
భువనేశ్వర్/ పూరీ: రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరం శిఖరాన పతిత పావన పతాకం కొయ్య ఒరిగింది. కాల వైశాఖి ప్రభావంతో మంగళవారం బలంగా వీచిన గాలులకు ఆలయ శిఖరాన నీల చక్రానికి బిగించిన పతిత పావన పతాకం కొయ్య బిగువు కోల్పోయి పక్కకు ఒరిగింది. ఈ సంఘటన జగన్నాథుని భక్తుల హృదయాల్ని కలిచివేసింది.
పతితుల్ని పావనం చేసే ఈ పతాకం ఒరగడం కరోనా సంక్రమణ వంటి విపత్కర పరిస్థితుల్లో ఏ వైపరీత్యానికి దారితీస్తోందోనని భక్త జనం తల్లడిల్లుతోంది. ఈ సంఘటన శ్రీ మందిరంలో దైనందిన నిత్య సేవలకు ఏమాత్రం అంతరాయం కలిగించలేదని శ్రీ మందిరం దేవస్థానం అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పూరీ పట్టణంలో సుమారు అరగంట సేపు కాల వైశాఖి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పట్టణ వాసులకు వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం లభించింది.
చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి
చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ