votes
-
నలుగురు ముస్లింల ఎన్నిక
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ముస్లింల ఓట్లు చీలాయి. అయినప్పటికీ, ముస్లింల ప్రాబల్యమున్న ఏడు నియోజకవర్గాలకు గాను ఆరింట్లో ఆప్ విజయం సాధించగలిగింది. ప్రస్తుత అసెంబ్లీలో ముస్లిం వర్గం ఎమ్మెల్యేలు ఐదుగురుండగా ఈసారి నలుగురు అసెంబ్లీలోకి అడుగిడనున్నారు. విజేతలు ఆప్‌కు చెందిన ఇమ్రాన్ హుస్సేన్(బల్లిమారన్), ఆలె మహ్మద్ ఇక్బాల్(మటియా మహల్), అమానతుల్లా ఖాన్ (ఓఖ్లా), చౌదరి జుబాయిర్ అహ్మద్(సీలంపూర్). 2020 ఎన్నికల్లో ముస్లింలు అధికంగా ఉన్న ఏడు స్థానాల్లో దాదాపు అందరూ ఆప్కే ఓటేయడంతో ఆ పార్టీ విజయకేతనం ఎగరేసింది. ఈదఫా ఆ పార్టీ ముస్తఫాబాద్ మినహా ఆరింట్లో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చీలాయి. అయినప్పటికీ ఆప్ విజయావకాశాలను దెబ్బతీసే స్థాయిలో చీలిక సంభవించలేదు. ముస్తఫాబాద్‌లో ముక్కోణ పోటీ నెలకొంది. ఆప్, ఎంఐఎం, కాంగ్రెస్‌లకు చెందిన ముగ్గురు ముస్లిం అభ్యర్థుల మధ్య ఓట్లు చీలాయి. ఫలితంగా, బీజేపీకి లాభం కలిగింది. ఆ పార్టికి చెందిన మోహన్ సింగ్ బిష్త్ ఇక్కడ 17,578 ఓట్ల తేడాతో విజయం సాధించగలిగారు. ముస్లిం అభ్యర్థులందరికీ కలిపి 1,12,874 ఓట్లు పోలయ్యాయి. ఇందులో, జైలులో నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యరి్థకి 33,474 ఓట్లు పడ్డాయి. ముస్లింల ప్రాబల్యమున్న ఓఖ్లా నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి 39,558 ఓట్లతో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఆ మూడు కారణాలు ఏమంటే.. ముస్లింల ఓట్లలో చీలిక రావడానికి ప్రధానంగా మూడు కారణాలను విశ్లేషకులు చూపుతున్నారు. అందులో ఒకటి..ఏదేమైనా బీజేపీని గెలవకుండా చేయాలి. ఇందుకోసం ఆప్‌కు ఓటేయడం ముఖ్యం. ఢిల్లీలో కాషాయ పార్టీ దూకుడును ఆప్ గలిగింది ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఒక్కడేనని కొందరు ముస్లింలు నమ్మారు. రెండోది..2020 అల్లర్ల సమయంలో ఆప్ తమను పట్టించుకోలేదని కొందరు ముస్లింలు భావిస్తున్నారు. అంతేకాకుండా, కోవిడ్ వ్యాప్తికి తబ్లిఘి జమాత్‌ను తప్పుబడుతూ ఆప్ అనుమానాస్పదంగా వ్యవహరించడం కొందరికి నచ్చలేదు. ప్రత్యామ్నాయంగా, లౌకికవాదాన్ని బలంగా వినిపిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీని బలపరచడం మేలని కొందరు ముస్లింలు నిర్ణయించుకోవడం. మూడోది..ఆప్, కాంగ్రెస్ వెంట నడవడం మానేసి, అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎంను అనుసరించడం మేలని, ఆయనైతే ముస్లింలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు, సమస్యలను బలంగా వినిపిస్తారని కొందరు విశ్వసించారు. ఈ కోణంలోనే, 2020 అల్లర్లలో నిందితులకు ఎంఐఎం టిక్కెట్లిచ్చి బరిలో నిలిపింది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కలిసి అంతిమంగా బీజేపీకే లాభం చేకూర్చాయి. ముస్లింల ఓట్లు చీలి ఆప్‌పై సునాయాస విజయానికి కాషాయ పార్టికి బాటలు పరిచాయి. -
ఈవీఎంల సాయంతో నకిలీ ఓట్లు: మాయావతి ఆరోపణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ రెండు స్థానాల్లో, ఆర్ఎల్డీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఉప ఎన్నికల్లో బీఎస్ఫీ ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయింది.ఈ ఫలితాల అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో నకిలీ ఓట్లు పోలవుతున్నాయని ఆరోపించారు. వీటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఏ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశారు. గతంలో బ్యాలెట్ పేపర్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా నకిలీ ఓట్లు వేసేవారని, ఈ పని ఇప్పుడు ఈవీఎంల ద్వారా కూడా జరుగుతోందని మాయావతి ఆరోపించారు. ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ -
ఓటుకు నోటు.. డబ్బులిస్తూ దొరికిపోయిన బీజేపీ నేత?
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతుంది. పోలింగ్‌కు ఒకరోజు ముందు రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే పాల్ఘర్ జిల్లాలో ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. వినోద్ తావ్డే వద్ద ఉన్న బ్యాగ్‌లో సుమారు రూ.5 కోట్లు ఉన్నాయని బహుజన్ వికాస్ అఘాడి (బీవీఏ) పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్ నాయక్, వినోద్ తావ్డేలు ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్ని, బీఏవీ చేస్తున్న ఆరోపణల్ని వినోద్ తావ్డే ఖండించారు. సమావేశం జరిగే హోటల్ గదిలో పలువురు వద్ద కరెన్సీ దర్శనమివ్వడం వివాదం తలెత్తింది. వినోద్ తావ్డే ఓటర్లకు డబ్బులు నోట్లను పంచుతున్నారంటూ బీవీఏ నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. ఆ డబ్బులు బ్యాగ్ తనది కాదని చెప్పడం గమనించవచ్చు.ఓటుకు నోటు ఘటనపై ఓ బీవీఏ నేత మాట్లాడుతూ.. తావ్డే తనని హోటల్ రూం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. తావ్డేతో పాటు వసాయ్ నుంచి పోటీ చేస్తున్న బీఏవీ ఎమ్మెల్యే అభ్యర్థులు హితేంద్ర ఠాకూర్, ఆయన కుమారుడు,నలసోపరా నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్తి క్షితిజ్ సైతం హోటల్ గదిలో ఉన్నట్లు తెలిపారు. తావ్డే తీరుపై బీవీఏ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ హోటల్‌ను సీజ్ చేసిన పోలీసులు..బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేని భయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. Shameless @BJP4India exposed again! In Vasai Vihar, #VinodTawde, BJP General Secretary, was caught red-handed by Bahujan Vikas Agadi distributing cash, with a bag filled with ₹5 crore, to voters and party workers during #MaharashtraElections. Hello @ECISVEEP, please wake up!!… pic.twitter.com/hlnjGdmwdi— Sanghamitra Bandyopadhyay (@SanghamitraLIVE) November 19, 2024 -
US Elections 2024: సంతకం రాక.. ఓట్లు చెల్లక
వాషింగ్టన్: మనకు ఒక కచ్చి తమైన సంతకం అంటూ లేకపోతే ఎంత నష్టమో అమెరికా ఎన్నికలను చూసి తెలుసుకోవచ్చు. పోస్టు ద్వారా వచ్చి న చాలా ఓట్లు సంతకంలో తేడాల వల్ల చెల్లకుండాపోయా యి. సంతకం చేయడం రాకపోవడంతో ఓటు వేసి నా అవి చెల్లలేదు. ప్రధానంగా యువ ఓటర్ల విషయంలో ఈ సమస్య ఎదురైంది. ఓటు–బై–మెయిల్ బ్యాలెట్‌లోని సంతకం, ఓటర్ రికార్డులోని సంత కం ఒకేలా ఉండాలి. ఎన్నికల అధికారులు రెండింటినీ సరిపోల్చుతారు. ధ్రువీకరణ తర్వాతే ఆ ఓటు ను లెక్కిస్తారు. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిస్తే సదరు ఓటరుకు సమాచారం ఇస్తారు. సంతకాన్ని సరిచేసుకొనే అవకాశం కల్పిస్తారు. ఓటర్లు స్పందించపోవడంతో ఈసారి పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లలేదు. నెవడా రాష్ట్రంలోని క్లార్క్ కౌంటీలో 11,300, వాషో కౌంటీలో 1,800 ఓట్ల విషయంలో సంతకాలను మళ్లీ సరిదిద్దాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి ఫ్రాన్సిస్కో అగిలార్ చెప్పారు. నేటి టెక్నా లజీ యుగంలో చేతితో రాయడం పెద్దగా అవసరం పడట్లేదు. అన్నీ కంప్యూటర్, ఫోన్లోనే టైప్ చేస్తున్నారు. సాధారణంగా సంతకాలను వంపు తిరిగిన అక్షరాల్లో(కర్సివ్) చేస్తారు. అమెరికా పాఠశాలల్లో ఇటీవలి కాలంలో కర్సివ్ చేతిరాత నేరి్పంచడం లేదు. దాంతో పిల్లలకు సంతకాలు చేయడం రావడం లేదని నిపుణులు అంటున్నారు. -
ఈవీఎం, వీవీ ప్యాట్ల ఓట్లను ఎందుకు లెక్కించరు?
సాక్షి, అమరావతి: ‘ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని 12 బూత్‌లలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. కానీ ఈసీ మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటోంది. ఈవీఎం ఓట్లను.. వీవీ ప్యాట్ల ఓట్లను ఎందుకు లెక్కించరు? రెండింటినీ ఎందుకు మ్యాచ్ చేయరు?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఈసీ తీరు వల్ల అనుమానాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. ఈవీఎంలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘కోర్టులో వైఎస్సార్సీపీ వేసిన కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ మేము అడిగే ప్రాథమిక ప్రశ్న ఒక్కటే.. ఒంగోలు నియోజకవర్గంలోని 12 బూత్‌లలో ఈవీఎంలు.. వీవీప్యాట్ల సంఖ్యను మ్యాచ్ చేయాలని కోరాం. నిజంగానే ఎన్నికల కమిషన్ మనసులో కల్మషం లేకపోతే మ్యాచ్ చేసి చూపించొచ్చు కదా? మా సందేహాలే కాకుండా దేశంలోని అందరి సందేహాలు నివృత్తి అవుతాయి?. కానీ, ఇదే ఈసీహైకోర్టులో.. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించేలా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ఈవీఎం, వీవీప్యాట్ల నంబర్లను వెరిఫై చేయమని చెప్పలేదని, మాక్ పోలింగ్ మాత్రమే చేయమని చెప్పిందని మాట్లాడుతోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాక్ పోల్ చేయడం వల్ల ఏం సాధిస్తాం. ఈవీఎంలోని నంబర్.. వీవీప్యాట్లను మ్యాచ్ చేయకపోవడంతోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఆరు నెలలు దాటేస్తే వీవీప్యాట్లపై ఇంక్ పోతుందేమోనని ఎదురు చూస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఇది అన్యాయం. అమెరికా, యూకేతో సహా 90 శాతం అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ప్రజాస్వామ్యం అన్నది ప్రబలంగా ఉండటం కాదు.. అది ప్రబలంగా ఉన్నట్టు కనిపించాలి. ప్రజాస్వామ్యంలో విలువలను నిలబెట్టాలి.’ అని అన్నారు. -
32 ఓట్లతో దక్కిన విజయం
చండీగఢ్: హరియాణాలోని ఉచానా కలాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ అత్రి కేవలం 32 ఓట్ల తేడాతో గెలుపు సాధించారు. అత్రి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బ్రిజేందర్ సింగ్‌న ఓడించారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేత దుష్యంత్ చౌతాలా ఐదో స్థానంలో నిలిచారని తెలిపింది. అత్రికి 48,968 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్‌కు 48,936 ఓట్లు పోలయ్యాయని ఈసీ పేర్కొంది. -
Haryana: అందరి దృష్టి ఆ సీటుపైనే..
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలోని 90 స్థానాల్లో ఒకటైన బధ్రా అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి నిలిచింది . ఈ సీటు హర్యానాలోని కీలకమైన సీట్లలో ఒకటి.బధ్రా అసెంబ్లీ స్థానం భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ సీటులో మొత్తం 1.5 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 97,247, మహిళా ఓటర్ల సంఖ్య 86,708. ఈ స్థానంలో జాట్ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సీటుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి ఒకసారి ఎన్నికల్లో గెలిచిన వారు మరోమారు విజయం సాధించలేదు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో బధ్రా అసెంబ్లీ స్థానం నుంచి జననాయక్ జనతా పార్టీ నేత నైనా చౌతాలా భారీ విజయాన్ని దక్కించుకున్నారు. నైనాకు 52,543 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రణబీర్ సింగ్ మహేంద్రకు 38,898 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సుఖ్వీందర్‌కు 32,685 ఓట్లు వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సుఖ్విందర్ మాంధీ విజయం సాధించగా, 2009లో ఐఎన్ఎల్డీ నేత కల్నల్ రఘ్బీర్ సింగ్ బధ్రా ఎన్నికల్లో విజయం సాధించారు. -
Association of Democratic Reforms: ఈ వ్యత్యాసాలు ఎందుకు?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఎందుకుందో చెప్పాలని భారత ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) గురువారం డిమాండ్ చేసింది. ఓట్లలో వ్యత్యాసానికి కారణాలను వివరించాలని కోరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని ఏడీఆర్ సోమవారం తమ నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించారని తెలిపింది. మరో 176 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకంటే 35,093 ఓట్లను అదనంగా లెక్కించారని పేర్కొంది. ఏడీఆర్ సోమవారం నివేదిక వెలువరించినప్పటికీ ఈసీ ఇప్పటిదాకా ఓట్లలో వ్యత్యాసంపై స్పందించలేదు. ఏపీలోనే అత్యధికం పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉంది. ఏపీలో 21 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం పోలైన ఓట్ల కంటే 85,777 ఓట్లను తక్కువగా లెక్కించారు. అలాగే మరో నాలుగు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 3,722 ఓట్లను అధికంగా లెక్కించారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఓట్లలో తేడా ఎలా వచి్చందో చెప్పాలని.. ఏడీఆర్ గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధూలకు లేఖ రాసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ వ్యత్యాసాలపై ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రజా విశ్వాసం సడలకుండా చూడాలని కోరింది. -
ఓట్లు వేయలేదని పింఛన్ల నిలిపివేత
పుంగనూరు: టీడీపీకి ఓట్లు వేయలేదన్న కారణంగా వృద్ధ దళిత మహిళలకు పింఛన్లు ఆపేశారు. ఇదేమని నిలదీసినందుకు కులం పేరుతో దూషించడమేగాక వారిపై దాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మీర్జేపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్జేపల్లికి చెందిన చెన్నమ్మ, రామయ్య, అమరక్క, మునెమ్మ, గంగమ్మ, సరస్వతి అనే దళిత మహిళలకు గురువారం పింఛన్ నిలిపివేశారు. దీంతో వారంతా కలసి పంచాయతీకి వెళ్లి పింఛను చెల్లించాలని కార్యదర్శిని కోరారు. దీంతో టీడీపీకి చెందిన నాగరాజు, గిరి తదితరులు వారిని కులం పేరుతో దూషించి.. మా ఇష్టం వచ్చిన వారికే పెన్షన్ ఇస్తాం. మీరు మా పార్టీకి ఓట్లు వేశారా అంటూ దాడి చేసి కొట్టడమే కాకుండా మీ అంతు చూస్తామని బెదిరించారని వృద్ధ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఓట్లు వేయలేదనే కారణంతో మీర్జేపల్లి నుంచి నాయకురాళ్లపల్లి, బసివినాయునిపల్లె తదితర బీసీ కులస్తులు ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్డుకు గత నెలలో గొయ్యి తవ్వించి రాకపోకల్ని ఆపేసిన విషయం విదితమే.దళిత నేతల ఆగ్రహంమీర్జేపల్లిలో పెన్షన్ అడిగిన దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దళితులకు రక్షణ కల్పించాలని మాల మహానాడు కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరులో మీడియాతో విలేకరులతో మాట్లాడుతూ మీర్జేపల్లిలో దళితులను, బీసీలను తిరగనివ్వకుండా రోడ్లను తవ్వేసి అడ్డగిస్తున్నారని, పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.పింఛన్ నిలిపేయడంతో దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నంవేధించిన టీడీపీ నాయకులుగత నెలలో 3 రోజులు తిప్పించుకుని పింఛన్ ఇవ్వని వైనంఈ నెల జాబితాలోనూ పేరు లేదన్న టీడీపీ నేతలుమనస్తాపంతో విషం తాగిన బాధితుడు.. పరిస్థితి విషమంకంబదూరు: పింఛన్ నిలిపివేయడంతో ఓ దివ్యాంగుడు పురుగు మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కుర్లపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.కుర్లపల్లికి చెందిన వడ్డే శ్రీనివాసులు దివ్యాంగుడు. భార్య గోవిందమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసులుకు 86 శాతం వైకల్యం ఉండటంతో ఏ పనీ చేయలేడు. దీంతో భార్య గోవిందమ్మ కంకర కొట్టి కుటుంబాన్ని పోషిస్తోంది. వీరి పరిస్థితి గుర్తించిన ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రీనివాసులుకు పింఛన్ అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక టీడీపీ నాయకులు కమ్మ కిష్టయ్య, కమ్మ కృష్ట తదితరులు దివ్యాంగుడైన శ్రీనివాసులుపై వైఎస్సార్సీపీ సానుభూతిపరుడన్న ముద్రవేసి కక్షగట్టారు. జూలై నెలలో పెంచిన పింఛన్ శ్రీనివాసులుకు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో శ్రీనివాసులు టీడీపీ నాయకుల్ని సంప్రదించగా.. మూడు రోజులు తిప్పించుకుని అర్హుల జాబితాలో పేరు లేదని జూలై నెలకు సంబంధించిన పింఛన్ ఎగ్గొట్టారు. తాజాగా గురువారం కూడా ఆగస్టు నెల పింఛన్ కోసం వెళితే జాబితాలో పేరు లేదని టీడీపీ నాయకులు చెప్పారు. ఏ ఆధారం లేని తనపై కక్ష గట్టడం తగదని, పింఛన్ సొమ్ము ఇవ్వాలని శ్రీనివాసులు ప్రాథేయపడినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసులు ఇంటికి వెళ్లి పురుగుమందు తాగాడు. శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో సచివాలయ సిబ్బంది హడావుడిగా కళ్యాణదుర్గం ఆస్పత్రికి వెళ్లి ఆగస్టు నెల పింఛన్ సొమ్మును అందజేశారు. అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఇప్పుడెలా పింఛన్ ఇచ్చారని శ్రీనివాసులు భార్య గోవిందమ్మ ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.వలంటీర్‌పై కక్ష సాధింపు.. పూరి గుడిసె కూల్చివేతపల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ దురాగతంసత్తెనపల్లి : తెల్లారకముందే ఇంటికి వచ్చిమరీ పింఛన్ ఇచ్చిన వలంటీర్‌పై కూటమి నేతలు కక్షగట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వలంటీర్ పూడిగుడిసెను కూల్చివేసి భార్యాబిడ్డలకు నిలువనీడ లేకుండా చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో వలంటీర్ కంటూ బ్రహ్మయ్య గ్రామంలోని పోరంబోకు స్థలంలో పూరి గుడిసె వేసుకుని చిన్నపాటి టీ హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. వలంటీర్‌గా పార్టీలకతీతంగా సేవలందించిన బ్రహ్మయ్యను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయాలని ఆ పార్టీ నేతలు గతంలో కోరారు. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామ టీడీపీ నాయకులు ఈ నెల 29న బ్రహ్మయ్య ఇంట్లో లేని సమయంలో 20 ట్రాక్టర్ల మట్టి పోసి ఇంట్లోకి దారి లేకుండా చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఎన్టీఆర్ విగ్రహం పున:ప్రతిష్ట చేసి ఇక్కడ పార్కుగా అభివృద్ధి చేయదల్చుకున్నామని తక్షణమే ఇంటిని కూల్చివేయమన్నారు. కనీసం నాలుగు నెలలు సమయం ఇవ్వాలని కోరగా పట్టించుకోకపోగా, స్థానిక టీడీపీ నేతలు బుధవారం ఇన్చార్జి తహసీల్దార్ ప్రసాద్‌ను కలిసి బ్రహ్మయ్య ఇల్లు ఖాళీ చేయించాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆగమేఘాల మీద బుధవారం అర్ధరాత్రి టీడీపీ నాయకులు పూరి గుడిసెను తొలగింపజేశారు. గ్రామస్తులు అక్కడ గుమికూడి టీడీపీ చర్యలపై ముక్కున వేలేసుకున్నా పూరి గుడిసె కూల్చేసే వారి ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. దీంతో వలంటీర్ బ్రహ్మయ్య, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు వీధినపడ్డారు. -
538 నియోజకవర్గాల ఓట్లలో తేడా: ఏడీఆర్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని ఆసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం తెలిపింది. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఈ 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 5,54,596 తక్కువగా ఉన్నాయని వివరించింది. అలాగే 176 నియోజకవర్గాల్లో పొలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 35,093 అదనంగా ఉన్నాయని తెలిపింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించలేదు. -
ఈవీఎంలలో గోల్మాల్?!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెర పడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికీ మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థాన్లాలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ‘ద వైర్’ వార్తా సంస్థ పేర్కొంది! కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది.మొత్తం 543 లోక్‌సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్–డయ్యు, లక్షద్విప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పై చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం! ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది. ‘‘పలు లోక్‌సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది.ఒక లోక్‌సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు! ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈ మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు’’ అని తెలిపింది. కథనంలో ద వైర్ ఏం చెప్పిందంటే... ఫలితాల వెల్లడిలో లోక్‌సభ స్థానాలవారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్‌సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెర లేచింది.దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ‘‘కొన్నిచోట్ల అలా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్/వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 17–సీలో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు.అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్‌సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచి్చంది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు! విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852; 1,884 ఓట్ల మెజారిటీ వచ్చి న ఇంకో చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారు.ఇవీ సందేహాలు.. ⇒ నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం? ⇒ లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డాటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? ⇒ ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ/తక్కువగా నమోదైన లోక్‌సభ స్థానాలవారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకివ్వడం లేదు? ⇒ ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద ఎన్ని ఈవీఎంలను, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా?వివరణ ఇవ్వాల్సిందే ప్రశాంత్ భూషణ్ఓట్ల లెక్కింపులో గోల్‌మాల్‌కు సంబంధించి ‘ద వైర్’ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్‌సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు! అసలేం జరుగుతోంది?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ద వైర్’ కథనాన్ని ట్యాగ్ చేశారు. ‘‘అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు కచి్చతంగా వివరణ ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. -
48 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపు!
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీయే కాదు.. అత్యల్ప మెజారిటీ కూడా నమోదైంది. మహారాష్ట్రలోని ముంబై వాయవ్య నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వెలువడింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్సెస్ శివసేన (సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ) పోరు హోరాహోరీగా సాగింది. ఈ పోరులో చివరి వరకు విజయం ఇరుపక్షాల మధ్య దోబూచులాడింది. చివరకు కేవలం 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్‌కర్ తన సమీప ప్రత్యర్థి అమోల్ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం ఇరు పారీ్టల అభ్యర్థుల మధ్య మారుతూ వచి్చంది. ఒక రౌండ్లో అయితే అమోల్ కేవలం ఒక ఓటుతో ఆధిక్యంలో కాసేపు కొనసాగారు. ఈ ఎన్నికల్లో కేరళలోని అత్తింగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు. చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ నుంచి బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్ నాగ్ 1,884 ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ రాజ్‌పుత్ 2,678 ఓట్ల తేడాతో నెగ్గారు. -
వైఎస్సార్సీపీకి 1.32 కోట్ల ఓట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందినా 1.32 కోట్ల మంది ఓటర్లు వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచినట్లు ఎన్నికల సంఘం తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా మే 13న జరిగిన పోలింగ్‌లో పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 3.38 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో టీడీపీకి 45.63 శాతం ఓట్లతో 1,53,56,470 మంది ఓటర్లు మద్దతు తెలుపగా, 39.37 శాతం ఓట్లతో 1,32,57,919 మంది మేం జగన్ వెంటే ఉన్నామంటూ వైఎస్సార్సీపీకి అండగా నిలిచారు. జనసేనకు సుమారు 8.3 శాతం ఓట్లతో 20 లక్షల మంది మద్దతు తెలుపగా బీజేపీకి 9.53 లక్షల మంది (2.80 శాతం) ఓట్లు వేశారు. 1.72 శాతంతో కాంగ్రెస్ పార్టీకి 5.80 లక్షల ఓట్లు పోలవ్వగా నోటాకు 1.09 శాతంతో 3.68 లక్షల మంది ఓటు వేశారు. ఎన్నికల సంఘం ఇంకా తుది ఫలితాలను ప్రకటించకపోవడంతో ఈ గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. గాజువాకలో రికార్డు మెజార్టీ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా రికార్డు మెజార్టీలు నమోదయ్యాయి. గాజువాక నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు సమీప వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై 95,235 మెజార్టీతో గెలుపొందారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ 91,413, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ గ్రామీణ, రాజమహేంద్రవరం సిటీ, విశాఖ తూర్పు, పిఠాపురం నియోజకవర్గాల్లో 70 వేలకు పైగా మెజార్టీలు నమోదయ్యాయి. మడకశిర నుంచి వైఎస్సార్ సీపీ అభ్యరి్థగా పోటీ చేసిన ఉపాధి హామీ కూలీ ఈర లక్కప్ప కేవలం 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు చేతిలో ఓడినట్లు తొలుత ప్రకటించగా దీనిపై రీ కౌంటింగ్ కోరడంతో 351 ఓట్లతో వెనుకబడినట్లు ప్రకటించారు. దీనిపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫలితం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గిద్దలూరులో రౌండు రౌండ్‌కు ఫలితం దోబూచులాడగా చివరకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి 392 ఓట్లతో గెలిపొందారు. ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.మందకొడిగా ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం నాలుగున్నర గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొని తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. నిర్దేశించుకున్న సమయం కంటే చాలా నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగింది. రాత్రి పది గంటల సమయానికి 155 నియోజకవర్గాల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. అర్థరాత్రి లోగా మొత్తం ఫలితాలను ప్రకటించేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు బదిలీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఓటింగ్ శాతాన్ని బీజేపీ గణనీయంగా 35.08 శాతానికి పెంచుకుంది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓటింగ్‌తో 8 ఎమ్మెల్యే సీట్లలో గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 21.08 ఓటింగ్ శాతం పెంచుకొని మొత్తంగా 35.08 శాతాన్ని సాధించడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికలు అప్పటి అధికారపార్టీ బీఆర్ఎస్– ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీల మధ్య సాగడంతో బీజేపీ మూడోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశంలో జాతీయ రాజకీయాలకు ఏర్పడిన ప్రాధాన్యత, మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారనే అంచనాల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పక్షాల మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో... తెలంగాణలో ప్రధానంగా జాతీయపార్టీలైన బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఏర్పడడంతో భారత రా్రïÙ్టయ సమితి (బీఆర్ఎస్) మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జాతీయ రాజకీయాలకు ఏర్పడిన ప్రాధాన్యం దృష్ట్యా పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీకి బదిలీ అయ్యిందనే అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు కావడంతో స్వతాహాగా బీజేపీ ఓటింగ్ శాతం పెరగడంతో పాటు, బీఆర్ఎస్ ఓట్లు కొంత మేర బీజేపీకి పడడంతో ఒక్కసారిగా ఓటింగ్‌శాతం 35.08 శాతానికి చేరుకుందని లెక్కలు కడుతున్నారు. 2.02 % ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓటమిరాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 39.4 శాతం ఓట్లను సాధించి అగ్రస్థానంలో నిలవగా, బీఆర్ఎస్ పార్టీ 37.35శాతం ఓట్లను సాధించింది. బీఆర్ఎస్తో పోల్చితే కేవలం 2.05 శాతం ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం గమనార్హం. బీజేపీ 13.9శాతం, ఎంఐఎం 2.22 శాతం, బీఎస్పీ 1.37శాతం ఓట్లను దక్కించుకున్నాయి. ఎన్నికల్లో పోలై న మొత్తం 2,32,59,256 ఓట్లలో కాంగ్రెస్ 92,35,792, బీఆర్ఎస్ 87,53,924, బీజేపీ 32,57,511, ఎంఐఎం 5,19,379 ఓట్లను సాధించాయి. -
ఎగ్జిట్ పోల్స్‌పై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి కూడా తమకు మంచి మెజారిటీ వస్తుందని చెబుతోంది.తాజాగా ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక ప్రకటనలో స్పందించారు. రేపు రానున్న ఎన్నికల ఫలితాలను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సవాల్ చేస్తున్నాయని అన్నారు. ఫలితాల కోసం వేచి చూడాల్సిందేనని సోనియా అన్నారు.. జస్ట్ వెయిట్ అండ్ సీ.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తాయనే పూర్తి ఆశతో ఉన్నామని సోనియా గాంధీ పేర్కొన్నారు.ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 371 నుండి 401 స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. దీనిలో బీజేపీకి 319 నుంచి 338 సీట్లు వస్తాయని అంచనా. ఇదే జరిగితే పార్లమెంటులో ఎన్డీఏ దాదాపు మూడు వంతుల మెజారిటీకి చేరుకుంటుంది. VIDEO | “We have to wait. Just wait and see. We are very hopeful that our results are completely the opposite to what the exit polls are showing,” says Congress leader Sonia Gandhi.Lok Sabha elections 2024 results will be declared tomorrow. #LSPolls2024WithPTI… pic.twitter.com/xIElzUjJ8P— Press Trust of India (@PTI_News) June 3, 2024 -
ప్రపంచ న్యాయస్థానం తీర్పుని సమర్థించిన భారత న్యాయమూర్తి!
ఇజ్రాయెల్ సైన్యం (మే 26, 2024) రఫా నగరంపై బాంబు దాడలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఐతే గత శుక్రవారమే అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇజ్రాయెల్‌ని రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సమర్థించారు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) లోని భారత ప్రతినిధి, న్యాయమూర్తి దల్వీర్ భండారీ. ఆయన అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఓటు కూడా వేశారు. భండారీ 2012 నుంచి ఐసీజే సభ్యడిగా ఉన్నారు. ఆయన న్యాయమూర్తిగా తన కెరీర్లో అనేక గొప్ప మైలురాయి కేసులను వాదించారు. ఆయన అక్టోబర్ 28, 2005న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రజావాజ్యం, రాజ్యాంగ చట్టం, క్రిమినల్ చట్టం, సివిల్ ప్రొసీజర్, అడ్మినిస్ట్రేటివ్ లా, ఆర్బిట్రేషన్, ఫ్యామిలీ లా, కార్మిక- పారిశ్రామిక చట్టం, కార్పొరేట్ చట్టం వంటి అంశాలలో ఆయన అనేక తీర్పులు ఇచ్చారు. అంతర్జాతీయ న్యాయస్థానంకి సంబంధించిన సముద్ర వివాదాలు, అంటార్కిటికాలో తిమింగలం వేట, మారణహోమం, కాంటినెంటల్ షెల్ఫ్ డీలిమిటేషన్, అణు నిరాయుధీకరణ, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, సార్వభౌమ హక్కుల ఉల్లంఘన వంటి అన్ని కేసులతో భండారీ సంబంధం కలిగి ఉన్నారు. న్యాయమూర్తి భండారీ అనేక సంవత్సరాలు ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ ఢిల్లీ సెంటర్‌కు అధ్యక్షత వహించారు.సుప్రీంకోర్టుకు జడ్జిగా రాకమునుపు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. విడాకుల కేసులో అతడిచ్చిన తీర్పుతో హిందూ వివాహ చట్టం, 1955ను సవరించేలా కేంద్రాన్ని ప్రేరేపించింది. కాగా, ఇజ్రాయెల్ మారణహోమా చర్యలపై దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన దరఖాస్తుకు ప్రతి స్పందనగా ఐసీజే ప్రిసైడింగ్ జడ్జి నవాఫ్ సలామ్ ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలంటూ తీర్పుని ప్రకటించడం జరిగింది. అంతేగాదు ఇజ్రాయెల్ తక్షణమే ఎటువంటి అవరోధం లేని మానవతా సహాయాన్ని అందించాలని, అలాగే మారణహోమం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న యూఎన్ సంస్థలకు సహకరించాలని ఈ తీర్పులో నొక్కి చెప్పింది ఐసీజే. అయితే ఈ తీర్పుకి ఉగాండాకు చెందిన న్యాయమూర్తులు జూలియా సెబుటిండే, ఇజ్రాయెల్ హైకోర్టు మాజీ అధ్యక్షుడు జడ్జి అహరోన్ బరాక్ మాత్రమే భిన్నాభిప్రాయాలతో వ్యతిరేకంగా ఓటు వేశారు. (చదవండి: అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు) -
21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళా ఓటర్లేనని స్పష్టమైంది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువ మంది ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ గణాంకాలు పేర్కొన్నాయి. అమలాపురం, ఒంగోలు, కర్నూలు, హిందూపురం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే మహిళలు కన్నా పురుషులు స్వల్పంగా ఎక్కువగా ఓటేశారు. కాకినాడ, అనంతపురం లోక్‌సభ స్థానాల్లో పురుషులు కన్నా మహిళలే ఎక్కువగా ఓటేసినా.. తేడా మాత్రం స్వల్పంగానే ఉంది.మిగతా లోక్‌సభ స్థానాల్లో 11 వేల నుంచి 47 వేల వరకు మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మహిళా ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయంటే సహజంగానే వైఎస్సార్సీపీకే మొగ్గు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా వారి జీవనోపాధిని మెరుగుపరచడమే కారణమని వారు విశ్లేíÙస్తున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరిట పథకాలు మంజూరు చేయడంతో మహిళా ఓటింగ్ పెరిగిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసిన విషయం తెలిసిందే.రాష్ట్రంలోని మహిళలందరూ మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే గట్టి పట్టుదలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారని సీనియర్ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళల ఓట్లు ఎక్కువగా నమోదైన 21 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఆ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మహిళల ఓట్లన్నీ వైఎస్సార్సీపీకే పడ్డాయని, పోలింగ్ రోజు ఇది స్పష్టంగా కనిపించిందని ఆ రాజకీయ నాయకులు చెబుతున్నారు.హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ఇస్త్రీ పనికి వెళ్లిన వారితో పాటు వివిధ రకాల చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వెళ్లిన మహిళలందరూ కూడా ఏపీ వెళ్లి వైఎస్సార్సీపీకే ఓటు వేశామని చెబుతున్నారు. ప్రభుత్వం వల్ల మేలు పొందిన వారందరూ ఎక్కడున్నా సరే పోలింగ్ రోజున రాష్ట్రానికి వచ్చి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఓటు వేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటమి బాటలో బాబు
చంద్రబాబు 35 ఏళ్ల కుప్పం ప్రస్థానంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి చూస్తే గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ గట్టి పట్టు సాధించిందని స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను, ఇటీవల తొలగించిన 33 వేల టీడీపీ దొంగఓట్లను పరిగణనలోకి తీసుకుంటే, మే 13న జరిగిన ఎన్నికలో కుప్పం అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ గెలుపు వాకిట నించున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు, మద్దతుదారులకు వచ్చిన ఓట్ల కంటే కేవలం 3–4 వేల ఓట్లు (0.02%) మాత్రమే అదనంగా అవసరం. అయితే భారీగా టీడీపీ దొంగ ఓట్లకు చెక్ పడటంతో కుప్పంలో చంద్రబాబు ఓడి పోబోతున్నారని స్పష్టమవుతోంది. ఇటు ఓటర్లు, అటు రాజకీయ విశ్లేషకులు, పలు సర్వే నివేదికలు చెబుతున్న వాస్తవం ఇది. సాక్షి, తిరుపతి: ఐదేళ్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జరిగినంత మేలు చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ జరగలేదని, అందుకే కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటెత్తారని స్పష్టమవుతోంది. 35 ఏళ్ల పాటు మాయ మాటలతో ప్రజలను నమ్మించి.. సీఎంగా, ఎమ్మెల్యేగా కొనసాగిన చంద్రబాబును కుప్పం ఓటర్లు ఈసారి శంకరగిరి మాన్యాలకు పంపుతున్నట్లు ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తుపై గట్టిగా నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. 2019 సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం వాసులు ఇచ్చిన తీర్పే.. ఇప్పుడూ పునరావృతం కాబోతోందని సమాచారం. నాటి చంద్రబాబు.. నేటి వైఎస్ జగన్ పాలనను బేరీజు వేసుకునే ఓటర్లు ఓటెత్తారని స్పష్టమవుతోంది. సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో డీబీటీ ద్వారా 4,32,067 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,400 కోట్లకుపైగా జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో 3,03,080 మంది లబ్ధిదారులకు రూ.1,175.21 కోట్లు అందించారు. కుప్పం వాసులకు కలగా మారిన కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చారు. చంద్రబాబు ఉన్నన్ని రోజులు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక హంద్రీ–నీవా సృజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొచ్చి కలను నిజం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వివరాలు » పలమనేరు నియోజకవర్గం అప్పిన పల్లి వద్ద 0 పాయింట్ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కి.మీ వరకు హంద్రీ–నీవా కాలువ తవ్వారు.» 5 కిలోమీటర్లలో పశు పత్తురు వద్ద, 39వ కిలోమీటర్ కృష్ణాపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు» వి.కోట మండలం ఆదిరే పల్లి 54.కి.మీ వద్ద లిఫ్ట్‌ల ద్వారా హంద్రీ–నీవా కృష్ణా జలాలు అందించారు.» కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్లివ్వడం ద్వారా 6,500 ఎకరాల ఆయకట్టుకు అండగా నిలిచారు. » అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి 300 క్యూసెక్కుల నీరు హంద్రీ–నీవా కాలువలు ద్వారా విడుదలవుతుంది. ఆవిరి, లీకేజీ పోగా 220 క్యూసెక్కుల నీరు కుప్పం చేరుతుంది. 4 లక్షల జనాభాకు తాగు నీరు అందుతుంది. కుడి ఎడమల సంక్షేమం, అభివృద్ధి» వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.» కుప్పం మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి, పట్టణ అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు.» నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయటంతో పాటు.. కుప్పం పోలీస్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఆర్డీఓ, డీఎస్పీలను నియమించారు.» రూ.15 కోట్ల వ్యయంతో కుప్పం పట్టణ నడిబొడ్డు, డికే పల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించారు.» నియోజకవర్గంలో ఏడు పురాతన దేవాలయాలు జీర్ణోద్ధరణకు సుమారు రూ.12 కోట్లు వెచ్చించారు.» రూ.5 కోట్ల వ్యయంతో మున్సిపాలిటి పాలన వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రెండు అంతస్తుల నూతన భవనాలు నిర్మించారు.» శాంతిపురం మండలంలోని కేటీ పల్లి, పోడిచేన్లు, ప్రతిచామనూరులకు రూ 7.25 కోట్లతో తారు రోడ్లు, సిమెంట్ రోడ్డు వేయించారు. » నియోజకవర్గంలో 78 సచివాలయాలకు రూ.87.55 కోట్లు ఖర్చు చేశారు. రూ.15.77 కోట్లతో 77 రైతు భరోసా కేంద్రాలు, రూ.7.9 కోట్లతో 58 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. » కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మరో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. »కుప్పంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న వన్నె కులస్తుల కోసం క్షత్రియ భవనం ప్రారంభించారు.బాబును గెలిపిస్తూ వచ్చింది దొంగ ఓట్లేచంద్రబాబు 1989 నుంచి కుప్పంలో గెలుపొందుతూ వచ్చారు. కుప్పం వాసుల అమాయకత్వంతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుకు చెందిన 52 వేల మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చి.. దొంగ ఓట్లు వేయించుకోవడమే ఇందుకు కారణం. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళి.. బాబు దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టారు. ఎన్నికల సమయంలో కర్ణాటక, తమిళనాడు నుంచి జనం భారీగా తరలివచ్చి, ఓట్లు వేసి వెళ్లటం గమనించిన చంద్రమౌళి దొంగ ఓట్లపై విచారణ జరిపించారు. అధికారుల విచారణలో దొంగ ఓట్లు ఉన్నట్టు తేలడంతో ఇదివరకు 18 వేల ఓట్లు, ఈ ఎన్నికలకు ముందు 33 వేల ఓట్లు తొలగించారు. దొంగ ఓట్లను తొలగించటంతో పాటు కుప్పం వాసులు చైతన్య వంతులు కావటంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. కుటుంబ సమేతంగా కుప్పానికి పరుగు» కుప్పంలో 2014 ముందు ఒక లెక్క. ఆ తర్వాత ఒక లెక్క అన్న చందంగా మారింది. వైఎస్సార్సీపీ రానంత వరకు అన్ని గ్రామాల్లో చంద్రబాబు చెప్పిందే శాసనంలా సాగింది. భయపెడుతూ.. బెదిరిస్తూ ప్రత్యర్థి లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. 2014లో వైఎస్సార్సీపీ అడుగు పెట్టడంతో షాక్‌ల మీద షాక్‌లు తగలటం మొదలయ్యాయి. » బాబు అండ్ కో బ్యాచ్ అరాచకాలను జీర్ణించుకోలేని స్థానికులు ప్రతి గ్రామంలో టీడీపీకి పోటీగా వైఎస్సార్సీపీ జెండాను ఎగుర వేయటం ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మొదటి రెండు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కంటే వైఎస్సార్సీపీ అభ్యర్థికే మెజారిటీ ఓట్లు నమోదవ్వటంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థలకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మెన్ అంతా వైఎస్సార్సీపీ మద్దతు దారులే గెలుపొందటంతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యింది. » 35 ఏళ్లుగా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనే చేయని చంద్రబాబుకు వైఎస్సార్సీపీ నేతల మాటలతో జ్ఞానోదయం అయింది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం చేపట్టారు. కుప్పానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే చంద్రబాబు.. 2019 ఎన్నికల తర్వాత కుటుంబ సమేతంగా పరుగులు పెట్టారు. 2014–19 మధ్య కాలంలో సీఎం హోదాలో చంద్రబాబు 8 పర్యాయాలు మాత్రమే కుప్పానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. 2019–2024 మధ్య 14 సార్లు కుప్పం రావడంతో పాటు కనీసం రెండు, మూడు రోజులు ఉండి వెళ్తున్నారు.» కుమారుడు లోకేశ్, సతీమణి భువనేశ్వరి సైతం కుప్పం దారిపట్టారు. ఓటమి భయంతోనే లోకేశ్ తన పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించి అభాసుపాలయ్యారు. నారా భువనేశ్వరి ఇటీవలి కాలంలో రెండు పర్యాయాలు కుప్పానికి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చంద్రబాబు నామినేషన్ వేయటానిక్కూడా కుప్పానికి వచ్చిన దాఖలాలు లేవు. స్థానిక నాయకులే చందాలు వేసుకుని ఆయన తరుఫున నామినేషన్ వేసేవారు. అటువంటిది ఈసారి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పానికి చేరుకుని, సొంత డబ్బులతో నామినేషన్ వేశారు. అనంతరం గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఓటుకు రూ.2 వేలు పంపిణీచంద్రబాబు గతంలో కుప్పంలో ఓటర్లకు పెద్దగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. స్థానిక నాయకులే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్ములో నుంచి ఓటుకు రూ.200 లేదా రూ.300 పంపిణీ చేసేవారు. ఈ నగదు కూడా ఓటర్లందరికీ ఇచ్చేవారు కాదు. సగం ఓటర్లకు ఇచ్చి మిగిలిన సగం నగదు నొక్కేసి అందరికీ పంపిణీ చేశామని లెక్క చూపేవారని ఆరోపణలు ఉన్నాయి. అటువంటి చంద్రబాబు ఈ ఎన్నికల్లో మే 10, 11, 12 తేదీల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేలు చొప్పున డబ్బులు పంపిణీ చేశారు. ఈ నగదును చంద్రబాబే స్వయంగా పంపించారని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకే డబ్బులు పంపిణీ చేసి మాయ చేయాలని చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారని, ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల ద్వారా కుటుంబ ఆర్థిక పురోభివృది్ధకి దోహద పడ్డారని, కుప్పాన్ని అభివృద్ధి చేసినందుకే తాము ఫ్యాన్ గుర్తుకు ఓటేశామని అత్యధికులు స్పష్టం చేస్తున్నారు.బాబు కుప్పం ప్రస్థానం 1989లో పోలైన ఓట్లు: 95,157చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 50,098 (52.65%)మెజారిటీ: 6,9181994లో పోలైన ఓట్లు: 1,07,582చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 81,210 (75.49%)మెజారిటీ: 56,5881999లో పోలైన ఓట్లు: 1,25,357 చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 93,288 (74.42%)మెజారిటీ: 65,687 2004లో పోలైన ఓట్లు: 1,40,153 చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 98,123–(70%– 4.42% తగ్గాయి.. 6,195 ఓట్లు కోల్పోయారు)మెజారిటీ: 59,5882009లో పోలైన ఓట్లు: 1,45,287చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 89,954 (61.9% – 8.1% తగ్గాయి.. 11,770 ఓట్లు కోల్పోయారు)మెజారిటీ: 46,0662014లో పోలైన ఓట్లు: 1,64,071చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 1,02,953 (62.5% –0.6% పెరిగాయి. 985 ఓట్లు అదనంగా వచ్చాయి)మెజారిటీ: 47,1212019లో పోలైన ఓట్లు: 1,79,329చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 1,00,146 (55.18% – 7.32% తగ్గాయి. 13,127 ఓట్లుకోల్పోయారు)మెజారిటీ: 30,722 మే 13న జరిగిన ఎన్నికలో కుప్పంలోమొత్తం ఓటర్లు: 2,13,145 పోల్ అయిన ఓట్లు: 1,83,027 (85.87%)గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు2014 – 55,839 ఓట్లు (33.9%)2019 – 69,424 ఓట్లు (38.25% – 4.35% పెరుగుదల -
ఓట్ల కోసం రిబేట్లు.. ప్రోత్సాహక పథకం షురూ!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ ‘ఓటు వేయండి- డిస్కౌంట్ పొందండి’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఢిల్లీ ఓటర్లు మే 25 న ఓటు వేశాక, కొన్ని మార్కెట్లలో షాపింగ్ చేస్తే వారికి కొంతమేరకు రాయితీ ఇవ్వనున్నారు. అలాగే వివిధ వస్తువులపై ఆఫర్లు అందజేయనున్నారు. ఫలితంగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుంటారని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ భావిస్తోంది.ఢిల్లీలోని 50కి పైగా చిన్న, పెద్ద మార్కెట్లలోని వ్యాపారులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించారు. కశ్మీర్ గేట్, కమలా నగర్, లజ్‌పత్ నగర్, చాందినీ చౌక్, రోహిణి, కరోల్ బాగ్, నెహ్రూ ప్లేస్ తదితర ప్రాంతాల్లోని పలు మార్కెట్లలో ఇటువంటి ఆఫర్లు అందించనున్నారు. ఓటర్లు తమ ఓటువేశాక, వారి వేలిపై పెట్టే సిరా గుర్తును చూపిస్తే ఈ మార్కెట్లలో కొనుగోళ్లపై 15 నుంచి 25 శాతం రాయితీ అందించనున్నారు.ఇటువంటి ఆఫర్ ఆహారపానీయాలపై కూడా ఇవ్వనున్నారు. గత నాలుగు దశల ఓటింగ్ ట్రెండ్లను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ వ్యాపారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రత్యేక తగ్గింపు కేవలం ఢిల్లీ ఓటర్లకు మాత్రమే కాదని, ఐదవ దశలో ఓటు వేసిన సమీప ప్రాంతాల ఓటర్లు కూడా మార్కెట్లలో ఈ తగ్గింపు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ తెలిపింది. -
వెల్లివిరిసిన మహిళా చైతన్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల చైతన్యం వెల్లి విరిసింది. పురుషులకంటే 4,78,535 మంది మహిళలు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల తుది వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం జరిగిన పోలింగ్‌లో ఈవీఎంల ద్వారా 80.66 శాతం (3,33,340,333 ఓట్లు), పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం ఓట్లు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఓట్లు నమోదవడం ఇదే తొలిసారన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో జరిగిన నాలుగు దశల పోలింగ్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైనట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు, అత్యవసర సర్వీసు ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు పాల్గొన్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోగా>, ఈసారి 4.97 లక్షల మంది వినియోగించుకున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో 56 వేల పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురయ్యాయని, ఈసారి ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా ఉన్నందున అటువంటి పరిస్థితి తలెత్తలేదని చెప్పారు.విశాఖలో ఎక్కువ ఓట్లు పోలవడం శుభపరిణామంలోక్సభ నియోజకవర్గాల్లో ఒంగోలులో అత్యధికంగా 87.06 శాతం ఓట్లు రాగా, అత్యల్పంగా విశాఖపట్నంలో 71.11 శాతం వచ్చాయన్నారు. శాసన సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు తెలిపారు. గత ఎన్నికల్లో తిరుపతిలో 65.9 శాతం పోలింగ్ నమోదవగా, ఈసారి 63.32 శాతానికి తగ్గడానికి ఆ నియోజకవర్గంలో బోగస్ ఓట్లను నియంత్రించడమే ప్రధాన కారణమని తెలిపారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి ప్రత్యేకించి విశాఖ పట్టణ ప్రాంతంలో 71.11 శాతం పోలింగ్ జరగడం ఎంతో శుభపరిణామమని అన్నారు.ఎవరూ రీపోలింగ్ కోరలేదుదేశ, విదేశాల నుండి ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌కు తరలి రావడం, చివరి రెండు గంటల ముందు క్యూలలో ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల అర్థరాత్రి వరకూ ఓటింగ్ కొనసాగిందని మీనా తెలిపారు. దీనికితోడు 5,600 పోలింగ్ స్టేషన్లలో 1,200కు పైబడి ఓటర్లు ఉండటం కూడా ఓటింగ్ ఆలస్యానికి కారణమైందన్నారు. దాదాపు 3,500 పోలింగ్ స్టేషన్లలో నిర్ణీత సమయమైన సాయంత్రం 6.00 గంటలు దాటి పోలింగ్ కొనసాగిందని, చివరి పోలింగ్ స్టేషన్లో అర్ధరాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసిందని చెప్పారు. శ్రీకాకుళం, కోనసీమ, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో వాతావరణం సహకరించకపోవడం వల్ల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత ఎలక్షన్ టీమ్‌లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు వచ్చేసరికి ఆలస్యమైందన్నారు. ఎన్నికలు ముగిసిన తదుపరి రోజు పరిశీలకులు, అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడైనా రీపోలింగ్‌కు అవసరం ఉందా లేదా అనే విషయాన్ని సమీక్షిస్తారన్నారు. ఈ సమీక్షల్లో ఒక్క పరిశీలకుడు కూడా రీపోలింగ్‌కు సిఫార్సు చేయకపోవడంవల్ల 25 లోక్‌సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అన్నింటినీ మంగళవారం రాత్రి 33 ప్రాంతాల్లో నున్న 350 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు తెలిపారు. ఈ స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రత కల్పించామని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తరువాతే అసలైన పోలింగ్ శాతాన్ని ఖరారు చేస్తామని, అందువల్లే పోలింగ్ శాతాన్ని ప్రకటించడంలో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు.హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ఎన్నికల అనంతరం ప్రత్యేకించి తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సరావుపేట ప్రాంతాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని మీనా చెప్పారు. ఈ ఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, వెంటనే డీజీపీతో చర్చించిందని తెలిపారు. మంగళవారం నుంచి పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైన చర్యలు చేపట్టిందని, అయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ నాలుగు ప్రాంతాలకు సీనియర్ అధికారులు, అదనపు పోలీసు బలగాలను పంపినట్లు చెప్పారు. స్థానికంగా జన సంచారాన్ని నియంత్రించడమే కాకుండా సంబంధిత పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేశామన్నారు. తదుపరి విచారణ జరిపి పోలిస్ కేసులను కూడా పెట్టడం జరుగుతుందన్నారు. 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను కూడా ఏర్పాటు చేశామని, అన్ని చోట్లా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన తెలిపారు. పోలింగ్ ఇలా..రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,13,33,702లోక్‌సభకు పోలైన ఓట్లు 3,33,40,560అసెంబ్లీకి పోలైన ఓట్లు 3,33,40,333ఈవీఎంల ద్వారా పోలైన ఓట్లుపురుషులు 1,64,30,359మహిళలు 1,69,08,684ఇతరులు 1,517 మందిపోస్టల్ బ్యాలెట్ ద్వారా మొత్తం వచ్చిన ఓట్లు 4.97 లక్షలుఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల ఓట్లు 4.44 లక్షలు85 ఏళ్ల పైబడిన వృద్ధులు 13,700దివ్యాంగులు 12,700అత్యవసర సర్వీసు ఓటర్లు 27,100 -
పోలింగ్ బూత్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించిన సీఎం రమేష్
-
విప్లవ సారథీ.. విజయీభవ
ప్రజాస్వామ్యమంటే ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే పాలకులను ఎన్నుకోవడం. ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి, నిబద్ధత, జవాబుదారీతనం పాలకుడికి ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం ప్రగతిపథంలో ఎలా దూసుకెళ్లగలదో గత 58 నెలల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారు. సుపరిపాలనతో ప్రతి నియోజకవర్గం.. ప్రతి గ్రామం.. ప్రతి ఇంటా.. విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు కొనసాగాలని బలంగా కోరుకుంటున్న జనం ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా.. అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది. ఈ పరిణామంతో మరో చారిత్రక విజయం ఖాయమైందని రాజకీయ పరిశీలకులతో పాటు జాతీయ స్థాయి సర్వే సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత 58 నెలలుగా విప్లవాత్మక మార్పులతో సుపరిపాలన అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ (86.28 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే సుపరిపాలనకు ఆయన శ్రీకారం చుట్టారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 99 శాతం అమలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాపన, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల నియామకాలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. కేవలం 58 నెలల్లోనే 2.32 లక్షల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించడం గమనార్హం. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించడం ఇదే ప్రథమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకూ.. పట్టణాల్లో 75 నుంచి వంద ఇళ్లకు ఒకరి వంతున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానం ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసి చరిత్ర సృష్టించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు. వివక్ష, లంచాలకు తావు లేకుండా అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు అందించారు. డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లను పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి.. దేశం మొత్తాన్ని మన వైపు చూసేలా చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు వాటి ద్వారా జీవనోపాధులను మెరుగుపర్చుకున్నారు. రాష్ట్రంలో పేదరికం టీడీపీ సర్కార్ హయాంలో 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. ప్రగతి పథంలో ఏపీ పయనం ♦ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులతో మన పిల్లలు పోటీ పడేలా విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తూనే.. రానున్న రోజుల్లో ఐబీ సిలబస్‌ను అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించారు. ♦ అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నికర నమోదు నిష్ఫత్తి రేటు 98.73 శాతానికి పెరిగింది. ♦ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనతో నాణ్యమైన ఉన్నత విద్యనందిస్తూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తున్నారు. తద్వారా 2022–23లో 1.2 లక్షల మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందారు. నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు ఇప్పుడు ఎడెక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యా రంగంపై ఉద్యోగుల జీతభత్యాలు కాకుండా రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు మహర్దశ సర్కారు దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు అనువుగా నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. అందులో 53,466 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు.. చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. ఇప్పటిదాకా 44.78 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.13 వేల కోట్ల విలువైన చికిత్సలు చేయించారు. ♦ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కొత్తగా 17 కాలేజీలకు శ్రీకారం చుట్టి, ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 ప్రారంభం కానున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటా జల్లెడ పడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, విలేజ్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధికి ఊతం ♦ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పారదర్శక విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చారు. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ప్రతి ఏటా రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవడమే అందుకు తార్కాణం. ♦ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే క్రమంలో.. కొత్తగా నాలుగు పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లు, మూడు ఇండ్రస్టియల్ కారిడార్లు, పది ఇండ్రస్టియల్ నోడ్స్ను అభివృద్ధి చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. ♦ టీడీపీ హయాంలో రూ.32,803 కోట్లు పెట్టుబడులు వస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే అందుకు నిదర్శనం. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం టీడీపీ సర్కార్ హయాంలో 2018–19లో 22వ స్థానంలో నిలిస్తే.. ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది. పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి. సాగుకు సాయం ♦ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు సీఎం జగన్ దన్నుగా నిలిచారు. ఫలితంగా వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17 నుంచి 18 శాతం ఉంటే.. గత నాలుగేళ్లలో దేశ జీడీపీలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ వాటా 36 శాతంపైగా ఉండటం విశేషం. ♦ విప్లవాత్మక సంస్కరణలతో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2021–22లో 11.23 శాతం వృద్ధి రేటుతో దేశంలో ఏపీ అగ్రగామిగా నిలవడమే అందుకు నిదర్శనం. సామాజిక న్యాయంలో టార్చ్ బేరర్ సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానమని సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే స్పష్టం చేశారు. కేబినెట్లో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఐదుగురు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు వర్గాలకే ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళను నియమించారు. సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన మాయవతి, బీసీ వర్గానికి చెందిన అఖిలేష్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్ కూడా ఆ వర్గాలకు కేబినెట్లో ఇంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని సామాజిక వేత్తలు చెబుతున్నారు. రాజ్యసభ, శాసన మండలి సభ్యులుగా అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్ పనుల్లో, పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. గత 58 నెలలుగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన దన్నుతో ఆ వర్గాలు సామాజిక సాధికారత సాధించాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక న్యాయంలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేశారు. రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలు వెరసి మొత్తం 200 స్థానాలకుగాను వంద స్థానాల్లో అంటే సగం స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులనే సీఎం జగన్ బరిలోకి దించారు. సామాజిక న్యాయం చేయడమంటే ఇదీ అని దేశానికే సీఎం జగన్ ఎప్పటికప్పుడు చాటిచెబుతూ వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఇదే పాలన కోరుకుంటున్న జనం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో వైఎస్ జగన్ మార్కు పాలన కనిపిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే.. రాష్ట్రం ప్రగతి పథంలో మరింతగా దూసుకెళ్లాలంటే విప్లవాత్మక పరిపాలన కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు.. ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలకడం ద్వారా తమ తీర్పును ముందే వెల్లడిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయానికి బాటలు వేస్తుందని స్పష్టం చేస్తున్నారు. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని వెల్లడైంది. -
కేరళలో ముస్లిం ఓట్లు.. ‘గేమ్ చేంజర్’?
దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకట్టకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 20 లోక్‌సభ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో 24 శాతమున్న ముస్లింల ఓటింగ్ సరళిపైనే అందరి దృష్టి నెలకొంది. ఇది ఎన్నికల్లో గేమ్ చేంజర్ కానున్నదననే మాట వినిపిస్తోంది. కేరళలోని 3.30 కోట్ల జనాభాలో ముస్లింల జనాభా 24 శాతం కాగా, క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవారు 17 శాతం ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ 19 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ కమలం వికసించలేకపోయింది. 2019లో ముస్లింలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌కు ఓటు వేశారు. అయితే సీఎం విజయన్ ఈ ట్రెండ్‌ను తిప్పికొట్టి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లను దక్కించుకున్నారు. ఈసారి కూడా ముస్లింల ఓటింగ్ సరళి నిర్ణయాత్మక అంశంగా మారనుంది. ఈ నేపధ్యంలో ముస్లిం సమాజాన్ని ప్రభావితం చేసేందుకు వామపక్షాలు, కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడో స్థానంలో నిలిచి, కేవలం 15.64 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. రాష్ట్రంలో అత్యధికంగా 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 47.48 శాతం ఓట్లను దక్కించుకుంది. అదే సమయంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌కు కేవలం ఒక్క సీటు మాత్రమే లభించగా, 36.29 శాతం ఓట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎంల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇదే సమయంలో బీజేపీ కూడా కొన్ని సీట్లు గెలవాలని ప్రయత్నిస్తోంది. -
fact check: అది మీ బాబు రూటు
సాక్షి, అమరావతి: పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా... కళ్లకు పచ్చ పసరు రాసుకున్న రామోజీకి అంతా తన ‘బాబు’ లాగే కనిపిస్తున్నారు. తన బాబు దొంగ ఓట్లతో గెలిచాడు కాబట్టి మిగతా వారూ అలానే ఉంటారని భావిస్తూ ‘‘ఓటు హక్కుపై వేటు.. అదే జగన్ రూటు’’ అంటూ జగన్‌పై ఉన్న అక్కసును బయటపెట్టుకున్నారు. అసలు దొంగఓట్లకు ఆద్యుడు చంద్రబాబేనని, తమిళనాడుకు చెందిన వలస కూలీలను చేర్పించడం ద్వారా ఇన్నాళ్లూ కుప్పంలో గెలుస్తూ వచ్చాడని, ఇప్పుడు ఆ భాగోతం బయటపడటంతో సొంత నియోజకవర్గంలో తన బాబు’ ఓడిపోతాడనే భయంతోనే ఇటువంటి వార్తలు రాస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సేవామిత్ర యాప్ పేరుతో వైఎస్సార్సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపు రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను చౌర్యం చేసి ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారు. వాటిని సేవా మిత్ర యాప్‌తో అనుసంధానం చేసి, వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు. తద్వారా తనకు అలవాటైన రీతిలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేశారు. ఈ కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేలి్చన ఎన్నికల అధికారులు.. 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో అదనంగా చేర్చారు. దాంతో ఆ ఎన్నికల్లో 50 శాతంపైగా ఓట్లు సాధించి.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. ఈసీ స్పష్టం చేసినా వినపడలేదా! అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇటీవల ఓ సమీక్షలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, గంపగుత్తగా ఓట్ల తొలిగింపు, జీరో ఇంటి నెంబర్‌పై ఓటర్ల నమోదు అంటూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేసిన బోగస్ ప్రచారంలో వీసమెత్తు నిజం లేదన్న విషయాన్ని ఆయన విస్పష్టంగాచెప్పారు. 2023 జనవరి 6 నుంచి ఆగస్టు 30 మధ్య కాలంలో తొలగించిన 21 లక్షల ఓట్లను సమీక్షిస్తే అందులో కేవలం 13,061 ఓట్లలోనే తప్పులు దొర్లాయని ఆయన తేల్చారు. అంటే తొలగించిన మొత్తం ఓట్లల్లో ఇది కేవలం 0.61 శాతం మాత్రమే. వాటిని తిరిగి సవరించారు. మృతి చెందిన, ఇంటి మార్పు, డూప్లికేట్ ఓటర్ల నమోదుపై 14.48 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 5.65 లక్షల ఓటర్లు చనిపోవడం లేదా శాశ్వతంగా వేరే చోటికి వెళ్లిపోవడం, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటాన్ని గుర్తించి వాటిని తొలగించారు. ఒకే ఇంటి నంబర్‌పై పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసులను పరిశీలించడానికి 1.57 లక్షల ఇళ్లకు ఎన్నికల సిబ్బంది వెళ్లారు. ఇంటింటి సర్వే నిర్వహించి 20 లక్షల ఓట్లను పరిశీలించారు. జీరో ఇంటి నెంబర్‌తో 2.52 లక్షల ఓట్లు ఉండగా వాటిలో 97 శాతం అసలైన చిరునామా నమోదు చేసి సరిదిద్దారు. ఎన్నికల సంఘం ఇంత కచి్చతంగా వ్యవహరించినా రామోజీ కళ్లకు ఇవేవీ కనిపించలేదు. నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఒకపక్క చెపుతున్నా.. పదేపదే అదే అబద్ధాన్ని రామోజీ ప్రచారం చేస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన బాబు 2014లో దొంగఓట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు 2019లో కూడా అదే దారిలో వెళ్లి భంగపడ్డారు. సేవామిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఇప్పుడు 2024లో కూడా ఇదే విధంగా దొంగ ఓట్లను చేర్పించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి భారీ సంఖ్యలో గంపగుత్తగా ఫారం–6లను దాఖలు చేస్తూ పచ్చ మీడియా ద్వారా అధికారపార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 99% స్వచ్ఛతతో ఓటర్ల జాబితా తయారు చేయడమే కాకుండా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నా రామోజీ పత్రిక మాత్రం ఓటర్ల జాబితాపై పదేపదే తప్పుడు ఆరోపణలతో విషకథనాలను ప్రచురిస్తోంది. 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు అప్పట్లో ప్రజా సంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా అదే కారణమని తేల్చాయి. -
Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది. ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్‌లను షేర్ చేయడం మానుకోవాలని పేర్కొంది. శుక్రవారం లఖ్‌నవూలో ఎన్నికల కాఫీ టేబుల్ బుక్ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్ కుమార్ -
నిర్వాసితులకు వారున్న కాలనీల్లోనే ఓటుహక్కు
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు వారు నివాసం ఉండే ఆర్అండ్ ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించినా తట్టుకోలేని ‘ఈనాడు’ అబద్ధాలు, అసత్యాలతో కూడిన కథనాన్ని బుధవారం అచ్చేసింది. అధికారులు ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారమే ఓట్లు మార్పు చేస్తే ఏదో మహా పాపం జరిగిపోయినట్టు పతాక శీర్షికలో ‘ఈ అరాచకం అనంతం’ అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన దేవీపట్నం మండలంలోని గోదావరి తీరంలో ఉన్న గిరిజనేతరులకు గోకవరం మండలంలో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు కృష్ణునిపాలెం సమీపంలో రెండేళ్ల క్రితం ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించి 1,282 కుటుంబాలకు పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఈనాడు కథనం పూర్తి వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. అంతా ఎన్నికల సంఘం నిబంధనల మేరకే.. కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో నివసిస్తున్న 2,475 మంది ఓటర్లను జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చినట్లు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తొయ్యేరులోని 237, 238, 239 పోలింగ్ బూత్‌లకు చెందిన ఈ ఓటర్లందరినీ రెండేళ్ల క్రితం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసేందుకు అప్పటి దేవీపట్నం తహసీల్దార్ సిఫారసు చేశారన్నారు. ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఓట్లను మార్చే ముందు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు. నాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అనుమతితోనే ఓట్లు మార్పు జరిగిందని వివరించారు. మండల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌కు, అక్కడ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్లి.. తిరిగి జిల్లా కలెక్టర్‌కు అనుమతులు వచ్చాకే ఓట్ల మార్పు సాధ్యపడుతుందని వివరించారు. నిబంధనల ప్రకారమే.. రెండేళ్ల క్రితమే నిర్వాసితుల ఓట్లు మార్చితే ఇప్పుడు ఈనాడు పత్రిక అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. నిర్వాసితులకు వారు ఉండే ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించామన్నారు. దొంగ ఓట్లు, వేరే రాష్ట్రాల వారి ఓట్లేమీ చేర్చలేదు కదా అని నిలదీశారు. ఓటు మార్చడంలో తప్పేముంది?పోలవరం ముంపులో తొయ్యేరు గ్రామం మునిగిపోయింది. కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో ఇళ్లు నిర్మించారు. శాశ్వతంగా ఎప్పటికీ ఇక్కడే నివాసం ఉండాలి. ఈ నేపథ్యంలో ఓటును ఇక్కడకు మార్చడంలో తప్పేముంది? కాలనీలోనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. –నండూరి సీతారామ్, కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీ ఓటు మార్పు వల్ల ఇబ్బందేమీ లేదు.. కాలనీకి వచ్చాక 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓట్లు నమోదు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం మేమున్న కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించారు. ఓట్లు మార్చడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా మా ఓటు హక్కును వినియోగించుకుంటాం. –దేవరపల్లి వీరబాబు, కృష్ణునిపాలెం ఆర్అండ్ ఆర్ కాలనీ -
ఇండొనేసియాలో కొత్త ఏలిక
సర్వేలన్నీ జోస్యం చెప్పినట్టు బుధవారం జరిగిన ఇండొనేసియా దేశాధ్యక్ష ఎన్నికల్లో రక్షణమంత్రి, వివాదాస్పద మాజీ సైనికాధికారి జనరల్ ప్రబోవో సుబియాంటో విజయం సాధించారు. అభ్యర్థుల్లో మిగిలినవారితో పోలిస్తే ఓటర్లకు బాగా పరిచయమున్న నేత గనుక తొలి రౌండులో ముందంజలో ఉంటాడని అందరూ అంచనా వేశారు. కానీ నెగ్గటానికి అవసరమైన 50.1 శాతం కనీస ఓట్ల వరకూ వెళ్లగలరని ఎవరూ అనుకోలేదు. ఇండొనేసియా ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థుల్లో ఎవరికీ కనీస ఓట్లు లభించకపోతే తిరిగి పోలింగ్ నిర్వహించకతప్పదు. గతంలో అధ్యక్ష పదవికి రెండు దఫాలు పోటీచేసి ఓడిన సుబియాంటోకు తాజా ఎన్నికల్లో సానుభూతితోపాటు యువత మద్దతు పుష్కలంగా దొరికింది. అందుకే ఆయనకు 60 శాతం ఓట్లు పోలయ్యాయి. సుబియాంటో చరిత్ర ఏమంత ఘనమైనది కాదు. దేశాన్ని దీర్ఘకాలం పాలించిన తన సొంత మామ, నియంత జనరల్ సుహార్తో ప్రాపకంతో సైన్యంలో ఉన్నత పదవులకు ఎగబాకి లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. 1997 నాటి విద్యార్థి ఉద్యమాన్ని దారుణంగా అణిచేయటంలో కీలకపాత్ర పోషించారు. ఆ సమ యంలో దాదాపు 20 మంది విద్యార్థి నేతల అపహరణలకు సుబియాంటోయే కారణమన్న ఆరోపణ లున్నాయి. వారందరూ సైన్యం చిత్రహింసలకు బలైవుంటారని మానవ హక్కుల సంఘాలు ఆరో పించాయి. చిత్రమేమంటే ఆ తర్వాత మరో ఏడాదికే సుహార్తోను గద్దెదించటానికి సుబియాంటో తోడ్పడ్డారు. ఆ తర్వాత తానే ఆ పీఠాన్ని అధిష్టించాలని ఉవ్విళ్లూరినా అది సాధ్యపడలేదు. కనీసం సైనిక దళాల చీఫ్ కావాలని కలలుకన్నా సుహార్తో స్థానంలో అధ్యక్షుడైన బీజే హబీబి అందుకు ససేమిరా అంగీకరించలేదు. దాంతో ఆయనపై ఆగ్రహించి కొందరు సైనికులను వెంటబెట్టుకుని అధ్యక్ష భవనంపై దాడికి సిద్ధపడ్డారు. కానీ అది వికటించి సైన్యం నుంచి ఉద్వాసన తప్పలేదు. ఆ తర్వాత జోర్డాన్ పరారై వ్యాపారవేత్తగా అవతరించారు. 2009 అధ్యక్ష ఎన్నికల నాటికి సొంతంగా ఒక పార్టీ స్థాపించి మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణోపుత్రితో కూటమికట్టి ఉపాధ్యక్షుడిగా పోటీచేశారు. కానీ ఆ కూటమి ఓటమి చవిచూసింది. 2014, 2019 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసినా ఓటర్లు తిరస్కరించారు. ఆ తర్వాతే సుబియాంటోకు జ్ఞానోదయమైంది. రెండుసార్లూ తనపై గెలిచిన అధ్యక్షుడు జోకోవితో సంధి చేసుకుని రక్షణమంత్రి అయ్యారు. ఈసారి సైతం జోకోవియే పోటీచేసేవారు. కానీ అధ్యక్ష పదవికి వరసగా రెండుసార్లు మించి పోటీ చేయకూడదన్న నిబంధన కారణంగా ఆయన రంగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలోనే ఇండొనేసియా మూడో అతి పెద్ద ప్రజాతంత్ర దేశం. జనాభా రీత్యా ముస్లింలు అత్యధికంగా వున్న దేశం. ఆగ్నేయాసియాలో అతి పెద్ద పారిశ్రామిక దేశంగా ఒకప్పుడున్నా 1997లో వచ్చిన ఆర్థిక సంక్షోభంలో దెబ్బతింది. ఆ తర్వాత క్రమేపీ వృద్ధి సాధిస్తూ 2012 నాటికి జీ–20 దేశాల్లో ఆర్థికాభివృద్ధి వైపు దూసుకుపోతున్న నాలుగో అతి పెద్ద దేశంగా ఎదిగింది. 2020లో కోవిడ్ బారిన పడటమేకాక, ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటున్నా నిరు ద్యోగం, అధిక ధరలు వేధిస్తూనే వున్నాయి. దానికితోడు దక్షిణ చైనా సముద్రంలో చైనాతో సరిహద్దు తగాదాలున్నాయి. అయితే ఇరు దేశాల ఆర్థిక సంబంధాలకూ ఆ వివాదం అడ్డురాలేదు. అటు అమె రికా, భారత్‌లతో సాన్నిహిత్యం సాగిస్తూ ఇండొనేసియా ఆర్థికంగా పుంజుకుంటోంది. విదేశీ పెట్టు బడులను ఆకర్షిస్తోంది. అయితే దీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ, ఉద్యమ చరిత్రగల ఇద్దరు నేతలను కాదని మాట నిలకడ, సిద్ధాంత నిబద్ధత లేని సుబియాంటోకు ఈ స్థాయిలో ప్రజలు నీరాజనాలు పట్టడం ఆశ్చర్యకరమే. యువతలో సుబియాంటో పేరు మారుమోగటానికి టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాలు దోహదపడ్డాయి. సర్వే నిర్వహించిన సంస్థలకు ఓటర్లు... మరీ ముఖ్యంగా యువ ఓటర్లు ఆయన గత చరిత్ర తమకు అనవసరమని చెప్పటం సుబియాంటోకున్న జనాకర్షణను తెలియజేస్తుంది. గతంలో దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన రెండుసార్లూ తన సైనిక గతాన్ని ఘనంగా చెప్పుకున్న సుబియాంటో ఈసారి ఆ జోలికి పోలేదు. సైనికాధికారిగా పనిచేసిన కాలంలో తూర్పు తైమూర్‌లో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నవారిని హతమార్చటం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఉద్యమించిన విద్యార్థి నేతలను మాయం చేసి వారి ప్రాణాలు తీయటంవంటి అంశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆయనపై నిషేధం కూడా విధించాయి. మూడో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండొనేసియాలో క్రమేపీ వ్యవస్థలు బలహీనపడు తుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈసారి సుబియాంటో తరఫున ఉపాధ్యక్ష పదవికి నిలబడిన 36 ఏళ్ల గిబ్రాన్ నేపథ్యమే ఈ సంగతి చెబుతుంది. కనీసం 40 ఏళ్లుంటే తప్ప ఉపాధ్యక్ష పదవికి పోటీచేయటానికి వీల్లేదని ఎన్నికల నిబంధనలు చెబుతున్నా రాజ్యాంగ న్యాయ స్థానం చీఫ్ జస్టిస్‌గా వున్న గిబ్రాన్ మామ ఈ నిబంధనను సవరించి అతనికి సాయపడ్డాడు. దీనిపై ఆందోళన చెలరేగి చీఫ్ జస్టిస్ రాజీనామా చేయాల్సివచ్చినా, ఆ తీర్పు మాత్రం రద్దుకాలేదు. 20 కోట్ల మంది ఓటర్లలో అత్యధికుల మనసు గెలుచుకున్న సుబియాంటో అంతంతమాత్రంగా వున్న వ్యవస్థలను మరింత బలహీనపరుస్తారని ఆయన ఎన్నికల ప్రసంగాలే చెబుతున్నాయి. మానవ హక్కుల చార్టర్, రాజ్యాంగ న్యాయస్థానం వంటివి కనుమరుగైతే ఇండొనేసియా తిరిగి నియంతృత్వంలోకి జారుకుంటుంది. ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుంది. ప్రజల అప్రమత్తతే ఆ ప్రమాదాన్ని నివారించాలి. -
పాక్ యువతకు ఇమ్రాన్ ‘అవినీతి’ పట్టలేదా?
పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం పలు అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా కనిపిస్తున్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పలు వార్తా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్ యువ ఓటర్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మద్దతు పలికారు. దీని వెనుకనున్న కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ జైల్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో అతని పార్టీ పేరు, గుర్తును రద్దు చేశారు. అయితే ఈ పార్టీకి చెందిన నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. వీరు స్వతంత్ర అభ్యర్థుల కంటే మెరున ఫలితాలు దక్కించుకోవడం విశేషం. 2022లో ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారం నుంచి తొలగించారు. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. 2023 ఆగస్టులో ఇమ్రాన్‌ను జైలుకు తరలించారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్‌పై కొన్నాళ్ల పాటు నిషేధం విధించారు. అయితే ఈ ఎన్నికల్లో పాక్ యువత ఇమ్రాన్‌కు మద్దతు పలికింది. పాక్‌లో సైనిక మద్దతుతో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువ ఓటర్లు ఇమ్రాన్‌కు అండగా నిలిచారు. అయితే ఈ వాదనను పాక్ ఆర్మీ ఖండించింది. మరోవైపు రాజకీయాలలో మిలటరీ ప్రమేయంపై పాక్ యువతకు అవగాహన ఏర్పడిన కారణంగా వారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు ఓటు వేశారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరగడం, ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపడంపై పాక్ యువత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. పాక్‌కు చెందిన న్యాయ విద్యార్థి నైలా ఖాన్ మార్వాత్ మాట్లాడుతూ ‘నేను 2016లో పీటీఐ పార్టీలో చేరాను. 2018లో నా మొదటి ఓటు ఈ పార్టీకే వేశాను. ఇమ్రాన్ ఖాన్ మాటలు నన్ను, నా సహోద్యోగులను ఎంతగానో ఉత్సాహపరిచాయి. నెల్సన్ మండేలా లాంటి పలువురు నేతలు జైలులో ఉంటూనే తమ సత్తా చాటారు’ అని పేర్కొన్నారు. -
పాక్‌లో ఎన్ని సీట్లకు ఎన్నికలు? బరిలో పార్టీలేవి? అభ్యర్థులెందరు?
ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. విపరీతమైన ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ.. దేశంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అనేక ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నడుమ పాక్ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. పాకిస్తాన్ ద్విసభ పార్లమెంటరీ వ్యవస్థను కలిగి ఉంది. దీనిలో జాతీయ అసెంబ్లీలోని పలువురు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉన్నాయి. వాటిలో 266 స్థానాలకు ప్రజలు ఓటు వేస్తారు. 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు ముస్లిమేతరులకు రిజర్వ్ చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 141 సీట్లు, సింధ్‌లో 75, ఖైబర్ పఖ్తుంక్వాలో 55, బలూచిస్థాన్‌లో 20, ఇస్లామాబాద్‌లో మూడు సీట్లు ఉన్నాయి. పాకిస్తాన్లో ప్రస్తుతం 12.85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో సగానికి పైగా ఉంది. 6.9 కోట్ల మంది పురుష ఓటర్లు ఉండగా, 5.9 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నమోదైన ఓటర్లలో కూడా 44 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. 2018 నుండి, దేశంలో ఓటర్ల సంఖ్య 2.25 కోట్లు పెరిగింది. అందులో 1.25 కోట్ల మంది మహిళలు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 52 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాకిస్తాన్ ఎన్నికల్లో 5,121 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 4,806 మంది పురుషులు, 312 మంది మహిళలు, ఇద్దరు లింగమార్పిడి అభ్యర్థులు ఉన్నారు. 167 నమోదిత రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా మొత్తం 5,121 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల విషయానికొస్తే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో, ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ). ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. ఫలితంగా పీటీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీకి దిగారు. ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం మొత్తం 90,582 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో దాదాపు 17,500 ‘అత్యంత సున్నితమైన’ పోలింగ్ స్టేషన్లు. పాక్ ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయనున్నారు. -
టీడీపీ ‘ఓటర్ల’ అక్రమాలపై రుజువులతో సహా ఫిర్యాదు
కొండపి (సింగరాయకొండ): తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను ఎలా నమోదు చేసింది, 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఓటర్ల జాబితాను ఏ విధంగా తారుమారు చేశారనే వాటిపై ఆధారాలతో సహా భారత ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. టీడీపీ ఓటర్ల జాబితాలో చేసిన అవకతవకలపై వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించిందని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎటువంటి ఆవేదన, సమస్యలు లేవన్నారు. జిల్లాకు బాలినేని అత్యంత విలువైన నాయకుడని, పార్టీలో ఆయన ప్రాధాన్యత ఏ రోజూ తగ్గదని చెప్పారు. సీఎంకు అత్యంత సన్నిహితుడైన బాలినేని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీచేస్తారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు గెలుపే లక్ష్యంగా 3 జాబితాలను విడుదల చేశామని, త్వరలో నాలుగో జాబితా ఉంటుందని తెలిపారు. మాగుంట ఎన్నికల్లో పోటీ చేయాలంటే చంద్రబాబును తిట్టాలని, రూ.150 కోట్లు ఇవ్వాలని షరతులు పెట్టారని ప్రచారం జరుగుతుందని, ఇది వాస్తవం కాదా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇది కేవలం మీడియా, టీడీపీ, చంద్రబాబు సృష్టిస్తున్న కథనం మాత్రమేనని చెప్పారు. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సహజమన్నారు. ‘మా అధినాయకుడిని విమర్శిస్తే తిప్పికొట్టడం ఆయన అనుచరులుగా మా బాధ్యత. ఈ బాధ్యతను పార్టీలోని ప్రతి ఒక్కరు తప్పకుండా నిర్వర్తించాలి్సందే..’ అని ఆయన స్పష్టం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
డబ్బుకు బాబు దాసోహం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త క్యాండిడేట్ల కోసం టీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ఓట్లను డబ్బుతోనైనా కొని గెలవాలని నిర్ణయించుకుని దండిగా డబ్బున్నవారికోసం వలవేస్తోంది. కాంట్రాక్టర్లు, రియల్టర్లు వంటి వారిని బరిలోకి దింపాలని చూస్తోంది. అనంతపురం జిల్లాలో కొత్త అభ్యర్థులను తీసుకొచ్చేందుకు కొందరు సీనియర్ నాయకులను రంగంలోకి దింపింది. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితులు సామాన్య కార్యకర్తలకు, నాయకులకు శరాఘాతంగా మారాయి. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సీఎం రమేష్, సుజనా చౌదరి, కనకమేడల, టీజీ వెంకటేష్ వంటి బడావ్యాపారులకు సీట్లిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం అనుసరించబోతున్నట్టు తాజా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బడా కాంట్రాక్టర్‌ను దించాలని యోచిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా అక్కడ పార్టీకి పనిచేస్తున్న వారిని ఈసారి పక్కన పెట్టొచ్చని విశ్వసనీయంగా తెలిసింది. గుంతకల్లు నియోజకవర్గంలో ఇప్పటివరకూ పనిచేసిన అభ్యర్థులను కాదని, ఒక సీఐ స్థాయి పోలీసు అధికారిని నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో రెండుసార్లు పరిటాల సునీత పోటీ చేశారు. ఇప్పుడు బాగా డబ్బున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని తెరమీదకు వచ్చారు. ఈయన పేరు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈయనకు టికెటిస్తే రూ.50 కోట్లయినా ఖర్చు చేయగలరని చంద్రబాబు విశ్వసిస్తున్నట్లు సమాచారం. ఈసారి రాయదుర్గం టికెట్ కాల్వ శ్రీనివాసులుకు ఇవ్వకుండా దీపక్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అగ్రకులాల చేతిలో రిజర్వుడు స్థానాలు మడకశిర, శింగనమల రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు మొత్తం ఆర్థిక బలమున్న అగ్రకులాల చేతుల్లోకి వెళ్లింది. పార్టీకి పనిచేసిన వాళ్లకు కాకుండా డబ్బున్న వాళ్లు ఎవరికి చెబితే వారికే దక్కే అవకాశం ఉంది. అందుకే ఇప్పటివరకూ శింగనమలకు బండారు శ్రావణి, మడకశిరకు ఈరన్న పేర్లను ఖరారు చేయకుండా నాన్చుతున్నారు. రూ.10 కోట్లయినా ఖర్చు చేయగలిగే వాళ్లకే ఇక్కడ టికెట్లు ఇవ్వాలనేది బాబు యోచన. మిగిలిన స్థానాల్లోనూ ఆర్థిక బలమున్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని కసరత్తు చేస్తున్నారు. -
పచ్చ పార్టీకి దొంగఓట్లే పెద్దదన్ను
ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడం... చేసిన పనులు సగర్వంగా చెప్పుకోవడం... తద్వారా ఎన్నికల సమయంలో ఓట్లడగటం నిజమైన నాయకుడి లక్షణం. అదే దొంగ ఓట్లను నమ్ముకోవడం... అధికారంకోసం అడ్డదారులు ఎంచుకోవడం... అందుకోసం కుట్రలు, కుతంత్రాలకు తెరతీయడం... ఎంతటి అక్రమానికైనా వెరవకపోవడం కుటిల నీతికి నిదర్శనం. రెండో కేటగిరీకి చెందినవారే మన పచ్చనేతలు. విజయమే పరమావధిగా దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేరి్పంచేసి వారిద్వారా గెలవడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాలే సాక్ష్యం. అక్కడ అధికారుల తనిఖీల్లో వేలాది దొంగఓట్లు బహిర్గతమయ్యాయి. వాటి ద్వారానే గతంలో వారు విజయం సాధించారని ఈ సంఘటన రుజువు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ దొంగ ఓట్లతోనే గత ఎన్నికల్లో గెలుపొందింది. తాజాగా బయటపడ్డ దొంగ ఓట్ల వ్యవహారం చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని అధికారపార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుదఫాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాటి తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు పెట్టారు. జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టగా పెద్ద ఎత్తున అక్రమ ఓట్లు ఉన్నట్లు తేలింది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఓట్లున్నవారికీ ఇక్కడ ఓట్లుండటం, స్థానికంగా ఒకే నియోజకవర్గంలో రెండు చోట్ల ఓట్లు నమోదు కావడం, చని పోయినవారి ఓట్లు జాబితాలో ఉండటం బయటపడింది. ఈ విధంగా బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 46,116 దొంగ ఓట్లను అధికారులు తొలగించారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అధికంగా బయటపడ్డాయి. అక్రమ ఓట్ల వల్లే గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు వాటిని తొలగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో వారి విజయం ప్రశ్నార్థకంగా మారనుంది. పర్చూరులో పదివేలకు పైగా దొంగ ఓట్లు పర్చూరు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. 2014లో 10,775 ఓట్లు, 2019లో 1647 ఓట్ల మెజారిటీ వచ్చింది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా 1967, 1991, 2004, 2019లో మాత్రమే పదివేలకుపైబడి మెజార్టీవచ్చింది. మిగిలిన 11 ఎన్నికల్లో 7 వేలకు మించలేదు. తాజాగా అధికారులు ఈ నియోజకవర్గంలో 10,468 దొంగ ఓట్లను తొలగించారు. మరిన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దీన్నిబట్టి పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లవల్లే గెలుపొందినట్లు తెలుస్తోంది. రేపల్లెలోనూ దొంగ ఓట్ల హవా... రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 2014లో 13,355 ఓట్లు, 2019లో 11,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ జరిగిన 15 ఎన్నికల్లో 8 సార్లు 10 వేలకు మించి మెజార్టీ రాగా 7 సార్లు 10వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఓట్ల విచారణ పూర్తికాక ముందే 8,880 దొంగ ఓట్లను గుర్తించారు. ఇంకా మరికొన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దొంగ ఓట్ల తొలగింపు రాబోయే ఎన్నికల్లో పచ్చపార్టీపై ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది. అద్దంకిలోనూ అదే తీరు... అద్దంకి నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్(ఐ), వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యరి్థగా పోటీచేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆయనకు 12,991 మెజార్టీ వచ్చింది. 2009, 2019 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గంలో 10 వేలకు మించి మెజార్టీ వచ్చింది. మిగిలిన 12 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సగటున 5 వేలకు మించి మెజార్టీ రాలేదు. తాజాగా ఈ నియోజకవర్గం పరిధిలో అధికారులు 7,207 దొంగ ఓట్లను తొలగించారు. విచారణ పూర్తయితే మొత్తం 8 వేల పైచిలుకు దొంగ ఓట్లను తొలగించే అవకాశముంది. -
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలపై సీఈసీ కసరత్తు
సాక్షి, అమరావతి: వచ్చే సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్‌కు జరిగే సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఉన్నతాధికారులు రెండు రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు సహా మొత్తం ఏడుగురు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు సమీక్షిస్తారు. తదనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో ఈసీఐ బృందం చర్చించనుంది. ఎస్ఎస్ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తదితరాలపై జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం చేసిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో కలసి పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. -
టీడీపీ నేతల బాటలోనే జనసేన నేతలు
-
చంద్రబాబు' రెండు ఓట్ల' సిద్ధాంతం బట్టబయలు
-
'ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు కూడా రాలేదు'
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అవకతవకలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. తమ నేతలతో సమీక్ష నిర్వహించిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే స్బందించారు. చిప్ ఉన్న ఎలాంటి యంత్రాన్నైనా హ్యాక్ చేయవచ్చని ఆయన అన్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లకు గాను బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకే పరిమితమైంది. Any Machine with a Chip can be hacked. I have opposed voting by EVM since 2003. Can we allow our Indian Democracy to be controlled by Professional Hackers! This is the Fundamental Question which all Political Parties have to address to. Hon ECI and Hon Supreme Court would you… https://t.co/8dnBNJjVTQ — digvijaya singh (@digvijaya_28) December 5, 2023 మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీని సూచించాయి. కానీ వాస్తవంగా బీజేపీ పూర్తి ఏకపక్ష మెజారిటీని సాధించింది. ఈ ఫలితంపై కాంగ్రెస్ నాయకులతో పార్టీ ప్రచార సారథి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. భారీ అపజయం వెనకు ఉన్న కారణాలను విశ్లేషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నట్లు కనిపించినప్పటికీ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని కమల్ నాథ్ చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని చెబుతున్నారు. నిజానికి ఇది ఎలా సాధ్యమైతుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Rajasthan Politics : రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే! -
మైనార్టీల ఓట్లెవరికో..?
కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల మైనార్టీ ఓట్లపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజక వర్గంలో మొత్తం 3,55,054 మంది ఓటర్లు ఉండగా అందులో 66 వేల పైచిలుకు మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరు కాకుండా క్రిస్టియన్లు, సిక్కులు, ఇతరులు కలిపి మరో 12 వేల మంది వరకు ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్‌లో నియోజకవర్గంలో 3,55,054 ఓట్లకు 2,24,504 ఓట్లు పోలయ్యాయి. ముస్లిం మైనార్టీలకు సంబంధించి 78 వేల ఓట్లల్లో 70 శాతం పోలైన 52 వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఒక అంచనా. మైనార్టీలు ముస్లింల ఓట్లు ఒకే పార్టీకి పడే అవకాశం ఉండటంతో ఈ ఓట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముస్లింలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారో అన్న చర్చ హట్‌టాపిక్‌గా మారింది. ఓటు హక్కు వినియోగించుకున్న 52 వేల పైచిలుకు మందిలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేశారనే సందిగ్ధంలో అభ్యర్ధులు మల్లగుల్లాలు పడుతున్నారు. అంచనా ప్రకారం పోలైన 52 వేల ఓట్లల్లో 35వేల పైచిలుకు ఓట్లు బీఆర్ఎస్కే పడుతాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. మిగతా 17వేల ఓట్లు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పడుతాయనే అంచనాల్లో మూడు పార్టీల నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లల్లో చేపట్టిన సంక్షేమ పథకాలు ముస్లిం మైనార్టీ వర్గాల్లో గడపగడపకూ అందాయని బీఆర్ఎస్ నాయకులు తెలుపుతుండగా, కాంగ్రెస్ హాయంలోనే 4 శాతం రిజర్వేషన్ ఇచ్చామని ముస్లిం మైనార్టీలకు వెన్నుదన్నుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. ముస్లిం ఓట్ల చీలికపై బీజేపీ ఆశలు పెంచుకుంది. త్రిపుల్ తలాక్‌తో పాటు బీజేపీ చేపట్టిన కార్యక్రమాలతో మైనార్టీల మద్దతు బీజేపీకి ఉందని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. దీంతో కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గం ఫలితం హట్‌టాపిక్‌గా మారింది, -
అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే!
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా 81 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల పండుగలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని, అత్యధిక ఓటింగ్‌కు కారణంగా నిలిచారు. మహిళల ఉత్సాహాన్ని చూసిన ఎన్నికల అధికారులు ఈసారి ఓట్ల లెక్కింపును కూడా మహిళలకే అప్పగిస్తున్నారు. కంకేర్ జిల్లాలో జరిగే ఈ ఓట్ల లెక్కింపులో సూపర్వైజర్ నుంచి సర్వెంట్ వరకు అన్ని విధులను మహిళలే నిర్వర్తించనున్నారని అధికారులు తెలిపారు. డిసెంబరు 3న జరిగే ఓట్ల లెక్కింపునకు మొత్తం 196 మంది మహిళలను విధుల్లోకి తీసుకున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీ ఉదయం ప్రారంభంకానుంది. ఈవీఎం లెక్కింపునకు 48 మంది మహిళా గెజిటెడ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 12 మంది.. మొత్తం 60 మంది మహిళా గెజిటెడ్ అధికారులను డ్యూటీ సూపర్వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ అసిస్టెంట్లుగా 72 మంది మహిళా అసిస్టెంట్ టీచర్లు, క్లర్క్‌లను నియమించారు. దీంతో పాటు కౌంటింగ్ టేబుళ్ల వద్దకు ఈవీఎం యంత్రాలను తరలించేందుకు 62 మంది మహిళా సేవకులను విధుల్లోకి తీసుకున్నారు. ఫలితాలను ప్రకటించేందుకు ఇద్దరు మహిళా అధికారులకు అనౌన్సర్లుగా బాధ్యతలు అప్పగించారు. ఈ విధంగా మొత్తం 196 మంది మహిళా ఉద్యోగులు ఓట్ల లెక్కింపును పూర్తి చేయనున్నారు. కాంకేర్ కలెక్టర్ ప్రియాంక శుక్లా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు పలు ప్రయోగాలు చేశామన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని రెయిన్ బో పోలింగ్ బూత్ నిర్మించామని, ఇక్కడ మోహరించిన భద్రతా బలగాలు కూడా థర్డ్ జెండర్ వారేనని తెలిపారు. ఇది కూడా చదవండి: ట్రైన్ ఎక్కుతూ కాలు జారిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్! -
తెలంగాణలో గెలుపెవరిది?.. డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలేనా?
తెలంగాణ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లే కీలక పాత్ర పోషించనున్నాయి. 30కిపైగా నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయిస్తారు. హైదరాబాద్ పాతబస్తీలో అయితే మజ్లిస్‌కి మినహా మరో పార్టీకి అవకాశమే లేదు. ఇక ఏ పార్టీ అధికారంలోకి రావాలో డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలే. ఒకప్పుడు మైనారిటీలు కాంగ్రెస్‌కి అండగా నిలిచేవాళ్ళు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఓట్లన్నీ గులాబీ గూటికే చేరుతున్నాయి. ఈసారి మైనారిటీలు ఎవరిని కరుణించబోతున్నారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా ఈసారి కులాలు, మతాల ఓట్లపై బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు కులాలవారీగా, మతాల వారీగా ఓట్ల వేట సాగిస్తున్నాయి. అందుకు అవసరమైన తాయిలాలు ప్రకటిస్తున్నాయి. హామీలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కోసం ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించింది. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై అటు బీజేపీ.. ఇటు బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇక మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మైనారిటీలంతా తమ మిత్రపక్షం బీఆర్ఎస్కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు కూడా సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలు సేకరిస్తూ..ఎవరికి కావాల్సిన హామీలు వారికిస్తున్నారు. గతంలో ఎన్నికలు వస్తే మా ఊరికి, పల్లెకు, కాలనీకి, నగరానికి ఏం చేస్తారంటూ...ఆయా పార్టీల తరపున నిలబడే అభ్యర్థులను అక్కడి ప్రజలు ప్రశ్నించే వాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులను మా కమ్యూనిటీకి ఏం చేస్తారు?..మా మతానికి ఎం చేస్తారు? అని అడుగుతున్నారు. కోట్లు గుమ్మరించి ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థులు కులం, మతానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ దిశగానే ప్రచారం సాగిస్తున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలోను, పట్టణంలోనూ ముస్లిం మైనారిటీలు నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ ఒక కుటుంబం మాదిరిగానే ఉంటారు. ఒక మాటకే కట్టుబడతారు. కాని పట్టణాలు, నగరాల్లోని బస్తీల్లో మాత్రం ఎవరి దారి వారిదే. ఎన్నికల సమయంలో ఎవరి పార్టీ వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుంటే...హైదరాబాద్ పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో మజ్లిస్ మినహా మరో పార్టీ గెలుస్తున్న ఉదంతాలు కనిపించడంలేదు. ఇక మిగిలిన 112 నియోజకవర్గాల్లో 30 సెగ్మెంట్లలో ముస్లిం మైనారిటీలు కీలక పాత్ర పోషిస్తారు. అభ్యర్థుల గెలవాలన్నా..ఓడించాలన్నా వీరిది నిర్ణయాత్మక పాత్రగా ఉంటోంది. హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్, నిజామాబాద్ అర్బన్ తో కలిపి మూడు నియోజకవర్గాల్లో లక్షకు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ జూబిలీ హిల్స్‌లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను బరిలో దించింది. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కరీంనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 60 వేల నుంచి లక్ష లోపు వరకు మైనారిటీ ఓట్లు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. 50వేలకు పైగా మైనారిటీలు ఉన్న నియోజకవర్గాలుగా ముషీరాబాద్, బోధన్, మహబూబ్ నగర్, జహీరాబాద్, గోషామహల్ ఉన్నాయి. ఇక అంబర్ పేట, సికింద్రాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి సెగ్మెంట్లలో 40వేలకు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నట్లు సమాచారం. 30 వేల నుంచి 40 వేల వరకు మైనారిటీ ఓట్లున్న నియోజకవర్గాలు 8..20 వేల నుంచి 30 వేల వరకు ఉన్న నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో 12వేలు మైనారిటీ ఓటర్లు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ 30 నియోజకవర్గాల్లో 25 సీట్లను గులాబీ పార్టీ గెలుచుకుంది. మూడు స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. గోషా మహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ కాషాయజెండా ఎగరేసారు. తాజా ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీతో ఎంఐఎం స్నేహపూర్వకంగానే ఉంది. తాము పోటీ చేయనిచోట బీఆర్ఎస్కు ఓటేయాలని అసదుద్దీన్ ఒవైసీ మైనారిటీలకు పిలుపునిచ్చారు. మరి మైనారిటీలు ఎవరి మాట వింటారో.. ఎవరి హామీలను విశ్వసిస్తారో.. ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి. చదవండి: నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆత్మహత్య -
Oath To Vote: ఓటుతో దుమ్ము రేపుదాం
సాక్షి: రాబోయే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రజా ప్రయోజనార్ధం సాక్షి మీడియా గ్రూప్ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి ప్రతి ఓటరు ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని "ఓత్ టు వోట్" (OATH TO VOTE) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అసలు "ఓత్ టు వోట్" (OATH TO VOTE) నినాదం ఏమిటంటే.. 'ఓటు హక్కు కలిగిన ఓటరు ఈ వెబ్ సైట్ https://o2v.sakshi.com/?utm_source=sakshio2v కు లాగిన్ అయి తమ ఓటు హక్కును 2023 ఎన్నికలలో తప్పకుండా వినియోగించుకుంటామని "ఓత్ టు వోట్" (OATH TO VOTE) ద్వారా ప్రమాణం చేయాలి. అంతేకాదు ఆ ప్రమాణానికి సంబంధించి ప్రమాణపత్రం కూడా ఇమెయిల్ రూపంలో వెంటనే పొందవచ్చు.' ఎన్నికల్లో ప్రతిసారి ఎవరో ఒకరు తమ విలువైన ఓటు హక్కును వాడుకోక పోవడం వల్ల ఆ ఓటు కాస్త మురిగిపోతుంది. దీనివల్ల ప్రభుత్వాలతోపాటు మన జీవితాలూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ‘‘ఏం ఓటు మీ హక్కు కాదా? మీకు తగిన అభ్యర్థిని మీరు ఎన్నుకోలేరా?’’ ఒక్కసారి ఆలోచించండి. గెలిచేది వారైతే గెలిపించేది మనమని అర్థం చేసుకోండి. వారు గెలిచి చేసే పాలన కన్నా మనం గెలిపించుకుని చేయించుకునే పాలనే మిన్న అని గుర్తించండి. ఓటు హక్కును వాడుకునే అవకాశాలు మున్ముందూ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మనముందున్న ఎన్నికలు మనకొచ్చిన తాజా అవకాశం. మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరనుకున్న రేపటి భవిష్యత్తు మారిపోతుందన్న నమ్మకంతో ముందుకు కదలండి. ‘ఓత్ టు వోట్’ ద్వారా మీరేంటో నిరూపించుకోండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి.. -
పులిటీషియన్లు.. కొంగబావలు
అడవిలో పులి వేటకు బయలుదేరింది. కొంతకాలంగా ఆ అడవిలో దానిదే రాజ్యం. ఎంత కావాలంటే అంత ఆహారం. రోజుకో జంతువు విందు. అందుకే తాపీగా లేచి ఒళ్లు విరుచుకుని అడవి మీద పడింది. మాంచి ఆకలి మీద ఉందేమో కాసింత పెద్ద జంతువునే వేటాడేసి.. ఆరగించడం మొదలుపెట్టింది. పులికైనా పొలిటీషియన్ కైనా ఎంత తిన్నా ఆకలి అలాగే ఉంటుందని.. ఓ పెద్ద రైటర్ ఏనాడో చెప్పాడు. దొరికిన జంతువును ఆబగా తింటూండేసరికి దాని ఎముకగొంతులో ఇరుక్కుంది. దీంతో విలవిల్లాడిన పులి దాన్ని బయటకు తీయాలని అన్ని జంతువులను బతిమాలింది. కొని పులి అరాచకంపై కోపంతో.. మరికొన్ని భయంతో మావల్ల కాదనేశాయి. ఇంతలో ఓ కొంగ దాని కంటపడింది. కొంగ బావను ఎలాగైనా ఒప్పించాలని.. దానితో మాటలు కలిపి..తన బాధను చెప్పింది. ముందు కొంగ కూడా ససేమిరా అంది. అయితే పులి కొంగకు ఆశలు పెట్టింది. తాయిలాలు చూపింది. అచ్చం ఎలక్షన్ టైమ్‌లో మన నాయకులలాగా.. ‘ ఇల్లు ఇస్తాం, పొలం ఇస్తాం, పింఛన్ పెంచుతాం. గ్యాస్‌ధర తగ్గిస్తాం.. ఈసారి ఓటేసి గట్టెక్కించండి...’’... అలా కొంగ బావకు రకరకాల ఆశలు పెట్టింది. దానితో కొంగ ఐసైపోయింది. మన ఓటరు లాగా. ‘ ఆహా.. చిన్న సాయానికే బతుకు మారిపోతుందే..’ అనుకుంది. తన పొడుగాటి ముక్కు పులి నోట్లో తల పెట్టి ఎముక చులాగ్గా లాగి పారేసింది. పులి ఊపిరి పీల్చుకుని కొంగకు «థ్యాంక్స్ చెప్పి బయలుదేరింది. అలా వెళుతున్న పులికి దాని బాసలు గుర్తుచేసింది. తొందరగా పని కానివ్వు అన్నట్టుగా. తర్వాత రెండు మూడు నెలలు గడిచాయి. పులి జాడలేదు. ఇచ్చిన మాట జాడలేదు. ఎలాగోలా పులిని వెతికి పట్టుకుని ‘..నీ మాటేమైంది..’ అని కొంగ అడిగింది. ‘ .. చూద్దాం అదే పనిలో ఉన్నా..’ అని పులి అక్కడ నుంచి జారుకుంది. అలా నెలలు గడుస్తున్నాయి. ఉలకదు పలకదు. అచ్చం మన ప్రజాప్రతినిధిలా. ఓసారి పులి ఎదురైతే కొంగ గాట్టిగా నిలేసింది. ‘..ఎంతో మేలు చేస్తానన్నావ్ నీ పని అయిపోయాక తప్పించుకు పోతున్నావ్....’ అని. దానికి పులి చిద్విలాసంగా..‘‘ నేను నీకు మేలు ఎప్పుడో చేసేసాను.. నా నోట్లో నీ తల పెట్టినప్పుడు వదిలేశా.. అంతకన్నా మేలు ఏముంటుంది..’ అని తాపీగా నడుచుకుంటూ పోయింది. కొంగబావ అవాక్కయ్యింది. ఎన్ని ప్రలోభాలు.. ఎన్ని మాటలు.. ఎన్ని మోసాలు అని తిట్టుకుంది. అది మనిషి కాదు కనుక దానికిది కొత్త.. మనకైతే ప్రతి ఐదేళ్లకోసారి అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఎలక్షన్ వచ్చింది...పులిటీషియన్లను ఇప్పుడు ఓటర్లే కాపాడాలి. ఎవరు మనవాళ్లు, ఎవరు విపక్షం, కొంగబావలాగా ఎవరిని మచ్చిక చేసుకోవాలి, ఏమివ్వాలి? ఎంత ఇవ్వాలి? ఏమిస్తామని ప్రలోభ పెట్టాలి..ఇలా ఎన్నో లెక్కలు.. .. ఇస్తే ఓటేసేవారెవరు? తీసుకుని మరీ వేరేవాళ్లకు వేసేదెవరన్న ఈ అంశంపైనే అమెరికాకు చెందిన మిషిగన్, కాలిఫోర్నియా యూనివర్సిటీల పొలిటికల్ స్టడీస్ ప్రొఫెసర్లు.. ఆగ్నేయాసియా దేశాల్లో విస్తృతమైన అధ్యయనం చేశారు. ఓట్ల కొనుగోళ్ల విషయంలో ఉన్న కొన్నిరకాల అభిప్రాయాలు తప్పు అని తేల్చారు. అభ్యర్థులు, ఓటర్ల మనోభావాలు ఎలా ఉంటాయన్నది విశ్లేషించారు. ఇది క్లైంటెలిజమ్! ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బులు, వివిధ రకాల వస్తువులు, బహుమతులు పంచడమే క్లైంటెలిజమ్. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది సాధారణమే. దీనివల్ల అధికారం కొందరు రాజకీయ నేతలకే పరిమితమైపోతుంది. సిద్ధాంతపరమైన, సామాజిక ప్రయోజనకర అంశాలు పక్కనపడి.. వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానమైపోతాయి. దానితో అభివృద్ధి కుంటుపడుతుంది. తాయిలాలకు ఓట్లు రాలుతాయా? డబ్బులు, బహుమతులు తీసుకున్నవారంతా ఓటేస్తారా? ఏదైనా తీసుకున్నప్పుడు, మరొకటి తిరిగిచ్చి రుణం తీర్చుకోవాలన్న సంప్రదాయం వర్కౌట్ అవుతుందన్న దానిపైనే తాయిలాలు తయారయ్యాయి... దీనిపై చేసిన సర్వేలో .. ఓటర్లు డబ్బులు, బహుమతులను తీసుకున్నా కూడా తమకు ఓటేయరేమోనని లేక ఓటేయడానికే రారేమోనని చాలా మంది అభ్యర్థులు భావిస్తున్నట్టు పేర్కొంది. కొందరు ఓటర్లు కూడా డబ్బు తీసుకున్నాక వేరేవారికి ఓటేయడం పట్ల పెద్దగా ఇబ్బంది పడాల్సిందేమీ లేదని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇందుకోసమేనేమో.. డబ్బులు తీసుకున్న ఓటర్లతో ఒట్టు పెట్టించుకోవడం, గుళ్లకు తీసుకెళ్లి ప్రమాణాలు చేయించడం, కుల సంఘాలు, అసోసియేషన్లలో ప్రమాణాలు చేయించడం వంటివి మన నేతలు చేస్తుంటారు. ఓట్లు అమ్ముకోవడం తప్పా? ఓట్లు కొనడం, అమ్ముకోవడం తప్పు అనే ప్రచారం ఉన్నా.. ఆ భావన అటు నేతల్లో, ఇటు ఓటర్లలోనూ కనబడటం లేదని అధ్యయనం పేర్కొంది. గెలవడానికి ఎంతెంత ఇచ్చాం, ఏమేం పంచామనేది నేతలు బహిరంగంగానే చెప్తున్నారని.. ‘వాళ్లు ఇస్తున్నారు. మేం తీసుకుంటున్నాం..’ అని చెప్పడానికి ఓటర్లు కూడా పెద్దగా ఇబ్బంది పడటం లేదని వెల్లడించింది. అందుకే ఓటేయడా నికి డబ్బులు తీసుకోవద్దంటూ జరిగే ప్రచారానికి పెద్దగా ఫలితం ఉండటం లేదని స్పష్టం చేసింది. వ్యతిరేకులపై ప్రభావం అంతంతే.. తమపై వ్యతిరేకత ఉన్నవారికి డబ్బులు, బహుమతులు ఇచ్చినా తమకు అనుకూలంగా ఓటేయర న్న విషయం రాజకీయ నాయకులకు తెలుసని అద్యయనం పేర్కొంది. తమకు అనుకూలమైన వా రిని అలాగే కొనసాగించుకునేందుకు, త టస్థంగా ఉన్నవారిని తమవై పు తిప్పుకొనేందుకు మా త్ర మే డబ్బులు పంచుతారని తేల్చింది. తమ వెంట నిలిచిన కార్యకర్తలకు ఏదో ప్రయోజనం కల్పించామన్న భావన కోసం, తమను నాయకుడిగా గుర్తించేందుకు వారికి డబ్బు, బహుమతులు ఇస్తుంటారని వివరించింది. .. అనుచరులకు కాంట్రాక్టులు, పదవులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడం, కొన్నిసార్లు నేరుగానే డబ్బు సాయం చేయడం వంటివీ ఇందుకే.. ఇక ఇప్పుడు రాజకీయంగా తటస్థంగా ఉండేవారు తక్కువే. కానీ ఆ కొద్దిశాతం ఓట్లతోనే గెలుపోటములు మారిపోయే పరిస్థితులు ఎక్కువ. ఇక్కడే ‘పంపకాల’ ప్రయోజనం మరింత ఎక్కువన్నమాట. ప్రలోభాలకు లొంగవద్దనే ప్రచారాలతో ప్రయోజనమెంత? డబ్బు తీసుకుని ఓటేయడాన్ని నిరుత్సాహ పరిచేందుకు ఎన్నికల కమిషన్, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తుంటాయి. ఇందులో ఓటేసేందుకు ఎలాంటి డబ్బు, బహుమతులు తీసుకోవద్దనేది ఒకటైతే.. డబ్బు తీసుకోండి, కానీ మీకు నచ్చినవారికే ఓటేయండి అన్నది రెండో రకం ప్రచారం. నిజానికి రెండో రకం ప్రచారం వల్ల ఓటర్లు డబ్బులు తీసుకున్నా.. తమకు నచ్చిన, సమర్థుడైన నేతకే ఓటేస్తారన్న అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది తప్పు అని అధ్యయనం తేల్చింది. ఏమీ తీసుకోవద్దు, ఓటును అమ్ముకోవద్దన్న ప్రచారంతోనే కొంత ప్రయోజనం ఉంటోందని పేర్కొంది. ఏమీ తీసుకోనివారిలో ఎలాంటి బెరుకు ఉండదని, నచ్చినవారికి ఓటేస్తారని తెలిపింది. అయితే పంచే డబ్బు/బహుమతి విలువ ఎక్కువగా ఉన్నప్పుడు ఓటర్లు తీసుకోకుండా ఉండలేకపోతున్నారని స్పష్టం చేసింది. ఇక.. ‘డబ్బు తీసుకోండి. నచ్చినవారికే ఓటేయండి’ అన్న ప్రచారం.. ఓట్ల కొనుగోలు, ప్రలోభాలను మరింతగా పెంచుతోందని అధ్యయనం స్పష్టం చేసింది. దీనివల్ల ఓటర్లు డబ్బు/బహుమతులు తీసుకోవడంలో మొహమాటాన్ని పక్కన పెట్టేస్తున్నారని, ఓట్ల కొనుగోళ్లకు ప్రయత్నించే నేతలకు పని సులువు అవుతోందని పేర్కొంది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లాక.. ‘డబ్బులు తీసుకున్నప్పుడు ఓటేయకపోతే ఎలా..?’ అన్న మీ మాంసతో డబ్బులిచ్చిన అభ్యర్థికే ఓటేస్తున్నారని తెలిపింది. -
పోస్టల్ ఓట్లు ఎక్కువొచ్చాయా? అయితే తేడానే..
మేకల కళ్యాణ్ చక్రవర్తి పోస్టల్ బ్యాలెట్.... ఎన్నికల ప్రక్రియలో చివరి అంకమైన కౌంటింగ్ మొదలు కాగానే వినిపించే ఫలితం ఇదే. రిజల్ట్కు సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్‌కు అద్దం పడతాయని భావించే ఈ పోస్టల్ ఓట్లంటే ప్రతి ఎన్నికల్లోనూ క్రేజే. ఎందుకంటే ఈవీఎంలలో పోలయిన ఓట్లను లెక్కించేందుకు ఓ అర గంట ముందే ఈ ఓట్లను లెక్కిస్తారు. వీటి లెక్క పూర్తి కాగానే పోస్టల్ బ్యాలెట్లో ఫలానా అభ్యర్థి ముందంజ... పోస్టల్ ఓట్లలో వెనుకబడిన ఫలానా అభ్యర్ధి... అంటూ వార్తలు వచ్చేస్తాయి. అయ్యో... మనోడు వెనుకబడ్డాడే... మన అభ్యర్థికి పోస్టల్ ఓట్లు బరాబర్ వచ్చినయ్.. కచ్చితంగా గెలుపు మనదే... అంటూ అభిమానులు, ఆయా పార్టీల కార్యకర్తలు కూడా పోస్టల్ ఫలితం రాగానే లెక్కలు వేసుకుంటుంటారు. గత ఎన్నికల్లో పొంతన లేకుండా 2018 ఎన్నికల్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్‌కు, రిజల్ట్ ట్రెండ్స్‌కు అసలు పొంతనే లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లు ఎక్కువగా వచ్చిన 75 మంది ఓడిపోయారు. 42 మంది మాత్రమే గెలిచారు. రెండు చోట్ల మాత్రం గెలిచిన వారికి, ఓడిన వారికి సమానంగా (తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారికి) ఈ ఓట్లు పోలయ్యాయి. కొన్ని చోట్ల అయితే మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థికి తొలి రెండు స్థానాల్లో ఉన్న వారికంటే ఎక్కువగా పోస్టల్ ఓట్లు రావడం గమనార్హం. ఈ ఫలితాలను బట్టి చూస్తే ఉద్యోగుల మూడ్‌ను బట్టి ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టమేనని అర్థమవుతోంది. ప్రజల తీర్పు ఓ విధంగా ఉంటే ఎన్నికల విధుల నిర్వహించిన ఉద్యోగులు, సరీ్వస్ ఓటర్లు, ఇతర పోస్టల్ ఓటర్ల అభిప్రాయం మరోవిధంగా ఉందని తేలింది. చదవండి: Rahul Gandhi: విమర్శల బాణం.. ఆత్మీయ రాగం మూడో స్థానానికి ‘మెజారిటీ’ గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులకు కొన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. కల్వకుర్తిలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చల్లావంశీచందర్రెడ్డికి అత్యధికంగా 323 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మద్దతు తెలిపారు. అక్కడ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు 142, రెండో స్థానంలో నిలిచిన ఆచారికి 285 వచ్చాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో గెలుపొందిన జోగురామన్నకు 465 పోస్టల్ ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో వచ్చిన అభ్యర్థి పాయల్‌కు 290 పోస్టల్ ఓట్లు వస్తే మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాతకు ఏకంగా 578 మంది పోస్టల్ ఓట్లేశారు. బాల్కొండలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డికి 124 పోస్టల్ ఓట్లే వచ్చాయి. కానీ, మూడో స్థానంలో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనిల్‌కు ఏకంగా 298 ఓట్లు వస్తే, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కు 175 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. దుబ్బాకలో అందరికంటే మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఉద్యోగుల మెప్పు పొందారు. ఆయనకు 221 పోస్టల్ ఓట్లు వస్తే, గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి 187, రెండో స్థానంలో ఉన్న మద్దులకు 108 ఓట్లు రావడం గమనార్హం. రెండు చోట్ల సమానంగా పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోకెల్లా పోస్టల్ బ్యాలెట్లో విభిన్న తీర్పు పటాన్చెరు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో వచ్చింది. ఇక్కడ గెలిచిన అభ్యర్థులకు, వారి సమీప ప్రత్యర్థులకు సమానంగా పోస్టల్ బ్యాలెట్ పోలైంది. పటాన్ చెరులో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డికి 148, కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌కు 148 ఓట్లు వస్తే, చాంద్రాయణగుట్టలో గెలిచిన ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీకి 30, బీజేపీ అభ్యర్థిని షెహజాదికి 30 పోస్టల్ ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో పోస్టల్ ‘సిత్రాలు’ జరిగిన నియోజకవర్గాలివే.. ►జుక్కల్‌లో రెండో స్థానంలో నిలిచిన సౌదాగర్ గంగారాం (216)కు పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా పోలయ్యాయి. అయితే, ఇక్కడ గెలిచిన అభ్యర్థి హన్మంత్ షిండే (157) పోస్టల్ ఓట్లు వస్తే మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి అరుణతార (178)కు గెలిచిన అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. ►కామారెడ్డిలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్‌కు 206, రెండో స్థానంలో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి 542, మూడో స్థానంలో వచ్చిన బీజేపీ అభ్యర్థి కె.వి.రమణారెడ్డికి 338 పోస్టల్ ఓట్లు వచ్చాయి. ►నిజామాబాద్ అర్బన్‌లో సమీప ప్రత్యర్థి తాహెర్‌బిన్(కాంగ్రెస్)కు ఏకంగా 713 పోస్టల్ ఓట్లు వస్తే మొదటి స్థానంలో వచ్చిన బిగాల గణేశ్ గుప్తా (బీఆర్ఎస్)కు 499, మూడోస్థానంలో వచి్చన యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ)కు పోటాపోటీగా 489 ఓట్లు వచ్చాయి. ►కరీంనగర్లో అయితే గెలిచిన అభ్యర్థి కంటే సమీప ప్రత్యర్థికి దాదాపు 600 పోస్టల్ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గంగులకు 844, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు 1440 ఓట్లు వస్తే, మూడో స్థానం దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు కూడా గెలిచిన అభ్యర్థితో అటూఇటుగా 826 ఓట్లు వచ్చాయి. ►నారాయణ్‌ఖేడ్‌లో విచిత్రంగా గెలిచిన అభ్యర్థి, మూడో స్థానంలో ఉన్న అభ్యర్థికి చెరిసమానంగా పోస్టల్ ఓట్లు వచ్చాయి. గెలిచిన భూపాల్‌రెడ్డి (బీఆర్ఎస్)కి 306, మూడోస్థానంలో ఉన్న సంజీవరెడ్డికి 306 ఓట్లు వస్తే, రెండో స్థానంలో ఉన్న సురేశ్‌షెట్కార్‌కు కేవలం 244 ఓట్లు మాత్రమే వచ్చాయి. ►పరిగిలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డికి 530కి పోస్టల్ ఓట్లు రాగా, ఆయన చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్‌ఆర్‌కు అంతకంటే రెట్టింపు సంఖ్యలో 1090 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ►డంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)కు 526 పోస్టల్ ఓట్లు రాగా, గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్ఎస్)కు కేవలం 174 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల విధుల్లో ఉన్న వారితో పాటు సాయుధ దళాల్లో పనిచేస్తున్న వారు (సర్వీస్ ఓటర్లు), విదేశాల్లో నివసించే భారతీయ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుంది. ఇక, ప్రత్యేక ఓటర్లు... అంటే పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేసే అవకాశం లేని ఓటర్లు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు. వీటిని ఈవీఎంల లెక్కింపు కంటే ఓ అర గంట ముందు లెక్కిస్తారు. -
భిన్న కుల, మత, భాషల ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు
ముహమ్మద్ ఫసియొద్దీన్: కుల మతాల పేరుతో ఓట్లను అభ్యర్థించవచ్చా? గుడులు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు వంటి ప్రార్థన స్థలాల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించవచ్చా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం... ‘లేదు’. ఎవరైనా అలా చేస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టే. మీ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సజావుగా అమలు అవుతోందా? పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ప్రవర్తన, చర్యలు.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా? అనే అంశాలను ప్రజలు కూడా పరిశీలించవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘిస్తే స్థానిక ఎన్నికల పరిశీలకులను కలిసి లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు లేదా ‘సీ–విజిల్’ యాప్ ద్వారా ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలు/వీడియోలు తీసి నేరుగా ఎన్నికల సంఘానికి పంపొచ్చు. వివిధ సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘంజారీ చేసిన నిబంధనల సంకలనాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తాజాగా విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు.. విద్వేషాలు రెచ్చగొట్టరాదు... భిన్న కుల, మత, భాష, వర్గాల ప్రజల మధ్య విభేదాలను పెంపొందించే, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు. ప్రత్యర్థి పార్టీలపై చేసే విమర్శలు కేవలం ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత చరిత్ర, చేసిన పనులకు పరిమితమై ఉండాలి. వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ధ్రువీకరణ జరగని ఆరోపణలు, వక్రీకరణల ఆధారంగా విమర్శలు చేయరాదు. ఎన్నికల చట్టాల్లో నేరపూరిత చర్యలుగా పేర్కొన్న కార్యకలాపాలకు అన్ని పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలి. ప్రధానంగా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేయడం, ఓటర్ల స్థానంలో ఇతరులతో ఓటేయించడం, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం, పోలింగ్‌కు 48 గంటల ముందు సభలు, సమావేశాలు జరపడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి రవాణా సదుపాయం కల్పించడం వంటివి చేయరాదు. ఇంట్లో ప్రశాంతంగా బతికేందుకు ప్రతి పౌరుడి హక్కును గౌరవించాలి. వ్యక్తుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వారి ఇళ్ల ముందు ఏ పరిస్థితుల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టరాదు. యజమానుల సమ్మతి లేకుండా వారి స్థలాలు, భవనాలు, ప్రహరీ గోడలను జెండాలు, బ్యానర్లు, పోస్టర్ల కోసం వినియోగించరాదు. గోడలపై ఎలాంటి రాతలు రాయకూడదు. ఇతర పార్టీల సమావేశాలు, ఊరేగింపులకు తమ మద్దతుదారులు భంగం చేయకుండా చూసుకోవాలి. ఏదైనా ఓ పార్టీ కార్యకర్తలు వేరే పార్టీల సమావేశం జరుగుతున్న ప్రాంతం మీదుగా ఊరేగింపులు నిర్వహించకూడదు. ఒక పార్టీ అతికించిన పోస్టర్లను మరో పార్టీ కార్యకర్తలు తొలగించకూడదు. ఊరేగింపులు... ఊరేగింపుల రూట్ మ్యాప్‌ను నిర్వాహకులు ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ఊరేగింపులు చేసుకోవాలి. భారీ ర్యాలీ అయితే తగిన నిడివికి తగ్గించుకోవాలి. ఇద్దరు లేదా అంతకుమించిఅభ్యర్థులు/పార్టీలు ఏక కాలంలో ఒకే రూట్లో ఊరేగింపు నిర్వహించే సమయంలో నిర్వాహకులు ముందుగా సంప్రదింపులు జరిపి ఘర్షణ జరగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి. ఊరేగింపులో తీసుకెళ్లే వస్తువుల విషయంలో పార్టీలు, అభ్యర్థులు నియంత్రణ పాటించాలి. ఆ వస్తువులు అసాంఘిక శక్తుల చేతిలో దురి్వనియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర పార్టీల నేతల దిష్టి బొమ్మలను ఊరేగించడం, వాటిని బహిరంగంగా దహనం చేయడం వంటివి చేయరాదు. పోలింగ్ బూత్‌ల వద్ద.. ఓటర్లు మినహా పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు ఎవరికీ అనుమతి ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం పాస్ కలిగిన వారికి మినహాయింపు. పరిశీలకులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో పార్టీలు, అభ్యర్థులకు ఫిర్యాదులుంటే వాటిని పరిశీలకుల దృష్టికి తేవాలి. సభలకు ముందస్తు అనుమతి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రతిపాదిత సభ సమయం, వేదికను ముందస్తుగా స్థానిక పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలి. సభ వేదిక ఉన్న ప్రాంతంలో ఏవైనా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటే వాటిని కచ్చితంగా పాటించాలి. అవసరమైతే ముందుగా దరఖాస్తు చేసుకుని సడలింపులు పొందాలి. సభలో లౌడ్ స్పీకర్, ఇతర సదుపాయాలను వినియోగించడానికి ముందస్తుగా సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందాలి. స్వేచ్ఛగా ఓటు వేసేలా.. అభ్యర్థులు/పార్టీలు ఎలాంటి ఆటంకాలు, బెదిరింపులకు తావు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా ఎన్నికల అధికారులకు సహకరించాలి. తమ అనధికార కార్యకర్తలకు గుర్తింపు కార్డులు, బ్యాడ్జీలను ఇవ్వాలి. ఓటర్లకు పంపిణీ చేసే చిట్టీలపై గుర్తులు, పార్టీల పేర్లు ఉండరాదు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం సరఫరా జరపరాదు. పోలింగ్‌బూత్‌ల వద్ద పార్టీలు, అభ్యర్థులు ఏర్పాటు చేసే క్యాంపుల వద్ద ప్రజలను గుమికూడనీయొద్దు. అభ్యర్థుల క్యాంపుల వద్ద పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదు. ఆహార పదార్థాలను సరఫరా చేయరాదు. పోలింగ్ రోజు వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలుంటాయి. పర్మిట్లు పొంది వాటికి స్లిక్కర్ బాగా కనిపించేలా వాహనంపై అతికించాలి. -
పరిటాల వారి నకిలీ ఓట్ల రాజకీయం
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఇంటి నంబరు 8–63లో 12 ఓట్లు ఉన్నాయి. అందులో ఆరుగురు స్థానికులే. మరో ఆరుగురు కర్ణాటకకు చెందిన వారు. వాళ్లంతా పోలింగ్ రోజునే ఇక్కడికి వస్తారు. ఓటు వేసి వెళ్లిపోతారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లేయడానికే తప్ప ఇటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కర్ణాటకకు చెందిన కె.ప్రతాప్ (48), బి.రమేశ్‌కుమార్ (49), వి.నాగయ్య (73), డి.వెంకటస్వామి (71), డి.వెంకటప్ప (48), వి.వెంకటస్వామి (68) పేర్లు రామగిరి మండలం నసనకోట పంచాయతీ ఓటరు జాబితాలో ఉన్నాయి. వీళ్లందరూ ఎన్నికల రోజు మినహా మిగతా రోజుల్లో ఆంధ్రలో కనిపించరు. ...రామగిరి మండలంలో ఇలాంటి నకిలీ ఓట్లు చాలా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కర్ణాటక వాసులను, ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను ఓటరు జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లు వేయించుకోవడమే పరిటాల కుటుంబం పని. సాక్షి, పుట్టపర్తి: గత ఎన్నికల్లో ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో ‘పరి టాల’ కుటుంబం దొంగ ఓట్లను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితాపై లేనిపోని రాద్ధాంతం చే స్తోంది. పరిటాల రవీంద్ర టీడీపీలో ప్రవేశించినప్పటి నుంచి నకిలీ ఓట్లపైనే ఆధారపడ్డారు. అదే తరహాలో ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా దొంగ ఓట్ల రాజకీయం చేయాలని చూస్తు న్నట్లు తెలుస్తోంది. స్థానికంగా లేని వారి ఓట్ల తొల గింపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.రవీంద్ర హయాంలోనే పెనుకొండ (ప్రస్తుతం రాప్తాడు) నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి మండలాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చించింది పరిటాల కుటుంబం.రవీంద్రకు భయపడి అధికా రులు ఎదురు మాట్లాడేవారు కాదు. దశాబ్దాలుగా దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్, దౌర్జన్యాలతో అమాయక ప్రజల ఓట్లను వారే వేసుకొనేవారు. ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతోంది.ఫలితంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రలో ఓటరు కార్డులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్ల తొలగింపుపై పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అవి దొంగ ఓట్లే అని ఒప్పు కోలేక, కాదనీ చెప్పలేక రోజుకోరకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక.. నేరుగా ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక నకిలీ ఓట్లపై పరిటాల కుటుంబం ఆధారపడింది. రవీంద్ర చేసిన హత్యాకాండను ప్రజలు మరువలేదు. నేడు వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీగా గెలవలేక దొంగ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత గతంలో నమోదు చేయించిన దొంగ ఓట్లను కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఓట్లలో అధిక శాతం పరిటాల సునీత సొంత పంచాయతీ నసన కోటలోనే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారంటూ హంగామా సృష్టిస్తున్నారు. -
తినే హక్కు గురించి కదా అడగాలి?
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వెంటనే రావాలనే వైపుంటారా, వ్యతిరేకంగా ఉంటారా అని లెక్కలు ఎందుకు? యూసీసీ కావాలా, వద్దా అనే పోటీ పెట్టి, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది సమాధానం కాదు. ఫేస్ బుక్‌లో, సామాజిక మీడియాలో, ఆలోచించే వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు, యూదులు, ఇతర మతాల వారు, ముఠాల వారు, అనేక రకాల వర్ణాల వారు, కులాల వారు, అటూ ఇటూ చీలిపోవడం న్యాయం కాదు. ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడం అత్యవసరమైపోయింది. కొన్ని పార్టీలు ఓడిపోయేందుకు సిద్ధం. వందల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ఇస్తున్నారంటే అనేక పార్టీలు ఓడిపోవ డానికీ, ఓట్లు చీల్చడానికీ సిద్ధం. అందుకే రాజకీయ అవస రాలతో సంస్కరణ చేయాలనడం దారుణం. పర్సనల్ లా అంటే ‘వ్యక్తిగతమైన’ అని అర్థం కాదు. ఒక మతానికి చెందిన చట్టాల ప్రకారం అని అర్థం. వివాహం, ఆస్తుల వారసత్వం ఇందులోని అంశాలు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో ముందు సమానత్వం, దాంతో మొత్తం మీద భారతదేశానికి ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు సలహాలు ఇచ్చాయే గానీ స్పష్టమైన తీర్పులు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’ కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. ఇటువంటి సంక్లి ష్టమైన యూసీసీ విషయంలో పార్లమెంట్ చట్టం చేయా ల్సిందే కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కావాలని స్పష్టం చేయడం సాధ్యం కాదు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు వర్తించే విభిన్న చట్టాలున్నాయి. భారత రాజ్యాంగం కింద ఈ మతాలలో అమలు చేసుకునే హక్కులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం మైనారీలకున్న ఈ హక్కులను ఉల్లంఘించి పార్లమెంటులో చట్టం చేస్తుంది కావచ్చు. కొన్ని సంవత్సరాల తరు వాత దాన్ని సవరించి కొట్టివేసేదాకా జనం ఎన్నికల్లో తమను సమర్థించాలనే ఆలోచన కూడా ఉండవచ్చు. అనేక చట్టాలు అందరికీ వర్తించేలా ఉంటాయి. ఉదాహరణ: ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్. గృహ హింస నిరోధక చట్టం! ఈ చట్టం అన్ని మతాల వారికీ ఉపయోగమే. అందులో ‘వయొలెన్స్’ అన్నంత మాత్రాన దాన్ని క్రిమినల్ చట్టం అనుకుంటారు. కానీ అది సివిల్ కేసు. అవన్నీ సివిల్ కోర్టులో విచారణ చేస్తారు. క్రిమినల్ కేసులు కూడా అన్ని మతాల వారికీ ఉప యోగపడేవి. వీటిని ఎక్కువగా వాడుకునేది హిందువులే. వారితోపాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా వినియోగిస్తున్నారనడం నిజం. చాలామంది దుర్వినియోగం అంటారు. దానికి కారణం ఎక్కువమంది అబద్ధాలు ఆడతారు. భార్యలైనా భర్తలైనా లేదా వారి బంధువులైనా అబద్ధాలు విపరీతంగా చెబుతూ అంటారు. లాయర్లని బద్నాం చేస్తాం గానీ, అబద్ధాలు ఆడని వారెవరు? ఎవరూ కోరని యూసీసీ ఇప్పుడెందుకు? తినే హక్కు గురించి ఎవరూ అడగడం లేదు. సంపాదించుకున్న ప్రకారం వండుకొని తినే హక్కు, ఇష్టమైన వస్త్రాలు వేసుకునే హక్కు, నచ్చిన భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదువుకుని, పాడుకునే హక్కు ఉన్నాయి. ఇవి యూసీసీకి అతీతమైనవి కదా! రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలనే శాసనం, లేదా చట్టం ఉండనవసరం లేదు. అది స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం. టమాటా ధరలను నియంత్రించే చట్టం ప్రభుత్వాలు చేయగలవా? దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంటుంది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా,మహీంద్రా యూనివర్సిటీ -
దొంగ ఓట్లతోనే కుప్పంలో బాబు గెలుపు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో ఒక్క దొంగ ఓటు కూడా ఉండకూడదని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలని.. తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీగా కోరుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. ఈ విషయమై తాము ఇవాళ (28వ తేదీన) కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలవనున్నామని చెప్పారు. బృందావన్ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ పథకం ప్రకారం రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు చేర్పిచిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి రాలేమన్న బలమైన అభిప్రాయంతో చంద్రబాబు ఇలా చేశారని విమర్శించారు. దీనికి పూర్తి భిన్నంగా రాష్ట్రంలో అసలు దొంగ ఓట్లే ఉండకూడదనే సదుద్దేశంతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. దీంతో ప్రతిపక్ష నేతల కూసాలు కదలిపోతున్నాయని, అందుకే చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాజాగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రేలాపనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. దొంగ ఓట్లతోనే కుప్పంలో బాబు గెలుపు చంద్రబాబు ఇప్పటి వరకు దొంగ ఓట్లతోనే కుప్పంలో గెలుపొందుతూ వచ్చారని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిష్పక్షపాతంగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయని చెప్పారు. ఈసారి కుప్పంలో చంద్రబాబుకు కూడా ఓటమి తప్పదన్నారు. నాలుగేళ్లలో సంక్షేమాభివృద్ధి నేరుగా దళితుల ఇంటి తలుపులు తడుతోందని స్పష్టం చేశారు. దళిత సంక్షేమంపై తాము చర్చకు సిద్ధం అని చెప్పారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కుప్పంలోనే కుప్పకూలిపోయిన వాస్తవాన్ని గుర్తించాలని కోరారు. 2024 ఎన్నికల్లో సైతం 2019 ఫలితాలే పునరావృతం అవుతాయని, టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. -
దొంగ ఓట్ల పాపం చంద్రబాబుదే
మడకశిర/హిందూపురం: రాష్ట్రంలో దొంగ ఓట్ల పాపం చంద్రబాబు దేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో స్థానిక మాజీ ఎమ్మెల్యే దివంగత వైసీ తిమ్మారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. వారి హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లను కాపాడుకోవడానికే చంద్రబాబు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వీటిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎంపీల బృందంతోపాటు రాష్ట్ర మంత్రుల బృందం కూడా ఢిల్లీకి వెళ్లి దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మడకశిర ప్రాంతంలో వన్యప్రాణుల మృతిపై విచారణ చేయిస్తామని తెలిపారు. వన్యప్రాణుల మృతికి కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పం, హిందూపురమూ మనవే: పెద్దిరెడ్డి ‘కలసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు. వచ్చే ఎన్నికల్లో కుప్పం మనదే. హిందూపురమూ మనదే...’ అని పెద్దిరెడ్డి అన్నారు. హిందూపురంలోని బైపాస్ రోడ్డులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. టీఎన్ దీపిక, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్‌నిశ్చల్ మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు శంకరనారాయణ, సిద్దారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర, మునిసిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘనీ పాల్గొన్నారు. -
దొంగ ఓట్ల పేరుతో బాబు కొత్త డ్రామా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల వివరాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే ఇప్పుడు ఇంటింటి సర్వే చేస్తోందని.. ఆ సర్వేలోనే దొంగ ఓట్లు, అసలు ఓట్ల సంగతేంటో తెలిసిందని.. అలాంటిది టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై కొత్తగా డ్రామాలాడటమేంటని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒక డ్రామా ఆడుతుంటాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఈసీకి లేఖలు, ఢిల్లీ పర్యటనలు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డేటాను టీడీపీ చౌర్యం చేసి, ఎలా దొరికిపోయిందో ప్రజలకు తెలుసు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన మాటలు నమ్మే పరిస్థితిలేదు. బౌన్సర్లతో, కిరాయి జనంతో, రాజకీయ కూలీలతో లోకేశ్ చేసేది పాదయాత్ర ఎలా అవుతుంది? ధర్మ ప్రచార పర్యవేక్షణకు ఏడుగురితో కమిటీ.. సనాతన హిందూ ధర్మం ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి యువతకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈనెల 6న అన్నవరంలో ప్రారంభమైన ధర్మ ప్రచార కార్యక్రమం అన్నిచోట్లా కొనసాగుతాయి. ఈ ధర్మ ప్రచార కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించాం. అలాగే, ఐదు లక్షలలోపు ఆదాయం ఉండే ఆలయాల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఇప్పటివరకు వంశపారంపర్య ధర్మకర్తలు లేదా అర్చకుల నుంచి 37 దరఖాస్తులు అందాయి. -
పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లపై ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో 2013 నుంచి 2023 వరకు జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్మీనాను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ.. 2013లో కేవలం మూడునెలల వ్యవధిలోనే సుమారు 20 వేల దొంగ ఓట్లు చేర్చగా.. అప్పటి ఆర్ఓ ఈ అవకతవకలపై విచారణ చేయమని క్రిమినల్ కేసు పెట్టారన్నారు. అప్పటి నుంచీ అది పెండింగ్‌లో ఉందన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఆర్ఓ ఆఫీస్ నుంచి నివేదిక లేదంటూ కోర్టుకు అప్పటి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. 2018లో సుమారు 15 వేల దొంగ ఓట్లు చేర్చారన్నారు. ఇలా ఇప్పటికి 2013 నుంచి 2023 జనవరి 1వ తేదీ కొత్త ఓటరు జాబితా ప్రకారం, సప్లిమెంటరీ ఓటరు జాబితా వరకు సుమారు 40వేల దొంగ ఓట్లు ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేర్చి అక్రమ పద్ధతిలో స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారన్నారని ఆరోపించారు. వీటితోపాటు విదేశాలలో ఉంటున్న వారి ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, దేశంలో ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారి ఓట్లు, పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపడచుల ఓట్లు తొలగించకుండా వాటిపేరుతో దొంగ ఓట్లతో అప్రజాస్వామికంగా ఎన్నికలు పర్చూరులో జరుగుతోందని వివరించారు. మార్టూరు ప్రస్తుత ఏఈఆర్ఓ తన లాగిన్‌లోని డేటాను ఏలూరికి ఎలా ఇచ్చారని ప్రశి్నంచారు. ఒక ప్రత్యేక అధికారి బృందంతో ఇంటింటికి సమగ్ర విచారణ జరిపి ప్రత్యేక ఓటరు ధ్రువీకరణ చేయాలని, ఓట్లు చేర్పు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. -
ఓటు దొంగలు.. బాబు అండ్‌కో
తాడికొండ: ఎన్నికలు సమీపిస్తుండడంతో బహుజనుల ఓట్లు దోచుకునేందుకు రాష్ట్రంలో బాబు అండ్ కో బ్యాచ్ అడ్డగోలుగా తిరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 1,049వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో శనివారం పలువురు మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పక్క రాష్ట్రంలో దాక్కున్న పలు పార్టీల నాయకులు ఇప్పుడు ఓట్లు వేయించుకునేందుకు బహుజనులకు వల విసురుతున్నారన్నారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు ఏం చేశాడో చెప్పి ప్రజల్లోకి రావాలని లేకుంటే తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహుజనుల కలలు సాకారం చేస్తుంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, బీజేపీలోని బాబు బంధువు పురందేశ్వరి.. బాబును గద్దెనెక్కించేందుకే ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న చంద్రబాబు.. అన్ని ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించేందుకు పావులు కదుపుతున్నాడని చెప్పారు. రిలే నిరాహార దీక్షలో సమితి నాయకులు కారుమూరి పుష్పరాజు, బేతపూడి సాంబయ్య, పులి దాసు, మాదిగాని గురునాథం, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలో బహుజన నేతలు -
ఎన్నికల ముందే హామీలు యాదికొస్తాయ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత హామీలు నెరవేరిస్తే, దొర గారికి మాత్రం ఎన్నికల ముందే హామీలు యాదికొస్తాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోయిన సీఎం కేసీఆర్ ఓట్ల కోసం అటక మీద దాచిన మేనిఫెస్టో తిరగేస్తున్నారని అన్నారు. ఈ మేరకు గురువారం షర్మిల ట్వీట్ చేశారు. రైతులను ఓట్లు అడిగేందుకు మొహం చెల్లక రుణమాఫీ చేస్తానంటూ.. నవంబర్‌లో నిర్వహించాల్సిన మద్యం టెండర్లను మూణ్ణెల్ల ముందే ముంగటేసుకున్నారని దుయ్యబట్టా రు. కరోనా సమయంలోనూ రాష్ట్రం ఆర్థికంగా దూసుకెళ్లిందని, నిధుల కొరత లేదని ఇన్నా ళ్లూ గప్పాలుకొట్టిన దొర ఎన్నికలకోసం డబ్బు ను పోగు చేసుకుంటున్నారని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డును రూ.7 వేల కోట్లకే లీజుకిచ్చారని, ప్రభుత్వ భూములను యథేచ్చగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. -
కమలా హారిస్ మరో రికార్డు.. అమెరికా చరిత్రలో 191 ఏళ్ల తర్వాత..
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్(58) మరో రికార్డు నెలకొల్పారు. భారత సంతతికి చెందిన కల్పనా కోటగల్‌ను అమెరికా సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్ సభ్యురాలిగా నియమించే విషయంలో ఆమె టై–బ్రేకింగ్ ఓటు వేశారు. సెనేట్‌లో బుధవారం ఓటింగ్ జరిగింది. కల్పనా కోటగల్‌ను నియమించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ టై–బ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షుడు ఇలాంటి ఓటు హక్కు వినియోగించుకోవడం 191 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చదవండి: రెస్టారెంట్‌కు షాక్.. మసాలా దోసతో సాంబారు ఇవ్వలేదని.. -
మధ్య కర్ణాటకలో ఆసక్తికర రాజకీయం
-
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకీరామిరెడ్డి మరోసారి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి ఉప్పుటూరు వేణుగోపాలరావుపై 20 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రతి రౌండ్లో నువ్వా, నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు విజయం జానకీరామిరెడ్డిని వరించింది. మొత్తం 1,438 ఓట్లు పోల్ కాగా.. జానకీరామిరెడ్డికి 703, వేణుగోపాలరావుకు 683, మరో అభ్యర్థి డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబుకు 38 ఓట్లు వచ్చాయి. కొన్ని ఓట్లు చెల్లలేదు. వేణుగోపాలరావు విజయావకాశాలను ప్రసాద్‌బాబు ప్రభావితం చేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి గెలుపొందడం ఇది వరుసగా రెండోసారి. ఇప్పటి వరకు సంఘం చరిత్రలో వరుసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి ఎవరూ లేరు. కాగా ఉపాధ్యక్షుడిగా పీఎస్పీ సురేష్‌కుమార్ గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి తుహిన్ కుమార్‌పై 52 ఓట్ల తేడాతో గెలిచారు. సురేష్‌కు 739 ఓట్లు రాగా తుహిన్కు 687 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్ ఎన్నికయ్యారు. ఆయన టి.సింగయ్య గౌడ్‌పై 142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంయుక్త కార్యదర్శిగా సాల్మన్ రాజు గెలుపొందారు. ఆయన వై.సోమరాజుపై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి 75 ఓట్లతో, గ్రంథాలయ కార్యదర్శిగా జ్ఞానేశ్వరరావు 4 ఓట్లతో, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా చంద్రశేఖర్‌రెడ్డి పితాని 213 ఓట్లతో గెలిచారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా అన్నం శ్రీధర్, మారుతి విద్యాసాగర్, కాశీ అన్నపూర్ణ, షేక్ ఆసిఫ్, శాంతికిరణ్, శరత్, అచ్యుతరామయ్య విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా విజయ్‌కుమార్ వ్యవహరించారు. ఎన్నికల్లో జానకీరామిరెడ్డి వర్గం ఓవైపు నిలవగా, ఆయన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు ఏకమయ్యాయి. -
ఆ ఊళ్లో ఎన్నికల ప్రచారమే ఉండదు! కానీ..
గుజరాత్లో మొత్తం 186 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఒక వారం మాత్రమే సమయం ఉన్నందున గుజరాత్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రచార ర్యాలీల హోరుతో రసవత్తరమైన ఎన్నికల టెన్షన్‌తో ఉత్కంఠంగా ఉంది. కానీ, ఆ ఊరిలో మాత్రం ఎలాంటి కోలాహలం లేకుండా సాధారణ వాతావరణం కనిపిస్తుంటుంది. గుజరాత్లో రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్ సమాధియాల అనే ఒక గ్రామం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతాయి కానీ అక్కడి రాజకీయ పార్టీల ప్రచార ప్రవేశం మాత్రం పూర్తిగా నిషేధం. అసలు అక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రచారం జరగదు. అయినప్పటికీ అక్కడి గ్రామస్తులంతా ఓటేస్తారు. అదీ కూడా ఒక్కరు కూడా మిస్స్ కాకుండా ఫుల్‌గా ఓట్లు పడతాయి. ఆ గ్రామంలో ఎన్నికల సమయంలో అందరూ అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తుంది అక్కడ గ్రామాభివృద్ధి కమిటీ. పైగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఓటు వేసేందుకు రాకపోతే వారిపై రూ. 51/- జరిమాన కూడా విధిస్తుంది గ్రామాభివృద్ధి కమిటీ. అక్కడ గ్రామ సర్పంచ్‌ని కూడా అందరీ ఏకాభిప్రాయంతోనే ఎన్నుకుంటారు. అంతేగాదు పోలీంగ్‌కు కొన్ని రోజుల ముందు కమిటీ సభ్యులు, గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎవరైనా ఓటు వేయకపోతే కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో ఏ రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదనే నియమం 1983 నుంచి ఉంది. పైగా ఇక్కడ ఏ పార్టీ కూడా ప్రచారం చేసేందుకు రాదని, ఒకవేళ ప్రచారం చేస్తే తమ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందని ఆయా రాజకీయ పార్టీలకు కూడా తెలుసుని గ్రామస్తులు చెబుతున్నారు. ఐతే తమ గ్రామంలో వైఫై ఇంటర్నెట్ కనెక్షన్, సీసీటీవీ కెమెరాలు, తాగునీరు అందించే ఆర్ఓ ప్లాంట్ తదితర అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామంలో అభ్యుర్థులను ప్రచారం చేయడానికి అనుమతించరు కాబట్టి గ్రామ ప్రజలంతా తమకు మంచిదని భావించే నాయకుడికే ఏకగ్రీవంగా ఓటు వేస్తారుని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. ఏ కారణం చేతనైనా ఓటు వేయలేని పక్షంలో ముందుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. (చదవండి: ప్రధాని తప్పు చేస్తే.. చర్యలు తీసుకునే సత్తా ఉన్న సీఈసీ కావాలి: సుప్రీం కోర్టు) -
'కాంగ్రెస్‌కి వేసి ఓట్లను వృధా చేయకండి': అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను కాంగ్రెస్‌కి ఓటు వేసి ఓట్లను వృధా చేయకండి అన్నారు. అందుకు బదులుగా ఆప్‌కి ఓటు వేసి గెలిపించండి అని ప్రజలను అభ్యర్థించారు. ఈ మేరకు కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి, ఆప్‌కి మధ్య ప్రత్యక్ష పోటీ జరుగుతోందన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి కేవలం నాలుగైదు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. గుజరాత్లో 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉందని, ఈసారి ఆప్ కచ్చితంగా గట్టి పోటీ ఇచ్చి గెలుస్తుందని ధీమాగా చెప్పారు. కాంగ్రెస్ తన ప్రాబల్యం కోల్పోతుందంటూ పదేపదే చెప్పి తమ పార్టీ ఆధిక్యతను ప్రచారం చేసే పనిలో పడ్డారు కేజ్రీవాల్. ఆప్ ఇప్పటికే గుజరాత్లో 178 స్థానాల్లో తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ ఓట్ల శాతం 13 శాతానికి పడిపోతుందని, అందువల్ల కాంగ్రెస్ ఓటు వేయాలనుకుంటున్న ఓటర్లంతా ఇలా చేసి మీ ఓటును వృధా చేయొద్దు. మీ కుటుంబానికి, పిల్లలకు మంచి భరోసా ఇచ్చే ఆప్కే ఓటు వేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేగాదు బీజేపీతో విసుగు చెంది ఉన్న ప్రజలు కాంగ్రెస్‌పై ద్వేషంతో నిస్సహాయతతో అధికార పార్టీకి ఓటు వేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు బరిలోకి దిగుతున్న ఆప్‌పై ప్రజల్లో కొత్త ఆశ చిగురించి తమకు ఓటు వేస్తారని, అలాగే కాంగ్రెస్ ఓట్లు కూడా తమకే పడతాయని ధీమాగా చెప్పారు. గుజరాత్లో డిసెంబర్ 1, 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి...మొండి చేయి చూపిన బీజేపీ) -
'కారు' మెజారిటీకి గండి పెట్టిన రోడ్డు రోలర్, రోటీ మేకర్
నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీ మెజారిటీకి కారును పోలిన గుర్తులతో గండి పడింది. ఉప ఎన్నికలో ఇండిపెండెంట్లకు కారును పోలి ఉన్న రోడ్డు రోలర్, చపాతి మేకర్ గుర్తులు వచ్చాయి. దీంతో కొందరు ఓటర్లు వాటిని చూసి కారు గుర్తే అనుకుని ఓటేసినట్లు తెలుస్తోంది. కారును పోలిన గుర్తులను మిగతావారికి ఇవ్వొద్దని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసింది. అయినా దాన్ని తొలగించలేదు. మొత్తం ఉప ఎన్నికలో 47 మంది పోటీలో ఉండగా 12వ నెంబర్లో ఉన్న అభ్యర్థికి చపాతి మేకర్ గుర్తు వచ్చింది. ఆ గుర్తుకు 2,407 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 14వ నెంబర్లో ఉన్న అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. ఆ గుర్తుకు 1,874 ఓట్లు వచ్చాయి. ఈ రెండు గుర్తులకు వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడితే మెజారిటీ మరింత పెరిగేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాగా, రెండో బ్యాలెట్లో 18వ నంబర్ అభ్యర్థి చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు వచ్చాయి. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
చౌటుప్పల్‌లో అనుకున్న మెజార్జీ రాలేదు
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ముందంజ
-
ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
జైపూర్: వివిధ సంస్థల్లో యూనియన్లు ఏర్పాటు చేసి దానికి లీడర్లను ఎన్నుకోవడం సాధారణ విషయమే, విద్యాసంస్థల్లోనూ ఈ విధానం అమలవుతోంది. కాలేజీ, యూనివర్సిటీలోనూ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉంటాయి. అక్కడ కూడా స్టూడెంట్స్ తమలో ఒకరిని విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేసే విద్యార్థి నాయకులంతా ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల హామీలు, వాగ్దానాలు చేస్తుంటారు. ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు తనను ఎన్నుకుంటే చేసే అభివృద్ధిని వివరిస్తూ వరాల జల్లు కురిపిస్తారు. అచ్చం ఇలాగే ఓ కాలేజీలో లీడర్‌గా పోటీ చేస్తున్న కొందరు విద్యార్థి నాయకులు ఓట్ల కోసం వినూత్నంగా వేడుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బరన్ జిల్లాలోని ఓ కళాళాలలో విద్యార్థి సంఘాల నేతలు ఓటు వేయడానికి వస్తున్న ప్రతి స్టూడెంట్స్‌ను అడ్డుకొని నమస్కరించి, కాళ్లు పట్టుకొని, తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా అమ్మాయిలు కనిపిస్తే వారి కాళ్లపై పడి పాదాలు పట్టుకొని తనకు అనుకూలంగా ఓట్లు వేయాలని ప్రాధేయపడ్డారు. చదవండి: అదరగొట్టిన ఆఫ్రికన్ చిన్నారులు.. కేటీఆర్ మెచ్చిన డ్యాన్స్ వీడియో ఓటు వేస్తామని విద్యార్థులు భరోసా ఇచ్చేంత వరకు తమ కాళ్లను వదిలిపెట్టకుండా పట్టేసుకున్నారు. దీంతో కాళ్లు పట్టుకొని ఓట్లు అడుగుతున్న వారిని చూసి అక్కడున్న వారంతా ఆశ్యర్యపోయారు. ఈ వీడియోను అన్‌సీన్ ఇండియా అనే పేజీ ట్విట్టర్లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రెండేళ్ల విరామం తర్వాత శుక్రవారం రాజస్థాన్‌లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం ఓట్ల లెక్కించి, మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని राजस्थान विश्वविद्यालय छात्र संघ चुनाव के दौरान प्रत्याशियों ने सड़क पर लेटकर पैर पकड़कर माँगे वोट. pic.twitter.com/rmvlgCFXgJ — UnSeen India (@USIndia_) August 26, 2022 -
ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
చెక్కు చెదరని వైఎస్సార్సీపీ ఓట్ షేర్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ మరోసారి భారీ మెజారిటీతో రికార్డు సృష్టించింది. వైఎస్సార్సీపీ ఓట్ షేర్ చెక్కు చెదరలేదు. మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు వైఎస్సార్సీపీ దక్కించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓట్ షేర్ 52.63 శాతం కాగా, టీడీపీ 30.73 శాతం, బీజేపీ 2.41 శాతం, జనసేన 4.67 శాతం, సీపీఐ 0.80 శాతం, సీపీఎం 0.81 శాతం, కాంగ్రెస్ 0.62 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే టీడీపీ ఓట్ షేర్ భారీగా తగ్గింది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలో.. మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ దేశంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. ‘ఫ్యాన్’ ప్రభంజనంతో 97.33 శాతం మున్సిపాలిటీలలో పాగా వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కీలక నిర్ణయాలకు ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్ష పెద్దలు ఎంతగా రెచ్చగొట్టినా, కుట్రలకు తెరలేపినా.. తమ తీర్పు ఇదేనని తేల్చి చెప్పారు. అటు న్యాయ రాజధాని.. ఇటు పరిపాలనా రాజధాని.. మధ్యలో శాసన రాజధానిలోనూ విస్పష్ట తీర్పునిచ్చారు. 2014లో అలా.. 2021లో ఇలా... 2014లో జరిగిన పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 939 వార్డుల్లో గెలిచింది. అప్పటి ఎన్నికల్లో 36.52 శాతం వార్డులను కైవసం చేసుకుంది. టీడీపీ 1,424 వార్డుల్లో గెలిచి 55.39 శాతం వార్డుల్లో విజయం సాధించింది. కాగా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఏకంగా 2,265 వార్డులను కైవసం చేసుకుంది. 81.07 శాతం వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ కేవలం 348 వార్డులకే పరిమితమైంది. ఆ పార్టీ కేవలం 12.70 శాతం వార్డులతో సరిపెట్టుకుంది. చదవండి: మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్ మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్ -
ఓటు వేయలేదని గునపాలతో దాడి చేశారు
-
ఓటు వేయలేదని గునపాలతో దాడి చేశారు
సాక్షి, శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం నేతలు రాష్ట్రవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్నారు. టీడీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జిల్లాలోని కింతలి పంచాయతీ ఖాజీపేటలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తమ మద్దతుదారులకు ఓట్లు వేయలేదని అక్కసుతో గత అర్ధరాత్రి యాదవ వీధిలో కర్రలు, గునపాలతో బీభత్సం సృష్టించారు. కొందరి ఇళ్లపై దాడులు చేసి కరెంటు మీటర్లు, ఇంటి తలుపులు, కిటికీలు, రెండు బైకులను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో నలుగురు గాయలపాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు తమ్మినేని చిరంజీవి నాగ్, పప్పల వెంకటరమణ శనివారం పరామర్శించారు. చదవండి: టీడీపీకి పరాభవం: నాటి పాపాలే.. నేటి శాపాలు! పేదల గూటికి టీడీపీ గండి! -
టీడీపీ కుటిల యత్నం!
పాలకొండ: ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నాయకులు కుఠిల రాజకీయాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి కనీస మద్దతుదారులు లేక అవస్థలు పడుతున్న టీడీపీ నాయకులు.. ఓట్లు తొలగింపును మాత్రం పక్కా ప్రణాళికతో చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకొండ మండలం లుంబూరు గ్రామంలో ఓటర్ల జాబితాను ఇష్టారాజ్యంగా మార్చిన సంఘటన గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు గుర్తించారు. ఏకంగా 29 మంది వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. ఓటర్లకు తెలియకుండా ఫారం–7లు అందించి ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారు. వీరంతా 2019 ఎన్నికల్లో ఓట్లు వేసిన వారే కావడంతో బాధితులంతా ఎంపీడీవో జె.ఆనందరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన డీఎల్పీవో కార్యాలయం నుంచి వచ్చిన జాబితానే అందించామని, ఫారం– 7 ఆధారంగానే డిలేషన్ జరిగిందని వివరించారు. అయితే ఆ ఫారం ఓటర్లు కాకుండా ఎవరు ఇచ్చారన్నది విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే..?
ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయమే శిరోధార్యం. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన ఎన్నికల్లో కూడా ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే అతనే గెలిచినట్టు. లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు ఆధిక్యతతో కూడా గెలిచిన వారున్నారు. అయితే, అభ్యర్థులిద్దరికి సమానంగా ఓట్లు వస్తే ఏం చెయ్యాలి. అలాంటి పరిస్థితుల్లో విజేతను నిర్ణయించటం ఎలా అన్న అనుమానాలు సహజమే. ఇలాంటి సమస్యలకు కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టం పరిష్కారం చూపించింది. ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే(బై) లాటరీ ద్వారా లేదా బొమ్మ బొరుసు పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించాలని ఈ చట్టంలోని 102వ అధికరణ స్పష్టం చేస్తోంది. ఆ పద్ధతిలో వచ్చిన ఫలితాన్ని అభ్యర్థులు ఇద్దరు తప్పనిసరిగా ఆమోదించాలి. లాటరీ తగిలిన అభ్యర్థికి అదనంగా ఒక ఓటు (లాటరీ) వచ్చినట్టు పరిగణించి అతనిని విజేతగా ప్రకటిస్తారు.గత ఏడాది అస్సాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆరు చోట్ల అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో బొమ్మ బొరుసు వేసి విజేతల్ని ప్రకటించారు. అలాగే, 2017, డిసెంబరులో మధుర బృందావన్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మీరా అగర్వాల్ ఇలా లాటరీలో గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులిద్దరికీ 874 ఓట్లు రావడంతో లాటరీ తీశారు. 2017, ఫిబ్రవరిలో బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి ఇలాగే లాటరీలో గెలిచి కార్పొరేటర్ అయ్యారు. ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే ఏం చెయ్యాలో ప్రజాప్రాతినిధ్య చట్టం చెప్పింది. మరి ముగ్గురికి సమానంగా ఓట్లు వస్తే ఏం చెయ్యాలో మాత్రం చట్టం చెప్పలేదు. ఇప్పటి వరకు అలాంటి స్థితి దేశంలో ఎప్పుడూ రాలేదు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై టీడీపీ కుట్రలు
అనంతపురం : టీడీపీ కన్ను ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై పడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లక్ష్యంగా టీడీపీ కుట్రలకు తెరలేపింది. కొందరు ప్రభుత్వ అధికారులు టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నట్లుగా తెలిసింది. ఓట్లు కొనేందుకు టీడీపీ నాయకులు లక్షల రూపాయలు వెదజల్లుతున్నారు. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న కొందరు ప్రభుత్వ అధికారులు టీడీపీ మద్ధతుదారులైన ఉద్యోగులకు రెండు ఓట్లు జారీ చేశారు. కదిరి, మడకశిర నియోజకవర్గాల్లో ఈ బాగోతం వెలుగుచూసింది. సుమారు 100 మంది ఉద్యోగులు కదిరిలో రెండుసార్లు ఓట్లు వేశారు. మడకశిరలో 50 మంది ఉద్యోగులకు డబుల్ పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు. ఈ విషయం గమనించిన వైఎస్సార్సీపీ నేతలు సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒక్కో ఉద్యోగికి రెండు ఓట్లు జారీ చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, ఆ ఓట్లు చెల్లకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. -
ముస్లింల ఓట్ల తొలగింపు
నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికారపార్టీ కుట్రలు చేస్తోంది. జిల్లాలో వైఎస్సార్సీపీకి ముస్లింలు అధిక శాతం మంది మద్దతుగా ఉన్నారు. ముస్లింల ఓట్లు తొలగించేలా అధికారపార్టీ కుతంత్రాలు చేసింది. నెల్లూరుసిటీ నియోజకవర్గానికి సంబంధించి వెంకటేశ్వరపురంలో 300 ముస్లిం ఓట్లు తొలగించారు. షేక్ ఖలీమ్ కుటుంబానికి సంబంధించి, ఆయన బంధువులు అందరివీ కలిపి సుమారు 50 ఓట్లు తొలగించారు. ఓటర్ కార్డు ఉండడంతో ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయని అనుకున్నారు. ఒకసారి చెక్ చేసుకుందామని జాబితాను పరిశీలించారు. వారి 50 ఓట్లు తొలగించారని గుర్తించారు. ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. ఆ ఇద్దరికి కూడా వెంకటేశ్వరపురంలో కాకుండా కొత్తూరులో ఓటు హక్కు కల్పించారు. ఇది అధికారులు, అధికారపార్టీ నాయకుల చేసిన కుట్రే. జిల్లా వ్యాప్తంగా ముస్లింల ఓట్లు తొలగించారు. ముస్లింలను గుర్తింపుకార్డులకు మాత్రమే పరి మితం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, అభిమానుల ఓట్లు వేల సంఖ్యలో తొలగించారు. కొత్తగా పెరిగిన ఓట్లు అధికారపార్టీకి అనుకూలంగా ఉండే వారివే అధికంగా ఉన్నాయని విమర్శలున్నాయి. జిల్లాలో 32.50 లక్షల మంది జనాభా ఉన్నారు. పెరిగిన ఓటర్లతో కలిíపి జిల్లాలో 23,92,210 మంది ఉన్నారు. జనాభా ప్రాతిపదికన పరిశీలించిన ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండాలి. జిల్లా వ్యాప్తంగా మరణించిన వారు ఓట్లు తొలగించకుండా బతికున్న వారి ఓట్లు తొలగించారు. అందని కార్డులు సార్వత్రిక ఎన్నికలు 2019కి సంబంధించి పోలింగ్ ప్రక్రియకు ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత వరకు పెరిగిన ఓటర్లకు గుర్తిపుకార్డులు అందలేదు. ప్రజలు మీ–సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మీ–సేవ కేంద్రాల్లో ఓటర్ కార్డులు డౌన్లోడ్ కావడంలేదు. రాత్రి 10 గంటల తరువాత ఉదయం 9 గంటల లోపు మాత్రమే సైట్ పని చేస్తోంది. పట్టించుకోని జిల్లా యంత్రాంగం ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేసి ప్రజలకు అందజేయాలన్నా మీ–సేవ నిర్వాహకులకు హోలో గ్రామ్స్ అందుబాటులో లేవు. హోలోగ్రామ్స్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద అందుబాటులో ఉన్న వాటిని మీ–సేవ కేంద్రాల నిర్వాహకులకు ఇవ్వడంలేదు. గుర్తింపు కార్డులు త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాల్సిన జిల్లా యంత్రాంగం పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మీ–సేవ ఏఓ పోస్టు ఖాళీగా ఉండడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు స్పందించి ప్రతి ఒక్కరికీ ఓటర్ గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఓట్లు ఎన్ని రకాలో మీకు తెలుసా!
సాక్షి, గూడూరు రూరల్ (నెల్లూరు): భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు మనకు గుర్తింపు మాత్రమే కాదు. మన తలరాతను మనమే రాసుకునే అవకాశం. ఓటు హక్కు వినియోగంతో బాధ్యత గల పౌరులమని నిరూపించుకోవడమే. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందే. 18 ఏళ్లు నిండిన తర్వాత తొలిసారి ఓటు వేసిన వారి ఆనందం వర్ణనాతీతం. అయితే అందరూ పోలింగ్ కేంద్రానికే వెళ్లి ఓటు వేయలేరు. ఎన్నికల విధుల్లో ఉన్న వారు, సైనికులు, గూఢచారులు వంటి వారు తమ ఓటు హక్కును ఇతర మార్గాల్లో వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అలాంటి ఓట్లు ఎన్నిరకాలు ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం. సాధారణ ఓటు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. దీనిని సాధారణ ఓటు అంటారు. ప్రాక్సీ ఓటు ప్రాక్సీ ఓటును గూఢచారి, ఇంటెలిజెన్స్ వారు వినియోగించుకోవడానికి వీలుంటుంది. ప్రాక్సీ ఓటు అంటే తమకు బదులు ఇంకొకరిని పంపి ఓటు వేయించడం. పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎన్నికల విధుల్లో భాగంగా ఉద్యోగులు, సిబ్బంది తాము ఉండే ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో వారు తమ స్వస్థలంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉండదు. ఇందుకు గాను పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. టెండర్ ఓటు ఎన్నికల రోజు వరకు ఓటరు జాబితాలో పేరు ఉండి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లే సరికి పేరు గల్లంతవ్వడం చూస్తూ ఉంటాం. తమ పేరున ఉన్న ఓటును వేరొకరు వేసి ఉంటే ఈ పరిస్థితుల్లో టెండర్ ఓటు వేసే అవకాశం ఇస్తారు. ఈ సమయంలో తాను అంతకు ముందు ఓటు వేయలేదని సదరు ఓటరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. సర్వీసు ఓటు దేశ రక్షణలో ఉన్న సైనికులు, పారామిలటరీ ఉద్యోగులు విధి నిర్వహణలో దూర ప్రాంతాల్లో ఉంటారు. దీంతో స్వగ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోలేరు. అందుకే సర్వీస్ ఓటును కల్పిస్తారు. ఎన్నారై ఓటు భారతీయ పౌరసత్వం ఉండి విద్యా, ఉద్యోగం, వ్యాపారాల కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడే ఉంటున్న వారికి ఎన్నికల సంఘం ఫారం–6ఏ ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ఇందుకు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, వీసా నకళ్లు, పాస్‌పోర్టు తదితర వాటిని సమర్పించాల్సి ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్ 1950 ఓటరు జాబితాలో ఏమైనా సందేహాలుంటే ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల రాజధానుల్లో స్టేట్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. -
ఆ గ్రామం ఏమైంది..?
సాక్షి, శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైకుంఠపురం సమీపంలో ఉన్న కొండప్రాంతంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 10గిరిజన కుటుంబాలను వైకుంఠపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం జన్మభూమి కమిటీ సభ్యుడు సంపతిరావు చినబాబు తన స్వార్థ రాజకీయాల కోసం, వారి వ్యవసాయ పనుల కోసం ఉపయోగ పడతారని ఇక్కడికి తీసుకువచ్చారు. వారంతా 2015వ సంవత్సరంలో కొరగాం పంచాయతీ పరిధిలో ఉన్న కొండల్లో పూరిపాకలు నిర్మించుకుని నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారు వచ్చిన అర్ధసంవత్సర కాలంలోనే వారి కోసం అధికారులు లక్షల రూపాయలు వెచ్చించి ఒక మంచినీటి బావి, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా అందజేశారు. వారిలో 29మందికి ఓటు హక్కు కల్పించి రేషన్ కార్డులు మంజూరు చేశారు. వారి పిల్లలను వైకుంఠపురం పాఠశాలలో చేర్పించారు. ఆ గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. అయితే వారంతా ఆ గ్రామంలో రెండు సంవత్సరాలు ఉన్నారు. వారికి ఏం కష్టమొచ్చిందో ఏమో? గానీ గత ఏడాది మే నెలలో రాత్రికి రాత్రే బస ఎత్తేశారు. దీంతో లక్షల రూపాయలు ప్రజాథనం వృథా అయింది. గ్రామానికి గ్రామం లేక పోయినా అధికారులు మాత్రం అక్కడి వారి ఓట్లను తొలగించలేదు. గ్రామాల్లో నివాసం ఉన్నవారి ఓట్లు మాత్రం ఇష్టానుసారం తొలగిస్తున్నారు. ఆనందపురంలో ప్రజలు లేకపోయినా ఇప్పటికీ విద్యుత్ సరఫరా అవుతోందంటే ఆ గ్రామస్తుల కోసం కాదని, రాజకీయ నాయకుడి కోసమేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ గిరిజన ఓటర్లంతా ఒడిశా రాష్ట్రంలోని వారి సొంత ప్రాంతానికి చేరుకుని ఉంటారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం..!
సాక్షి, హైదరాబాద్: ‘నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. అన్న డైలాగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఫేమస్. తెలుగు ప్రజలు మాత్రం ఓటు నమోదు విషయంలో ఈ డైలాగ్‌ను ఎప్పుడో ఫాలో అయ్యారు. ఏపీ, తెలంగాణలో ఓటు నమోదు చేసుకున్నారు. అక్కడా ఓటేస్తారు. ఇక్కడా ఓటేస్తారు. రెండు చోట్లా ఎన్నికల్లో పాల్గొని తమ సత్తా చాటుతారు. అయితే, ఇది స్వల్ప మొత్తంలో ఉంటే ఫరవాలేదు. కానీ, పార్టీల భవితవ్యాన్ని, ప్రభుత్వాల్ని మార్చగలిగే స్థాయిలో అంటే.. అక్షరాలా లక్షల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2014 రాష్ట్ర విభజన వరకు ఈ ఓటర్లు రెండు రాష్ట్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లక్షల సంఖ్యలో డూప్లికేట్ ఓటర్లు.. ఉమ్మడి రాష్ట్రంలో 292 అసెంబ్లీ స్థానాలు, 42 పార్లమెంటు స్థానాలు ఉండేవి. ఈ స్థానాలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపడం కష్టతరం కావడంతో ఏపీలో ఒక దశలో, తెలంగాణలో మరో దశలో నిర్వహించేవారు. ఆ సమయంలో చాలామంది తెలంగాణ, ఏపీల్లో ఓటు నమోదు చేయించుకున్నారు. (2018 నవంబర్ వరకు రెండుచోట్లా ఓట్లు నమోదు చేయించుకుని ఉన్నవారి సంఖ్య 20 లక్షలుగా ఉంది.) వీరు తెలంగాణలో ఒకసారి, ఏపీలో మరోసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు. రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణలో ఏప్రిల్ 30న, ఏపీలో మే 7న ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనూ వీరిలో చాలామంది ఇక్కడా, అక్కడా ఓట్లేశారు. అవి బోగస్ ఓట్లు కావు.. ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, ఏకంగా 52 లక్షల బోగస్ ఓట్లు నమోదయ్యా యని ఆరోపిస్తూ గతేడాది హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. దీనికి అప్పటి ఏపీ ఎన్నికల ప్రధా నాధికారి స్పందించారు కూడా. తమకు ఈ విష యంపై ఫిర్యాదు అందిందని, అయితే వీటిలో అన్నీ బోగస్ ఓట్లు కావని తెలిపారు. ఇందులో ఒకే పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు, వయసు తదితర వివరాలను పోల్చి చూసినపుడు ఏపీ, తెలంగాణలో ఇలాంటి వారు 18.2 లక్షల మం దికిపైగా ఉన్నారని తెలిపారు. దీంతో వీరంతా అక్కడా, ఇక్కడా ఓటుహక్కు కలిగి ఉన్నారన్న విషయం తేటతెల్లమైంది. ఒకేదశలో రావడంతో.. చాలా ఏళ్లుగా తెలంగాణలో, ఏపీలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సి రావడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి మాత్రం ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు మొదటిదశలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంటే, రెండు రాష్ట్రాల్లోనూ ఒకేరోజు పోలింగ్ ఉంటుంది. దీంతో ఈ ఓటర్లు ఏదో ఒక ప్రాంతంలోనే ఓటు వేయగలరు. వీరిలో అధికశాతం హైదరాబాద్ నగరంలోనే ఓటు హక్కు కలిగి ఉండటంతో.. అదే రోజు ఏపీకి వెళ్లి ఓటు వేయడం దాదాపుగా అసాధ్యంగా భావిస్తున్నారు. -
సగంలో సగమే!
మహిళలు మగవారికి దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విద్య, ఉద్యోగాలతో పాటు వ్యాపారాల్లోనూ దూసుకుపోతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవడంలో మాత్రం వెనుకబడ్డారు. సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఉత్సాహం చూపిన మహిళలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఓటరుగా నమోదు చేయించుకోవడంపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. సాక్షి, కామారెడ్డి: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 22న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓటరు జాబితాలో పురుషుల కన్నా మహిళల ఓట్లు చాలా తక్కువ గా ఉన్నాయి. ఇటీవల జరిగిన అ సెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల కోసం తయారు చేసిన జాబితాల్లోనూ వారి ఓట్లే ఎక్కువ.. మహిళలు ఓ రకంగా అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో మాత్రం మహిళల ఓట్లు పురుషుల సంఖ్యలో సగం కూడా లేకపోవడం గమనార్హం. కరీంనగర్– ఆదిలాబాద్– మెదక్– నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 35,764 మంది ఉన్నారు. ఇందులో పురుషుల ఓట్లు 24,076 ఉండగా.. మహిళలవి 11,681 మాత్రమే ఉన్నా యి. పురుషులకన్నా 12,395 ఓట్లు తక్కువగా ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లా జనాభాలో మహిళలు పురుషులకన్నా ఎక్కు వ మందే ఉన్నారు. అలాగే సాధారణ ఓటరు జాబితాలో కూడా వారి సంఖ్యే ఎక్కువ.. కానీ పట్టభద్రుల విషయానికి వచ్చే సరికి మహిళలు మగవారిలో సగం కూడా ఓటర్లుగా నమోదు కాలేదు. కామారెడ్డి జిల్లాలో మరీ తక్కువగా ఉన్నారు. ఇక్కడ 7,324 మంది పురుషులకు ఓటు హక్కు ఉంటే.. 2,928 మంది మహిళలకే ఓటు హక్కు ఉంది. పురుష ఓటర్లలో మూడోవంతు కూడా మహిళా ఓటర్లు లేకపోవడం గమనార్హం. కారణం ఏమై ఉంటుంది? మహిళలు అన్నింటా దూసుకుపోతున్న నేటి రోజుల్లో పట్టభద్రుల ఓటర్ల జాబితాలో వారి సంఖ్య తగ్గడానికి కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది మహిళలు ఉన్నత విద్యాభ్యాసం చేసినవారున్నారు. అలాగే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారూ ఉన్నారు. అయినా వారు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఓటరు నమోదుకు మహిళలు ఆసక్తి కనబర్చలేకపోవడం, వారిని ప్రోత్సహించకపోవడం మూలంగానే ఎక్కువమంది ఓటర్లుగా నమోదు కాలేదన్న విషయం స్పష్టమవుతోంది. మహిళా పట్టభద్రుల విషయంలో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో వారు ఓటరు నమోదుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఉమ్మడిజిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు.. జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం కామారెడ్డి 7,324 2,928 01 10,253 నిజామాబాద్ 16,752 8,753 06 25,511 మొత్తం 24,076 11,681 07 35,764 -
ఓటుకు పోటు!
కర్నూలు, ఆదోని: ఓట్లు తొలగించాలని కోరుతూ ఆదోని నియోజకవర్గంలో మరో వెయ్యి దరఖాస్తులు ఆన్లైన్లో దాఖలయ్యాయి. దీంతో ఓట్ల తొలగింపు కోసం దాఖలైన దరఖాస్తుల సంఖ్య 7వేలు దాటింది. గంపగుత్తగా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా వచ్చి పడుతుండడంతో రెవెన్యూ అధికారుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో తహసీల్దార్ విశ్వనాథ్ ఆదివారం.. టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు దరఖాస్తులను ఆన్లైన్లో ఎవరు ఎక్కడి నుంచి దాఖలు చేశారో విచారించి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఐపీసీ 182, 419 అండ్ 66డి ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మీసేవా కేంద్రాలు, సెల్‌ఫోన్ సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు ఫాం–7కింద ఓటరు తొలగింపుకు దరఖాస్తులు ఆన్లైన్ చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అక్రమాలకు ఆస్కారం ఇస్తే చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందని తహసీల్దార్ హెచ్చరించారు. టీడీపీ వారి పనే... తెలుగుదేశం నాయకులే ఓట్ల తొలగింపు కుట్రకు తెరతీసినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే తహసీల్దార్ విశ్వనాథ్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఫొటోలు, పేర్లు వినియోగంచుకొని తమ పార్టీ మద్దతు దారుల ఓట్లను తొలగించి రాజకీయ లబ్ధి పొందేందుకే టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు శేషిరెడ్డి, బీమా, నర్సప్ప, చిన్న స్వామి గౌడ్ మరికొంత మంది ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా..ఎన్నికల నాటికి తమ ఓట్లు ఉంటాయో, ఉండవో తెలియని అయోమయ పరిస్థితుల్లో నిర్ధారించుకోవడానికి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఓటర్లు తిరుగుతున్నారు. తొలగింపునకు తమపేరుపై దరఖాస్తు దాఖలు కావడం చూసి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఫ్యాన్సీ.. సీరియల్.. సేమ్!
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో అనేక చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఫ్యాన్సీ నెంబర్లతో కూడిన ఓట్లు వచ్చాయి. మరికొందరికి ఆరోహణ, అవరోహణ క్రమాల్లో సీరియల్‌గా వచ్చినట్లు తేలింది. ఒకే సంఖ్యలో ఓట్లు వచ్చిన అభ్యర్థులు సైతం ఉన్నారు. ఈ మూడు కేటగిరీలకు చెందిన వారిలో అత్యధికులు చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లే ఉన్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా ఇలా.. ఖైరతాబాద్: బీజేపీ తరఫున పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు వచ్చాయి. జాతీయ మహిళా పార్టీ అభ్యర్థిని దాన లక్ష్మికి 99 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి కె.నవీన్‌కుమార్‌కు 77 ఓట్లు, న్యూ ఇండియా పార్టీకి చెందిన అమృత్‌రాజ్‌కు 66 ఓట్లు వచ్చాయి. కార్వాన్: బీఎస్పీ అభ్యర్థి సయ్యద్ రహిముద్దీన్కు 363, తెలంగాణ ఇంటి పార్టీకి చెందిన నర్సింగ్‌రావుకు 200 ఓట్లు వచ్చాయి. అలానే సోషలిస్ట్ పార్టీకి చెందిన సార్వత్కు 155, లోక్ తాంత్రిక్ సర్వజన్ సమాజ్ పార్టీకి చెందిన ఖతీజాకు 154 చొప్పున పోలయ్యాయి. ఎల్బీనగర్: ఇండిపెండెంట్లు జగన్మోహన్ పోలే, అనుగు సాయికృష్ణలకు 74, 73 చొప్పున, రాంబాబురెడ్డి, ప్రవీణ్గౌడ్లకు 61, 60 చొప్పున, దేవ, శ్రీనివాసాచారిలకు 59 చొప్పున ఓట్లు వచ్చాయి. మలక్‌పేట: అన్నా వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసిన సయ్యద్ అన్వర్, బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థి వెంకట రమణలకు 118, 117 ఓట్లు, ఆప్ అభ్యర్థి చిన్న లింగానికి 100, ఇండిపెండెంట్లు గోపాల్, రమేష్‌లకు 80 చొప్పున ఓట్లు వచ్చాయి. మేడ్చల్: స్వర్ణ్ భారత్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు రాహుల్ పండిట్, దుర్గా ప్రసాద్‌లకు 140 చొప్పున, ఇండిపెండెంట్లు వేద్, నారాయణలకు 137, 136 ఓట్లు, దీపక్, కాంతారెడ్డిలకు 134, 133 చొప్పున, సతీష్‌కుమార్‌కు 100 ఓట్లు నమోదయ్యాయి. ముషీరాబాద్: యువ పార్టీ, ఇండియా ప్రజా బంధు పార్టీలకు చెందిన చందు, రాజ్‌కుమార్‌లకు 147, 146, అన్నా వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఫాతిమా భానుకు 100, న్యూ ఇండియా పార్టీకి చెందిన మహబూబ్ అలీకి 77, బహుజన రాష్ట్ర సమితి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్, నాగేందర్‌లకు 76 ఓట్లు చొప్పున వచ్చాయి. ఇండిపెండెంట్ సోమయాజులు, జన వాహిని పార్టీ అభ్యర్థి నవాబ్‌లకు 53 ఓట్ల చొప్పున వచ్చాయి. నాంపల్లి: బీజేపీ అభ్యర్థి డి.కరుణాకర్‌కు 11,622 ఓట్లు పడ్డాయి. సీపీఐఎం అభ్యర్థి లక్ష్మీకుమార్‌కు 400, ఇండిపెండెంట్ అజీమ్‌కు 88, స్వతంత్ర అభ్యర్థులు సంతోష్, యూసుఫ్‌లకు 82 చొప్పున ఓట్లు నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్: టీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద్‌కు 1,54,500 ఓట్లు, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీశైలం గౌడ్‌కు 1,13000 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్లు బిక్షపతికి 727, భూపాల్, రాములుకు 338, 337 చొప్పున, మరో స్వతంత్ర అభ్యర్థి రాఘవకు 101 ఓట్లు లెక్క తేలాయి. సనత్‌నగర్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు 66464 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ దేవేందర్‌కు 200, బహుజన రాష్ట్ర సమితి అభ్యర్థి అశోక్ కుమార్‌కు 66 ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్: సీపీఐఎం అభ్యర్థి అనిల్‌కుమార్‌కు 555, ఇండిపెండెంట్ రజనికి 444, మోహన్‌కు 232, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ఆర్కు 88 చొప్పున ఓట్లు నమోదయ్యాయి. కంటోన్మెంట్: స్వతంత్ర అభ్యర్థి బి.రాజుకు 88 ఓట్లు పడ్డాయి. శేరిలింగంపల్లి: శివసేన, అన్నా వైఎస్సార్ సీపీల తరఫున పోటీ చేసిన కేశవులు ఖాలీద్లకు 212 చొప్పున, దళిత్ బహుజన్ పార్టీ అభ్యర్థి కల్పన, ఇండిపెండెంట్ శివప్రసాద్‌లకు 211 చొప్పున, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజుకు 151 ఓట్లు వచ్చాయి. ఉప్పల్: బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వై.పరమేశ్వర్‌కు 1211, ది ఫ్యూచర్ ఇండియా పార్టీ అభ్యర్థి అనిల్‌కు 343 వచ్చాయి. ఆలిండియా సమత పార్టీకి చెందిన ప్రకాష్, ఇండిపెండెంట్ మహేందర్ కుమార్‌లకు 114 చొప్పున, న్యూ ఇండియా పార్టీ, జై మహాభారత్ పార్టీల అభ్యర్థులు బాలరాజు, యుగంధర్లకు 106 చొప్పున ఓట్లు పడ్డాయి. యాకుత్‌పురా: ఎంబీటీ అభ్యర్థి ఫర్హత్ ఖాన్‌కు 21222 ఓట్లు, శివసేన అభ్యర్థి మహేష్‌కుమార్‌కు 323 ఓట్లు, ఎంసీపీఐ అభ్యర్థి హాజీ పాషాకు 131, తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి ఉస్మాన్‌కు 121, ఇండిపెండెంట్ సుదర్శన్‌కు 99 నమోదయ్యాయి. గోషామహల్: అఖిల భారతీయ ముస్లిం లీగ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు ఖాజా ఖాన్, రాజులకు 103, 102 చొప్పున, అంబేడ్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి అభిమన్యు యాదవ్‌కు 99, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి రియాజుద్దీన్‌కు 88 ఓట్లు నమోదయ్యాయి. -
ఓట్లు వేయలేదని వీధిలైట్లు కట్!
పాన్‌గల్: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గ్రామస్తులు ఓట్లు వేయలేదన్న అక్కసుతో గ్రామంలోని వీధి లైట్ల కనెక్షన్లను తొలగించారు. ఈ ఘటన ఆదివారం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కేతేపల్లిలో కలకలం రేపింది. ఎన్నికల్లో టీఆర్ఎస్కు గ్రామస్తులు ఓట్లు వేయలేదనే అక్కసుతో వీధి లైట్లకు విద్యుత్ కనెక్షన్లను మాజీ సర్పంచ్ రేవతి భర్త రాజు గౌడ్ తొలగించారు. కొన్ని కాలనీల్లో కుళాయి కనెక్షన్లను సైతం తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ నేతల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాన్‌గల్ ఎస్సై తిరు పాజీ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిపై ఆరాతీశారు. వీధి దీపాలకు తొలగించిన కనెక్షన్లను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. సంబంధి త వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ విషయాలను గ్రామస్తులు కలెక్టర్‌తో పాటు మండల అధికారులు, గ్రామ ప్రత్యేకాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రాజుగౌడ్‌ను వివరణ కోరగా.. తమ పదవీ కాలంలో ఏర్పాటు చేసిన వీధి లైట్లకు బిల్లులు చెల్లించకపోవడంతోనే కనెక్షన్ తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. -
భారీగా ‘ఓట్ల’ గల్లంతు
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుండారం, కల్లెపెల్లి గ్రామాల్లో సుమారు 350 మంది ఓట్లు గల్లంతయ్యాయి. శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు తమ ఓటు లేదని తెలియడంతో ఆవేదనకు గురయ్యారు. తాము పలు ఎన్నికల్లో ఓటు వేయగా ఇప్పుడు ఎలా గల్లంతవుతాయని అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. వికలాంగ వృద్ధుద్దురాలు జత్నం రత్తవ్వ గుండారంలో ఓటు వేసేందుకు రాగా అక్కడ అధికారులు ఇచ్చిన ఓటరు స్లిప్‌లో పేరు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రంలో లేకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగింది. గుండారం, దాని శివారులోని కొత్తగా ఏర్పడ్డ పెరుకబండలోనే సుమారు 250 వరకు ఓట్లు గల్లంతు కాగా.. మరణించిన పలువురి ఓట్లు కొత్త జాబితాలో ఉండటంతో ప్రజలు మండిపడుతున్నారు. కల్లెపెల్లిలో సుమారు 70 ఓట్లు గల్లంతయిన ట్లు తెలిపారు. ఖాజీపూర్‌లో 40 ఓట్లు గల్లంతు మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని ఖాజీపూర్‌లో సుమారు 40 మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఓటర్ల పేర్లు రికార్డుల్లో లేకపోవడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి బంధువులు అంగన్వాడీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యం కారణంగానే పేర్లు గల్లంతైనట్లు ఆరోపించారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇటిక్యాలలో 200 ఓట్లు..జగదేవ్‌పూర్(గజ్వేల్): గ్రామంలో 1709 ఓట్లు ఉండగా.. అందులో సుమారు 200 ఓట్లు గల్లంతయినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది తమ ఆధార్ కార్డులను, ఎన్నికల గుర్తింపు కార్డులను తీసుకెళ్లినా ఓటర్ లిస్టులో పేరు లేదనే కారణంతో ఓటు వేసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు ఎన్నికల కేంద్రం నుంచి ఇంటికి వెనుదిరిగారు. పీర్లపల్లిలో ఎంపీపీ రేణుక ఓటు హక్కును, నర్సన్నపేటలో జెడ్పీటీసీ రాంచం ద్రం ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుబ్బాకలో...దుబ్బాకటౌన్: దుబ్బాక నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా చాలామంది ప్రజల ఓట్లు గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డులున్నా చాలామంది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో పరేషాన్ అయ్యారు. దుబ్బాక పట్టణంలోనే సుమారుగా నాలుగైదు వందల మందికి పైగా ఓట్లు గల్లంతయ్యాయి. దుబ్బాక పట్టణంలోని 38వ పోలింగ్ కేంద్రం వద్ద పట్టణంకు చెందిన అంకం రాజేశ్వర్, అంకం సత్తవ్వ, రేపాక సువర్ణ, రమ్యలకు చెందిన ఓట్లు గల్లంతు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓటు హక్కే కాదు బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాస్వామ్యం దేవాలయం వంటిది. ఎవరో చెప్పారని, ఎవరు బలవంత పెట్టారనో, తాయిలాలు ఇచ్చారనో కాకుండా, అంతరాత్మ ప్రబోధంతో గుడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చినంత పవి త్రంగా ప్రతి ఒక్క పౌరుడూ పోలింగ్ కేంద్రానికి బాధ్యతతో వెళ్ళి ఓటు వేసి రావాలి’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లను చైతన్యపరచడానికి విస్తృతంగా కృషి చేసినందు వల్ల గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటును కేవలం హక్కుగానే కాకుండా ఓటర్లు బాధ్యతను గుర్తించి ఓటేయాలని కోరారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి నేడు సెలవు కూడా ప్రకటించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు తెలంగాణ శాసనసభ పరిధిలోని 119 నియోజకవర్గాలకు శుక్రవారం ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతం గా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లతో సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు సీఈ ఓ ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లపై గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం 5 వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి వారికి రాత్రి 7 వరకు ఓటేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నామన్నారు. ఈవీఎంల వినియోగం పట్ల అపోహలను తొలగించడానికి, అవగాహన కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా నమూనా పోలింగ్ నిర్వహించామని, ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నా రు. ఇప్పుడు మొత్తం 44,415 బ్యాలెట్ యూనిట్లను (7,557 అదనంగా), 32,016 కంట్రోల్ యూనిట్లను (4,432 అదనంగా), 32,016 వీవీప్యాట్ల (5,261, అదనంగా)ను ఓటర్లు ఉపయోగించుకోబోతున్నారని చెప్పారు. సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు 240 మంది బీఈఎల్/ఈసీఐఎల్ ఇంజనీర్లను అన్నిచోట్ల అందుబాటులో ఉంచామని తెలిపారు. అరగంటలో కొత్త ఈవీఎంల ఏర్పాటు ఈవీఎంలతో అత్యాధునిక సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నామని రజత్‌కుమార్ చెప్పారు. ఈవీఎంలతో ఎక్కడా ఎలాంటి సమస్యలు రావని, పోలింగ్ ప్రక్రియ ఎక్కడా ఆగదని వెల్లడించారు. ప్రతి సెక్టార్ మేజిస్ట్రేట్ వద్ద 2 ఈవీఎంలు, వీవీప్యాట్లు అదనంగా అందుబాటులో ఉంటాయని, ఎక్కడైనా ఈవీ ఎంలు మొరాయిస్తే కేవలం 30 నిమిషాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా ఇప్పటివరకు రూ.135 కోట్లు సీజ్ చేశామని, ఇప్పటివరకు ఇదే రికార్డు అని చెప్పారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అరెస్టు ఘటనపై వచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన జరుపుతోందన్నారు. డిసెంబర్ 26 నుంచి పార్లమెంటు ఎన్నికల కోసం ఓటర్ల జాబితా రూపకల్పన ప్రారంభిస్తామని, ఓటు లేని వాళ్ళు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తుది జాబితాలో కొన్ని తప్పులున్నాయని ఫిర్యాదులున్న నేపథ్యంలో మళ్ళీ పరిశీలన చేసి సరిదిద్దుతామని చెప్పారు. -
ఇక భారమంతా బూత్ కమిటీలదే!
సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ పోలింగ్‌పై దృష్టి పెట్టాయి. బూత్ స్థాయిలో ఓటర్లను సమీకరించి, ఓట్లు తమకు అనుకూలంగా పడే అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు వీలుగా బూత్ కమిటీలను అప్రమత్తం చేస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా.. ప్రతి ఇంటికీ ఓటరు స్లిప్పులు పంచడం, వారి నుంచి ఓటు హామీ పొందడం, తటస్థులను మచ్చిక చేసుకోవడం లక్ష్యంగా బూత్ కమిటీలను పార్టీలు సిద్ధం చేశాయి. ఓటింగ్ శాతం పెంచడం, వృద్ధ, దివ్యాంగ ఓటర్లను బూత్‌లకు తీసుకొచ్చే భారాన్ని పార్టీలన్నీ బూత్‌కమిటీలపై పెట్టాయి. పోలింగ్ రోజు, అంతకుముందు రోజు ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు వీరే కీలకం కావడంతో బూత్ కమిటీల ఇన్చార్జిలను పార్టీలు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కో బూత్ పరిధిలో 10 మంది ముఖ్య పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించడంతో పాటు ఓటర్లతో సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. కేటాయించిన బూత్‌ల పరిధిలో ఉన్న ఓటర్లను కలుస్తూ తమ పార్టీకే ఓటు వేయించే బాధ్యతను పూర్తిగా బూత్ కమిటీలకే అప్పగించారు. ఇదే బాటలో అన్ని పార్టీలు.. ప్రతి 10 నుంచి 20 మంది ఓటర్లకు ఒక బూత్‌స్థాయి నేత, ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జి, బూత్కమిటీలను సమన్వయపరిచేందుకు 5 గ్రామాలకు ఒక పార్టీ నేతను కో–ఆర్డినేటర్‌గా నియమించారు. ఈ గ్రామాల ఇన్చార్జీలను సమన్వయం చేసేందుకు మండల స్థాయిలో ఒక నాయకుడు, మండల స్థాయిలో నాయకులను సమన్వయ పరిచేందుకు నియోజకవర్గ స్థాయిలో పార్టీ సీనియర్ నేతలను నియమించారు. దాదాపు అన్ని పార్టీలు ఇంచుమించు ఇదే తరహాలో కమిటీలు నియమించుకున్నాయి. కులాలు, మహిళా సంఘాలను ప్రభావితం చేసేపనిని కూడా కొంతమంది నేతలకు అప్పగించారు. ఇప్పటికే ఆయా సంఘాలతో మాట్లాడుతున్న నేతలు, పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోరు హోరాహోరీగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓటర్లను వ్యక్తిగతంగా ప్రభావితం చేసే అంశాలపై బూత్‌కమిటీలు ప్రత్యేక దృష్టిపెట్టాయి. కొత్త ఓటర్లతో చర్చించి పార్టీలకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తమ పార్టీకి తప్పకుండా పడతాయని భావించిన ఓట్లను వేయించడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ, వృద్ధ, దివ్యాంగ ఓటర్లపై కమిటీలు దృష్టి పెడుతున్నాయి. ఈ బూత్‌కమిటీ నేతలకు పార్టీల అభ్యర్థులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ ఓట్లు పడే మార్గాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. -
చిన్న మార్జిన్లు.. పెద్ద తేడా!
సాధారణ ఎన్నికల్లో బహుముఖ పోటీలు, నువ్వా-నేనా అన్నట్టుండే ముఖాముఖి పోటీలు పెరిగినపుడు సహజంగానే గెలుపోటముల మధ్య వ్యత్యాసం తగ్గిపోతుంది. స్వల్ప ఓట్ల తేడాతోనే ఫలితాలు అంతిమ విజేతల్ని నిర్ణయిస్తాయి. ఉత్కంఠ పోరులో ఆ స్వల్ప పెచ్చు ఎవరికి రానుందో ఓట్ల లెక్కింపు ముగిసే వరకూ తెలియదు. అప్పటిదాకా తమదే గెలుపనే ధీమాతో ఉండే అత్యధికుల ఆశలు గల్లంతవుతాయి. ఇప్పుడు తెలంగాణలో మూడో వంతు నుంచి సగం వరకు నియోజకవర్గాల్లో అటువంటి పరిస్థితులున్నాయి. మిగతా పోటీ దారుల్ని వెనక్కి నెట్టి ప్రధాన పక్షాల అభ్యర్థులు నువ్వా నేనా అన్నంత తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న నియోజకవర్గాల సంఖ్య పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పెరుగుతోంది. ఇవి కాక, ప్రధాన పక్షాలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అభ్యర్థులు కాకుండా బీజేపీ, బీఎస్పీ, బీఎల్ఎఫ్ (కూటమి)ల అభ్యర్థులు బరిలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలున్నాయి. ప్రధాన పక్షాల నుంచి బరిలో బలమైన తిరుగుబాటు అభ్యర్థులు దూసుకొస్తున్న చోట కూడా త్రిముఖ పోటీ రోజురోజుకీ బలపడుతోంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే సామాజిక అవగాహన, రాజకీయ పరిణతి, మీడియా చేతన అధికంగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు తేలే నియోజకవర్గాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఈ పరిస్థితి రాజకీయ పరిశీలకుల అంచనాల్ని కూడా గల్లంతు చేస్తోంది. ఫలితాల తర్వాత అధికారం మాదంటే మాదని ప్రధానపక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ బల్లగుద్ది చెబుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ స్వల్ప ఓట్ల వ్యత్యాసపు గెలుపోటములు ఎవరి కొంపముంచుతాయన్నది ఉత్కంఠ రేపుతోంది. జనం ముందు సిద్ధాంత రాద్ధాంతాలు నిలువవు పలు సమకాలీన అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రాజకీయ పరిశీలకులు, ఎన్నికల విశ్లేషకులు, సెఫాలజిస్టులు రకరకాల అంచనాలు చెబుతారు. కానీ, అత్యధిక సందర్భాల్లో ప్రజా తీర్పు విస్మయం కలిగిస్తుంది. అంచనాల్ని గల్లంతు చేస్తుంది. ఫలితం హంగ్ అనో, గెలుపెవరిదైనా కావచ్చనో అంచనాలు సాగే సందర్భాల్లోనూ... ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన దాఖలాలే ఎక్కువ. పార్టీల ప్రచారపు ఎత్తుగడలు, వ్యూహాలతో నిమిత్తం లేకుండా, ఆసిఫాబాద్ నుంచి భద్రాచలం వరకు ఓటర్లు ఒకరికొకరు మాట్లాడుకొని ఓట్లేసినట్టే ఉంటుంది. మనకు తెలియని ‘న్యూరో నెట్వర్క్’ ఏదో అంతర్లీనంగా పనిచేసిందన్నట్టు ఏకరీతి ఫలితాల్ని ప్రజలు శాసిస్తారు. ఒక శాస్త్రీయ అధ్యయనం, పరిశీలన ద్వారా క్షేత్రంలో ఉన్న పరిస్థితిని ముందుగా ప్రతిబింబించేవే ‘సర్వే’లని మనబోటి సామాన్యులనుకుంటారు. కానీ, సర్వేల పేరిట పలికే గణాంకాలతో, ఆయా పార్టీలకిచ్చే హెచ్చు-తగ్గులతో రాబోయే ప్రజాతీర్పునే ప్రభావితం చేయాలని కొందరు ‘మేధావులు’ యోచిస్తుంటారు. రాజకీయ పక్షాలకు కొమ్ముకాసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఇటువంటి మేధావిత్వాన్ని తరచూ ప్రదర్శిస్తాయి. అందువల్లే, కాలక్రమంలో సర్వేలంటేనే విశ్వసనీయత లేకుండా పోతోంది. గణాంకాలు కొన్ని సార్లు విచిత్రంగానూ ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న తెలంగాణ (ఆపద్ధర్మ) ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖరరావును ఇంటర్వ్యూ చేస్తూ సీనియర్ జర్నలిస్టు, ఎన్నికల విశ్లేషకుడు ప్రణయ్‌రాయ్ (ఎన్డీటీవీ) ఒక ప్రశ్న అడిగారు. ‘కిందటిసారి ఎన్నికల్లో మీ ఓట్ల శాతం 33 మాత్రమే, ఈ సారి కాంగ్రెస్-తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి, దీన్ని ఎలా అధిగమిస్తారు?’ అన్నదా ప్రశ్న. దీనికి సంబంధం లేకుండా ఆయనేదో సమాధానం చెప్పారు, అసలు చంద్రబాబునాయుడికి ఇక్కడి రాజకీయాల్లో జొరబడే నైతిక హక్కే లేదని కొట్టివేశారు. ఇక్కడి ప్రాజెక్టుల్ని, ప్రగతిని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నాడన్నారు. అదొకరకంగా ప్రణయ్ ప్రశ్నకు సమాధానమే కావచ్చు! ఇద్దరు కలిస్తే పెరుగుతాయనే ఎందుకనుకుంటున్నారు? తగ్గొచ్చు, అన్నది కేసీఆర్ కవి హృదయమేమో తెలియదు! ఎలా అంటే, 2 కు 2 కలిపితే 4 అయేది గణితంలోనే! రాజకీయాల్లో అది 4 అవొచ్చు, ఆరో, ఎనిమిదో కావచ్చు. అవేవీ కాకుండా సున్నా కూడా కావచ్చు. ఓట్ల శాతాల్లోని వ్యత్యాసాలకు పొందే సీట్ల హెచ్చుతగ్గులకు పొంతనలేని సందర్భాలెన్నో! ప్రజలు గమనిస్తున్నారని గ్రహించాలి రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి, తమను మెరుగుపరచుకునే ఎత్తులు, జిత్తులు ఎన్ని చేసినా ప్రజలు గమనిస్తున్నారనేది తప్పక గ్రహించాలి. ప్రజల్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రాజకీయ వ్యూహాలు రచించి, ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వెచ్చించి, విచ్చలవిడిగా వెదజల్లినంత మాత్రాన ఫలితాలు తమకే అనుకూలిస్తాయనుకోవడం భ్రమ. స్థూలంగా కూటమి నుంచి, ప్రత్యేకంగా ‘తెలంగాణ జన సమితి’ నుంచి బయటకు వెళ్తూ యువ న్యాయవాది, హక్కుల కార్యకర్త రచనారెడ్డి ఒక మాటన్నారు. ‘‘కూటమిలో మీరు మీ స్వార్థం, తగాదాలతో... ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఎంపిక చేసుకునేందుకు ‘ప్రత్యామ్నాయం’ అవకాశాన్నే లేకుండా చేసి తెలంగాణ సమాజాన్ని వంచించారు, ప్రజల్ని మోసపుచ్చారు’’ అన్నది ఆలోచించదగ్గ వ్యాఖ్యే! గత ఎన్నికలన్నీ గుణపాఠాలే! ఒకే ప్రత్యర్థి పార్టీల మధ్య కిందటి సారి ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసాలకు, తర్వాత మారిన మొగ్గుకు, తాజా పరిస్థితికి ఉండే లంకెని రాజకీయ వ్యూహకర్తలు పరిశీలించాలి. గత గణాంకాలను బట్టి ఇప్పుడేం పనిచేస్తుందో యోచించి అన్వయించాలి. కిందటి ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయగానే, అప్పట్లో వారికి లభించిన ఓట్ల శాతాల్ని ఇప్పుడు కలిపి లెక్కించలేం. ఒకే ఎన్నికలో కూడా, ఓట్ల శాతాలకు సీట్ల సంఖ్యకు ఉండే సంబద్ధత ఏకరీతిన ఉండాలని కూడా లేదు. 2014లో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికలు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా వర్తిం చాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్ని గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఆశ్చర్యకరమైన తేడాలున్నాయి. స్వల్ప వ్యత్యాసపు గెలుపోటములు ఒక రాజకీయ పార్టీకి ఎలా అనుకూలించాయో ఏపీ గణాంకాల విశ్లేషణ స్పష్టం చేస్తోంది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో బీజేపీకి 49.1% ఓట్లు (99 సీట్లు)రాగా కాంగ్రెస్‌కు 41.4 శాతం ఓట్లు(77 సీట్లు) లభించాయి. అంటే దాదాపు 8 శాతం (7.7 శాతం) ఓట్ల వ్యత్యాసమున్నపుడు సాధించిన సీట్లలో తేడా 22 మాత్రమే! కానీ, ఏపీకి వచ్చే సరికి పరిస్థితి భిన్నం! టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల వ్యత్యాసం 2 శాతం కన్నా తక్కువ. 175 స్థానాలున్న ఏపీలో టీడీపీకి 46.30 శాతం ఓట్లు (102 సీట్లు) రాగా వైఎస్సార్సీపీకి 44.47 శాతం ఓట్లు (67 సీట్లు) లభించాయి. అంటే 2 కన్నా తక్కువ (1.83 శాతం) ఓట్ల వ్యత్యాసమున్నా 35 సీట్లు తక్కువ లభించాయి. -దిలీప్‌రెడ్డి -
చెల్లని ఓట్లకు చెల్లు
సాక్షి, దండేపల్లి (మంచిర్యాల): ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)ల రంగ ప్రవేశంతో ఇక చెల్లని ఓట్లకు చెక్ పడింది. గతంలో ఈవీఎంలు లేకముందు బ్యాలెట్ పేపరుపై స్వస్తిక్ ముద్ర వేసి ఓటు హక్కు వినియోగించుకునేది. కొన్ని సందర్భాల్లో స్వస్తిక్ ముద్ర సరిగా పడకపోవడం, ఓటు మడిచే సమయంలో గుర్తు ఇద్దరు అభ్యర్థులపై పడడం, మరికొన్ని సందర్భాల్లో స్వస్తిక్ ముద్ర వేయకుండానే ఓటును బ్యాలెట్ బాక్సులో వేసేవారు. ఇలాంటి వాటన్నింటిని చెల్లని ఓట్లుగా పరిగణించేవారు. కానీ ఈవీఎంల రాకతో ఓటు వేయదలుచుకున్న అభ్యర్థి గుర్తు పక్కన మీట నొక్కాలి, లేదంటే నోటా మీట నొక్కాలి. దీంతో చెల్లని ఓట్లు అనే మాటేలేదు. -
వీవీప్యాట్ మిషన్లు ఫొటోలు తీయబోవు..
న్యూఢిల్లీ: ఓటు ధ్రువీకరణ యంత్రాల(వీవీప్యాట్)తో అనుసంధానం చేసిన ఈవీఎంలు ఓటు వేసే సమయంలో ఓటర్లను ఫొటోలు తీయబోవని, వీటిపై ప్రచారమవుతున్న అవాస్తవాలను నమ్మవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ‘వీవీప్యాట్ ఈవీఎం మిషన్లు ఓటు వేసే సమయంలో ఫొటోలు తీస్తాయి. మీరు మా నుంచి డబ్బులు తీసుకుని ఓటు వేయకపోతే మాకు తెలుస్తుంది. మీరు మమ్మల్ని మోసం చేయలేరని కొందరు రాజకీయ నాయకులు ఓటర్లను భయపెడుతున్నారు. ఇవి పూర్తిగా అవాస్తవాలు. వీటిని నమ్మవద్దు’అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ వివరించారు. వీవీప్యాట్ మిషన్లు ఈవీఎంతోపాటు ఉంటాయని, ఓటరు ఓటు వేసిన వెంటనే తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు, గుర్తు వీవీప్యాట్ పరికరం నుంచి చిన్న పేపర్‌పై ప్రింట్ అయ్యి బయటకు వస్తాయని చెప్పారు. ఆ పేపరు సుమారు 7 సెకన్లపాటు ఓటరుకు కనిపించి.. అక్కడే ఉన్న బాక్స్‌లోకి వెళుతుందని తెలిపారు. -
కడప నియోజకవర్గంలో లక్షా పదివేల ఓట్లు గల్లంతు
-
28వేల ఓట్ల తొలగింపు.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 28వేల ఓట్లను తొలగించడంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. మురళి వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. అంతేకాక దీనిపై కంటోన్మెంట్ బోర్డుకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
క్రైస్తవుల ఓట్ల కోసం బీజేపీ సరికొత్త వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లో క్రైస్తవ మిషనరీలు మత మార్పిడులకు పాల్పడకుండా నిరోధించేందుకు 1978లో మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారు. దేశంలో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన మూడవ రాష్ట్రం అరుణాచల్. అంతకుముందు 1967లో ఒరిస్సాలో, 1968లో మధ్యప్రదేశ్‌లో తీసుకొచ్చారు. స్థానిక మతాలను, వారి సంప్రదాయాలను పరిరక్షించాలనే లక్ష్యంతోనే అరుణాచల్‌లోనూ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లోగానే దీన్ని మత మార్పిడిల వ్యతిరేక లేదా నిరోధక చట్టం అనకుండా ‘అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం’ అని నామకరణం చేశారు. బలవంతంగా, ప్రోద్బలంతో లేదా మరే ఇతర తప్పుడు మార్గాల ద్వారా ఒక మతం నుంచి మరో మతంలోకి ప్రజలను తీసుకోరాదని చట్టం నిర్దేశిస్తోంది. క్రైస్తవ మిషనరీల ప్రోద్బలంతో రాష్ట్రంలో వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోందని, న్యీషి, డోన్యీ–పోలో, రంగ్ఫ్రా, గ్యాటీ అండా, అమిక్ మతాయ్.. స్థానిక జాతులు లేదా మతాల ప్రాభవం తగ్గి, అవి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్న కారణంగా నాడు మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారు. 1971లో అరుణాచల్ రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య జనాభాలో ఒక శాతం ఉండగా, 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య 30 శాతానికి చేరుకుంది. అదే 51.6 శాతం ఉన్న స్థానిక మతాల ప్రజల సంఖ్య 26 శాతానికి పడిపోయింది, మత మార్పిడుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయక పోవడం వల్ల రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో, చట్టం వచ్చిన 40 ఏళ్ల అనంతరం తమ బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎత్తివేయాలనుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖందు ఇటీవల ప్రకటించడం ప్రజా వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. క్రైస్తవుల పట్ల వివక్ష చూపుతున్న ఈ చట్టం నిజమైన లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధమని కూడా ఆయన వ్యాఖ్యానించడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. మంచి విద్యను, మంచి వైద్యాన్ని అందిస్తామన్న హామీతోనే స్థానికంగా క్రైస్తవ మతం ఎదిగిందని ‘అరుణాచల్ తెగల అధ్యయన సంస్థ’కు చెందిన జుమ్యిర్ బసర్ తెలిపారు. సంప్రదాయబద్ధమైన చికిత్సా విధానంపైనా ప్రజలకు పెద్దగా నమ్మకం లేకుండా పోయిందని, పైగా ఆ వైద్యంలో ఖర్చుతో కూడుకున్న సంప్రదాయాలున్నాయని ఆమె వివరించారు. స్థానిక ప్రజలు ప్రోద్బలంతో తమ మతంలోకి రాలేదని, తమ మతాన్ని మనస్ఫూర్తిగా నమ్మి వచ్చారని అరుణాచల్ క్రైస్తవ సంస్థకు చెందిన టొకో టెకీ చెప్పారు. రాజ్యాంగం లౌకికవాద స్ఫూర్తికి భిన్నంగా ఉన్న చట్టాన్ని ఎత్తివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం వివేకమైన నిర్ణయమని టెకీ వ్యాఖ్యానించారు. ఎప్పటి నుంచో ఈ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న క్రైస్తవ సంఘాల సభ్యుల్లో ఆయన ఒకరు. చట్టం ప్రకారం మత మార్పిడులు జరుగ కూడదుగానీ స్థానిక ప్రజలు కైస్తవాన్ని జీవన విధానంగా ఎంపిక చేసుకున్నారని ‘అరుణాచల్ చర్చి పునురుద్ధణ మండలి’ అధ్యక్షుడు న్యాక్డో టాసర్ వ్యాఖ్యానించారు. 1970 చివర్లో, 1980 మొదట్లో కొన్ని సార్లు మాత్రమే మత మార్పిడుల నిరోధక చట్టాన్ని వినియోగించారని, ఆ తర్వాత ఎప్పుడూ లేదని అరుణాచల్ యూనివర్శిటీలో చరిత్రను బోధించే అధ్యాపకుడు నాని బాత్ తెలిపారు. చట్టాన్ని ఎత్తివేస్తే అడ్డూ అదుపూ లేకుండా మత మార్పిడులు పెరిగిపోతాయని స్థానిక మతం న్యీషి సాంస్కృత సంఘానికి చెందిన పై ధావే ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లను దృష్టిలో పెట్టుకొనే చట్టాన్ని ఎత్తివేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. సహజంగా బీజేపీకి క్రైస్తవులు వ్యతిరేకులు. వారి డిమాండ్‌ను అంగీకరించడం ద్వారా వారి మద్దతును కూడగట్టవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు ఉంది. బీజేపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికంగా పనిచేస్తున్న ఆరెస్సెస్ న్యాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మతాల పిల్లల పాఠశాలలకు, సాంస్కృతిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ద్వారా వారిని హిందూమతంలోకి తీసుకరావడానికి ఆరెస్సెస్ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 22 శాతం మంది హిందువులు ఉండగా, 2011 నాటికి వారి సంఖ్య 29 శాతానికి పెరిగింది. ఓ దశలో బాగా పెరిగిన హిందువుల సంఖ్య సామాజిక అంతరాల వైషమ్యాల కారణంగా పడిపోయింది. అరుణాచల్ తర్వాత మత మార్పిడుల నిరోధక చట్టాన్ని చత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు తీసుకొచ్చారు. -
ఓట్ల కోసం బోగస్ పట్టాలు
జయపురం : జయపురంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోంది. ఎన్నికలలో నెగ్గేందుకు అధికార పార్టీ రాజకీయ నేతలు ఎటువంటి నేరాలకైనా వెనుకాడడంలేదని జయపురం ఎంఎల్ ఏ, విధానసభలో కాంగ్రెస్ చీఫ్‌విప్ తారాప్రసాద్ బాహిణీపతి ధ్వజమెత్తారు. జయపురంలోని నివాస గృహంలో గల పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాలను ప్రజలకు అందజేసి మోసగించారని ఆరోపించారు. కేవలం జయపురం సమితిలో 10 వేల మందికి బోగస్ భూమి పట్టాలను అధికార పార్టీకి చెందిన మాజీమంత్రి అందజేశారని, పట్టాలు పొందిన లబ్ధిదారులు జయపురం తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఇచ్చిన పట్టాల భూములు అందజేయాలని అడుగగా అసలు ఆ పట్టాలు తాము ఎవరకీ ఇవ్వలేదని, ఆ పట్టాల వివరాలు తమ కార్యాలయం రికార్డులలో లేవని స్పస్టం చేయడంతో లబ్ధిదారులు కంగుతిన్నారని ఆయన వెల్లడించారు. 2011 పంచాయతీ ఎన్నికల సమయంలోను, 2014 విధానసభ ఎన్నికల సమయంలోను బోగస్ పట్టాలను ఆనాటి మాజీమంత్రి ప్రజలకు పంచారని ఆరోపించారు. బయటపడిన 10 వేల పట్టాలు ఇంతవరకు 10 వేల బోగస్ పట్టాలు బయటపడ్డాయని ఇంకా అనేకం బయటపడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలలో లబ్ధిపొందేందుకు బోగస్ భూమి పట్టాలతో ప్రజలను ప్రలోభపరిచారని ఎద్దేవా చేశారు. కేవలం జయపురం సమితిలోనే కాదని జయపురం నియోజకవర్గంలో అంతర్భాగమైన బొరిగుమ్మ సమితిలో కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు బోగస్ భూమి పట్టాలు పంచి ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. జయపురం విధానసభ నియోజకవర్గంలో దాదాపు 25 వేల మందికి బోగస్ భూమిపట్టాలు పంచారని ధ్వజమెత్తారు. అనేక పట్టాలపై తహసీల్దార్ సంతకాలు లేవని, అలాగే పట్టాలపై తేదీలు కూడా లేవంటూ కొన్ని పట్టాలను విలేకరులకు చూపించారు. బాధితులకు పట్టాలు అందజేయాలి ఈ వ్యవహారం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి తెలిసే జరిగిందా? లేదా పట్టాలు పంచిన వారు బోగస్ పట్టాలు ముద్రించి ప్రజలను మోసగించారా? అన్నది తేలాలని అందుచేత ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించి బోగస్ పట్టాలు పంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసపోయిన లబ్ధిదారులకు వెంటనే భూములు, స్థలాలు సమకూర్చి అసలైన పట్టాలు అందజేయాలని కోరారు. జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాల సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత నిందితులను అరెస్టు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాందోళన చేపట్టి జయపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. దర్యాప్తు జరిపి నిందితలను అరెస్టు చేయకపోతే బోగస్ పట్టాలు ప్రజలకు పంచి మోసగించిన వారిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెడతామని, అలాగే రాజధానిలో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎంఎల్ఏ తారాప్రసాద్ విలేకరుల సమావేశం పూర్తిచేసిన తరువాత పలువురు గ్రామీణ ప్రజలు బోగస్ భూమి పట్టాలతో వచ్చి తాము మోసపోయినట్లు వాపోయారు. బోగస్ పట్టాలు ప్రజలు పంచిన నేత మాజీ మంత్రి రవినారాయణ నందో అని ఆయన పరోక్షంగా తారాప్రసాద్ బాహిణీపతి ఆరోపించారు. పట్టాలు పంచిన సమయంలో ఉన్న తహసీల్దార్ సిబ్బంది ఇతర నేతలు కూడా నిందితులేనని స్పష్టం చేశారు. సమావేశంలో జయపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ మíహంతి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి నిహార్ బిశాయి పాల్గొన్నారు. -
ఆబార్షన్లపై ఐర్లాండ్‌లో రేపే రిఫరెండం
ఒక భారతీయ మహిళ విషాదభరితమైన మరణం ఐర్లాండ్ చట్టాలనే మారుస్తుందా ? గర్భస్రావంపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు అయిదేళ్లుగా చేస్తున్న పోరాటం ఎలాంటి మలుపు తిరగబోతోంది ? ఐర్లాండ్‌లో అబార్షన్లపై నిషేధాన్ని రద్దు చేయాలా ? వద్దా ? అనే అంశంపై అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణకు వీలుగా ఈ నెల 25 శుక్రవారం రిఫరెండం జరుగుతున్న వేళ ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తల్లి ప్రాణంతో పాటు, పుట్టబోయే బిడ్డ ప్రాణానికి అత్యంత విలువను ఇస్తూ గర్భస్రావంపై అత్యంత కఠినమైన చట్టాలు ఇప్పటివరకు ఆ దేశంలో అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల కారణంగా కర్ణాటకకు చెందిన సవిత హలప్పనవర నిండు ప్రాణం బలైపోయింది. ఆమె మృతి దేశంలో ఎందరినో కదలించడంతో ప్రభుత్వం రిఫరెండంకు సిద్ధమైంది. అయిదేళ్ల క్రితం ఏం జరిగిందంటే ? కర్ణాటకకు చెందిన దంత వైద్యురాలు సవిత హలప్పనవర (31) ఆమె భర్త ప్రవీణ్‌లు ఐర్లాండ్‌లో నివాసం ఉంటున్నారు. మూడో నెల గర్భవతిగా ఉన్న సవిత విపరీతమైన నడుం నొప్పి రావడంతో 2012 అక్టోబర్ 21న గాల్వే ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భస్రావం చెయ్యక తప్పనిపరిస్థితి ఏర్పడిందని నిర్ధారించారు. అయితే అప్పటికే గర్భస్థ శిశువు గుండెకొట్టుకోవడం ప్రారంభం కావడంతో చట్టపరంగా అబార్షన్ చేయడానికి వీల్లేదని భావించిన వైద్యులు సహజంగా గర్భస్రావం అయిపోతుందేమోనని రెండు, మూడు రోజులు వేచి చూశారు. ఈ లోపే ఆమె గర్భాశయానికి ఇన్ఫెక్షన్ సోకి సెప్టిక్‌గా మారి సవిత ప్రాణాల మీదకి వచ్చింది. దీంతో ఆమెకి మందుల ద్వారా అబార్షన్ చేశారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సవిత అక్టోబర్ 28న తుది శ్వాస విడిచింది. ఐర్లాండ్‌లోని కఠినమైన చట్టాలే సవిత ప్రాణాలు తీశాయంటూ ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సవిత మృతితో దేశవ్యాప్తంగా మహిళలు రోడ్డెక్కారు. తల్లి ప్రాణం మీదకి వస్తున్నా లెక్కచేయకపోవడమేమిటంటూ నినదిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. చట్టాల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆ సమయంలో ఆందోళనలు మిన్నంటాయి. సవిత మృతిపై ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ గాల్వే ఆస్పత్రి సిబ్బందిని క్షుణ్ణంగా విచారించి సరైన సమయంలో అబార్షన్ చేసి ఉంటే సవిత ప్రాణాలు దక్కి ఉండేవని, గర్భస్రావం చట్టాన్ని సవరించాలంటూ గట్టిగా సిఫారసు చేసింది. మరోవైపు గర్భస్రావంపై నిషేధాన్ని సమర్థిస్తున్న కొందరు సంప్రదాయవాదులు సవిత కేసు సాకుతో చట్టాలను నీరుకార్చే ప్రయత్నం చేయవద్దంటూ నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం సవిత మృతి వెనుక నిజానిజాలను తెలుసుకోవడానికి రెండో కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ గాల్వే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సవిత ప్రాణాలు పోయాయని నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం అబార్లషన్లపై ప్రజాభిప్రాయ సేకరించాలని నిర్ణయించింది. సవితను గుర్తుకు తెచ్చుకోండి : ఓటర్లకు తండ్రి విజ్ఞప్తి ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ కాలంలో తమ కుమార్తె దేశం కాని దేశంలో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో మరణించడం సవిత తల్లిదండ్రుల్ని కుంగదీసింది. తాము సర్వస్వాన్ని కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నామని సవిత తండ్రి అందనప్ప ఎలగి కన్నీరుమున్నీరవుతున్నారు. ఐర్లాండ్‌వాసులు ఓటు వేసే ముందు తమ కుమార్తెను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, తమ పరిస్థితి మరే తల్లిదండ్రులకు రాకూడదని ఆయన అంటున్నారు. సవిత మరణంతో అబార్షన్ల విషయంలో ఐర్లాండ్వాసుల దృక్కోణంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. మరి రిఫరెండంలో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపిస్తారో మరో రోజులో తేలిపోనుంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
మోదీ ఘనం, పార్టీ పతనం
జాతిహితం ఆ రెండు రాష్ట్రాలలోను ఆధిక్యం సాధించడానికి అవసరమైనంత ప్రతిష్ట మోదీకి మాత్రం ఉంది. కానీ, ఆ రాష్ట్రాల స్థానిక సారథులు మోదీ పాలిట గుదిబండలే. గుజరాత్లో విజయ్ రూపానీ– ఈయన ఏ వర్గానికీ చెందినవారు కాదు. నిజానికి అదే ఆయనను ముఖ్యమంత్రి పదవికి దగ్గర చేసింది. కర్ణాటకలో యడ్యూరప్ప– వయసు పైబడినవారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు కూడా. మౌలిక భేదం ఏమిటంటే– ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలలో మోదీ తన కోసం ఓటు అడిగారు. రాహుల్ గాంధీ అయితే గుజరాత్లో, ఉత్తరప్రదేశ్‌లో మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయమని కోరారు. కర్ణాటకలో మాత్రం సిద్ధరామయ్యకు ఓటు వేయమని అభ్యర్థించారు. గడచిన రెండేళ్లలో ఎన్నికలు జరుపుకున్న రాష్ట్రాలలో పర్యటించినప్పుడు కొన్ని విశేషమైన అంశాలు గమనంలోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ నిలకడగా కని పించడం ఒకటి. అలాగే ధరల పెరుగుదల (ప్రధానంగా పెట్రోలు, డీజెల్ ధరలు), ఉద్యోగాలు లేకపోవడం, వాణిజ్యం చతికిల పడడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ మొదలైన వాటి పట్ల ప్రజానీకంలో ఆగ్రహం కొట్టొచ్చినట్టు కనిపించడం మరొకటి. ఇలాంటి వాటి మీద ప్రజలు ఆగ్రహించడం సహజం. ఈ ఆగ్రహం బీజేపీ మీదకు, ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాల మీదకు మళ్లుతున్నది కూడా. కానీ ఆయనే ఇప్పుడొక కొండగుర్తు అయినట్టు, ఆస్తిత్వం అయినట్టు, తనకు తానే ఆయనొక బ్రాండ్ అయినట్టు వీటిలో ఏవీ కూడా ప్రధాని మీద ప్రతిబింబించడం లేదు. మోదీ రాజ వంశాల బరువుతో వంగిపోయిన, ప్రత్యేక హక్కులు, భారతీయతను తుడిచిపెట్టిన, ‘నేపథ్యం’ఉన్న వ్యవస్థలో తనకు తాను నాయకునిగా అవతరించిన వారు కాదు. ఆయన తనకు తాను అవతరించిన సూపర్‌బ్రాండ్. ఆయన రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలను పక్కన పెట్టి ఎక్కువ మంది భారతీయులు ఒక దైవంలా భావిస్తున్న వ్యక్తి. ఇక్కడ కొన్ని అర్హతలు వర్తిస్తాయి. అంటే ఆయనను వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. మైనారిటీలు, నిబద్ధతగల సోషలిస్టులు, ఇప్పుడే బాగా వ్యతిరేకత పెంచుకుంటున్న దళితులు మోదీ అంటే విముఖంగా ఉన్నారు. రాజీవ్‌గాంధీ కూడా అపారమైన (మోదీ కంటే ఎక్కువగా) ప్రాచుర్యం కలిగి ఉండేవారు. కానీ అది ఆయన గెలిచిన 1984 డిసెంబర్ మొదలు 18 మాసాల వరకే. తరువాత ఆయన ఇక కోలుకోలేనంతగా అప్రతిష్ట పాలయ్యారు. ఇంకొకరకంగా చెప్పాలంటే, ఆ మొదటి 18 మాసాల కాలంలో రాజీవ్ ఏం చెప్పినా మన మాతృమూర్తుల కళ్లు తడిసేవి. ఆ తరువాత, 19వ మాసం మొదలుకొని ఆయన ఏం చెప్పినా మన పిల్లలకు కూడా నవ్వొచ్చేది. ఈ పరిణామానికే మనం ప్రభుత్వ వ్యతిరేకత అని పేరు పెట్టుకున్నాం. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొంతకాలం గడిచాక ఏ రాజకీయవేత్త మీదనైనా ప్రభావం చూపేదే. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే– ఈ విశ్వజనీన అంశం నుంచే మోదీ శక్తిమంతమవుతున్నారా? నా ఆలోచనలను పరీక్షించుకోవలసిన అవసరం ఉందేమోనని ఈ అభిప్రాయాలను చూసి మీరు భావించవచ్చు. ఈ వారం నేను మీ ముందుకు తెస్తున్న వాదనను బట్టి నేను విమర్శను ఎదుర్కొనక తప్పదు. నేను ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నానా అని, రాజ్యసభ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్నానా అన్న ప్రశ్నలు వస్తాయి. మీ పైజమా కింద ఉన్న ఖాకీ చెడ్డీని బహిర్గతం చేస్తారా అని అడగవచ్చు. చివరకు భక్తునిగా మారిపోతున్నారని అనుకోవచ్చు. ఇక్కడే ఒక మీమాంస ఉంది. ప్రతివారు– భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్, జర్నలిస్టులు అంతా ఓటు వేస్తారు. కానీ మీరు మీ నిర్ణయాలను అధిగమించడానికి మీ ఓటు ప్రాధామ్యాలను అనుమతిస్తున్నారా? తరువాత ప్రశ్న–ఈ వాదనను మీ ముందుకు తెస్తున్న సమయం గురించినది. కర్ణాటకలో మోదీ తన పార్టీకి ఆధిక్యం సాధించిపెట్టడంలో విఫలమైన ఈ వారంలోనే ఈ వాదనను మీ ముందుంచగలనా? లేదా అత్తెసరు మెజారిటీతో ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా ఆయన పార్టీ గట్టెక్కి కొన్ని నెలలు కూడా గడవని ఈ సమయంలో ఈ వాదనను తేవచ్చునా? ఆయన పార్టీ ప్రతిష్ట దిగజారిందని ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వెల్లడించడం లేదా? ఇతర రాజ కీయ పార్టీల ప్రభుత్వాల మాదిరి గానే ఆయన పార్టీ ప్రభుత్వాల మీద కూడా ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి బింబించలేదా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఔననే. బీజేపీ ఈ మధ్య తన ప్రతిష్టను కోల్పోయినట్టే కనిపిస్తున్నది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఉందని కచ్చితంగా నిర్ధారించుకున్న రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. అయితే పార్టీ పరిస్థితే ప్రధానికి ఉన్న ప్రజాకర్షణ విషయంలోను ప్రతిబింబిస్తున్నదని మీరు చెప్పగలరా? ఎన్నికలు జరగుతున్న ప్రాంతాలలో ప్రజల నాడిని పట్టుకునే విషయంలో జర్నలిస్టులు, రాజ కీయ పండితులు అంత ఆధారపడదగినవారు కాదు. అయినప్పటికి అప్పుడు గుజరాత్‌లోను, ఇప్పుడు కర్ణాటకలోను కూడా మోదీ రాక తరువాత ఏర్పడిన పరిస్థితి మీద ఏకాభిప్రాయం ఉంది. ఆయన గతంలో ఎవరూ చేయనంత ఉధృతంగా ప్రచారం చేశారు. గుజరాత్లో 34 సభలలోను, కర్ణాటకలో 21 సభలలోను ప్రసంగించారు. నిజానికి కర్ణాటకలో మొదట 15 సభలకే ప్రధానిని పరిమితం చేశారు. గుజరాత్లో మోదీ పార్టీ కేవలం ఎనిమిది స్థానాల ఆధిక్యం సాధించింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దాదాపు అన్నే స్థానాలను సాధిం చలేకపోయింది. కర్ణాటక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయంటూ వచ్చిన సర్వేలన్నీ మోదీ ప్రచారానికి ముందు జరిపినవే. పోలింగ్ సమీపిస్తున్న సమయంలో మోదీ వచ్చి ఉత్సాహం రేకెత్తించకుంటే ఎన్ని స్థానాలు వచ్చి ఉండేవో ఒక్కసారి ఊహించండి! ఆ రెండు రాష్ట్రాలను జార విడుచుకోవడానికి అవసరమైన మేర ఆయన పార్టీ అప్రతిష్ట పాలైంది. అయితే ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఆ రెండు రాష్ట్రాలలోను ఆధిక్యం సాధించడానికి అవసరమైనంత ప్రతిష్ట మోదీకి మాత్రం ఉంది. ఆ రెండు రాష్ట్రాలలోను కూడా స్థానిక సారథులు మోదీ పాలిట గుదిబండలే. గుజరాత్లో విజయ్ రూపానీ– ఈయన ఏ వర్గానికీ చెందినవారు కాదు. నిజానికి అదే ఆయనను సీఎం పదవికి దగ్గర చేసింది. కర్ణాటకలో యడ్యూరప్ప– వయసు పైబడినవారు. అవి నీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు కూడా. మౌలిక భేదం ఏమిటంటే– ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలలో మోదీ తన కోసం ఓటు అడిగారు. రాహుల్ గాంధీ అయితే గుజరాత్లో, ఉత్తరప్రదేశ్‌లో మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయమని కోరారు. కర్ణాటకలో సిద్ధరామయ్యకు ఓటు వేయమని అడిగారు. తన ప్రజాకర్షణ నుంచి, తన పార్టీ అదృష్టాన్ని బట్టి, తన ప్రభుత్వ పని తీరును బట్టి ఏ వ్యక్తి అయినా శక్తిమంతుడై, అందరికీ అతీతంగా ఉన్నత శిఖరం మీదకు చేరగలడా? దీనికి సమాధానం ఏమిటంటే– వాస్తవాలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఇక్కడ సిద్ధాంతీకరించడానికి ప్రత్యేకమైన అంశమంటూ ఏదీ లేదు కూడా. గడచిన నాలుగేళ్లుగా ఆర్థిక వ్యవస్థ ఈ ప్రధాని నాయకత్వంలో నానా ఇక్కట్లు పడుతున్న సంగతి మనకు తెలుసు. ఉద్యోగావకాశాల లభ్యత దారుణ (క్షమిస్తే ఇవి ప్రభుత్వ గణాంకాలే) స్థితిలో ఉంది. భారత వ్యూహాత్మక స్థానం అధ్వాన స్థితికి చేరింది. గతంలో ఎన్నడూ లేనంతగా మనుషుల మధ్య సామరస్యం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అధికార వ్యవస్థ నుంచి మైనారిటీలు దూరమయ్యారు. చాలామంది క్షోభకు గురవుతున్నారు. అయినా సరే, మోదీ బృందంలోని వారు నిష్ప్రయోజకులైనప్పటికీ ఆయనకు తగిన సంఖ్యలో ఓట్లు పడుతూనే ఉన్నాయి. అయితే వచ్చే సంవత్సరం జరిగే సాధారణ ఎన్నికలలో అలాంటి నిష్ప్రయోజకులనే బరిలోకి దించితే ఓటర్లు ఏం చేస్తారో? ఇక్కడ కూడా మరోసారి అర్హతలు పరిగణనలోనికి వస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ పొత్తు ఇందుకు ఉదాహరణ. కానీ ఇది విస్తృత స్థాయిలో మార్పు తీసుకురాలేదు. ఒక వ్యక్తి తన పార్టీనీ, ప్రభుత్వాన్ని మించి ఎదిగిపోవడం ఎలా సాధ్యం? గడగ్ జిల్లాలో మేం పర్యటిస్తున్నప్పుడు శిరహట్టి నియోజకవర్గంలో ఒక చోట పొలాల మధ్య ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఆగాం. అక్కడే బస్సు కోసం వేచి ఉన్న తొలి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థినులతో సంభాషణ ఆరంభించాను. వారంతా దాదాపు 18 ఏళ్లు ఉన్న అమ్మాయిలే. ఆ సంభాషణలో వారందరి దగ్గర నుంచి ఒకటే సమాధానం వచ్చింది. అది– వాళ్లు బీజేపీకే ఓటు వేస్తారట. అందుకు ‘ఒకే ఒక్క కారణం, మోదీ’. స్వచ్ఛ భారత్ పిలుపు ప్రభావం వారి మీద చాలా ఉంది. ‘మా గ్రామం 75 శాతం శుభ్రపడింది. మేం డిజిటల్ ఇండియాలో నివసించగలుగుతున్నాం. భారత ప్రతిష్టను మోదీ ఇనుమడింప చేశారు. అన్నిటి కంటే ముఖ్యంగా అవినీతిని విచ్ఛిన్నం చేశారు’– ఇంక వాదించడానికేం ఉంది. వీటిని వారు పరమ సత్యంగా విశ్వసిస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గురించి ఏమంటారంటే, ‘ఆయన మంచి మనిషి కావచ్చు. కానీ మాకు తెలియదు’ ఇదే సమా«ధానం. ఇంకా, ‘ఆ మాటకు అర్థం నేను రాహుల్‌ను వ్యతిరేకిస్తూ మోదీని అభిమానిస్తున్నానని కూడా కాదు. కానీ మోదీ నాకు ఒక నాయకుడిగా తెలుసు. ఆయన సందేశాన్ని నేను నమ్ముతాను.’ ఇలాంటి సందేశమే నేను వాళ్ల నుంచి విన్నాను. ఇలాంటి విశ్వాసమే దేశమంతా ఉంది. వాళ్ల దృష్టిలో మోదీ ఒక్కరే నాయకుడు. వచ్చే సంవత్సరం వీరిలో 14 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరిలో కొన్ని విభేదాలు ఉండవచ్చు. కానీ వారి విధేయత ఏకశిలా సదృశమే. అది– మోదీ– ఇజం. దీనిని మోదీ ఎలా సాధించారు? ఆయన ఒక సరికొత్త సందేశాన్ని నిర్దుష్టంగా అందిస్తున్నారు. అందులో మీ కోసం కొన్ని మంచి విషయాలు చెబుతున్నారు. అవి– పరిశుభ్రత, నిజాయితీ, విద్య, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం. వీటి నిర్వహణ బాధ్యతను కూడా మీకే అప్పగిస్తున్నారు. భారత రాజకీయ చరిత్రలో ఓటర్లను కేంద్రీకృతం చేసిన నాయకుడు మోదీ. అయితే ఆయన వ్యతిరేకులు కూడా తక్కువేమీ కాదు. వారు మోదీని తీవ్రంగా ఈసడించుకుంటారు. వీరే ఈ వారం వ్యాసంలో ఇలాంటి వాదన తెచ్చినందుకు నన్ను కూడా ఈసడించుకోవచ్చు. వాస్తవికతను అంగీకరించడమే రాజకీయం. దీనితో మీరు ఏకీభవించకుంటే ఖండించడానికి మార్గాలు వెతకండి. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఔను.. ఓటర్లను ఆకర్షిస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘‘ఓట్లు ఆకర్షించే పథకాలకు ఖర్చు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. గ్యారంటీగా చేస్తం. ఓట్లు ఆకర్షించకపోతే రాజకీయ పార్టీ ఎందుకండి? కచ్చితంగా ఆకర్షించాలె.. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం.. హిపోక్రసీ ఎందుకు? అన్ని రాజకీయ పార్టీలు చేసేది అదే పని. మంచి చేసి ఎవరు ఎక్కువ శాతం ప్రజలను ఆకర్షిస్తరో వారే గెలుస్తరు. ప్రజలను ఆకర్షించకపోతే వికర్షిస్తరా?’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. అంతకుముందు బీజేపీ పక్ష నేత జి.కిషన్ రెడ్డి.. ప్రభుత్వం చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ‘‘గత యూపీఏ కంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువిచ్చిందని కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో మీ గొప్పతనమేమి లేదు. అసలు మీరు ఇచ్చేదే ఏమీ ఉండదు. ఇక్కడ ఎవరూ బిచ్చగాళ్ల మాదిరి తీసుకోవడం ఉండదు. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల రాజ్యాంగపరమైన హక్కు. 2004లో లోక్‌సభకు వెళ్లినప్పుడు కేంద్ర బడ్జెట్ రూ.4 లక్షల కోట్లు. నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.24 లక్షల కోట్లు. అది ఎలా పెరుగుతుందో రాష్ట్రాల వాటా అలాగే పెరుగుతుంది. పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఇమిడి ఉంది. ఈ దేశాన్ని సాకే ఏడు రాష్ట్రాలో తెలంగాణ ఒకటి. మన దగ్గరి నుంచి పోయే డబ్బు రూ.50 వేల కోట్లకు పైనే. తిరిగి వచ్చేది మాత్రం రూ.24 వేల కోట్లే’’అని అన్నారు. ఎన్నికలకు మరో ఏడాది ఉందని, గత నాలుగేళ్లలో ఏం చేశామో, ఈ ఏడాది ఏం చేయబోతున్నామో ప్రజల ముందు ఉంచామని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల ఆర్థిక ప్రణాళిక, టీఆర్ఎస్, ప్రభుత్వ ఆలోచన విధానం, మంచి చేసినమో చెడు చేసినమో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ‘‘కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రానికి ఓ ఆర్థిక ప్రాతిపదిక లేదు. అనిశ్చితి పరిస్థితిలో రాత్రింబవళ్లు కష్టపడి వాస్తవానికి అతి దగ్గరగా తొలి బడ్జెట్ రూపొందించాం. అద్భుతమైన పురోగతి లభించింది. తెలంగాణ అంటే ఇతర పార్టీలకు రాజకీయ క్రీడ. ఉద్యమ సమయంలో కావొచ్చు. రాష్ట్రం వచ్చినప్పుడు కావొచ్చు. కానీ టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్. రాష్ట్ర సాధన సమయంలో ఏ ఉద్యమ స్ఫూర్తితో పని చేశామో రాష్ట్రం వచ్చిన తర్వాత అదే స్ఫూర్తితో పని చేస్తున్నాం. ప్రజలు హర్షిస్తున్నారు. ఉప ఎన్నికల్లో వచ్చిన గెలుపే దీనికి గీటురాయిు’’అని సీఎం వివరించారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామి! ఏ విషయంలో, ఏ రాష్ట్రంతో పోల్చకున్నా తెలంగాణ అగ్రభాగంలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వచ్చిన ఫలితాలను ఈ సందర్భంగా వివరించారు. 2017–18లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,12,764 ఉంటే తెలంగాణలో రూ.1,75,534 ఉందన్నారు. తెలంగాణ రాక ముందు 2013–14లో దేశ జీడీపీ వృద్ధిరేటు 13 శాతం ఉంటే తెలంగాణ జీఎస్డీపీ 12.4 శాతం మాత్రమే ఉండేదన్నారు. 2017–18లో దేశ జీడీపీ 9.8 శాతం ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ 14.1 శాతం ఉందన్నారు. 2014లో పారిశ్రామికరంగంలో –0.8 శాతం వృద్ధి ఉందని, 2017–18లో 5.6 శాతానికి వృద్ధి సాధించామని పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగం 2014లో 1,283 యూనిట్లు ఉండగా.. ఇప్పుడు 1,507 యూనిట్లకు పెరిగిందన్నారు. జాతీయ సగటు 1,122 యూనిట్లు మాత్రమే అన్నారు. వ్యవసాయ వృద్ధి రేటు 2013–14లో 4 శాతం ఉండగా.. 2017–18లో 7 శాతానికి పెరిగిందన్నారు. కేంద్ర సర్కారు అంకెల గారడీ దేశానికి సంబంధించి ద్రవ్య వ్యవస్థ, నిర్వహణ అంతా కేంద్రం చేతిలో ఉంటుందని సీఎం అన్నారు. ‘‘కేంద్రం ఎట్ల ఉంటదో మనం అట్లనే ఉండాల్సి వస్తది. కేంద్రంతో భిన్నంగా ఉండడానికి రాష్ట్రాలకు అవకాశం లేదు. కేంద్రంలోని ఈ ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి 42 శాతం వాటా ఇస్తామని చెబుతూనే కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపుల్లో కోత పెట్టింది’’అని విమర్శించారు. ‘‘కరీంనగర్‌ను లండన్, వరంగల్‌ను సింగపూర్ చేస్తామని ఎవరు చెప్పారండి? కిషన్‌రెడ్డి గారికి కల వచ్చిందా? మేం చెప్పని మేం అనని విషయాలు చెప్పుతామంటే కుదరదు. కరీంనగర్ లండన్ కచ్చితంగా అవుతది. రూ.500 కోట్లతో లోయర్ మానేరుపై చెక్‌డ్యాం నిర్మిస్తున్నాం. మానేరులో ఏడాది మొత్తం నీళ్లు ఉంటాయి. లండన్‌లోని థేమ్స్ నదిలా ఇక్కడ పరిస్థితి ఉంటుందని మాత్రమే చెప్పా’’అని అన్నారు. ఉద్యోగులపై బీజేపీ మొసలి కన్నీళ్లు గత ప్రభుత్వాలు చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసి వెట్టి చేయించుకున్నాయని సీఎం విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులపై బీజేపీ మొసలి కన్నీళ్లు కారుస్తోందన్నారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలుపై నిర్ణయం కేంద్రం చేతిలోనే ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు ఏ అధికారం లేదని స్వయంగా కేంద్రమంత్రి పార్లమెంట్లో ప్రకటించారని గుర్తు చేశారు. సీపీఎస్ ఒప్పందంతో కొత్త ఉద్యోగులు సర్వీసులో చేరారని, పాత పెన్షన్ విధానానికి మారితే వారి పదేళ్ల సర్వీసు ఏం కావాలని ప్రశ్నించారు. దీనిపై ఏం చేయాలో ఆలోచిస్తున్నామని, తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. దేశంలో అత్యుత్తమ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నారన్నారు. ‘‘హోంగార్డుల జీతాలను రూ.3 వేల నుంచి రూ.20 వేలకు పెంచాం. అంగన్వాడీ టీచర్లకు రూ.10.500 చెల్లిస్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, లెక్చరర్లు సహా మొత్తం 2,38,068 మంది ఉద్యోగుల వేతనాలను పెంచి ఏటా రూ.1,100 కోట్ల అదనపు భారాన్ని భరిస్తున్నాం. త్వరలో ఆశా వర్కర్ల జీతాలు పెంచుతాం. పీఆర్సీ బకాయిలను పింఛన్ డబ్బుల్లో జమ చేసుకోవడానికి తొలుత ఉద్యోగ సంఘాలు ఒప్పుకున్నాయి. తర్వాత బకాయిలు కావాలని అడిగితే విడతల వారీగా చెల్లించేందుకు ఒప్పుకున్నాం’’అని వివరించారు. నియోజకవర్గానికి 15 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు కావాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య అడుగుతున్నారంటూ బెంగాల్లో గత లెఫ్ట్ పాలనను ఉటంకించారు. 35 ఏళ్ల సీపీఎం పాలనలో కోల్‌కతా మొత్తం ధ్వంసమైతే ఇప్పుడు మమతా బెనర్జీ హాయాంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. మైనారిటీల సంక్షేమానికి ఈ ఏడాది రూ.800 కోట్లు మాత్రమే విడుదల చేశారని అక్బరుద్దీన్ అనడంలో వాస్తవం లేదని, ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశామని, ఈ నెలాఖరులోగా మరో రూ.150 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. బడ్జెట్‌పై మూస పద్ధతుల్లో విమర్శలు చేస్తున్నారని, వాస్తవ పునాదులపై విశ్లేషణాత్మక ధోరణిలో నిర్మాణాత్మకంగా మాట్లాడేవారు కరువయ్యారన్నారు. -
‘రాజ్యసభ’పై పక్కా వ్యూహం!
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల పోలింగ్ విషయంలో అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది. ఒకే అభ్యర్థికి ఎక్కువ మంది ఓట్లు వేయకుండా.. ముగ్గురు అభ్యర్థులూ కచ్చితంగా గెలిచేలా వ్యూహం సిద్ధం చేస్తోంది. నేరుగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను అభ్యర్థుల మధ్య విభజిస్తోంది. కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల విషయంగా సమస్యలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో.. వారు ఓటేయకున్నా ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ పక్కాగా శిక్షణ ఇస్తోంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి సంబంధించిన బాధ్యతలను ఇద్దరు మంత్రులకు అప్పగించింది. ఆ ఎమ్మెల్యేలతో ఇబ్బందులు! టీఆర్ఎస్ నుంచి అధికారికంగా గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్లో విలీనమైనట్టుగా ప్రకటించుకున్న టీడీపీ (12), వైఎస్సార్సీపీ (3), బీఎస్పీ (2) ఎమ్మెల్యేలు కలుపుకొంటే టీఆర్ఎస్కు అధికా రికంగా 82 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఏడుగురు కాం గ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక సీపీఐ ఎమ్మెల్యే ఓట్లపై డోలాయమాన పరిస్థితి ఉంది. టీఆర్ఎస్కు మద్దతిస్తామని మజ్లిస్ ప్రక టించిన నేపథ్యంలో టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటేసే వారి సంఖ్య 89కి చేరుకుంది. ఇక శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలకుగాను.. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణతో ఆ సంఖ్య 117కు తగ్గుతోంది. ఈ లెక్కన గెలిచే అభ్యర్థికి 29 ఓట్లు వస్తే సరిపోతుందని టీఆర్ఎస్ వర్గాలు లెక్కగడుతున్నాయి. పోలింగ్‌కు సభ్యులు గైర్హాజరైతే గెలవడానికి 26 లేదా 27 ఓట్లు సరిపోతాయన్న అంచనా ఉంది. ఇద్దరు మంత్రులకో అభ్యర్థి బాధ్యత ఒక్కో అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యతను ఇద్దరు చొప్పున మంత్రులకు కేసీఆర్ అప్పగించారు. జోగినిపల్లి సంతోష్ గెలుపు బాధ్యతను మంత్రులు కేటీఆర్, ఈటలకు.. బండా ప్రకాశ్ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావులకు.. బడుగుల లింగయ్యయాదవ్ బాధ్యతను మంత్రులు టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డిలకు అప్పగించారు. దీనికి అనుగుణంగానే ముగ్గురు అభ్యర్థులకు కేటాయించిన ఎమ్మెల్యేలను ఆయా మంత్రులు సమన్వయం చేస్తున్నారు. ఒకే అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడం, మరో అభ్యర్థికి తక్కువ ఓట్లు రావడం వంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి.. ఒక్కో సభ్యుడికి వేర్వేరుగా ఓటర్లను కేటాయించారు. టీఆర్ఎస్కు చెందిన 82 ఓట్లలో 30 మందిని సంతోష్‌కుమార్‌కు, మరో 30 మందిని బండా ప్రకాశ్‌కు కేటాయించారు. మిగతా 22 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు కలిపి 29 మందిని లింగయ్యయాదవ్‌కు కేటాయించారు. ఇక కాంగ్రెస్ నుంచి చేరిన ఏడుగురు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే ఓట్లను అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలన్న వ్యూహంతో ఉన్నారు. ఆ ఇద్దరికీ ఓటుహక్కు లేనట్టే... కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాన్ని బహిష్కరించిన నేపథ్యంలో అధికారికంగా 117 మంది సభ్యులే ఉన్నట్టు శాసనసభ మంగళవారం ప్రకటించింది. దీంతో 23న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఇద్దరికి ఓటుహక్కు లేనట్టేనని శాసనసభ అధికారవర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే ఓటు అవసరం లేకుండానే టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలిచే అవకాశముందని పేర్కొంటున్నాయి. అయితే పార్టీ విప్ వర్తింపు, చట్టపరంగా ఎదురయ్యే చిక్కులు వంటివాటి విషయంలో కాంగ్రెస్ అనుసరించే వ్యూహాన్ని బట్టి ఎత్తులు వేయాలనే టీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు ఇబ్బందులు వస్తాయనుకుంటే ఓటింగుకు గైర్హాజరు చేయించనున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ రాజ్యసభ ఎన్నికల కసరత్తు కోసం మంగళవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ సొంత ఎమ్మెల్యేలతోపాటు ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలు కలిపి 97 మంది దీనికి హాజరయ్యారు. ముగ్గురు అభ్యర్థులకు 33, 32, 32 చొప్పున ఓట్లను కేటాయించి.. మాక్‌పోలింగ్ నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్యేలతోపాటు కాలె యాదయ్య ఓటును సంతోష్‌కుమార్‌కు.. వరంగల్, ఖమ్మం, మెదక్ ఎమ్మెల్యేలను బండా ప్రకాశ్‌కు.. నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలను బడుగుల లింగయ్య యాదవ్‌కు కేటాయించారు. ఇక టీఆర్‌ఎస్‌ఎల్పీలోనూ రెండురోజులు మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. -
వైఎస్సార్సీపీ ఓట్లు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో వైఎస్సార్సీపీ ఓట్లు గల్లంతు అవుతున్నాయని ఆ పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వారు శుక్రవారం హైదరాబాద్‌లో ఎన్నికల అధికారి సిసోడియాను నేతలు కలిసి ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. తాను గుంటూరు జిల్లా, నరసరావుపేటలోని 150 నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటర్ గా ఉండేవాడినని, ప్రస్తుతం తన ఓటు 162 పోలింగ్ బూత్‌లోకి మారిందని గోపిరెడ్డి తెలిపారు. ఇలా నరసరావుపేటలో 21 వేలకు పైగా ఓటర్లను సర్వే పేరుతో ఇష్టారీతిన ఇతర బూత్‌లకు మార్చారని విమర్శించారు. సత్తెనపల్లిలో ప్రతి నాలుగు ఓట్లలో ఒక ఓటు తొలగించారని అంబటి రాంబాబు మండిపడ్డారు. -
గుంటూరు జిల్లాలో భారీగా ఓట్ల గల్లంతు
-
42,990 కొత్త ఓటర్లు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా 42,990 మం ది ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు. దీంతో గతేడాది 10,02,949గా ఉన్న జిల్లా ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 10,45,939కి చేరింది. ఇందు లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం. 4,99,682 మంది పురుష ఓటర్లు ఉండగా, 5,46,178 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 1,974 మంది ఎక్కువగా ఉన్నారు.ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో.. తాజా వివరాలను జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ అధికారులు బుధవారం విడుదల చేశారు. జిల్లాలో గతంలో 1379 ఉన్న పోలింగ్ స్టేషన్లలో 40 తగ్గించి 1339కి కుదించారు. కొత్తగా ఓటర్ల నమోదుతో పాటు ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కొత్తగా నమోదు, చేర్పులు, మార్పులు, అభ్యంతరాలను స్వీకరించి అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో జాబితాలు ప్రదర్శించారు. అక్కడి నుంచి వివరాలను తెప్పించుకున్న కలెక్టరేట్ అధికారులు తుది జాబితాను బుధవారం విడుదల చేశారు. అత్యధిక ఓటర్లు ‘రూరల్’లోనే.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనే అత్యధికంగా కొత్తగా ఓటర్లు నమోదయ్యారు. 38,704 మంది కొత్తగా తమ పేరు నమోదు చేసుకోగా, మొత్తం ఓటర్ల సంఖ్య 1,94,481కి చేరింది. అలాగే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,349 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. 1,95,974తో జిల్లాలోనే అత్యధిక ఓటర్లు గల నియోజకవ వర్గంగా ‘రూరల్’ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం 3,512 మంది కొత్త ఓటర్ల నమోదుతో 1,60,692కి చేరగా, బోధన్ నియోజకవర్గంలో 822 ఓటర్లు తగ్గి 1,66,428కి చేరింది. అలాగే బాన్సువాడ నియోజకవర్గంలో 438 మంది కొత్త ఓటర్లు పేరు నమోదు చేసుకోగా, ఓటర్ల సంఖ్య 1,50,006కు పెరిగింది. బాల్కొండ నియోజకవర్గంలో కొత్తగా 685 మంది పేర్లు నమోదు కాగా, ఓటర్ల 1,78,358కి చేరింది. -
స్థానిక సమరం.. ఖర్చు అధికం
సాక్షి, మచిలీపట్నం/చిలకలపూడి : స్థానిక సంస్థల సమరానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2018, జులై నెలాఖరుతో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్నాహాలు మొదలు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులకు ఉత్తర్వులు అందాయి. జనాభా ప్రతిపదికన వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారుచేసే అంశమై జిల్లావ్యాప్తంగా కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికకు ప్రధానమైన వ్యయం అంశంలో అధికారులు స్పష్టతకు వచ్చారు. వివిధ ఖర్చులకు గానూ రూ.17.72 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలకు రూ.4 కోట్లు మాత్రమే వెచ్చించారు. ప్రస్తుతం నిత్యావసరాలు, వివిధ సామగ్రి, ఇంధనం తదితర ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఎన్నికలకు ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో గత ఎన్నికల వ్యయానికి, ప్రస్తుత వ్యయానికి రూ.13.72 కోట్ల మేర వ్యత్యాసం ఏర్పడింది. గత ఎన్నికల ఖర్చు : రూ.4 కోట్లు ప్రస్తుత ఖర్చు : రూ.17.72 కోట్లు మొత్తం పంచాయతీలు : 970 పూర్తిస్థాయిలో పాలకవర్గంలేనిది : 1 ఉప సర్పంచ్ల ద్వారా నడుస్తున్నవి : 30 జిల్లావ్యాప్తంగా.. జిల్లాలో 49 మండలాలు, వాటి పరిధిలో 970 పంచాయతీలు ఉన్నాయి. అందులో 120 మేజర్ పంచాయతీలు. 2013లో అన్ని పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ప్రస్తుతం 49 పంచాయతీలను విజయవాడ కార్పొరేషన్లో విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ముసాయిదా మేరకు రిజర్వేషన్ల కల్పన ఆయా గ్రామాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా విభజన జరగనుంది. ఈనెల 1వ తేదీ నుంచే ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం తీవ్రంగా కృషిచేస్తోంది. తద్వారా ఓటర్ల ముసాయిదా జాబితా వెలువడితే.. ఓటర్ల జాబితాను పంచాయతీల వారిగా రూపొందించి, ఓటర్లను కులాలవారీగా విభజించనున్నారు. విభజించిన ఓటర్ల జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పంచాయతీల్లో కులాలవారీగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతారు. ఎన్నికలా.. ప్రత్యేక పాలనా? ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావన ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్లనుందా? లేక ప్రధాన ఎన్నికల అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా? అప్పటివరకు పాలనా సౌలభ్యం కోసం ప్రత్యేకాధికారుల పాలనతో కాలం వెల్లదీస్తారా? అన్న వాదనలు వినవస్తున్నాయి. పాలకవర్గాలు లేని వాటికీ ఎన్నికలు పంచాయతీ పాలక వర్గాలు లేని వాటికి సైతం ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1 పంచాయతీలో మాత్రమే పూర్తి స్థాయిలో పాలకవర్గం లేదు. మిగిలిన 30 పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లతో పాలన కొనసాగుతోంది. పాలకవర్గం లేని పంచాయతీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఓట్ల వివరాలు 2011 జనాభా లెక్కల ఆధారంగా, 29,25,100 మంది ఓంటర్లు ఉండగా, అందులో 14,68,763 మంది పురుషులు, 14,56,451 మంది మహిళలు ఉన్నారు. కానీ, ఈసారి ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 49 మండలాల పరిధిలో ఎస్టీ పురుషులు 51,331, మహిళలు 50,733 మంది ఉన్నారు. ఎస్సీ పురుషులు 3,50,376, మహిళలు 3,48,831 మంది. ఇతరులు 10,67,056 మంది పురుషులుండగా, 10,56,847 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల ఖర్చు రూ.17.72 కోట్లు ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు టీఏ, డీఏ, స్టేషనరీ కొనుగోలు, పోస్జేజీ, వాహనాలు, పబ్లికేషన్, ఎన్నికల బూత్‌ల వద్ద ఏర్పాట్లు, అధికారుల పర్యవేక్షణకు వినియోగించే వాహనాలకు ఇంధనం ఖర్చులకు రూ.17.72 కోట్లు అవసరమని పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వాటిలో ఖర్చు వివరాలు పరిశీలిస్తే.. సామగ్రి ఖర్చు ఓటర్ల జాబితా తయారీ రూ.90,21,290 ఎన్నికల సిబ్బందికి టీఏ, డీఏ రూ.4,57,83,600 స్టేషనరీ కొనుగోలు రూ.2,95,95,000 పోస్టేజీ, టెలిఫోన్ బిల్లులు రూ.2,00,000 వాహనాలు రూ.55,17,000 పబ్లికేషన్ రూ.3,22,00,000 పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాట్లు రూ.5,34,35,000 ఇంధనం (వాహనాలకు పెట్రోల్, డీజిల్) రూ.14,16,000 న్యాయవాదుల ఫీజులు రూ.1,00,000 -
కడపలో భారీగా ఓట్లు గల్లంతు!
కడప కార్పొరేషన్: కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా లక్షా పన్నెండు వేల ఓట్లు గల్లంతయ్యాయి. ఇందులో ముస్లిం మైనార్టీల ఓట్లు 35వేల వరకూ ఉన్నాయి. నగరంలో అస్తవ్యస్తంగా డోర్ నంబర్లు కేటాయించడం వల్లే ఓట్లు తీసేశారని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 2014 ఎన్నికల నాటికి కడప నియోజకవర్గంలో పురుషుల ఓట్లు 1,27,143, మహిళల ఓట్లు 1,28,050 కలిపి మొత్తం 2,53,193 ఓట్లు ఉండేవి. ప్రస్తుతం తొలగించిన ఓట్లతో ఆ సంఖ్య 1.41లక్షలకు పడిపోయింది. సాధారణంగా కొత్త డోర్ నంబర్లు వేయాలంటే కలెక్టర్ గెజిట్ తీసుకొని చేయాలి. కానీ ఎన్నికల కమిషన్ ఆదేశించిందని చెప్పి రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు ఆగమేఘాలపై రూ.45లక్షల వ్యయంతో ఒక ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థ నగరాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనే నాలుగు జోన్లుగా విభజించి ఈ డోర్ నంబర్లు కేటాయించింది. ఈక్రమంలో కొన్ని ఇళ్లకు నంబర్లు వేయకపోగా, రెండు, మూడు అంతస్తులు ఉన్న ఇంటికి గ్రౌండ్‌ఫ్లోర్‌కు మాత్రమే ఒకే డోర్ నంబర్ ఇచ్చారు. దీంతో పైరెండు అంతస్తుల్లో ఉన్నవారి ఓట్లు గల్లంతయ్యాయి. ఇలా వందల సంఖ్యలో ఇళ్లకు కొత్త డోర్ నంబర్లు కేటాయించలేదు. విచారణ చేపట్టకుండానే తొలగింపు నగరశివార్లలోని తులసీప్రాజెక్టు వెంచర్లో 100 కుటుంబాలు నివసిస్తుంటే ఒక్క ఇంటికి కూడా కొత్త డోర్ నంబర్లు వేయలేదు. కడప నగరంలో మొత్తం 84వేల నివాసగృహాలు ఉన్నాయి. అనధికారికంగా మరో ఐదువేలు ఉండే అవకాశం ఉంది. ఇంటికి ఇద్దరు ఓటర్లు అని లెక్కవేసుకున్నా 1.80లక్షల ఓట్లు ఉండాలి. కానీ ఎలాంటి విచారణ చేపట్టకుండానే గత తహసీల్దార్ ఈ ఓట్లను తొలగించినట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నర వరకూ ఎన్నికలు లేనందున ఎవరి ఓట్లు ఉన్నాయో, ఎవరి ఓట్లు గల్లంతయ్యాయో ప్రజలకు తెలియడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలేవీ లేవు కాబట్టి ప్రస్తుతం వారికి దానిపై అంత ఆసక్తి లేదు. కొత్తగా వేసిన డోర్ నంబర్లనే ఓటు కార్డుల్లో పొందుపరిచడం వల్ల కొత్త నంబర్లు వేయని ఇళ్లలో ఉన్నవారి ఓట్లన్నీ తొలగించినట్లే. చెల్లాచెదురైన ఓట్లు కొత్త డోర్ నంబర్ల వల్ల ఓట్లన్నీ చెల్లాచెదురయ్యాయి. గతంలో ఒక డివిజన్లోని ప్రజలు మూడు లేదా నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేవారు. ప్రస్తుత డోర్ నంబరింగ్ విధానం వల్ల ఆయా ఓట్లన్నీ 20 నుంచి 30 పోలింగ్ స్టేషన్లకు మారిపోయాయి. ఉదాహరణకు మాజీ కార్పొరేటర్ భాగ్యమ్మ చెమ్ముమియ్యాపేటలో నివసిస్తుండగా, ఆమె ఓటు అగాడి పోలింగ్ స్టేషన్లో ఉంది. అలాగే ప్రస్తుత కార్పొరేటర్ ఎస్ఏ షంషీర్ నకాస్లో నివసిస్తుండగా ఆయన ఓటు బెల్లంమండీ పోలింగ్స్టేషన్లో ఉంది. అంతేగాక 11మంది కార్పొరేటర్ల ఓట్లు మాయం అయ్యాయి. 47వ డివిజన్ కొత్త డోర్ నంబర్లతో ఓట్లన్నీ చెల్లాచెదరయ్యాయి. ఒక డివిజన్ ప్రజలు గతంలో కేవలం మూడు బూతుల్లో ఓట్లు వేసేవారు. మారిన విధానం ప్రకారం 26 బూతులకు ఆ ఓట్లను చెల్లాచెదరు చేశారు. అదే డివిజన్‌కు సంబంధించి 16వ నంబర్ పోలింగ్ బూత్ మరియాపురం జూనియర్ కాలేజీలో ఉండగా, దాన్ని 11గా మార్చి వికాస్ ఇంగ్లిషు మీడియం స్కూల్లో వేశారు. అంటే అక్కాయపల్లెలోని ప్రజలంతా చెమ్ముమియ్యాపేటకు పోయి ఓట్లు వేయాలన్నమాట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చెల్లాచెదరైన ఓట్లు, పోలింగ్బూతుల వల్ల 15శాతం ఓటింగ్ కూడా జరగడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెలలో మళ్లీ మొదలుపెడుతున్నాం: రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న ఇళ్లకు నంబర్లు కేటాయించకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. అది ఇప్పుడు జరిగింది కాదు. ఈ నెలలో డోర్‌నంబర్లు వేయని ఇళ్లకు నంబర్లు కేటాయిస్తాము. తద్వారా కొత్త ఓట్లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తాం. –ప్రేమంత్ కుమార్, కడప తహసీల్దార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మేయర్, ఎమ్మెల్యే కడప నగరంలో లక్షా ముప్పై ఐదు వేల ఓట్లు గల్లంతు కావడంపై మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా కలెక్టర్ బాబూరావునాయుడుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్లీ ఓటు నమోదు చేసుకోవచ్చంటున్న అధికారులు ఉన్న ఓట్లన్నీ తొలగించిన రెవెన్యూ అధికారులు కొత్తగా మళ్లీ ఎక్కించుకోవచ్చని తాపీగా చెబుతుండటంపై ప్రజాప్రతినిధులు, ప్రజలు మండిపడుతున్నారు. ఎలాంటి విచారణ లేకుండా లక్షకు పైగా ఓట్లు తొలగించి, ఇప్పుడు నమోదు చేసుకోమంటే ఎవరి ఓటు ఉందో, ఎవరి ఓటు లేదో నిరక్షరాస్యులకు ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. -
తప్పు చేశావు బాబూ!
►నంద్యాలలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాల్ రైటింగ్స్ ►హడావుడిగా తుడిచేసిన అధికారపార్టీ నేతలు ►ప్రజల్లో బాబుపై వ్యతిరేకతే కారణమంటున్న స్థానికులు నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై నియోజకవర్గ ప్రజల్లో ఏహ్యభావం వ్యక్తమవుతోందా? తనకు ఓటేయకుంటే.. తానిచ్చిన పింఛన్లు ఎలా తీసుకుంటారని, తానేసిన రోడ్లపై ఎలా నడుస్తారంటూ ప్రశ్నించడం పట్ల వారిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ‘తప్పు చేశావు బాబూ’ అంటూ నంద్యాల పట్టణంలో వాల్‌రైటింగ్స్ వెలియడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నంద్యాల పట్టణంలోని రైల్వే క్వార్టర్స్ సమీపాన ఈ వాల్ రైటింగ్స్ వెలిశాయి. మిగిలిన ప్రాంతాల్లో సైతం ఇవి బయటపడ్డాయి. దీంతో కంగారుపడిన అధికారపార్టీ నేతలు హడావుడిగా వాటిని తుడిచేసేందుకు ప్రయత్నించారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే భావనతో నియోజకవర్గంలో సగానికిపైగా కేబినెట్‌ను రంగంలోకి దించడం, ఎక్కడికక్కడ నేతల్ని లోబర్చుకునేందుకు యత్నించడంతోపాటు బెదిరింపులకు దిగడం తెలిసిందే. అంతేగాక కులం, మతం ప్రాతిపదికన తాయిలాలు ప్రకటిస్తూ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే సీఎం నంద్యాల నియోజకవర్గంలో రెండుసార్లు పర్యటించడం.. ఈ పర్యటనల్లోనూ రాత్రిపూట అక్కడే బస చేయడం విదితమే. అదే సమయంలో సమస్యలు విన్నవించిన ప్రజలపైన ఆయన శివాలెత్తడం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు నంద్యాల ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతను కలిగించినట్టు తెలుస్తోంది. దీన్ని ప్రతిబింబిస్తూ.. ‘తప్పు చేశావు బాబూ’ అంటూ ఈ వాల్ రైటింగ్స్ వెలిసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుపై నంద్యాల నియోజకవర్గ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ వాల్‌రైటింగ్స్ అద్దం పడుతున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏంటి సార్ ఇది..?
రేగోడ్(మెదక్): ఏంటీ సార్ ఇది.. నా ముందు ధర్నా చేయమనడం ఏమిటీ? నాకేమైనా మంజూరు చేసే అధికారం ఉందా.. నన్ను ఇబ్బందులు పెట్టడం సరికాదంటూ మండల పరిషత్తు సూపరింటిండెంట్ లక్ష్మీ ఎంపీడీఓ బస్వన్నప్పను ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మండల కేంద్రమైన రేగోడ్‌లో సోమవారం టీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మర్పల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కుమార్ గ్రామంలో అర్హులున్నా పెన్షన్లు మంజూరు చేయడం లేదని తెలిపిన సంగతీ విధితమే. అయితే ఎంపీడీఓ పెన్షన్లు మంజూరు చేయకపోగా సూపరింటిండెంట్ ముందు తమను ధర్నా చేయమన్నాడని పార్టీ సీనియర్ నాయకుల వద్ద తన గోడును వెల్లబోసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘ఓట్లు ఎలా అడుగుతారో చూస్తాం, అంటూ మంగళవారం సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన సూపరింటిండెంట్ ఎంపీడీఓకు కథనాన్ని చూపించి ఏంటీ సార్ ఇదీ.. నా ముందు ధర్నా చేయమనడం ఏమిటీ?.. నాకేమైనా మంజూరు చేసే అధికారం ఉందా..? నన్ను ఇబ్బంది పెట్టడం సరికాదంటూ ఎంపీడీఓతో తన ఆవేదన చెప్పుకున్నట్లు సమాచారం. ఏం చేయాలో తెలియక అలా చేయాల్సివచ్చిందన్నట్లు తెలిసింది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారి తోటి అధికారి ముందు అధికార పార్టీ నాయకులనే ధర్నా చేయమనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అధికారి వల్లే పార్టీ పరువు పోతుందని పలువురు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నా పాలకవర్గం మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం. ఇటు అధికార వర్గాలు.. అటు అధికార పార్టీ నాయకుల్లో ‘సాక్షి’ కథనం దూమారం లేపింది. సమావేశంలో ఇలా జరిగిందేమిటీ అని కొందరు అనుకుంటుంటే.. మరి జరగదా అంటూ మరికొందరు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బహింరంగంగానే అనుకుంటున్నట్లు సమాచారం. సబ్సిడీ ట్రాక్టర్లు, మిషన్ కాకతీయ పనులు, సీసీ రోడ్లు ఇలా అన్నీ లబ్ధి పొందిన వారే సమావేశానికి రాకపోతే తామేందుకు రావడం అని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. ఇటీవల రేగోడ్‌కు వచ్చిన ఎమ్యెల్యే బాబూమోహన్ గ్రూపులు కడితే ఎంతటి వారున్నా పార్టీ నుంచి సాగనంపుతానని హెచ్చరికలు చేసినా పరిస్థితిలో మార్పురాలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
భారీ బందోబస్తు
కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ను పురస్కరించుకొని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, అభ్యర్థుల అనుచరులు పెద్ద ఎత్తున కర్నూలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథంయలో ఓట్ల లెక్కింపు జరిగే కర్నూలు ప్రభుత్వ టౌన్‌మోడల్ హైస్కూలు వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఒక ప్లటూన్ కేంద్ర బలగాలతో పాటు ఒక ప్లటూన్ ఏపీఎస్పీ బలగాలు, ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 20 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, వందమంది కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు నియమించారు. అలాగే ఆరు పికెట్లు, మూడు చెక్‌పోస్టులు, ఐదు స్ట్రైకింగ్ ఫోర్సులు, నాలుగు ముబైల్ పార్టీలతో పాటు బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద సెక్షన్–144 సీఆర్పీసీ, 30 పోలీస్‌యాక్ట్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలో ప్రజలు గుంపులు గుంపులుగా చేరితే చెదర గొట్టేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను నియమించారు. ర్యాలీలపై నిషేధం గెలుపొందిన అభ్యర్థికి అనుకూలంగా మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం ఎన్నికల సందర్భంగా సర్వసాధారణం. అయితే ఈ సారి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీపై పోలీసు అధికారులు నిషేధం విధించారు. డప్పులు వాయించడం, పెద్ద శబ్దాలు చేయడం, బాణ సంచా పేల్చడం వంటి వాటిపై కూడా నిషేధం విధించినట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ వెల్లడించారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌తో పాటు, పదోతరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకొంది. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. పోలీసు ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. రాకపోకలపై ఆంక్షలు.. ప్రభుత్వ టౌన్ మోడల్ స్కూలు మీదుగా ఇతర ప్రాంతాల నుంచి పాత»బస్టాండు వైపు వెళ్లే వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఇతర పట్టణంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రధాన రహదారి గుండా పాతబస్టాండుకు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు. వాహన చోదకులు కూడా ఈ విషయాన్ని గమనించి పోలీసు శాఖతో సహకరించాలని ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి సుమారు 500 మీటర్ల వరకు నాయకుల వాహనాలు కానీ, నాయకుల అనుచరులు, పార్టీ కార్యకర్తలు కానీ రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. -
ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలి
–వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు కార్యాక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెంటరు ఏర్పాటు చేసి నిబంధనలు పాటించే విధంగా చూడాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్పోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, పెన్‌లను అనుమతించరాదన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు నుంచి కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ టౌన్ మోడల్ స్కూల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి మొదటి దఫా శిక్షణ ఇచ్చామని, రెండో దఫా శిక్షణ ఆదివారం ఇవ్వనున్నామన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ హరికిరణ్ మాట్లాడుతూ ఎన్నికల నియమావలిని అనుసరించి అర్హత ఓట్లను, అనర్హత ఓట్లను, నోటా ఓట్లను విభజించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, ఎన్నికల సెట్ సూపరింటెండెంటు ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు. -
టౌన్ మోడల్ కళాశాలలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
– వసతులను పరిశీలించిన జేసీ కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఓట్ల లెక్కింపును టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సోమవారం జాయిట్ కలెక్టర్ హరికిరణ్ తనిఖీ చేశారు. కౌంటింగ్ కార్యక్రమాన్ని చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను జేసీ సూచించారు. జేసీ వెంట కర్నూలు తహసీల్దారు రమేష్‌బాబు, ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి ఉన్నారు. -
20న ఓట్ల లెక్కింపు
కర్నూలు (అగ్రికల్చర్): శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఈనెల 20న జరగనుంది. కర్నూలు డివిజన్ బ్యాలెట్ బాక్సులను పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోనూ, నంద్యాల డివిజన్ బ్యాలెట్ బాక్సులను శాంతిరామ్ ఫార్మసీ కళాశాలలోనూ, ఆదోని డివిజన్ బ్యాలెట్ బాక్సులను సెయింట్ జోషఫ్ ఇంగ్లిషు మీడియా స్కూలులోనూ భద్ర పరిచి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీలు వేశారు. శుక్రవారం బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తుతో అనంతపురానికి తరలిస్తారు. ఈనెల 20న అనంతపురంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
పులిని పట్టుకుంటేనే ఓటేస్తాం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఓ ఆడ పులి పెద్ద ఎన్నికలకు సమస్యగా మారింది. గత నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలను బలితీసుకున్న ఈ పులిని పట్టుకుంటేనే ఈ నెల 15వ తేదీన ఈ ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తామని, లేదంటే బహిష్కరిస్తామని ప్రజలతోపాటు స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఎన్నికల పేరుతో నెల రోజుల క్రితమే తమ వద్దనున్న లైసెన్స్ ఆయుధాలను, ఆఖరికి దీపావళి టపాసులను కూడా పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లలో డిపాజిట్ చేసుకున్నారని ఫిలిబిత్ జిల్లాలోని ఓ అసెంబ్లీ సీటు నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ శైలేంద్ర గ్యాంగ్వర్ తెలిపారు. పులి భయం కారణంగా తాను అసెంబ్లీ నియోజక వర్గంలో ఇంతవరకు ఒక్క బహిరంగ సభను కూడా నిర్వహించలేక పోయానని ఆయన వాపోయారు. ఎక్కడి నుంచి వచ్చి పులి దాడి చేస్తుందోనన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారని చెప్పారు. చివరకు వీధి కుక్క మొరిగినా షెల్టర్ కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజలకు రాత్రిపూట వరండాలో పడుకునే అలవాటని, అలా పడుకున్నవారిని ఆడ పులి లాక్కుపోతుండడంతో ఇంట్లోనే పడుకోవాల్సి వస్తోందని ఆయన వివరించారు. మల్లాపూర్ గ్రామంలో మొదట ఓ బాలుడిని బలి తీసుకోవడంతో ఆ పులికి గ్రామస్థులు మల్లు అని పేరు పెట్టారు. ఇప్పుడు జిల్లా వాసులంతా ఆ పేరుతోనే ఆ పులిని పిలుస్తున్నారు. ఆ పులికి రెండేళ్లు ఉంటాయని అటవి శాఖ అధికారులు తెలియజేశారు. మొన్న మంగళవారం నాడు కూడా 52 ఏళ్ల నన్హేలాల్ అనే వ్యక్తిని సగం తిని పడేసింది. ఫిలిబిత్‌కు చెందిన రాష్ట్ర మంత్రి హేమరాజ్ వర్మ కూడా జోక్యం చేసుకోవడంతో మల్లును పట్టుకునేందుకు అటవిశాఖ అధికారులు రంగంలోకి దిగారు. మత్తు ఇంజెక్షన్ల ప్రయోగం కోసం లక్నో జూ నుంచి ముగ్గరు వెటర్నరీ డాక్టర్లను పిలిపించారు. లఖీంపూర్‌లోని డూడ్వా టైగర్ రిజర్వ్ నుంచి నాలుగు ఏనుగులను రప్పించారు. ఫిలిబిత్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో 40–50 పులులు ఉంటాయని అటవి శాఖ అధికారులు చెబుతుండగా, 60-70 ఉంటాయని ప్రజలు చెబుతున్నారు. ఫిబిత్తోపాటు లఖీంపూర్, ఖేరి, బహరాయిక్లతో కూడిన టెరాయ్ ప్రాంతంలో ప్రజలు అక్రమ సెటిల్మెంట్లు చేసుకోవడం వల్ల తరచుగా పులుల దాడులు జరుగుతున్నాయని అటవి శాఖ అధికారులు చెబుతున్నారు. -
పది పాక్ తలలు నరికి బదులివ్వాలన్నారుగా..
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్జికల్ దాడిని త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమర వీరులైన సైనికుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. హేమ్ రాజ్ కుటుంబంతో సహా సర్జికల్ దాడిని నిలదీస్తున్నాయి. ఓట్ల కోసం సర్జికల్ దాడుల వంటివి ఉపయోగించరాదని హేమ్ రాజ్ కుటుంబం పేర్కొంది. 2013 జనవరిలో పాక్ ఉగ్రవాదులు సైనికుడు అయినటువంటి హేమ్రాజ్ తలను నరికేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురా జిల్లాలో శేర్‌నగర్ హేమ్రాజ్ గ్రామం. అతడి తల్లి తాజాగా స్పందిస్తూ ‘సర్జికల్ దాడులు జరిగినట్లు ఎక్కడ ఆధారాలు? హేమ్ రాజ్ తల నరికిన చంపిన వ్యక్తిని చంపేశామని భారత సైన్యం చెప్పుకుంది. కానీ అది ప్రభుత్వం వర్షన్మాత్రమే. హేమ్ రాజ్కోసం ఇది అసలు బదులు తీర్చుకోవడమే కాదు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి భారతీయ సైనికుడికి ఒక్కో పాకిస్థానీ తలను ఇలా మొత్తం పది తలలతో బదులు తీర్చుకోవాలని సుష్మా స్వరాజ్ తెలిపారు. మధురలో శేర్‌నగర్ ప్రాంతానికి చెందిన సైనికుడు బబ్ల్యూ సింగ్ అనే వీర సైనికుడి భార్య కూడా ఘటుగా స్పందించారు. అసలు సర్జికల్ దాడులు ఎక్కడ జరిపిందని, ప్రభుత్వం మాత్రం వారంతా చనిపోయారని చెప్పిందని.. నిజంగా సర్జికల్ దాడులు జరిగాక కూడా వారు మళ్లీ ఎందుకు దాడులు చేస్తూనే ఉన్నారని ఆమె ప్రశ్నించింది. ఇలా చాలా మంది సర్జికల్ దాడులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
పార్టీలను చూసి ఓట్లేసే సంస్కృతి పోవాలి
బీసీల ఓట్లతో ఓసీలకు రాజ్యాధికారమా: ఆర్ కృష్ణయ్య జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పార్టీలను చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. తమ ఓట్లు తామే వేసుకున్నప్పుడే రాజ్యాదికారం సిద్ధిస్తుందని చెప్పారు. సోమవారం మహబూ బ్‌నగర్ లో నిర్వహించిన బీసీ గర్జనలో ఆయన మాట్లాడారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలSను అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. బీసీల నాయ కత్వం రావాలని పిలుపునిచ్చారు. ఓటు అనే వజ్రాయుధాన్ని సద్విని యోగం చేసుకో వాలని సూచించారు. ఒక్కశాతం ఉన్న ఓసీలు రాజ్యాధికారాన్ని అను భవిస్తున్నారని అన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం చాలని కోరారు. బీసీల కోసం రూ.10 వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. -
కులమతాలతో ఓట్లు కోరడం అవినీతే
• సుప్రీం కోర్టు కీలక తీర్పు • జాతి, వర్గం, భాష పేర్లతోనూ ఓట్లు కోరకూడదు • ఎన్నికల్లో మతానికి చోటు లేదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: రాజకీయాల నుంచి కులమతాలను వేరు చేసే దిశగా సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరిం చింది. ‘మతం, జాతి, కులం, వర్గం, భాషల పేర్లతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టం కింద అవినీతి చర్య కిందికే వస్తుంది’ అని విస్పష్టంగా పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ సహా ఏడుగురితో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు 4:3 మెజారిటీ తేడాతో తీర్పునిచ్చింది. హిందుత్వం జీవన విధానమన్న తన 21 ఏళ్ల నాటి వివాదాస్పద తీర్పును సవరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజాప్రాతినిధ్య (ఆర్పీ) చట్టం–1951లోని 123(3) సెక్షన్ ప్రకారం ‘అతని మతం’(హిజ్ రిలిజియన్) అంటే ఓటర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహా అందరి కులమతాలూ అని అర్థం‘ అని జస్టిస్ ఠాకూర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులు(మెజారిటీ జడ్జీలు) స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో లౌకికవాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని జస్టిస్ లోకూర్ రాసిన తీర్పులో సూచించారు. అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ప్రత్యర్థి, ఓటర్ల మతాల పేరుతో ఓట్లు కోరడం ఆర్పీ చట్ట ప్రకారం అవినీతి కిందికి వస్తుందని జస్టిస్ ఠాకూర్ చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కొనసాగించేందుకు 123(3)కి విస్తృత, ప్రయోజనకర భాష్యం కావాలన్నారు. లౌకికవాదం మన రాజ్యాగ మౌలిక నిర్మాణంలో భాగమని, మతమనేది వ్యక్తిగత విషయమని అన్నారు. ‘రాజ్య వ్యవహారాలను మతం తో కలపడానికి వీల్లేదు. లౌకిక రాజ్యం ఏ మతంతోనూ గుర్తింపు పొందకూడదు. లౌకిక ప్రక్రియ అయిన ఎన్నికల్లో మతానికి చోటు లేదు’ అని స్పష్టం చేశారు. దేవుడిని మనిషి అనుసరించే మార్గాలు వ్యక్తిగత ప్రాధాన్యాలని పేర్కొన్నారు. మనలాంటి పెద్ద ప్రజాస్వామ్యంలో ఈ సెక్షన్‌ను అభ్యర్థికి మేలు చేకూరేలా వ్యాఖ్యానించడం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారుతుందని జస్టిస్ లోకూర్ అన్నారు. మైనారిటీ జడ్జీలు ఏమన్నారంటే.. మెజారిటీ జడ్జీలతో విభేదించిన జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు.. సెక్షన్ 123(3) ప్రకారం.. ‘అతని మతం’ అంటే అభ్యర్థి మతమేనన్నారు. ఆర్పీ చట్టానికి ఎన్నో సవరణలు చేసినా ఈసెక్షన్ మాత్రం మారలేదన్నారు. కులమతాల కారణంగా అన్యాయానికి గురవుతున్న ప్రజల న్యాయబద్ధమైన ఆందోళన గురించి మాట్లాడకుండా, చర్చించకుండా అడ్డుకుంటే ప్రజాస్వామ్యం అస్పష్టంగా మారుతుందన్నారు. ‘ఏ తరహా ప్రభుత్వమూ సంపూర్ణమైనది కాదు. అయితే ఇందులోని లోపాలను న్యాయవ్యవస్థ.. చట్ట నిబంధనను తిరగరాయడం ద్వారా పరిష్కరించకూడదు’ అని మైనారిటీ తీర్పు రాసిన జస్టిస్ చంద్రచూడ్ అన్నారు . కులమతాల పేర్లతో ఓట్లు అడగడం అవినీతా, కాదా అన్న దానికి సంబంధించిన ఎన్నికల చట్ట నిబంధన విస్తృతిపై విచారణ జరిపిన కోర్టు గత అక్టోబర్ 27న తీర్పు వాయిదా వేయడం తెలిసిందే. గతంలో ఇచ్చిన తీర్పులో కోర్టు ‘అతని మతం’ అంటే అభ్యర్థి మతం మాత్రమే అని పేర్కొంది. మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉందని, అయితే ఎన్నికల కోసం మతాన్ని వాడుకోవచ్చా?అని ధర్మ సందేహం లేవనెత్తింది. 1990లోశాంతాక్రజ్ ఎమ్మెల్యేగా(బీజేపీ) తన ఎన్నికను బాంబే హైకోర్టు కొట్టేయడంతో అభిరాం సింగ్ సహా పలువురు వేసిన పిటిషన్లు కోర్టు విచారణలో ఉన్నాయి. ‘హిందుత్వ’ను ఉద్దేశించి చేసే విజ్ఞప్తి హిందువులను ఉద్దేశించి చేసినట్లు భావించకూడదని, హిందుత్వమనేది ఓ జీవన విధానమని 1995లో బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. 2002లో ఈ తీర్పును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని కోర్టు నిర్ణయించింది. ఆర్పీ చట్టంలోని 123(3) వివరణ అంశాన్ని తేల్చాలని 2014లో కోర్టు ఏడుగురు జడ్జీల బెంచ్‌కు నివేదించింది. -
ఓట్ల కోసం ముస్లింలను మోసగిస్తున్నాయి
కాంగ్రెస్, టీఆర్ఎస్లపై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఓట్ల కోసం ముస్లింలను మోస గిస్తున్నాయని, ఈ పార్టీల మాటలను నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అఫ్సర్ పాషా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు. ముస్లింల ట్రిపుల్ తలాఖ్, రిజర్వేషన్లపై తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని, ఏ మతానికి సంబంధించిన మహిళలకూ అన్యాయం జరగవద్దనేది తమ పార్టీ విధానమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు పాల్గొన్నారు. -
ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు (నెహ్రూనగర్): తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిళ్ళ మేరకే గుంటూరు కార్పొరేషన్లో ఓట్లు తొలగించారని, ఓట్ల తొలగింపులో పారదర్శకత లోపించిందని, ఏ ప్రతిపాదికన ఓట్లు తొలగించారో స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు నగర కమిషనర్ నాగలక్ష్మిని కోరారు. శుక్రవారం ఓట్ల తొలగింపుపై కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానూకూలంగా స్పందించిన కమిషనర్ ఓట్ల తొలగింపు విషయంలో పొరపాట్లు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్సీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఓట్లు తొలగించారంటూ ధ్వజమెత్తారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అన్నారు. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టిన తరుణంలో జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అక్షింతలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అధికార నేతలకు తలొగ్గి, వారి మెప్పుకోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ప్రజాస్వామ్యం కాదు.. అగ్రకులాల స్వామ్యం
నిజామాబాద్ నాగారం, వినాయక్‌నగర్ : దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలను ఓట్ల కోసం వాడుకొని ప్రజాస్వామ్యాన్ని అగ్రకులాల స్వామ్యంగా మారుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. సాంస్కృతిక విప్లవం రావాలని, బీసీలు రాజ్యాధికార స్థాపన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో శుక్రవారం బీసీ కుల సంఘాల జిల్లా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణయ్య ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. అర, ఒక్క శాతం ఉన్న అగ్రకులాల వారు బీసీలు వేసిన ఓట్లతో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా సుమారు 70 దశాబ్దాలు పాలించారని అన్నారు. బీసీల ఓట్లతో అధికారం చేపట్టి బీసీల అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. క్షేత్రస్థాయి నుంచి బీసీలంతా ఏకమై ఉద్యమాలకు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇ. శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌లు పాల్గొన్నారు. బడ్జెట్లో రూ. 150 కోట్లు కేటాయిస్తే బీసీలకు సరిపోతాయా.. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పర్చిన ప్రకారం రూ.18 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, 500 గురుకుల పాఠశాలలు నిర్మించాలన్నారు. -
56,634 మంది ఓటర్ల తొలగింపు
కర్నూలులో పూర్తికావచ్చిన ఇంటింటి సర్వే – కొత్తగా 34,057 ఓటర్ల నమోదు – నివాసం ఒకచోట.. ఓటు మరోచోట ఉన్న ఓటర్లు 33,189 మంది – ఆగస్టు మూడవ వారంలో ముసాయిదా జాబితా ప్రకటన కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరపాలక సంస్థలో ఓటర్ల జాబితాను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన డోర్ టు డోర్ సర్వే దాదాపు పూర్తయింది. ఆగస్టు నెల మూడవ వారంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్లో కర్నూలుతో పాటు పాణ్యం, కోడుమారు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లు ఉన్నారు. వీటిల్లో ఇంటింటి సర్వే వల్ల భారీగా బోగస్ ఓటర్లు వెలుగు చూశారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 41,311 మంది, పాణ్యం నియోజకవర్గం(కల్లూరు)లో 10,368 మంది, కోడుమూరు నియోజకవర్గంలో(కర్నూలు రూరల్) 4955 మంది ఓటర్లను బోగస్‌గా గుర్తించారు. ఇందులో మరణించిన వారు, డూప్లికేట్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు ఉన్నారు. వీరందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కార్పోరేషన్లో 413 పోలింగ్ కేంద్రాలు ఉండగా 3,03, 303 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇంటింటి సర్వేలో 3,12,803 మంది ఓటర్లను సర్వే చేశారు. కర్నూలు నియోజక వర్గంలో 8,088, కర్నూలు రూరల్ మండలంలో 1,116, కల్లూరు అర్బన్ వార్డుల్లో అత్యధికంగా 24,853 మంది కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇకపోతే 33,189 మంది నియోజకవర్గంలోనే ఓటర్లుగా ఉన్నా.. ఓటర్ల జాబితాలోని అడ్రస్‌ల్లో లేరు. వీరిని ఆయా పోలింగ్ కేంద్రాల్లోకి మార్పు చేయనున్నారు. కర్నూలు నగరపాలక సంస్థలో అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే చేపట్టారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాకు ప్రాధాన్యత ఏర్పడింది. -
విడిపోవడానికే బ్రిటన్ వాసి పట్టం
లండన్: బ్రిగ్జిట్ ఫలితాలలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. బ్రిటన్ వాసులు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడానికే మొగ్గుచూపారు. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్‌లో రెండు శాతం ఓట్లు స్వల్ప తేడాతో 'బ్రెగ్జిట్' వాదన గెలుపొందింది. దీంతో రెండో ప్రపంచ యుద్దం అనంతర కాలం నుంచి యూరప్ ఐక్యతలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఐరోపా సమాఖ్య(ఈయూ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మొత్తానికి 52 శాతం ఓటర్లు విడిపోవాలని, 48 శాతం ఓటర్లు కలిసుండాలని తీర్పుఇచ్చారు. బ్రెగ్జిట్ ఫలితాలతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. పౌండ్ విలువ భారీగా నష్టపోయింది. భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 900 పాయింట్ల వరకూ కోల్పోయింది. రూపాయి విలువ పతనమైంది. ఈ ఫలితాలతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ రాజీనామా చేయాలని ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
‘బ్రెగ్జిట్’ ఫలితాలపై ఉత్కంఠ
రెఫరెండంపై కొద్ది గంటల్లో చారిత్రక తీర్పు * ప్రతికూల వాతావరణంలోనూ భారీ పోలింగ్ * పోలింగ్ బ్రెగ్జిట్ వ్యతిరేక వాదనకే అనుకూలమనే ప్రచారం * యూకేలో వెయ్యికోట్ల బెట్టింగ్ లండన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న చారిత్రక ‘బ్రెగ్జిట్’ (బ్రిటన్ ఎగ్జిట్-ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం) రెఫరెండంపై మరికొద్ది గంటల్లో ఫలితం రానుంది. ‘యురోపియన్ యూనియన్ (ఈయూ)లో బ్రిటన్ ఉండాలా? వద్దా?’ అనే ప్రశ్నకు సమాధానం మరికొద్ది సేపట్లో రానుంది. ఇరు వర్గాల మధ్య వాదనలు, ఓ ఎంపీ హత్య, నువ్వా నేనా అన్నట్లు ప్రచారం తర్వాత 28 దేశాల ఈయూ కూటమిలో బ్రిటన్ అస్థిత్వాన్ని నిర్ణయించేందుకు జరిగిన రెఫరెండంలో భారీసంఖ్యలో బ్రిటన్లు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఇందులో 12 లక్షలమంది భారతీయ బ్రిటన్లు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. భారీగా పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భార్య సమంతతో కలసి ఓటేశారు. ఈయూలో ఉంటేనే దేశానికి మేలు జరుగుతుందని కామెరాన్ మొదట్నుంచీ ప్రచారం చేస్తున్నారు. యూకే ప్రజలు ఈయూనుంచి విడిపోవాలని.. యూకేకు అసలైన స్వాతంత్య్రం తీసుకురావాలని ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహిస్తున్న లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ ప్రచారం చేశారు. కలిసుండేందుకే స్వల్ప మొగ్గు? ఎన్నిక సరళి ఆధారంగా రెఫరెండంపై ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించకూడదని యూకే ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రచారం నువ్వా-నేనా అన్నట్లుండటం వల్ల.. ఫలితాలు కూడా అలాగే ఉండొచ్చనే అంచనా. అయితే.. ఎన్నికల ప్రచారం, ప్రజల స్పందన ఆధారంగా ‘ద డైలీ టెలిగ్రాఫ్’, ‘టైమ్స్’ మీడియా సంస్థలు జరిపిన సర్వేల ప్రకారం 51 శాతం బ్రిటన్లు ఈయూతో కలిసుండాలని, 49 శాతం వద్దని అభిప్రాయపడ్డారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఓటింగ్ శాతం తగ్గితే.. విడిపోవాలనుకున్న డిమాండ్ గెలుస్తుందన్న ప్రచారంతో.. అనుకూల వర్గం భారీగా పోలింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయానికల్లా (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల్లోపు) రెఫరెండం ఫలితాలు వెల్లడవుతాయి. యూకే బూకీలు మాత్రం బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా బెట్టింగ్ పెట్టినట్లు తెలిసింది. 100 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. వెయ్యికోట్లు)పైనే బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. ఓటింగ్‌లో పెన్సిల్ వివాదం రెఫరెండంలో ఓటింగ్ వెళ్లే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఉన్న వర్గాలు.. తమ పెన్నును తీసుకెళ్లాలని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎవరు ఓటేసినా ఈయూలో ఉండాలనేందుకు మొగ్గుచూపుతున్నట్లుగా ఓటు పడేలా కుట్ర జరుగుతోందంటూ కొందరు పోస్టులు చేశారు. ఓటింగ్ కేంద్రాల బయట పెన్సిల్స్ ఇస్తున్నారని.. దీనితో ఓటు వేస్తే.. కౌంటింగ్ సమయంలో చెరిపేసి బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పెన్నుతో మళ్లీ మార్కు చేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై స్పందించిన యూకే ఎన్నికల కమిషన్.. ఓటర్లు తమవెంట పెన్నులు తెచ్చుకోవాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియతోపాటు కౌంటింగ్ పక్కాగా జరిగేలా పారదర్శకమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. -
బ్రెగ్జిట్ పై ఓటింగ్ షరూ..
లండన్ : బ్రిటన్‌లో చరిత్రాత్మక రెఫరెండమ్‌కు సంబంధించిన ఓటింగ్ ప్రారంభమైంది. ప్రపంచ దేశాలు, ఆర్థిక నిపుణులు, స్టాక్ మార్కెట్లు ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ మొదలైంది. యురోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా లేదా అనేది ఈ రెఫరెండం ద్వారా తేలిపోనుంది. సుమారు 4 కోట్ల 64 లక్షల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని అంచనా. బ్రిటన్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఓటింగ్ జరగనుండగా ...రేపు (శుక్రవారం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని కోరుతున్న 1,280 మంది పారిశ్రామికవేత్తలు ఒక హెచ్చరిక లేఖపై సంతకం చేస్తూ, బ్రెగ్జిట్ వల్ల ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని, ఉపాధి ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఈయూలో కొనసాగాలని భావిస్తుండగా, చిన్న సంస్థలు మాత్రం చీలిపోయాయి. ఈయూలో బ్రిటన్ కొనసాగడం వల్ల వాణిజ్యం మరింత పెరుగుతుందని, తద్వారా మరిన్ని ఉద్యోగాలు వస్తాయని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రచారంలో చివరి రోజు ప్రధాని కామెరూన్ మాట్లాడుతూ, ఈయూలో బ్రిటన్ ప్రత్యేక హోదాను అనుభవిస్తున్నదని అన్నారు. ఐరోపా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నదని, ఇది ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద మార్కెట్ అనిపేర్కొన్నారు. కాగా బ్రిటన్ చరిత్రలో ఇది మూడో రెఫరెండమ్. యునైటెడ్ కింగ్డమ్ యురోపియన్ యూనియన్‌లో కొనసాగాలా వద్దా అని అంశంపై ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా తెలియజేయనున్నారు. . ఎస్, నోలలో దేనికి 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తే యూకే దానికి కట్టుబడి ఉంటుంది. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో తమ దేశం సర్వం సిద్ధంగా ఉందని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
మద్య నిషేధానికి ఓట్లు రాలుతాయా?
న్యూఢిల్లీ: మద్యాన్ని నిషేధిస్తే ఓట్లు రాలుతాయా? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చర్చోపచర్చలకు తెరలేపిన హాట్ టాపిక్ ఇదే! ఇప్పటికే లిక్కర్ బార్లను నిషేధించి బీరు, వైన్ లాంటి డ్రింకులను అనుమతించిన కేరళలోని యూడీఎఫ్ ప్రభుత్వం మద్యం నిషేధం మహిళల ప్రశంలను అందుకుంటుందని, ఓట్లను రాలుస్తుందని భావిస్తోంది. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ మాత్రం ఈ వాదనతో విభేదిస్తోంది. సంపూర్ణ మద్య నిషేధం ఎప్పటికీ విజయవంతం కాలేదని, మద్యాన్ని నిషేధించడంకన్నా మద్యాన్ని మాన్పించేలా ప్రజల్లో చైతన్యం తీసుకరావడమే ఉత్తమ మార్గమని ఎల్డీఎఫ్ భావిస్తోంది. మహిళల మాటలను మన్నించి మద్యాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చినందునే బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి మహిళలు మళ్లీ పట్టంగట్టారని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ, ఆయన కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకనే ఆయన క్రమంగా పదేళ్లలో సంపూర్ణ నిషేధాన్ని అమలు చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే రీతిన తమిళనాడులో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. పాలక, ప్రతిపక్షాలు పరస్పర భిన్నంగా మాట్లాడుతున్నాయి. ఒకప్పుడు ఓట్లు వేయించుకునేందుకు మద్యాన్ని పారించిన రాజకీయ పెద్దలే ఇప్పుడు అవే ఓట్ల కోసం నిషేధం బాట పట్టడం విశేషం. రాజకీయ నేతల అభిప్రాయలను పక్కన పెడితే అసలు ఓటర్లు ఏమనుకుంటున్నారు? మద్యం నిషేధానికి ఓటేస్తారా? వివిధ సంఘాల ద్వారా ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు, సామాజిక విశ్లేషకులు ఈ ప్రాతిపదికన ఓట్లు వేయరని చెబుతున్నారు. అయితే మద్యం నిషేధం మంచిదా, కాదా ? అన్న విషయంలో మాత్రం వారి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కేరళలో మాత్రం మద్య నిషేధం ప్రభావం ఉండదని, రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్యలేమిటో వారికి తెలుసునని రాజకీయ విశ్లేషకులు ఎన్ఎం పియర్సన్ అన్నారు. ఎన్నికల షేడ్యూల్ వెలువడక ముందే వారు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకొని ఉంటారని ఆయన చెప్పారు. మద్యనిషేధానికి ఓట్లు పడడం, పడకపోవడం అనేది ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని సైరో-మలబార్ చర్చి అధికార ప్రతినిధి ఫాదర్ తెలక్కత్ అన్నారు. మద్యంపై సంపూర్ణ నిషేధం విధించడమా, ప్రజలచేత తాగుడు మాన్పించడమా ? అన్న ప్రశ్న ముఖ్యం కాదని, ఏ విధాన్నైనా అమలు చేయడం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంతన్నదే ప్రశ్న అని ఆయన వ్యాఖ్యానించారు. కారణం ఏదైనా మద్యంపై ఏదోరకమైన నియంత్రణ ఉండడమే మంచిదని, ఎందుకంటే కేరళలో మద్యం అనేది సామాజిక సమస్యగా మారిందని ప్రముఖ సామాజిక కార్యకర్త అజిత అభిప్రాయపడ్డారు. మద్య నిషేధం దేశంలో ఎక్కడా విజయం సాధించలేదని, మద్య నిషేధం అమల్లో ఉన్న మిజోరమ్, మణిపూర్, నాగాలాండ్ ప్రభుత్వాలు క్రమంగా నిషేధాన్ని ఎత్తివేస్తున్నాయని, గుజరాత్లో కూడా నిషేధం సక్రమంగా అమలవడం లేదని, అక్కడ లిక్కర్ మాఫియా రంగప్రవేశం చేసిందని మద్యాన్ని స్వచ్ఛందంగా మానేయాలని వాదించే వర్గాలు చెబుతున్నాయి. అసలు ఎన్నికల హామీలనే రాజకీయ నాయకులు సీరియస్‌గా తీసుకోరని, ఎన్నికలు కాగానే వాటిని మరచిపోతారని, వారి హామీలపై ఒత్తిడి తేవాల్సింది మళ్లీ ప్రజలేనని పర్యావరణవేత్త ఎంకే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. మద్యంతాగి భార్యలను వేధిస్తున్నారనడం ఈ రోజుల్లో సరైనది కాదని, మద్యంతాగి వేధించే వారిని ఎలా హ్యాండిల్ చేయాలో నేటి మహిళలకు పూర్తి అవగాహన ఉందని రచయిత్రి భట్టాతిరి అభిప్రాయపడ్డారు. గృహ హింసకు పాల్పడితే పోలీసులను ఆశ్రయించే ధైర్యం నేటి మహిళకు ఉందని ఆమె చెప్పారు. -
మోగెరా నగారా!
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన విడుదల ఫిబ్రవరి 2న పోలింగ్ సమర భేరి మోగింది. మహా సమరానికి తెర లేచింది. ఎత్తులు...పై ఎత్తుల కసరత్తు మొదలైంది. కొత్త పొత్తులు... విమర్శల కత్తులు సిద్ధమవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమరాంగణ ప్రాంగణంలో తల పడేందుకు అధికార... ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ‘మహా’బలుడెవరో తేల్చుకోవాలని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార పగ్గాలను అందించే బ్రహ్మాస్త్రాల కోసం అన్వేషిస్తున్నాయి. కులమో... గుణమో... ధనమో...ఏదో ఒక ఆకర్షణ మంత్రం... అధికారమే లక్ష్యం. ఈసారి అతివలూ అధికార పీఠం కోసం బరిలో దిగుతున్నారు. పాలనా పగ్గాలు ఎవరు చేపట్టాలనే అంశంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. పోలింగ్ కేంద్రాలు : 7,757 పోలింగ్ లొకేషన్లు: 3,117 500 కంటే తక్కువ ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు: 165 500-1000 మధ్య ఓట్లున్నవి: 4,752 1000-1250 ఓట్లు ఉన్నవి: 2,318 1250 కంటే ఎక్కువ ఉన్నవి: 522 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 1987 అత్యంత సమస్యాత్మకమైనవి: 867 పోలింగ్ సిబ్బంది : 46, 545 మంది ప్రిసైడింగ్ అధికారులు : 7,757 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు: 7,757 ఇతర పోలింగ్ అధికారులు: 23,271 (ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు) రిజర్వులోని పోలింగ్ సిబ్బంది: 7,760 150 వార్డులకు సంబంధించిన రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ హాళ్ల సంఖ్య : 24 -
ఓట్లు మావే.. సీట్లూ మావే
* ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతాం: ఎంపీటీసీల ఫోరం * మొత్తం 12 సీట్లలో ఎంపీటీసీ అభ్యర్థులను నిలుపుతాం * ఎంపీటీసీలకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా ఓడిస్తాం * జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లతో జేఏసీగా ఏర్పడతామని ప్రకటన సాక్షి, హైదరాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉవ్విళ్లూరుతోంది. ప్రభుత్వం గత 17 నెలలుగా ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు, విధులు అప్పగించకపోవడంపై ఉన్న వ్యతిరేకతను చూపేందుకు సన్నద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 12 సీట్లకు ఫోరం తరపున ఎంపీటీసీలనే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలపాలని నిర్ణయించింది. ఏవైనా రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ టికెట్లను ఎంపీటీసీలకు కేటాయించిన పక్షంలో, ఆ అభ్యర్థులకు మాత్రం మద్దతు ఇవ్వాలని ఫోరం రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం ఓట్లున్న ఎంపీటీసీలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చి బరిలో నిలిపితే ఓడించి తీరతామని స్పష్టం చేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఫోరం రాష్ట్ర ప్రతినిధులు, వివిధ జిల్లాల అధ్యక్షులు ఈ మేరకు ప్రతినబూనారు. ఈ దఫా ఎన్నికల్లో ఓట్లు, సీట్లు తమవేనని నినదించారు. గత ఏడాదిన్నర కాలంగా ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని, ఈ నేపథ్యంలో ఎంపీటీసీలనే ఎమ్మెల్సీలుగా చట్టసభలకు పంపాల్సిన అవసరం ఏర్పడిందని వారు అంటున్నారు. ఎంపీటీసీల సమస్యలివే.. గ్రామ సర్పంచులతో సమానమైన అధికారాలు కల్పిస్తామంటూ గత ఆగస్టులో కరీంనగర్లో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా... అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటిదాకా వెలువడలేదని ఎంపీటీసీల ఫోరం ఆరోపిస్తోంది. ఎంపీటీసీల ద్వారా ఖర్చు చేయాల్సిన బీఆర్జీఎఫ్ నిధులను ఈ ఏడాది కేంద్రం నిలిపివేసిందని, 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకే ఇస్తుండడంతో తమ పరిస్థితి ఉత్సవ విగ్రహాల మాదిరి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకంలోనైనా తమకు సముచిత స్థానం కల్పించడం లేదని అంటున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు టీచర్లను, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గ్రాడ్యుయేట్లను అభ్యర్థులుగా నిలుపుతున్నపుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలకు ఎందుకు అవకాశమివ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. 80 శాతం ఓట్లు మావే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓట్లలో 80 శాతం ఓట్లు ఎంపీటీసీలవేనని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ చెప్పారు. ఏడాదిన్నర కాలంగా ఎంపీటీసీలకు ఎలాంటి అధికారాలు, నిధులు, విధులనూ ప్రభుత్వం అప్పగించలేదన్నారు. ఎంపీటీసీల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడమే సరైన మార్గంగా భావిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగా ఎంపీటీసీలకు టికెట్లిస్తే ఫోరం తరపున మద్దతు ఇస్తామని వెల్లడించారు. తమలాగే ఎలాంటి అధికారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సెలర్లను కూడా కలుపుకొని స్థానిక ప్రజాప్రతినిధుల జేఏసీగా ఏర్పడాలని యోచన చేస్తున్నామన్నారు. నెలాఖరులోగా రాష్ట్ర స్థాయిలో భారీ సమావేశం నిర్వహించి తమ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకయ్య, ఉపాధ్యక్షుడు పెండ్యాల గోవర్ధన్, కార్య నిర్వాహక కార్యదర్శి మనోహర్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
కోట్లు చూసి ఓట్లు వేయరు
ఓటర్లకు నిజమేంటో తెలుసు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హన్మకొండ : ప్రజా చైతన్యానికి ఓరుగల్లు పురిటిగడ్డ అని.. ఇక్కడి ప్రజలు కోట్లను చూసి ఓట్లు వేయరని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని హయగీవ్రచారి మైదానం లో బుధవారం టీఆర్ఎస్ ఎన్నికల బహిరంగ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి హరీ ష్‌రావు హాజరై మాట్లాడారు. వరంగల్ జిల్లా ప్రజలు ఆత్మగౌరవం కలిగినవారని.. ఈ ప్రాం త ఓటర్లకు నిజమేంటో తెలుసని చెప్పారు. బీజేపీ కోట్లను చూసి, పార్టీ సభ్యుడు కాని వారి కి టికెట్ ఇచ్చిందని విమర్శించారు. ఉప ఎన్నిక లో విపక్షాల నోళ్లు మూయించే విధంగా ఫలి తాలుండాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న టీఆర్ఎస్ అభ్యర్థి పసునూ రి దయాకర్‌ను గెలిపించాలన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఎస్సారెస్పీ కాలువ నిర్వీర్యమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని కోణాల్లో ఆలోచించి, జిల్లా నేతల అభిప్రాయాలు సేకరించి పసునూరి దయాకర్‌కు టికెట్ ఇచ్చారన్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాం గ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించి మిద్దెలు కట్టుకోవడంపై నే దృష్టిపెడతారని ఆరోపించారు. అధికారం లో ఉన్న సమయంలో వారికి పేదల కష్టాలు పట్టవన్నారు. వ్యవసాయశాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియ జేయాలన్నారు. గతంలో వచ్చిన మెజారిటీకి వడ్డీ కలిపి అదనపు మెజారిటీ సాధించాలన్నా రు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు 60 ఏళ్లలో చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ 16 నెలల్లో చేసి చూపించారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ మాట్లాడుతూ పార్టీ కోసం బాధ్యతగా పనిచేసినందుకు గుర్తింపు దక్కిందన్నారు. ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించా లని కోరారు. సభలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు తక్కళ్లపల్లి రవీందర్రావు, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, జెడ్పీ చైర్పర్సన్ పద్మ, ఎంపీలు బో యినిపల్లి వినోద్‌కుమార్, అజ్మీరా సీతారాంనాయక్, గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు బోడకుంట్ల వెంకటేశ్వ ర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, కొండా సురేఖ, రెడ్యానాయక్, అరూరి రమేష్, శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల భిక్షపతి, నాయకుల కన్నెబోయిన రాజయ్య యాదవ్, గుడిమల్ల రవికుమార్, సత్యవతి రాథోడ్, ఎన్.సుధాకర్‌రావు, ముద్దసాని సహోదర్‌రెడ్డి, మార్నేని రవీందర్రావు, యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, రమేష్, వెంకటేశ్వర్లు, భరత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీ రద్దు... కలెక్టరేట్ సమీపంలోని రెవెన్యూ కాలనీలో మాజీ ఎంపీ రాజయ్య నివాసంలో చోటుచేసుకున్న దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు టీఆర్ఎస్ నామినేషన్ ర్యాలీని రద్దు చేశారు. కాగా, సభ అనంతరం ర్యాలీగా వెళ్లి అభ్యర్థి పసునూ రి దయాకర్ నామినేషన్ వేయాలని ముందు గా నిర్ణయించారు. అయితే కలెక్టరేట్ సమీపం లో మృతిచెంది విషాదఛాయలు అలుముకున్న నేపథ్యంలో డప్పు చప్పుళ్లతో వెళ్లడం బాగుండదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పా రు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పసునూరి దయాకర్ కలెక్టరేట్‌కు వెళ్లి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. -
అప్పట్లోనే ఓటుకు నోటు
ఇటీవలి రాజకీయాల్లో ఓటుకు నోటు వ్యవహారాలు షరా మామూలే అయినా, నోట్లు వెదజల్లి ఓట్లు కొనుగోలు చేయడం రెండు శతాబ్దాల కిందటే ఉండేది. జాన్ మేటన్ అనే బ్రిటిష్ పెద్దమనిషి ఈ పద్ధతికి ఆద్యుడు. ఘనమైన రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబంలో జన్మించిన మేటన్ దొరగారికి లెక్కలేనంత తిక్క ఉండేది. ఈయనగారి తలతిక్క కారణంగానే జనాలు ఈయనను ‘మ్యాడ్ జాక్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. పెద్దల ప్రోద్బలంతో, కుటుంబ రాజకీయ వారసత్వ పరంపర కొనసాగించే సదుద్దేశంతో మేటన్ దొరగారు 1819లో నార్త్ ష్రాప్షైర్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో టోరీ పార్టీ తరఫున పోటీ చేశారు. ప్రచార సభల్లో ప్రసంగాలు, ప్రజలకు వాగ్దానాలు చేయడం వంటి చిల్లర వ్యవహారాలన్నీ నచ్చని మేటన్ దొరగారు ఓటర్లందరికీ పది పౌండ్ల నోట్లు ధారాళంగా పంచిపెట్టాడు. నోట్లు పుచ్చుకున్న ఓటర్లందరూ కృతజ్ఞతతో ఆయనగారికి ఓట్లు గుద్దేశారు. ఆ విధంగా ఆయనగారు బ్రిటిష్ పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లోకి అడుగుపెట్టారు. ‘అనుభవించు రాజా...’ అనే రీతిలో మందు విందు చిందుల్లో ఓలలాడే మేటన్ దొరగారికి పార్లమెంటు బొత్తిగా నచ్చలేదు. సభలో ఆయన గడిపింది కేవలం అరగంట మాత్రమే. ఆ తర్వాత ఎన్నడూ ఆయన సభలో అడుగుపెట్టిన పాపాన పోలేదు. అయితే, ఆయన మొదలుపెట్టిన ‘ఓటుకు నోటు’ పద్ధతిని మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులు అందిపుచ్చుకున్నారు. ఈ పద్ధతిని చట్టాలు ఒప్పుకోకున్నా, ఇప్పటికీ దీనిని ఎవరి శైలిలో వాళ్లు కొనసాగిస్తూ ఆ విధంగా ముందుకు పోతున్నారు. - పన్యాల జగన్నాథ దాసు -
ఓట్లను తొలగిస్తున్నామనేది అవాస్తవం
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్లను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ అన్నారు. ఎవరికైనా సందేహాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని ఆయన మంగళవారమిక్కడ సూచించారు. ఒకవేళ ఓట్లు తొలగించినట్లు ఎవరి వద్ద అయినా ఆధారాలు ఉంటే చూపించాలని భన్వర్ లాల్ కోరారు. ఇప్పటివరకు 5,14,796 మంది తమ ఓట్లను బదిలీ చేయించుకున్నారని, 89,085 మంది డూప్లికేటు ఓటర్లు ఉన్నారని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లను మాత్రమే హైదరాబాద్ ఓటర్ల నుంచి తొలగించామని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తామని, అక్రమంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని భన్వర్ లాల్ స్పష్టం చేశారు. -
ఆ కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది..
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఓటును కూడా అకారణంగా తొలగించరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గంలో భారీగా ఓట్లు తొలగించారనేది అవాస్తవమని, 2014 కంటే సనత్ నగర్ లో ఇప్పుడు 7వేల ఓట్లు పెరిగాయన్నారు. ఓట్లు తొలగించారంటూ నిరాధారంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయటం తగదన్నారు. ఓట్లు తొలగించినట్లు తమకు ఇప్పటివరకూ ఎవరి నుంచి ఫిర్యాదులు రాలేదని తలసాని తెలిపారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బుద్ధిలేని మాటలు చెబుతున్నారని, చౌకబారు రాజకీయాలతో అనవసర ప్రకటనలు చేస్తున్నారని తలసాని మండిపడ్డారు. ప్రారంభోత్సవాల్లో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదన్నారు. రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. ధర్నాల పేరుతో కాంగ్రెస్, తెలంగాణ టీడీపీల కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని తలసాని వ్యాఖ్యానించారు. -
పవన్ వల్ల టీడీపీకి ఓట్లు పెరగలేదు: కేశవ్
పవన్ కాళ్లు, మోదీ గడ్డం పట్టుకొనే అధికారంలోకి వచ్చారు: రామచంద్రయ్య సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లగానీ, మరేఇతర పార్టీల వల్ల తెలుగుదేశం పార్టీకి ఓట్ల శాతం పెరగలేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం శాసనమండలిలో కరువుపై చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భయంకరమైన కరువు ఛాయలు నెలకొన్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందనా లేదని ఆరోపించారు. దీన్ని అధికార పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన రామచంద్రయ్య సినీనటుడు పవన్ కల్యాణ్ కాళ్లు, నరేంద్రమోదీ గడ్డం పట్టుకొని అధికారంలోకి వచ్చిన మీకు (టీడీపీ) ప్రజల ఇబ్బందులు తెలుసుకొనే ఆసక్తి లేకపోవడం శోచనీయమన్నారు. అందుకు టీడీపీ సభ్యుడు కేశవ్ కలుగజేసుకొని పై వ్యాఖ్యలు చేశారు. -
ది ఫోర్త్ ఎస్టేట్: ఓట్లు, కోట్లు, చట్టాలు
-
ఓట్లేయనోళ్లకు పనులెట్లా చేయాలె..
కన్నాయిగూడెం ప్రజలతో మంత్రి చందూలాల్ ములుగు: మాకు ఓట్లు వేయనోళ్లకు మేము ఎట్లా పని చేసి పెట్టాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వరంగల్ జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెం ప్రజల ను ప్రశ్నించారు. కన్నాయిగూడెంలో మంగళవారం బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి మంత్రి వచ్చారు. నియోజకవర్గంలోని అన్నిరోడ్లు పూర్తయ్యాక ఈ పనులు ప్రారంభిస్తామని అన్నారు. పంచాయతీ, పీఏసీఎస్, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామస్తులు సహకరించలేదని గుర్తు చేశారు. తర్వాత తేరుకున్న మంత్రి గ్రామపెద్దలను పిలిపించుకొని తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. చివరికి ఆయన రోడ్డు పనులను ప్రారంభించారు. -
వైఎస్సార్ సీపీకి ఓటెయ్యడం నేరమా?
మార్కాపురం : ఆరు నెలల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమపై దాడి చేస్తున్నారని మార్కాపురం మండలం చింతగుంట్లకు చెందిన దళితులు పులుకూరి వెలుగొండయ్య, రూతమ్మ, మరియమ్మ, కొండమ్మ, తదితరులు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తికి తాము ఓట్లు వేయలేదన్న కోపంతో తమపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఇళ్లకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్కు స్వగ్రామానికి వెళ్తే 24వ తేదీ రాత్రి తమపై దాడికి ప్రయత్నించటంతో తప్పించుకుని మార్కాపురం పట్టణానికి వచ్చి బంధువుల ఇంట్లో తల దాచుకున్నామన్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన పొలాల్లో టీడీపీ నేతలు జేసీబీలతో గుంతలు తీయించారని, సాగు చేసుకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయటమే తాము చేసిన నేరమా.. అని దళితులు ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉండాలి :ఆర్డీఓను కోరిన ఎమ్మెల్యే జంకె చింతగుంట్ల దళితులకు అండగా ఉండాలని ఆర్డీఓను ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరారు. సోమవారం బాధితులతో ఆయన ఆర్డీఓను కలిశారు. వాటర్‌షెడ్ పథకం నెపంతో తమ పార్టీ కార్యకర్తల పొలాలను ప్రత్యర్థులు పొక్లెయిన్లతో త వ్విస్తున్నారని, పొలం గట్ల వెంబడి ఉన్న చిల్లకంపను వారే కొట్టుకుని అమ్ముకుంటున్నారని, ఈ సంఘటనపై విచారణ జరపాలని ఆర్డీఓను ఎమ్మెల్యే కోరారు. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష చూపొద్దన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తానని, సర్వేయర్‌ను పంపించి పొలం హద్దులు చూపిస్తానని, వాటర్‌షెడ్ అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యేకు ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు మార్కాపురం ఎంపీపీ ఎల్.మాలకొండయ్య ఉన్నారు. -
తెలుగోడి చైతన్యానికి వేదికగా ‘సాక్షి’
* వరుస కథనాలపై వాట్సప్,ఫేస్బుక్లో చర్చలు * తెలుగువారంతా ఏకమయ్యే సందర్భమిదేనంటూ పిలుపులు * ఓట్లు చీలకుండా తెలుగువారిని సంఘటితపర్చేందుకు పలు సంఘాల ప్రయత్నాలు ముంబై, న్యూస్‌లైన్: రాజకీయ దిగ్గజాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకునేందుకు తెలుగు ప్రజలు సంసిద్ధులయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నేతల గెలుపునకు కీలకశక్తిగా మారనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయపార్టీల ముఖ్య నేతలు తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు క్యూలు కడుతోన్న నేపథ్యంలో... ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతోన్న వరుస కథనాలు మరింత చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. కోల్పోయిన రాజకీయ అస్థిత్వాన్ని పునరుత్తేజం కలిగించేందుకు దోహదపడుతోన్నాయి. ప్రధానంగా ‘మరాఠి గడ్డపై తెలుగు బిడ్డ’ శీర్షికతో వచ్చిన కథనాలు అనేక మంది తెలుగు ప్రజలను కదిలించేలా చేశాయి. ఈనెల 12న ‘మసకబారిన తెలుగు’, 13న ‘తెలుగోడి దయకోసం..’ శీర్షికల పేరిట ప్రచురితమైన కథనాలపై తెలుగు నెటిజన్లు ఆసక్తి కనబరిచారు. సామాజిక వెబ్సైట్లలో తెలుగు ప్రజల రాజకీయవారసత్వంపై చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ఎన్నికలు, రాజకీయాలు, ఓటింగ్ ప్రభావం తదితర అంశాలపై ‘వాట్సప్’లతోపాటు ఇతర సోషల్మీడియాలలో కొనసాగుతోన్న చర్చల్లో ‘సాక్షి’ కథనాల ప్రాధాన్యత కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాడు చక్రం తిప్పిన సీనియర్లను గుర్తుచేస్తూ.. ఆనాటి తెలుగు ప్రజల రాజకీయ వైభవాన్ని మరలా సాధించుకోవాలనే స్ఫూర్తితో ఓటర్లు సిద్ధమవుతున్నారు. వీటన్నింటికీ తోడు రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లోని తెలుగు సంఘాలు ఐక్యవేదికగా దిశగా కసరత్తు చేయాలనే ఆలోచనలు సాగిస్తున్నాయి. ఇప్పట్నుంచి ప్రాంతాలవారీగా తెలుగువారందర్నీ సమీకరించి భవిష్యత్ ఎన్నికల రాజకీయ గుర్తింపునకు పునాదులు వేయాలని తలంచుతున్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం తెలుగువారి ఐక్యతపై సంఘాలతో చర్చించారు. ఓట్లు అడగడానికి వెళ్లినప్పుడు, ప్రముఖులతో మాట్లాడిన సందర్భాల్లో ఆయా నేతలు ‘సాక్షి’ కథనాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూర్, మరాఠ్వాడాలోని నాందేడ్, విదర్భలోని చంద్రాపూర్ల తోపాటు ముంబై, భివండీ నేతలు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసినందున.. నేతలు తెలుగువారి ప్రాంతాల్లో పెద్దలను కలిసి అంతర్గత చర్చల్లో నిమగ్నమయ్యారు. బీజేపీ తరఫున కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు తెలుగు సినీ నటుడు కృష్ణంరాజు ప్రాంతాలవారీగా పర్యటిస్తున్నారు. మరోవైపు సినీనటుడు ప్రకాష్‌రాజ్ సైతం తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు హామీలతోపాటు తాత్కాలిక ప్రయోజనాలకు సైతం తెరదీశారు. ప్రాధాన్యమిచ్చే నేతకే ఓటు.. ఎన్నికల నేపథ్యంలో నేతల భవితవ్యంపై తెలుగువారి తీర్పు ఏవిధంగా ఉండబోతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈనెల 15న జరగనున్న ఎన్నికల్లో మెజార్టీ తెలుగువారి ఓటింగ్ ఏ పార్టీకి చెందిన నేత సొంతం చేసుకుంటాడనేది ఈసారి ప్రశ్నార్థకమేనని చెప్పవచ్చు. స్థానిక సమస్యల పరిష్కారంతోపాటు తమకు అన్నివిషయాల్లోనూ అండగా నిలిచే నాయకుడి కోసం తెలుగు ఓటర్లు వేచిచూస్తోన్న తరుణంలో .. ఈ ఎన్నికల్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ విషయంలో తెలుగుసంఘాలు కీలక భూమిక పోషిస్తుండగా, పలు పార్టీల నేతలూ తెలుగు ఓటింగ్ ప్రభావం ఎటువైపు మొగ్గుచూపుతుందోనని ఉత్కంఠతో ఉన్నారు. ప్రతీసారి తెలుగువారి చీలిక ఓటింగ్‌తో అధికారాన్ని నెట్టుకొస్తున్న నేతలు .. మారిన పరిస్థితుల్లో ఖంగుతినే ప్రమాదాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకనుగుణంగానే తెలుగు ప్రజలంతా తమకు నచ్చిన నేతను ఎన్నుకోవడంలో ఏకాభిప్రాయ ఓటింగ్‌నకు సిద్ధం కావాలనే ఆలోచనలు చేస్తున్నారు. కులమతాలు, రాజకీయ పార్టీలకతీతంగా అందరూ ఒకే నేతను ఎన్నుకున్నప్పుడే తెలుగోడి సత్తా తెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వైఎస్సార్ సీపీకి ఓట్లేశారని..
దళితులపై టీడీపీ నేతల కక్ష కమ్యూనిటీ భవనానికి తాళాలు చిలకపాడు, (సంతనూతలపాడు): టీడీపీకి కాకుండా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారనే నెపంతో తమపై వివక్ష చూపుతున్నారని..దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..చిలకపాడులో దళిత విద్యార్థులు చదువుకునేందుకు 2011లో పనబాకలక్ష్మి ఎంపీ నిధులతో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాంతానికి చెందిన దళితులు వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారనే కారణంతో టీడీపీ నాయకులు సహించలేకపోయారు. అంబేద్కర్ భవనాన్ని ఖాళీ చేయించాలని పన్నాగం పన్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని ఆ భవనం అంగన్వాడీ కేంద్రానికి కావాలంటూ పంచాయతీలో తీర్మానం చేశామని..ఆ భవనంలోని దళిత విద్యార్థులు వెంటనే ఖాళీ చేయాలని పట్టుబట్టారు. స్థానిక టీడీపీ నాయకులు బుధవారం అకస్మాత్తుగా వచ్చి తాళాలు వేసుకునే క్రమంలో కొంతసేపు దళితులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దళితులను బెదిరించి..భవనానికి తాళాలు వేసుకుని ఎవరైనా తాళాలు పగులగొడితే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయిస్తామని హుకుం జారీ చేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి గొడవలు పెంచుకోవద్దని, ఏవైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి వె ళ్లారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో విద్యార్థుల మెటీరియ ల్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయని దళిత విద్యార్థులు వాపోయారు. ఈ విషయం చెప్పినా..టీడీపీ నాయకులు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత విద్యార్థులు మాట్లాడుతూ మంగళవారం తహసీల్దార్‌కు, ఎంపీడీవోకు టీడీపీ వారు చేస్తున్న దారుణాలపై వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫ్యాక్స్ చేశామని, గురువారం కలెక్టర్‌కు, ఎస్పీకి టీడీపీవారి అక్రమాలపై వినతిపత్రం ఇస్తామని తెలిపారు. కమ్యూనిటీ భవనం ముందు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మద్దిపాడు సీడీపీవో విజయలక్ష్మిని సాక్షి సంప్రదించగా..గ్రామంలో అంగనవాడీ కేంద్రానికి గది ఎక్కడ కేటాయించినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, అంబేద్కర్ భవనాన్నే ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పలేదని అన్నారు. -
నిన్ను చూసి ఓట్లేయలేదు?
పార్టీ విప్ ధిక్కరించిన ఎంపీటీసీని నిలదీసిన ప్రజలు బాపట్ల రూరల్: ‘ఓట్లు వేసి ఎంపీటీసీగా గెలిపిస్తే... నిలువెత్తున ముంచేసి టీడీపీకి ఎందుకు మద్దతు తెలిపావు?.. నిన్ను చూసి ఓట్లువేయలేదని.. జగనన్నను చూసి ఓట్లువేశామంటూ ప్రజలు మండిపడ్డారు.. నీముఖం మాకు చూపించవద్దు’ అంటూ ఈతేరు ఎంపీటీసీ సభ్యురాలు కాగిత నాగభూషణమ్మపై మూడు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈతేరులో సోమవారం ఉద్రిక్తతకు దారితీసే అవకాశం కనిపించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాజన్నపై ఉన్న ప్రేమను ఈతేరు, చుండూరుపల్లి, మర్రిపూడి గ్రామస్తులు మరోసారి చాటుకున్నారు. మొదటి నుంచి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న మర్రిపూడి, చుండూరుపల్లి, ఈతేరు గ్రామాల్లోని ప్రజలు తమ పార్టీ అభ్యర్థినిని ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి తిరిగి విజయవాడ నుంచి స్వగ్రామానికి వచ్చిన నాగభూషణమ్మను ప్రజలు నిలదీశారు. తన ఇష్టమొచ్చినట్లు చేసుకుంటానని ఒకసారి, నన్ను అడిగేందుకు మీరెవరంటూ మరోసారి సమాధానం చెప్పడంతో ప్రజలు ఆగ్రహించారు. పార్టీని, ఓట్లు వేసిన గ్రామస్తులను మోసం చేశావంటూ ఎంపీటీసీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఐ మల్లికార్జునరావు, రూరల్, వెదుళ్ళపల్లి ఎస్ఐలు చెన్నకేశవులు, సురేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పారు. -
కంగుతిన్న కమలనాథులు
బీజేపీకి ఘోర పరాజయం ఫలించని మోడీ మంత్రం పనిచేయని పవనిజం బాబు హామీలు నమ్మని జనం మదనపల్లె, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటర్లు ఇచ్చిన తీర్పును చూసి బీజేపీ నాయకులు కంగుతిన్నా రు. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా రాజంపేట, తిరుపతి లోక్‌సభ స్థానాల ను, మదనపల్లె అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కి కేటాయించారు. అయితే మోడీ గాలి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పన్నాగాలు జిల్లాలో ఫలించలేదు. మూడు స్థానాల్లో నూ బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేతిలో 1.74 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చెందా రు. ఇక తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున జయరాం పోటీ చేశారు. ఈయన కూడా వైఎస్సార్ సీపీ అభ్యర్థి వరప్రసాద్ చేతిలో ఓటమి చెందారు. మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లపల్లె నరసింహారెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థి దేశాయ్ తిప్పారెడ్డి చేతిలో 17,039 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బీజే పీ అభ్యర్థుల గెలుపు కోసం నరేంద్రమోడీ తిరుపతి, మదనపల్లెలో బహిరం గ సభలు, ప్రచారం నిర్వహించారు. అయితే దేశవ్యాప్తంగా మోడీ గాలి వీచి నా చంద్రబాబు సొంత జిల్లాలో ఏమాత్రం పని చేయలేదు. మోడీ ప్రభంజనా న్ని, చంద్రబాబు ప్రకటించిన పథకాల ను ఓటర్లు నమ్మలేదు. మూడు స్థానాల్లో నూ బీజేపీ ఓటమి చెందడంతో ఆ పార్టీ నాయకుల్లో కలవరం రేగింది. టీడీపీ నుంచి పూర్తిస్థాయిలో సహకారం లేక పోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్న విమర్శలు బీజేపీ నాయకుల నుంచి విని పిస్తున్నాయి. పురందేశ్వరి, చల్లపల్లె నరసింహారెడ్డి ఓటమిని పార్టీ నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఎన్నిక ల్లో ఎన్నో ఆశలు, అంచనాలతో ఉన్న బీజేపీ నాయకులు జిల్లాలో వచ్చిన ఫలి తాలను చూసి కంగుతిన్నారు. -
కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
-
జెడ్పీటీసీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు
సాక్షి, ఖమ్మం: జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ వరుసగా అత్యధిక ఓట్లను సాధించాయి. అత్యధికంగా టీడీపీ 4,62,774 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 3,22,280, వైఎస్ఆర్సీపీ 2,49,260, సీపీఎం 65,279, సీపీఐ 43,184 ఓట్లు సాధించాయి. వైఎస్ఆర్సీపీకి తొలి ప్రయత్నంలో ఈ ఎన్నికల్లో భారీస్థాయిలో ఓట్లు రావడం గమనార్హం. -
సీనియర్లకూ తప్పని ఓటమి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి కౌన్సిలర్లుగా, ఆ తరువాత కార్పొరేటర్లుగా వ్యవహరించిన పలువురు సీనియర్లు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనంలో ఓటమిపాలయ్యారు. ఈ జాబితాలో సీనియర్ కౌన్సిలర్‌గా, నగర డిప్యూటీ మేయర్‌గా పని చేసిన సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లుతోపాటు సీనియర్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన పిండి సురేష్‌బాబు, షేక్ అబ్దుల్ మునాఫ్ (కాంగ్రెస్), స్వర్ణ వెంకయ్య (టీడీపీ) ఉండగా, దారా జయరాజ్, మండ్ల ఈశ్వరయ్య, సంక్రాంతి కల్యాణ్, వారి కు టుంబసభ్యులు గతంలో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా గెలుపొందినప్పటికీ ఈ సారి రిజర్వేషన్లు తారుమారు కావడం తో మళ్లీ వారి కుటుంబసభ్యులను ఎన్నికల బరిలో దింపినప్పటికీ ఓటమి తప్పలేదు. చావుతప్పి కన్నులొట్ట బోయినకాంగ్రెస్ నగరంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్‌పార్టీకి 54 డివిజన్లలో కేవలం 12వ డివిజన్ నుంచి ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి మాత్రమే గెలుపొందారు. దీంతో ఆ పార్టీకీ నగరంలో చావుతప్పి కన్నులొట్టబోయినట్లైంది. ఒకటి, రెండుచోట్ల మా త్రమే కాంగ్రెస్ అభ్యర్థులు రెండో స్థానం లో నిలవగా అధికభాగం డిపాజిట్లు కో ల్పోవడం గమనార్హం. కాంగ్రెస్‌పార్టీ ఘోర పరాజయం పాలుకావడంతో తగిన శాస్తి జరిగిందంటూ నగరవాసులు అంటున్నారు. పలుచోట్ల ప్రధాన రాజకీయపార్టీల రెబల్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమ సత్తా చాటారు. సీపీఎంకు కంచుకోటగా ఉండే నగరంలోని పలు డివిజన్లలో ఈ సారి ఆ పార్టీ అభ్యర్థులంతా ఓటమిపాలుకాగా కేవలం 25వ డివిజన్ నుంచి ఆ పార్టీ అభ్యర్థి బిరదవోలు పద్మజ ఒక్కరే గెలుపొందారు. బీజేపీ నుంచి నగరంలోని 23వ డివిజన్‌కు చెందిన ఎర్రబోలు అపర్ణ, 50వ డివిజన్ నుంచి కప్పిర ఉమామహేశ్వరి మాత్రమే గెలుపొందారు. టీడీపీ నుంచి సీటు ఆశించి చివరకు బీ-ఫారం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దొడ్డపనేని రాజా విజయం సాధించారు. ఎక్స్ అఫిషియో సభ్యులతో పనిలేదు నగర మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఒక్కోసారి ఎక్స్అఫిషియో సభ్యుల ఓట్లు ఎంతో కీలకంగా పనిచేస్తాయి. ఈ సారి వారి అవసరం ఉంటుందని భావించినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 32 స్థానాలను చేజిక్కించుకోవడంతో ఇక వారితో పనిలేకుండా పోయింది. -
పోస్టల్ బ్యాలెట్‌పై నజర్
- ఉద్యోగులపై దృష్టి సారించిన అభ్యర్థులు - ఈ నెల 16 వరకు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం - ఆదిలాబాద్, నిర్మల్‌లోనే అత్యధికంగా వినియోగం ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నిన్నా మొన్నటి వరకు ఓట్ల వేటలో తిరిగిన అభ్యర్థులంతా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్‌పై దృష్టి సారించారు. ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసైనా ఓట్లు రాబట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ నెల 16 వరకు పోస్టల్ బ్యాలెట్ దాఖలు చేసేందుకు అవకాశం ఉండడంతో అభ్యర్థులు తమ పనిని వేగవంతం చేశారు. గత నెల 30న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో 73.70 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. అయితే.. వాటితో పాటే అభ్యర్థుల గెలుపునకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ప్రధానమే అయ్యాయి. జిల్లావ్యాప్తంగా 18 వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. ఇప్పటి వరకు 13,443 మంది దాఖలు చేశారు. మిగిలిన ఉద్యోగుల వివరాలు సేకరిస్తూ.. పరిచయం ఉన్న పక్షంలో నేరుగా, లేనిపక్షంలో వారి సంబంధీకుల ద్వారా పోస్టల్ బ్యాలెట్ తమకు అనువుగా మలుచుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు దాఖలైన పోస్టల్ బ్యాలెట్లో ఆదిలాబాద్, నిర్మల్ నుంచే అత్యధికంగా ఉన్నాయి. విజయావకాశాలు.. జిల్లాలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ అహ్మద్‌బాబు ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు పోలింగ్ డ్యూటీ కేటాయించే సమయంలోనే వారి ఎపిక్ నంబర్లను సైతం సేకరించారు. అన్ని మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల్లోనూ పోలింగ్ బాక్సులను ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. పలువురు ఉద్యోగులు ఎన్నికల తేదీ 30 కంటే ముందే తమ ఓటును వినియోగించుకోగా.. ఇంకొంత మంది పోస్టల్ ద్వారా తమ బ్యాలెట్‌ను నేరుగా నియోజకవర్గ కేంద్రాలకు పంపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఒక్కోసారి అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయి. 2009 ఎన్నికల్లో ముథోల్ టీడీపీ అభ్యర్థి వేణుగోపాలచారి, ప్రజారాజ్యం అభ్యర్థి విఠల్‌రెడ్డికి సుమారు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించాల్సి వచ్చింది. చివరికి వేణుగోపాలాచారిని విజయం వరించింది. ఈసారి కూడా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు పోటాపోటీగా ఉండడంతో పోస్టల్ బ్యాలెట్ కీలకం కానుంది. -
గంటాపై ముప్పేట దాడి
అటు కాంగ్రెస్ చెన్నా దాసు, ఇటు టీడీపీ రెబెల్ అనిత మరో పక్క ఇండిపెండెంట్ డాక్టర్ శ్రీనివాస్.. మాజీమంత్రికి తప్పని ఓట్ల చీలిక వైఎస్సార్ సీపీ అభ్యర్థి సీతారామ్‌కు అనుకూల పవనాలు పాపం..గంటా సారుకు భీమిలిలో తల బొప్పికట్టక తప్పేలా లేదు. గత్యంతరం లేక ఇక్కడ అసెంబ్లీ బరిలో నిల్చున్న మాజీ అమాత్యులపని కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. కాంగ్రెస్ అభ్యర్థి చెన్నాదాసు, టీడీపీ రెబెల్ అనిత, స్వతంత్ర అభ్యర్థిడాక్టర్ శ్రీనివాస్.. ఈ త్రయం భారీగా ఓట్లను చీలుస్తుండటంతో శ్రీనివాసునికి చుక్కెదురు తప్పదన్నది దేశం శ్రేణుల భావన. మొత్తం మీద ఫ్యానుగాలి జోరుగా వీస్తుండటంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సీతారామ్‌కు పరిస్థితి సానుకూలంగా ఉంది. తగరపువలస, న్యూస్‌లైన్ : భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది. కాంగ్రెస్‌ను వీడిన తరువాత జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేయాలో చివరి వరకు తేల్చుకోలేక ఒకానొక దశలో పోటీ నుంచి విరమించుకోవడానికే నిర్ణయించా రు. అయితే చంద్రబాబు ఒత్తిడితో విశాఖ పార్లమెంట్‌కు పోటీ చే యాలని భావించినా వైఎస్సార్సీపీ నుంచి వైఎస్ విజయమ్మ పేరు ఖరారు కావడంతో ఆమెపై నెగ్గడం అంత ఆషామాషీ కాదని వెనక్కు తగ్గారు. అప్పటికే జిల్లాలో టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో భీమిలి అయితే సేఫ్ అని భావించారు. ఇక్కడ మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న 20 వేలమంది మత్స్యకార ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి చెన్నా దాసు వెంట నడుస్తుండటంతో మొదటిసారి కంగుతిన్నారు. టీడీపీ రెబెల్‌గా దిగిన అనిత గంటాను పత్రికాముఖంగానే పార్టీకి పట్టిన శనిగ్రహమని తిట్టిపోయడంతో చెమటలు పట్టాయి. ఇక రాజు ఫౌండేషన్ పేరుతో భీమిలి నియోజకవర్గంలో పలుసేవా కార్యక్రమాలు చేపట్టిన ఎన్ఆర్ఐ కంటుభుక్త రామానాయుడు తన సోదరుడు డాక్టర్ శ్రీనివాస్‌ను ఇండిపెండెంట్‌గా పోటీకి దించారు. ఈయనకు కూడా నియోజకవర్గంలో మెజారిటీ సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా మూడువైపులా టీడీపీ ఓట్లను చీల్చే ఈ ముగ్గురికీ తోడు ఇప్పటికే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకసారి, వైఎస్ విజయమ్మ మూడుచోట్ల నిర్వహించిన ప్రచారాలకు టీడీపీలో వణుకు పుట్టించింది. భీమిలిలో దాదాపు ఓటమి అంచున ప్రయాణిస్తున్న గంటా విశాఖ ఎంపీగా పోటీ చేసి విజయమ్మ చేతిలో ఓటమి పొందినా గౌరవం ఉండేదని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్పీలో చక్రం తిప్పి, కాంగ్రెస్‌లో మంత్రిగా అజమాయిషీ చెలాయించిన గంటా టీడీపీలో కూడా తన హవా కొనసాగించాలనుకుని మొదటిసారి తప్పుతోవ పట్టారని వినిపిస్తోంది. ఈ ఎన్నికల తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా, వైఎస్ విజయమ్మ విశాఖ ఎంపీగా ఎన్నిక కావడం దాదాపు ఖాయమని ఇప్పుడు కర్రి సీతారామ్ చేతిలో కూడా గంటా ఓటమి చెందితే తమ భవిష్యత్తు ఏమిటని దేశం శ్రేణులు మథనపడుతున్నాయి. ఎన్నికల తరువాత మళ్లీ నియోజకవర్గబాధ్యతలు మోసే నాయకుడు ఐదేళ్ల వరకు టీడీపీకి లభించరని తెలుస్తోంది. టీడీపీలో నియోజకవర్గం మీద అభ్యర్థి నుంచి కార్యకర్త వరకు తమ భవిష్యత్తుపైనే తలపట్టుకుని కూర్చున్నారు. -
ఓటంటే ఓటేనంటా.. ఎంతకైనా దిగిరావాలంటా..!
-
మేమంతా ఓటేశాం.. మరి మీరో?
ఈసారి రికార్డు సంఖ్యలో యువతీ యువకులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. వాళ్లందరికీ ఓటరు గుర్తింపుకార్డులు కూడా వచ్చాయి. అయితే వాళ్లలో ఎంతమంది తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు? ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పలువురు ప్రముఖులు పిలుపునివ్వడమే కాదు, క్షణం తీరిక లేకపోయినా ఉదయమే వెళ్లి ఓటు వేసి వచ్చారు. ఇలాంటి వారిలో పలువురు అగ్రశ్రేణి సినీనటులు కూడా ఉన్నారు. తమిళనాట అగ్రహీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కూడా చెన్నైలో తమ నివాసాలకు సమీపంలోఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే అలనాటి హీరోయిన్ ఖుష్బూ కూడా ఓటు వేశారు. బాలీవుడ్ విలక్షణ నాయకుడు, దర్శక నిర్మాత అమీర్‌ఖాన్, ఇటీవలే పెళ్లి చేసుకున్న విద్యాబాలన్, యువ హీరోయిన్ సోనమ్ కపూర్.. ఇలా అందరూ గురువారం ఉదయమే వెళ్లి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తామంతా ఓటు వేశామని, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని యువతీ యువకులంతా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ తరఫున ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్న అమీర్ ఖాన్, తాను కూడా స్వయంగా ఓటు వేయడం ద్వారా అందరినీ ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. -
అభివృద్ధివైపే ఓటరు మొగ్గు
అభ్యర్థుల నేరచరిత్ర కంటే గతంలో చేసిన అభివృద్ధికే మహారాష్ట్ర ఓటరు ప్రాధాన్యమిస్తున్నాడు. ఈ విషయం రెండు స్వచ్ఛంద సంస్థలు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో స్పష్టమైంది. అయితే కానుకల ఆశ చూపి ఓట్లు వేయించుకోవడాన్ని మాత్రం అనేకమంది ఓటర్లు ఇష్టపడడం లేదు. అది అక్రమమని వారు భావిస్తున్నారు. ఎంపీల పనితీరుపై ఓటర్లు ఇచ్చిన పాయింట్లలో గురుదాస్ కామత్‌కి అందరికంటే ఎక్కువ దక్కాయి. సాక్షి, ముంబై: రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు అభ్యర్థుల నేరచరిత్రను విస్మరిస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నేరచరితులైన అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వారు చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు వారికే ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్న ట్లు స్పష్టమైంది. రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు ఉన్న మనోభావాలను తెలుసుకునేందుకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్), దక్ష్ అనే సేవా సంస్థలు అధ్యయనం చేశా యి. ఇందులో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలను దృష్టిలో పెట్టుకొని 7.73 శాతం మంది ఓట్లు వేయగా, అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని 7.24 శాతం మంది ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి అభ్యర్థి కోసం 7.53 శాతంమంది, కులాభిమానంతో 5.69 శాతం మంది, ఇచ్చే కానుకలు (చీరలు, మద్యం, డబ్బు) ఆశపడి 5.31 శాతం మంది ఓట్లు వేస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. కానుకలిచ్చి ఓట్లు వేయించుకోవడం అక్రమమని 62.07 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థులు తమ గెలుపు కోసం కానుకలు పంచుతున్నారని 54.09 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్య, మహిళలకు భద్రత, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల తదితర అంశాలపై ఎంపీలు చేసిన పనులకు ప్రజలు పాయింట్స్ ఇచ్చారని అధ్యయన నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ప్రియాదత్ (ముంబై నార్త్ సెంట్రల్)కు అతి తక్కువ 4.01 పాయింట్లు లభించగా, తర్వాత కాంగ్రెస్ ఎంపీ మిలింద్ దేవరా (ముంబై సౌత్)కి 4.63 పాయింట్లు వచ్చాయి. నీలేష్ రాణే (రత్నగిరి, సింధుదుర్గ్) 4.82, ఏక్నాథ్ గైక్వాడ్ (ముంబై సౌత్ సెంట్రల్)కి 4.91, సంజయ్ నిరుపమ్ (ముంబై నార్త్)కు 5.21, గురుదాస్ కామత్ (ముంబై నార్త్ వెస్ట్)కి 6.33 పాయింట్లు వచ్చాయి. ఇదిలావుండగా మావల్ ఎంపీ బాబర్ జి దంషీ (శివసేన)కు అత్యధికంగా 8.4 పాయింట్లు వచ్చాయి. తర్వాత బీజేపీకి చెందిన హరిశ్చంద్ర (డోంగ్రి)కు 7.43, ఎన్సీపీ ఎంపీ సంజయ్ దీనా పాటిల్‌కు (నార్త్ ముంబై ఈస్ట్)కు 5.3 పాయింట్లు వచ్చాయి. కాగా అధ్యయనం చేపట్టే సమయంలో ఓటర్లు పాలనపై వేసుకున్న అంచనాలు, ఎంపీలు చేపట్టిన అభివృద్ధి పనులను బేరీజు వేశారు. ప్రజలు ఊహించుకున్నంత మేర పనులు ఎంపీలు చేయకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందని రాష్ట్ర ఎలక్షన్ వాచ్ సంస్థ సభ్యుడు శరద్ తెలిపారు. రాష్ట్రానికి చెందిన 48 మంది ఎంపీల పనితీరును పరిశీలించగా కేవలం 12 మంది ఎంపీలు మాత్రమే నయమని ఈ సర్వేలో తేలింది. అధ్యయనం నిర్వహించిన టాప్‌టెన్‌లో పట్టణాల్లో చక్కని రహదారులు, తాగు నీరు, పాఠశాలలను ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, గృహావసరాలకు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ, ఆస్పత్రులు, సాగునీటి ప్రాజెక్టులున్నాయి. -
అభ్యర్ధులకు ఎన్ని కష్టాలు !
-
అభ్యర్ధుల పరకాయ ప్రవేశం
-
డబ్బు తీసుకునే ఓటర్లపైనా కేసులు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరిక హైదరాబాద్: ఓట్లు వేసేందుకు డబ్బు తీసుకునే వారిపైనా కేసులు పెడతామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ హెచ్చరించారు. డబ్బు పంచడానికి వచ్చే వారి ముఖాన్నే దానిని కొట్టాలని, మంచి వారికే ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించాలని ప్రజల ను కోరారు. తద్వారా దేశంలో రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు - ఓటరు చైతన్య కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బు, మద్యం పట్టుబడటానికి బహుశా ఇక్కడ పలు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్) ఎన్నికలు ఉండటం కారణం కావచ్చునని భన్వర్‌లాల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలనే చైతన్యం ప్రజల్లో బాగా వచ్చిందని, గతంలో 30-35 లక్షల కొత్త ఓట్లు నమోదు కాగా ఈ పర్యాయం ఏకంగా 90 లక్షల ఓట్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈసారి రాష్ట్రంలో 85 నుంచి 90 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. -
తొలి దశ ప్రశాంతం
సాక్షి, ముంబై: చెదురుమదురు సంఘటనలు మినహా విదర్భలోని పది లోక్‌సభ స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్ల కాల్పులు, ఈవీఎంల మొరాయింపు, స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నా పోలింగ్ సజావుగానే ముగిసింది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సుమారు 62.36 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అందిన వివరాల మేరకు...గడ్చిరోలి, అకోలా, అమరావతి, భండారా-గోండియాలో 65 శాతం, వర్ధాలో 61, రాంటెక్ 62, నాగపూర్ 59, చంద్రపూర్ 63, యావత్మల్-వాషీలో 60 శాతం, బుల్డానాలో 58.66 శాతం ఓటింగ్ నమోదైంది. భండారా-గోండియా, బుల్డానా మినహా మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో పొలింగ్ ఒకటి నుంచి పదిహేను శాతానికి పెరిగింది. 2009 ఎన్నికల్లో 49 శాతం ఓటింగ్ నమోదైన అకోలాలో ఈసారి ఏకంగా 65 శాతానికి పెరిగింది. గత ఎన్నికల్లో 43.4 శాతం ఓటింగ్ నమోదైన నాగపూర్‌లో ఈసారి సుమారు 59 శాతం పెరిగింది. ఉత్సహంగా ఓటేసిన ప్రజలు... తొలి దశలో పోటీ చేస్తున్న 201 మంది అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)లో నిక్షిప్తమైంది. మావోయిస్టుల ప్రభావమున్న ప్రాంతాల్లో ఈసారి కూడా ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ బాగానే జరిగినా, మధ్యాహ్నం భానుడి ప్రతాపానికి మందకొడిగా సాగింది. సాయంత్రం మళ్లీ పుంజుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు ముగించారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు క్యూలో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, పలు నియోజకవర్గాలలో జరిగిన సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈవీఎంల మొరాయింపు, ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతు, ఎన్నికల బహిష్కరణ తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక మంది సామాన్యులతో పాటు పలువురు ప్రముఖ వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో నిరాశతో ఓటు వెయ్యకుండా వెనుదిరిగారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు పది లోక్‌సభ నియోజకవర్గాల్లో అనేకమంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉదయం ఏడు గంటలకే నాగపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. విలాస్ ముత్తెంవార్, అంజలి దమానియాలు కూడా నాగపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రఫుల్ పటేల్, దేవేంద్ర ఫడ్నవీస్, నవనీత్ కౌర్, ముఖుల్ వాస్నిక్, ప్రకాష్ అంబేద్కర్ వారివారి నియోజకవర్గాల్లో ఓటును వేశారు. నాలుగు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ... వార్ధా సేలు తాలూకాలోని నాలుగు గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి. అలగావ్, పహెలానపూర్, శివణగావ్, చించోలి గ్రామాల్లో ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. గ్రామంలోని సమస్యలు ప్రతిసారి పరిష్కరిస్తామనే చెప్పి నాయకులు మోసం చేస్తున్నారని ఈ గ్రామస్తులు ఆరోపించారు. అందుకే ఈసారి ఎన్నికలను బహిష్కరించామన్నారు. అమనావతిలో మధ్యాహ్నం కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే అభిజీత్ అడ్సూల్ ఓటర్ల జాబితాలో సుమారు 46 వేల ఓటర్ల పేర్లు లేవని ఆరోపించారు. ఆయన మద్దతుదారులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గోండియాలోని రాంనగర్లో ఈవీఎం మొరాయించింది. ఓ యంత్రంలో ఏ బటన్ నొక్కినా నాలుగో నంబర్ బటన్‌పై ఉన్న మంచం గుర్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థికే ఓటు వెళుతుందని అధికారులు గుర్తించారు. మరో ఈవీఎంను ఏర్పాటుచేశారు. ప్రశాంతంగా ఉప ఎన్నిక... వాసిం జిల్లాలోని రిసోడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ జనక్ గతేడాది అక్టోబర్ 28వ తేదీన మరణించారు. దీంతో గురువారం జరిగిన ఉప ఎన్నికలో సుమారు 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. గడ్చిరోలిలో మావోయిస్టుల కాల్పులు గడ్చిరోలి, న్యూస్‌లైన్: జిల్లాలో ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎటాపల్లి తాలూకా గర్దేవాడా సమీపంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈవీఎంలను తీసుకెళుతున్న ఎన్నికల అధికారులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతగా ఉన్న పోలీసులు వెంటనే స్పందించడంతో మావోయిస్టులు పారిపోయారు. అయితే ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అహురి, ఆరమోరి, గోండియా జిల్లాలోని ఆమగావ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. నాగపూర్‌లో బ్రిటీషు రాయబారి పర్యటన నాగపూర్: నాగపూర్‌లో గురువారం జరిగిన ఓటింగ్ సరళిని బ్రిటీష్ రాయబారి సర్ జేమ్స్ డేవిడ్ బెవన్ పరిశీలించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో పొలింగ్ విధానం దగ్గరుండి చూడటం అద్భుతమైన అనుభవమని ఆయన మీడియాకు తెలిపారు. భారత్‌లో మాదిరిగానే బ్రిటన్‌లోనూ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇక్కడి ప్రజాస్వామ్య విధానాన్ని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకే వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని వివరించారు. -
పోలింగ్‌బూత్‌ల్లో కనిపించకూడదు..
సాక్షి, ఒంగోలు, ‘మీ సంగతి మాకు తెలుసు.. మేమెన్ని చెప్పినా, అక్కడికెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్‌కే ఓటేస్తారు..! మర్యాదగా ఇచ్చేది తీసుకుని, ఇళ్లల్లోనే ఉండాలి. పోలింగ్‌బూత్‌ల్లో కనిపించకూడదు..’ అంటూ ఓ శాసనసభ్యుడి బెదిరింపు సదరు నియోజకవర్గ పల్లెల్ని కలవరపరుస్తోంది. స్వతంత్రపోరుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మరో నేత కూడా తన నియోజకవర్గంలో ఇదేతీరుగా హూంకరించడం ఓటర్లకు ఇబ్బందిగా మారింది. టీడీపీకి చెందిన ప్రముఖ నేత సైతం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా.. పక్క నియోజకవర్గాల్లోని మండలాలపై కూడా పెత్తనం చెలాయిస్తూ మంత్రాంగం నెరపడం వివాదాలకు దారితీస్తోంది. గ్రామాల్లో నోరు మెదపని బడుగు, బలహీనవర్గాలు... ఎన్నికలు ముగిసేనాటికి పలుకుబడి గల నేతల కారణంగా ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ సమస్యలు జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లోని దళిత, బీసీ కాలనీల్లో ఉన్నాయని పలువురు పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదులు కూడా పంపినట్లు తెలిసింది. ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికార యంత్రాంగం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముమ్మరగస్తీ పెట్టింది. గ్రామాల గోడలపై యువతకు సందేశం ఇచ్చేలా పోస్టర్లను సైతం అంటించి శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రచారం చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అధికార కాంగ్రెస్, టీడీపీ నేతలు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి బడుగు, బలహీన వర్గాల ఓటర్లను పిలిపించి బెదిరిస్తోన్న వైనంపై నిద్రనటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనిగిరి మండలంలో కాంగ్రెస్‌కు పనిచేయకుండా.. వైఎస్సార్ సీపీ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారంటూ దళిత కార్యకర్తలపై సిట్టింగ్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఆ సందర్భంలోనే తామంతా జగన్ అభిమానులమంటూ చెప్పగా, అందరికీ డబ్బులిస్తామని.. పోలింగ్ బూత్‌ల్లో మాత్రం కనిపించరాదని శాసించినట్లు బాధితులు చెబుతున్నారు. మరో ఎమ్మెల్యే తమపరిధిలోని బీసీల్ని స్థానికంగా ఓ ఇంటికి పిలిపించి టీడీపీకి పనిచేయకుంటే, కేసులు పెట్టించాల్సి వస్తుందని బెదిరించినట్లు తెలిసింది. పేదల కాలనీల్లో రాత్రిళ్లు హల్చల్ కాంగ్రెస్, టీడీపీ నేతలు మూకుమ్మడిగా ఉదయం పూట ప్రచారంలో ఇటీవల కొత్తపల్లవి అందుకున్నారు. ఓటర్లు అందరి వద్ద డబ్బులు తీసుకోండని.. అయితే, ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకి వేయరాదని హుకుం జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వేయడం ఇష్టంలేని వారు టీడీపీకైనా ఓటేయాలని.. వినూత్న ప్రచారానికి దిగుతున్నారు. కుమ్మక్కు రాజకీయాల్ని బాహాటంగానే నడుపుతున్న అధికార నేతల అండగా, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు కూడా పేదల కాలనీలపై ప్రతాపం చూపుతున్నారు. దొనకొండ మండలంలోని ఎస్సీ కాలనీలకు చెందిన కొందరు టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు రెండ్రోజుల కిందట రాత్రి సమయంలో వె ళ్లారు. అక్కడున్న వారికి లిక్కర్ సీసాలు పంపిణీ చేశారు. మహిళలను పిలిపించి డబ్బులు పంపిణీ చేస్తామని చెప్పి పడిగాపులు పడేలా చేశారు. ఇదేరకమైన వైనం మార్కాపురం మండలంలో చోటుచేసుకుంది. మద్యం తాగిన మత్తులో తెలుగుతమ్ముళ్లు కొందరు ద్విచక్రవాహనాలపై ఆయాగ్రామాల వీధుల్లో చక్కర్లు కొట్టి.. పెద్దగా కేకలేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు. కందుకూరులో కొందరు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చినందుకు వారిపై పోలీసు కేసులు నమోదు చేయిస్తామని కాంగ్రెస్ నేత బెదిరిస్తున్నట్లు వదంతులు పుట్టించారు. దీంతో బీసీలు, ఎస్సీలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అదనంగా వచ్చిన పోలీసు బలగాలు అన్ని నియోజకవర్గాల్లోని శివారు మండలాల్లోని పేదలకాలనీలపై ప్రత్యేకంగా దృష్టిసారించి, రక్షణ కల్పించాలని కోరుతున్నారు. -
మున్సిపోలింగ్ 76.95 శాతం
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: చెదురుమదురు సంఘటనలు మినహా ఆదివారం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాం తంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 76.95 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో మొత్తం 129 వార్డు కౌన్సిలర్ స్థానాలకు 536 అభ్యర్థులు బరిలో నిలిచారు. విజయనగరంలో 40 వార్డుల్లో 169 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, బొబ్బిలి మున్సిపాలిటీలో 30 వార్డులలో 117 మంది, సాలూరులో 29 వార్డుల్లో 95 మంది, పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వారు స్థానాలకు 155 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని ప్రాంతాలు మినహా సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. విజయనగరం మున్సిపాలిటీలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియగా... ఈవీఎంలు మొరాయించడంతో సాలూరు మున్సిపాలిటీలో 13 వార్డులో అరగంట ఆలస్యంగా, పార్వతీపురం మున్సిపాలిటీలో 8,15 వార్డులలో గంటన్నర ఆలస్యంగా, బొబ్బిలి మున్సిపాలిటీలో 4, 10, 14,12, 20 వార్డుల్లో గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అదే మున్సిపాలిటీలో 10, 7 మున్సిపాలిటీల్లో అధికారులు నిర్లక్ష్యం కారణంగా సాయంత్రం ఏడు గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. నేతల భవితవ్యం నిక్షిప్తమై ఉన్న ఈవీఎంలను ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచినట్టు ఎన్నికల అధికారి ఆర్.సోమన్నారాయణ తెలిపారు. అందరి దృష్టి ఫలితాలపైనే.... మున్సిపల్ ఎన్నికలు సజావుగా ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల దృష్టి ఇప్పుడు ఫలితాలపై పడింది. పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయా పార్టీల నేతలు తమకు దక్కే ఓట్ల లెక్కలను బేరీజులు వేసుకునే పనిలో పడ్డారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2 ఫలితాలు ప్రకటించవలసి ఉన్నప్పటికీ సాధారణ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉంటుందని హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఫలితాల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 1న ఫలితాల ప్రకటనపై ైెహ కోర్టు తీర్పునివ్వాల్సి ఉంది. మున్సిపాలిటీల వారీగా పోలింగ్ శాతం నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 76.95 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా బొబ్బిలి మున్సిపాలిటీలో 80.14 శాతం నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం మున్సిపాలిటీలో 69.01 శాతం ఓట్లు నమోదయింది. సాలూరు మున్సిపాలిటీలో 79.72 శాతం, పార్వతీపురం మున్సిపాలిటీలో 78.93 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోల్చుకుంటే ఈ సారి ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రంగం తీసుకున్న చర్యల వల్ల పోలింగ్ శాతం ఘననీంగా పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఓటర్లకు ఎర
-
ఓటర్లకు ఎర
-
సైనికుల ఓట్లకు పార్టీల గాలం
తూటాలకు ఛాతీలు ఎదురొడ్డి పోరాడే సైనికులు ఇన్నాళ్లూ కనీసం ఓటు కూడా వేయలేకపోయారు. కానీ ఈ సారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వివిధ కంటోన్మెంటులలో ఉన్న సైనికులు తొలిసారి ఓటు వేయబోతున్నారు. ప్రభుత్వం జనవరి 1, 2014 నుంచి వారు ఉన్న చోటునుంచే తమ రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు వీలు కల్పించింది. అందుకే ఈ సారి అన్ని రాజకీయ పార్టీలూ సైనికుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాయి. వారి ఓట్లను సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉదాహరణకి పంజాబ్ లోని గురుదాస్ పూర్ ఎంపీ ప్రదీప్ సింగ్ బజ్వానే తీసుకుంటే ఆయన గత ఎన్నికల్లో 15000 వేల మంది సైనికులను ఓటర్లుగా నమోదు చేయించారు. ఆయనకు వారి నుంచి 13345 ఓట్లు పడ్డాయి. ఆయన తన ప్రత్యర్థిపై గెలుపొందింది కేవలం 8000 ఓట్ల తోనే. అంటే ఆయన సైనికులను ఓటర్లుగా నమోదు చేయించి ఉండకపోతే ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవారు. అందుకే ఆయన గత అయిదేళ్లలో సైన్యబలగాల సమస్యల గురించి లోకసభలో 157 ప్రశ్నలు వేశారు. హిమాచల్, ఉత్తరాఖండ్ లో సైనిక ఓట్లే ప్రధానం ఇలాగే హిమాచల్ ప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో సైనికులు చాలా మంది పోస్టల్ బాలెట్ ఓట్లు వేయలేకపోయారు. వారికి బ్యాలెట్ పత్రాలు ఎన్నిలైపోయిన తరువాతే అందాయి. హిమాచల్ ప్రదేశ్ లో 1.50 లక్ష మంది మాజీ సైనికులు, మరో 1.50 లక్ష మంది ప్రస్తుత సైనికులు ఉన్నారు. ప్రస్తుత సైనికులు ఓట్లు వేయలేకపోయినందుకే తాము ఓడిపోయామని బిజెపి వాదించింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లలో సైనికులు, మాజీ సైనికులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఒక్క హిమాచల్ లోనే యోల్, ధర్మశాల, అహ్లాల్, పాలంపూర్, సుబాతు, బాక్లో, నహన్, పూహ్, డల్హౌసీ పట్టణాల్లో ఆర్మీ కంటోన్మెంట్లు ఉన్నాయి. ఇక బెంగాల్ లోని డార్జిలింగ్ లోనూ మాజీ సైనికుల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే బిజెపి, కాంగ్రెస్ లకు ఎక్స్ సర్వీస్ మెన్ సెల్స్ కూడా ఉన్నాయి. రాజకీయాల్లోకి సైనికులు గతంలో ఎన్నికల రాజకీయాల్లో సైనికులు పాల్గొనేవారు కాదు. అసలు పోటీ చేసేవాళ్లు దొరకడమూ చాలా కష్టం. పోటీచేసిన వాళ్లు కూడా ఘోరంగా ఓడిపోయారు. ఉదాహరణకి 1962, 1965, 1971 యుద్ధాల్లో సాహసోపేతంగా పనిచేసిన మేజర్ జనరల్ యూస్టేస్ డిసౌజా 1974 లో పోటీ పడ్డారు. కానీ ఘోరంగా ఓడిపోయారు. అయితే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేసిన కల్నల్ డిఎన్ రాజు రాజమండ్రి నుంచి, షానవాజ్ ఖాన్ (నటుడు షారుఖ్ ఖాన్ తాతగారు) ఉత్తరభారతం నుంచి ఎంపీలుగా గెలుపొందారు. ఆ తరువాత సైనికులు రాజకీయాలకు దూరంగా ఉండటం, రాజకీయులు సైనికులను పట్టించుకోకపోవడం జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరీలు మాజీ సైనికులే. మన మాజీ రక్షణ మంత్రి జస్వంత్ సింగ్ కూడా బ్రిగేడియర్ స్థాయిలో పనిచేసిన వారే. రాజస్థాన్ లో ప్రస్తుత ఎంపీ సచిన్ పైలట్ తండ్రి రాజేశ్ పైలట్ ఎయిర్ ఫోర్సులో పనిచేసిన వారే. మన రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యం నుంచి వచ్చిన వారే. వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు దీ ఆర్మీ నేపథ్యమే. మాజీ సైనికులను ఆకట్టుకుంటున్న మోడీ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మాజీ సైనికుల వోటు విలువను గుర్తించిన అరుదైన నేతల్లో ఒకరు. అందుకే ఆయన ప్రత్యేకంగా మాజీ సైనికుల సదస్సును ఏర్పాటు చేసి, దానికి జనరల్ వికె సింగ్ ను ఆహ్వానించారు. జనరల్ వికె సింగ్ బిజెపిలో చేరడం కూడా ఒక కీలక పరిణామమే. మాజీ సైనికుల ఓట్లు కనీసం దేశంలోని 25 లోకసభ స్థానాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ వర్గం సమస్యలను గుర్తించడం, పరిష్కారాలను వెతకడం అవసరమని ఆయన భావించారు. ఒక హోదా ఉన్న వారికి ఒకే జీతం, సైనికులకు ఓటు హక్కు వంటి అంశాలను ఆయన ప్రస్తావించిన తరువాతే కాంగ్రెస్ వీటిపై చర్యలు తీసుకుంది. మొత్తం మీద ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో ఖాకీ నుంచి ఖాదీకి మారే వారి సంఖ్య మరింత పెరుగుతుందన్నది మాత్రం సుస్పష్టం. -
పల్లె గరం గరం
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ఉపసంహరణ గడువు ఈ నెల 24న ముగియ నుండడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ల్లో కొద్దిమేరకు అభ్యర్థులు తగ్గే అవకాశం ఉంది. పార్టీ టికెట్లు ద క్కుతాయని భావిస్తున్న వారు తమ గెలుపునకు ఆటంకంగా మారి పోటీలో ఉన్న వారిని నయానో.. భయానో ఒప్పించి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. కుల సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. హామీలు గుప్పిస్తూ తమను గెలి పిం చాలని తీర్మానాలు చేయించుకుంటున్నారు. తమకే ఓట్లు వేయించాలని కోరుతూ కులపెద్దల కాళ్లు వేళ్లూ పట్టడానికి కూడా వెనకాడడం లేదు. ఈ నేపథ్యం లో కులపెద్దలకు, సంఘాలకు తాము గెలిస్తే ఇచ్చే న జరానాలను ప్రకటిస్తున్నారు.వారిదే కీలక పాత్ర పరిషత్ ఎన్నికలలో తమవారిని గెలిపించుకునేందు కు ఆయా గ్రామాలలో సర్పంచులు,పల్లె గరం గరం వార్డు సభ్యులు కీలక భూమిక పోషిస్తున్నారు.తమకు అనుకూలమైన వారితో సమావేశాలు, బైఠక్‌లు జరుపుతున్నారు. పల్లెల్లో రాత్రీ, పగలు ప్రచార హోరు పెరిగిపోయింది. జిల్లాలో 36 జడ్పీటీసీలు స్థానాలు, 583 ఎంపిటీసీ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో స్థానంలో బీజేపీ ఉంది. కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 157 నామినేషన్లు , ఎంపీటీసీ స్థానా లకు 1347 నామినేషన్లు వచ్చాయి. బీజేపీ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 68 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 597 నామినేషన్లు,టీఆర్ఎస్ నుంచి జడ్పీటీసీ స్థానాలకు 141 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 1226 నామినేషన్లు, టీడీ పీ నుంచి జడ్పీటీసీ 67 నామినేషన్లు, ఎంపీటీ సీ 609 నామినేషన్లు, వైఎస్సార్సీపీ నుంచి జడ్పీటీసీ 6 నామినేషన్లు, ఎంపీటీసీ 19 నామినేష న్లు, సీపీఐ నుంచి జడ్పీటీసీ 3 నామినేషన్లు, ఎంపీటీసీ 21 నామినేషన్లు, సీపీఎం నుంచి జడ్పీటీసీ 5 నామినేషన్లు,ఎంపీటీసీ 15 నామినేష న్లు, లోక్‌సత్తా జడ్పీటీసీ 4 నామినేషన్లు, ఎంపీటీసీ 7 నామినేషన్లు, బీఎస్పీ జడ్పీటీసీ 3 నామినేషన్లు, ఎంపీటీసీ 9 నామినేషన్లు, ఇతర పార్టీల నుంచి జడ్పీటీసీ 7 నామినేషన్లు,ఎంపీటీసీ 18 నామినేషన్లు దాఖలయ్యాయి. -
యువ..నవ
యువత.. నవ శకాన్ని సృష్టించబోతోంది.. తమ ఓట్లను అస్త్రాలుగా సంధించబోతోంది.. విశ్వసనీయత, విలువలకు పట్టం కట్టే నవతరం నాయకత్వానికే మద్దతుగా నిలుస్తామని చెబుతోంది.. యువ ఓటర్లే నేతల తలరాతలను మార్చబోతున్నారు. 40శాతం ఓట్లు వారివే ఉండటంతో జిల్లా రాజకీయ యవనిక పై కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా రాజకీయాలను ఏలిన నాయకులు తమ వారసులను రంగంలోకి దింపేందుకు యత్నిస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న మునిసిపల్, స్థానిక, సాధారణ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కానున్నారు. జిల్లా జనాభాలో సుమారు 37శాతం జనాభా 39 ఏ ళ్ల లోపు వారే ఉన్నారు. నమోదైన ఓటర్ల జాబితా తో పోల్చితే 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయ సు కలిగిన ఓటర్లు 63.19 శాతం మంది ఉ న్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో యువ నాయకత్వానికి ఓటర్లు పట్టం కట్టా రు. మునిసిపల్, స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లోనూ యువ ఓటర్లే కీలకంకా నున్నారు. దీంతో అన్ని పార్టీలు యువతకు టికెట్ల పంపిణీలో పెద్దపీట వేశాయి. గతంలో రాజకీయాలంటే యువత విముఖత చూపే పరిస్థితి నుంచి ప్రస్తుతం పదవుల కోసం తీవ్రంగా పోటీదశకు చేరింది. విద్యావంతులైన యువత కూడా ఎన్నికల్లో పోటీచేస్తోంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారిలో 40ఏళ్ల లోపు వారే అత్యధికంగా ఉన్నట్లు అంచనా. ప్రజా సమస్యలను అర్థంచేసుకోవడ, పరిష్కరించడం తమ వల్లే అవుతుందని ఓటర్లకు నచ్చజెప్పడంలో యువ నాయకత్వమే ముందుంటుంది. యువత కు రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు కూడా తోడవడంతో భిన్న సామాజిక వర్గాల నుంచి కూడా నవతరం నాయకత్వం ముందుకొస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యే వంటి పదవుల్లో మాత్రం ఇంకా సాంప్రదాయక రాజకీయాల వాసనే కొనసాగుతోంది. యువ ఓటర్లు ఎన్నికల ఫలితాలను శాసించే స్థితిలో ఉండటంతో తలపండిన రాజకీయ నేతలు కొత్తఎత్తులు వేస్తున్నారు. తమ వారసులను ఎన్నికల బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. తెరపైకి యువ నాయకత్వం సోషల్ వెబ్సైట్లు వేదికగా యువత జోరుగా రాజకీయ చర్చలు సాగిస్తోంది. పార్టీలు, నాయకుల తీరును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఎండగడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు, నేతలు రాత్రికి రాత్రి సోషల్ నెట్‌వర్క్‌లో అకౌంట్లు తెరుస్తున్నారు. సొంత వెబ్సైట్ల ద్వారా తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. యువ ఓటర్లు గణనీయంగా పెరగడంతో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పార్టీలను అవకాశాలు కోరుతున్న యువత కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది.విశ్వసనీయతకు, విలువలకు పెద్దపీట వేసే పార్టీల నుంచి టికెట్లు కోరుతున్నారు. -
చుక్కెదురు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రెండు పర్యాయాలు ఎమ్మెల్యే.. ఆపై మంత్రి.. ఇంకేముంది జిల్లా అధికార వ్యవహారాల్లో ఆయన హవా కొనసాగింది. బదిలీలు.. పనులు.. ఒకటేమిటి అన్నింట్లో ఆయన మార్కు కనిపించింది. ఐదేళ్ల పదవీ కాలంలో ఉండే నాయకులకు అధికారులు గులాం కాక తప్పని పరిస్థితి. కాదూ కూడదంటే బదిలీయే బహుమానం. ఇలా మంత్రి టీజీ జారీ చేసిన ఆదేశాలన్నింటికీ అధికార యంత్రాంగం తలూపింది. మరో వారం రోజుల్లో సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ పార్టీ మంత్రిగా రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయిన ఆయన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కనీసం ప్రజలను ఆకట్టుకోవడం ద్వారానైనా నాలుగు ఓట్లు రాబట్టుకోవాలనుకుంటే అక్కడా చుక్కెదురవుతోంది. కర్నూలువాసులకు కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం గ్రామ వ్యవసాయ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తనదైన శైలిలో పావులు కదిపారు. ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు మురళీకృష్ణ కర్నూలు పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే శాఖ కేంద్ర సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాజకీయంగా కోట్ల, టీజీ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇళ్ల పట్టాల వ్యవహారాన్ని ఎమ్మెల్యే మురళి అడ్డుకున్నారు. అయితే రాష్ట్ర మంత్రి కావడంతో కొంతవరకు ఫైల్‌ను కదిలించగలిగినా.. చిట్టచివరన అధికారులు బ్రేక్ వేశారు. రచ్చబండ-1లో ఇళ్ల పట్టాల కోసం వచ్చిన వినతులకు సంబంధించి 7,700 మందికి కర్నూలు మండలం రుద్రవరం గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 507/ఏ, 605, 652, 671, 681లో 243 ఎకరాలను పంపిణీ చేయాలని భావించారు. అయితే ఆ భూముల్లో 170 ఎకరాలను రైతులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. వారికి తెలియకుండా ఆ భూములను లాక్కొని ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మంత్రి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా భూములను డీలిస్ట్ చేయించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ భూమిలో 2,500 మందికి పట్టాలు కూడా పంపిణీ చేసేశారు. మిగిలిన 5,200 పట్టాలను పంపిణీ చేసేందుకు గత కొద్దిరోజుల క్రితం టీజీవి అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుసుకున్న రైతులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. విషయాన్ని వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన గుట్టురట్టు చేశారు. విషయం అప్పటికి సద్దుమణిగినా రెండు రోజులుగా రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీవ్రతరమయ్యాయి. ఎన్నికల సమయంలో ఆయన మాటకు తలూపితే ఇబ్బందులు తప్పవని భావించినా అధికారులు సంతకాలు పెట్టేందుకు నిరాకరించారు. అపద్ధర్మ సీఎం నుంచి ఫోన్? తన మాట వినకపోవడంతో టీజీ వెంకటేష్ పట్టాలపై సంతకాలు చేయాలంటూ అపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిచే జిల్లా అధికారికి ఫోన్ చేయిచినట్లు విశ్వసనీయ సమాచారం. అంతకు ముందు ఇటీవల బదిలీ అయిన కర్నూలు మండల తహశీల్దార్ బాలగణేషయ్యపైనా ఆ విషయమై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పట్టాల వ్యవహారాన్ని మంత్రి కోట్ల వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. -
నగరి మున్సిపాలిటీ రద్దు సంగతేంటి?
హామీలు మరచిన ముద్దుకృష్ణమనాయుడు ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకెక్కడిది? ఎమ్మెల్యే ‘గాలి’ తీరుపైఆర్.కె.రోజా ధ్వజం పుత్తూరు, న్యూస్‌లైన్: ఓట్లు, సీటు కోసం ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎంతటి స్థాయికైనా దిగజారుతారనేందుకు నగరి మున్సిపాలిటీని రద్దు చేయిస్తానని ఇచ్చిన హామీనే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, నగరి నియోజకవర్గ సమన్వయక కర్త ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తనది 35 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ముద్దుకృష్ణమ నాయుడు పుత్తూరు, నగరి మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చుకున్నారని గుర్తు చేశారు. టీడీపీలో నగరి నియోజకవర్గం టికెట్టు పొంది, ఓట్ల కోసం నగరి మున్సిపాలిటీని రద్దు చేయిస్తానని, నేతన్నలు పెరిగిన విద్యుత్ చార్జీలను చెల్లించవద్దని, వాటిని రద్దు చేయిస్తానని ప్రలోభపెట్టారన్నారు. ఆయన స్వల్ప ఓట్లతో గట్టెక్కితే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఈ సాకు చూపించి ఐదేళ్ల కాలాన్ని గడిపేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలకు కొత్త కథను రూపొందించి మహానేత వైఎస్ఆర్పై, ఆయన తనయుడు జగన్‌పై విమర్శనాస్త్రాలను చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు మంజూరు చేయించుకుని అపరభగీరథుడు అంటూ పొగడ్తలు కురిపించారన్నారు. నేడు మహానేతపై చేస్తున్న బురదజల్లే రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పుత్తూరులో ఓవర్‌బ్రిడ్జ్, సమ్మర్‌స్టోరేజీ, అండర్‌బ్రిడ్జ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరు చేయించుకుని తన అనుచరులకు కాంట్రాక్ట్‌లు అప్పగించుకోలేదా ? అని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలో జననేత జగన్ నాలుగు రోజుల పర్యటనకు అపూర్వ స్పందన లభించిందన్నారు. దీన్ని ఓర్వలేని ముద్దుకృష్ణమ నాయుడు ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కోటల్లో సైతం జగన్‌కు జనం అపూర్వ స్వాగతం పలికారన్నారు. దీంతో ముద్దుకృష్ణమ నాయుడుకు మతిభ్రమించి స్థాయి మరచి మరింత దిగజారిపోయి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
చంద్రబాబు అటూ, ఇటూ మోసం చేస్తున్నారు: జగన్
చిత్తూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ, సీమాంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ తలపెట్టిన సమైక్య శంఖారావం - ఓదార్పు యాత్ర మంగళవారం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర విజభనపై చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఇరు ప్రాంతాల్లోనూ డ్రామాలాడిస్తున్నారని జగన్ అన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు. రాజకీయాలంటే రాష్ట్రాన్ని ఎలా విడగొట్టి, ఓట్లు ఎలా దండుకోవాలని ఆలోచించడం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. పేదవాడి గుండెల్లో ఎలా బతకాలో నేర్చుకోవాలని హితవు పలికారు. సమైక్య శంఖారావం - ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ ఈరోజు నారాయనవనం గ్రామంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. శాసనసభ హాలులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాలవారితో విభిన్న వాదనలు చేయిస్తున్నారని చెప్పారు. పార్టీ అన్నాకా ఆ నాయకుడికి విశ్వశనీయత ఉండాలన్నారు. ప్రజలకు న్యాయం చేసే దమ్ము కూడా ఉండాలన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని, అప్పుడు మన రాష్ట్రాన్ని ఎవరు విడగొడతారో చూద్దాం అని అన్నారు. సమైక్యం అన్నవారినే ప్రధానిని చేద్దాం అన్నారు. ఇది ఢిల్లీ అహంకారానికి తెలుగువారి ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. పేదరికానికి వైద్యం చేయాలంటూ ఆలోచించిన నేత వైఎస్ఆర్ అని చెప్పారు. ఆరోగ్యశ్రీతో ధనవంతుని బెడ్ పక్కనే పేదవానికి వైద్యం చేయించిన ఘనత వైఎస్ఆర్ది అని గుర్తు చేశారు. మన నీటి కోసం మనమే కొట్టుకు చావాలా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను విడచి వెళ్లిపోవాలంటే వెళ్లిపోవాలా? అని జగన్ అడిగారు. -
రాజకీయాలంటే ఓట్లు దండుకోవడం కాదు:జగన్
-
మైనారిటీలపై కాంగ్రెస్ వల!
ప్రత్యేక పథకాలపై భారీ ప్రచారం లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం న్యూఢిల్లీ: ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. మైనారిటీలకు ప్రకటించిన ప్రత్యేక పథకాలపై భారీ ప్రచారం, లబ్ధి చేకూర్చే పొత్తులు, ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం వంటి అంశాలపై కసరత్తు మొదలుపెట్టింది. పనిలోపనిగా రాహుల్ గాంధీనే తమ భావినాయకుడని తేల్చేసింది. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో మైనారిటీల డిమాండ్లు, అభిప్రాయాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం సోమవారం 200 మంది మైనారిటీ విభాగాల నేతలతో భేటీ నిర్వహించింది. 11, 12వ పంచవర్ష ప్రణాళికల్లో మైనారిటీలకు ప్రవేశపెట్టిన ‘జియో పార్శీ’(పార్శీల సంక్షేమానికి), ‘సీఖో ఔర్ కమావో’(చదువు, సంపాదన), ‘నయీ రోష్ని’ (కొత్త వెలుగు) వంటి పథకాలు, వక్ఫ్ సంస్కరణలు, మైనారిటీ సంక్షేమ శాఖ సాధించిన విజయాలతో రూపొందించిన బుక్లెట్లను అందించింది. వాటిలోని అంశాలపై మైనారిటీలో ్లప్రచారం చేయాలని సూచించింది. భేటీలో మైనారిటీ నేతలు పలు ఫిర్యాదులు చేశారు. ముస్లిం ఓటుబ్యాంకును కాపాడుకోవాలంటే దిద్దుబాటు చర్యలు అవసరమన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వారి వాదనతో ఏకీభవించారు. బీఎస్పీ, ఆర్జేడీలతో పొత్తుకు కసరత్తు లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్జేడీలతో పొత్తుకు కాంగ్రెస్ అవకాశాలను అన్వేషిస్తోంది. వీటితో పొత్తు వల్ల 120 పార్లమెంటు సీట్లున్న ఉత్తరప్రదేశ్, బీహార్‌లో తమకు కలిసిసొస్తుందని భావిస్తోంది. వీటితోపాటు రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీతో చేయి కలిపితే జార్ఖండ్‌లోనూ లాభపడొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. మరోపక్క.. నిత్యావసరాల ధరల పెరుగుదల, అవినీతి వంటి సవాళ్ల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించేందుకు రాహుల్ ఈ నెల 27న పార్టీ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ధరల నియంత్రణ తదితరాలపై చర్చిస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ చెప్పారు. కాంగ్రెస్ భవిష్యత్ నాయకుడు రాహులేనని, అయితే తమ ప్రధాని అభ్యర్థిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సామాజిక మీడియాలో తమపై బీజేపీ సాగిస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో ‘సైబర్ ఆర్మీ’ని ఏర్పాటు చేస్తామన్నారు. కాగా గత పదేళ్లలో దేశం మంచి ఆర్థిక వృద్ధి, సర్వతోముఖాభివృద్ధి సాధించినప్పటికీ దేశవ్యాప్తంగా తమ పార్టీ రాజకీయంగా ఒంటరైందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు.