Puri jagannath temple
-
రత్న భండార్‌లో రెండో సర్వే ప్రారంభం
పూరీ: భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) ఒడిశా పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్‌లో శనివారం మధ్యాహ్నం రెండో దఫా టెక్నికల్ సర్వే ప్రారంభించింది. మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని, మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 6 గంటల ద్వారా భక్తులను ఆలయంలోకి అనుతించబోమని శ్రీజగన్నాథ్ ఆలయ పరిపాలనా విభాగం అధికారులు వెల్లడించారు. సర్వే జరుగుతున్న సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. రత్న భండార్‌లో రహస్య గది గానీ, సొరంగం గానీ ఉన్నా యా? అనేది తేల్చబోతున్నామని రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఈ సర్వే కోసం అత్యాధునిక రాడార్‌ను ఉపయోగిస్తున్న ట్లు వివరించారు. రత్న భండార్‌లో మొదటి దఫా సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. -
పూరీ జగన్నాథ ఆలయంలో కలకలం
పూరీ: ఒడిశాలోని పూరిలో గల జగన్నాథ ఆలయంలో కలకలం చెలరేగింది. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆలయంలో నిత్యం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయితే తాజాగా జరిగిన ఒక ఉదంతం ఆలయ భద్రతపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆలయ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ శిఖరంపైకి చేరుకున్నాడు. దీనిని చూసినవారంతా షాకయ్యారు. సాయంత్రం వేళ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ గోపురంపైకి ఎక్కిన వ్యక్తిని చూసిన ఆలయ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారు.పూరీలోని శ్రీ మందిరం చుట్టూ గట్టి భద్రతా వలయం ఉంది. దీనిని తప్పించుకుని ఆ వ్యక్తి ఆలయంపైకి ఎలా ఎక్కగలిగాడనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. కాగా శిఖరాన్ని అధిరోహించిన ఆ వ్యక్తి పైననే కొద్దిసేపు ఉన్నాడు. ఆలయ అధికారులు అతనిని కిందకు తీసుకువచ్చారు. తరువాత పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి తాను ఒడిశాలోని ఛత్రపూర్నకు చెందినవాడినని తెలిపాడు. 1988 నుంచి తాను ఆలయానికి వస్తున్నానని, తన కోరిక ఒకటి నెరవేరాక, ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రాన్ని తాకి, అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: Karnataka: గణపతి నిమజ్జనంలో ఉద్రిక్తత -
Ratna Bhandar: తెరిచి ఉన్న చెక్క పెట్టెలు!
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న భాండాగారం స్థితిగతుల పట్ల సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రత్న భాండాగారం ఉన్నత స్థాయి తనిఖీ పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ రథ్ తాజా ప్రకటన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రత్న భాండాగారం లోపలి గదిలో ఓ ఇనుప పెట్టె ఉంది. దీనికి 2 తాళాలు వేసేందుకు సదుపాయం ఉంది. ఒక తాళం సరిగ్గా ఉండగా, మరొకటి వదులుగా వేలాడుతుందని పేర్కొన్నారు. అలాగే మరో 2 చెక్క పెట్టెలు తాళాలు లేకుండా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 1978లో రత్న భాండాగారంలోకి ప్రవేశించిన వారు ఇలా తాళాలు వేయకుండా బయటకు వచ్చారని తాను నమ్మలేకపోతున్నానని రథ్ పేర్కొనడం గమనార్హం. -
భండార్ నుంచి స్ట్రాంగ్ రూంకు
పురీ: పురీ జగన్నాథుని ఆలయంలోని అమూల్య వస్తువులు, ఆభరణాల తరలింపు గురువారం పూర్తయింది. రత్న భండార్ లోపలి గదిలో ఉన్న అమూల్య సంపదను ఆలయం ఆవరణలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించారు. చెక్క, ఇనుప అల్మారాలు, భోషాణాలు తదితర ఏడింటిలో ఉన్న వీటిని స్ట్రాంగ్ రూంకు మార్చేందుకు ఏడు గంటలు పట్టిందని ఆలయ ప్రధాన అధికారి అరబింద చెప్పారు. అనంతరం రత్న భండార్తోపాటు స్ట్రాంగ్ రూంకు కూడా నిబంధనలను అనుసరించి తాళం, సీల్ వేసి తాళం చెవులను కలెక్టర్‌కు అందజేశామన్నారు.రత్న భండార్ లోపలి భాగంలోని అమూల్య సంపదను తాము పరిశీలించామని సూపర్వైజరీ కమిటీ చైర్మన్, ఒరిస్సా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. రత్న భండార్‌కు అవసరమైన మరమ్మతులను భారత పురావస్తు శాఖ చేపట్టనుందని, ఆ తర్వాతే స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అభరణాలు, ఇతర వస్తువుల జాబితా తయారీ ప్రక్రియ మొదలవుతుందని పూరీ రాజవంశీకుడు దిబ్య సింఘ దేబ్ వివరించారు. లోపలి చాంబర్ కింద సొరంగం ఉన్నదీ లేదని సర్వేలోనే తేలుతుందన్నారు.అమూల్య వస్తువులు, నగల తరలింపు ప్రక్రియను వీడియోలో చిత్రించినట్టు పురీ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వాన్ చెప్పారు. ఆలయం చుట్టుపక్కల భారీ భద్రత ఉంటుందని ఎస్పీ పినాక్ మిశ్రా చెప్పారు. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాములు పట్టేవాళ్లు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. రత్నభండార్ లోపల రక్షణగా పాము ఉందన్న వార్తలపై స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యుడు సువేందు మాలిక్ స్పందిస్తూ...అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. -
పూరీ రత్నభాండాగరం ఇవాళ మళ్లీ ఓపెన్ చేయనున్న అధికారులు
-
Ratna Bhandar: నేడు మళ్లీ రత్న భాండాగారం ఓపెన్
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని రత్న భాండాగారం మరోసారి తెరవనున్నారు. ఈసారి కూడా శుభ ఘడియల్లో తెరిచేందుకు నిర్ణయించారు. రత్న భాండాగారం తనిఖీ ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ నిర్ణయం మేరకు ఈనెల 18వ తేదీ ఉదయం 9.51 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల మధ్య ఈ సన్నాహాలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ అత్యవసర సమావేశం శ్రీమందిర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. కమిటీ సభ్యులందరూ సమావేశంలో పాల్గొని వివరంగా చర్చించారు. శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి (సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి సమావేశం వివరాలు మీడియాకు వివరించారు.సురక్షితంగా ఆభరణాల తరలింపురత్న భాండాగారంలో ఆభరణాలు వగైరా సురక్షితంగా తరలించడమే ప్రధాన అజెండాగా చర్చ కొనసాగింది. సమావేశ నిర్ణయం మేరకు ఈనెల 18న మళ్లీ ఆలయంలోని రత్న భాండాగారం తెరిచి లోపల ఉన్న ఆభరణాలను తరలిస్తారు. ప్రధాన ఆలయం సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లోపలికి పకడ్బందీ వ్యవస్థ మధ్య తరలిస్తారు. ఈ విధానాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీన తొలిసారిగా రత్న భాండాగారం తెరిచిన విషయం తెలిసిందే. వెలుపలి గది పర్యవేక్షణ ముగించి ఆభరణాలు వగైరా తొలగించి ఖాళీ చేశారు. లోపలి గది తాళాలు తెరిచేందుకు విఫలయత్నం చేశారు. నకిలీ తాళం చెవిలతో తాళాలు తెరవకపోవడంతో విరగగొట్టి, గదిలోనికి ప్రవేశించినట్లు సీఏవో మరోసారి గుర్తు చేశారు. కానీ సమయాభావం వల్ల ఆభరణాల తరలింపు ప్రక్రియ చేపట్టకుండా పొడిగించారు. లోపల గదికి 3 తాళాలు వేసినట్లు గుర్తించారు. వాటిలో ఒకటి సీల్ వేసి ఉండగా, మిగిలిన రెండు సీలు లేకుండా ఉన్నట్లు రత్న భాండాగారం తనిఖీ ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటి బృందం గుర్తించింది. పాత తాళాలు విరగ్గొట్టడంతో మేజిస్ట్రేట్ సమక్షంలో రెండు కొత్త తాళాలు వేసి సీల్ చేసి, వాటి తాళం చెవిలు ట్రెజరీలో జమ చేశారు.మరమ్మతులకు అప్పగింతరాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం వెలుపలి మరియు లోపలి గదుల్లో రత్నాల వస్తువుల తరలింపు పూర్తయ్యి, ఖాళీ చేసిన తర్వాత వాటి మరమ్మతుల కోసం భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కి అప్పగిస్తారు. పురావస్తు శాఖ మరమ్మతులు పూర్తి చేశాక తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లోని ఆభరణాలన్నింటినీ తిరిగి రత్న భాండాగారంలో యథాతథంగా భద్రపరిచేందుకు తరలిస్తారు. తాజాగా జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం రత్న సంపద అన్ని లెక్కలు మరియు అంచనాలు జరుగుతాయని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి తెలియజేశారు. -
మూడో గది రహస్యం.. 46 ఏళ్ల తర్వాత ఇలా! తెరుచుకున్న పూరీ రత్నభాండాగారం (ఫొటోలు)
-
జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.
-
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Puri Jagannath Temple: సిరిసంపదల లెక్కకు శ్రీకారం
భువనేశ్వర్: దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. పూరీలోని జగన్నాథుని రత్న భాండాగారంలో సంపద లెక్కింపు ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రారంభమైంది. రత్న భాండాగారం తనిఖీ పర్యవేక్షక కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో 11 మంది ప్రముఖులు శుభఘడియల్లో రత్న భాండాగారం లోపలికి ప్రవేశించారు. వీరిలో పూరీ జిల్లా కలెక్టర్, భారత పురావస్తు శాఖ సూపరింటెండెంట్, రత్న భాండాగారం సబ్ కమిటీ సభ్యుడు, పర్యవేక్షక ప్యానెల్ నుంచి ఇద్దరు సభ్యులు, గజపతి మహారాజు ప్రతినిధి, సేవకుల సంఘం నుండి నలుగురు ప్రతినిధులు ఉన్నారు.తొలి రోజు ఇలా..సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా తెరుచుకోని రత్న భాండాగారంలో అన్ని గదుల్ని ఏక విడతలో తెరిచి సమగ్ర సంపదని లెక్కించడం అసాధ్యం. తొలి రోజున వెలుపలి భాండాగారం తెరిచి దానిలోని సంపదని శ్రీ మందిరంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. వెలుపలి గది పని పూర్తి కావడంతో లోపలి గది తెరిచే సరికి వేళ దాటింది. ఒకసారి గదిలోని సంపదని తాకితే నిరవధికంగా సమగ్ర సంపదని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కానందున తొలి రోజున నామ మాత్రపు పర్యవేక్షణతో పని ముగించారు. లోపలి గదిలో పలు చెక్క పెట్టెలు, బీరువాలు, సొరుగుల్లో రత్న సంపద ఉన్నట్లు గుర్తించారు. జగన్నాథుని మారు రథయాత్ర నీలాద్రి విజే తర్వాత రత్న భాండాగారం పర్యవేక్షణ మలి విడత తేదీ ప్రకటిస్తారు.కట్టుదిట్టమైన నియమావళిలెక్కింపు సందర్భంగా ఆలయ ప్రధాన పాలనాధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన నిర్ధారిత కార్యాచరణ నియమావళి(ఎస్ఓపీ)ని పకడ్బందీగా అమలు చేశారు. రత్న భాండాగారం తెరిచి శ్రీమందిరం సింహద్వారం మినహా మిగిలిన 3 ద్వారాల్ని మూసి వేశారు. తనిఖీ కోసం లోనికి ప్రవేశించే సభ్యులను బెహెరాన్ ద్వారం సమీపంలో తనిఖీ చేసి అనుమతించారు. ఈ ప్రక్రియనంతా వీడియో తీశారు.తాళాలు విరగ్గొట్టి..గతంలో రత్న భాండాగారం తాళం చెవి గల్లంతైంది. తదుపరి దశలో నకిలీ తాళం చెవిలు లభ్యమైనట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. దీర్ఘకాలంగా లోపలి భాండాగారం తెరవనందున నకిలీ తాళం చెవిలతో తలుపులు తెరవలేని పరిస్థితుల్లో విరగొట్టాల్సిందేనని తనిఖీ పర్యవేక్షణ ఉన్నత స్థాయి కమిటీ ఎస్ఓపీలో పేర్కొంది. ఈ క్రమంలో ఆదివారం రత్న భాండాగారం తెరిచే ప్రయత్నంలో కలెక్టర్ అందజేసిన తాళం చెవి పనిచేయకపోవడంతో ఫోరెన్సిక్ నిపుణులతో మేజిస్ట్రేట్, కలెక్టర్ సమక్షంలో తాళాలు విరగ్గొట్టారు. 3 తాళాల్లో ఒకటి మాత్రమే సీలు వేసి ఉండగా మిగిలిన రెండు తాళాలకు సీలు లేనట్లు గుర్తించారు. 2 కొత్త తాళాలతో లోపలి గది మూశారు. ఈ రెండు తాళాలు సీలు చేసి తాళం చెవులను జిల్లా కలెక్టరుకు అప్పగించి ట్రెజరీలో భద్రపరిచేలా ఆదేశించారు.సంప్రదాయం ప్రకారం..శ్రీ మందిరం రత్న భాండాగారం యజమాని శ్రీ మహాలక్ష్మి. సంరక్షకురాలు విమలా మాత, ప్రధాన రక్షకుడు లోకనాథ మహాప్రభువు. ప్రభువు నుంచి ఆజ్ఞామాల రావడంతో సభ్యులు శ్రీ మందిరంలోనికి అడుగిడారు. తొలుత మహా లక్ష్మి, విమలా మాతని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి నుంచి అనుమతి పొందిన తర్వాత తలుపులు తెరిచారు.భారీ చెక్క పెట్టెల తరలింపు..రత్న భాండాగారంలో స్వామి ఆభరణాలు భద్రపరిచేందుకు పూరీకి 6 భారీ చెక్క పెట్టెలు తరలించారు. వీటిని టేకు కలపతో తయారు చేసి లోపల నలువైపులా ఇత్తడి తాపడంతో సిద్ధం చేశారు. ఒక్కో పెట్టె 4.5 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు, రెండు అడుగుల లోతు పరిమాణంతో తయారయ్యాయి. స్వామి యాత్ర సందర్భంగా వినియోగించే పెట్టెల్ని ఇవి పోలి ఉన్నాయి. రత్న భాండాగారంలో సమగ్ర సంపద భద్రపరిచేందుకు మొత్తం 15 చెక్క పెట్టెలు అవసరం ఉంటుందని అంచనా. ఈ మేరకు తయారీ పనులు కొనసాగుతున్నాయి. తొలి దశ పనుల కోసం 6 పెట్టెల్ని సిద్ధం చేశారు.పాముల భయం లేదు..దశాబ్దాల తర్వాత రత్న భాండాగారం తెరుస్తున్నందున పాములు నిండి ఉంటాయని సోషల్ విస్తృత ప్రచారం జరగడంతో స్నేక్ హెల్ప్‌లైన్, ఓడ్రాఫ్ దళాల్ని సిద్ధం చేశారు. అయితే రత్న భాండాగారం లోపల పాముల భయం లేనందున స్నేక్ హెల్ప్‌లైన్ నిపుణుడు సువేందు మల్లిక్ ఆధ్వర్యంలో బృందం వెనుదిరిగింది. ఆకస్మిక అవసరాల దృష్ట్యా ఈ బృందాన్ని శ్రీ మందిరం ఆవరణలో అందుబాటులో ఉంచారు. లోపలికి మాత్రం అనుమతించ లేదు.గబ్బిలాల అలికిడి..రత్న భాండాగారం తెరవడంతో గబ్బిలాలు పెద్ద సంఖ్యలో అలికిడి చేశాయి. ఒక్కసారిగా బయటకు ఎగిరి వచ్చాయి. ఈ పక్షులు శ్రీ మందిరం సింహద్వారాన్ని అనుసంధాన పరిచే 22 పావంచాల మార్గంలో బయటకుఎగిరి పోయాయి.ఎస్పీపై వదంతులు..రత్న భాండాగారం తెరిచిన కాసేపటికి భద్రతా వ్యవస్థ పర్యవేక్షకుడు, పూరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పినాకి మిశ్రా అస్వస్థతకు గురై సొమ్మసిల్లినట్లు పుకారు వ్యాపించింది. ఈ వార్తని సేవాయత్ ప్రతినిధి ఒకరు ప్రసారం చేయడంతో కాసేపు కలకలం రేగింది. తక్షణమే ఎస్పీ స్వయంగా మీడియా ముందు హాజరై వదంతులు నమ్మవద్దని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు.రత్న భాండాగారం లోపల పరిస్థితి సాధారణంగానే ఉంది. మాలో ఎవరికీ ఎటువంటి శారీరక , మానసిక ఇబ్బంది కలగలేదు. అందరూ జగన్నాథుని నామస్మరణ చేస్తూ లోపలికి వెళ్లాం.కొన్ని చెక్క పెట్టెలు (2), కొన్ని బీరువాలు ( 5), ఇతర వస్తువులు ఉన్నాయి. వెలుపలి గది నుంచి సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచేందుకు సుమారు 3 గంటలు నిర్విరామంగా శ్రమించాల్సి వచ్చింది. – జస్టిస్ బిశ్వనాథ్ రథ్ -
రత్న భాండాగారం రహస్యం ఇదే
-
పూరీ: రత్నభాండాగారంలో ఆభరణాల లెక్కింపు నిలిపివేత
👉 పూరీ రత్నభాండగారంలో ఆభరణాల లెక్కింపును అధికారులు నిలిపివేశారు.👉 ఇవాళ చీకటి పడటంతో లెక్కింపును నిలిపివేసినట్లు తెలిపారు. 👉 రేపు (సోమవారం) తిరిగి ఆభరణాలను అధికారులు లెక్కించనున్నారు. 👉 ‘‘ రత్నభాండాగారం రహస్య గది తాళాలు పగలగొట్టి లోపలి వెళ్లాము. బయటి రత్నభాండాగారంలోని ఆభరణాలను మార్చేశాము. లోపలి భాండాగారంలోని ఆభరణాలను మార్చుతున్నామని అధికారులు తెలిపారు. ఆభరణాల లెక్కింపుకు ఇవాళ సమయం మించిపోయింది. ఆభరణాల లెక్కింపు ప్రక్రియను రేపు(సోమవారం) చేపట్టాలని నిర్ణయించుకున్నాం’’ అనిశ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (SJTA)చీఫ్ అరబింద పాధీ మీడియాకు తెలిపారు. Puri, Odisha: The Ratna Bhandar of the Shri Jagannath Temple opened today.Sri Jagannath Temple Administration (SJTA) Chief Arabinda Padhee says, "All the ornaments of outer Ratna Bhandar have been shifted; the inner Ratna Bhandar was opened after breaking the locks. The… pic.twitter.com/R0TandjiG3— ANI (@ANI) July 14, 2024 👉 ఈసారి లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది. సంపదను మరోచోటుకు తరలించి పటిష్టమైన భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. వివరాల నమోదును డిజిటలైజేషన్ చేస్తామని ఒడిశా ప్రభుత్వంలో చెబుతోంది.👉రత్న భాండాగారం రహస్య గది లోపలికి 11 మంది కమిటీ సభ్యులు వెళ్లారు. రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలను పెట్టెల్లో కమిటీ సభ్యులు భద్రపర్చనున్నారు.👉 బంగారం నాణ్యతను ఆర్బీఐ ప్రతినిధులు పరిశీలించనున్నారు. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.👉 పూరీ జగన్నాథ్ ఆలయ రత్న భాండాగారం రహస్య గదిని అధికారులు తెరిచారు. ఈ మేరకు రహస్య గది తలుపులు తెరిచినట్లు సీఎంవో అధికారికంగా ప్రకటించింది. 👉 46 ఏళ్ల రత్న భాండాగారం రహస్య గదిని అధికారులు ఓపెన్ చేశారు. చివరగా 1978లో రహస్య గదిని అధికారులు తెరిచారు. 👉కాగా, ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈనెల 19వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది?అనే విషయాలు తెలియాల్సి ఉంది.👉ఇక, రత్న భాండాగారం తెరిచిన సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగానే ఏర్పాట్లు చేశారు. రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియంతా డిజిటలైజేషన్ చేయనున్నారు. 👉 మరోవైపు.. నిధిని తెరిచి అందులోని వస్తువులను తరలించేందుకు ఆరు పెట్టెలను అధికారులు సిద్ధం చేశారు. #WATCH | Odisha | Ratna Bhandar of Sri Jagannath Temple in Puri re-opened today after 46 years.Visuals from outside Shri Jagannath Temple. pic.twitter.com/BzK3tfJgcA— ANI (@ANI) July 14, 2024 👉 ఇక, అంతకుముందు పూరీ జగన్నాథ్ ఆలయ రత్నభాండాగరాన్ని తెరిచే ప్రయత్నాల్లో తాళం చెవి తెరిచే ప్రక్రియలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ, కాసేపటికే విజయవంతంగా తెరిచారు. 👉 నిధి ఉన్న గదికి చేరుకున్న ఆలయ కమిటీ సభ్యులు 👉జగన్నాథుని సేవలకు అంతరాయం కలగకుండా తెరిచేందుకు ఏర్పాట్లు చేశారు.👉రత్నభాండాగరాన్ని తెరించే ప్రారంభమైన ప్రయత్నాలు👉పాములుంటాయన్న భయంతో స్నేక్ క్యాచర్స్‌ను సిద్ధంగా ఉంచిన అధికారులు👉ఉదయం 11 గంటల నుంచే భక్తులకు దర్శనాలు నిలిపివేసిన అధికారులు👉అంతరాయలంలోకి ప్రత్యేక కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యులు 👉ఇప్పటికే ఆలయంలోకి 15 కమిటీ సభ్యులు,నిపుణులు, ఆలయ అర్చుకులు ప్రవేశించారు.👉గజపతి రాజుల చేతిలో ఉన్న ఒకతాళం, జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలోని ఖజానా శాఖ వద్ద ఒక తాళం, ఆలయం ప్రధాన అధికారి వద్ద ఉన్న మూడో తాళం.. ఈ మూడు తాళాలు ఒకేసారి తెరుచుకోవాలి. అయితే అందులో ఒకతాళం లేకపోవడం, ఆతాళానికి సంబంధించిన తలుపుల్ని బద్దలు కొట్టేందుకు ఆయల కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథ్ ఆయలయంలో ట్రస్ట్ బోర్డ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం రత్నభాంఢాగారాన్ని మధ్యాహ్నం 1.28గంటలకు తెరవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. 46 ఏళ్ల తర్వాత రత్నభాండాగారాన్ని ఆలయ అధికారులు, ట్రస్ట్ కమిటీలు,నిపుణుల పర్యవేక్షణలో తెరుచ్చుకోనున్నాయి.ఇందులో భాగంగా ఎన్ఆర్ఆర్ఎఫ్ బృందాలు పూరీ ఆలయానికి చేరుకున్నాయి. భాండాగారం గది తలుపులు తెరుచుకోకపోతే భారీ సెర్చ్ లైట్స్, ఎక్విప్మెంట్ తీసుకొచ్చాయి. -
పూరి రత్న భాండాగారంలో విష సర్పాలు !
-
Puri Jagannath: నేడు తెరుచుకోనున్న జగన్నాథుడి రత్న భాండాగారం
భువనేశ్వర్: పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం లెక్కింపు ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శనివారం ప్రకటించారు. శ్రీ జగన్నాథ ఆలయ పాలక మండలి సమీక్షించిన నిర్ధారిత కార్యాచరణ (ఎస్వోపీ)ని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించగా, శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. జగన్నాథ ఆలయ అధికారిక వర్గం (ఎస్జేటీఏ) నిర్ణయించిన శుభ ముహూర్తంలో రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని తెలిపారు. దశలవారీగా ఈ పనులు సాగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆభరణాల జాబితా రూపకల్పనలో పారదర్శకతను నిర్ధారించడానికి, భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సహాయం కోరామని, శ్రీ మందిరం పాలక మండలి బృందానికి సహకరించేందుకు ఆర్బీఐ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓఈకు అప్పగించినట్లు మంత్రి చెప్పారు. -
మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది రేపే తెరుచుకోనుంది.ఈ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి.ఆదివారం పూరీలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు.46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. అయితే.. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేకృష్ణ మహాపాత్ర అంటున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు కూడా.👉పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. 👉అయితే.. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.👉భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు.👉ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే.. హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్ బృందం భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. 👉జగన్నాథుని రత్న భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు లభించాయి. 👉కాగా, 1978లో జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు లభించాయి. 1982 – 1985 సంవత్సరాలలో రత్న భండాగారం తెరచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు.👉జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం (ఒక భరీ సుమారు 12 గ్రాములతో సమానం), 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు.👉రఘుబీర్ కమిటీ నివేదికపై జులై 10లోగా స్పందన తెలియజేయాలంటూ ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. రాజకీయం చేయొద్దని బీజేడీ కోరినా.. బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈలోపే ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ.. ఎన్నికల హామీ మేరకు రత్న భాండాగారం తెరిపించేందుకు సిద్ధమైంది.👉ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో.. ఈ నెల 14న(ఆదివారం) రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి ఆ కమిటీ సిఫార్సు చేసింది.👉జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను బిశ్వనాథ్ కమిటీనే తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో.. రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారని తెలుస్తోంది. -
4 దశాబ్దాల తరువాత.. రేపే ఓపెన్
-
జగన్నాథ రహస్యం!
లక్షలాది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాల నిల్వ గది(రత్న భండార్)ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు, పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం చెప్పారు.180 రకాల ఆభరణాలు1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి. ‘‘ 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు నేనూ వెళ్లా. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతోపాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తరభారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్‌వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్‌కు అందజేశాం’ అని ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా రెండేళ్ల క్రితం ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.2018లో మరోసారి ప్రయత్నించి..పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటిగదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరీ జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ సంచలన నిర్ణయం..
-
5 దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న రత్న బండార్
-
ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి
ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథం లాగుతుండగా ఒక్కోసారిగా తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం పూరీ శంఖారాచార్య స్వామి నిశ్చలనానంద సరస్వతిలు జగన్నాథుడిని,దేవీ శుభద్రను సందర్శించుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5.20 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. అయితే పూరీలోని గ్రాండ్ రోడ్ బారా దండాలో సంప్రదాయబద్ధంగా బలభద్ర స్వామి రథాన్ని లాగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.#WATCH | Odisha | Devotees throng in large numbers to witness the two-day Lord Jagannath Yatra that begins today in Puri. pic.twitter.com/Z65j3iM2H1— ANI (@ANI) July 7, 2024 -
‘రత్న భాండార్’లో ఏముంది? తాళాలు ఏమయ్యాయి?
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భాండార్ గురించి ప్రస్తావించారు. ఈ రత్న భాండార్ తాళాలు గత ఆరేళ్లుగా కనిపించడం లేదని, అవి ఏమైపోయాయనేది ఒడిశా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఈ భాండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని మోదీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ విషయాన్ని దాచి ఉంచుతున్నారని మోదీ ఆరోపించారు. మోదీ విమర్శల నేపధ్యంలో ‘రత్న భాండార్’ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ‘రత్న భాండార్’లో ఏముంది? పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి?అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు.దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం.దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి.ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు.ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు.అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది.ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని.దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు.అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు.అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు.దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు.జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు.ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు.ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు.పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది.అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక.భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
వైరల్‌గా మారిన పూరీ జగన్నాథ ఆలయం లోపలి దృశ్యాలు
భువనేశ్వర్: అధికారులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ, పూరీ జగన్నాథ ఆలయం లోపలి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. తరచూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. నిఘా వ్యవస్థ లోపంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితులు ఆలయ భద్రత వ్యవస్థ పటిష్టతకు సవాల్‌గా నిలుస్తున్నాయి. శ్రీమందిరం లోపలికి సెల్ఫోన్లు, కెమెరాలు ఇతరేతర సాంకేతిక పరికరాలు, యంత్రాల ప్రవేశం పూర్తిగా నిషేధం. ఈ నేపథ్యంలో సింహద్వారం ఆవరణలో పటిష్టంగా తనిఖీలు నిర్వహించి, లోపలికి ప్రవేశించేందుకు అనుమతించే విధానం అమలులో ఉంది. ఈ వ్యవస్థ కార్యచరణ లోపంతో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి శ్రీమందిరం ప్రధాన దేవస్థానం లోపలి దృశ్యాలను వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పరిస్థితులు తీవ్ర కలకలం రేపి, విశిష్ట మందిరం భద్రతపై తీవ్రమైన ప్రశ్నలకు అవకాశం కల్పిస్తున్నాయి. వీడియోలో తారసపడిన వ్యక్తి స్థానికేతరుడుగా భావిస్తున్నారు. ఈ దృశ్యాల్ని తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో అప్లోడ్ చేసి, విడుదల చేయడంతో వివాదం ఊపందుకుంది. దీని ప్రకారం వివాదాస్పద యాత్రికుడు వారణాసికి చెందిన వ్యక్తి రోహిత్ జైస్వాల్గా గుర్తించారు. ఆలయ ప్రాంగణంలో సెల్ఫోన్లు నిషేధించినా.. తనతో పరికరాన్ని ఎలా తీసుకు వెళ్లడనే దానిపై అనుబంధ వర్గాలు తక్షణమే స్పందించలేని దయనీయ పరిస్థితులు తాండవిస్తున్నాయి. స్వామివారు లేని సమయంలో.. తోబుట్టువులతో కలిసి జగన్నాథుడు గుండిచా మందిరానికి యాత్రగా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యవధిలో నిత్యం కళకళలాడే శ్రీమందిరం బోసిబోయింది. మరమ్మతులు తదితర నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. అయితే యాత్రికులు శ్రీమందిరం సందర్శించేందుకు ఎటువంటి ఆంక్షలు లేకున్నా.. భద్రతాపరమైన కార్యాచరణ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. మూల విరాట్లు లేనందున శ్రీమందిరం సందర్శనకు నామమాత్రపు యాత్రికులు మాత్రమే సందర్శిస్తున్నారు. జనసందోహం లేని ఈ వ్యవధిలో భద్రత, తనిఖీ కార్యకలాపాలు మందగించే నిర్లక్ష్య పరిస్థితులను యాత్రికుడు అనుకూలంగా చేసుకొని, లోపలి దృశ్యాల చిత్రీకరణకు పాల్పడేందుకు వీలైందనే ఆరోపణ బలంగా వ్యాపించింది. రాత్రింబవళ్లు నిరవధికంగా కొనసాగాల్సిన భద్రతా వ్యవస్థ కార్యాచరణ పెద్ద సవాల్‌గా నిలిచింది. చర్యలలో అలసత్వం కారణంగా అతను ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడా? లేదా ఘటనలో ఎవరిదైనా సహాయం తీసుకున్నాడా? అనే దానిపై స్పష్టత లేదు. చర్చలేవీ..? జగన్నాథ దేవాలయం లోపలి దృశ్యాల వీడియోలు, చిత్రాలు ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టడం మినహా అవాంఛిత సంఘటనల పునరావృతం నివారణ దిశలో పూరీ జిల్లా, పోలీసు, జగన్నాథ ఆలయ పాల క వర్గం ఇతర అనుబంధ వర్గాలు చేపట్టిన చర్యలు శూన్యంగా పరిణమించాయి. లోపలి దృశ్యాల చిత్రీకరణ వివాదస్పద కార్యకలాపాల్లో బాధ్యులైన సిబ్బంది, అధికార వర్గాల వ్యతిరేకంగా చేపట్టిన చర్యల దాఖలాలు లేకపోవడం విచారకరం. -
పూరి జగన్నాథుడు: మూల విరాటుల అంగాలకు ముప్పు? వినకుంటే విపత్తే!
భువనేశ్వర్: మూల విరాటుల అంగాలకు ముప్పు వాటిల్లే విపత్కర చర్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. శ్రీమందిరం సింహద్వారం ఆవరణలో ఇటీవల తారు రోడ్డు పనులు చేపట్టారు. ప్రస్తుత నిర్మాణ శైలి రథయాత్ర ప్రక్రియలో రత్నవేదిక నుంచి యాత్రకు తరలివచ్చే మూలవిరాట్ల శ్రీఅంగాల (విగ్రహాల)కు భారీ ముప్పు కలిగించే రీతిలో తారస పడుతున్నాయి. సువిశాల బొడొదండొ మార్గం పొడవునా తారుపూత పూస్తున్నారు. ఈ సందర్భంగా స్వల్ప విభజనతో రెండు అంచెల రోడ్డుగా మలుస్తున్నట్లు వర్ధమాన నిర్మాణశైలి ప్రతిబింబిస్తుంది. ఈ విభజన రథాల కదలికకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. అలాగే శ్రీమందిరం గర్భగుడి రత్నవేదిక నుంచి మూలవిరాట్ లను రథాల పైకి తరలించే పొహొండి కార్యక్రమంలో కాలు జారడం వంటి చిరు ప్రమాదాలతో పెద్ద తప్పిదాలను ప్రేరేపిస్తాయని కలవర పడుతున్నారు. యాత్ర పొడవునా పలుమార్లు 3 భారీ రథాలను మలుపు తిప్పాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో నిర్మాణశైలి తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. యాత్ర నిర్వహణ దృష్టిలో పెట్టుకుని సింహద్వారం ఆవరణ, బొడొదండొ మార్గం తారుపూత పనులు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విభజన, ఎగుడు దిగుడులు తొలగించాలని శ్రీమందిరం పాలకమండలి సీనియర్ సభ్యుడు దుర్గాప్రసాద్ దాస్ మహాపాత్ర కోరారు. దీనిపై ప్రధాన పాలనాధికారి (సీఏఓ) దృష్టి సారించాలన్నారు. రథ వాకిలిలో భద్రత.. రథయాత్ర ఆద్యంతాల్లో మూల విరాట్ల రథాలు శ్రీమందిరం సింహద్వారం ముంగిట నిలుపుతారు. యాత్ర ప్రారంభం పురస్కరించుకుని ఈ వాకిలిలో రథ ప్రతిష్ట ముగించి మూల విరాట్లను గొట్టి పొహొండి ప్రక్రియలో ఒక్కొక్కటిగా రథాల పైకి తరలిస్తారు. అలాగే యాత్ర చిట్టచివరి ఘట్టం నీలాద్రి విజే పురస్కరించుకుని రథాలపై ఆసీనులైన మూర్తులను సురక్షితంగా శ్రీమందిరం రత్న వేదికకు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రాంగణంలో సిద్ధం చేసిన తారురోడ్డు ఉపరితలమంతా ఎగుడు దిగు డుగా తయారైంది. ఈ పరిస్థితిని సవరించి పూర్తిగా చదును చేయకుంటే గొట్టి పొహండి, నీలాద్రి విజే పురస్కరించుకుని జరిగే మూల విరాట్ల తరలింపు సందర్భంగా కాలు జారుడు వంటి ప్రమాదాలతో మూల విరాట్ల భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం తలెత్తుతుంది. యాత్ర ఆద్యంతాలు మలుపు తిప్పే పరిస్థితుల్లో చకచకా తరలే రథాల కదలికకు ఆటంకం కలగవచ్చు. ఈ అభ్యంతరాల దృష్ట్యా రోడ్డు చదును చేసేందుకు సంబంధిత అధికారులు సుముఖంగా స్పందించారు. దశమహాపాత్ర నిర్మాణ సంస్థ అధికారులు ఈ నెలలోగా ఎగుడు దిగుడులు తొలగించి కొత్తగా నిర్మితం అవుతున్న రహదారి చదును చేసే పనులు పూర్తి చేస్తామని అనుబంధ అధికార వర్గాలు హామీ ఇచ్చారు. సర్దుబాటుకు ఆదేశాలు.. తారుపూతలో ఎగుడు దిగుడుల కారణంగా యాత్ర ఆద్యంతాల్లో రథాన్ని మలుపు తిప్పడంలో పలు ఇబ్బందులు తలెత్తుతాయని అనుబంధ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అభ్యంతరాలను ఆలయ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పూరీ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో నిర్మాణ శైలిలో స్వల్ప మార్పుతో అనుకూల రీతిలో సర్దుబాటు చేయాలని నిర్మాణ సంస్థ ఓబీసీసీని ఆదేశించారు. రథశాల ప్రాంగణంలో.. శ్రీమందిరం కార్యాలయం పరిసరాల్లో స్వామి వార్షిక రథయాత్ర కోసం కొత్త రథాల తయారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రథాల పలు భాగాల నిర్మాణం అంచెలంచెలుగా పూర్తి కావడంతో క్రమ పద్ధతిలో అమర్చి, రథం రూపుదిద్దుతారు. అనంతరం ఈ ప్రాంగణం నుంచి మలుపు తిప్పి శ్రీమందిరం సింహద్వారం ఆవరణకు తరలించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాంగణంలో తారురోడ్డుపై రాళ్లు తేలుతున్నాయి. రథ భాగాల అమరిక పురస్కరించుకుని భారీ కొయ్య భాగాల తరలింపు, రథాల మలుపు పురస్కరించుకుని రోడ్డుపై తేలియాడుతున్న రాళ్లతో ఊహాతీత ప్రమాదాలు తలెత్తే అవకాశం లేకపోలేదని భొయి సేవకవర్గం ప్రముఖుడు సర్దార్ రవిభొయి తెలిపారు. ఈ ప్రాంగణంలో తారురోడ్డుపై రాళ్లు తొలగించి చదును చేయడం అనివార్యంగా పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు తెలియజేసినట్లు వివరించారు. -
Puri Jagannath Temple: ఆ మూడో గదిలో అంతులేని ధనరాశులున్నాయా?
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి? అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు. దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని. దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు. అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు. దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు. జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు. ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు. ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు. పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది. అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక. భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
దేవుడి సొమ్ము భద్రమేనా?