భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న భాండాగారం స్థితిగతుల పట్ల సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రత్న భాండాగారం ఉన్నత స్థాయి తనిఖీ పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ రథ్ తాజా ప్రకటన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
రత్న భాండాగారం లోపలి గదిలో ఓ ఇనుప పెట్టె ఉంది. దీనికి 2 తాళాలు వేసేందుకు సదుపాయం ఉంది. ఒక తాళం సరిగ్గా ఉండగా, మరొకటి వదులుగా వేలాడుతుందని పేర్కొన్నారు. అలాగే మరో 2 చెక్క పెట్టెలు తాళాలు లేకుండా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 1978లో రత్న భాండాగారంలోకి ప్రవేశించిన వారు ఇలా తాళాలు వేయకుండా బయటకు వచ్చారని తాను నమ్మలేకపోతున్నానని రథ్ పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment