👉 పూరీ రత్నభాండగారంలో ఆభరణాల లెక్కింపును అధికారులు నిలిపివేశారు.
👉 ఇవాళ చీకటి పడటంతో లెక్కింపును నిలిపివేసినట్లు తెలిపారు.
👉 రేపు (సోమవారం) తిరిగి ఆభరణాలను అధికారులు లెక్కించనున్నారు.
👉 ‘‘ రత్నభాండాగారం రహస్య గది తాళాలు పగలగొట్టి లోపలి వెళ్లాము. బయటి రత్నభాండాగారంలోని ఆభరణాలను మార్చేశాము. లోపలి భాండాగారంలోని ఆభరణాలను మార్చుతున్నామని అధికారులు తెలిపారు. ఆభరణాల లెక్కింపుకు ఇవాళ సమయం మించిపోయింది. ఆభరణాల లెక్కింపు ప్రక్రియను రేపు(సోమవారం) చేపట్టాలని నిర్ణయించుకున్నాం’’ అనిశ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (SJTA)చీఫ్ అరబింద పాధీ మీడియాకు తెలిపారు.
Puri, Odisha: The Ratna Bhandar of the Shri Jagannath Temple opened today.
Sri Jagannath Temple Administration (SJTA) Chief Arabinda Padhee says, "All the ornaments of outer Ratna Bhandar have been shifted; the inner Ratna Bhandar was opened after breaking the locks. The… pic.twitter.com/R0TandjiG3— ANI (@ANI) July 14, 2024
👉 ఈసారి లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది. సంపదను మరోచోటుకు తరలించి పటిష్టమైన భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. వివరాల నమోదును డిజిటలైజేషన్ చేస్తామని ఒడిశా ప్రభుత్వంలో చెబుతోంది.
👉రత్న భాండాగారం రహస్య గది లోపలికి 11 మంది కమిటీ సభ్యులు వెళ్లారు. రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలను పెట్టెల్లో కమిటీ సభ్యులు భద్రపర్చనున్నారు.
👉 బంగారం నాణ్యతను ఆర్‌బీఐ ప్రతినిధులు పరిశీలించనున్నారు. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
👉 పూరీ జగన్నాథ్ ఆలయ రత్న భాండాగారం రహస్య గదిని అధికారులు తెరిచారు. ఈ మేరకు రహస్య గది తలుపులు తెరిచినట్లు సీఎంవో అధికారికంగా ప్రకటించింది.
👉 46 ఏళ్ల రత్న భాండాగారం రహస్య గదిని అధికారులు ఓపెన్ చేశారు. చివరగా 1978లో రహస్య గదిని అధికారులు తెరిచారు.
👉కాగా, ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈనెల 19వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది?అనే విషయాలు తెలియాల్సి ఉంది.
👉ఇక, రత్న భాండాగారం తెరిచిన సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగానే ఏర్పాట్లు చేశారు. రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియంతా డిజిటలైజేషన్ చేయనున్నారు.
👉 మరోవైపు.. నిధిని తెరిచి అందులోని వస్తువులను తరలించేందుకు ఆరు పెట్టెలను అధికారులు సిద్ధం చేశారు.
#WATCH | Odisha | Ratna Bhandar of Sri Jagannath Temple in Puri re-opened today after 46 years.
Visuals from outside Shri Jagannath Temple. pic.twitter.com/BzK3tfJgcA— ANI (@ANI) July 14, 2024
👉 ఇక, అంతకుముందు పూరీ జగన్నాథ్ ఆలయ రత్నభాండాగరాన్ని తెరిచే ప్రయత్నాల్లో తాళం చెవి తెరిచే ప్రక్రియలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ, కాసేపటికే విజయవంతంగా తెరిచారు.
👉 నిధి ఉన్న గదికి చేరుకున్న ఆలయ కమిటీ సభ్యులు
👉జగన్నాథుని సేవలకు అంతరాయం కలగకుండా తెరిచేందుకు ఏర్పాట్లు చేశారు.
👉రత్నభాండాగరాన్ని తెరించే ప్రారంభమైన ప్రయత్నాలు
👉పాములుంటాయన్న భయంతో స్నేక్ క్యాచర్స్‌ను సిద్ధంగా ఉంచిన అధికారులు
👉ఉదయం 11 గంటల నుంచే భక్తులకు దర్శనాలు నిలిపివేసిన అధికారులు
👉అంతరాయలంలోకి ప్రత్యేక కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యులు
👉ఇప్పటికే ఆలయంలోకి 15 కమిటీ సభ్యులు,నిపుణులు, ఆలయ అర్చుకులు ప్రవేశించారు.
👉గజపతి రాజుల చేతిలో ఉన్న ఒకతాళం, జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలోని ఖజానా శాఖ వద్ద ఒక తాళం, ఆలయం ప్రధాన అధికారి వద్ద ఉన్న మూడో తాళం.. ఈ మూడు తాళాలు ఒకేసారి తెరుచుకోవాలి. అయితే అందులో ఒకతాళం లేకపోవడం, ఆతాళానికి సంబంధించిన తలుపుల్ని బద్దలు కొట్టేందుకు ఆయల కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.
పూరి జగన్నాథ్ ఆయలయంలో ట్రస్ట్ బోర్డ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం రత్నభాంఢాగారాన్ని మధ్యాహ్నం 1.28గంటలకు తెరవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. 46 ఏళ్ల తర్వాత రత్నభాండాగారాన్ని ఆలయ అధికారులు, ట్రస్ట్ కమిటీలు,నిపుణుల పర్యవేక్షణలో తెరుచ్చుకోనున్నాయి.
ఇందులో భాగంగా ఎన్‌ఆర్‌ఆర్‌ఎఫ్ బృందాలు పూరీ ఆలయానికి చేరుకున్నాయి. భాండాగారం గది తలుపులు తెరుచుకోకపోతే భారీ సెర్చ్ లైట్స్, ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment