సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నూతన పాలక మండలి అక్రమాల ఆరోపణలపై పోలీసులు రంగంలోకి దిగారు. సొసైటీ కార్యాలయానికి చేరుకున్న జుబ్లీహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్, కోశాధికారి నాగరాజుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సొసైటీ స్థలం తక్కువ ధరకు అమ్మి రూ.5 కోట్ల నష్టం చేశారని సభ్యుడు సురేష్ బాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
సొసైటీ స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణను జీహెచ్‌ఎంసీ తొలగించింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలో సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్, కోశాధికారి నాగరాజుకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment