Bhandari
-
Ratna Bhandar: తెరిచి ఉన్న చెక్క పెట్టెలు!
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న భాండాగారం స్థితిగతుల పట్ల సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రత్న భాండాగారం ఉన్నత స్థాయి తనిఖీ పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ రథ్ తాజా ప్రకటన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రత్న భాండాగారం లోపలి గదిలో ఓ ఇనుప పెట్టె ఉంది. దీనికి 2 తాళాలు వేసేందుకు సదుపాయం ఉంది. ఒక తాళం సరిగ్గా ఉండగా, మరొకటి వదులుగా వేలాడుతుందని పేర్కొన్నారు. అలాగే మరో 2 చెక్క పెట్టెలు తాళాలు లేకుండా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 1978లో రత్న భాండాగారంలోకి ప్రవేశించిన వారు ఇలా తాళాలు వేయకుండా బయటకు వచ్చారని తాను నమ్మలేకపోతున్నానని రథ్ పేర్కొనడం గమనార్హం. -
మరోమారు తెరుచుకున్న రత్న భాండాగారం
12వ శతాబ్దానికి చెందిన పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం నేడు (గురువారం) మరోమారు తెరిచారు. ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. రత్న భాండాగారంలోని విలువైన ఆభరణాలను లోపలి ఛాంబర్ నుండి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌నకు తరలించనున్న నేపధ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జేటీఏ) చీఫ్ అరబింద పాధి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత ఎవరినీ లోనికి అనుమతించడం లేదన్నారు. ఆలయ సింహద్వారం మాత్రమే తెరిచివుంచి, మిగతా తలుపులన్నీ మూసి వేశామని తెలిపారు. గత కొన్నేళ్లుగా భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన వస్తువులను ఆలయ సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లోనికి తరలించనున్నట్లు అరబింద పాధి తెలిపారు.ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్‌హౌస్‌కు ఆభరణాలను తరలించేందుకుగాను రత్న భండాగారం లోపలి గదిని ఆలయ పరిపాలనా యంత్రాంగం (ఎస్జేటీఏ) తిరిగి తెరిచింది. ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధి, జస్టిస్ విశ్వనాథ్ రథ్ (రత్నాల భాండాగారాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షక కమిటీ చైర్మన్), పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఇతర అధికారుల సమక్షంలో రత్న భాండాగారం లోపలి గదిని తెరిచారు. ఉదయం 9:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు అధికారులు రత్న భాండాగారంలో ఉండనున్నారు. ఇక్కడి విలువైన వస్తువులను తాత్కాలిక స్టోర్‌హౌస్‌కి తరలించనున్నారు.ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్నారు. -
Ratna Bhandar: నేడు మళ్లీ రత్న భాండాగారం ఓపెన్
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని రత్న భాండాగారం మరోసారి తెరవనున్నారు. ఈసారి కూడా శుభ ఘడియల్లో తెరిచేందుకు నిర్ణయించారు. రత్న భాండాగారం తనిఖీ ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ నిర్ణయం మేరకు ఈనెల 18వ తేదీ ఉదయం 9.51 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల మధ్య ఈ సన్నాహాలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ అత్యవసర సమావేశం శ్రీమందిర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. కమిటీ సభ్యులందరూ సమావేశంలో పాల్గొని వివరంగా చర్చించారు. శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి (సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి సమావేశం వివరాలు మీడియాకు వివరించారు.సురక్షితంగా ఆభరణాల తరలింపురత్న భాండాగారంలో ఆభరణాలు వగైరా సురక్షితంగా తరలించడమే ప్రధాన అజెండాగా చర్చ కొనసాగింది. సమావేశ నిర్ణయం మేరకు ఈనెల 18న మళ్లీ ఆలయంలోని రత్న భాండాగారం తెరిచి లోపల ఉన్న ఆభరణాలను తరలిస్తారు. ప్రధాన ఆలయం సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లోపలికి పకడ్బందీ వ్యవస్థ మధ్య తరలిస్తారు. ఈ విధానాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీన తొలిసారిగా రత్న భాండాగారం తెరిచిన విషయం తెలిసిందే. వెలుపలి గది పర్యవేక్షణ ముగించి ఆభరణాలు వగైరా తొలగించి ఖాళీ చేశారు. లోపలి గది తాళాలు తెరిచేందుకు విఫలయత్నం చేశారు. నకిలీ తాళం చెవిలతో తాళాలు తెరవకపోవడంతో విరగగొట్టి, గదిలోనికి ప్రవేశించినట్లు సీఏవో మరోసారి గుర్తు చేశారు. కానీ సమయాభావం వల్ల ఆభరణాల తరలింపు ప్రక్రియ చేపట్టకుండా పొడిగించారు. లోపల గదికి 3 తాళాలు వేసినట్లు గుర్తించారు. వాటిలో ఒకటి సీల్ వేసి ఉండగా, మిగిలిన రెండు సీలు లేకుండా ఉన్నట్లు రత్న భాండాగారం తనిఖీ ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటి బృందం గుర్తించింది. పాత తాళాలు విరగ్గొట్టడంతో మేజిస్ట్రేట్ సమక్షంలో రెండు కొత్త తాళాలు వేసి సీల్ చేసి, వాటి తాళం చెవిలు ట్రెజరీలో జమ చేశారు.మరమ్మతులకు అప్పగింతరాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం వెలుపలి మరియు లోపలి గదుల్లో రత్నాల వస్తువుల తరలింపు పూర్తయ్యి, ఖాళీ చేసిన తర్వాత వాటి మరమ్మతుల కోసం భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కి అప్పగిస్తారు. పురావస్తు శాఖ మరమ్మతులు పూర్తి చేశాక తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లోని ఆభరణాలన్నింటినీ తిరిగి రత్న భాండాగారంలో యథాతథంగా భద్రపరిచేందుకు తరలిస్తారు. తాజాగా జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం రత్న సంపద అన్ని లెక్కలు మరియు అంచనాలు జరుగుతాయని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి తెలియజేశారు. -
Puri Jagannath: నేడు తెరుచుకోనున్న జగన్నాథుడి రత్న భాండాగారం
భువనేశ్వర్: పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం లెక్కింపు ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శనివారం ప్రకటించారు. శ్రీ జగన్నాథ ఆలయ పాలక మండలి సమీక్షించిన నిర్ధారిత కార్యాచరణ (ఎస్వోపీ)ని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించగా, శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. జగన్నాథ ఆలయ అధికారిక వర్గం (ఎస్జేటీఏ) నిర్ణయించిన శుభ ముహూర్తంలో రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని తెలిపారు. దశలవారీగా ఈ పనులు సాగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆభరణాల జాబితా రూపకల్పనలో పారదర్శకతను నిర్ధారించడానికి, భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సహాయం కోరామని, శ్రీ మందిరం పాలక మండలి బృందానికి సహకరించేందుకు ఆర్బీఐ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓఈకు అప్పగించినట్లు మంత్రి చెప్పారు. -
ప్రపంచ న్యాయస్థానం తీర్పుని సమర్థించిన భారత న్యాయమూర్తి!
ఇజ్రాయెల్ సైన్యం (మే 26, 2024) రఫా నగరంపై బాంబు దాడలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఐతే గత శుక్రవారమే అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇజ్రాయెల్‌ని రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సమర్థించారు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) లోని భారత ప్రతినిధి, న్యాయమూర్తి దల్వీర్ భండారీ. ఆయన అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఓటు కూడా వేశారు. భండారీ 2012 నుంచి ఐసీజే సభ్యడిగా ఉన్నారు. ఆయన న్యాయమూర్తిగా తన కెరీర్లో అనేక గొప్ప మైలురాయి కేసులను వాదించారు. ఆయన అక్టోబర్ 28, 2005న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రజావాజ్యం, రాజ్యాంగ చట్టం, క్రిమినల్ చట్టం, సివిల్ ప్రొసీజర్, అడ్మినిస్ట్రేటివ్ లా, ఆర్బిట్రేషన్, ఫ్యామిలీ లా, కార్మిక- పారిశ్రామిక చట్టం, కార్పొరేట్ చట్టం వంటి అంశాలలో ఆయన అనేక తీర్పులు ఇచ్చారు. అంతర్జాతీయ న్యాయస్థానంకి సంబంధించిన సముద్ర వివాదాలు, అంటార్కిటికాలో తిమింగలం వేట, మారణహోమం, కాంటినెంటల్ షెల్ఫ్ డీలిమిటేషన్, అణు నిరాయుధీకరణ, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, సార్వభౌమ హక్కుల ఉల్లంఘన వంటి అన్ని కేసులతో భండారీ సంబంధం కలిగి ఉన్నారు. న్యాయమూర్తి భండారీ అనేక సంవత్సరాలు ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ ఢిల్లీ సెంటర్‌కు అధ్యక్షత వహించారు.సుప్రీంకోర్టుకు జడ్జిగా రాకమునుపు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. విడాకుల కేసులో అతడిచ్చిన తీర్పుతో హిందూ వివాహ చట్టం, 1955ను సవరించేలా కేంద్రాన్ని ప్రేరేపించింది. కాగా, ఇజ్రాయెల్ మారణహోమా చర్యలపై దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన దరఖాస్తుకు ప్రతి స్పందనగా ఐసీజే ప్రిసైడింగ్ జడ్జి నవాఫ్ సలామ్ ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలంటూ తీర్పుని ప్రకటించడం జరిగింది. అంతేగాదు ఇజ్రాయెల్ తక్షణమే ఎటువంటి అవరోధం లేని మానవతా సహాయాన్ని అందించాలని, అలాగే మారణహోమం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న యూఎన్ సంస్థలకు సహకరించాలని ఈ తీర్పులో నొక్కి చెప్పింది ఐసీజే. అయితే ఈ తీర్పుకి ఉగాండాకు చెందిన న్యాయమూర్తులు జూలియా సెబుటిండే, ఇజ్రాయెల్ హైకోర్టు మాజీ అధ్యక్షుడు జడ్జి అహరోన్ బరాక్ మాత్రమే భిన్నాభిప్రాయాలతో వ్యతిరేకంగా ఓటు వేశారు. (చదవండి: అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు) -
రెండేళ్ల గరిష్టానికి తయారీ రంగం: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్లో మంచి పనితీరును ప్రదర్శించిందని హెచ్ఎస్బీసీ సర్వే శుక్రవారం పేర్కొంది. దేశం నుంచి అలాగే విదేశాల నుంచి పటిష్టమైన ఆర్డర్లతో రెండేళ్ల గరిష్టానికి తయారీ రంగం ఉత్పత్తి పెరిగిందని హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ప్రన్జుల్ భండారీ పేర్కొన్నారు. డిసెంబర్లో తయారీ రంగం ఉత్పత్తికి సంబంధించి హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 54.5 వద్ద ఉంది. ఈ సూచీ పాయింట్లు నవంబర్‌లో 53.3. గత 14 నెలలుగా తయారీ రంగం ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. హెచ్ఎస్బీసీ పీఎంఐ 50 పైన ఉంటే దానిని వృద్ధికి సంకేతంగా పరిగణిస్తారు. ఆ దిగువన నమోదయితే క్షీణతగా ఆ సంస్థ పరిగణిస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గుదల సానుకూల ధోరణి సైతం తయారీ రంగానికి దోహదపడిందని హెచ్ఎస్బీసీ వర్గాలు వివరించాయి. ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో కొనసాగుతున్న పక్షంలో 2015లో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందని భండారీ అన్నారు.