ఇజ్రాయెల్ సైన్యం (మే 26, 2024) రఫా నగరంపై బాంబు దాడలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఐతే గత శుక్రవారమే అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇజ్రాయెల్‌ని రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సమర్థించారు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) లోని భారత ప్రతినిధి, న్యాయమూర్తి దల్వీర్ భండారీ. ఆయన అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఓటు కూడా వేశారు. భండారీ 2012 నుంచి ఐసీజే సభ్యడిగా ఉన్నారు. ఆయన న్యాయమూర్తిగా తన కెరీర్‌లో అనేక గొప్ప మైలురాయి కేసులను వాదించారు.
ఆయన అక్టోబర్ 28, 2005న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రజావాజ్యం, రాజ్యాంగ చట్టం, క్రిమినల్ చట్టం, సివిల్ ప్రొసీజర్, అడ్మినిస్ట్రేటివ్ లా, ఆర్బిట్రేషన్, ఫ్యామిలీ లా, కార్మిక- పారిశ్రామిక చట్టం, కార్పొరేట్ చట్టం వంటి అంశాలలో ఆయన అనేక తీర్పులు ఇచ్చారు. అంతర్జాతీయ న్యాయస్థానంకి సంబంధించిన సముద్ర వివాదాలు, అంటార్కిటికాలో తిమింగలం వేట, మారణహోమం, కాంటినెంటల్ షెల్ఫ్ డీలిమిటేషన్, అణు నిరాయుధీకరణ, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, సార్వభౌమ హక్కుల ఉల్లంఘన వంటి అన్ని కేసులతో భండారీ సంబంధం కలిగి ఉన్నారు. న్యాయమూర్తి భండారీ అనేక సంవత్సరాలు ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ ఢిల్లీ సెంటర్‌కు అధ్యక్షత వహించారు.
సుప్రీంకోర్టుకు జడ్జిగా రాకమునుపు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. విడాకుల కేసులో అతడిచ్చిన తీర్పుతో హిందూ వివాహ చట్టం, 1955ను సవరించేలా కేంద్రాన్ని ప్రేరేపించింది. కాగా, ఇజ్రాయెల్ మారణహోమా చర్యలపై దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన దరఖాస్తుకు ప్రతి స్పందనగా ఐసీజే ప్రిసైడింగ్ జడ్జి నవాఫ్ సలామ్ ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలంటూ తీర్పుని ప్రకటించడం జరిగింది. అంతేగాదు ఇజ్రాయెల్ తక్షణమే ఎటువంటి అవరోధం లేని మానవతా సహాయాన్ని అందించాలని, అలాగే మారణహోమం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న యూఎన్ సంస్థలకు సహకరించాలని ఈ తీర్పులో నొక్కి చెప్పింది ఐసీజే. అయితే ఈ తీర్పుకి ఉగాండాకు చెందిన న్యాయమూర్తులు జూలియా సెబుటిండే, ఇజ్రాయెల్ హైకోర్టు మాజీ అధ్యక్షుడు జడ్జి అహరోన్ బరాక్ మాత్రమే భిన్నాభిప్రాయాలతో వ్యతిరేకంగా ఓటు వేశారు.
(చదవండి: అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు)
Comments
Please login to add a commentAdd a comment