సాక్షి, కణేకల్లు: కణేకల్లు వ్యవసాయ విత్తనోత్పత్తిక్షేత్రంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రంగంలో దిగిన ఆడిటర్లు తమకు అప్పగించిన పనిని పూర్తి చేశారు. పూర్వ ఏడీఏ సనావుల్లా పదేళ్ల కాలంలో రికార్డులను సక్రమంగా నిర్వహించకుండా, ఆదాయ వ్యయాలు సరిగా చూపకుండా, నిధులను భారీస్థాయిలో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఫారం బకాయిపడిన సొమ్మును ఓటీఎస్ ద్వారా రూ.78.36 లక్షలను ప్రభుత్వం ఇటీవలే చెల్లించగా... ఇందులో కూడా ఓ వ్యక్తి ఖాతా నుంచి తన భార్య ఖాతాకు రూ.13.85 లక్షలు మళ్లించుకున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్.. సనావుల్లా పని చేసిన సమయంలోని రికార్డులన్నీ పరిశీలించేందుకు ఆడిటర్లను నియమించింది.
ఆడిటర్లు యోగానందరెడ్డి, రాంబాబు, మాధవి, అన్నపూర్ణ ఐదు రోజుల పాటు రికార్డులన్నీ క్షుణ్ణంగా ఆడిట్ చేశారు. నిధుల దుర్వినియోగంపై ఆడిటర్లను అడిగితే ‘ఆ ఒక్కటి అడక్కండి.. కమిషనర్‌కు నివేదిక అందజేస్తాం’ అని సమాధానమిచ్చారు. నివేదికలో ఏముంది.. పూర్వ ఏడీఏపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
(చదవండి: విద్యార్థి ఆత్యహత్య కేసు: చనిపోవడానికి ముందు వేరే గదికి!)
Comments
Please login to add a commentAdd a comment