సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆపి, ‘హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టు’అంటాడు ఓ సినిమాలో ట్రాఫిక్ పోలీస్. మధ్యప్రదేశ్‌లో పోలీసులు మరో అడుగు ముందుకేశారు! రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తకి హెల్మెట్ పెట్టుకోలేదంటూ రూ.300 జరిమానా విధించారు! పన్నా జిల్లాలో అజయ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన జరిగింది.
సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తి తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు అతిథులను ఆహ్వానించేందుకు వెళ్తుండగా ఓ పోలీసు వాహనం అడ్డగించింది. బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కుమార్తె పుట్టినరోజు వేడుకలకు ఇంటికి వెళ్లాల్సి ఉందని చెప్పినా పోలీసులు విన్పించుకోలేదు. పక్కనే ఉన్న ఓ బైకు రిజి్రస్టేషన్ నంబర్ రాసి మరీ, హెల్మెట్ లేకుండా వాహనం నడిపావంటూ శుక్లాకు జరిమానా విధించారు. దాంతో ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఆధారంగా తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment