Road Roller
-
మీ బైక్ సైలెన్సర్ సౌండ్ మారిందో.. జర జాగ్రత్త..!
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల అధిక శబ్దాలతో వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో వాహనదారులతో పాటు వృద్ధులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే శబ్దకాలు ష్యంతో అవస్థలు పడుతున్నామని పలువురు పోలీ స్‌స్టేషన్ మెట్లెక్కారు. దీంతో ఇటీవల పట్టణ పోలీ సులు అలాంటి సైలెన్సర్లు అమర్చి వాహనాలు న డుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. మెకానిక్ షాప్‌లకు నోటీసులు.. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చే మెకానిక్ షాప్‌లకు నోటీసులు పంపిస్తాం. అయినా వినకుంటే కేసులు నమోదు చేస్తాం. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చుకునే ద్విచక్ర వాహనదారులకు మొదటిసారిగా జరిమానా విధించి తర్వాత కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతాం. శబ్ద కాలుష్యం ద్వారా జరిగే అనర్థాలకు ఎవరు కారణం కావద్దు. లేదంటే తగిన చర్యలు తీసుకుంటాం. - గంగారెడ్డి, నిర్మల్ డీఎస్పీ సౌండ్‌తో ఇబ్బంది అవుతుంది.. సౌండ్ వచ్చే ద్విచక్ర వాహనాలతో పట్ట ణంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. మైనర్లు సైతం ద్విచక్ర వాహనాలకు సౌండ్ వచ్చే సైలెన్సర్లు బిగించి రోడ్డు మీద వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనాలతో రోడ్లపై ఇష్టానుసారంగా నడుపుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరించాలి. - శంకర్ యాదవ్, మంజులాపూర్ కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మార్చుతూ.. ద్విచక్ర వాహనానికి కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మాడిపై చేస్తున్నారా..? అయితే మీకు షాక్ ఇచ్చేందుకు పట్టణ పోలీసులు సిద్ధమయ్యారు. శబ్ద కాలు ష్యంపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు అధిక శబ్దాలు చేసే వారి వాహనాల పని పడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. రోడ్డు రోలర్‌తో తొక్కిస్తూ.. అధిక సౌండ్ చేసే బైక్‌లను పట్టుకుని వాటి సైలెన్సర్లను తొలగించి పట్టణ నడి ఒడ్డున గల చౌరస్తాలో రోడ్‌రోలర్‌తో వాటిని పోలీసులు తొక్కించి నుజ్జునుజ్జు చేయిస్తున్నారు. 2023లో ఇప్పటివరకు 126 సై లెన్సర్లను తొలగించారు. ఇందులో నుంచి 100 ద్వి చక్ర వాహనాలకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మిగతా 26 ద్విచక్ర వాహనాలను ఆర్టీ వోకు అప్పజెప్పారు. దీంతో ఆర్టీవో ఒక్కొక్క వాహనానికి రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. కొన్ని ద్విచక్ర వాహనాలకు పలువురు నేటికీ అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు.. ఖరీదైన ద్విచక్ర వాహనాలు నడిపేవారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడుతున్నారని నిర్మల్‌లో ఫి ర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సైలెన్సర్లు వాడడంతో శబ్ద కాలుష్యంతో పాటు, వృద్ధుల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడనుంది. అంతేకాకుండా రో డ్డుపై వెళ్లే మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరుతున్నారు. విక్రయదారులపై చర్యలు శూన్యం.. మార్కెట్లో విచ్చలవిడిగా మెకానిక్ షాపుల్లో అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు విక్రయిస్తున్నారు. మొదట గా సైలెన్సర్లు విక్రయించే షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకుంటే అమ్మడం ఆపేస్తారని సూచిస్తున్నారు. పోలీసులు వారిని కట్టడి చేస్తే ఎవరు అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు అమర్చుకోలేరని వాపోతున్నారు. -
బుల్లెట్ బాబులు..పని పట్టిన ట్రాఫిక్ పోలీసులు (ఫొటోలు)
-
బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు..
సాక్షి, కరీంనగర్: చెవులను రణగొణ ధ్వనులతో ఠారెత్తించే ద్విచక్ర వాహనాల సైలెన్సర్స్‌ను కరీంనగర్ పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు. సౌండ్ పొల్యూషన్‌కు కారణమవుతున్న బైక్స్‌ను పట్టుకున్నారు. ఆయా వాహనాలకు చెందిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే.. వారి కళ్లముందే రోడ్ రోలర్ తో సైలెన్సర్స్‌ను తొక్కించేసి.. తునాతునుకలుగా ధ్వంసం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'కారు' మెజారిటీకి గండి పెట్టిన రోడ్డు రోలర్, రోటీ మేకర్
నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీ మెజారిటీకి కారును పోలిన గుర్తులతో గండి పడింది. ఉప ఎన్నికలో ఇండిపెండెంట్లకు కారును పోలి ఉన్న రోడ్డు రోలర్, చపాతి మేకర్ గుర్తులు వచ్చాయి. దీంతో కొందరు ఓటర్లు వాటిని చూసి కారు గుర్తే అనుకుని ఓటేసినట్లు తెలుస్తోంది. కారును పోలిన గుర్తులను మిగతావారికి ఇవ్వొద్దని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసింది. అయినా దాన్ని తొలగించలేదు. మొత్తం ఉప ఎన్నికలో 47 మంది పోటీలో ఉండగా 12వ నెంబర్లో ఉన్న అభ్యర్థికి చపాతి మేకర్ గుర్తు వచ్చింది. ఆ గుర్తుకు 2,407 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 14వ నెంబర్లో ఉన్న అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. ఆ గుర్తుకు 1,874 ఓట్లు వచ్చాయి. ఈ రెండు గుర్తులకు వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడితే మెజారిటీ మరింత పెరిగేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాగా, రెండో బ్యాలెట్లో 18వ నంబర్ అభ్యర్థి చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు వచ్చాయి. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
Munugode Bypoll: రోడ్డురోలర్ ఎఫెక్ట్.. ఆర్వోపై వేటు.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/చండూరు: మునుగోడు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి (ఆర్వో) జగన్నాథరావు యుగతులసి పార్టీ అభ్యర్థికి కేటాయించిన రోడ్డురోలర్ గుర్తును మార్చి మరో గుర్తును కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా మండిపడింది. ఆర్వో తనకు లేని అధికారాలను వినియోగించారని ఆగ్ర హం వ్యక్తం చేసింది. జగన్నాథరావును ఎన్నికల విధుల నుంచి తప్పించి.. రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలను మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌కు అప్పగించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. ఏం జరిగింది? కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏదైనా ఎన్నికలో తొలుత గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకు, తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు లాటరీ ద్వారా గుర్తులను కేటాయిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో ఇచ్చిన ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సంఘం చివరిగా 2021 సెప్టెంబర్ 23న ‘ఫ్రీసింబల్స్’ జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 17న జనరల్ అబ్జర్వర్ సమక్షంలో లాటరీ ద్వారా యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్‌కు రోడ్డురోలర్ గుర్తును కేటాయించారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు చండూరులోని ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. టీఆర్ఎస్ గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్‌ను ఎలా కేటాయిస్తారని మండిపడ్డాయి. నల్లగొండలోని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నివాసం ఎదుట కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. మరోవైపు 18న విడుదల చేసిన గుర్తుల కేటాయింపు జాబితాలో రోడ్డురోలర్ గుర్తు మాయమైంది. రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు.. రోడ్డురోలర్ గుర్తును మార్చి కొత్తగా బేబీ వాకర్ గుర్తును శివకుమార్‌కు కేటాయించారు. అదికూడా జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లకుండా/ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చే ముందు అభ్యర్థికి ఎలాంటి నోటీసు/సమాచారం ఇవ్వలేదు. నామినేషన్ పత్రాల్లో శివకుమార్ ఇచ్చిన ప్రాథమ్యాల్లో బేబీ వాకర్ గుర్తు లేదు. రిటర్నింగ్ అధికారి ఎన్నికల గుర్తును మార్చిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తూ.. జనరల్ అబ్జర్వర్ ఈ నెల 18న లేఖ రాశారు. శివకుమార్ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ ఈ నెల 19న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నివేదిక తెప్పించుకుంది. సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్, 1961లోని నిబంధన 10(5)’ను ప్రయోగిస్తూ ఆర్వో జగన్నాథరావు ఎన్నికల గుర్తు మార్పు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఈసీ తప్పుబట్టింది. ఒకసారి అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులను మార్చే అధికారం కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. తనకు లేని అధికారాలను వినియోగించి ఎన్నికల గుర్తు మార్చడానికి దారితీసిన పరిస్థితులపై సంజాయిషీ ఇవ్వాలని జగన్నాథరావును ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్‌కు లేఖ రాశారు. ఈ మేరకు జగన్నాథరావు పంపిన సంజాయిషీని సీఈవో కార్యాలయం గురువారం రాత్రి సీల్డ్ కవర్లో ఈసీకి పంపింది. మారిన గుర్తులతో బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. సీఈవో కార్యాలయాన్నీ సంప్రదించని తీరు ఎన్నికల గుర్తు మార్పు విషయంలో ఆర్వో జగన్నాథరావు సీఈవో కార్యాలయాన్ని కూడా సంప్రదించలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఈసీ ఆదేశాల మేరకు జగన్నాథరావుపై చర్యలకు అవకాశముందని పేర్కొన్నాయి. అయితే ఓ పార్టీ ఒత్తిడితోనే జగన్నాథరావు ఎన్నికల గుర్తును మార్చారని ఈసీ నిర్ధారణకు వచ్చిందని.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈసీ నల్లగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) అయిన జగన్నాథరావును తప్పించి.. ఆ స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌ను నియమించింది. తదుపరి పోస్టింగ్ కోసం రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని జగన్నాథరావుకు సూచించింది. గుర్తుల తొలగింపుపై టీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈసీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన అంబాసిడర్ కారును పోలిన ఎనిమిది ఎన్నికల చిహ్నాలు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నాయని.. వాటిని తొలగించాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కెమెరా, చపాతీ రోలర్, డోలీ (పల్లకి), రోడ్డురోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, పడవ గుర్తులు తమ పార్టీ గుర్తును పోలి ఉన్నాయని, ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ పేర్కొంది. అయితే టీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తి సజావుగా లేదని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడినట్టు సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీనిపై సీఈవో వికాస్‌రాజ్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. సీరియల్ నంబర్‌పైనా ఫిర్యాదు ఇక బ్యాలెట్లో తమకు సీరియల్ నంబర్ కేటాయింపు విషయంలోనూ యుగతులసి పార్టీ రిటర్నింగ్ అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. బ్యాలెట్ పేపర్లో మొదట తమకు సీరియల్ నంబర్ 5ను కేటాయించినా.. తర్వాత 14వ నంబర్‌కు మార్చారని, దీనిని కూడా సరిదిద్దాలని కోరింది. నాకు ఉన్న అధికారాలతోనే గుర్తును మార్చాం: జగన్నాథరావు యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు తొలుత రోడ్డురోలర్ గుర్తు కేటాయించింది వాస్తవమేనని.. తర్వాత వచ్చిన వినతుల మేరకు తనకున్న అధికారంతో గుర్తును మార్చానని తొలగింపునకు గురైన రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు. చండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ నుంచి వచ్చిన తాజా ఆదేశాల మేరకు యుగతులసి పార్టీకి తిరిగి రోడ్డురోలర్ గుర్తును కేటాయించామన్నారు. యుగతులసి అభ్యర్థికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సీరియల్ నంబర్ 14 వచ్చిందని, 5వ నంబర్ కాదని చెప్పారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ అ«ధికారిగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. -
యుగతులసి పార్టీకే రోడ్డు రోలర్ గుర్తు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కే రోడ్డు రోలర్ గుర్తును కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ నెల 17 రాత్రి జరిగిన నామినేషన్ల ఉపసంహరణ తరువాత రోడ్డు రోలర్ గుర్తు లాటరీ పద్ధతిలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు వచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన మీడియాకూ వెల్లడించారు. అయితే 18న బయటకు వచ్చిన జాబితాలో మాత్రం ఆయనకు బేబీ వాకర్ గుర్తును కేటాయించినట్లుగా ఉంది. దీంతో శివకుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. గుర్తుల కేటాయింపు రోజున తనకు రోడ్డురోలర్ కేటాయించిన అధికారులు.. మరుసటిరోజు జాబితాలో ఆ గుర్తు లేకుండా చేశారని, తన గుర్తును మార్చేశారని ఫిర్యాదు చేశారు. తమ కారు గుర్తును పోలి ఉన్న రోడ్డురోలర్, క్యాప్, చపాతి రోలర్ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ 17వ తేదీ రాత్రి ఆందోళన చేసింది. దీంతో తెల్లారేసరికి గుర్తులు మారిపోయాయని, దీనిపై వివరణ కోసం తాను ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని శివకుమార్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం భారత ఎన్నికల సంఘం వద్దకు కూడా వెళ్లడంతో, వారు పరిశీలన జరిపి రోడ్డు రోలర్ గుర్తును శివకుమార్‌కే కేటాయించేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు గుర్తుల విషయంలో రిటర్నింగ్ అధికారిపైనా చర్యలకు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు, ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. -
రూ.3.14 కోట్ల మద్యం బాటిళ్లు ధ్వంసం.. రోడ్డు రోలర్‌తో తొక్కించి
సాక్షి, నెల్లూరు: మద్యం అక్రమరవాణా, అనధికార విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా సెబ్, పోలీసు అధికారులు దాడులు చేశారు. మూడు సంవత్సరాల్లో రూ.3.14 కోట్ల అక్రమ మద్యాన్ని స్వా«దీనం చేసుకుని వందలాది మందిని కటకటాల వెనక్కి పంపారు. వరుస దాడులతో అక్రమ రవాణా తగ్గుముఖం పడుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. జిల్లా పోలీçసు బాస్‌ల పర్యవేక్షణలో సెబ్ అధికారులు, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్రమ రవాణాకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో కాపు కాసి దాడులు చేస్తున్నారు. కార్లు, బస్సులు, కంటైనర్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్న పొరుగు మద్యంతోపాటు డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వా«దీనం చేసుకుని నిందితులను కటకటాల వెనక్కి పంపుతున్నారు. పక్కాగా.. మూడేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా సెబ్, పోలీసులు 2,744 కేసులు నమోదు చేసి (ఎన్డీపీఎల్, డీపీఎల్) రూ 3,14,37,980 విలువ చేసే 74,547 మద్యం బాటిళ్ల (15,719 లీటర్ల)ను స్వా«దీనం చేసుకున్నారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీలక్ష్మి పూర్తిస్థాయిలో అక్రమ మద్యం కట్టడికి చర్యలు తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత నేరస్తులను బైండోవర్ చేయడంతోపాటు పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తున్నారు. వరుస దాడులు, సెబ్, పోలీసు అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలవడంతోపాటు అక్రమ రవాణా, అనధికార విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మాకివ్వండి సారూ.. పట్టుబడిన మద్యంను ధ్వంసం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ అధికారులు మంగళవారం కొత్తూరు టాస్‌్కఫోర్స్ కార్యాలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను రోడ్డురోలర్లతో తొక్కించారు. దీంతో ఆ ప్రాంతమంతా మద్య ప్రవాహంతో నిండిపోయింది. మద్యం బాటిళ్లను చేస్తున్నారన్న ధ్వంసం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు, మందుబాబులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డురోలర్లతో తొక్కించే బదులుగా తమకివ్వండి సారూ.. కొందరు అక్కడ విధుల్లో ఉన్న సెబ్, పోలీసు సిబ్బందిని బతిమిలాడారు. వారు నిరాకరించడంతో వెళ్లిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రోడ్డు రోలర్‌తో తొక్కించి.. రూ.3.14 కోట్ల మద్యం ధ్వంసం (ఫొటోలు)
-
Vizag: ఇక బంద్! రోడ్డు రోలర్‌తో తొక్కించి సైలెన్సర్ల ధ్వంసం
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నగరంలో శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణమవుతున్న 631 లౌడ్ సైలెన్సర్లను ధ్వంసం చేయించామని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. బీచ్‌రోడ్డులోని పోలీస్ మెస్ ఆవరణలో ఆదివారం రోడ్డు రోలర్‌తో సైలెన్సర్లను ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు మోడిఫైడ్ సైలెన్సర్లను వాడరాదని కోరారు. బీచ్‌రోడ్డులో యువకులు బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీంతో స్పెషల్ డ్రైవ్ ద్వారా ఏడు వాహనాలను, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బీచ్‌రోడ్డులో బైక్ రేసింగ్‌లు పాల్పడే యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా వుండి తమ కుమారులపై నిఘా వుంచాలని సూచించారు. హెల్మెట్ లేకుండా బైక్‌లు నడుపుతూ ప్రమాదాలకు గురై ఇటీవల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మట్ ధరించాలని సూచించారు. మద్యపానం చేసి వాహనాలు నడపరాదని ఆయన కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడేవారితో కోర్టు ఆదేశాలతో కమ్యూనిటీ సర్వీస్ చేయిస్తున్నామని గుర్తు చేశారు. ఆయా జంక్షన్లలో వీరిచేత ప్లకార్డుల సాయంతో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు నగరంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 205 మందితో కమ్యూనిటీ సర్వీస్ చేయించామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ ఆరిబుల్లా, ట్రాఫిక్ ఏసీపీ – 1 కుమారస్వామి, ట్రాఫిక్ ఏసీపీ – 2 శరత్‌కుమార్, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ ఏవీ లీలారావు, ఎస్ఐ అసిరితాత, తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: విశాఖలో ఇగ్లూ థియేటర్ ఎక్కడ ఉందో తెలుసా?) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రూ.2.14 కోట్ల విలువైన మద్యం బాటిళ్ల ధ్వంసం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను బుధవారం ఎస్పీ మలికాగర్గ్ సమక్షంలో ధ్వంసం చేశారు. ఒంగోలు నగరం దక్షిణ బైపాస్‌లోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెన కింద అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ మొత్తంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, ఎస్ఈబీ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. మొత్తం రూ.2.14 కోట్ల విలువైన 42,810 బాటిళ్లను ధ్వంసం చేశారు. (క్లిక్: 88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..) -
88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..
రాయచోటిటౌన్: అక్రమ మద్యంపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత రెండు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 472 కేసులు నమోదు చేసి పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి సమీపంలో ధ్వంసం చేశారు. అడిషనల్ ఎస్పీ రాజ్‌కమల్ కథనం మేరకు.. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని 17 పోలీస్స్టేషన్లలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.92 లక్షల వరకు ఉంటుందని అంచనా. కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. (క్లిక్: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!)