
జర్మనీకి పారిశ్రామిక దిగ్గజం సీమెన్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది. తన గ్యాస్ అండ్ పవర్ యూనిట్లో ప్రపంచవ్యాప్తంగా 2,700 ఉద్యోగాల కోత పెడుతున్నట్టు వెల్లడించింది. ఇందులో స్వదేశంలో 14వందల మంది ఉన్నట్టు వెల్లడించింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తద్వారా 2020 నాటికి 560 మిలియన్ డాలర్లును పొదుపు చేయాలని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే 7వేల ఉద్యోగులను తీసివేస్తున్నట్టుగా ఇప‍్పటికే ప్రకటించినట్టు తెలిపింది. అయితే ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్యాకేజీలకు సంబంధించి ఆయా ఉద్యోగ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొంది. సామాజికంగా బాధ్యతగా ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
80 దేశాలలో 64,000 మంది ఉద్యోగులలో కార్యకలాపాలనునిర్వహిస్తున్న సంస్థ 2018 ఏడాదిలో 12.4 బిలియన్ యూరోల అమ్మకాలతో 377 మిలియన్ యూరోల లాభాలను నమోదుచేసింది. అయితే ప్రపంచ శిలాజ ఇంధనాల నుండి పునరుత్పాదక శక్తికి మారిన ఫలితంగా విద్యుత్ ప్లాంట్ పరికరాల డిమాండ్ క్షీణించి సంవత్సర సంవత్సరానికి లాభదాయకత క్రమేపీ తగ్గుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment