ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల అధిక శబ్దాలతో వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో వాహనదారులతో పాటు వృద్ధులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే శబ్దకాలు ష్యంతో అవస్థలు పడుతున్నామని పలువురు పోలీ స్‌స్టేషన్ మెట్లెక్కారు. దీంతో ఇటీవల పట్టణ పోలీ సులు అలాంటి సైలెన్సర్లు అమర్చి వాహనాలు న డుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కొరడా ఝులిపిస్తున్నారు.
మెకానిక్ షాప్‌లకు నోటీసులు..
అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చే మెకానిక్ షాప్‌లకు నోటీసులు పంపిస్తాం. అయినా వినకుంటే కేసులు నమోదు చేస్తాం. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చుకునే ద్విచక్ర వాహనదారులకు మొదటిసారిగా జరిమానా విధించి తర్వాత కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతాం. శబ్ద కాలుష్యం ద్వారా జరిగే అనర్థాలకు ఎవరు కారణం కావద్దు. లేదంటే తగిన చర్యలు తీసుకుంటాం. - గంగారెడ్డి, నిర్మల్ డీఎస్పీ
సౌండ్‌తో ఇబ్బంది అవుతుంది..
సౌండ్ వచ్చే ద్విచక్ర వాహనాలతో పట్ట ణంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. మైనర్లు సైతం ద్విచక్ర వాహనాలకు సౌండ్ వచ్చే సైలెన్సర్లు బిగించి రోడ్డు మీద వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనాలతో రోడ్లపై ఇష్టానుసారంగా నడుపుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరించాలి. - శంకర్ యాదవ్, మంజులాపూర్
కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మార్చుతూ..
ద్విచక్ర వాహనానికి కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మాడిపై చేస్తున్నారా..? అయితే మీకు షాక్ ఇచ్చేందుకు పట్టణ పోలీసులు సిద్ధమయ్యారు. శబ్ద కాలు ష్యంపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు అధిక శబ్దాలు చేసే వారి వాహనాల పని పడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు.
రోడ్డు రోలర్‌తో తొక్కిస్తూ..
అధిక సౌండ్ చేసే బైక్‌లను పట్టుకుని వాటి సైలెన్సర్లను తొలగించి పట్టణ నడి ఒడ్డున గల చౌరస్తాలో రోడ్‌రోలర్‌తో వాటిని పోలీసులు తొక్కించి నుజ్జునుజ్జు చేయిస్తున్నారు. 2023లో ఇప్పటివరకు 126 సై లెన్సర్లను తొలగించారు. ఇందులో నుంచి 100 ద్వి చక్ర వాహనాలకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మిగతా 26 ద్విచక్ర వాహనాలను ఆర్టీ వోకు అప్పజెప్పారు. దీంతో ఆర్టీవో ఒక్కొక్క వాహనానికి రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. కొన్ని ద్విచక్ర వాహనాలకు పలువురు నేటికీ అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని తిరుగుతున్నారు.
శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు..
ఖరీదైన ద్విచక్ర వాహనాలు నడిపేవారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడుతున్నారని నిర్మల్‌లో ఫి ర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సైలెన్సర్లు వాడడంతో శబ్ద కాలుష్యంతో పాటు, వృద్ధుల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడనుంది. అంతేకాకుండా రో డ్డుపై వెళ్లే మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరుతున్నారు.
విక్రయదారులపై చర్యలు శూన్యం..
మార్కెట్లో విచ్చలవిడిగా మెకానిక్ షాపుల్లో అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు విక్రయిస్తున్నారు. మొదట గా సైలెన్సర్లు విక్రయించే షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకుంటే అమ్మడం ఆపేస్తారని సూచిస్తున్నారు. పోలీసులు వారిని కట్టడి చేస్తే ఎవరు అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు అమర్చుకోలేరని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment