irregularities
-
ఈసీ తీరుపై... అన్నీ అనుమానాలే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలను కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ సోమవారం లోక్‌సభలో లేవనెత్తాయి. వీటిపై సందేహాలు, నానాటికీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నార్థకంగా మార్చాయంటూ ఆందోళన వెలిబుచ్చాయి. పైగా వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం అరకొర స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నాయి. కనుక ఈ మొత్తం అంశంపై లోక్‌సభలో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో చేస్తున్న డిమాండని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందా అని ప్రశ్నించారు. ‘‘కేంద్రం తయారు చేయదన్నది నిజమే. కానీ ఇవన్నీ మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకే ఈ అంశంపై సవివరమైన చర్చకు మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఓటర్ల జాబితాల విశ్వసనీయతను దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రతో సహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు దీనిపై అనుమానాలు లేవనెత్తాయి’’ అని గుర్తు చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమంటూ సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఆప్ కూడా గొంతు కలిపాయి. దీన్ని పార్లమెంటు చర్చకు స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాయి. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఓటర్ల జాబితా అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తారు. ‘‘ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు నంబర్లలో నకిలీల సమస్య దశాబ్దాలుగా ఉంది. కానీ పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన అనంతరమే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది’’ అంటూ దృష్టికి తెచ్చారు. అంటే ఇంతకాలంగా తప్పిదాలు జరుగుతూ వస్తున్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్, హరియాణాల్లో నకిలీ ఓటరు కార్డులు దొరికాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. దానిపై అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఇలాగే జరిగింది. ఇవన్నీ తీవ్రమైన లోటుపాట్లే. వచ్చే ఏడాది బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆలోపే ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ తప్పిదాలపై దేశ ప్రజలకు ఈసీ బదులివ్వాల్సిందేనన్నారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతరహితంగా వ్యవహరించాలని సమాజ్‌వాదీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్ అన్నారు. ‘‘మహారాష్ట్రలో నెలల వ్యవధిలోనే కొత్తగా లక్షలాది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారు? ఢిల్లీలోనూ అదే జరిగింది. 2022లో యూపీలోనూ ఇదే చేశారు’’ అని ఆరోపించారు.రాజ్యసభలోనూ... రాజ్యసభలో కూడా జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అందుకు అనుమతివ్వలేదు. దీనితో పాటు డజనుకు పైగా అంశాలపై 267వ నిబంధన కింద చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇచి్చన నోటీసులన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. ‘‘మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆర్నెల్లలోనే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇదెలా సాధ్యం? దీనిపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ వద్ద సమాధానమే లేదు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించిన ఫొటో ఓటర్ల జాబితాను ఎక్సెల్ ఫార్మాట్లో మాకు అందజేయాలని డిమాండ్ చేస్తే ఈసీ నేటికీ స్పందించనే లేదు. దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, డూప్లికేట్ ఈపీఐసీ నంబర్ల వంటి తీవ్ర తప్పిదాలు, లోటుపాట్లు ఇష్టారాజ్యాంగా చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియ తాలూకు సమగ్రతనే సవాలు చేస్తున్నాయి. పైగా ఈ తప్పిదాలను స్వయంగా ఈసీయే అంగీకరించింది. కనుక వీటన్నింటిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందే. అందుకు మోదీ సర్కారు అంగీకరించాల్సిందే’’ అంటూ అనంతరం ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్నేళ్లుగా ఘోరంగా విఫలమవుతోందని అంతకుముందు టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ సభలో దుయ్యబట్టారు. ఇందుకు ఈసీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని సీఎం మమతే తొలిసారి లేవనెత్తారు. దీనిపై ఈసీ ఇచ్చిన వివరణ ఎన్నికల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉంది’’ అని ఆరోపించారు. అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఈసీపై ఉందని ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్ అన్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరియాణా పౌరులకు విచ్చలవిడిగా ఓటరు కార్డులిచ్చారని ఆరోపించారు. తద్వారా ఎన్నికల ప్రక్రియనే ప్రహసనంగా ఈసీ మార్చేసిందని దుయ్యబట్టారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియే పార్లమెంటు ఉనికికి ప్రాణం. ఎన్నికల అవకతవకలపై ఇక్కడ చర్చించేందుకు అవకాశమివ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు’’ అన్నారు. -
బెంగాల్ ఓటర్ల జాబితాలో గోల్మాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టి(టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష బీజేపీ ఎన్నికల సంఘం అండతో ఇతర రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓటర్లుగా చేర్పిస్తోందని మండిపడ్డారు. నకిలీ ఓటర్లను తక్షణమే తొలగించాలని, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని సూచించారు. లేకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ నియామకం పట్ల అనుమానాలు వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం మద్దతుతో ఓటర్ల జాబితాను బీజేపీ ఇష్టానుసారంగా మార్చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదన్నారు. మరోసారి ‘ఖేలా హోబే’ మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడానికి ప్రయోగించిన కుయుక్తులను బెంగాల్లోనూ పునరావృతం చేయాలన్నదే బీజేపీ కుట్ర అని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీలో హరియాణా ప్రజలను, మహారాష్ట్రలో గుజరాత్ ప్రజలను ఓటర్లుగా చేర్పించి, అడ్డదారిలో నెగ్గిందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బెంగాల్లో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే అవకాశమే లేదన్నారు. అందుకే మరో గత్యంతరం లేక ఎన్నికల్లో నెగ్గడానికి నకిలీ ఓటర్లను నమ్ముకుందని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రలకు ఎన్నికల సంఘం సహకరిస్తుండడం దారుణమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఓటర్లను బహిర్గతపర్చి, బీజేపీ బండారం బయటపెడతామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ కుట్రలను అక్కడి పార్టీలు పసిగట్టలేకపోయాయని అన్నారు. బెంగాల్లో బీజేపీ నిర్వాకాలను తాము గుర్తించామని చెప్పారు. మహారాష్ట్ర, ఢిల్లీలో అక్రమంగా గెలిచిన బీజేపీ ఇప్పుడు బెంగాల్‌పై కన్నేసిందని, ఆ పార్టికి తాము గట్టిగా బదులిస్తామని అన్నారు. మరోసారి ఖేలా హోబే(ఆట మొదలైంది) తప్పదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించామని, రాబోయే ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం నేర్పబోతున్నామని పేర్కొన్నారు.మన లక్ష్యం 215 ప్లస్ సీట్లు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 215కు పైగా సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని టీఎంసీ శ్రేణులకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ బలాన్ని మరింతగా తగ్గించాలన్నారు. బీజేపీతోపాటు సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ దఫా డిపాజిట్లు కూడా దక్కకుండా చూడాలన్నారు. గతంలో ఎన్నికలప్పుడు కాషాయదళ నేతలు ఇచ్చిన నినాదాలను ఆమె గుర్తు చేశారు. ‘2021 ఎన్నికల్లో బీజేపీ నేతలు ‘200 సీట్లకు మించి’అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఓటమి పాలయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు ‘400కు మించి’ అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ పార్టీ కనీసం మెజారిటీని సైతం సాధించలేకపోయింది. ‘ఈ దఫా ఎన్నికల్లో మనం, మూడింట రెండొంతుల మెజారిటీ తెచ్చుకుంటాం. కానీ, అంతకుమించి మెజారిటీ సాధించేందుకు మీరు కృషి చేయాలి. ఈసారి బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కకూడదు’ అని మమత స్పష్టంచేశారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అక్రమాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అవకతవకలు(irregularities)చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ఆరోపించారు. రాష్ట్రంలోని వయోజనుల కంటే నమోదైన ఓటర్లే ఎక్కువమంది ఉన్నారన్నారు. అయిదేళ్ల క్రితం కంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలో ఎక్కువ మంది పేర్లను జాబితాలో చేర్చారని చెప్పారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటరు జాబి తాను ఇవ్వాలంటూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌లు, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)లు కోరినా ఈసీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన తెలిపారు. దీనిపై తాము చట్ట ప్రకారం ముందుకెళతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది ఓటర్ల పేర్ల తొలగింపు లేక బదిలీ చేశారని, వీరిలో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాల వారే ఉన్నారని రాహుల్ వివరించారు. కొత్తగా చేర్చిన ఓటర్ల కంటే తొలగింపునకు గురైన పేర్లే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయని ఆయన చెప్పారు.5 నెలల్లోనే 39 లక్షల కొత్త ఓటర్లు‘మహారాష్ట్ర ఎన్నికలకు(Maharashtra election)సంబంధించి ఈసీని పలు ప్రశ్నలు అడిగాం. 2019 విధాన సభ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల మధ్యలో ఐదేళ్ల వ్యవధిలో మహారాష్ట్రలో 32 లక్షల ఓటర్ల పేర్లను చేర్చారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలు, 2024 అసెంబ్లీ ఎన్నికలకు గాను కేవలం ఐదు నెల్ల వ్యవధిలో ఏకంగా 39 లక్షల కొత్త ఓటర్ల పేర్లు చేరాయి’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అంత స్వల్ప వ్యవధిలో అంత ఎక్కువ మంది ఓటర్లను కొత్తగా ఎలా చేర్చారు? ఈ 39 లక్షల మంది ఓటర్లు ఎవరు? 39 లక్షల మంది హిమాచల్ ప్రదేశ్ మొత్తం జనాభాతో సమానం. అయిదేళ్లలో కంటే కేవలం ఐదు నెలల్లో మహారాష్ట్రలో ఈసీ ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు చేర్చింది?’అని ఆయన ప్రశ్నించారు. కొత్త ఓట్లు బీజేపీ ఖాతాలోకేమహారాష్ట్రలో వయోజనుల జనాభా 9.54 కోట్లు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 9.7 కోట్లు. మహారాష్ట్రలోని మొత్తం వయోజనుల కంటే నమోదైన ఓటర్లు ఎక్కువ మంది ఉండటం ఎలా సాధ్యమని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటు బ్యాంకు యథాతథంగా ఉండగా కొత్తగా చేరిన ఓటర్లలో ఎక్కువ మంది బీజేపీకే ఓటేశారన్నారు. ఉదాహరణకు కంతీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సాధించిన మెజారిటీ కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్యతో సమానంగా ఉందని ఆయన వివరించారు. అదేవిధంగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన ప్రతిపక్షాలకు పడిన ఓట్ల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదని కూడా ఆయన చెప్పారు. తమ ప్రశ్నలకు ఈసీ ఎందుకు బదులివ్వడం లేదన్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈసీకుందన్నారు. లేకుంటే తమ తదుపరి చర్య న్యాయస్థానాలను ఆశ్రయించడమేనని స్పష్టం చేశారు.అలాగైతే కేంద్రానికి బానిస అన్నట్లే..శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ...‘ఈసీ సజీవంగా, సొంతంగా పనిచేయగలిగి ఉంటే రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి అది బానిసగా మారినట్లే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంకెళ్ల నుంచి ఈసీ బయటకు రావాలి’అని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక కూడా తమ పార్టీకి చెందిన మల్షిరాస్ ఎమ్మెల్యే ఉత్తమ్ జన్కార్ మళ్లీ ఎన్నికలు జరపాలని, ఈసారి బ్యాలెట్‌ను వాడాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వం అక్కడికి పోలీసులను పంపించిందని ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలే ఆరోపించారు.అన్ని గణాంకాలను వెల్లడిస్తాం: ఈసీమహారాష్ట్ర ఎన్నికల్లో అవకత వకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన పలు ఆరోపణలపై ఈసీ స్పందించింది. పూర్తి గణాంకాలతో లిఖిత పూర్వకంగా సమాధానమిస్తామని స్పష్టం చేసింది. -
బీజేపీపై నిఘాకు కెమెరాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న జరిగే ఎన్నికల సమయంలో బీజేపీ అక్రమాలకు పాల్పడితే రికార్డు చేసేందుకు వీలుగా స్పై, బాడీ కెమెరాలను మురికివాడల్లోని ప్రజలకు అందజేసినట్లు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ చారిత్రక విజయం సాధించబోతోందన్నారు. బీజేపీ ఘోర పరాజయం తప్పదన్నారు. ఇది తెలిసే ఆ పార్టీ అనుచిత చర్యలకు దిగుతోందని విమర్శించారు. బీజేపీ గూండాల అక్రమాలను రికార్డు చేసేందుకు మురికివాడల్లోని ప్రజలకు నిఘా కెమెరాలను అందించినట్లు చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని పోలీసులకు పట్టించేందుకు వీలుగా సమాచారం అందిన 15 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకునేలా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. స్లమ్ ఏరియాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసే ఉద్దేశంతో వారి వేలికి నల్ల సిరా పూసి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని తెలిపారు. బీజేపీ వాళ్ల నుంచి డబ్బులైతే తీసుకోండి, కానీ, వేలికి సిరా పూయనివ్వకండని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు. -
మళ్ళీ నామినేషన్ దందా షురూ!
సాక్షి, అమరావతి: రూ.లక్ష లోపు అంచనా ఉన్న పనులను ఈఈ.. రూ.2 లక్షల్లోపు పనులను ఎస్ఈ.. రూ.3 లక్షల్లోపు పనులను సీఈ నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చన్నది ప్రభుత్వ నిబంధన. అదీ వరదలు, కరువు వంటి ఉత్పాతాలు ఏర్పడినప్పుడు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన. ఆ పనులకు టెండర్లు పిలిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుండదు కాబట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులుబాటు కల్పించారు. కానీ, ఈ నిబంధనను నిక్కచ్చిగా అమలుచేయాల్సిన ప్రభుత్వమే దాన్ని నిలువునా పాతరేసింది. రూ.లక్ష కాదు, రూ.2 లక్షలు కాదు.. ఏకంగా రూ.480.22 కోట్ల విలువైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఎన్సీసీ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఇవి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సినవి కావు. అయినా, నిబంధనలు ఉల్లంఘించి వాటిని ఎన్సీసీ సంస్థకు అప్పగించడం వెనుక భారీఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలను కప్పెట్టుకోవడానికి కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించడం గమనార్హం. అక్రమాల దందా పునరావృతంఅస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి.. ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలుచేసుకోవడం 2014–19 మధ్య ముఖ్యనేతలు రివాజుగా మార్చుకున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ పనుల్లో రూ.2,917 కోట్ల పనులను నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టడమే అందుకు పరాకాష్ట. దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడాలేవు. కృష్ణా పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు–చెట్టు పనుల వరకూ రూ.15 వేల కోట్లకు పైగా విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టింది. ఇప్పుడూ అదే రీతిలో నామినేషన్ దందాకు తెరతీసింది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ ఒక్క పనిని కూడా నామినేషన్‌పై కట్టబెట్టకపోవడం గమనార్హం. పూర్తికాక ముందే నిధులు మిగులా?.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2014–19 తరహాలోనే మళ్లీ నామినేషన్ దందాకు తెరతీసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులను ఇందుకు వేదికగా చేసుకుంది. నిజానికి.. ఈ కెనాల్‌ను 79.6 కిమీ నుంచి 220.35 కిమీ వరకూ వెడల్పుచేసి, ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు రూ.1,929 కోట్ల వ్యయంతో 2021, సెపె్టంబరు 4న వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాంకేతిక అనుమతిచ్చింది. ఈ పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.1,217.49 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుని.. వాటిని పూర్తిచేయానికి 2023, ఫిబ్రవరి 1న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పనులను ఎన్సీసీ సంస్థ ఇప్పటివరకూ పూర్తిచేయలేదు. 25 శాతంలోపు మాత్రమే పూర్తయ్యాయని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వాస్తవానికి.. ఏదైనా పని పూర్తయ్యాకే ఆ పనికి కేటాయించిన నిధుల్లో మిగిలాయాన్నది తేల్చవచ్చు.కానీ.. ఇక్కడ పూర్తికాక ముందే వాటికి ప్రభుత్వం ఇచ్చిన సాంకేతిక అనుమతిలో రూ.711.51 కోట్ల మేర మిగులు ఉందంటూ తేల్చడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఇందులో రూ.480.22 కోట్ల వ్యయంతో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు 75.075 కిమీ నుంచి 207.80 కిమీ వరకూ లైనింగ్ చేసే పనులను నామినేషన్ పద్ధతిలో ఎన్సీసీ సంస్థకు కట్టబెట్టాలని ముఖ్యనేత ఆదేశించారు. దాంతో ఆ పనులను ఎన్సీసీకి అప్పగిస్తూ జలవనరుల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. -
ఫీ‘జులుం’ కోసమే కేఎల్‌యూ మాయాజాలం
సాక్షి, అమరావతి: న్యాక్ ర్యాంకింగ్ కోసం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం (కేఎల్‌యూ) పాల్పడిన అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. పూర్తి ఆధారాలతో బయటపడిన ఈ ర్యాంకింగ్ గూడుపుఠాణి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా న్యాక్ చైర్మన్, సభ్యులకే భారీ లంచాలు ఇచ్చి మరీ న్యాక్ ఏ++ ర్యాకింగ్ కోసం కేఎల్‌యూ యాజమాన్యం పక్కా పన్నాగంతో వ్యవహరించినట్టు సీబీఐ కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. దాంతోనే పక్కా వ్యూహంతో వ్యవహరించి న్యాక్‌కు భారీ లంచాలు ఇస్తుండగా.. శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చేసిన 10 మంది నిందితులను విజయవాడలోని న్యాయస్థానంలో ఆదివారం హాజరుపరిచింది. న్యాక్ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహా, సభ్యులు రాజీవ్ సిజిరాయా, డి.గోపాల్, రాజేశ్‌సింగ్ పవర్, మానస్‌కుమార్ మిశ్రా, గాయత్రి దేవరాజ, బులు మహారాణతోపాటు కేఎల్‌యూ యాజమాన్య ప్రతినిధులు కోనేరు రాజ హరేన్ (వైస్ ప్రెసిడెంట్), జీపీ సారథి వర్మ (వీసీ), ఎ.రామకృష్ణ (డైరెక్టర్)లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కేఎల్‌యూ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, ఇతర నిందితులు ఎల్.మంజునాథరావు (న్యాక్ మాజీ సలహాదారు), ఎం.హనుమంతప్ప(బెంగళూరు విశ్వవిద్యాలయం డైరెక్టర్), ఎం.శ్యామ్‌సుందర్ (న్యాక్ సలహాదారు)ల కోసం సీబీఐ గాలింపు ముమ్మరం చేసింది. కాగా.. న్యాయస్థానానికి సీబీఐ సమర్పించిన రిమాండ్ నివేదికలో న్యాక్ ర్యాంకింగ్ కుట్రపై పూర్తి వివరాలు వెల్లడించింది.భారీగా ఫీజులు కొల్లగొట్టేందుకే..అక్రమ విధానాలతో న్యాక్ ఏ++ ర్యాంక్ సాధించిన అనంతరం ఆ ర్యాంకింగ్‌ను చూపిస్తూ భారీగా ఫీజులు నిర్ణయించి దోపిడీకి పాల్పడాలన్నది కేఎల్‌యూ యాజమాన్యం ప్రధాన ఉద్దేశని సీబీఐ పేర్కొంది. రిమాండ్ నివేదికలో ఇంకా ఏమున్నాయంటే.. ఇష్టానుసారంగా సెక్షన్లు పెంచేసి భారీగా విద్యార్థులను చేర్పించుకుని భారీ ఫీజులతో దోపిడీకి పాల్పడటమే అసలు లక్ష్యం. ఈ ఏడాది న్యాక్ తనిఖీలు ఉంటాయని తెలిసినప్పటి నుంచి పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అందుకోసం న్యాక్ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహాతోపాటు సభ్యులను మధ్యవర్తుల ద్వారా కొన్ని నెలల ముందుగానే సంప్రదించింది. న్యాక్ ప్రస్తుత సలహదారు ఎం.శ్యామ్‌సుందర్, మాజీ సలహాదారు ఎం.హనుమంతప్ప ఇందులో కీలక పాత్ర పోషించారు. వారి ద్వారా న్యాక్ చైర్మన్, సభ్యులను లోబర్చుకునేందుకు కేఎల్‌యూ యాజమాన్యం పావులు కదిపింది. ఏ++ ర్యాంకింగ్ ఇస్తే భారీగా ముడుపులు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరింది. అందుకోసం న్యాక్ చైర్మన్, సభ్యుల గృహాలకే భారీగా ముడుపులు అందించేలా ఏర్పాట్లు చేసింది. తనిఖీల కోసం కేఎల్యూను సందర్శించినప్పుడు కూడా వారికి భారీగా కానుకలు, ఇతర తాయిలాలు ముట్టజెప్పేందుకు అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసింది.పక్కా సమాచారంతో వ్యూహాత్మక దాడిన్యాక్ ర్యాంకింగ్ కోసం కేఎల్‌యూ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందని ఉమ్మడి విజయవాడ, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచే సీబీఐకి పలువురు ఫిర్యాదు చేశారు. అందుకోసం కేఎల్‌యూ ఎలా వ్యవహరిస్తోందన్నది కూడా నేరుగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి సమాచారమిచ్చారు. దాంతో సీబీఐ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దిగారు. ఢిల్లీ, విశాఖపట్నంలోని సీబీఐ అధికార బృందాలు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌యూ ప్రధాన క్యాంపస్‌తోపాటు దేశంలోని 20 నగరాల్లోని న్యాక్ చైర్మన్, సభ్యులకు చెందిన నివాస గృహాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ అనూహ్య పరిణామంతో న్యాక్ చైర్మన్, సభ్యులు, కేఎల్‌యూ ప్రతినిధులు బిత్తరపోయారు. న్యాక్ చైర్మన్, సభ్యుల వద్ద భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.వాటికి సంబంధించిన వివరాలు అడిగితే న్యాక్ చైర్మన్, సభ్యులు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దాంతో న్యాక్ ర్యాంకింగ్ కోసమే అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. న్యాక్ చైర్మన్, సభ్యుల నుంచి మొత్తం రూ.37 లక్షల విలువైన పరికరాలను జప్తు చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. -
ఉర్దూ అకాడమీలో అంతులేని అక్రమాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీకి కేటాయించిన రూ.కోట్లాది రూపాయలను ఇష్టానుసారం కొల్లగొట్టేశారు. అప్పట్లో ఉర్దూ అకాడమీకి కేటాయించిన దాదాపు రూ.30కోట్లలో ఎంత సద్వినియోగం అయ్యాయి? ఎంత అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి? అనే కోణాల్లో దృష్టిసారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముస్లిం సమాజం కోరుతోంది.విజయవాడలో ఆఫీస్... కర్నూలులో బ్యాంక్ అకౌంట్ విజయవాడలో ఏపీ ఉర్దూ అకాడమీ రాష్ట్ర కార్యాలయం ఉంది. అయితే కర్నూలులోని ఎన్ఆర్ పేట కెనరా బ్యాంకు బ్రాంచిలో ఏపీ ఉర్దూ అకాడమీ పేరుతో అకౌంట్ (33941010001054)ను తెరిచి అక్రమాలకు పాల్పడ్డారు. ఉర్దూ అకాడమీ ఉన్నత ఉద్యోగులు రకరకాల కార్యక్రమాల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. ముస్లింలు లేని చోట కూడా ఉర్దూ భాషాభివృద్ధి సాకుతో ముసాయిరా(కవి సమ్మేళనం) నిర్వహించినట్టు చెబుతూ నిధులు స్వాహా చేశారు.రూ.3.15 కోట్ల స్కామ్‌పై కమిషనర్ ఆరా..తెలంగాణ ఉర్దూ అకాడమీకి రూ.3.15 కోట్లను ఏపీ ఉర్దూ అకాడమీ నుంచి అప్పు ఇచ్చినట్లు ఆడిట్ రిపోర్ట్‌లో వెలుగు చూసిన వ్యవహారంపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ ఇటీవల ఆరా తీశారు. తన కార్యాలయానికి పలువురు సిబ్బందిని పిలిచి ఈ విషయంపై వివరాలు తెలుసుకున్నారు. ఆ నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి అప్పట్లో రికార్డులు సైతం తారుమారు చేశారని, ఆధారాలు ధ్వంసం చేశారని పలువురు ఉద్యోగులు చెప్పినట్లు తెలిసింది. నిధుల మళ్లింపు కేసులో గతంలోనే ఇద్దరి అరెస్టుతెలంగాణ ఉర్దూ అకాడమీకి 2016–17లో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ అప్పు ఇచ్చినట్లు చూపించి రూ.3.15కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్లు ఏపీ లోకాయుక్త ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాజాగా కూటమి ప్రభుత్వం విచారణకు కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు 2018–19లో ఉర్దూ అకాడమీకి చెందిన దాదాపు రూ.4కోట్లను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన వ్యవహారంపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే సీఐడీ 2021లో ఐపీసీ సెక్షన్ 420, 409 రెడ్‌విత్120(బి) కింద కేసు నమోదు చేసింది. అప్పటి ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్‌వలీ (ప్రస్తుతం రిటైర్డ్), సూపరింటెండెంట్ జాఫర్ (ప్రస్తుతం తెలంగాణ ఉర్దూ అకాడమీలో పని చేస్తున్నారు)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించారు. అనంతరం వారు బెయిల్ పొందారు.67 మంది వ్యక్తిగత ఖాతాలకు నిధుల మళ్లింపు ఏపీ ఉర్దూ అకాడమీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కొందరు ఉన్నతాధికారులు అడ్డగోలుగా తమ బంధువులు, అనుయాయుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులు మళ్లించి, ఆ తర్వాత వారి నుంచి తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇలా 2019 ఎన్నికల ముందు హడావుడిగా రూ.3,92,21,500లను ఏకంగా 67 మంది వ్యక్తిగత ఖాతాలకు జమ చేశారు. ఆ డబ్బులను వారి నుంచి తిరిగి తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. వారిలో ప్రధానంగా ఉన్నతాధికారులుగా పనిచేసిన షాహిదుల్లా బేగ్ ఖాతాకు రూ.2.2కోట్లు, సోహెల్ పాషా ఖాతాకు రూ.15లక్షలు, బీఎస్కే సైదా–పి.ఇస్మాయల్ల ఖాతాలకు రూ.3,77,700, షేక్ జాఫర్ బంధువులు, స్నేహితుల ఖాతాలకు రూ.95,22,906 మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. -
అమరావతి ‘ముంపు టెండర్ల’లో అక్రమాల వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు, పాల వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు చేపట్టే పనుల టెండర్లలో అక్రమాలు వరదెత్తాయి. పనుల అంచనా వ్యయాన్ని 100 నుంచి 250 శాతం పెంచేసి.. మూడు ప్యాకేజీలుగా విభజించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల ద్వారా ముఖ్యనేతలు మూడు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటి కాంట్రాక్ట్ విలువ (అన్ని పన్నులతో కలిపి) రూ.1,404.13 కోట్లుగా నిర్దేశించారు. పనుల విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయం రూ.702.33 కోట్లను కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. మూడు ప్యాకేజీల పనులు ఇవీ ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి, లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో రెండేళ్లు నిర్వహించాలని నిబంధనతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.462.26 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా రూ.60.53 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.522.79 కోట్లు. రెండో ప్యాకేజీ ఇదీ రెండో ప్యాకేజీ కింద నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడం.. కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో రెండేళ్లలో పూర్తి చేసి, మరో రెండేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.303.73 కోట్లుగా నిర్దేశించింది.దీనికి అదనంగా రూ.38.57 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.342.3 కోట్లు. ఒకటో, రెండో ప్యాకేజీ పనులకు షెడ్యూళ్లు దాఖలు చేయడానికి ఈనెల 31 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన ఆరి్థక బిడ్లను ఫిబ్రవరి 5న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనున్నారు. మూడో ప్యాకేజీ కింద.. మూడో ప్యాకేజీ కింద మంగళగిరి మండలం నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.470.74 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.539.04 కోట్లు. ఈ పనుల టెండర్లలో షెడ్యూళ్ల దాఖలుకు ఈ నెల 22 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్, ఈనెల 25న ఆర్థిక బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టనున్నారు. అంచనాల్లో పొంగిపొర్లిన అక్రమాలు రాజధాని ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు వంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించడమే.. కొత్తగా 7.843 కిమీల పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, 10 నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ. రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ వంటి పన్నులతో కలిపి)కు మించదని జలవనరుల శాఖలో అనేక ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారి తేల్చిచెప్పారు.ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను జీఎస్టీ వంటి పన్నులతో కలిపి రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. కొండవీటి వాగు, పాల వాగు లోతు, వెడల్పు పెంచే పనులకు కి.మీ. రూ.5 కోట్లు చొప్పున వేసుకున్నా రూ.201.75 కోట్లు అవుతుంది. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.వంద కోట్లు లోపే అవుతుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే..జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉండి ఉంటే టెండర్ ముసాయిదా షెడ్యూల్ దశలోనే ఈ అక్రమాలు బహిర్గతమయ్యేవని.. అందుకే ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు స్పష్టం చేశారు. జాయింట్ వెంచర్‌గా ఏర్పడి టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టడం ద్వారా ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకే పనులు అప్పగించేందుకు ముఖ్యనేతలు ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. అదే టెండర్ నోటిఫికేషన్లో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే వెసులుబాటును కల్పించడాన్ని బట్టి చూస్తే ముఖ్యనేతల దోపిడీ పన్నాగం బట్టబయలవుతుందని రిటైర్డ్ ఎస్ఈ ఒకరు స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి, ప్రతిపాదన దశలోనే పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. వాటిని కమీషన్ల రూపంలో వసూలు చేసుకుని జేబులో వేసుకోవడానికి ముఖ్య నేతలు మరిగారు. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని చేసి.. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని రద్దు చేశారు. రూ.100 కోట్లు.. అంతకంటే వ్యయం ఎక్కువగా ఉన్న పనులకు సంబంధించి టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలి.దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆన్లైన్లో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదా షెడ్యూల్లో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసిన ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదిస్తారు. దాంతోనే సంబంధిత శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగాకే రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ ఇదే తీరురెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.197.05 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం పన్నులతో కలిపి రూ.342.3 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే అంచనా వ్యయం రూ.145.25 కోట్ల మేర పెంచేసినట్టు స్పష్టమవుతోంది. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడానికి.. కిలోమీటర్‌కు రూ.6 కోట్ల చొప్పున రూ.47.05 కోట్లు అవుతుంది.కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్లకు మించదు. మూడో ప్యాకేజీ కింద నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.200 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.339.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టు తేటతెల్లమవుతోంది. -
ధరణి లావాదేవీలపై ‘ఫోరెన్సిక్ ఆడిట్’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత జరిగిన భూముల లావాదేవీలపై ‘ఫోరెన్సిక్ ఆడిట్’నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొల్లగొట్టిన భూముల వివరాలను ఈ ఆడిటింగ్ ద్వారా కూలంకషంగా పరిశీలిస్తామని చెప్పారు. భూభారతి బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇందుకు స్పందించిన మంత్రి పొంగులేటి.. ‘మాకు, బీఆర్ఎస్కు ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందన్నట్టు బీజేఎల్పీ నేత మాట్లాడుతున్నారు. మా నిజాయితీ, చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తాం. పదేళ్ల పాటు పేద ప్రజలను మోసం చేసి గుంజుకున్న ఆస్తులను, భూములను తిరిగి వారికి ఇప్పి స్తాం’అని వెల్లడించారు. ఆ తర్వాత కూడా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ ఆడిట్ సరిపోదని, సీబీఐ విచారణ జరిపించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అక్రమాలు తేలుతాయన్నారు. మంత్రి బదులిస్తూ ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై ప్రాథమిక నివేదిక వచి్చన తర్వాత ఏం చేయాలన్నది పరిశీలిస్తామని, సీఎంతో పాటు మంత్రిమండలిలో చర్చించి, స్పీకర్ అనుమతితో అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్పారు. కేసీఆర్ టేబుల్‌పై ఆ పుస్తకం కనిపించేది.. ప్రముఖ న్యాయకోవిదుడు పడాల రామిరెడ్డి భూ సంస్కరణలపై రాసిన పుస్తకం ఎప్పుడూ కేసీఆర్ టేబుల్‌పై కనిపించేదని మంత్రి పొంగులేటి అంటూ, తన సెల్ ఫోన్లోని ఆ ఫొటోను ప్రదర్శించారు. అలాంటి పుస్తకాలు చదివిన ఆయన రూపొందించే ధరణి అద్భుతంగా ఉంటుందనుకున్నానని, కానీ ప్రజా కంటకంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు రోజుకో వేషం, రోజుకో డ్రామా వేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు.స్పీకర్ పోడియంపైకి కాగితాలు, పుస్తకాలు విసిరివేయడం, బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు వేలు చూపిస్తూ బెదిరించడం లాంటివి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కూడా దాడి చేయాలనే ఉద్దేశంతో తన సీటు వద్దకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెదిరించారని పేర్కొన్నారు. ఈ దొరలను ప్రజలు రాష్ట్రంలో ఉండనీయబోరని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సభలో గూండాయిజం ప్రదర్శించిన వారిపై స్పీకర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ కాపలా కుక్క కాదు.. వేటకుక్క..తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని ఉద్య మ సమయంలో కేసీఆర్ చెప్పారని, అయితే ఆయన వేటకుక్కలా రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. భూభారతి బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు నిరసన తెలుపుతున్న సమయంలో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్, ప్రతిపక్షంలోనూ అబద్ధాలతో కాలం గడపాలనుకుంటోంది. కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా, ప్రతిపక్ష నేత సభలో కనిపించరు.అధికారంలో ఉన్నప్పటి తరహాలో నే ప్రతిపక్షంలో కూడా బీఆర్ఎస్ అరాచకంగా వ్యవహరిస్తోంది. ధరణితో లక్షల మంది ఇబ్బందికి గురికాగా, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎలాంటి సమస్యల్లేవని బుకాయించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన 73 ఏళ్ల మద్దెల కృష్ణయ్య అనే దళిత రైతు 35 ఏళ్ల క్రితం కొన్న ఏడెకరాల భూమి ధరణి పుణ్యాన వేరే వారి పేరిట మారటంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి’ అని పొంగులేటి ధ్వజమెత్తారు. -
కేసులపై కుతంత్రం!
చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం..! విపక్ష ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం!! ఇదీ కూటమి సర్కారు కుట్రల కుతంత్రం! ఒకపక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్‌స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది కూలంకషంగా ఉద్బోధించినట్లు తెలుస్తోంది.చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఓ ప్రైవేట్ న్యాయవాది ఈ సమావేశాన్ని నిర్వహించడం.. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు మరో వైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారి ఒకరు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరినీ అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది!! – సాక్షి, అమరావతి -
అమెరికా అభ్యర్థన రాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కేంద్ర ప్రభు త్వం మొదటిసారిగా అధికారికంగా స్పందించింది. ఇది కేవలం ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు, అమెరికా న్యాయవిభాగాలకు సంబంధించిన న్యాయ పరమై న వ్యవహారమని పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు ఈ విషయం తెలిపారు. అదానీకి నోటీసు/ అరెస్ట్ వారెంట్‌పై అమెరికా నుంచి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన కూడా రాలేదన్నారు. అదానీపై కేసు నమోదుపై ముందుగా అమెరికా భారత ప్రభుత్వా నికి ఎటువంటి సమా చారం ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు. ఈ కేసులో సహకరించాలంటూ అమెరికా ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞాపనా అందలేదని, దీనిపై రెండు ప్రభుత్వాల స్థాయిలో ఏ చర్చా జరగలేదని కూడా జైశ్వాల్ తెలిపా రు. ప్రస్తుతానికి ఈ అంశంతో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన వివరించారు. అదానీ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్న వేళ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. -
అమ్మో.. అమోయ్‌కుమార్!
సాక్షి, హైదరాబాద్: అమోయ్‌కుమార్.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో చేసిన అక్రమాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే కాదు అటవీ, రక్షణశాఖ, కాందిశీకుల భూములనూ తన అధికారాన్ని ఉపయోగించి ధారాదత్తం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహేశ్వరం మండలంలో భూదాన్భూములపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టడంతో ఆయన బారిన పడిన బాధితులు ఒక్కొక్కరుగా ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవైపు ఈడీ విచారణ చేస్తుండగానే.. మరోవైపు హైకోర్టు, అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు 52 ఎకరాల ప్రభుత్వ భూమిని పైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని తప్పుపడుతూ ఆ నిర్ణయాన్ని మంగళవారం కొట్టేయడం చూస్తుంటే.. కలెక్టర్‌గా ఆయన ప్రభుత్వానికి తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించారో తెలుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీపావళి తర్వాత అమోయ్‌కుమార్‌ను మరోసారి విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. – ఆదిబట్లలోని సర్వే నంబరు 44లోని సీలింగ్ భూములైన 18 ఎకరాలను కొంతమందికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వడం పూర్తిగా అధికార దుర్వినియోగమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. – శామీర్‌పేట మండలంలోని తూముకుంటలోని అటవీ భూములకు సంబంధించి సర్వే నంబరు 164లో మొత్తం 26 ఎకరాలను కూడా అన్యాయంగా కొంతమంది వ్యక్తులు, పరిశ్రమల పేరిట పెద్దవారికి ధారాదత్తం చేశారని రాఘవేందర్‌గౌడ్ డాక్యుమెంట్లతో సహా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. – సర్వే నంబరు 165/1, సర్వేనంబరు 1266లోని భూములను కూడా ఒకసారి పరిశీలించాలని అందులో పేర్కొన్నారు. 26 ఎకరాలను మరొకరి పేరిట చేయడమేకాక, మ్యుటేషన్ కూడా చేశారని, ఆ స్థలం అటవీశాఖ ఆ«దీనంలోనే ఉన్నా.. ఇలా మ్యుటేషన్ చేయడంతో వారు ఆ కాగితాలను వినియోగించుకొని రుణాలు కూడా తెచ్చుకున్నారని చెబుతున్నారు. 1953లోనే ఆ సర్వే నంబరులోని భూములు రిజర్వ్ ఫారెస్ట్ కోసం కేటాయించినట్టు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నా, వారసులం అంటూ కొందరు చేసుకున్న దరఖాస్తు ఆధారంగా వారికి ఆ భూములు ధారాదత్తం చేశారని ఆ ఫిర్యాదులో వివరించారు. ఆ భూమి తమదంటూ దరఖాస్తు చేసుకున్న వారసుల తండ్రి 1976లో చనిపోతే.. వారు 2017లో వచ్చి తమ భూమి అంటూ దరఖాస్తు చేసుకోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం వారసులకు భూములు అప్పగించే ముందు ఆ భూమిలో వారి ఆ«దీనంలో ఉందా.. వారు ఆ భూమిని సాగు చేస్తున్నారా.? రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం, దానిపై అభ్యంతరాలను ఆహా్వనించడం, సక్సెషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లను కోరడం, యుఎల్‌సీ, తదితర వాటిని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్న ఆ భూములు ఎవరి ఆ«దీనంలో ఉన్నాయో తెలుసుకోకుండా మ్యుటేషన్ చేశారని ఈడీకి ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. – 261, 273 తదితర సర్వే నంబర్లలోని భూములను కూడా అదే విధంగా అప్పగించారని పేర్కొన్నారు. కూకట్పల్లి సమీపంలోని హైదర్‌నగర్ దగ్గర మూడు ఎకరాల భూమిని కూడా అమోయ్‌కుమార్ ధరణిని అడ్డుపెట్టుకొని ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారన్నారు. – శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్‌మక్తలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా ఆ జాబితా నుంచి తొలగించి కొందరికి అప్పగించారని పేర్కొన్నారు. మరో పిటిషన్.. అమోయ్‌కుమార్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో గోపనపల్లిలో 50 ఎకరాలు, మాదాపూర్‌లో 5 ఎకరాలు, హఫీజ్‌పేటలో 20 ఎకరాలు, మోకిలలో 115 ఎకరాలు, వట్టినాగుల పల్లిలో 20 ఎకరాలు, గండిపేట ఖానాపూర్‌లో 150 ఎకరాలు, మియాపూర్‌లో 27 ఎకరాలు అన్యాక్రాంతం చేశారని బక్క జడ్సన్ మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడంలో ఆయనతోపాటు మాజీ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత రెవెన్యూ ముఖ్యకార్యదర్శిల పాత్ర ఉన్నట్టు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఈవీఎంలలో అవకతవకలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి మరిన్ని ఫిర్యాదులు చేసింది. దాదాపు 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్‌తో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిగతా ఈవీఎంల బ్యాటరీల్లో 80 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉందన్నారు. 99 శాతం చార్జింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తమ పార్టీ ఫిర్యాదులపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవీఎంలను తారుమారు చేశారని వారు అనుమానిస్తున్నారు. అందుకే న్యాయం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. -
‘భూ’చక్రం తిప్పేశారు!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌లో అక్రమాల భూ‘చక్రం’ తిరిగింది. నిబంధనల ప్రకారం సీనియారిటీ ఉన్న సభ్యులకుగానీ, ప్రభుత్వానికి గానీ చెందాల్సిన భూమిని పాలకమండలిలోని ముఖ్యులు పక్కా ప్లాన్‌తో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. సొసైటీలోని ముఖ్యులతోపాటు అధికార యంత్రాంగం కూడా ఈ తతంగంలో భాగస్వామ్యం కావడం గమనార్హం. ప్రభుత్వం ఈ సొసైటీకి కేటాయించిన భూమి నుంచి 304/జీ/111 ప్లాట్‌ను 1988లో సభ్యత్వం నంబర్ 4153గా ఉన్న ఐఏఎస్ నటరాజన్‌కు కేటాయించారు. నటరాజన్ మరణించిన కొన్నేళ్లకు ఆయన కుమారుడు శంకర్ నారాయణన్ పేరుపై సభ్యత్వ బదిలీ జరిగింది. కానీ ఆయన ఇప్పటివరకు ప్రభుత్వ విలువను చెల్లించి ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.ఇలాంటప్పుడు సదరు ప్లాట్‌ను సీనియారిటీ మేరకు తర్వాతి లబ్ధిదారులకు బదిలీ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ అలా చేయలేదు. 36 ఏళ్లు గడిచాయి. ఇప్పటి పాలకమండలి సభ్యులు ‘భూ’ చక్రం తిప్పారు. అతి ఖరీదైన ఈ ప్లాట్‌ను తొలుత శంకర్ నారాయణన్ పేరిట, ఆ వెంటనే సర్దార్ దల్జీత్ సింగ్ అనే మరో వ్యక్తి పేరిట ఒక్కరోజులోనే గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఇది పూర్తిగా సొసైటీ నిబంధనలకు విరుద్ధం.ప్లాట్ ఓనర్ కాకుండానే..సొసైటీ పాలకవర్గం చకచకా స్థలాన్ని శంకర్ నారాయణన్ పేరు మీదకు, తర్వాత గంటల వ్యవధిలోనే దల్జీత్ సింగ్‌కు బదిలీ చేయడం గమనార్హం. శంకర్ నారాయణన్‌కు రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రభుత్వ విలువను సొసైటీకి చెల్లించాల్సిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్ని దల్జీత్ సింగ్ బదిలీ చేశారు. జూన్ 28న నారాయణన్ చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ కోసం రూ.25,89,735.. 29న రూ.60,80,550 చెల్లించారు. విచిత్రమేంటంటే అప్పటికి ఆయన ప్లాట్ ఓనర్ కానే కాదు. అలాగే సొసైటీకి చెల్లించాల్సిన రూ.3,40,67,600ను జూలై 1న బదిలీ చేశారు. డాక్యుమెంట్ నంబర్ 4244/2024తో 529 గజాల భూమి శంకర్ నారాయణన్ పేరు మీదకు మారింది. తర్వాత గంటల వ్యవధిలోనే ఆ భూమిని దల్జీత్ సింగ్ పేరిట మార్చే పని మొదలుపెట్టారు.ఇళ్లు నిర్మించకుండా అమ్మకం చెల్లదుసొసైటీలో భూమి పొందిన లబ్ధిదారులెవరైనా 18 నెలల్లో ఇల్లు నిర్మించకుంటే.. దాన్ని రద్దు చేసే అధికారం సొసైటీకి ఉంటుంది. అసలు ఇల్లు నిర్మించకుండా అమ్మడం చెల్లదనేది సొసైటీ నిబంధన కూడా. రిజిస్ట్రేషన్ పత్రాల్లోనూ ఈ విషయాన్ని పేర్కొంటారు. ఇవేమీ పట్టించుకోకుండా దల్జీత్ పేరు మీదకు రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబర్ 4257/2024) మారిపోయింది. సాధారణంగా ఎవరైనా రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేశాక డాక్యుమెంట్లు రావడానికి వారం రోజుల సమయం పడుతుంది. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చేతికిచ్చారంటే.. అక్రమంలో అధికారుల పాత్ర ఏమిటో తెలిసిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణన్ పేరు మీది డాక్యుమెంట్ రాకుండానే సబ్ రిజిస్ట్రార్ దల్జీత్ పేరిట రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేయడం గమనార్హం. రిజిస్ట్రేషన్ సమయంలో రూ.8 కోట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొన్న దల్జీత్.. రూ.4,25,42,665ను డీడీ రూపంలో నారాయణన్‌కు బదిలీ చేసినట్టు చూపారు. సొసైటీలోని భూమి నారాయణన్ పేరు మీదకు జూలై 1న రిజిస్ట్రేషన్ కాగా.. అదే రోజున దల్జీత్ పేరు మీదకు మారడం గమనార్హం.నిబంధనలను పక్కకు నెట్టి..హౌసింగ్ సొసైటీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం స్థలం మంజూరు చేస్తుంది. కేటాయించిన స్థలంలో గృహ నిర్మాణం చేపట్టాలి. లేదంటే తిరిగి సొసైటీకి స్థలాన్ని అప్పగించాలి. అంటే శంకర్ నారాయణన్ పేరిట స్థలం మారినా.. అందులో ఎలాంటి నిర్మాణం చేపట్టకుండానే దల్జీత్‌కు విక్రయించడం సొసైటీ నిబంధనలకు విరుద్ధం. అంతేకాదు.. స్థలం బదిలీకి ఒకట్రెండు సంవత్సరాలు వేచిచూడాలి, లేదా సొసైటీలోని తర్వాతి లబ్ధిదారులకు కేటాయించాలని చట్టం చెబుతోంది. దీన్ని సొసైటీ పాలకమండలి పూర్తిగా ఉల్లంఘించింది. రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో అధికారులకూ ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల అక్రమం!దల్జీత్‌సింగ్ తన పేరుమీదకు మారిన స్థలంలో నిర్మాణం ప్రారంభించేందుకు జూన్ 18న జీహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేశారు. సొసైటీ నుంచి నారాయణన్ పేరిట జరిగిన రిజిస్ట్రేషన్‌లో 529 గజాల ప్లాట్‌కు గజానికి రూ.64,400 చొప్పున మొత్తం రూ.3,40,67,600గా లెక్కగట్టారు. రూ.25,89,720 స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. ఇదే ప్లాట్‌ను దల్జీత్ పేరిట మార్చిన రిజిస్ట్రేషన్‌లో మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.1,54,228 చొప్పున లెక్కించారు. స్టాంపు డ్యూటీగా రూ.60,80,550 చెల్లించారు. అంటే మొత్తం ప్లాట్ ధర రూ.8 కోట్లుగా చూపారు. (జూన్ 8న ఆర్టీజీఎస్ ద్వారా రూ.25,89,735.. జూన్ 29న ఆర్టీజీఎస్ ద్వారా రూ.3,40,67,600.. జూలై 1న డీడీ రూపంలో రూ.4,25,42,665.. టీడీఎస్‌కు రూ.8 లక్షలు చెల్లించినట్టు చూపారు). నిజానికి జూబ్లీహిల్స్‌లో బహిరంగ మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంది. అంటే ఈ భూమి విలువ రూ.16 కోట్లకుపైనే! అందులో రూ.8 కోట్లు లెక్కకు వచ్చిందని, మిగతా సొమ్ము సంగతి తేల్చాలనే డిమాండ్ వస్తోంది. ఈ వ్యవహారంపై పలువురు ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)’ను ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. -
‘జూబ్లీహిల్స్’.. అక్రమాలు ఫుల్!
సాక్షి, హైదరాబాద్: సహకార హౌసింగ్ సొసైటీలు ఏవైనా.. సొసైటీలో ఇల్లు లేని వారికి తక్కువ ధరతో స్థలం అందేలా చూడటం, సభ్యులు చెల్లించే సొమ్మును, వారి ప్రయోజనాలను పరిరక్షించడం వాటి విధి. కానీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. 1962లో ఎంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సొసైటీ.. కొన్నేళ్ల నుంచి రూట్ మార్చుకుంది. చట్టాన్ని పట్టించుకునేది లేదు.. నిబంధనలను అమలు చేసేది లేదు.. పాలక వర్గానికి తోచిందే చట్టం, వారు పెట్టిందే నిబంధన అన్నట్టు మారింది.కొందరు వ్యక్తులు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారు కొన్నేళ్లుగా సొసైటీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాతవారికి స్థలాలు మంజూరు కాకుండానే కొత్తగా సభ్యులను చేర్చుకునే అక్రమానికి తెరలేపారని మండిపడుతున్నారు. దీనికోసం దశాబ్దాలుగా ఉంటున్న వారిని సొసైటీ నుంచి తొలగించేందుకు ప్రయతి్నంచారని.. సంబంధిత అధికారులు దీన్ని తిరస్కరించారని సమాచారం. తమ పథకం బెడిసికొట్టినా.. కొత్త సభ్యత్వాలను మాత్రం ప్రారంభించడం గమనార్హం. టీవీ–5 చానల్ అధినేత కుమారుడు రవీంద్రనాథ్ అధ్యక్షుడిగా ఉన్న ఈ జూబ్లీహిల్స్ సొసైటీ లీలలు మరెన్నో ఉన్నాయని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. సహకార సూత్రాల మేరకు ఏర్పాటై.. ‘ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సొసైటీ చట్టం’కింద 1962 జూలై 7న ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జేహెచ్‌సీహెచ్‌బీఎస్)’రిజిస్టర్ అయింది. సొసైటీ ఏర్పడినప్పుడు సభ్యుల సంఖ్య 300 మంది. సహకార సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ప్రయోజనాలు కాపాడుతూ.. భూమి కొనుగోలు, అభివృద్ధి చేయాలన్నది నిబంధన. సొసైటీ కోసం 2,500 షేర్లను, ఒక్కో షేర్‌కు రూ.100 చొప్పున నిర్ణయించి.. మొత్తంగా రూ.2.5 లక్షల మూలధనంతో సొసైటీని ప్రారంభించారు. నిబంధనల మేరకు జూబ్లీహిల్స్లోనే ఈ సొసైటీ కార్యకలాపాలు నిర్వహించాలి.సభ్యుల్లో ఎవరైనా తన పేరిట, తన భార్య, పిల్లల పేరు మీద షేర్లు కొనుగోలు చేయవచ్చు. అయితే సొంత ఇల్లు లేనివారే సభ్యుడిగా ఉంటారు. 1964లో ప్రభుత్వం షేక్‌పేట్ సర్వే నంబర్ 403లో 1,195 ఎకరాలు, హకీంపేట్ సర్వే నంబర్ 102లో 203 ఎకరాలు కలిపి మొత్తంగా 1,398 ఎకరాలను కేటాయించింది. ఇందులో.. 1971లో 1,345.40 ఎకరాలను, 1972లో 40.67 ఎకరాలను కలిపి.. 1,386.07 ఎకరాలను సొసైటీకి అందజేసింది. సొసైటీ ఈ భూమిలో 1984 నుంచి 1991 మధ్య 3,035 మంది సభ్యులకు ప్లాట్లను అందజేసింది. సభ్యులకు ఒకసారి ప్లాట్ అందినా, లేదా సభ్యుడయ్యాక హైదరాబాద్ నగరంలో ఇల్లు ఉన్నా వారు మరో ప్లాట్ పొందేందుకు అనర్హులు. విక్రయించడం చట్టవిరుద్ధం ఒకరి ప్లాట్‌ను మరో సభ్యుడికి బదిలీ చేయడంగానీ, అసలు సభ్యత్వమే లేని వారికి విక్రయించడంగానీ చట్టవిరుద్ధం. ఒకవేళ ఏవైనా అనివార్య కారణాలతో సభ్యుడెవరైనా ప్లాట్ బదిలీ చేయాలని భావిస్తే.. దాన్ని సొసైటీకి అప్పగించాలి. ప్లాట్ పొందేటప్పుడు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా సొసైటీ తిరిగి చెల్లించాలి. ఈ స్థలాన్ని సొసైటీలో సీనియారిటీ ప్రకారం వెయిటింగ్‌లోని లబ్ధిదారులకు మంజూరు చేయాలి. వీరి నుంచి ప్రభుత్వ మార్కెట్ విలువ, ఇతర చార్జీలు వసూలు చేయవచ్చు. మేనేజింగ్ కమిటీ అనుమతి లేకుండా సభ్యుడు స్థలాన్ని విక్రయించడానికి వీలులేదు. అలా ఎవరైనా విక్రయిస్తే అది చట్టవిరుద్ధంగా, కొనుగోలు చేసినవారిని ఆక్రమణదారుగా పరిగణిస్తారు. ఇక సొసైటీలోని సభ్యులందరికీ ఇంటి స్థలం మంజూరుకాకుండా.. కొత్తగా సభ్యులను తీసుకోవద్దని నిబంధన చెబుతోంది. ఉదాహరణకు 90 మందికి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంటే 100 మందిని సభ్యులుగా తీసుకోవాలి. లబి్ధపొందని వారు 10 శాతానికి మించి ఉండటానికి వీలులేదు. కానీ జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలాలు అందనివారు 30 శాతానికి పైనే.. 800 మందిని తొలగించే ప్రయత్నం.. సొసైటీలో కేవైసీ (పూర్తి చిరునామా, ఇతర వివరాలు) లేదని, జనరల్ బాడీ సమావేశానికి హాజరుకావడం లేదని.. ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ కూడా లేదని కారణాలు చూపుతూ దశాబ్దాలకుపైగా ఉన్న 800 మంది సభ్యుల తొలగింపునకు సొసైటీ పాలకవర్గం ఎత్తులు వేసింది. 2024 మార్చి 24లోగా కేవైసీ అందజేయాలంటూ సభ్యులను ఆదేశించింది. అనుకున్నదే తడవుగా వివరాలు ఇవ్వని 800 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. జాబితా కూడా సిద్ధం చేసి పంపగా.. హౌసింగ్ అధికారులు దీనికి ససేమిరా అనడంతో తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే అంగ బలం, ఆర్థిక బలంతో ఈ తొలగింపు జాబితాకు అధికారులు ఆమోదముద్ర వేసేలా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. సొసైటీ పాలకవర్గం తీరును నిరసిస్తూ కొందరు సభ్యులు కరపత్రాలు వేసి, పంచినా కూడా.. వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. ‘రియల్’దందా కోసమే.. సొసైటీలో అసలు స్థలమే లేనప్పుడు సభ్యులను తొలగించడం ఎందుకు? కొత్త వారిని చేర్చుకోవడం ఎందుకు? అనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఇక్కడే సదరు అక్రమార్కులు చక్రం తిప్పడం ప్రారంభించారు. కొత్త సభ్యత్వాల పేర రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. సొసైటీకి సంబంధం లేని వెంచర్లో అమ్మకాలు ప్రారంభించారు. అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమంటూ అంటగడుతున్న ఆ వెంచర్ ఏంటి? ఎక్కడ ఉంది? ప్లాట్ల అమ్మకాల ‘రియల్’కహానీ రెండో భాగంలో.. ప్రస్తుతం సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య: 4,962 మంది వీరిలో స్థలం పొందిన లబి్ధదారులు: 3,035 మంది ఇంకా ప్లాట్లు రానివారు: 1,927 మంది మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులే.. జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలం మంజూరు కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నవాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటివరకు వారికి స్థలం అందించే దిశగా ఎలాంటి చర్యలు లేవు. మొత్తం 1,927 మంది ఎదురుచూస్తుండగా.. పలు కారణాలతో 800 మందిని తొలగించారు. వారి స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా 800 మందిని తీసుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. మిగిలిన 1,145 మందికి స్థలాలు వచ్చే వరకు కొత్త వారిని చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నాం. క్లబ్ కోసమంటూ కొత్త వారిని చేర్చుకుంటే ఒత్తిడి పెరిగి, అసౌకర్యంగా మారుతుంది. – ప్రభాకర్‌రావు, సొసైటీ సభ్యుడు10 శాతానికి మించి ఉండొద్దు.. కో–ఆపరేటివ్ చట్టంలోని సెక్షన్–19 ప్రకారం స్థలాలు ఉంటేనే కొత్త సభ్యులను చేర్చుకోవాలి. ప్రస్తుతానికి సొసైటీ వద్ద ఖాళీ స్థలం లేదు. అంతేకాదు స్థలం పొందని సభ్యులు 10శాతానికి మించి ఉండకూడదని హౌసింగ్ సొసైటీ నిబంధన. కొత్తవారి నుంచి షేర్ వ్యాల్యూ కేవలం రూ.300 తీసుకుని దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులపై వారికి కూడా హక్కులు వర్తింపజేస్తున్నారు. క్లబ్, స్కూల్, కమ్యూనిటీ సెంటర్ ఇలా అన్నింటిలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? – విజయభాస్కర్‌రెడ్డి, సొసైటీ సభ్యుడుసొసైటీది సహాయక పాత్ర మాత్రమే.. వివిధ కారణాలతో సొసైటీ నుంచి 800 మంది వెళ్లిపోయారు. వారికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. జనరల్ బాడీ ఆమోదంతోనే వారిని తొలగించాం. కొత్త సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. 800 మందికి మించి తీసుకోం. వీరితోపాటు ఇంకా స్థలాలు రానివారు దాదాపు 1,200 మంది ఉన్నారు. ఈ రెండు వేల మంది కలిసి నిర్మించుకుంటున్న వెంచర్ జూబ్లీహిల్స్ ఫేజ్–4. కాస్ట్ టు కాస్ట్ (ఖర్చులు) ధరకే వీరికి ఫ్లాట్లు అందనున్నాయి. వీరంతా సొసైటీ సభ్యులే అయినందున మేం ఫెసిలిటేటర్‌గా ముందుకు వచ్చాం. వెంచర్‌ను నిపుణులైన కమిటీ పర్యవేక్షిస్తుంది. సొసైటీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా వెంచర్ కోసం ఖర్చు చేయడం లేదు. చట్టప్రకారం, జనరల్ బాడీ అనుమతితోనే చర్యలు చేపడుతున్నాం. – రవీంద్రనాథ్, సొసైటీ అధ్యక్షుడు సభ్యత్వం తొలగింపుపై చట్టం ఏం చెబుతోంది? చట్టప్రకారం ఎవరి సభ్యత్వమైనా తొలగించాలంటే.. ఎందుకు తీసివేస్తున్నామో కారణాలు వెల్లడిస్తూ వారికి నోటీసులు జారీ చేయాలి. తర్వాత వారి వివరణను పరిశీలించాలి. దానిపై సంతృప్తి చెందకుంటే తీసివేతపై మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ తొలగింపు చట్ట వ్యతిరేకమని సభ్యుడు భావిస్తే.. ట్రిబ్యునల్‌ను, ఆ తర్వాత కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే తొలగింపుపై సొసైటీ నోటీసులు జారీచేసినా అవి చాలా మందికి అందలేదని.. వారి వివరణ కూడా రాకుండానే, తొలగిస్తూ జాబితాను సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యత్వం తొలగింపునకు సంబంధించి ఒక ఫిర్యాదు అందినట్టు తెలిసింది. ఇక కొత్తగా సభ్యులను చేర్చుకునే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సొసైటీలో లబి్ధపొందని వారు 10శాతం దాటకుండా ఉండాలి. అలాంటిది స్థలం దక్కనివారు ఇప్పటికే 30శాతం ఉన్నా.. కొత్త వారిని ఎలా తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సొసైటీని వివరణ కోరగా.. వివిధ కారణాలతో 800 మందిని తొలగించామని, ఆ స్థానంలో కొత్తవారిని తీసుకుంటున్నామని వెల్లడించడం గమనార్హం. -
ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌లో కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము గోల్మాల్ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో బాధిత ఖాతాదారులు గురువారం బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్థానిక బ్యాంకు బ్రాంచిలో కొన్నేళ్లుగా పలువురు ఫిక్స్డ్ (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు(ఆర్డీ) చేయడంతో పాటు గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఆర్డీకి సంబంధించి వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు వచ్చిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఒక్కొక్కరుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్ల విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజనల్ హెడ్ రమేశ్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో గతంలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేశ్ చంద్రశేఖర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. డిపాజిట్లు రెన్యువల్ చేయకపోవడం, ఓవర్ డ్రాఫ్ట్‌లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇతర సిబ్బంది హస్తంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14మంది బ్యాంకు ఖాతాదారులు పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు రూ.6.9కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్మాల్ జరిగిందని చెప్పారు. అంతేకాకుండా, మరో రూ.30 కోట్ల వరకు ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యందీనిపై జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, అది పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ "ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎల్లప్పుడూ కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశాం. బ్యాంకులో మోసాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం" అన్నారు -
గోల్డ్ లోన్ల మంజూరులో లోపాలు.. ఆర్బీఐ డెడ్‌లైన్
బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాల మంజూరులో లోపాలపై గోల్డ్ లోన్ సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డెడ్‌లైన్ విధించింది. ఈ మేరకు రుణాలు మంజూరు చేసే పద్ధతుల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది.ఆర్బీఐ ఇటీవల నిర్వహించిన సమీక్షలో సోర్సింగ్, మదింపు, వాల్యుయేషన్, డ్యూ డిలిజెన్స్, ఎండ్-యూజ్ మానిటరింగ్, వేలం పారదర్శకత, లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) మానిటరింగ్, రిస్క్-వెయిట్ అప్లికేషన్లో గణనీయమైన లోపాలు బయటపడ్డాయి. దీంతో బంగారు రుణాలకు సంబంధించి తమ విధానాలు, ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించుకోవాలని సంబంధిత గోల్డ్ లోన్ సంస్థలకు ఆర్బీఐ సూచించింది.ఆర్బీఐ గుర్తించిన ప్రధాన లోపాలు⇒ రుణాల సోర్సింగ్, మదింపు కోసం థర్డ్ పార్టీలను ఉపయోగించడంలో లోపాలు⇒ కస్టమర్ లేకుండానే బంగారం మదింపు⇒ తగిన శ్రద్ధ, బంగారు రుణాల తుది వినియోగ పర్యవేక్షణ లేకపోవడం⇒ డిఫాల్ట్ అయిన రుణాలకు సంబంధించిన బంగారు ఆభరణాల వేలంలో పారదర్శకత లేకపోవడం⇒ ఎల్టీవీ పర్యవేక్షణలో లోపాలు⇒ రిస్క్-వెయిట్ల అమలులో తప్పులుఅంతేకాకుండా అవుట్సోర్స్ కార్యకలాపాలు, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై తగిన నియంత్రణలు ఉండేలా చూసుకోవాలని గోల్డ్ లోన్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. ఇందు కోసం నెలల నెలల గడువును విధించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. -
విచారణ చేపట్టండి
బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఉదంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రంగం సిద్ధమైంది. సిద్ధరామయ్యను విచారించాలని లోకాయక్త పోలీసులకు బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచి్చంది. దీంతో సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణను లోకాయుక్త పోలీసులు మొదలుపెట్టనున్నారు. సిద్ధూ భార్యకు ప్రభుత్వ వెంచర్లలో 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారన్న ఫిర్యాదుల మేరకు సిద్ధూపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధూ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడం, ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోశ్ గజానన్ భట్ ఆదేశాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచి్చన ఫిర్యాదు మేరకు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎంపీల సంబంధిత కేసులను విచారించే ఈ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచి్చంది. మూడు నెలల్లోగా అంటే డిసెంబర్ 24వ తేదీకల్లా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమరి్పంచాలని జడ్జి సూచించారు. ముఖ్యమంత్రిపై ఉన్న ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పెషల్ కోర్టుకు ఆగస్ట్ 19న తాము ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాజాగా ఉపసంహరించుకోవడంతో స్పెషల్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడానికి వీలు కల్గింది. ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి, స్వామికి ఈ భూమిని అమ్మిన దేవరాజులను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. విచారణను ఎదుర్కోవడానికి సిద్ధం దర్యాప్తు మొదలుపెట్టాలని లోకాయుక్తకు ఆదేశాలు రావడంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని గతంలోనే చెప్పా. ఎలాంటి దర్యాప్తునకు నేను భయపడను. చట్టప్రకారం పోరాటానికి నేను సిద్ధం. కోర్టు ఉత్తర్వుల కాపీలో ఏముందో చదివాక మళ్లీ మాట్లాడతా’’ అని సిద్ధరామయ్య అన్నారు. -
అధికారమే అండ.. అక్రమాలే అజెండా
సాక్షి, నంద్యాల/నంద్యాల (సిటీ): అధికారమే అండగా న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ రెచి్చపోతున్నారు. కనిపించిన భూమిని హస్తగతం చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. సామాన్యులను వేధిస్తూ మాట వినని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. సుప్రీం కోర్టులో కేసు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన తీరు మారడం లేదు. నంద్యాల పద్మావతి నగర్‌లోని సర్వే నంబర్ 706–ఏ9లో 1.16 సెంట్ల భూమి ఉంది.ఇందులో 58 సెంట్లను రామిశెట్టి వెంకటన్న (28 సెంట్లు), నిమ్మకాయల బాలనారాయణ (30 సెంట్లు) ఖతీఫ్ ఖాజా హుస్సేన్, ఖతీఫ్ నూర్‌అహ్మద్ నుంచి 2010లో కొనుగోలు చేశారు. ఈ స్థలం పక్కనే సర్వే నంబర్ 700–ఏలో మంత్రి ఫరూక్‌కు స్థలం ఉంది. దీంతో పక్కనే ఉన్న స్థలంపై ఆయన కన్ను పడింది. స్థలాన్ని కబ్జా చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. డాక్యుమెంట్స్ పక్కాగా ఉండటంతో కోర్టుల్లో దొంగ కేసులు వేసి బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. సర్వే రిపోర్టు బయటకు రాకుండా రిట్ మంత్రి వేధింపులు భరించలేక రామిశెట్టి వెంకటన్న, నారాయణ ఇద్దరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు సాగిన తర్వాత 2023లో బాధితులకు అనుకూలంగా తీర్పు వచి్చంది. ఆర్డర్ కాపీని స్థానిక కోర్టులో అందజేశారు. ఆ తర్వాత తమ స్థలాన్ని సర్వే చేయాలని కోరుతూ ఇద్దరు ప్రభుత్వానికి చలానాలు కట్టారు. ఇదే అంశంపై అదే ఏడాది జూలై 10న నంద్యాల కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. తమ స్థలాన్ని సర్వే చేసి తమకు అప్పగించాలని కోరారు.స్పందించిన అప్పటి కలెక్టర్ సెపె్టంబర్ 5న సిబ్బందితో సర్వే చేయించి నివేదికను సిద్ధం చేశారు. నివేదిక బాధితులకు అనుకూలంగా ఉందన్న విషయం తెలుసుకున్న ఫరూక్ హైకోర్టులో అధికారులపై ఆగమేఘాల మీద రిట్ పిటిషన్ వేశారు. తప్పుల తడకగా సర్వే చేశారని గొలుసుల ద్వారా కాకుండా శాటిలైట్ ద్వారా సర్వే చేయడంతో తప్పులు దొర్లినట్టు రిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సర్వే అంశం మాత్రమే కోర్టులో నడుస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. సుప్రీం తీర్పుతో ఖాళీ స్థలానికి పన్ను 706–ఏ9లో ఉన్న భూమి మంత్రి ఫరూక్, ఆయన బంధువులకు చెందినదిగా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తేల్చడంతో బాధితులకు కొండంత భరోసా వచి్చంది. సుప్రీం తీర్పు కాపీని స్థానిక మున్సిపల్ కార్యాలయానికి కూడా పంపించారు. దీంతో ఇన్చార్జి ఆర్వో వెంకటకృష్ణ, ఆర్ఐ గులాం హుస్సేన్ సంబంధిత స్థలానికి రూ.55,980 వీఎల్టీ (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) వేశారు. విషయం తెలుసుకున్న మంత్రి పీఏ అనిల్ మంగళవారం మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి ఇద్దరు అధికారులను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ మీ అంతు చూస్తామని బెదిరించారు. మంత్రి ఒత్తిడి మేరకు అదే రోజు రాత్రి ఎలాంటి విచారణ చేయకుండానే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ కమిషనర్ నిరంజన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.కౌన్సిల్ ఆమోదానికి చైర్‌పర్సన్‌పై ఒత్తిడి మునిసిపల్ పరిధిలోని ఆస్తి లేదా స్థలాలపై ఒకసారి పన్ను విధిస్తే దాన్ని రద్దు చేయాలంటే కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. దీంతో 706–9ఏపై విధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను కౌన్సిల్ ముందుంచి రద్దు చేయాలని మంత్రి అనుయాయులు మునిసిపల్ చైర్‌పర్సన్‌పై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. అధికారం తమ చేతిలోనే ఉందని.. తమకు అనుకూలంగా పని చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ స్థలం విలువ రూ.58 కోట్లపైనే..పట్టణ నడి»ొడ్డున గల ఈ స్థలం విలువ సెంటు రూ.కోటిపైనే పలుకుతోంది. రూ.58 కోట్లకు పైగా విలువ కలిగిన 58 సెంట్లను కొట్టేసేందుకు మంత్రి ఫరూక్ తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. మరోవైపు పట్టణంలో ఆయనకు చెందిన థియేటర్‌ను సెటిల్మెంట్లకు అడ్డాగా చేసుకున్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద భూములకు సెటిల్మెంట్ చేయడం, అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలు, తన అనుచరులకు సంబంధించిన గొడవల సెటిల్మెంట్లు అన్నీ థియేటర్ నుంచే సాగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. -
రూ. 60 లక్షలు కాదు.. రూ. 2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో అక్రమాలు రోజురోజుకు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన ‘మార్క్‌ఫెడ్‌లో రూ. 60 లక్షలు మాయం’ కథనంతో మరిన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో రూ. 60 లక్షలు మాయమైనట్లు తేలగా ఇప్పుడు ఆ జిల్లాతోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ ఇటువంటి అక్రమాలు జరిగినట్లు మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే చెబుతు న్నారు.ఖమ్మం జిల్లాలో రూ. 70 లక్షలు, నల్లగొండ జిల్లాలో 50 లక్షలు, ఆదిలాబాద్ జిల్లాలో రూ. 40 లక్షల వరకు మార్క్‌ఫెడ్ ఎరువుల సొమ్మును కొందరు ఉద్యోగులు కాజేశారని అంటున్నారు. అంటే మొత్తంగా రూ. 2.20 కోట్లు కాజేసినట్లు అంచనా. అయితే కరీంనగర్ విషయం బయటపడటంతో అక్కడి అధికారులపై చర్యలు చేపట్టి అక్రమాలపై విచారణకు ఆదేశించారు. కానీ మిగిలిన జిల్లాల్లో జరిగిన వాటిపై మాత్రం నోరుమెదపడంలేదు. ఏళ్లుగా అక్రమాలు జరుగుతున్నా వాటిపై నిఘా ఎందుకు పెట్టలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి. డీసీఎంఎస్ సేల్ పాయింట్ల ద్వారా అక్రమాలు...మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా, డీఏపీ సహా వివి ధ రకాల ఎరువులను జిల్లాలకు పంపిస్తారు. వాటి లో కొంతభాగాన్ని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల ద్వారా రైతులకు సరఫరా చేస్తారు. అందుకోసం కొందరు ప్రైవేట్ ఎరువుల దుకాణదారులకు లేదా నిరుద్యోగుల కోసం డీసీ ఎంఎస్ ఆధ్వర్యంలో సేల్ పాయింట్లను ఇచ్చారు. వాటికి లైసెన్సులు కూడా మంజూరు చేసి ఎరువు లు సరఫరా చేస్తున్నారు. అందుకు అవసరమైన సొమ్మును సేల్పాయింట్ల నుంచి తీసుకోవాలి. అయితే కరీంనగర్ జిల్లా మార్క్‌ఫెడ్ అధి కారులు రికార్డులను సరిగ్గా నిర్వహించకపోవడం, డేటా తారుమారు చేయడం, రికార్డుల చోరీ, ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు మార్క్‌ఫెడ్ గుర్తించింది.డీసీఎంఎస్ వేములవాడ సేల్ పాయింట్లో ఎరువుల బకాయిలు రూ. 76.77 లక్షలు దుర్వినియోగం అయినట్లు తేల్చింది. అందులో ఇప్పటివరకు రూ. 16 లక్షలు రికవరీ చేయగా ఇంకా రూ. 60.77 లక్షల మేర బకాయిలు అక్రమార్కుల వద్దే ఉన్నాయి. అలాగే ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లోనూ అక్రమాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆయా జిల్లాల మార్క్‌ఫెడ్ అధికారుల ప్రోత్సాహంతోనే అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. 1,100 డీసీఎంఎస్ సేల్ పాయింట్లలో ఎన్నింటిలో అక్రమాలు జరుగుతున్నాయో విచారణ చేపట్టాల్సిన అవసరముందన్న చర్చ జరుగుతోంది. వాటిపై నిఘా కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విచారణాధికారిణిగా సీఎఫ్ఎంకరీంనగర్లో రూ. 60 లక్షలు దుర్వినియోగ మైనట్లు గుర్తించాం. ప్రాథమిక విచారణ నివే దిక ఆధారంగా మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌ను ఎరువుల బకాయిల వసూలుకు పూర్తి బాధ్యత వహించాల్సిందిగా ఆదేశించాం. ఈ ఉదంతంపై మార్క్‌ఫెడ్ చీఫ్ ఫెర్టిలైజర్ మేనేజర్ (సీఎఫ్ఎం)ను విచారణాధికారిగా నియమించాం. తదుపరి నివేదిక అందాక తగిన చర్యలు తీసుకుంటాం. – విష్ణువర్ధన్‌రావు, జనరల్ మేనేజర్, మార్క్‌ఫెడ్ -
NEET-UG 2024: సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: ఖర్గే
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పేపర్ లీక్‌లు, పరీక్షల్లో రిగ్గింగ్‌లతో కోట్లాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. నీట్లో గ్రేసు మార్కులు మాత్రమే సమస్య కాదని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని, పేపర్ లీక్ అయ్యిందని, పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నీట్ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత దర్యాప్తునకు తాము డిమాండ్ చేస్తామని తెలిపారు. -
తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే కఠిన చర్యలు: చంద్రఘోష్
సాక్షి, హైదరాబాద్: విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయని కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీలో సమావేశం అయ్యాం. వాళ్లను అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పాను. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నాను. ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్టు అందించామన్నారు. ఏజెన్సీలను నిర్మాణం, డిజైన్, మెయింటెనెన్స్ గురించి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని అదేశించాను. ఏది చెప్పినా, ఎవరూ కమిషన్‌కు చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలి. ఈ నెలాఖరు లోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని అదేశించాం’’ అనివ చంద్రఘోష్ పేర్కొన్నారు.ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తాం. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమని చెప్తున్నా’’ అని చంద్రఘోస్ వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళతో అఫిడవిట్ వచ్చాక ఇతర వ్యక్తులను కూడా పిలుస్తాను. కొంతమంది అధికారులు స్టేట్‌లో లేరు. వాళ్లను కూడా విచారణ చేస్తాం. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి.. వాళ్లను కూడా విచారణ చేస్తాం. తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే మాకు తెలిసిపోతుంది’’ అని చంద్రఘోష్ తెలిపారు. -
కాళేశ్వరం విచారణ.. జస్టిస్ చంద్ర ఘోష్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇవాళ 20 మందికిపైగా తాజా, మాజీ అధికారులు కమిషన్ ముందు హాజరయ్యారు.ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ కమిషన్ జస్టిస్ చంద్ర ఘోష్.. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు బ్యారేజీలు సంబంధించి సమాచారం తెలుసుకున్నానని తెలిపారు. 25 జూన్ లోపు విచారణకు వచ్చిన అందరూ అఫిడవిట్ ఫైల్ చేయాలి అని చెప్పాను జరిగిన, తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని చెప్పాం. తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు తేలితే చట్టపరంగా చర్యలు ఉంటాయి’’ అని చంద్ర ఘోష్ స్పష్టం చేశారు.ఇంజనీర్లతో నిన్న, ఈ రోజు(సోమ,మంగళ) సమావేశం జరిపాను.రేపటి నుంచి ఏం చేయాలన్నది అనే దానిపై లిస్టు రెడీ చేస్తాం. త్వరలో నిర్మాణ సంస్థలను పిలుస్తాం. ప్రతీ ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులో అధికారులు ఉంటే వాళ్లకు నోటీసులు ఇస్తాము. బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుంది. ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్ల ఇలా జరిగిందనిపిస్తోంది. బ్యారేజీల వల్ల లాభం తప్ప నష్టం లేదు అని అనిపిస్తోంది. -
తోడు దొంగలు
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు, చెరుకూరి రామోజీరావు.. అందరికీ చిరపరిచితమైన ఈ తోడు దొంగలు పైకి అత్యంత సత్యవంతులుగా, నీతీ నిజాయితీల గురించి ఒకరు మాటల్లో, మరొకరు రాతల్లో లెక్కలేనన్ని పాఠాలు చెబుతూ సమాజ నిర్దేశకులుగా కనిపిస్తారు. వారి చరిత్ర చూస్తే అంతా అవినీతి, అక్రమాలే. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, నయవంచనలే పరమపద సోపానాలుగా ఎదిగిన వారు.రాజకీయ నాయకుడిగా చంద్రబాబు, మీడియా అధిపతిగా రామోజీరావు 40 ఏళ్లుగా ఒకరికొకరు సహకరించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. రాజకీయంగా చంద్రబాబును ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి రామోజీరావు అన్ని రకాలుగా అండదండలు అందించారు. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు చంద్రబాబు బరితెగించి సహకరించారు. చంద్రబాబు కోసం రామోజీ తన మీడియాను విశృంఖలంగా ఉపయోగించారు. ఈ ఎన్నికల్లోనూ సిగ్గు విడిచి, బట్టలూడదీసుకుని మరీ అబద్ధాల యుద్ధం చేశారు.జీజే రెడ్డి అనే ప్రముఖుడి దగ్గర గుమస్తాగా చేరి ఆయన ఆస్తులన్నింటినీ కొట్టేసిన ఘరానా దొంగ రామోజీ. మార్గదర్శి చిట్‌ఫండ్స్, ఈనాడు కూడా జీజే రెడ్డి ఆలోచనలే. జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు నమోదవడంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. దీంతో ఆయన ఆస్తులన్నింటినీ రామోజీరావు సొంతం చేసుకున్నారు. మార్గదర్శిలో రామోజీ వాటా కేవలం రూ.10 మాత్రమే. మిగిలిన పెట్టుబడి అంతా జీజే రెడ్డిదే. దీనిపై ఇటీవల ఆయన కుమారుడు యూరీ రెడ్డి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.జీజే రెడ్డే కాదు.. సొంత బంధువులను కూడా మోసం చేసి విజయవాడ, విశాఖలో వారి ఆస్తులు కొల్లగొట్టారు రామోజీ. ఇలా దోపిడీ మార్గాల్లో సమకూర్చుకున్న ఆస్తులను రక్షించుకునేందుకు రాజకీయాలను ఉపయోగించుకున్నారు. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నారు. దీనికి ఎన్టీఆర్ అంగీకరించకపోవడంతో అధికారం కోసం గుంట నక్కలా వేచి చూస్తున్న చంద్రబాబును చేరదీశారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి చంద్రబాబుతో కలిసి కుట్ర పన్నారు.రామోజీ అండదండలతో చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రామోజీరావు వ్యాపారాలకు అన్ని రకాలుగా సహకరించారు. చంద్రబాబు అవినీతికి రామోజీ సహకరించారు. ఈనాడు విస్తరణ, మార్గదర్శి ద్వారా వేల కోట్లు దోచుకోవడానికి, ఫిలిం సిటీకి వేలాది ఎకరాల పేదల భూములు కొట్టేయడానికి సహకరించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రామోజీ సంస్థలు వేల కోట్లకు ఎదిగాయి.చంద్రబాబు ఏలేరు, ఐఎంజీ భారత్ కుంభకోణాలకు రామోజీ మద్దతుచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలు, అక్రమాలకు రామోజీ కప్పెట్టేశారు. బాబు ఎంత భయంకరమైన స్కాములు చేసినా ఈనాడులో ఒక్క అక్షరం రాయలేదు సరికదా, ఆయన్నో గొప్ప విజనరీగా చిత్రీకరించారు. ఐఎంజీ భారత్, ఏలేరు భూముల కుంభకోణాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారు.హైదరాబాద్‌లో స్టేడియంలు నిర్మించి, ఒలింపిక్ క్రీడాకారులను తయారు చేసే పేరుతో ఐఎంజీ భారత్‌కి 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉండగా చంద్రబాబు 800 ఎకరాలను అక్రమంగా కేటాయించాడు. దీన్ని కోర్టు తప్పు పట్టింది. ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని ఇటీవల తీర్పు కూడా ఇచ్చింది. ఇలాంటి ఎన్నో అక్రమాలను కప్పి పుచ్చి చంద్రబాబును గొప్ప నేతగా చూపించే ప్రయత్నం చేశారు రామోజీ. 2004లో ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు రాజకీయంగా సహకారం అందించారు.రామోజీ బంటుగానే చంద్రబాబుతన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడిన రామోజీకి చంద్రబాబు ఎప్పుడూ బంటుగానే ఉన్నారు. ఈనాడు గ్రూపు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని దివాలా తీసే పరిస్థితులకు వెళ్లినప్పుడు చంద్రబాబు సహకారం అందించారు. మార్గదర్శి అక్రమాలు బయటపడి రామోజీ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కోసం నిలబడి తెరవెనుక నుంచి మద్దతు పలికారు. దీనికి ప్రతిగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు రామోజీ శాయశక్తులా ప్రయత్నించారు.2014–19 సంవత్సరాల మధ్య ప్రపంచమే నివ్వెరపోయేలా జరిగిన అమరావతి భూముల కుంభకోణం సహా ఆయన చేసిన అరాచకాలని్నంటినీ రామోజీ కప్పిపుచ్చారు. ఈ ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును గెలిపించేందుకు సిగ్గు ఎగ్గు వదిలేసి ప్రజల మెదళ్లలో విషం ఎక్కించేందుకు సర్వశక్తులూ ఒడ్డారు.ఇలా ఆది నుంచి తోడు దొంగల్లా బాబు, రామోజీ ఒకరికొకరు ఆలంబనగా నిలబడి మోసాలు, కుట్రలతో ప్రజలను వంచిసూ్తనే ఎదిగారు. ఇప్పుడు కూడా వాటినే అస్త్రాలుగా ఉపయోగించుకుని ఈ దొంగలిద్దరూ మళ్లీ అధికారంలోకి వచ్చి దోపిడీని కొనసాగించాలని తహతహలాడుతున్నారు. కానీ నమ్మకం, నయవంచనలకు నిలువెత్తురూపాలైన ఈ ఇద్దరు రాక్షసుల ఆటలు సాగే పరిస్థితులు కనిపించట్లేదు. -
అరాచకాల అసత్యమూర్తి
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : సత్యం...శివం..సుందరం...అంటారు...ఈ టీడీపీ మాజీ మంత్రి పేరులో మాత్రమే సత్యముంది.. మనిషి స్వభావమే అసత్యం. మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేదు.. సాటి మహిళా ప్రజాప్రతినిధులను అసభ్యకరమైన భాషలో నిందిస్తుంటారు. ఈయన తాను ఏలిన నియోజకవర్గంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. ఈయన తనయుడూ తండ్రికి తగ్గవాడే. ఓ దళిత మహిళపై దుశ్శాసన పర్వం సాగించి, ఆమె భూమిని కబ్జా చేసిన చరిత్ర ఈ తండ్రీ కొడుకులది. నియోజకవర్గంలో భూములను కాజేశారు. క్వారీలను కొల్లగొట్టారు. ఎన్టీఆర్ గృహకల్ప పేరిట ప్రభుత్వ భూములనూ కబళించారు.ఇన్ని ఆగడాలు చేసిన ఈ మాజీకి ఇటీవల టికెట్ విషయంలో టీడీపీ అధినేత నుంచి అవమానాలూ ఎదురై ...మంచంపట్టి...కన్ను లొట్టపోయి.. ఇప్పుడు మళ్లీ మరోసారి మరింతగా దోచుకోవడానికి పక్క నియోజకవర్గం నుంచి ఎన్నికల రణక్షేత్రంలోకి దూకుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో మూడు కబ్జాలు.. ఆరు ఆక్రమణలుగా సాగింది ఈ మాజీ ప్రజాప్రతినిధి పాలన. ముఖ్యంగా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈయన తనయుడు రెచ్చిపోయారు. రెవెన్యూ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని భూములను కొల్లగొట్టారు.అసైన్డ్, బీ–ఫారం భూములతో పాటు దళితులకు చెందిన భూములనూ విడిచిపెట్టలేదు. నీరు–చెట్టు పథకంలోనూ అడ్డంగా దోచుకుతిన్నారు. అక్రమంగా తవ్వుకున్న క్వారీలు వీరికి అదనపు ఆదాయం తెచి్చపెట్టాయి. ఈ దోపిడీ వ్యవహారాల్లో అవసరమైతే దాడులకూ దిగిన సందర్భాలూ ఉన్నాయి. పోలీసులను ఉపయోగించుకుని కేసులు పెట్టిన ఘటనలు కోకొల్లలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెర్రిపోతులపాలెం దాషీ్టకం.. రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపిన భూదోపిడీలు ఆ మాజీ మంత్రి పనితీరుకు మచ్చుతునకలు. 2017 డిసెంబర్ 19న జెర్రిపోతులపాలెంలో దళితుల ఆ«దీనంలో ఉన్న భూమిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎన్టీఆర్ గృహకల్ప పేరిట దోచుకోవడానికి యతి్నంచారు. ఆ భూమికి హక్కుదారైన దళిత మహిళ వీరిని అడ్డుకోబోగా ఆగ్రహానికి గురైన టీడీపీ నాయకులు మాజీ మంత్రి తనయుడి ప్రోద్బలంతో ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేసి, దాడికి తెగబడ్డారు. దీనిపై కేంద్ర ఎస్సీ కమిషన్ ప్రతినిధులు రంగంలోకి దిగడంతో ఏడుగురు టీడీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు. ఆరు క్రిమినల్ కేసులు మాజీ మంత్రిపై ఆరుక్రిమినల్ కేసులు ఉన్నాయి. దీనితోపాటు మరో కేసూ ఉంది. వీటిని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో 2023, అక్టోబర్ 1న గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో 153ఏ, 354(ఏ), 504, 505, 506, 509, 499 ఐపీసీ, 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే నేరంపై 2023, సెపె్టంబర్ 30న విజయవాడ సీఐడీ–2 పోలీసులు 153ఏ, 504, 505(2), 506, 509, ఆర్/డబ్ల్యూ 120బీ ఐపీసీ, 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగిస్తున్న క్రమంలో తహసీల్దార్, వీఆర్వోలను అడ్డుకొని వారి విధులకు ఆటంకం కలిగించినందుకు 2020, ఫిబ్రవరి 17న 341, 353 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. హౌసింగ్ పేరుతో భూ ఆక్రమణలు.. అక్రమంగా అమ్మకాలు... అవినీతికి మారుపేరైన జన్మభూమి కమిటీలు మాజీ మంత్రి అండతో చెలరేగిపోయాయి. ఎనీ్టఆర్ హౌసింగ్ పథకం పేరుతో భూ ఆక్రమణలకు తెగబడ్డారు. సబ్బవరం, పెందుర్తి, పరవాడ మండలాల్లో ఈ పథకం పేరు చెప్పుకుని వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అమ్ముకున్నారు. ప్రతి పంచాయతీలోనూ టీడీపీ నాయకులు ఓ జాబితా తయారు చేసి, అందులో అర్హులను వదిలేసి, తమ బినామీల పేర్లు రాయించుకున్నారు.. ఆ తర్వాత అక్రమంగా లేఅవుట్లు వేసి స్థలాలు పంచుకుని తెగనమ్ముకున్నారు. క్వారీలనూ తవ్వేసుకున్నారు మాజీ మంత్రి అండతో టీడీపీ నాయకులు క్వారీలనూ వదల్లేదు. జెర్రిపోతులపాలెం, సబ్బవరం, నరవ, పొర్లుపాలెం ప్రాంతాల్లో క్వారీలను తవ్వుకుని దోపిడీ చేసే క్రమంలో అక్కడి రైతుల భూముల్లో ఫలసాయాన్నీ ధ్వంసం చేశారు. పెందుర్తి మండలం చింతగట్లలో స్థానిక రెవెన్యూ అధికారుల కక్కుర్తిని సొమ్ము చేసుకున్న టీడీపీ నాయకులు 117 ఎకరాల్లో క్వారీ అనుమతులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో క్వారీకి ఆనుకునే ఉన్న ఊరిని సైతం అక్కడ ఊరే లేదని నివేదికలో అధికారులతో రాయించారు. ఇదే తరహాలో సబ్బవరం మండలం అమృతపురంలో క్వారీకి అనుమతి తెచ్చుకున్న టీడీపీ నాయకులు దానికి దారి కోసం ఏకంగా రైతులకు ఫలసాయం అందిస్తున్న మొక్కలనూ అప్పట్లో తొలగించారు. -
అవినీతి ‘కాలువ’
ప్రభుత్వ అక్రమాలను ఎత్తిచూపే పాత్రికేయమే రాజకీయ అవతారమెత్తితే...ఇంకేముంది..ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో ...ఎంతగా దోచుకోవాలో ఆనుపానులు కనిపెడుతుంది...అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి ప్రతినిధి ఒకరు పచ్చ మీడియా అధినేత ఆశీస్సులతో టీడీపీలోకి ప్రవేశించి, మొదట ఎంపీ అయ్యారు.. అ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. చీఫ్‌విప్ ...మంత్రి పదవులూ దక్కించుకున్నారు.. పనిలోపనిగా గుడ్‌విల్ పేరిట అక్రమార్జన పనిలో పడ్డారు.అతి తక్కువ వ్యవధిలోనే రూ.1500 కోట్లను ఆర్జించారంటే ఈ నేత దోపిడీ పనితనం ఎంత గొప్పదో అర్థమవుతుంది.. ఇసుక... మట్టి, సాగునీటి ప్రాజెక్టులు.. చెరువుల పూడికతీత పనుల్లో దోపిడీకి అవకాశమున్న మేరకు దోచుకున్నారు... ఈ అపర వెంకన్న దోపిడీ ధనం ‘కాలువై’ పొంగి పొర్లుతోంది.. ఆ దోపిడీ ప్రవాహం ఎలా సాగిపోయిందంటే....సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆయన పేరు తిరుమల వేంకటేశ్వరుడికి పర్యాయ నామం. పేరుకు తగ్గట్టుగా వ్యవహరించడం ఆయనలో లేదు. మనిషిని చూస్తే తెల్లగా, ఎర్రగా కనిపించినా అవినీతిలో మాత్రం స్వభావం నలుపే. పాత్రికేయ వృత్తితో అతి సామాన్య జీవనం ఆరంభించినా, రాజకీయం రారమ్మని తలుపు తట్టింది. రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి టీడీపీ అధినేత చంద్రబాబుకు విధేయుడిగా మార్కులు కొట్టేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పదవి దక్కించుకున్నారు. ఆ పార్టీ తరఫున ఎంపీగా ఓ సారి గెలిచి.. రెండో సారి ఓటమి పాలయ్యారు.తన జిత్తుల మారి ఎత్తులతో 2014లో అసెంబ్లీ టికెట్ సాధించుకున్నారు. స్వల్ప మెజారీ్టతో ఎమ్మెల్యేగా గట్టెక్కారు. ఆ తర్వాత చీఫ్‌విప్‌గా ఉంటూ అమాత్యుడిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ అవకాశాన్ని రెండు చేతులతో సద్వినియోగం చేసుకుని ఆరి్థక బకాసురుడిగా ఎదిగారు. ఇసుక నుంచి మట్టిదాకా.. ప్రాజెక్టుల నుంచి రోడ్ల వరకూ దేన్నీ వదలకుండా దోచేశారు. ప్రతి పనిలోనూ అంచనాలు పెంచి గుడ్‌విల్ పేరుతో దిగమింగారు. ఈ విషయాలను అప్పట్లో సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యతిరేకించారు. తల్లి పంట మేస్తే... పిల్ల మేర మేసినట్టు తామేమీ తక్కువ కాదన్నట్టు ఆ నాయకుడి అండదండలతో తమ్ముళ్లూ అవినీతిలో మునిగి తేలారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.1,500 కోట్లకు పైగా అవినీతి సొమ్ము పోగుచేసి ఉంటారనే అభియోగాలు ఉన్నాయి. ప్రజల్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన ఈ వ్యవహారం ఇప్పటికీ మరచిపోలేని పరిస్థితి. ఆ మరకను ఎదుటి వారికి అంటించి కడుక్కోవాలని చూసినా ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆ మాజీ నేత మళ్లీ ప్రజాప్రతినిధిగా గెలవడానికి చేయని పనులు లేవు. అక్రమాల తీరిలా.. : జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవానితిప్ప (బీటీ) ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తెస్తామనే నెపంతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు ఈ మాజీ నాయకుడు. ఈ నేపథ్యంలో ఫేజ్–1 కింద రూ.450 కోట్లను కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. మొత్తంగా రూ.968 కోట్లకు పరిపాలన అనుమతులను జారీచేశారు. అయినా భూనిర్వాసితులకు పిసరంతైనా నష్టపరిహారం అందించలేదు.ఆ పనులను ప్రస్తుతం మరో దుర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత సంస్థకు కట్టబెట్టి దోపిడీ పర్వానికి తెరలేపారు. ఆయన డీకేటీ భూముల్లో మాత్రమే కాలువ తవ్వకం పనులు చేపట్టి, రైతులను నమ్మించే ప్రయత్నం చేశారు. బోరంపల్లి లిఫ్ట్ నుంచి 56 కిలోమీటర్ల దూరంలోని బీటీప్రాజెక్టుకు నీరివ్వాలి. అప్పటి ధర ప్రకారం కిలో మీటర్‌కు రూ.3 కోట్లు ఖర్చవుతుందని కాంట్రాక్టర్లు అంచనా వేశారు. మెకానికల్ పనులతో కలిపితే రూ.350 కోట్లలోపే వ్యయంతో నీరివ్వొచ్చు.దోచుకోవాలి కాబట్టి ఏకంగా రూ.968 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో తలా కొంచెం పంచుకుతినేలా కుట్రలు పన్నారు. ఈ పనుల్లో అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రాజెక్టు వద్ద వేసిన పైలాన్ మొదలు ల్యాండ్‌స్కేప్, రంగులు తదితర పనుల్లో రూ.కోట్లు మెక్కేసిన వైనంపై ఈ ప్రాంతంలో ఎవరినడిగినా చెబుతారు. ⇒ నియోజకవర్గ ముఖ్యపట్టణం నుంచి కళ్యాణదుర్గం రోడ్డు విస్తరణ పనుల్లోనూ రూ.20 కోట్ల వరకు ఈ నేత గుడ్‌విల్ మెక్కారనే ఆరోపణలూ బలంగా ఉన్నాయి. ఈ పనులకు అప్పటి ప్రభుత్వం రూ.222 కోట్లతో టెండర్ పిలిచింది. కిలోమీటర్‌కు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల చొప్పున 56 కిలోమీటర్లకు రూ.112 కోట్ల నుంచి రూ.168 కోట్లు ఖర్చవుతుంది. అలా చేస్తే తమకు మిగిలేదేమీ ఉండదు కాబట్టి రూ.54 కోట్ల నుంచి రూ.110 కోట్ల మేర అంచనాలు పెంచి రూ.222 కోట్లకు తుది అంచనాలు రూపొందించారు.ఈ పనులను కేసీపీఎల్– లికాన్ ఏజెన్సీ 15.35 శాతం తక్కువతో రూ.194 కోట్లకు దక్కించుకుంది. దీనివల్ల ఏజెన్సీకీ లాభమే. ఈ పనుల్లో 10 శాతం అంటే రూ.20 కోట్ల వరకు అప్పట్లో మంత్రిగా ఉన్న ఈ నేతకు ముడుపులు అందినట్టు ఆరోపణలున్నాయి. ⇒ ఈ మాజీ ఎమ్మెల్యే హయాంలోనే కణేకల్లు, బొమ్మనహాళ్, డి హీరేహాళ్ మండలాల్లో ఇసుక–మట్టి అక్రమ రవాణా జిల్లాలోనే ఓ మాఫియాను తలపించింది. రచ్చుమర్రి వద్ద వేదావతి హగరి నదిలో తవ్విన ఇసుకను ఈనేత అండదండలతో ఓ సంస్థ సహకారంతో నేరుగా బెంగళూరుకు తరలించి రూ.కోట్లను కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పత్రికలు, టీవీ చానళ్లలోనూ ఈ అవినీతి బాగోతంపై అనేకమైన కథనాలు వచ్చాయి. చివరకు తమ మానస పుత్రికగా చెప్పే ఈనాడులోనే ‘మంత్రి ఇలాకాలో కంత్రీల కులాసా’ శీర్షికతో కథనాన్ని ప్రచురించారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క వ్యవహారంలోనే రూ.350 కోట్లకు తక్కువ కాకుండా కూడగట్టారనే అభియోగం నేటికీ ఉంది. అప్పట్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను కణేకల్లు పోలీసులు పట్టుకుంటే పోలీస్‌స్టేషన్ ముందు నేరుగా ఈ మాజీ మంత్రి ధర్నా చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిచి్చంది.రాయదుర్గం మండలం టీ వీరాపురం, డి హీరేహాళ్ ప్రాంతాల్లో రూ.కోట్ల విలువ చేసే మట్టిని కర్ణాటక ప్రాంతానికి తరలించారు. ఆనాటి అక్రమాల ఆనవాళ్లు నేటికీ తన అవినీతిని బట్టబయలు చేస్తున్నాయి. ⇒ముఖ్య పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో విలువైన రిజర్వ్ స్థలాన్ని టీడీపీ కౌన్సిలర్ ఒకరు ప్లాట్లు వేసి అమ్మేశారు. ఈయన్ని అనుసరిస్తూ మరింత మంది దురాక్రమణకు పాల్పడి విలాసవంతమైన భవనాలను నిరి్మంచారు. వాటిని రూ.లక్షలకు అమ్ముకుని సొమ్ము కూడగట్టారు.మల్లాపురం, గౌడ, భంభంస్వామి, ముత్రాసకాలనీ, బీటీపీ, గ్యాస్‌గోడౌన్ లేఅవుట్లలో భవిష్యత్తు అవసరాల కోసం వదిలిన రిజర్వ్ స్థలాలను సైతం మాజీ ఎమ్మెల్యే అండతో తమ్ముళ్లు ఆక్రమించారు. ఒక్కో స్థలాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేశారు. ఇటీవలే టీడీపీ నాయకుడి సహకారంతో పేదలకు చెందిన నాలుగు ప్లాట్లను రూ.6 లక్షలకు ఓ వ్యక్తి అమ్ముకున్నాడు. ఆ విషయమూ వివాదంగా మారింది. ⇒ ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే హయాంలో కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో ఇసుక మేటల నివారణలో భాగంగా రూ.కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపారు. పొలాల్లో మాత్రం ఇసుక అలాగే ఉండిపోయింది. ఆ రికార్డులు సైతం మాయం చేయడం గమనార్హం. నీరు–చెట్టు పనుల్లో సైతం రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు తమ్ముళ్ల జేబులోకి చేరాయి. ఇందులో ఈ మాజీ ప్రజాప్రతినిధికీ కమీషన్ల వరద పారింది. గుమ్మఘట్ట, డి హీరేహాళ్, కణేకల్లు ప్రాంతాల్లో జరిగిన అనేక పనులకు ఆనవాళ్లే లేవంటే దోపిడీ తీరు అర్థం చేసుకోవచ్చు. ⇒అప్పట్లో కణేకల్లు చిక్కణ్ణేశ్వర చెరువు పూడికతీత కోసం రూ.2 కోట్లను కేటాయించారు. ఈ పనులనూ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీకే అప్పగించారు. సరిగ్గా వారం రోజుల పనులయినా చేయకముందే చెరువులోకి హెచ్ఎల్సీ నీరొచి్చచేరింది.నీరు నిండిపోవడంతో అరకొరగా చేసిన పనులు కనిపించలేదు. పక్కా ప్లాన్‌తోనే నీరొదిలి రెండు దుర్గాల నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేతలు కలసి రూ.2 కోట్లను దిగమింగారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నిధులతోనే ఈ మాజీ ఎమ్మెల్యే విలాసవంతమైన భవనం కట్టుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ⇒టీడీపీ పాలనంతా అవినీతి, నిధుల మేతగా సాగినా... నేడు ఈ మాజీ ఎమ్మెల్యే నీతిమంతుడిలా బిల్డప్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు మళ్లీ పట్టం కడితే రెండింతల అవినీతి తప్పదని స్థానిక ప్రజలు మాజీమంత్రిపై నమోదైన కేసుల వివరాలు.. ⇒19–04–2014న ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడడంతో .. ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదయింది. (క్రైమ్ నంబర్ –157/ 2014) ⇒27–04–2014 న ఎంసీసీ ఉల్లంఘన పై ఐపీసీ 188 సెక్షన్ కింద మరో కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ – 188/14 ⇒14–03–2020న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ విషయంలో అనుచరులతో కలిసి ఈ మాజీ ఎమ్మెల్యే .. కార్యాలయంలో దౌర్జన్యం చేశారు.. ఈ విషయంపై ఐపీసీ 343, 506 సెక్షన్ల కింద ఆర్పీ యాక్ట్ కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ 88/20 ⇒07–12–2021న ఓ యాక్సిడెంట్ కేస్ విషయంలో.. శవ రాజకీయం నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టిన విషయంపై.. ఐపీసీ 341, 188ల సెక్షన్ల కింద కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ 525/21. ⇒27–11–2022 న చెన్నేకొత్తపల్లి వద్ద టీడీపీ నిర్వహించిన ధర్నాకు ఈ మాజీ ఎమ్మెల్యే ఎలాంటి అనుమతులు లేకుండా పాల్గొనేందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.. పోలీసులు అడ్డుకోవడంతో.. రోడ్డుపై ధర్నా చేస్తూ రాద్ధాంతం చేశారు. ఈ ఘటనపై ఐపీసీ 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ 330/ 22 ⇒16–09–23 న చంద్రబాబు స్కిల్స్ స్కామ్ అరెస్టుపై అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహిస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడంపై.. ఐపీసీ 143, 188, 341 ల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. క్రైమ్ నంబర్ 157/23 ⇒ 27–09–2023 న స్కిల్ స్కామ్ కేసులో మరో ర్యాలీ చేపట్టడంతో.. ఐపీసీ 143, 188, 341 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.. క్రైమ్ నంబర్ 165/23 ⇒28–08–23న స్కిల్ స్కాం కు నిరసనగా ర్యాలీలు, నిరసనలు పోలీసు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడంతో.. ఐపిసి 143, 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 167/23 ⇒ 08–10–2023న మళ్లీ అవే సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఈ (9 కేసులు.. రాయదుర్గం అర్బన్ పీఎస్ లో నమోదు) క్రైమ్ నంబర్ 167/23 ⇒ 02–04–2024న బొమ్మనహళ్ మండలం ఉంతకల్లులో ఎంసీసీ కోడ్ నిబంధనలకు విరుద్ధంగా.. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడంతో.. బొమ్మనహళ్ పీఎస్ పరిధిలో.. 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. క్రైమ్ నంబర్: 64/24 -
అక్రమాలు కో‘కొల్లు’లు
విజయవాడ: కృష్ణాజిల్లాలోని తీరప్రాంత ముఖ్య పట్టణానికి ప్రాతినిధ్యం వహించిన ఆ టీడీపీ నేత అక్రమాలు కోకొల్లలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవీ వెలగబెట్టిన ఆయన హయాంలో ప్రజలు మౌలిక వసతులు లేక నరకం అనుభవించారు. గుక్కెడునీటికీ అంగలార్చారు. కానీ ఆయన మాత్రం భారీగా అక్రమాస్తులు మూటగట్టారు. మామ ద్వారా వసూళ్ల దందా సాగించారు. సెటిల్మెంట్లు చేశారు. ప్రభుత్వ స్థలాలూ కాజేశారు. అవినీతి సొమ్ముతో విజయవాడతో పాటు తీరప్రాంత మండలాలు, హైదరాబాద్‌లలో రూ.కోట్ల విలువ చేసే స్థలాలు కొన్నారు. ఎక్సైజ్‌లో భారీగా దోపిడీ ∗ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భారీగా దండుకున్నారు. ఒక్కో బదిలీకి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మంత్రిగా ఉన్న రెండేళ్లలోనే రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు దోపిడీకి పాల్పడ్డారు. లిక్కర్ దందా నడిపారు. ∗ భీమవరంలో భార్యాభర్తల మ్యూచువల్ బదిలీ కోసం దాదాపు రూ.40 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ ఎక్సైజ్ శాఖలో డిజిటలైజేషన్ నిమిత్తం కాంట్రాక్టర్ నుంచి రూ.5 కోట్లు నాటి ప్రభుత్వ పెద్దలకు అందాయి. ఆ కాంట్రాక్టర్ నుంచి మాజీ మంత్రి రూ.2 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ స్టేషన్ల నుంచి నెలవారీ మామూళ్లూ వసూలు చేశారని సమాచారం. ∗ ఇసుక రవాణాలోనూ వసూళ్ల దందాకు పాల్పడ్డారు. ఈ తంతు మొత్తం మాజీ మంత్రి అనుచరుడు దగ్గరుండి నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన అండతో ముఖ్యపట్టణంలో తెలుగు తమ్ముళ్లు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్లాట్లుగా వేసి స్థలాలు అమ్ముకున్నారు. రూ.కోట్లకు పడగలెత్తారు. ∗ సొంత రైసు మిల్లును అడ్డుపెట్టుకుని ధాన్యం కొనుగోళ్లలో అక్రమ దందాకు పాల్పడ్డారు. రూ.3 కోట్ల వరకు ఇలా బొక్కేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండూ ప్రతిపక్షాల నుంచి వినిపించింది. ∗ కరకట్ట, చల్లపల్లి బైపార్ రోడ్డు, విజయవాడ – మచిలీపట్నం హైవే నిర్మాణ పనులకు సంబంధించిన మట్టి (బుసక) సరఫరాలో నాలుగున్నరేళ్లలో రూ.వందల కోట్లు మింగారు. పొక్లెయిన్ బుజ్జీని బినామీగా పెట్టి కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వి వచి్చన మట్టిని నిర్మాణాలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ∗ ప్రభుత్వ పథకాల మంజూరులోనూ భారీ వసూళ్లకు తెరతీశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి కమీషన్లు వసూలు చేసి తన కక్కుర్తి బుద్ధిని చాటుకున్నారు. రైతు రథం పంపిణీ, అదనపు తరగతుల నిర్మాణాల్లోనూ గడ్డికరిచినట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ బినామీల పేరుతో కాల్‌మనీ వ్యవహారం నడిపించి రూ.1.50 కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ∗ రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ అభ్యర్థి వద్ద రూ.5 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఉద్యోగం రాకపోవడంతో ఆ అభ్యర్థి ప్రశి్నస్తే రూ.3 లక్షలు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పిస్తానని నచ్చజెప్పినట్లు సమాచారం. ∗ ముఖ్యపట్టణంలో డివైడర్ గ్రిల్ పనుల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. బీచ్ ఫెస్టివల్, పోర్టు పనులు ప్రారంభం విషయంలో చంద్రబాబు పర్యటనలోనూ భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణంలోనూ భారీగా కమీషన్లు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ ఒక్కో వాటర్ ట్యాంక్ రూ.5 కోట్లతో 7 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ట్యాంకుకు 10 శాతం చొప్పున రూ.3.50 కోట్లు దండుకున్నట్లు తెలిసింది. ∗ రైల్వే గేట్ నుంచి మంగినపూడి బీచ్ వరకు రూ.14 కోట్లతో చేపట్టిన రోడ్డు పనుల్లో 10 శాతం వాటా కింద రూ.1.40 కోట్లు వసూలు చేశారు. గుట్కా విక్రయదారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ∗ జాతీయ తుపాను విపత్తుల నివారణ పథకం కింద రూ.36.45 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో మచిలీపట్నం నుంచి కృత్తివెన్ను మండల సమీపం వరకు 18.6 కిలోమీటర్ల మేర చేపట్టిన కరకట్ట నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. అనతి కాలంలో ఆ కరకట్ట బాగా దెబ్బతింది. ∗ మంత్రి రాజకీయ గురువు కూడా ఈ అక్రమాల్లో భాగం పంచుకున్నారు. తన పరిశ్రమలో నకిలీ ఎరువులు తయారు చేసి, వాటిని రైతులకు కట్టబెట్టి రూ.లక్షలు కొల్లగొట్టారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. హత్య సహా 25 కేసులు ఈ మాజీ మంత్రి 2020 జూలై 27న మచిలీపట్నం చేపల మార్కెట్లో జరిగిన వైఎస్సార్ సీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్నారు. క్రైం నంబర్ 192/2020తో 120 బీ, 302 ఐపీసీ 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. ఆయన పరారు కావడంతో పోలీసు ప్రత్యేక బృందం గాలించి అదుపులోకి తీసుకుంది. రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈయనపై 2009 నుంచి ఇప్పటి వరకు హత్య, ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు మొత్తం 25 కేసులు నమోదయ్యాయి. అందులో 12 కేసుల నుంచి తన పలుకుబడి ఉపమోగించి బయటపడ్డారు. మిగిలినవి విచారణ దశలో ఉన్నాయి. -
మళ్లీ దోపిడీకి తెరపైకి..
అన్నమయ్య జిల్లాలో ఆంధ్రా ఊటీగా ప్రసిద్ధిచెందిన ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఆ మాజీ ఎమ్మెల్యే సాగించిన అవినీతి దందా అంతాఇంతా కాదు. తాజ్‌మహల్‌ను తలుచుకోగానే ఈయన గారి పేరు గుర్తొస్తుంది. సొంత మత మండలి ఆస్తులనూ కబళించిన ఘనుడు. ప్రతి పనికీ ధర నిర్ణయించి ప్రజలను పీడించుకుతిన్న చరిత్ర ఆయన సొంతం. అతడి బెదిరింపులు, దౌర్జన్యాలకు బలైన వారు ఎందరో.. ఇప్పుడు మళ్లీ టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు.చందాలు ఇవ్వాలంటూ వ్యాపార వర్గాలను బెదిరిస్తున్నారు. సాక్షి, టాస్‌్కఫోర్స్ : హైటెక్ రంగానికి తానే ఆద్యుడని, హైదరాబాద్‌కు బిల్‌గేట్స్‌ను తీసుకువచ్చానని, భాగ్యనగరానికి వరల్డ్ మ్యాప్‌లో గుర్తింపు తన భాగ్యమేనని డాబు మాటలు చెప్పుకునే వ్యక్తి ఎవరని అడిగితే ఠక్కని మనకు గుర్తుకు వచ్చే పేరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అచ్చు ఆయనకు ఏ మాత్రం తీసిపోకుండా, అంతకంటే రెండు ఆకులు ఎక్కువే చదివారు ఈ మాజీ ఎమ్మెల్యే.నియోజకవర్గంలో అభివృద్ధి తన చలవేనని, తాను వేసిన రోడ్ల మీద ప్రజలు నడుస్తున్నారని, వక్ఫ్ భూములను తానే కాపాడానని, తాను లేకపోతే, మైనారీ్టలకు పెద్ద దిక్కు లేదని గొప్పలు చెప్పుకుంటుంటారు. బస్సు యజమానిగా ఉన్న ఈయన 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. చదివింది పదో తరగతే అయినా మతాన్ని అడ్డుపెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగారు. అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తన ఆధిపత్యానికి అడ్డు వస్తే బెదిరింపులు, దౌర్జన్యాలకూ వెనుకాడరు. ∗ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల ముసుగులో రూ.కోట్లు కొల్లగొట్టారు. ∗ హ్యాండ్లూమ్ వర్కర్స్ అసోసియేషన్ పేరుతో చేనేత కార్మికుల కోసం స్థలం కేటాయించాలని వినతిపత్రం పెట్టించి, తర్వాత తనకు అనుకూలురైన తహసీల్దార్, ఆర్డీఓల ద్వారా వాటిని అక్రమమార్గాల్లో దక్కించుకున్నారు. ∗ తన అనుచరులతో ప్రభుత్వ స్థలాల్లో పాగావేసి, వాటిని విక్రయించడం ద్వారా రూ.కోట్లు పోగేసుకున్నారు. ∗ ఈ అక్రమాలను వెలుగులోకి తెచి్చనందుకు ఓ పక్ష పత్రిక విలేకరిపై అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపారు. ∗నియోజకవర్గ కేంద్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను కాపాడేందుకు పట్టణంలోని జామియా మసీదు కమిటీ పెద్దలు కోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాల అనంతరం వక్ఫ్ భూములు మసీదుకే చెందుతాయని హైకోర్టు 2002లో తీర్పు ఇస్తే.. 2009లో ఈయన ఎమ్మెల్యే అయిన రెండేళ్ల తర్వాత వక్ఫ్ భూములకు కంచె వేయించి, భూములను తానే కాపాడినట్లుగా గోబెల్స్ ప్రచారం చేసుకున్నారు. ‘టిప్పు’టాప్‌గా కబ్జా టిప్పు సుల్తాన్ వక్ఫ్ భూముల్లో మున్సిపల్ అనుమతులు లేకుండానే షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఒక్కో షాపునకు అడ్వాన్సుల పేరుతో రూ.లక్షలు వసూలుచేసి, వాటికి జమా లెక్కలు చూపకుండా నిధులు తన సొంత ఖాతాల్లోకి మళ్లించారు. టిప్పుసుల్తాన్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని దుకాణాలు, గదులు అన్నింటికీ తానే యజమాని అన్నట్లుగా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు.తనకు నచ్చిన వారికి కేటాయిస్తున్నారు. చివరకు దుకాణాల ఎదుట మెయిన్ రోడ్డుపై చిరువ్యాపారులు టెంట్లు, గుడారాలు వేసుకుని వ్యాపారాలు చేస్తుంటే.. వారి వద్ద నుంచి మాజీ ఎమ్మెల్యే అనుచరులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ వెనుకవైపు ఖాళీస్థలంలో ఆస్పత్రి నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల మసీదు నిధులను ఖర్చుచేసి, పనులు పూర్తిచేయకుండానే అసంపూర్తిగా వదిలివేశారు.వీటికి తోలిన ఇసుక, కంకరతో ఎన్వీఆర్లే అవుట్, మోతీనగర్‌లో రెండు ఇళ్లను నిర్మించుకున్నట్లు పట్టణంలో వదంతులు వినిపిస్తున్నాయి. కదిరిరోడ్డులోని టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్ ఖాళీ స్థలాల్లో మెకానిక్‌లు, కార్పెంటర్లు, చేతివృత్తులవారు తాత్కాలిక షెడ్లు వేసుకునేందుకు రూ.లక్షలు వసూలు చేసి అనుమతులిచ్చారు. దీనిలో మాజీ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడని ఆయన సొంత తమ్ముడే వాటిని తొలగించారు. ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలతో పేదవారు అప్పులపాలై రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ∗బడేమకాన్ వక్ఫ్ భూముల్లో మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా దౌర్జన్యంగా షాపులు నిరి్మంచడమే కాకుండా ఒక్కో దుకాణానికి రూ.15–20 లక్షల వరకు వసూలుచేసి, వాటికి యజమాని తానేనన్నట్లుగా, తన జాగీరు అన్నట్లుగా రూ.100 స్టాంపు పేపర్‌పై స్వయంగా సంతకం చేసి అగ్రిమెంట్లు చేసిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పుణ్యమా అని చాలాకాలం ఈ కాంప్లెక్స్‌కు కరెంటు లేక చీకట్లోనే వ్యాపారులు దుకాణాలు నడపాల్సి వచ్చింది. ∗వక్ఫ్ భూముల రక్షణ ముసుగులో భూములకు సంబంధించి అగ్రిమెంట్లు చేసి అందులో ఇతరులకు చెందిన భూములకు వెళ్లేందుకు డబ్బులు తీసుకుని రోడ్డు వేసేందుకు సహకరించారు. ∗ఈయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ పాలన సాగింది. దీంతో ఆయన స్థానిక సంస్థల్లో ఏకఛత్రాధిపత్యం సాగించారు. తన అక్రమాలకు అడ్డువస్తే మద్దతు ఉపసంహరించుకుంటానని అప్పటి సీఎంనే బెదిరించిన చరిత్ర ఈయనది. ∗అప్పట్లో జరిగిన ప్రతి అభివృద్ధి పనిలోనూ కమీషన్లు వసూలు చేశారు. ఇవ్వకుంటే బెదిరించారు. నియోజకవర్గ కేంద్రంలో నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకుని ట్యాంకర్ల ద్వారా సరఫరా పేరుతో రూ.కోట్లు దోచేశారు. బోర్ల రీ డ్రిల్లింగ్ల్లోనూ స్వాహా చేశారు. ∗ బుగ్గకాలువలో ఓ టీడీపీ నేత వేసిన లేఅవుట్‌కు దారి కలి్పంచేందుకు మున్సిపల్ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి నిర్మాణం చేయించారు. దీనివల్ల అప్పటి మున్సిపల్ కమిషనర్ ఇప్పటికీ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రమోషన్లు, ఇతరత్రా సౌకర్యాలు నిలిచిపోయి ఇబ్బందులు పాలయ్యారు. ∗నామినేటెడ్ పోస్టులనూ రూ.లక్షలకు అమ్ముకున్నారు. మార్కెకట్ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చేందుకు భారీగా ముడుపులు తీసుకున్నట్టు సమాచారం. ∗జామియామసీదుకు చెందిన షాదీమహల్ నిర్మాణానికి పంచాయతీరాజ్‌శాఖలో 2.5 లక్షలు బిల్లు చేయించి, మసీదు నిధుల నుంచి దొంగబిల్లులతో కాజేశారు. ∗ఈయనకు ప్రజాదరణ ఏమాత్రం లేదు. 2014లో మళ్లీ పోటీ చేసిన ఈయనకు కేవలం 7,357 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019లో రాజంపేట ఎంపీ అభ్యరి్థగా పోటీచేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అఫిడవిట్ ప్రకారం పది క్రిమినల్ కేసులు 2019లో సమరి్పంచిన అఫిడవిట్లో తనపై 2 క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అవి 10 కేసులకు పెరిగాయని పేర్కొన్నారు. తన ఆదాయవనరు రవాణా వ్యాపారం అని చూపిన ఆయన వాటి వివరాలు ప్రస్తావించలేదు. 2019లో ఇన్నోవా వాహనం ఉందని అఫిడవిట్ సమరి్పంచిన ఆయన ఇప్పుడు ఎలాంటి వాహనాలు లేవని పేర్కొన్నారు. -
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
‘అన్యాయం జరిగితే అరగంట లేటుగా వస్తానేమో.. కానీ ఆడపిల్లకు ఆపద వస్తే అర నిమిషం కూడా ఆలస్యం చేయను’– ఇది వెండితెరపై వీర లెవల్ డైలాగ్ కట్ చేస్తే.. ఆడది కనిపిస్తే ‘ముద్దు’ అయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి – ఇది రియల్ లైఫ్‌లో ముసుగు తొలగించిన మన నాయకుడి ముతక డైలాగ్ ‘నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది’రాజకీయాల్లో మాత్రం తనదాకా ఎందుకనుకున్నారేమో.. ప్రజలను వణికించడానికి నియోజకవర్గంలో పీఏలకే పెత్తనాన్ని అప్పగించేశారు. సాక్షి టాస్క్‌ఫోర్స్: సినిమాల్లో వీర లెవల్ డైలాగులు పలికే ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మాత్రం ఫెయి ల్యూర్ నేతగా మిగిలిపోయారు. అభివృద్ధి, ప్రతిపక్షంపైనా భారీ సంభాషణలు పలికే ఆయన ప్రజల సమస్యలు తీర్చడంలో జీరోగా మారారు. సెల్యూలాయిడ్‌పై తన నటనతో ఈలలు, చప్పట్లు కొట్టించుకునే ఆయన ప్రజా జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించి అభినందనలు పొందలేకపోయారు.గడిచిన పదేళ్లలో ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టకపోవడం, కనీసం స్థానికంగా ఉండే లోటు పాట్లు, సమస్యలపై పదిశాతం కూడా అవగాహన లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆయన తీరుపై అక్కడి ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం నెలకోసారి కూడా నియోజకవర్గంలో పర్యటించని నేత తమకెందుకని, తమ సమస్యలు తీర్చి అక్కున చేర్చుకునే స్థానిక నేతలే తమక కావాలని వారు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ పదేళ్లలో చాలా హామీలిచ్చినా వాటిని తీర్చలేకపోయారు.రాష్ట్రంలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. వెండి తెరపై మన్ననలు పొందిన మాజీ సీఏంతో పాటు ఆ కుటుంబానికి చెందిన మరో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అయితే మరీ ముఖ్యంగా గడిచిన దశాబ్ద కాలంగా ఎమ్మెల్యే ఉన్న ఆయన ఆ ప్రాంతాన్ని గాలికొదిలేశారు. సినిమా షూటింగులు, కుటుంబ వ్యవహారాలు, హైదరాబాద్‌లో స్థిరనివాసం వెరసి ఆయన ఏడాదికి ఒకట్రెండుసార్లు పర్యటనకు మాత్రమే పరిమితమయ్యారు.పీఏలదే పెత్తనం ఎమ్మెల్యే స్థానికంగా ఉండాలనేది అక్కడి ప్రజల మనోగతం. కానీ అరిచి గీపెట్టినా ఆయన అక్కడికి వెళ్లరు. దీంతో ఆయన నియమించుకున్న ప్రైవేటు పీఏలదే పెత్తనం. అంతేకాదు షాడో ఎమ్మెల్యేగా కూడా వీళ్లే వ్యవహరిస్తుంటారు. ఆయనకు పీఏగా ఉన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పేరు కలిగిన వ్యక్తి గతంలో కర్ణాటకలో పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. అనంతరం రిమాండుకు వెళ్లారు. అయినా సరే మళ్లీ ఆయన్నే పీఏగా కొనసాగిస్తున్నారు.ఆ పీఏతోపాటు మరో ఇద్దరు కూడా పీఏలుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పీఏలు అంతులేని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా పంచాయతీలు తీర్చడం, సెటిల్మెంట్లు చేయడంలో వారు ఆరితేరారు. నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఈ పదేళ్లలో వారు ఎలాంటి సమస్యను తీర్చడానికి కూడా ఆసక్తి కనబరచలేదు. కేవలం అయ్యగారు చెప్పిందే వేదంగా పనిచేశారు. పచ్చ నేతలకే అందుబాటులో ఉండేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాము ఎదుర్కొనే సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక అక్కడి ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు. ప్రచార రంగంలోకి మళ్లీ ఫ్యామిలీ మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ‘పురం’లో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎమ్మెల్యే ఆయన భార్య కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే భార్య అక్కడికి వచ్చి చీరలు పంచినట్టు తెలిసింది. నియోజకవర్గంలో చుట్టిముట్టేలా ప్రచారం ముమ్మరం చేసి కొత్త హామీలు ఇస్తున్నారు. త్వరలోనే కుమారుడు, కూతుళ్లను కూడా ప్రచారానికి దించబోతున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు.కానీ అవి ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయని పురం ప్రజలు వాపోతున్నారు. భూగర్భ డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తానని, రోడ్ల విస్తరణ చేపడతానని ఇచి్చన హామీలు నెరవేర్చలేకపోయారు. క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని ఇచి్చన హామీ అలాగే ఉంది. హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడంలో బావను మించిపోయారనే విమర్శలున్నాయి. వాటిని అమలుపరచకపోగా మళ్లీ ఇప్పుడు కొత్త హామీలు గుప్పిస్తున్నారు. సెంటిమెంటును గౌరవించని తీరు 1985లో నటుడు, మాజీ సీఎం ఇక్కడ మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అప్పటి నుంచి ఆ కుటుంబమంటే ఇక్కడి ప్రజలకు గౌరవం. ఆ గౌరవంతోనే ఆయన కుమారులను ఎమ్మెల్యేలుగా చేశారు. ఆ కుటుంబమంటే ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉండటమే ఇక్కడి ప్రజలకు శాపమైంది. దీన్ని ప్రజల బలహీనతగా భావించిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడకు రావడమే మానేశారు. మేము వచి్చనా రాకపోయినా మాకే ఓటేస్తారన్న ధీమా ఆయనది. 2014లోనూ, 2019లోనూ ఇక్కడి నుంచి ఆయన్ను అసెంబ్లీకి పంపించారు. కానీ ఆయన ఇక్కడి సమస్యలను మాత్రం ‘పురం’ పొలిమేర దాటించలేకపోయారన్న విమర్శలున్నాయి. ఎప్పుడూ అక్కడి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలేదు. వేసవి వచి్చందంటే తాగునీటితో అల్లాడే ఇక్కడి ప్రజలు తమ కష్టాలు తామే తీర్చుకోవాలన్నట్టు చెబుతుంటారు. ఇదే విషయమై ఇటీవల ఓ టీడీపీ నేత ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘నాకు ఓటు వేయడం వాళ్ల అదృష్టం.ఆ అవకాశం అందరికీ రాదు . మీరు నోరు మూసుకుని చెప్పింది చేయండి’’ అని గర్జించారట. కేంద్రం నిధులిచి్చనా.. నియోజకవర్గ కేంద్రంలో ఎప్పటినుంచో తాగునీటి సమస్య ఉంది. 1984 నుంచి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధీ లేదు. అమృత్ స్కీం ద్వారా టీడీపీ హయాంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రూ.194 కోట్లతో పైప్‌లైన్ వేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీపై రూ.100 కోట్ల భారం పడింది. ఈ డబ్బుకు వడ్డీ చెల్లించేందుకు మున్సిపాలిటీ ఆదాయం సరిపోవడం లేదు. దీంతో పురం మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. -
అవినీతిలో ‘ఆది’పత్యం
ఆయనో మాజీ మంత్రి. సొంత పేరు కంటే.. పేకాట పాపారావంటే స్థానిక ప్రజలు సులభంగా చెప్పేస్తారు. సోదరుడిని, ఆయన తయారు చేసుకున్న వర్గాన్ని అణగదొక్కి మరీ రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత మహానేత వైఎస్సార్ భిక్షతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన మరణం తర్వాత విచ్చలవిడి దోపిడీకి బరితెగించారు. గండికోట ప్రాజెక్టు, గాలేరు–నగరి సొరంగం పనుల కాంట్రాక్టర్ల నుంచి రూ.కోట్లలో దోచుకున్నారు.కాలువ తవ్వకాల్లో వచి్చన బండరాళ్లను కూడా వదల్లేదు. కంకరగా మార్చి అక్రమార్జన చేశారు. పక్క రాష్ట్రానికి ఇసుక తరలించేందుకు పెన్నానదికి గర్భశోకం కలిగించారు. నీరు–చెట్టు పథకంలో ఆయన దోపిడీకి అడ్డు లేదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నమ్మినవారిని నట్టేట ముంచడం,పారీ్టలు మారడం అంటే ఆయనకు మంచినీళ్లు తాగినంత సులభం.సాక్షి టాస్క్ ఫోర్స్: ‘‘జమ్మలమడుగులో వర్గ పోరాటం కొనసాగించాం. మా సర్వస్వం కోల్పోయాం. ఆస్తులు కూడా తాకట్టులో ఉన్నాయి. ఒక్క అవకాశం ఇవ్వండి..’’ అంటూ రాజకీయాల్లోకి వచ్చారు. గెలిచారు. ఆ తర్వాత ఆయన సాగించిన దోపిడీతో రాష్ట్రంలోనే అత్యధిక సంపాదనాపరుల్లో ఒకరిగా మారారు. ప్రకృతి వనరుల దోపిడీలో ఆయన జోరు చూసి నియోజకవర్గ ప్రజలే నోరెళ్లబెట్టారు. ప్రభుత్వ, కొండ పోరంబోకు భూములను వందల ఎకరాలు స్వాహా చేసి, తన సాగులోకి చేర్చుకున్నారు. సోలార్ ప్రాజెక్టు పనుల్ని శాసించారు. చివరికి గండికోట నిర్వాసితుల చెక్కుల్నీ స్వాహా చేశారు. చెప్పుకుంటూ పోతే.. ఆయన అక్రమాలకు లెక్కే లేదు. ఇప్పుడు కేంద్ర పారీ్టలో చేరి, మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రతి అవకాశం.. ఆదాయ మార్గందేవగుడి, గొరిగనూరు, పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె, చలివెందుల, సుగమంచుపల్లె, ధర్మాపురం గ్రామాల్లో ఈ నేత కుటుంబ ఆధిపత్యం యథేచ్ఛగా సాగుతోంది. అనూహ్య పరిస్థితుల్లో అమాత్యుని హోదా దక్కించుకున్నారు. ఇంకేముంది ఆయా గ్రామాల పరిధిలో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బెంగళూరు తదితర ప్రాంతాలకు భారీ వాహనాలతో ఇసుకను తరలించారు. కేవలం ఇసుక తరలింపుతోనే రూ.వందల కోట్లు ఆర్జించారు.పేకాట పాపారావు ఈయనకు స్థానికంగా మరో పేరు కూడా ఉంది. పేకాట పాపారావుగా బాగా ప్రసిద్ధి. 2019 ఎన్నికల తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా పేకాట కోసం బెంగళూరు క్లబ్బును తన నివాసంగా మార్చుకున్నారు. గత నాలుగున్నరేళ్లూ నమ్ముకున్న కార్యకర్తలకు దూరంగా పత్తాలేకుండా పోయారు. ఆ మధ్య ఓ చానల్ ఇంటర్వ్యూలో కూడా తన జూద ప్రావీణ్యతను మహ సరదాగా చెప్పుకొచ్చారు.ఆ నేతపై ఉన్న కేసుల్లో కొన్ని ఈ నేతపై పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ∗ 2020లో క్రైమ్ నెం.130 పేరిట 143, 144, 147, 148, 323, 324, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ∗ మైదుకూరు పోలీసు స్టేషన్లో క్రైమ్ నెం.239/2020 కేసు ఉంది. ∗ తుళ్లూరులో క్రైమ్ నెం.65/2023 ఐపీసీ 294, 504, 505(2), 506 సెక్షన్ల కింద కేసులు నమోదయినట్లు సదరు నేత తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు.ప్రభుత్వ భూములు స్వాహా.. ఈ మాజీ అమాత్యుని కుటుంబ సభ్యులు పెన్నానది ఇసుకతో సరిపెట్టుకోలేదు. ఇసుక తరలిపోగా ఏర్పడిన గట్టి ప్రాంతాన్ని వ్యవసాయ భూములుగా మార్చి, సాగులోకి తెచ్చారు. సమీప బంధువుల పేరిట సున్నపురాళ్లపల్లె సమీపంలో 300 ఎకరాలు సాగుచేసి అనుభవిస్తుండగా, అవి స్టీల్ ప్లాంట్ పరిధిలోకి వెళ్లాయి. సర్వే నెం.411లో కొండపోరంబోకు భూమిని ఆక్రమించి బినామీల పేర్లతో సాగు చేసుకునేవారు. సర్వే నెం.64లో గొరిగనూరు గ్రామానికి చెందిన ఈతని బంధువు సబ్ డివిజన్ చేయించి మరీ భూముల్ని ఆక్రమించారు. దేవగుడి ఆధిపత్య గ్రామాల్లో ఈ కుటుంబం వందలాది ఎకరాల కొండ ప్రాంతాన్ని ఆక్రమించి సొమ్ము చేసుకుంది.‘డైమన్షనల్’దందా టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈయనకు అడ్డూఅదుపూ లేదు. మైలవరం మండలంలోని కొండల్లో విలువైన, అరుదైన ఖనిజాలు లభిస్తాయి. అందులో డైమన్షనల్ స్టోన్ ఒకటి. ఆ రాయిని శిల్పాలు, దేవాలయాల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఒక్కొ టన్ను ధర రూ.వేలల్లోనే. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా, రాయల్టీ చెల్లించకుండా అక్రమంగా తరలించారు. రూ.కోట్లలో ఆర్జించారు.గ్రావెల్ అక్రమ రవాణా స్థానికంగా అడ్డుకునే వారు లేకపోవడంతో.. నియోజకవర్గ పరిధిలోని శిరిగేపల్లి, సున్నపురాళ్లపల్లె కొండల్లో రోడ్లకు ఉపయోగపడే గ్రావెల్‌ను ఈ మాజీ అమాత్యుని సమీప బంధువే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పొక్లెయినర్ల సాయంతో కొండలు, గుట్టల్ని పెకలించేశారు. క్రషర్ ద్వారా కంకరగా మార్చి సొమ్ము చేసుకున్నారు.పాలూరు ఎత్తిపోతల పథకం చేపట్టిన కోయా కంపెనీ, సుజిలాన్ పవర్ విండ్ ప్రాజెక్టుతోపాటు సోలార్ కంపెనీ యాజమాన్యం నుంచి ఎన్నికల ఖర్చుల పేరిట దందాల ఆరోపణలూ ఉన్నాయి. ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు ఎర్త్ పనులు ఈ కుటుంబం కనుసన్నుల్లోనే జరిగాయి. నీరు–చెట్టు పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు పనులు జరిగితే, అందులో సగం సొమ్ము ఈయన సన్నిహితుల జేబులోకే వెళ్లినట్లు సమాచారం. -
నల్లమలకూ ఓ వీరప్పన్!
విలువైన కలపను టోకుగా కాజేశాడా నేత.. నల్లమల వీరప్పన్‌గా పేరుమోశాడాయన.. నాటుసారా వ్యాపారంలో అందెవేసిన చేయి.. తన సారా వ్యాపారానికి అడ్డొచ్చి న వారి అంతు చూడడానికి సైతం వెనుకాడనంత దౌర్జన్యపరుడు.. ఈ అక్రమాలన్నిటితో రూ.వేల కోట్లను అనతికాలంలోనే ఆర్జించి.. తన దోపిడీ సామ్రాజ్యాన్ని బలపరుచుకున్న నేత.. అక్కడి జనాన్ని తన కంటి చూపుతో శాసించారు.సారా వ్యతిరేకోద్యమం ముమ్మరంగా రాష్ట్రంలో ఊపేస్తే.. అప్పటి ఈ టీడీపీ నేత నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఈయనకు వ్యతిరేకంగా గొంతెత్తడానికి సాహసించలేకపోయారంటే జనాన్ని ఎంతగా భీతిగొలిపారో అర్థం చేసుకోవచ్చు. తుదకు తనఅక్రమాలకు మద్దతిచ్చే టీడీపీలో చేరారు.. అదొక్కటే కాదు.. అవకాశవాదంతో ఏ ఎండకా గొడుగు పడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోనూ చేరారు.. ఈ నేత నీడన పెరిగిన ఆయన తనయ ప్రస్తుతం టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.సాక్షి, టాస్‌్కఫోర్స్: ఆ పేరు వింటే చాలు నల్లమల వీరప్పన్ గుర్తుకు వస్తారు. కొన్నేళ్ల కిందట నల్లమల అడవిని అడ్డాగా చేసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. కలప చెట్లను ఇష్టానుసారం నరికి హైదరాబాద్‌కు తరలించి రూ. వేల కోట్లు సంపాదించారు. తనకు ఎదురుమాట్లాడితే వారి పని అంతే. అడ్డుకుందామని యతి్నంచిన అధికారులను నయానో భయానో లొంగదీసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. అంగబలానికి తోడు అర్ధబలం తోడవడంతో ఆయన అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయింది. తండ్రి రాజకీయ అండతో..: తండ్రి రాజకీయ అండతో ఈ నేత విచ్చలవిడిగా సంపాదించారు. జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు, ఓర్వకల్లు మండలాల్లో సొంతంగా సారా అంగళ్లు తెరిచారు. పల్లెలకు సారాను పరిచయం చేశారు. సారా వల్ల అనేక వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సారా అంగళ్లను తమ గ్రామాల్లో తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా, తన అంగబలంతో వాటిని అణచివేశారు.1989లో రాష్ట్ర వ్యాప్తంగా సారాకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. రోడ్ల మీదకి వచ్చి తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న సారా రక్కసిని పారదోలాలని రాష్ట్రమంతటా నినదించారు. ఒక్క నందికొట్కూరు నియోజకవర్గంలో మాత్రమే సారా ఉద్యమం చేయాలంటే గజగజ వణకాల్సిన పరిస్థితిని ఈ నేత సృష్టించారు. ఉద్యమం చేస్తే తమను ఏం చేస్తారోనన్న భయం నియోజకవర్గ ప్రజలను వెంటాడింది. ఉద్యమం పెద్ద ఎత్తున ఎగసిపడిన రోజుల్లోనూ స్థానికంగా మాత్రం సారా వ్యాపారం విచ్చలవిడిగా సాగిపోయింది. రూ.కోట్లలో విభేదాలతో బయటకు... 1993లో ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డితో సారా కాంట్రాక్టు విషయంలో ఈ నేతకు విభేదాలు వచ్చాయి. తన సారా వ్యాపారానికి సహకరించడంలేదన్న కోపంతో ఆయన టీడీపీలో చేరి 1994లో నందికొట్కూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్షరాస్యత పెద్దగా లేని నాటి రోజుల్లో అమాయక ప్రజలను తన రాజకీయ లబ్ధి కోసం ఈ నేత వాడుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు చేపట్టి ఎంతో మంది మహిళల పుస్తెలు తెంపిన ఘన చరితా ఈయనదేనన్న ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి ఎన్నికవడంతో.... 1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ నేత ఆగడాలు శృతిమించాయి. నల్లమల అడవిని చెరబట్టి అటవీ సంపదను కొల్లగొట్టారు. విలువైన కలపను ఇతర ప్రాంతాలను రవాణా చేసి రూ.కోట్లు గడించారు. అటవీ అధికారులను బెదిరించి విలువైన కలప చెట్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలించి రూ.వేల కోట్లు సంపాదించారు. ఆ నేత ఇంటిలో, హైదరాబాద్‌లోని హోటల్లో ఎక్కడ చూసినా విలువైన కలప కళాఖండాలు కనిపిస్తాయని ఉమ్మడి కర్నూలు ప్రజలందరికీ తెలుసు. బీడీల కట్టలు కట్టి అమ్ముకునే నిరుపేదల రక్తం తాగారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల నుంచి కారుచౌకగా బీడీ కట్టలను కొనుగోలు చేసి తాను మాత్రం ఎక్కువ రేటుకు విక్రయించి లాభాలు గడించారు. ఆ నేతకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన ఆగడాలను ప్రశి్నంచినా వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే. ఈ నేతకు విలేకరులంటే అలుసు. అప్పట్లో విలేకరుల సమావేశాలంటూ పిలిచి కురీ్చలు కూడా వేసేవారు కాదు. పాత్రికేయులు నిలుచునే ఆయన చెప్పేది నోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా కేంద్రాలలో ఉండే ముఖ్య ప్రతినిధి వస్తే మాత్రమే కుర్చీ వేసేవారు. ∗ 2004లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నేత వరుసగా పార్టీలు మారారు. కొద్ది రోజులు రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో హడావుడి చేశారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లోకి ఆయన వెళ్లొచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ ఊసరవెల్లి రాజకీయాలు సాగించిన ఘనత దక్కుతుంది. కేసులు.. వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడంతో ఆయనపై ఐపీసీ 341 కింద నియోజకవర్గంలో కేసు నమోదైంది. ఐపీసీ 143, 188, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న తనయతండ్రికి తానేమీ తక్కువకాదన్నట్లుగా ఆయన తనయ వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈమె నోరు తెరిస్తే చాలు అవతలి వ్యక్తి హడలిపోవాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లెలో ఈమెపై క్రిమినల్ కేసు నమోదైంది. దళిత వ్యక్తిని దూషించడంతో పాటు దాడి చేయడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈమె టీడీపీ తరఫున లోక్ సభకు పోటీ చేస్తున్నారు. -
అక్రమాల ప్రియ
పేరేమో అందరికీ ‘ప్రియం’గా అనిపిస్తుంది.. వ్యవహార శైలి చూసినా, విన్నా అన్నీ అప్రియాలే... టీడీపీ హయాంలో మంత్రిగా అవకాశం లభించేసరికి దోపిడీకి లైసెన్సు పొందినట్లయింది.ఈమె గారి పతి పేరులోనే దేవుడు...∗ లీలల్లో రావణుడే... ఈ సతీపతుల విచ్చలవిడి దోపిడీకినంద్యాల సమీపంలోని ఓ నియోజకవర్గం అడ్డాగా మారింది. నీరు–చెట్టు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు, తాగునీటి పేరిట వీరి అక్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వీరి దోపిడీని లెక్కగడితే రూ.వంద కోట్లు దాటి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ దంపతుల కంటికి నదురుగా ఎవరి స్థలమైనా కనిపించినా.. లేదా.. స్థల వివాదాల్లో న్యాయం చేయాలని ఎవరైనా వీరి వద్దకు వచ్చినా.. పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చిందన్న చందంగా ఆ స్థలాలను కాజేసే దాకా వీరు నిద్రపోరు. ∗మాయ మాటలతో రైతులను వంచించడంలో ఈ దంపతులను మించిన వారు లేరని వీరిఅఘాయిత్యాలే చెబుతాయి..∗ఎవరైనా వీరి అన్యాయాలనుప్రశ్నించారో వారిపై విరుచుకుపడతారు. డబ్బుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరనివీరి చరిత్ర చెబుతోంది. జైలుకెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోకపోవడం వీరికే చెల్లింది. సతి ఆదేశం.. పతి దౌర్జన్యం.. చింతకుంట గ్రామానికి చెందిన గూడా నరసింహుడు భార్య వెంకట లక్షమ్మకు ఆళ్లగడ్డ పట్టణ శివారులో 25 సెంట్ల స్థలముంది. ఆ స్థలాన్ని మహమ్మద్‌హుసేన్, నూర్ అహమ్మద్ల నుంచి 1995 మార్చి 27న కొనుగోలు చేసి రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. రూ.2 కోట్ల విలువ చేసే ఈ స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఈ దంపతులు ఓ సర్వేయర్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ద్వారా 1952లో అల్లిసా పేరిట రిజి్రస్టేషన్ డాక్యుమెంట్‌ను బయటకు తీశారు. అవుకు మండలం సంగపట్నంలో నివసించే వారి మనవడు నూర్‌బాషాకు నచ్చజెప్పి మూడు భాగాలుగా చేసి 2022 డిసెంబర్1న అనుచరుల పేరున రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇప్పుడు ‘గూడా’ దంపతులు లబోదిబోమంటున్నారు. ఈ అరాచక దంపతుల దౌర్జన్యంలో ఇది మరో కోణం. సాక్షి, టాస్‌్కఫోర్స్: గత ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన యువ మహిళా మంత్రి అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అక్రమాలను అవలీలగా చేసేశారు. ఇప్పుడామె అధికారంలో లేకున్నా... కబ్జాలకు కొదవలేదు. ఎదిరించేవారిపై దౌర్జన్యాలకూ వెనుకాడటం లేదు. ఆమెతోపాటు ఆమె రెండో భర్త చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ పనిచేసినా వారికి వాటాలు ముట్టజెప్పాల్సి వచ్చేది.కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ నియామకాల్లోనూ ఈ సతీపతుల వసూళ్ల దందా సాగింది. అభివృద్ధి పనుల్లోనూ ఆ దంపతులు రూ.కోట్లలో పర్సంటేజీలు మూటగట్టుకున్నారు. చివరకు పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ వసూళ్లు కొనసాగించారు. వివిధ పనుల్లో టెండర్లతో పని లేకుండా రూ.200 కోట్ల వరకూ స్వాహా చేశారు. అధికారం కోల్పోయినా తమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అభివృద్ధి పేరుతో అక్రమాలు... ఆమె టీడీపీ హయాంలో నియోజకవర్గంలో వివిధ పనుల కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుని వాటిని పక్కదారి పట్టించారు. అధికారులను బెదిరించి పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రతి పనినీ తన అనుయాయులకే టెండర్‌తో ప్రమేయం లేకుండా కట్టబెట్టించి వారి వద్ద పర్సంటేజీలు నొక్కేశారు. దౌర్జన్యాలకు నిదర్శనాలివిగో.. ∗ తాజాగా ఓ పంచాయితీ కోసం ఇంటికొచ్చిన ఓ ముస్లిం మైనార్టీ నాయకుడిని అందరూ చూస్తుండగానే మాజీ మంత్రి దంపతుల ఆదేశాల మేరకు అనుచరులు చితకబాది వారి వద్దనున్న రూ.1.30 కోట్లు దోచే యడం ఇప్పుడు సంచలనమైంది. ∗ జగత్ డెయిరీకి చెందిన అమాయక రైతుల పేర్లపై బ్యాంకు రుణాలు తీసుకుని మంత్రి తిరిగి చెల్లించకపోవడంతో ఆ రైతులు డిఫాల్టర్లుగా మారి పంట రుణాలూ పొందలేక అల్లాడిపోయారు. ∗ మంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లకు ఆశపడి మున్సిపల్ శానిటరీ, స్వీపర్ పోస్టులతోపాటు టూరిజం శాఖలో విద్యుత్ సబ్స్టేషన్లలో ఉద్యోగాలను అమ్ముకున్నారు. ∗ నీరు చెట్టు పనుల్లో అడిగినంత కమీషన్ ఇవ్వలేదని భాచాపురం గ్రామ నాయకుడి చెక్‌బుక్ దొంగిలించి అతనిపై చెక్‌బౌన్స్ కేసు పెట్టి వేధించారు. ∗ మాజీ మంత్రి ప్రస్తుత భర్త ద్వారా ఖాళీ స్థలాలపై కన్నేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. భూ కబ్జాలకు పాల్పడి బాధితులను చంపుతామని బెదిరించారు. వ్యాపారవర్గాలను భయభ్రాంతులకు గురి చేశారు. ∗ అవసరమైనప్పుడు అప్పులిచ్చి ఆదుకున్న స్నేహితులు, శ్రేయోభిలాషులను మోసం చేశారు. రుణాలు ఎగ్గొట్టారు. వారిని ఇంట్లోకీ రానివ్వకుండా అవమానించారు.∗ తండ్రి ఇంటిపేరును దుర్వినియోగం చేయడంతో విసిగిపోయిన బంధువులు ఆమెకు దూరమయ్యారు. ఆమెను, ఆమె భర్తను బహిష్కరించారు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ∗ నాలుగేళ్లుగా హైదరాబాద్‌కే పరిమితమైన మాజీ మంత్రి దంపతులు ఇప్పుడు ఎన్నికలు రావడంతో పదవి కోసం మళ్లీ నియోజకవర్గంలో తిష్టవేశారు. ∗ నంద్యాలకు ఆనుకుని ఉన్న నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా ప్రవహించే వక్కిలేరులో అప్పటి టీడీపీ మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఏటా నీరు–చెట్టు పేరిట పనులు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 350 పనులుగా దీన్ని విభజించి తన బంధువులైన రామతీర్థ పుట్టాలమ్మ ఆలయ అప్పటి చైర్మన్ (ప్రస్తుత బీజేపీ నాయకుడు), అప్పటి సహకార సంఘం చైర్మన్, కోటకందుకూరు మాజీ సర్పంచికి అప్పగించారు.వారు వాగులో అరకొర పనులు చేసి ఏకంగా రూ.3 కోట్లకు పైగా నిధులు కొల్లగొట్టారు. ఇందులో నాటి మంత్రికి సగం ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వర్క్ ఆర్డర్ లేకపోయినా అధికారులను బెదిరించి బిల్లులు చేయించుకున్నట్లు సమాచారం. ∗ రుద్రవరం మండలం నాగులవరం సమీపంలోని టీజీపీ పంట కాలువలో పూడిక తీసినట్టు అధికారులు బిల్లులూ మంజూరు చేశారు. ఇదే గ్రామానికి చెందిన నాటి మంత్రి అనుచరుడు ఇలాంటి పది పనులు సుమారు రూ.కోటితో చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు పనులు నాసిరకంగా చేపట్టగా, ఆరు పనులను అసలు చేయకుండానే బిల్లులు ఆమోదింపజేసుకుని రూ.60 లక్షలు మింగేశారని సమాచారం. ఇలా పైపై పనులు చేపట్టి దాదాపు రూ.130 కోట్ల మేర నాటి మంత్రి, జన్మభూమి కమిటీలు, వారి అనుచరులు బొక్కేశారు. రైతులకు ఉచితంగా ఇచ్చే శనగ విత్తనాల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని ఇతర రాష్ట్రాల నుంచి మినుములను రప్పించి ఇక్కడి రైతులవే అని చెప్పి కొల్లగొట్టేశారు. తాగునీటి సరఫరా పేరుతో దోపిడీ... చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకుని అప్పటి మంత్రిగా అడ్డంగా దోచేశారు. పట్టణంలో ట్యాంకరుకు రూ.500 నుంచి రూ.750 వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. మంత్రి అనుచరులు ట్యాంకర్లను కొని మున్సిపాలిటీకి అద్దెకిచ్చారు. నీటిని వారు తరలించకుండానే కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వేషంలో వెళ్లి కిడ్నాప్.. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమి ఆక్రమించుకునేందుకు మాజీ మంత్రి, ఆమె వర్గీయులు చేసిన కిడ్నాప్ సినిమాను తలపించింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల వేషంలో వెళ్లి కిడ్నాప్ చేయడంతో అప్పట్లో సంచలనమైంది. అయితే తీరా కిడ్నాప్ చేసిన మనుషులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు కావడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కిడ్నాప్ చేసిన వ్యవహారంలో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె ఏ1 నిందితురాలు. నెలల తరబడి జైలు జీవితం గడిపారు. కిడ్నాప్ కేసులో ఓ మహిళా మాజీ మంత్రి జైలుకు వెళ్లడం అదే తొలిసారి. -
ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సు
వృత్తి: ట్రాన్స్‌పోర్టు బిజినెస్ప్రవృత్తి: హత్యా రాజకీయాలు.. నేరాలు.. ఘోరాలుపదవి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక దేశం నేతఅరాచకాలు,కేసులు: చెప్పలేనన్నిఅతనో నియంత.. అతనికెదురెళ్తే టిప్పర్ లారీకి ఎదురెళ్లినట్లే.. తన దురన్యాయాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఆ రోజుతో వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే.. ఊళ్లలో ఫ్యాక్షన్ మంటలను ఎగదోసి, వాటితో చలికాచుకునే దుర్మార్గ రాజకీయం తన సొంతం.. అదే తన హాబీ కూడా.. రౌడీషీట్ తెరిపించుకున్న ఘనత ఆయన సొంతం. ఆయన తనయుడూ తక్కువేమీ తినలేదు. ప్రస్తుతం ఇతను ‘దేశం’ తరఫున పోటీ చేస్తున్నారు. సాక్షి, టాస్‌్కఫోర్స్ : ట్రావెల్స్ ద్వారా కండిషన్ లేని బస్సులను నడిపి ఆ ‘దేశం’ నేత ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడారు. 2013 అక్టోబరు 30వ తేదీన మహబూబ్‌నగర్ సమీపంలో పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 45 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సీనియర్ నేత భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ లీజు అగ్రిమెంట్లు సృష్టించారని ఆ నేతపై సీఐడీ అభియోగాలను మోపింది.2017లో విజయవాడ వద్ద ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కాంట్రాక్ట్ క్యారేజ్ పేరుతో పర్మిట్లు తీసుకుని స్టేట్ క్యారేజ్‌గా బస్సులు నడపడంపై అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. తప్పు చేసింది కాకుండా తన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ నేత హైదరాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని తన అనుచరులతో కలిసి ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్రమాలకు పరాకాష్టగా బీఎస్ 3 వాహనాలు ఆ నేత అక్రమాలకు పరాకాష్టగా బీఎస్–3 వాహనాల కుంభకోణం నిలిచింది. ఓ ప్రముఖ సంస్థ వద్ద స్క్రాప్ ద్వారా కొనుగోలు చేసిన 154 బీఎస్–3 లారీలను బీఎస్–4 వాహనాలుగా నకిలీ ఎన్ఓసీ, ఇన్సూరెన్స్‌తో నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై సీబీఐ,ఈడీ దాడులు చేశాయి. 2020లో ఆ నేతతో పాటు ఆయన కుమారుడు, అనుచరుడు, మరికొందరిపై వివిధ పోలీసు స్టేషన్లలో 24 కేసులు నమోదయ్యాయి. బస్సులను సీజ్ చేయడంతోపాటు ఈ నేత, బినామీల పేరుపై ఉన్న రూ.22 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసి, పలు రికార్డులు స్వా«దీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ప్రభుత్వ నిధులూ స్వాహా...?తాడిపత్రి ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. 2015æలో యాడికి మండలంలో గ్రామీణ సడక్ యోజన కింద రూ.2.40 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా పూర్తి చేయించారు. రాయలచెరువులో నీరు–చెట్టు కింద పూడికతీత పనుల్లో రూ.2.5 కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.పెద్దవడుగూరు మండలంలో 2015లో రూ.6.45 కోట్లతో నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో ఎక్కువ శాతం చేయకుండానే పూర్తయినట్లు రికార్డుల్లో చూపించి నిధులు బొక్కేశారు. పెద్దవడుగూరు మండలంలోని పెద్ద వంక వద్ద జంగిల్ క్లియరెన్స్ పేరుతో దాదాపు రూ.8 లక్షలు కాజేశారు. చిన్నవడుగూరులో కుంట, కాలువల్లో ముళ్ల పొదల తొలగింపునకు దాదాపు రూ.18 లక్షలు, పెద్దవంకలో రూ.7 లక్షలను పనులు చేయకుండానే పక్కదారి పట్టించారు. కేసుల వివరాల► ఇప్పటికే రౌడీ షీట్ నమోదై ఉంది. ► 1996లో జరిగిన టౌన్‌బ్యాంకు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో టీడీపీకి చెందిన లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. ► మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 70కి పైగా కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్లో 57 కేసులు, తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ పోలీసు స్టేషన్లో 5, పెద్దపప్పూరు పోలీసు స్టేషన్లో 6, యాడికిలో ఒక కేసు నమోదయ్యాయి. ► 2020లో నకిలీ ఇన్సూరెన్స్ కుంభకోణంలో తాడిపత్రి పట్ట ణ, అప్‌గ్రేడ్ రూరల్ పోలీసు స్టేషన్లలో 28 చీటింగ్ కేసుల నమోదు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించడంతో ఆయనపై పోలీసులు ఒకేసారి 28 కేసులు నమోదు చేశారు. (1). ఎఫ్ఐఆర్ నెం. 28/2020. ఐపీసీ 420, 467, 468, 471, 472, 120(బి), 201 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్లు. (2) ఎఫ్ఐఆర్ : 85/2020. ఐపీసీ 420, 467, 468, 471, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ, 179, 182, 190 ఎం.వి.యాక్టు) మరో 27 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ► 2023లో పెద్దపప్పూరులోని ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అనుచరులతో కలిసి వెళ్లిన ఆయన అక్కడున్న టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుని కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ► 1996 నుంచి 1999 వరకు జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన నిందితునిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ ద్వారా పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో 2014లో ఎఫ్ఐఆర్ నెం. 142/14, సెక్షన్ 151 సీఆర్పీసీ కింద పీడీ యాక్టు నమోదైంది. అసెంబ్లీ పోటీలో ఉన్న తనయుడిపై కేసులు : ► ఆయన తనయుడిపై 30 కేసులు నమోదయ్యాయి. నకిలీ పత్రాలను సృష్టించి వాహనాలను విక్రయాలు జరిపిన నేరంపై 2022లో ఐపీసీ 420, 467,468,471,120బి రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో తండ్రీకొడుకులు కడప సెంట్రల్ జైలులో 50 రోజులు జ్యూడిíÙయల్ రిమాండ్‌లో ఉన్నారు. ► బీఎస్–3 వాహనాల కుంభకోణంలో బైయిల్‌పై వస్తూ తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్ర కుమార్‌పై అనుచితంగా ప్రవర్తించినందుకు తండ్రితోపాటు తనయుడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదైంది. మనీ ల్యాండరింగ్‌పై తాడిపత్రిలోని నివాసంలో ఈడీ అధికారులు దాడులు జరిపి ఆయన తనయుడిపై రెండు కేసులు నమోదు చేశారు. ఇంకా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసిన పలు కేసుల్లో తనయుడిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులూ నమోదయ్యాయి. డబ్బు కోసం దేనికైనా సై ► తాడిపత్రి మండలం హుస్సేన్‌పురం వద్ద రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన గెర్దావ్ స్టీల్ ప్లాంట్‌పై కన్నేసిన ఆ నేత కంపెనీ యజమానులను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సొంతంగా ట్రాన్స్‌పోర్టును ఏర్పాటు చేసి, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు తన లారీలనే వినియోగించుకునేలా వారిపై ఒత్తిడి చేశారు. సరుకు రవాణాకు సంబంధించి ట్రాన్స్‌పోర్టు వే బిల్లులు కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ ద్వారా చేయించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. బినామీ లెక్కలతో రూ.300 కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. ► స్టీల్ ప్లాంట్‌లో డ్రైస్లాగ్ ద్వారా నెలకు దాదాపు రూ.15 కోట్ల చొప్పున ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో రూ.900 కోట్లు ఆర్జించారని సమాచారం. ► గుత్తి నుంచి తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద ఉన్న వైఎస్సార్ జిల్లా సరిహద్దు వరకూ 63 కి.మీ. హైవే పనులకు రూ.275 కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ హైవే అధికారులు ఆహా్వనించిన టెండర్లను నాటి టీడీపీ ఎంపీకి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు మరో విదేశీ కంపెనీ 13 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకున్నాయి. విదేశీ కంపెనీకి మన దేశంలో అనుమతుల్లేవంటూ అధికారులను బెదిరించి ఆ టెండర్‌ను రద్దు చేయించారు. అనంతరం ఎంపీకి చెందిన కంపెనీతోపాటు మరో కంపెనీతో కలసి 4.9 శాతం ఎక్కువకు టెండర్ కోట్ చేయించి దక్కించుకున్నారు. ఈ అక్రమాలతో రూ.50 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ► మున్సిపాలిటీ ఆ«దీనంలోని కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తును తన ముఖ్య అనుచరుడు ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఆ నేత లీజుకు ఇచ్చి, గుడ్‌విల్ రూపంలోనే దాదాపు రూ.2.66 కోట్లు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ► ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న కాంప్లెక్స్‌లో 6, 67, 68, 72 రూములను తక్కువ మొత్తంతో అద్దెకు తీసుకుని సబ్ లీజులకు ఇచ్చి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు సమాచారం. ► పెద్దపప్పూరు మండలం జూటూరు భూముల్లో ఆయన అనుచరులు రూ. కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పెన్నా, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాలోనే వారి అనుచరులు రూ.40 కోట్లకు పైగా కూడబెట్టారు. ► తమ కుటుంబ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలోని గనుల్లో లైమ్‌స్టోన్ వెలికి తీసే క్రమంలో చారిత్రక గుహలు వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు. ►మట్కా డాన్‌గా పేరున్న ఓ వ్యక్తికి ఈ నేత పూర్తి అండదండలు ఉండేవి. అప్పట్లో కడప విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న సీఐ, తన సిబ్బందితో కలసి మట్కా డాన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించినప్పుడు తన అనుచరులను ఉసిగొల్పి పోలీసులపై దాడులు చేయించి, పోలీసు వాహనాలకు నిప్పంటించారు. -
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
దోచుకో.. పంచుకో.. సూత్రం సారా వ్యాపారంలో ఆరితేరిపోయిన సీఎం రమేష్‌ను చంద్రబాబు నాయుడుకు దగ్గర చేసింది. సారా వ్యాపారంతో మొదలైన ఆర్జన ఇరిగేషన్ కాంట్రాక్టుల వరకు వెళ్లింది. టీడీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ అక్రమార్జనపరుడికి ఎదురే లేకుండా పోయింది. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ పేరుతో హంద్రీ –నీవా, వెలిగొండ, తెలుగుగంగ,గుంతకల్లు బ్రాంచి కెనాల్, వంశధార.. ఒకటేమిటి.. అధికారంలో బాబు అండతో సీఎం రమేష్ అక్రమాల్లో చెలరేగిపోయారు. బాబు– సీఎం రమేష్లది ఆర్థిక రాజకీయ బంధం. ఈ బంధం ఫెవికాల్ అంతదృఢంగా పెనవేసుకుపోయింది. బాబుతో ముడిపడిన ఆర్థిక బంధం రెండు టర్మ్‌ల్లో సీఎం రమేష్‌ను రాజ్యసభ సభ్యుడిని చేసింది. రాజకీయ చక్రం బాగా తిప్పుతారని సదరు బాబు సూచనతో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఇతనికి ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలనిపించింది. స్థానికంగా అంత సీన్ లేనందున తన అక్రమాల నేపథ్యం తెలియని కోస్తాంధ్ర వైపు దృష్టి సారించారు. సాక్షి ప్రతినిధి, కడప : స్వయం కృషితో కష్టపడి ఉన్నత స్థాయికి చేరేవారు కొందరైతే, రాజకీయ అండ దొరకబుచ్చుకుని చెలరేగిపోయే వారు ఇంకొందరు. ఇందులో రెండో కోవకు చెందిన నేత చింతకుంట మునెయ్యగారి (సీఎం) రమేష్ నాయుడు. ఉరఫ్ సీఎం రమేష్. చిత్తూరు జిల్లా సారా వ్యాపారంలో చంద్రబాబుతో ఏర్పడ్డ సాన్నిహిత్యం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది. అదీ ఏ స్థాయిలో అంటే సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడినే బాబు పక్కన పెట్టే స్థాయిలో సంబంధాలు పెనువేసుకున్నాయని పరిశీలకుల అభిప్రాయం. విభజిత ఏపీలో సీఎం రమేష్‌నాయుడు కాంట్రాక్టు సంస్థ దినదినాభివృద్ధి చెందింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమ కార్యకలాపాలను శరవేగంగా నడిపారు. ఎంతలా అంటే 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం ఒక్క రోజు ముందే ఈయన కాంట్రాక్టు సంస్థకే ఇరిగేషన్ పనులు దక్కేలా చక్రం తిప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లూ సీఎం రమేష్ ఆర్థిక సామ్రాజ్యం విస్తరించింది. ఎవరీ సీఎం రమేష్‌నాయుడు? వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన చింతకుంట మునెయ్యగారి (సీఎం) సుబ్బానాయుడు మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి అనుచరుడు. సారా వ్యాపారంలో రాణించారు. కడప జిల్లాలో పలుపాంత్రాల్లో ఈ వ్యాపారాన్ని విస్తరించారు. ఆయనకు నలుగురు కుమారులు. మునిస్వామినాయుడు, గోవర్ధన్‌నాయుడు, సత్యనారాయణనాయుడు, గోపాల్‌నాయుడు. తండ్రి సుబ్బానాయుడు వారసత్వంగా కుమారులు పలువ్యాపారాలను విస్తరించారు. ఈ క్రమంలో మునిస్వామినాయుడు సారా వ్యాపారాన్ని కొనసాగించారు. అప్పట్లో కడప జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సారా కాంట్రాక్టును చిత్తూరు జిల్లాకు విస్తరించారు. ఈ జిల్లాలో సారా కాంట్రాక్టు కార్యకలాపాలను మునిస్వామినాయుడు కుమారుడు సీఎం రమేష్‌నాయుడు కొనసాగించారని ఈ వ్యవహారం మొత్తం తెలిసిన పలువురు వివరిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో అప్పటికే క్రియాశీలకంగా ఉన్న చంద్రబాబుతో సాన్నిహిత్యం కోసం తొలుత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడితో సీఎం రమేష్ దోస్తీ చేశారు. క్రమంగా వీరి సాన్నిహిత్యం పెరిగి, తుదకు నారా రామ్మూర్తినాయుడినే చంద్రబాబు నుంచి దూరం పెట్టేలా చేసింది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన యువతిని సీఎం రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ బాబుకు మరింత దగ్గరైనట్లు సమాచారం. అనంతరం 1994 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఆయనకు చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు అప్పగించినట్లు పలువురు చెబుతున్నారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో సీఎం రమేష్ సారా వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరించినట్లు సమాచారం. అప్పటి సాన్నిహిత్యమే అంచెలంచెలుగా ఎదిగి టీడీపీ నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యే స్థాయికి చేరుకుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. టీడీపీ హయాంలో రూ.3,658 కోట్ల పనులు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికార పగ్గాలు చేపట్టింది. రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు ఇదో వరంగా పరిణమించింది. అప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేస్తూ ఆర్థిక లోటుపాట్లతో ఇబ్బందులు పడుతున్న ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరించి అండగా నిలిచింది. ఈ క్రమంలో ఈ సంస్థకు కాంట్రాక్టు పనుల వరద పారిందని పలువురు వివరిస్తున్నారు. అందులో ప్రధానంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.522 కోట్లు, హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 రూ.1000 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు రూ.195 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ 34వ ప్యాకేజీ రూ.234 కోట్లు, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో రూ.350 కోట్లు, వెలిగొండ టన్నెల్ రూ.270 కోట్లు, తెలుగుగంగ లైనింగ్ పనులు రూ.289 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రూ.172 కోట్లు, వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు, ఆర్టీపీపీ 6వ ప్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్ల పనులు దక్కినట్లు పలు కాంట్రాక్టు సంస్థలు వెల్లడిస్తున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దాదాపు రూ.3,658 కోట్ల పైబడిన కాంట్రాక్టులను ఆ సంస్థ కొనసాగిస్తున్నట్లు పలువురు కాంట్రాక్టర్ల విశ్వసనీయ సమాచారం. అదే విషయాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ అప్పటి టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి (ప్రస్తుత టీడీపీ అభ్యర్థి) సైతం పలుమార్లు స్పష్టం చేశారు. ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఆర్టీపీపీలో అడ్డగోలు టీడీపీ ఎంపీ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రమేష్ దందా నిర్వహిస్తే, సోదరుడు సీఎం సురేష్‌నాయుడు స్థానికంగా ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్) కేంద్రంగా దోపిడీ చేశారు. ఇనుము (స్క్రాప్), సిమెంటు, కంకర యథేచ్ఛగా తరలించారు. తన దారికి అడ్డు లేకుండా మరో రహదారి (అనధికారిక గేట్) ఏర్పాటు చేసి మరీ తరలించారు. మూడేళ్ల పాటు జెన్కో డైరెక్టర్లు చోద్యం చూడటం మినహా కట్టడి చేయలేని దుస్థితి. ఆర్టీపీపీలో అధికారికంగా రెండుగేట్లు ఉన్నాయి. వాటి పరిధిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు(ఎస్పీఎఫ్) బందోబస్తు ఉంటుంది. ప్రతిదీ అక్కడ రికార్డు అవుతుంది. ఈ క్రమంలో అనధికారికంగా మూడో గేటు వెలసింది. అందుకు అప్పటి సీఈ, ఓ డైరెక్టర్ స్థాయిలో సహకరించారు. 6వ యూనిట్ నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలకు మూడో గేట్ ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం సమర్థించుకుంది. ఆ గేటులో ఎలాంటి సిబ్బంది లేకపోవటంతో అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. యథేచ్ఛగా ఈదారి గుండా వాహనాలు ఆర్టీపీపీలోకి వెళ్లడం, బయటికి రావడంతో అందులో ఉన్న కోట్లాది రూపాయల స్క్రాప్, కంకర, సిమెంటు బయటకు వెళ్లింది. విజిలెన్సు విభాగం యాజమాన్యానికి అప్పట్లో ఈ విషయమై నివేదించినా ఫలితం లేకపోయింది. చంద్రబాబు అండ చిత్తూరు జిల్లాలో సారా వ్యాపారంతో అరంగేట్రం చేసిన సీఎం రమేష్ కుటుంబానికి అప్పటి నుంచే చంద్రబాబునాయుడు అండగా నిలిచి ఆదరించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో గుడిమల్లం దేవాలయ భూములు 303 ఎకరాలు వేలానికి వచ్చాయి. అప్పటి రాజకీయ సంబంధాల కారణంగా సీఎం రమేష్ కుటుంబం తక్కువ ధరలకు ఆ భూములను వేలంలో దక్కించుకున్నట్లు సమాచారం. ఆ భూముల ఆధారంగా 90వ దశకం చివర్లో అప్పటి రాజకీయ పలుకుబడితో బ్యాంకులో దాదాపు రూ.400 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ కార్యకలాపాలు చురుగ్గా సాగినట్లు వాటి కార్యకలాపాలే చెబుతున్నాయి. వ్యక్తిపై దాడి కేసు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సీఎం రమేష్నాయుడుపై 2019 ఏప్రిల్ 11న వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2019 ఎన్నికల సమయంలో యర్రగుంట్లలోని ఓ ఎన్నికల బూత్‌లోకి నిబంధనలకు విరుద్ధంగా ఒకరికంటే ఎక్కువ మంది వెళ్లడంతోపాటు ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడు పడిగపాటి వెంకటసుధాకర్ తండ్రి బాల సుబ్బిరెడ్డి ఇచి్చన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు సీఎం రమేష్‌పై 100/2019 ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఐపీసీ సెక్షన్ 323, 324/ఆర్/డబ్లు 34 కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులతో భూములకు ప్రొటెక్షన్ వాల్ అపోట్లదుర్తి గ్రామంలో నీరు–చెట్టు పథకం కింద ఫ్లడ్ ప్రొటెక్షన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీఓ జారీ చేసింది. జీఓ ఆర్టీ నంబర్ 74 ను 2019 జనవరి, 29న జారీ చేశారు. ఆ మేరకు నీరు–చెట్టు పథకం కింద ఫ్లడ్ ప్రొటెక్షన్ బ్యాంక్స్ నిర్మించేందుకు ఫిబ్రవరి 1న ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లను ఆ శాఖ ఎస్ఈ ఆహా్వనించారు. అంటే విషయం గ్రహించేలోపు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా వ్యవహరించారు. ఎన్నికల కోడ్‌కు ముందే టెండర్లకు పిలిచిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న టెండర్లు ఫైనల్ చేశారు. పలు కాంట్రాక్టు సంస్థలు పోటీపడ్డా ఆయా సంస్థలను డిస్క్వాలిఫై చేసి రిత్విక్ సంస్థకు మాత్రమే టెండర్‌ను 4 శాతం ఎక్సెస్ రేట్లకు ఖరారు చేశారు. అవే పనులను రూ.3.08 కోట్లతో రమేష్‌నాయుడు కుటుంబ సభ్యుల స్వా«దీనంలో ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ నిరి్మంచడం విశేషం. అఇకోస్తాంధ్రలోనే ఎందుకంటే.. సీఎం రమేష్‌నాయుడు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా, రాయలసీమలో అందునా కడప జిల్లాలో రాజకీయంగా గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ స్థాయి. అదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనేక పర్యాయాలు చెప్పుకొచ్చారు. అలాంటి స్థాయిలేని నాయకుడికి అనధికారికంగా జిల్లా బాధ్యతలు అప్పగించి ప్రజాధనం దోపీడీకి పాల్పడుతున్నారని అప్పట్లో తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాబలం లేని కడప నుంచి పోటీ చేయలేక, కోస్తాంధ్రలోని అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో ఖర్చు చేయగల సామర్థ్యం, పైగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం వల్లే అక్కడ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. -
అయ్యన్న..హన్నన్న..నేరాల ప్రీతిపాత్రుడు
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల పరిధిలో వేలాది హెక్టార్లలో ఉన్న విలువైన ఖనిజం లేటరైట్. ఈ ఖనిజం అంటే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి ఎంతో ప్రీతి. టీడీపీ హయాంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజ నిల్వలను అక్రమంగా తవ్వుకుని రూ.వందల కోట్లు ఆర్జించారు. ఇందులో ఆయన తనయుడు విజయ్ ప్రధాన భాగస్వామి. అప్పట్లో ఖనిజ సంపద తవ్వకాల అనుమతులు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. తవ్వకాలను వ్యతిరేకించిన గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరికి శివపురంలోని పంట కాలువనూ అయ్యన్న వదల్లేదు. కాలువను ఆక్రమించి మరీ తన ఇంటి నిర్మాణం చేపట్టారు. తొలగించేందుకు వచ్చిన అధికార యంత్రాంగంపై దాడికి తెగబడ్డారు. అప్పటి సరుగుడు సర్పంచ్‌పై ఒత్తిడి బమిడికలొద్ది ఏరియాలో 110 హెక్టార్ల లీజుదారుడైన జర్తా లక్ష్మణరావును తన బినామీకి 80 శాతం వాటా ఇవ్వాలని అయ్యన్న తనయుడు అప్పట్లో డిమాండ్ చేశారు. దీనికి ఆయన నిరాకరించాడు. దీంతో మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు తీర్మానం చేయాలంటూ ప్రస్తుత ఎంపీపీ, అప్పటి సరుగుడు పంచాయతీ సర్పంచ్ లక్ష్మణ్మూర్తిపై విజయ్ ఒత్తిడి చేశారు. దీంతో లక్ష్మణ్‌మూర్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సరుగుడు పంచాయతీలో జర్తా లక్ష్మణరావుకు మైనింగ్ కోసం ఇచ్చిన పంచాయతీ తీర్మానం సరైనది కాదని, రికార్డులు తారుమారు చేశారంటూ అప్పటి మంత్రి అయ్యన్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తక్షణ విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు పంచాయతీ తీర్మానానికి రెండు పుస్తకాలను వినియోగించటమే కాకుండా కొన్ని పొరపాట్లు చేశారని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదించారు. అయ్యన్న ఒత్తిడితో ఆ రోజు చేసిన తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలని కలెక్టర్‌ను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. అప్పటి కలెక్టర్ యువరాజ్ సరుగుడు ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలు జరగకుండా చూడాలని తొమ్మిది శాఖల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. టీడీపీ హయాంలో లేటరైట్ అనుమతుల కోసం మైనింగ్ మాఫియా బినామీలైన సింగం భవాని పేరిట 5 హెక్టార్లు, కిల్లో లోవరాజు పేరుతో 35 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అయ్యన్న తనయుడు విజయ్ సహకారంతో కాకినాడకు చెందిన అబ్బాయిరెడ్డి, బుజ్జి, తోట నవీన్, శ్రీనివాస్ అలియాస్ నల్లశ్రీను ఏకమై తవ్వకాలు చేపట్టారు. రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి, సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్ అనుమతులు రద్దు చేసినా నిరాటంకంగా తవ్వకాలు సాగించారు. అక్రమ నిర్మాణంపై ప్రశ్నిస్తే దౌర్జన్యం నర్సీపట్నంలోని శివపురంలో 10 అడుగుల ఇరిగేషన్ పంట కాలువను అయ్యన్నపాత్రుడు కబ్జా చేసి, అక్రమంగా ఇంటిని నిర్మించారని జిల్లా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆక్రమణను తొలగించాలని నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని తొలగించేందుకు 2022 జూన్ 20న అధికారులు ప్రయతి్నంచారు. దీన్ని అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. జేసీబీ ఆపరేటర్లను బెదిరించడంతో వారు జేసీబీ వదిలి వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, అతని చేతిలో కెమెరా లాక్కున్నారు. జాయింట్ సర్వే చేయించి ఆక్రమణలు నిరూపిస్తే తామే తొలగిస్తామని అప్పటి ఆర్డీవో గోవిందరావుకు అయ్యన్న రెండో కొడుకు రాజేష్ వినతిపత్రం అందించారు. ఆర్డీవో ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రీసర్వే చేపట్టారు. సర్వే చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు సర్వేను అడ్డుకుని కొలత చెయిన్ లాక్కున్నారు. రికార్డులు పట్టుకుపోయారు. పోలీసుల హెచ్చరికలతో సర్వే రికార్డులను తిరిగి అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు జేసేబీ అద్దాలు పగులగొట్టడంతోపాటు టైర్లలో గాలి తీసేశారు. ఇప్పటికీ ఆ జేసీబీ అక్కడే ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తోంది. ఈ గొడవ జరుగుతుండగానే అయ్యన్న కోర్టును ఆశ్రయించి అదే రోజు సాయంత్రానికి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. రేప్ కేసు సహా 23 ఎఫ్ఐఆర్లు ► అయ్యన్నపై ఇప్పటివరకూ రేప్ సహా 23 కేసులు నమోదయ్యాయి. బట్టలూడదీసి కొడతానని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై 2020లో క్రైమ్ నెం. 777/2020 యు/ఎస్ 354(ఏ), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ఐపీసీ కింద నర్సీపట్నం టౌన్ స్టేషన్లో రేప్ కేసు నమోదైంది. ► దళితులను దూషించినందుకు క్రైమ్ నెం. 690/2020 యు/ఎస్ 3(ఐ)(ఆర్), 3(ఐ)(యు) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ► తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇరిగేషన్ కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినందుకు అమరావతి సీఐడీ పోలీసులు క్రైమ్ నెం.64/2022 యు/ఎస్ 464, 467, 471, 474 ఆర్/డబ్ల్యూ 120–బి, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ► ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించటంపై క్రైమ్ నెం.542/2019 యు/ఎస్ 179, 186, 189, 353, 500, 504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ► పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు క్రైమ్ నెం. 10/2020 యు/ఎస్ 341, 188, 189, 504, 505,(1)(బి) ఐపీసీ కింద కేసు నమోదైంది. -
రేవంత్ ఇంటి దగ్గర్లోనూ ఓ వార్‌రూమ్!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఓ గెస్ట్‌హౌస్ తీసుకున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఉన్న దీంట్లో ప్రణీత్‌రావు వార్‌రూమ్ నిర్వహించాడు. ఈ గెస్ట్‌హౌస్ కేంద్రంగానే భారీ సెటిల్మెంట్లు కూడా జరిగినట్టు తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు విచారణలో ఈ విషయాలు గుర్తించిన అధికా రులు ఆదివారం రాత్రి ఆ గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేశారు. మరోపక్క రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగి యనుండటంతో సిట్ అధికారులు తమ దర్యా ప్తు, విచారణ ముమ్మరం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్‌నంబర్లను లీగల్ ఇంటర్సెప్షన్గా (ఎల్ఐ) పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది. అయితే 2018 ఎన్నికల నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ అలియాస్ పాల్ రవికుమార్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే ఈ ట్యాపింగ్ పరికరం మ్యాన్ ఇన్ ది మిడిల్ (ఎంఐటీఎం) ఎటాక్స్‌కు వినియోగించారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయ సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి ఓ కృత్రిమ సెల్‌ఫోన్ టవర్గా మారిపోయి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన సోషల్‌మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్‌ను ట్యాప్ చేసే అవకాశం దానిని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే రేవంత్‌తోపాటు ఆయన కుటుంబీకులు, ప్రధాన అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచింది. రాధాకిషన్‌రావు, భుజంగరావులు ఇదే గెస్ట్‌హౌస్ కేంద్రంగా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ప్రభాకర్‌రావు నేరుగా పర్యవేక్షించి భారీ వసూళ్లకు తెర లేపినట్టు పోలీసులు గుర్తించారు. -
సీఎం రమేష్ సారా అక్రమాల చరిత్ర ఇది
టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు.. కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అక్రమాల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు.. సీఎం రమేష్‌పై తాజాగా పోలీస్ కేసు నమోదైంది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్ఐ అధికారులపై గుండాయిజం ప్రదర్శించిన సీఎం రమేష్ అక్రమాల చరిత్రను పరిశీలిస్తే.. కుప్పంలో ఒకప్పుడు సీఎం రమేష్ తన తండ్రితో పాటు సారా వ్యాపారం చేశారు. రాయదుర్గం నుంచి అక్రమంగా సారా ప్యాకెట్లు తెప్పిస్తుంటే సీఎం రమేష్‌ను, ఆయన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మరొక కేసులో సీఎం రమేష్ తండ్రిని పీడీ యాక్ట్ కింద అరెస్టు అయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లను ఎలా ఆకట్టుకోవాలో సీఎం రమేష్‌కు బాగా తెలుసు. 1989–94లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసుల నుంచి బయట పడడానికి సీఎం రమేష్ ఆయన కుటుంబం కడపలో ఉన్న ఓ మంత్రి సాయం తీసుకునే వారు. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లాక సీఎం రమేష్ పోట్లదుర్తి నుంచి కొంతమందిని తీసుకెళ్లి కుప్పంలో దొంగ ఓట్లు నమోదు చేయించారు. కుప్పంలో ఓటు మేనేజ్మెంట్ అంతా సీఎం రమేష్ ఆయన తీసుకెళ్లిన పోట్లదుర్తి మనుషులే చూసుకునేవాళ్లు. అప్పటి నుంచి చంద్రబాబుతో సీఎం రమేష్‌కు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు సీఎం రమేష్ రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ అనకాపల్లిలో సుమారు 200 మందిని తీసుకెళ్లి జీఎస్టీ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. వీటికి బీజేపీ ఏమి సమాధానం చెబుతుంది.? కోల్‌కత్తాలో ఈడీ అధికారులపై అక్కడి టీఎంసీ నేతలు దాడికి దిగితే ఖండించిన బీజేపీ ఇప్పుడు సీఎం రమేష్ చేసిన ఈ దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతుంది? అక్రమ సారా నుంచి రూ.3 వేల కోట్లకు ఎదిగాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎం రమేష్ తనకు ఏం కావాలో చెప్పి చేయించుకునేవారు. అనకాపల్లిలో ప్రస్తుత ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేయడానికి ఉన్నాడు. పోట్లదుర్తి నుంచి తన మనుషులను అనకాపల్లికి తీసుకొచ్చాడు. నీతులు చెబుతున్న చంద్రబాబు... సీఎం రమేష్ ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంటో చెప్పగలరా?. గతంలో విజయమ్మ పోటీ చేసినప్పుడు కడప నుంచి మనుషులను తీసుకొచ్చారని టీడీపీ వాళ్లు అసత్య ప్రచారాలు చేయించారు. ఆమె ఓటమికి కారణమయ్యారు. కడప ప్రాంతానికే చెందిన రమేష్ ఇప్పుడు అనకాపల్లిలో చేస్తున్న దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతారు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
518 ఎకరాలు.. హాంఫట్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవి పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు.. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేని భూములు.. కానీ ధరణి పోర్టల్‌లో రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. దీనితో ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 518 ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపో యాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకున్న ఈ భూదందా.. తాజాగా ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు, ఐఐటీ ఉండటంతో కంది మండలంలో భూముల ధర ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతోంది. అంటే అక్రమాలు జరి గిన 518 ఎకరాల భూముల విలువ రెండున్నర వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. 11 గ్రామాల పరిధిలో.. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వెరిఫి కేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడైనా అన్యా క్రాంతం అయ్యాయా? వాటి రికార్డుల పరిస్థితే మిటనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక్కో మండలం చొప్పు న బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూము లుగా రికార్డులను మార్చేసినట్టు తేలింది. అత్య ధికంగా బ్యాతోల్‌లో 181 ఎకరాలు, చిద్రుప్ప లో 154 ఎకరాలు, జుల్కల్లో 57 కాశీపూర్‌లో 41 ఎకరాలు, ఉత్తర్‌పల్లిలో 17 ఎకరాలు మిగ తాచోట్ల కలిపి 68 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మార్చేసినట్టు గుర్తించారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మరో ఆరు గ్రామాల రికార్డులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వాటిలోనూ తని ఖీ పూర్తయితే.. మరిన్ని అక్రమాలు వెలుగు లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ధరణి పోర్టల్‌లో మార్చేసి.. అధికారులు, దళారులు కుమ్మక్కై ధరణి పోర్ట ల్ను ఆసరాగా చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. అసైన్డ్భూములను ధరణి పోర్టల్‌లో పట్టా భూము లుగా మార్చేశారు. ఈ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. తర్వాత ఆ పాసు పుస్తకాల ఆధారంగా.. చాలావరకు భూముల క్రయవిక్రయాలు చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నేతలు, బడాబాబులకు భూములు దక్కేలా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారని.. కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు కంది మండలంలో ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. భూములకు సంబంధించిన రికా ర్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి నట్టు గుర్తించాం. అన్ని గ్రామాల్లో వెరిఫి కేషన్ పూర్తిచేసి నివేదిక ఇస్తాం. – విజయలక్ష్మి, కంది మండల తహసీల్దార్. -
దారి తప్పుతున్న పోలీస్ సిబ్బంది
జగిత్యాలక్రైం/మెట్పల్లి: జిల్లాలో కొందరు పోలీస్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖకు కళంకం తెస్తోంది. శాంతిభద్రతల విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ప్రజల మెప్పు పొందేలా ఉన్నతాధికారులు వ్యవహరిస్తుంటే కిందిస్థాయిలో మాత్రం కొందరు సిబ్బంది ఖాకీ చొక్కాను అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేస్తూ పోలీస్ శాఖను అభాసు పాల్జేస్తున్నారు. దారి తప్పిన సిబ్బందిపై ఉన్నతాధికారులు వారం వ్యవధిలోనే వేటువేయడం ఇందుకు అద్దం పడుతోంది. జేబులు నింపుతున్న అక్రమదందాలు పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల నుంచే కాకుండా బయట అక్రమదందాలు నడిపే వారి నుంచి కూడా కొందరు సిబ్బంది వసూళ్లకు పాల్ప డుతున్నారు. ఇసుక, పేకాట, బెల్టు, మద్యం, కల్లు, దాబాలు, రేషన్ బియ్యం తదితర దందాలు చేసే వారి నుంచి నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్టేషన్ల ఖర్చులతో పేరుతో కొన్నిచోట్ల ఎస్హెచ్ఓలు ఈ వసూళ్లకు పాల్పడుతుంటే.. కింది సిబ్బంది సైతం వారినే అనుసరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొన్ని స్టేషన్లలో సివిల్ పంచాయితీలకు పెద్దపీట వేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. సివిల్ కేసుల్లో పోలీసులు తల దూర్చరాదు. కానీ ఈ కేసుల్లో అధిక సొమ్ము వస్తుందనే ఆశతో ఎక్కువగా ఇలాంటి వాటిపైనే దృష్టి పెడుతున్నారు. ఉన్నతాధికారుల చర్యలతో దారికొచ్చేనా..? అక్రమ వసూళ్లు, మహిళల పట్ల వంకరబుద్ధి ప్రదర్శిస్తున్న పోలీస్ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న పోలీ సుల వ్యవహారంపై ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి కఠిన చర్యలు చేపడుతోంది. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2023 నవంబర్ 28న ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ శేఖర్‌నాయక్ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విచారణ చేపట్టిన అధికారులు సస్పెండ్ చేశారు. ♦ మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ సుదర్శన్ అక్రమ వసూళ్లకు పాల్పడగా విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 22న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ♦ జగిత్యాల పట్టణ సీఐగా పనిచేస్తున్న నటేశ్ అవినీతి ఆరోపణలు, క్రైం బర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టి ఫిబ్రవరి 23న సస్పెండ్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ♦ రాయికల్ పోలీస్ స్టేషన్లో కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ మహేందర్ అల్లీపూర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద కోర్టు విషయంలో వసూళ్లకు పాల్పడగా 2024 ఫిబ్రవరి 2న సస్పెండ్ చేశారు. ♦ డీసీఆర్బీ ఎస్సైగా పనిచేస్తున్న వెంకట్రావ్ కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నసమయంలో ఓ మహిళ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 23న సస్పెండ్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ ఉత్తర్వులు జారీచేశారు. ► ఇబ్రహీంపట్నం ఏఎస్సైగా పనిచేస్తున్న రాములు ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌కు వస్తే ఆమెతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉండగా ఫొటోలు తీయించుకున్నాడు. అవి వైరల్ కావడంతో ఏఎస్సైని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు మల్టీజోన్ ఐజీకి నివేదిక సమర్పించారు. ► మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు, ఇద్దరు కానిస్టేబుళ్లు వారం క్రితం బయట వ్యక్తులతో పోలీస్‌స్టేషన్‌లోనే మద్యం సేవించిన విషయం వెలుగు చూడటంతో విచారణ చేపట్టిన పోలీసులు త్వరలోనే క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే మాంసం, మద్యంతో జల్సా ►హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్ల నిర్వాకం ► ఈనెల 17న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి మల్లాపూర్: ఈనెల 17న మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు సిబ్బంది మాంసం, మద్యంతో జల్సా చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ ఉండడంతో బందోబస్తు కోసం ఎస్సై కిరణ్‌కుమార్ వెళ్లారు. దీంతో హెడ్‌కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేశ్ పోలీస్‌స్టేషన్‌లోకి మాంసం, మద్యం తెచ్చుకుని పార్టీ చేసుకున్నారని, వీరితో మరో ఇద్దరు బయటి వ్యక్తులు కూడా పాల్గొన్నారని సమాచారం. వారు పార్టీ చేసుకునే సమయంలో అక్కడికి వెళ్లిన ఓ అధికారి ఆ తతంగాన్ని చూసి సదరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరు విషయాన్ని బయట పెట్టడంతో విషయం జిల్లా పోలీస్ బాస్ దృష్టికి చేరింది. ఆయన సదరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేసి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. వీరిపై రెండు, మూడు రోజుల్లోనే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా.. పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది జల్సా చేసుకుంది నిజమేనని, సిబ్బందిపై ఎస్పీకి నివేదించామని పేర్కొన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు పోలీస్ అధికారులు, సిబ్బంది అంతా క్రమశిక్షణతో పనిచేయాలి. ప్రజలకు సత్వర సేవలందించడంతోపాటు, న్యాయం జరిగేలా చూడాలి. ఎలాంటి ఆరోపణలు వచ్చినా విచారణ చేపట్టి నిజమని తేలితే చర్యలు తీసుకుంటాం. – సన్‌ప్రీత్‌సింగ్, ఎస్పీ -
Delhi liquor scam: త్వరలో వస్తా..అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్‌చేసిన నేపథ్యంలో ఈడీ కస్టడీ నుంచి ఆయన వీడియో సందేశం ఇచ్చారు. దాన్ని ఆయన భార్య సునీత ప్రత్యక్షప్రసారంలో చదివి వినిపించారు. ‘‘జైల్లో ఉన్నా, బయటున్నా నా జీవితంలో ప్రతి క్షణం దేశ సేవకే అంకితం. నా ప్రతి రక్తపుబొట్టు దేశం కోసమే ధారపోస్తా. మీ సోదరుడు, కుమారుడినైన నన్ను ఏ జైలూ ఎక్కువ రోజులు బంధించలేదు. త్వరలోనే బయటికొస్తా. మీకిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తా. కష్టాల్లోనే పెరిగా. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డా. అందుకే ఈ అరెస్ట్‌తో ఆశ్చర్యపోలేదు. దేశాన్ని బలహీన పరిచే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వాటిని ఓడించండి’’ అని బీజేపీని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘గత జన్మలో ఎంతో పుణ్యంచేసుకొని ఉంటా. అందుకే ఈ పుణ్యభూమిలో పుట్టా. కోట్లాదిగా మీరు చూపిస్తున్న ఈ ప్రేమే నాకు కొండంత అండ’ అని అందులో కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ వాళ్లంతా నా సోదరసోదరీమణులు ‘‘ఆప్ వాలంటీర్లకు నాదో సూచన. నేను కస్టడీలో ఉన్నా çసామాజిక, సేవ కార్యక్రమాలు ఆగకూడదు. ఢిల్లీ మహిళలకు నెలకు రూ.1,000 వాగ్దానం నేనొచ్చాక నెరవేరుస్తా. నన్ను అరెస్ట్ చేశారని బీజేపీపై ద్వేషం పెంచుకోకండి. వాళ్లంతా నా సోదరసోదరీమణులు. ప్రజల ఆశీర్వా దాలతో మూడుసార్లు సీఎం అయిన నన్ను అధికార అహంకారంతో మోదీ జైళ్లో పడేశారు. ఇది ఢిల్లీ ప్రజలను వంచించడమే. ఎక్కడున్నా ప్రజాసేవలకే అంకితమవుతా. వాళ్లే నిర్ణాయక శక్తులు. జై హింద్’’ అన్నారు. ఆప్ ఢిల్లీ ఆఫీస్‌కు తాళం ఆప్ ఢిల్లీ కార్యాలయానికి సీలు వేశారని మంత్రి ఆతిషి ఆరోపించారు. ‘‘లోక్‌సభ ఎన్నికల వేళ జాతీయ పార్టీ ఆఫీస్‌కు వెళ్లకుండా మా నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం’’ అని చెప్పారు. ఈ వార్తలను పోలీసులు ఖండించారు. ‘‘ఆఫీస్‌కు సీల్ వేయలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అందుకే వందల సంఖ్యలో వస్తున్న ఆప్ కార్యకర్తలను ఆఫీస్ వైపు వెళ్లనివ్వట్లేదు. గుమిగూడనివ్వట్లేదు’’ అని వివరించారు. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారని ఆతిశీ ‘ఎక్స్’లో వెల్లడించారు. జైలులో సీఎం ఆఫీస్‌కు అనుమతి కోరతాం: భగవంత్ మాన్ ఈడీ కేసులో కోర్టు కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే అక్కడి నుంచి ఆయన ప్రభుత్వాన్ని నడిపేలా సీఎం తాత్కాలిక ఆఫీస్‌ను ఏర్పాటుచేసేందుకు అనుమతి కోరతామని ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు. ‘ఆప్‌లో కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ భర్తీచేయ లేరు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకూడదనే నిబంధన ఏదీ లేదు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కోర్టు కేజ్రీవాల్‌ను జైలుకు తరలిస్తే అక్కడి నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వహి స్తారు. దోషిగా తేలనంత వరకూ చట్ట ప్రకారం ఆయన జైలు నుంచి కూడా పనిచేయవచ్చు. అందుకే ఆఫీస్ కోసం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల అనుమతి కోరతాం’ అని మాన్ అన్నారు. సోదరా, తీహార్‌కు వెల్కం! కేజ్రీవాల్‌కు సుఖేశ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రియ సోదరా, కేజ్రీవాల్! నెమ్మదిగా అయినా నిజమే గెలుస్తుంది. సరికొత్త భారత్ శక్తికి ఇదో క్లాసిక్ ఉదాహరణ. వెల్ కం టూ తీహార్ క్లబ్. బాస్ ఆఫ్ తీహార్ క్లబ్‌గా ఆహ్వానిస్తున్నా. మీ డ్రామాలకు ముగింపు పడింది’’ అంటూ మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ శనివారం ఆయకు లేఖ రాశాడు. ‘‘మీ అవినీతంతా బయటపడుతుంది. ఢిల్లీ సీఎంగా 10 కుంభకోణాలు చేశారు. నాలుగింటికి నేనే ప్రత్యక్ష సాక్షిని. లిక్కర్ స్కాం కేవలం ఆరంభమే. అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయట పెడతా. నేను ఛైర్మన్‌గా, కేజ్రీ బిగ్‌బాస్‌గా, సిసోడియా సీఈఓగా, సత్యేంద్ర జైన్ సీఓఓగా తిహార్ క్లబ్ నడుపుతా‘’ అన్నాడు. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న శివబాలకృష్ణ లీలలు
సాక్షి, హైదరాబాద్: తవ్వేకొద్దీ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో టీడీఆర్ స్కాం వెలుగులోకి వచ్చింది. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. కృష్ణకుమార్ని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పని చేసిన బీవీ కృష్ణ కుమార్.. బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేశారు. బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కృష్ణ కుమార్ చర్య వల్ల ప్రభుత్వానికి 3800 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ అంచనా వేస్తోంది. మరో ఇద్దరు హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. బడా బిల్డర్ల ప్రాజెక్ట్‌ల ప్లానింగ్‌లో టీడీఆర్ విలువ తగ్గించి, తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వానికి నష్టం చేశారు. శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు కాగానే కృష్ణకుమార్ అమెరికాకు వెళ్లిపోగా, అక్కడ నుంచి హైదరాబాద్‌కు రప్పించే ప్రయత్నాలను ఏసీబీ అధికారులు చేస్తున్నారు. శివబాలకృష్ణ, కృష్ణ కుమార్, మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సిండికేట్‌పై ఏసీబీ దృష్టి పెట్టింది. -
Delhi Jal Board case: జలమండలి కేసులోనూ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ గైర్హాజరుల పర్వం ఢిల్లీ జలమండలి కేసులోనూ పునరావృతమైంది. మద్యం అవకతవకల కేసులో కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు సమన్లు జారీచేయడం ఆయన గైర్హాజరవడం తెల్సిందే. తాజాగా ఢిల్లీ జల్‌బోర్డ్‌లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ విచారణ కోసం సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సమన్లు జారీచేయగా కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్‌కు రాలేదు. తనకు సమన్లు పంపడం చట్టవ్యతిరేకమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ సంబంధించిన సమన్లు అందుకున్న రెండో కేసు ఇది. మద్యం ఎక్సయిజ్ కేసులో ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు అందుకోవడం, ప్రతిసారీ ఆఫీస్‌కు రాకుండా మిన్నకుండిపోవడం తెల్సిందే. మద్యం కేసులో విచారణ నిమిత్తం మార్చి 21వ తేదీన తమ ఆఫీస్‌కు రావాలని ఈడీ తాజాగా ఆయనకు తొమ్మిదోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం. -
మరో అమరావతి ‘అనకొండ’.. అడ్డంగా దొరికేసింది
అమరావతిని దోచేసిన మరో అనకొండ అడ్డంగా దొరికింది. ప్రజా ధనాన్ని వాటాలేసుకుని మరీ మింగేసిన మరో టీడీపీ నేత దొరికిపోయాడు. అమరావతిలో నిర్మాణాల పేరుతో రచించిన దోపిడీ కథ జైలుకి చేరింది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్, జీఎస్టీ ఎగవేత కేసుల్లో అరెస్ట్ అయిన ప్రత్తిపాటి శరత్‌ను రిమాండ్‌కు తరలించారు. బోగస్ ఇన్వాయిస్లు, బోగస్ బిల్లులతో కోట్లు కొల్లగొట్టిన నేరంపై DRI, డైరెక్టరేట్ ఆఫ్ GST అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ అమరావతి అనకొండ కథేంటో చూద్దాం. టీడీపీకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అవెక్సా కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పుల్లారావు భార్య, కొడుకు శరత్ మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి కాంట్రాక్టులు తన భార్య కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న సంస్థకి తీసుకుని, వాటి ద్వారా కోట్ల రూపాయలను అడ్డదారిలో మళ్లించారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులను కొల్లగొట్టి, వాటిని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఆధారాలతో సహా బట్టబయలైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోదాల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడింది. డీజీజీఐ విచారణలో తేలిన ఆధారాలపై ఏపీ డీఆర్ఐ కూడా విచారించడంతో మొత్తం గుట్టురట్టయ్యింది. ఈ నేపథ్యంలోనే డీఆర్ఐ అధికారులు ప్రత్తిపాటి శరత్ పై విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రత్తిపాటి శరత్ ని పోలీసులు అరెస్ట్ చేసి వెంటనే న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున న్యాయస్థానం ప్రత్తిపాటి శరత్ ని 14 రోజులు రిమాండ్ కి పంపింది. బోగస్ ఇన్వాయిస్ లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని సాక్షాత్తూ అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్రా జగదీష్ అంగీకరించారు. డీజీజీఐ, డీఆర్ఐ విచారణలోనే నేరం అంగీకరించడంతో ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ కుంభకోణం ఎలా జరిగిందో కూడా జగదీష్ పూసగుచ్చినట్టు వెల్లడించడంతో ప్రత్తిపాటి శరత్‌కి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లను బెదిరించి అమరావతి పనులు చేసే కాంట్రాక్టు సంస్థల నుండి ఈ కంపెనీ 2017 నుండి అడ్డగోలుగా సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టు పొందింది. ఆ కంపెనీ నుండి 37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. సీఆర్డీఏ పరిధిలో రోడ్డు, వరద నీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాకులు గ్రీనరీ పనులు చేస్తామని సబ్ కాంట్రాక్టు తీసుకుంది. అయితే వీళ్లు మళ్లీ తానిషా ఇన్ ఫ్రా, రాలాన్ ప్రాజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు 21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టును ఇచ్చినట్టు చూపించారు. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్ లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా మాయ చేసింది. ప్రభుత్వ ఖజానా నుండి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. ఏ పనులు చేయలేదు. ఆ నాలుగు కంపెనీలు షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం 21.93 కోట్లు ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. మరో వైపు అమరావతిలోని ఉద్దండ రాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్ఆర్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకుంది ప్రత్తిపాటి పుల్లారావు అవెక్సా కంపెనీ. ఇక్కడైతే అసలు రోడ్డు పనులు చేయకుండానే బిల్లులు పెట్టి ప్రజా ధనాన్ని సొంత ఖాతాల్లోకి మళ్ళించేసుకున్నారు. రోడ్డు నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్ పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఏ పనీ చేయకుండానే 26 కోట్లకు పైగా దోపిడీ చేసింది ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ. పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ కోట్లు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జీ ప్లస్ 3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్ లను సమర్పించి ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీకి చెందిన కంపెనీ. ఈ మేరకు ఆధ్యా ఎంటర్ ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్టు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా 17.85 కోట్లు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ మొత్తం 66.3 కోట్లు కొల్లగొట్టింది. ఈ అవినీతి దందా మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అవెక్సా డైరెక్టర్ అయిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ప్రత్తిపాటి శరత్ కి రిమాండ్ విధించింది. ఇదీ చదవండి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం -
HMDA: ఆమ్రపాలికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్పై సమీక్ష జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇదీ చదవండి: హెచ్ఎండీఏ డైరెక్టర్లే లక్ష్యంగా.. విజిలెన్స్ సోదాలు! -
Public Exam Bill 2024: పేపర్ లీకేజీలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీ ఉదంతాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో పరీక్షల అక్రమార్కులపై కేంద్రం కఠిన చర్యల కొరడా ఝులిపించింది. పేపర్ లీకేజీలు, నకిలీ వెబ్సైట్లుసహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు–2024’ను తీసుకొచ్చింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఇన్నాళ్లూ ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేకపోవడంతో దీనిని తీసుకొచ్చారు. బిల్లులో ఏముంది? ► ప్రశ్నపత్రం, ప్రశ్నపత్రం కీ లీకేజీకి పాల్పడి నా, కంప్యూటర్ నెట్వర్క్/ రీసోర్స్/ సిస్టమ్‌ను ట్యాంపర్ చేసిన వ్యక్తులు/సంస్థలను కఠినంగా శిక్షిస్తారు ► నకిలీ వెబ్సైట్లు నిర్వహించడం, నకిలీ ఉద్యోగ/ప్రవేశ పరీక్షలు చేపట్టడం, నకిలీ అడ్మిట్ కార్డులు, ఆఫర్ లెటర్లు ఇవ్వడం, ఒకరి బదులు ఇంకొకరితో ఎగ్జామ్ రాయించడం వంటి అవకతవకలు చేసి నగదు వసూళ్లకు పాల్పడితే గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. ► వీటితో ప్రమేయమున్న వ్యక్తులు/సంస్థలు/ఏజెన్సీలు/వ్యాపారసంస్థలు/ సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.1 కోటి జరిమానా విధిస్తారు. ఇంకోసారి ప్రభుత్వం నుంచి సంబంధిత పనులు చేపట్టకుండా నాలుగేళ్లపాటు నిషేధం విధిస్తారు. ► యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్స్‌లో కలగజేసుకున్న అక్రమార్కులను సంబంధిత నియమాల కింద శిక్షిస్తారు. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకూ ఈ బిల్లులోని నియమాలు వర్తిస్తాయి. ► ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యతలు చూసే కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సిబ్బంది మొత్తం ఈ చట్టపరిధిలోకి వస్తారు. -
అవినీతికి దూరంగా ఉండండి: జిన్‌పింగ్
బీజింగ్: అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని అధికార కమ్యూనిస్టు పార్టీ అఫ్ చైనా నాయకులకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సూచించారు. కుటుంబ సభ్యులను, బంధువులను సైతం వాటికి దూరంగా ఉంచాలన్నారు. ఈ నెల 22న సీపీసీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుల భేటీలో జిన్‌పింగ్ ప్రసంగించారు. వ్యక్తిగతంగా క్రమశిక్షణ పాటించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. అవినీతిపై మనం పోరాటం చేస్తున్నారని, ఈ విషయంలో పార్టీ నేతలంతా సహకరించాలని కోరారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మీ కింద పని చేసేవారు అవినీతి దూరంగా ఉండేలా కఠినమైన నిబంధనలు విధించాలని జిన్‌పింగ్ సూచించారు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు నాయకుల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరులకు ప్రయోజనాలు కలి్పంచి, వారి నుంచి లంచాలు, బహుమతులు స్వీకరిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకత్వంగుర్తించింది. కొందరిపై విచారణ సైతం ప్రారంభించింది. -
ముకేశ్ అంబానీకి సెబీ జరిమానా సరికాదు
న్యూఢిల్లీ: రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్) షేర్లలో అవకతవకల ట్రేడింగ్ వివాదం విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ, మరో రెండు సంస్థలపై సెబీ విధించిన జరిమానాను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్– శాట్ సోమవారం తోసిపుచి్చంది. 2007లో ఒకప్పటి రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్లలో అవకతవకల ట్రేడింగ్‌కు పాల్పడినట్లు వచి్చన ఆరోపణలపై ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా– సెబీ జనవరి 2021లో జారీ చేసిన ఉత్తర్వుపై ట్రిబ్యునల్‌లో దాఖలైన అప్పీల్లో 87 పేజీల ఈ తాజా తీర్పు వెలువడింది. ఈ కేసులో సెబీ జనవరి 2021 కీలక రూలింగ్ ఇస్తూ, ఆర్‌ఐఎల్‌పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ రెండింటినీ ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేశారు. ఒకవేళ రెగ్యులేటర్ వద్ద జరిమానాను డిపాజిట్ చేసినట్లయితే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కూడా సెబీని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆర్ఐఎల్కు లభించని ఊరట.. అయితే ఈ కేసు విషయంలో ఆర్ఐఎల్ వేసిన అప్పీల్‌ను శాట్ తోసిపుచి్చంది. కంపెనీ విషయంలో సెబీ ఉత్తర్వు్యలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏదీ లేదని భావిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ తరుణ్ అగర్వాలా, ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరా స్వరూప్‌లతో కూడిన ధర్మాసనం కంపెనీ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ, ‘కంపెనీ ఆర్ఐఎల్కు సంబంధించినంతవరకు సెబీ ఆర్డర్లో జోక్యం చేసుకోవడానికి మాకు ఎటువంటి కారణం లేదు‘ అని స్పష్టం చేసింది. నవంబర్ 2007లో నగదు– ఫ్యూచర్స్ సెగ్మెంట్లలో ఆర్పీఎల్ షేర్ల అమ్మకం–కొనుగోలుకు సంబంధించిన కేసు ఇది. 2009లో ఆర్ఐఎల్తో ఆర్పీఎల్ విలీనమైంది. అంతక్రితం 2007 మార్చిలో ఆర్ఐఎల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ... ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అటు తర్వాత నవంబర్ 2007లో నగదు– ఫ్యూచర్స్ సెగ్మెంట్లలో ఆర్పీఎల్ షేర్ల అమ్మకం–కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని సెబీ తన జనవరి 2021 ఆర్డర్లో పేర్కొంది. ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అయితే కంపెనీ (ఆర్ఐఎల్) నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని పేర్కొంది. నగదు, ఎఫ్అండ్ఓ లావాదేవీలు రెండింటిలోనూ ఆర్పీఎల్ షేర్లను విక్రయించడం ద్వారా అనవసరమైన లాభాలను ఆర్జించడానికి తాను నియమించిన ఏజెంట్లతో ఆర్ఐఎల్ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్లోకి ప్రవేశించిందని వివరించింది. ఇది పీఎఫ్‌యూటీపీ (మోసపూరిత– అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నిషేధం) నిబంధనలను ఉల్లంఘించడమేనని సెబీ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ నిధులు సమకూర్చాయని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో ముకేశ్ అంబానీ, రెండు కంపెనీల పాత్రపై తగిన ఆధారాలు లేవని శాట్ బెంచ్ అభిప్రాయపడింది. -
కేబినెట్ కళ్లుగప్పి ఖజానాకు కన్నం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి బరి తెగించిన మాజీ సీఎం చంద్రబాబు ఉచిత విధానం ముసుగులో నిర్భీతిగా అన్ని విధి విధానాలను ఉల్లంఘించారు. ఒకపక్క ఇసుక ఉచితమంటూనే మరోపక్క అక్రమ తవ్వకాలకు భారీ జరిమానాలంటూ మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతోపాటు కేబినెట్‌ను చీకట్లో ఉంచి మరీ దోపిడీకి తెరతీశారు. కేబినెట్ ఆమోదం లేకుండా మొదట ఓ మెమో.. తరువాత జీవో ద్వారా ఇసుక దందాకు తెగబడ్డారు. ఇప్పుడు పారదర్శకంగా ఇసుక తవ్వకాలను నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రెండేళ్లలో దాదాపు రూ.770 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అంటే గత సర్కారు హయాంలో దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి ఖజానాకు చంద్రబాబు గండి కొట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆ ఆదాయం అంతా పచ్చ ముఠాలకు చేరిపోయింది. అంతేకాకుండా ఉచితం ముసుగులో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. వీటిని అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిపై నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణా రహితంగా దాడులకు బరి తెగించారు. స్వయంగా నాటి సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం పక్కనే ఇష్టారాజ్యంగా ఇసుక లూటీ జరుగుతున్నా కళ్లు మూసుకుని కూర్చోవడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా తప్పుబడుతూ భారీ జరిమానా సైతం విధించింది. రాష్ట్ర సంపదను దోచేస్తున్నారని ఆక్షేపించినా చంద్రబాబు చలించలేదు. ఈ ఇసుక దోపిడీ కేసులో సీఐడీ తీగ లాగుతుంటే పచ్చ ముఠాల డొంక కదులుతోంది. ఆది నుంచి కన్ను 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక రీచ్‌లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా జిల్లా, మండల మహిళా సమాఖ్యలకు అప్పగించినట్లు చంద్రబాబు కథ నడిపారు. మహిళా సమాఖ్యల ముసుగులో రెండేళ్ల పాటు భారీగా ఇసుక కొల్లగొట్టినా ఆయన సంతృప్తి చెందలేదు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు 2016లో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రీచ్‌లను వేలం వేసి ఇసుక విధానాన్ని రూపొందించారు. ఈమేరకు కేబినెట్ తీర్మానం చేసి 2016 జనవరి 1న జీవో 19 ఇవ్వగా అదే ఏడాది జనవరి 15న జీవో 20 వెలువడింది. ఈ విధానం ద్వారా కూడా మిగిలిన మూడేళ్లలో తాను ఆశించిన మేరకు ఇసుక దోపిడీ సాధ్యం కాదని భావించిన చంద్రబాబు రెండు నెలల్లోనే టెండర్ల ద్వారా ఇసుక రీచ్ కేటాయింపు విధానాన్ని పక్కన పెట్టేశారు. పచ్చ ముఠాలకే ఉచితం రాష్ట్రంలో ఇసుకను ప్రజలందరికీ ఉచితంగా ఇస్తున్నట్లు చంద్రబాబు నమ్మబలికారు. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండా జారీ చేసిన మెమో 3066, జీవో 43 మధ్యలో మరో జీవో కూడా తెచ్చారు. 2016 మార్చి 14న జారీ చేసిన ఆ జీవో ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టేందుకు భారీ జరిమానాలను నిర్దేశించారు. ఇసుక ఉచితం అన్నప్పుడు ఇక అక్రమ తవ్వకాలు అనే మాటే ఉత్పన్నం కాకూడదు కదా? అంటే ఉచిత ఇసుక విధానం పేరుతో చంద్రబాబు కనికట్టు చేశారన్నది స్పష్టమైంది. ఆ పేరుతో కేవలం చంద్రబాబు బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుక రీచ్‌లను గుప్పిట్లో పెట్టుకున్నారు. మూడేళ్లపాటు దోపీడికి పాల్పడ్డారు. ఇతరులు ఇసుక రీచ్‌ల జోలికి రాకుండా కట్టడి చేసేందుకే జీవో 35 తెచ్చారు. కొసమెరుపు ఏమిటంటే జీవో 35కు కూడా కేబినెట్ ఆమోదం లేదు. ఉచిత ఇసుక విధానం పేరుతో తెచ్చిన మెమో 3066, అనంతరం జారీ చేసిన జీవోలు 35, 43లకు కేబినెట్ ఆమోదం లేదన్నది నిర్ధారణ అయింది. వాటికి సంబంధించిన నోట్ ఫైళ్లు అటు ఏపీఎండీసీలోగానీ ఇటు గనుల శాఖ, జలవనరుల శాఖ కార్యాలయాల్లోగానీ లేవని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు పక్కాగా సాగించిన పన్నాగంపై పూర్తి ఆధారాలతో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేబినెట్‌ను చీకట్లో ఉంచి.. ఉచిత ఇసుక విధానంతో దోపిడీ ఎంత ఇసుక అందుబాటులో ఉంది? ఎంత తవ్వుతున్నాం? ఎంతకు అమ్ముతున్నాం? అనే ప్రాథమిక లెక్కలతో కూడా నిమిత్తం లేకుండా యథేచ్ఛగా కాజేసేందుకు ఈ విధానాన్ని తెచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తుంగలోకి తొక్కారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే కథ నడిపారు. అందుకోసం 2016 మార్చి 4న మెమో 3066 జారీ చేశారు. అది కూడా అప్పటికి రెండు రోజుల ముందు నుంచి అంటే 2016 మార్చి 2 నుంచే ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. అప్పటివరకు కేబినెట్ ఆమోదంతో అమలులో ఉన్న ఇసుక విధానాన్ని తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మెమో జారీ చేశారు. ఈ మెమోకు కేబినెట్ ఆమోదం లేదు. అంటే కేబినెట్ ఆమోదంతో రూపొందించిన విధానాన్ని పక్కనపెట్టి అడ్డదారిలో మెమో ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అక్రమంగా ఇసుక తవ్వకాలపై భారీ జరిమానాలు విధించేందుకు విధివిధానాలను నిర్దేశిస్తూ 2016లో గత సర్కారు జీవో 35 జారీ చేసింది. రెండు నెలల తరువాత అంటే 2016 ఏప్రిల్ 6న జీవో 43 వెలువరించి అప్పటివరకు మెమో ద్వారా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానానికి రాజముద్ర వేసింది. విడ్డూరం ఏమిటంటే ఆ జీవో 43కు కూడా కేబినెట్ ఆమోదం లేదు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఉచిత ఇసుక విధానాన్ని దొడ్డిదారిలో తెచ్చి ఇసుక దోపిడీకి చంద్రబాబు తెరతీశారు. చదవండి: రోత పుట్టించే రాతలు రాయడంలో పచ్చమీడియా రికార్డు -
Delhi Liquor Policy Case: ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
న్యూఢిల్లీ: ఢిల్లీలో నూతన మద్యం విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వివరాలు రాబట్టేందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ కార్యాలయానికి పిలవగా గరువారం ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఆయనకు మరో తేదీతో సమన్లు జారీచేసే అవకాశముంది. విచారణకు పిలిచి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందన్న ఆప్ ఆరోపణల నడుమ గురువారం ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ ఎదుట పెద్దసంఖ్యలో ఆప్ కార్యకర్తలు గుమిగూడారు. ఉద్రిక్త పరిస్థితుల నివారణ కోసం ముందస్తుగా కేంద్రం పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను ఈడీ ఆఫీస్, బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద మోహరించింది. ఈ కేసును వచ్చే 6–8 నెలల్లోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ప్రాసిక్యూషన్ వారికి సూచించిన నేపథ్యంలో ఈడీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశముంది. చట్టవ్యతిరేకం, కక్షపూరితం ఈడీ ఆఫీస్‌కు గైర్హాజరైన సందర్బంగా దర్యాప్తు సంస్థకు కేజ్రీవాల్ ఒక లేఖ రాశారు. ‘ నాకు పంపిన ఈ సమన్లు పూర్తిగా చట్టవిరుద్ధం. కక్షపూరితం. రాజకీయ ప్రేరేపితం. బీజేపీ చేస్తున్న తీవ్ర ఒత్తిళ్లతో ఈడీ నోటీసులు పంపించింది. వీటిని ఉపసంహరించుకోండి. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను అడ్డుకునేందుకు ఇçప్పుడీ సమన్లు పంపారు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం ఉందని సమన్లు పంపారు? సాక్షిగానా లేక నిందితుడిగానా అనేది అందులో లేదు. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు పంపారా? లేదంటే ఆప్ కన్వీనర్ అయినందుకు పంపారా?’ అని లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘కేజ్రీవాల్‌కు సమన్లు పంపి అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు అక్టోబర్ 30న అన్నారు. అదేరోజు సాయంత్రం యాధృచ్ఛికంగా ఈడీ సమన్లు ఇచ్చింది’ అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, ఈడీ ఆఫీస్‌కు రాకుండా కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి సింగ్రౌలీ నియోజకవర్గంలో ఎన్నికల రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. ‘నన్ను అరెస్ట్‌చేస్తారని ఢిల్లీ కోడైకూస్తోంది. ఈడీ అధికారులు నన్ను అరెస్ట్ చేయగలరుగానీ నా ఆలోచనలను అరెస్ట్ చేయలేరుకదా. నా సిద్ధాంతాలతో ఏకీభవించే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది, కోట్లాది అభిమాన కేజ్రీవాల్‌లను అరెస్ట్ చేయలేరు’ అని ర్యాలీలో కేజ్రీవాల్ అన్నారు. ‘ఇండియా’ కూటమిని దెబ్బతీసేందుకు యత్నం: ఆప్ ‘ఇండియా’ కూటమిని దెబ్బ కొట్టాలంటే ఢిల్లీలో కొరకరాని కొయ్యలా ఉన్న కేజ్రీవాల్‌ను ముందు అరెస్ట్చేయాలనేది బీజేపీ ప్రణాళిక. అలా అయితేనే ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ బలహీననమై సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతుందని బీజేపీ కుట్ర పన్నుతోంది’ అని ఆప్ ఆరోపించింది. నిజాన్ని ఎదుర్కోలేక పారిపోయారు: బీజేపీ కేజ్రీవాల్ గైర్హాజరుపై బీజేపీ ఎద్దేవాచేసింది. ‘ ఎక్సైయిజ్ పాలసీ విధానంలో నిజాలను వెల్లడించే ధైర్యం లేకనే కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్‌కు రాకుండా పారిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కింగ్ ఆయనే’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ‘ సాక్ష్యాలు, ఆధారాలుంటేనే ఈడీ సమన్లు జారీచేసి విచారణకు పిలుస్తుంది. మద్యం విధానం గురించి బాగా కేజ్రీవాల్‌కు బాగా తెలుసు. నిజాలు కప్పిపుచ్చే సమర్థత లేకనే, భయంతోనే ఆయన ఈడీ ఆఫీస్‌కు వెళ్లలేదు’ అని ఆయన ఆరోపించారు. -
Delhi Liquor Policy Case: సిసోడియా బెయిల్‌పై 30న సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 30వ తేదీన తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా తిహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. తీర్పు సోమవారం ఉదయం వెలువడుతుందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా
కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారని, పైగా తాము కొట్టలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సమర్ధించుకోవటంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షలు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు సిద్ధమేనా? అని సీపీకి సవాల్ విసిరారు. ఈ నెల 5న క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్ ఆఫీస్ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తమను పోలీసులు కొట్టారని విద్యా ర్థులు జడ్జి ఎదుట తెలిపారు. కాగా, ఆ విద్యార్థి నాయకులను శుక్రవారం రఘునందన్‌రావు కేయూ దూరవిద్య కేంద్రం ఆవరణలో పరామర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న వీసీపై విచారణ జరపాల్సింది పోయి, ఆయనతో కలసి సీపీ ప్రెస్‌మీట్ నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. వీసీ, పీహెచ్డీ అవకతవకల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల, ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12న వరంగల్ జిల్లా బంద్ చేపట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు తమని అరెస్ట్‌చేసి టాస్క్‌పోర్స్ పోలీసులతో కొట్టించారంటూ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. -
తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన స్కామ్.. సీమన్స్, అమరావతి భూకుంభకోణాల దారులన్నీ ఒకే చోటుకు చేరుతున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులే.. సీమన్స్, అమరావతి అసైన్డ్ భూకుంభకోణాల్లో ప్రధానపాత్ర పోషించారని సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణాల మూలాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ల వద్దే ఉన్నాయని చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లేనన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. అమరావతి పేరుతో జరిగిన స్కామ్‌లన్నింటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా తండ్రీకొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో రట్టయిందని ఎత్తిచూపారు. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం.. హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరో స్కామ్ బయటకొచ్చిందని చెప్పారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండని.. మనల్ని అందర్నీ తాకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూచేసి చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఐటీ శాఖ నోటీసులు చూస్తే.. చంద్రబాబు మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందని చెప్పారు. లోకేశ్ మిత్రుడు రాజేశ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారన్నారు. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న తరహాలోనే.. ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు, ఫైబర్‌నెట్ స్కామ్‌లలోను ఈ వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్ జరిగిందని చెప్పారు. ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేశ్ తదితరులు ఆ కుంభకోణాల్లోను ప్రధానపాత్ర పోషించారన్నారు. ఐదేళ్లలో రకరకాల స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేసిన చంద్రబాబు వేలకోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్‌లో దాచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. ప్రజాధనాన్ని దోచేసిన తండ్రీకొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ఐటీ శాఖను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు. తండ్రీకొడుకులు ఏయే పాపాలు చేశారని నాలుగేళ్లుగా చెబుతున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది.. అవినీతి బట్టబయలైంది.. పరిహారం చెల్లించాల్సిన రోజు వస్తుంది.. అని పేర్ని నాని చెప్పారు. -
అద్దె విషయంలో అవకతవకలు.. ఇలా చేయకండి!
యజమాని చెల్లించే జీతభత్యాల్లో ‘‘ఇంటద్దె అలవెన్సు’’ ఒక ముఖ్యమైన అంశం. పెద్ద అంశం. దీని వెనుక రహస్యం ఏమిటంటే ‘‘ఇంటద్దె అలవెన్స్’’తో పన్నుపరంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు. ఇతర అలవెన్సుల కన్నా ఇక్కడ అవకాశమూ, వెసులుబాటు ఎక్కువ. తండ్రి పేరు మీద ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో ఉంటూ, తండ్రికి అద్దె ఇచ్చినట్లు రసీదు చూపించి, ఇంటద్దె అలవెన్స్‌కి పూర్తిగా మినహాయింపు పొందే సుపుత్రులు ఎందరో. ఈ కట్టుకథని నిజం చేయాలంటే నిజంగానే తండ్రి అకౌంటులో అద్దె జమ చేయండి. తండ్రి ఆదాయంలో ఈ మొత్తాన్ని ఆదాయంగా చూపించి బైటపడండి. ఇలా అద్దె పుచ్చుకున్న వారు ట్యాక్స్ లిమిట్స్‌లోకి రాకుండా జాగ్రత్త పడండి.. నాన్నకు ప్రేమతో నమస్కారం పెట్టండి. ‘‘ఇల్లరికంలో ఉంది మజా’’ అంటూ మావగారింట్లో పూర్తిగా తిష్టవేసిన అల్లుళ్లు ఉన్నారు. ‘‘అల్లుడా ..మజాకా’’ అని మావగారు భయపడకుండా పైన చెప్పినట్లు చేయండి. అలా చేస్తే ఉభయకుశలోపరి. ఆఫీసులోని అధికారితో గల ప్రేమో, అభిమానమో, నాటకమో, చొరవో, చనువో .. దొంగ రసీదు ఇచ్చి క్లెయిం చేసే ప్రబుద్ధులెందరూ. స్వర్గంలో ఉన్న కుటుంబ సభ్యుల పేరుతో రసీదు, లేని ఇంటి నంబరుతో రసీదు, తప్పుడు ఇంటి పేరు మీద రసీదు, నాన్ రెసిడెంటు సంతానం పేరున రసీదు, భార్యభర్తలు కలిసి ఉంటూ ఒక ఇంటి మీద చెరొక రసీదు లేదా చెరొక ఇంటి నంబరుతో రసీదు, కుడి చేత్తో ఒక రసీదు .. ఎడమ చేత్తో ఒక రసీదుపై సంతకాలు పెట్టడం .. తన పేరు మీద ఇల్లున్నా ఏదో ఒక నంబరుపై రసీదు చూపించడం వంటివి ఎన్నో జరుగుతుంటాయి. హైదరాబాదులో అసలే ఇంటి నంబర్లు పది అంకెలు దాటి ఉంటాయి. ఒకో నంబరుకు నాలుగు బైలు(/) .. రెండేసి ఇంగ్లీషు అక్షరాలు కూడా ఉంటాయి. పోస్ట్‌మ్యాన్‌కి దొరక్కపోవచ్చు. గూగుల్ మ్యాప్‌కి కూడా అందకపోవచ్చు. కానీ డిపార్టుమెంటుకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఉన్నత విద్య కోసం.. ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసా? ఈ డమ్మీ ఆటకు పేకాటలో ‘‘రమ్మీ’’లో జోకర్లాంటి వెసులుబాటు ఉంది. మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. మీరు ఎవరినైతే సృష్టించారు ఆ వ్యక్తి నిజంగానే ఉండాలి. ఆ ఇల్లు ఆ వ్యక్తి పేరు మీద ఉండాలి. అప్పుడు అద్దెను వారు తమ ఆదాయంగా డిక్లేర్ చేసి, ఇన్‌కంట్యాక్సు రిటర్నుల్లో ఇన్కమ్గా వేయాలి. పన్ను పరిధిలోకి రాకపోతే సమస్య లేదు. తక్కువ శ్లాబులు పడ్డా మీకు లాభమే. పన్ను భారం తగ్గకపోతే ఆ జోలికి వెళ్లకండి. లక్ష రూపాయల్లోపల రసీదులు అడగరు. బీ హ్యాపీ. ఇదీ చదవండి: ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. దీర్ఘకాలంలో తిరుగులేని పనితీరు! జీవిత భాగస్వామి పేరు మీద ఇల్లు ఉండి, ఆ వ్యక్తి పన్ను పరిధిలోకి రాకపోతే ఈ ప్లానింగ్ చేయండి. కానీ నిజంగా చెల్లించడం, అటు పక్క వ్యక్తికి ఆదాయంగా చూపించడం, నిజమైన రసీదు, నిజమైన డిక్లరేషన్స్తో అంతా నిఖార్సయిన వ్యవహారంగా ఉండాలి. ఎందుకంటే, డిపార్ట్మెంట్ వారి దగ్గర దొంగ రశీదుల వ్యవహారం రుజువులతో సహా ఉంది. అద్దె విషయంలో అవకతవకలకు పాల్పడకండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
మార్క్‘ఫ్రాడ్’
ఆయన ఓ మార్క్‌ఫెడ్ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్ బ్యాంకు భరించింది. మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం. సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్‌ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్‌కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్‌కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లోనే పెడుతోంది. ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు 2022–23లో ఫెర్టిలైజర్స్ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు. కమీషన్లు... బహుమతులు.. టూర్ ప్యాకేజీలు వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్‌ఫెడ్ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్‌లో పెట్టడం రిస్క్‌తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్ ఎవరికోసం మార్క్‌ఫెడ్ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్‌ఫెడ్ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రుణాలు...అక్కడ జమ మార్క్‌ఫెడ్ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న. పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు. కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. ఇలా ఒక ప్రైవేట్ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. -
రెడ్ డైరీలో రాజస్తాన్ ప్రభుత్వ అక్రమాలు
జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల రహస్యాలన్నీ రెడ్ డైరీలో ఉన్నాయని, దీనిపై సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. గంగాపూర్‌లో శనివారం జరిగిన ‘సహకార కిసాన్ సమ్మేళన్’ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే కొందరు నినాదాలు ప్రారంభించారు. వారినుద్దేశించి మంత్రి మాట్లాడుతూ..‘నినాదాలు చేసేందుకు కొందరిని పంపించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని గెహ్లాట్‌కు చెప్పాలనుకుంటున్నా. ఆయనకు సిగ్గుంటే, రెడ్ డైరీ వ్యవహారంపై రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లి ఉండేవారు’అని వ్యాఖ్యానించారు. 2020లో కాంగ్రెస్ నేత ధర్మేంద్ర రాథోడ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ‘రెడ్ డైరీ’దొరికింది. దాన్లో సీఎం గెహ్లాట్ ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ ఉన్నట్లు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేంద్ర గూధా చేసిన ఆరోపణలను అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించారు. -
ఐపీవో అక్రమాల నిధుల పంపిణీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. 2003–05 మధ్య కాలంలో నమోదైన ఐపీవో అవకతవకల నుంచి సమీకరించిన నిధుల పంపిణీని మరోసారి చేపట్టింది. మూడో దశలో భాగంగా దాదాపు రూ. 15 కోట్లను 2.58 లక్షల ఇన్వెస్టర్లకు పంపిణీ చేయనుంది. ఈ బాటలో ఇప్పటికే 2010 ఏప్రిల్‌లో రూ. 23.28 కోట్లు, 2015 డిసెంబర్లో రూ. 18.06 కోట్లు ఇన్వెస్టర్లకు పంచిపెట్టింది. పబ్లిక్ ఇష్యూల అక్రమాల కేసులలో భాగంగా సమీకరించిన నిధులను అర్హతగల ఇన్వెస్టర్లకు సెబీ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2003–05 మధ్య కాలంలో మొత్తం 21 ఐపీవోలకు సంబంధించి సెబీ అక్రమాలను గుర్తించింది. వీటిపై దర్యాప్తు పూర్తయ్యాక సంబంధిత వ్యక్తుల నుంచి చట్టవిరుద్ధంగా ఆర్జించిన లాభాలను రాబట్టే చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి డీపీ వాధ్వా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆదేశాల ప్రకారం సంబంధిత ఇన్వెస్టర్లకు నిధుల పంపిణీని చేపడుతోంది. -
నేనంటే కేసీఆర్‌కు భయం
సాక్షి, హైదరాబాద్: తనను చూసి కేసీఆర్ భయపడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బంధు అక్రమాలపై నిరసన తెలపడానికి బయలుదేరిన ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేశారు.ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్న షర్మిలను, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల పోలీసులకు హారతి ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సీఎం కేసీఆర్ తొత్తుల్లా పని చేయడం మానుకోవాలన్నారు. తనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు కొనసాగిన ఆమె దీక్షను తీగుల్ గ్రామస్తులు వచ్చి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. షర్మిల నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు తొమ్మిదేళ్లుగా గుడిసెల్లోనే.. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తాను వెళ్లాలనుకున్న తీగుల్ గ్రామంలో దళితులు తమ ఇళ్ల ఫొటోలు పంపి, వారి కోసం కొట్లాడాలని వినతి పత్రం పంపించారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు ఓట్లేసి గెలిపించినా.. తొమ్మిదేళ్లుగా ఈ ప్రజలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నారన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లోనే దళిత బంధు ఇంత దరిద్రంగా అమలవుతుంటే ఇతర నియోజకవర్గాల్లో ఎలా అమలవుతుందో ఊహించుకోవచ్చన్నా రు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలుంటే.. ఇప్పటి వరకు 38 వేల కుటుంబాలకే దళిత బంధు అమలైందన్నారు. ప్రతి ఒక్కరికీ దళితబంధు పథకం అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. -
మార్గదర్శిలో తీవ్రమైన అవకతవకలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జరుగుతున్నవన్నీ తీవ్ర అంతర్గత అవకతవకలని, వాటి గురించి చందాదారులకు తెలిసే అవకాశమే లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. అందుకే వాటిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వివరించింది. చందాదారులు ఫిర్యాదు చేయనంత మాత్రాన, మార్గదర్శి అక్రమాలు, అవకతవకలను ప్రశ్నించకూడదు, చర్యలు తీసుకోకూడదు అంటే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ప్రశ్నించారు. మార్గదర్శి చిట్ గ్రూపుల మూసివేత ఏమాత్రం ఏకపక్ష నిర్ణయం కాదన్నారు. చట్టపరమైన తీవ్ర ఉల్లంఘనలను గుర్తించాకే 2022 డిసెంబర్లో ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి వివరణ కోరామన్నారు. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో.. అందుకు కారణాలను వివరిస్తూ మళ్లీ నోటీసు ఇచ్చామని తెలిపారు. అయినా కూడా మార్గదర్శి య«థేచ్ఛగా ఉల్లంఘనలను కొనసాగిస్తూనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో చిట్ గ్రూపుల నిలుపుదల విషయంలో అభ్యంతరాలను ఆహ్వానిస్తూ బహిరంగ నోటీసు ఇచ్చామన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా తాము వ్యవహరిస్తున్నట్లు మార్గదర్శి చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని వివరించారు. మార్గదర్శి వ్యాజ్యాలకు విచారణార్హత లేదు.. ఉల్లంఘనలను గుర్తించినప్పుడు.. వాటి విషయంలో తనంతట తాను (సుమోటో)గా చర్యలు ప్రారంభించే అధికారం చిట్ రిజిస్ట్రార్లకు చట్టం కల్పిస్తోందని ఏజీ శ్రీరామ్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదని తెలిపారు. చిట్ రిజిస్ట్రార్లు చట్టప్రకారం తమకున్న సుమోటో అధికారాన్ని ఉపయోగించి చర్యలకు ఉపక్రమించారన్నారు. 2008లో ఇచ్చిన జీవో ప్రకారం రిజిస్ట్రార్లకు అధికారాలను అప్పగించారని, చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 48 (హెచ్) కింద చిట్ గ్రూపులను నిలిపేసేందుకు చర్యలు తీసుకునే సుమోటో అధికారం సైతం డిప్యూటీ రిజిస్ట్రార్లకు ఉందన్నారు. ప్రస్తుతం తాము జారీ చేసింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు మార్గదర్శికి ఏమాత్రం అవకాశం లేదని తెలిపారు. అందువల్ల ఆ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో విస్తృత ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోర్టును అభ్యర్థించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని చెప్పారు. ఇరుపక్షాలు వాదనలు ముగించడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రకాశం జిల్లా చిట్ గ్రూపు వ్యవహారంలో న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల చిట్ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ జారీ చేసిన పబ్లిక్ నోటీసుపై మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదనలు వినిపించారు. బహిరంగ నోటీసు అమలును నిలిపేసి, ఆ నోటీసు ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. -
కొనసాగిన ధార్మిక పరిషత్ కమిటీ విచారణ
తిరుపతి కల్చరల్: హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న సమయంలో అర్జున్‌దాస్ పలు అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులు ఏబీ కృష్ణారెడ్డి, జోలా చైతన్య, శ్రీరామమూర్తి, విజయరాజు, రామకృష్ణారెడ్డి రెండో రోజు కూడా విచారణ నిర్వహించారు. అర్జున్‌దాస్ గురువారం కూడా విచారణకు హాజరవ్వలేదు. అయితే విచారణ కమిటీ సభ్యులు మఠంలోని రికార్డులను నిశితంగా పరిశీలించారు. రికార్డుల్లోని లావాదేవీలపై సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు, మాజీ పూజారులు అర్జున్‌దాస్ వల్ల తాము పడిన ఇబ్బందులను విచారణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో మఠం భూముల విషయంలో అర్జున్‌దాస్ చేసిన అక్రమాలను పలువురు కమిటీకి విన్నవించారు. అనంతరం విచారణ కమిటీ సభ్యుడు ఏబీ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణకు అర్జున్‌దాస్ సహకరించట్లేదని చెప్పారు. అర్జున్‌దాస్‌పై పలువురు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించామని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం నివేదిక సమరిస్తామని తెలిపారు. -
మంత్రికి ముచ్చెమటలు పట్టించిన వై.ఎస్.ఆర్
-
అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణం
బికనేర్: అవినీతి, అక్రమాలకు మరో రూపమే కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణమే కాంగ్రెస్ అన్నారు. ప్రజాగ్రహంతో రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగిపోవడం ఖాయమని చెప్పారు. విద్వేష బజార్లో ప్రేమ దుకాణం అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసే వ్యాఖ్యలపై ఆయన ఈ సెటైర్ వేశారు. శనివారం ప్రధాని బికనేర్ జిల్లా నొరంగ్దేశార్లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. అవినీతి, నేరాలు, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మారుపేరుగా మారిందని ఆరోపించారు. ‘మహిళలపై నేరాల్లో, అత్యాచార ఘటనల్లో రాజస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ రక్షకులే వేటగాళ్లుగా మారారు. హత్యలు, అత్యాచార నిందితులను రక్షించుకోవడంలో మొత్తం ప్రభుత్వం నిమగ్నమై ఉంది’అని ప్రధాని విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, దేశాన్ని గుల్ల చేస్తుంది. అధికారం నుంచి దిగిపోతే విమర్శలతో దేశం ప్రతిష్టను మంటగలుపుతుంది. బీజేపీ కార్యకర్తలు దేశం కోసం సర్వస్వం త్యాగం చేస్తే కాంగ్రెస్ నేతలు విదేశాలకు వెళ్లి దేశం పరువు తీస్తారు’ అని ఆరోపించారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే కొందరు మంత్రులు, శాసనసభ్యులు ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేసి సొంతిళ్లకు మకాం మార్చినట్లు నాకు సమాచారమొచ్చింది. రాబోయే ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ నేతలకు మాత్రమే నమ్మకం కుదిరింది’ అని ఎద్దేవా చేశారు. -
మున్సిపల్ నియామకాల్లో అవకతవకలు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మున్సిపల్ కార్పోరేషన్లలో నియామకాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. డమ్ డమ్, హలీసహర్, బడా నగర్ మున్సిపల్ కార్పొరేషన్లుసహా మొత్తం 14 కార్పోరేషన్ల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అయాన్ సిల్, అతని ఆఫీస్, మరో ముగ్గురికి చెందిన ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. సాల్ట్ లేక్ ప్రాంతంలోని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. ముడుపులు తీసుకుని కొలువులు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సీబీఐ రంగప్రవేశం చేసింది. అయితే ఇదంతా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలో భాగమని పశ్చిమబెంగాల్ రాష్ట్ర మన్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యానించారు. -
ఆర్థిక నేరాలకు మార్గదర్శితో ముగింపు!: ఉండవల్లి అరుణ్‌కుమార్
సాక్షి, విశాఖపట్నం: రిజిస్టర్ చేయకుండా చిట్‌ఫండ్ నిర్వహించిన కేసులో మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు గతంలో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని, అప్పటి నుంచి ఆయన మోసాలు కొనసాగుతూనే ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు. మార్గదర్శి కేసుతోనైనా దేశంలో ఆర్థిక నేరాలకు ఫుల్స్టాప్ పడాలని వ్యాఖ్యానించారు. 17 ఏళ్లుగా కొనసాగుతున్న మార్గదర్శి కేసు ఇక ముగిసిన అధ్యాయం అనుకున్న తరుణంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడుతూ సీఎం వైఎస్ జగన్ వేసిన ఎస్ఎల్పీ పిటిషన్‌తో కొత్త ఊపిరి వచ్చిందని, లక్షల మంది ఖాతాదారులకు ధైర్యం వచ్చిందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖలోని ఓ హోటల్లో ఆదివారం సాయంత్రం స్వర్ణాంధ్రవేదిక ఆధ్వర్యంలో ‘రామోజీరావు మార్గదర్శి అక్రమాలు– నిజానిజాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పలువురు మాట్లాడారు. ఎవరికి ఫిర్యాదు చేయాలి?: ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ 17 ఏళ్ల తరువాత డబ్బులు ఎవరికి ఇచ్చారో వెల్లడించాలని మార్గదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఘన విజయం సాధించామని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. జూలై 18కి కేసు వాయిదా వేశారు. చాలా ఏళ్లు న్యాయస్థానాల్లో కేసు ఏమిటనేది వినే పరిస్థితి రాలేదు. 2021లో హైకోర్టులో కేసు కొట్టివేసిన తర్వాత ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్)దాఖలు చేశా. ఏడాది తర్వాత ఏపీ ప్రభుత్వం నేరుగా ఎస్ఎల్పీ వేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సరైన టైమ్‌లో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయడంతో నాకు నమ్మకం వచ్చింది. ఈ కేసు కథ ముగిసిపోతుందనుకున్న తరుణంలో వైఎస్ జగన్ వేసిన ఎస్‌ఎల్‌పీతో మళ్లీ మొదలైంది. దివంగత వైఎస్సార్ అనుకున్నది రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి చేయలేకపోయారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎవరికి డబ్బులు చెల్లించారనే వివరాలు బయటకు వస్తే ఈ కేసు ఈడీకి వెళ్తుందా? మనీ ల్యాండరింగ్‌కు కిందకు వెళ్తుందా? చెల్లించిన డిపాజిటర్లు ఎవరు? అనే విషయాలు బయటకు వస్తాయి. మొత్తం 2.36 లక్షల మంది పేర్లు బయటికి వస్తాయి. దీన్ని వచ్చే ఎన్నికల్లో ఇష్యూ చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదని రామోజీ అంటున్నారు. చిట్ డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? పోలీస్ స్టేషన్లో ఇస్తే తీసుకుంటారా? కలెక్టరేట్లో తీసుకుంటారా? అదే బాటలో ధనలక్ష్మి, కార్తికేయ... రామోజీని చూసి మిగిలిన చిట్స్ కూడా మోసాల బాట పడుతున్నాయి. రామోజీ ఏం చేస్తున్నారో అందరూ అదే చేస్తున్నారు. మూడు నెలల క్రితం కాకినాడలో ధనలక్ష్మి సొసైటీ, నెల క్రితం కార్తికేయ సొసైటీ మూతపడ్డా పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఎర్రన్నాయుడి వియ్యంకుడైన ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడిని ఇదే మోసం కారణంగా అరెస్టు చేశారు. రామోజీని అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు తీర్పు వచ్చింది. మరి అలాంటప్పుడు అప్పారావును ఎందుకు అరెస్టు చేశారని ఆయన్ను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు? ఇద్దరికీ చెరో నీతా? రామోజీని ఇంటికెళ్లి విచారిస్తారు.. అప్పారావును ఎందుకు అరెస్టు చేస్తారు? అని అడగాలి కదా! ఆదిరెడ్డి అప్పారావు ఏమైనా పర్వాలేదు కానీ రామోజీకి ఏమీ జరగకూడదని టీడీపీ స్టాండ్ తీసుకుంది. అబిడ్స్ స్టేషన్లో రామోజీ.. ఈనాడుకు మొట్టమొదటి ఎడిటర్ ఉన్న ఏబీకే ప్రసాద్‌కు ఫోన్ చేస్తే.. ఏ పర్మిషన్ లేకుండా చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నారన్న ఆరోపణలపై రామోజీరావు నాలుగు రోజుల పాటు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారన్న కొత్త విషయాన్ని చెప్పారు. ఆ తర్వాతే మార్గదర్శిని రిజిస్టర్ చేశారట. జీవీ రెడ్డి మార్గదర్శిపై చర్చకు వస్తామని ప్రకటించారు. కానీ హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ని ఈ నెల 14న టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పేరుతో బుక్ చేసుకున్నారు. రామోజీ కోసం ఏమైనా చేస్తామని తద్వారా టీడీపీ నేరుగానే చెబుతోంది. రెండు దశాబ్దాల నిరంకుశత్వం రామోజీ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న మార్గదర్శితో ఈ వేదికపై ఉన్నవారెవరికీ వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఈనాడైనా.. చిత్తు కాగితాలైనా.. పచ్చళ్లైనా.. పరిశ్రమలైనా.. చిట్స్ అయినా.. తానే చేయాలన్నదే రామోజీరావు కాన్సెప్ట్. చిన్నవాడెవడూ బతకకూడదు. ఆయనకి యాడ్స్ ఇవ్వకపోతే వ్యతిరేకంగా వార్తలు రాయడం నిత్యకృత్యమైంది. బలవంతుడైన రామోజీతో పోరాటం చేయడం చిన్నవిషయం కాదు. అధికార శక్తి, మీడియా శక్తి ఏకమైతే ఎంత భయంకరంగా ఉంటుందో గత రెండు దశాబ్దాలుగా రామోజీ రూపంలో చూస్తున్నాం. మార్గదర్శి అక్రమాలపై త్వరలో తిరుపతిలో సదస్సు నిర్వహిస్తాం. – కేబీజీ తిలక్, స్వర్ణాంధ్ర దినపత్రిక ఎడిటర్ ‘చంద్రమతి మాంగల్యం’.. మార్గదర్శి ఆస్తులు! డిపాజిటర్లు మోసపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించి డిపాజిటర్లను కాపాడింది. కొత్త అప్పులు రెండు లక్షల మందికిపైగా డిపాజిటర్లకు గుదిబండగా మారనున్నాయి. అనుబంధ కంపెనీలకు నిధులు ఎలా బదలాయిస్తారు? ‘చంద్రమతి మాంగల్యం’ మాదిరిగా ఆస్తులు వారికి మినహా ఇతరులకు కనపడటం లేదు. అగ్రిగోల్డ్, సహారా మోసాలు జరిగిపోయాయి. మరిన్ని జరగకుండా నివారించడం మన బాధ్యత. నిజంగా డిపాజిటర్లకు చెల్లించి ఉంటే సుప్రీం ఆదేశాల ప్రకారం వివరాలను వెల్లడించాలి. డిపాజిట్ రసీదుపై రామోజీరావు సంతకం ఉంటుంది. డిశ్చార్జ్ రసీదుపై ప్రొప్రైటర్ సంతకం చేయడం నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తిగా లోతైన దర్యాప్తు చేపట్టాలి. – శర్మ, ప్రముఖ న్యాయవాది. బ్రహ్మయ్య కంపెనీలో వందల ఫిర్యాదులు మార్గదర్శి, డాల్ఫిన్, ప్రియా ఫుడ్స్, ఈనాడుతో 1979 నుంచి నాకు అనుబంధం ఉంది. ఉండవల్లి పోరాటం జరిగిన తర్వాత రామోజీ మోసాలు ప్రతి ఒక్కటీ గుర్తుకొచ్చాయి. 100 టన్నుల న్యూస్ ప్రింట్ పేపర్ దిగుమతి చేసుకుంటే 90 టన్నులు మాత్రమే వినియోగించేవారు. ఇలాంటి ఎన్నో మోసాలు నా కళ్లముందే జరిగాయి. మా మామయ్య కేఎస్ రెడ్డి అన్నదాత ఎడిటర్‌గా ఉండేవారు. రామోజీ ప్రజల డబ్బులతో హోటల్స్.. ప్రింటింగ్ ప్రెస్‌లు, బిల్డింగ్లు కడుతున్నారని, చివరకు ఏమవుతుందోనని మామయ్య ఆందోళన చెందేవారు. చట్టాల్లో లొసుగులను అడ్డు పెట్టుకొని తప్పించుకోవడం రామోజీరావుకి వెన్నతో పెట్టిన విద్య. టీడీపీ నుంచి వచ్చిన జీవీ రెడ్డికి, మార్గదర్శికి ఏం సంబంధం? మా గ్రామంలో ఒక వ్యక్తికి చిట్ అయిపోయిన 9 ఏళ్ల తర్వాత డబ్బులిచ్చారు. నేను ఆడిట్ చేసిన సమయంలో బ్రహ్మయ్య అండ్ కంపెనీలో మార్గదర్శిపై కొన్ని వందల కంప్లైంట్స్ ఉన్నాయి. – నాగార్జునరెడ్డి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే.. -
అల్లూరయ్య అక్రమాలు.. టీడీపీ ముఖ్యనేత సతీమణికి భారీగా అవినీతి సొమ్ము
తీగలాగితే డొంక కదిలినట్లు.. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఓ చిరుద్యోగి ఇంట్లో సోదాలు చేస్తే మాజీ మంత్రి బొజ్జల అనుచరుల అక్రమాల పర్వం వెలుగుచూసింది. రాజీవ్‌నగర్‌లో నిరుపేదలకు కేటాయించిన స్థలాలను ఇష్టారాజ్యంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న వైనం పట్టణ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో పురపాలక ఉద్యోగి అల్లూరయ్యను అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా ప్లాట్లు విక్రయించేశారనే విషయం తెలియడంతో లబి్ధదారులు లబోదిబోమంటున్నారు. మాయమాటలు చెప్పి తమ పట్టాలు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో తెగనమ్మేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా మరికొందరు పచ్చనేతలు అందినకాడికి స్థలాలను ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తిలో దివంగత నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో మంచి డిమాండ్ ఉన్న రాజీవ్ నగర్ కాలనీలోని ప్లాట్లను బొజ్జల అనుచరులు ఒక్కొక్కటిగా అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. అసలైన లబ్ధిదారుల సంతకాలను ఫోర్జరీ చేసి విక్రయించుకుంటున్నారు. మంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో అల్లూరయ్య అనే మున్సిల్ ఉద్యోగి నివాసంలో అధికారులు చేపట్టిన సోదాలో బయటపడ్డ పట్టాలే ఇందుకు నిదర్శనం. సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్‌నగర్ కాలనీ పేరుతో ఇల్లులేని పేదలకు గూడు కల్పించాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో అందుకు అవసరమైన భూములను సేకరించారు. సుమారు 6వేల మంది పేదలకు రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. పక్కాగృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో రాజీవ్ నగర్ అభివృద్ధి అటకెక్కింది. తర్వాత ప్రభుత్వాలు రోడ్లు, తాగునీరు తదితర మౌలిక కలి్పంచకపోవటంతో అక్కడ ఇల్లు కట్టుకునేందుకు లబి్ధదారులు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో హౌసింగ్‌శాఖలో కాంట్రాక్టు కింద పనిచేస్తున్న అల్లూరయ్య మాయమాటలు చెప్పి లబి్ధదారుల పట్టాలను తీసిపెట్టుకున్నాడు. అరాకొర ధరలకే కొన్ని ప్లాట్లను అమ్ముకుని జేబులో వేసుకున్నాడు. ఈ విషయం అప్పట్లోనే బయటపడడంతో నాటి ప్రభుత్వం వెంటనే అల్లూరయ్యను ఉద్యోగం నుంచి తొలగించింది. టీడీపీ హయాంలో రెచ్చిపోయి.. టీడీపీ ప్రభుత్వంలో అల్లూరయ్య శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తొలుత అటెండర్‌గా చేరి అవినీతి పర్వానికి తెరతీశాడు. ఆ సమయంలోనే 30 మంది మున్సిపల్ ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును కాజేశాడనే ఆరోపణలతో సస్పెండయ్యాడు. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత సతీమణికి రూ.20లక్షలు ముట్టజెప్పి, 2018లో అదే కార్యాలయంలో జూనియర్ అసిప్టెంట్గా ఉద్యోగం పొందాడు. ఇక అప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్‌లో అల్లూరయ్య ఆడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది. అదే సమయంలో అల్లూరయ్య వద్ద ఉన్న ఇంటి పట్టాల విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బొజ్జల అనుచరులు నలుగురు రంగంలోకి దిగారు. లబి్ధదారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.100 డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. దొరికిన స్థలాలను దొరికినట్లు ఇష్టారాజ్యంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. వందలాది పట్టాలు వెలుగులోకి.. రాజీవన్నగర్లో నాడు రూ.30వేలు ఉన్న ఇంటి స్థలం.. నేడు రూ.5లక్షలకు చేరడంతో అల్లూరయ్య దగ్గర ఉన్న పట్టాలను టీడీపీ నేతలు బయటకు తీయించారు. తాము ఇది వరకే సిద్ధం చేసుకున్న రూ.100 డాక్యుమెంట్లను చూపించి కొనుగోలుదారులను బురిడీ కొట్టించడం ప్రారంభించారు. తమకు నగదు అవసరమని, అందుకే రూ.5లక్షల ప్లాటుని రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకే ఇచ్చేస్తున్నామని ప్రచారం చేపట్టారు. ఆ ప్రాంతంలో పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే ప్లాటు వస్తుందని స్థానికులు పెద్దసంఖ్యలో కొనుగోలు చేశారు. ఇలా సుమారు వెయ్యి ప్లాట్ల వరకు విక్రయించినట్లు తెలిసింది. ఇవి కాకుండా అల్లూరయ్య ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో మరో 2,309 పట్టాలు దొరకడం గమనార్హం. టీడీపీలోని నలుగురు నేతలు, అల్లూరయ్య చేస్తున్న అక్రమాలను తెలుసుకున్న మరికొందరు ఆ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరు 5 నుంచి 10 ప్లాట్ల వరకు ఆక్రమించుకున్నట్లు సమాచారం. భాగోతం బట్టబయలు! రాజీవ్‌నగర్‌లో ఇంటి స్థలాలకు రేటు పలకుతుండడంతో అల్లూరయ్య దగ్గర పట్టాలు ఇచ్చిన లబి్ధదారుల్లో కదలిక వచ్చింది. తమ పట్టాలను వెంటనే ఇవ్వాలని అల్లూరయ్యను కోరారు. అయితే తన వద్ద ఎలాంటి పట్టాలు లేవని తెగేసి చెప్పడంతో ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విచారణకు ఆదేశించడంతో బొజ్జల అనుచరుల భాగోతం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెరిగిన డిమాండ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గం అభివృద్ధి పథంలో పయనించింది. అక్కడ జగనన్న కాలనీ పేరుతో 2 వేల మందికి పైగా పక్కాఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లే అవుట్‌ని సుందరంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సైతం ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నవరత్నాల ఆలయాన్ని నిర్మించారు. జగన్న కాలనీకి ఎదురుగానే ఉన్న రాజీవ్‌నగర్‌కి పైన కొండచుట్టు కోసం ‘దేవుడి బాట’ పేరుతో 20 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేశారు. కాలనీకి పకడ్బందీగా నీటి సౌకర్యం కలి్పంచారు. దీంతో రాజీవ్‌నగర్ కాలనీలోని ప్లాట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. -
కార్వీ కేసులో డైరెక్టర్ యుగంధర్‌కు ఊరట
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్)లో అవకతవకల కేసుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణలో సంస్థ డైరెక్టరు మేకా యుగంధర్‌కు ఊరట లబించింది. క్లయింట్ల నిధుల దుర్వినియోగం విషయంలో ఆయన ప్రమేయమేమీ లేదని తుది ఉత్తర్వుల్లో సెబీ అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో ఆయన కేఎస్‌బీఎల్ మేనేజ్మెంట్తో కుమ్మక్కయ్యారనేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది. ఆధారాలను బట్టి చూస్తే సంస్థలో యుగంధర్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా మాత్రమే ఉన్నారని, కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఆయన జోక్యం లేదని తెలిపింది. వాస్తవానికి 2017లోనే క్లయింట్ల నిధుల దుర్వినియోగ అంశం గురించి ఆయన లేవనెత్తి, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరినప్పటికీ సంస్థ సీఎఫ్‌వో, మేనేజ్మెంట్ పట్టించుకోలేదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో యుగంధర్ ప్రజావేగుగానే వ్యవహరించారని, ఆయన్ను నేరస్తుడిగా భావించడానికి లేదని సెబీ పేర్కొంది. ఈ కేసులో కేఎస్‌బీఎల్, దాని ప్రమోటరు ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ విజయం
-
కేజ్రీవాల్ నివాసానికి మరమ్మతులపై నివేదిక కోరిన ఎల్జీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసానికి రూ.49 కోట్లతో చేయించిన మరమ్మతుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. దీనిపై సవివర నివేదిక ఇవ్వాలని, మరమ్మతులకు సంబంధించిన అన్ని రికార్డులను 15 రోజుల్లోగా తన ముందుంచాలని శనివారం చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. 2020–22 సంవత్సరాల్లో అధికార నివాసంలో అదనపు పనులు, మరమ్మతుల కోసం కేటాయింపులు రూ43.70 కోట్లు కాగా, రూ.44.78 కోట్లు వెచ్చించినట్లు రికార్డులు చెబుతున్నాయి. సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఆప్ అంటోంది. -
తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్రమాలపై విచారణ
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ పాల్పడిన అక్రమ చెల్లింపులు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం కమిటీ సభ్యులు గంగాధర్‌గౌడ్, వసుంధరదేవి, ప్రవీణ్‌కుమార్ వర్సిటీని సందర్శించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరిని కలిసి 2021 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ 18 వరకు వర్సిటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ మధ్యకాలంలో జరిపిన చెల్లింపులపై విచారణ జరపనున్నారు. వర్సిటీకి విచారణ కమిటీ రాక సందర్భంగా విద్యార్థులు ‘థాంక్యూ సాక్షి’అంటూ క్యాంపస్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’పత్రికకు ధన్యవాదములు’అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఫ్లెక్సీల ఏర్పాటు సోషల్ మీడియాలో వైరలైంది. వర్సిటీలో కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నెల 19న హైదరాబాద్ రూసా భవనంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఆ శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ సమావేశానికి హాజరైన వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం వీసీ అక్రమాలపై విచారణ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రకళ, నలుగురు ఈసీ మెంబర్లతో కలిపి పాలకమండలి కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం ఈ నెల 26న జరిగిన పాలకమండలి సమావేశంలో ఏ విధంగా విచారణ జరపాలనే విషయమై కమిటీ సభ్యులకు మార్గనిర్దేశనం చేశారు. ఈసీ నిర్ణయాలు తాత్కాలికంగా రద్దు చేసిన హైకోర్టు ఈ నెల 19న జరిగిన తెలంగాణ యూనివర్సిటీపాలక మండలి(ఈసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మధ్యంతరంగా రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఈ సమావేశంలో వీసీ అధికారాలు తగ్గించడం, ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా విద్యావర్ధినిని తొలగించి ప్రొఫెసర్ యాదగిరిని నియమించడం, వీసీపై వచ్చిన ఆరోపణల విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు వంటి నిర్ణయాలను ఈసీ తీసుకున్న విషయం తెలిసిందే. ఈసీ నిర్ణయాలపై తాను హైకోర్టును ఆశ్రయించగా, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వీసీ తెలిపారు. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తుందని ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు. -
మార్గదర్శి అక్రమాలపై కొనసాగుతున్న సీఐడీ సోదాలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాలపై సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో మార్గదర్శి బ్రాంచీల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి రశీదు డిపాజిట్ల ముసుగులో భారీగా బ్లాక్‌మనీ మార్పిడి జరిగిందని, ఆ నల్లధనాన్నే తమ సంస్థల్లో పెట్టుబడులుగా రామోజీ తరలించినట్లు సీఐడీ గుర్తించింది. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. రికార్డులు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు సీఐడీ పరిశీలించింది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, నరసరావుపేట, ఏలూరు, అనంతపురం మార్గదర్శి బ్రాంచీల్లో సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్‌ఫండ్ అక్రమాలు, నిధులు దారిమళ్లింపుపై విచారణ జరుపుతుంది. ఇప్పటికే హైదరాబాద్ మార్గదర్శి కార్యాలయంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఎండీ శైలజాకిరణ్‌పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి.. -
'ఓట్ల లెక్కింపులో అక్రమాలు చూపినా ఆర్ఓ పట్టించుకోలేదు'
అనంతపురం క్రైం: ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, వాటిని సాక్ష్యాలతో సహా చూపించినా రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ), కలెక్టర్ నాగలక్ష్మి పట్టించుకోలేదని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం దేనికి సంకేతం అని ప్రశి్నంచారు. పైగా వారు తమకు పడ్డ ఓట్లను సైతం తగ్గించి చూపించారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలో కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని చూసి చాలా బాధేసిందన్నారు. ‘కౌంటింగ్ నిర్వహణలో కలెక్టర్, ఎస్పీ పూర్తిగా వైఫల్యం చెందారు. టీడీపీకి అనైతికంగా మద్దతుగా నిలి్చన వీరిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ప్రవీణ్, కమలాపురం ఇన్చార్జ్ నరసింహారెడ్డి, పులివెందులకు చెందిన పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆలం నరసానాయుడు, వడ్డే మురళీ, సరిపూటి రమణ.. ఇలా పది మందికిపైగా టీడీపీ ముఖ్య నేతలు ఏజెంట్లుగా కూర్చున్నప్పటికీ ఆర్ఓ పట్టించుకోలేదు. వీరు కౌంటింగ్ హాల్లోని ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి ప్రభావం చూపేలా వ్యవహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కౌంటింగ్ హాలులో పదుల సంఖ్యలో, పరిసర ప్రాంతాల్లో వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిష్ట వేసినా ఎస్పీ ఫక్కీరప్ప ప్రేక్షక పాత్ర పోషించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే కలెక్టర్ నాగలక్షి్మ, ఎస్పీ ఫక్కీరప్పలు ఏవిధంగా మాట్లాడారు? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయాన్ని మరచిపోయారా? ► కౌంటింగ్ హాల్లో టేబుల్ నంబర్ 19లో ఓ అధికారి టీడీపీ అభ్యర్థివి 44, మా పార్టీవి ఆరు ఓట్లు కట్టకట్టి ఒకే దానిలో వేశారు. దీనిపై మా ఏజెంట్ ఫిర్యాదు చేయగా అసలు నిజం వెలుగు చూసింది. ► అదే అధికారి 3, 4, 5 రౌండ్లలోనూ ఉన్నాడని ఫిర్యాదు చేస్తే తనకేం సంబంధం లేదని రిటర్నింగ్ అధికారి చెప్పడమేంటి? అక్రమాలు జరిగినప్పుడు విచారణ చేయకపోతే ఆర్ఓగా ఎందుకున్నట్లు? మరో అధికారి.. తమవి 70 ఓట్లు ఉంటే ఆ కట్టపై 50 అని రాశారు. టీడీపీవి 30 ఉంటే 50 అని నమోదు చేశారు. ► ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోలేదు. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
‘మార్గదర్శి’ అక్రమాలు: ఇదో పోంజీ తరహా స్కామ్.. చందాదారుల సొమ్ముతో దందా!
సాక్షి, అమరావతి: మార్గదర్శి యాజమాన్యం చందాదారుల డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించినట్లు తమ తనిఖీల్లో వెల్లడైందని సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ వెల్లడించారు. చట్ట ప్రకారం చిట్‌ఫండ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే చిట్స్ రిజిస్ట్రార్‌కు మార్గదర్శి యాజమాన్యం సహకరించడం లేదని తెలిపారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించడం తమ బాధ్యతని, ఇదే ధోరణి కొనసాగితే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలకు సైతం వెనుకాడబోమన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నిధుల దుర్వినియోగం, మోసం, చట్ట ఉల్లంఘనలకు సంబంధించి తాము నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నట్లు న్యాయస్థానం కూడా రిమాండ్‌కు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొందని గుర్తు చేశారు. “మన రాష్ట్రంలో చందాదారుల సొమ్మును ఇతర రాష్ట్రాలకు అక్రమంగా బదిలీ చేస్తున్నారు. అందుకు ఇక్కడ బాధ్యులు ఉండరు. ఇతర రాష్ట్రాల్లో అడిగితే మీకు సంబంధం లేదంటున్నారు. అంటే చందాదారులు చెల్లిస్తున్న సొమ్ముకు ఎలాంటి భద్రతా లేదు’ అని పేర్కొన్నారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో వారు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వివరించారు. చిట్‌ఫండ్ చట్టం సామాజిక, ఆర్థికపరమైన చట్టమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. చందాదారుల హక్కుల పరిరక్షణ, చిట్‌ఫండ్ కంపెనీల్లో ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఈ చట్టం చేశారని పేర్కొంది. చిట్‌ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీ బ్రాంచిలోని మేనేజర్ (ఫోర్మేన్) చందాదారులు చెల్లించే సొమ్ముకు పరిరక్షకుడు. చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పర్యవేక్షకుడు. బ్యాంక్ లావాదేవీల నిర్వహణ, నిధుల చెల్లింపులన్నీ ఫోర్మేన్ నిర్వహించాలి. రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉన్న 37 బ్రాంచీల్లో ఏడు బ్రాంచిల్లో తనిఖీలు చేశాం. చందాదారులు చెల్లించిన మొత్తం అక్కడి బ్యాంకుల్లో లేదన్న విషయం అందులో వెల్లడైంది. ఆ సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించేశారు. మార్గదర్శి ఫోర్‌మేన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన చెక్ పవర్‌తోసహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. ఇక్కడున్న చందాదారుల సొమ్ముల భద్రత గురించి అడిగితే తనకు తెలియదని ఫోర్‌మెన్ చెబుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అడిగితే తెలంగాణలో ఉన్న ప్రధాన కార్యాలయం ఏపీ అధికారుల పరిధిలోది కాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారులు చెల్లిస్తున్న డబ్బులకు బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. సొమ్ము రాష్ట్ర ప్రజలది...పెత్తనం పక్క రాష్ట్రంలో వారిది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు చెందిన సొమ్ములను నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, తమ అనుబంధ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆ సంస్థ బ్యాలన్స్ షీట్, కొన్ని బ్యాంకు ఖాతాలను చారెŠట్‌డ్ అకౌంటెంట్ ద్వారా పరిశీలిస్తే ఈ విషయాలు బయటపడ్డాయి. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్‌వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్‌లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరులో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఫోర్మెన్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాం. గుంటూరు మినహా మిగతా మూడు చోట్లా న్యాయస్థానాలు నిందితులకు రిమాండ్ విధించాయి. నిందితులపై సీఐడీ మోపిన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని రిమాండ్‌కు అనుమతిస్తూ న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. సీఐడీ కేసు డైరీలో పేర్కొన్న అంశాలతో తాము సంతృప్తి చెందినట్లు, వారిని అరెస్టు చేయడం సరైనదేనని పేర్కొన్నాయి. మార్గదర్శి యాజమాన్యం నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ, చిట్స్ రిజిస్ట్రార్‌కు సహాయ నిరాకరణ కొనసాగిస్తే చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారన్న అంశంతో మాకు నిమిత్తం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, చందాదారుల సొమ్ముకు భద్రత కల్పించడమే మా విధి. ఈ కేసులో విచారణ కొనసాగిస్తాం. కేసు దర్యాప్తులో పురోగతికి అనుగుణంగా ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 చెరుకూరి శైలజను కూడా విచారించడంతోపాటు ఇతర చర్యలను తగిన సమయంలో తీసుకుంటాం. ఇదో.. పోంజీ తరహా స్కామ్ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యం పోంజీ స్కామ్ తరహా అక్రమాలకు పాల్పడుతోంది. చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచుతోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధం. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉంది. గతంలో అక్రమంగా సేకరించిన రూ.15 వేల కోట్ల డిపాజిట్లపై ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. చదవండి: ఆడియో మార్చి అభాండాలా..? చందాదారుల నుంచి ఫిర్యాదులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ చిట్‌ఫండ్ చట్టం, ఇతర చట్టాలను అనుసరించి మార్గదర్శిపై స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఒక్క చిట్‌ఫండ్ చట్టమే కాకుండా ఇతర చట్టాలను కూడా ఉల్లంఘించారు. సీఐడీ కేసు నమోదు చేయగానే పలువురు చందాదారులు తాము మోసపోయామని, తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే 8 మంది చందాదారులు ఫిర్యాదు చేశారు. ఓ చందాదారుడు తనకు ఇవ్వాల్సిన రూ.10 లక్షలను ఆర్నెల్లుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. -
ఆన్లైన్ అక్రమాలకు అడ్డుకట్ట ఏదీ?
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం బర్త్, డెత్‌సర్టి ఫికెట్ల జారీలో ఆన్లైన్ అవకతవకలు గుర్తించి తెగ హడావుడి చేస్తున్న జీహెచ్ఎంసీ..ఐదేళ్లకు పూర్వం నుంచే ఆన్లైన్ ద్వారా వివిధ అంశాల్లో ఎన్నో అక్రమాలు వెలుగు చూసినా ఇప్పటి వరకు ఎవరిపైనా తగిన చర్యలు తీసుకోలేదు. అందువల్లే అక్రమాలకు ఫుల్స్టాప్ పడటం లేదని జీహెచ్ఎంసీ వర్గాలే చెబుతున్నాయి. బర్త్, డెత్ సర్టి ఫికెట్ల జారీలో చేతులు తడపనిదే పని కాని పరిస్థితి ఎన్నో ఏళ్లుగా వేళ్లూనుకుంది. దాన్ని నివారించేందుకని ఆన్లైన్ ద్వారా జారీ విధానాన్ని, ప్రజలకు మరింత సులభంగా సేవలందిచేందుకని ఇన్స్టంట్ అప్రూవల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన జీహెచ్ఎంసీ..కనీస పర్యవేక్షణను గాలికొదిలేసింది. దాంతో ఆన్లైన్ ద్వారా సర్టి ఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు జత చేయాల్సిన డాక్యుమెంట్ల స్థానే చిత్తుకాగితాలు జత చేసినా సర్టి ఫికెట్లు జారీ అవుతుండటంతోనే అక్రమాలు పెచ్చరిల్లాయి. మీసేవా కేంద్రాల ద్వారా అవి జారీ అయినందున జీహెచ్ఎంసీకి సంబంధం లేదని చెబుతున్నా..జీహెచ్ఎంసీ–మీసేవా కేంద్రాల సిబ్బంది మధ్య సంబంధం ఉంటుందనే ఆరోపణలున్నాయి. ఒకరి భవనం మరొకరికి.. ఈ పరిస్థితి ఒక్క బర్త్, డెత్ సర్టిఫికెట్లకే పరిమితం కాలేదు. ఆన్లైన్ ద్వారా భవనాల సెల్ఫ్ అసెస్‌మెంట్లలోనూ అదే ధోరణి కొనసాగింది. దాదాపు ఐదేళ్ల క్రితం కొందరి భవనాల్ని వేరే వారికి మ్యుటేషన్లు చేసిన ఘటనలు సైతం ఉన్నాయి. ఇలా ఎన్ని అవకతవకలు దృష్టికొచ్చినా, వాటిని నిలువరించేందుకు జీహెచ్ఎంసీ శ్రద్ధ చూపలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అక్రమాలు వెలుగుచూసినప్పుడే బాధ్యులపై కఠినచర్యలు తీసుకొని ఉంటే తిరిగి అక్రమాలు జరిగేవి కాదని పలువురు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో పేరుకు మాత్రం ఐటీ విభాగం ఉన్నా.. అన్నింటికీ సీజీజీ మీదే ఆధారపడుతోంది. జీహెచ్ఎంసీలో పనిచేసి వెళ్లినవారే సీజీజీలో చేరి మ్యుటేషన్ల అవకతవకలకు పాల్పడ్డారనే ప్రచారం జరిగినా జీహెచ్ఎంసీ పట్టించుకోలేదు. వేలకోట్ల బడ్జెట్ ఉన్న జీహెచ్ఎంసీకి తగిన విధంగా ఐటీ విభాగం లేదు. బయోమెట్రిక్ హాజరులోనూ ఎన్నో పర్యాయాలు నకిలీ వేలిముద్రలు పట్టుబడ్డా చర్యల్లేవు. చూసీ చూడనట్లు ఎందుకో..? దాదాపుగా అన్ని సేవలూ ఆన్లైన్ చేశాక.. తమకు పై ఆదాయం తగ్గినందున జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులే అక్రమాలు జరిగినా చూసీ చూడనట్లు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. తద్వారా ఆన్‌లైన్‌ను ఎత్తివేస్తారనే యోచనతోనే ఇలా వ్యవహరించి ఉంటారని జీహెచ్ఎంసీ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా సెల్ఫ్ అసెస్మెంట్ వల్ల ప్రభుత్వ భవనాల్ని సైతం ప్రైవేట్ వ్యక్తులు సెల్ఫ్ అసెస్ చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వీటికి బదులేదీ..? ♦ కొద్దికాలం క్రితం బర్త్ సర్టి ఫికెట్లో పేరులో ఒక అక్షరం తప్పు పడితే దాన్ని సరిచేసుకునేందుకు మీసేవా కేంద్రాల్లో అవసరమైన పత్రాలన్నీ సమర్పించినా.. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని సర్కిల్ కార్యాలయాలకు రావాల్సిందిగా సమాచారమిచ్చేవారు. అలాంటి జీహెచ్ఎంసీ అధికారులే నాన్‌అవైలబిలిటికీ సంబంధించిన బర్త్, డెత్ సర్టి ఫికెట్ల జారీలో ఎందుకు కళ్లు మూసుకున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ♦ గతంలో ఏభవనానికి ఎంత ఆస్తిపన్ను బకాయి ఉందో ఎవరైనా తెలుసుకోగలిగేవారు. బకాయిల వివరాలు ఇతరులకు తెలియకుండా ఉండేందుకు భవన యజమాని ఫోన్‌కే ఓటీపీ వచ్చేలా ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ.. ఎంతో కీలకమైన సర్టి ఫికెట్లు ఎలాంటి పరిశీలన లేకుండానే జారీ అయ్యేలా ఎందుకు వ్యవహరించిందో అంతుబట్టడం లేదు. -
వెలుగు చూస్తున్న ‘మార్గదర్శి’ అక్రమాలు.. నలుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇండివిడ్యువల్ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్ సమర్పించలేదు. బ్యాలెన్స్‌షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి ఇవ్వలేదు. తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలూ బేఖాతరు చేసింది. దీంతో గడచిన మూడు నెలలుగా 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను అధికారులు నిలిపేశారు. డిసెంబర్ నుంచి కూడా ఈ ఫారం నింపి మార్గదర్శి ఇవ్వలేదు. అధికారుల చర్యలతో సంబంధిత బ్రాంచ్‌ల్లో చిట్స్ బంద్ అయ్యాయి. మార్గదర్శి కేసులో నలుగురిని సీఐడీ అరెస్ట్ చేసింది. నలుగురు ఫోర్మెన్లను అదుపులోకి తీసుకుంది. నిన్నటి నుంచి మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీఐడీ.. విశాఖపట్నం మార్గదర్శి బ్రాంచ్ ఫోర్ మెన్ కామినేని రామకృష్ణ, రాజమండ్రి మార్గదర్శి బ్రాంచ్ ఫోర్ మెన్ సత్తి రవి శంకర్, విజయవాడ మార్గదర్శి ఫోర్ మెన్ బి.శ్రీనివాసరావు, గుంటూరు మార్గదర్శి ఫోర్ మెన్ గొరిజవోలు శివరామకృష్ణలను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ సోదాల్లో భారీ అక్రమాలు, ఉల్లంఘనలను సీఐడీ గుర్తించింది. మార్గదర్శిలో రికార్డులన్నీ అక్రమం అని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని సీఐడీ గుర్తించింది. అక్రమాలకు పాల్పడినందున నలుగురు ఫోర్ మెన్లను సీఐడీ అరెస్ట్ చేసింది.. అరెస్టయిన నలుగురిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా,చట్టాన్ని యథేచ్చగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆ సంస్థపై సీఐడీ అధికారులు శనివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ, రామోజీరావు పెద్ద కోడలు చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వారిపై సెక్షన్లు 120(బి), 409, 420, 477(ఎ) రెడ్‌విత్ 34 సీఆర్సీపీ కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం–1999, చిట్ ఫండ్ చట్టం–1982 కింద కూడా కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చదవండి: తోడు దొంగలు.. యథేచ్ఛగా అక్రమాలు, ఆర్బీఐ నిబంధనలు బేఖాతరు -
గోమెకానిక్ ఖాతాల్లో గోల్మాల్
న్యూఢిల్లీ: వాహనాల రిపేర్ సేవలు అందించే స్టార్టప్ సంస్థ గోమెకానిక్ ఆర్థిక అవకతవకల వివాదంలో చిక్కుకుంది. ఈ వ్యవహారాన్ని స్వయంగా అంగీకరించిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. సంస్థ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే వ్యాపారాన్ని కూడా పునర్వ్యవస్థీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 70 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపారు. గోమెకానిక్లో దాదాపు 1,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోగా మిగిలిన సిబ్బందిని జీతాలు లేకుండా మూడు నెలల పాటు పని చేయాలంటూ కంపెనీ కోరినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ గోమెకానిక్ను మరింత వృద్ధిలోకి తేవాలనే యావలో పడి వ్యవస్థాపకులు నియంత్రణ తప్పి వ్యవహరించారని, తప్పిదాలు చేశారని లింక్డ్ఇన్లో రాసిన పోస్టులో భాసిన్ పేర్కొన్నారు. దీనికి తాము తీవ్రంగా చింతిస్తున్నామని ఆయన తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత మాదే. పెట్టుబడులను సమకూర్చుకునేలా పరిష్కార మార్గాలను అన్వేషించుకుంటూ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించాలని అంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం‘ అని భాసిన్ చెప్పారు. రూ. 120 కోట్ల పైగా రుణభారం ఉండగా, అందులో మూడో వంతు రుణాన్ని సత్వరం తిరిగి చెల్లించాల్సిన నేపథ్యంలో గోమెకానిక్ మనుగడ సాగించాలంటే నిధులను తప్పనిసరిగా సమీకరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఆదాయాలను అధికంగా చూపడమే కాకుండా వ్యవస్థాపకులు కావాలనే వాస్తవాలను దాచిపెట్టారని ప్రధాన ఇన్వెస్టర్లు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఈ అవకతవకలపై విచారణ జరిపేందుకు థర్డ్ పార్టీని ఎంపిక చేసినట్లు వివరించారు. కార్ల యజమానులను వారి ప్రాంతంలోని మెకానిక్ షాపులకు అనుసంధానించే స్టార్టప్‌గా గోమెకానిక్ 2016లో ప్రారంభమైంది. కుశాల్ కర్వా, నితిన్ రాణా, రిషభ్ కర్వా, భాసిన్ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. సెకోయా క్యాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. గోమెకానిక్ 2021 జూన్‌లో 42 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
Hyderabad: ‘ముంపు’ పేరిట ముంచేస్తూ.. రూ. 37 కోట్ల పనుల్లో అక్రమాలెన్నో
సాక్షి, హైదరాబాద్: పూడికతీత పనుల నుంచి రోడ్ల పనుల దాకా అన్నింటా కుమ్మక్కవుతున్న జీహెచ్ఎంసీ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వానాకాలంలో ముంపుసమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేసిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్(ఎంఈటీ)లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. ఒకే రకమైన పనికి ఒక్కోచోట ఒక్కోరేటు ఉండగా, కొన్ని చోట్ల ఒక్క శాతం కంటే తక్కువకే కాంట్రాక్టర్లకు కేటాయించగా, కొన్ని చోట్ల 40 శాతానికి మించి లెస్‌కు పనులప్పగించారు. గత సంవత్సరం వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా వెంటనే తోడిపోయడానికి 326 టీమ్స్ ఏర్పాటు చేశారు. వాటిల్లో 160 స్టాటిక్ టీమ్స్ కాగా, మిగతావి మొబైల్ టీమ్స్. మైబైల్ టీమ్స్‌లో డీసీఎం, ట్రాక్టర్, టాటా ఏస్, జీప్ వంటి వాహనంతో పాటు నలుగురు కార్మికులుంటారని చెబుతున్నా, చాలా ప్రాంతాల్లో ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులనే పనులకు వినియోగించారు. ఉంచాల్సిన వాహనాల బదులుగా ఆటోలనుసైతం వినియోగించారు. ఇక కార్మికులకు ఇవ్వాల్సిన రేడియం జాకెట్లు, షూస్, రెయిన్కోట్లు, గొడుగులు, టార్చిలు వంటివి మాటలకే పరిమితమయ్యాయి. ఈ టీమ్స్ ఏర్పాటు పేరిట రూ. 37.42 కోట్ల పనులు చేశారు. కొందరు కాంట్రాక్టర్లే ఎక్కువచోట్ల పనులు పొందడం.. వాటిల్లో కొన్ని చోట్ల తక్కువలెస్కు టెండర్ దక్కించుకోగా, మరికొన్ని చోట్ల చాలా ఎక్కువ లెస్‌కు వేయడం అనుమానాలకు తావిస్తోంది. రూ. 14 లక్షల పని రూ.6 లక్షలకే .. ఒక కాంట్రాక్టు ఏజెన్సీ ఈ టీమ్స్ ఏర్పాటుకు సంబంధించి మలక్‌పేట సర్కిల్లో ఒక్కొ క్కటి రూ.14.20 లక్షల విలువైన రెండు పనులను దాదాపు రూ. 6.75 లక్షలకే చేసింది. అంటే ఎంత ఎక్కువ లెస్‌కు పనిచేసిందో అంచనా వేసుకోవచ్చు. అలాగే ఖైరతాబాద్ సర్కిల్లో ఒక కాంట్రాక్టర్ రూ.17.30 లక్షల విలువైన ఒక పనిని 48.58 శాతం లెస్తో, రూ.17.35 లక్షల విలువైన మరో పనిని 48.99 శాతం లెస్తో చేసేశారట. అలాగే ఫలక్‌నుమా సర్కిల్లో రూ.12.80 లక్షల విలువైన పనిని 48.01 శాతం లెస్తో, రూ.12.80 లక్షల విలువైన పనిని 47.99 శాతం లెస్తో పూర్తిచేశారు. ఇంత ఎక్కువ లెస్‌కు పనులు చేశారంటే, టీమ్‌లు అన్నివేళలా పని చేయకపోవడమైనా ఉండాలి. లేదా ఒకే యూనిట్‌ను(వాహనం,వర్కర్లు ) రెండు చోట్లా చూపి ఉండాలి. లేదా వర్కర్లను తగ్గించి ఉండాలి. ఈ ఉదాహరణలు కేవలం మచ్చుకు మాత్రమే. ఇలా అత్యధికంగా 40 శాతం, అంత కంటే ఎక్కువ లెస్తో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. ఒక్క శాతం లోపునే.. ఇక అత్యల్పంగా ఒక్క శాతం కంటే తక్కువ లెస్తోనే పనులు చేసిన వారు సైతం ఉన్నారు. హయత్‌నగర్ సర్కిల్లో రూ.13 లక్షల విలువైన పనిని చాంద్రాయణగుట్ట సర్కిల్లో రూ. 15 లక్షల విలువైన పనిని కేవలం ఒక్కశాతం కంటే తక్కువ లెస్‌కే చేశారు. రూ. 10 కోట్ల అవినీతి..? వీటిని చూస్తుంటే కొన్ని సర్కిళ్లలో అధికారులు అంచనా వ్యయం అత్యధికంగా వేసి కాంట్రాక్టర్లతో ఎక్కువ లెస్ వేయించారా? లేక పనులు మేం చూసుకుంటాంలే అని పనులు చేయకున్నా బిల్లులు చెల్లిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సర్కిళ్లలో అంచనా వ్యయం రూ.20 లక్షలుంటే కొన్ని సర్కిళ్లలో కోటిరూపాయల వరకుంది. వాహనాలు ఎక్కడైనా ఒకటే. సిబ్బంది సంఖ్యలో తేడా ఉంటే అంచనా వ్యయంలో ఆమేరకు కొంత తేడా ఉండవచ్చుకానీ రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటానికి కారణం సంబంధిత ఇంజినీర్లకే తెలియాలి. ఇంజినీర్లు, కాంట్రాక్టరు కుమ్మక్కై జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొట్టడానికి వారి ఇంజినీరింగ్ ప్రతిభాపాటవాలు ప్రదర్శించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడులా కొందరు స్థానిక కార్పొరేటర్లకు సైతం వాటాలంది ఉంటాయని జీహెచ్ఎంసీ వ్యవహారాలు తెలిసిన వారు చెబుతున్నారు. ఈ ముంపు పరిష్కార పనుల్లో దాదాపు రూ. 10 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.. అవకతవకలపై ఫిర్యాదులున్నాయని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు. కొందరికే ఎక్కువ పనులు.. ∙కొందరు కాంట్రాక్టర్లు ఎక్కువ పనులు దక్కించుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. ఎల్బీనగర్ జోన్‌లోని ఉప్పల్,హయత్‌నగర్ రెండు సర్కిళ్ల పనులు చేసిన ఒక కాంట్రాక్టర్ ఒక చోట 7.25 శాతం లెస్తో చేయగా, మరోచోట 29.09 లెస్తో చేశారు. అంటే ఒక చోట తగ్గించింది మరోచోట పూడ్చుకున్నారన్న మాట. ఇదే కాంట్రాక్టర్ అల్వాల్, మల్కాజిగిరి సర్కిళ్లలోనూ చేశారు. అక్కడ మాత్రం కేవలం 0.09 శాతం, 0.56 శాతం లెస్‌కు మాత్రమే చేయడం విశేషం. ►అదే జోన్లో ఇద్దరు కాంట్రాక్టర్లు హయత్‌నగర్, ఎల్బీనగర్ రెండు సర్కిళ్లలోనూ , మరో కాంట్రాక్టర్ ఉప్పల్, సరూర్‌నగర్ రెండు సర్కిళ్లలో పనులు చేశారు. హయత్‌నగర్, ఎల్బీనగర్ సర్కిళ్లలో పనులు చేసిన ఒక కాంట్రాక్టరే కూకట్పల్లి, అల్వాల్, రాజేంద్రనగర్,బేగంపేట సర్కిళ్లలోనూ పనిచేశారు. ►చందానగర్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలోని ఆరు పనుల్లో నాలుగింటిని ఒక్క కాంట్రాక్టరే చేశారు. మరో కాంట్రాక్టర్ జూబ్లీహిల్స్‌తోపాటు కార్వాన్, గోషామహల్‌లోనూ పనులు చేశారు. ► గోషామహల్‌లోని కాంట్రాక్టర్ మూడు పనుల్ని 45 శాతం లెస్‌కు చేశారు. ►రాజేంద్రనగర్‌లోని పనులన్నింటినీ రెండు సంస్థలే దక్కించుకున్నాయి. ►ఇలా చెప్పుకుంటూ పోతే మాన్సూన్ ఎమర్జెన్సీటీమ్స్ పేరిట జరిగిన మాయాజాలానికి అంతే లేదు. -
అమరావతిలో చంద్రబాబు బృందం అక్రమాలు బట్టబయలు
-
ఆ ఒక్కటీ... అడక్కు..!! షాక్‌లో ఆడిట్ అధికారులు
సాక్షి, కణేకల్లు: కణేకల్లు వ్యవసాయ విత్తనోత్పత్తిక్షేత్రంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రంగంలో దిగిన ఆడిటర్లు తమకు అప్పగించిన పనిని పూర్తి చేశారు. పూర్వ ఏడీఏ సనావుల్లా పదేళ్ల కాలంలో రికార్డులను సక్రమంగా నిర్వహించకుండా, ఆదాయ వ్యయాలు సరిగా చూపకుండా, నిధులను భారీస్థాయిలో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫారం బకాయిపడిన సొమ్మును ఓటీఎస్ ద్వారా రూ.78.36 లక్షలను ప్రభుత్వం ఇటీవలే చెల్లించగా... ఇందులో కూడా ఓ వ్యక్తి ఖాతా నుంచి తన భార్య ఖాతాకు రూ.13.85 లక్షలు మళ్లించుకున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్.. సనావుల్లా పని చేసిన సమయంలోని రికార్డులన్నీ పరిశీలించేందుకు ఆడిటర్లను నియమించింది. ఆడిటర్లు యోగానందరెడ్డి, రాంబాబు, మాధవి, అన్నపూర్ణ ఐదు రోజుల పాటు రికార్డులన్నీ క్షుణ్ణంగా ఆడిట్ చేశారు. నిధుల దుర్వినియోగంపై ఆడిటర్లను అడిగితే ‘ఆ ఒక్కటి అడక్కండి.. కమిషనర్‌కు నివేదిక అందజేస్తాం’ అని సమాధానమిచ్చారు. నివేదికలో ఏముంది.. పూర్వ ఏడీఏపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. (చదవండి: విద్యార్థి ఆత్యహత్య కేసు: చనిపోవడానికి ముందు వేరే గదికి!) -
హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. హైకోర్టు ఆదేశాలతో నారాయణను ఆయన ఇంట్లో సీఐడీ ప్రశ్నించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలపై అధికారులు విచారణ జరిపారు. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 2014-19 మధ్య ఇన్నర్ రింగ్‌రోడ్డు భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అలైన్మెంట్ మార్చడంతో రామకృష్ణా హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్‌కు లబ్ధి చేకూర్చారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అప్పటి సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే నారాయణ నాటి మున్సిపల్ మినిస్టర్ హోదాలో అలైన్మెంట్ మార్పులు చేసిట్టు గుర్తించారు. ఇప్పటికే నారాయణ బెయిల్‌ను సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. చదవండి: ఈడీ విచారణలో ఎల్ రమణకు తీవ్ర అస్వస్థత -
అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పు కేసు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులో అక్రమాల కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి నారాయణ సహకరించపోతే బెయిల్ రద్దు చేయాలని తమను ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ముందస్తు బెయిల్ తీర్పుతో దర్యాప్తుపై ప్రభావం పడకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. మాస్టర్ ప్లాన్ మార్పు కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ కేసుపై జస్టిస్, గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం విచారణ జరిపింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మౌఖిక ఆదేశాలతో మార్చారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. నారాయణ తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారన్నారు. తీవ్రమైన ఆర్థిక నేర కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. చదవండి: రామోజీరావుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు -
చిట్‌ఫండ్ అక్రమాలు బట్టబయలు
సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ కంపెనీల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, మోసాలు బట్టబయలయ్యాయి. రాష్ట్రంలోని అనేక కంపెనీలు చిట్ల పేరుతో సామాన్యులు చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమైంది. చిట్‌ఫండ్ కంపెనీలపై జిల్లాల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో ఇటీవల రిజిస్ట్రేషన్లశాఖ రాష్ట్రవ్యాప్తంగా పలు కంపెనీల్లో తనిఖీలు చేసింది. జీఎస్టీ, పోలీసు అధికారులను కూడా తనిఖీ బృందాల్లో ఉంచి ఆ కంపెనీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ తనిఖీల్లో పలు కంపెనీల్లో అక్రమాలు, మోసాలు జరిగినట్లు గుర్తించారు. చాలా కంపెనీలు చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బును ఇతర కార్యకలాపాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. పలు కంపెనీలు చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆ డబ్బును వడ్డీలకు తిప్పుతున్నట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్టు స్పష్టమైంది. కొన్ని కంపెనీలు వసూలు చేసిన చిట్స్ డబ్బును తమ అనుబంధ కంపెనీలకు మళ్లించి వ్యాపారం చేసుకుంటున్నట్లు తేలింది. చిట్ల రికార్డులు, ఖాతాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని వెల్లడైంది. చిట్స్ పాడుకున్నవారికి వాటి కాలం తీరిన తర్వాత కూడా చెల్లించని ఘటనలు లెక్కలేనన్ని ఉన్నట్లు తెలిసింది. అనుమతులు లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొన్ని కంపెనీలు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు తేలింది. చిట్లు పాడిన తర్వాత, గ్యారెంటీల ప్రక్రియ ముగిసేలోపు ఆ డబ్బును ప్రత్యేక బ్యాంకు ఖాతాలకు కాకుండా వేరేరకంగా వినియోగించుకున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల ప్రత్యేక ఖాతాల్లో ఉంచిన డబ్బును అదేరోజు వెనక్కి తీసుకున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే తాము నిర్వహిస్తున్న చిట్లపై ప్రభుత్వానికి తప్పుడు ఓచర్లు సమర్పిస్తున్నట్టు తేలింది. నగదు నిర్వహణలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయి. చిట్ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం, ఆ డబ్బుకు సంబంధించి నగదు రశీదులు.. వోచర్లు ఇవ్వకపోవడాన్ని తనిఖీ అధికారులు గుర్తించారు. కొన్ని లావాదేవీలపై నేరుగా ఆదాయపన్ను శాఖ పెనాల్టీ పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. జీఎస్టీ చట్టాన్ని కూడా చిట్‌ఫండ్ కంపెనీలు ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అక్రమాలు జరిగిన కంపెనీలు, వాటి వివరాలను అందులో పొందుపరిచారు. వాటి ఆధారంగా అక్రమాలు జరిగిన కంపెనీలపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. -
మనోజ్ కేసులో కొత్త ట్విస్ట్.. మధ్యవర్తిగా ‘పెద్ద మనిషి’.. బెడిసి కొట్టిన వ్యూహం..
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ అక్రమాల కేసు సరికొత్త మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో ఫిర్యాదుదారులు కూడా సహ నిందితులని తేలింది. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో డబ్బు రాబట్టుకునేందుకు ‘ఫిర్యాదు’ డ్రామాకు తెరలేపారని నిర్ధారించారు. ‘ఫిర్యాదు’ ప్లాన్‌కు రూపకల్పన చేసిన వారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు తెలిసింది. టీడీపీ బడా నేతల అండదండలు కలిగిన అనంతపురానికి చెందిన రాయల్ శ్రీనివాసులు, దండు వెంకటనాయుడు అలియాస్ డీవీ నాయుడు ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్‌తో జతకట్టారు. అతని సహకారంతో నకిలీ ఎన్ఓసీలు సృష్టించడం, డాక్యుమెంట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేయించడం తదితర అక్రమ మార్గాల ద్వారా అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారు. చదవండి: వచ్చే రెండు రోజులు వర్షాలు ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు.. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వేనంబర్ 513లోని భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం రూ.కోట్లు చేతులు మారాయి. చెప్పిన విధంగా ఎన్ఓసీ చేయించకపోవడంతో భూమి యజమాని తానిచ్చిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. మనోజ్ మాత్రం గడువు మీద గడువు కోరుతూ వచ్చాడు. ఇరువైపులా కమీషన్ తీసుకున్న రాయల్ శ్రీనివాసులుకు ఇది ఇబ్బందికరంగా మారింది. ఇరకాటంలో పెట్టయినా సరే మనోజ్ నుంచి డబ్బు రాబట్టాలని డీవీ నాయుడుతో కలసి ప్లాన్ వేశారు. రంగంలోకి ‘పెద్ద మనిషి’.. అనుకున్నదే తడవుగా పోలీసు శాఖకు అనుబంధంగా పనిచేసే ఓ ‘పెద్ద మనిషి’ని రాయల్ శ్రీనివాసులు, డీవీ నాయుడు ఆశ్రయించారు. ఎలాగైనా మనోజ్‌పై ఒత్తిడి పెంచి డబ్బు రాబట్టాలని, మీరు కూడా కావలసినంత దండుకోవచ్చని సలహా ఇచ్చారు. మనోజ్‌ను భయపెట్టడానికి అవసరమైతే అతని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తామని చెప్పారు. దీనికి ‘పెద్ద మనిషి’ సరేనన్నాడు. ఈ పని చేసిపెట్టడానికి ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ను సంప్రదించి.. అనంతపురంలోని పోలీసు అతిథిగృహానికి పిలిపించాడు. మనోజ్‌ను భయపెట్టి, మనకు కావలసినంత డబ్బు రాబట్టుకోవడానికి ఏదైనా మంచి ప్లాన్ ఇవ్వాలని శ్రీనివాసులు, డీవీ నాయుడు కోరారు. ఎన్ఓసీ విషయంలో మనోజ్ మోసం చేశాడని ‘పోలీస్ స్పందన’లో ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. ఆ ఫిర్యాదు నేరుగా తన వద్దకే వస్తుందని, అప్పుడు మన పని సులభమవుతుందంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ పక్కా ప్లాన్ రచించారు. ఇందుకు గాను శ్రీనివాసులు, నాయుడుతో డీల్ కుదుర్చుకున్నారు. వీరికి అనుసంధానకర్తగా ఉన్న ‘పెద్ద మనిషి’కి కూడా రూ.లక్షల్లో ముట్టజెప్పారు. బెడిసి కొట్టిన వ్యూహం.. సీఐ ప్లాన్ మేరకు గత నెలలో రాయల్ శ్రీనివాసులు, డీవీ నాయుడు ‘స్పందన’లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. మనోజ్ తమను మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదును ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్‌గా తీసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ)ను రంగంలోకి దింపారు. మనోజ్‌ను ఎస్ఓజీ తన ఆదీనంలో ఉంచుకుంది. తెలుగు తమ్ముళ్లలో ఒకరైన రాయల్ శ్రీనివాసులును సైతం విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. దీంతో మరొక తెలుగు తమ్ముడు డీవీ నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఊహించని విధంగా వ్యూహం బెడిసికొట్టడంతో సదరు సీఐ కంగుతిన్నారు. నిందితులను ఎస్పీ నేరుగా విచారణ చేస్తే తన బండారం బయటపడుతుందని భయపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నిత్యం నిందితుల వద్దే ఉంటున్నట్లు సమాచారం. -
ఇంటి దొంగలు కాజేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతీ నెలా లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిస్తున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖలో కొందరు ఇంటి దొంగలు ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రూ.కోట్ల సొమ్ము కాజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ కోసం సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) కింద మిల్లర్లు ఇచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ, పౌరసరఫరా శాఖ ప్రధాన గోదాముల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి మండల స్థాయి గోదాం (ఎంఎల్ఎస్) పాయింట్లు, అటు నుంచి రేషన్‌షాపులకు బియ్యం సరఫరా అవుతుంది. ఈ రెండు దశల్లో బియ్యం రవాణాకు కాంట్రాక్టర్లు ఉంటారు. చాలా చోట్ల ప్రభుత్వానికి సొంత గోదాములు లేక అద్దెకు తీసుకుంటోంది. కొన్ని చోట్ల ప్రైవేటు, సహకార శాఖ, గిడ్డంగుల సంస్థ, వ్యవసాయ మార్కెట్, జీసీసీ గోదాములను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 170 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, రేషన్ షాపులకు 2.95 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. మొదట ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోలు చొప్పున బియ్యం ఇవ్వగా, కరోనా తర్వాత లబ్ధిదారులకు పది కిలోల చొప్పున ఇవ్వడంతో ఆ కోటా పెరిగింది. ఈ నేపథ్యంలో స్టాక్ పెరగడం, ఉచిత బియ్యం కావడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలు పెరిగాయి. ఆన్లైన్, తనిఖీలు ఉన్నా.. ప్రతీ ఎంఎల్ఎస్ పాయింట్లలో నెల నెలా బియ్యం నిల్వలపై ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. జిల్లాల్లో స్థానిక అదనపు కలెక్టర్ (రెవెన్యూ), పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆర్డీవో, ఎమ్మార్వో లు ఈ పాయింట్లను తనిఖీలు చేయాలి. కానీ ఇది చాలా చోట్ల జరగడం లేదు. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు మాత్రం తేడాలు బయటపడుతున్నాయి. చాలా చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు నేరుగా కొంతమంది రేషన్ డీలర్లు, రైస్‌మిల్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి నుంచి బియ్యం పక్క దారి పట్టిస్తున్నారు. మిల్లులకు రీ సైక్లింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు ఉన్నతాధికారుల అండదండలతోనే హమాలీ, రవాణా చార్జిలు, గన్నీ సంచుల్లోనూ అవకతకవలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్లలోనే బఫర్ స్టాక్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లు నుంచి బియ్యం రాకున్నా వచ్చినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఆసిఫాబాద్‌లో రూ.3 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో ఉన్నతాధికారుల నుంచి సైతం పరోక్షంగా సహాయ, సహకారాలు అందుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. మరోవైపు నెలా వారీ కోటా బియ్యంలో క్వింటా, అరక్వింటా తక్కువగా వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం సాహసం చేయడం లేదు. ఇలా అక్రమంగా దారిమళ్లించిన బియ్యాన్ని తమకు నమ్మకం ఉన్న డీలర్లకు కోటాకన్నా ఎక్కువగా పంపిస్తూ.. వారి ద్వారా బయట అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గుర్తించిన అక్రమాలు.. ►ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 8,339 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. గత కొంతకాలంగా గోదాంకు బియ్యం రాకున్నా వచ్చినట్లు నమోదు చేస్తూ భారీగా అవకతకలకు పాల్పడ్డారు. వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. అక్కడి ఇన్చార్జి, డీఎస్వో సైతం సస్పెండ్ అయ్యారు. ఇంకా విచారణ జరుగుతోంది. ►మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఎంఎల్ఎస్ పాయింట్లో 218.25 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వచ్చింది. గోదాం ఇన్చార్జిపై విచారణ జరుగుతోంది. ►మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్లో 650 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. దీంతో ఇన్చార్జిని సస్పెండ్ చేసి, బియ్యాన్ని రికవరీ చేశారు. -
ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్’పై దర్యాప్తు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా తనకు నివేదిక అందజేయాలని చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత్ విద్యుత్ పథకంలో అక్రమాలు జరిగాయని, ఇందులో లోపాలున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌కు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించాయి. ఈ పథకం వెనుక భారీ కుంభకోణం ఉందంటూ న్యాయవాద వర్గాల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నాయి. ఉచిత విద్యుత్‌ను అడ్డుకొనే కుట్ర: కేజ్రీవాల్ తాము ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం పట్ల గుజరాత్ ప్రజలు ఆకర్శితులు అవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అందుకే ఢిల్లీలో ఉచిత్ విద్యుత్‌కు అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గుజరాత్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరిట ప్రజల రక్తం పీల్చేస్తోందని, వారికి కొంత ఊరటనివ్వాలని తాము సంకల్పిస్తే బీజేపీ సహించలేకపోతోందని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయాన్ని అడ్డుకోవడానికి కేంద్ర సర్కారు కుతంత్రాలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. ఢిల్లీలో ఉచిత విద్యుత్ పథకంపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. -
విచారణ విధులకు డుమ్మా.. ఎందుకు చెప్మా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొత్తూరు పౌర సరఫరాల గోదాంలో జరిగిన అక్రమాలను ఆ శాఖ సీరియస్‌గా తీసుకుంది. రూ.కోటికిపైగా సరుకులు పక్కదారి పట్టిన వైనంపై ఉన్నత స్థాయి విచారణకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ మూడు నెలలుగా పర్యవేక్షణ లేదు. ఎవరూ భౌతిక తనిఖీలు చేపట్టిన దాఖలా కనిపించలేదు. దీంతో సరుకులు పక్కదారి పట్టాయి. ఈ మొత్తం వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రంగంలోకి దిగింది. ఈ గుట్టు రట్టు చేసేందుకు నెల్లూరులో పనిచేస్తున్న విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన ఈ నెల 20న జిల్లాకు రానున్నారు. సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్ రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని ఇప్పటికే ఆదేశించారు. చదవండి: కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా నిబంధనలు ఇవీ.. ♦రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు, వసతి గృహాల కోసం పౌరసరఫరాల సంస్థకు చెందిన ప్రైవేటు గోడౌన్లో సరుకులు ఉంచుతారు. ♦ప్రతి నెలా మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. వచ్చిన నిల్వలు, సంబంధిత సరఫరా ఏజెన్సీలకు వెళ్లిన సరుకులు, ఇంకా మిగిలి ఉన్న నిల్వలపై ప్రతి నెలా చివర భౌతిక తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ♦తనిఖీలో గుర్తించిన విషయాలపై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌కు నివేదిక అందించాలి. ♦ఆ నివేదిక సవ్యంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. వెలుగులోకి ఆసక్తికర విషయాలు.. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్‌ను ఏప్రిల్ నెలలో తనిఖీ చేసేందుకు ఏఎస్ఓ వంశీని నియమించారు. అయితే ఆయనకు ట్రాన్స్ఫర్ కావడంతో తనిఖీలు చేయలేదు. మే నెలలో తనిఖీ చేసేందుకు ఏఎం అకౌంట్స్ జ్యోతిని నియమించారు. ఆమె కూడా అనారోగ్యం కారణం చూపి తనిఖీలకు వెళ్లలేదు. జూన్‌లో తనిఖీ చేసేందుకు ఏప్రిల్‌లో నియమించిన ఏఎస్ఓ వంశీనే మళ్లీ నియమించారు. బదిలీ కారణంతో ఆ నెలలో కూడా తనిఖీలకు వెళ్లలేదు. ఈయన మొదటిసారి తనిఖీ చేయకపోయినా రెండోసారి మళ్లీ ఆయననే తనిఖీ చేయాలని ఆదేశించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తనిఖీ చేయకుండా సాకులు చెప్పడం వెనుక కారణాలేంటి..? అన్న అనుమానాలూ బలపడుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలా చేసిన తనిఖీలకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదిక వచ్చిందా? లేదా? అన్నది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డీఎం కార్యాలయం చూసుకోవాలి. దీన్ని బట్టి ఏ నెల ఏం జరిగిందో ఒక అవగాహనకు వస్తారు. కానీ, ఇక్కడ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తనిఖీలు జరిగాయో లేదో, ఫిజికల్ విజిట్ నివేదికలొచ్చాయో లేదా అన్నది ఏ ఒక్కరూ గుర్తించలేదు. జూలై నెల వస్తే గానీ ఈ విషయం బయటపడలేదు. ఈలోపే అక్రమాలు జరిగిపోయాయి. అయితే ఇదంతా పథకం ప్రకారం జరిగిందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. రామ్మోహన్‌పై చర్యలు.. భారీగా సరుకులు మాయమైన ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి, గ్రేడ్ 3 టెక్నికల్ అసిస్టెంట్ ఈ.రామ్మోహనరావును ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు అక్కడ పనిచేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డును కూడా విధుల నుంచి తొలగించారు. సరుకుల మాయంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. దానితో పాటు సస్పెండైన రామ్మోహన్‌రావుపై చార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఏడు రోజుల సమయం ఇచ్చారు. ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తదుపరి ఏం చేయాలన్నదానిపై సివిల్ సప్లై అధికారులు ఆలోచిస్తున్నారు. కుమ్మక్కయిందెవరు.. సరుకులు మాయమైన తర్వాత విచారణ చేస్తున్న కొద్దీ చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిగా ఉన్న రామ్మోహన్ ఆ గోడౌన్ తాళం వాచ్‌మెన్‌కు ఇచ్చేసి రెగ్యులర్‌గా విధులకు హాజరు కాలేదని తెలిసింది. వాచ్‌మెన్‌పైనే ఆ పాయింట్ ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో 198.706 మెట్రిక్ టన్నుల బరువైన 3,982 బస్తాలు(50 కిలోలవి) బియ్యం, 176 బస్తాలు (50 కిలోలు) పంచదార, 148 పామాయిల్ ప్యాకెట్లు, 420బస్తాల(50కిలోలవి) కందిపప్పు మాయమయ్యాయి. దీంతో ఎవరెవరు కుమ్మక్కయ్యారు? దీంట్లో ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి, వాచ్‌మెన్‌తో పాటు ఇంకెవరు ఉన్నారనే దానిపై ఆరా తీయాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందంటే ఈ ఇద్దరే కాదు మరికొంతమంది ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 20న జిల్లాకు ప్రత్యేక అధికారి.. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారిని ఉన్నతాధికారులు నియమించారు. ఈ నెల 20న జిల్లాకు వస్తున్నారు. రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని సమాచారం ఇచ్చారు. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌చార్జీగా పనిచేసిన రామ్మోహన్‌రావును సస్పెండ్ చేయడమే కాకుండా చార్జెస్ కూడా ఫ్రేమ్ చేశాం. దానిపై వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. – బి.జయంతి, డిస్ట్రిక్ట్ మేనేజర్, జిల్లా పౌరసరఫరా సంస్థ -
డోలో ట్యాబ్లెట్ అమ్మకంలో అక్రమమార్గాలు అనుసరించిన తయారీదారు
-
కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు వారి ‘వ్యాపార రహస్యం’ బట్టబయలైంది. ఏళ్లుగా సాగుతున్న గ్రానైట్ బాగోతం వెలుగుచూసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు గ్రానైట్ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. కలర్ గ్రానైట్‌ను అక్రమ తరలించడమే కాకుండా అడ్డగోలుగా విక్రయాలు జరిపారు. ఈ మొత్తం వ్యవహారం గనుల శాఖ , విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసింది. దీనిపై పక్కా ఆధారాలతో అధికారులు కోట»ొమ్మాళి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చదవండి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు కోటబొమ్మాళి మండలం పెద్ద బమ్మిడి గ్రామంలో సర్వే నంబర్ 106/1,104/9లో టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాదరావు కుమారుడు సురేష్‌కుమార్ పేరున శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. 2018 ఏప్రిల్ 23 నుంచి 2038 ఏప్రిల్ 22వ తేదీ వరకు దాదాపు 20 ఏళ్ల పాటు మినరల్ డీలర్ లైసెన్స్ తీసుకున్నారు. దీంట్లో నాథూరాం చౌదరి, పొన్నాం దాలినాయుడు, పొన్నాం భాస్కరరావు, రావాడ మోహనరావు భాగస్వాములుగా ఉన్నారు. జిల్లాలో అనేక కలర్ గ్రానైట్ క్వారీల నుంచి గ్రానైట్ బ్లాక్‌లను అధికారికంగా అనుమతి తీసుకుని తమ ఇండస్ట్రీకి రవాణా చేసుకోవాల్సి ఉంది. కానీ, అచ్చెన్న కుటుంబీకులకు చెందిన ఈ ఇండస్ట్రీలో అందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. మే 8న వచ్చిన సమాచారం మేరకు కంచిలి మండలం భైరీపురం గ్రామంలోని రానా గ్రానైట్ అండ్ మినరల్ క్వారీ నుంచి గ్రానైట్ బ్లాక్‌లను తరలిస్తున్న వాహనాన్ని(ఏపీ30టీఎ 1089) గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి గడువు దాటిన పరి్మట్‌తో అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తించారు. మే 8వ తేదీ మ«ధ్యాహ్నం 3.11గంటల వరకే ఉన్న పర్మిట్‌ను ఆధారంగా చేసుకుని ఆ తర్వాత గ్రానైట్ బ్లాక్‌ల తరలింపు చేసినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది స్టేట్మెంట్ తీసుకుని వాహనం సీజ్ చేశారు. ఈ సందర్భంలో తమ యాజమాన్యం చెప్పినట్టుగా వాహనం బ్రేక్ డౌన్ అయిన కారణంగా ఆలస్యమైందని, దానివల్ల గడువు సమయం దాటి రవాణా చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ జరిపారు. పలాస దగ్గర ఉన్న టోల్ ప్లాజాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా పట్టుకున్న ఏపీ 30టీఎ 1089వాహనం నిర్దేశిత ట్రాన్సిట్ గడువు సమయంలో మూడు సార్లు లోడింగ్, అన్‌లోడింగ్‌తో అటు ఇటు వెళ్లినట్టు రికార్డైంది. దీంతో ఒక ట్రాన్సిట్ ఫారంతో రెండు మూడు సార్లు గ్రానైట్ బ్లాక్‌ల అక్ర మ తరలింపు జరిగినట్టు అభిప్రాయానికొచ్చారు. దీని వెనుక గుట్టు తేల్చేందుకు ఈ గ్రానైట్ బ్లాక్‌లు రవాణా జరిగిన అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీని, అటు కంచిలిలో ఉన్న గ్రానైట్ క్వారీని పరిశీలించి, విచారణ జరిపారు. దీంతో దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీ బాగోతం బయటపడింది. అ«ధికారుల విచారణను దృష్టిలో ఉంచుకుని అప్పటికప్పుడు గ్రానైట్ బ్లాక్‌ల నంబర్లు దిద్దుబాటు చేయడం, నంబర్ల టాంపరింగ్‌కు పాల్పడటం వంటివి చేశారు. అంతేకాకుండా ఒకే నంబర్‌తో ఉన్న వివిధ గ్రానైట్ బ్లాక్‌లను గుర్తించారు. అలాగే, ఆన్లైన్లో ఉన్నదానికి, భౌతికంగా ఉన్న బ్లాక్‌ల నిల్వల తేడాను సైతం పట్టుకున్నారు. 172.87 క్యూబిక్ మీటర్ల బరువైన 23 బ్లాక్‌లకు సంబంధించి తేడాలు ఉన్నాయి. ఇవన్నీ గ్రానైట్ క్వారీల నుంచి అక్రమంగా తరలించినట్టుగా తేల్చారు. దీని విలువ అపరాధ రుసుంతో కలిపి రూ.6కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం. దానిని అచ్చెన్న ఫ్యామిలీ వ్యూహాత్మకంగా గండి కొట్టి దోచుకుంది. కేసు నమోదు అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీలో ప్రభుత్వ ప్రాపర్టీ దొంగతనం, టాంపరింగ్, డూప్లికేషన్, ఉన్న స్థితిని మార్చడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాదరావు కుమారుడు సురేష్‌కుమార్, భాగస్వాములైన నాథూరాం చౌదరి, పొన్నాం దాలినాయుడు, పొన్నాం భాస్కరరావు, రావాడ మోహనరావుపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో శ్రీకాకుళం గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో 379, 420, 477–ఎ, 406, 120బి, 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. -
రెవెన్యూలో క్రమశిక్షణ కొరడా
సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖలో అక్రమార్కులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. విచారణలో తప్పు చేసినట్లు తేలితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది తహసీల్దార్లపై ఈ తరహా చర్యలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఇద్దరు తహసీల్దార్లను ఏకంగా సర్వీసు నుంచి తొలగించారు. ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా రివర్షన్ ఇచ్చారు. మరొకరికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇవ్వగా ఇంకో ముగ్గురికి ఇక్రిమెంట్లలో కోత విధించారు. భూముల వ్యవహారాల్లో అక్రమాలు చేస్తే.. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల తహసీల్దార్ సీహెచ్ శ్రీదేవికి నాలుగు రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్‌గా రివర్షన్ ఇచ్చారు. 2017లో ఆమె పెద్దపంజాణి మండల తహసీల్దార్‌గా ఉన్నప్పుడు ముత్తుకూరు గ్రామంలో 350 ఎకరాల అటవీ శాఖ భూమిలో ప్రైవేటు వ్యక్తులకు పట్టాలిచ్చారు. అక్కడి నుంచి బదిలీ అయ్యి రిలీవైన తర్వాత రోజు వెబ్ ల్యాండ్‌లో ఈ మార్పులు చేయించినట్లు తేలింది. ఆమెకు సహకరించిన పెద్దపంజాణి వీఆర్వో డి.శ్రీనివాసులను సైతం పూర్తిగా విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె తహసీల్దార్ ఈశ్వరయ్య అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సర్వీసు నుంచి తొలగించారు. 2017లో ఆయన అట్లూరు మండల తహసీల్దార్‌గా ఉన్నప్పుడు వందల ఎకరాల భూముల రికార్డులను తారుమారు చేసినట్లు రుజువైంది. ఒక వీఆర్వో భార్య పేరు మీద కోట్ల రూపాయల విలువైన భూముల్ని మార్చినట్లు విచారణలో తేలడంతో విదుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ తహసీల్దార్ డి.చంద్రశేఖర్‌ను శాశ్వతంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకి రివర్షన్ చేశారు. అనంతపురం జిల్లా పుట్లూరు తహసీల్దార్ పి.విజయకుమారి, అదే జిల్లాకు చెందిన మరో తహసీల్దార్ పీవీ రమణకు రివర్షన్ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన తహసీల్దార్ డీవీబీ వరకుమార్‌కు సీనియర్ అసిస్టెంట్‌గా రివర్షన్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తహసీల్దార్లు టి.రామకృష్ణ, కె.శ్రీని వాసరావు, ఏలూరు జిల్లాకు చెందిన తహసీల్దార్ పి రాకడమణికి ఇంక్రిమెంట్లలో కోత పెట్టారు. చితూ ్తరు జిల్లాకు చెందిన మరో తహసీల్దార్ నరసింహులకు కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాల్లో ఒక డిప్యూటీ సర్వేయర్, మరో టైపిస్ట్పైనా చర్యలు తీసుకున్నారు. గతంలోలాగా కాకుండా.. గతంలో అక్రమాలు బయట పడితే సస్పెండ్ చేసి వదిలేసేవారు. దీంతో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుని ఏమీ జరగనట్లు పనిచేసేవారు. ఆ అక్రమాలపై తదుపరి విచారణ ఏళ్ల తరబడి కొనసాగేది. చివరికి వాటి నుంచి ఎలాగోలా బయటపడి క్లీన్చిట్ తెచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అక్రమాలు నిజమని తేలితే ఊహించని విధంగా చర్య తీసుకుంటుండటంతో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు వణికిపోతున్నారు. రివర్షన్ అనే పదం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో గుబులు రేపుతోంది. పెండింగ్‌లో ఉన్న వి చారణలు త్వరితగతిన పూర్తి చేసేలా తమ శాఖ వి జిలెన్స్ విభాగాన్ని సీసీఎల్ఏ సాయిప్రసాద్ పరుగులు పెట్టిస్తున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తాజా ఘటనలతో అక్రమాలు అంటేనే ఉలిక్కిపడుతున్నారు. -
SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు
జిల్లాలో టీడీపీ హయాంలో నీరు–చెట్టు పథకాన్ని తమ్ముళ్లు జేబులు నింపుకునే పథకంగా మార్చుకున్నారు. ఆ పనుల్లో నాణ్యత లేకపోవడంతో అప్పట్లోనే రూపురేఖలు లేకుండా పోయాయి. ఆ పనులపై జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో చాలా వాటికి అధికారులు బిల్లులు నిలిపివేశారు. గత ప్రభుత్వ చివరి కాలంలో చేసిన పనులకు అప్పటి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడు ఆయా బిల్లులు చెల్లించాలంటూ తెలుగు తమ్ముళ్లు హైకోర్టును ఆశ్రయించడంతో జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆయా పనులకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. సాక్షి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ పాలనలో నీరు–చెట్టు పథకం కింద రూ.వందల కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో ఒక్కటీ ప్రయోజనకరంగా లేకుండా పోయాయి. తెలుగు తమ్ముళ్లకు దోచి పెట్టడానికే ఈ పథకాన్ని అప్పటి ప్రభుత్వం అమలు చేసిందనేది జగద్వితం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కోవూరు మాజీ ఎమ్మెల్యేలు, మిగతా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అందిన కాడికి జేబులు నింపుకున్నారనే ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. టీడీపీ ఐదేళ్ల కాలంలో జిల్లాకు 13,780 నీరు–చెట్టు పనులు మంజారయ్యాయి. ఆయా పనులకు రూ.711 కోట్లు నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు, ద్వితీయ శ్రేణి నేతలకు నీరు–చెట్టు పనులను పందేరం చేసి వాటాలు పంచుకున్నారు. ఎన్నికల చివరి ఏడాదిలో కూడా దాదాపు రూ.200 కోట్ల మేర పనులు హడావుడిగా తూతూ మంత్రంగా చేపట్టి నిధులు ఆరగించేందుకు పథకం వేసి విఫలమయ్యారు. అప్పట్లో టీడీపీ నేతలు, జలవనరుల శాఖ అధికారులు సైతం నీరు–చెట్టు అవినీతిలో భాగస్వామ్యులై నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. దాదాపు రూ.300 కోట్ల వరకు దోపిడీ జరిగిందనే ఆరోపణలున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో బిల్లులు నిలిచిపోయాయి. నీరు–చెట్టు పథకం అంతా పచ్చ నేతల ఫలహారంగానే మారినట్లుగా గతంలో విజిలెన్స్ పరిశీలనలో నిగ్గు తేలింది. అవి‘నీటి’ చెక్‌డ్యామ్‌లు గత ప్రభుత్వ హయాంలో 751 చెక్‌డ్యాంలను నిర్మించారు. ఇందులో కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోనే 80 శాతానికి పైగా చెక్‌డ్యాంల నిర్మాణాలు జరిగాయి. ఒక్క ఉదయగిరి నియోజకవర్గలోనే 400 చెక్ డ్యాంలు నిర్మించి రూ.40 కోట్లు పైగా బిల్లులు డ్రా చేసుకున్నారు. ఇందులో రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అవసరం లేని ప్రాంతాల్లో కూడా చెక్‌డ్యాంలు నిర్మించి ప్రజాధనం వృథా చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఉదయగిరి నియోజకవర్గంలో నాగపూర్ టెక్నాలజీ పేరుతో అప్పటి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు స్వయంగా కాంట్రాక్ట్ దక్కించుకుని, కార్యకర్తలకు సబ్ కాంట్రాక్ట్‌గా అప్పగించారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని బొల్లినేని, ఆయన అనుచరులు ఫైబర్ చెక్‌డ్యాముల ముసుగులో భారీ దోపిడీ చేసిన వైనం విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. నియోజకవర్గంలో 24 ప్యాకేజీలుగా 210 ఫైబర్ చెక్ డ్యామ్‌లకు దాదాపు రూ.72 కోట్లు నిధులు మంజూరు చేయించి తన అస్మదీయులుకు కమీషన్ల రూపంలో పందేరం చేశారు. ఆయా టెండర్లను తన సూట్‌కేసు కంపెనీలైన సిగ్మా, శ్రీనివాస కంపెనీల పేరుతో టెండర్లు వేయించి పనులు దక్కించుకున్నారు. చెక్‌డ్యామ్ నిర్మాణాల్లో నాణ్యత లేకుండా మమ అనిపించి నిధులు ఆరగించినట్లు గత తనిఖీల్లో తేల్చారు. నీరు–చెట్టు పనులు అన్ని కూడా పూడికతీత, కుంటలు తీయడం, ఊట కంటలు, చెక్‌డ్యామ్‌లు అయా పనుల్లో చాలా వరకు అక్రమాలు జరిగాయి. కొన్ని చోట్ల పనులు చేయకుండానే బిల్లులు చేసుకొని తెలుగు నేతలు స్వాహా చేసిన ఘటనలు ఉన్నాయి. హైకోర్టును ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు జిల్లాలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో సంబంధిత జలవనరుల శాఖ అధికారులు సైతం చివరి దశలో బిల్లుల చెల్లింపును పెండింగ్ పెట్టారు. దాదాపు 3,308 పనులకు సంబంధించి ఎంబుక్స్ నమోదు చేయలేదు. ఆయా పనులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఆధారాలు కూడా లేకపోవడంతో అధికారులు మిన్నకుండిపోయారు. అయితే 501 పనులకు సంబంధించి బిల్లులు ఇప్పించాలని వర్క్ ఆర్డర్ దక్కించుకున్న టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 206 పనులను ఇంజినీరింగ్ బృందాలు తనిఖీలు చేశాయి. మిగిలిన 295 పనులను తనిఖీలు చేయాల్సి ఉంది. సీతారామపురం మండలంలో నిర్మించిన నాసిరకం చెక్‌డ్యామ్ (ఫైల్) తనిఖీలకు 43 బృందాలు జిల్లాలో నీరు–చెట్టు పనులను పరిశీలించి నివేదికలు అందించాలని 43 ప్రత్యేక బృందాలను కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ బిల్లులు చెల్లింపునకు సంబంధించి కొందరు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితిపై పలు ఇంజినీరింగ్ శాఖల అధికారులతో బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ చక్రధర్‌బాబు ఆదేశాలిచ్చారు. ఉదయగిరి ప్రాంతంలో నాసిరకంగా నిర్మించిన చెక్‌డ్యామ్ (ఫైల్ ) ఫైబర్ చెక్డ్యామ్లోనూ అంతే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అప్పటి ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నయా టెక్నాలజీ పేరుతో ఫైబర్ చెక్‌డ్యాంలకు నిధులు మంజూరు చేయించుకున్నారు. మహారాష్ట్ర టెక్నాలజీ అంటూ గొప్పగా ప్రచారం చేసుకొని నీటి సామర్థ్యాన్ని తట్టుకునే ఇనుప గేట్లకు బదులుగా ఫైబర్ గేట్లు వినియోగించారు. అయితే ఈ ఫైబర్ గేట్లు ఏడాది తిరగక ముందే చిన్నపాటి వర్షాలకు కొట్టుకుపోయాయి. నియోజకవర్గంలో రూ.68 కోట్లతో 201 ఫైబర్ చెక్‌డ్యాంలు నిర్మించి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. ఈ నియోజకవర్గంలోనే సుమారు 30 మందికి పైగా నేతలు లబ్ధిపొందారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. వీటి నిర్మాణాలపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించి పనుల్లో డొల్లతనంపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ పనులు చేసిన వారంతా అధికార పార్టీ వారు కావడం.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో ఈ నివేదికలు బుట్ట దాఖలయ్యాయి. ‘నిరు’పయోగం ►ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని ఎర్ర‡వాగుపై రూ.90 లక్షలతో నిర్మించిన చెక్‌డ్యాంలో ఫైబర్ గేట్లలో నాణ్యత లోపించడంతో నీరంతా లీకేజీతో బయటకు వెళ్లిపోయింది. రూ.లక్షలు ఖర్చు చేసినా ఉపయోగం లేకుండాపోయింది. ►2016–17లో వరికుంటపాడు మండలం నారసింహాపురంలో రూ.60 లక్షలతో నిర్మించిన ఫైబర్ చెక్‌డ్యాం కొద్దిపాటి వర్షానికే గేట్లు కొట్టుకుపోయింది. దీంతో ఈ పనుల కోసం కేటాయించిన నిధులున్నీ దుర్వినియోగం అయినట్లయింది. ►వింజమూరు మండలం రాగిపాడు పంచాయతీ పరిధిలో అవసరం లేకపోయినా రూ.40 లక్షలు వెచ్చించి ఓ చిన్న కాలువకు ఫైబర్ చెక్‌డ్యాం నిర్మించారు. పనులు చేసిన కొద్ది రోజులకే నాణ్యత లోపించి ప్రధాన కట్టడం నెర్రెలు బారి నాణ్యతా లోపం స్పష్టంగా కనిపించింది. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే. ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన 80 శాతం చెక్, ఫైబర్ డ్యామ్‌లు కేవలం ఐదారేళ్లల్లోనే కనుమరుగు అయ్యాయి. త్వరితగతిన తనిఖీలు పూర్తి చేస్తాం జిల్లాలో గతంలో జరిగిన నీరు– చెట్టు పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆయా పనులకు సంబంధించి వాస్తవ పరిస్థితిపై పూర్తిస్థాయిలో త్వరితగతిన తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులతో 43 బృందాలను ఏర్పాటు చేశాం. 3,308 పనులకు సంబంధించి పనులను పరిశీలించాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పనులు పరిశీలన పూర్తి చేశారు. పనుల నిగ్గు తేల్చి హైకోర్టుకు నివేదిస్తాం. కోర్టు ఆదేశాలు మేరకు చర్యలు చేపడతాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, కలెక్టర్ -
దర్యాప్తుపై ‘ముద్ర’కు సీఐడీ వెనకడుగు!
సాక్షి, హైదరాబాద్: కుంభకోణాల్లోనే ఈ సొసైటీది ప్రత్యేక ‘ముద్ర’. ఏకంగా తన ఉద్యోగులందరికీ టోకరా వేసింది. పెద్ద ఎత్తున రైతులకు కుచ్చుటోపి పెట్టింది. వీరి వద్ద నుంచి సుమారు రూ.200 కోట్ల మేర స్వాహా చేసింది. అయితే ఈ సొసైటీ అక్రమాలపై దర్యాప్తునకు సీఐడీ వెనుకడుగు వేయడం గమనార్హం. అదే ‘ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’. నల్లగొండ, రామాయంపేట, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సొసైటీపై కేసులు నమోదయ్యాయి. ఇదీ కుంభకోణం కథ... తిప్పినేని రామదాసప్పనాయుడు అనే వ్యక్తి చైర్మన్‌గా ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇది ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీం కింద ఏర్పాటు చేసిన సంస్థగా అందరినీ నమ్మించాడు. హైదరాబాద్‌లోని నల్లకుంటలో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేశాడు. అగ్రికల్చర్ సొసైటీ పేరుతో ప్రతి జిల్లాల్లో రైతుల నుంచి రూ.50 వేల చొప్పున డిపాజిట్లు వసూలు చేశాడు. మండలాలు, డివిజన్లలో సొసైటీ కార్యాలయాలను ఏర్పాటు చేసి మేనేజర్, క్యాషియర్ లాంటి ఉద్యోగులను నియమిం చాడు. రెండేళ్ల తర్వాత సొసైటీ పూర్తిస్థాయిలో బ్యాంకుగా మారుతుందని చెప్పి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్ష వసూలు చేసి ఒరిజినల్ సర్టిఫికెట్లను తన వద్ద సెక్యూరిటీగా పెట్టించుకున్నాడు. నెలకు రూ.20 వేల జీతం చెల్లిస్తానని చెప్పి రూ.4 వేలు, రూ.8 వేల చొప్పున చెల్లిస్తూ వచ్చాడు. అయితే మూడు నెలల్లోనే రామదాసప్పనాయుడు నుంచి ఉద్యోగులకు వేధింపులు మొదలయ్యాయి. డిపాజిట్ల రూపంలో మరింత ఎక్కువ సొమ్ము వసూలు చేయాలని హుకుం జారీచేశాడు. దీంతో ఉద్యోగులు ఒత్తిడికిలోనై రాజీనామాలు సమర్పించగా క్రిమినల్ కేసులు పెట్టిస్తానని, అసాంఘిక శక్తులతో సంబంధాలున్నాయని వేధించాడు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని కోరగా ప్రతి ఉద్యోగి 10 లక్షలు కట్టాలని బెదిరించాడు. దీనితో బాధిత ఉద్యోగులంతా పోలీసులను ఆశ్రయించారు. రూ.200 కోట్లకుపైగా వసూలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాల పేరుతో 1,780 మంది నుంచి రూ.లక్ష నుంచి ఆపై మొత్తం లో వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. రైతులకు రుణాలు, ఇతర వ్యవసాయ సంబంధిత స్కీంల పేరుతో భారీగానే వసూలు చేసినట్టు ఆ ఉద్యోగులు వెల్లడించారు. ఇలా మొత్తంగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వసూలు చేసి ఉంటాడని పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డబ్బుతో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. వాటిని స్వాధీనం చేసుకుంటేగానీ బాధితులకు న్యాయం చేయలేమని పోలీసులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సీఐడీకి బదిలీ చేసి విచారణ పక్కాగా జరిగేలా చూడాలని దర్యాప్తు అధికారులైన పలువురు సీఐలు, ఎస్ఐలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఎస్పీలు, కమిషనర్లు సీఐడీకి లేఖలు రాసినా పట్టించుకోవడంలేదు. స్కామ్ సొమ్ముతో కొనుగోలు చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలంటే హైదరాబాద్ సీసీఎస్‌తోపాటు సీఐడీకి మాత్రమే అధికారాలున్నాయి. -
ఈపీఎఫ్ ఖాతాల్లో అక్రమాలపై సీబీఐ కేసు
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాల్లో అక్రమాలకు పాల్పడిన గుంటూరులోని ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలోని పలువురు అధికారులపై సీబీఐ బుధవారం కేసులు నమోదు చేసింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చీరాల, గుంటుపల్లి తదితర చోట్ల ఈపీఎఫ్ అధికారులకు చెందిన 40 నివాసాలు, ఇతర ప్రదేశాలపై సీబీఐ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈపీఎఫ్ అధికారులు కొందరు ప్రైవేటు కన్సల్టెన్సీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ గుర్తించింది. ఈపీఎఫ్ క్లెయిములు, సేవలు, ఉద్యోగులకు బకాయిల చెల్లింపు వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. అందుకోసం గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే మొదలైన మొబైల్ వాలెట్ల ద్వారా భారీగా లంచాలు తీసుకున్నట్టు కూడా ఆధారాలు సేకరించింది. అక్రమాలకు పాల్పడిన ఈపీఎఫ్ అధికారులపై 4 కేసులు నమోదు చేసినట్టు సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. -
బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు
గయ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్ లో ఆందోళనలు మూడవ రోజు కూడా కొనసాగాయి. బుధవారం గయ నగరంలో ఉద్యోగార్థులు రైలుకు నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని గయ ఎస్ఎస్పీ ఆదిత్యకుమార్ చెప్పారు. నిరసనకారులు నిప్పటించిన కోచ్ యార్డ్ లో ఖాళీగా నిలిపి ఉందని, అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్ తెలిపారు. బీహార్ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలపై రైలు రోకో చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. నిరసనల కారణంగా అధికారులు కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపారు. ఆర్‌ఆర్‌బిఎన్‌టిపిసి(నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)లో ఉత్తీర్ణత సాధించిన వారికి మళ్లీ పరీక్షను నిర్వహించాలన్న రైల్వే నిర్ణయాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. లెవల్ 2 నుండి లెవల్ 6 వరకు 35,000 పోస్ట్‌లకు పైగా ప్రకటనలు చేసిన పరీక్షలకు దాదాపు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టిపిసి, లెవల్ 1 పరీక్షలను నిలిపివేత హింసాత్మక నిరసనల నేపథ్యంలో రైల్వే తన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (ఎన్టిపిసి), లెవల్ 1 పరీక్షలను నిలిపివేసింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (ఆర్ఆర్బి) కింద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, ఫెయిల్ అయిన వారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేయనుంది. అభ్యర్థులు తమ సమస్యలు మరియు సూచనలను సంబంధిత వెబ్సైట్లో కమిటీకి తెలియజేయవచ్చని రైల్వే తెలిపింది. అభ్యంతరాలను తెలపడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కమిటీ మార్చి 4లోపు రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తుంది. నిరసనల సమయంలో విధ్వంసానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్ చేయకుండా నిషేధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక సాధారణ నోటీసును జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వద్దు్ద అభ్యర్థులెవ్వరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రిక్రూట్మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేంద్రం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, తమ ఫిర్యాదులను అధికారికంగా ఉన్నత కమిటీకి అందించాలని సూచించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలుంటాయని తెలిపారు. అణచివేత ధోరణి సరికాదు అభ్యర్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణి సరికాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ’సత్యాగ్రహ’ మార్గంలో చాలా శక్తి ఉందని, ఆందోళనలు శాంతియుత మార్గంలో చేయాలని ఉద్యోగార్థులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
ప్రజారోగ్య సంచాలకుడి అక్రమాలపై విచారణకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు అక్రమాలపై విచారణ జరపాలని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన అక్రమాలపై ఇప్పటికే లోకాయుక్తను ఆశ్రయించా నని, మార్చి 9న హాజరు కావాలని లోకాయుక్త సమన్లు జారీ చేసిందని తెలిపారు. మందుల కొనుగోలులో అక్రమాలు, కోవిడ్–19 మరణా ల సమాచారంలో తప్పుడు లెక్కలు, వైద్యుల బదిలీలు, పదోన్నతుల్లో అవక తవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు. -
Polavaram Project: బయటపడుతున్న చంద్రబాబు అక్రమాలు
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బాబు ప్రభుత్వం, ఆ కంపెనీ కలిసి సుమారు నలభై కోట్లు ఎగ్గొట్టింది. కూరగాయల సప్లయర్ నుంచి అనేక పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. చదవండి: రామోజీ మార్కు ‘వైఫల్యం’ తమకు రావాల్సిన బకాయిలేవని వారు ప్రశ్నిస్తే బలవంతంగా సెటిల్మెంట్ చేసి అప్పటి మంత్రి దేవినేని ఉమా సగానికి సగం కోసేశారు. అలా సెటిల్మెంట్ చేసిన ఎమౌంట్ కూడా ఇప్పటి వరకూ వారికి చేరనేలేదు. ఇప్పుడు వాళ్లంతా ట్రాన్స్ట్రాయ్ చేసిన నిర్వాకం, ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు చేసిన సెటిల్మెంట్లను ఏకరువు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం పెద్ద మనసుతో తమకు రావాల్సిన సొమ్ము ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు. -
టెలికాం లెక్కల్లో గోల్మాల్..రూ.890కోట్లు అవినీతి..కాగ్ నివేదిక
సమాచార సాంకేతికత (ఐటీ), టెలికం మంత్రిత్వశాఖల కింద పనిచేసే విభాగాల అకౌంట్లలో తీవ్ర అవకతవకలు ఉన్నట్లు కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఒకటి పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఐసీఎస్ఐ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటల్ సర్వీస్) ద్వారా రూ. 890 కోట్ల విలువైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కొనుగోళ్లు వీటిలో ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నివేదికలను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, సీ–డాట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ , ఐటీఐ లిమిటెడ్, సీడీఏసీ తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ఆర్థిక పరిణామాలకు దారితీసేవిగా ఉన్నాయని లోక్‌సభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) ద్వారా ప్రింట్ మీడియా ప్రకటన విడుదలకు సంబంధించిన ప్రభుత్వ సూచనలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడంలో నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) విఫలమైందని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. దీని ఫలితం రూ.1.21 కోట్ల అనవసర చెల్లింపులు జరిగాయని అంచనాలకు వచ్చింది. -
టీడీపీ అక్రమాలు.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: టీడీపీ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీ నీలం సాహ్నికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. మున్సిపల్, జెడ్పీ ఉప ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ విలువలను దిగజారుస్తున్నారన్నారు. కుప్పంలో టీడీపీ నేతలు అమర్నాథ్రెడ్డి, పులివర్తి నాని దౌర్జనాలు చేస్తున్నారన్నారు. కుప్పం పర్యటనలో లోకేష్ న్యాయస్థానాల విలువలను దిగజార్చేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఓటర్లను భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. చదవండి: kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు ‘‘కుప్పం వెళ్లాలని చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబుకు కుప్పంలో ఓటు లేదు. ఎందుకు వెళ్తున్నారు. టీడీపీ అరాచకాలపై ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశాం. కుప్పంలో చంద్రబాబు ఓటరు కాదు.. నారావారి పల్లెలో కూడా బాబుకు ఓటు లేదు. దొంగ ఓట్లు వేయించే కల్చర్ టీడీపీదే.. ప్రశాంతంగా ఉన్న ఏరియాలో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని’’ లేళ్ల అప్పిరెడ్డి దుయ్యబట్టారు. -
బాబు ఆస్థానం.. అవినీతి ప్రస్థానం: కుప్పంలో అడ్డగోలు దోపిడీ
సొంతూరు చంద్రగిరి ఓడగొట్టినా.. తనను ఆదరించిన కుప్పం పట్ల కూడా కనీస కృతజ్ఞత చూపించని చంద్రబాబు అప్పనంగా ఆ నియోజకవర్గాన్ని అక్కడి టీడీపీ నేతలకు అప్పగించేశారు. ♦అంతే తడవుగా.. తెలుగుదేశం నేతలు కుప్పంను పూర్తిగా ఊడ్చేశారు. ♦చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం పాత సామెత.. బాబు పేరు చెప్పుకుని భూములు దోచేయడం.. అడ్డగోలుగా కాంట్రాక్టులు కొట్టేయడం.. అందిన కాడికి వసూళ్లు చేయడం... కుప్పం టీడీపీ నేతలు కొత్త రివాజుగా మొదలుపెట్టారు. ♦ముప్పై ఏళ్లుగా బాబు హయాంలో కుప్పంలో జరిగిన అభివృద్ధి ఏంటని అడిగితే టీడీపీ నేతల్లో ఎవ్వరూ సరిగా సమాధానం చెప్పలేని దుస్థితి. ♦కానీ అదే ముప్పై ఏళ్లలో టీడీపీ నేతల అభివృద్ధి చూస్తే.. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. ♦సరిగ్గా తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి రూ.కోట్లకు ఎగబాగిన కుప్పంలోని బాబు తాబేదార్ల గురించి ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. ♦పీఏ మనోహర్ మొదలు ఏడుగురు టీడీపీ నేతల అవినీతి ప్రస్థానం నిన్న ఒకింత పరికించే ప్రయత్నం చేశాం.. ఇవాళ మిగిలిన నేతల చిట్టా చూద్దాం రండి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అప్పుడప్పుడు.. నిజం చెప్పాలంటే ఎక్కడా, ఏ పనీ లేనప్పుడు.. వీలున్నప్పుడు.. చంద్రబాబునాయుడు కుప్పం వచ్చి వెళ్తుంటారు. మనస్ఫూర్తిగా కాకుండా మొహమాటపు పర్యటనలకే శ్రీకారం చుడుతుంటారు. వచ్చినప్పుడు మాత్రం కాస్త సెంటిమెంట్ డైలాగులే వల్లిస్తుంటారు. కుప్పం అంటే నాకు చాలా అది.. ఇది అంటూ ఒకింత ఎమోషనల్ టచ్ ఇస్తుంటారు. అక్కడితో అంతే సంగతులు.. మళ్లీ పర్యటనకు వచ్చినప్పుడు సేమ్ సీన్ రిపీట్. ఇలా ముప్పై ఏళ్లుగా నెట్టుకొచ్చేస్తున్న బాబు ఇక్కడి పరిస్థితి ఏంటీ.. టీడీపీ నేతల వ్యవహారశైలి ఎలా ఉందని కూడా కనిపెట్టలేకపోయారు. అందుకే ఆయన పేరు చెప్పుకుని ఇక్కడి టీడీపీ నేతలు రెచ్చిపోతుంటారు. పీఏ మనోహర్ మొదలు కుప్పం పట్టణానికి చెందిన చోటామోటా నేతలు సైతం అడ్డగోలు సంపాదన రుచి మరిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పంను చెరబట్టేశారు. సుధాకర్, వంద పడకల అస్పత్రి చైర్మన్, టీడీపీ నేత.. ప్రస్తుతం కుప్పం వందపడకల ఆస్పత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సుధాకర్ చిట్టా కూడా తక్కువేమీ లేదు. కుప్పం మేజర్ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు పంచాయతీ నిధులు దురి్వనియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. వంద పడకల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా డ్రా చేశారన్న విమర్శలు ఉన్నాయి. తన భూమికి ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయించుకోవడం, డీకేటీ భూముల దురాక్రమణ, కనమానపల్లి శ్రీనివాస స్వామి దేవస్థానానికి చెందిన భూములు, నకనపల్లి వద్ద దేవదాయ భూముల ఆక్రమణల్లోనూ సుధాకర్ ప్రమేయంపై ఆరోపణలున్నాయి. త్రిలోక్ నాయుడు, కుప్పం మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థి.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అనిమిగానిపల్లెకు చెందిన త్రిలోక్‌ను త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. ఇందులో టీడీపీయేతర వర్గాలకు వచ్చిన అభ్యంతరం లేదు కానీ ఎన్నో అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన త్రిలోక్‌ను ఎంపిక చేయడంపై స్వయంగా టీడీపీ వర్గాలే భగ్గుమంటున్నాయి. అనిమిగానిపల్లి సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో త్రిలోక్ పంచాయతీ డబ్బులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డీకేటీ భూములను కూ డా విక్రయించారనే విమర్శలున్నాయి. టీడీపీ నేత పీఎస్ మునిరత్నం అటవీ భూముల్లో నిర్మించుకున్న చెక్‌డ్యాం కుప్పంలోని టూరిజం హోటల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసుకుని రియల్ దందా చేశారన్న నిందారోపణలు ఉన్నాయి. ఇక టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్వర్క్ నడిపి ఇష్టానుసారంగా దోచేశారన్న అప్రతిష్ట మూటకట్టుకున్నారు. పట్టణంలో కేబుల్ నెట్వర్క్ని దెబ్బతీసి ఏపీ ఫైబర్‌ను బలవంతంగా అంటకట్టి.. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును మింగేశారని ఈయనపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికీ విచారణ సాగుతోంది. ఇంతటి ‘ఘన’మైన చరిత్ర కలిగిన త్రిలోక్‌ను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంపై టీడీపీ వర్గాలే ఈసడించుకుంటున్నాయి. మాజీ సర్పంచ్ వెంకటేష్ బహుళ అంతస్తుల భవనం మణి, మాజీ సర్పంచ్, డీకే పల్లి, టీడీపీ నేత ఒక్కసారి సర్పంచ్‌గా పనిచేస్తే చాలు.. ఎన్ని కోట్లు అక్రమంగా సంపాదించవచ్చనే విషయానికి ఉదాహరణ చూపించాలంటే టీడీపీ నేత డీకే పల్లి మాజీ సర్పంచ్ మణిని చూపిస్తే చాలని స్వయంగా టీడీపీ వర్గాలే అంగీకరిస్తాయి. సర్పంచ్ హోదాను అడ్డుపెట్టుకుని రియల్ వ్యాపారంతో అడ్డగోలు సంపాదనకు తెరలేపారు. కుప్పం పట్టణానికి డీకేపల్లి కూతవేటు దూరంలో ఉండటంతో భూముల విలువ పెరగడంతో ఈయన డీకేటీ స్థలాలు, మోడల్ కాలనీ ప్లాట్లు, హౌసింగ్ పట్టాలు విచ్చల విడిగా విక్రయించేశారు. అక్కడితో ఆగకుండా ఓ రిటైర్డ్ తహశీల్దార్ పేరిట నకిలీ పట్టాలు కూడా విక్రయించారనే ఆరోపణలున్నాయి. ఇక సర్పంచ్‌గా ఇష్టారాజ్యంగా డబ్బులు డ్రా చేశారన్న విమర్శలనూ మూటకట్టుకున్నారు. టీడీపీ నేత పి.గోపీనాథ్ బినామీ పేర్లతో అద్దెకు ఇచ్చిన పంచాయతీ దుకాణాలు ఆర్ఆర్ రవి, గంగమ్మ గుడి మాజీ చైర్మన్, టీడీపీ నేత.. ఈయన పట్టణంలో పేరొందిన వడ్డీ వ్యాపారి. అధిక వడ్డీలతో పేద, మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేసే వడ్డీ రవిగా పేరు. టీడీపీ హయాంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్‌గా పని చేసి చివరికి అమ్మవారికి వచ్చిన విరాళాలు కూడా దురి్వనియోగం చేశారనే అపకీర్తిని సాధించుకున్నారు. కేవి శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు.. కుప్పంలో గ్రానైట్ అక్రమ వ్యాపారానికి తెర తీసిన వ్యక్తి ఎవరంటే మొదటగా టీడీపీ నేత కేవీ శ్రీనివాసులు పేరే చెబుతారు. అనుమతుల్లేకుండానే.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమంగా గ్రానైట్ తరలింపులో ఈయన చాలా పేరు గడించారు. కుప్పం వారధి వద్ద నిబంధనలను అతిక్రమించి భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. వీళ్లే కాదు.. ఇంకా చాలామంది చోటామోటా టీడీపీ నేతలు కూడా ఇదే దారిలో ఉన్నారు. పాతపేట సోమేశ్వరస్వామి దేవాలయం భూములను టీడీపీ నేత ఆర్ఆర్ రవి ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆయనకు పట్టణ నడి»ొడ్డున ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా దేవాలయం భూమేనన్న వాదనలున్నాయి. టీడీపీకే చెందిన మాజీ సర్పంచ్ ప్రతాప్ డీకేటీ భూములు, కాలువ గట్టు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారనే విమర్శలున్నాయి. మాజీ ఎంపీటీసీ వేలుపై తమిళనాడులో ఎన్నో పోలీసు కేసులు ఉన్నాయి. ఇక మంజునాథ్, జిమ్ దాము అనే టీడీపీ నేతలు మీటర్ వడ్డీ వ్యాపారం, సెటిల్మెంట్లలో మునిగితేలుతుండటం గమనార్హం. -
బీవోబీలో అక్రమాలపై ముమ్మర విచారణ
కలికిరి: చిత్తూరు జిల్లా కలికిరిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో వెలుగుచూసిన అక్రమాలపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. సోమవారం విచారణకు బీవోబీ రీజినల్ మేనేజర్ ఎం.వి.శేషగిరి, ఉద్యోగులు కె.జయకృష్ణ, ఈశ్వరన్, అబీదా ముబీన్, మహమ్మద్ షరీఫ్, రామచంద్రుడు, సి.ఈలు, తేజసాయి, సి.రాము, ఇన్చార్జ్ మేనేజరు రామసుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. బదిలీపై వెళ్లిన మేనేజర్ మద్దిలేటి వెంకట్ గైర్హాజయ్యారు. ఉదయం నుంచి వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి ఉద్యోగులను విచారించారు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి నకిలీ ఖాతాలు సృష్టించి రూ.కోటి వరకు నగదు తీసుకుని మెసెంజర్‌తోపాటు కొందరు ఉద్యోగులు పంచుకున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. కాగా, అక్రమ లావాదేవీలతో తమకు సంబంధం లేదని, తమ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లతో మెసెంజర్ అలీఖాన్ ఇదంతా చేశారని విచారణకు హాజరైన ఉద్యోగులు తెలిపారు. మెసెంజర్ అలీఖాన్ ఉద్యోగులందరికీ యూజర్‌నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేయించి ఇచ్చేలా మేనేజర్లే సూచించారని చెప్పారు. దీంతో అందరి యూజర్‌నేమ్, పాస్వర్డ్లు ఉపయోగించి అక్రమ నగదు లావాదేవీలు చేశారని పోలీసులకు వివరించారు. -
అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి..
వంతాడ నుంచి సాక్షి ప్రతినిధి బొల్లికొండ ఫణికుమార్: అది రక్షిత అటవీ ప్రాంతం. సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న కొండ. దాని పైనే ఉంది చిన్న గిరిజన గ్రామం వంతాడ. ఒకప్పుడు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేది. ఇప్పుడు ఆ కొండపై ప్రతి చోటా లోయలను తలపించేలా పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. వందల మీటర్ల లోతుకు తవ్వి వదిలేసిన ఎర్రమట్టి లోయలు మిలమిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆ మెరిసే మట్టే అత్యంత విలువైన బాక్సైట్ ఖనిజం. అక్కడే లేటరైట్ కూడా ఉంది. వాటిపై మైనింగ్ మాఫియా కన్ను పడింది. అంతే అడవి స్వరూపమే మారిపోయింది. ఐదేళ్లలో ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖనిజాన్ని తవ్వేశారు. లేటరైట్‌తోపాటు దాని పేరు చెప్పి వేల కోట్ల విలువైన బాక్సైట్‌ను అమ్మేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తి రిజర్వు ఫారెస్టులోని గిరిజనాపురం, లింగంపర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ తవ్వకాలు జరిగాయి. ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం పంచాయతీలోని వంతాడ గ్రామంలో ఈ భూములు కలిసిపోయి ఉంటాయి. మైనింగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగిన ఈ దోపిడీపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.. టీడీపీ హయాం.. అండ్రు మినరల్స్‌కు స్వర్ణయుగం 2013లో కేంద్రం నుంచి అండ్రు మినరల్స్ సంస్థ వంతాడ పరిసరాల్లోని 200 ఎకరాల డిఫారెస్టేషన్కి అనుమతి సంపాదించింది. అదే సంవత్సరం డిసెంబర్ 4న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విస్తీర్ణాన్ని 8 భాగాలుగా విడగొట్టి 8 లేటరైట్ లీజులు మంజూరు చేసింది. అప్పుడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతో టీడీపీ అధినేతకు తెరచాటు సంబంధాలు ఉండడంతో ఈ డిఫారెస్టేషన్ ప్రక్రియ సాధ్యమైంది. లీజుల మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వెంటనే వాటిని ఇచ్చేశారు. అనంతరం కొద్ది కాలానికే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఈ అడవిని ఊహించని స్థాయిలో కొల్లగొట్టేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అండ్రు మినరల్స్‌కు స్వర్ణయుగంలా నడిచింది. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో సన్నిహితంగా ఉండడంతో ఆ కంపెనీ వైపు ఎవరూ కన్నెత్తి చూడలేకపోయారు. పరిధి దాటి అడవిని కబళించినా, గిరిజనుల కడుపు కొట్టినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఒకే కుటుంబంలో 8 మందికి ఎడాపెడా లీజులు ఒక కుటుంబంలో పది మంది ఉంటే ప్రభుత్వం ద్వారా ఎంత మందికి లబ్ధి ఉంటుంది. ఉంటే ఒకరో, ఇద్దరో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఒకరిద్దరు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? అందరికీ పథకాలు వర్తిస్తాయా? అర్హత ఉన్నా అందరికీ లబ్ధి సాధ్యం కాదు. ప్రభుత్వ నిబంధనలు అందుకు ఒప్పుకోవు. పేదల కోసం అమలు చేసే పథకాలు, ఉపాధి కల్పించే ఉద్యోగాలకే బోలెడు నిబంధనలుంటాయి. అలాంటిది ఒకే కుటుంబంలో 8 మందికి మైనింగ్ లీజులు ఇస్తే.. అదీ అత్యంత విలువైన లేటరైట్ లీజులు.. బరితెగించి ఇలా లీజులు ఇప్పించింది చంద్రబాబే. అండ్రు మినరల్స్ యజమాని అండ్రు రమేష్‌బాబు. ఆయన పేరుతో ఒక లీజు మంజూరు చేశారు. ఆయన భార్య అండ్రు సుజాత పేరుతో మరో లీజు. రమేష్‌బాబు దగ్గరి సోదరుడు (పెదనాన్న కుమారుడు) శ్రీనివాస్ పేరుతో మరో లీజు. శ్రీనివాస్ తల్లి సత్యవతి, భార్య ఉషారాణి పేరుతో రెండు లీజులు. వీరి దగ్గరి బంధువులైన మన్యం వెంకటేశ్వరరావు, మన్యం వెంకట రజని, వెంపాటి వీర్రాజులకు మరో మూడు లీజులు. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఎడాపెడా లేటరైట్ లీజులు ఇచ్చేశారు. ఒకే కుటుంబంలో అంతమందికి ఎలా లీజులు ఇచ్చారనే దానికి సమాధానం లేదు. గనుల శాఖలో వేల లీజు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే కేవలం ఒక కుటుంబానికి అన్ని లీజులు మంజూరు చేయడంలోనే కుమ్మక్కు స్పష్టమవుతోంది. ఐదు రెట్లు ఎక్కువ ఖనిజం అక్రమంగా తరలించారు! అధికారికంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని తవ్వినట్లు రికార్డుల్లో చూపింది అండ్రు మినరల్స్. దానికి రూ.88.30 కోట్ల సీనరేజి ఫీజు కట్టింది. నిజానికి దాని కంటే నాలుగైదు రెట్ల ఎక్కువ ఖనిజాన్ని అనధికారికంగా తవ్వి తరలించినట్లు భావిస్తున్నారు. సుమారు నాలుగు కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ఖనిజాన్ని అక్రమంగా తరలించినట్లు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని చూసిన మైనింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో ఎ గ్రేడ్ (మెటలర్జికల్) లేటరైట్ మెట్రిక్ టన్ను రూ.200, బి గ్రేడ్ (నాన్–మెటలర్జికల్) లేటరైట్ టన్ను రూ.100కిపైగానే ఉంది. ఎ గ్రేడ్ లేటరైట్‌ను 30 శాతం, బి గ్రేడ్ లేటరైట్‌ను 70 శాతం తరలించారు. దీని విలువ వందల కోట్లకుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దోచేసింది వేల కోట్లు ! పైకి లేటరైట్ అని చూపిస్తున్నా అదంతా బాక్సైట్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లోతుగా విచారణ చేపట్టింది. అండ్రు మినరల్స్ చేసిన ఎగుమతుల్ని బట్టి ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. వేదాంత లిమిటెడ్ (ఒడిశా)కు ఐదేళ్లలో 32 లక్షల టన్నుల ఖనిజాన్ని సరఫరా చేసినట్లు ఈ కంపెనీ రికార్డుల్లో చూపింది. వాస్తవానికి ఆ కంపెనీ స్టీల్, అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు బాక్సైట్ వినియోగిస్తారు. ఈ నేపథ్యంలోనే అండ్రు కంపెనీ లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తవ్వేసి అమ్మేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే చైనాకు ఎగుమతి చేసిన 4.5 లక్షల టన్నుల ఖనిజం కూడా బాక్సైట్ అని భావిస్తున్నారు. బాక్సైట్ టన్ను రేటు మార్కెట్లో రూ.500 నుంచి వెయ్యి వరకు ఉంటుంది. ఈ లెక్కన అండ్రు మినరల్స్ లేటరైట్ ముసుగులో బాౖMð్సట్‌ను అమ్మి రూ. వేల కోట్లను అక్రమంగా సంపాదించిందనే అనుమానాలు బలపడుతున్నాయి. గనుల్లో తవ్విన ఖనిజాన్ని ప్రాసెస్ చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా రావికంపాడు/బెండపూడి, అర్లధర/ప్రత్తిపాడులో రెండు స్టాక్ యార్డ్లు నిర్వహించారు. అందులో రోజుకు 8 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్ చేసే క్రషింగ్ యూనిట్లు పెట్టారు. అక్కడే లేటరైట్‌ను ప్రాసెస్ చేసి బాక్సైట్‌గా మార్చి అమ్ముకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అడ్డగోలుగా తవ్వేశారు.. అవి కనపడకుండా పూడ్చి మొక్కలు నాటారు.. కేటాయించిన లీజు ప్రాంతం 200 ఎకరాలే అయినా దాన్ని దాటి తవ్వకాలు జరిపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో బ్లాకులో (మొత్తం 8 బ్లాకులు) 25 ఎకరాలే వాళ్ల పరిధి. ఆ మార్కింగ్ లోపే తవ్వకాలు జరపాలి. కానీ దాన్ని దాటి అదనంగా ప్రతి బ్లాకులో 5 నుంచి 10 ఎకరాల్లో తవ్వకాలు జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బ్లాకులతో సంబంధం లేకుండా కొన్నిచోట్ల విడిగా కూడా తవ్వేశారు. ఇలా 50 ఎకరాల కంటే ఎక్కువ అడవిని తొలిచేశారు. ఈ అక్రమ తవ్వకాలు బయటపడకుండా గొప్ప పన్నాగమే పన్నింది అండ్రు కంపెనీ. తవ్వేశాక మిగిలిన పనికిరాని రాళ్లు, మట్టితో ఆ గోతులను పూడ్చేశారు. తవ్వకాల పరిమాణం తెలియకుండా నాటిన నీలగిరి చెట్లు వాటిపై మళ్లీ మొక్కలు నాటేశారు. దీంతో అనధికారికంగా తవ్వకాలు జరిపిన చోట్ల ప్రస్తుతం మొక్కలే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎంత పరిమాణంలో అక్రమ తవ్వకాలు జరిగాయో కనిపెట్టడం అధికారులకు సాధ్యం కావడంలేదు. మైనింగ్ శాఖ నిర్వహించే సాధారణ డీజీపీఎస్, ఈటీఎస్ సర్వేలతో ఎంత తవ్వారో తెలియని పరిస్థితి నెలకొంది. మైనింగ్ తవ్వకాల్లో ఇదో కొత్త టెక్నిక్‌గా అధికారులు చెబుతున్నారు. ఎన్ని రకాల తనిఖీలు చేసినా అక్రమాలు బయటపడకుండా ఉండేలా అండ్రు మినరల్స్ తన పలుకుబడిని, ఆర్థిక బలాన్ని ఉపయోగించింది. అధిక లోడుతో లారీల తరలింపు 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో ప్రతిరోజు వందలాది లారీల్లో ఖనిజాన్ని తరలించారు. తవ్విన చోటు నుంచి స్టాక్ యార్డుకు ఒక్కో లారీ ప్రతిరోజూ 25 నుంచి 30 ట్రిప్పులు తిరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఒక లారీలో 12 టన్నుల ఖనిజాన్ని తరలించడానికే అనుమతి ఉంది. కానీ దానికి రెట్టింపు ఖనిజాన్ని లారీలో వేసేవారు. ఒకోసారి 30 టన్నులు కూడా లారీలో ఉండేదని సమాచారం. ఎప్పుడైనా మైనింగ్ అధికారులు తనిఖీ చేసినప్పుడు మాత్రం 12 టన్నులే వేసేవారు. ఆ తర్వాత మామూలే. మైనింగ్ నిబంధనల ప్రకారం తవ్విన ఖనిజాన్ని తరలించే లారీకి పర్మిట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. ఆ లారీలో ఎంత పరిమాణం ఉందనేది చూడరు. దీన్ని ఆసరాగా తీసుకుని అండ్రు కంపెనీ పరిమితికి మించి ఇష్టానుసారం ఖనిజాన్ని తవ్వేసి తరలించేసింది. ఇప్పటికే స్టాక్ యార్డుల్లో రికార్డుల్లో చూపిన దానికన్నా అదనంగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం దీనికి రూ.12.32 కోట్లు జరిమానా వసూలు చేయాల్సివుంది. అటవీ శాఖకు యూజర్ చార్జీలు ఎగనామం తవ్వకాలు జరిపిన ప్రాంతం అంతా రిజర్వు ఫారెస్టు. అటవీ భూమిని మైనింగ్ కోసం కన్వర్ట్ చేసుకున్నారు. ఇలా చేసిన అటవీ భూమిలో తవ్విన ఖనిజానికి టన్నుకు రూ.10 అటవీ శాఖకు యూజర్ చార్జీగా చెల్లించాలి. 2013లో జీఓ నంబర్ 63 ప్రకారం ఈ యూజర్ చార్జీలు కచ్చితంగా కట్టాల్సిందే. అధికారికంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల లేటరైట్ తవ్వారు. దానిపై యూజర్ చార్జీల కింద రూ.8.3 కోట్లకుపైగా అటవీ శాఖకు చెల్లించాల్సి వుంది. కానీ ఆ చార్జీలను కూడా అండ్రు మినరల్స్ కట్టలేదు. రాజకీయ పలుకుబడి ఉండడంతో అటవీ శాఖాధికారులు కూడా దీనిపై నోరు మెదపలేకపోయారు. అండ్రు మినరల్స్ తవ్విన ఖనిజాన్ని నిల్వ చేసే స్టాక్ యార్డ్ టీడీపీ మళ్లీ వస్తే ఇంకా కుమ్మేయడానికి స్కెచ్ ఐదేళ్లలో అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసిన అండ్రు కుటుంబం టీడీపీ పెద్దల దన్నుతో అడవిని ఇంకా తవ్వేయడానికి ప్రణాళిక రూపొందించింది. 2019 ఎన్నికల్లోను మళ్లీ టీడీపీ గెలుస్తుందని అప్పుడు ఇంకా తవ్వుకోవచ్చనే ఉద్దేశంతో అదే ప్రాంతంలో మరిన్ని లీజులకు దరఖాస్తు చేసుకుంది. ఈసారి వంతాడ గ్రామం వెనుక ఉన్న అడవిని సర్వే చేసి హద్దులు కూడా నిర్ణయించింది. సుమారు 600 ఎకరాలను లీజుకు తీసుకునేందుకు మైనింగ్ శాఖకు దరఖాస్తులు పెట్టినట్లు సమాచారం. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ అనుమతులు కూడా తెచ్చుకుని య«థేచ్ఛగా తవ్వకాలు చేసేవారు. కానీ టీడీపీ ఓడిపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. మైనింగ్ కోసం వంతాడ కొండపై రిజర్వు ఫారెస్టులో 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు. మైనింగ్‌కు అనుమతి ఉన్నా రోడ్డు వేయడానికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిందే. ఈ రోడ్డు కోసం అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నా అది అధికారులను ప్రలోభపెట్టి తీసుకున్నట్లు చెబుతున్నారు. రిజర్వు ఫారెస్టులో అండ్రు సంస్థ నిర్మించిన రోడ్డు రక్షణ చర్యలూ లేవు మైనింగ్ ప్రాంతంలో పెద్దగా రక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. మైనింగ్ చేసే చోట, స్టాక్ యార్డుల్లో సుమారు 500 మంది పనిచేసేవారు. ఖనిజాన్ని రవాణా చేసేందుకు వచ్చే వాహనాల సిబ్బంది వందల సంఖ్యలో ఉండేవారు. వారికి అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా పని చేయించుకున్నారు. రాత్రి సమయాల్లో వారు ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. వారికి జీతాలు కూడా సరిగా ఇవ్వలేదని చెబుతున్నారు. పనిచేసే వారిలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అధికారం అండతో మైనింగ్ చేసే చోట తీసుకోవాల్సిన కనీస చర్యల్ని అండ్రు కంపెనీ తీసుకోలేదని చెబుతున్నారు. స్థానికులకు ఉపాధి ఇవ్వలేదు.. అక్కడి రోడ్లను నాశనం చేశారు మరోవైపు మైనింగ్ జరిగే ప్రాంతంలో ఉన్న వంతాడ గ్రామవాసులకు పెద్దగా ఉపాధి కల్పించలేదు. అతికొద్ది మందికి మాత్రమే చిన్నచిన్న పనులు ఇచ్చినా ఎక్కువ మందిని బయట ప్రాంతం నుంచే తీసుకువచ్చారు. దీంతో వందల కోట్ల విలువైన ఖనిజాన్ని ఆ ప్రాంతం నుంచి తరలించుకుపోయినా అక్కడి ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపాధి దొరకలేదు. ఐదేళ్లపాటు ఓవర్ లోడు వాహనాలను నిరంతరాయంగా నడపడంతో ఆ ప్రాంతంలో రోడ్లు నాశనమయ్యాయి. స్టాక్ యార్డులో నిల్వ ఉన్న ఖనిజం లంపకలోవ–ప్రత్తిపాడు రోడ్డు చిద్రమైపోయింది. చివరికి ఖనిజాన్ని తరలించే టిప్పర్లు కూడా వెళ్లడం కష్టంగా మారడంతో అండ్రు కంపెనీ కోసం టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద రూ.12 కోట్లతో రోడ్డు మంజూరు చేసి నిర్మించింది. అనుమతి లేకుండా పెదశంకర్లపూడి వద్ద ఏలేరు ఎడమ కాలువ గట్టును మైనింగ్ వాహనాల రాకపోకలకు వినియోగించింది. దీనివల్ల కాలువ గట్టు ధ్వంసమై కుంగిపోయింది. పెద శంకర్లపూడి వద్ద ఏలేరు కాలువపై ఉన్న వంతెన అండ్రు లారీల రాకపోకలతో కుంగిపోయింది. మైనింగ్ తవ్వకాల వల్ల ఏర్పడే కాలుష్యంతో గిరిజనులు సాగు చేసే తోటలు దెబ్బతిన్నాయి. జీడిమామిడి తోటలు, సీతాఫలం దిగుబడులు తగ్గిపోయాయి. మరోవైపు మైనింగ్ కోసం ఈ ప్రాంతంలో నీటి వనరులను అండ్రు సంస్థ పెద్దఎత్తున వినియోగించింది. బోర్లు వేసి పెద్దఎత్తున నీటిని తోడేసింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఫలితంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. అండ్రు మినరల్స్ జరిపిన ఖనిజ తవ్వకాలు.. వృత్తంలో అక్కడే వదిలేసిన యంత్రాలు ఎవరీ అండ్రు.. అండ్రు మినరల్స్ యజమాని రమేష్‌బాబు. తన ఇంటి పేరుతోనే ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం. గతంలో అక్కడ స్టోన్ క్వారీలు ఉండేవి. క్రషర్లు నిర్వహించేవారు. క్రషర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2013లో తన కుటుంబ సభ్యుల పేరు మీదే లేటరైట్ లీజులు తీసుకున్నారు. పూర్తిగా లేటరైట్ మైనింగ్‌పైనే దృష్టి పెట్టారు. రాజమండ్రిలో ప్రధాన కార్యాలయం పెట్టారు. టీడీపీ నాయకుల ద్వారా చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఆ తర్వాత లోకేశ్‌తో సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు. చిన్న క్రషర్ యజమాని ఇప్పుడు మైనింగ్ ద్వారా వేల కోట్లు ఆర్జించినట్లు మైనింగ్ రంగంలో ఉన్న పెద్దవాళ్లు చెబుతున్నారు. ఇదంతా చంద్రబాబు, లోకేశ్ అండతోనే. టీడీపీ హయాంలో స్వయంగా లోకేశ్ ఈ లీజుల్లో తవ్వకాలను పర్యవేక్షించేవారని సమాచారం. స్థానిక టీడీపీ నేతలు, కొందరు మంత్రులకు ఈ తవ్వకాల్లో భాగమున్నట్లు చెబుతున్నారు. లారీలు తిరుగుతూనే ఉండేవి రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తవ్వేవాళ్లు. పెద్ద టిప్పర్లు ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి. ఆ క్వారీలు లేకముందు అంతా పచ్చగా ఉండేది. ఇప్పుడు ఎటు చూసినా ఎర్రమట్టి గోతులున్నాయి. ఆ క్వారీల వల్ల మా పిల్లలకు ఏమైనా ఉద్యోగాలిప్పిస్తారనుకున్నాం. అది కూడా లేదు. పెద్ద మిషన్లతో తవ్వుతుంటే మట్టితో మా తోటలు పాడైపోయేవి. ఎవరికి చెప్పుకోలేక అలాగే ఉండిపోయాం. – మాతే బాలమ్మ, వంతాడ ఇక్కడ ఖనిజం తవ్వుకున్నారు.. ఇక్కడ ఉద్యోగాలివ్వలేదు మా కొండపై ఐదేళ్లు ఎర్రమట్టి తవ్వుకుని వెళ్లారు. దానికి చాలా విలువ ఉంటుందని చెబుతున్నారు. మా ఏరియా మట్టితో కోట్లు సంపాదించినోళ్లు మా ఊర్లో పది మందికి కూడా ఉద్యోగాలివ్వలేదు. గట్టిగా మాట్లాడిన నలుగురైదుగురిని సూపర్వైజర్లుగా పెట్టుకున్నారు. క్వారీలు రాకముందు చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అది జరగలేదు. మా పంటలు పాడైపోయాయి. ఉపాధి తగ్గిపోయింది. – కుడే రాంబాబు, వంతాడ ఇష్టానుసారం తవ్వుకున్నారు మా ప్రాంతంలో ఖనిజాన్ని ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్లారు. కానీ మా ప్రాంతాలను పట్టించుకోలేదు. అండ్రు కంపెనీ లారీల వల్ల మా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. వంతెనలు కుంగిపోయాయి. ఆ లారీల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. పాడైన రోడ్లు బాగు చేస్తామన్నారు కానీ చేయలేదు. – అన్నిక సత్తిబాబు, ఇ.గోకవరం, ప్రత్తిపాడు మండలం ప్రాథమికంగా అక్రమాలు బయటపడ్డాయి.. అండ్రు మినరల్స్ తవ్వకాలపై చాలా ఫిర్యాదులు రావడంతో ప్రాథమిక విచారణకు ఆదేశించాం. అందులో కొన్ని అక్రమాలు బయటపడ్డాయి. స్టాక్ యార్డులో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం లెక్కకు మించి ఉంది. దీంతో ఇంకా లోతుగా విచారణ చేస్తున్నాం. తవ్విన చోట మళ్లీ పూడ్చి మొక్కలు నాటారు. దీంతో అసలు ఎంత తవ్వారో తెలియడంలేదు. అందుకే త్రీ డైమెన్షన్లో డ్రోన్ సర్వే చేయాలని నిర్ణయించాం. ఈ కంపెనీ తవ్వకాలు జరపకముందు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునేందుకు శాటిలైట్ చిత్రాలను తెప్పిస్తున్నాం. – వీజీ వెంకటరెడ్డి, మైనింగ్ శాఖ డైరెక్టర్ ఇవీ చదవండి: Andhra Pradesh: పోలవరం.. శరవేగం ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు -
సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని కొడిమి గ్రామ సర్వే నంబరు 227లో ఐదు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఇందులోని సెంటు స్థలానికి కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారి ఐదు ఎకరాల స్థలంలో ఏకంగా వందకు పైగా డాక్యుమెంట్లను అక్రమంగా రిజిష్టర్ చేశారు. ఆయన అక్రమాల పర్వం అనంతపురం రూరల్ మండలానికే పరిమితం కాలేదు. కార్యాలయ పరిధిలోని రాప్తాడు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, ఆత్మకూరు, కూడేరు మండలాలకూ విస్తరించింది. అందినకాడికి దండుకుని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై.. సురేష్ ఆచారి అనంతపురం రూరల్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా గత ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు 13 వరకు పనిచేశారు. ఈ మధ్య కాలంలోనే అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై విలువైన ప్రభుత్వ, అసైన్డ్, దేవదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ రిజిష్టర్ చేశారు. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి సర్వే నంబరు 123లోని 4.17 ఎకరాల వంక పోరంబోకును ఇతరుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వైనంపై ఈ నెల 1న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆ శాఖ డీఐజీ మాధవి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. దీంతో సురేష్ ఆచారి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. 9 నెలల్లో 999 అక్రమ రిజిస్ట్రేషన్లు అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ హరివర్మ నేతృత్వంలోని బృందం సురేష్ ఆచారి అక్రమాలపై విచారణ చేపట్టింది. గత తొమ్మిది నెలల వ్యవధిలోనే 999 అక్రమ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించింది. ఇందులో 830 అసైన్డ్ భూములకు సంబంధించినవి కాగా, ప్రభుత్వ భూములకు సంబంధించి 165, దేవదాయ శాఖ భూములకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లు ఉన్నాయి. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసినందుకు గాను సదరు సబ్ రిజిస్ట్రార్ రూ.కోట్లలోనే ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చట్ట సవరణ జరిగితేనే.. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించేలా చట్టంలో సవరణలు చేస్తేనే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి తగ్గుముఖం పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అధికారులు కెమెరా కళ్లకు చిక్కకుండా అక్రమాలు కొనసాగిస్తున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ సమయంలో సబ్‌రిజిస్ట్రార్ నిర్వహించే ప్రక్రియ అంతా రికార్డు అవుతుంది. క్రయ విక్రయదారులు అధికారి వద్దకు వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో కూడా రికార్డు అవుతుంది. కానీ సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో కార్యాలయం బయటే తతంగమంతా నడిపిస్తున్నారు. తద్వారా సీసీ కెమెరాలకు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. అక్రమాలను ఉపేక్షించం రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించం. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను తప్పుడు విధానంలో రిజిస్ట్రేషన్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ప్రసన్నాయపల్లి సర్వే నంబరు 123–2లోని ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసినందుకే సబ్‌రిజిస్ట్రార్ సురేష్ ఆచారిని సస్పెండ్ చేశాం. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. గతంలోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడిన హిందూపురం, ఉరవకొండ, చెన్నేకొత్తపల్లి సబ్రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశాం. –ఎన్.మాధవి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇవీ చదవండి: పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని.. వీడని మిస్టరీ: అంతులేని ‘కొడనాడు’ కథ -
విజయ డెయిరీ చైర్మన్ చలసాని మాయ.. వెన్న నుంచి కమిషన్లు
అంతులేని అక్రమాలు.. ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలకు ఆలవాలంగా మారిన విజయ డెయిరీలో రోజుకో అక్రమాల చిట్టా బయటపడుతోంది. భూముల కొనుగోలులో చేతివాటం మొదలుకొని.. రూ.కోట్లలో నిధులను మింగేయడం.. కమీషన్ల దందా నడిపించడం.. బోనస్‌ల బాగోతం వంటి అక్రమాల పుట్టలెన్నో విజయ డెయిరీ ప్రతిష్టను మసకబారుస్తోంది. తాజాగా వెన్న, పాల పౌడర్ కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారం బట్టబయలు కావడంతో పాల సొసైటీల చైర్మన్లు అవాక్కవుతున్నారు. సాక్షి, అమరావతి: వెన్న నుంచి నెయ్యి తీయడం అందరికీ తెలుసు. కానీ.. విజయ డెయిరీలో మాత్రం వెన్న నుంచి కమీషన్లు కూడా పిండారు. డెయిరీని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్టు ఆ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆయన హయాంలో ప్రతి వ్యవహారం అవినీతిమయంగా మారిందని పాడి రైతులు వాపోతున్నారు. తాజాగా వెన్న, పాల పౌడర్ కొనుగోళ్ల తీరు తెలుసుకుని పాల సొసైటీల చైర్మన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అవసరం లేకపోయినా వీటిని భారీగా కొనుగోలు చేసి కమీషన్ల రూపంలో రూ.కోట్లు మింగేశారని చెబుతున్నారు. గతంలో రెండు నెలలకు ఒకసారి అవసరాన్ని బట్టి వెన్న, పాల పౌడర్ కొనేవారు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా మంచి పేరున్న సంస్థల నుంచే కొనుగోలు చేసేవారు. డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కొద్దినెలల క్రితం 2,500 టన్నుల వెన్నను మద్రాసుకు చెందిన ఒక మధ్యవర్తి ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేయించారు. ఇదికాకుండా సంస్థలో మరో 500 టన్నుల వెన్న తయారైంది. మొత్తం 3 వేల టన్నుల వెన్న విజయ డెయిరీ వద్ద నిల్వ ఉంది. ఇంత వెన్న ఒకేసారి కొనుగోలు చేయడం అంటే కమిషన్ కోసమే తప్ప వేరే ప్రయోజనం లేదని స్పష్టమవుతోంది. ఎంత పక్కాగా నిల్వ చేసినా సంవత్సరం లోపు మాత్రమే దాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా కమిషన్ కోసం ఒకేసారి భారీగా కొనేశారు. అప్పు చేసి కొని.. కోల్డ్ స్టోరేజీల్లో దాచారు యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన రుణంలో సుమారు రూ.75 కోట్లను వెచ్చించి వెన్న కొన్నారు. తర్వాత దాన్ని విశాఖ, హైదరాబాద్‌లోని కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరిచారు. స్థానిక కోల్డ్ స్టోరేజీల్లో అయితే ఎక్కువ అద్దె కట్టాల్సి వస్తుందని, అందుకే ఆ నగరాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టినట్టు సమర్ధించుకుంటున్నారు. అసలు కొనడమే అనవసరమని రైతులు వాపోతుంటే కొని ఎక్కడో కోల్డ్ స్టోరేజీల్లో పెట్టామని చెప్పుకోవడం ఏమిటనే ప్రశ్నలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు సుమారు వెయ్యి టన్నుల వెన్నను అతికష్టం మీద వినియోగించారు. రాబోయే రెండు నెలల్లో మహా అయితే మరో 500 టన్నులు వినియోగించే అవకాశం ఉంది. ఇంకా 1500 టన్నుల వెన్న మిగిలిపోయే పరిస్థితి ఉంది. చివర్లో దీన్ని చిన్న డెయిరీలకు ఎంతోకొంతకు అమ్మి వదిలించుకోవాల్సిందే. దీనివల్ల సంస్థకు రూ.కోట్లలో నష్టం వాటిల్లనుంది. చైర్మన్‌కు మాత్రం ముందే భారీగా లాభం సమకూరింది. పాల పొడి కొనుగోళ్లలోనూ కమీషన్ల పర్వం పాల పొడి కొనుగోళ్లలోనూ ఆనవాయితీకి భిన్నంగా వ్యవహరించి కమీషన్లు దండుకుంటున్నారు. సహకార రంగంలో ఉన్న అమూల్ వంటి పెద్ద సంస్థల నుంచి గతంలో పౌడర్, వెన్న కొనేవారు. ఆంజనేయులు చైర్మన్ అయ్యాక పెద్ద సంస్థల నుంచి నామమాత్రంగా కొంటూ ఎక్కువ భాగాన్ని నాసిరకం సరుకు ఇచ్చే ప్రైవేట్ సంస్థల నుంచి కొంటున్నారు. హర్యానా ఫుడ్స్, బోయీ బాబా, స్టెర్లిన్ ఆగ్రో, మధు డైరీస్ వంటి సంస్థల వద్ద వీటిని కొనడమంటే నాణ్యతకు తిలోదకాలిచ్చినట్టే. కానీ.. కమీషన్లు భారీగా ముడుతుండటంతో చైర్మన్‌కు అవే పెద్ద సంస్థలుగా కనబడుతున్నాయి. కమీషన్ల కక్కుర్తి వల్ల విజయ బ్రాండ్ మసకబారుతోందని రైతులు వాపోతున్నారు. విజయ పాల నాణ్యత తగ్గిపోవడానికి ఇవే కారణాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రస్తుత పాలకవర్గాన్ని సాగనంపకపోతే విజయ డెయిరీ పరువు గంగలో కలిసిపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. -
అక్రమార్కులపై వేటు.. ఆపరేషన్ రెవెన్యూ
జిల్లా రెవెన్యూ శాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి తిమింగళాలు, భూ బకాసురులు, అక్రమార్కులపై వేటుపడుతోంది. ఏళ్ల తరబడి కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రతి పనికో రేటు కట్టి రోజువారీ రాబడికి అలవాటుపడ్డారు. అలాంటి కలుపు మొక్కల ఏరివేత యజ్ఞానికి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శ్రీకారం చుట్టారు. కలెక్టర్ చర్యలు అక్రమార్కుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ప్రభుత్వ భూములు కాపాడుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని గాడిలో పెట్టే దిశగా అడుగులు వేయడం శుభపరిణామంగా మారింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సరిగ్గా రెండు నెలల క్రితం జూన్ 2వ తేదీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అధికంగా భూ సమస్యలు ఉండటాన్ని గమనించారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించిన వ్యవహారాలను సీరియస్‌గా తీసుకున్నారు. వాటిలో కొన్నింటిపై విచారణ చేయించారు. అవినీతికి పాల్పడిన ముగ్గురు తహసీల్దార్లతో పాటు రెవెన్యూ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో జిల్లా రెవెన్యూ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గంటల వ్యవధిలో ఉద్యోగ విరమణ చేసే తహసీల్దార్‌ను కూడా సస్పెండ్ చేసి తప్పుచేస్తే ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్న సంకేతాలు పంపారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత రెండు సోమవారాలు మాత్రమే స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో దాదాపు 400కుపైగా రెవెన్యూ పరమైన సమస్యలపై ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి అధికారులపై చర్యలు చేపట్టే దిశగా కలెక్టర్ వేగంగా అడుగులు వేశారు. గత వారంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సున్నితంగా మందలించారు. తప్పుచేసిన వారిని వదలబోనని, అక్రమాలకు పాల్పడిన వారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని నిలదీశారు. వారం తిరగకుండానే అమలుచేశారు. ముగ్గురు తహసీల్దార్లపై సస్పెన్షన్ వేటు... ప్రభుత్వ భూములను రక్షించలేకపోవడం, ఇతరులకు అక్రమంగా కట్టబెట్టడం లాంటి వాటితో పాటు భూ రికార్డులు తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడిన జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. వారికి సహకరించిన ఆర్ఐలు, వీఆర్వోలను కూడా వదల్లేదు. పొదిలి తహసీల్దార్ ఏవీ హనుమంతరావుతో పాటు ఏఆర్ఐ శివరామ ప్రసన్న, కంబాలపాడు వీఆర్వో కె.కమలాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా సిలికా సాండ్ భూముల లీజ్ అంశంలో అక్రమాలకు పాల్పడిన చినగంజాం తహసీల్దార్ కె.విజయకుమారిని కూడా సస్పెండ్ చేశారు. తాజాగా గత శనివారం హనుమంతునిపాడు తహసీల్దార్ ఎన్.సుధాకరరావు, ఆర్ఐ పి.వి.శివప్రసాదు, వేములపాడు వీఆర్వో బి.నరసింహం, సీఎస్ పురం మండలం పెదగోగులపల్లి వీఆర్వో జే నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూములను అక్రమార్కులకు కట్టబెట్టి ఆన్లైన్ చేసినట్లు వీరందరిపై ఆరోపణలు ఉండగా, విచారణలో రుజువు కావడంతో కలెక్టర్ కఠినంగా స్పందించారు. ప్రత్యేకంగా రెవెన్యూ ‘స్పందన’కు చర్యలు... జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమణదారులు, కబ్జాదారుల బారి నుంచి కాపాడటంతో వారికి సహకరించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలకు కలెక్టర్ ఉపక్రమించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న సచివాలయాల ద్వారా ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారితో పాటు వారికి అప్పనంగా కట్టబెట్టిన అవినీతి అధికారులపై విచారణ నిర్వహించి వారందరినీ ఏరివేసేందుకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, కొందరు అవినీతి రెవెన్యూ అధికారులు, సిబ్బంది ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు వ్యక్తుల భూములు సైతం సంబంధం లేని వ్యక్తుల పేర్లపై మారుస్తూ రికార్డులు తారుమారు చేస్తున్నారు. రైతులకు సంబంధించిన భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులు కూడా ‘స్పందన’లో కలెక్టర్ దృష్టికి వచ్చాయి. వీటన్నింటి పరిష్కారం కోసం గ్రామాల వారీగా భూ రికార్డులు పరిశీలించి ‘రెవెన్యూ స్పందన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా మూడు నెలల వ్యవధిలో ప్రైవేటు భూములకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదుల్లో సగానికిపైగా భూ సమస్యలే... ఎన్ని స్పందన కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని సమస్యలు పరిష్కరించినా.. రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది చేస్తున్న తప్పుల కారణంగా భూ సమస్యలు అధికంగా వస్తున్నాయని కలెక్టర్ గుర్తించారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం రెవెన్యూ పరమైన ఫిర్యాదుల్లో భూ సమస్యలు వేలల్లో ఉన్నాయి. 2020 జూన్ నుంచి అక్టోబర్ వరకు జిల్లా మొత్తం మీద భూ సమస్యలు, రెవెన్యూ అంశాలపై 13,766 అర్జీలు రాగా, 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 2,583 ఫిర్యాదులు వచ్చాయి. పాస్ పుస్తకాలు ఇవ్వాలని, వాటిని ఆన్లైన్ చేయాలని, ఒకరి భూమిని మరొకరి పేరుమీద ఆన్లైన్ చేశారని.. ఇలా జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. ఎంతటి అధికారినైనా ఉపేక్షించేది లేదు. ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకునే అధికారులకు అండగా ఉంటా. అధికారుల సంక్షేమాన్ని ఏ విధంగా చూస్తానో, అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలకు కూడా అదేవిధంగా వెనకాడేది లేదు. అన్ని శాఖల అధికారులు దీనిని గుణపాఠంగా తీసుకుని కార్యాలయాలకు వచ్చే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి. -
జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాలు.. రంగంలోకి పోలీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నూతన పాలక మండలి అక్రమాల ఆరోపణలపై పోలీసులు రంగంలోకి దిగారు. సొసైటీ కార్యాలయానికి చేరుకున్న జుబ్లీహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్, కోశాధికారి నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సొసైటీ స్థలం తక్కువ ధరకు అమ్మి రూ.5 కోట్ల నష్టం చేశారని సభ్యుడు సురేష్ బాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సొసైటీ స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణను జీహెచ్ఎంసీ తొలగించింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలో సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్, కోశాధికారి నాగరాజుకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. -
బియ్యం అక్రమార్కులకు పెద్దల అండ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని రేఖ రైస్ మిల్లు అక్రమాల్లో భాగస్వాములైన అధికారులకు రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాపతినిధి అండగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అందువల్లే గత ఏడాది డిసెంబర్లో విచారణ నివేదిక అందినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. అయితే గద్వాల టీఆర్ఎస్ పార్టీలో మూడు వర్గాలు ఉండగా.. ఓ వర్గం నేతలు జిల్లాస్థాయి అధికారికి మద్దతు ఇస్తున్నారని, మరో వర్గం తటస్థంగా ఉందని తెలిసింది. వారికి పోటీగా ఉండే ఇంకో వర్గం నేతలు రేషన్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ యంత్రాంగంపై ఇటీవల తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. దీని కారణంగానే ఒకరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు చెప్తున్న వివరాలు కూడా ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. ఒకరిపై కేసు నమోదుకు ఆదేశాలు ‘‘రేఖ రైస్‌మిల్లులో పట్టుబడిన 170.05 క్వింటాళ్ల రేషన్ బియ్యం విషయంలో రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులను తప్పుదోవ పట్టించిన ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గణపతిరావుపై కేసు నమోదు చేయాలని చెప్పారు. ఈ మేరకు గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం’’అని ఇన్చార్జి డీఎస్ఓ రేవతి తెలిపారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇతర అధికారులపై చర్యలకు సంబంధించి పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. ఈ లెక్కన రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదిక బుట్టదాఖలైనట్టేనా? అందులో పేర్కొన్న అదనపు కలెక్టర్ (రెవెన్యూ), మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇన్చార్జి తహసీల్దార్, సీఐ, ఎస్సైలపై చర్యలుంటాయా.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘రేషన్’ బియ్యం వ్యవహారం ఇదీ.. 2020 అక్టోబర్ 2న గద్వాల శివారులోని రేఖ రైస్ మిల్లులో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు స్థానిక పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు ఆ మిల్లులో సోదాలు నిర్వహించారు. 341 సంచుల్లో (170.05 క్వింటాళ్లు) రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కానీ మిల్లు యాజమాన్యంతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారు. పట్టుబడినది రేషన్ బియ్యం కాదంటూ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఎల్.గణపతిరావు తప్పుడు నివేదిక రూపొందించి బురిడీ కొట్టించాడు. దీనిపై అప్పట్లో పోలీస్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గతంగా వివాదం చెలరేగింది. ఈ విషయం బయటికి రావడంతో రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మిల్లులో సీజ్ చేసిన బియ్యాన్ని ల్యాబ్‌కు పంపగా రేషన్ బియ్యమేనని తేలింది. దీంతో పూర్తిస్థాయిలో ఆరా తీశారు. రేఖ మిల్లులో బియ్యం పట్టుబడ్డ రోజు గణపతిరావు విధుల్లోనే లేరని, తప్పుడు అనుమతి పత్రాలను రూపొందించి అధికారులకు ఇచ్చారని గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పటి గద్వాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తోపాటు మరో ఐదుగురి హస్తం ఉన్నట్టు తేల్చి గత ఏడాది డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇన్నాళ్లూ ఆ నివేదిక మూలనపడగా.. తాజాగా గత నెల 21న గద్వాల పట్టణ పోలీసు స్టేషన్లో డీటీ గణపతిరావుపై కేసు నమోదు చేశారు. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. -
సేవా ముసుగులో చీకటి వ్యాపారం
పేరుకు ప్రజాసేవ.. అనాథలకు ఆశ్రయం కల్పించి తరిస్తున్నట్లు బిల్డప్.. ‘అయ్యా..ఎవరూ లేరు. ఆదుకోండి’..అంటూ శరణు కోరి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం.. ఆ తరువాత ఆ అనాథ చిన్నారులను అమ్మి సొమ్ము చేసుకోవడం వారికి నిత్యకృత్యం. ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శరణాలయానికి సీలు వేసి, నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: మధురై రిజర్వ్లైన్ నివాస ప్రాంతాల మధ్య ‘ఇదయం జెరియాట్రిక్ కేర్ సెంటర్’ పేరుతో ఓ అనాథ శరణాలయం ఉంది. శివకుమార్, మదార్షా అనే వ్యక్తులు దీన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధులు, మానసిక దివ్యాంగులు, అనాథలు అయిన చిన్నారులు, మహిళలు సుమారు 80 మందికిపైగా ఇందులో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉండగా, మధురై జిల్లా మేలూరు సమీపం సేక్కిపట్టికి చెందిన అజారుద్దీన్ తన గ్రామంలోని అనాథలైన ఐశ్వర్య (22), ఆమె ముగ్గురు పిల్లలను కేర్ సెంటర్లో చేర్పించాడు. ఐశ్వర్య మూడో సంతానమైన మాణిక్యం కరోనా వైరస్‌కు బలైందని, కార్పొరేషన్ సిబ్బంది సహకారంతో శశ్మానంలో ఖననం చేసినట్లు కేర్ సెంటర్ నుంచి అజారుద్దీన్‌కు సమాచారం అందింది. ఈ సమాచారానికి జత చేసిన పత్రాలను అనుమానించిన అజారుద్దీన్ జిల్లా నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు తహసీల్దారు, వీఏఓ, శిశు సంక్షేమశాఖాధికారి, పోలీసులు కేర్ సెంటర్లో విచారణ చేపట్టేందుకు వెళ్లగా నిర్వాహకులు శివకుమార్, మదార్షాలు అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో కేర్ సెంటర్ ముసుగులో గోల్మాల్ జరుగుతోందని దాదాపు నిర్ధారణకు రావడంతో విచారణ బృందం రంగంలోకి దిగింది. కరోనా సోకినందున ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పి ఈనెల 13వ తేదీన నిర్వాహకులు బిడ్డను తీసుకెళ్లారని ఐశ్వర్య తెలిపింది. కొన్నిరోజుల తరువాత నీ బిడ్డ చనిపోయింది.. ఖననం కూడా పూర్తి చేశాం, అంతిమ సంస్కారాలు చేయాల్సిందిగా శ్మశానంలోని ఒకచోటును చూపెట్టారు. తాను క్రతువు చేస్తుండగా ఫొటోలు తీశారని అధికారులకు ఆమె చెప్పింది. దీంతో ఆశ్చర్యానికి లోనైన విచారణ బృందం..అజారుద్దీన్ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించగా నకిలీవని నిర్ధారణ అయింది. వేరే ఒక చిన్నారిని పూడ్చిన చోటునే మాణిక్యంను పూడ్చినట్లుగా చూపి డ్రామా ఆడి నకీలీ పత్రాలు సృష్టించినట్లు స్పష్టమైంది. కేర్ సెంటర్లో ఆశ్రయం పొందుతున్న శ్రీదేవి అనే అనాథ కుమార్తె సహా మొత్తం 16 మంది చిన్నారులను అమ్మి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా కేర్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు తేలింది. చిన్నారుల తరలింపు వెనుక అవయవాల అమ్మకం వ్యాపారం సాగుతోందా ? లేక సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్నారా, నకిలీ పత్రాల జారీలో నిర్వాహకులకు సహకరిస్తున్న అధికారులు ఎవరు అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. చిన్నారులను విక్రయించిన తరువాత నకలీ పత్రాలతో అంతిమ సంస్కారాలు జరిపించడం, పలువురు సామాజిక కార్యకర్తలు, పోలీసులు సైతం ఎందరో అనాథలకు ఇక్కడ ఆశ్రయం కల్పించడంతో నిర్వాహకులపై ఎవరికీ అనుమానం రాలేదు. వెయ్యికి పైగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశానని ప్రచారం చేసుకున్న నిర్వాహకుడు శివకుమార్ గతంలో ప్రభుత్వం నుంచి నగదు బహుమతితో పాటు అవార్డు అందుకోవడం గమనార్హం. చిన్నారుల విక్రయాల బండారం బయటపడడంతో అనాథ శవాల వ్యవహారాన్ని కూడా అనుమానిస్తున్నారు. శివకుమార్, మదార్షా పట్టుబడితేనే ఎంతమంది చిన్నారులను అమ్మారు ? ఎంత ఆర్జించారనే వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. శరణాలయం ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలైవాణి, అనీషారాణి, సక్కూబాయి–సాధిక్ భార్యాభర్తలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. శరణాలయంలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని శరణాలయానికి సీల్ వేశారు. నిర్వాహకులు శివకుమార్, మదార్షాలను పట్టుకునేందుకు పోలీస్ కమిషనర్ ప్రేమ్ ఆనంద్సిన్హా ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనాథ శరణాలయం నుంచి అనధికారికంగా చిన్నారులను కొనుగోలు చేసిన నేరంపై గణేశన్, భవానీ, సాధిక్, అనీస్రాణి దంపతులను, శరణాలయం ఉద్యోగి కలైవాణిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. -
ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ!
ఆయనో ఎస్ఐ. శాంతిభద్రతలు కాపాడటంతో పాటు అక్రమ మద్యం, పేకాట, మట్కా తదితరాలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అధికారి. అలాంటి బాధ్యతాయుతమైన అధికారి దాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం పెనుకొండ ప్రాంతంలో పనిచేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సారు.. గతంలో చిలమత్తూరులోనూ పనిచేశారు. ఆ సమయంలో అక్కడా అక్రమ మద్యం ఏరులై పారించారు. అప్పటి సీఐ అండతో ఆయన రెండు చేతులా ఆర్జించారనే అపవాదు ఉంది. ఈయన దందా బయటపడినా అదే సీఐ అండతో ఎస్పీకే టోకరా వేసినట్లు సమాచారం. రెండు రోజుల కిందట పెనుకొండ మండలం శెట్టిపల్లి సమీపంలో పెద్ద ఎత్తున పేకాట జరుగుతోందనే సమాచారం జిల్లా ఉన్నతాధికారులకు అందింది. పెనుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అధికారులు.. అక్కడి పరిస్థితులతో విసిగిపోయి సోమందేపల్లి ఎస్ఐ వెంకటరమణకు విషయం చేరవేశారు. సదరు ఎస్ఐ వెంటనే సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి, నిందితులను అరెస్ట్ చేశారు. వాస్తవానికి శెట్టిపల్లిలో జరుగుతున్న పేకాట గురించి ముందుగానే పెనుకొండ ప్రాంతంలోని పోలీసు అధికారికి తెలిసినా ఆయనెందుకనో మౌనం వహించారు. ఈ చిన్న సారు పనితీరుకు ఇదో ఉదాహరణ మాత్రమే.. ఆయన పనిచేసిన చోటల్లా ఇదే తంతు. హిందూపురం సెంట్రల్: పెనుకొండ ప్రాంతంలో పని చేస్తున్న ఓ ఎస్ఐ పనితీరు వివాదాస్పదంగా మారింది. మట్కా నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేయడం.. దుప్పటి పంచాయితీలు చేసి డబ్బులు దండుకోవడం. చేయి తడిపితే చాలు కేసును తారుమారు చేయడం.. తనమాట వినకపోతే బెదిరింపులతో పాటు గుండాగిరీ చేయడం ఆయన నైజం. ఇలా ఖాకీ దుస్తుల్లో పోలీసు శాఖ పరువు తీస్తున్న ఆయన వైఖరిపై నిజాయితీ ముసుగులో ఖాకీ దందా శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో గతంలో ఆయన పనిచేసిన చిలమత్తూరు స్టేషన్ సిబ్బందీ ఆయన కన్నింగ్ కథలు ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటున్నారు. అక్రమ మద్యం.. ఆయన కనుసన్నల్లోనే పెనుకొండకు రాకముందు చిలమత్తూరులో పనిచేసిన ఈ చిన్న సారు.. బార్డర్లో అక్రమ మద్యం దందా జోరుగా సాగించారు. కొడికొండ చెక్‌పోస్ట్‌లో గతేడాది కరోనా లాక్డౌన్ ముగిసిన తర్వాత కర్ణాటక మద్యం రాష్ట్రంలోకి ఏరులై పారింది. అందుకు అప్పటి చిలమత్తూరు స్టేషన్‌లోని ముఖ్య అధికారే సహకరించారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. చిలమత్తూరు మండలంలోని కొందరి వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో రూ.లక్షలు దండుకున్నారని తెలుస్తోంది. అనధికార డ్రైవర్‌తో దందా అనధికారికంగా నియమించుకున్న డ్రైవర్ సాయంతో సదరు ఎస్ఐ రూ.లక్షలు కూడబెట్టినట్టు అప్పట్లో చిలమత్తూరు మండలంలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే చిలమత్తూరు ఎస్ఐగా రంగడు బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్ఐ రంగడు కొడికొండ చెక్‌పోస్ట్‌కు వెళ్లగా.. సాయంత్రం సమయంలో సర్వీస్ రోడ్లో ఓ కారు వచ్చింది. దీంతో ఎస్ఐ ఆ కారును నిలుపగా... అందులోని వ్యక్తులు కారును వదిలేసి పారిపోయారు. అందులో చిలమత్తూరు మండలానికి చెందిన వ్యక్తులతో పాటుగా అంతకుముందు చిలమత్తూరు ఎస్ఐకి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి ఉన్నట్లు తేలింది. దీనిపై అప్పుడే ‘సాక్షి’ చిల‘మత్తూరు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీన్ని ఎస్పీ సత్యయేసుబాబు సీరియస్‌గా తీసుకోగా.. ఎస్పీని తప్పుదోవ పట్టిస్తూ సీసీటీవీ పుటేజీల మాయాజాలంతో అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మభ్యపెట్టారు. చిలమత్తూరు మండలానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చూపించి కేసును సింపుల్‌గా మూసేశారు. స్వామి భక్తికి మెచ్చి డ్రైవర్‌కు ప్రమోషన్ కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో ఉన్నతాధికారులకు సహకరించిన సదరు ఎస్ఐ డ్రైవర్‌కు సర్కిల్‌స్థాయి అధికారి ప్రమోషన్ ఇప్పించి ఏకంగా ఎస్పీఓగా తీసుకున్నారు. ఆధారాలు తారుమారు చేసిన తర్వాత తమను ఎవరు ఏమి చెయ్యగలరనే ధైర్యంతో ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పెనుకొండ వ్యవహారంపై తీవ్ర చర్చ ఇక పెనుకొండ పోలీస్ స్టేషన్ విషయంపై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త పెనుకొండ పోలీసు సబ్ డివిజన్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఆ ఎస్ఐ ఎక్కడికి వెళ్లినా ఇంతేనా అంటూ పోలీసులే పెదవి విరుస్తున్నారు. చదవండి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు -
జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక అసలు కారణాలను వెలికితీయాలని తమిళనాడులో కొత్తగా కొలువుతీరిన డీఎంకే ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఆసుపత్రిలో జయలలిత చివరి ఆరునెలల కాలంలో ఫైళ్లపై సందేహాస్పద సంతకాలు, రూ.కోట్ల ఒప్పందాలు, టెండర్లు కట్టబెట్టడం తదితర అంశాలపై కూపీలాగాలని ఐఏఎస్ అధికారులను నూతన ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ కోవిడ్ పరిస్థితులను చక్కబెట్టడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వం అమలుచేసిన కోవిడ్ ఆంక్షలకు తోడుగా పూర్తి లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై విచారణ చేపట్టేందుకు స్టాలిన్ రహస్యంగా సమాయుత్తం అవుతున్నారు. అన్నాడీఎంకే హ యాంలో చేసుకున్న ఒప్పందాలు, జరిపిన నియా మకాలు, ఎవరెవరికి ప్రభుత్వ పనులు అప్పగించారు? ఏ పనులకు ఎంత ఖర్చు చేశారు? అనే అం శాలపై పూర్తి వివరాలు సేకరించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. తన చుట్టూ అత్యంత విశ్వాసపాత్రులు, నిజాయితీపరులైన ఐఏఎస్ అధికారులను నియమించుకున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించిన ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలోని అనేక వ్యవహారాలపై కూపీలాగే బాధ్యతలను సదరు ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. ఈ అంశాల్లో ప్రధానమైనది ప్రభుత్వ ఫైళ్లలో ‘జయలలిత సంతకం’. 2016 సెపె్టంబరు 23న అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన జయలలిత అదే ఏడా ది డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. ఆమె మరణానికి అసలు కారణాలను కనుగొనేందుకు అప్పటి ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ఇంతకాలమైనా ఇంకా నివేదిక సమరి్పంచలేదు. మరణానికి ముందు.. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్న ఆరునెలల మధ్య కాలంలో ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. జయ ఆసుపత్రిలో చేరేముందు కొన్ని వారాలపాటు ఫైళ్లపై ఆమె సంతకాలు చేయలేదనే ఆరోపణలు, విమర్శలు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో పెరిగాయి. అధికారులు కొన్ని ఫైళ్లను వెలికి తీసి పరిశీలించగా జయలలిత సంతకం చేయకుండానే నిర్ణయాలు జరిగినట్లు బయటపడింది. ఆయా ఫైళ్లలో సీఎం హోదాలో జయలలిత సంతకం చేయాల్సిన చోట ‘జే æజే’ అనే అక్షరాలే ఉన్నాయి. ఇలాంటి సంతకాలున్న ఫైళ్లపైనే ముఖ్యంగా విచారణ జరపాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. రూ.కోట్ల విలువైన కొన్ని టెండర్లు సైతం జయసంతకం లేకుండానే ఆమోదం పొందినట్లు తేలింది. జయకు తెలియ కుండానే ఈ నిర్ణయాలు జరిగాయా? లేక ఆసుపత్రిలో ఉన్న ఆమెకు చెప్పి చేశారా? అప్పట్లో అత్యున్నత బాధ్యతల్లో ఉన్న ఉన్నతాధికారుల ప్రమే యంపై సైతం దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. జె.జె. అనే అక్షరాలు జయలలిత సంతకమేనని ఆసుపత్రిలో ఉన్నపుడు ఆమె అలా సంతకం చేశా రని కొందరు చెబుతున్నారు. డీఎంకే అధికారం చేపట్టిన తరువాత అన్నాడీఎంకేను ఎ లాంటి ఒత్తిళ్లకు గురిచేయలేదు. కానీ, గత ప్రభుత్వ అవకతవకలపై నిగ్గుతేల్చేందుకు పరోక్షంగా డీఎంకే ప్రభుత్వం సిద్ధమైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’
పరిగి మండలానికి చెందిన నరేష్ కొన్ని వారాల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. మూడు రోజుల తర్వాత స్వల్పంగా దగ్గు మొదలైంది. ఎందుకైనా మంచిదని హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకున్నారు. చికిత్స కోసం వచ్చిన అతన్ని కనీసం తలెత్తి కూడా చూడని ఆ డాక్టర్.. నరేష్ చెబుతున్న జబ్బు లక్షణాలు పూర్తి కాకనే ఓ రెఫరల్ ప్రిస్కిప్షన్ చేతిలో పెట్టేశాడు. చెస్ట్ ఎక్స్‌రే, సీటీ స్కాన్, బ్లడ్ చెకప్ చేయించాలని రాసి ఉంది. అదే ఆస్పత్రిలోని డయాగ్నస్టిక్ ల్యాబ్ టెక్నీషియన్‌ను కలిసి బ్లడ్ చెకప్‌కు సంబంధించి నమూనాలు ఇచ్చి, రూ.900 బిల్లు చెల్లించాడు. డాక్టర్ సూచించిన ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి ఎక్స్‌రే కోసం రూ.350, సీటీ స్కాన్ కోసం రూ.3వేలు బిల్లు చెల్లించుకున్నాడు. ఈ మొత్తం రిపోర్టులు పరిశీలించిన తర్వాత నరేష్‌కు కరోనా సోకిందంటూ నెమ్మదిగా చెప్పిన డాక్టర్.. తనకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాప్ ద్వారా రూ.800 విలువ చేసే మందులు కొనుగోలు చేయించాడు. దగ్గు కోసం చికిత్సకు వెళితే.. కేవలం రెండు గంటల వ్యవధిలో డాక్టర్ కన్సల్టింగ్ ఫీజుతో కలిపి రూ.4,350 వరకు నరేష్ చెల్లించుకోవాల్సి వచ్చింది. తనలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో ఎందుకైనా మంచిదని అదే రోజు తనకు తెలిసిన ఊపిరితిత్తులకు సంబంధించిన మరో ప్రైవేట్ వైద్యుడిని కలిశాడు. అతన్ని పూర్తిస్థాయిలో పరీక్షించిన అనంతరం కరోనా లేదని, ఇన్ఫెక్షన్ సోకడం వల్ల దగ్గు వస్తోందంటూ తేల్చి ఓ టానిక్, కొన్ని మందులు రాసిచ్చాడు. ఇక్కడ ఆస్పత్రి కన్సల్టెంగ్ ఫీజు, నెబులైజర్, మందులకు 1,300 ఖర్చయింది. ఇంటికెళ్లి ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ రాసిచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడడంతో ఓ రెండు రోజుల తర్వాత నరేష్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ పరిస్థితి కేవలం నరేష్ ఒక్కనిదే కాదు. సాధారణ జబ్బులతో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరుతున్న వారందరూ ఈ తరహా దోపిడీకి గురవుతున్నారు. హిందూపురం టౌన్: ఆస్పత్రికి వచ్చే వారిని కచ్చితంగా సీటీ స్కానింగ్ చేయించుకోవాలని ప్రైవేట్ వైద్యులు జులుం చేస్తున్నారు. ఇలా హిందూపురం ప్రాంతంలోని చాలా ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ పేరిట పెద్ద ఎత్తున స్కామ్‌కు తెరలేపారు. కరోనా కష్టకాలంలో రోగుల్లోని భయాన్ని కొందరు డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశారు. స్వల్పంగా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే చాలు.. అవసరం లేకున్నా వైద్య పరీక్షలు అంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. రోజుకు సగటున 70కి పైగా.. హిందూపురం జిల్లా ఆస్పత్రితో పాటు మరో మూడు ప్రైవేట్ సీటీ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో జిల్లా ఆస్పత్రిలోని సీటీ స్కానింగ్ యంత్రం పనిచేయడం లేదు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలోనూ ఒకటి పనిచేయడం లేదు. దీంతో పనిచేస్తున్న రెండు స్కానింగ్ సెంటర్లకు కరోనా కష్ట కాలంలో భారీ డిమాండ్ నెలకొంది. గతంలో సీటీ స్కాన్‌కు రోగి అవసరాన్ని బట్టి రూ.4 వేలు నుంచి రూ.5వేల వరకూ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు వసూలు చేసుకునేవారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ తీసుకుంటున్నారు. ఈ లెక్కన హిందూపురంలోని స్కానింగ్ సెంటర్లలో రోజుకు 70 నుంచి 140 వరకు సీటీ స్కాన్లు నిర్వహిస్తుంటారు. జిల్లాస్పత్రిలో సీటీ స్కాన్ పనిచేయకపోవడంతో అవసరాన్ని బట్టి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రెఫర్ చేస్తుంటారు. రెఫరల్‌కు రూ.800 కమీషన్ హిందూపురం నియోజకవర్గంతో పాటు పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల ప్రజలు అత్యవసర చికిత్సల కోసం హిందూపురంలోని ఆస్పత్రులనే ఆశ్రయిస్తుంటారు. కరోనా భయంతో కుదేలవుతున్న రోగులకు అవసరం లేకున్నా సీటీ స్కాన్లు నిర్వహిస్తూ ఆర్ఎంపీలు, ప్రైవేట్ డాక్టర్లు తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. తమ వద్దకు చికిత్స కోసం వచ్చిన రోగులకు అవసరం లేకున్నా.. ముందుగా సీటీ స్కాన్లు, బ్లడ్ చెకప్‌లు, ఎక్స్‌రేలకు డాక్టర్లు రెఫర్ చేస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యకూ సీటీ స్కాన్ తప్పనిసరి చేసేశారు. సీటీ స్కానింగ్‌కు రెఫర్ చేసిన డాక్టర్‌కు ఒక్కో స్కాన్‌కు రూ.800 చొప్పున కమీషన్‌ను స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు అందజేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇతర వైద్య పరీక్షల్లోనూ కమీషన్లను డాక్టర్లు దండుకుంటున్నారు. చివరకు మందుల కొనుగోలు విషయంలోనూ కమీషన్లు ఉండడంతో ప్రి్రస్కిప్షన్ చాలా పొడవుగా ఉంటోంది. సీటీ స్కాన్‌తో అన్నీ సమస్యలే.. అవసరం లేకున్నా సీటీ స్కాన్ చేయించడం చాలా ముప్పు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందంటున్నారు. కొంతమంది వైద్యులు ప్రతి మూడు రోజులకు ఒకసారి సీటీ స్కాన్ చేయిస్తుంటారని, దీంతో రోగి శరీరం అధిక రేడియేషన్‌కు గురికావడంతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు మాత్రం అదీ వైద్యులు సూచిస్తేనే సీటీ స్కాన్ చేయించుకోవాలని చెబుతున్నారు. సీటీ స్కాన్ కంటే చెస్ట్ ఎక్స్రేకే తొలి ప్రాధాన్యమివ్వాలని.. అప్పటికీ జబ్బు పరిస్థితి తేలకపోతే సీటీ స్కాన్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. ఒక సీటీ స్కాన్ 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్‌రేలతో సమానమని హెచ్చరిస్తున్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడే వారికి సీటీ స్కాన్ అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్న వారు, ఆక్సిజన్ లెవల్స్ సాధారణంగా ఉన్న వారికి సీటీ స్కాన్ అసలు అవసరం లేదని అంటున్నారు. తుంగలోకి కోవిడ్ నిబంధనలు కరోనా నిర్ధారణకు ఆర్ఎంపీలు, ప్రైవేట్ వైద్యులు సీటీ స్కాన్పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. దీంతో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ డిమాండ్‌ను అనుకూలంగా మార్చుకున్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కేశారు. డాక్టర్లు రాసిచ్చిన రెఫరల్ ప్రి్రస్కిప్షన్ను మళ్లీ రోగి చేతికి ఏ ఒక్క స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఇవ్వడం లేదు. కేవలం రిపోర్టులు మాత్రమే చేతిలో పెట్టేసి డబ్బు గుంజుతున్నారు. దీనికి తోడు ఒకరికి స్కాన్ చేసిన తర్వాత యంత్రాన్ని పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయడం లేదు. దీంతో తొలుత స్కాన్ చేసిన రోగికి కరోనా పాజిటివ్ ఉంటే.. తర్వాత స్కాన్ చేసిన రోగికి లేకపోయినా.. అతను కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదు. అయితే నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డాక్టర్ రెఫరల్ ప్రిస్కిప్షన్ లేకపోయినా.. సొంత నిర్ణయాలతో సీటీ స్కాన్లు చేసేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డాక్టర్ సిఫారసు లేకుండా చేయరాదు అవసరం లేకున్నా స్కాన్‌కు రెఫర్ చేయడం సరికాదు. క్వాలిఫైడ్ డాక్టర్ల సిఫారసు లేకుండా సీటీ స్కాన్ చేస్తే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. రోగులు సైతం డాక్టర్ల సలహా మేరకే స్కానింగ్ చేయించుకోవాలి. వ్యక్తిగత నిర్ణయాలు చాలా నష్టం కలిగిస్తాయి. – డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ చదవండి: ప్రాణ వాయువుకు ఫుల్‘పవర్’ నిరంతరాయంగా స్టీల్‌ప్లాంట్ ఆక్సిజన్ -
‘ప్రైవేటు’ నిర్వాకం.. ఇదేంటని ప్రశ్నిస్తే వైద్యం బంద్
కడప రూరల్: కోవిడ్ బాధితులకు చికిత్స చేసే విషయంలో అక్రమాలను అధికారులు ప్రశ్నించినందుకు నిరసనగా వైఎస్సార్‌జిల్లా కేంద్రం కడపలోని 6 ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులు వైద్యం నిలిపేశాయి. ఈ ఆస్పత్రుల్లో చికిత్సకు కోవిడ్ బాధితుల నుంచి రోజుకు రూ.50 వేలు, రూ.లక్షకు పైగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ హరికిరణ్.. జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ తదితరులతో ఆ ఆస్పత్రుల్లో తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు, లోపాలు వెలుగుచూశాయి. ఆరోగ్యశ్రీ కోవిడ్ పేషెంట్ల వద్ద డబ్బులు అధికంగా వసూలు చేసినట్లు తేలడంతో రెండు ఆస్పత్రులకు జరిమానా వేశారు. అనంతరం కూడా కొన్ని ఆస్పత్రుల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం కడపలోని ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రుల యజమానులు సమావేశమయ్యారు. అధికారులు అక్రమాల గురించి ప్రశ్నించడం జీర్ణించుకోలేకపోయిన వారు.. కోవిడ్ ఆస్పత్రుల్లో కరోనా బాధితులను అడ్మిట్ చేసుకోకూడదని, వైద్యసేవలు అందించకూడదని నిర్ణయించారు. ఆస్పత్రులను మూసేసి, కోవిడ్ పేషెంట్లను చేర్చుకోబోమంటూ ముఖద్వారాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సరికాదు..: చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి: వైఎస్సార్ జిల్లా పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ‘కరోనా కేసులను చూడం..’ అంటూ బోర్డులు పెట్టడం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్ణయంపై గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ఆస్పత్రులను శిక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు బయట మార్కెట్‌కు తరలుతున్నాయని, తద్వారా నిజమైన పేదలకు అవి అందడం లేదనే విజిలెన్స్ తనిఖీలు జరిపారని, ఇవి కక్షపూరితం కాదని చెప్పారు. పేదలకు ఆరోగ్య సహాయ çసహకారాలు అందాల్సిన సమయంలో వైద్యులు చెడ్డపేరు మూటగట్టుకునే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. రాయచోటిలో కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన అమరావతి ఆస్పత్రిని శానిటేషన్ పేరుతో మే 1 వరకు మూసివేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. దీనిపై పునరాలోచించాలని కోరారు. తప్పుచేసిన ఆస్పత్రి యజమానులు, వైద్యులపైన మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆయన గుర్తుచేశారు. చదవండి: ఏపీ: జర్నలిస్టుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం -
అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే..
దొండపర్తి(విశాఖ దక్షిణ): టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దందాలకు కాదేదీ అనర్హం అన్నట్లు ఉంది. లిక్కర్ మాఫియా.. భూకబ్జాలు.. సెటిల్మెంట్లు.. దౌర్జన్యాలు.. ఇలా అనేక అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన తూర్పు నియోజకవర్గం.. తాజాగా వెలగపూడి ఫుడ్స్టాళ్లకు కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ 90 శాతం స్టాళ్లు, ఫుడ్ ట్రక్కులు ఆయన వర్గానికి చెందిన స్థానికేతర వ్యాపారులవే. స్థానికులకు అవకాశం లేకుండా కృష్ణా, ఇతర జిల్లాల నుంచి అనుచరగణాన్ని జిల్లాలోకి దింపి తూర్పులో స్థానిక చిరువ్యాపారులపై పెత్తనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి ఎంవీపీ కాలనీ, చినవాల్తేరు, పార్కు హోటల్ ప్రాంతాల్లో కూడళ్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్లు సైతం ఆక్రమించారు. ఆ స్థలాల్లో అనధికారంగా ఫుడ్‌ట్రక్కులు, తోపుడుబళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని తరువాత చిరు వ్యాపారులకు అద్దెలకిచ్చి వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇలా మొదలు పెట్టి.. అలా పాగా తూర్పు నియోజకవర్గంలో కొంత మంది టీడీపీ నేతలు వ్యాపారాల పేరుతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పేదల స్వయం ఉపాధి, చిరు వ్యాపారాల పేరు చెప్పి ప్రధాన జంక్షన్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించుకుంటున్నారు. ముందు చిన్న తోపుడు బండ్లను పెట్టించడం.. కొద్ది కాలానికి నెమ్మదిగా ఒక బడ్డీ ఏర్పాటు చేయించడం.. మరికొద్ది రోజులకు అక్కడ ఒక షెడ్డును నిర్మించడం.. ఇలా పరిపాటిగా మార్చుకున్నారు. అడుగడుగునా ఫుడ్‌ట్రక్కులు నియోజకవర్గంలో ఫుడ్‌ట్రక్కులు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ బళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎంవీపీ కాలనీలో ఏఎస్‌రాజా కాలేజీ గ్రౌండ్ నుంచి మొదలుకొని సమతా కాలేజీ వరకు సుమారు 80 వరకు ఫుడ్ ట్రక్కులు, ఫాస్ట్‌ఫుడ్ బళ్లు ఉన్నాయి. ఎంవీపీ రైతుబజార్ రోడ్డు నుంచి లుంబినీ పార్కు వరకు కూడా ఇదే తరహాలో ఫుడ్‌స్టాల్స్ వచ్చేశాయి. చినవాల్తేరు జంక్షన్ నుంచి పార్కు హోటల్ వరకు, హోటల్ ఎదురుగా పెదవాల్తేరుకు వెళ్లే దారిలో కూడా పదుల సంఖ్యలో బడ్డీలు, ఫుడ్‌ట్రక్కులు పుట్టుకొచ్చాయి. అనధికార వ్యాపారాలే ఎక్కువ పేదల జీవనోపాధి కోసం చేసే వ్యాపారులకు జీవీఎంసీ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అధికారులకు దరఖాస్తు చేసుకుంటే తోపుడు బండ్లు, ఫుడ్ ట్రక్కులు పెట్టుకోవడానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేని స్థలాన్ని గుర్తించి అక్కడ వ్యాపారానికి అవకాశం కల్పిస్తున్నారు. చిరు వ్యాపారులను ఆదుకోవడానికి జీవీఎంసీ ఉదారంగా అనుమతులిస్తున్నప్పటికీ.. ఎమ్మెల్యే అనుచరులు కొంత మంది అనధికారంగా బడ్డీలు, ట్రక్కులను ఏర్పాటు చేయిస్తున్నారు. ఎంవీపీ కాలనీలో 25 మంది చిరు వ్యాపారులకు మాత్రమే జీవీఎంసీ అనుమతులు ఇచ్చింది. అయితే అక్కడ 150 వరకు బండ్లు, ట్రక్కుల్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారం జరుగుతోంది. రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కారణంగా పాదచారులు, వాహనదారులు ఇబ్బందులుపడుతున్నప్పటికీ.. వారు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ.. ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా అధికారులు వాటిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే కొంత మంది వీధి వ్యాపారుల యూనియన్ పేరుతో చిరువ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండడం గమనార్హం. ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులే ఈ దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వరుసగా ఆక్రమణల తొలగింపు జీవీఎంసీ అధికారులు ‘రైట్ టు వాక్’పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లపై పెట్టిన బడ్డీలు, బళ్లను తొలగిస్తున్నారు. అనుమతులు ఉన్న ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రా యూనివర్సిటీ స్థలాన్ని ఆక్రమించి వేసుకున్న షాపులను కూలి్చవేశారు. రెండు రోజులుగా ఎన్ఏడీ, గోపాలపట్నం ప్రాంతాలతో పాటు నగరంలో కొన్ని చోట్ల బడ్డీలను తొలగించారు. ఆదివారం రుషికొండ ప్రాంతంలో అక్రమంగా వేసిన షాపులను కూడా తీసేశారు. తూర్పు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే అనుచరుల నుంచి షాపులను ఖాళీ చేయించి నిజమైన లబ్ధిదారులు, అనుమతులు పొందిన చిరువ్యాపారులకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ప్రధాన జంక్షన్లలో ఉన్న అనధికార ట్రక్కులు, ఫుట్‌స్టాల్స్‌ను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక వ్యాపారులకు మొండిచెయ్యి నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఫుడ్‌ట్రక్కులు, ఫాస్ట్‌ఫుడ్ బండ్లు ఉన్నప్పటికీ.. వాటిల్లో స్థానికులకు 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. కృష్ణా, ఇతర జిల్లాల నుంచి ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ఇక్కడ దందా సాగిస్తుండడం గమనార్హం. స్థానిక చిరు వ్యాపారులకు అవకాశం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. అక్రమంగా, అనధికారంగా స్థానికేతరులు చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు అధికారులను కోరుతున్నారు. అలాగే స్థానికులకే ముందు అవకాశం కలి్పంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేలాది రూపాయల అద్దెల వసూలు ప్రభుత్వ స్థలాలు, ఫుట్‌పాత్‌లపై అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న స్టాళ్లు, బడ్డీలు, ఫుడ్‌ట్రక్కులను టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారు. అనధికారికంగా చేస్తున్న వ్యాపార స్థలాలు, బళ్లను వేలాది రూపాయలకు అద్దెలకిస్తూ డబ్బులు చేసుకుంటున్నారు. ప్రాంతం, షాపును బట్టి రూ.5 వేలు నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల రోజువారి అద్దెలు పిండుకుంటున్నారు. జీవీఎంసీకి ఒక పైసా కూడా కట్టకపోగా.. నిబంధనల ప్రకారం వ్యాపారానికి తీసుకోవాల్సిన ట్రేడ్ లైసెన్సులు కూడా పొందడం లేదు. రెండో రోజు 20 బడ్డీల తొలగింపు కొమ్మాది(భీమిలి): రుషికొండ బీచ్ రోడ్డులోని ఫుట్‌పాత్‌పై అనధికారికంగా ఏర్పాటు చేసిన బడ్డీల తొలగింపు రెండో రోజు సోమవారం కూడా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు పెదరుషికొండ నుంచి ఐటీ జంక్షన్ వరకూ రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై ఉన్న 20 బడ్డీలను తొలగించారు. మొత్తం 90 బడ్డీలను తొలగించినట్టు అధికారులు తెలిపారు. విశాఖ నుంచి భీమిలి వరకు త్వరలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనుల నేపథ్యంలో త్వరితగతిన ఆక్రమణలు తొలగిస్తున్నట్లు అధికారులు వివరించారు. బడ్డీల తొలగింపు విషయం ముందుగానే తెలుసుకున్న నిర్వాహకులు తమ సామాన్లను ఇంటికి తీసుకెళ్లడంతో అంతా ప్రశాంతంగా జరిగింది. పీఎంపాలెం సీఐ రవికుమార్, ఏసీపీ అరుణవళ్లీ, టీపీవోలు రఘునాథరావు, ప్రసాద్‌ల పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్.. నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పెతకంశెట్టి గణవెంకటరెడ్డి నాయుడు ... అంటే అర్థం కాలేదు కదా... అదేనండి గణబాబు... విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే.. టీడీపీ సీనియర్ నాయకుడు. ఏమిటీ ఇంకా గుర్తుకు రాలేదా.. అవును మరీ.. 2019 ఎన్నికల తర్వాత ఒకటిరెండు సార్లు తప్పించి.. పెద్దగా ఇంటి గడప దాటి బయటకు రాని ఎమ్మెల్యే ఈయన. ఇప్పుడీయన సంగతేమిటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. పైకి సుతిమెత్తగా మాట్లాడే ఈయన అక్రమార్జన మాత్రం గణగణ మోగాల్సిందే. సర్కారీ స్థలంలో ఏకంగా సినిమా థియేటర్లు కట్టేసుకుని ఆనక కోర్టుకు వెళ్ళి.. ఎంచగ్గా ఆక్రమణ ‘చిత్రం’ నడిపించేస్తున్నారు ఈయనగారు.. పూర్తి ‘సినిమా’ చూడాలంటే ఈ కథనంలోకి రావాల్సిందే. వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులను కాపాడుకోవడం, చేతనైతే పెంచుకోవాలనుకోవడం ఇవన్నీ సహజం.. ఎవరైనా అదే చేస్తుంటారు. కానీ ఎమ్మెల్యే గణబాబు రూటే సెపరేట్.. వారసత్వంగా వచ్చిన ఆక్రమిత స్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి గత టీడీపీ హయాంలో అప్పటి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. 22ఏ(ప్రభుత్వ స్థలం) నుంచి బయటకు తీసుకువచ్చేలా జీవో(నెం 361) తెప్పించుకున్నారు. ఇటీవల రెవిన్యూ యంత్రాంగం పూర్తి స్థాయి పరిశీలిస్తే గణబాబు వారి ఆ ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు విశాఖ రూరల్ మండలం.. ఇప్పుడు గోపాలపట్నం మండలం.. గోపాలపట్నం రెవెన్యూ గ్రామం సింహాచలం రైల్వే స్టేషన్ సమీపంలో సర్వే నెంబర్ 27బై1లో 35.5సెంట్ల(సుమారు1726.67 చదరపు గజాల) ప్రభుత్వ స్థలంలో గణబాబు తాత అప్పలనాయుడు ఐదు దశాబ్దాల క్రితం ఓ సినిమా థియేటర్ నిర్మించారు. అప్పట్లో ఆ స్థలం గ్రామ కంఠంగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. తర్వాత కాలంలో ప్రభుత్వ డ్రై స్థలం (పోరంబోకు)గా రికార్డుల్లో చూపించారు. 1962లో సింహాచలం దేవస్థానం అధికారులు ఈ భూమికి సంబంధించి రైతు వారీ పట్టా ఇవ్వాల్సిందిగా అనకాపల్లి అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే.. ఈ భూమి మాదేనంటూ 2009లో జిల్లా పరిషత్ సీఈవో అప్పటి రూరల్ తహశీల్దార్‌కు లేఖ రాశారు. ఈ స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి తప్పించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇలా ఆ భూమిపై వివాదాలు నడుస్తుండగానే గణబాబు కుటుంబం సదరు సినిమా థియేటర్ రూపు మార్చేసింది. నరసింహా, శ్రీ నరసింహా పేర్లతో రెండు థియేటర్లు నిర్మించేసింది. మరోవైపు 2014లో ఆ ప్రాంత ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గణబాబు ఎన్నికయ్యారు. అప్పటికే రియల్ బూమ్ ఆకాశాన్నంటిన విశాఖలో 35.5సెంట్ల స్థలం విలువ కోట్లకు ఎగబాకింది. గోపాలపట్నంలోని నరసింహా, శ్రీ నరసింహా సినిమా థియేటర్లు.. దీంతో సదరు భూమిని ఎలాగైనా పూర్తిగా హస్తగతం చేసుకోవాలని గణబాబు పక్కా స్కెచ్ వేశారు. టీడీపీ ప్రభుత్వమే కావడంతో 2015లో ఎమ్మెల్యే గిరీ ఉపయోగించి గ్రామ కంఠం నుంచి ఆ స్థలానికి మినహాయింపు పొందారు. ఈ మేరకు 2015 సెప్టెంబర్ 29న రెవిన్యూ శాఖ నుంచి జీవో కూడా విడుదలైంది. ఇక ఆ తర్వాత స్థలాన్ని 22ఏ నుంచి తొలగించాలని ఓ వైపు కోర్టులో దాఖలు చేస్తూనే మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే 2016 జనవరి 22న అప్పటి జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఆర్సి నంబర్ 3153బై2015ఈ.1 ప్రకారం ఆ స్థలం 22ఏలో నుంచి బయట పడింది. స్థలాన్ని మింగేందుకు సబ్ డివిజన్లు సదరు విలువైన పోరంబోకు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు గణబాబు ఎన్నో మాయోపాయాలు ప్రయోగించారు. ఆ క్రమంలో ఆ భూమిని లెక్కకు మించిన సబ్ డివిజన్లుగా విభజించారు. మొదట్లో ఒకే ఒక (27బై1) సర్వే నెంబర్ పేరిట ఉన్న స్థలాన్ని ఆ తర్వాత 27బై4, 27బై5, 27బై5పి, 27బై16పి, 27బై18 సర్వే నెంబర్లుగా రూపాంతం చేశారు. దీంతో భూమి స్థితి మారి.. 22ఏ నుంచి బయటపడేందుకు మార్గం సులువైంది. ఈ మేరకు అప్పట్లో అధికారులు ఆయనకు పూర్తిస్థాయిలో సహకరించారని స్పష్టమవుతోంది. అధికారుల గ్రౌండ్ రిపోర్ట్‌తో బయటపడిన వాస్తవాలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దరిమిలా ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. టీడీపీ హయాంలో అక్రమార్కుల పరమైన సర్కారీ స్థలాలను ఆక్రమణల చెర నుంచి విడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్లు విలువైన గణబాబు సినిమా థియేటర్ల స్థలంపై కూడా దృష్టిసారించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలికితీసి జిల్లా అధికార యంత్రాంగానికి నివేదికనిచ్చారు. చదవండి: గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ భూ అక్రమాలు ప్చ్.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా! -
ఏబీపై క్రమశిక్షణ కొరడా!
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి సస్పెండై సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులపై బహిరంగ ఆరోపణలకు దిగిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఏబీ వెంకటేశ్వరరావు (ఐపీఎస్ బ్యాచ్ 1989)పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి సస్పెండైన ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముందు విచారణకు హాజరైన అనంతరం సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా విచారణకు సంబంధించిన అనేక అంశాలను బహిర్గతం చేశారు. ఈ నెల 4న వెలగపూడిలోని సెక్రటేరియెట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పలువురు అధికారులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు చేశారు. అఖిల భారత సర్వీసులో ఉన్న అధికారులు రాజకీయంగా, బయటి వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తించకూడదన్న నిబంధనలను అతిక్రమించారు. అఖిల భారత సర్వీసు (క్రమశిక్షణ–అప్పీల్) నియమాలు–1969, అఖిల భారత సర్వీస్(ప్రవర్తన) నియమాలు–1968 ప్రకారం నిబంధనలను అతిక్రమించిన ఏబీ వెంకటేశ్వరరావును వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సంబంధిత అధికారి వద్ద ఆయన స్వయంగా హాజరై రాతపూర్వకంగా 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. సర్వీసు రూల్స్ అతిక్రమించి దుష్ప్రవర్తన(మిస్ కాండక్ట్)కు పాల్పడిన ఏబీ వెంకటేశ్వరరావు గడువులోగా సహేతుకమైన వివరణ ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఆర్‌ఆర్‌ఐలో అక్రమాలు: వారికి ధనార్జనే ధ్యేయం
గుడివాడ టౌన్: హోమియో ప్రాంతీయ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ) అక్రమాలకు వేదికగా మారింది. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందన లేకుండా పోతోంది. కనీసం ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఇవి వెళ్లడం లేదని సమాచారం. ఇక్కడ పనిచేసే అధికారులే ఎక్కువ శాతం ఈ వ్యవహారంలో భాగస్వాములు కావడంతో ఎవరూ కిమ్మనడం లేదని తెలుస్తోంది. అందుకే దీనిపై ఫిర్యాదులు వెళ్లినా మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పందన నిల్.. ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ దినపత్రిక గత నెల 25న ‘పరిశోధనం స్వాహా’ అనే శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇది వచ్చి పదిహేను రోజులు దాటినా ఇంతవరకు దీనిపై కనీస చర్యలకు పూనుకోలేదు. వాస్తవానికి దీనిపై విచారణకు ఆదేశించేందుకు ఏ అధికారి ముందుకు రావడం లేదని సమాచారం. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి అధికారులు అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల నుంచి ఫలానా మెడికల్ షాపుల్లో మందులు కొనాలని ప్రిప్రస్కిప్షన్ రాయటం వరకు ఏదో ఒక మార్గంలో కమీషన్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదని చెబుతున్నారు. మంచి సక్సెస్ రేటు.. గుడివాడ ప్రాంతీయ హోమియో పరిశోధనా స్థానం నుంచి గతంలో అనేక పరిశోధనలు విజయవంతం అయ్యాయి. హోమియో వైద్యం ద్వారా అనేక వంశపారంపర్య దీర్ఘ రోగాలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చిస్తుంటే, ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులు మాత్రం సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాక ముందు.. ఇక్కడ పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి మరో హోమియో స్టోర్స్ యజమానుల భాగస్వామ్యంతో పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసిన మందుల కంపెనీకి చెందిన మందులనే ఇక్కడకు వచ్చిన తమకు అంటగట్టేవారని రోగులు చెబుతున్నారు. ఈ తంతు రెండేళ్లుగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వచ్చే రోగులకు కనీసం రెండు మూడు రకాల ‘మందులు ఇక్కడ లేవు. ఫలానా మందుల షాపులో కొనుక్కోండి’ అని చెప్పి పంపేవారని రోగులు వివరిస్తున్నారు. అయితే సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమయ్యాక ఫలానా షాపులో కొనండి అని రాసే స్లిప్పులను తొలగించారు. రోగి తనకిష్టం వచ్చిన చోట మందులు కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడా అక్కడా తీసుకుంటున్నారు.. ఆర్‌ఆర్‌ఐలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వైద్యులు ఇళ్ల వద్ద ప్రైవేట్ వైద్య సేవలు నిర్వహించరాదు. అందుకు ప్రతిగా వారికి బేసిక్ పేలో 20 శాతం అదనంగా జీతం అందజేస్తారు. అంటే రూ.2 లక్షలు బేసిక్ ఉంటే రూ.40 వేలు నెలకు అదనపు జీతం అందుతుంది. అయినప్పటికీ ఆర్‌ఆర్‌ఐలో పనిచేస్తున్న వారు ఇంటి వద్ద వైద్య వ్యాపారం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆరుగురు వైద్యులు ఇక్కడ పరి్మనెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అందరూ ఇక్కడా అక్కడా లాభం పొందుతూనే ఉన్నారు. ఇప్పటికైనా స్పందిస్తే.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్‌ఐలో అవినీతి ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలోనూ.. ఇక్కడ ఉద్యోగ విరమణ చేసిన ఉన్నత స్థాయి వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగాల నియామకంలో తన చేతివాటం చూపించి రూ.30 లక్షలకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో 2019 జూలై నెలలో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ (177/2019) నమోదు చేశారు. సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇందుకోసం ఇక్కడ పనిచేసిన విశ్రాంత ఉద్యోగి(యూడీసీ) కాంట్రాక్ట్ ఉద్యోగుల సహాయం తీసుకుని, నిరుద్యోగులను ప్రలోభపెట్టి ఈ వసూలు దందాకు పాల్పడ్డాడని చెబుతున్నారు. చదవండి: పత్రికల్లో వార్తలు సేకరించి.. ఇంటెలిజెన్స్ డీఎస్పీనంటూ.. మండుటెండలో సైతం.. భక్తిభావం ఉప్పొంగగా.. -
ఏబీవీ అక్రమాలపై విచారణ తుది దశకు
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిబంధనలకు పాతరేసి అక్రమాలకు పాల్పడం ద్వారా దేశ ద్రోహానికి ఒడిగట్టారనే అభియోగంపై సస్పెన్షన్‌కు గురైన రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)పై విచారణ తుది దశకు చేరింది. సెలవు రోజైన ఆదివారం కూడా వెలగపూడి సచివాలయంలో ఈ విచారణ కొనసాగింది. ఏబీవీ అక్రమాలపై శాఖాపరమైన విచారణను గత నెల 18న కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సిసోసియా చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం 22 నుంచి రోజూ కొనసాగింది. 14 రోజులపాటు సాగిన ఈ విచారణలో 21 మందికి పైగా సాక్షులను విచారించి వారిచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. తనపై వచ్చిన అభియోగాలకు వివరణ ఇచ్చేందుకు ఏబీవీ రోజువారీగా హాజరు కాగా, మాజీ డీజీపీలు, పలువురు ఐపీఎస్‌లు హాజరై సాక్ష్యం ఇచ్చారు. సాక్షులుగా మాజీ డీజీపీలు జేవీ రాముడు, నండూరి సాంబశివరావు, ఎం.మాలకొండయ్య, ఆర్పీ ఠాకూర్ హాజరై వివరణ ఇచ్చినట్లు సమాచారం. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎన్వీ సురేంద్రబాబు, సీహెచ్ ద్వారకా తిరుమలరావు, రవిశంకర్ అయ్యన్నార్ తదితరులూ హాజరయ్యారు. కాగా, ఏబీవీపై శాఖాపరమైన విచారణను ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రోజువారీ విచారణను చేపట్టి మే 3లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చేపట్టే విచారణను ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో చేపట్టాలని ఏబీవీ కోరారు. కానీ, జ్యూడీషియల్ సంస్థగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ గోప్యంగానే జరుగుతుందని స్పష్టంచేసింది. మరోవైపు.. ఈ నెలాఖరు నాటికి నివేదిక సిద్ధంకానుంది. మే 3లోగా దానిని సమర్పించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. సాక్షులను నేను క్రాస్ ఎగ్జామిన్ చేశా : ఏబీవీ కాగా, సచివాలయంలో ఆదివారం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణకు హాజరైన ఏబీవీ.. తర్వాత మీడియాతో మాట్లాడారు. తనపై జరిగినా విచారణలో 21 మంది సాక్షులను తానే క్రాస్ ఎగ్జామిన్ చేశానన్నారు. అల్పులు, అథములు, కుక్కమూతి పిందెలు, చట్టాలు తెలియని వాళ్లు తనపై ఆరోపణలు చేశారని.. కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించి తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఏబీవీ ఆరోపించారు. -
‘అసైన్డ్ స్కామ్’పై సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: టీడీపీ అక్రమాలకు రాజధానిగా మారిన అమరావతిలో అసైన్డ్ భూస్కామ్‌పై నేర పరిశోధన విభాగం (సీఐడీ) మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే పలు కేసులను నమోదు చేసిన సీఐడీ భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగా రైతులను కలిసి వారి వాంగ్మూలం నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సీఐడీ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి రైతుల నుంచి సమాచారాన్ని సేకరించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన 50 మంది అసైన్డ్ భూములు రైతులను మందడం గ్రామానికి పిలిచిన సీఐడీ ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో వారిని విచారించాయి. రెండు రోజుల క్రితం తాళ్లాయపాలెం, రాయపూడి గ్రామాల రైతులను తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. భయపెట్టి భూములు గుంజుకున్నారు.. తాజాగా సీఐడీ బృందాల విచారణలో రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని అధికారులు ముందు ఏకరువు పెట్టారని తెలుస్తోంది. టీడీపీ నేతలు తమను భయపెట్టి అయినకాడికి తమ భూములను గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదంటూ ఆందోళనకు గురిచేసి.. అతి తక్కువ ధరకే తమ భూములను అమ్ముకునేలా చేశారని రైతులు వాపోయారు. ఇలా తమ భూములను కొల్లగొట్టిన టీడీపీ నేతలు వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకుని.. తమను నిలువెల్లా మోసం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా భూములను అమ్మడానికి ఇష్టపడని రైతులను అనేక విధాలుగా బెదిరించి, భయపెట్టారని సీఐడీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. బినామీల పేర్లతో అమ్మలేదనే అక్కసుతో.. మల్కాపురంలో ఉద్ధంరాయునిపాలెం సొసైటీకి చెందిన ఆరుగురు రైతులను సీఐడీ విచారించింది. తాము భూములు పూలింగ్‌కు ఇస్తామన్నా తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేశారని రైతులు తెలిపారు. ఈ అంశంపై అప్పటి కలెక్టర్‌తోపాటు, సీఆర్డీఏ అధికారులు, ఎస్సీ కమిషన్ చైర్మన్, నాటి సీఎం చంద్రబాబును సైతం కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో కోర్టుకు వెళ్లి తమ భూములను పూలింగ్‌కు తీసుకోవాలని కోరగా, కలెక్టర్‌ను కలవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో కలెక్టర్‌ను కలిసినా ఆయన ఉద్దేశపూర్వకంగా మాట దాటవేయడంతో తాము పూలింగ్‌కు ఇవ్వలేకపోయామన్నారు. బినామీ పేర్లతో అమ్మలేదనే అక్కసుతోనే తమ భూములను పూలింగ్‌కు తీసుకోలేదని రైతులు విమర్శించారు. తమ పేర్ల మీద భూములు ఉన్నా.. వాటిని ప్రభుత్వ భూములుగా మార్చి ఇతరుల పేర్లపై నమోదు చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకు సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ఆధారాలే నిదర్శనమన్నారు. కోర్టును ఆశ్రయించడంతో తిరిగి రికార్డుల్లో ప్రభుత్వ భూములనే పేర్లు తొలగించి తమ పేర్లను నమోదు చేశారని వివరించారు. అక్రమంగా భూములు సొంతం చేసుకునేందుకు ప్రయత్నించి సాధ్యపడకపోవడంతో రికార్డుల ట్యాంపరింగ్‌కు యత్నించారని రైతులు వాపోయారు. రైతులతోపాటు స్థానికులు కూడా దీనిపై సీఐడీ అధికారులకు పలు ఫిర్యాదులు చేశారు. తప్పించుకోవడానికి టీడీపీ నేతల ప్రయత్నాలు.. కాగా, అసైన్డ్ భూముల కుంభకోణంలో బలమైన ఆధారాలు కనిపిస్తుండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా ఉండే కొందరిని తెర మీదకు తెచ్చారు. రైతుల పేరుతో వారిని సీఐడీ, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అధికారుల దగ్గరకు పంపించి అసైన్డ్ భూములను తాము ఇష్టపూర్వకంగానే ఇచ్చామని, గత టీడీపీ ప్రభుత్వం తమను ఆదుకుందని చెప్పే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అసైన్డ్ భూముల కుంభకోణంపై సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తే టీడీపీ ప్రభుత్వ పాపాలు బట్టబయలవుతాయని అమరావతి ప్రాంతానికి చెందిన దగా పడ్డా దళిత రైతులు చెబుతున్నారు. -
పోలవరం పరిహారంలో అక్రమాలు
బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): పోలవరం భూ నిర్వాసితులకు చెల్లించిన పరిహారంలో అక్రమాలు వెలుగుచూసినందున వాటిని సమగ్రంగా పరిశీలించాల్సిందిగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినట్లు రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ఈ చెల్లింపులన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం చెన్నరాయునిపల్లెలో శనివారం జస్టిస్ లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమకు అందిన ఫిర్యాదుల్లో హౌస్‌ఫెడ్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పోలవరం పరిహారంలో అక్రమాలు వెలుగుచూశాయని చెప్పారు. పోలవరం పరిహారంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నివేదిక చూశాక సీఐడీ ద్వారా సమగ్ర విచారణకు ఆదేశించనున్నట్లు చెప్పారు. నిర్వాసితులకు మరో రూ.30 వేల కోట్లకు పైగా పరిహారం ఇవ్వాల్సి వున్నందున అనర్హుల ఏరివేతతో ప్రభుత్వంపై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోని వివిధ అంశాలపై జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించిన వివరాలివీ.. ► పోలవరం ప్రాజెక్టు భూ నిర్వాసితుల్లో నిరక్ష్యరాస్యులు ఉండడంతో అక్రమాలు జరిగినట్లు తేలింది. మాకు అందిన ఫిర్యాదులను డీఎస్పీ ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ చేయించాం. ఓ రేషన్ షాపు డీలర్ భార్య పేరుతో రూ.64 లక్షల పరిహారం పొందారు. దీన్ని విచారిస్తే ప్రభుత్వ భూమిని సొంత పట్టా భూమిగా చూపి పరిహారం పొందినట్లు నిర్ధారణ అయింది. ఆ సొమ్మును రికవరి చేశాం. ఇలాంటి అక్రమాలను బాధితులు మా దృష్టికి తెచ్చారు. ► గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బోగస్ పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. ఇలా ఇంకెన్ని మోసాలు జరిగాయో నిగ్గు తేల్చాలని కలెక్టర్లకు లేఖలు రాశాం. ► తూర్పు గోదావరి జిల్లా తొండంగి గ్రామంలో 90 శాతం మంది రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని తాము వ్యవసాయం చేస్తున్నామని, ఇక్కడి ప్రాథమిక సహకార పరపతి సంఘంలో తమ పేర్లతో రుణాలు పొందినట్లు అనుమానిస్తూ రైతులు ఫిర్యాదు పంపారు. దీనిపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలపై విచారణ జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాం. ► అలాగే, వైఎస్సార్ జిల్లాకు చెందిన గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ రుణగ్రహీతలు చెల్లించిన రుణాలను తన సొంతానికి వాడుకున్న కేసు విచారణలో ఉంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ వ్యక్తి ఇంటిపై రూ.75వేల రుణం తీసుకుని చెల్లించినా, ఇంకా రూ.6.96 లక్షల రుణం ఉందంటూ హౌస్‌ఫెడ్ అధికారులు నోటీసిచ్చారు. కాబట్టి.. హౌస్‌ఫెడ్‌కు చెల్లిస్తున్న వాయిదాల రసీదులను రుణగ్రహీతలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ► గ్రంథాలయ సెస్సు చెల్లించకుండా స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీల నుంచి రూ.60 కోట్ల సెస్సును గ్రంథాలయ సంస్థకు చెల్లించేలా చేశాం. అలాగే, స్థానిక సంస్థలకు అందాల్సిన సీవరేజి చార్జీలను ప్రభుత్వ శాఖల నుంచి రూ.100 కోట్లకు పైగా వసూలుచేసి వాటికి జమచేశాం. ► చెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవించాం. ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర భూ సర్వేలో చెరువులకూ సర్వే జరపాల్సిన అవసరం ఉంది. లోకాయుక్త సేవలను కోస్తా వాసులు సది్వనియోగం చేసుకొంటున్నారు. ఈ విషయంలో రాయలసీమ వెనుకబడింది. ప్రభుత్వాధికారులు సేవలను అందించడంలో నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించినా లోకాయుక్తను ఆశ్రయించవచ్చు. ఇటీవల ఎక్సైజ్ శాఖలోని సెక్యూరిటీ గార్డులకు వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కేసును పరిష్కరించి తొమ్మిది మందికి న్యాయం చేశాం. -
ఇదీ నిజామాబాద్‌లో అధి‘కార్ల’ దందా
జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు గతంలో అద్దె కారు ఉండేది. అయితే, గతంలో పని చేసిన ఓ అధికారిణి అద్దె కారును పక్కన పెట్టి.. తన సొంత వాహనాన్ని ‘అద్దె’కు వినియోగించుకున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి తెల్ల నెంబరు ప్లేటు గల వాహనాన్ని కొన్ని నెలల పాటు నడిపించి నెలనెలా అద్దె డబ్బులను పర్సులో వేసుకున్నారు. సాక్షి, ఇందూరు(నిజామాబాద్): జిల్లాలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అద్దె వాహనాల పేరుతో వేల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. సొంత వాహనాలనే వినియోగిస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి దొరక్కుండా పోతోంది. ప్రభుత్వ శాఖ ల్లో అధి‘కార్ల’ దందా కొనసాగుతున్నా అడిగే వారు లేరు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సర్కారు కార్యాలయాల్లో సంబంధిత శాఖకు సొంత కార్లు లేకపోతే అధికారుల పర్యటనలకు అద్దెకు తీసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అద్దె వాహనం తీసుకోవాలంటే చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియారిటీ కలిగిన వారికి అవకాశం కల్పించాలి. పసుపు రంగు (ట్యాక్సీ) నెంబరు ప్లేట్ కలిగి ఉండడంతో పాటు వాహనం పూర్తి కండిషన్‌తో ఉండాలి. అగ్రిమెంట్ సమయంలో ఆయా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. నెలకు 2,500 కిలో మీటర్లు తిరిగితే ఇంధనం (పెట్రోల్/డీజిల్), కారు అద్దె, డ్రైవర్ బత్తా అన్నీ కలిపి గతంలో రూ.24 వేలు ఇచ్చే వారు. అయితే, ప్రభుత్వం దీనిని రూ.33 వేలకు పెంచింది. దీంతో అధికారుల కన్ను ‘అద్దె’పై పడింది. తెల్ల నెంబరు ప్లేటు ఉన్న తమ సొంత వాహనాలను అద్దెకు పెట్టి ‘ఆన్ గోవ్ట్ డ్యూటీ’ అని రాయించుకుని మరీ యథేచ్ఛగా తిప్పుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు కలిపి సుమారు 40 మంది అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తూ నెలకు రూ.13 లక్షల వరకూ ‘అద్దె’ వసూలు చేస్తున్నారు! తిరగకున్నా.. సొంత వాహనం లేదా బినామీ పేర్లతో బంధువుల వాహనాలను ప్రభుత్వ శాఖల్లో అద్దెకు వినియోగిస్తున్న అధికారులు.. ఇతర వాహనాల విషయంలో మాత్రం నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. నిరుద్యోగులు తమ వాహనాన్ని అద్దెకు పెడితే నిబంధనల పేరుతో మెలికలు పెడుతూ సతాయిస్తున్నారు. బిల్లులు ఆలస్యంగా ఇస్తున్నారు. అయితే, వేతనానికి కారు అద్దె తోడవుతుందనే ఆశతో అధికారులు సొంత వాహనాలు, బంధువుల పేరిట కలిగినవి ఉపయోగిస్తున్నారు. నెలకు 2,500 కిలో మీటర్లు తిరగకున్నా, తిరిగినట్లు రీడింగ్ చూపి నెలనెలా అద్దెను కాజేస్తున్నారు. ⇔ పై చిత్రంలో కనిపిస్తున్న స్విఫ్ట్ కారు జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో అద్దెకు నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె వాహనం జిల్లా/రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే, తెల్ల నెంబరు ప్లేటు కాకుండా పసుపు రంగు (ట్యాక్సీ) ప్లేటు ఉండాలి. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన తెల్ల నెంబరు ప్లేటుతో ఏడు నెలలుగా ఆ శాఖ అధికారులు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఢిల్లీ నెంబరు ప్లేటు ఉండడంతో అద్దె బిల్లులు చేయడానికి వీలు కావడం లేదు. అయితే, పాత కారు పేరిట బిల్లులు కూడా లేపేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘కామారెడ్డి’లో కూడా.. అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తున్నారని తెలుసుకున్న కామారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. సొంత వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దని గత కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అందుకు ప్రభుత్వ శాఖల్లో ట్యాక్సీ ప్లేటు గల వాహనాలను వినియోగించాలని సూచించారు. కానీ చాలా మంది అధికారులు సొంత వాహనాలే వినియోగిస్తున్నారు. -
నచ్చిన వారికి కొలువులు.. అడిగినంత వేతనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): నచ్చిన వారికి కొలువులివ్వడం.. వారు అడిగినంత వేతనాలు చెల్లించడం దుర్గగుడి అధికారులకు పరిపాటిగా మారింది. కమిషనర్ ఆర్డర్‌తో పని లేదు.. ఆలయంలో ఉద్యోగం చేసే అర్హతలున్నాయా లేదా అనేది అవసరం లేదు.. కావాల్సిందల్లా అధికారుల అండదండలే.. గత కొంత కాలంగా దుర్గగుడిలో పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ఈ విషయం ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు పాటించారు. సోదాలు జరుగుతున్న సమయంలో ఈ ఉద్యోగులను విధుల్లోకి రానివ్వకుండా చూశారు. ప్రస్తుతం అక్కడి ఉద్యోగుల్లో ఇదీ చర్చనీయాంశం అయ్యింది. ►అమ్మవారి పల్లకీసేవ, ఊరేగింపులు, ఉత్సవాల సమయంలో బోయలు సేవలు చేస్తుంటారు. గతంలో దేవస్థానంలో 14 మంది బోయలు విధులు నిర్వహిస్తుండగా, కొత్తగా ఇద్దరు బోయలను విధుల్లోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో భారీగానే సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. కొత్తగా విధుల్లోకి చేరిన బోయలకు కమిషనర్ అనుమతి లేదు. రెండు నెలలుగా వారికి వేతనాలు చెల్లించడం లేదు. బోయలకు వేతనాలు చెల్లించాలంటే తొలుత వారి వివరాలను దేవస్థాన పరిపాలనా విభాగం రిజిస్ట్రార్‌లో నమోదు చేసుకోవాలి. తమ వివరాలను నమోదు చేసి వేతనాలు చెల్లించాలంటూ బోయలు రెండు నెలలుగా ఈవో చాంబర్‌కు, పరిపాలనా విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ►అమ్మవారి ప్రసాదాలను విక్రయించే కౌంటర్లలో ఇద్దరు సిబ్బందిని దేవస్థాన అధికారులు నియమించారు. గతంలో ఏళ్ల తరబడి విధులు నిర్వహించిన సిబ్బందిని కరోనా సమయంలో ఆలయ అధికారులు తొలగించారు. తొలగించిన వారి స్థానంలో కొత్తగా ఇద్దరిని నియమించడానికి భారీగానే సమర్పించుకున్నట్లు సమాచారం. ►దుర్గగుడిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలను కవరేజీ చేసేందుకు ఒక ఫొటోగ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్ ఉన్నారు. అయితే నెల రోజుల కిందట మరొకరిని అదనంగా విధుల్లోకి తీసుకున్నారు. ఇక్కడకూ కమిషనర్ ఆర్డర్ లేదు. ►ఇలా అనధికారికంగా విధుల్లోకి తీసుకున్న వారి నుంచి కమీషన్లు దండుకున్న అధికారులు వాస్తవంగా పనిచేస్తున్న సిబ్బంది కన్న ఎక్కువగా జీతాలు ఇస్తామంటూ నమ్మబలికినట్లు తెలిసింది. అధికారుల తీరుపై సిబ్బంది ఆగ్రహం దుర్గగుడిలో ఎన్నో ఏళ్లుగా 80 మంది ఎన్‌ఎంఆర్‌లు(నాన్ మస్టర్ రోల్)గా, ఇంజినీరింగ్ విభాగంలో మరో 18 మంది కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అనేక మంది రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. అయితే ఎన్‌ఎంఆర్‌లకు రూ.15 వేల నుంచి రూ.16 వేలు చెల్లిస్తుండగా.. అనధికారికంగా కొత్తగా విధుల్లోకి చేర్చుకున్న వారికి మాత్రం రూ.18 వేలు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 13 మంది దుర్గ గుడి ఉద్యోగుల సస్పెన్షన్.. నేడు కుప్పానికి బాబు: మేము రాలేం బాబోయ్! -
సిటీలో మటన్ ముక్కకు ఏదీ లెక్క?
సాక్షి, హైదరాబాద్: నగరంలో ముక్క లేనిదే ముద్ద దిగని మాంసం ప్రియుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక ఆదివారం వస్తే దీని వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. ప్రత్యేకించి మేక, గొర్రె మాంసం ఖరీదైనా ఎంతో కొంత కొనుగోలు చేయకుండా ఉండలేని వారెందరో. అయితే.. తాము కొనుగోలు చేస్తున్న మాంసం నాణ్యమైనదేనా? నిబంధనల ప్రకారమే వ్యాపారులు మాంసాన్ని అమ్ముతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. ఆయా సందేహాలపై ‘మెహర్’ సర్వే నిర్వహించిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆఫ్పాన్ ఖాద్రీ తెలిపారు. కొన్ని రోజులుగా చికెన్ విక్రయాలు తగ్గి మటన్ విక్రయాలు పెరిగాయి. దీంతో మటన్ విక్రేతలు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగాల బారినపడిన జీవాల మాంసాన్ని అమ్ముతున్నట్లు సర్వేలో వెల్లడైనట్లు ఆయన పేర్కొన్నారు. వెయ్యి మంది అభిప్రాయాల సేకరణ.. జంట నగరాల్లోని షాపుల్లో, రోడ్ల పక్కన విక్రయిస్తున్న మాంసంపై ముద్రలు ఉండట్లేదు. నిబంధనలకు అనుగుణంగానే మేకలు, గొర్రెలను కోస్తున్నారా? నాణ్యమైన మాంసాన్నే అమ్ముతున్నారా? ఇలాంటి నిబంధనలు నగర వాసులకు తెలుసా? షాపుల వారు ఇస్తున్న రసీదులను పరిశీలిస్తున్నారా? షాపుల్లో అమ్మే మాంసంపై నాణ్యత ముద్ర ఉండాలన్న విషయం కొనుగోలుదారులకు తెలుసా? అనే అంశాలపై వెయ్యి మంది అభిప్రాయాలను ‘మెహర్’ సంస్థ సేకరించింది. అవగాహన లేదు.. మటన్ నాణ్యతపై పెద్దగా అవగాహన లేదని అత్యధిక మంది స్పష్టం చేశారు. షాపుల్లో, రోడ్లపై ఎక్కడ కొన్నా నాణ్యత ఉందని భావిస్తున్నామని వెల్లడించారు. నిజానికి నగరంలోని కబేళాల్లో రోజూ వేల సంఖ్యలో మేకలు, గొర్రెలను కోసి మాంసాన్ని నగరంలోని షాపులకు, ఇతర హోటళ్లకు, విందులకు సరఫరా చేస్తున్నారు. కబేళాలో మేక, గొర్రెలను వెటర్నరీ డాక్డర్ల పర్యవేక్షణలోనే కోయాలన్న నిబంధనలను పెద్దగా పాటించడం లేదు. తెల్లవారుజామునే కబేళాల్లో మేక, గొర్రెలు ఆరోగ్యంగా ఉంటేనే వాటిని కోసేందుకు డాక్టర్లు అనుమతి ఇవ్వాలి. మాంసంపై నాణ్యత ముద్ర వేయాలి. ఇవేవీ పాటించడం లేదని స్పష్టమైంది. ప్రాంతాలను బట్టి.. జంట నగరాల్లోని ఆయా ప్రాంతాలను బట్టి కూడా మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. నగరం నడి»ొడ్డున మాంసం దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో దుకాణాల కంటే కూడా రోడ్లకు ఇరువెపుల మేకలు, గొర్రెలను కోసి అమ్ముతున్నారు. నగరంలోనూ కొన్నిషాపుల వారు సొంతంగా మేకలు, గొర్రెలను కొనుగోలు చేసి ఇంటి వద్దనే వాటిని కోసి మాంసాన్ని షాపుల్లో అమ్ముతున్నారు. ఇలాంటి వాటికి అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదని చాలా మంది వెల్లడించారు. -
అధికార మార్పిడికి అడ్డంకులు
మొండివాడు రాజుకంటే బలవంతుడు ఈ సామెత డొనాల్డ్ ట్రంప్‌కి అతికినట్టుగా సరిపోతుంది ట్రంప్ పట్టిన పట్టు వీడడం లేదు. అధికార మార్పిడికి అంగీకరించడం లేదు తానే గెలిచానని పూటకో ప్రకటన చేస్తున్నారు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టు తలుపులు తట్టారు అధికారాల అప్పగింత సజావుగా సాగకపోతే అమెరికాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తానే గెలిచానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలతో అధికార బదలాయింపు ప్రక్రియపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అ«ధికార మార్పిడికి అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్న ట్రంప్ ఎన్నికలు భద్రంగా, పారదర్శకంగా జరిగాయని పేర్కొన్న ఎన్నికల అధికారి క్రిస్టోఫర్ క్రెబ్స్‌ను సస్పెండ్ చేశారు. కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ కాలం గడిపేస్తున్నారు. అధ్యక్షుడి ఎన్నికను జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) అధికారికంగా గుర్తించాలి. అప్పుడే అధికారాల బదలాయింపు ప్రారంభమవుతుంది. ట్రంప్ ఓటమి అంగీకరించకపోవడంతో ఆ విభాగం చీఫ్‌ఎమిలి మర్ఫీ అధికార మార్పిడికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయలేదు. దీంతో ఈ ప్రక్రియ మరింత జటిలంగా మారింది. అమెరికాలో ఫలితాలు వెలువడ్డాక కాబోయే అధ్యక్షుడి దగ్గరకు ప్రస్తుత అధ్యక్షుడు స్వయంగా వెళ్లి అభినందించి వస్తారు. అప్పట్నుంచే అధికార మార్పిడి మొదలవుతుంది. ట్రంప్ ఏం చేస్తారు ? ఎన్నికల్లో బైడెనే గెలిచినప్పటికీ వచ్చే ఏడాది జనవరి 20 వరకు ట్రంపే అధ్యక్షుడిగా కొనసాగుతారు. అందుకే ఆయన ఎవరి మాటా వినడం లేదు. కరోనా విజృంభణతో దేశ ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు కునారిల్లాయి. పలు ఉగ్ర సంస్థలు అమెరికాపై గురి పెట్టి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ అధికార మార్పిడికి సహకరించాలని రిపబ్లికన్ పార్టీలోనూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఇంకా కాలయాపన చేస్తే కరోనా మరణాలు పెరిగిపోతాయని బైడెన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్ను ఎగవేత, పరువు నష్టం కేసులు ఉండడంతో ట్రంప్ దిగిరాక తప్పదని డెమొక్రట్లు ధీమాగా ఉన్నారు. యంత్రాంగం కసరత్తు సంక్లిష్టం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారు పాలనా యంత్రాంగంపై పట్టు సాధిం చడం సంక్లిష్టంగా సాగే ప్రక్రియ. అందుకు రాజ్యాంగం వారికి రెండు 3 నెలలు గడువు ఇచ్చింది. ప్రభుత్వంలో 100కి పైగా ఆపరేటింగ్ ఏజెన్సీలు, వాటికి సబ్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటి పనితీరుని కొత్త అధ్యక్షుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ యాక్ట్ ప్రకారం కాబోయే అధ్యక్షుడి బృందానికి, కార్యాలయానికి అవసరమైన స్థలం కేటాయించాలి. 4 వేల రాజకీయ పదవుల్ని భర్తీ చేయాలి. వాటిలో 1,200 పదవులకు సెనేట్ ఆమోద ముద్ర పడాలి. ప్రభుత్వ యంత్రాంగం కూర్పుకి కావల్సిన కోటి డాలర్ల నిధులు ఇవ్వాలి. ఇవన్నీ జరగకుంటే జాతీయ భద్రతకి, ప్రజా జీవనానికి పెను సవాళ్లు ఎదురవుతాయని సెంటర్ ఫర్ ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ డైరెక్టర్ మాక్స్ అభిప్రాయపడ్డారు. అధికార మార్పిడిలో జాప్యంతోనే 9/11 దాడులు ? అమెరికాపై 2001, సెప్టెంబర్ 11 దాడులకి ప్రధాన కారణం అధికార బదలాయింపులో జాప్యమేనని దాడులపై ఏర్పాటైన కమిషన్ గట్టిగా చెప్పింది. 2000 ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి అల్ గొరె, రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ డబ్ల్యూ బుష్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఫ్లోరిడా ఫలితంపై వివాదం నెలకొనడంతో అధికార మార్పిడి ప్రక్రియ ఆలస్యమైంది. జాతీయ భద్రతకు సంబంధించి ముఖ్యమైన అధికారుల్ని నియమించడంలో బుష్ ప్రభుత్వానికి తగినంత సమయంలో లేకపోవడం వల్లే 2001, సెప్టెంబర్ 11న దాడులు జరిగాయని కమిషన్ విశ్లేషించింది. -
టీడీపీ నేతల కుట్ర భగ్నం..
సాక్షి, అనంతపురం: రూ.8 కోట్లు కాజేసేందుకు టీడీపీ నేతలు పన్నిన కుట్రను కమిషనర్ పీవీఎస్ మూర్తి భగ్నం చేశారు. ఎన్టీఆర్ మార్గ్ పనుల్లో టీడీపీ నేతల అక్రమాలు వెలుగు చూశాయి. అరెకరం స్థలానికి 9.63 కోట్ల పరిహారానికి తొలుత ప్రతిపాదనలు జరగ్గా, ప్రతిపాదనల తర్వాత స్థలం వివరాలను టీడీపీ నేతలు తారుమారు చేశారు. టీడీపీ హయాంలో చదరపు అడుగు 17వేల నుంచి 30వేలకు పెంచారు. పరిహారం డబ్బు రూ.9.63 కోట్ల నుంచి రూ.17 కోట్లకు పెంచారు. టీడీపీ నేతలకు అప్పటి జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సహకరించారు. లక్షల రూపాయల ముడుపులు చేతులు మారాయి. రూ.8 కోట్లు అదనంగా కాజేసే కుట్రను కమిషనర్ మూర్తి గుర్తించారు. పరిహారం రెట్టింపు చేసుకునేందుకు ప్రైం లోకేషన్ల వివరాలను టీడీపీ నేతలు జత చేయగా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పరిశీలనలో అక్రమాలు బయటపడ్డాయి. మొత్తం రూ.17 కోట్ల పరిహారం నిలుపుదల చేశారుజ సమగ్ర వివరాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు మున్సిపల్ కమిషనర్ మూర్తి సిద్ధమయ్యారు. -
మరుగుదొడ్ల నిర్మాణం.. టీడీపీ అక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగు తమ్ముళ్లు గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. మరుగుదొడ్లు కట్టుకోవడానికి రుణం కోసం వెళ్లిన వారికి ఇప్పటికే మీ పేరుతో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందంటూ అధికారులు ఇస్తున్న సమాధానంతో వారు కంగుతింటున్నారు. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మారుస్తున్నామంటూ హడావుడి చేసి జిల్లా వ్యాప్తంగా వేలాది మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. దీన్ని ఆసరాగా తీసుకుని చాలా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి మరుగుదొడ్లు కట్టకుండానే కట్టినట్లు లెక్కలు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. అటువంటి ఘటనే మరొకటి ఇటీవల వెలుగు చూసింది. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం గ్రామంలో 2018లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.40 లక్షల మేర దుర్వినియోగం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (చదవండి: ‘పశ్చిమ’లో టీడీపీకి ఎదురుదెబ్బ..) అయ్యపరాజుగూడెం గ్రామానికి చెందిన పలువురు కొంత కాలంగా గ్రామ సచివాలయానికి వెళ్లి తాము మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు పరిశీలించగా.. వారి పేర్లతో 2018లోనే మరుగుదొడ్ల కోసం రుణం తీసుకున్నట్లు ఉంది. దీంతో వారు మీపేరు మీద మరుగుదొడ్డి తీసుకున్నట్లుగా ఉంది. అసలు తాము మరుగుదొడ్డి ఇంటి వద్ద నిర్మించుకోకుండా ఎలా బిల్లులు చేశారు. కనీసం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయరా అని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. (చదవండి: ఆ వదంతులు అవాస్తవం: రామసుబ్బారెడ్డి) గ్రామ టీడీపీ నేత చేతివాటం 2018లో గ్రామంలో సుమారు 266 మరుగుదొడ్ల నిర్మాణానికి ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు పి.శ్రీనివాసరావు ఓ తాపీ మేస్త్రి పేరుతో కాంట్రాక్టు పొందారు. ఒక్కో మరుగుదొడ్డి కోసం రూ.15 వేలు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఆ సమయంలో గ్రామంలో లేనివారు, చనిపోయినవారు, మరుగుదొడ్డి నిర్మించుకోని వారి ఆధార్ కార్డుల నంబర్లను తీసుకుని వారి పేర్లు మీద మరుగుదొడ్లు నిర్మించినట్లుగా నగదును డ్రా చేసినట్లు సమాచారం. ఇది అప్పట్లో ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పర్యవేక్షణలో జరిగాయి. ఈ నిర్మాణాల గురించి పట్టించుకోకుండా దొడ్లు కట్టించిన తెలుగుదేశం నాయకుడి మాటే వేదవాక్కుగా దొంగ సంతకాలు చేసి ఇచ్చిన లిస్ట్ ఆధారంగా అధికారులు బిల్లులు చెల్లించేశారు. మొత్తం 266 మరుగుదొడ్లలో రెండు వందలకుపైగా మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసినట్టు సమాచారం. దీనిపై పూర్తి వివరాలను సచివాలయ ఉద్యోగులు సేకరిస్తున్నారు. లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించిన సదరు నేతను నిలదీస్తే తనకు సంబంధం లేదని, ఏం చేస్తారని బెదిరిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్వాకం వల్ల ఇప్పుడు తాము మరుగుదొడ్డి నిర్మించుకుందామంటే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని గ్రామస్తులు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానన్నారు. మరుగుదొడ్డి నిర్మించినట్టు రికార్డుల్లో ఉంది మరుగుదొడ్డి నిర్మించుకుందామని గ్రామ సచివాలయానికి వెళ్లి నాపేరు అన్లైన్లో నమోదు చేయించుకోవడానికి దరఖాస్తు ఇచ్చాను. కంప్యూటర్లో నాపేరును నమోదు చేస్తుంటే మరుగుదొడ్డికి రుణం నేను గతంలో తీసుకున్నట్లు ఉంది. నాపేరు మీద మరుగుదొడ్డి డబ్బులు ఎవరు తీసుకున్నారని సచివాలయంలో అడగ్గా మరుగుదొడ్లు కాంట్రాక్టు చేసిన పిల్లల శ్రీను తీసుకున్నారని చెప్పారు. – చీదరాల కృష్ణకుమారి, అయ్యపరాజుగూడెం నిర్మించకుండానే డబ్బులు కాజేశారు నాకు మరుగుదొడ్డి నిర్మిస్తానని చెప్పి పిల్లల శ్రీను అనే వ్యక్తి ఆధార్ కార్డు తీసుకున్నాడు. అ తరువాత వచ్చి నీ కార్డు అన్లైన్ కావటం లేదు దొడ్డి రాదని చెప్పారు. తీరా ఈ ప్రభుత్వంలో మరుగుదొడ్డి నిర్మించుకుందామని సచివాలయానికి వెళ్లి అడిగితే ఆధార్ నంబరు కొట్టి చూస్తే మరుగదొడ్డి కట్టినట్లుగా నాపేరు మీద రూ.15 వేలు నగదు తీసుకున్నట్లుగా ఉంది. – యర్రా జయమ్మ, అయ్యపరాజుగూడెం ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం అవకతవకలు విషయం ఇప్పటి వరకు నాదృష్టికి రాలేదు. లబ్ధిదారులు ఫిర్యాదుచేస్తే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – శ్రీదేవి, ఎంపీడీఓ, లింగపాలెం -
తిత్లీ పరిహారాన్ని గెద్దల్లా తన్నుకుపోయారు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రెండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు. తిత్లీ తుఫాన్ జిల్లాలో విరుచుకుపడింది. మరో కోనసీమగా పిలిచే ఉద్దానంలో విధ్వంసం సృష్టించింది. భీకర గాలుల బీభత్సానికి పచ్చటి ఉద్దానం కకావికలమైంది. కొబ్బరి, జీడి రైతుల జీవితకాలపు కష్టాన్ని క్షణాల్లో ధ్వంసం చేసేసింది. టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల స్వరూపమే మార్చేసింది. తుఫాన్ విధ్వంసంతో రైతు కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. టీడీపీ నేతలకు మా త్రం తుఫాన్ కాసులు కురిపించింది. తిత్లీ తుఫాన్‌తో రైతులు రోడ్డు పాలు కాగా, టీడీపీ నేతలు ధనవంతులయ్యారు. బాధితుల ముసుగులో తుఫాన్ పరిహారమంతా తమ ఖాతాల్లో వేసుకున్నా రు. అండగా నిలవాల్సిన అప్పటి అధికార పార్టీ నేతలు.. రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని గెద్దల్లా తన్నుకుపోయారు. నాడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు దగ్గరుండి అక్రమాల తంతునడిపారు. అనర్హులకు పెద్ద ఎత్తున పరిహారం కట్టబెట్టారు. తుఫాన్లో నష్టపోని వారి ఖాతాలకు లక్షలు జమ చేయించారు. వాస్తవంగా నష్టపోయిన వారికి మొండిచేయి చూపారు. నాడు లెక్క తేల్చిన నష్ట పరిహారం జాబితాలో 60 శాతం వరకు అనర్హులే ఉన్నారని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. కోట్లాది రూపాయలు టీడీపీ నేతల జేబుల్లోకి వేశారు. వాస్తవానికైతే 52,164మంది కొబ్బరి రైతులు, 78,108 మంది జీడి రైతులు తిత్లీ బీభత్సానికి నష్టపోయినట్టుగా పరిహారం జాబితాల్లో చూపించారు. ఎన్నికలకు ముందు దాదాపు రూ.307 కోట్లు వరకు పరిహారం కింద అందించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన అనర్హులకు ఎన్ని కోట్లు వెళ్లాయో అక్రమార్కులకే తెలియాలి. విచిత్రమేమిటంటే ఎన్నికలకు ముందు రోజుల్లో ఒక్క ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే రూ.50 కోట్ల వరకు అనుయాయుల ఖాతాల్లో వేశారు. అప్పట్లో ఇది ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ప్రభావం చూపింది. పరిహారం.. పరిహాసం ♦భూముల్లేని టీడీపీ సానుభూతిపరులకు భూములున్నట్టుగా చూపించారు. తక్కువ భూమి ఉన్న టీడీపీ శ్రేణులకు ఎక్కువ భూమి ఉన్నట్టుగా నమోదు చేయించారు. ♦ పల్లం భూమిని మెట్ట భూమిగా నమోదు చేసి, పంచాయతీకి చెందని వ్యక్తులను స్థానికంగా చూపించి పరిహారం జాబితాలు సిద్ధం చేశారు. ♦ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని డమ్మీగా మార్చేశారు. ♦ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ కుటుంబీకులు, బంధువులను సైతం నష్టపోయినట్టు పరిహారం జాబితాలో చేర్చినట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. ♦ పి.బంగారమ్మ, డి.వల్లభరావు, బి.సంహిత, డి.గీత తదితర వేలాది పేర్లతో తుఫాన్ పరిహారాన్ని స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ♦ వైఎస్సార్సీపీ సానుభూతి పరులుగా ఉన్న కొంతమంది వాస్తవంగా నష్టపోయినప్పటికీ పరిహారం జాబితాలో వారి పేర్లను చేర్చలేదు. ♦ రాజకీయ కక్షతో పరిహారానికి దూరం చేశారు. కొందరికైతే జాబితాల్లో నష్టపోయినట్టుగా చూపించి కూడా పరిహారం ఇవ్వలేదు. పరిహారం వచ్చేసరికి వారి పేర్లు గల్లంతయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఇదీ పరిస్థితి... అక్రమాల తంతుపై ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. కలెక్టర్ జె.నివాస్ సైతం విచారణకు ఆదేశించారు. గ్రామసభలు పెట్టి వారు అర్హులా?అనర్హులా? తెలుసుకుని పరిహారం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయి అధికారులు అక్కడున్న అనర్హుల గుట్టు రట్టు తేల్చడం లేదు. ఏదో ఒకటి చెప్పి నాన్చుతూనే ఉన్నారు. తూతూమంత్రంగా గ్రామసభలు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు అనర్హులను తమ రికార్డులను మారి్పంచుకున్నారు. వారసత్వంగా వచ్చే భూములను తమ రికార్డుల్లో చేరి్పంచుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రికార్డులు మారిపోయాయి. పెండింగ్‌లో పెంచిన పరిహారం... తిత్లీ బాధితుల నష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో చలించిపోయారు. అధికారంలోకి రాగానే పరిహారం పెంచుతానని ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చాక పరిహారం పెంచారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు రూ.1500 నుంచి రూ.3వేలకు, జీడి తోట హెక్టార్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పరిహారం పెంచడమే కాకుండా నిధులు కూడా విడుదల చేశా రు. ఈ లెక్కన దాదాపు రూ.290కోట్ల వరకు అదనంగా వచ్చినట్టు అయింది. ఇంతవరకు బాగానే ఉన్నా పరిహారం పంపిణీకొచ్చేసరికి చిక్కుముడి నెలకొంది. పాత జాబితా ప్రకారంగా పంపిణీ చేస్తే ఇది కూడా అనర్హుల జాబితాలోకి వెళ్లిపోతుందని ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆగారు. -
పేదల బియ్యంలో అవినీతి పురుగులు
జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలు.. పరాకాష్ట స్థాయికి చేరాయి. ఓ వైపు ధాన్యం కొనుగోలులో ధరలు, తరుగుల పేరుతో రైతుల కడుపులు కొడుతున్న మిల్లర్లు.. మరో వైపు పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని అడ్డదారుల్లో కొనుగోలు చేసి సీఎంఆర్ పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. సీఎంఆర్ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని ఆడించి నాణ్యమైన బియ్యంగా దర్జాగా మార్కెట్లో విక్రయించి మరో రకంగానూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. సాక్షి, నెల్లూరు: సివిల్ సప్లయిస్, ఎఫ్‌సీఐ అవినీతిని ఆసరాగా చేసుకుని జిల్లాలో రైస్ మిల్లర్లు నిరుపేదల కడుపులు కొడుతున్నారు. ప్రభుత్వాన్ని ఓ వైపు మోసం చేస్తూ, మరో వైపు రైతులను దోచుకుంటూ, సీఎంఆర్‌కు ఇచ్చిన ధాన్యాన్ని నాణ్యమైన బియ్యంగా మార్చుకుని రూ.కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. జిల్లాలో నెలకు 1.9 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం కార్డుదారులకు సరఫరా చేయాల్సి ఉంది. మార్చిలో కరోనా తర్వాత కేంద్రం కూడా బియ్యం ఉచితంగా అందిస్తోంది. నెలకు రెండు దఫాలు సరఫరా చేస్తున్నాయి. అంటే దాదాపు 2.18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. సాధారణంగా రేషన్ బియ్యం తక్కువ శాతం వినియోగం ఉంది. దీంతో మిల్లర్లు దళారుల ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేసి తిరిగి సీఎంఆర్‌కు సరఫరా చేస్తున్నారు. ♦పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత ఆహార సంస్థ, పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా కేజీ బియ్యం రూపాయికే సరఫరా చేస్తున్నాయి. ♦పేదలకు ఇచ్చిన రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు పలు మార్గాల్లో సేకరించి తిరిగి మిల్లులకు చేర్చి పాలిష్ చేసి సీఎంఆర్‌గా మళ్లీ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు, భారత ఆహార సంస్థకు సరఫరా చేస్తున్నారు. ♦ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ♦జిల్లాలో ఎక్కువగా నెల్లూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల పరిధిలో ఉన్న రైస్ మిల్లర్లు దీన్నే వ్యాపారంగా మార్చుకొని రూ.కోట్లు గడిస్తున్నారు. ♦కొంత మంది మిల్లర్లు కనీసం పాలిష్ కూడా చేయకుండానే సంచులు మార్చి మళ్లీ పౌర సరఫరాల సంస్థకు అప్పగిస్తున్నట్లు సౌత్‌రాజుపాళెం మిల్లులో వెలుగు చూసిన వాస్తవాలే బట్టబయలు చేస్తున్నాయి. ఒక కన్సైన్మెంట్కు రూ.5 లక్షలు ఆదాయం పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఆడించి బియ్యం సరఫరా చేసేందుకు ట్రేడింగ్ మిల్లులకు అధికారులు అప్పగిస్తున్నారు. ఇలా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)గా మిల్లర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఇచ్చే మిల్లింగ్ చార్జీల ద్వారా ఒక కన్సైన్మెంట్ (220 క్వింటాళ్లు)కు నికరంగా రూ.15 వేలు ఆదాయం ఉంటుంది. కానీ నాణ్యమైన బియ్యం బదులుగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ ద్వారా సరఫరా చేస్తే దాదాపు రూ.5 లక్షల వరకు మిగులుతోంది. ♦జిల్లాలో ట్రేడింగ్ కేటగిరీలో 146 రైస్ మిల్లులు ఉన్నాయి. అందులో సీఎంఆర్ పెండింగ్‌తో 6ఏ కేసులు నమోదైన మిల్లులు మినహాయించి 135 మిల్లులకు ప్రభుత్వం సీఎంఆర్ ధాన్యం సరఫరా చేస్తోంది. ♦ఇందులో దాదాపు అత్యధిక మిల్లులు ప్రభుత్వ సరఫరా చేసిన ధాన్యాన్ని ఆడించి నాణ్యమైన బియ్యంగా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నాయి. ♦ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన సీఎంఆర్‌కు రేషన్ బియ్యాన్ని సేకరించి పాలిష్ పట్టి సరఫరా చేస్తున్నారు. ♦ఇటువంటి బియ్యాన్ని టెస్టింగ్ ద్వారా గుర్తించి వాటిని నిరాకరించాలి్సన ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల కార్పొరేషన్ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై దిగుమతి చేసుకుంటున్నారు. ♦రేషన్ బియ్యం కిలో రూ.10లకు కొనుగోలు చేసి పాలిష్ పట్టించి, తిరిగి సీఎంఆర్‌గా రూ.27.60లకు విక్రయిస్తున్నారు. ♦ఒక్కో రైస్‌మిల్లు ఏడాదికి వందకు పైగా కన్సైన్మెంట్లు సరఫరా చేస్తే దాదాపు రూ.5 కోట్లు మిగులుతున్నట్లు అంచనా. ♦ఇలా రేషన్ బియ్యం సీఎంఆర్‌గా రీసైక్లింగ్ జరుగుతుండడంతో ధాన్యం డిమాండ్ తగ్గిపోతోంది. దీంతో మిల్లర్లు రైతులను అడ్డుగోలు ధరలకు దోచుకుంటున్నారు. విజిలెన్స్ దాడుల్లో.. జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వేలాది టన్నుల రేషన్ బియ్యం పట్టుబడడం సర్వసాధారంగా మారింది. ఇటీవల మర్రిపాడులో రేషన్ డీలర్ ఇంటి నుంచి దళారులు రేషన్ బియ్యం సేకరించి వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ♦కృష్ణపట్నం పోర్టులో విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తే ఇతర దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న పేదల బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ♦కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురంలోని రైస్‌మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీల్లో 20 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం 17.5 టన్నుల నూకలు ఉన్నట్లు గుర్తించారు. ♦నెల్లూరు రూరల్ మండలంలోని అల్లీపురం ప్రాంతంలో 20 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. నెల్లూరురూరల్ మండలం సౌత్‌రాజుపాళెంలోని లక్ష్మీనరసింహ లారీ పార్కింగ్ యార్డులో అక్రమంగా నిల్వ చేసిన నిరుపేదలకు పంచాల్సిన చౌక బియ్యం 77 టన్నులు పట్టుబడ్డాయి. సీఎంఆర్ లేబుల్‌తో ప్యాక్ చేసిన 263 బస్తాలతో పాటు 1,280 బస్తాల చౌక బియ్యం స్టాక్ చేసినట్లు పక్కా సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.28 లక్షల పైమాటే. ఇటీవల వెంకటేశ్వరపురం ఎఫ్‌సీఐ గోదాముల్లో భారీస్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎమ్మార్‌కు ఇస్తున్నట్లు అధికారులు నిగ్గు తేల్చారు. -
అమ్మకానికి ఇందిరమ్మ స్థలాలు..
మండపేట పట్టణానికి చెందిన మహిళకు పదేళ్ల క్రితం రాజీవ్ గృహకల్పలో ప్లాటు, గొల్లపుంత కాలనీలో ఇందిరమ్మ స్థలం మంజూరయ్యాయి. ఏదో ఒక పథకానికి మాత్రమే అర్హులన్న నిబంధనతో ఆమె స్థలాన్ని వదులుకుంది. ఖాళీగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని దళారులు అన్యాక్రాంతం చేసేశారు. తాజాగా కొనుగోలు చేసుకున్న వారు ఇంటి నిర్మాణానికి సన్నద్ధమవుతుండగా స్థానికుల ఫిర్యాదుతో హౌసింగ్ అధికారులు అడ్డుకుని నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. గొల్లపుంత కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల స్థలాల్లో జరుగుతున్న అక్రమాల్లో వెలుగు చూసిన ఉదంతమిది. బయటకు రాకుండా అన్యాక్రాంతమైన ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, ఇళ్లు 400 పైనే ఉంటాయని అంచనా. మండపేట: పట్టణంలోని ఇందిరమ్మ స్థలాల్లో రియల్ వ్యాపారం చాపకింద నీరులా సాగిపోతోంది. ఖాళీ స్థలం నుంచి నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను రూ.మూడు లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ మేస్తున్నారు. వ్యాపారులు, దళారులతో పాటు ఉద్యోగులు సైతం బినామీ పేర్లపై ఇక్కడ స్థలాలు కొనుగోళ్లు చేసి నిర్మాణాలు చేస్తున్నట్టు సమాచారం. పేదల స్థలాల్లో సాగుతున్న రియల్ వ్యాపారం ద్వారా దాదాపు రూ.20 కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. వైఎస్ అకాల మరణం, పాలకుల నిర్లక్ష్యంతో.. దివంగత వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ పథకం మండపేటలో వేలాది మంది పేదల సొంతింటి కలను సాకారం చేసింది. వైఎస్ ప్రోత్సాహంతో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి పట్టణంలోని గొల్లపుంతలో రెండు విడతలుగా 122.72 ఎకరాలను సేకరించారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద స్థలసేకరణ. తొలి విడతలోని 55.77 ఎకరాల లేఅవుట్‌ను సెంటున్నర చొప్పున రెవెన్యూ అధికారులు 2,125 ప్లాట్లుగా విడదీశారు. 1,890 మంది లబి్ధదారులకు పంపిణీ చేయగా మిగిలిన 235 ప్లాట్లను ఖాళీగా ఉంచారు. 2010 నవంబరు నుంచి నిర్మాణ పనులు మొదలయ్యాయి. వైఎస్ అకాల మరణం, పాలకుల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ఇప్పటి వరకూ దాదాపు 1500 ఇళ్లు మాత్రమే పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అమ్మకానికి స్థలాలు, ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపికలో రెవెన్యూ సిబ్బంది అవకతవకలకు పాల్పడడంతో అక్రమాలకు తెరలేచింది. పలువురు సొంతిళ్లు ఉన్న వారికి, రాజీవ్ గృహకల్పలో ప్లాట్లు మంజూరైన వారికి స్థలాలు మంజూరు చేశారు. ఇళ్లు ఉన్న వారు స్థలాల అమ్మకాలు మొదలుపెట్టడంతో పేదల స్థలాల్లో రియల్ వ్యాపారం మొదలైంది. నిబంధనలకు విరుద్దంగా దళారులు స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు చేయిస్తున్నారు. లబి్ధదారుల స్థలాలతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మకాలు చేసేస్తున్నారు. పేదలకు పంపిణీ చేయగా ఖాళీగా ఉంచిన 235 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. స్థలం రూ.మూడు లక్షల నుంచి ఉండగా, నిర్మాణంలో ఉన్నవి, పూర్తి చేసిన ఇంటిని రూ.ఐదు లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం. అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ.20 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు అంచనా. కొందరు ఇళ్లను నిర్మించి అద్దెకు ఇస్తుండడం గమనార్హం. పట్టణంతో పోలిస్తే కాలనీలో అద్దె తక్కువగా ఉండడంతో ఇక్కడకు అద్దెకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. కాలనీలో అద్దెకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు 300 కు పైగా ఉంటాయని అంచనా. బయట అద్దెలు చెల్లించలేక, అర్హత ఉన్నా స్థలం రాని పలువురు పేదవర్గాల వారు స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అటువంటి వారికి అన్యాయం జరుగకుండా చూడడంతోపాటు అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దర్జాగా కబ్జాలు కాలనీలోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపాలీ్టకి ఆదాయం సమకూర్చే దిశగా పట్టణంలో మాదిరి కాలనీలోను మెయిన్ రోడ్డు వెంబడి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అప్పట్లో అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం గొడ్డు కాలువ వంతెన వద్ద నుంచి అందరికీ ఇళ్లు, ప్లాట్ల వరకూ రోడ్డు నుంచి దాదాపు 20 మీటర్ల మేర స్థలం వదిలి మిగిలిన దానిలో ప్లాట్లను విభజించారు. కాగా విలువైన ఈ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. కాలనీలో ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ స్థలాల్లో జరుగుతున్న రియల్ వ్యాపారాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మండపేట తహసీల్దార్ రాజేశ్వరరావును వివరణ కోరగా తాను ఇటీవల బదిలీపై వచ్చానని, అమ్మకాలకు సంబంధించి ఫిర్యాదులేమీ రాలేని అన్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
మూడు కోట్లు మూసీలో పోశారు!
వృథా నీటిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షంగా మార్చాలన్న తలంపుతో మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుపయోగంగా మారింది. పథకం ఏర్పాటు లక్ష్యం మంచిదైనప్పటీకీ అధికారుల నిర్ణయాలు, ప్రజా ప్రతినిధుల దురాలోచనలతో అది మూలనపడింది. దీంతో రైతులకు మేలు జరగక పోగా, కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. ఈ కోవకు చెందినదే పొదిలి మండలంలోని పాములపాడు పంచాయతీలో గల కాశీపురం ఎత్తిపోతల పథకం. పొదిలి రూరల్: పొలం పక్కనే నీరు ప్రవహిస్తున్నా అది పైర్లకు ఉపయోగపడకపోవడంతో అప్పటి ప్రభుత్వం ఆ నీటిని సాగుభూములకు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసింది. మండలంలోని పాములపాడు, గొల్లపల్లి, కాశీపురం గ్రామాలకు చెందిన 625 ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో 1988–89 సంవత్సరంలో దాదాపు రూ.20 లక్షల వ్యయంతో మూíసీనదిపై ఈ పథకాన్ని నిర్మించారు. దీనికి 25 హెచ్‌పీ సామర్ధ్యం గల మూడు విద్యుత్ మోటార్లు, నీటి సరఫరాకు పైపు లైన్లు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో కాకున్నా పథకం మొదట్లో కొంతమేరకు పనిచేసింది. నీటి సరఫరా లేక సాగు తగ్గి నిర్వహణ లోపంతో మూడేళ్ల అనంతరం రైతులు ఒక లక్ష రూపాయలు పైబడి విద్యుత్ బకాయిలు పడ్డారు. కరెంట్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా అధికారులు సరఫరా తొలగించారు. పథకం పని చేయక పోవడంతో మోటార్లు, భవనం తలుపులు, కిటికీలు దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో అక్కడ పిచ్చి చెట్లు పెరిగి సాగు భూములు బీడుగా మారాయి. ప్రజల విన్నపం మేరకు తరువాత వచ్చిన ప్రభుత్వాలు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో కదిలిన యంత్రాంగం పథకం గ్రౌండ్ రిపోర్టు తయారు చేసింది. రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభిప్రాయాలు తెలుసుకొని పథకానికి అక్కడ అనువైన ప్రాంతం కాదని, కుంచేపల్లి మూసీనది మాగాణి వద్ద ఏర్పాటు చేస్తే ఉపయోగకరమని పెర్కొంటూ నివేదిక పంపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాసులకు కక్కుర్తిపడి: కాశీపురం ఎత్తిపోతల పథకంను కుంచేపల్లి వద్ద పునర్నిర్మాణం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు, అధికారులు మొత్తుకున్నా వారి మాటలును గత తెలుగుదేశేం ప్రభుత్వం పట్టించుకోలేదు. కాసుల కోసం కక్కుర్తి పడి ఆపార్టీ నాయకులు అప్పటి అధికారులపై వత్తిడి తెచ్చి పనిచేయని పథకానికి మరమ్మతుల కోసం రూ.3.20 కోట్లతో ఎస్టిమెషన్ వేయించి మంజూరు చేయించారు. ఈ పథకానికి 10 క్యూసెక్కులు నీటి పరిమాణం అవసరమని అధికారులు గుర్తించారు. దానికి తగ్గట్టు బావి, సంపు నిర్మాణాలు చేపట్టినట్లు కాకి లేక్కలు చూపి పాత పథకానికే ఏవో కొన్ని మొక్కుబడి పనులు చేసి మసిపూచి మారేడుకాయ చేశారు. పాత భవనాన్ని మర్మతులు చేసి, తలపులు బిగించి, మోటార్లు రీపేరు చేయించి, ట్రాన్స్పార్మర్లు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. పథకానికి నీరు రావాలంటే మూసీ నదిలో నీరు నిల్వ ఉండాలి. నీరు నిల్వ ఉండాలంటే నదికి అడ్డంగా కట్టనిర్మించాలి. కానీ ఇక్కడ అలాంటి పని చేయలేదు. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించినా పథకం పనిచేయలేదు. మూసీనదిలో ఇసుక మేట వేయడం, పథకం ప్రాంతంలో చిల్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తుంది. దీంతో ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పటికీ నది వద్ద చుక్కనీరు నిల్వ ఉండక పోవడం కొసమేరుపు. వందలాది ఎకరాల భూములు బీడుగా ఉన్నాయని, ఈ స్కీం వినియోగంలోకి తీసుకురాక పోతే మరలా సామగ్రి దొంగల పాలౌతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు పక్షపాతిగా ఖ్యాతిగాంచిన ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వమైనా నదిలో నీరు నిల్వ ఉండటానికి అడ్డు కట్ట వేసి ఈ స్కీం వినియోగంలోకి తీసురావాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. -
గృహ నిర్మాణ శాఖలో కొండంత అవినీతి..
పేదల సొంతింటి కలను గత ప్రభుత్వం చెరిపేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టామని గొప్పలు చెప్పుకున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణాల్లో సైతం భారీ ఎత్తున అక్రమాలకు ఊతమిచ్చింది. పేదల పేరుతో లెక్కలు చూపి అందిన కాడికి సిమెంట్‌ను బొక్కేశారు. ఈ కారణంగా నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అనంతపురం సిటీ: గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ పక్కా గృహాల నిర్మాణం అక్రమాలకు నిలయంగా మారింది. ఉరవకొండ, కూడేరు, బెళుగుప్ప, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి మధ్య మంజూరైన, చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సిమెంట్ కొరతతో ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అధికారిక రికార్డుల మేరకు సిమెంట్ బస్తాలు లబ్ధిదారులకు అందజేసినట్లుగానే ఉంది. అయితే లబి్ధదారులు మాత్రం తమకు సిమెంట్ అందివ్వకపోవడం వల్లనే గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోలేకపోయామని వాపోతున్నారు. వేలాది సిమెంట్ బస్తాలు ఎక్కడ? ఒక్కో ఇంటి నిర్మాణానికి 90 బస్తాల సిమెంట్ చొప్పున గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ ద్వారా లబి్ధదారులకు అందజేస్తామని చెప్పింది. అయితే ఉరవకొండ నియోజకవర్గంలో లబి్ధదారుల్లో కొందరికి సిమెంట్ ఇవ్వకనే ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేసి అక్రమాలకు తెరతీశారు. దీనికి తోడు కంపెనీల నుంచి సిమెంట్ తీసుకువచ్చిన లారీల్లోని బస్తాలను స్థానిక గోదాములో దించకుండానే మాయం చేసేశారు. అధికారిక అంచనాల మేరకు సుమారు 5వేలకు పైబడి బస్తాల సిమెంట్ మాయమైనట్లుగా తెలుస్తోంది. అయితే వాస్తవానికి 15వేల సిమెంట్ బస్తాలకు లెక్క తేలడం లేదు. ఈ లెక్కన ఒక్కో సిమెంట్ బస్తా రూ.160 చొప్పున అమ్ముకున్నా.. రూ.లక్షల్లో అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. రికార్డులు తారుమారు 2017–19 మధ్య సిమెంట్ బస్తాల సరఫరాకు సంబంధించిన రికార్డులన్నీ తారుమారు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అసలు కంపెనీల నుంచి లారీల్లో వచ్చిన సిమెంట్ బస్తాలు గోదాములోకి కాకుండా ఎక్కడికి తరలించారనే విషయం ఇప్పటికీ ఆ శాఖ అధికారులకే అంతు చిక్కడం లేదు. ఈ వ్యవహారంలో అదృశ్య శక్తుల పాత్రపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఏ ఒక్కరిపైనా చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. ఆర్నెల్లుగా విచారణ ఉరవకొండ నియోజకవర్గంలో ఎనీ్టఆర్ పక్కాగృహాల నిర్మాణానికి సంబంధించి కేటాయించిన సిమెంట్ బస్తాలు మాయమైన ఉదంతంపై సంబంధిత శాఖ అధికారులు ఆలస్యంగా స్పందించారు. ఆర్నెల్ల క్రితం విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. విచారణాధికారిగా గృహ నిర్మాణ శాఖ ఈఈ వెంకటనారాయణను నియమించారు. అయితే ఆర్నెల్లు అవుతున్నా విచారణ ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. టీడీపీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి జోక్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అప్పు చేసి నిర్మించుకున్న ఇంటి వద్ద బోయ రామాంజినమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇంటి ఎదుట నిల్చొన్న ఈమె పేరు బోయ రామాంజినమ్మ. ఉరవకొండ మండలం రేణుమాకులపల్లి. పక్కా గృహాన్ని నిర్మించుకోవాలని ఏళ్లుగా కలలు కనింది. రేయింబవళ్లూ పిల్లలతో కలిసి కూలి పనులకు వెళ్లి కొద్దోగొప్పో దాచుకుంది. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమెకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరు చేసింది. ఎంతో సంతోషంతో దాచుకున్న డబ్బుతో బేస్ మట్టం నిర్మించుకుంది. బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఒక్క పైసా బిల్లు మంజూరు చేయలేదు. బేస్మట్టం నిర్మాణానికి ఇస్తామన్న ఆరు బస్తాల సిమెంట్ కూడా ఇవ్వలేదు. బిల్లు మంజూరుకు టీడీపీ నాయకులు డబ్బు డిమాండ్ చేశారు. అప్పటికే ఉన్న గూడును తొలగించి, నిలువ నీడ లేని స్థితిలో ఉన్న రామాంజినమ్మ చివరకు తన వద్దనున్న బంగారు నగలు అమ్మగా వచ్చిన సొమ్ముకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులతో అప్పులు చేసి రూ.3.50లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంది. కాగా, సిమెంట్‌తో పాటు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లులు స్వాహా చేశారంటూ ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అక్రమాలు వాస్తవమే ఉరవకొండ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సిమెంట్ బస్తాల పంపిణీలో గోల్మాల్ జరిగిన మాట వాస్తవమే. ఈ వ్యవహారంపై రెండ్రోజుల్లో విచారణ పూర్తి అవుతుంది. ఆ వెంటనే నివేదికను పీడీకి అందజేస్తా. – వెంకటనారాయణ, గృహ నిర్మాణ శాఖ ఈఈ, అనంతపురం చర్యలు తీసుకుంటాం ఉరవకొండలో లబి్ధదారులకు సిమెంట్ ఇవ్వకుండా వేలాది బస్తాలు మాయం చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. ఈ ఉదంతంపై విచారణ కొనసాగుతోంది. నివేదిక అందగానే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ, అనంతపురం -
రూటు మార్చిన అక్రమార్కులు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సెబ్, సివిల్ పోలీసుల దాడులతో ఇసుక మాఫియా రూటు మారింది. ఇన్నాళ్లూ అధికారుల కళ్లుగప్పి అర్ధరాత్రి ఇసుకను తరలించిన వారు.. ఇప్పుడు దర్జాగా అధికారికంగానే తెప్పిస్తున్నారు. ఇతరుల ఆధార్ కార్డులు వినియోగించి ఇసుక బుక్ చేసి.. దాన్నంతా ఒకేచోట డంప్ చేసి ఆ తర్వాత అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంతో ఇసుకాసురులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. గతంలో రీచ్ నుంచి డిపోలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించుకుని విక్రయించేవారు. అయితే దీనిపై సెబ్ నిఘా ఉంచి సదరు కాంట్రాక్టర్లపై ఏకంగా కేసులు పెట్టడంతో ఇసుక అక్రమ రవాణా తగ్గిపోయింది. దీంతో ఇసుక అక్రమ రవాణాపైనే ఆధారపడి బతుకున్న వారు మరో కొత్తదారిలో అక్రమాలకు తెరలేపారు. ఇతరుల ఆధార్‌కార్డులతో ఇసుకను ఒకే ప్రాంతానికి బుక్ చేసుకుని.... అక్కడే డంప్ చేసేస్తున్నారు. అక్కడి నుంచి దర్జాగా అధిక ధరకు విక్రయిస్తున్నారు. వానాకాలంలోనూ పెరిగిన డిమాండ్ మామూలుగా వర్షాకాలం నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. దీంతో ఇసుక డిమాండ్ బాగా తగ్గిపోతుంది. కానీ జిల్లాలో ఇసుక డిమాండ్ గతంతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా ఉంటోంది. వాస్తవానికి ఇసుక రీచ్ నుంచి డిపోకు.. అక్కడి నుంచి వినియోగదారుల చేరే వరకూ నిఘా ఉంచేందుకు వాహనాలకు ఇప్పటికే జీపీఎస్ పరికరాలను అమర్చారు. ఈ నేపథ్యంలోనే ఇసుకాసురులు కొత్త మార్గాన్ని వెతుక్కున్నారు. బుకింగ్ సమయంలోనే అక్రమాలు చేయడం ద్వారా ఆదాయార్జనకు తెరలేపారు. గతంలో రోజువారీగా వర్షాకాలంలో కేవలం 1,000 టన్నుల మేరకు ఇసుక డిమాండ్ ఉండేది. అయితే, ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఏకంగా 4 వేల నుంచి 5 వేల వరకూ డిమాండ్ ఉంటోంది. దీంతో అధికారులు అప్రమత్తమై మొత్తం ఇసుక బుకింగ్స్‌పై కూపీలాగటం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇంత డిమాండ్ ఉందా.! వాస్తవానికి జిల్లాలో రోజూ 4 వేల టన్నుల వరకూ ఇసుక బుకింగ్ జరుగుతోంది. కొన్ని రోజుల్లో ఇది కాస్తా 5వేల టన్నులకు చేరుకుంటోంది. అయితే, వాస్తవ వినియోగం ఇంత ఉందా! లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఈ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయా అనే అనుమానం అధికారులను తొలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎక్కడి నుంచి బుకింగ్ జరుగుతోంది? నిజంగా వారి కోసమే ఇసుకను బుకింగ్ చేసుకున్నారా....? వారి ఆధార్‌కార్డుతో ఇతరులు బుక్ చేసి... పక్కదారి పట్టిస్తున్నారా....? అనే కోణంలో అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రధానంగా అనంతపురం పట్టణంతో పాటు కదిరి, హిందుపురం, మడకశిర ప్రాంతాల్లో ఈ విధంగా ఇతరుల ఆధార్‌కార్డులతో బుకింగ్ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరా తీస్తున్నాం ఇటీవల వర్షాలు బాగా కురిశాయి. మామూలుగా నిర్మాణాలన్నీ ఆగిపోతాయి. అయినప్పటికీ ఇసుకకు డిమాండ్ తగ్గలేదు. అందుకే పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. కొంతమంది ఇతరుల ఆధార్లతో ఇసుకను బుక్ చేసుకుని.. డంప్ చేసి విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆ మేరకు విచారణ చేస్తున్నాం. – నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ -
అక్రమాలు చేసి.. ముఖం చాటేశారు..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గండేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అవినీతి, అక్రమాలపై విచారణకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార అధికారులు కదిలారు. అక్రమాలకు సంబంధించిన రికార్డులు తారుమారు కాకుండా చూసేందుకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం వారు ప్రయత్నించారు. సొసైటీ సిబ్బంది సహకరించకపోవడంతో చివరకు సొసైటీ భవనాన్ని, అందులో కీలకమైన రికార్డులు ఉన్న బీరువాలను సీజ్ చేశారు. బినామీ పేర్లు, నకిలీ డాక్యుమెంట్లతో గండేపల్లి సొసైటీలో కొంతమంది ప్రబుద్ధులు రూ.23 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంపై.. డీసీసీబీలోని ఇద్దరు డిప్యూటీ జనరల్ మేనేజర్లతో చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీని నుంచి ఏదో ఒకలా బయట పడదామనుకుంటున్న సూత్రధారులు విచారణ ముందుకు సాగకుండా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన రికార్డులను మాయం చేసే ప్రయత్నాలకు బుధవారమే తెర తీశారు. తొలిగా సొసైటీలో సిబ్బందిని అందుబాటులో లేకుండా చేశారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ సొసైటీలో 156 మంది బినామీ పేర్లు, నకిలీ బాండ్లతో విడుదల చేసిన రుణాల రికార్డుల కోసం విచారణాధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. విచారణ కోసం సొసైటీ కార్యాలయానికి వెళ్లేసరికి సిబ్బంది ముఖం చాటేయడంతో వారు అవాక్కయ్యారు. శుక్రవారం సొసైటీ వద్దకు వెళ్లగా రికార్డులు, కార్యాలయంలోని బీరువాల తాళాలు కూడా అందుబాటులో లేవనే సమాధానం వారికి ఎదురైంది. తద్వారా విచారణను అడ్డుకునేందుకు అక్రమార్కులు ఎత్తు వేశారు. సొసైటీలోని బీరువాల్లో ఉన్న రికార్డులను మార్చేసే ప్రయత్నం కూడా జరుగుతోందని స్థానికులు డీసీసీబీ అధికారులకు ఉప్పందించారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన డీసీసీబీ అధికారులు అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేశారు. విచారణ ముందుకు సాగాలంటే రికార్డులు తారుమారు కాకుండా చూడాలని, ప్రధాన ఆధారాలుగా భావిస్తున్న 156 మంది రైతుల పేర్లతో నమోదై ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసే వరకూ సొసైటీలోని రికార్డులను భద్రంగా ఉంచాల ని జిల్లా సహకార అధికారి పాండురంగారావును డీసీసీబీ చైర్మన్ అనంతబా బు కోరారు. జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు పెద్దాపురం, ప్రత్తిపా డు సబ్ డివిజన్ల సహకార అధికారులు బీఎన్ శివకుమార్, శివకామేశ్వరరావు లు గండేపల్లి సొసైటీకి వెళ్లారు. సిబ్బందిని రికార్డుల గురించి అడగగా వారు ఇవ్వలేదు. అటెండర్‌కు కరోనా వచ్చినందు వల్ల తాళాలు లేవని చెప్పారు. వారి మాటలను విశ్వసించని అధికారు లు రికార్డులు ఉన్న మూడు బీరువాల తో పాటు, గండేపల్లి సొసైటీ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. డీసీసీబీ జారీ చేసిన నోటీసులను సొసైటీ ప్రధాన ద్వారం తలుపులపై అతికించారు. ఈ అక్రమాలపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపడతామని డివిజనల్ సహకార ఆఫీసర్ రాధాకృష్ణ తెలిపారు. అక్రమార్కుల నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టే వరకూ విశ్రమించేది లేదన్నారు. బాధ్యులుగా తేలిన వారిపై సహకార చట్టం ప్ర కారం చర్యలు తప్పవన్నారు. విచారణ ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసుల సాయం కూడా తీసుకుంటామని హెచ్చరించారు. -
వెలుగు చూస్తున్న కైలాస్ నాయక్ లీలలు..
కర్నూలు రూరల్: జిల్లాకు చెందిన లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కైలాష్‌నాయక్ లీలలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. కుల సంఘం మాటున నేతగా ఎదిగిన ఇతను సొంత కులం వారినే వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. గతంలో పేదల స్థలాలు కబ్జాలు చేయడమే కాకుండా బాధితులను ఊరు విడిపించిన ఉదంతాలూ ఉన్నాయి. కైలాష్‌నాయక్ కోడుమూరు నియోజకవర్గ టీడీపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. ఆయన అండతో మొన్నటి వరకు చిన్న చిన్న దందాలు, దౌర్జన్యాలకు పాల్పడిన ఇతను ఇప్పుడు భారీ వసూళ్లకు తెరతీశాడు. కర్నూలు మండలం సుగాలి తండాలో 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి 1975లో కర్నూలు మండలం రుద్రవరం గ్రామం వద్ద కుటుంబానికి ఐదెకరాల చొప్పున అప్పటి ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. సర్వే నంబర్ 507ఏలోని దాదాపు 95 ఎకరాలను ఇటీవల పేదలకు ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు గాను ఎకరానికి రూ.18 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఇదే సర్వే నంబర్లో కైలాష్ నాయక్‌కు కూడా ఐదెకరాల పొలం ఉంది. అయితే.. అందరికీ నష్టపరిహారం డబ్బు తానే తెప్పించానంటూ అక్రమ వసూళ్లకు తెర తీశాడు. ప్రతి ఒక్కరూ ఎకరాకు రూ.4 లక్షల చొప్పున ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. ఇలా ఇప్పటికే రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా డబ్బు అందని వారి నుంచి ప్రాంసరీ నోటు కూడా రాయించుకున్నట్లు తెలుస్తోంది. డబ్బు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన బాధితులను చంపేస్తానంటూ రివ్వాలర్‌తో బెదిరించాడు. దీంతో మూడు రోజుల క్రితం కైలాష్‌నాయక్‌పై బాధితులు కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత అండతో.. టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి అండతో కైలాస్ నాయక్ దందాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సుగాలి తండా, నందనపల్లి పంచాయతీలో వందకు పైగా భూదందాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అతనికి భయపడి సుమారు 20 కుటుంబాలు ఊరు విడిచాయి. అమాయక ప్రజల ఇళ్లను ఖాళీ చేయించి వాటిని ఆక్రమించుకున్నాడు. అతని అన్న కుమారుడు యోగేశ్‌నాయక్ కూడా స్థానికంగా దందాకు తెరతీశాడు. స్థానిక కల్లు దుకాణం నుంచి రైస్ మిల్లు వరకు మామూళ్లు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. మా డబ్బు ఇప్పించండి మాకు ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.18 లక్షలు ఇచ్చింది. ఇందులో సగం డబ్బు కైలాస్ నాయక్‌కే ఇచ్చాం. మా లాంటి వాళ్ల దగ్గర ఇంత డబ్బు వసూలు చేయడం దారుణం. అధికారులు మాకు డబ్బు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలి. – పార్వతీ బాయి, సుగాలి తండా నేను తప్పు చేయలేదు తండాలో అందరూ మా రక్తసంబంధీకులే. మా కుటుంబ సభ్యులను నేను మోసం చేయను. నా జీవితంలో ఎన్నో కేసులు చూశా. వీటిని కూడా ఎదుర్కొంటా. నేను తప్పు చేశానని రుజువు చేస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమే. – ఆర్.కైలాష్‌నాయక్ -
ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లపై మాటే
ఓ సారి అధికారం ఇస్తే పది కాలాలపాటు ప్రజల సేవలో తరించాలనుకోవాలి...ప్రజల మన్ననలు పొందుతూ వారి మదిలో పదిలంగా స్థానం సంపాదించాలని ప్రజాప్రతినిధి తపన పడాలి. కానీ టీడీపీ హయాంలో ప్రజాప్రతినిధులంటే నిధుల స్వాహాకే వచ్చినట్టుగా...అందుకే పదవిని చేపట్టినట్టుగా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఐదేళ్లే కాకుండా రానున్న ఐదేళ్లలో కూడా దోపిడీకి స్కెచ్ వేసుకొని మరీ స్వాహాకు ఉపక్రమించడం మరీ విడ్డూరం. అదృష్టవశాత్తూ వారు అధికారానికి దూరమయ్యారు కాబట్టి సరిపోయింది గానీ లేదంటే నిలువు దోపిడీ జరిగేది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పచ్చ నేతల ముందు చూపుతో సహకార సంఘాల్లో కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. జిల్లాలోని ఏ సహకార సంఘాన్ని కదిలించినా గత టీడీపీ ఏలుబడిలో ఎటు చూసినా అవినీతి కుంభకోణాలు బట్టబయలవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అండాదండా చూసుకుని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమనే ధీమాతో టీడీపీ నేతలు సహకార సంఘాల్లో దొంగలు పడ్డట్టుగా చొరబడి దొరికినంత దోచుకున్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారు, పంట రుణాలు మాఫీ చేస్తారని ఆ పార్టీ ఏలుబడిలోని సహకార సంఘాల పాలక వర్గాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు గట్టి నమ్మకంతో ఉన్నారు. అతి విశ్వాసంతోనే బినామీ పేర్లతో కోట్లు రుణాలు లాగేశారు. తీరా ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఘోర పరాభవాన్ని రుచి చూపించారు. ఈ పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రభుత్వం వచ్చేస్తుంది, చంద్రబాబు రుణ మాఫీ అమలవుతుందనే గుడ్డి నమ్మకంతో జిల్లాలోని పలు సహకార సంఘాల ప్రతినిధులు నకిలీ పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో రూ.కోట్లకు పడగలెత్తారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక ఈ కుంభకోణాలను ఒకటొకటిగా ఛేదిస్తున్నారు. గతం దొంగల దోబూచులాట కొన్ని సంఘాలు, బ్రాంచీల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణాలు బయటకు రాకుండా సంఘాల్లో పనిచేస్తున్న అధికారులు దాచిపెడుతున్నారు. గత పాలకవర్గాల్లో సంఘాలపై పడి నిలువునా దోచుకున్న వారే కావడం గమనార్హం. గత టీడీపీలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ వరుపుల రాజా, సీఈఓల హయాంలో డీసీసీబీ, సహకార సంఘాలు కుంభకోణాలమయంగా మారిపోయాయి. ఈ కుంభకోణాల గుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో రట్టు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఇలా ఏజెన్సీలోని మొల్లేరు, మెట్ట ప్రాంతంలో లంపకలోవ, కోనసీమలో వద్దిపర్రు...తదితర సొసైటీలపై పడి రూ.కోట్లు కొట్టేసిన వైనాన్ని సాక్షి’ వెలుగులోకి తేవడం, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటున్నారు. గండేపల్లిలో తాజాగా... ఈ వరుసలోనే తాజాగా మెట్ట ప్రాంతంలోని గండేపల్లి సహకార సంఘం, గండేపల్లి డీసీసీ బ్రాంచీలో రూ.కోట్లు కొల్లగొట్టిన కుంభకోణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 2017 నవంబరు నెల నుంచి గండేపల్లి బ్రాంచి పరిధిలోని గండేపల్లి పీఏసీఎస్‌లో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్లు, బినామీ రైతుల పేరుతో స్వాహా బాగోతమిదీ. గండేపల్లి డీసీసీబీ బ్రాంచి సూపర్వైజర్గా నేదూరి వాసుదేవరెడ్డి గతేడాది అక్టోబరు 28న జాయినయ్యారు. 2020 జనవరి 30న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, చైర్మన్ ఆదేశాల మేరకు గండేపల్లి సొసైటీ రికార్డులను బ్యాంకులో పరిశీలించేందుకు సూపర్వైజర్ ప్రయత్నించారు. అందుకు సొసైటీ, బ్రాంచిల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ క్రమంలో 2017 నవంబరు 28 నుంచి ఇచ్చిన రుణాలకు సంబంధించి రికార్డులు బ్యాంక్‌కు ఇవ్వలేదనే విషయం గుర్తించారు. గండేపల్లి బ్రాంచిలో సైతం రికార్డులను దాచిపెట్టారు. లోతుగా పరిశీలించే క్రమంలో బ్యాంకులో ఉన్న షాడో రిజిస్టర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా కొంత సమాచారాన్ని సూపర్వైజర్ సేకరించడంతో విషయం డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. సూపర్వైజర్ సంతకం లేకుండానే.. సూపర్వైజర్ సంతకం లేకుండా పది మంది సభ్యుల రుణాలు రెన్యువల్ చేసిన వైనం ఆ సందర్భంలోనే బయటపడింది. తన ప్రమేయం లేకుండా రుణాలు రెన్యువల్ చేయడంతో ఇందులో పెద్ద కుంభకోణమే దాగి ఉందనే అనుమానం, ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందనే భయం వెరసి సూపర్వైజర్ డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఈ క్రమంలోనే రికార్డులు పరిశీలించే సరికి తీగ లాగితే డొంక కదిలినట్టు గండేపల్లి సొసైటీలో కోటి రూపాయల బినామీ రుణాల బాగోతం బయటకు వచ్చిందంటున్నారు. 10 మంది సభ్యుల రుణాలకు సంబంధించి అడ్వాన్సు స్టేట్మెంట్, రికవరీ స్టేట్మెంట్పై సొసైటీ సూపర్వైజర్ సంతకాలు లేకపోవడం గమనార్హం. మేనేజర్ ఒక్క కలం పోటుతో రూ.99,93,000 లక్షలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలను 2020, ఫిబ్రవరి 17న రెన్యువల్ చేయడం విశేషం. మొదట గుర్తించిన పది మంది సభ్యుల బినామీ రుణాలు రెన్యువల్ చేయడంతో మరిన్ని రుణాలు ఇదే రీతిన రెన్యువల్ చేశారని తెలియవచ్చింది. అలా గండేపల్లి సొసైటీలో మొత్తం 156 మంది సభ్యుల పేరుతో బినామీ పాస్‌పుస్తకాలు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్ పేపర్లతో సుమారు రూ.23 కోట్లు రుణాలు అప్పటి పాలకవర్గం హయాంలో విడుదలయ్యాయి. ఈ 156లో మొత్తం 50 మంది సభ్యుల(బినామీలు) రుణాలను రెన్యువల్ చేయగా, మిగిలిన 106 మంది రెన్యువల్ చేసే క్రమంలోనే విషయం బయటకు పొక్కడంతో బ్రేక్ పడిందంటున్నారు. ఈ నకిలీ పాస్‌పుస్తకాలు, డాక్యుమెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మెషీన్‌ను గండేపల్లిలో ఏర్పాటు చేశారని, చివరకు బాండు పేపర్లను సబ్ రిజిస్ట్రార్ సీల్‌ను కూడా టేంపరింగ్ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ బినామీ రుణాలకు సంబంధించిన మొత్తం జాబితా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు కూడా చేరినట్టు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా డీసీసీబీ నిష్పక్షపాతమైన విచారణ జరిపితే కుంభకోణం వెలుగులోకి రానుంది. ఇంకా మా దృష్టికి రాలేదు గండేపల్లి బ్రాంచ్ పరిధిలో రుణాల అవకతవకల విషయం నా దృష్టికి రాలేదు. జిల్లాలో ఏ సొసైటీ, బ్రాంచ్‌లో అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చినా వెంటనే చైర్మన్ అనంతబాబు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుని రికవరీ కూడా చేస్తున్నాం. గండేపల్లి సొసైటీ విషయం చైర్మన్‌తో మాట్లాడతాను. – ప్రవీణ్‌కుమార్, డిసీసీబీ ఇన్చార్జ్ సీఈవో -
‘సంక్షేమం’ కోసం.. అడ్డదారులు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నందిగాం మండలం దిమ్మడిజోలలో ఇటీవల తొమ్మిది మంది పింఛన్లను అధికారులు నిలిపేశారు. అధార్ కార్డులలో వయస్సు మార్పు చేశారని గుర్తించిన తరువాత ఈ చర్య తీసుకున్నారు. సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో వైఎస్సార్ చేయూత పథకం కోసం నెల రోజుల వ్యవధిలో అధార్ కార్డులో వయస్సు మార్పులు చేసి కొత్త వాటితో దరఖాస్తులు చేశారు. దీన్ని గమనించిన సచివాలయం సిబ్బంది ఆరాతీసేసరికి అసలు విషయం వెలుగు చూసింది. శ్రీకాకుళంలోని ఓ ఆధార్ సెంటర్లో పదిమంది వరకు ఇలా వయస్సు మార్పులు చేయించుకున్నారని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరు వయస్సు మార్పు కోసం రూ. 5 వేలు చొప్పున సమరి్పంచినట్టు కూడా తెలిపారు. ఫిర్యాదు చేయండని అడిగేసరికి ఎందుకొచ్చింది వాళ్లంతా మా వాళ్లేనని దాటవేస్తున్నారు. ఈ రెండు చోట్లేకాదు జిల్లాలో పలుచోట్ల పింఛన్లు, వైఎస్సార్ చేయూత, ఇతరత్రా సంక్షేమ పథకాల కోసం అధార్కార్డులలో వయస్సు మార్పులు చేస్తున్నారు. ఏటా రూ. 18,750 వచ్చే చేయూత పథకాన్ని, నెలకు 2,250 రూపాయలు వచ్చే సామాజిక పింఛన్లను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆరాటంతో పలువురు అడ్డదారులు తొక్కుతున్నారు. పొరుగు జిల్లాలోని చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎల్‌ఎన్‌పేట, శ్రీకాకుళం, ఒడిశాలోని పర్లాకిమిడి, ఏడు మైళ్లరాయి, బరంపురం వద్ద ఆధార్ సెంటర్లు, మీసేవా కేంద్రాల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆధార్ కార్డులలో మార్పులు చేయిస్తున్నారు. గత కొన్నాళ్లుగా జిల్లాలో ఈ ప్రాక్టీసు జరుగుతోంది. కాసులకు కక్కుర్తిపడిన నిర్వాహకులు ఇష్టం వచ్చినట్టు వయస్సు వేసేసి కొత్త ఆధార్ కార్డులు వచ్చేలా చేస్తున్నారు. దీంతో 45 ఏళ్లు, 50 ఏళ్లు ఉన్న వారు కూడా 65 ఏళ్ల వయస్సు ఉన్నట్టుగా మార్చుకుని పింఛన్లకు అర్హత సాధిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ముడుపుల బాగోతం నడుస్తున్నది. ఒక్కొక్క కార్డులో వయస్సు మార్చేందుకు రూ. 5 వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వసూలు చేసి భారీగా లబ్ధిపొందుతున్నారు. సహకరిస్తున్న మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఇదే సమయంలో కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా అత్యాశకు పోయి వారికి సహకరిస్తున్నారు. కొన్ని ఆధార్ సెంటర్లలో ఇదేరకమైన మాల్ ప్రాక్టీసు జరుగుతోంది. వయస్సు మార్చి డబ్బులు సంపాదించడమే పనిగా వీరు పెట్టుకున్నారు. సాధారణంగా ఏదైనా ధ్రువీకరణ పత్రం చూసి ఆధార్ కార్డులో వయస్సు మార్చేందుకు ఆప్‌లోడ్ చేయాలి. కానీ పలు కేంద్రాల నిర్వాహకులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయస్సు మార్పులు చేసి అప్లోడ్ చేసేస్తున్నా రు. అప్లోడ్ అయ్యాక వయస్సు మార్పుతో కూడిన ఆధార్ కార్డులు జారీ అయిపోయాయి. వీటిని పట్టుకుని పింఛను, వైఎస్సార్ చేయూత పథకాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. కాకపోతేసచివాలయం సిబ్బంది కొన్నిచోట్ల క్షుణ్ణంగా పరిశీలించి నెలల వ్యవ«ధిలోనే వయస్సు ఎలా మారిపోయిందని నిలదీసేసరికి కొన్నిచోట్ల ఆధార్ అక్రమాలు బయటపడుతున్నాయి. పట్టుబడ్డ ముఠాతో వాస్తవాలు వెలుగులోకి.. పర్లాకిమిడిలో వయస్సు మార్పులు చేపడుతున్నారన్న సమాచారంతో సరుబుజ్జిలి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు ఒడిశా కేంద్రంగా పట్టుబడ్డ ముఠా తో అక్రమాలు మరింత రుజువయ్యాయి. ఎస్మాన్ మండల్ నాయక్, కిల్లారి చిన్నారావు, చింతా డ శ్రీనివాసరావు బృందంగా ఏర్పడి చేస్తున్న నకిలీ ఆధార్ కార్డుల గుట్టును రట్టు చేశారు. ఈ ముఠా సభ్యులు నకిలీ స్టడీ సరి్టఫికెట్లతో పాన్‌కార్డుల వయస్సును మార్చారు. ఆధార్ కార్డుల కో సం అప్లోడ్ చేశారు. 260 కార్డులను తారుమారు చేసి పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా నౌగాడ వద్ద ఆధార్ కార్డుల కోసం ఎస్మాన్ మండల్ నాయక్ అనే వ్యక్తి ఒక సరీ్వ సు ప్రొవైడర్ ఏర్పాటు చేశారు. ఆయనతో ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన కిల్లారి శ్రీనివాసరావు, చింతాడ శ్రీనివాసరావులు జత కలిసి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేయడం మొదలు పెట్టారు. నేరుగా ఎల్‌ఎన్‌పేటకు వచ్చి నకిలీ ధ్రువపత్రాలు, పాన్‌కార్డులను మోసపూరితంగా ఉపయోగించి ఆధార్ కార్డుల కోసం అప్లోడ్ చేసిన వ్యవహారం బట్టబయలైంది. -
అంతే వీరు.. మారదు తీరు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ కాంట్రాక్టర్ల తీరు మారలేదు. కూన రవికుమార్ సోదరుడిలో కనీసం మార్పు రాలేదు. కోట్లాది రూపాయలతో ఆయన వేసిన రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. కొత్త రోడ్డు కొన్నాళ్లకే పా డైపోతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం పూర్తి స్థాయి నాణ్య తా ప్రమాణాలతో మళ్లీ వేయాల్సి ఉంటుంది. కానీ వారి అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదన్నట్టుగా మరమ్మతుల్లో కూ డా నాసిరకం పనులే చేపట్టారు. వీరి పనితనం వల్ల రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు జనాలను వెక్కిరించేదిగా తయారైంది. విపత్తు నివారణ పథకం కింద పొందూరు మండలం కింతలి–బొడ్డేపల్లి జెడ్పీ రోడ్డు నుంచి సింగూరు మీదుగా ఎన్‌హెచ్–5 వరకు 4.75 కిలోమీటర్ల తారు రోడ్డు వేసే కాంట్రాక్ట్‌ను టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ సోద రుడు, విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ అధినేత కేవీ సత్యనారాయణ దక్కించుకున్నారు. రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు కొన్నాళ్లకే శిథిలమైపోయింది. గునపాలతో పెకిలించినట్టుగా ధ్వంసమైపోయింది. ఇదే విషయమై ఆగస్టు 31వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘రోడ్డు శిథిలం–అవినీతి పదిలం’ శీర్షికన వార్త ప్రచురితమైంది. మరమ్మతు పనుల్లోనూ.. ‘సాక్షి’లో కథనం వచ్చాక హుటాహుటిన కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఆ రోడ్డు వద్దకు చేరుకుని, శిథిలమైన రోడ్డును పరిశీలించి, మరమ్మతులు చేపట్టేందుకు చర్య లు తీసుకున్నారు. దీంతో ఆ రోడ్డుకు మంచి రోజులొస్తాయని, తమ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆశపడ్డారు. కానీ కాంట్రాక్టర్ అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదు. ఎక్కడైతే రోడ్డు శిథిలమై కుంగిపోయిందో అక్కడే మట్టితో కప్పి మసిపూసి మారేడు కాయ చేశారు. వాస్తవంగా రోడ్డు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం వేసిన రోడ్డు పాడైతే దాన్ని పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాల్సి ఉంది. కానీ ఇక్కడ మట్టితో మమ అనిపించేశారు. ఇంకేముంది ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ రోడ్డు కుంగిపోయింది. వేసిన మట్టి కొట్టుకుపోతోంది. చేసిన ప్యా చ్ వర్క్ కూడా పనికి రాకుండా పోయింది. మరమ్మతుల్లో కూడా నాసిరకం పనులే చేశారు. ఫలితంగా ఆ రోడ్డు అక్క రకు రాకుండా పోతోంది. చెప్పేందుకే నీతులు చేసేవన్నీ అవినీతి పనులే అని మరోసారి నిరూపించుకున్నారు. టీడీ పీ హయాంలో జరిగిన నీరు చెట్టు పనులు మాదిరిగానే రోడ్డు పనులు చేపట్టి కోట్లాది రూపాయలకు కన్నం పెట్టేసిన ఘనుడిగా మరోసారి నిలిచిపోయారు. వెక్కిరిస్తున్న ‘కూన’ వేసిన రోడ్డు కూన రవికుమార్ సోదరుడు కె.వి.సత్యనారాయణ వేసిన రోడ్డు ఇప్పుడందర్ని వెక్కిరించేలా ఉంది. అటుగా వెళ్లిన వారంతా ఆ రోడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు. కోట్లాది రూపాయలతో వేసిన రోడ్డుకు ఈ పరిస్థితేంటని అవాక్కవుతున్నారు. అధికారంలో ఉన్నంతవరకు అడిగే వారు లేక ఇష్టారాజ్యమైపోయిందని, ఇప్పుడైనా నాణ్యమైన పనులు చేపట్టి, కోట్లాది రూపాయలకు ఫలితం వచ్చేలా చూడాల్సింది పోయి అదే అడ్డదార్లు తొక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇంజనీరింగ్ అధికారులు సైతం నాసిరకం మరమ్మతు పనులపై అభ్యంతరం తెలపకపోవడం అందరికీ విస్మయం కలిగిస్తోంది. -
వెలుగులోకి సీఐ అవినీతి బాగోతాలు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: బాధ్యత గల పోలీసు ఉద్యోగంలో ఉంటూ బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఐ నాగేశ్వరనాయక్ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సీఐ నాయక్ తమకు అన్యాయం చేశారంటూ ఆయన బాధితులు జిల్లా పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు గురువారం జంగారెడ్డిగూడెం పోలీసుస్టేషన్లో ఎస్ఈబీ అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ నేతృత్యంలోని అధికారుల బృందం తనిఖీ నిర్వహించింది. జంగారెడ్డిగూడెం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇసుక అక్రమార్కులకు పెద్దఎత్తున లంచాలు తీసుకుని సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఎస్ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగిన విచారణపై ‘సాక్షి’ రాసిన కథనాలతో ఉన్నతాధికారులు తప్పనిసరి పరిస్థితిలో జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర్ నాయక్, ఎస్సై గంగాధర్‌ను వీఆర్‌లో పెట్టారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే విచారణ చేస్తున్న సందర్భంలో సీఐ అవినీతి బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో నిందితుడిగా ఉన్న వ్యక్తి కారును ఇప్పటికీ సీఐ వినియోగిస్తున్నట్లుగా విచారణాధికారులు గుర్తించారు. సీఐపై మరికొన్ని ఆరోపణలు ఇవీ.. ఉన్నతాధికారుల అనుమతులు ఏమాత్రం లేకుండా జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఒక షెడ్ నిర్మాణంతోపాటు అనధికారికంగా సీఐ కార్యాలయంలో ఏసీలు పెట్టించడం వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలు చేపట్టినట్లు సీఐపై ఫిర్యాదులు వచ్చాయి. ►భీమడోలు సీఐగా పనిచేసే సమయంలో సీఐ నాయక్ తనను అక్రమంగా నిర్బంధించి, చేపల వ్యాపారస్తులకు చెందిన కేసులో ఇరికిస్తానంటూ బెదిరించి తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.40 లక్షలను అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల ఖాతాల్లోకి బదిలీ చేయించారని, సీఐ నాయక్‌పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఏలూరుకు చెందిన చేపల వ్యాపారి మామిడి వెంకట కృష్ణ అనే వ్యక్తి గురువారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ►సీఐ నాయక్ చింతలపూడి ఇన్చార్జ్ సీఐగా ఉంటూ చింతలపూడి ప్రాంతంలో మద్యం దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను అరెస్ట్ చేసి, వారినే ద్వారకాతిరుమలలో జరిగిన మద్యం దొంగతనం కేసులో కూడా నిందితులుగా పెట్టి, అసలైన నిందితులను వదిలేశారనే విషయం తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. ►జిల్లాలోని చింతలపూడి పోలీసుస్టేషన్లో నమోదైన ఓ కేసులో నిందితురాలిగా ఉన్న జిల్లా అధికారిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సదరు ఉద్యోగి నుంచి సీఐ పెద్దఎత్తున వసూళ్లు చేశారని గుర్తించి ఆ దిశగానూ విచారణ మొదలుపెట్టారు. మద్యం బాటిళ్ల మాయంపై క్రిమినల్ చర్యలు : ఎస్ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్ జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసుల్లో సీజ్చేసిన మద్యం బాటిళ్లు దురి్వనియోగం జరిగినట్లు గుర్తించామని దీనిపై సంబంధిత ఎస్హెచ్ఓపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ వెల్లడించారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. నాలుగు ఎన్డీపీ మద్యం కేసుల్లో బాటిళ్లను తారుమారు చేశారని పేర్కొన్నారు. మొత్తం 24 బాటిళ్లు తారుమారయ్యాయని వెల్లడించారు. అంతేగాక కేసులకు సంబంధం లేని అనధికార మద్యం బాటిళ్లు 51 క్వార్టర్ బాటిళ్లను పోలీస్‌స్టేషన్‌లో గుర్తించామన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించి మద్యం బాటిళ్లను తారుమారు చేసినట్లు, అక్రమాలు జరిగినట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ మద్యం కేసులు నమోదు జరిగిన సమయంలో ఉన్న ఎస్హెచ్ఓపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రస్తుత ఎస్హెచ్ఓను షరీఫ్ ఆదేశించారు. అంతేగాక అప్పటి ఎస్హెచ్ఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను నివేదించినట్లు కరీముల్లా షరీఫ్ చెప్పారు. -
స్టాఫ్‌నర్సు నియామకాల్లో అక్రమాలు
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్టాఫ్‌నర్సు అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. లోకల్ అభ్యర్థులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కి మెరిట్ లిస్ట్ తయారు చేశారు. నాన్‌లోకల్ అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టబెట్టి జిల్లా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. ఫలితంగా అర్హుత ఉండీ ఉద్యోగాలు దక్కని వారంతా లబోదిబోమంటున్నారు. అనంతపురం హాస్పిటల్: స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియలో జిల్లా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఆరోగ్యశాఖ, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉండే పోస్టుల నియామకాలు, ప్రొవిజినల్ మెరిట్ లిస్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో మన జిల్లా అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. వివిధ శాఖల ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా అర్హులకు మొండిచేయి చూపారన్న విమర్శలున్నాయి. పొరుగు జిల్లాలైనా వైఎస్సార్, కర్నూలులో లోకల్, నాన్‌లోకల్ కేటగిరిలో పోస్టులను పక్కాగా భర్తీ చేస్తుంటే ‘అనంత’లో మాత్రం నిబంధనలకు నీళ్లొదిలారు. కాంట్రాక్టు పోస్టుల భర్తీకి... కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పీహెచ్‌సీలు, సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ, ఏరియా ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన స్టాఫ్‌నర్సు పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. లోకల్ కాకపోయినా... ఈ నెల 14న 92 స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్ లిస్టును డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్ విడుదల చేశారు. మొదటి 28 పోస్టులు అన్‌రిజర్వ్ కేటగిరికి కేటాయించారు. మరో రెండు పోస్టులు పీహెచ్ – హెచ్‌హెచ్ (వికలాంగులు)కు కేటాయించారు. ఇక మిగతా 62 పోస్టులు స్థానికంగా ఉండే వారికి కేటాయించాలి. కానీ వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎ.అమరావతి (జాబితాలో 28వ నంబర్)కి పోస్టింగ్ ఇచ్చారు. అర్హుల జాబితాలోనూ ఈమెను లోకల్‌గానే చూపించారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ (సీరియల్ నెంబర్ 64 )ను అర్హుల జాబితాలో లోకల్‌గా చూపించారు. ఇదే విధంగా మరో నలుగురు నాన్‌లోకల్ వారిని లోకల్‌గా చూపించి పోస్టులను కేటాయించారు. ఆరోగ్యశాఖలోనూ... ఈ నెల 5న డీఎంహెచ్ఓ కార్యాలయంలో స్టాఫ్‌నర్సులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టులు కేటాయించారు. మొత్తం 77 పోస్టులను భర్తీ చేశారు. అందులో వైఎస్సార్ జిల్లా గాలివీడుకు చెందిన కే.శైలజ (మెరిట్ నంబర్ 43) వర్కింగ్ ప్లేస్‌గా చూపించి పోస్టింగ్ కేటాయించారు. అలాగే మదనపల్లికి చెందిన ఉమాదేవి (సీరియల్ నంబర్ 65 ) , కర్నూలు జిల్లాకు చెందిన టి.సునీత (సీరియల్ నంబర్ 68)ను లోకల్ కేటగిరిలో చూపించారు. మెరిట్, ఫైనల్ మెరిట్ లిస్టుల్లో అభ్యర్థి ఏ ఊరు అనే అంశాన్ని కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. అదేబాటలో వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ పోస్టుల భర్తీలోనూ వైద్య కళాశాల డీఎంహెచ్ఓ, వైద్య విధానపరిషత్ అధికారులు అనుసరిస్తున్న వైఖరిని అవలంభిస్తుండం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మెరిట్ జాబితా ఎంపికపై అవగాహన లేకపోవడంతో పాటు కొందరు అధికారుల అనుయాయులకు పోస్టులు కట్టబెట్టడానికే ఈ అడ్డగోలు బాగోతానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని జిల్లా అభ్యర్థులు కోరుతున్నారు. 92 పోస్టులకు 39 మంది హాజరు అనంతపురం హాస్పిటల్: డీసీహెచ్ఎస్ కార్యాలయంలో డీసీహెచ్ఎస్ రమేష్‌నాథ్ ఆధ్వర్యంలో గురువారం స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించారు. 92 పోస్టులకు గానూ కేవలం 39 మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. అభ్యర్థుల మెరిట్ లిస్టు ప్రాతిపదికన స్థానాలను కేటాయించారు. అనంతరం డీసీహెచ్ఎస్ రమేష్‌నాథ్ అభ్యర్థులకు ఆర్డర్ కాపీలను అందజేశారు. భర్తీ చేయాల్సిందిలా.. స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీలో 70 శాతం స్థానికులతోనే భర్తీ చేయాలి. 30 శాతం మాత్రం నాన్‌లోకల్ తో పాటు స్థానికులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంది. భర్తీ చేసిందిలా... 70 శాతం లోకల్ కేటగిరీలోనే నాన్‌లోకల్ వారికి అవకాశమిచ్చి ఉద్యోగాలిచ్చారు. ఫలితంగా జిల్లాకు చెందిన అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. నాన్ లోకల్‌లోనూ మెరిట్ పక్కన పెట్టి జాబితా తయారు చేశారు. తప్పులుంటే సరిచేస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పోస్టుల భర్తీ జరుగుతుంది. స్టాఫ్‌నర్సు పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న విషయంపై మరోసారి జాబితాను పరిశీలిస్తాం. ఏవైనా తప్పులు జరిగి ఉంటే సరిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనూ ఇలాంటి సమస్య తలెత్తితే సరి చేసేలా చర్యలు తీసుకున్నాం. – సిరి , జాయింట్ కలెక్టర్ -
టీడీపీ నేతలతో కుమ్మక్కై..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికలకు ముందు బాహుదా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చే కూర్చి ప్రజాధనం మింగేద్దామని టీడీపీ నాయకులు వేసిన ప్లాన్ ఎట్టకేలకు బట్టబయలైంది. ఈ బాగోతంలో అధికారులతో పాటు అప్పటి వంశధార ఎస్ఈ సురేందర్ పేరు కూ డా బయటకు రావడం విస్మయం కలిగిస్తోంది. ప్రారంభం కాని ప్రాజెక్టులను రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో ఫర్వాలేకపోయింది. లేదంటే ఈ ప్రా జెక్టు ముసుగులో వేల కోట్ల రూపాయలను తినేసేవారే. టీడీపీ నేతలను పక్కన పెడితే బాధ్యత గల అధికారిగా పనిచేయాల్సిన గత ఎస్ఈ అవినీతిలో భాగస్వామి కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతా కలిపి కుమ్మక్కై దోచేద్దామని ప్రయత్నించినా ఈ ప్రభుత్వం అడ్డుకోగా, అంతకుముందే డీపీఆర్, ఇతరత్రా పేరిట లక్షలాది రూపాయల అక్రమాలకు పాల్పడిన వ్యవహారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలినట్టు సమాచారం. (చదవండి: ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ..) టీడీపీ హయాంలో దోపిడీకి ప్రణాళిక వంశధార ప్రాజెక్టు రెండో దశలో హిరమండలం రిజర్వాయర్ నుంచి 110 కిలోమీటర్ల పొడవునా హైలె వల్ కెనాల్ తవ్వి ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిలోకి వంశధార జలాలను తరలించి రెండు నదులను అనుసంధానం చేయాలని అప్పటి సర్కార్ నిర్ణయించింది. వంశధార, బాహుదా నదులు అనుసంధానం చేసి, 75వేల ఎకరా ల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.1075 కోట్లతో 2015 లో బాహుదా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశా రు. 2019 ఫిబ్రవరి 11న ఇదే ప్రాజెక్టును 2లక్షల ఎకరాల ఆయకట్టుకు పెంచి రూ.6,326.62కోట్లతో డిజైన్ చేసి టెండర్ల నోటిఫికేషన్ పిలిచారు. ఇందులో 90వేల ఎకరాలు స్థిరీకరణ కింద, లక్షా 10వేల ఎకరాల కొత్త ఆయకట్టు కింద నిర్దేశించారు. నాలుగేళ్ల కాలంలో లక్షా 25వేల ఎకరాల మేర అ దనపు ఆయకట్టు చూపించి, రూ. 5,251 కోట్ల మేర అదనంగా అంచనా వ్యయం పెంచారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు డిజైన్ చేసి, ఫిబ్రవరి 11న టెండర్లు పిలిచారు. అదే నెల 27న ప్రైస్‌బిడ్ టెండర్లు తెరిచారు. (చదవండి: ఆ పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే) వంశధార ప్రాజెక్టు రెండో దశలో హిరమండలం రిజర్వాయర్ నుంచి 110 కిలోమీటర్ల పొడవున హైలెవల్ కెనాల్ తవ్వి ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిలోకి వంశధార జలాలను తరలించి రెండు నదులను అనుసంధానం చేయాలని సర్కార్ నిర్ణయించింది. హిరమండలం రిజర్వాయర్ నుంచి తరలించడం ద్వారా ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో 2లక్షల ఎకరాలకు నీరందించాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. ఈ కెనాల్‌కు అనుబంధంగా 8.30 టీఎంసీల సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ మేరకు ఎన్నికల షెడ్యూల్‌కు ముందు పరిపాలన అనుమతి ఇచ్చే సింది. ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాల్సి ఉండగా చంద్రబాబు ఒత్తిడి మేరకు కేవలం రెండు ప్యాకేజీల కింద నాటి సూపరింటెండెంట్ ఇంజనీర్ పనులను ఖరారు చేశారు. అంచనా వ్యయం పెంచి.. నాటి సీఎం చంద్రబాబునాయుడు స్వ యంగా జోక్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు డిజైన్ దగ్గరి నుంచి టెండర్ల పిలిచే వరకు కథ నడిపించారు. దానికి అప్పట్లో పనిచేసిన బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు సర్కిల్ సూపరింటెండెంట్ సురేందర్‌రెడ్డిని పావుగా వాడుకున్నా రు. చంద్రబాబు ఒత్తిడి మేరకు కేవలం రెండు ప్యాకేజీల కింద నాటి సూపరింటెండెంట్ ఇంజినీర్ పనులను ఖరారు చేశారు. 0 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వరకూ కాలువ తవ్వకం, పెద్ద లో గిడి, రంగసాగరం, మల్లివీడు రిజర్వా యర్ల నిర్మాణానికి రూ.1618.24 కోట్లతో, 55 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకూ కాలువ తవ్వకం, ఆళ్లకోలి, హంసరాళి, కంచిలి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు రూ. 2,452.85కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించి లంప్సమ్– ఓపెన్ విధానంలో టెండర్లు పిలిచారు. టెండర్ల నోటిఫికేషన్ జారీ చేయకుముందే తన అనుయాయులైన ఇద్దరు కాంట్రాక్టర్లు రెండు ప్యాకేజీలకు షెడ్యూల్ దాఖలు చేసేలా ఒక్కొక్కరు ఒక్కో ప్యాకేజీ దక్కించుకునేలా వ్యూహరచన చేసి, ఆ కాంట్రాక్టర్‌కు ఉన్న అర్హతలనే టెండర్లలో నిబంధనలు పొందుపరిచారు. ఇంకేముంది.. అనుకున్నట్టే కుమ్మక్కైన వారికి రూ.1618.24కోట్ల ప్యాకేజీని రూ. 1695.11 కోట్లకు, రూ.2452.85కోట్ల ప్యాకేజీని రూ.2572.06కోట్లకు కట్టబెట్టారు. ఇదంతా వేల కోట్లు కొట్టేసేందుకు వ్యూహాత్మకంగా డిజైన్ చేసిన ప్రాజెక్టుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇందులో గత ఎస్ఈ సురేందర్ పాత్ర డీపీఆర్ పేరుతో రూ.64,20,345 అడ్డగోలుగా ఇచ్చి ప్రభు త్వ ఖజానా ఖాళీ చేశారు. డబుల్ చెక్ బెంచ్‌మార్క్ లెవల్స్ చూసి పోల్స్ వెయ్యడానికి సాధారణంగా 2శాతం మాత్రమే వెచ్చించాలి కాని 20 శాతం నిధులు వెచ్చించి వృధాగా ఖ ర్చు చేశారు. 120 కిలోమీటర్ల మేర (కొండలు, నదులు, రోడ్లు) వంటి ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలను బట్టి కెనాల్ మొత్తం గ్రిడ్ లెవల్లు తీయాలి, పుస్తకాల్లో రికార్డు చేయాలి. అవేమీ లేకుండా నిధులు కాజేశారన్న వాదనలు ఉన్నాయి. ఎస్ఈ, ఈఈగా వ్యవహరించి పుస్తకాల్లో రికార్డు చేయకుండా అందులో పేర్కొన్న సెక్షన్లతో సంబంధం లేకుండా పే మెంట్ చేశారు. అన్ని రికార్డులు ఇచ్చిన తర్వాతే 25 శాతం నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా అవేమీ లేకుండా మధ్యలోనే ఆ 25 శాతం నిధులు రిలీజ్ చేశారు. క్వాలిటీ కంట్రోల్ సరి్టఫికెట్ లేకుండా ఒక్క బిల్లు కూడా ఇవ్వకూడదు. కానీ ఎ ల్‌ఎస్ 1పార్ట్ బిల్లు, 2 అండ్ 3 బిల్లులు చేసేశారు. ప్రాథమిక అంచనాలో రూ.1040 కోట్లుగా ఇచ్చి అమాంతంగా ఆ ప్రా జెక్టు రేటును రూ.6342.55కోట్లకి పెంచేసి ఆ నిధుల కోసం పథక రచన చేశారని ఎస్ఈపై నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలినట్టు తెలిసింది. అంతేకాకుండా కాంట్రాక్టర్ నకిలీ బ్యాంకు గ్యారెంటీని ఇవ్వగా, అదేదీ చూడకుండా తీసుకుని కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశారని, ఇలాంటి నకిలీదేదైనా జరిగితే ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉన్నా అవేమీ చేయకుండా కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని తిరిగి ఇచ్చేశారని విచారణలో తేలినట్టు సమాచారం. అంతేకాకుండా వంశధార ట్రిబ్యునల్ టీమ్ ఖర్చుల పేరుతో ఎలాంటి సాంకేతిక మంజూరు లేకుండా సురేంద్ర ఇష్టం వచ్చిన వ్యక్తులకు ఇచ్చేసి అక్రమాలకు పాల్పడ్డారని తేల్చారు. కార్యాలయంలో కేస్ వర్కర్లు అంటే సూపరింటెండెండ్, జేఈ, ఏఈ, ఈఈలతో సంబంధం లేకుండా ఎస్టిమేట్ల మీద ఎస్ఈ సంతకాలతోనే ఫైల్ రన్ చేసేశారని విచారణలో తేలినట్టు సమాచారం. -
ప్రైవేట్ లేబొరేటరీల మాయాజాలం
♦హైదరాబాద్‌లో అదో ప్రముఖ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్. అందులో ఆర్టీ– పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. అయితే పరీక్షకు ముందు బాధితుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అక్కడ చేసే పరీక్షల వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు చేరడం లేదు. ♦ఖమ్మంలో ఓ ప్రైవేట్ లేబొరేటరీ ఉంది. దానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కానీ యాంటిజెన్ కిట్లను తెచ్చి పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టుకు రూ.500 ధర కాగా, ఈ లేబొరేటరీ నిర్వాహకులు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంటికెళ్లి చేస్తే రూ.3,500 వరకు తీసుకుంటున్నారు. ఈ పరీక్షలు ఎన్ని జరుగుతున్నాయో లెక్కాపత్రం లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా ప్రైవేట్ లేబొరేటరీల్లో ఇష్టారాజ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగు తున్నాయి. కొన్ని కనీస ప్రొటోకాల్‌ను కూడా పాటించడం లేదు. అనేక కేంద్రాలపై వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల పర్యవేక్షణ కరువైంది. దీంతో వాటిల్లో ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయో కూడా ప్రభుత్వ వర్గాలకు సమాచారం లేకుండా పోయింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులను, వారి ప్రాథమిక, సెకండరీ కాంటా క్టులను గుర్తించడం కష్టంగా మారింది. ఫలి తంగా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. బాధితులు తక్షణమే వైద్య సాయం అందించే పరిస్థితే లేకుండా పోవడంతో కొందరికి వ్యాధి తీవ్రమవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు లేవు..: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 చోట్ల, ప్రైవేట్‌లో 35 డయాగ్నస్టిక్ సెంటర్లు, కొన్ని ఆసుపత్రుల్లోని లేబొరేటరీల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తు న్నారు. అలాగే 1,076 ప్రభుత్వ కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు జరుగుతున్నాయి. ప్రైవేట్ లేబొరేటరీలు, ఆసుపత్రుల్లో ఆర్టీ– పీసీఆర్ పద్ధతిలోనే పరీక్షలకు అనుమతి ఉంది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు అనుమతి లేదు. ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలంటే ముందుగా అతని ఫోన్ నంబర్ సహా వివరాలను ప్రభుత్వం నిర్ధేశించిన వెబ్సైట్లో ముందుగా అప్లోడ్ చేయాలి. తక్షణమే ఆ ఫోన్‌కు ఓటీపీ నంబర్ వస్తుంది. దాన్ని లేబొరేటరీ నిర్వాహకు లకు చెప్పాక, వెబ్సైట్లో ఒక కోడ్ నంబర్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారమే శాంపిల్ సేకరించి పరీక్షకు పంపించాలి. ఈ ప్రక్రియను చాలా లేబొరేటరీలు పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. పైగా ఆర్టీ–పీసీఆర్ బదులు కొన్నిచోట్ల యాంటిజెన్ టెస్టులు చేసి పంపిస్తున్నారు. యాంటిజెన్ టెస్టుకు రూ.500 ఖర్చు అవుతుంటే, ఆర్టీ–పీసీఆర్ పరీక్ష ధరతోపాటు పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్క్‌ల ధరలను బాధితులపై వేసి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకుండా, అందుకు సంబంధించిన కోడ్ లేకుండా ఇచ్చే టెస్ట్ రిపోర్టుకు విలువ ఉండటంలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. పైగా ఎంతమంది పాజిటివ్‌గా ఉన్నారో కూడా సమాచారం బయటకు రావడంలేదు. అనుమతిలేని లేబొరేటరీల్లో ర్యాపిడ్ టెస్టులు... రాష్ట్రవ్యాప్తంగా అనుమతిలేని వందలాది చిన్నాచితక లేబొరేటరీల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. వాస్తవంగా ప్రైౖ వేట్ లేబొరేటరీల్లో ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు అనుమతే లేదు. కానీ వాటిల్లో అక్రమంగా ఈ దందా కొనసాగుతోంది. తయారీ కంపెనీల నుంచి యాంటిజెన్ కిట్లను కొనుగోలు చేసి పరీక్షలు చేస్తున్నాయి. ప్రైవేట్ లేబొరేటరీల్లోని కొందరు టెక్నీషియన్లకు స్వాబ్ శాంపిళ్లు తీసే శిక్షణ కూడా ఉండదు. కానీ ఏదో రకంగా శాంపిళ్లు తీసి అరగంటలోపే ఫలితం వెల్లడిస్తున్నారు. కొన్ని లేబొరేటరీలైతే ఇళ్లకు పంపించి టెస్టులు చేయిస్తున్నాయి. ఒక్కో టెస్టుకు రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలా నిర్వహించే కరోనా టెస్టులు, పాజిటివ్ వ్యక్తుల వివరాలు ప్రభుత్వ సంఖ్యలోకి రావడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు వేలాది పరీక్షలు జరుగుతున్నా, ప్రజలు ప్రైౖ వేట్ లేబొరేటరీలను ఆశ్రయిస్తున్నారంటే ఎక్కడో లోపం ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని జిల్లా కేంద్రాల్లోనే టెస్టులు చేయించుకోవడం గగనంగా మారింది. అది ప్రైవేట్ లేబొరేటరీలకు వరంగా మారింది. ఇంత జరుగుతున్నా కిందిస్థాయి వైద్య, ఆరోగ్య అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
కాసుల కోసం అడ్డదారులు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. తమ ప్రా ణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కోవిడ్ బారిన పడ్డారు. మరికొందరు ప్రాణాలు విడిచారు. వైద్యులే లేకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఈ నేపథ్యంలో వైద్యుల్ని ప్రత్యక్ష దైవంగా ప్రజలు కొలుస్తున్నారు. అలాంటి వైద్య వృత్తిలో కొందరు కాసులకు కక్కుర్తి పడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కరోనా నేపథ్యంలో సొమ్ము సంపాదించుకునే పనిలో పడ్డారు. ఎంత వేగంగా పరీక్షలు చేస్తే అంత వేగంగా వైద్యం అందించవ చ్చని ప్రభుత్వం ఉచితంగా విలువైన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష కిట్లను ఆస్పత్రులకు సమకూర్చితే వాటిని పక్కదారి పట్టించి వ్యాపారం చేసుకుంటున్నారు. రోగులు వెంటనే కోలుకునేలా, ప్రాణాపాయం నుంచి కాపాడేందుకని ఖరీదైన రెమిడెసీవిర్ తదితర మందులను అందుబాటులోకి తెస్తే వాటిలోనూ చేతివాటం ప్రదర్శించి డబ్బులు వెనకేసుకుంటున్నారు. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పలాస సీహెచ్‌సీలో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు దొరికారు. ఇలాంటి వారు జిల్లాలో మరికొన్నిచోట్ల ఉన్నారు. కరోనా సమయంలో ఉచితంగా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న ర్యాపిడ్ కిట్లకు సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధార్ నమోదు చేసి ప్రైవేటు క్లినిక్‌లలో పరీక్షలు చేయించి నగదు వసూలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి రోగం వచ్చినా, దీర్ఘకాలిక రోగం ఉన్నా వైద్యులు చూసేందుకు భయపడుతున్నారు. కరోనా పరీక్షలు చేసుకుని, ఫలి తం చూపిస్తేనే చేయి ముట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో డయాలసిస్ రోగులు, ఆస్తమా రోగులు, గర్భిణులు, డయాబెటిస్ రోగులు, హృద్రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ చెకప్ చేసుకుంటేనే వారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సాధారణ జ్వరం, దగ్గు, జలుబు వచ్చిన వారికి కూడా వైద్యం అందించే పరిస్థితి కొన్నిచోట్ల కరువైంది. వీరిని లక్ష్యంగా చేసుకుని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు అందుబాటులో ఉంచిన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష కిట్లను పక్కదారి పట్టించి, ఆయా రోగులకు ప్రైవేటు క్లినిక్‌లు పరీక్షలు చేస్తున్నారు. ఉచితంగా చేస్తే ఫర్వాలేదు. కానీ ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 2వేల నుంచి రూ.2,500 వరకు వసూలు చేసి పరీక్షలు చేస్తున్నారు. విశేషమేమిటంటే ఆ కిట్లు వినియోగించినట్టు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంబంధిత రోగుల ఆధార్ నమోదు చేయించి, బయట పరీక్షలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రికి ఇప్పటి వరకు ఐదు మాసాలుగా పలు విధాలుగా ఇండెంట్ పెడుతూ వేలల్లో ర్యాపిడ్ కిట్ల ను తీసుకువచ్చారు. కానీ ఇక్కడ కొంద రు కుమ్మక్కై వాటిని సర్దుకుంటూ వారికి ఉన్న ప్రైవేటు క్లినిక్‌లకు తీసుకెళ్లి వినియోగించారు. పలాస ఆస్పత్రిలో ఇది కొ త్తేమీ కాదు. గతంలో ప్రసూతి ఆపరేషన్‌కు రూ.5వేలు వసూలు చేసిన గైనికాలజిస్టు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడి సస్పెండైన విషయం తెలిసిందే. రక్తం పేరిట కూడా దందా నడిచేదన్న ఆరోపణలు ఉన్నాయి. కరోనా భయంలో అత్యవసర వైద్యం కోసమని శ్రీకాకుళం తరలించడానికి పెట్టే అంబులెన్స్‌లో కూడా కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క పలాసలోనే కాదు జిల్లాలో పలు చోట్ల ఇదేరకమైన తంతు నడుస్తోంది. మందులు కూడా.. ప్రస్తుతం కరోనా రోగులు కోలుకునేందుకు బాగా ఉపయోగపడుతున్న రెమిడెసీవర్ త దితర మందులను కూడా పలుచోట్ల పక్కదా రి పట్టిస్తున్నారు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ. 5400పైగా ఉండటంతో వాటిని ఆస్పత్రుల్లో రోగులకు వినియోగించినట్టు చూ పించి, వాటిని ప్రైవేటుగా విక్రయాలు చేప డుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ము ఖ్యంగా జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఈ దందా ఎక్కువగా నడుస్తున్నట్టు సమాచారం. ఉపేక్షించం.. ర్యాపిడ్ కిట్లను పక్కదారి పట్టించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఇంకా ఎక్కడైనా జరిగినట్టు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే నిఘా పెట్టాం. రెమిడెసీవిర్ ఇంజెక్షన్ల విషయంలో కూడా ఆరా తీస్తాం. ఎక్కడై నా ప్రైవేటుకు తరలించినట్టు తేలితే సీరియస్‌గా చర్యలు తీసుకుంటాం. – జె.నివాస్, కలెక్టర్ లెక్క అడుగుతున్నాం కరోనా ర్యాపిడ్ పరీక్ష కిట్లు పక్కదారి పడుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యాం. ఎక్కడ ఎన్ని కిట్లు వినియోగించారు? ఎవరికి పరీక్షలు చేశారు? ఏ అవసరం కోసం పరీక్ష చేశారు? తదితర వివరాలను తెలుసుకుంటున్నాం. ఆస్పత్రుల వారీ గా సరఫరా చేసిన కిట్లకు సంబంధించి లెక్క అడుగుతున్నాం. తప్పు చేసే వారిని వదలం. – కె.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్. -
‘పచ్చ’నేతలు దొరికారు!
గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ అవినీతి తమ హక్కు అన్నట్టుగా ఆ నేతలు చలాయించడంతో కోట్ల రూపాయలకు కాళ్లు వచ్చాయి. రానున్న ఐదేళ్లూ కూడా తమవే అన్న రీతిలో రెచ్చిపోవడంతో మృతులు కూడా వీరికి ఆదాయ వనరులుగా మారిపోయారు. సహకార వ్యవస్థకు తూట్లు పొడిచిన ‘పచ్చ’ నేతలు రైతులను మోసం చేశారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లాలో సహకార రంగాన్ని భ్రష్టు పట్టించి కోట్లు కొట్టేసిన ప్రబుద్ధుల బండారాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. పచ్చ నేతలు పచ్చని పొలాలను పావులుగా వాడుకుని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, మృతుల పేర్లతో పాస్‌పుస్తకాలు, బినామీ ఆస్తులను కుదువ పెట్ట డం ద్వారా సహకార వ్యవస్థను అధఃపాతాళంలోకి నెట్టేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ను లూటీ చేసేశారు. ఈ కుంభకోణాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డీసీసీబీ సీఈఓ మంచాల ధర్మారావు సహా పలు బ్రాంచీల మేనేజర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులపై డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ సస్పెన్షన్ వేటు వేశారు. గత పాలకవర్గంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విచారణ కు ఆదేశించి, అవినీతి కుంభకోణాల మూలాలను తవ్వి తీస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెట్ట ప్రాంతంలో అప్పటి డీసీసీబీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రస్తుత ఇన్చార్జి వరుపుల రాజా అధ్యక్షుడిగా వ్యవహరించిన లంపకలోవ సొసైటీలో కోట్ల రూపాయల అవినీతి గుట్టును 51 విచారణ రట్టు చేసింది. ఇప్పుడైతే లంపకలోవలో అవినీతి కుంభకోణం బయట పడింది కానీ ఆ ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లాలో ఏ సహకార సంఘాన్ని కదలించినా భారీగానే అక్రమాలు బయటపడుతున్నాయి. గత నెలలో ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు సొసైటీలో అంతా కుమ్మక్కై వ్యవసాయ కూలీలను రైతులుగా చూపించి రూ.1.50 కోట్లు కొట్టేసిన సంగతి ‘సాక్షి’ బయటపట్టిన నేపథ్యంలో పలువురిపై చర్యలు తీసుకున్నారు. పలు కేసుల నమోదు దాదాపు ఇదే రీతిన ప్రత్తిపాడు మండలం లంపకలోవ పీఏసీఎస్‌లో ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.16 కోట్లు పైనే నొక్కేసినట్టు నిర్థారణ కావడం జిల్లా సహకారశాఖను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఈ సొసైటీలో రూ.16,47,59,023 దుర్వినియోగానికి పాల్పడ్డ అప్పటి సొసైటీ అధ్యక్షుడు, నాటి డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై శుక్రవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం తీవ్ర సంచలనమైంది. రాజాతో పాటు ఇద్దరు మాజీ సీఈఓలు, మాజీ బ్రాంచి మేనేజర్లపై పెద్దాపురం డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ రాధాకృష్ణారావు పోలీసుల కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. డొంక కదిలింది ఇలా... లంపకలోవ సొసైటీలో 2018 మే 11 నుంచి 2019 జూలై 30 మధ్య కాలంలో నిధులు అడ్డంగా దోచేశారంటూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ అవినీతి డొంక కదిలింది. ఎమ్మెల్యే పర్వత శాసనసభలో ప్రస్తావించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో నిధు ల దుర్వినియోగం రుజువుకావడంతో ప్రత్తిపాడు డీసీసీబీ మేనేజర్ ఎం.నరసింహమూర్తిని సస్పెండ్ చేశారు. ఈ చర్య ఎంత మాత్రం సరిపోదని, లోతైన విచారణ జరిపి ప్రతిపైసా తిరిగి సొసైటీకి జమవ్వాలని ఎమ్మెల్యే పర్వత, ఇటు డీసీసీబీ చైర్మన్ అనంతబాబు పట్టుబట్టి మరీ ఏపీ సహకార చట్టం 1964 ప్రకా రం 51 విచారణ జరిపించారు. ఈ అవినీతిని వెలుగులోకి తీసుకురావడానికి జిల్లా సహకార అధికారి డి.పాండురంగారావు సొసైటీ పరిధిలో 5050 మంది సభ్యులలో రుణాలు పొందిన సుమారు 4000 మంది సభ్యులను సుమారు రెండు నెలల పాటు విచారించిన మీదట నిధుల దుర్వినియోగాన్ని నిర్థారించారు. అడ్డగోలుగా రుణాలు మంజూరు ఒకరి పేరునే రెండు, మూడు రుణాలు తీసుకోవడం, మృతుల పేర్ల మీద, నకిలీ పాస్ పుస్తకాలపైన అడ్డగోలుగా రుణాలు మంజూరు చేయడం వంటి అనేక అవకతవకలు ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. గత నవంబర్ నెలలో రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలను తనిఖీ చేసి, అధిక శాతం నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్టు నిర్ధారించారు. ఇదే లంపకలోవ సొసైటీలో అవకతవకలపై గత అక్టోబర్ నెలలో కుంభకోణంలో క్రియాశీలక పాత్ర పోషించిన డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు సొసైటీ డైరెక్టర్లు, మాజీ సీఈఓ చాగంటి వెంకట్రావుల ఆస్థులపై జప్తు నోటీసులను కూడా జారీ చేశారు. ఇప్పుడు రాజాతోపాటు ఈ కుంభకోణ బాధ్యులుపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వరుపుల రాజాతో పాటు నలుగురిపై కేసులు ప్రత్తిపాడు: మండలంలోని లంపకలోవ వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో నిధుల అవకతవకలపై అప్పటి సొసైటీ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై శుక్రవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక పోలీసుల కథనం మేరకు లంపకలోవ సొసైటీలో 2018 మే 11–2019 జూలై 30 మధ్య కాలంలో తప్పుడు లెక్కలు నమోదు చేయడం, అవకతవకలకు పాల్పడి రూ.16,47,59,023 నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని పెద్దాపురం డివిజన్ కోఆపరేటివ్ అధికారి ఎ. రాధాకృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అప్పటి లంపకలోవ సొసైటీ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల జోగిరాజు అనే రాజా, సొసైటీ మాజీ సీఈఓ సీహెచ్ వెంకట్రావు, సీఈఓ కె.అప్పారావు, ప్రత్తిపాడు డీసీసీబీ మాజీ బ్రాంచ్ మేనేజర్లు ఎం.నరసింహమూర్తి, పి.మురళీకృష్ణలపై 409, 419, 420, 468, 471, 477(ఎ), 109 రెడ్‌విత్ 34 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడు సీఐ వై.రాంబాబు ఆధ్వర్యంలో ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం లంపకలోవ సొసైటీలో విచారణ చేపట్టారు. ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐలు వై.రాంబాబు, సురేష్, సొసైటీ అధ్యక్షుడు గొంతిన సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
కోవిడ్ దందా.. గుట్టు చప్పుడుగా కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ‘కర్మన్‌ఘాట్‌కు చెందిన ఒక మహిళ గత నాలుగు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం వంటి కోవిడ్ అనుమానిత లక్షణాలతో బాధపడుతుంది. పక్కనే ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే ఈ విషయం ఇరుగు పొరుగు వారికి తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత వారంతా అనుమానంతో తమను ఎక్కడ దూరం పెడతారో? అని భావించి ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌ని ఆశ్రయించింది. సదరు ఆస్పత్రిలోని ల్యాబ్ సిబ్బంది ఆమెకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేసి, కోవిడ్ లేదని నిర్ధారించాడు. టెస్టుకు రూ.3500 చార్జీ చేశారు. రిపోర్టు మాత్రమే కాదు.. కనీసం ఆస్పత్రి బిల్లు కూడా ఇవ్వలేదు. ఈ ఆస్పత్రి యాజమాన్యం ఇటీవలే కోవిడ్ చికిత్సలకు అనుమతి తీసుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అనుమతి లేదు. రిపోర్ట్లు జారీ చేస్తే దొరికి పోయే ప్రమాదం ఉండటంతో వాటిని ఇవ్వకుండా కేవలం నోటిమాట ద్వారా పాజిటివ్, నెగిటివ్ రిపోర్ట్‌లను చెప్పేస్తున్నారు... ఇలా ఒక్క ఈ నర్సింగ్ హోం మాత్రమే కాదు.. నగర శివారులోని అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లో గుట్టు చప్పుడు కాకుండా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. రూ.500 విలువ చేసే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్‌కు ఏకంగా రూ.3500 చార్జీ చేస్తుండటం గమనార్హం. ఇక్కడ తస్కరించి..అక్కడికి తరలించి కోవిడ్ నిర్ధారణలో ఖచ్చితత్వం కోసం ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ టెస్టులను ప్రామాణికంగా తీసుకుంది. గాంధీ సహా ఉస్మానియా, ఫీవర్, నిమ్స్, ఛాతి, డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్, ఈఎస్ఐసీ, సహా 16 ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్‌తో పాటు మరో 31 ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు ఇందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు ప్రైవేటులో రూ.2500 ధర నిర్ణయించింది. హోం సర్వీసుకు రూ.2800 ఛార్జీగా నిర్ణయించింది. విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో టెస్టుల కోసం సిటిజన్లు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరుతుండటం, రోగుల నిష్పత్తికి తగినన్ని టెస్టింగ్ కేంద్రాలు లేక పోవడం, రిపోర్ట్ జారీకి 48 గంటల సమయం పడుతుండటంతో టెస్టుల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇదే అంశంపై ఇటు హైకోర్టు సహా అటు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం జులై 8వ తేదీ నుంచి ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులను ప్రారంభించింది. ఫలితం కూడా అరగంటలో వస్తుండటంతో ప్రభుత్వం ఈ టెస్టింగ్ కేంద్రాలను విస్తరించింది. ఈ టెస్టులు చేసేందుకు కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకే అనుమతి ఇచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 1076 ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా, వీటిలో హైదరాబాద్ జిల్లాలో 97, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ జిల్లాలో 87 ఆరోగ్య కేంద్రాల్లో ఈ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి రోజుకు సగటున 50 నుంచి 100 ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న కొంత మంది మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు గుట్టు చప్పుడు కాకుండా ఆయా కిట్లను సొంత క్లినిక్‌లకు తరలిస్తున్నారు. ప్రభుత్వానికి చిక్కకుండా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్టులకు ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు తప్పనిసరి. ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తే కానీ హెల్త్ పోర్టల్‌లో పేషంట్ నెంబర్ ఎంటర్ కాదు. ఈ హెల్త్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయించడం ద్వారా జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటి ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో విషయం ఇరుగు పొరుగు వారికి తెలిసి పోతుంది. యజమాని ఇళ్లు ఖాళీ చేయించే అవకాశం కూడా లేకపోలేదు. అందరికీ తెలిసే విధంగా టెస్టు చేయించుకోవడం కంటే గుట్టు చప్పుడు కాకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడమే ఉత్తమమని చాలా మంది భావిస్తున్నారు. ఆర్టీపీసీఆర్తో పోలీస్తే ర్యాపిడ్ టెస్టులో రిజల్ట్ త్వరగా తెలిసిపోతుండటంతో ఎక్కువ మంది వీటికే మొగ్గు చూపుతున్నారు. రోగుల్లో ఉన్న ఈ బలహీనతను ఆయా క్లినిక్‌ల నిర్వాహకులు ఆసరాగా తీసుకుంటున్నారు. రూ.500 విలువ చేసే ర్యాపిడ్ కిట్లతో గుట్టుగా టెస్టు చేసి..వారి నుంచి రూ.3500 వసూలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. చెల్లించిన బిల్లు తాలూకు రసీదు మాత్రమే కాదు..టెస్టుకు సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వడం లేదు. అదేమంటే..ఇక్కడ అంతేనని బుకాయిస్తున్నారు. వారితో గొడవకు దిగితే విషయం బయటికి తెలిసే ప్రమాదం ఉండటంతో వెనుతిరుగుతున్నారు. -
రేషన్‌కు కోత.. డీలర్ల దోపిడీ..
చినుకు..చినుకు కలిసి వరదైనట్టు.. గింజ..గింజ కలిసి వేలాది క్వింటాళ్లవుతున్నాయి. స్టాక్ పాయింట్లు, కొన్ని చౌకదుకాణాల ద్వారా యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతున్నాయి. డీలర్లకు వచ్చేసరికి తూకంలో తేడాలొస్తున్నాయి. దీనిపై ప్రశ్నించిన వారినే లక్ష్యంగా చేసుకుని కొందరు అధికారులు వేధిస్తున్నట్టు తెలుస్తోంది. చేసేది లేక వచ్చిన బియ్యంలో లబ్ధిదారులకు కోత విధిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. గుడిపాల: నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణీ పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఈ పాస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యం తూకంలో తేడాలుంటున్నాయి. ఇదే సాకుతో రేషన్ డీలర్లు కార్డుదారులకు కోత విధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 లక్షల 62 వేల 691 తెల్ల కార్డులున్నాయి. వీటికి 2,901 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ దుకాణాలకు ఆగస్టులో 1,75,921 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు. రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేసేముందు ఎలాంటి షార్టేజ్ రాకుండా తూకం వేయించి పంపించాలి. సంబంధిత అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యపు బస్తాలను తూకం వేయడం లేదు. సరాసరి బస్తా 50 కిలోల వంతున రేషన్ దుకాణాలకు పంపుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఈ విధానంతో తూకాల్లో తేడాలుంటున్నాయి. వీటిని ఈ–పాస్ మిషన్ల ద్వారా ఎలా సరఫరా చేయాలని డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. రేషన్ దుకాణంలోని బస్తాలను తూకం వేస్తే ఏ ఒక్క బస్తా కూడా 50 కేజీలు ఉండడం లేదు. ఒక్కో సంచి సుమారు 600 గ్రాముల వరకు ఉంటుంది. ఆ మేరకు తూకానికి సంబంధించి కొరవడిన బియ్యాన్ని తాము ఎక్కడి నుంచి తెచ్చి కార్డుదారులకు ఇవ్వాలని రేషన్ డీలర్లు ప్రశ్నిస్తున్నారు. క్వింటాల్‌కు 3 కిలోల వరకు తరుగు రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యపు బస్తాలో ఒక్కో దానికి కనీసం 1.5 కిలోల షార్టేజ్ వస్తోంది. ఇలాంటి సమయంలో వంద క్వింటాళ్లు ఇస్తున్న రేషన్ దుకాణంలో కనీసం 3 క్వింటాళ్ల వరకు తక్కువ వస్తున్నాయి. ఇంతమొత్తంలో బియ్యం తక్కువగా వస్తే తాము కార్డుదారులకు ఎలా సరఫరా చేయాలని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలర్ల దోపిడీ రేషన్‌డీలర్లు బియ్యం ఇచ్చే సమయంలో ఒక్కో కార్డుదారునికి కనీసం అరకేజీ నుంచి కేజీ వరకు తగ్గిస్తూ ఇస్తున్నారు. దీనికి కొంతవరకు కార్డుదారులు కూడా అలవాటు పడగా ఎవరైనా ప్రశ్నిస్తే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తమకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. కార్డుదారులకు నచ్చజెప్పి పంపడం పరిపాటుగా సాగుతోంది. సంచుల తూకాలు తగ్గించడం లేదు 50 కిలోల బియ్యంతో పాటు వస్తున్న సంచి తూకంలో 600 గ్రాముల తగ్గించాలి. ఒక రేషన్‌షాపునకు 100 బస్తాల బియ్యం వస్తే 60 కేజీలు సంచుల కోసం తగ్గించాలి. 100 బస్తాలు వచ్చే రేషన్షాపన#కు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి 270 కేజీలు బియ్యం తక్కువగా వస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. సక్రమంగా బియ్యం ఇస్తున్నాం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి డీలర్లకు బియ్యం సరిగ్గానే పంపుతున్నాం. ఒక బస్తాలో పొరబాటున బియ్యం తగ్గవచ్చు. మరో బస్తాలో ఎక్కువగా ఉండవచ్చు. పొరబాటు జరిగి బియ్యం తక్కువ వచ్చే అవకాశం లేదు. బియ్యం సరఫరా చేసే సమయంలో డీలర్లను ఎంఎల్ఎస్ పాయింట్లో దగ్గరుండి తూకం వేయించుకొని తీసుకుపొమ్మని చెబుతాం. – విజయకుమారి, ఎంఎల్‌ఎస్‌పాయింట్ డెప్యూటీ తహసీల్దార్, చిత్తూరు -
ధన‘మొక్క’టే మూలం!
టి.నరసాపురం: రాజమండ్రి విజిలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ ఏవీఎస్‌ఆర్‌కే అప్పన్న, జిల్లా సామాజిక అటవీ అధికారి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం మండలంలోని టి.నరసాపురం, మల్లుకుంట గ్రామాల్లోని నర్సరీల్లో తనిఖీలు నిర్వహించారు. సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రెండు నర్సరీల నుంచి 17 వేల కొబ్బరిమొక్కలను అక్రమంగా తరలిస్తుండగా, కొందరు రైతులు కామవరపుకోట మండలం తడికలపూడి వద్ద ఆదివారం లారీని అడ్డుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన విజిలెన్స్ అధికారులు లారీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. సబ్సిడీ మొక్కలు కోల్‌కతాకు.. జగనన్న హరితహారం పథకం కింద ఈ మొక్కలను రైతులకు సబ్సిడీపై అందించాల్సి ఉంది. అయితే ఫారెస్టు అధికారులు రైతులకు సరఫరా చేయకుండా వ్యాపారులకు అక్రమంగా విక్రయిస్తే వారు ఆ మొక్కలను నేరుగా కోల్‌కతాకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జీలుగుమిల్లికి చెందిన రైతు మల్లిపాటి నారాయణరావు కథనం ప్రకారం.. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం రేంజ్‌ల పరిధిలో 8 లక్షల కొబ్బరి మొక్కలను రైతులకు అందించేందుకు సామాజిక అటవీ అధికారులు ఫిబ్రవరి నుంచి వివిధ నర్సరీల్లో పెంచారు. ఈ మొక్కలను ఒక్కోటి పాలకొల్లు సమీపంలోని అడవిపాలెంకు చెందిన ఒక వ్యాపారి వద్ద రూ.25కు కొని ప్రభుత్వం నుంచి మొక్కకు రూ.60 చొప్పున నిధులు డ్రా చేశారు. మొక్కల కొనుగోలులోనే అవినీతికి పాల్పడ్డారు. నర్సరీలో పెంచిన తర్వాత ఒక్కో మొక్కను రైతుకు సబ్సిడీపై రూ.10కే అందించాల్సి ఉండగా, తిరిగి కొనుగోలు చేసిన వ్యాపారికే మొక్కను రూ.25 నుంచి రూ. 30కి విక్రయిస్తున్నారు. ఇలా కొన్న మొక్కలను వ్యాపారి నేరుగా కోల్‌కతాకు తరలించి ఒక్కోటి రూ.60కు పైగా అమ్మి లక్షలు గడిస్తున్నారు. ఇప్పటికే 30 టన్నుల సామర్థ్యంగల 3 లారీల మొక్కలు కోల్‌కతాకు తరలిపోయాయి. ఇప్పుడు అడ్డుకున్న లారీ నాలుగోది. టీనరసాపురం నర్సరీలో 1.90 లక్షల మొక్కలు, మల్లుకుంట నర్సరీలో 1.30 లక్షల మొక్కల్లో రైతులకు పంపిణీ చేసింది నామమాత్రమే. లారీలో తరలిస్తున్న మొక్కలను పాలకొల్లు రైతులు కొన్నట్టు అధికారులు చెబుతున్నా.. నరసాపురం రేంజ్లో సోషల్ ఫారెస్ట్ అధికారులు పెంచిన 85 వేల కొబ్బరిమొక్కలు సిద్ధంగా ఉండగా, 10 కిలోమీటర్లలోపు ఉన్న మొక్కలను తీసుకోకుండా అక్కడి రైతులు ఇక్కడికి ఎందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం. ఇదంతా వ్యాపారుల, సోషల్ ఫారెస్ట్ అధికారుల మాయాజాలం. ఈ అవినీతిలో సోషల్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేసినట్టు రైతులు చెబుతున్నారు. విచారణ చేస్తాం: ఈ వ్యవహారంపై పూర్తిగా విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీఎఫ్ఓ అప్పన్న తెలిపారు. లారీలో మొక్కలు తరలిస్తున్న అధికారులు రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించామని వివరించారు. రైతుల ఆరోపణలను విలేకరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, ఆ అంశాలన్నీ పరిశీలిస్తామని, విచారణ నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని తెలిపారు. అక్రమాలు ప్రాథమికంగా జరిగినట్లు గుర్తించి నివేదిక సోషల్ ఫారెస్ట్ డీఎఫ్ఓ ఎం.శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు సమర్పించగా, టి.నరసాపురం, మల్లుకుంట నర్సరీల ఇన్చార్జి, ఫారెస్టు సెక్షన్ అధికారి గోపీకుమార్‌ను సస్పెండ్ చేసినట్లు అప్పన్న తెలిపారు. -
ఈ రోగం పేరు ‘దోపిడీ వైరస్’
కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. పాజిటివ్ కేసుల సంబంధీకులను కూడా వెంటనే గుర్తిస్తూ పరీక్షలను నిర్వహిస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలకు సైతం పరీక్షలను విస్తరించింది. ఇటీవల సంజీవని వాహనం ద్వారా ప్రజల ముంగిటకే పరీక్షల ప్రక్రియను తీసుకు వచ్చింది. తీవ్రతను బట్టి వాహనాన్ని పంపించి టెస్టులు చేస్తున్నారు. కొందరు అవగాహన లోపంతో ఇప్పటికీ కోవిడ్ టెస్టులు చేయించుకోకుండా సీటీ స్కాన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇది సరికాదని కోవిడ్ అధికారులు ఖండిస్తున్నా గోప్యత కోసం కొందరు ప్రైవేట్ ఆస్పత్రులను..ఆర్ఎంపీలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం సకల సదుపాయాలూ కల్పించి క్లిష్టమైన కేసులకుసైతం చికిత్స అందిస్తుంటే మరోవైపు కొందరు అవగాహనా రాహిత్యంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరమొుస్తే సీటీ స్కాన్ తీయించేసుకుంటూ ప్రైవేట్ వైద్యులకు కాసులు కురిపిస్తున్నారు. సాక్షి కడప: కోవిడ్ పరీక్ష చేయించుకుని వైద్యుల పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకొని మందులు వాడితే కరోనా జలుబు లాంటిదేనని ప్రభుత్వం తొలినాళ్ల నుంచి చెబుతోంది. పైగా చాలామందికి రోగ లక్షణాలు కూడా బయటపడకుండానే కొన్ని రోజులకు నెగెటివ్ వస్తోందని వైద్య సర్వే స్పష్టం చేస్తున్నా కొందరు ఇంకా పక్కదారి పడుతున్నారు. పరీక్షలు చేయించుకుంటే కరోనా బయటపడుతుందేమో అనే భయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. దీంతో వారు కొందరు ఆర్ఎంపీలను సంప్రదిస్తున్నారు. మిడిమిడి జ్ఞానం ఉన్న వారు సాధారణ జ్వరాన్ని కూడా కరోనా పేరు చెప్పి చెమటలు పట్టిస్తున్నారు. కనీస దయ చూపించకుండా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. సాధారణ జ్వరంతో వెళ్లిన వారిని కూడా సీటీ స్కానింగ్ చేయించుకొని రమ్మంటున్నారు. వారు చెప్పిన డయాగ్నటిక్ సెంటరుకు పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కొందరు పేరు మోసిన ఆర్ఎంపీలకు సీటీ స్కానింగ్ కమిషన్ ఆర్జన విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. జ్వరంతో తమ వద్దకు వచ్చే వారిని అవసరం ఉన్నా.. లేకున్నా అడ్డగోలుగా పరీక్షలు చేయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చింది. స్వార్థంతో కొందరు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు కోవిడ్ వైద్యం చేయడానికి ముందుకు రాలేదు. కానీ తెరచాటున వైద్యం చేస్తూ రోగి నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ముందుగా డిపాజిట్ చేయించుకొని రోజుకు రూ.20 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. వర్షాకాలం కావడంతో జలుబు, జ్వరాలతో జనాలు బాధపడుతున్నారు. కోవిడ్ అనే భయంతో కొందరు ముందు జాగ్రత్తగా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆయాసంతో వెళ్తే చాలు కొందరు వైద్యులు సీటీ స్కానింగ్‌కు సిఫార్స్ చేస్తున్నారు. అలా దోపిడీ మొదలవుతోంది. అవసరమైన పక్షంలో స్కానింగ్ చేయడం సమంజసమే అయినా ఇది విపరీత ధోరణులకు దారి తీస్తోంది. అనుమతి లేకుండా నిర్వహణ వైద్య ఆరోగ్యశాఖ రికార్డుల్లో లేని ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో సుమారు 350కి పైగా క్లినికల్ ల్యాబ్‌లు, 80 వరకు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అనుమతి లేకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు. ప్రస్తుత కేసుల తీవ్రత..జనం బలహీనత ఆసరాగా కొన్ని స్కానింగ్ సెంటర్లు భారీగా రేట్లు పెంచేశాయి. గతంలో రూ. 2వేలు ఉన్న సీటీ స్కానింగ్ ధరలను కొందరు ఏకంగా రూ. 4500 నుంచి రూ. 6 వేలకు పెంచారు. స్కానింగ్ కోసం ప్రజలు చెల్లించే మొత్తంలో సుమారు 60 శాతం రెఫర్ చేసిన డాక్టర్లు, ఆర్ఎంపీలకు వెళుతుందనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని పల్మనాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లకు కరోనా లక్షణాలు, తీవ్రత గురించి నిర్ధారింగలరు. వీరు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తే పర్వాలేదు. చేయకుంటే ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేయాలి. ఇవేమీ చేయకుండా తమ ఆస్పత్రులలోనే వైద్యం చేసి భారీగా ఆర్జిస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్‌కు రూ.6 వేలు కరోనా వ్యాధి నిర్ధారణ కోసం ప్రభుత్వం ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్, ట్రూనాట్ టెస్ట్‌లను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఈ మూడింటిలోనూ స్వాబ్ తీసి పరీక్ష చేస్తారు. వీటి ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగానే కోవిడ్ పాజిటివ్, నెగిటివ్‌గా నిర్ధారణ జరుగుతోంది. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నారు. రక్త నమూనాలను సేకరించి టెస్టు నిర్వహిస్తున్నారు. దీనివల్ల వచ్చే ఫలితం నమ్మశక్యం కానిదని ప్రభుత్వంతో పాటు సీనియర్ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా యాంటీ బాడీ టెస్టు చేస్తూ రూ. వేలు దోచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అధికారులు ఇలాంటి వాటిపై దాడులు చేయడం ప్రారంభించారు. కాగా ఇటీవల కడపలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు రాత్రి 11 గంటల ప్రాంతంలో అత్యవసర వైద్యం కోసం వెళ్లిన రోగికి ర్యాపిడ్ టెస్ట్ చేశారు. 5 నిమిషాల్లో పాజిటివ్ అని చెప్పి రూ.5 వేలు తీసుకుని రోగి పరిస్థితి కూడా తెలుసుకోకుండా గేటు నుంచే పంపించేశారు. టెస్ట్ చేసినట్లు కాగితం ముక్క ఇవ్వండని సదరు ఆస్పత్రి యాజమాన్యానికి అడిగితే ‘ఇది అనధికారికం ఇచ్చేది లేద’ని చెప్పడం కొసమెరుపు. సీటీ స్కాన్ ద్వారా కరోనాను నిర్ధారించలేం సిటీస్కానింగ్ ద్వారా కరోనా వైరస్‌ను నిర్ధారించలేమని జిల్లాలోని ప్రముఖ, సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వైరస్ తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి స్కానింగ్ చేయాల్సి వస్తుందన్నారు. స్కానింగ్ పరీక్షలనే కొలమానంగా తీసుకొని కోవిడ్ నిర్ధారణ జరగదని తెలిపారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల ద్వారా కరోనాను ప్రాథమిక దశలో గుర్తించవచ్చన్నారు. వీటి ద్వారానే సకాలంలో, కచ్చితమైన ఫలితాలను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. వైరస్ సోకిన 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే సీటీ స్కాన్‌లో తెలుసుకోవచ్చని, ఒక్కోసారి స్కానింగ్‌లో కూడా తీవ్రత కనిపించదన్నారు. వర్షాకాలం కావడంతో న్యూమోనియో ఉన్నా స్కానింగ్‌లో చూపిస్తుందన్నారు. సీటీ స్కాన్ అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆసుపత్రిలో కోవిడ్ నిర్ధారణయినవారికి అవసరమైతే వైద్యులు సూచిస్తారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇదే తరహా విధానం అమలులో ఉంది. సీటీ స్కాన్‌ను కోవిడ్ నిర్ధారణకు ఎక్కడా చేయడం లేదు. ఇది సరైన ప్రక్రియ కాదు..ఇదో కార్పొరేట్ హంగామా అని కోవిడ్ స్టేట్ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. సీఓఆర్ఏడీ4..5 అంటూ కరోనా పాజిటివ్ అని చెబుతూ వ్యాపారం మొదలెట్టేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కఠినచర్యలు తప్పవు.. కరోనా వైరస్ (కోవిడ్– 19) కు ఎవరు పడితే వారు వైద్యం అందించకూడదు. అలా అందిస్తే ఆ వైద్యుడు మందుల చీటీ వివరాలను మాకు అందజేయండి. ఆ వివరాల ప్రకారం హాస్పిటల్‌ను తనిఖీ చేస్తాం. నిజమని తేలితే హాస్పిటల్‌ను సీజ్ చేస్తాం. చెస్ట్ సీటీ స్కాన్ ద్వారా కరోనా నిర్ధారణ చేయకూడదు. ర్యాపిడ్ టెస్ట్, వీఆర్డీఎల్ ద్వారా నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షల ద్వారానే వైరస్ ఉందో లేదో నిర్ధారితమవుతుంది. ఈ చెస్ట్ సిటీ స్కాన్‌లో చెస్ట్ వైరల్ న్యుమోనియా, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయో..లేవో తెలుస్తాయి. ఛాతిలో అనారోగ్య సమస్యలుంటే తెలుసుకోవడానికి సీటీ స్కాన్‌ను వినియోగిస్తే తప్పు లేదు. కానీ కరోనా నిర్ధారణకు సిటీ స్కాన్‌ను వినియోగించడం సరికాదు. ప్రభుత్వం కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. వైరస్ నివారణకు మంచి వైద్యం అందిస్తోంది. ఎవరైనా కరోనాకు వైద్యం అందిస్తామంటే నమ్మి మోసపోకండి. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి -
రిజిస్ట్రేషన్ శాఖలో వసూల్ రాజాలు
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే ఆస్తుల క్రయవిక్రయాల్లో అక్రమాలు, అవినీతిని వెలికి తీయాల్సిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగం మామూళ్ల మత్తులో జోగుతోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే లావాదేవీల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాల్సిన విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ప్రతి నెలా ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించాల్సిన అధికారులు జల్సాలు, మామూళ్ల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి నెల్లూరు: జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో 9 కార్యాలయాలు, గూడూరు జిల్లా పరిధిలో 10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన భూముల విలువలను తారుమారు చేసి అవినీతికి పాల్పడుతున్నట్లు ఆ శాఖ తేల్చిన ఆడిట్ రిపోర్టులే అద్దం పడుతున్నాయి. కొంత కాలంగా రెండు జిల్లాల పరిధిలో 933 డాక్యుమెంట్లలో రూ.5.74 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు అయితే ఆడిట్ శాఖ సైతం అవినీతి సొమ్ములో వాటాలు పంచుకుంటుంది. ♦సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్ట్ గేజ్, సవరణ లీజు అగ్రిమెంట్, వీలునామా, జీపీఏ కమ్ సేల్, జనరల్ పవర్, రెంటల్ అగ్రిమెంట్ తదితరాలకు సక్రమంగా స్టాంప్ డ్యూటీ చెల్లించారా? లేదా? అనే విషయాలను ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగం నిగ్గు తేల్చుతోంది. ♦స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు తేలితే వెంటనే పెనాల్టీ వేసి, సబ్‌రిజిస్ట్రార్‌కు నోటీసు పంపిస్తోంది. ♦అయితే మార్కెట్ విలువ ప్రకారమే స్టాంప్ డ్యూటీ సక్రమంగా చెల్లించి ఉంటే జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ వద్ద అప్పీల్ చేసుకుని సరిచేసుకోవచ్చు. ♦స్టాంప్ డ్యూటీ చెల్లింపులో నిజంగా తేడా ఉంటే సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్ ఓనర్‌కు పెనాల్టీ చెల్లించాలని నోటీసు అందిస్తారు. ♦రిజిస్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగం అధికారులు డాక్యుమెంట్లపై అభ్యంతరాలు ఉన్నాయని సాకు చూపుతూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ♦జిల్లాలో నిషేధిత భూములు జాబితాలో ఉన్న ప్రభుత్వ, దేవదాయ భూములకు సైతం సబ్ రిజిస్ట్రార్లు కాసుల కోసం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ♦నెలవారీగా అధికారులు నిర్వహించే ఇంటర్నల్ ఆడిట్లో ఆయా రిజిస్టేషన్లకు రేటు ఫిక్స్ చేసి వసూళ్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆడిటింగ్‌లో జాప్యం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఆడిట్ జిల్లా అధికారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంటర్నల్ ఆడిటింగ్ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. చేయి తడిపిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిటింగ్ పూర్తి చేసి పెనాల్టీలు లేకుండా సరి చేసిన ఉదంతాలు ఉన్నాయి. మిగిలిన కార్యాలయాల్లో మాత్రం ఆడిట్ చేయకుండా నెట్టుకొచ్చాడు. ఆ అధికారి తీరు వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు.. నెల్లూరు రీజియన్ పరిధిలో ఆర్ఓ నెల్లూరులో గతేడాది నవంబర్ నుంచి ఆడిట్ జరగలేదు. దాదాపు 318 డాక్యుమెంట్లకు స్టాంప్ డ్యూటీలో తేడాలున్నట్లు నిర్ధారణ చేశారు. ♦నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట, బుచ్చిరెడ్డిపాళెంలో గతేడాది డిసెంబర్ నుంచి ఆడిటింగ్ జరగలేదు. స్టౌన్‌హౌస్‌పేట రిజిస్ట్రార్ కార్యాలయంలో 136 డాక్యుమెంట్లు తేడాలున్నట్లు నిర్ధారించారు. ♦ఉదయగిరి, వింజమూరు, అల్లూరు, ఆత్మకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాయాల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆడిట్ నిర్వహించలేదు. ♦గూడూరు జిల్లా పరిధిలో గూడూరు ఆర్ఓ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా గతేడాది డిసెంబర్ నుంచి ఆడిట్ నిర్వహణ జరగలేదు. ఆ కార్యాలయంలో సుమారు 62 డాక్యుమెంట్లు తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ♦బుజబుజనెల్లూరు, ఇందుకూరుపేట, కోట, పొదలకూరు, రాపూరు, వెంకటగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా జనవరి నుంచి ఆడిట్ నిర్వహణ చేయలేయకపోవడం గమనార్హం ♦ఆడిటింగ్ విభాగంలో ఉద్యోగ విరమణ చేసిన జిల్లా అధికారి ఇద్దరు సబ్రిజిస్ట్రార్లను టీమ్‌గా ఏర్పాటు చేసి వారి ద్వారా ఆడిటింగ్ నిర్వహణ చేయించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి పాత తేదీలతో అధికారి సంతకాలు చేసేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం జిల్లా ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో ఆ ఎత్తుగడకు చెక్ పెట్టారు. రూ.3.23 కోట్ల రికవరీపై దృష్టి ఏదీ జిల్లాలో 933 డాక్యుమెంట్లలో రూ.5.74 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ జరిగింది. ఇందులో అత్యధికంగా 648 డాక్యుమెంట్లకు సంబంధించి అవినీతి సొమ్మును రికవరీ చేసినట్లు చెబున్నా.. సగం కూడా లేకపోవడం గమనార్హం. 648 డాక్యుమెంట్లకు సుమారు రూ.2.51 కోట్లు ఉంటే.. మిగిలిన 285 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.3.23 కోట్ల రికవరీ చేయాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు, అధికారులపై శాఖా పరమైన చర్యలు కూడా చేపట్టాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి వసూళ్లు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. ఆడిటింగ్ విభాగంపై చర్యలుంటాయి మా శాఖ ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగంలో అక్రమాలు జరుగుతున్నట్లు నా దృష్టికి అయితే రాలేదు. వారు అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆడిట్లో గుర్తించిన అక్రమాలకు సంబంధించి దాదాపు రూ.3 కోట్లు పైనే రికవరీ పెండింగ్ ఉంది. త్వరలోనే రికవరీ చేస్తాం. – అబ్రహం, డీఐజీ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
'రిఫర్' చేస్తే లక్ష..!
డాక్టర్ జయచంద్ర (పేరు మార్చాం) హైదరాబాద్‌లో సొంతంగా క్లినిక్ నడుపుతున్నాడు. క్లినిక్‌కు వచ్చే కరోనా అనుమానితులకు వెంటనే పరీక్షలు చేయిస్తాడు. పాజిటివ్ వచ్చి, లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తాడు. అలా చేసినందుకు సంబంధిత ప్రైవేట్ ఆసుపత్రి ఒక్కో కేసుకు లక్ష రూపాయలు కమీషన్ కింద చెల్లిస్తుంది. ఇలా ఈయన ఇప్పటివరకు 150 కేసులు రిఫర్ చేసి, కోటిన్నర రూపాయలు మూటగట్టుకున్నాడు. వరంగల్ నగరంలో డాక్టర్ శ్రీనివాస్ (పేరు మార్చాం) నడిపే నర్సింగ్ హోంకు కరోనా చికిత్సచేసే అనుమతి లేదు. అయితే తన వద్దకు కరోనా అనుమానిత లక్షణాలతో ఎవరైనా వస్తే, తన వద్ద ఉన్న సీటీ స్కాన్‌తో కరోనా నిర్ధారణ పరీక్ష చేస్తాడు. పెద్దగా లక్షణాలు లేకున్నా.. పాజిటివ్ వస్తే చాలు సీరియస్‌గా ఉందంటూ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తాడు. ఇలా చేసినందుకు అతనికి ఇప్పటివరకు దాదాపు కోటి రూపాయల వరకు ముట్టాయి. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులతో కొం దరు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆడుకుంటు న్నారు. అంబులెన్స్ డ్రైవర్ మొదలు డాక్టర్ల వరకు పలువురు కరోనా కేసుల పేరుతో అంది నకాడికి దండుకుంటున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖకు ఫిర్యాదులందాయి. ‘కరోనా పాజిటివ్’ పేరుతో బాధితుల భయాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు నడిపే కొందరు డాక్టర్లు పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులతో ముందే ఒప్పందం కుదుర్చుకుని, తమ వద్దకు వచ్చే అనుమానిత కేసుల్ని రిఫర్ చేసి.. కేసుకు లక్ష రూపాయల చొప్పున కమీషన్‌గా అందుకుంటున్నారు. ఇటీవల జనగామలో ప్రభుత్వ డాక్టరే అక్ర మంగా అర్ధరాత్రుల్లో టెస్టులుచేసి హైదరా బాద్‌కు రిఫర్ చేస్తుండగా ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ‘రిఫరెన్స్’లకు రిజర్వుడ్ పడకలు రాష్ట్రంలో 170 ప్రైవేట్, కార్పొరేట్ సహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు చేస్తున్నారు. వీటిలో కరోనా పడకలు 9,058 ఉండగా, అందులో 4,061 పడకలు నిండిపోయాయి. ఇంకా 4,997 పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1,786 ఐసీయూ పడకలకు 1,039, 4,003 ఆక్సిజన్ పడకలకు 2,115 ఖాళీగా ఉన్నాయి. అయితే పేరొందిన ఆసుపత్రుల్లో మాత్రం పడకలు ఖాళీగా ఉండట్లేదు. చాలామంది బాధితులు పేరున్న ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని భావిస్తు న్నారు. దీంతో వాటిలో ఖాళీ పడకలు తక్కువే ఉంటున్నాయి. అయితే పేరొందిన ఆసుపత్రు లకు పంపాలంటే రిఫరెన్స్ తప్పనిసరి కావడంతో దీన్నే కొందరు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. వారు ఎప్పుడు రోగిని పంపినా అవసరమైన బెడ్స్‌ను ఆయా ప్రముఖ ఆసుపత్రులు రిజర్వుడ్‌లో పెడుతున్నాయి. ఇక కొన్ని చిన్న ఆసుపత్రుల తోనూ కొందరు డాక్టర్లు, ప్రైవేట్ ప్రాక్టీషనర్లు ఒప్పందం చేసుకుంటున్నారు. వాటిలో ఖాళీలు అధికంగా ఉండటంతో ఆయా ఆసుపత్రుల పీఆర్వోలు జిల్లాల్లో ఉండే ఆసుపత్రులతో మాట్లాడి రోగులను తెప్పించుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి అక్కడా లక్ష రూపాయల వరకు కమీషన్ ముట్టజెపుతున్నారు. కొందరు డాక్టర్లు, ఇతర సిబ్బంది అయితే అటు ఆసుపత్రుల వద్ద, ఇటు రోగుల వద్ద రెండువైపులా గుంజుతున్నారు. కొందరు అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఒక్కో కేసుకు రూ.30,000 నుంచి రూ.50,000 వరకు గుంజుతున్నారు. ఆస్తులమ్ముకుంటున్న బాధితులు ఇలా ‘రిఫర్’గా వస్తున్న కేసుల్లోని బాధితుల్ని కొన్ని ఆసుపత్రులు నిండా పిండుతున్నాయి. ఆసుపత్రి స్థాయిని బట్టి రోజుకు లక్ష, వెంటలేటర్‌పై ఉంటే లక్షన్నర, సాధారణ బెడ్‌పై ఉంచినా రూ.75 వేల చొప్పున గుంజుతున్నాయి. ఈ క్రమంలో బాధితులు ఆస్తులమ్ముకుంటున్నారు. ఇంకొందరు బంగారం, ఇతరత్రా ఆస్తులు తాకట్టు పెడుతుండగా, మరికొందరు అప్పులు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల ఈ దందాపై బాధితుల నుంచి వైద్య, ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
విక్రయాల్లో విచిత్రాలెన్నో..
కర్నూలు(అగ్రికల్చర్): యూరియా అమ్మకాల్లో ప్రయివేటు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమాలకు ఒడిగట్టారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి సమగ్ర విచారణ చేపట్టాలంటూ కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పుల్లయ్యతో విచారణ చేయిస్తున్నారు. ఇప్పటికే డీఆర్వో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేశారు. ఈ క్రమంలో డీలర్ల ‘వేషాలు’ వెలుగు చూశాయి. ♦నందికొట్కూరులోని రెండు దుకాణాల్లో ముగ్గురు వ్యక్తులే 188 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. దీనిపై డీఆర్వో విచారణ చేయగా.. ఆ ముగ్గురూ ఆయా షాపుల్లో పనిచేసే గుమాస్తాలేనని తేలింది. బిజినవేములకు చెందిన ఇర్ఫాన్ 84.6 టన్నులు, షేక్ సికిందర్ 49.14 టన్నులు, చెరుకుచెర్లకు చెందిన శివన్న 54.945 టన్నులు కొన్నట్లు డీలర్లు రికార్డు చేశారు. ♦నంద్యాలలోని ఒక ఫర్టిలైజర్ దుకాణంలో బి.గోవిందు అనే వ్యక్తి ఏకంగా 174.555 టన్నుల యూరియా (3,491 బస్తాలు) కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. ఒక మండలానికి సరిపోయే యూరియాను ఒకే వ్యక్తి కొన్నట్లు డీలర్లు మాయ చేశారు. అలాగే అద్దంకి సత్యనారాయణ అనే వ్యక్తి 169.155 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు చూపారు. ♦ఇలా 23 మంది వేలాది బస్తాల యూరియా కొనుగోలు చేసినట్లు డీలర్లు చూపడం వెలుగులోకి వచ్చింది. యూరియాతో సహా రసాయనిక ఎరువులను పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణం మేరకు ఈ–పాస్ మిషన్‌లో రైతు వేలిముద్ర తీసుకుని పంపిణీ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ డీలర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. 3 షాపుల లైసెన్స్ సస్పెండ్ యూరియా అధిక ధరకు అమ్ముతున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో తేలిన నేపథ్యంలో కల్లూరు మండలం చిన్నటేకూరులోని ధనుంజయ ఫర్టిలైజర్స్, కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని సాయికృప ఏజెన్సీస్, వసుంధర ఆగ్రో ఏజెన్సీస్ లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తూ కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ ఆర్.విజయశంకర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వాటాల పంపకాల్లో తేడా.. బాగోతం గుట్టురట్టు
అవినీతి సొమ్ము వాటాల పంపకాల్లో తేడా వచ్చింది. కాకినాడ జీజీహెచ్ కోవిడ్ కేంద్రంలో అక్రమాల బాగోతం బయటపడింది. కరోనా పేరుతో ఓ సీనియర్ స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ మరి కొందరు నడిపిన వసూళ్ల తంతును పూసగుచ్చినట్టు పోలీసులకు వివరించాడు ఆ ఎంఎన్ఓ. తాను కిట్లు దొంగిలించింది కేవలం స్టాఫ్ నర్సుపై ప్రతీకారం తీర్చుకోవడానికేనని వారికి చెప్పుకొచ్చాడు. కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా అవినీతిపరులు మాత్రం పేట్రేగిపోతున్నారు. వైద్యసేవల మాటున కాసుల దందాకు తెరతీస్తున్నారు. కరోనా యాంటీజెన్ ర్యాపిడ్ కిట్లు దొంగిలించి పోలీసులకు పట్టుబడ్డ బాషా వాంగ్మూలంతో కాకినాడ జీజీహెచ్ కోవిడ్ కేంద్రంలో అవినీతి బాగోతం బయటపడింది. కిట్లను పక్కదారి పట్టించి ఓ సీనియర్ స్టాఫ్ నర్సుతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు వైరస్ అనుమానితుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కిట్లు దొంగిలించిన ఎంఎన్‌వో షేక్ జాన్ బాషా ఈ ఆరోపణలను నిజమేనన్నట్టుగా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం విశేషం. కొద్ది రోజుల క్రితం ఉద్యోగాల పేరుతో.. ఇటీవల విడుదలైన జీజీహెచ్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆసరాగా, సంబంధిత నర్సు అభ్యర్థుల నుంచి వసూళ్లకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని అక్కడ కొందరు జీజీహెచ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన బాధితులను పిలిపించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సు సమక్షంలో మాట్లాడారు. ఎవరికీ డబ్బులివ్వొద్దని వాళ్లతో చెప్పి నర్సుతో పాటు అభ్యర్థులను అక్కడి నుంచి పంపేశారే తప్ప చర్యలేవీ చేపట్టలేదు. ఆ నర్సే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సూపరింటెండెంట్ ఆమె కష్టాన్ని పదింతలు చేసి ఆమెను ప్రశంసించడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు అక్కడే పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీ షియన్కు ఓ ప్రైవేటు ల్యాబ్ ఉండగా జీజీహెచ్‌లో వసూళ్లకు పాల్పడడమే కాక, అక్కడికి కూడా కిట్లను తరలిస్తున్నాడని వెల్లడైంది. వసూళ్ల దందాలో ఈ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నాడని నిందితుడు బాషా పోలీసులకు వెల్లడించాడు. ఈ వసూళ్ల వ్యవహారం వెనుక వీళ్లకు దన్నుగా జీజీహెచ్ ఉన్నతాధికారి ఉన్నారన్న చర్చ సాగుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న కిట్లలో కొన్ని.. నిందితుడిని అరెస్టు చేశాం : పోలీసులు కాకినాడ మూడో పట్టణ పోలీసులు మాట్లాడుతూ నిందితుడు బాషా ప్రతీకార చర్యలో భాగంగానే దొంగిలించినట్టు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడు చెప్పిన పేర్లను సూపరింటెండెంట్‌కి తెలిపి కేసును కాకినాడ ఒకటో పట్టణ పోలీసులకు అప్పగిస్తామన్నారు. నిందితుడి నుంచి 298 కిట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కరోనా పాజిటివ్ బాధితుడైన బాషా వాటిలో రెండు కిట్లను తన కోసం వినియోగించుకున్నాడన్నారు. అతడికి మంగళవారం రాత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. గత నెల 27న జీజీహెచ్ నుంచి ఇంటెండ్ తీసుకున్న బాషా డీఎంహెచ్‌వో కార్యాలయానికి కిట్ల కోసం వచ్చాడని, ఆ సమయంలో సిబ్బంది అందుబాటులో లేక వెనుదిరిగాడని తెలిపారు. ఆ తర్వాత అమలాపురానికి బదిలీ కావడం, కరోనా పాజిటివ్ రావడంతో ఇంద్రపాలెంలోని తన ఇంట్లో క్వారెంటైన్లో ఉన్నాడన్నారు. ఆ స్టాఫ్ నర్సుపై పగతో ఆమెతో పాటు, ల్యాబ్ టెక్నీషియన్ల దందాను బయట పెట్టాలని నిర్ణయించి ఆ ఇండెంట్‌పై తేదీని పదిగా మార్చి, కిట్ల సంఖ్యను 200 నుంచి 300 చేసి తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడని విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. నిందితుడిని బు«ధవారం ఉదయం అరెస్టు చేశామని, పరీక్షల కోసం జీజీహెచ్‌కి పంపామని తెలిపారు. నిందితుడితో పాటు అతడి వద్ద లభ్యమైన 298 కిట్లను న్యాయస్థానానికి అందిచనున్నట్టు తెలిపారు. ప్రతీకారం తీర్చుకుందామని.. ఎంఎన్‌వో బాషా కిట్లను దొంగిలించి ఇంట్లో దాచుకున్నాడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన అతడికి లేదని పోలీసుల విచారణలో తేలింది. 300 కిట్లు దొంగిలించడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తే నివ్వెరపరిచే సమాధానమిచ్చాడు. అక్కడి నర్సుపై ప్రతీకారం తీర్చుకునేందుకే తాను ఈ పని చేశానని తేల్చి చెప్పాడు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వసూలు చేసే డబ్బుల పంపకంలో చోటు చేసుకున్న ఘర్షణలో తానే డబ్బులు వసూలు చేసినట్టుగా నర్సు తనపై నింద వేసి నోడల్ అధికారికి ఫిర్యాదు చేసిందన్నాడు. దీంతో జీజీహెచ్ సూపరింటెండెంట్ తనను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి బదిలీ చేశారని, అది తనను తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు. -
టీడీపీ అక్రమాలు.. రూ.కోటిన్నర మాయం
గతమంతా ఘన చరిత్ర...అయితే అవినీతితో అన్నట్టుగా ఉంది టీడీపీ పాలన. అన్నీ పక్కాగా సాగాల్సిన సహకార సొసైటీల్లో కూడా కోట్ల రూపాయల స్వాహాకు పాల్పడ్డారు. తెలుగు తమ్ముళ్లు. తరువాత అధికారం తమదేనన్న ధీమాతో బినామీల పేరుతో...సెంటు భూమిలేని వ్యక్తుల పేరుతో నిధులను పక్కతోవ పట్టించారు. కళ్లుమూసుకొని పాలుతాగుతూ పిల్లి ఎవరూ చూడడం లేదన్న రీతిలో సొసైటీల్లో ఖజానా గుల్ల చేసేశారు. అనంతరం డీసీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంత ఉదయ భాస్కర్ ఈ అక్రమాలపై దృష్టి సారించడంతో వ్యవహారం బట్టబయలైంది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘కంచే చేను మేసింద’నే సామెతను తలపించే రీతిలో సహకార సంఘాలను అధికారులే కొల్లగొట్టేశారు. సంఘాలలో పనిచేస్తూ ప్రగతికి పాటుపడాల్సిన సంబంధితాధికారులు, ఉద్యోగులే సంఘాలను గుల్ల చేసిపోయారు. గత తెలుగుదేశం పార్టీ పాలకవర్గం ఏలుబడిలో తెలుగు తమ్ముళ్లు, అధికారులు కుమ్మక్కై గత ఐదేళ్లలో పలు అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఏ సంఘాన్ని కదిపినా అవినీతి, అవకతవకలే కదలాడుతున్నాయి. అప్పట్లో డీసీసీబీ పాలకవర్గం, సీఈఓ సహా అధికారుల సంఘాలు, బ్రాంచీల్లో జరుగుతున్న అవినీతి కుంభకోణాలను చూసీచూడనట్టు ప్రేక్షకపాత్ర పోషించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి డీసీసీబీ చైర్మన్‌గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక నాటి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వద్దిపర్రు సొసైటీ, ఆత్రేయపురం బ్రాంచి అధికారులు అడ్డంగా దోచేసిన రైతుల సొమ్ము అక్షరాలా రూ.1.37 కోట్లుగా లెక్క తేలింది. అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించడంతో ఈ కుంభకోణం బయటపడింది. 2019 మార్చి వరకూ జరిగిన లావాదేవీలపై ఆడిట్లో బయటపడింది కానీ లేకుంటే ఇది బయటపడేదే కాదు. ఈ కుంభకోణాన్ని వద్దిపర్రు పర్సన్ ఇన్చార్జి కొరుప్రోలు వెంకటేశ్వరరావు బయటపెట్టారు. వద్దిపర్రు సొసైటీలో... టీడీపీ ఏలుబడిలో సొసైటీలో 55 మంది బినామీ రైతుల పేర్లతో సుమారు రూ.54 లక్షలు దిగమింగేశారు. సొసైటీలో జరిపిన ఎరువుల లావాదేవీల సొమ్ము రూ.60 లక్షలు, నగదు నిల్వ రూ.23 లక్షలు కూడా మాయం చేసేశారు. వద్దిపర్రు, పేరవరం గ్రామాల్లో అసలు సెంటు భూమంటూ లేని, నిరక్షరాస్యులైన వ్యవసాయ కూలీల పేరుతో లక్షలు రుణాలు తీసేసుకున్నారు. ఈ సొసైటీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సీఈఓ ఆచంట మునీశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన లావాదేవీలపై జరిపిన ఆడిట్లో ఈ కుంభకోణం వెలుగులోకి చూసింది. పేరవరం గ్రామానికి చెందిన కొండ్రు నాంచారావు సన్ఆఫ్ పల్లయ్య రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ. ప్రభుత్వం ఇచ్చిన పక్కా గృహంలో నివాసం ఉంటున్నాడు. అతని పేరున రూ.17.30 లక్షలు రుణం వద్దిపర్రు సొసైటీ రికార్డుల్లో ఉంది. సెంటు భూమి లేదు. అయినా నాంచారావు పేరున స్వల్పకాలిక రుణం రూ.3 లక్షలు, స్వల్పకాలిక ఇతర రుణం రూ.9.70 లక్షలు, దీర్ఘకాలిక రుణం రూ.4.60 లక్షలు, మొత్తంగా రూ.17.30 లక్షలు రుణం దోచేశారు. ఏవీ చూడకుండానే... ♦రుణం ఇవ్వాలంటే ముందు బ్రాంచి మేనేజర్, సూపర్వైజర్ కచ్చితంగా భూమిని పరిశీలించాలి. భూ తనఖా రిజిస్ట్రేషన్ నంబరు, అతని పేరున భూమి ఉందా లేదా, భౌతికంగా కూడా చూడాలి. అదే రూ.3 లక్షలు రుణం వరకూ బ్రాంచి స్థాయిలో పరిశీలన జరిపితే సరిపోతుంది. రూ.3 లక్షలు దాటి రుణం ఇవ్వాల్సి వస్తే డీసీసీబీ స్థాయిలో పరిశీలన జరపాలనేది నిబంధన. కానీ ఇవేమీ చూడకుండానే కళ్లుమూసుకుని సెంటు భూమి లేని నాంచారావు పేరున రూ.17.30 లక్షలు రుణం గుటకాయ స్వాహా చేశారు. ♦వద్దిపర్రు గ్రామంలో ఉప్పే కొండయ్య సన్ ఆఫ్ పెరుమాళ్లు. ఇతనికి 0.6 సెంట్లు భూమి ఉంది. దీనిని 0.67 సెంట్లుగా రికార్డు చూపించారు. అంటే 61 సెంట్లు పెంచి చూపించారు. స్వల్పకాలిక రుణ బాండ్లో 67 సెంట్లు చూపించారు. తీరా కొండయ్య పేరున సొసైటీలో తనఖా పెట్టిన బాండును అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిశీలిస్తే ఆ బాండు నంబర్ 949/2012తో కరుటూరి మాధవి పేరున రిజిస్టరై ఉందని తేలింది. ఇలా ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు పీఏసీఎస్ ద్వారా 55 మందికి రూ.54 లక్షలు పంట రుణాలు ఇచ్చినట్టు రికార్డు ఉంది. రుణాలు ఇవ్వాలంటే టైటిల్ డీడ్, బాండ్ పేపర్లు సొసైటీ తరువాత బ్రాంచిలో డిపాజిట్ చేయాలి. కానీ ఇక్కడ సొసైటీ సీఈఓ సహా కొందరు బ్రాంచి అధికారులు భూమి లేని వారికి భూమి ఉన్నట్టు, భూముల విస్తీర్ణం పెంచేసి, టైటిల్ డీడ్లు లేకుండానే ఉన్నట్టు, బాండ్ పేపర్లు నకిలీవి సృష్టించడం...ఇలా రికార్డుల మాయాజాలంతో లక్షలు దారిమళ్లించి రైతుల నోట మట్టికొట్టారు. ఓ రైతుకు రుణం ఇవ్వాలంటే... స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం టైటిల్ డీడ్, బాండ్ కచ్చితంగా ఉండాలి. వీటిని రైతుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకుంటారు. సొసైటీ స్థాయిలో సీఈఓ పరిశీలన జరిపి డీసీసీబీ బ్రాంచికి అందజేయాల్సి ఉంటుంది. ఆ బ్రాంచి మేనేజర్ రికార్డు ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందాక బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఆ రుణం కూడా నేరుగా రైతుకే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రైతుకు రుణం అందుకోవాలంటే ఇంతటి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటే వద్దిపర్రు సొసైటీలో మాత్రం ఈ నిబంధనలన్నింటినీ గాలికొదిలేసినా డీసీసీబీ స్థాయిలో అప్పటి సీఈఓ సహా ఉన్నతాధికారులు, ఆత్రేయపురం బ్రాంచి మేనేజర్ ఎం.క్రాంతి కృష్ణ పర్యవేక్షణ ఏమి చేశారని ఆ ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ సీఈఓ ఆచంట మునీశ్వరరావు, సూపర్వైజర్ మహలక్ష్మిరాజు(పదవీ విరమణ) అక్కడి తెలుగు తముళ్లు తెరవెనుక ఈ కథ నడిపించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎరువుల లావాదేవీల్లోనూ... ఎరువుల లావాదేవీల సొమ్ము రూ.60 లక్షలు, మార్చి 2019 నాటికి ఉండాల్సిన నగదు నిల్వ రూ.23 లక్షలలో మాయాజాలమే జరిగింది. తమకు తెలియకుండా తమ పేరున రుణాలు కాజేసిన వ్యవహారం ఆనోట, ఈనోటా రైతులకు చేరడం, ఇంతలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి వద్దిపర్రు పర్సన్ ఇన్ఛార్జిగా కొరుప్రోలు వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, కుంభకోణంపై ఆడిట్ నిర్వహించడం ద్వారా స్వాహా అయిన నిధులను బాధ్యుల నుంచి తిరిగి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కోటి రూపాయల వరకు రికవరీ చేసినట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. మిగిలిన మొత్తం కూడా వసూళ్లు చేస్తామన్నారు. సొమ్ము రాబట్టి బాధ్యులను విడిచిపెట్టేస్తే ఇలాంటి కుంభకోణాలు పునరావృతం అవుతాయని, బాధ్యులపై చర్యలకు డీసీసీబీ స్థాయిలో కొందరు అధికారులు అడ్డంపడుతున్నారని తెలిసింది. ఇటీవల గోకవరం బ్రాంచిలో బంగారం, దీర్ఘకాలిక రుణాలలో అవినీతిని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో బాధ్యుడైన మేనేజర్ ఎస్ఎ హుస్సేన్ నుంచి బంగారం, నగదు రికవరీ చేసి విధులకు దూరంగా ఉంచారు. వద్దిపర్రు సొసైటీ సీఈఓ మునేశ్వరరావుపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆత్రేయపురం బ్రాంచిలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రుణాలు నొక్కేసింది వీరి పేర్లతోనే... పోతుల శ్రీరామ్-రూ.3 లక్షలు పోతుల ఏసుప్రభావతి-రూ.3 లక్షలు గుడే సునీత-రూ.3 లక్షలు బొజ్జా రాజేశ్వరి-రూ.3 లక్షలు బొజ్జా తులసీరావు-రూ.3లక్షలు మద్దిపోతి శ్రీనివాసరావు-రూ.13,700లు మద్దెల అర్జియ్య-రూ.2లక్షలు అత్తిలి రామాంజనేయులు-రూ.2 లక్షలు అత్తిలి గోవిందు-రూ.2 లక్షలు వరదా రాంబాబు-రూ.2.40లక్షలు మద్దిపోతు విజయలక్ష్మి-రూ.1.75 లక్షలు గన్నమేని అనసూయ-రూ.1.50 లక్షలు ఎస్ వెంకటేశ్వర్లు-రూ.లక్ష అవకతవకలు వాస్తవమే.. వద్దిపర్రు సొసైటీలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. ఆ విషయాలు నా దృష్టికి కూడా వచ్చాయి. దానిపై ఆడిట్ కూడా నిర్వహించాం. బాధ్యులపై విచారణతోపాటు సొమ్ము రికవరీ చేస్తున్నాం. ఇటువంటి అవకతవకలు జరగకుండా బ్రాంచి, సహకార సంఘాల్లో పనిచేస్తున్న వారిని భవిష్యత్తులో బదిలీలు చేసేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. – ప్రవీణ్‌కుమార్, డీసీసీబీ సీఈవో అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం సొసైటీలో అవకతకవలు జరిగినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. ప్రతి పైసా సొసైటీకి తిరిగి వచ్చే వరకూ పోరాడతాం. సొసైటీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. – కొరుప్రోలు వెంకటేశ్వరరావు, వద్దిపర్రు సొసైటీ చైర్మన్, ఆత్రేయపురం మండలం సహకార సంఘాలను భ్రష్టు పట్టించిన టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సహకార సంఘాలను భ్రష్టుపట్టించారు. తెలుగు తమ్ముళ్లు కొందరు సహకారంతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకుతిన్నారు. అటువంటిదే మా నియోజకవర్గంలో పలివెలలో జరిగింది. పలివెలలోని సహకార సంఘ పరిధిలో రెండు భవనాల నిర్మాణానికి రూ.35 లక్షలు విడుదల చేశారు. కానీ అక్కడ నిర్మించింది ఒకే భవనం. నేను స్వయంగా అక్కడ జరిగిన అవినీతిని నాడు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు తీసుకోలేదు. పదేపదే ఒత్తిడి తీసుకొచ్చిన మీదట మొక్కుబడిగా విచారణ చేసి రూ.6 లక్షలు అవినీతి జరిగినట్టు తేల్చారు. టీడీపీ అధికారం కోల్పోయిన సమయానికి కూడా అవినీతి సొమ్ము రికవరీ చేయలేకపోయింది. – చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే -
అమరావతి భూముల్లో వెలుగులోకి వస్తున్న వాస్తవాలెన్నో!
సాక్షి, గుంటూరు: భూమి ఒకటే... సర్వే నంబరూ అదే... భూ యజమానులూ వారే... అయినా రికార్డులు మారాయి. ఇతరుల పేరిట భూమి బదలాయింపునకు తారుమారయ్యాయి. ఇలా ఒకటి రెండూ కాదు. పెద్ద సంఖ్యలోనే. రూ.కోట్లు చేతులు మారాయి. ఇదంతా నెలల వ్యవధిలోనే జరిగిపోయింది. ప్రపంచ స్థాయి నగరంగా చెప్పుకున్న రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఎన్నెన్ని లుకలుకలో. మరెన్ని లోగుట్లు ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నాయో... పెదలంక భూ ఉదంతాన్నే పరిశీలిస్తే... 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో భూసమీకరణ కింద దాదాపు 33 వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకుంది. ఆ సమయంలో తమకు అనుకూలురైన అధికారులను నియమించుకుని అప్పటి అధికార పార్టీ పెద్దలు అన్యాయాలకు పాల్పడ్డారని, పేదలు, నిరుపేదలను దారుణంగా మోసగించారని నిర్దిష్ట ఆరోపణలు వచ్చాయి. భూముల విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాలకు చెందిన వారు పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులను కలిసి నేటికీ ఫిర్యాదులు అందజేస్తూ న్యాయాన్ని కోరుతున్నారు. అలాంటి ఫిర్యాదుల్లో భాగంగానే తుళ్లూరు మండలం రాయపూడి పంచాయతీలోని పెదలంకలో జరిగిన మోసాన్ని రెవెన్యూ సహకారంతో పోలీసులు ఛేదించారు. తుళ్లూరు మండల మాజీ (రిటైర్డు) తహసీల్దారు అన్నే సుధీర్‌బాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, విజయవాడలో ప్రముఖ ఎం అండ్ ఎం వస్త్ర దుకాణ యజమాని గుమ్మడి సురేష్లను బుధవారం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తుండటంతో విచారణాధికారులు సైతం విస్తుపోతున్నారు. అన్నే సు«దీర్‌బాబు 2014 నుంచి 2017 ఆగస్టు వరకు తుళ్లూరు తహసీల్దారుగా పనిచేసి రిటైరయ్యారు. సమీకరణలో అసైన్డు భూమి పట్టా భూమిగా మారింది పెదలంక సర్వే నంబరు 376/2ఎలో 3.70 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా 1975లో ప్రభుత్వపరమైంది. ఆ భూమిని అసైన్మెంట్ పట్టా కింద యలమంచిలి సూరయ్య, ఆయన కుమారులతో పాటు పలువురు స్థానికులకు ప్రభుత్వం అప్పట్లోనే పంపిణీ చేసింది. రాజధాని పేరిట ఆ భూమిని కూడా సమీకరణ కింద సర్కారు తీసుకుంది. అసైన్డ్ ల్యాండ్‌ను పట్టా భూమిగా అప్పటి తహసీల్దారు అన్నే సుధీర్‌బాబు రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించారు. అడంగల్, ఆర్ ఒ ఆర్– 1బి, పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లలో మార్పులు చేసేశారు. ఆరు పర్యాయాలు ఆరు రకాలుగా... యలమంచిలి సూరయ్య, ఆయన కుమారులకు చెందిన 86 సెంట్ల భూమికి ఆరుసార్లు ఆరు రకాలుగా రికార్డులు మార్పులు జరిగినట్లు పరిశీలనలో వెల్లడైంది. తొలుత సీలింగ్ ల్యాండ్‌ను అసైన్డ్ పట్టాల కింద ప్రభుత్వం పంపిణీ చేసింది. రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ ఆరంభమైనప్పటి నుంచి 2017 ఆగస్టు మధ్య కాలంలో అసైన్డ్ నుంచి పట్టాగా మళ్లీ అసైన్డ్, ఆపై పట్టా, తిరిగి అసైన్డ్, ఆ తరువాత పట్టాగా రికార్డుల్లో మార్పులు జరిగాయి. అవసరాన్ని, సమయాన్ని బట్టి ఆన్లైన్ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో ఈ మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నట్లు పోలీసు పరిశీలనలో తేటతెల్లమైంది. ఎందుకిలా చేశారంటే... అసైన్డ్ ల్యాండ్‌గా ఉంటే రిజిస్ట్రేషన్లకు వీలుకాదు. విక్రయానికీ కుదరదు. అందువల్లే వెబ్‌ల్యాండ్‌లో పట్టా భూమిగా మార్పుచేశారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారి గుమ్మడి సురేష్ పేరిట సేల్ కమ్ జీపీ చేశారు. ఆ తరువాతే గుమ్మడి సురేష్ వల్లూరు శ్రీనివాస్‌బాబుకు విక్రయించగలిగారు. అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకి ఇవ్వగలిగారు. ఎస్సీలను మోసగించినందున... ఎస్సీ వర్గానికి చెందిన రైతులను మోసగించే ఉద్దేశంతోనే అన్నే సుధీర్‌బాబు, గుమ్మడి సురేష్ ఉమ్మడిగానే వ్యవహారాలు నడిపారనేది వెల్లడైనందున వారివురిని అరెస్టు చేయడంతోపాటు సెక్షన్ 3(1)(ఎఫ్)(జి), 3(2)(విఎ) ఎస్సీ, ఎస్టీ అమెండ్మెంట్ యాక్టు–1989 కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తుళ్లూరు డీఎస్పీ మీడియాకు తెలిపారు. రికార్డుల తారుమారుతో పాటు సీఆర్డీఏకి భూమి అప్పగించడం వెనుక కుట్ర, మోసం ఉన్నందున సెక్షన్–7 ఆఫ్ ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్– 1977తో పాటు 120–బి, 407, 420, 465, 468,471,477(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంలో ఆ ఇద్దరితో పాటు అసైనీలు సహా సంబంధితులందరూ నిందితులేనని తెలిపారు. మరో 9 సర్వే నంబర్లలోనూ... రాజధాని గ్రామాలైన అనంతవరం, నేలపాడు, వెలగపూడి, రాయపూడి, పెదలంక తదితర గ్రామాల్లోని తొమ్మిది సర్వే నంబర్లలోని రికార్డులు తారుమారయ్యాయని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. ఆయా గ్రామాలకు చెందిన పేద రైతులు తమను మోసగించారని రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. వీటిపై లోతైన దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని దళిత సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. -
నందిగాం భూ బాగోతంలో కొత్త కోణాలు..
వీళ్లు మామూలు దొంగలు కాదు. సిగ్నే‘చోర్’లు. అంటే డిజిటల్ సంతకాలను కూడా దొంగిలించేవారు. నందిగాంలో వెలుగు చూసిన భూ బాగోతంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. చోరులు తమ అక్రమాలకు ఏకంగా తహసీల్దార్ కార్యాలయాన్నే కేంద్రంగా చేసుకున్నారు. తహసీల్దార్‌కు ఉండే డిజిటల్ సిగ్నేచర్ కీనే వాడుకున్నారు. ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చేశారు? అక్రమార్కుడికి సహకరించినదెవరు? తహసీల్దార్‌కు తెలీకుండా జరిగిందా? ఇంకేదైనా గూడు పుఠాణీ నడిచిందా? ఇప్పుడు తేలాల్సి ఉంది. అధికారంలో ఉన్నన్నాళ్లూ అంతులేని అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులు ఓడిపోయిన తర్వాత కూడా కొన్ని చోట్ల చక్రం తిప్పుతున్నారు. దానికి నందిగాం ఘటనే సాక్ష్యం. మొత్తానికి ఇక్కడి రెవెన్యూ కార్యాలయం కేంద్రంగా ఏదో నడిచిందనే చెప్పాలి. ఇలాంటి తప్పుడు పాసు పుస్తకాలు, వన్‌బీల్లో దిద్దుబాట్లు ఇంకెన్ని సృష్టించారో, ఇంకెన్ని బాగోతాలు చేశారో నిగ్గు తేల్చాలి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పేదోడికి సెంటు స్థలం ఇవ్వలేదు గానీ ప్రభుత్వ భూములను మాత్రం టీడీపీ నేతలు ఇష్టారీతిన ఆక్రమించారు. తమ పేర్లను రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. అంతటితో వారి భూదాహం తీరలేదు. తమకు తెలిసిన వ్యక్తుల పేరు మీద ఉన్న భూముల వివరాలనే మార్చేసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారు. ఇందులో కొందరు రెవెన్యూ సిబ్బంది సహకరించారు. తిలా పా పం తలా పిడికెడు అన్నట్టుగా భూముల రికార్డుల మార్పిడిలో కుమ్మక్కై కథ నడిపారు. చెప్పాలంటే అక్రమార్కులతో చేతులు కలిపారు. అక్రమార్కుడు అధికారుల స్టాంపు, డిజిటల్ సిగ్నేచర్ పక్కా గా వినియోగించుకున్నాడంటే రెవెన్యూ కార్యాలయం కేంద్రంగా భూమాయ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అనువంశికంగా దఖలు పడిన భూమిని తన పేరున మార్చి, పట్టాదారు పాసుపుస్తకం, 1బీ, అడంగల్లు ఇప్పించాలని కాళ్లు అరిగేలా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగి నా 1బీ రాదు, పాసుపుస్తకం రాదన్న పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ పలుకుబడి, రెవెన్యూ సిబ్బందితో మచ్చిక చేసుకుంటే తనది కాని భూమిని కూడా తన పేరున, తన వారి పేరున ఎకరాల కొద్దీ మార్చేస్తారని నందిగాంలో తాజాగా జరిగిన ఘటన ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వ కాలంలో మండలంలో చక్రం తిప్పిన కొంత మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమకు కని పించిన ప్రభుత్వ భూములను, పోరంబోకు భూములను, మెట్టలను తమ పేరున మార్చుకొని లక్షలాది రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, ఇన్పుట్ సబ్సిడీలు పొందటం, బీమా పరిహారం పొందటం వంటివి చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడంతో ఆరితేరిన సిబ్బంది వీరికి లోపాయికారీగా సహకరించడం, తహసీల్దారు పని ఒత్తిడిలో తన డిజిటల్ కీను కంప్యూటర్ ఆపరేటర్లకు ఇవ్వడంతో తహసీల్దార్‌కు సంబంధం లేకుండానే భూములు మార్చకోవడం జరుగుతోంది. తాజా వ్యవహారంలో ఏం జరిగిందో విచారణలో తేలాలి. అంతులేని అక్రమాలు.. తెలుగు యువత అధ్యక్షుడు మదన్‌గౌడ్ విషయంలో బాధితుడు ఆన్లైన్లో రెవెన్యూ రికార్డులు చూసి మోసపోయిన విషయం గుర్తించారు. మండల పరిధిలోని హరిదాసుపురా నికి చెందిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తికి మాదిగా పురం, సొంఠినూరు పరిధిలో సుమారు 60 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చూపుతుండగా, క్షేత్రస్థాయిలో వారికి 12 సెంట్లు, 24 సెంట్లు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి దరఖాస్తులు లేకుండా మండలంలోని మాదిగా పురం పరిధిలో గురుబెల్లి చిన్నిమ్ములు, తలగాపు సత్యవతిల పేరున సుమారు 14 ఎకరాలను, సొంఠినూరు పరధిలో గురుబెల్లి చిన్నమ్మలు పేరున 15 ఎకరాలు, తలగాన సత్యవతి పేరున 15 ఎకరాలు, కల్లేపల్లి త్రినాథరావు పేరున 15 ఎకరాలకు రెవెన్యూ రికార్డులను తయారు చేయించి వారి పేరున 1బీలు, అడంగల కాఫీలు తయారు చేశారు. అలాగే శివరాంపురం పంచాయతీ బడబందలో 149–1లో ఉన్న మెట్టలో 15 ఎకరాల వరకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల పేరున 1బీలు తయారు చేసుకున్నారని, కాపుతెంబూరు పరిధిలో సర్వే నంబర్ 28, 28–2, లట్టిగాం పరిధిలో సర్వే నంబర్ 3–10లో సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు వారి పేరున తయారు చేసుకున్నారని, గొల్లూరు పంచాయతీ సొంఠినూరు సర్వే నంబర్ 1లో ఉన్న కొండపై అనేక మంది పట్టాలు సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాదు బయటకు రాని భూములు ఇంకా చాలా ఉన్నాయన్న వాదనలు ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే మదన్‌గౌడ్ లాంటి వారు మరింత మంది బయటకు వస్తారని తెలుస్తోంది. ఫిర్యాదులపై దృష్టి సారిస్తే.. మండల పరిధిలో వందల ఎకరాల భూముల రెవెన్యూ రికార్డులను కొంతమంది తమ పేరున మార్చుకొన్న వ్యవహారంపై అధికారులకు పలు ఫిర్యాదులు వచ్చినా వాటిని పరిశీలించకపోవడం, దర్యాప్తు చేయకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలను కట్టడి చేయలేకపోవడం ఒక ఎత్తు అయితే ప్రస్తుత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు, అవినీతికి తావు ఇవ్వనప్పటికీ నేటికీ తారుమారైన రికార్డులు, భూములపై దృష్టి సారించకపోవడం వల్ల గత అక్రమాల కు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మండల పరిధిలోని భూముల వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే పలువురు కోరుతున్నారు. డిజిటల్ సిగ్నేచర్ దుర్వినియోగంపై ఫిర్యాదు నాకున్న డిజిటల్ సిగ్నేచర్ ఎలా దుర్వి నియోగమైందో విచారించి, దోషులను పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. డిజిటల్ సిగ్నేచర్‌ను ఆయుధంగా చేసుకుని రికార్డుల మార్పిడి చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్నాను. పోలీ సుల విచారణ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటాను. అలాగే ఇలాంటివి ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించండని వీఆర్ఓలతో సమావేశం పెట్టి చెప్పాను. – ఎన్.రాజారావు, తహసీల్దార్, నందిగాం తెలుగు యువత అధ్యక్షుడికి 14 రోజుల రిమాండ్ నందిగాం: రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి లేని భూమిని ఉన్నట్లుగా న మ్మించి అమ్మేయబోయిన నందిగాం మండల తెలుగు యువత అధ్యక్షుడు మదన్‌గౌడ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదన్గౌడ్పై నందిగాం పోలీసు లు కేసు నమోదు చేసి బుధవారం టెక్కలి కోర్టుకు తరలించారు. స్థానిక ఇన్చార్జి మెజిస్ట్రేట్ ప్రకాశరావు మదన్‌ను 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. అనంతరం పోలీసులు శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. -
అవినీతికి అడ్డాగా బందరు సబ్ ట్రెజరీ కార్యాలయం