
గునా: మధ్యప్రదేశ్‌లోని గునాలో జరిగిన హనుమజ్జయంతి వేడుకల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. హనుమాన్ రథయాత్ర ఉత్సాహంగా సాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గునాలో శనివారం సాయంత్రం 7:30 గంటల సమయంలో హనుమాన్ రథయాత్ర ఒక ప్రార్థనా స్థలం సమీపంలో కొనసాగుతుండగా, రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న పోలీసులు , స్థానిక అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొంది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది భద్రతను కొనసాగిస్తున్నారు. మీడియాతో మాట్లాడిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ సిన్హా.. స్థానికులు ఎలాంటి వదంతులపై దృష్టి పెట్టకూడదని కోరారు.
ఇది కూడా చదవండి: ఎన్‌ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు