాము ఇచ్చింది మదింపు నివేదిక కాదు.. కేవలం పరిశీలన పత్రమే. అంతేగానీ అసలు ఆ ప్రాజెక్ట్ వాస్తవంగా ఉందా లేదా అన్నది మేము క్షేత్ర స్థాయిలో పరిశీలించలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి సాఫ్ట్వేర్, పరికరాలు, మౌలిక వసతుల విలువను అంచనా వేసి నివేదిక ఇస్తే అది మదింపు నివేదిక అవుతుంది. కానీ మేము ఇటువంటి మదింపు నివేదిక ఇవ్వలేదు. మా పేరుతో ప్రచారంలో ఉన్న మదింపు నివేదికతో మాకు సంబంధం లేదు’ అని తేల్చి చెప్పింది. కేవలం ప్రతిపాదనలు చూసి నివేదిక ఇవ్వడం అంటే ‘డీపీఆర్’ ఇవ్వడం లాంటిదే. ఇక వారి వద్దకు పత్రాలు తీసుకువచ్చే నాటికే అంటే 2015 డిసెంబర్ 18కే ఆ ప్రాజెక్ట్ వ్యయంలో ప్రభుత్వ వాటా 10 శాతం అంటే రూ.337 కోట్లను డిజైన్‌టెక్ కంపెనీకి ప్రభుత్వం చెల్లించేసిందని కూడా సీఐడీటీ తెలిపింది. కాబట్టి తమ నివేదిక ఆధారంగానే నిధులు చెల్లించారన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. మరి అది నిబంధనలకు విరుద్ధమే కదా రామోజీ? ప్రశ్న 2: 2.13 లక్షల మంది సీమెన్స్ ప్రాజెక్టు ద్వారా శిక్షణ పొందారు.. 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి.. వాస్తవం : అసలు సీమెన్స్ కంపెని తమకు ఆ ఒప్పందమే తెలియదు.. ఆ ప్రాజెక్ట్ గురించే తెలీదు అని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం నిధులను సమకూర్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే విధానమే తమ వద్ద లేదని కూడా కుండబద్దలు కొట్టింది. తమ అంతర్గత విచారణలో కూడా ఆ అంశం నిర్ధారణ అయ్యిందని చెప్పింది. ఈ మేరకు న్యాయస్థానంలో సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చింది. ఇలాంటి సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూర్చేందుకు ఒప్పదం చేసుకున్నామని టీడీపీ చెబుతుండటం పూర్తిగా అవాస్తవం. ఆ ప్రాజెక్ట్ అన్నదే లేనప్పుడు.. 2 లక్షల మందికి ఎలా శిక్షణ ఇస్తారు? ఇలా చెప్పడం ప్రజలను మోసగించడమే. ఆ ప్రాజెక్ట్ కింద శిక్షణ పొందని విద్యార్థులను శిక్షణ పొందినట్టుగా.. బీటెక్ అర్హతతో విద్యార్థులు తాము చదువుకున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ కింద ఉద్యోగాలు పొందిన వారిని ఈ ప్రాజెక్ట్ కింద ఉద్యోగాలు వచ్చినట్టుగా నమ్మించేందుకు టీడీపీ కుట్ర పన్నుతోంది. -
ప్రజాధనం లూటీ చేస్తే క్షమించి వదిలేయాలా?
సాక్షి, అమరావతి: ప్రజా ధనం లూటీ చేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడిని క్షమించి వదిలేయాలా అంటూ తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసింది చిన్న తప్పు కాదని తెలిపారు. మంత్రి బొత్స శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అధికారం ఉందని తప్పులు చేస్తే క్షమించరాని నేరమవుతుంది. ఇలాంటి తప్పులు చేసిన వారిని క్షమించి వదిలేయాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పడం విచిత్రంగా ఉంది’ అని బొత్స మండిపడ్డారు. ‘గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వ చర్యలు, న్యాయస్థానం తీర్పు ప్రజలకు తెలిసిన విషయమే. చంద్రబాబు ఒప్పందం రద్దు చేసుకున్న సీమెన్స్ కంపెనీ పేరుతో ఎలాంటి బిల్లులు లేకుండా రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. సీమెన్స్‌తో ఎప్పుడు ఒప్పందం చేసుకున్నారో, ఏయే తేదీల్లో డబ్బులు ఆ కంపెనీకి చెల్లించారో చంద్రబాబు చెప్పడంలేదు. ఇంత మొత్తం డబ్బును ఏ కంపెనీలకు చెల్లించారో కూడా వెల్లడించడంలేదు. ఇలాంటి అవినీతిపరుడికి తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం వత్తాసు పలకడం శోచనీయం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఉద్దేశపూర్వంగా అక్రమాలు చేస్తే చూసీ చూడనట్టు వదిలేయాలనడం దారుణం. ఇలాంటి తప్పు తెలంగాణలో జరిగితే అక్కడి సీఎం కేసీఆర్ చూసీచూడనట్టు వదిలేస్తారా’ అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి కేసులో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, ఆధారాలతో సహా నిరూపిస్తామని అన్నారు. చంద్రబాబు ఇలాంటి తప్పులు ఎన్నో చేశారని చెప్పారు. ఆ పత్రికలు సొంత భాష్యం చెబుతున్నాయి ప్రభుత్వంలో ప్రతి ఫైల్‌కు, ప్రతి సంతకానికి ఎంతో విలువ ఉంటుందని, కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ప్రొసీడింగ్స్‌కు, రూల్స్‌కు విరుద్ధంగా సంతకాలు చేసి ప్రజాధనం దారిమళ్లించారని చెప్పారు. సాక్ష్యాత్తు ఈడీ, ఇన్‌కంట్యాక్స్ విభాగాలు దీనిని తేల్చి చెప్పాయన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అసత్యాలు రాస్తున్నాయన్నారు. చంద్రబాబు ఫైళ్లపై చేసిన సంతకాలు, కంపెనీ పేర్లు లేకుండా నిధులు విడుదల చేసిన ఆదేశాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఓ వర్గం మీడియా మాత్రం బాబును భుజానకెత్తుకుని చట్టాలకు, రూల్స్‌కు అతీతంగా సొంత భాష్యం చెప్పడం విచారకరమన్నారు. నిధుల మళ్లింపు రూల్స్ విరుద్ధంగా చేశారా లేదా అని చంద్రబాబునే అడిగితే సమాధానం వస్తుందన్నారు. రూల్స్ పాటించే చేశానని చెప్పే ధైర్యం ఆయన చేయరని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు గత ప్రభుత్వంలో ఎలా పనిచేశాయి, ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా పరిశీలించి చెప్పాలని ఆయన అన్నారు. అక్రమార్కుడు చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ మద్దతెలా ఇస్తారు? ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పెంటపాడు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మద్దతివ్వడంపై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన శనివారం పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడులో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తెలంగాణ స్పీకర్ శ్రీనివాసరెడ్డి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబుకు మద్దతివ్వడం శోచనీయమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడవచ్చు కానీ, వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదని తెలిపారు. స్కిల్ కుంభకోణంలో పాత్ర ఉన్న వారందరినీ నిందితులుగా చేర్చే విషయం సీఐడీ చూసుకుంటుందన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు పాత్ర లేదని ఎలా చెబుతారని ప్రశి్నంచారు. -
స్కిల్ స్కాం: అంతా చంద్రబాబు కనికట్టు
సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ పేరుతో డబ్బులు కొట్టేయడానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. స్కిల్ సెంటర్స్ పేరుతో డొల్ల కంపెనీల ద్వారా డబ్బు ఎలా తరలించాలో ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాతే ఏపీఎస్ఎస్డీసీని తెరపైకి తెచ్చి.. సీమెన్స్ ముసుగులో ఒప్పందం చేసుకున్నారు. ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్లు దొంగ ఇన్వాయిస్లను సృష్టించి రూ.241 కోట్లు కాజేశారు. ఈ బాగోతమంతా ఎన్ఫోర్స్మెంట్, జీఎస్టీ ఇంటిలిజెన్స్, సెబీ, ఫోరెన్సిక్ ఆడిట్స్‌లో పక్కా ఆధారాలతో బయటపడింది. ఇందుకోసం అప్పటికప్పుడు కొన్ని షెల్ కంపెనీలను పుట్టించగా, హవాలా మార్గంలో నగదును సరఫరా చేసే కొన్ని షెల్ కంపెనీలను ఎంచుకున్నారు. మొత్తం ఈ కుంభకోణంలో సీమెన్స్ ముసుగులో డిజైన్‌టెక్ కీలకంగా వ్యవహరించింది. డిజైన్ టెక్ నుంచి రెండు షెల్ కంపెనీలకు మొత్తం నగదును పంపించి, అక్కడ నుంచి అనేక షెల్ కంపెనీల ద్వారా తిరిగి ఆ నగదు చంద్రబాబు సూచించిన వ్యక్తులకు చేరినట్లు దర్యాప్తులో షెల్ కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. రూ.లక్షతో రూ.241 కోట్లు నగదును తరలించడం కోసం స్కిలర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్ట్‌గా పిలిచేవారు) పేరుతో ఒక డొల్ల కంపెనీని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే 2015 మార్చి30న స్కిలర్ కంపెనీని ఏర్పాటు చేసినట్లు రిజాస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) డేటా స్పష్టం చేస్తోంది. న్యూఢిల్లీ కేంద్రంగా ప్రతిక్ రమన్భాయ్ పటేల్, అబ్దుల్ రఫుల్ హాయ్ కేవలం లక్ష రూపాయల మూల ధనంతో స్కిలర్ ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఎటువంటి అనుభవం లేని ఈ కంపెనీకి ఏకంగా రూ.241.49 కోట్ల విలువైన హార్డ్‌వేర్ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును అప్పగించారు. 717 దొంగ ఇన్వాయిస్లను సృష్టించి వాటి ద్వారా డబ్బులు కొట్టేశారు. స్కిలర్ కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కిల్ ల్యాబ్స్‌కు రూ.241.49 కోట్ల విలువైన హార్డ్‌వేర్ పరికరాలను సరఫరా చేసి డబ్బులు తీసుకున్నట్లు దొంగ రికార్డులు సృష్టించారు. కానీ ఆ వివరాలను ఎక్కడా ఆ కంపెనీ అకౌంట్స్‌లో చూపించలేదు. 2016–17 సంవత్సరానికి స్కిలర్ కంపెనీ ఆర్వోసీకి సమర్పించిన ఆర్థిక స్టేట్మెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆ సంవత్సరంలో కేవలం రూ.99.03 కోట్ల విలువైన పరికరాలు మాత్రమే సరఫరా చేసినట్లు దొంగ లెక్కలు చూపించారు. వాస్తవానికి ఒక్క రూపాయి విలువైన పరికరాలు కూడా సరఫరా చేయలేదు. స్కిల్ కుంభకోణంపై సీఐడీ విచారణ ప్రారంభించిన తర్వాత స్కిలర్ తన దుకాణం మూసేసినట్లు ఆర్వోసీ రికార్డులు సూచిస్తున్నాయి. 2021లో చివరిసారిగా బ్యాలెన్స్ షీట్లు సమర్పించిన స్కిలర్ గత రెండేళ్ల నుంచి ఎటువంటి సమాచారాన్ని ఆర్వోసీకి ఇవ్వడం లేదు. డబ్బులు వచ్చాక దుకాణం బంద్ స్కిలర్ చేతికి వచ్చిన రూ.241.49 కోట్లను పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనేక డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబు గూటికి తరలించేశారు. ఈ కంపెనీలు కేవలం స్కిల్ కుంభకోణం సమయంలో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాయని, ఆ తర్వాత పని చేయలేదని రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రూ.లక్ష మూలధనంతో 2012లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల కంపెనీని 2016లో నగదు తరలించిన తర్వాత మూసేశారు. 2016లో చివరిసారిగా బ్యాలెన్స్ షీట్ సమర్పించిన ఈ కంపెనీ ఆ తర్వాత నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ప్రస్తుతం ఇది మూతపడిన కంపెనీగా ఆర్వోసీ రికార్డుల్లో పేర్కొన్నారు. మరో డొల్ల కంపెనీ పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా న్యూఢిల్లీ కేంద్రంగా రూ.లక్షతో మొదలైంది. స్కిల్ కుంభకోణం నిధుల తరలింపు పూర్తయిన తర్వాత 2018లో ఈ కంపెనీ మూతపడింది. 2018 తర్వాత ఈ కంపెనీ ఎటువంటి బ్యాలెన్స్ షీట్లను సమర్పించలేదని, ప్రస్తుతం ఈ కంపెనీ మూసివేసిన కంపెనీగా ఆర్వోసీ రికార్డుల్లో చూపిస్తోంది. రూ.లక్షతో న్యూఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్ 2018 డిసెంబర్ 10 తర్వాత నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని ఆర్వోసీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ డొల్ల కంపెనీలన్నీ నగదు తరలించాక కనుమరుగయ్యాయని స్పష్టమవుతోంది. ఇలా దొంగ ఇన్వాయిస్లతో నగదును తరలించడమే కాకుండా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కోరుతూ దరఖాస్తు చేయడంతో పూణేలోని జీఎస్టీ ఇంటిలిజెన్స్ రంగంలోకి దిగి తీగ లాగితే మొత్తం డొంకంతా బయట పడింది. హవాలా నగదు తరలింపులో ఏసీఐ దిట్ట అల్లైయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఆసియా) లిమిటెడ్ (ఏసీఐ) నకిలీ ఇన్వాయిస్లతో నగదును తరలించడంలో దిట్ట. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన ఈ కంపెనీకి ఈ విషయంలో పెద్ద రికార్డే ఉంది. 2013–14 నుంచి 2019–20 వరకు ఈ కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌ను పరిశీలిస్తే స్కిల్ కుభంకోణం సమయంలో ఏసీఐ ద్వారా ఎంత నగదు తరలించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కుంభకోణం ముందు, తర్వాత ఏడాదికి రూ.లక్షల్లో మాత్రమే ఆదాయాన్ని చూపిన ఈ కంపెనీ.. కుంభకోణం సమయంలో రూ. కోట్లల్లో ఆదాయం చూపించడం గమనార్హం. ఒప్పందం కుదిరిన మొదటి సంవత్సరం అంటే 2015–16లో రూ.30.52 కోట్లు, 2016–17లో రూ.35.77 కోట్లు, 2018–19లో రూ.9.77 కోట్లు ఆదాయాన్ని చూపించిన ఈ కంపెనీ 2019–20కి వచ్చే సరికి కేవలం రూ.2 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపించింది. ఈ కంపెనీ లావాదేవీలపై అనుమానం వచ్చిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 2017లో రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా సెబీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ వారికి సమాచారమిస్తే వారు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ సందర్భంగా కంపెనీకి, కంపెనీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేయగా, వారు నిజాలను ఒప్పేసుకున్నారు. ఎటువంటి వస్తువులు సరఫరా చేయకుండానే చేసినట్లు ఇన్వాయిస్లు సృష్టించి డిజైన్ టెక్ నుంచి నగదును తీసుకొని వాటిని వివిధ రూపాల్లో తిరిగి వారికే ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు ఏసీఐ ఎండీ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పేరుతో రూ.241 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా కొట్టేస్తూ సాక్ష్యాలతో బటయపడినా టీడీపీ మీడియా మా బాబు నిప్పు అంటూ అడ్డుగోలుగా వాదనలు చేయడం వారికే చెల్లింది. -
సుమన్ బోస్‌కు ఏ అధికారమూ లేదు: సీమెన్స్
స్కిల్ డెవలప్మెంట్ కేసు నిరాధారమైందని, ఈ ప్రాజెక్టు నూరుశాతం విజయవంతమైందని.. దీనిలో ఏమాత్రం అవినీతి జరగలేదని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ తాజాగా మీడియా ముందుకొచ్చారు. పైగా యువత జీవితాన్ని దారుణంగా దెబ్బతీసే విధంగా సీమెన్స్, స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టులపై ఏపీ సీఐడీ నిరాధార ఆరోపణలు చేస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ వ్యవహారంపై సీమెన్స్ కంపెనీనే స్వయంగా స్పందించింది. సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని మరోమారు స్పష్టత ఇచ్చింది. ప్రశ్న: జీవోలో పేర్కొన్నట్టుగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్ నెలకొల్పడానికి అంగీకరించారా? మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో ప్రభుత్వం వాటా 10 శాతంగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సీమెన్స్ 90శాతం వాటా సమకూర్చేందుకు సమ్మతించిందా? గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అటువంటి ప్రాజెక్ట్‌లు చేపట్టే విధానం సీమెన్స్ కంపెనీలో ఉందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్ కంపెనీలో లేనే లేదు. డిజైన్ టెక్ కంపెనీతో కలసి మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. అలాంటి ఒప్పందం గురించి మాకు అసలు తెలీదు. ప్రశ్న: ఏపీలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఏమైనా వర్క్ ఆర్డర్ మీకు వచ్చిందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్ ఆర్డర్ రాలేదు. ప్రశ్న: ఏపీఎస్ఎస్డీసీ, డిజైన్‌టెక్‌తో కలిసి సీమెన్స్ కంపెనీ పేరున కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంపై సీమెన్స్ కంపెనీ తరపున అని చెబుతూ సుమన్ బోస్ సంతకాలు చేశారు. సీమెన్స్ కంపెనీలో ఆయన హోదా ఏమిటి? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? సుమన్‌బోస్ తాజా ప్రెస్ మీట్లో.. సీమెన్స్ కంపెనీ సమాధానం: సీమెన్స్ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు. కంపెనీ ఆ అధికారాన్ని ఆయనకు ఎప్పుడూ ఇవ్వ లేదు. సుమన్ బోస్ మా కంపెనీకి ఎప్పుడో రాజీనామా చేశారు. ఆయనకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా మాకు సమాచారం లేదు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట అవినీతి కేసులో సుమన్ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు సీమెన్స్ కంపెనీ ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన సమాధానాలు ఇవి.. ఇదీ చదవండి: బాబుకు తోడు దొంగల వత్తాసు -
అబద్ధాలు ఆపండి.. అసలు నిజాలివీ
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచ్చీలుడని చెప్పేందుకు ఎల్లో మీడియా నానాపాట్లు పడుతోంది. ఇందుకోసం నిత్యం టన్నుల కొద్దీ అసత్య కథనాలు, అభూత కల్పనలను వండివారుస్తూ పాఠకుల మెదళ్లను కలుషితం చేస్తోంది. రాజకీయ కక్ష్యతోనే అరెస్టులు జరిగాయని, సీమెన్స్‌తో ఒప్పందం జరిగిందని, ఇందుకోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టింది నిజమని నమ్మించేందుకు తెగ ప్రయాసపడుతోంది. ఈ కుంభకోణానికి చంద్రబాబుకు ఏమిటి సంబంధం?.. ఆయన ఎక్కడైనా సంతకం చేశారా? ఈ ల్యాబ్‌లు పరికరాలు అన్నీ ఉత్తివేనా అంటూ శుద్ధపూసలా ప్రశ్నిస్తూ తమ బాబు అమాయకుడంటూ ప్రజలను నమ్మించేలా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్, ఈనాడు చేస్తున్న ఆరోపణలు, వాదనల్లోని నిజాలు ఏమిటంటే.. ఆరోపణ: రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబును జైలుకు పంపించారు.. వాస్తవం: చంద్రబాబును జైలుకు పంపింది ప్రభుత్వం కాదు.. కోర్టు. చంద్రబాబు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా కోర్టు విశ్వసించింది. అలాగే, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ఎదుర్కొంటున్న అభియోగాల మీద కోర్టులో సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టుపై దాదాపు 10 గంటలసేపు వాదోపవాదాలు జరిగాయి. చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చి వాదించారు. వారి వాదనలకు గౌరవ న్యాయస్థానం సంతృప్తికర స్థాయిలో సమయం ఇచ్చింది. ఇంతటి న్యాయ ప్రక్రియ తర్వాతే కోర్టు చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని జైలుకు తరలించాల్సి వచ్చింది. ఇందులో రాజకీయ కక్షకు, ప్రతీకారానికి ఆస్కారం ఎక్కడ? పైగా కక్ష ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అరెస్టు చేసేది. నాలుగేళ్లపాటు సుదీర్ఘ విచారణలో చంద్రబాబు ప్రమేయంపై ఆధారాలను కోర్టుకు సమర్పించాకే ఆయనకు రిమాండ్ విధించారు. ఆరోపణ: రూ.371 కోట్లు ఖర్చుచేశారు కదా? పరికరాలు ఏర్పాటుచేశారు కదా? ఇకఅవినీతి ఆరోపణలకు ఆస్కారం ఎక్కడుంది? వాస్తవం: ఎలాంటి టెండర్లు లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని డిజైన్‌టెక్ కంపెనీకి అప్పనంగా ఐదు విడతల్లో రూ.371 కోట్లు విడుదల చేశారు. ఇందులో రూ.241 కోట్లను హవాలా మార్గంలో తరలించారు. ఆ డబ్బు తిరిగి చంద్రబాబు మనుషులకే చేరిందని ఐటీ, ఈడీ విచారణలో తేలింది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పాత్రపైనా ఆధారాలు ఉండడంతో ఐటీ శాఖ నోటీసులిచ్చింది. అందుకే డిజైన్‌టెక్, షెల్ కంపెనీల వ్యవహారాలపై జీఎస్టీ, ఈడీ అధికారులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సమాచారమిచ్చినా చంద్రబాబు మౌనం దాల్చడం, చంద్రబాబే సూత్రధారి అనేందుకు నిదర్శనం. ఆరోపణ: ఏపీతో ఒప్పందానికి సీమెన్స్ ఆసక్తి అంటూ ప్రచారం. గతంలో డిజైన్‌టెక్‌కు పంపిన ఈ–మెయిల్స్‌లో సీమెన్స్ వైస్ ప్రెసిడెంట్ పెట్ క్యారియర్ వెల్లడి అంటూ ఈనాడు రాతలు.. వాస్తవం: తమకు తెలియకుండానే భారత్‌లో తమ కంపెనీ ప్రతినిధి కొందరితో కుమ్మక్కై ఈ ప్రాజెక్టును చేపట్టారని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018లో సీమెన్స్ సంస్థ తన ఇంటర్నల్ ఆడిట్ రిపోర్టులో తేల్చిచెప్పింది. సీమెన్స్ విచారణాధికారులు మూస్మా యెర్ క్లాస్, ఎస్. రాబర్ట్ ఈ నివేదిక ఇచ్చారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వలేదని కూడా విచారణాధికారికి స్పష్టంచేశారు. అలాగే, సీమెన్స్ ఇంటర్నల్ ఆడిట్ చేస్తున్న సమయంలోనే ప్రభుత్వానికి ఈ స్కాంపై ఓ సామాజిక కార్యకర్త సమాచారమిస్తే దాన్ని పక్కనపెట్టేశారు. ఇదంతా దురుద్దేశపూరితం కాదా? ఆరోపణ: ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు సంతకాలు ఎక్కడైనా పెట్టారా? పెడితే చూపించండి అంటూ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో లోకేశ్ సవాల్.. వాస్తవం: ఒకచోట కాదు.. మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టారు. రూ.371 కోట్ల విడుదల దగ్గర నుంచి ప్రతిచోటా కూడా సంతకాలు పెట్టారు. ఉదా.. ఆర్థిక శాఖ ఫైలులోని ఎనెగ్జర్–1 పేజి నంబర్ ౖ42లో చంద్రబాబు సంతకం చేశారు. సాధారణ పరిపాలన శాఖ ఎనెగ్జర్ పేజ్ నంబర్–15లో గంటా సుబ్బారావును స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ కార్యదర్శిగా నియమిస్తూ సంతకం చేశారు. సాధారణ పరిపాలన శాఖ ఎనెగ్జర్–1, పేజి–11లో డిప్యూటీ సీఈఓగా అపర్ణను నియమించారు. సీమెన్స్ స్కాంలో కీలకంగా వ్యవహరించిన జీవీఎస్ భాస్కర్ భార్యే అపర్ణ. ఆరోపణ: పరికరాలు, ఫలితాలు అన్నీ అబద్ధాలేనా అన్న లోకేశ్.. వాస్తవం: రూ.371 కోట్లలో రూ.241 కోట్లు తినేసి, మిగతా డబ్బుతో మమ అనిపించేసి, వీటికి రూ.3,300 కోట్లు ఖర్చుచేశారంటే నమ్మాలా? అందులోనూ తప్పుడు బిల్లులు, రశీదులు ఉన్నాయి. వాడిన సాఫ్ట్వేర్ విలువకు నిర్ధారణే లేదు. వాటి విలువను నిర్ధారించే సామర్థ్యం తమకులేదని సీఐటీడీ విచారణలో చెప్పింది కూడా. మరి పరికరాలున్నాయి? ఫలితాలు వచ్చేశాయి? అని మాయమాటలు చెప్పడం దేనికి? ఆరోపణ: 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం.. ఇందులో 80 వేల మందికి ఉద్యోగాలిచ్చామంటూ లోకేశ్, ఈనాడు బాకా.. వాస్తవం: లక్షల మందికి శిక్షణ ఇచ్చామంటూ ఈనాడు, లోకేశ్, టీడీపీ చెప్తున్న మాటల్లో అంతా డొల్లతనమే. విహార యాత్ర పేరుతో బీసీ వెల్ఫేర్ స్కూళ్ల విద్యార్థులను తరలించి, వారికి శిక్షణ ఇచ్చామని చెప్పుకున్నారు. శిక్షణ ఇచ్చామన్న వారిలో 70,000 మంది స్కూల్ పిల్లలున్నారు. శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు తయారుచేసి నిధులు స్వాహా చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.200 ఇచ్చినట్లు సంతకాలు పెట్టించారు. ఆరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల్లో సగానికి పైగా ల్యాబ్‌లు ఏర్పాటుకాలేదు. దీన్నిబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎంత బూటకమో అర్థమవుతోంది. ఆరోపణ: ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ సీఐటీడీ కన్నా ప్రైవేటు సంస్థే ముద్దా? అంటూ ఈనాడు కథనం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మదింపులో సీఐటీడీ నివేదికను పరిగణలోకి తీసుకోరా? ఒక్కో క్లస్టర్‌కు రూ.559 కోట్లుగా సీఐటీడీ నివేదికను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఈనాడు ప్రశ్నలు.. వాస్తవం: ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టుపై తాము ఇండిపెండెంట్ మదింపు చేయలేదని సీఐటీడీ స్పష్టంచేసింది. ఒక్కో కోర్సుకు, ఒక్కో స్టూడెంటుకు ఎంత ఖర్చవుతుందో సీమెన్స్ చెప్పిన వివరాల ఆధారంగా యథాతథంగా సంతకం చేశామని విచారణలో స్పష్టంచేసింది. సాఫ్ట్వేర్ విలువను మదింపు చేసే సామర్థ్యం తమకులేదని కూడా చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ క్లస్టర్లను స్వయంగా పరిశీలించి అక్కడి సాఫ్ట్వేర్, మౌలిక వసతులను పరిశీలించి ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని.. కానీ, తమను ఆ విధంగా మదింపు నివేదిక ఇవ్వాలని ఏపీఎస్ఎస్డీసీ కోరనేలేదని సీఐటీడీ విచారణలో వెల్లడించింది. మదింపు నివేదిక ఇవ్వాలంటూ సీఐడీటీని ఏపీఎస్ఎస్డీసీ అధికారులు, డిజైన్ టెక్ ప్రతినిధులు 2015 డిసెంబర్ 5న కోరగా 2016 మార్చి 22న నివేదిక ఇచ్చింది. కానీ, ఆ నివేదికతో నిమిత్తం లేకుండానే, అంతకంటే ముందే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు 2015 డిసెంబర్ 5న రూ.185 కోట్లు, 2016 జనవరి 29న రూ.85 కోట్లు, మార్చి 11న రూ.67 కోట్లు విడుదల చేశారు. ఈ విధంగా రూ.337 కోట్లు డిజైన్‌టెక్ కంపెనీకి అప్పనంగా ఇచ్చేశారు. చివరగా.. 2016 మార్చి 31న మిగిలిన రూ.34 కోట్లు కూడా విడుదల చేశారు. ఇలా డబ్బులన్నీ ఇచ్చేశాక మదింపు నివేదిక కోరడం ఏమిటి? కోరిన రోజే రూ.185 కోట్లు విడుదల చేయడం ఏంటి? ఇదంతా నిబంధనలకు విరుద్ధం కాదా? ఆరోపణ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లాంటిదే గుజరాత్‌లోనూ, తమిళనాడులోనూ కూడా చేశారు కదా? అక్కడలేని తప్పు ఇక్కడేముంది? వాస్తవం: ఏపీలో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.546.84 కోట్లు, ఇందులో ప్రభుత్వ వాటా రూ.55 కోట్లు. టెక్ కంపెనీల నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండానే రూ.371 కోట్లు విడుదల చేశారు. అదే గుజరాత్లో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.17.1 కోట్లు, ప్రభుత్వ వాటాగా సుమారు రూ.188 కోట్లు విడుదల చేశారు. తమిళనాడులో ఒకే ఒక్క యూనివర్సిటీలో మాత్రమే చేశారు. ఆరోపణ: సీమెన్స్ ప్రాజెక్టు నిజం.. సాఫ్ట్వేర్ హార్డ్‌వేర్ ఇచ్చింది వాస్తవం.. ఆరు క్లస్టర్లకు వాటా విలువ రూ.3,356 కోట్లపైనే. ఒక్కో క్లస్టర్లో పరికరాల విలువ రూ.559 కోట్లు.. అయినా నిధులు మళ్లించారంటూ అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.. వాస్తవం: సీమెన్స్ ప్రాజెక్టు పక్కా అబద్ధం. అసలు ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదని సీమెన్స్ తన ఇంటర్నల్ రిపోర్టులోనూ, విచారణాధికారితోనూ స్పష్టంచేసింది. రూ. 3,300 కోట్ల ప్రాజెక్టు అని, 90% సీమెన్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా, 10% ఏపీ ప్రభుత్వం ఇస్తుందని జీఓలో రాశారు. కానీ, దీనికి భిన్నంగా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే వాటాను ఆర్థిక సహాయంగా పేర్కొన్నారు. ఒప్పందంలో ఎక్కడా కూడా ఏ లెటర్ ఆధారంగా చేస్తున్నారో, తేదీ ఏంటో కూడా పేర్కొనలేదు. ఒప్పందంలో భాగస్వాములైన సీమెన్స్, డిజైన్‌టెక్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తంచేసినా, నిబంధనలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు నిధులు విడుదల చేశారు. అంతేకాక.. తాను ఎంపిక చేసుకున్న గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తికి కీలక హోదాలను కట్టబెట్టారు. పరికరాల కొనుగోలు కోసం రూ.58 కోట్లు తప్ప ఒక్క రూపాయి కూడా అందలేదని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్న స్కీమే తమ వద్దలేదని సీమెన్స్ సంస్థ స్పష్టంచేసింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిలో ఏ రాష్ట్రంలో కూడా తాము ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని చెప్పింది. అలాంటప్పుడు సీమెన్స్ ప్రస్తావన ఎందుకొస్తుంది? -
‘స్కిల్’ కుంభకోణం కుట్రదారు చంద్రబాబే
సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం ప్రధాన కుట్రదారుడు చంద్రబాబు నాయుడే. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మోసపూరితంగా వ్యవహరించారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల వరకు ఆయనే సర్వం తానై వ్యవహరించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లలో ఏ–1 చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు. ఏ–2 అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతకాలు అయిదు చోట్ల ఉన్నాయి’ అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫక్కీరప్పతో కలసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించిగానీ ఒప్పందం గురించిగానీ తమకు తెలియదని సీమెన్స్ కంపెనీయే ఈ మెయిల్ ద్వారా న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలం ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా మళ్లించిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబుకే చేరాయన్నారు. సీఐడీతోపాటు సమాంతరంగా దర్యాప్తు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు కొల్లగొట్టారని నిర్ధారించిందని చెప్పారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించి.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందాకే ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సీఐడి అదనపు డీజీ సంజయ్ ఇంకా ఏం చెప్పారంటే.. కుంభకోణం సూత్రధారి చంద్రబాబే ♦ కేబినెట్ ఆమోదం లేకుండానే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ పేరిట ప్రజాధనం కేటాయింపు అంతా గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు. అందుకోసం ఆయనకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–ఈసీవోగా మొదట నియమించి, అనంతరం ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి పోస్టుతోపాటు ఏకంగా సీఎం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా కూడా నియమించారు. ♦ డిప్యూటీ సీఈవోగా అపర్ణను నియమించారు. ఆమె భర్త సీమెన్స్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇది పరస్పర ప్రయోజనాల కిందకు వస్తుంది. ఇక టీడీపీకే చెందిన జె.వెంకటేశ్వర్లు అనే చార్టెడ్ అకౌంటెంట్‌కు ఏపీఎస్ఎస్డీసీలో పోస్టు కట్టబెట్టారు. ఉన్నత విద్యా శాఖను బైపాస్ చేశారు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా బడ్జెట్‌ను ఆమోదించారు. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలన్న ప్రతిపాదనను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా ఆరు చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమెన్స్ కంపెనీ పేరుతో మోసం ♦ టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్, అందుకోసం ఒప్పందం గురించి సీమెన్స్ కంపెనీకి తెలియనే తెలీదు. చంద్రబాబు కేవలం నిధులు కొల్లగొట్టడానికే ఆ కంపెనీ పేరును వాడుకుని మోసానికి పాల్పడ్డారు. జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు ఆ జీవో గురించి, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని వెల్లడించింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ చెబుతున్న రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌తో తమకు సంబంధం లేదని, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని స్పష్టం చేసింది. తాము 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇస్తామని ఎవరికీ చెప్పలేదని.. అసలు ఆ వ్యవహారంతో సీమెన్స్ కంపెనీకి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా వివరించడంతోపాటు న్యాయస్థానంలో 164సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. ♦ సీమెన్స్ కంపెనీ అంతర్గతంగా కూడా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ఏపీఎస్ఎస్డీసీ, సీఐడీలకు అందించింది. భారత్‌లో సీమెన్స్ కంపెనీ ప్రతినిధిగా ఉన్న సుమన్ బోస్ మరికొందరు నిందితులతో కలసి జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి తెలియకుండా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నిర్ధారించింది. ఈ మేరMý ు సుమన్‌బోస్, ఇతరులు డిలీట్ చేసిన ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, మెసేజ్‌లు, ఇతర డాటాను రిట్రైవ్ చేసి సీఐడీకి అందించింది. ♦ డిజైన్ టెక్ కొరితే తాము రూ.58.80 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే ఆ కంపెనీకి విక్రయించామని తెలిపింది. ఎవరైనా తమ వద్ద నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసుకోవచ్చని, అంత మాత్రాన తాము ఆ ఒప్పందంలో భాగస్వాములమైనట్టు కాదని వెల్లడించింది. రూ.3,300 కోట్లు ప్రాజెక్ట్‌గా నకిలీ ఒప్పందం ♦ సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన వాంగ్మూలంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.58 కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా చూపిస్తూ చంద్రబాబు భారీగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందుకోసమే జీవోకు విరుద్ధంగా నకిలీ ఒప్పందాన్ని తీసుకువచ్చారు. డిజైన్ టెక్ అనే కంపెనీని భాగస్వామిని చేశారు. ♦ సీమెన్స్ కంపెనీ నుంచి 90 శాతం నిధులు రావని తెలుసు. ఎందుకంటే వారికి అసలు ఒప్పందం గురించే తెలియదు. అందుకే ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను నిబంధనలకు విరుద్ధంగా డిజైన్‌టెక్ కంపెనీకి చెల్లించి.. పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి మళ్లించి.. అక్కడి నుంచి వివిధ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు దక్కించుకున్నారు. చంద్రబాబు ఒత్తిడితోనే రూ.371 కోట్లు విడుదల ♦ జీవోలో పేర్కొన్నట్టు రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ ప్రభుత్వ వాటా 10 శాతం జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్ టెక్ కంపెనీకి ఏకపక్షంగా విడుదల చేశారు. దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొన్నారు. ♦ కానీ నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయాలని అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. అదే విషయాన్ని అధికారులు నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అనంతరమే నిధులు విడుదల చేశారు. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు రూ.241 కోట్లు ♦ డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో ఆ కంపెనీ సీమెన్స్ కంపెనీ నుంచి రూ.58.80 కోట్ల సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి అందించింది. మిగిలిన రూ.311 కోట్లను డిజైన్ టెక్ కంపెనీ వివిధ షెల్ కంపెనీలకు మళ్లించింది. ♦ వాటిలో షెల్ కంపెనీలకు కమీషన్లు పోగా, మిగిలిన రూ.241 కోట్లు చంద్రబాబుకు చేర్చారు. అంటే ఈ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. గుజరాత్ మోడల్ కాదు.. ♦ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం గుజరాత్లో అమలు చేస్తున్న ప్రాజెక్ట్‌నే ఏపీలో అమలు చేశామని టీడీపీ చెబుతుండటం సరికాదు. అధికారుల బృందం గుజరాత్లో పర్యటించి అక్కడి ప్రాజెక్ట్‌ను పరిశీలించింది. కానీ అందుకు విరుద్ధంగా ఏపీలో ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ♦ 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది జీవోలో చూపించారు గానీ ఒప్పందంలో లేదు. ఇక పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుందామన్న అధికారుల ప్రతిపాదనను పట్టించుకోలేదు. కేవలం రూ.371 కోట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. నోట్ ఫైళ్లు మాయం ♦ ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు జీవోకు సంబంధించిన నోట్ ఫైళ్లు, నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాల నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ సీఐడీ వాటిని రిట్రైవ్ చేసింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్‌తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర బయటపడింది. చంద్రబాబు ముఠా ద్వారా అక్రమ నిధుల తరలింపు ♦ షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించిన నిధులు చంద్రబాబు తన ముఠా మనుషుల ద్వారా పొందారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఇందులో కీలక పాత్ర పోషించారు. ♦ డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లు వివిధ షెల్ కంపెనీల ద్వారా యోగేశ్ గుప్తాకు చేరాయి. ఆయన ఆ రూ.241 కోట్లు డ్రా చేసి నగదును మనోజ్ పార్థసానికి ముంబయిలో అందించారు. మనోజ్ పార్థసాని ఆ రూ.241 కోట్ల నగదును హైదరాబాద్ తీసుకువచ్చి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. ఆయన ఆ నగదును చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ నిధుల తరలింపులో పాత్రధారులుగా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాలే చంద్రబాబు ఇతర కుంభకోణాల్లోనూ నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల నిర్మాణం, రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులు కట్టబెట్టిన కుంభకోణంలో నిధులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. ♦ ఆ విషయం ఆదాయ పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడైంది. దాంతో ఆదాయ పన్ను శాఖ మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్‌లకు నోటీసులు జారీ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తాము అక్రమ నిధులను చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కే అందించామని మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా వాంగ్మూలంలో స్పష్టం చేశారు. షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన నిధులను వారిద్దరి నుంచి చంద్రబాబు తరఫున తాను స్వీకరించానని పెండ్యాల శ్రీనివాస్ కూడా అంగీకరిస్తూ వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఈడీ దర్యాప్తులోనూ ‘స్కిల్’ కుంభకోణం బట్టబయలు ♦ ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించిన అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించి ఇప్పటి వరకు డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ కంపెనీ భారత ప్రతినిధిగా గతంలో వ్యవహరించిన సుమన్బోస్లతోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. ♦ డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ పత్రికా ప్రకటన జారీ చేయడంతోపాటు ట్వీట్ కూడా చేసింది. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌ను ఈడీ ఈ ఏడాది మార్చి 10న అరెస్ట్ చేస్తే, మే 12 వరకు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయ్యారు. ♦ ఈ కుంభకోణంలో చంద్రబాబు భాగస్వామి అయిన ఆయన ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో అసలు అక్రమాలే జరగలేదని వీడియోలు విడుదల చేయడం విడ్డూరం. అక్రమాలు చేయకపోతే ఈడీ ఆయనపై కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపిందో సమాధానం చెప్పాలి. సీఐడీ కూడా చంద్రబాబుతోపాటు ఇప్పటికే వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌తోపాటు మొత్తం 9 మందిని అరెస్ట్ చేసింది. ♦ సీఐడీ నమోదు చేసిన కేసుపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. ఇరుపక్షాల వాదనలను పూర్తిగా ఆలకించింది. అనంతరం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందడంతోనే ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. -
స్కిల్ 100% ఫ్రాడ్... తేల్చేసిన సీమెన్స్
-
పూర్తిగా ఇరుక్కున్న చంద్రబాబు..తేల్చేసిన సీమెన్స్ కంపెనీ
-
మా పేరుతో.. పచ్చి మోసం
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) పేరుతో చంద్రబాబు సర్కారు సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలతో కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంలో కుతంత్రం బట్టబయలైంది. తమ పేరుతో కుదుర్చుకున్నట్లు చెబుతున్న ఒప్పందం గురించి తమకు ఏమాత్రం సంబంధం లేదని, అసలు ఆ ఒప్పందం గురించే తమకు తెలియదని సీమెన్స్ కంపెనీ వెల్లడించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద తాము 90 శాతం నిధులను సమకూరుస్తామని చెప్పలేదని స్పష్టం చేసింది. మోసపూరితంగా తమ కంపెనీ పేరును వాడుకుంటూ దీన్ని రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా చూపారని తెలిపింది. ఈమేరకు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఏపీఎస్ఎస్డీసీకి పంపిన ఈ–మెయిల్‌తో వాస్తవాలు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని బుకాయించేందుకు ఓ పత్రికా ప్రకటన జారీ చేసిన టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.370 కోట్లలో రూ.70 కోట్లతో సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని అందులో పేర్కొంది. మరి మిగిలిన రూ.300 కోట్లు ఏమయ్యాయో వెల్లడించకపోవడం ద్వారా ఆ నిధులు కొల్లగొట్టినట్లు పరోక్షంగా అంగీకరించింది. ప్రభుత్వ వాటాగా 10 శాతం నిధులను విడుదల చేశామని పేర్కొన్న టీడీపీ మరి 90 శాతం కింద సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలు నిధులు ఎందుకు సమకూర్చలేదనే విషయాన్ని మాత్రం దాటవేయడం గమనార్హం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు సర్కారు నిధులు కొల్లగొట్టిన విషయాన్ని సీఐడీతోపాటు ఈడీ కూడా నిర్ధారించిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు టీడీపీ చేసిన యత్నాలు ఫలించలేదు. 90 శాతం నిధులా..? వంద శాతం మోసమే మాజీ సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా సీమెన్స్ కంపెనీ ముసుగులో ఒప్పందం పేరిట భారీ అవినీతికి పాల్పడినట్లు ఆ కంపెనీ పంపిన ఈ – మెయిల్‌తో స్పష్టమైంది. ఏపీఎస్ఎస్డీసీకి పంపిన ఈ – మెయిల్లో సీమెన్స్ ఇంకా ఏం చెప్పిందంటే.. ఆ ఒప్పందంలో మేం భాగస్వాములం కాదు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు ఒప్పందం గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. అందుకు మేం బాధ్యత వహించం. ఆ ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూరుస్తామని మేం ఎక్కడా చెప్పలేదు. మా కంపెనీ పేరుతో సుమన్ బోస్‌తోపాటు జీవీఎస్ భాస్కర్, భావనా గుప్తా, ప్రతాప్ బొంతా, రాహుల్ సెహ్గల్, ఆశీష్ శర్మ, సతీశ్ కురుప్ తదితరులు ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. 90 శాతం నిధులను సమకూరుస్తామని వారు ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి సీమెన్స్ కంపెనీ బాధ్యత వహించదు. డిజైన్ టెక్ కంపెనీతో కలసి సుమన్ బోస్ దురుద్దేశపూరితంగా వ్యవహరించారు. మోసపూరితంగా రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా పేర్కొన్నారు. సీమెన్స్ కంపెనీ 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తుందని సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ, ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం పూర్తిగా మోసపూరితం. ఆ ఒప్పందంలో మేం భాగస్వాములం కాము. మాకు సంబంధం లేదు.’ గంటా సుబ్బారావు దరఖాస్తే చేయలేదు ఏపీఎస్ఎస్డీసీ ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం మా కంపెనీకి ఎలాంటి దరఖాస్తూ చేయలేదు. సీమెన్స్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఎస్‌ఐఎస్‌డబ్లూ భారత్‌లో మా సాఫ్ట్ట్వేర్ విక్రయాలను పర్యవేక్షిస్తుంది. కానీ ఆ కంపెనీ భారత్‌లో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం లేదు. కాబట్టి మేం 90 శాతం నిధులు సమకూరుస్తామనే ఒప్పందం పూర్తిగా బోగస్. సుమన్ బోస్ చాటింగ్, ఈ మెయిల్స్ ఇవిగో.. మా కంపెనీ ముసుగులో సుమన్ బోస్, ఇతరులు డిజైన్ టెక్‌తో జరిపిన ఈమెయిల్స్, వాట్సాప్ చాటింగ్, బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేశారు. వాటిని మేం రిట్రీవ్ చేసి నాలుగు డ్రైవ్‌లలో మీకు అందిస్తున్నాం. మా కంపెనీ ముసుగులో చేసిన మోసం కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాం. అయితే మాత్రం అరెస్టులా..? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. “ఔను నిధులు కొల్లగొట్టాం.. అయితే మాత్రం కేసు పెడతారా..? అరెస్ట్‌లు చేస్తారా..? అలాగైతే అది వేధించడమే...!’ అనే తరహాలో వితండవాదం చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. అంశాలవారీగా టీడీపీ వాదనలో డొల్లతనం ఇదీ... రూ.300 కోట్లు లూటీని ఒప్పుకున్న టీడీపీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.3,300 కోట్లతో సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నామని, అందులో 90 శాతం నిధులను సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు ఇవ్వాలని, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాలన్నది ఒప్పందమని టీడీపీ పేర్కొంది. గత ప్రభుత్వం తన వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లు విడుదల చేసినట్లు కూడా అంగీకరించింది. అందులో సీమెన్స్ కంపెనీ నుంచి డిజైన్ టెక్ కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ కోసం రూ.70 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. ( వాస్తవానికి డిజైన్ టెక్ రూ.56 కోట్లే చెల్లించింది. ఆ విషయాన్ని సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్లో వెల్లడించింది. టీడీపీ వాదనను పరిగణలోకి తీసుకుని రూ.70 కోట్లు చెల్లించారని భావించినా మిగిలిన రూ.300 కోట్లు ఏం చేశారన్న దానిపై మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం. అంటే ఆ రూ.300 కోట్లను కొల్లగొట్టినట్లు ఆ పార్టీనే పరోక్షంగా ఒప్పుకుంది. 90 శాతం నిధులతో సాఫ్ట్వేర్ ఎక్కడ? సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90 శాతం నిధులు సమకూరుస్తాయన్నది ఒప్పందం అని టీడీపీ పేర్కొంది. మరి ఆ మొత్తాన్ని సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు వెచ్చించాయా? లేదా? అన్న విషయాన్ని మాత్రం టీడీపీ వెల్లడించ లేదు. 90 శాతం రాయితీతో సాఫ్ట్‌వేర్‌ను సీమెన్స్ సంస్థ రూ.70 కోట్లకు సమకూర్చిందని చెబుతోంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లుగా ఎందుకు చూపినట్లు..? అందులో ప్రభుత్వ వాటా కింద 10 శాతాన్ని జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు ఎందుకు చెల్లించినట్లు? నిధులు కొల్లగొట్టేందుకే రూ.70 కోట్ల ప్రాజెక్ట్‌ను ఏకంగా రూ.3,300 కోట్లుగా కాగితాలపై చూపించి అడ్డగోలుగా ప్రజాధనాన్ని కాజేసినట్లు టీడీపీ ప్రకటనే చెబుతోంది. బాబు ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నిధులు స్కిల్ స్కామ్‌లో నిధుల విడుదలకు అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రులది బాధ్యత కాదని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉంది. అప్పటి ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా నాటి సీఎం చంద్రబాబు ఆదేశించడంతోనే నిధులను విడుదల చేస్తున్నట్లు నోట్ ఫైళ్లలో స్పష్టంగా ఉంది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతతోపాటు పలువురు అధికారులు, ఇతరులను విచారించిన అనంతరం సీఐడీ వాస్తవాలను నిగ్గు తేల్చింది. సీఐడీతోపాటు ఈడీ కూడా నిర్ధారించింది.. అసలు నిధులను ఎక్కడ మళ్లించారని టీడీపీ ప్రశ్నిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించారని సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్త సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆధారాలతో సహా నిర్ధారించాయి. షెల్ కంపెనీలు ఏసీఐ, నాలెడ్జ్ పోడియమ్, ఈటా, పాట్రిక్స్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్, ఇన్‌వెబ్, పోలారీస్, కాడెన్స్ పార్టనర్స్ ద్వారా నిధులను తరలించినట్లు నిగ్గు తేల్చాయి. ఈ కేసులో సీఐడీ ఇప్పటివరకు చంద్రబాబుతోసహా 9 మందిని అరెస్ట్ చేసింది. వారిలో నలుగురిని ఈడీ అరెస్ట్ చేయడంతోపాటు ఆ షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసింది. ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) సైతం నిర్ధారించింది. విదేశాలకు పరారయ్యారు కదా... ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇవ్వగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు నిధులు తరలింపులో పాత్రధారిగా వ్యవహరించిన మనోజ్ పార్థసాని రాత్రికి రాత్రే విదేశాలకు పరారయ్యారు. దీనిపై స్పందించకుండా వారికి ఇప్పుడు నోటీసులు జారీ చేయడం ఏమిటని టీడీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ లభించిన ఆధారాలను బట్టి విచారణ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ కేసులో సీఐడీ కూడా అదే చేసింది. చంద్రబాబు ఆదేశాలతోనే వారు విదేశాలకు పరారైనట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. చంద్రబాబు ఏ స్థాయిలో సాక్షులను ప్రభావితం చేయగలరో, దర్యాప్తును పక్కదారి పట్టించగలరో ఈ ఉదంతమే రుజువు చేస్తోంది. ఈ క్రమంలో సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. దర్యాప్తు సాగేకొద్దీ సూత్రధారులు తెరపైకి.. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ పేరిట ఏర్పాటైన కొత్త శాఖలో అన్ని వ్యవహారాలు అధికారులే చూశారని, అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు కేవలం పర్యవేక్షించారని టీడీపీ పేర్కొంది. ఈ కేసులో అచ్చెన్నాయుడును ఇరికించేందుకు సీఐడీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కానీ కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ లభిస్తున్న ఆధారాలతో ఈ కుంభకోణం అసలు సూత్రధారులు ఎవరన్నది బయటపడుతోంది. ఆ ఆధారాలతోనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఈ కుంభకోణంలో కీలక భూమిక పోషించారని వెల్లడైంది. నోట్ ఫైళ్లు మాయమైనా అధికారులు అందుబాటులో ఉన్నారని, వారిని విచారించాలని టీడీపీ వాదిస్తోంది. అంటే నోట్ ఫైళ్లను మాయం చేశామని ఆ పార్టీ అంగీకరించినట్లే కదా! అందుబాటులో ఉన్న అధికారులను విచారించి, ఇతర అంశాలను నిగ్గు తేల్చి పూర్తి ఆధారాలతోనే సీఐడీ కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తెచ్చింది. అన్నిటికి సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, రాజధాని మాస్టర్ ప్లాన్ కుంభకోణాల్లో చంద్రబాబు పాత్రను వెలుగులోకి తేవటాన్ని చూసి టీడీపీ బెంబేలెత్తుతోంది. ఇప్పటికే ఈ మూడు కేసుల్లో సీఐడీ కీలక ఆధారాలను సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను మూడు సార్లు మార్చిన వైనం, ఆ అలైన్‌మెంట్‌ను ఆనుకుని వందలాది ఎకరాలను ఎలా సేకరించారు?.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి బినామీల ద్వారా అసైన్డ్ భూములు ఎలా కొల్లగొట్టారు? లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రోకోకు ఎలా పాల్పడ్డారు.. తదితరాలన్నీ బట్టబయలయ్యాయి. ఆ కేసుల్లో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. తమ అవినీతి బాగోతం సాక్షాధారాలతో రుజువు కావడంతో ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. అవినీతి నెట్వర్క్ గుట్టు రట్టు స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో చంద్రబాబు ఖజానా నుంచి విడుదల చేసిన రూ.371 కోట్లు ఎక్కడకు వెళ్లాయన్నది ఈ కేసులో కీలకంగా మారింది. ఆ నిధులన్నీ షెల్ కంపెనీల ద్వారా చివరకు చంద్రబాబుకే చేరినట్లు సీఐడీ దర్యాప్తులో ఆధారాలతోసహా వెల్లడైంది. షెల్ కంపెనీల కమీషన్లు పోనూ రూ.241 కోట్లను అవినీతి నెట్వర్క్ ద్వారా చంద్రబాబు నివాసానికి చేరినట్లు గుర్తించారు. మరోవైపు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల ప్రాజెక్ట్‌ల కాంట్రాక్టు కేటాయింపులలోనూ చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. షెల్ కంపెనీల ద్వారా బాబుకు డబ్బులు చేరాయిలా.. ► టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ► పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు, నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు, ఈటా: రూ.14.1 కోట్లు, పాట్రిక్స్: రూ.3.13 కోట్లు, ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు, భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు, ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు, పోలారీస్: రూ.2.2 కోట్లు, కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ► మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించాడు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పాడు. అంటే ఆ రూ.140.53 కోట్లను చివరకు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా రూ.241 కోట్లు గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు చేరిపోయాయి. -
ప్రజాధనం దోపిడీకే తెరపైకి ‘సీమెన్స్’
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టాలన్న ముందస్తు పథకంలో భాగంగానే గత సర్కారు పెద్దలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్‌ను తెరపైకి తెచ్చారని సీఐడీ తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,356 కోట్లకు కృత్రిమంగా పెంచారని, ఇందులో సీమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ ప్రసాద్ కీలక పాత్ర పోషించారని నివేదించారు. ఇలా పెంచిన మొత్తాన్ని పెద్దల అండతో దారి మళ్లించేందుకు భారీ కుట్రకు తెర తీశారని తెలిపారు. అందులో భాగంగానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్–సీమెన్స్ మధ్య ఒప్పందం కుదరగానే యూపీలో ఐఏఎస్ అధికారిగా ఉన్న భాస్కర్ ప్రసాద్ భార్య ఊర్మిళను ఇంటర్ కేడర్ డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈవోగా నియమించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదో భారీ కుంభకోణమని, ఇంత తీవ్రమైన కేసులో మేస్ట్రేస్టేట్ చాలా యాంత్రికంగా భాస్కర్ ప్రసాద్ రిమాండ్‌ను తిరస్కరించారని తెలిపారు. కింది కోర్టులో ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భాస్కర్ ప్రసాద్‌పై ఐపీసీ సెక్షన్లు 409, 120 (బీ) కింద సీఐడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే మేస్ట్రేస్టేట్ విస్మయకరంగా రిమాండ్ సమయంలోనే మినీ ట్రయల్ నిర్వహించి సెక్షన్ 409 వర్తించదని తేల్చడంతోపాటు భాస్కర్ ప్రసాద్ రిమాండ్‌ను తిరస్కరించారని వివరించారు. ఏ సెక్షన్ వర్తిస్తుంది? ఏ సెక్షన్ వర్తించదు? అనే అంశాలను దర్యాప్తు పూర్తై చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత చేపట్టే తుది విచారణలో తేల్చాలే కానీ రిమాండ్ సమయంలో కాదన్నారు. రాష్ట్రంలోని కింది కోర్టుల్లో రిమాండ్ సమయంలోనే ఫలానా సెక్షన్ వర్తించదంటూ రిమాండ్‌ను తిరస్కరించే ట్రెండ్ నడుస్తోందని, దీనిపై హైకోర్టు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని సుధాకర్‌రెడ్డి నివేదించారు. ఈ కుంభకోణం వెనుక దాగిన పెద్దల పాత్ర బహిర్గతం కావాలంటే భాస్కర్ ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించడం సీఐడీకి అనివార్యమన్నారు. సీఐడీ తరఫున వాదనలు ముగియడంతో భాస్కర్ ప్రసాద్ తరఫు న్యాయవాది వీఆర్ మాచవరం వాదనల నిమిత్తం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్.భానుమతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘స్కిల్’ కుంభకోణంలో కీలక వ్యక్తి అరెస్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆయన నివాసంలో బుధవారం అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయన్ని కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువస్తున్నారు. ఆయన్ని విజయవాడలోని కోర్టులో హాజరుపరుస్తారు. జీవీఎస్ భాస్కర్‌తో సహా ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ 8 మందిని అరెస్టు చేసింది. ప్రాజెక్టు వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. రూ. 371 కోట్ల ప్రజాధానాన్ని చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టడంలో జీవీఎస్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషించారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వం సీమెన్స్ కంపెనీ ముసుగులో షెల్ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రూపకల్పనలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. (అసలు ఆ ప్రాజెక్టు గురించి తమకేమీ తెలియదని, తమ కంపెనీ అసలు ఆ ఒప్పందం కుదుర్చుకోలేదని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం తరువాత ప్రకటించడం గమనార్హం). సీమెన్స్ ఇండియా లిమిటెడ్‌కు అప్పట్లో ఎండీగా ఉన్న సుమన్ బోస్‌తో కుమ్మక్కై టీడీపీ పెద్దలు ఈ ఎంవోయూ కథ నడిపారు. అందులో భాస్కర్ కీలకంగా వ్యవహరించారు. అంచనాలను పెంచేసి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లుగా చూపించారు. అందులో 10 శాతం వాటాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.371 కోట్లు సమకూర్చాలని లెక్క తేల్చారు. సీమెన్స్ కంపెనీ కేవలం రూ.58 కోట్లు విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే సమకూర్చింది. కేవలం అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే భాస్కర్ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు.. ఆ ప్రాజెక్టు వ్యయాన్ని మూడో పార్టీ ద్వారా పరిశీలించేందుకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ (సీఐటీడీ)కు నివేదించగా అక్కడ కూడా భాస్కరే కథ నడిపారు. ఇతర నిందితులతో కలిసి అనుకూలంగా నివేదిక వచ్చేలా మేనేజ్ చేశారు. అంతేకాకుండా నిధులు కొల్లగొట్టడానికి అనుకూలంగా అవగాహన ఒప్పందం (ఎంవోయూ)ను తయారు చేశారు. ఒప్పందం రూ.3,300 కోట్లకు చేశారు. కానీ ప్రభుత్వం తన వాటాగా రూ.371 కోట్లు చెల్లించాలనే దగ్గరకు వచ్చేసరికి పక్కా కుతంత్రానికి పాల్పడ్డారు. ఈ ప్రాజెక్టులో టెక్నాలజీ పార్ట్‌నర్స్‌గా ఉన్న సీమెన్స్, డిజైన్ టెక్‌లకు కేవలం రూ.371 కోట్ల వర్క్ ఆర్డర్ ఇస్తున్నట్టుగా రాశారు. దాంతో వర్క్ ఆర్డర్ విలువ మేరకే సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలకు చెల్లించాలనే భావన కలిగించారు. కానీ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో సీమెన్స్ కంపెనీ 90 శాతం ముందు సమకూర్చాలన్న ఒప్పందంలోని ప్రధాన అంశాన్ని.. ఆ తరువాత పేరాల్లో లేకుండా చేశారు. ఇలా కేవలం రూ.371 కోట్ల వర్క్ ఆర్డర్ మేరకే బిల్లులు చెల్లిస్తున్నట్టు భ్రాంతి కలిగించారు. ఇదంతా టీడీపీ ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై చేశారని సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో సహా నిరూపితమైంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఎంవోయూ కుదిరిన తరువాత భాస్కర్ తన సతీమణి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీలో డిప్యూటీ సీఈవోగా పోస్టింగు వచ్చేలా కథ నడిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీఎస్ఎస్డీసీ అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావుతో భాస్కర్ కుమ్మక్కయ్యారు. దాంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అపర్ణను రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై తీసుకువచ్చారు. అనంతరం ఆమెకు ఏపీఎస్ఎస్డీసీలో డిప్యూటీ సీఈవోగా పోస్టింగు ఇచ్చారు. సీమెన్స్ కంపెనీలో భాస్కర్ కీలకంగా ఉండగా.. ఆయన భార్య ఏపీఎస్ఎస్డీసీలో డిప్యూటీ సీఈవోగా ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి మరీ కుంభకోణానికి రంగం సిద్ధం చేశారు. షెల్ కంపెనీలతోనూ బంధం ఈ ప్రాజెక్టు పేరుతో నిధుల మళ్లింపునకు సాధనంగా ఉన్న షెల్ కంపెనీల్లోనూ జీవీఎస్ భాస్కర్ కీలకంగా వ్యవహరించారు. ఎస్‌ఐఎస్‌డబ్లూ కంపెనీకి చెందిన అప్టస్ హెల్త్‌కేర్ ఒక షెల్ కంపెనీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకు చెల్లించిన రూ.371 కోట్లను ఈ షెల్ కంపెనీ ద్వారానే విదేశీ ఖాతాలకు మళ్లించారు. ఆ షెల్ కంపెనీతో భాస్కర్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టుగా సీఐడీ గుర్తించింది. -
డిజిటల్ సేవలకు భారత్ ముఖ్య కేంద్రం!
ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లు డిజిటల్ పరివర్తనానికి వీలుగా సేవలు అందించేందుకు భారత్ కీలక కేంద్రంగా ఉంటుందని సీమెన్స్ ప్రకటించింది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, రవాణా, విద్యుదుత్పత్తి, విద్యుత్ సరఫరా తదితర రంగాలకు సీమెన్స్ సేవలు అందిస్తుంటుంది. భారత్‌లోని సంస్థ డెవలప్మెంట్ సెంటర్లో 6,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ యాక్సెలరేటర్ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను భారత్‌లో ప్రారంభించింది. డిజిటల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత సేవలను ఈ కేంద్రం ద్వారా అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా సీమెన్స్ యాక్సెలరేటర్‌ను అమలు చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ తెలిపింది. -
సీమెన్స్ : భారీ ఉద్యోగాల కోత
జర్మనీకి పారిశ్రామిక దిగ్గజం సీమెన్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది. తన గ్యాస్ అండ్ పవర్ యూనిట్లో ప్రపంచవ్యాప్తంగా 2,700 ఉద్యోగాల కోత పెడుతున్నట్టు వెల్లడించింది. ఇందులో స్వదేశంలో 14వందల మంది ఉన్నట్టు వెల్లడించింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తద్వారా 2020 నాటికి 560 మిలియన్ డాలర్లును పొదుపు చేయాలని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే 7వేల ఉద్యోగులను తీసివేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించినట్టు తెలిపింది. అయితే ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్యాకేజీలకు సంబంధించి ఆయా ఉద్యోగ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొంది. సామాజికంగా బాధ్యతగా ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 80 దేశాలలో 64,000 మంది ఉద్యోగులలో కార్యకలాపాలనునిర్వహిస్తున్న సంస్థ 2018 ఏడాదిలో 12.4 బిలియన్ యూరోల అమ్మకాలతో 377 మిలియన్ యూరోల లాభాలను నమోదుచేసింది. అయితే ప్రపంచ శిలాజ ఇంధనాల నుండి పునరుత్పాదక శక్తికి మారిన ఫలితంగా విద్యుత్ ప్లాంట్ పరికరాల డిమాండ్ క్షీణించి సంవత్సర సంవత్సరానికి లాభదాయకత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. -
ఎన్టీపీసీకి సీమెన్స్ ట్రాన్స్ఫార్మర్
హైదరాబాద్: సీమెన్స్ కంపెనీ ఎన్టీపీసీకి అతి పెద్ద మేడ్ ఇన్ ఇండియా సింగిల్ ఫేజ్ జనరేటర్ స్టెప్ అప్(జేఎస్‌యూ) ట్రాన్స్ఫార్మర్ను అందించనున్నది. ఈ జేఎస్‌యూ ట్రాన్స్ఫార్మర్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ... ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అధిక కెపాసిటీ ఉన్న విద్యుదుత్పత్తి సాధ్యమవుతుందని సీమెన్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 10 జేఎస్‌యూ ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్‌ను ఎన్టీపీసీ నుంచి పొందామని సీమెన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హరాల్డ్ గ్రిమ్ పేర్కొన్నారు. కర్నాటకలోని ఎన్టీపీసీకి చెందిన కుడ్గి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లో ఈ జేఎస్‌యూ ట్రాన్స్ఫార్మర్ను అమరుస్తారని వివరించారు.