
హర్యానా: ఏం జరిగిందో ఏమో హర్యానాలో ఒక కుంటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన హర్యానాలోని అంబాలాలో చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు సంగత్ రామ్(65), అతని భార్య మహింద్రా కౌర్, సుఖ్వీందర్ సింగ్(34), అతని భార్య రీనా, వారి ఇద్దరు కూతుళ్లు ఆషు, జస్సీలుగా గుర్తించినట్లు తెలిపారు.
ఈ ఘటనకు గల కారణాలేమిటో తెలుసుకునేందుకు క్రైం టీంని పిలిపించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ మృతుల వద్ద నుంచి సూసైడ్ నోట్ లభించిందని పేర్కొన్నారు. ఇదే విధంగా ఈ నెల ప్రారంభంలో జమ్ములోని సిధ్రలో ఒక కుటుంబం చనిపోయిందని తెలిపారు.
(చదవండి: నిందితుడిని అరెస్టు చేయబోతుండగా... పోలీసులపై దాడి యూనిఫాం చింపి....)
Comments
Please login to add a commentAdd a comment