
స్వామి సేవకునిగా బాలుడు
ఆ నోటికి ఇంకా మాటలు రావు..ఆ కళ్లు ఇంకా లోకాన్ని చూడలేదు. అమ్మా అని కూడా ఆ పెదవులు పలకలేవు. అటువంటి 29రోజుల పసికందు స్వామి సేవకు అంకితమయ్యాడు. వంశపారపర్యంగా జగన్నాథ స్వామి సేవకు అంకితమైన కుటుంబీకులు తమ 29రోజుల పసికందును గురువారం స్వామి సేవకు అప్పగించారు.
భువనేశ్వర్/పూరీ: జగన్నాథుని సంస్కృతి మానవాళికి తార్కాణంగా నిలుస్తుంది. స్వామి సేవ మహా భాగ్యం. తరతరాలుగా స్వామి సేవలో తరించిన వారు అనంతం. వంశ పారంపర్యంగా స్వామి సేవకులు నియమితుల వుతారు. ఇప్పటికీ ఇదే ఆచారం కొనసాతోంది.
ఉదయం మేలు కొలుపు నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు నిరవధికంగా నిర్వహించే దైనందిన కార్యకలాపాలతో పాటు వార్షిక ఉత్సవాలు, వేడుకల్లో వంశపారంపర్యంగా పలు వర్గాల సేవకులు నిరవధికంగా అంకితం చేసిన తల్లిదండ్రులుాల్గొంటారు.
ఆ వంశీకులు స్వామి సేవకు అంకితమవుతారు. జన్మించిన 21వ రోజు నుంచి ప్రతి శిశువు స్వామి సేవకు అర్హత సాధించడం జగన్నాథ సంస్కృతి, సంప్రదాయం. ఈ ఆచారం నిరంతరాయంగా కొనసాగుతోంది. స్వామి సేవకు పసి కందు స్థాయిలోనే అంకితం చేస్తారు. ఈ సంఘటన గురువారం పూరీలో జరిగింది.
పిన్నవయసులో అగ్రస్థానం
జగన్నాథునికి స్నానోత్సవం నుంచి పక్షం రోజులపాటు గోప్య సేవల్ని అందిస్తారు. దైతపతి సేవకులు చీకటి మండపం మీద కొలువు దీరిన చతుర్థా మూర్తులకు గోప్యంగా ఉపచారాలు చేస్తారు. ఈ వర్గానికి చెందిన దైతపతి వంశానికి చెందిన 29 రోజుల పసికందును స్వామి సేవకు అంకితం చేశారు.
జగన్నాథుని సంస్కృతి, సంప్రదాయాల రీతిలో గురువారం ఈ ప్రక్రియ నిర్వహించారు. ఈ నేపథ్యంలో 29 రోజుల పసి కందు అక్షయ దాస్ మహాపాత్రోను స్వామిసేవకు అంకితం చేశారు. ఇక నుంచి జ్వరం బారిన పడిన దేవతామూర్తులకు సేవ చేసే అర్హత, యోగ్యత పసికందుకు ప్రాప్తించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నారు. పూరీలోని డోలమండపం దైతపతి వీధిలో ఉంటున్న సంజయ్ దాస్‌మహాపాత్రో రెండో కుమారుడు అక్షయ దాస్ మహాపాత్రో.
అతి పిన్న వయసులో స్వామి సేవకునిగా అంకితమైన జాబితాలో అగ్రస్థానం సాధించాడు. గురువారం శ్రీ మందిరంలోని చీకటి మండపం లోకి ప్రవేశించిన లాంఛనంగా 10 నిమిషాలపాటు స్వామి సేవలో పాల్గొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment