స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైందని, ఈ ప్రాజెక్టు నూరుశాతం విజయవంతమైందని.. దీనిలో ఏమాత్రం అవినీతి జరగలేదని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ తాజాగా మీడియా ముందుకొచ్చారు. పైగా యువత జీవితాన్ని దారుణంగా దెబ్బతీసే విధంగా సీమెన్స్, స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టులపై ఏపీ సీఐడీ నిరాధార ఆరోపణలు చేస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ వ్యవహారంపై సీమెన్స్ కంపెనీనే స్వయంగా స్పందించింది. సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని మరోమారు స్పష్టత ఇచ్చింది.
ప్రశ్న: జీవోలో పేర్కొన్నట్టుగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్ నెలకొల్పడానికి అంగీకరించారా? మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో ప్రభుత్వం వాటా 10 శాతంగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సీమెన్స్ 90శాతం వాటా సమకూర్చేందుకు సమ్మతించిందా? గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అటువంటి ప్రాజెక్ట్‌లు చేపట్టే విధానం సీమెన్స్ కంపెనీలో ఉందా?
సీమెన్స్ కంపెనీ సమాధానం: గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్ కంపెనీలో లేనే లేదు. డిజైన్ టెక్ కంపెనీతో కలసి మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. అలాంటి ఒప్పందం గురించి మాకు అసలు తెలీదు.
ప్రశ్న: ఏపీలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఏమైనా వర్క్ ఆర్డర్ మీకు వచ్చిందా?
సీమెన్స్ కంపెనీ సమాధానం: ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్ ఆర్డర్ రాలేదు.
ప్రశ్న: ఏపీఎస్‌ఎస్‌డీసీ, డిజైన్‌టెక్‌తో కలిసి సీమెన్స్ కంపెనీ పేరున కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంపై సీమెన్స్ కంపెనీ తరపున అని చెబుతూ సుమన్ బోస్ సంతకాలు చేశారు. సీమెన్స్ కంపెనీలో ఆయన హోదా ఏమిటి? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు?
సుమన్‌బోస్ తాజా ప్రెస్ మీట్‌లో..
సీమెన్స్ కంపెనీ సమాధానం: సీమెన్స్ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు. కంపెనీ ఆ అధికారాన్ని ఆయనకు ఎప్పుడూ ఇవ్వ లేదు.
సుమన్ బోస్ మా కంపెనీకి ఎప్పుడో రాజీనామా చేశారు. ఆయనకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా మాకు సమాచారం లేదు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్ పేరిట అవినీతి కేసులో సుమన్ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు
సీమెన్స్ కంపెనీ ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన సమాధానాలు ఇవి..
ఇదీ చదవండి: బాబుకు తోడు దొంగల వత్తాసు
Comments
Please login to add a commentAdd a comment