investigate
-
462 కంపెనీలపై దర్యాప్తు!
అనుమానాస్పద మోసపూరిత లావాదేవీల విషయమై కార్పొరేట్ శాఖ రీజినల్ డైరెక్టర్లు 462 కంపెనీలపై దర్యాప్తు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో కార్పొరేట్ మోసాలు పెరిగాయనడానికి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. కార్పొరేట్ శాఖ రీజినల్ డైరెక్టర్లు (ఆర్డీలు), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అధికారులు సాధారణంగా మోసపూరిత లావాదేవీలపై దర్యాప్తు నిర్వహిస్తుంటారు. ఆర్డీలు, ఎస్ఎఫ్ఐవో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్న కేసుల వివరాలను కార్పొరేట్ శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభకు లిఖిత పూర్వకంగా అందించారు. 2019–2020 మధ్య ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కార్పొరేట్ శాఖ ఆర్డీలు 462 కంపెనీలపై దర్యాప్తు నిర్వహించగా, ఎస్ఎఫ్ఐవో 72 కేసుల దర్యాప్తును చేపట్టినట్టు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ శాఖ ఆర్డీలు 51 కంపెనీలపై దర్యాప్తు నిర్వహించినట్టు చెప్పారు.ఇదీ చదవండి: నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలుబీఎస్ఈ నుంచి కొత్త ఇండెక్సులుస్టాక్ ఎక్స్ఛేంజీ బీఎస్ఈ అనుబంధ సంస్థ ఏషియా ఇండెక్స్ తాజాగా ఐదు సూచీలను ప్రవేశపెట్టింది. మార్కెట్ నుంచి బీఎస్ఈ 1000సహా మరో 4 ఇండెక్సులను రూపొందించింది. దీని ద్వారా మార్కెట్లో పెట్టుబడులకు మరిన్ని అవకాశాలకు తెరతీసింది. దీంతో దేశీయంగా తదుపరితరం వర్ధమాన కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్కెట్ పార్టిసిపెంట్లకు వీలు కల్పించనుంది. బీఎస్ఈ 1000తోపాటు బీఎస్ఈ నెక్ట్స్ 500, బీఎస్ఈ 250 మైక్రోక్యాప్, బీఎస్ఈ నెక్ట్స్ 250 మైక్రోక్యాప్, బీఎస్ఈ 1000 మల్టీక్యాప్తో కొత్త ఇండెక్సులకు తెరతీసింది. మొత్తం దేశీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో 93 శాతాన్ని బీఎస్ఈ 1000 ఇండెక్స్ ప్రతిఫలించనున్నట్లు ఏషియా ఇండెక్స్ ఎండీ, సీఈవో అశుతోష్ సింగ్ పేర్కొన్నారు. వెరసి మొత్తం స్టాక్ మార్కెట్‌కు ప్రామాణిక ఇండెక్స్‌గా ఇది నిలవనున్నట్లు తెలియజేశారు. -
ఎవరి ఆదేశాలతో ఎఫ్ఈఓకు డబ్బులిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓ (ఫార్ములా– ఈ ఆపరేషన్స్ లిమిటెడ్)కు హెచ్ఎండీఏ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? నిధులు బదిలీ చేయాలని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు? రేసు నిర్వహణ నిర్ణయాలను ఎవరెవరిని సంప్రదించి తీసుకునేవారు?’అని హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తాను ఉన్నతాధికారుల ఆదేశాలనే పాటించానని, వారు ఏది చెబితే అదే చేశానని ఆయన సమాధానమిచ్చినట్టు తెలిసింది. ఫార్ములా–ఈ కారు రేసు కేసులో ఏ–3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 9.50 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.ఏసీబీ అధికారులు ముందుగా సూచించిన మేరకు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను తీసుకువచ్చారు. ఏసీబీ సీఐయూ (సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్ బృందం బీఎల్ఎన్ రెడ్డిని విచారించింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఏ–1 మాజీ మంత్రి కేటీఆర్, ఏ–2 ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విచారణ సందర్భంగా సేకరించిన వివరాలు, దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది.ప్రధానంగా బ్రిటన్‌కు చెందిన ఎఫ్ఈఓ కంపెనీకి హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోని హెచ్ఎండీఏ అకౌంట్స్ నుంచి నగదు ఎందుకు పంపారన్న అంశంపైనే ప్రశ్నించినట్టు సమాచారం. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 కోసం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రెండు విడతలుగా రూ.45.71 కోట్లు బదిలీ చేసినట్లు బీఎల్ఎన్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. నిధుల బదిలీ కోసం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని పత్రాలను ఏసీబీ అధికారులకు ఆయన అందించినట్టు సమాచారం. అవసరం మేరకు మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని బీఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ అధికారులు సూచించినట్లు తెలిసింది. -
ఏసీబీ విచారణకు హాజరైన IAS అధికారి అరవింద్
-
నేడు ఏసీబీ విచారణకు IAS అధికారి అరవింద్ కుమార్
-
రైలు పట్టాలపై సిలిండర్.. ఉగ్రవాదుల పనేనా?
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలపై కుట్ర కోణం దాగింవుందనే చర్చ జరుగుతోంది. యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైల్వే మార్గంలో భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ పట్టాలపై సిలిండర్ ఉంచిన ఉదంతాన్ని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో రైలు వేగం ఎక్కువగా ఉంది. డ్రైవర్ రైలును ఆపినప్పటికీ, అది సిలిండర్‌ను ఢీకొంది. దీంతో పెద్ధ శబ్ధం వచ్చింది. ప్రయాణికులు భయకంపితులయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది.ఈ కేసును ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, యూపీ ఏటీఎస్‌సహా అన్ని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించాయి. దీనివెనుక ఐఎస్ఐఎస్ కుట్ర ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాది ఫర్తుల్లా ఘోరీ ఒక ఆడియోను విడుదల చేశాడు. దానిలో రైలును బోల్తా కొట్టించాలంటూ దేశంలోని స్లీపర్ సెల్‌లను ఆదేశించినట్లు ఉంది. దీంతో దర్యాప్తు సంస్థల అధికారులు ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలను కూడా ఈ కోణంలోనే పరిశీలిస్తున్నారు. ఈమధ్య ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీకి చెందిన 14 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు.తాజాగా కాన్పూర్‌లోని రైల్వే ట్రాక్‌పై సిలిండర్ లభ్యమైన ప్రదేశంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. కుట్ర పన్నారనే అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ డీసీపీ వెస్ట్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తు సంస్థలన్నీ తమ తమ స్థాయిలలో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నారో త్వరలోనే వెల్లడిస్తామని ఆయా సంస్థల అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తునకు డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు. ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ కేసుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ధ్వంసమయ్యాయి. దర్యాప్తునకు ఇది ఆటంకం కలిగించే అంశంగా మారింది. కాగా ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బాటిల్లో మండే పదార్థాన్ని పోలీసు అధికారులు గుర్తించారు. -
‘ ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’.. రంగంలోకి ప్రభుత్వం
ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విషయంలో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఈ సంగతేంటో చూడాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయానికి ప్రభుత్వం సూచనలను అందించింది. ఇన్ఫోసిస్ ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న వ్యవహారాన్ని పరిశీలించి తమకు, అభ్యర్థులకు అప్డేట్లను అందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర కార్మిక శాఖ కోరింది.ఇన్ఫోసిస్ 2022లో ఆఫర్ లెటర్ ఇచ్చిన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. ఆన్‌బోర్డింగ్ తేదీలలో సర్దుబాటు చేసినప్పటికీ, ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్లను గౌరవిస్తామని, అందిరినీ ఉద్యోగాల్లోకి చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ హామీ ఇచ్చారు. 2024 జూన్ నాటికి 315,000 మంది ఉద్యోగులతో ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ఒక ప్రధానమైన శక్తిగా ఉంది.2,000 మంది గ్రాడ్యుయేట్లను ఇన్ఫోసిస్ ఆలస్యంగా ఆన్‌బోర్డింగ్ చేయడంపై ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల యూనియన్ అయిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) నుండి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు ఫిర్యాదు అందింది.ఈ వారం ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది గ్రాడ్యుయేట్లకు కన్ఫర్మేషన్ ఈమెయిల్‌లను పంపడం ప్రారంభించింది. మైసూర్లో చేరడానికి అక్టోబర్ 7ను షెడ్యూల్ తేదీగా పేర్కొంది. -
ఉన్నావ్,హత్రాస్ సీబీఐ అధికారుల చేతికే ఆర్జీ కార్ డాక్టర్ కేసు
దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగిల్చిన కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల ట్రాక్ రికార్డ్ చర్చాంశనీయంగా మారింది. గతంలో దేశంలో సంచలనం సృష్టించిన రెండు దారుణాల్లో నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా సీబీఐ అధికారులకు ఆర్జీకార్ కేసును కేంద్రం అప్పగించింది. ఇప్పుడు ఆ ఇద్దరు మహిళా అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగుతుంది. సీబీఐ మహిళా అధికారుల్లో ఒకరు జార్ఖండ్‌కు 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ మీనా గతంలో హత్రాస్, ఉన్నావ్ కేసుల్ని కొలిక్కి తెచ్చారు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పాటు సీమా పహుజా సైతం ఉన్నారు. దర్యాప్తుతో నిందితులకు శిక్షపడేలా చేశారు. కాబట్టే కేంద్రం ప్రత్యేకంగా ఆర్జీ కార్ కేసును వీరికి అప్పగినట్లు సమాచారం. సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంపత్ మీనా ఆర్జీకార్ ఆస్పత్రి కేసు దర్యాప్తు చేస్తున్న 25 మంది అధికారుల బృందానికి బాధ్యత వహిస్తున్నారు. కేసు దర్యాప్తు ఎలా జరుగుతుందో తెలుసుకునే పర్యవేక్షక బాధ్యతల్ని ఈమే చూస్తున్నారు.మరో మహిళా సీబీఐ అధికారిణి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీమా పహుజా సైతం 2007 నుంచి 2018 మధ్యకాలంలో పలు సంచలనాత్మక కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కేసు దర్యాప్తు చేపట్టినందుకు రెండుసార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు.2017లో హిమాచల్ ప్రదేశ్‌లో 10వ తరగతి విద్యార్ధిని కేసు, ఉన్నావ్ కేసుల్ని సంపత్ మీనాతో పాటు సీమా పహుజా ఛాలెంజింగ్ తీసుకున్నారు. 2017లో హిమాచల్ ప్రదేశ్‌లో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 10వ తరగతి విద్యార్థిని కిడ్నాప్‌కు గురైంది. రెండ్రోజుల తర్వాత శవమై కనిపించింది. నాటి విద్యార్ధినిపై జరిగిన దారుణం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసింది.అయితే ఏప్రిల్ 2018లో సీబీఐ అధికారిణి సీమా అహుజా కేసును ఛేదించారు. అధునాతన డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి 1000 మందికి పైగా స్థానికుల విచారణ, 250 మందికి పైగా డీఎన్ఏ పరీక్షల అనంతరం నిందితుడు అనిల్ కుమార్ తండ్రిలో ఫోరెన్సిక్ నమూనాలకు సరిపోలినట్లు కనుగొన్నారు. తండ్రి ఫోరెన్సిక్ నమూనాల ఆధారంగా నిందితుడు అనిల్ కుమార్‌ను గుర్తించారు. ఈ కేసులో అనిల్‌కుమార్‌కు జీవిత ఖైదు పడడంలో సీమా అహుజా సేకరించిన ఆధారాలు కీలకంగా వ్యవహరించాయి.ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్‌లో 2017 జూన్ 4న 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక దురాఘతంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా నిర్ధారించడంలో సంపత్ మీనా, సీమా పహుజాల దర్యాప్తు తోడ్పడింది.2020లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లో 19 ఏళ్ల బాలికపై అగ్ర కులానికి చెందిన నలుగురు నిందితుల చేసిన దారుణంలో వారం రోజుల తర్వాత బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మరణించారు. ఆ ఉదంతం దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దారి తీశాయి. ఈ కేసులో నిందితుల్ని గుర్తించి శిక్షపడేలా చేసిందనుకుగాను సీబీఐ అధికారులు సంపత్ మీనా, సీమా పహుజా దర్యాప్తు చేసిన తీరుపై ప్రశంశలు వెల్లువెత్తాయి. తాజాగా ఆర్జీకార్ జూనియర్ డాక్టర్ కేసు దర్యాప్తు చేసేలా సీబీఐ మహిళా అధికారులైన సంపత్ మీనా,సీమా పహుజాలకు కేంద్రం అప్పగించింది. -
రూ.21లక్షల విలువ చేసే 130 సెల్ఫోన్లు స్వాధీనం..!
డోన్ టౌన్: పట్టణంలోని చిగురమానుపేటలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో రూ.21 లక్షల విలువ చేసే 130 సెల్ ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్‌ని దృష్టిలో పెట్టుకొని కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు.పట్టణంలో సమస్యాత్మకమైన చిగురమానుపేటలో పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, అస్రత్‌బాషా, పట్టణ, రూరల్ ఎస్ఐలు శరత్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలతో పాటు జలదుర్గం ఎస్ఐ విజయ్‌కుమార్‌లు మూడు పోలీసు స్టేషన్ల సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారన్నారు. ఇందులో భాగంగా కాలనీకి చెందిన ఎరుకలి రవి అలియాస్ పిలక రవి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఒక లగేజ్ బ్యాగ్‌లో దొంగలించుకొచ్చిన 130 సెల్ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రవిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని సమీప బంధువులు ఎరుకలి నవాగ్ మరియు ఎరుకలి పవన్‌లు తమిళనాడు రాష్ట్రంకు వెళ్ళి అక్కడ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లు దొంగలించేవారన్నారు. వాటిని రవికి ఇవ్వగా హైదరాబాద్‌కు తీసుకెళ్ళి మహమ్మద్ ఖాజా నిజాముద్ధీన్ అలియాస్ ఖైజర్‌కు ఒట్టుగా అమ్ముతున్నట్లు వెల్లడైందన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ.21 లక్షలు ఉంటుందన్నారు. పైన తెలిపిన ముద్దాయిలు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో.. అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. జైలులో కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో మహిళా సిబ్బంది తప్పకుండా ఉండాలని.. విచారణకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని సూచించింది. ఇంతకు ముందు ఓసారి విచారణ: ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో.. కేంద్ర హోంశాఖ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు మరో 14 మందిపై 2022 జూన్ 22న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అమిత్ అరోరా ఇచ్చిన వాంగ్మూలం, పలు విచారణ అంశాల ఆధారంగా ప్రశ్నించాల్సి ఉందంటూ.. అదే ఏడాది డిసెంబర్ 2న ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వచ్చి ప్రశ్నించారు. తర్వాత ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే ఆలోగానే కవితను ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అదుపులోకి తీసుకుంది. బెయిల్‌పై సోమవారం స్పష్టత ఈ కేసులో కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం స్పష్టత రానుంది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 20న విచారణ చేపడతామని సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. అయితే కవితను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. వచ్చే వారం జైలులోనే ఆమెను విచారించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు
-
మీ బైక్ సైలెన్సర్ సౌండ్ మారిందో.. జర జాగ్రత్త..!
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల అధిక శబ్దాలతో వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో వాహనదారులతో పాటు వృద్ధులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే శబ్దకాలు ష్యంతో అవస్థలు పడుతున్నామని పలువురు పోలీ స్‌స్టేషన్ మెట్లెక్కారు. దీంతో ఇటీవల పట్టణ పోలీ సులు అలాంటి సైలెన్సర్లు అమర్చి వాహనాలు న డుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. మెకానిక్ షాప్‌లకు నోటీసులు.. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చే మెకానిక్ షాప్‌లకు నోటీసులు పంపిస్తాం. అయినా వినకుంటే కేసులు నమోదు చేస్తాం. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చుకునే ద్విచక్ర వాహనదారులకు మొదటిసారిగా జరిమానా విధించి తర్వాత కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతాం. శబ్ద కాలుష్యం ద్వారా జరిగే అనర్థాలకు ఎవరు కారణం కావద్దు. లేదంటే తగిన చర్యలు తీసుకుంటాం. - గంగారెడ్డి, నిర్మల్ డీఎస్పీ సౌండ్‌తో ఇబ్బంది అవుతుంది.. సౌండ్ వచ్చే ద్విచక్ర వాహనాలతో పట్ట ణంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. మైనర్లు సైతం ద్విచక్ర వాహనాలకు సౌండ్ వచ్చే సైలెన్సర్లు బిగించి రోడ్డు మీద వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనాలతో రోడ్లపై ఇష్టానుసారంగా నడుపుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరించాలి. - శంకర్ యాదవ్, మంజులాపూర్ కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మార్చుతూ.. ద్విచక్ర వాహనానికి కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మాడిపై చేస్తున్నారా..? అయితే మీకు షాక్ ఇచ్చేందుకు పట్టణ పోలీసులు సిద్ధమయ్యారు. శబ్ద కాలు ష్యంపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు అధిక శబ్దాలు చేసే వారి వాహనాల పని పడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. రోడ్డు రోలర్‌తో తొక్కిస్తూ.. అధిక సౌండ్ చేసే బైక్‌లను పట్టుకుని వాటి సైలెన్సర్లను తొలగించి పట్టణ నడి ఒడ్డున గల చౌరస్తాలో రోడ్‌రోలర్‌తో వాటిని పోలీసులు తొక్కించి నుజ్జునుజ్జు చేయిస్తున్నారు. 2023లో ఇప్పటివరకు 126 సై లెన్సర్లను తొలగించారు. ఇందులో నుంచి 100 ద్వి చక్ర వాహనాలకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మిగతా 26 ద్విచక్ర వాహనాలను ఆర్టీ వోకు అప్పజెప్పారు. దీంతో ఆర్టీవో ఒక్కొక్క వాహనానికి రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. కొన్ని ద్విచక్ర వాహనాలకు పలువురు నేటికీ అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు.. ఖరీదైన ద్విచక్ర వాహనాలు నడిపేవారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడుతున్నారని నిర్మల్‌లో ఫి ర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సైలెన్సర్లు వాడడంతో శబ్ద కాలుష్యంతో పాటు, వృద్ధుల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడనుంది. అంతేకాకుండా రో డ్డుపై వెళ్లే మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరుతున్నారు. విక్రయదారులపై చర్యలు శూన్యం.. మార్కెట్లో విచ్చలవిడిగా మెకానిక్ షాపుల్లో అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు విక్రయిస్తున్నారు. మొదట గా సైలెన్సర్లు విక్రయించే షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకుంటే అమ్మడం ఆపేస్తారని సూచిస్తున్నారు. పోలీసులు వారిని కట్టడి చేస్తే ఎవరు అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు అమర్చుకోలేరని వాపోతున్నారు. -
అవినీతి కేసు పీకల్లోతులో చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ఈశ్వరన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబును నమ్ముకున్న ఏ ఒక్కరూ సక్రమమైన దారిలో నడిచినట్టు చరిత్రలో లేదు. అమరావతిని బాహుబలి సినిమాలో మాదిరిగా రూపొందిస్తానంటూ సింగపూర్ బృందాన్ని విజయవాడలో దింపి.. ఠక్కుఠమార విద్యలన్నీ ప్రదర్శించిన బాబు డొల్లతనం ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో బయటపడుతోంది. చంద్రబాబుతో కలిసి అమరావతిని ఏదో చేస్తామని చెప్పిన సింగపూర్ బృంద నాయకుడు ఈశ్వరన్ ఇప్పుడు కీలక నేరాల్లో చిక్కుకుని పదవికి దూరమయ్యారు. ఇక్కడి సిబిఐని మేనేజ్ చేసుకుని కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు.. ఇప్పుడు సింగపూర్ లో CBIకి సమానమై CPIB ని ఈశ్వరన్ కోసం ఏ రకంగా ప్రభావితం చేస్తాడో చూడాలి. బాబు పార్ట్ నర్ ఈశ్వరన్ అసలు రూపం ఇది ఈశ్వరన్ సింగపూర్ దేశంలో రవాణాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీగా నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు తీవ్రత ఏంటీ? ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాలేంటీ? దేశానికి ఏ రకంగా నష్టం జరిగింది? అన్న వివరాలను అక్కడి దర్యాప్తు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఒక హైప్రొఫైల్ కేసు అని, అత్యంత కీలక అంశాలతో ముడిపడి ఉన్న విషయమని సింగపూర్ వర్గాల సమాచారం. అందుకే ఈశ్వరన్ ను విచారించేందుకు అక్కడి దర్యాప్తు సంస్థ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CPIB) ప్రధానిని అనుమతి అడగ్గానే ఆయన స్పందించారు. ఈశ్వరన్ ను అధికారికంగా విచారిస్తామంటూ డైరెక్టర్ డెనిస్ టాంగ్ ప్రధాని లీ అనుమతిని కోరారు. ఈ నేపధ్యంలో తాను జూలై 6న సీపీఐబీ డైరెక్టర్‌కి సమ్మతి తెలిపానని, ఆ తర్వాత అధికారిక విచారణ జూలై 11న ప్రారంభమైందని ప్రధాన మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఈశ్వరన్‌ను ఆదేశించినట్లు ప్రధాని లీ తెలిపారు. On 5 July, Director CPIB briefed me on a case and sought my concurrence to open a formal investigation. Minister S Iswaran is assisting with investigations and will take a leave of absence. SMS Chee Hong Tat will be Acting Minister for Transport. – LHL https://t.co/0ut4SRoTfG — leehsienloong (@leehsienloong) July 12, 2023 ఎవరీ ఈశ్వరన్ అమరావతి విషయంలో ఎన్నో కొత్త విషయాలను తెరమీదికి తెచ్చారు చంద్రబాబు. అందులో ముఖ్యమైంది రైతుల భూమిని సేకరించి అభివృద్ధి చేసి మళ్లీ ఇస్తానని. ఇందులో భాగంగా సింగపూర్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. మే 17, 2017న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై నాటి చంద్రబాబు ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియాకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరిపి MOUలో భాగంగా సింగపూర్ కంపెనీలకు 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. అమరావతి భూములను అభివృద్ధి చేసినందుకు సింగపూర్ ప్రభుత్వానికి 58% వాటా, ఏపీ ప్రభుత్వానికి 42% వాటా ఉంటుందని బాబు చెప్పారు. ఈ సింగపూర్ కన్సార్టియానికి మంత్రి ఈశ్వరన్ నేతృత్వం వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇంకేముంది విడతల వారీగా సింగపూర్ బృందాలు విజయవాడ రావడం, ప్రతీ నెలా సమావేశాలు పెట్టడం.. అదిగో ఇదిగో అంటూ రకరకాల ఊహాచిత్రాలను విడుదల చేయడం జరిగింది. అయిదేళ్లలో చంద్రబాబు గానీ, ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియం గానీ చేసిందేమీ లేదు. "Director of the Corrupt Practices Investigation Bureau (CPIB) briefed me on a case CPIB had uncovered... This would involve interviewing Minister S Iswaran, among others... I have instructed Minister Iswaran to take leave of absence until these investi... https://t.co/KkMSp0rhB2 — The Independent Singapore (@IndependentSG) July 12, 2023 2019లో ఏం తేలింది? 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. అదే సమయంలో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి ఒప్పందం గురించి పరిశీలించగా.. అసలు ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియానికి సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. సింగపూర్ లోని కొన్ని సంస్థలు కలిసిందే కన్సార్టియం తప్ప చంద్రబాబు అప్పటివరకు చెప్పినట్టు సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని తేలింది. (చదవండి : కన్సార్టియం పేరిట బాబు అక్రమాలు ఇవి) ‘పక్షపాతం లేకుండా దర్యాప్తు’ ఒక మంత్రిగా ఉన్న ఈశ్వరన్ మీద ఆరోపణలు రావడంతో అక్కడి దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాలను వెలికితీయడానికి, సత్యాన్ని నిరూపించడానికి, చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి, దృఢ సంకల్పంతో ఈ కేసును దర్యాప్తు చేస్తామని పేర్కొంది. CBIP చేపట్టే అన్ని కేసులను పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తుందని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడే పార్టీలపై చర్య తీసుకోవడానికి వెనుకాడదని ఆ ప్రకటనలో పేర్కొంది. మరో వైపు ఈశ్వరన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను కూడా సీపీఐబీ విచారిస్తుందని ప్రధాన మంత్రి లీ సియన్ లూంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూరో బయటపెట్టిన ఒక కేసుకు సంబంధించి ఇటీవల సీబీఐబీ డైరెక్టర్ తనకు సమాచారం అందించారని ప్రధాని లీ చెప్పారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఈశ్వరన్ రాజకీయ జీవితం.. మంత్రి ఈశ్వరన్ రాజకీయ జీవితం 1997లో వెస్ట్ కోస్ట్ GRCకి పార్లమెంటు సభ్యునిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుండి ప్రారంభమయ్యింది. 26 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2006లో క్యాబినెట్లోకి ప్రవేశించకముందు అనేక ప్రభుత్వ పార్లమెంటరీ కమిటీలలో సభ్యనిగా కొనసాగారు. సెప్టెంబర్ 2004 నుండి జూన్ 2006 వరకు పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. మే 2021 నుండి రవాణా మంత్రిగా ఉన్నారు. మే 2018 నుండి వాణిజ్య సంబంధాల ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మంత్రి ఈశ్వరన్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలలో మంత్రి పదవులను కూడా నిర్వహించారు. మే 2011 నుండి సెప్టెంబర్ 2015 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో మంత్రిగా కూడా ఉన్నారు. రాజకీయాలలో ప్రవేశించక ముందు ఈశ్వరన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు టెమాసెక్ హోల్డింగ్స్‌తో సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేశారు. ఈశ్వరన్ ను పక్కకు తప్పించడంతో ఆయన బాధ్యతలను సింగపూర్ సీనియర్ మంత్రి చీ హాంగ్ టాట్ పర్యవేక్షిస్తారని ప్రధాని తెలిపారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఇది కూడా చదవండి: ‘శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తమోడుతున్న చీరతో’.. -
వీడియో కెమెరాలతో A1 రామోజీ విచారణ !
-
మార్గదర్శి కేసులో రామోజీరావు, శైలజాకిరణ్ ను విచారిస్తున్న సీఐడీ
-
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ
-
లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారించనున్న ఈడీ
-
మాజీ మంత్రి నారాయణను ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు
-
ఎమ్మెల్యే కాలనీ దొంగతనం కేసు: వంట మనిషే లాకర్ దొంగ
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే రాజధాని హోటల్ యజమాని అరిహంత్ జైన్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును బంజారాహిల్స్ క్రైం పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు అదే ఇంట్లో పని చేస్తున్న వంట మనిషిగా గుర్తించారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ ఎం. సుదర్శన్, సీఐ నరేందర్, డీఐ ప్రవీణ్ కుమార్, డీఎస్ఐ మల్లికార్జున్‌తో కలిసి దొంగతనం వివరాలు వెల్లడించారు. రాజస్తాన్ నాగోర్ జిల్లా బేగాన మండలం గుండీసన్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్(31) రెండున్నరేళ్ళ క్రితం అరిహంత్ జైన్ ఇంట్లో వంట మనిషిగా కుదిరాడు. పక్కా ప్రణాళికతో ఈ ఇంట్లో వంటవాడిగా చేరిన చంద్రశేఖర్ ఇంటి యజమానుల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ డబ్బు లావాదేవీలు, ఆభరణాలు ఎక్కడెక్కడ దాచి పెడతారు తదితర వివరాలు గమనిస్తూ వచ్చి రాజస్తాన్‌కు చెందిన తన స్నేహితుడు రామకృష్ణ అలియాస్ రామకిషన్‌తో ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే రామకృష్ణకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రా ద్వారా ఇంటి వివరాలను, లొకేషన్, ఆభరణాలు ఎక్కడ దాస్తారు తదితర వివరాలు చెప్పసాగాడు. ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన జైన్ ఇంటి వాచ్మెన్ సెలవులో ఉండటంతో ఇదే అదునుగా దొంగతనానికి ప్లాన్ వేసిన చంద్రశేఖర్ రామకృష్ణను రాజస్తాన్ నుంచి పిలిపించాడు. సాయంత్రం 6.30 గంటలకు ఆ ఇంటికి చేరుకున్న రామకృష్ణ గోడ దూకి సీసీ కెమెరాల వ్యవస్థను భగ్నం చేసి అవి రికార్డు కాకుండా చూశాడు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మొదటి అంతస్తుకు వెళ్ళి కప్‌బోర్డ్‌లో ఉన్న లాకర్‌ను చంద్రశేఖర్ సాయంతో దొంగిలించి మూడో అంతస్తులో సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్న చంద్రశేఖర్ గది ముందు పెట్టి దానిపైన వేరే డబ్బాలు పెట్టి చెప్పుల స్టాండ్ అడ్డుగా పెట్టి కనిపించకుండా చేశారు. అదే రాత్రి 2.30 గంటలకు రామకృష్ణ రాజస్తాన్‌కు ఉడాయించాడు. ఈ నెల 4న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయిదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక సీసీ కెమెరాలో మాత్రమే ఓ వ్యక్తి గోడ దూకి లోనికి వెళ్ళడం అదే వ్యక్తి బయటికి రావడం మాత్రం కనిపించింది. దొంగిలించిన సొత్తు బయటికి తీసుకెళ్ళలేదని నిర్ధారణకు వచ్చిన డీఐ ప్రవీణ్ కుమార్ మరింత లోతుగా విచారణ చేపట్టి అక్కడ పని చేస్తున్న 12 మందిని విచారించారు. మూడు రోజులు విచారించినా ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ మాత్రం పోలీసుల ముందుకు వస్తూనే ఏ మాత్రం బయట పడలేదు. పోలీసులకు గాలిస్తున్న సమయంలోనే లాకర్‌ను తెరిచేందుకు తీసుకొచ్చిన గ్యాస్ కట్టర్, ఇతర సామాగ్రి చంద్రశేఖర్ గది ముందు దొరికాయి. దీంతో ఇంటి పనిమనిషుల సాయంతోనే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావించి అనువనువు గాలించగా చంద్రశేఖర్ గది ముందు లాకర్ దొరికింది. తెరిచి చూడగా అందులో నగదుతో పాటు ‘ 25 లక్షల విలువ చేసే ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. తన స్నేహితుడు రామకృష్ణ సాయంతో లాకర్‌ను దొంగిలించిన చంద్రశేఖర్ గ్యాస్ కట్టర్‌తో అది తెరుచుకోకపోవడంతో తన ఇంటి ముందు భద్రపరిచినట్లుగా చెప్పాడు. మరో పది రోజుల్లో రాజస్తాన్‌కు వెళ్ళే ప్లాన్ వేసుకున్న చంద్రశేకర్ ఆ లోపున రామకృష్ణను పిలిపించి ఇద్దరూ కలిసి ఈ లాకర్‌ను తీసుకెళ్ళాలని పథకం వేసి చివరికి పోలీసులకు చిక్కారు. చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణ పరారీలో ఉన్నాడని తెలిపారు. (చదవండి: అయ్యో.. ఏమైందో ఏమో!) -
విద్యార్థి ఆత్యహత్య కేసు: చనిపోవడానికి ముందు వేరే గదికి!
సాక్షి, అనంతపురం శ్రీకంఠంసర్కిల్: రెండు రోజుల క్రితం అనంతపురం జేఎన్టీయూలో కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య కేసు దర్యాప్తును వన్‌టౌన్ పోలీసులు ముమ్మరం చేశారు. జేఎన్టీయూ (ఏ)లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన రమణారెడ్డి, విజయ దంపతుల కుమారుడు చాణిక్య నందరెడ్డి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు వర్సిటీలోని ఎల్లోరా హాస్టల్లో చాణిక్య ఉంటున్న నంబర్ 131 గదిలోని నలుగురు విద్యార్థులతో పాటు చాణిక్య ఆత్మహత్య చేసుకునే ముందు నిద్రించిన గదిలోని అత్యంత సన్నిహితున్ని శుక్రవారం విచారణకు పిలిచారు. ఎవరితో పెద్దగా విభేదాలు లేవని, ప్రేమ వ్యవహారాలు కూడా నడవలేదని, ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకున్నాడన్న దానిపై తమకూ స్పష్టత లేదని వారు చెప్పినట్లు సమాచారం. అయితే, డిసెంబరు 31 రాత్రి నుంచి చాణిక్య మూడీగా ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందు 134 గదిలోకి.. చాణిక్య తను ఉండాల్సిన 131 నంబరు గదిలో కాకుండా 134లోకి రావడానికి కారణాన్ని కూడా పోలీసులు తెలుసుకున్నారు. తనతో పాటు ఇంటర్ నుంచి కలసి చదువుతున్న విద్యార్థి నరేంద్ర సీఈసీ తీసుకున్నాడు. తను 134 గదిలో ఉంటున్నాడు. దీంతో ఎక్కువగా చాణిక్య కూడా అతనితో గడిపేవాడు. చనిపోయే ముందు కొన్ని గంటల ముందు కూడా చాణిక్య అక్కడే పడుకున్నాడు. కాగా తను ఎప్పుడు నిద్ర లేచి వెళ్లాడో తెలియదని నరేంద్ర అంటున్నాడు. తను చనిపోయిన విషయం హాస్టల్లో విద్యార్థులకు కూడా ఆరు గంటల దాకా తెలియదంటున్నారు. ఇదిలా ఉండగా హాస్టల్ టెర్రస్ పైభాగాన చాణిక్య చెప్పులు వదిలేసి ఉండటం పోలీసులకు అనుమానాన్ని పెంచుతోంది. సెల్ఫోన్లోనూ నో క్లూ.. చాణిక్యనందరెడ్డి సెల్‌ఫోన్‌ను తనిఖీ చేసిన పోలీసులకు అందులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రేమ వ్యవహారాలుంటే అందులో ఏదో ఒక చోట సంభాషణ, లేదా పంపిన సందేశాలుండేవి. అయితే, అలాంటివి లేవంటున్నారు. గతంలో జేఎన్టీయూలో జరిగిన ర్యాగింగ్ బ్యాచ్‌ల్లో చాణిక్య ఉన్నాడా? అని కూడా ఆరా తీయగా, వాటితో ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలిసినట్లు సమాచారం. ఆర్థిక సమస్యలుండవచ్చనే కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవముండవచ్చని కూడా పోలీసులు అనుమానించారు. కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉందేమోగాని.. చాణిక్య వరకు అలాంటి ఇబ్బంది లేదు. కారణం తను దుబారా ఖర్చులు చేసేవాడు కాదట. చదువు మినహా మరో వ్యాపకం కూడా లేదని అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా తనకు వచ్చిన రూ. 60 వేల స్కాలర్ షిప్ కూడా తండ్రి ఖాతాలోకి మళ్లించాడు. లోన్‌యాప్స్, క్రెడిట్‌కార్డులు లాంటి అవకాశం కూడా లేదని పోలీసులు చెబుతున్నారు. సెల్ఫోన్లో ఎక్కడా ఆ జాడలు లేవు. కాని చాణిక్య తను చనిపోయే ముందు సెల్ఫోన్లో టైప్ చేసి ఉంచిన మైఫైల్స్ సందేశంలో మాత్రం.. వ్యక్తిగత సమస్యలతోనే చనిపోతున్నట్లు ఉంది. తన సోదరి గీతారెడ్డికి పంపిన సందేశంలోని సారాంశాన్ని పరిశీలించిన పోలీసులు కుటుంబ ఆర్థిక పరిస్థితితోనే చాణిక్య ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. (చదవండి: మేనమామతో పెళ్లి.. భర్త తీరు బాగోలేదంటూ వివాహిత షాకింగ్ ట్విస్ట్) -
నేడు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ
-
చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు
-
పోలీసుల అకౌంట్లోకి వచ్చిపడుతున్న కోట్ల డబ్బు...టెన్షన్లో అధికారులు
ఒక పోలీస్ అకౌంట్లో 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి. దీంతో అతను ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటిశ్వరుడిగా మారిపోయాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో చోటు చేసుకుంది. ఒక పోలీస్ అధికారికి తన జీతంతో పాటుగా సుమారు రూ. 10 కోట్లు అకౌంట్లో జమ అయ్యాయి. అయితే బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి చెప్పేంత వరకు తనకు ఈ విషయం తెలియలేదని సదరు పోలీసు అధికారి చెబుతున్నాడు. దీంతో అతని అకౌంట్‌ని బ్లాక్ చేసి ఈ డబ్బు ఎలా క్రెడిట్ అయ్యిందని దానిపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. అచ్చం సదరు పోలీస్‌లానే పాక్‌లోని లర్కానా ప్రాంతంలోనిమరో ముగ్గురు పోలీస్ అధికారుల అకౌంట్లోకి కూడా రూ. 5 కోట్లు చొప్పున క్రెడిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇంత మొతంలో డబ్బు ఎలా ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. (చదవండి: బ్రేక్ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్ అనేది తేలుద్దాం: బైడెన్ ఫైర్) -
ఉప్పల్ జంట హత్య కేసులు: కక్షతోనే అంతం..ఎనిమిది మంది నిందితులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: క్షుద్ర పూజలు చేసినా పోలీసు ఉద్యోగం రాలేదు. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులూ వెంటాడటంతో కక్షగట్టి ప్రాణాలు తీశాడని రాచకొండ పోలీసులు తేల్చేశారు. నగరంలో సంచలనం సృష్టించిన ఉప్పల్ జంట హత్యల కేసును ఎట్టకేలకు ఛేదించారు. ప్రధాన నిందితుడు లక్కీ వినయ్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. మంగళవారం ఆయన మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ మురళీధర్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. 1991లో బాలాపూర్‌లోని మామిడిపల్లికి చెందిన లక్కీ వినయ్ తండ్రి పర్మ యోగేందర్ రెడ్డి రాజకీయ కక్షల నేపథ్యంలో తుకారాంగేట వద్ద హత్యకు గురయ్యారు. అనంతరం లక్కీ, అతడి అన్న, సోదరితో కలిసి ఉప్పల్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఇక్కడి హనుమాన్సాయినగర్కు చెందిన పురోహితుడు నర్సింహ శర్మతో లక్కీకి పరిచయమైంది. ఈ క్రమంలో నర్సింహకు అతీత శక్తులున్నాయని, పూజలతో ఏదైనా సాధించగలడని అతడు నమ్మకం పెంచుకున్నాడు. 2016లో ఎస్ఐ పరీక్షకు లక్కీ హాజరయ్యాడు. ఆ సమయంలో నర్సింహా పూజలు చేసి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అతడి నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానంటూ కిస్మత్‌పురాకు చెందిన వాలి, రాజ్యలక్ష్మీలకు రూ.12.50 లక్షలు ఇప్పించాడు. ఈ నేపథ్యంలో పూజలు చేసినా ఎస్ఐ ఉద్యోగం రాకపోవటంతో తాను ఇచి్చన డబ్బులు తిరిగి ఇవ్వాలని నర్సింహపై లక్కీ ఒత్తిడి పెంచాడు. నర్సింహ కాలయాపన చేస్తూ తప్పించుకు తిరిగేవాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వకపోవటం, అనారోగ్యం క్షీణించడం, ఆర్థిక ఇబ్బందులకు లోనుకావటంతో.. పూజారి నర్సింహ క్షుద్ర పూజల కారణంగానే తాను దీన స్థితికి వచ్చానని లక్కీ భావించాడు. నర్సింహను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. రక్తం మరకలు.. దుస్తులను శుభ్రం చేసిన తల్లి.. జంట హత్యల అనంతరం నిందితులు లక్కీ, బాలకృష్ణలు తప్పించుకునేందుకు జల్పల్లికి చెందిన గడ్డి కార్తీక్, ఎల్బీనగర్కు చెందిన వాకిటి సుధాకర్ రెడ్డిలు రూ.35 వేలు కమీషన్ తీసుకొని రెండు ద్విచక్ర వాహనాలను సమకూర్చారు. హత్యల అనంతరం రక్తం మరకలున్న దుస్తులు, కత్తి, కొడవలిని మామిడిపల్లిలోని లక్కీ ఇంట్లో వదిలేసి పారిపోయారు. లక్కీ తల్లి సావిత్రి రక్తపు మరకలు కనిపించకుండా దుస్తులను శుభ్రం చేసింది. నర్సింహ పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలను సేకరించి 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రక్తం మరకులున్న దుస్తులు, కత్తి, కొడవలి, రెండు బైక్‌లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్లో నక్కి.. రెక్కీ లక్కీ తన స్నేహితుడైన చంపాపేటకు చెందిన యెళ్ల బాలకృష్ణను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. ఇద్దరూ కలిసి పథకం పన్నారు. నర్సింహ కదలికలను పసిగట్టేందుకు ఆయన ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్ గదిని అద్దెకు తీసుకున్న మామిడిపల్లికి చెందిన లాల్ జగదీష్ గౌడ్, కార్వాన్కు చెందిన గన్వయ రామ్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన గైక్వాడ్ శ్యాం సుందర్‌లు రెక్కీ చేసి సమాచారాన్ని లక్కీకి చేరవేసేవారు. సరైన సమయం కోసం వేచి ఉన్న లక్కీ, బాలకృష్ణలు శుక్రవారం తెల్లవారుజామున కొడవలి, కత్తులతో నర్సింహ ఇంట్లోకి ప్రవేశించి అతడిని హత్య చేశారు. తిరిగి వెళ్లిపోతుండగా నర్సింహ చిన్న కుమారుడు శ్రీనివాస్ అడ్డుకోవటానికి ప్రయతి్నంచగా.. అతడినీ బాలకృష్ణ కత్తితో పొడిచి చంపేశాడు. (చదవండి: 'నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. జీవితాన్ని చాలిస్తున్నా') -
తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు.. తీరా దొంగ ఎవరంటే?...
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటరు కదా. మన మధ్య, మనతోనే ఉంటూ మోసం చేస్తే ఈ సామెత వాడుతుంటాం ఔనా! అచ్చం అలాంటి సంఘటన ఒక వ్యాపారవేత్తకి ఎదురైంది. అసలేం జరిగిందంటే...ముంబైకి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్‌కాదర్ షబ్బీర్ ఘోఘవాలా ఇంట్లో బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయం అవ్వడం జరిగింది. దీన్ని సదరు వ్యాపారవేత్త గుర్తించాడు కూడా. ఇలా కొద్ది నెలలోనే చాలా నగలు పోయాయి. కానీ అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. ఇంట్లో వస్తువులు ఏదో మంత్రం వేసినట్లు మాయవుతున్నాయని అనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పెద్దమొత్తంలో నగదు చోరికి గురైంది. దీంతో ఇక చేసేదేమి లేక వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాపారవేత్త ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదుకి సంబంధించి దాదాపు 40 లక్షలకు పైనే దొంగతనం జరిగింది. పోలీసులు వెంటనే ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం జరిగాలంటే వ్యాపారవేత్తకు తెలిసిన వ్యక్తి చేసి ఉండాలి లేదా ఇంట్లో ఉండే వ్యక్తే అయ్యి ఉండాలన్న అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. తీరా విచారణ చేస్తే అసలు దొంగ ఆ వ్యాపారవేత్త 12 ఏళ్ల మేనకోడలే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ తిన్నాడు. పోలీసుల విచారణలో సదరు వ్యాపారవేత్త మేనకోడలు గుజరాత్‌లోని సూరత్‌లో ఉండే తన బంధువుని తన మావయ్య ఇంట్లో దొంగతనం చేయమని చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు బంధువుని అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 40 లక్షలు వరకు రికవర్ చేశారు. ఐతే సదరు వ్యాపారవేత్త మేనకోడలుపై ఎలాంటి చర్య తీసుకోలేదని, ఈ దొంగతనంలో ఆమె పాత్ర ఎంత వరుకు ఉందో నిర్థారించిన తర్వాత జువైనల్ జస్టీస్ బోర్డుకు వివరణాత్మక నివేదికను పంపుతామని పోలీసులు తెలిపారు. (చదవండి: దగ్గు సిరప్కి కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి...ఉత్పత్తికి చెక్!) -
వింత ఘటన: బతికి ఉండగానే మార్చురీకి... కంగుతిన్న వైద్యులు
ఒక వ్యక్తిని బతికి ఉండగానే మార్చురీకి పంపించింది ఓ ఆస్పత్రి. చనిపోయింది ఒకరోజు అయితే మరో రోజు చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది. దీంతో ఆస్సత్రి వర్గాలు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....55 ఏళ్ల ఆస్ట్రేలియన్ వ్యక్తి రీడ్ని యూకేలో పెర్త్‌లోని రాకింగ్హామ్ ఆస్పత్రి చనిపోయాడని నిర్ధారించి మార్చురీకి తరలించింది. ఐతే సదరు వ్యక్తి మృతదేహాన్ని తరలించడానికి ముందు కుటుంబ సభ్యులుకు సమాచారం కూడా అందించింది. ఐతే ధృవీకరణ పత్రం వెంటనే జారీ చేయలేదు. వాస్తవానికి రీడ్ అనే వ్యక్తిని మార్చురుకి సజీవంగా ఉండగానే తరలించారు. ఈ విషయం మార్చురీలో వైద్యులు శవపరీక్ష జరుపుతుండగా బయటపడింది. ఈ మేరకు వైద్యుడు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఆ మృతదేహాన్ని చూసి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ మృతదేహం ఉన్న స్థితి చాలా సేపటి క్రితం చనిపోయిన వ్యక్తిలా లేదు కొద్ది నిమిషాల ముందు చనిపోయినట్లు అనిపించింది. పైగా సదరు వ్యక్తి మృతదేహాన్ని ప్యాక్ చేసిన కవర్ విప్పి ఉందని, కవర్‌పై రక్తం పడి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు వైద్యుడు. బహుశా ఆ వ్యక్తి బతికే ఉండవచ్చని ఆ కవర్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి ఉండవచ్చని అన్నారు. అందువల్లే కవర్ని ఓపెన్ చేసి ఉందని దానిపై రక్తపు మరకలు ఉన్నాయని అన్నారు. పైగా ఆ రక్తం బతికి ఉన్న వ్యక్తి శరీరంలోని రక్తం మాదిరిగా ఉందని అన్నారు. తాము పోస్ట్‌మార్టం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయి చాలాసేపు కాలేదని, కొద్ది నిమిషాల వ్యవధిలోనే మరణించినట్లు వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో తెలిపారు. అదీగాక అతను సెప్టెంబర్ 5న చనిపోతే...6న చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది రాకింగ్హామ్ ఆస్పత్రి. దీంతో ఈ ఘటనపై యూకే కరోనరీ కోర్టు దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఆస్పత్రి వర్గాలు ఈ ఘటనను కప్పి పుచ్చుకునేందుకు యత్నించాయి కూడా. అంతేగాదు మరణధృవీకరణ పత్రాన్ని వెనక్కి తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు కోర్టుని అభ్యర్థించాయి కూడా. దీంతో కరోనరి కోర్టు సదరు వ్యక్తి మరణం అసహజంగా ఉందని పోస్ట్‌మార్టం నివేదిక ఆస్పత్రి వర్గాలు చెబుతున్న దానికి భిన్నంగా ఉందంటూ దర్యాప్తు ప్రారంభించటమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యుల తీసుకుంటామని స్పష్టం చేసింది. (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
యూఎస్‌లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్
కాలిఫోర్నియా: ఎనిమిది నెలల చిన్నారితో సహా భారత సంతతి కుటుంబం కిడ్నాప్‌కి గురయ్యింది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సోమవారం 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్ వారి ఎనిమిదేళ్ల పాప అరూహి ధేరి తోపాటు 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్ కిడ్నాప్ అయినట్లు మెర్సిడ్ కౌంటీ షెరీఫ్స్ కార్యాలయ(పోలీస్ కార్యాలయం) పేర్కొంది. అలాగే నిందితుడు ఆయుధాలు కలిగి ఉన్నాడని చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పారు. అంతేగాదు పోలీసులు ప్రజలను అనుమానితుడు లేదా బాధితులు గానీ కనిపిస్తే వారి వద్దకు వెళ్లవద్దని తమకు సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గతంలో ఇలానే 2019లో యూఎస్‌లోని కాలిఫోర్నియాలో భారత సంతతి టెక్కీ, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని తుషార్ అత్రే తన ఇంటి నుంచి కిడ్నాప్ అయినా కొద్ది నిమిషాల్లోనే తన గర్లఫ్రెండ్ కార్లో శవమై కనిపించాడు. (చదవండి: ఇంట్లోనే ఐపీఎస్ అధికారి దారుణ హత్య.. పనిమనిషి పరార్) -
శాస్త్రీయ పద్ధతులతో సమగ్ర దర్యాప్తు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కీలకమైన కేసులకు సంబంధించి శాస్త్రీయమైన పద్ధతుల్లో దర్యాప్తును సమగ్రంగా చేపట్టాలని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు. శనివారం గుంతకల్లు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష నిర్వహించారు. నమోదైన కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తు దశ, చార్జిషీటు దాఖలు వరకు పురోగతిపై ఆరా తీశారు. పోలీస్స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించి నిర్ణిత గడువులోపు పెండింగ్ కేసులకు పరిష్కారం చూపాలన్నారు. నిందితుల అరెస్టు, చార్జ్ షీట్లు దాఖలు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల ఛేదింపు, నేర నియంత్రణకు దోహదం చేసే నైపుణ్యాలను వివరించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలతో ప్రవేశపెట్టి శిక్ష పడే విధంగా చేయాలన్నారు. హత్య కేసులు, మహిళలపై నేరాలు, చిన్నారుల అదృశ్యం తదితర కేసుల్లో అలసత్వం చూపకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. చోరీ కేసుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని, సొత్తు రికవరీపై దృష్టి సారించాలని సూచించారు. అనధికార ఆన్లైన్ లోన్ యాప్‌ల మోసాలు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించి వారు కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు అమర్చుకునేలా చూడాలన్నారు. రహదారులపై ప్రమాదాలు, నేరాల నియంత్రణకు హైవే మొబైల్ టీంతో నిరంతర గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. గుట్కా, మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు. సమావేశంలో గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. (చదవండి: జగనన్న కాలనీలో మహిళలకు ఉపాధి) -
గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం
పనాజీ: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ పగ్గాలు చేపట్టిన వెంటనే భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని హోం సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్ హోం సెక్రటరీ బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండజ్కి గోవాలోని అస్సాగోలో సుమారు 13, 900 చ.కిమీ పూర్వీకులు ఆస్తి ఉంది. ఆ ఆస్తి కబ్జాకి గురయ్యిందని బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండెజ్ ఫిర్యాదు చేసినట్లు గోవా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సిట్) అధికారి నిధి వాసన్ తెలిపారు. ఫెర్నాండజ్ ఫిర్యాదు ఆధారంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ఫెర్నాండెజ్‌కు అతని కుటుంబసభ్యులకు చెందిన అస్సగావో గ్రామంలో సర్వే నెంబర్ 253/3, 252/3లో ఉన్న ఆస్తులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇన్వెంటరీ ప్రోసీడింగ్లను దాఖలు చేశారని ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయా వ్యక్తుల ఈ ఏడాది జులై 27న ఆ ప్రోసీడింగ్లను దాఖలు చేసినట్లు ఆగస్టులో తనకు తెలిసిందని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా ఫెర్నాండజ్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ గోవా ఎన్నారై కమిషనరేట్లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గోవా ఎన్నారై కమీషనర్ నరేంద్ర సవైకర్ మాట్లాడుతూ... తమ శాఖకు గతవారమే ఈమెయిల్ వచ్చిందని, దీన్ని రాష్ట్ర హోం శాఖకు పంపించామని తెలిపారు. ఈ మేరకు గోవా ప్రభుత్వం ఇలాంటి భూ కబ్జా కేసులను నివారించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో పోలీస్, రెవెన్యూ, ఆర్కెవ్స్, పురావస్తు శాఖ అధికారులతో కూడిన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ రాష్ట్రంలో ఇలాంటి భూ కబ్జా కేసులకు సంబంధించి సుమారు 100కు పైగా కేసులను దర్యాప్తు చేస్తోంది. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 7 కోట్లు స్వాధీనం) -
యాకూబ్ మెమన్ సమాధి వివాదం... విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర సీఎం
ముంబై: ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ సమాధికి సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఒక నిందితుడి సమాధిని సుందరీకరించడంపై పెనువివాదం చెలరేగింది. ఈ విషయమై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముంబై పోలీసులను విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ విషయంపై సత్వరమే విచారణ చేసి నివేదికను కూడా సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మాట్లాడుతూ...పాక్ ఆదేశానుసారం ఉగ్రవాది యాకూబ్ మెమన్ 1993లో ముంబైలో పేలుళ్లును అమలు చేశాడు. అలాంటి వ్యక్తి సమాధిని ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే మజార్‌గా మార్చారని ఆరోపణలు చేశారు. ఇదేనా ఆయనకు ముంబైపై ఉన్న ప్రేమ, దేశభక్తి అని ప్రశ్నించారు. దీనికి థాక్రే క్షమాపణలు చెప్పలంటూ డిమాండ్ చేశారు. అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా క్షమాపణ చెప్పాలని కోరారు. వాస్తవానికి మార్చి12, 1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. సుమారు 257 మంది మరణించగా దాదాపు 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో సుమారు రూ. 27 కోట్ల విలువైన ఆస్తి ధ్వంసమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి అప్పగించింది. ఈ కేసులో యాకుబ్ మెమన్‌కి ఉరిశిక్ష పడింది కూడా. (చదవండి: అమిత్ షాపై ట్రోల్స్... 'ఇండియా బిగ్గెస్ట్ పప్పు' అంటూ...) -
షాకింగ్ ఘటన: ఏం కష్టం వచ్చిందో ఏమో! ఇద్దరు చిన్నారులతో సహ కుటుంబం మృతి
హర్యానా: ఏం జరిగిందో ఏమో హర్యానాలో ఒక కుంటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన హర్యానాలోని అంబాలాలో చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు సంగత్ రామ్(65), అతని భార్య మహింద్రా కౌర్, సుఖ్వీందర్ సింగ్(34), అతని భార్య రీనా, వారి ఇద్దరు కూతుళ్లు ఆషు, జస్సీలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలేమిటో తెలుసుకునేందుకు క్రైం టీంని పిలిపించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ మృతుల వద్ద నుంచి సూసైడ్ నోట్ లభించిందని పేర్కొన్నారు. ఇదే విధంగా ఈ నెల ప్రారంభంలో జమ్ములోని సిధ్రలో ఒక కుటుంబం చనిపోయిందని తెలిపారు. (చదవండి: నిందితుడిని అరెస్టు చేయబోతుండగా... పోలీసులపై దాడి యూనిఫాం చింపి....) -
బహ్మరెడ్డి... ఓ ‘సర్కార్’!
సాక్షి, హైదరాబాద్: విజయ్ కథానాయకుడిగా వచ్చిన సర్కార్ సినిమా గుర్తుందా..? అందులో ఎన్నారై, బడా వ్యాపారవేత్త అయిన కథానాయకుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తాడు. అప్పటికే ఆ ఓటు ఎవరో వేసేశారని తెలుసుకుని న్యాయపోరాటం చేస్తాడు. దాదాపు ఇలాంటి ఉదంతమే నగరంలో చోటు చేసుకుంది. సినిమాలో ఓటు అంశం సాధారణ ఎన్నికలకు సంబంధించినదైతే... ఇక్కడ మాత్రం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ గవర్నింగ్ కౌన్సిల్ది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం... ఖైరతాబాద్‌లోని ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) తెలంగాణ స్టేట్ సెంటర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న బి.బ్రహ్మరెడ్డి న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్‌కు (ఐఈటీఈ) కార్పొరేట్ మెంబర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈయనకు ఓటుహక్కు ఉంది. దీనికి సంబంధించిన ఎన్నికలు ఈ ఏడాది జూన్‌లో జరిగాయి. ఆ నెల 30వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు ఆన్లైన్లో ఓటు వేసుకునేందుకు అర్హులకు అవకాశం ఇచ్చారు. ఈ ఆన్లైన్ ఓటింగ్ కోసం అర్హులైన ఐఈటీఈ ఓటర్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేదా ఫోన్‌కు వచ్చే ఓటీపీ సహాయంతో అధికారిక వెబ్‌సైట్‌లోని ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఆపై అక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఐఈటీఈ ఓటర్లు అంతా ఇలానే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్రహ్మారెడ్డి జూన్ 30 మధ్యాహ్నం 2.10 గంటలకు ఓటు వేయడం కోసం అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు. అయితే అప్పటికే ఈ ఓటు వేరే వాళ్లు వేసినట్లు అందులో కనిపించింది. తన ఈ–మెయిల్ ఐడీ, యూజర్ ఐడీ తదతరాలను హ్యాక్ చేసిన దుండగులు ఇలా చేశారని ఆయన అనుమానించారు. దీంతో ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ ఓటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిందిగా కోరుతూ ఐఈటీఈకి లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన వాళ్లు గెలిచారని, తన ఓటు కూడా ఆ రాష్ట్రంలోని అమరావతి నుంచే వేసినట్లు తెలుస్తోందని బ్రహ్మరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. (చదవండి: వచ్చేస్తున్నాయ్ వందేభారత్ రైళ్లు) -
డబ్బుల వివాదంతోనే హత్య
కొండాపూర్(సంగారెడ్డి): అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ట్రాన్స్ జెండర్ హత్య కేసును పోలీసులు ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవీంద్రా రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్కు చెందిన దీపిక అంబర్‌పేటకు చెందిన సాయిహర్ష మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీపిక బోనాల పండగ సమయంలో సంపాదించిన డబ్బుతో వారు జీవనం సాగించేవారు. దీపిక ఆర్థిక లావాదేవీలు సాయిహర్ష చూసుకునేవాడు. దీపిక గతంలో సాయిహర్ష నుంచి రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరడంతో దీపిక అతడికి దూరంగా ఉండటం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సాయిహర్ష ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 21న దీపిక మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కొండాపూర్ మండలం మారేపల్లిలో బోనాల జాతరకు హాజరైంది. దీనిపై సమాచారం అందడంతో సాయిహర్ష కూడా మారేపల్లికి వెళ్లాడు. బోనాల జాతర ముగిసిన అనంతరం మద్యం తాగి, భోజనం చేశారు. అనంతరం అందరు కలిసి తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. దీపికకు ఎక్కువగా మద్యం తాగించిన సాయి హర్ష కారులోనే ఆమె ప్రైవేట్ భాగాలపై పిడిగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో నిందితుడు ఆమెను లింగంపల్లిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో సాయిహర్ష దీపిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి దీపిక చనిపోయిందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. దీపిక సోదరుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొండాపూర్ పోలీసులు సాయిహర్షను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి దీపిక పట్టా గొలుసులు, బోనం, మేకప్ కిట్, కారును స్వాదీనం చేసుకున్నారు. సాయిహర్షపై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దీపికతో పాటు ఇంటి నుంచి వచ్చిన మరో స్నేహితుడి శివ ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు. సాయిహర్ష ఒక్కడే హత్య చేశాడనే నిర్ధారణకు వచ్చినప్పటికీ శివపాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీఐ సంతో‹Ùకుమార్, ఎస్ఐ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మూసీ ముంచేసి..) -
దడ పుట్టిస్తున్న ధార్ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో మంగళవారం జరిగిన భారీ చోరీ మధ్యప్రదేశ్‌లోని ధార్ ముఠా పనిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఒకేసారి నాలుగైదు ఇళ్లలో చోరీలకు పాల్పడటం ఈ గ్యాంగ్ స్టయిల్. దూలపల్లి హైటెన్షన్ లైన్‌లోని మహాలక్ష్మి ఎన్క్లేవ్ అగ్రి నివాస్‌లో అశోక్ రామ ఇంటితో పాటు అదే అపార్ట్మెంట్లోని 108, 203, 202 ఫ్లాట్లలోనూ దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్లూ ఆధారంగానే ఈ చోరీ ధార్ గ్యాంగ్ పనేనని పోలీసులు నిర్ధారించారు. తెలంగాణలో 2018 నుంచి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాపై 98 కేసులుండగా.. వీటిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 68 ఉండటం గమనార్హం. నెల రోజుల క్రితం ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మాన్‌సింగ్‌తో పాటు మొహబత్, రీమ్ సింగ్, కిషన్‌సింగ్‌లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల గుర్తింపు.. అగ్రి నివాస్ అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవటంతో.. ఆ రహదారిలోని సీసీటీవీ ఫుటేజీలను పేట్ బషీరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లే దారిలోని రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. చోరీ జరిగిన ఇంట్లోని వేలిముద్రలు, ఇతరత్రా సాంకేతిక ఆధారాల మేరకు నలుగురు నిందితులు చోరీకి పాల్పడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. చోరీ సొత్తుతో నిందితులు రాష్ట్రం దాటకుండా ముమ్మర గాలింపు చేస్తున్నామన్నారు. ఐటీ, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), లా అండ్ ఆర్డర్ పోలీసులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. (చదవండి: ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి) -
రాజధానిలో మధ్యప్రదేశ్ పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ భారీ చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న అక్కడి పోలీసులు నగరంలో దాడి చేశారు. ఆ నేరానికి బాధ్యులైన ఇద్దరు దొంగలను పట్టుకుని తీసుకెళ్లారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ చోరుల విషయం తెలుసుకున్న ఇక్కడి పోలీసులు స్థానికంగా ఏమైనా నేరాలు చేశారా? అనేది ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కమలనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్ బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడే చిన్న చిన్న యంత్రాలు విక్రయించే వ్యాపారం చేశారు. కోవిడ్ నేపథ్యంలో అమలైన లాక్డౌన్ ఫలితంగా వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో మూసేసి తమ స్వస్థలానికి వచ్చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరికి హైదరాబాద్‌కు చెందిన వసీమ్‌తో ఇండోర్‌లో పరిచయం ఏర్పడింది. వీరి పరిస్థితిని గమనించిన వసీమ్ తాను చెప్పినట్లు చోరీలు చేస్తే తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని, అప్పులు తీర్చడమే కాకుండా జల్సాగా బతకవచ్చని చెప్పాడు. అందుకు వీరు అంగీకరించడంతో పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్ ద్వారా పట్టుకుంటారనే విషయం వారికి చెప్పిన వసీమ్ టార్గెట్ చేసిన ప్రాంతానికి కనీసం పది కిలోమీటర్ల దూరంలోనే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాలని సలహా ఇచ్చాడు. ఆపై సంప్రదింపులు జరపడానికంటూ ఆన్లైన్లో చైనా నుంచి అత్యాధునిక వాకీటాకీలు ఖరీదు చేయించాడు. చోరీ చేయాల్సిన ప్రాంతానికి చేరుకోవడానికి ముందే ఈ గ్యాంగ్ కొన్ని కార్లను ఎంపిక చేసుకుని వాటి ఫొటోలు, వివరాలు తెలుసుకునేది. వీటి ఆధారంగా ఆ కార్లకు సంబంధించి ఫాస్ట్‌ట్యాగ్స్ సమీకరించుకునేది. ఆపై అదే మోడల్ కారును అద్దెకు తీసుకుని తాము టార్గెట్ చేసిన ప్రాంతానికి చేరుకుని చోరీ చేసేది. వసీమ్ మాత్రం నేరుగా నేరంలో పాల్గొనకుండా వీరికి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన మొత్తాన్ని అంతా సమానంగా పంచుకునే వారు. ఈ పంథాలో మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్‌లు భోపాల్‌లోని కమలనగర్, ఇండోర్‌లోని సాయి సంపద ఏరియాలతో కొన్ని నేరాలు చేశారు. గత నెల్లో ఇండోర్‌లోని ఎంఐజీ ప్రాంతంలో నివసించే వ్యాపారి స్వస్తిక్ అగర్వాల్ ఇంట్లో రూ.50 లక్షల సొత్తు తస్కరించారు. వసీమ్ సలహా మేరకు నగరానికి వచ్చేసిన మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్ షేక్‌పేట్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. వసీమ్ సూచనలతో ఇక్కడా కొన్ని నేరాలు చేసినట్లు తెలుస్తోంది. వీరి కోసం గాలింపు చేపట్టిన ఇండోర్‌లోని ఎంఐజీ పోలీసులు వారి భార్యల కదలికలపై నిఘా ఉంచారు. ఇటీవల వీరు తమ భార్యల్ని షేక్‌పేటకు పిలిపించుకున్నారు. అలా వీరి ఆచూకీ కనిపెట్టిన ఎంఐజీ పోలీసులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. పరారీలో ఉన్న వసీమ్ కోసం గాలిస్తున్నారు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న ఇక్కడి అధికారులు స్థానికంగా చేసిన నేరాలపై ఆరా తీస్తున్నారు. (చదవండి: ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టి ముగ్గురు మృతి.. ఆత్మహత్యలా? ప్రమాదమా?) -
కేవలం రూ.160 కోసమే గొంతు కోసి చంపి...
నాంపల్లి: లక్డీకాపూల్ టెలిఫోన్ భవన్ సమీపంలోని బస్టాప్ వద్ద ఈ నెల 24న జరిగిన హత్య కేసును సైఫాబాద్ పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మధ్య మండలం డీసీపీ రాజేష్ చంద్ర, అడిషనల్ డీసీపీ రమణారెడ్డి, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి మంగళవారం వివరాలు వెల్లడించారు. జహీరాబాద్, రామ్‌నగర్‌కు చెందిన బోయిన మహేష్ కర్ణాటక రాష్ట్రం, కలబుర్గి జిల్లా, డంజార్గావ్కు చెందిన జె.అనిల్‌కుమార్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అడ్డా కూలీలుగా పని చేస్తూ ఫుట్‌పాత్‌లపై నివాసం ఉండేవారు. ఈ క్రమంలో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వ్యక్తులను బెదిరించి డబ్బులు లాక్కుని జల్సా చేసేవారు. ఈ నెల 24న లక్డీకాపూల్ బస్టాపు వద్ద నిద్రిస్తున్న ఓ యాచకుడిని టార్గెట్ చేసుకున్న వారు కత్తితో అతడి గొంతు కోసి జేబులో ఉన్న రూ.160 నగదును తీసుకుని పారిపోయారు. రక్తం మడుగులో ఓ వ్యక్తి కొట్టుమిట్టాడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందడంతో సైఫాబాదు పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం అతను మృతి చెందాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించిన పోలీసులు బోయిన మహేష్, జె.అనిల్ కుమార్‌లను నిందితులుగా గుర్తించారు. నాంపల్లి, బజార్‌ఘాట్‌లోని కాలభైరవ దేవాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు నేరం అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని డీసీపీ తెలిపారు. కేసును చేధించిన ఇన్స్పెక్టర్ సత్తయ్య, ఎస్సై మాధవి, కానిస్టేబుళ్లు అజీముద్దీన్, అహ్మద్ షా ఖాద్రీలను డీసీపీ అభినందించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లకు నగదు రివార్డులను అందజేశారు. (చదవండి: ఫామ్ హౌస్‌లో గుట్టుగా సెక్స్ రాకెట్.. బీజేపీ నేత అరెస్టు) -
‘హష్’ రవాణాతో సిటీకి లింకులు!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులకు ఇటీవల చిక్కిన హష్ ఆయిల్ అక్రమ రవాణా గ్యాంగ్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ముఠా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బెంగళూరుతో పాటు హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ముంబైలకు సరఫరా చేస్తోందని గుర్తించారు. అయితే ఈ అక్రమ రవాణా మొత్తం నెల్లూరు కేంద్రంగా సాగుతున్నట్లు వెలుగులోకి రావడంతో కంగుతిన్నారు. ఈ గ్యాంగ్ అరెస్టుపై ఇక్కడి అధికారులకు సమాచారం ఇచి్చన సీసీబీ నెల్లూరు కోణంపై దృష్టి పెట్టాల్సిందిగా కోరింది. బెంగళూరులోని వివిధ పబ్బుల్లో పని చేసే డిస్కో జాకీలకు (డీజే) పెద్ద ఎత్తున గంజాయి, హష్ ఆయిల్ సరఫరా అవుతున్నాయి. వీళ్లే తమ పబ్స్‌కు వచ్చే కస్టమర్లకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అక్కడి సీసీబీ అధికారులకు గత నెల్లో సమాచారం అందింది. దీంతో వరుసపెట్టి దాడులు చేసిన అధికారులు కొందరు డీజేలను అరెస్టు చేశారు. వీరికి ఈ మాదకద్రవాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే అంశంపై సీసీబీ దృష్టి పెట్టింది. తమ దర్యాప్తును కొనసాగించిన నేపథ్యంలో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముఠా అరకు లోయ నుంచి తీసుకువచ్చి అందిస్తున్నట్లు గుర్తించింది. దీంతో నిఘా కొనసాగించిన సీసీబీ పోలీసులు గత వారం నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లోకి ఎక్కని, తొలిసారిగా పోలీసులకు చిక్కిన ఈ గ్యాంగ్‌లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అరకు ప్రాంతానికి చెందిన వీరిని శ్రీనివాస్, ప్రహ్లాద్, సత్యవతి, మల్లీశ్వరిగా వీరిని గుర్తించారు. ఈ నలుగురినీ కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సీసీబీ లోతుగా విచారించింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోణం వెలుగులోకి వచి్చంది. ఈ ముఠా ఏజెన్సీ ప్రాంతానికి చెందినదే. గంజాయి పండేది, హష్ ఆయిల్ ఉత్పత్తి అవుతున్నది సైతం ఆ ఏరియాలోనే. అయితే తమకు మాత్రం ఈ మాదకద్రవ్యాలను నెల్లూరులో ఓ వ్యక్తి అందించారంటూ ఈ నలుగురూ బయటపెట్టారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రేగా అనే వ్యక్తి ఆదేశాల మేరకు తాము అక్కడకు వెళ్లామని సీసీబీ విచారణలో చెప్పారు. నెల్లూరులో ఓ వ్యక్తి గతంలోనూ తమకు గంజాయి, హష్ ఆయిల్ ఇచ్చాడని, వాటిని హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాలకు తీసుకువెళ్లి డెలివరీ చేసి వచ్చాయని అంగీకరించారు. డెలివరీ ఎవరికి ఇవ్వాలనేది ముందుగా చెప్పరని ఆయా ప్రాంతాలకు చేరుకున్న తర్వాతే వాట్సాప్ కాల్ ద్వారా తమకు సమాచారం ఇస్తారని ఈ నలుగురూ సీసీబీ విచారణలో వెల్లడించారు. ఈ ముఠాకు హైదరాబాద్‌లోనూ పెడ్లర్లు ఉన్నారని తెలియడంతో సీసీబీ పోలీసులు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. నలుగురి వివరాలు, ఫోన్ నెంబర్లు అందించి స్థానిక లింకులపై ఆరా తీయాల్సిందిగా కోరారు. ఈ ముఠాకు, నెల్లూరులోని సరఫరాదారుడికి ఉన్న సంబంధాన్నీ తెలుసుకున ప్రయత్నాలు చేయాలని కోరారు. దీంతో ఇక్కడి అధికారులు ఆ కోణంలో ఆరా తీయడం మొదలెట్టారు. (చదవండి: డిస్క్ంకు ఉరితాళ్లు!) -
‘ఆన్లైన్ ఆకతాయిల’ ఆటకట్టు
సాక్షి, హైదరాబాద్: ఆఫ్‌లైన్, ఆన్లైన్..ఎక్కడపడితే అక్కడ మహిళలు వేధింపులకు గురవుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రదేశాలలో మఫ్టీలో పోలీసులు గస్తీ కాస్తూ పోకిరీలను పట్టుకుంటున్న పోలీసులు ఆన్లైన్ ఆకతాయిలను కూడా అదే రీతిలో ఆటకట్టిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి అన్ని సామాజిక మాధ్యమాలలో మారు పేర్లతో ఖాతాలను తెరిచి..24/7 గస్తీ కాస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి మహిళలు, పిల్లలను వేధిస్తున్న పోకిరీలకు అరదండాలు వేస్తున్నారు. ఇప్పటివరకు సైబరాబాద్ వర్చువల్ షీ టీమ్స్ 65 మంది పోకిరీలపై కేసులు నమోదు చేశాయి. నిందితులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాయి. ఎక్కువగా ఇన్‌స్ట్రాగామ్‌లో మహిళలను వేధిస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. 80 శాతం ఆన్లైన్ వేధింపులే.. గతంలో మహిళలపై వేధింపులలో 80 శాతం ఆఫ్‌లైన్‌లో, 20 శాతం ఆన్లైన్లో ఉండేవి. కానీ, ఇప్పుడవి రివర్స్ అయ్యాయి. ఆన్లైన్లో వేధింపులు 80 శాతానికి చేరాయి. సోషల్ మీడియాలో ఎవరూ పట్టుకుంటారులే అనే ధీమాతో పోకిరీలు కూడా డిజిటల్లోకి మారి.. ఆన్లైన్ వేదికగా మహిళలు, పిల్లలను వేధిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆఫ్‌లైన్‌లో 11, ఆన్లైన్లో 12 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఒక్కో టీమ్‌లో ఇద్దరేసి పోలీసులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఆయా అధికారులు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూప్స్, డేటింగ్ యాప్‌లపై 24/7 గంటలు నిఘా పెడుతుంటారు. నింతరం సామాజిక మాధ్యమాలలో ఖాతాలను నిర్వహిస్తూ.. మహిళలు, అమ్మాయిలు, పిల్లలను టార్గెట్ చేసుకొని పోస్ట్‌లు, కామెంట్లు, ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసే ఆకతాయిల భరతం పడుతుంటారు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త చేసిన పనికి..) -
డోలో కంపెనీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...ఆ వైద్యులకు ఝలక్
సాక్షి,ముంబై: కోవిడ్ సంక్షోభంలో కోట్ల రూపాయలు దండుకున్న డోలో-650 మేకర్ మైక్రోల్యాబ్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డోలో-650 తయారీదారుల ‘అనైతిక పద్ధతులను’ పరిశోధించడానికి ప్రభుత్వం సెపరేట్ అండ్ స్పెషల్ ప్యానెల్‌ను రూపొందించాలని ఫార్మస్యూటికల్ విభాగాన్ని ఆదేశించింది. ఈ ప్యానెల్ నివేదికను జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఫార్మా మార్కెటింగ్ పద్ధతులపై కోడ్ రూపొందించి ఎథిక్స్ కమిటీకి అందించాలని కోరింది. ఈ విభాగం రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. అంతేకాదు మైక్రోల్యాబ్స్ ద్వారా ప్రయోజనాలు పొందిన వైద్యుల వివరాలను సేకరించి వారికి షోకాజ్ నోటీసు లివ్వాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. కంపెనీ ప్రాంగణంలో దాడులు చేసి పేర్లు బయటపడ్డ వైద్యులకు షోకాజ్ నోటీసులు పంపాలని మంత్రిత్వ శాఖ కార్యాలయం అధికారులను ఆదేశించిందని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఫార్మా స్యూటికల్ సంస్థల అనైతిక చర్యల గురించి తెలుసుకోవాలని కోరింది. ఇప్పటివరకు, మధుమేహం, కార్డియో, మానసిక చికిత్స అనే మూడు విభాగాల ఫార్మా కంపెనీలు డబ్బును పెట్టుబడి పెట్టేవి, వైద్యులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించేవని తెలుసంటూ మరో అధికారి వ్యాఖ్యానించారు. కాగా బెంగళూరుకు చెందిన డోలో-650 తయారీదారు మైక్రోల్యాబ్స్ అనైతిక విధానాలకు పాల్పడుతోందనీ, తమ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వైద్యులు, వైద్య నిపుణులకు సుమారు రూ.1,000 కోట్ల ఉచితాలను ఇచ్చిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) బుధవారం ఆరోపించింది. ఆసుపత్రి పరికరాలు, బంగారు ఆభరణాలు, విదేశీ పర్యటనలు, ఇతరత్రా ఉచితాలతో వారిని ఆకర్షించినట్టు సీబీడీటీ పేర్కొంది. అధికారి వెబ్సైట్ ప్రకారం మైక్రోల్యాబ్స్ విక్రయాల పరంగా 19వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా లక్షా, 50 వేలకు పైగా వైద్యుల ద్వారా తమ ఉత్పత్తులపై ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తాజా పరిణామాలపై మైక్రో ల్యాబ్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
గ్యాంగ్ రేప్ నిందితులకు డీఎన్ఏ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడు, చట్టంతో విభేదించిన బాలురకు కచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వీరికి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ (టీఐపీ) పూర్తి చేసిన అధికారులు నిందితులకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానాలు అనుమతి మంజూరు చేయడంతో తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అవసరమైన పక్షంలో బాధితురాలి నుంచీ నమూనాలు సేకరించాలని యోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసులో సాదుద్దీన్, మరో ఐదుగురు చట్టంతో విభేదించిన బాలురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు సైతం పట్టుబడి జువైనల్ హోమ్‌కు చేరాడు. అయితే ఇతడు కేవలం బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడానికి సంబంధించి మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సాదుద్దీన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు సహా ఐదుగురు మాత్రం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాన్సూ బేకరీ నుంచి బాలికను ఇన్నోవా కారులో పెద్దమ్మ గుడి సమీప ప్రాంతాలకు తీసుకువెళ్లిన ఈ ఐదుగురూ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో వెంట్రుకలు, వినియోగించిన టిష్యూ పేపర్లతో సహా అనేక ఆధారాలు సేకరించారు. బాలిక పోలీసులకు, న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలోనూ తనపై ఆ కారులోనే అఘాయిత్యం జరిగినట్లు బయటపెట్టింది. దీంతో ఇన్నోవా కారులో లభించిన ఆధారాలు క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇప్పుడు సాదుద్దీన్ సహా ఐదుగురి నుంచి సేకరించిన నమూనాలకూ పంపనున్నారు. ఈ రెండింటినీ సరిపోల్చే నిపుణులు ఆ రోజు కారులో ఉన్నది, బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది వీరేనంటూ సాంకేతికంగా నిర్థారించనున్నారు. పోలీసులు దాఖలు చేసే అభియోగపత్రాల్లోనూ ఈ అంశాన్ని పొందుపరుస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి ఇది కీలకం కానుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కోర్టుల్లో బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలంటూ పోలీసులు కోర్టును కోరుతున్నారు. కాగా బాలికపై సామూహిక అత్యాచారంలో ఎమ్మెల్యే కుమారుడి పాత్ర లేకున్నా... బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు, ఆధారాలు ఉండటంతోనే జువైనల్ హోమ్‌కు చేరాడు. ఇతడిపై ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద సదరు ఆరోపణలు నమోదు చేశారు. ఆమ్నేషియా పబ్ వద్ద సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఓ కీలక విషయం గుర్తించారు. ఇన్నోవా కారులో అప్పటికే ఉన్న సాదుద్దీన్‌ను దింపిన ఎమ్మెల్యే కుమారుడు అక్కడే కారు ఎక్కాడని, అలా ఈ కేసులో చిక్కాడని తెలుసుకున్నారు. (చదవండి: కోర్టును ఆశ్రయించిన పోలీసులు.. ఎందుకంటే..?) -
షాకింగ్ ఘటన... డబ్బాలో ఏడు పిండాలు!
7 Aborted Fetuses: బెళగావి జిల్లాలోని ముదలగి గ్రామంలో ఒక డబ్బాలో గర్భస్రావం చేయబడిన ఏడు పిండాలను స్థానికులు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ షాకింగ్ ఘటన బెళగావి జిల్లా ముదలగి గ్రామంలోని బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వెంటనే సంఘటనే స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు పోలీసులు ఆ డబ్బాలో ఏడు పిండాలను గుర్తించారు. అవన్నీ ఐదు నెలల పిండాలని, భ్రూణ హత్యలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ విషయమై జిల్లా యంత్రంగాం వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టింది. అంతేకాకుండా ఈ పిండాలను ఆస్పత్రికి తరలించి, ఆపై పరీక్ష కోసం జిల్లా ఫంక్షన్ సైన్స్ సెంటర్ తీసుకువెళ్తున్నామని పోలీసులు చెప్పారు. (చదవండి: మహిళను బంధించి దోపిడీ) -
ప్రమాదానికి కారణం అమోనియం కాదా...?
అనకాపల్లి: బ్రాండిక్స్‌లో సీడ్స్ కంపెనీలో ప్రమాదకర వాయువు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై నిపుణుల కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే విషవాయువుల వ్యాప్తి జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ వాయువుల్లో అమోనియం లేదని, ఉండి ఉంటే కళ్లకు మరింత ప్రమాదముంటుందని నిపుణుల బృందం భావిస్తోంది. సీడ్స్ కంపెనీలోని ఏసీ యూనిట్లన్నింటినీ కమిటీ పరిశీలించింది. ఏసీ యూనిట్‌కు సంబం«ధించిన గ్యాస్, ఇతర డస్ట్‌లను పరిశీలించినట్టుగా సమాచారం. ఉద్యోగులను అస్వస్థతకు గురి చేసిన వాయువు ఎక్కడ నుంచి విడుదలైందన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది. పొరుగున ఉన్న ఫార్మా కంపెనీల నుంచి విషవాయువు వస్తే ఆ కర్మాగారంలోని ఉద్యోగులు, మధ్యలో ఉన్న వివిధ వర్గాల వారికి ప్రమాదముండేది కాబట్టి దానిపై కూడా స్పష్టత రావడం లేదు. మరోవైపు బ్రాండిక్స్‌లో ఉన్న పలు యూనిట్లలో ప్రమాదకర రసాయనాలతో ఎటువంటి పనులు చేయరని ఇక్కడి యాజమాన్యం చెబుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే నిపుణుల బృందం స్పష్టమైన అంచనాకు రానుంది. (చదవండి: ఇన్స్పెక్టర్ రాసలీలలు.. లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరై.. ఆ తర్వాత..) -
మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించి, ఊపిరాడకుండా చేసి...
Asphyxiation death of Black man: బ్రెజిల్లో జ్యాత్యాహంకారం కోరలు చాచింది. అక్కడి పోలీసులు.. ఒక నల్లజాతీయుడిని దారుణంగా హింసించడంతో పాటు ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సెర్గిప్‌లోని యుంబౌబలో హైవేపై మోటర్ సైకిల్ మీద వెళ్తున్న డి జీసస్ శాంటోస్ అనే వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అతని నేలపై కూర్చొబెట్టి మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించారు. అంతటితో ఆపకుండా కారు డిక్కిలో పడేసి బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో శాంటోస్ కన్నుమూశాడు. అయితే పోలీసులు మాత్రం శాంటోస్ దురుసుగాగా ప్రవర్తించాడని, అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటించాడని చెబుతున్నారు. అతనిని నియంత్రించే క్రమంలోనే బాష్పవాయువును ఉపయోగించామని చెప్పారు. కానీ బాధిత కుటుంబం మాత్రం శాంటోస్‌ని హైవేపై బలవంతంగా ఆపి చొక్కా పైకెత్తమనడంతో.. భయపడ్డాడని అంటున్నారు. పైగా మానసికంగా అతను స్థిమితంగా లేడని, అతని దగ్గర మందుల చీటి చూసి కూడా కనికరించకుండా హింసించారని అంటున్నారు. శాంటోస్ ఎంతగా వదిలేయమని ప్రాధేయపడ్డా వదలకుండా ఊపిరాడకుండా చేసి చంపేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శాంటోస్‌ని పోలీస్‌స్టేషన్‌కి తరలించే క్రమంలోనే తీవ్ర ఆవస్థతకు గురై చనిపోయాడని పోలీసులు అంటున్నారు. ఊపిరాడకపోవం వల్లే మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది. దీంతో.. శాంటోస్ హత్యకు పోలీసులే కారణమంటూ.. జనాలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ఘటన కార్చిచ్చు రాజేయడంతో.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నత దర్యాప్తునకు ఆదేశించారు. (చదవండి: మిస్టర్ బైడెన్.. ముందు అమెరికన్లను కాపాడండి: ట్రంప్ ఫైర్) -
పేరు మార్చి.. ఏమార్చి!
సాక్షి హైదరాబాద్: నేరం జరిగిన వెంటనే పోలీసులు చేసే మొదటి పని.. అనుమానితులు ఎవరు? వారికి పాత నేర చరిత్ర ఏమైనా ఉందా? అని ఆరా తీయడమే! దీనిని గమనించిన నేరస్తులు.. పోలీసుల దృష్టి మరల్చేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇంటి పేరు, తండ్రి పేరుతో సహా మార్చి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మారు పేర్లతో పాన్, ఆధార్ కార్డ్‌లు సృష్టించి వారి నేర చరిత్రను కప్పిప్పుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పాత పేర్లతో ఉన్న స్థిరచరాస్తులను విక్రయిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలను మూసేస్తున్నారు. నేరం జరిగిన తర్వాత అనుమానితులు, నేరం జరిగిన తీరును పరిశీలించాక.. పోలీసుల డేటా బేస్‌లో పాత నేరస్తులు, ఇలాంటి తరహా నేరాలేమైనా జరిగాయా అని విచారణాధికారులు పరిశీలిస్తారు. ఒకవేళ ఉంటే.. ఆ కోణం నుంచి దర్యాప్తు మొదలుపెడతారు. పాత నేరస్తుల కదలికలపై పోలీసుల ని ఘా ఉంటుంది కాబట్టి పట్టుకోవటం సులవవుతుంది. అదే కొత్త నేరస్తుడైతే పట్టుకోవటం ఆలస్యమే.. వాంగ్మూలం ఇప్పించడంలోనూ ఆలస్యం జ రుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించి న ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్టి మట్టారెడ్డి చేసిందిదే. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. కానీ.. మట్టారెడ్డి అసలు పేరు మేరెడ్డి అశోక్ రెడ్డి. ఎవరో జ్యోతిష్యుడు సూచించాడని తన పేరును మట్టారెడ్డిగా, తన తండ్రి పేరు వెంకట నరసింహారెడ్డి కాగా.. ఇంద్రసేనా రెడ్డిగా మార్పించాడు. అశోక్ రెడ్డిపై నారాయణగూడ, మలక్‌పేట, సరూర్‌నగర్ పీఎస్‌లలో మూడు చీటింగ్ కేసులు ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. తన నేర చరిత్రను కప్పిపుచ్చేందుకు 2007 లోనే తన పేరును మార్చి, నకిలీ పాన్ కార్డ్ పొందాడు. గతంలోనే అశోక్ రెడ్డి అరెస్ట్‌కు వారంట్ కూడా జారీ అయ్యిందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అయితే పేరు మారడంతో అరెస్ట్ చేయలేకపోయారు. పాత పేరు బయటపడకుండా.. పాత నేరాల తాలుకు ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు నేరస్తులు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. మట్టారెడ్డి తన పాత పేరు (అశోక్ రెడ్డి)తో ఉన్న స్థిరచరాస్తులను విక్రయించేశాడని, బ్యాంక్ ఖాతాలను కూడా మూసేశాడని ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి తెలిపారు. దీంతో తాజా నేరాల్లో పోలీసులకు చిక్కినా.. తొలిసారి నేరస్తుడిగా భావించాలని, శిక్ష కాస్త తగ్గుతుందని నిందితుల ఎత్తుగడగా ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. పోలీసుల రికార్డ్స్ ఎక్కడ కూడా మట్టారెడ్డి పాత నేరస్తుడిగా లేకపోవటంతో మొద ట్లో పోలీసులు కూడా అమాయకుడే అనుకున్నారు. కానీ, సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో మట్టారెడ్డి తడబడటంతో పోలీసులకు క్లూ దొరికింది. మట్టారెడ్డి ఫామ్ హౌస్, అందులోని సీసీటీవీ గురించి తెలిసింది. అందులోని ఫుటేజ్‌ను పరిశీలించగా మట్టారెడ్డి అసలు పేరు మేరెడ్డి అశోక్ రెడ్డి అని. ఇక్కడ తీగ కూపీ లాగితే మట్టారెడ్డి అలియాస్ అశోక్ రెడ్డి పాత నేర చరిత్ర అంతా బయటపడింది. -
రష్యా నేరాలపై ఐసీసీలో విచారణ
హేగ్: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) విచారణ ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న నరమేధంపై విచారణ ప్రారంభించినట్టుగా ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చెప్పారు. రష్యా యుద్ధ నేరాలపై విచారణ జరగాలని అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. రష్యా అనాగరిక చర్యలపై విచారణ జరిపించి దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు యూకే, దాని మిత్రదేశాలు పోరాటం చేస్తాయని చెప్పారు. రష్యా చేస్తున్న నేరాలకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరిస్తున్నామని తెలిపారు. రష్యా నేరాలపై విచారణకు ఐసీసీ న్యాయమూర్తులు అంగీకరించిన తర్వాత ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ తాము ఆధారాలు సేకరించే పని మొదలు పెట్టినట్టుగా తెలిపారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ దాడుల్లో 2 వేల మందికిపైగా పౌరులు మరణించారని చెబుతోంది. రష్యా విచక్షణారహితంగా పౌరులు నివసించే ప్రాంతాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటివాటిపై బాంబులు వేస్తూ ఉండడంతో హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో మానవ హక్కుల హననం జరుగుతోందని ఐసీసీ విచారణకు అంగీకరించడంతోనే అర్థమవుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తాత్కాలిక అధ్యక్షుడు బల్కీస్ జర్రా చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్,అధికారులపై అభియోగాలు మోపే అవకాశాలున్నాయి. (చదవండి: భారత్‌పై కాట్సా.. బైడెన్‌దే నిర్ణయం) -
తెలుగు అకాడమీ నిధుల స్కాం తో CCS దర్యాప్తు ముమ్మరం
-
జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాలు.. రంగంలోకి పోలీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నూతన పాలక మండలి అక్రమాల ఆరోపణలపై పోలీసులు రంగంలోకి దిగారు. సొసైటీ కార్యాలయానికి చేరుకున్న జుబ్లీహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్, కోశాధికారి నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సొసైటీ స్థలం తక్కువ ధరకు అమ్మి రూ.5 కోట్ల నష్టం చేశారని సభ్యుడు సురేష్ బాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సొసైటీ స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణను జీహెచ్ఎంసీ తొలగించింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలో సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్, కోశాధికారి నాగరాజుకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. -
హ్యాకింగ్ కుట్రదారులను బయటపెడతాం
కోల్‌కతా: దేశవ్యాప్తంగా పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ ఉదంతంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌తో బహిరంగ పోరుకు దిగిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ దిశగా మరో అడుగు ముందుకేశారు. మోదీ ప్రభుత్వం విపక్ష నేతలు, జడ్జిలను లక్ష్యంగా చేసుకునే పెగసస్ హ్యాకింగ్‌కు పాల్పడిందంటూ ప్రభుత్వ పాత్రను నిగ్గుతేల్చేందుకు మమత సిద్ధమయ్యారు. హ్యాకింగ్‌లో కేంద్రం కుట్రను బట్టబయలుచేసేందుకు కోల్‌కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్‌లతో ద్వి సభ్య కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు మమత సోమవారం ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీలను ఏకంచేసే లక్ష్యంతో ఢిల్లీకి బయల్దేరేముందు మమత ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘బెం గాల్లోని ప్రముఖ వ్యక్తులు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్‌కు సంబం ధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఉద్దేశించిన కమిషన్ నియామకానికి రాష్ట్ర కేబినెట్ ఓకే చెప్పింది. హ్యాకింగ్‌లో పాత్రధారులు ఎవరు? ఎలాంటి చట్టవ్యతిరేక మార్గాల్లో హ్యాకింగ్ కొనసాగింది? తదితరాలపైనా ఈ కమిషన్ దృష్టిసారిస్తుంది’ అని ఆమె చెప్పారు. కమిషన్ ఎంక్వైరీ చట్టం–1952లోని సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రప్రభుత్వం సైతం విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయవచ్చు. ఒక రాష్ట్రం ఈ అంశంపై విచారణ కమిషన్‌కు ఆదేశించినందున మోదీ సర్కార్ సైతం విస్తృత స్థాయిలో విచారణ కోసం కేంద్ర కమిషన్‌ను ఏర్పాటుచేయాల్సిందేననే ఒత్తిళ్లు కేంద్రంపై పెరిగేవీలుంది. ఢిల్లీలో మమత 5 రోజుల టూర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీలను ఏకతాటి మీదకు తేవడమే లక్ష్యంగా మమత ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఇటీవల బెంగాల్ రాష్ట్ర ఎన్నికల్లో టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకున్నాక మమత ఢిల్లీలో పర్యటించడం ఇదే మొదటిసారి. తన పర్యటనలో భాగంగా మమత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారు. ప్రధాని మోదీని కలుస్తానని ఢిల్లీకి బయల్దేరేముందు సోమవారం కోల్‌కతాలో విమానాశ్రయంలో విలేకరులకు మమత చెప్పారు. మోదీతో భేటీలో ఏఏ విషయాలు ప్రస్తావిస్తారో ఆమె వెల్లడించలేదు. మోదీతో భేటీ తర్వాతే విపక్ష పార్టీలతో వరస భేటీలు ఉంటాయని సమాచారం. 30వ తేదీ వరకు ఆమె ఢిల్లీలోనే ఉంటారని, పార్లమెంట్‌కు వెళ్లి పలు పార్టీల నేతలను కలుస్తారని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. మమత ఢిల్లీ పర్యటనపై పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పెదవివిరిచారు. బెంగాల్లో నకిలీ కరోనా టీకాల కుంభకోణం, రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత చెలరేగిన హింస, ఇతర సమస్యలను ఎదుర్కోలేకే ఆమె ఢిల్లీకి వెళ్లిపోయారని దిలీప్ ఘోష్ ఎద్దేవాచేశారు. అప్పుల్లో కూరుకుపోయిన బెంగాల్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరేందుకే మోదీని మమత కలుస్తున్నారని ఘోష్ ఆరోపించారు. -
ఢిల్లీ అల్లర్లపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
-
‘హాజీపూర్’ ఘటనపై పోలీసుల వాదనలు పూర్తి
నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో జరిగిన వరుస అత్యాచారాలు, హత్యల కేసులకు సంబంధించి పోలీసుల తరఫు వాదనలు పూర్తయ్యాయి. రెండ్రోజులుగా నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి ముందు పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.చంద్రశేఖర్ ఓరల్ వాదనలు వినిపించారు. మూడు హత్యలకు సంబంధించి తొలి రోజు ఒక ఘటనకు సంబంధించి, రెండో రోజు మరో రెండు హత్యలకు సంబంధించి వాదనలు వినిపించారు. ఇద్దరు బాలికల హత్యలకు సంబంధించి వాదనలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఘటనకు సంబంధించి అన్ని రకాల ఆధారాలతోపాటు నిందితుడు తానే నేరం చేసినట్లుగా పోలీసుల ముందు ఒప్పుకున్న సాక్షులను కూడా కోర్టు ముందు ఉంచారు. దీంతో నిందితుడు శ్రీనివాస్ రెడ్డే హత్యలు, అత్యాచారాలు చేశాడని పీపీ చంద్రశేఖర్ వాదించారు. ఇలాంటి వారు సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు. క్రూరంగా అత్యాచారం, హత్య చేసిన నిందితుడు ఉరిశిక్షకు అర్హుడన్నారు. అనంతరం భువనగిరి యాదాద్రి జిల్లా ఏసీపీ భుజంగరావు నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను వివరిస్తూ తన వాదన వినిపించారు. దీంతో పోలీసుల తరఫు ఓరల్ వాదనలు పూర్తయ్యాయి. రాతపూర్వక వాదనల కోసం ఫైల్ దాఖలు చేయనున్నట్లు పీపీ చంద్రశేఖర్ తెలిపారు. నేడు నిందితుడి తరఫు ఓరల్ వాదనలు.. హాజీపూర్ హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తరఫున లీగల్ సెల్ నియమించిన న్యాయవాది ఠాగూర్ వాదనలు బుధవారం వినిపించనున్నారు. మూడు హత్యా కేసులకు సంబంధించి ఈ వాదనలు వినిపిస్తారు. మరోవైపు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష వేయాలంటూ మహిళా న్యాయవాదులు కోర్టు ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. -
నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎన్ఐఏ!
రక్షణ దళాల్లో ఒకటైన నావికాదళంపై వలపు వల(హానీ ట్రాప్) విసిరి కీలకమైన రహస్యాలను చోరీ చేస్తున్న ఉదంతంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దృష్టి సారించింది. పాకిస్థాన్ ఏజెంట్లు ఫేస్బుక్లో యువతుల పేరుతో నేవీ ఉద్యోగులను పరిచయం చేసుకొని.. క్రమంగా వారిని ట్రాప్ చేసి రహస్యాలు రాబడుతున్నట్లు తెలుసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరిట ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఏడుగురు నేవీ సిబ్బందిని అరెస్టు చేయడం కలకలం రేపింది. దరిమిలా నేవీలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలా మంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తుకు ఎన్ఐఏను రంగంలోకి దించుతున్నారు. ఆ సంస్థ అధికారులు రెండు మూడు రోజుల్లో తూర్పు నావికాదళ కేంద్రానికి వచ్చి విచారణ జరుపుతారని సమాచారం. సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సమాచారాన్ని శత్రుదేశం పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఏడుగురు ఇండియన్ సెయిలర్స్‌ని ఈ నెల 20న అరెస్టు చేసిన కేంద్ర నిఘా వర్గాలు లోతైన విచారణ చేపడుతున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఈ కేసుని సీరియస్‌గా తీసుకుంది. ఆపరేషన్ డాలి్ఫన్ నోస్‌లో వెల్లడైన నిజాల నిగ్గు తేల్చేందుకు రెండు మూడు రోజుల్లో ఎన్ఐఏ బృందం విశాఖ రానుంది. తూర్పు నౌకాదళంలో అధికారుల బృందాలతో మాట్లాడి మరిన్ని ఆధారాలు సంపాదించేందుకు ఎన్ఐఏ ప్రయతి్నంచనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఈ సంఘటనతో అప్రమత్తమైన నౌకాదళం ఇకపై షిప్‌లలో స్మార్ట్ఫోన్ల వినియోగాన్ని బంద్ చేసినట్లు ఆదేశాలు జారీ చేసింది. వలపు వలలో చిక్కుకుని.. భారత నౌకాదళ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు శత్రుదేశం పాకిస్థాన్ దృష్టి సారించింది. 2017లో నౌకాదళంలో సెయిలర్స్‌గా చేరిన వారిని ఇందుకోసం టార్గెట్ చేసుకుని వలపు వల విసిరింది. ఆర్మీ జవాన్లపై ఈ ఏడాది జనవరిలో విసిరిన ఫేస్బుక్ వల మాదిరిగానే... వీరిపైనా అలానే అ్రస్తాన్ని సంధించింది. ఈ వలలో విశాఖ ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళానికి చెందిన ముగ్గురు సెయిలర్స్, ముంబయికి చెందిన ఇద్దరు, కర్వార్‌కు చెందిన మరో ఇద్దరు సెయిలర్స్ చిక్కుకున్నారు. ఈ వ్యవహారంపై ఎన్ఐఏ, ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ మొదలుపెట్టాయి. డిసెంబర్ 20న ఏడుగురు సెయిలర్స్‌తోపాటు ఒక హవాలా బ్రోకర్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ప్రస్తుతం వీరంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరికొందరి ప్రమేయంపైనా అనుమానాలు పాకిస్థాన్ ఇంటర్ సరీ్వస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) చట్రంలో కేవలం ఏడుగురు సెయిలర్స్ మాత్రమే కాకుండా మరికొందరు కూడా చిక్కుకున్నారని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఆపరేషన్ డాలి్ఫన్ నోస్’ నిర్వహించిన సమయంలోనే ఇంకొందరు సెయిలర్స్ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైనా.. కేవలం ఏడుగురి నుంచి మాత్రమే సమగ్ర సమాచారం పాక్‌కు చేరిందని భావించడంతో వారిపైనే దృష్టి సారించి అదుపులోకి తీసుకున్నారు. అయితే మరికొందరు సెయిలర్స్ కూడా పాక్ హనీట్రాప్‌లో చిక్కుకొని నౌకలు, సబ్ మెరైన్స్ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేశారనే కోణంలో నిఘా వర్గాలు విచారణ ముమ్మరం చేశాయి. స్మార్ట్ఫోన్ల వినియోగం బంద్ కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న సంఘటన వెలుగు చూడటంతో నౌకాదళం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరికొంత మంది ఇంటి దొంగలు ఉన్నారన్న అనుమానాలను నిఘావర్గాలు వెల్లడించడంతో అప్రమత్తమైంది. ఇకపై నౌకల్లో, సబ్మెరైన్లలో ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారిగానీ, కెపె్టన్, సెయిలర్స్.. ఏ స్థాయి ఉద్యోగి కూడా స్మార్ట్ ఫోన్ వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వాట్సప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం, టెలిగ్రామ్, టిక్‌టాక్, హైక్ మొదలైన సోషల్ మీడియా యాప్స్‌ని పూర్తిగా నౌకల్లో నిషేధిస్తున్నట్లు ఆదేశించింది. ఈ ఆదేశాలు కఠినంగా అమలు చెయ్యాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖకు ఎన్ఐఏ బృందాలు మరోవైపు ఇప్పటికే అరెస్టైన ఏడుగురు సెయిలర్స్ నుంచి నిజాలు రాబట్టేందుకు ఎన్ఐఏ బృందం ప్రయతి్నస్తోంది. అరెస్టైన సెయిలర్స్ సన్నీకుమార్, ఎస్.కుమార్‌శర్మ, ఎస్.దాస్, అకుమా, అశోక్‌కుమార్, వి.కుమార్, సోమనాథ్‌కు విజయవాడ ఎన్ఐఎ కోర్టు జనవరి 3 వరకూ రిమాండ్ విధించింది. వీరిచ్చిన సమాచారం మేరకు తూర్పు నౌకాదళంలో విచారణకు ఎన్ఐఎ బృందం రెండు మూడు రోజుల్లో రానుంది. 2018 అక్టోబర్ నుంచి పాకిస్థాన్‌కు ఈ సెయిలర్స్ సమచారం అందించడం ప్రారంభించారు. ముఖ్యంగా యుద్ధనౌకలు, సబ్మెరైన్ల కదలికలపై సమాచారం ఎప్పటికప్పుడు చేరవేశారు. ఏ యుద్ధ నౌక ఎక్కడ ఉంది..? వివిధ జలాంతర్గాముల ప్రస్తుత స్థితి ఏమిటి.. ఇలా కీలకమైన సమాచారం చేరవేశారు. అయితే ఏయే నౌకలు, సబ్మెరైన్ల సమాచారం అందించారు., ఏయే సమయాల్లో అందించారు.. ఆ సమయంలో ఆయా నౌకలు, జలాంతర్గాములు ఎక్కడ ఉన్నాయి.. ఏ ఆపరేష న్లో ఉన్నాయి.. సెయిలర్స్ ఇచ్చిన సమాచారం వల్ల నౌకాదళానికి, దేశ భద్రతకు ఏ మేరకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.. ఇలా పూర్తి సమాచారాన్ని సేకరించే దిశగా ఎన్ఐఏ బృందం ప్రయతి్నంచనుంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే తూర్పు నౌకాదళానికి సమాచారం ఇచ్చినట్లు నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం. -
ఇద్దరు యువకుల ఘాతుకం
సాక్షి, కోటవురట్ల(పాయకరావుపేట) : వావివరుసలు మరచి ఇద్దరు యువకులు చెల్లి వరుస అయిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా ఉరివేసి హత్యచేసేందుకు యత్నించిన సంఘటన ఆలస్యంగా బీకే పల్లిలో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన ఆమె కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. బాలిక తల్లి లక్ష్మి వివరాలు ఇలా ఉన్నాయి. తమ పక్క ఇంటిలో ఉంటున్న పైల గోపి, పైల సునీల్ తన కుమార్తెకు అన్నదమ్ముల వరుస అవుతారని, దానిని మరిచి ఇద్దరూ ఆమెపై లైంగికదాడికి యత్నించి, ఆపై చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. పథకం ప్రకారం ఆదివారం పాకలోకి పిలిచి లైంగికదాడికి యత్నించారని తెలిపింది. బాలిక అడ్డుకోవడంతో వెలుగులోకి వస్తే ప్రమాదమని భావించి ఉరి వేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. చనిపోయిందనుకుని ఏమీ తెలియనట్టుగా తమ పెద్ద కూతురు ఉమాదేవి వద్దకు వచ్చి మీ చెల్లిపై సిమెంట్ బస్తాలు పడిపోయాయని గోపి చెప్పాడని, అక్కడకు వెళ్లేసరికి కొనఊపిరితో ఉన్న కుమార్తెను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వైద్య సిబ్బంది కూడా జరిగిన సంఘటనపై అనుమానం వ్యక్తం చేశారని, సిమెంట్ బస్తాలు పడితే పెనుగులాడినట్టు తల, వీపుపై మట్టి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారని తెలిపింది. పరిస్థితి ఆందోళనగా ఉండడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా మెడ నరాలు తెగిపోవడంతో పాటు చిన్న మెదడు దెబ్బతిన్నట్టు వైద్యులు తెలిపారన్నారు. జరిగిన అన్యాయంపై మంగళవారం కోటవురట్లలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ స్పందించలేదని, కేసు పెడితే ఆ ఇద్దరు ఏమైనా చేసుకుంటే బాధ్యత మీదేనని నిందితుల తరఫున మాట్లాడుతూ బెదిరించారన్నారు. మొదటి నుంచి గోపి, సునీల్ తమ రెండో కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫొటోలను అసభ్యంగా తయారు చేసి వాట్సప్‌లో పెడతామని బెదిరించేవారని, ప్రతీసారీ రూ.1000, రూ.2 వేలు తెమ్మని డిమాండ్ చేసేవారని చెప్పింది. ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని తెలిపింది. ఈ విషయాన్ని నిలదీసినందుకే తన మూడో కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. కఠినంగా శిక్షించాలి ఆ యువకులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఎస్ఐ మధుసూదనరావును సస్పెండ్ చేయాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. సమాచారం తెలుసుకున్న ఐద్వా సభ్యులు గురువారం విశాఖలో బాధితురాలిని పరామర్శించారు. శుక్రవారం బి.కె.పల్లి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలను బ్లాక్మెయిల్ చేస్తూ వేధించిన పైల గోపి, పైల సునీల్‌లను తక్షణం అరెస్టు చేసి, విచారించాలన్నారు. హత్యచేసుందుకు యత్నించిడంతో బాధితురాలు కోలుకోలేని స్థితిలో కేజీహెచ్‌లో వైద్యం పొందుతోందని చెప్పారు. కేజీహెచ్‌లో వైద్యం చేస్తే ఆమె పూర్తిగా కోలుకోలేదని, అందువల్ల కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందించాలన్నారు. వైద్యానికి రోజుకు రూ.45 వేలు వరకు ఖర్చు అవుతుందని, 90 రోజుల పాటు వైద్యం అందించాలని, ఇందుకు రూ.90 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మద్దతుగా జన విజ్ఞాన వేదిక నక్కపల్లి మండల కన్వీనర్ బి.రాము, సీపీఎం మండల కన్వీనర్ జి.డేవిడ్ నిలిచారు. గ్రామంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. దీనిపై ఎస్ఐ మధుసూదనరావును వివరణ కోరగా తాను ఇటీవల కోటవురట్ల ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నానని, మండలంపై తనకు పూర్తి అవగాహన లేదన్నారు. ఓ బాలికకు అన్యాయం జరిగితే నిందితులను కాపాడే నీచమైన వ్యక్తిత్వం తనది కాదన్నారు. బాధితురాలు నోరు విప్పితే అన్ని విషయాలు బయటకు వస్తాయని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని, పైల గోపిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధితురాలికి వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడినట్టు తెలిపారు. -
టీటీడీలో రోజుకో వివాదం.. భక్తులు మండిపాటు
సాక్షి, తిరుమల : టీటీడీలో రోజుకో వివాదం తలెత్తుతున్నాయి. అంతేకాక టీటీడీ వివాదస్పద నిర్ణయాలపై భక్తులు మండిపడుతున్నారు. అరవై ఐదుళ్లు దాటిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై యాదవ్ సంఘాలు గుర్రుమంటున్నాయి. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంతో 5మంది మీరాశి అర్చకులు, 10 మంది నాన్ మిరాశి అర్చకులు, ఒక సన్నిధి గొల్ల ఉద్యోగాలు కోల్పోతారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై పూర్తి విచారణ చేయాలని సీఐటీయు నాయకుడు కందారపు మురళి కోరారు. ప్రభుత్వం వెంటనే దీనిపై సమాధానం చెప్పాలని మురళి పేర్కొన్నారు. ‘ఆలయంలో అసలేం జరుగుతుందో భక్తులకు అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీవారి అభరణాలు, ఆస్తులు భద్రతపై భక్తులు నమ్మకం కోల్పోతున్నారు. వెంటనే ఈ ఆరోపణలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేయించాలి’. అని కందారపు మురళి అన్నారు. ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులకు ఈఓ నోటిసులు కూడా జారీ చేసింది. దీనిపై రమణ దీక్షితులు మాట్లాడుతూ.. మాపై చర్యలు తీసుకునే హక్కు టీటీడీకి లేదన్నారు. ఆ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. 143 చట్టం ప్రకారం మాకు మిరాసిలో వచ్చే ఆదాయం మాత్రమే రద్దయిందని తెలిపారు. వంశపారంపర్యం, సంభవణ, గౌరవంగా చూస్కోవాలని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది.. కోర్టు నిర్ణయాలను కూడా టీటీడీ లెక్కచెయ్యట్లేదన్నారు. మిరాశి అర్చకులును హీనంగా చూసిన సహించాము.. కానీ కైంకర్యాలలో లోపాలు జరిగితే ఉరుకోము. టీటీడీ అధికారులు వీఐపీల సేవలో తరిస్తూ, మాపై పెత్తనం చలాయిస్తున్నారు. నిత్య సేవలు త్వరగా నిర్వహించాలని మాపై ఒత్తిడి తేస్తున్నారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. -
కదలిన గిరిజనం
గిరిజనం కదలి వచ్చారు. తమకు జరిగిన అన్యాయంపై విచారణాధికారికి ఆధారాలతో సహావినతిపత్రాలు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఐటీడీఏ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. హైకోర్టు స్పందించి విచారణ కమిటీ ఏర్పాటు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందన్ననమ్మకంతో గిరిజనులు పెద్ద ఎత్తున ఐటీడీఏకు తరలి వచ్చారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కుక్కునూరు, జీలుగుమిల్లి, ఏలూరు మెట్రో:శక్తి స్వచ్ఛంద సంస్థ కోర్టులో వేసిన పిటీషన్ ఆధారంగా హైకోర్టు విచారణ అధికారిని నియమించిన నేపథ్యంలో మంగళవారం కేఆర్‌పురం ఐటీడీఏలో జరిగిన విచారణకు విలీన మండలాల నుంచి పలువురు గిరిజనులు హాజరై తమ సమస్యలను విచారణ అధికారికి విన్నవించుకున్నారు. గిరిజన సంఘాల,వామపక్షాల, న్యాయవాద, ప్రజాసం«ఘాల నేతలు పెద్ద ఎత్తున బాధితులను వెంటబెట్టుకుని తీసుకువచ్చారు. వారందరూ తమకు జరిగిన అన్యాయం గురించి విచారణాధికారికి మొరపెట్టుకున్నారు. ఈ అన్యాయానికి ఐటీడీఏ పీవో షాన్మోహన్, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ కారణమని, వారిపై విచారణ జరిపించాలని గిరిజనసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు కాకర్ల సురేష్, సోమసుందరంకు అనుకూలంగా అధికారులు వ్యవహరించారని వారు ఆరోపించారు. పొలాల్లో ఉన్న చెట్లు, పంటలకు సంబంధించిన పరిహారాన్ని కొందరి ఖాతాల్లో మాత్రమే వేశారని, ఎక్కువగా బ్రోకర్ల ఖాతాలలో వేసి వారి వద్ద కమీషన్లు తీసుకుని మిగిలిన సొమ్ములు తమకు ఇచ్చారని బాధితులు ఆరోపించారు. గిరిజనులే కాకుండా నష్టపోయిన గిరిజనేతరులు కూడా పెద్ద సంఖ్యలో ఐటీడీఏకు తరలి వచ్చారు. అయితే తాము గిరిజనులకు జరిగిన అన్యాయంపైనే కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నందున మిగిలిన వారి నుంచి వినతులు తీసుకోలేమని విచారణాధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. ముంపు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తరలి వస్తూనే ఉన్నారు. -
నకిలీ విజిలెన్స్ అధికారుల మోసాలపై దర్యాప్తు
ఉయ్యూరు: నకిలీ విజిలెన్స్ అధికారి పేరుతో కొనసాగిస్తున్న దందాకు ఉయ్యూరు పోలీసులు చెక్ పెట్టారు. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగిస్తున్న మోసాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. గుట్కా విక్రయ దుకాణాలనే టార్గెట్‌గా చేసుకుని లక్షలు కొల్లగొట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఆ కేటుగాళ్ల మాయపంథాలో ఎందరో చిరువ్యాపారులు చిక్కుకున్నవారే. అచ్చం విజిలెన్స్ అధికారిలానే.. విజయవాడకు చెందిన శ్రీనివాసరావు నకిలీ విజిలెన్స్ అధికారిగా అవతారమెత్తి సుమారు రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మోసాలకు పాల్పడుతున్నారు. బాలాజీతో కలిసి చిరు వ్యాపారులని లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దందా సాగిస్తున్నారు. నిజమైన విజిలెన్స్ అధికారిలా కనపడేలా ఐడీ కార్డు పెట్టుకుని దొంగ రశీదు బుక్కుతో కారు దిగి హడావుడి చేసి వ్యాపారులను భయబ్రాంతులకు గురిచేస్తూ యథేచ్ఛగా దోచేస్తున్నట్లు తెలిసింది. ‘‘శ్రీనివాసరావు ముందుగానే ఎక్కడ గుట్కాలు అమ్ముతారో తెలుసుకుంటాడు. ఆ షాపు తిన్నగా కారు ఆపి నేరుగా షాపులోకి వెళ్లి అదేంటి.. ఇదేంటి అంటూ హడావుడి చేస్తాడు. ఏం గుట్కాలు అమ్ముతున్నావంటూ గుట్కా ప్యాకెట్లు పట్టుకుని కేసు రాస్తున్నా, కోర్టుకు వెళ్లి రూ.25 వేలు ఫైను కట్టుకోండి అంటూ భయబ్రాంతులకు గురిచేస్తాడు. ఆ వ్యాపారి సరిచేయమంటూ ప్రాథేయపడతాడు. చివరకు అలాఇలా రూ.5 వేలు నుంచి రూ.10 వేలు మధ్యలో బేరం కుదుర్చుకుని ఆ నకిలీ రశీదు ఇచ్చి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు తాను నిజాయితీ అధికారినంటూ, ఫార్మాల్టీస్ ఏమీ వద్దని చెబుతూ ఓ రెండు సిగరెట్ పెట్టెలు ఇవ్వండని తీసుకుని మరీ వెళ్లిపోయి మరో కొత్త ఊరిని వెతుక్కుంటాడు.’’ ఇదే పంథాలో శ్రీనివాసరావు తన మోసాలు కొనసాగిస్తున్నాడు. గుట్కాలు అమ్మడం నేరం కావడంతో వ్యాపారులు ఎవ్వరూ ఇంతవరకు పోలీసులను ఆశ్రయించకపోవడంతో దర్జాగా దోచుకుంటూ తిరుగుతున్నాడు. ఉయ్యూరులో వెలుగులోకి.. పట్టణంలోని ఓ దుకాణంలో తన పంథాలోనే శ్రీనివాసరావు దాడి చేసి హడావుడి చేశాడు. ఈ క్రమంలోనే గల్లా పెట్టెలోని రూ.60 వేలు మాయం చేశాడు. పెద్ద మొత్తంలో డబ్బులు పోవడంతో ఆ వ్యాపారి టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ సత్యానందం నేతృత్వంలో ఎస్ఐ రామారావు సిబ్బందితో శ్రీనివాసరావు కదలికలపై నిఘా పెట్టి ఎట్టకేలకు మాటువేసి మరీ పట్టుకోవడంతో అసలు డొంకంతా కదులుతోంది. రూట్లు మారుస్తూ.. కారు మార్చి.. శ్రీనివాసరావు తన మోసాలకు రెండు కార్లను వినియోగిస్తున్నట్లు తెలిసింది. షాపులపై దాడులకు వెళ్లేటప్పుడు అద్దెకు స్విఫ్ట్ కారును వినియోగించి, డబ్బు దోచుకున్న అనంతరం వేరే ప్రాంతానికి వెళ్లేటప్పుడు తన సొంత ఇండికా కారును వాడి దొరక్కుండా తిరుగుతాడు. ఈ క్రమంలోనే ప్రధాన రోడ్లగుండా కాకుండా ప్రత్యామ్నాయం డొంక రోడ్లగుండా వెళ్లి చిక్కకుండా పోతున్న కేటుగాడిని అదే వ్యూహాన్ని అనుసరించి పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం శ్రీనివాసరావుతో పాటు రెండు కార్లు పోలీసుల అదుపులో ఉన్నాయి. మరో వ్యక్తితోపాటు ఇంకా ఎక్కడెక్కడ నేరాలు చేశాడనే దానిపై పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ విజిలెన్స్ అధికారుల అరెస్టు విజయవాడ: విజిలెన్స్ అధికారుల ముసుగులో అక్రమ వసూళ్లకు, దోపిడీలకు పాల్పడే ఇద్దరు నిందితులను ఉయ్యూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సూర్యారావుపేటలో లా అడ్ అర్డర్ డీసీపీ క్రాంతి రాణా టాటా తన చాంబర్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన వజ్జల వెంకట శ్రీనివాస్ కుమార్ డిగ్రీ వరకు చదివి, చిన్న, చిన్న ఉద్యోగాలు చేసి తేలికగా డబ్బు సంపాదించేందుకు మరో ఇద్దరితో కలిసి నకిలీ విజిలెన్స్ అధికారులుగా డబ్బు వసూళ్లు చేస్తున్నారు. రెండేళ్లుగా శ్రీనివాసకుమార్ నగరంలో నివసించే మహేష్, లోకం బాలాజీతో కలిసి విజిలెన్స్ అధి కారులుగా, పొల్యూషన్ బోర్ఢు అధికారులుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. యజమానులను బెదిరించి డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వెంకట శ్రీని వాసకుమార్, బాలాజీలను విద్యాధరపు రం వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 40 వేలు, నకిలీ రసీదులు, స్టాంపులు స్వాధీ నం చేసుకున్నారు. ఓ కారు, బైక్‌కూడా స్వా ధీనం చేసుకున్నారు. మరో నిం దితుడు మహేష్ పరారీలో ఉన్నాడు.డీసీపీ గజరావు భూ పాల్, ఉయ్యూరు సీఐ సత్యానందం పాల్గొన్నారు. -
రామగౌడ్ మృతిపై విచారణ జరపాలి
బెల్లంపల్లి : నెన్నెలకు చెందిన రంగు రామగౌడ్ ఆత్మహత్యపై ప్రభుత్వం వెంటనే సీబీసీఐడీ విచారణ జరిపించాలని సీపీఐ, బీజేపీ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వేర్వేరుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అండదండలతోనే నెన్నెల మండల కోఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, సర్పంచ్ ఆస్మా మరి కొందరు టీఆర్ఎస్ నాయకులు రామగౌడ్‌పై అక్రమ కేసు బనాయించారని అన్నారు. ఎమ్మెల్యేగా చిన్నయ్య ఎన్నికైన నుంచి నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని అన్నారు. ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వేధింపుల వల్ల ఏడాదిన్నర క్రితం తాండూర్ మండలానికి చెందిన ఆరె వరలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్యను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రామగౌడ్ ఆత్మహత్యకు కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఎం.మల్లేష్, ఎం.వెంకటస్వామి, సిహెచ్.నర్సయ్య, లక్ష్మీనారాయణ, రాజం, మల్లేష్, చంద్రమాణిక్యం, రాజమౌళి, బీజేపీ నాయకులు కె.భాస్కర్, డి.ప్రకాష్, సోమశేఖర్, మోహ న్, నర్సయ్య, ఎం.శ్రీనివాస్, అరుణ్ తదితరులున్నారు. -
వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసు?
బంజారాహిల్స్: వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసంటూ చోరీ కేసులో నిందితురాలు పోలీసులకు సమాధానం చెబుతుంటే అర్థంకాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ నివాసంలో బంగారు ఆభరణాలు చోరీ అయిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు పనిమనిషి సుజాతను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు ఆమె స్వగ్రామానికి వెళ్లి చోరీ చేసిన ఆభరణాల గురించి వాకబు చేయగా ఆమె పోలీసులకు సహకరించకుండా గంటకోమాట మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రోజులుగా ఆమెను విచారిస్తుండగా చోరీ చేసిన ఆభరణాలు ఎక్కడ దాచిన విషయం సరిగ్గా చెప్పడం లేదు. రోజుకొక మాట మాట్లాడుతూ పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నట్లు సమాచారం. లక్ష్మినారాయణ నివాసంలో కేవలం నెల రోజులు మాత్రమే పనిచే నగలబాక్స్ను మాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దోచిన నగలను కొంత మందికి విక్రయించినట్లు తెలియగా వారి వద్దకు వెళ్తే తాము కొనుగోలు చేయలేదంటూ ఎదురు తిరుగుతున్నారు. ఒక వైపు నిందితురాలు సహకరించకపోగా మరోవైపు నగలు కొనుగోలు చేసిన వారుకూడా తలోమాట మాట్లాడుతుండటంతో ఈ కేసు ముందుకు సాగడం లేదు. దొంగను పట్టుకున్నామన్న ఆనందం పోలీసులకు లేకుండా పోయింది. -
‘బీబీనగర్’ రిసార్ట్‌లో నయీమ్ కేసు విచారణ
బీబీనగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో నల్లగొండ జిల్లా భువనగిరి, పరిసర ప్రాంతాలకు చెందిన అనుచరులను, నిందితులను, అతడితో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇందుకోసం వారు బీబీనగర్ మండలంలోని ఓ రిసార్టును వేదిక చేసుకున్నట్లు సమాచారం. పాశం శ్రీనుతోపాటు, మరి కొంతమందిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని ఈ రిసార్టుకు తీసుకువచ్చి విచారిస్తునట్లు తెలిసింది. అలాగే, బీబీనగర్ మండలంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులకు నయీమ్‌తో ఎమైనా సంబంధాలున్నాయా? నయీమ్ అనుచరులు ఇక్కడ భూదందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడ్డారా? వారికి ఎవరైనా సహకరించారా? అని సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి
షాద్‌నగర్ : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్లో నిజానిజాలు బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింVŠ జడ్జితో విచారణ చేయించాలని పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర కార్యదర్శి జయవింద్యాల డిమాండ్ చేశారు. శుక్రవారం షాద్‌నగర్ శివారులోని మిలీనియం టౌన్షిప్లో నయీం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకునేందుకు ఆంధ్రా పాలకులు నయీంను పావుగా వాడుకున్నారన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని అప్రూవల్‌గా మార్చి విచారించి ఉంటే బడా నేతల భాగోతం బయటపడేదన్నారు. నయీంను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్బాల్‌ఖాన్, జంట నగరాల ప్రధాన కార్యదర్శి సలీం, సభ్యుడు కష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కూతురు ఎందుకు అలా తింటుందని..
బీజింగ్: తన కూతురు ఇష్టమొచ్చిన వస్తువులన్నింటిని తింటుండంతో ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి వారితో దర్యాప్తు చేయించింది. అసలు ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకొని అవాక్కయింది. ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. చైనాలోని ఒక అమ్మాయి బతికున్న చేపలను, వానపాములను, పాముల్లాంటి చేపలు(పాపెర్లు) తింటుంది. ఇంట్లో ట్యూబ్లైట్స్ తో సహా ఏ ఎలక్ట్రిక్ వస్తువులను వదల్లేదు. దీంతో భయపడిన ఆమె తల్లి పోలీసులకు చెప్పి దర్యాప్తు చేయించింది. ఈ దర్యాప్తులో ఆ అమ్మాయికి ఒక ఆన్ లైన్ ఖాతా ఉందని, చైనాకు చెందిన ఓ వీడియో యాప్ ద్వారా వాటిని ఆన్ లైన్లో పెట్టింది. ఆన్లైన్ లో హిట్స్ కొట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేసిందని తేలింది. ఆమె ఇలా చేయడం ద్వారా మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఒకేసారి ఆమె ఖాతాలో పెరిగిపోయారంట. ఈ జుగుప్సకరమైన వీడియోలను ఇప్పటికీ ఆన్ లైన్ లో నుంచి ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. -
చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కేరళ ప్రభుత్వం దృష్టి..
గతేడాది సంచలం సృష్టించిన కిస్ ఆఫ్ లవ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా కేరళలో పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై కేరళ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు హోం మంత్రి వెల్లడించారు. గతేడాది రాష్ట్రంలో జరిగిన వివాదాస్పద 'కిస్ ఆఫ్ లవ్' నిరసనపై దర్యాప్తు ప్రారంభించినట్లు కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల తెలిపారు. ఆన్ లైన్ వ్యభిచారం, సెక్స్ ట్రేడ్, వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నిరసనలో పాల్గొన్న వారందరికీ క్రిమినల్ ఉద్దేశ్యాలు ఉన్నట్లుగా చెప్పలేమని... కోచి ఆన్ లైన్ వ్యభిచారం కేసులో ఉద్యమ నిర్వాహకులతో మొత్తం పదిమందిని అరెస్ట్ చేసిన ఓ రోజు తర్వాత ఆయన స్పందించారు. కిస్ ఆఫ్ లవ్ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నవారు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారని హోం మంత్రి చెన్నితాల అన్నారు. ఇది కేవలం వారి స్వార్థ ప్రయోజనాలకోసం చేస్తున్నట్లుగా స్పష్టమౌతోందన్నారు. ఇటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పిన ఆయన... మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారందరినీ వ్యతిరేకులుగా నమ్మలేమన్నారు... మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా గతేడాది ఫేస్ బుక్ పేజ్‌లో కిస్ ఆఫ్ లవ్ ప్రారంభమైంది. అయితే దీన్ని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సహా పలు మతవాద, రాజకీయ బృందాలు అప్పట్లో వ్యతిరేకించాయి. తాజాగా ఆన్ లైన్ వ్యభిచారం, మైనర్లతో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌కు సంబంధించిన కార్యకలాపాలపై దృష్టి సారించిన పోలీసులు బుధవారం 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాలను నిర్వహించిన రాహుల్ పసుపాలన్, అతని భార్య, రేష్మి ఆర్ నాయర్‌తోపాటు ఎనిమిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 'ఆపరేషన్ బిగ్ డాడీ' పేరుతో నిర్వహించిన తనిఖీల్లో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్నాకులం రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. క్రైం బ్రాంచ్ ఇచ్చిన సమాచారం మేరకు రహస్యంగా దర్యాప్తు జరిపిన పోలీసు బృందాలు... మలప్పరం, త్రిసూర్, పాలక్కడ్ లలో ఏకకాలంలో దాడులు జరిపాయి. కొచ్చు సదరికల్ పేజీలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు, కామెంట్స్ ను పరిశీలించి.. ఆపేజీలో ఉన్నవారంతా క్లైంట్స్ గా తేల్చారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను కూడ వీరు ట్రాప్ చేసి తెస్తున్నట్లుగా తేల్చి, గట్టి నిఘాతో నిందితులను ఆరెస్ట్ చేశారు. కేరళ కొళికోడ్ లోని ఓ హోటల్ లో అనైతిక కార్యకలాపాలపై అప్పట్లో భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు దాడి జరపడంతో కొందరు ఫేస్ బుక్‌లో కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో పాల్గొనే వారు బహిరంగంగా ముద్దు పెట్టుకోవాలని నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే అప్పట్లో కార్యక్రమం మొదలు కాకముందే పోలీసులు దాడిచేసి పాల్గొనేందుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని వదిలేశారు. అయితే ప్రస్తుత సెక్స్ రాకెట్ కేసులో ఆ కార్యక్రమ నిర్వాహకులను కూడ పోలీసులు ప్రశ్నించడం కేరళలో చర్చనీయాంశమైంది. -
చిక్కుల్లో ‘కామరాజ్’
సాక్షి, చెన్నై : తనను మోసం చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆర్ కామరాజ్‌కు చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.విచారణకు కోర్టు ఆదేశించడంతో డీఎస్పీ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. తిరువారూర్ జిల్లా నీడామంగళం సమీపంలోని కీలై వలైకు చెందిన పీవీఎస్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. గతంలో చెన్నైలో ఆయన ఓ బంగ్లా కొనుగోలు చేశారు. అందులో అద్దెకు ఉన్న వాళ్లు ఖాళీ చేయక పోవడంతో అన్నాడీఎంకే నాయకుడు కామరాజ్ బంధువు రామకృష్ణన్‌ను ఆశ్రయించాడు. ఆయన ద్వారా కామరాజ్‌తో ఆ బంగ్లాలో ఉన్న వాళ్లను ఖాళీ చేయించాలని కోరుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు గాను రూ. 30 లక్షలు చేతులు మారాయి. ఖాళీ చేసి బంగ్లా అప్పగిస్తానన్న కామరాజ్ అందుకు తగ్గ ప్రయత్నాలు చేయలేదు. అలాగే, ఎన్నికల్లో విజయంతో ఆయన మంత్రి అయ్యారు. తనకు ఆ బంగ్లా ఖాళీ చేయించి ఇవ్వాలని లేని పక్షంలో తీసుకున్న రూ. 30 లక్షలు వెనక్కు ఇవ్వాలని పదే పదే మంత్రి చుట్టు తిరిగినా ఫలితం శూన్యం. ఇక, కామరాజ్ మంత్రి కావడంతో ఆయన దర్శనం కోసం పడిగాపులు గాచినా, చి వరకు కుమార్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. తనను కామరాజ్ మోసం చేశారని మన్నార్ కుడి పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం శూన్యం. వారు ఫిర్యాదు అందుకోకపోవడంతో మద్రాసు హైకోర్టును కుమార్ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయ స్థాయం కుమార్‌కు భరోసా ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మన్నార్ కుడి డిఎస్పీని ఆదేశించింది. దీంతో విచారణకు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందం గురువారం రంగంలోకి దిగింది. ఫిర్యాదు అందుకున్న ఈ బృందం కేసు నమోదు చేసే పనిలో పడింది. కుమార్‌తో విచారణ ముగియగానే, ఇక మంత్రి కామరాజ్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి. కాగా, మంత్రులపై ఏదేని అవినీతి ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు బయలు దేరినా, పోలీసు కేసులు ఎదురైనా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నెర్ర చేయడం సహజం. ఈ దృష్ట్యా, త్వరలో రాష్ట్ర క్యాబినెట్లో మార్పులు జరిగేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇప్పటికే అగ్రి కృష్ణమూర్తి రూపంలో ఇరకాటంలో పడ్డ సీఎం పన్నీరు సెల్వం ప్రభుత్వానికి, తాజాగా మరో మంత్రిపై ఆరోపణలు బయలు దేరి ఉండటం మరో శిరోభారమే. -
విశాఖలో ఓ వ్యక్తి అనుమానస్పద మృతి
-
బ్లాక్‌మనీ జాబితాలో సోనియా అల్లుడు?
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బ్లాక్ మనీ దాచుకున్న వారిలో వాద్రా ఉన్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఆయనపై కేసు నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు సమాచారం. వాద్రాపై గతంలో కూడా పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. బ్లాక్ మనీ దాచుకున్న వారి జాబితాను త్వరలో బయటపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఒప్పందంలో భాగంగా జర్మనీ నుంచి వివరాలు సేకరించామని తెలిపారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి పేరు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. జైట్లీ వీటిని ఖండించకపోవడం మరింత ఊతమిస్తోంది. -
చిక్కుల్లో మమతా బెనర్జీ
-
కేసీఆర్ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు
సీబీఐ ఎస్పీకి ప్రత్యేక కోర్టు ఆదేశం కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతి ఆస్తులపై ప్రైవేట్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) అక్రమంగా పెద్దఎత్తున ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐ ఎస్పీని ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశించింది. అలాగే కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావు, మెదక్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదేశించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డంపెట్టుకొని కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతి అక్రమంగా డబ్బు ఆర్జించారని, వారి ఆస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది వై.బాలాజీ వధేరా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిన ప్రైవేటు ఫిర్యాదును పరిశీలించిన న్యాయమూర్తి... ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతి అక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ మాజీ నేత రఘునందన్‌రావును ఫిర్యాదులో సాక్షిగా పేర్కొన్నారు. ‘‘కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతిల అక్రమార్జన వివరాలను రఘునందన్‌రావు గత ఏడాది మే 15న బయటపెట్టారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్ భారీగా డబ్బును ఆర్జించి, బంధువుల పేరుతో స్థిర, చరాస్తులు కూడబెట్టారని ఆయన ఆరోపించారు. ఫాంహౌస్‌లతోపాటు ప్రైవేటు సీ పోర్టులు, ఓడలు వీరి పేరుతో ఉన్నాయి. సినీనటుడు కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోకు ప్రభుత్వ భూముల కేటాయింపు వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హరీష్‌రావు... తర్వాత కృష్ణను బెదిరించి రూ. 80 లక్షలు వసూలు చేశారని, ఈ సమయంలో విజయశాంతి భర్త శ్రీనివాసప్రసాద్ అక్కడే ఉన్నారని రఘునందన్‌రావు తెలిపారు. కేసీఆర్ అక్రమాస్తులపై ప్రశ్నించిన పార్టీ కార్యకర్తలను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను సీడీ రూపంలో రఘునందన్‌రావు బయటపెట్టారు. ఈ కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’’ అని బాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మార్ కేసులోనూ కేసీఆర్ ప్రమేయంపై వచ్చిన ఆరోపణలపై కూడా సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయించాలని కోర్టును కోరారు. కేసీఆర్ తదితరుల ఆస్తులపై గతంలో తాను పిల్ దాఖలు చేసినప్పుడు హైకోర్టు సూచన మేరకు సీబీఐకి ఫిర్యాదు చేశానని, అయితే ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం వల్లే ప్రైవేట్ ఫిర్యాదు చేస్తున్నట్లు విన్నవించారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు. అయోమయంలో సీబీఐ అధికారులు... సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతిల ఆస్తులపై దర్యాప్తు చేయాలా.. వద్దా అనే విషయంలో సీబీఐ అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ప్రైవేటు ఫిర్యాదులను తమకు పంపి దర్యాప్తుకు ఆదేశించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉండదని సీబీఐ వర్గాల భావన. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు ఆదేశాలను ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి పంపి, అక్కడి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పుడు మాత్రమే సీబీఐ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అయితే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అక్రమాలపై దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసి దాదాపు 20 రోజులు దాటినా సీబీఐ అధికారులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాఖలాలు లేవు. -
శశి థరూర్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
న్యూఢిల్లీ: అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సునందా పుష్కర్ కేసులో ఆమె భర్త, కేంద్ర మంత్రి శశి థరూర్‌తో పాటు ఆమె బంధువులను పోలీసులు విచారించే అవకాశం ఉంది. మంగళవారం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సునంద మృతిని హత్య లేదా ఆత్మహత్య కోణంలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో, వారు కేంద్ర మంత్రిని విచారణలో పాల్గొనాల్సిందిగా కోరడానికి సిద్ధమవుతున్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం కేంద్ర మంత్రితో పాటు మరో 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం. కాగా, తన తల్లి ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదని సునంద కుమారుడు శివ్ మీనన్ చెప్పారు. మీడియా వార్తలతో ఒత్తిడికి లోనవడం, తప్పు డు విధంగా వివిధ మందులను కలిపి వాడడం సునంద మృతి చెందారని తెలిపారు. అప్పుడప్పుడు గొడవపడినా శశి థరూర్, తన తల్లిని ప్రేమగానే చూసుకునేవారని చెప్పారు.