silencers
-
సౌండ్ వస్తే నుజ్జు నుజ్జే..
-
మీ బైక్ సైలెన్సర్ సౌండ్ మారిందో.. జర జాగ్రత్త..!
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల అధిక శబ్దాలతో వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో వాహనదారులతో పాటు వృద్ధులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే శబ్దకాలు ష్యంతో అవస్థలు పడుతున్నామని పలువురు పోలీ స్‌స్టేషన్ మెట్లెక్కారు. దీంతో ఇటీవల పట్టణ పోలీ సులు అలాంటి సైలెన్సర్లు అమర్చి వాహనాలు న డుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. మెకానిక్ షాప్‌లకు నోటీసులు.. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చే మెకానిక్ షాప్‌లకు నోటీసులు పంపిస్తాం. అయినా వినకుంటే కేసులు నమోదు చేస్తాం. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చుకునే ద్విచక్ర వాహనదారులకు మొదటిసారిగా జరిమానా విధించి తర్వాత కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతాం. శబ్ద కాలుష్యం ద్వారా జరిగే అనర్థాలకు ఎవరు కారణం కావద్దు. లేదంటే తగిన చర్యలు తీసుకుంటాం. - గంగారెడ్డి, నిర్మల్ డీఎస్పీ సౌండ్‌తో ఇబ్బంది అవుతుంది.. సౌండ్ వచ్చే ద్విచక్ర వాహనాలతో పట్ట ణంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. మైనర్లు సైతం ద్విచక్ర వాహనాలకు సౌండ్ వచ్చే సైలెన్సర్లు బిగించి రోడ్డు మీద వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనాలతో రోడ్లపై ఇష్టానుసారంగా నడుపుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరించాలి. - శంకర్ యాదవ్, మంజులాపూర్ కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మార్చుతూ.. ద్విచక్ర వాహనానికి కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మాడిపై చేస్తున్నారా..? అయితే మీకు షాక్ ఇచ్చేందుకు పట్టణ పోలీసులు సిద్ధమయ్యారు. శబ్ద కాలు ష్యంపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు అధిక శబ్దాలు చేసే వారి వాహనాల పని పడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. రోడ్డు రోలర్‌తో తొక్కిస్తూ.. అధిక సౌండ్ చేసే బైక్‌లను పట్టుకుని వాటి సైలెన్సర్లను తొలగించి పట్టణ నడి ఒడ్డున గల చౌరస్తాలో రోడ్‌రోలర్‌తో వాటిని పోలీసులు తొక్కించి నుజ్జునుజ్జు చేయిస్తున్నారు. 2023లో ఇప్పటివరకు 126 సై లెన్సర్లను తొలగించారు. ఇందులో నుంచి 100 ద్వి చక్ర వాహనాలకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మిగతా 26 ద్విచక్ర వాహనాలను ఆర్టీ వోకు అప్పజెప్పారు. దీంతో ఆర్టీవో ఒక్కొక్క వాహనానికి రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. కొన్ని ద్విచక్ర వాహనాలకు పలువురు నేటికీ అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు.. ఖరీదైన ద్విచక్ర వాహనాలు నడిపేవారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడుతున్నారని నిర్మల్‌లో ఫి ర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సైలెన్సర్లు వాడడంతో శబ్ద కాలుష్యంతో పాటు, వృద్ధుల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడనుంది. అంతేకాకుండా రో డ్డుపై వెళ్లే మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరుతున్నారు. విక్రయదారులపై చర్యలు శూన్యం.. మార్కెట్లో విచ్చలవిడిగా మెకానిక్ షాపుల్లో అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు విక్రయిస్తున్నారు. మొదట గా సైలెన్సర్లు విక్రయించే షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకుంటే అమ్మడం ఆపేస్తారని సూచిస్తున్నారు. పోలీసులు వారిని కట్టడి చేస్తే ఎవరు అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు అమర్చుకోలేరని వాపోతున్నారు. -
బుల్లెట్ బాబులు..పని పట్టిన ట్రాఫిక్ పోలీసులు (ఫొటోలు)
-
బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు..
-
బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు..
సాక్షి, కరీంనగర్: చెవులను రణగొణ ధ్వనులతో ఠారెత్తించే ద్విచక్ర వాహనాల సైలెన్సర్స్‌ను కరీంనగర్ పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు. సౌండ్ పొల్యూషన్‌కు కారణమవుతున్న బైక్స్‌ను పట్టుకున్నారు. ఆయా వాహనాలకు చెందిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే.. వారి కళ్లముందే రోడ్ రోలర్ తో సైలెన్సర్స్‌ను తొక్కించేసి.. తునాతునుకలుగా ధ్వంసం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బైక్ సెలైన్సర్లపై కొరడా..రోడ్ రోలర్‌తో తొక్కించిన వైజాగ్ పోలీస్ (ఫొటోలు)
-
బుల్లెట్ బాబులు..పని పట్టిన ట్రాఫిక్ పోలీసులు
-
చెవులు చిల్లులు పడేలా బైక్ రైడ్లు..
బెజవాడలో బైకర్లు బీభత్సం సృష్టిస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా రయ్..రయ్ మంటూ చెవులు చిల్లులు పడేలా బైకులపై దూసుకెళ్తూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. సైలెన్సర్లు తొలగించి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ.. పొగలు విరజిమ్ముతూ నగర రహదారులపై నానా యాగీ చేస్తున్నారు. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తున్న కొందరు యువకులు కనీస నిబంధనలు పాటించకుండా నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిజేస్తున్నారు. మిన్ను విరిగి మీద పడేలా శబ్దం చేస్తూ ధ్వని కాలుష్యానికి కారకులవుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తమకేమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరస్థాయిలో బైక్ రేస్‌లు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సాక్షి, అమరావతిబ్యూరో : చెవిలో కర్ణభేరి సైతం పగిలిపోయేంతలా శబ్దాలు చేస్తూ జనం బెంబేలెత్తేలా మోటర్ సైకిళ్లపై కుర్రాళ్లు వాయువేగంతో దూసుకుపోతున్నారు. సంపన్న వర్గాలకు చెందిన కొందరు యువకులు రూ.లక్షలు వెచ్చించి అత్యాధునిక బైక్‌లు కొనుగోలు చేస్తున్నారు. 550 సీసీ సామర్థ్యం ఉన్న వాహనాలు నడుపుతూ నగరంలో హల్చల్ చేస్తున్నారు. నగరంలో ద్విచక్రవాహనాలు 5,05,424 ఉంటే.. వాటిలో 150 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగినవి సగానికి పైగా ఉన్నాయని సమాచారం. బెంజ్‌సర్కిల్, బీఆర్టీఎస్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు, రాఘవయ్యపార్కు, పంటకాలువ రహదారి ప్రాంతాల్లో అధిక శబ్దం చేసుకుంటూ ప్రయాణిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులే చెబుతున్నారు. చాలా చోట్ల ఫంక్షన్‌హాళ్ల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ సమస్యపై స్థానికులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు తీసుకుంటున్న చర్యలు లేవనే విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా బందరు, ఏలూరు, 65 జాతీయ రహదారులపై ఉదయం, రాత్రి వేళల్లో బైక్‌రేస్‌లు నిర్వహిస్తూ యువకులు రెచ్చిపోతున్నారు. సైలెన్సర్లు మార్చేసి.. చాలామంది యువత తమ వాహనాలకు సైలెన్సర్లను మార్చేందుకు ఇష్టపడుతున్నారు. ద్విచక్రవాహనదారులు, కార్లు ఇతర వాహనదారులు కంపెనీతో వచ్చే సైలెన్సర్లను తొలగించి ప్రత్యేకంగా రూపొందించిన వాటిని అమర్చి ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్నారు. నగరంలో ఇలాంటి వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు వాటిని గుర్తించి పట్టుకొనే ప్రయత్నం చేయడం లేదు. ఒకవేళ ఏ పోలీసైనా అలాంటి వాహనదారులను నిలిపే ప్రయత్నం చేసినా.. వారు తేలిగ్గా తప్పించుకుంటున్నారు. వాస్తవానికి చట్టప్రకారం వారికి శిక్షపడేలా చేయాలన్నా.. శబ్ద కాలుష్యానికి పాల్పడే తీరును సాంకేతికంగా చూపాల్సి ఉంటుంది. ఆ సాంకేతిక పరికరాలు మన వద్ద లేకపోవడంతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. అందుకే నిర్లక్ష్య డ్రైవింగ్ అంటూ కేసులు పెడుతున్నారు. మోత మోగించినా... కేవలం వాహనాలే కాకుండా సౌండ్ బాక్సులు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేసే వాటిపైనా పోలీసులు దృష్టి సారించడం లేదు. ప్రస్తుతానికి వివిధ పండగ కార్యక్రమాల సమయంలో, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల విషయంలో ఉపయోగించే డీజేలపై మాత్రమే పోలీసులు షరతులు పెట్టి అనుమతులిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం.. వాణిజ్య సముదాయ ప్రాంతంలో 65 డెసిబుల్స్ కంటే ఎక్కువగా ధ్వని ఉండకూడదు. నివాస ప్రాంతాల్లో, ధ్వని రహిత ప్రాంతాల్లో 50 డెసిబుల్స్‌కు మించకుండా ఉండాలి. చెవులకు చిల్లులు పడేలా శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు విజయవాడ కమిషనరేట్ పరిధిలో దాదాపు లేవనే చెప్పొచ్చు. శబ్ద కాలుష్య యంత్రాలేవి? నగరంలో శబ్దరహిత ప్రాంతాలుగా ఇప్పటికే ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఉన్నతస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో శబ్ద కాలుష్య నమోదు యంత్రాలను ఏర్పాటుచేయాల్సి ఉంది. అలాంటి యంత్రాలు లేని కారణంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను పట్టుకున్నా కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఉంది. పెద్దగా హారన్లు మోగించేవారిని గుర్తించి మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశమున్నా ట్రాఫిక్ పోలీసులు ఆ దిశగా దృష్టి సారించకపోవడం గమనార్హం. -
బుల్లెట్ల కదలికలపై డేగకన్ను !
గుంటూరు: ఇష్టానుసారంగా బుల్లెట్లను మార్పులు, చేర్పులు చేస్తూ రోడ్లపై మితి మీరిన వేగంతో హల్చల్ సృష్టిస్తున్న వాహనాలపై పోలీస్, రవాణా శాఖాధికారులు డేగకన్ను వేశారు. జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగాబుల్లెట్లకు పెద్దగా శబ్దం వచ్చేలా నకిలీ సైలెన్సర్లను ఏర్పాటు చేసి ‘మోత మోగిస్తున్నారు’ శీర్షికతో బుధవారం ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయా శాఖల ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. అర్బన్, రూరల్ జిల్లాల ఎస్పీలు సీహెచ్ విజయారావు, సీహెచ్ వెంకటప్పల నాయుడులు సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ’సాక్షి’ పత్రికలో ప్రచురితమైన విధంగా రోడ్లపై వాహనాలు నడుస్తున్నట్లు, నకిలీ సైలెన్సర్లు తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఒక వేళ అలాంటివి ఎక్కడ ఉన్నా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు బుల్లెట్ల రాకపోకలపై దృష్టి సారించారు. అదే విధంగా డీటీసీ రాజారత్నం కూడా స్పందించి బుల్లెట్ల రాకపోకలపై నిఘా ఉంచి సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఓ వైపు పోలీసులు, మరో వైపు రవాణా శాఖాధికారులు ప్రధాన రహదారులపై నిఘా పెట్టడంతో భారీ శబ్దంతో పాటు మితిమీరిన వేగంతో నిబంధనలను బేఖాతరు చేస్తున్న వాహన యజమానులు బుధవారం తమ బుల్లెట్లను రోడ్డెక్కెనివ్వలేదు. జిల్లాలోని మంగళగిరి, తెనాలి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో కూడా సైలెన్సర్లను మార్పు చేసిన యువత వాహనాలను బయటకు తీసే సాహసం చేయలేదు. దుకాణాల మూసివేత ’సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గంటల వ్యవధిలోనే రెండు శాఖల అధికారులు రంగంలోకి దిగడంతో నకిలీ వ్యాపారులు, మెకానిక్‌ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందోనని హడలిపోతున్నారు. తెనాలికి చెందిన మెకానిక్ తన దుకాణంలో ఉన్న సైలెన్సర్లను హడావుడిగా రహస్య ప్రాంతాలకు తరలించాడు. తన పేరు బయటకు రాకుండా ఉంచేందుకు పోలీస్ అధికారులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అందుకు ప్రతిఫలం కూడా చెల్లించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అతన్ని తప్పించేందుకు పోలీస్ అధికారులు భరోసా ఇచ్చి వెంటనే దుకాణం మూయించి వేసి పంపినట్లు సమాచారం. ఇదే తరహాలో విజయవాడలోని నకిలీ సైలెన్సర్లు విక్రయిస్తున్న వ్యాపారికి కూడా సమాచారం అందించడంతో అతను కూడా దుకాణంలో ఉన్న వాటిని అతని గోడౌన్‌కు తరలించినట్లు తెలిసింది. మంగళగిరి, నరసరావుపేటల్లోని మెకానిక్‌లు వారు సైలెన్సర్లు విక్రయించిన బుల్లెట్ల యజమానులకు సమాచారం అందించి బయటకు బుల్లెట్‌ను తీసుకురావద్దని చెప్పి వారు దుకాణాలను మూసి వేశారు. ఏది ఏమైనా రెండు శాఖల ఉన్నతాధికారులు ఇదే విధానంలో నిఘా కొనసాగించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే రోడ్డుపై వాహనాలు ప్రశాంతంగా రాకపోకలు కొనసాగించడంతో పాటు గుండెజబ్బు రోగులకు కొంత ఊరట నిచ్చినట్లు ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. -
దడ పుట్టిస్తున్న సైలెన్సర్లు!
మామూలు శబ్దం కాదు.. తుపాకీ నుంచి తూటా దూసుకొచ్చినంత సౌండ్. రాకెట్లాగా నిప్పులు చిమ్ముకుంటూ ప్రయాణం.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగం.. అంతా కుర్రకారే.. రేసుల కోసం.. ప్రత్యేక ఆకర్షణ కోసం.. ప్రజలకు దడ పుట్టిస్తున్నారు. బుల్లెట్ వాహనాలకు వింతైన సైలెన్సర్లను బిగించి రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. తెనాలిలోని ఓ వ్యాపారి తన కుమారుడు బీటెక్ పూర్తి చేసిన ఆనందంలో అతని కోరిక మేరకు బుల్లెట్ కొనిచ్చాడు. అప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ఓ మెకానిక్ అధిక శబ్దంతో పాటు నిప్పులు చెరిగే సైలెన్సర్లు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న యువకుడు నేరుగా అక్కడకు వెళ్లి మెకానిక్ కోరినంత డబ్బు ఇచ్చి నిప్పులు చెరిగే సైలెన్సర్‌ను వాహనానికి బిగించుకున్నాడు. దీంతో రాత్రి వేళల్లో ప్రధాన రహదారులపై హల్చల్ చేస్తున్నాడు. నిప్పులు చెరుగుతూ బుల్లెట్ వెళుతుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ.. రోడ్డు పక్కకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు బైక్ రేసులకు రహస్యంగా వెళ్లడం ప్రారంభించాడు. గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు జిల్లాలో గడచిన నాలుగేళ్లలో యువతలో బుల్లెట్ల క్రేజ్ పెరిగింది. అధునాతనంగా తీర్చిదిద్దిన వాహనానికి అదనపు హంగులు కోసం ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కొందరు మెకానిక్‌లు వారిదైన శైలిలో యువత మోజును క్యాష్ చేసుకుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే మరి కొందరు జిల్లాలోనే నకిలీ సైలెన్సర్లను తయారు చేసి గుట్టుగా విక్రయాలు చేస్తున్నారు. మార్పులు ఇలా... జిల్లా వ్యాప్తంగా గడచిన నాలుగేళ్లలో ప్రతిఏటా సగటున 700 బుల్లెట్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. అధికంగా యువత వాటినే కొనుగోలు చేసేందుకు ఆసకి చూపుతున్నారు. వాహన కొనుగోలు చేసిన అనంతరం బుల్లెట్‌కు నిబంధనల ప్రకారం 70 నుంచి 80 డెసిబుల్స్ లోపు శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేస్తారు. అయితే వాటిని తొలగించి వాటి స్థానంలో 90 నుంచి 160 డెసిబుల్స్ సౌండ్ వచ్చే వాటిని బిగించుకుని హంగామా సృష్టిస్తున్నారు. అయితే వీటితో పాటు పటాకా పేరుతో నూతనంగా మార్కెట్లోకి మంటలు వచ్చే సైలెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. రకాలను బట్టి రూ.2 వేల నుంచి రూ.28 వేల వరకు మెకానిక్‌లు వసూలు చేస్తున్నారు. వాటితో పాటు అధిక శబ్దం వచ్చే విధంగా హారన్లను బిగిస్తున్నారు. ఇలా అదనపు హంగులను ఏర్పాటు చేసుకుంటున్న యువత రహస్యంగా బైక్ రేస్‌లు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గత నెలలో విజయవాడలో బైక్ రేస్ నిర్వహిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కొందరు మెకానిక్‌లు తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి ఆర్డర్లపై సైలెన్సర్లను తెప్పించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో నకిలీ సైలెన్సర్ల తయారీ.. ఇదిలా ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న మంగళగిరి, తాడేపల్లి మండలాలను బైక్ రేసులకు అనువైన ప్రాంతంగా యువత ఎన్నుకొంటోంది. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఏకంగా విజయవాడ, తాడేపల్లి, మంగళగిరితో పాటు తెనాలి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో నకిలీ సైలెన్సర్లను తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్న సైలెన్సర్లు అధిక రేటు కావడంతో యువత తక్కవ ధరకు వచ్చే వాటిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ వ్యాపారి నకిలీలను తనకు నమ్మకమైన మెకానిక్‌లకు మాత్రమే అమ్ముతున్నట్టు సమాచారం. తెనాలిలో ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ కానిస్టేబుల్ చెందిన దుకాణంలో మెకానిక్ విజయవాడ నుంచి సైలెన్సర్లను తెప్పించి మరీ విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. భారీ శబ్దం వచ్చే హారన్లు, సైలెన్సర్లను బిగించి వాహనాలతో రోడ్లపై యువత హల్చల్ చేస్తున్నారు. ఫలితంగా తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక గుండెపోటు వున్న వారి సంగతి అంతే. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రవాణా, పోలీస్, శబ్ద కాలుష్యం శాఖల మధ్య సమన్వయం లోపంతో యువత ఇష్టాను సారంగా రెచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. -
ట్రక్కు సైలెన్సర్‌లో యువతి తల..
న్యూయార్క్ : అమెరికాకు చెందిన ఓ యువతి చేసిన పిచ్చి పని కొద్ది గంటల పాటు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. ట్రక్కు సైలెన్సర్ పెద్దదిగా ఉండటంతో తాగిన మైకంలో ఉన్న ఆ యువతి అందులో తలను దూర్చింది. కొద్ది సేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా ప్రయోజనం లేకపోయింది. అలా కొద్ది గంటల పాటు సైలెన్సర్‌లో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కైట్లీన్ స్ట్రోం(19) అనే యువతి విన్స్టక్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లి అక్కడ పూటుగా మద్యం సేవించింది. తాగిన మైకంలో ఉన్న ఆమె అక్కడున్న ట్రక్కు సైలెన్సర్‌ను చూసింది. పెద్దగా ఉన్న ఆ సైలెన్సర్‌లో తలను దూర్చితే ఎలా ఉంటుందని ఆలోచించి.. అనుకున్నదే తడువుగా అందులోకి తలను దూర్చింది. కొద్దిసేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా కుదరలేదు. ఇది గమనించిన అక్కడి వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి గ్యాస్ కట్టర్ల సహాయంతో ఆమె తలను సురక్షితంగా బయటకు తీశారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లైంది ఆ యువతి పరిస్థితి. ఇది ఇలా ఉంటే చిన్న వయస్సులో మద్యం సేవించినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైలెన్సర్‌లో తల ఇరుక్కున్నప్పటి దృశ్యాలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. దీంతో కైట్లీన్ స్ట్రోం స్పందిస్తూ.. తాను చేసిన పనికి ఏమాత్రం బాధపడటం లేదని ట్రక్కు సైలెన్సర్‌లో తల ఇరుక్కుపోయిన యువతి తానేనంటూ ఫేస్బుక్లో పోస్టులు పెడుతోంది. -
కాలుష్య కారకులకు భారీ జరిమానా..!
న్యూఢిల్లీః రాజధాని నగరంలో కాలుష్య నివారణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరో అడుగు ముందుకేసింది. కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతున్ననగరంలో ఇకపై ధ్వని కాలుష్యాన్ని కూడా అరికట్టేందుకు చర్యలు తీసుకోనుంది. సైలెన్సర్ లేని వాహనాలు నడిపేవారిపై ఆంక్షలు విధించి, కాలుష్య కారకులకు 5000 రూపాయల జరిమానా విధించనుంది. హస్తినలో వాయు కాలుష్యమే కాదు, ధ్వని కాలుష్యం కూడ ఎక్కువేనని గుర్తించిన ఎన్జీటీ.. కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న వ్యక్తులపై కొరడా ఝుళిపించనుంది. సైలెన్సర్ లేని వాహనాలను నడుపుతూ, నగరంలో తీవ్ర శబ్దకాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై 5000 వేల రూపాయలు జరిమానా వేయాలని ప్రకటించింది. ఎన్జీటీ ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం.. భరించరాని, నిబంధనలకు విరుద్ధమైన ధ్వని కాలుష్యాన్ని సృష్టించేవారిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం కింద చలాన్స్ మరియు పెనాల్టీలు విధించినట్లుగానే పర్యావరణ కాలుష్యాన్ని సృష్టించే నేరస్థులు 'పొల్యూటర్ పేస్' (కాలుష్య కారకులు) ఆధారంగా 5000 రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ ఎం ఎస్ నంబియార్ దర్శకత్వంతో కూడిన ధర్మాసనం తెలిపింది. అలాగే వాతావరణ పరిహారాన్ని ప్రత్యేక ఖాతాలో జమచేయాలని ట్రాఫిక్ పోలీసులకు గ్రీన్ ప్యానెల్ సూచించింది. నేరస్థులకు నోటీసులు జారీ చేయడంలో ఎన్జీటీని సంప్రదించేందుకు ట్రాఫిక్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. భారీ శబ్దం వచ్చే హారన్స్ తీవ్ర శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తాయన్న ట్రిబ్యునల్.. వాటి వాడకంపై దేశరాజధానిలో నిషేధం విధించింది. వాహనాల్లో హారన్స్ నుంచి వచ్చే శబ్దం కాలుష్యానికి ప్రధాన సమస్య అని, ముఖ్యంగా ఢిల్లీలో ట్రక్కు డ్రైవర్ల వంటివారు మితిమీరి హారన్ మోగించడంతో పాటు, డిటిసి బస్సులతో వచ్చే శబ్దం వల్ల కూడా నగరంలో కాలుష్యం తీవ్రమౌతోందని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ అధికారులు ఈ కోణంలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వశాఖ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి, నగరంలో శబ్దకాలుష్యాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించింది.