నల్లగొండ: టీఆర్‌ఎస్ పార్టీ మెజారిటీకి కారును పోలిన గుర్తులతో గండి పడింది. ఉప ఎన్నికలో ఇండిపెండెంట్లకు కారును పోలి ఉన్న రోడ్డు రోలర్, చపాతి మేకర్ గుర్తులు వచ్చాయి. దీంతో కొందరు ఓటర్లు వాటిని చూసి కారు గుర్తే అనుకుని ఓటేసినట్లు తెలుస్తోంది. కారును పోలిన గుర్తులను మిగతావారికి ఇవ్వొద్దని టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసింది.
అయినా దాన్ని తొలగించలేదు. మొత్తం ఉప ఎన్నికలో 47 మంది పోటీలో ఉండగా 12వ నెంబర్‌లో ఉన్న అభ్యర్థికి చపాతి మేకర్ గుర్తు వచ్చింది. ఆ గుర్తుకు 2,407 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 14వ నెంబర్‌లో ఉన్న అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. ఆ గుర్తుకు 1,874 ఓట్లు వచ్చాయి.
ఈ రెండు గుర్తులకు వచ్చిన ఓట్లు టీఆర్‌ఎస్ పార్టీకి పడితే మెజారిటీ మరింత పెరిగేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాగా, రెండో బ్యాలెట్‌లో 18వ నంబర్ అభ్యర్థి చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు వచ్చాయి.
చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment