చంద్రబాబుపై ఎత్తేద్దాం.. ప్రతిపక్షంపై బనాయిద్దాం..
ఆధారాలతో పనిలేదు.. అధికారం మనదే కదా!
చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం..! విపక్ష ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం!! ఇదీ కూటమి సర్కారు కుట్రల కుతంత్రం!
ఒకపక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది.
ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్‌స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది కూలంకషంగా ఉద్బోధించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఓ ప్రైవేట్ న్యాయవాది ఈ సమావేశాన్ని నిర్వహించడం.. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు మరో వైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారి ఒకరు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరినీ అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది!!
– సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment