Bhuvaneshwari
-
Bhuvaneshwari : కలలకు రెక్కల వెనక అసలు కథేంటీ.?
కుప్పంలో పోటీ చేయాలని భువనేశ్వరీ కలగన్నారు. నేరుగా కుప్పానికే వెళ్లి చంద్రబాబుకు విశ్రాంతి ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇక్కడ నాకు పోటీ చేయాలని ఉందని, ఇది నా కల అని కూడా చెప్పుకొచ్చారు. ఆమె స్వప్నం ఎందుకు సాకారం కాలేదో.. అన్నది వేరే సంగతి కానీ.. ఇప్పుడు కలలకు రెక్కలంటూ మళ్లీ ప్రజల ముందుకొచ్చారు. చంద్రబాబు కోసం భువనేశ్వరి ప్రకటనలు చేశారా.? లేక చంద్రబాబే చేయించారా అన్నది పక్కనబెడితే.. భువనేశ్వరీకి తెలియాల్సిన కొన్ని విషయాలున్నాయి. అమ్మాయిల కలలకు రెక్కలు అన్న కాన్సెప్ట్ ఎలా ఉన్నా.. ఇప్పటివరకు మీరు చూపించిన భ్రమరావతి మహిళలందరికి పీడ కలలు మిగిల్చాయి. ఒక సారి 2014 లో చంద్రబాబు మహిళలకు చేసిన వాగ్దానాలు చూడండి. ఇందులో ఏ ఒకటి అయినా తీర్చాడా? అన్నది భువనేశ్వరీనే చెప్పాలి. చంద్రబాబు 2014-19లో మహిళలకు ఇచ్చిన హామీలు మహాలక్ష్మి పథకంలో భాగంగా పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 25 వేలు డిపాజిట్ చేస్తా గర్భిణులకు రూ.10 వేలు ఇస్తాం ప్రతి పేద మహిళకు స్మార్ట్ఫోన్లు ఇస్తా ఏడాదికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు 100 సబ్సిడీతో ఇస్తా 14 వేళా కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ ఇవేవీ అమలు చేయలేక మ్యానిఫెస్టోను మాయం చేసిన ఘనత చంద్రబాబుది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు భార్యగా మీది. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి మళ్లీ కాకమ్మ కథలు చెప్పడం బాగోలేదని ప్రజలంటున్నారు. ఏ పని చేయలేడనే చంద్రబాబును చిత్తుగా ఓడించిన ప్రజలు 23 సీట్లకు పరిమితం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ 58 నెలల్లో వివిధ పథకాల ద్వారా (డీబీటీ, నాన్ డీబీటీ ) కింద కేవలం మహిళలకు అందించిన లబ్ధి అక్షరాల రూ.2 .78 లక్షల కోట్లు అందించారు. సంక్షేమ పథకాల ద్వారా జగన్ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో 18.38 లక్షల మంది మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. అందుకే భువనేశ్వరీ గారు, మళ్లీ కలలకు రెక్కలంటూ కాకమ్మ కబుర్లు చెప్పొద్దని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో పోటీ చేయాలని కల గంటున్నారు కదా.. మీ కలలకు రెక్కలు తెచ్చుకోండి. ధైర్యంగా నామినేషన్ వేయండి, చంద్రబాబు తప్పుకుంటారు. కల సాకారం అవుతుందా లేదా పక్కనబెట్టి కనీసం ప్రయత్నం చేశారన్న గౌరవం ఉంటుంది. -
భువనేశ్వరి రెస్ట్ ఇస్తుందో లేదో కాని... చంద్రబాబుకి మేము ఎప్పుడో రెస్ట్ ఇచ్చేశాం ఎమ్మెల్సీ భరత్ కౌంటర్
-
ఓటమి భయం.. మరో మాస్టర్ ప్లాన్!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు నిజంగానే రెస్ట్ అవ్వాలని ఆయన భార్య భువనేశ్వరి భావిస్తున్నారా? ఆయనది పెద్ద వయసు కనుక, ముప్పై ఐదేళ్ల పాటు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆమెకు ఆ ఆలోచన వచ్చింది. చంద్రబాబు ఆరోగ్య రీత్యానే ఆమె ఆ ప్రకటన చేసి ఉంటే అది అభినందించదగిందే. చంద్రబాబు కూడా నిజంగానే ఆమె కుప్పంలో పోటీచేయాలని అభిప్రాయపడుతుంటే కొంత అప్రతిష్ట వచ్చినా, కాస్త తెలివైన నిర్ణయమే అనిపించవచ్చు. ఎందుకంటే తాను ఓడిపోతానేమో అన్న అనుమానం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకుండా ఈ ప్లాన్ అమలు చేయవచ్చు. అదే తరుణంలో భువనేశ్వరి కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమె ఏదో సరదాగా చెప్పినట్లు కనిపించాలని అనుకున్నా, అసలు ఉద్దేశం బయటపెట్టినట్లయింది. కుప్పంలో చంద్రబాబు విజయావకాశాల మీద సందేహాలు రావడం వల్లే ఈ ప్లాన్ వేసినట్లు అనిపిస్తుంది. చంద్రబాబు ఈ సారి ఇక్కడ నుంచి పోటీచేయరు అని నేరుగా చెబితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకోసం టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్‌ను మానసికంగా సిద్దం చేయడానికి ఆమెతో ఈ మాటలు చెప్పించి ఉండాలి. లేదా కుప్పం టీడీపీ క్యాడర్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అయినా అనుకోవచ్చు. లేదా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని భువనేశ్వరి ఆశిస్తుండవచ్చు! ఎందుకంటే ఆమె తండ్రి ఎన్.టీ రామారావు, ఇద్దరు సోదరులు హరికృష్ణ, బాలకృష్ణ, సోదరి పురందేశ్వరిలు రాజకీయాలలో చేరి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఆ ప్రభావం కూడా పనిచేస్తుండవచ్చు. ఈ మధ్యకాలంలో భువనేశ్వరి కూడా న్యాయం గెలవాలి.. అంటూ ఒక కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తన భర్త చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో చిక్కి జైలుకు వెళ్లినప్పుడు భువనేశ్వరి ప్రజలలోకి వచ్చారు. దాంతో ఆమె రాజకీయాల మజా రుచి చూసి ఉంటారు. ఇలా ఆమెకు ఈ కోరిక వచ్చి ఉండవచ్చు. పైగా కుప్పం నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో జరిగిన అనేక పరిణామాలలో తెలుగుదేశం బాగా బలహీనపడింది. మున్సిపల్ ఎన్నికలలో ఎంత వ్యయం చేసినా, టీడీపీ గెలవలేకపోయింది. మండల, జడ్పీలలోను అదే పరిస్థితి. సర్పంచ్‌లు తొంభై శాతం మంది వైఎస్సార్సీపీవారే ఎన్నికయ్యారు. తత్ఫలితంగా టీడీపీ ఈసారి కుప్పంలో గెలుస్తుందా? లేదా? అనే చర్చ వచ్చింది. కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టడం, కుప్పంను మున్సిపాల్టీ చేయడం, ఆర్డిఓ కేంద్రంగా మార్చడం, కుప్పంకు కృష్ణా జలాలను తీసుకురావడం వంటివాటివల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రాఫ్ బాగా పెరిగింది. దాంతో చంద్రబాబు అక్కడ పోటీ చేయడానికి భయపడుతున్నారు. కాకపోతే ఆ విషయం చెప్పకుండా చంద్రబాబు దాటవేస్తున్నారు. ఎన్నికలు దగ్గరబడుతుండడంతో ఆయన తన భార్య ద్వారా ఈ విషయం చెప్పినట్లు అనుకోవాలి. కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు గురించి ఆయన భార్య భువనేశ్వరి స్వయంగా విశ్రాంతి అవసరం అని చెప్పారంటే అందులో ఏదో మతలబు ఉండి తీరాలి. మరో రెండు ఎన్నికలు జరగనున్న తరుణం, ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ఒకవైపు ప్రచారం చేస్తూ, మరో వైపు ఆయన భార్యే రెస్ట్ ఇవ్వాలని అనడం అంటే కచ్చితంగా డౌట్లు వస్తాయి. ఒకటి.. రాష్ట్రంలో, కుప్పంలో టీడీపీ గెలవలేదన్న భావన రావడం, రెండు.. కుప్పంలో చంద్రబాబును పోటీనుంచి తప్పించడం, మూడు.. ఆయనతో పోటీచేయించినా మరో సురక్షిత సీటునుంచి పోటీచేయించాలని అలోచించడం, నాలుగు.. నిజంగానే చంద్రబాబుకు రెస్టు ఇచ్చి, కుమారుడు లోకేష్‌ను ఫోకస్ చేయడం. వీటిలో ఏదైనా కావచ్చు. గతంలో లోకేష్ ఎమ్మెల్యే కాకపోయినా, ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇప్పించడం, భువనేశ్వరి, బ్రాహ్మణిల ఒత్తిడి ఉందని అప్పట్లో టీడీపీ వర్గాలలో ప్రచారం జరిగింది. అలాగే ఇప్పుడు ఏమైనా చంద్రబాబు సీరియస్ పోటీలో ఉంటే, లోకేష్‌కు అవకాశాలు తగ్గుతున్నాయన్న భావన ఏమైనా ఉందేమో తెలియదు. మరోవైపు చంద్రబాబు కుప్పం బదులు పెనమలూరు లేదా మరో సేఫ్ నియోజకవర్గం నుంచి పోటీచేయవచ్చన్న ప్రచారమూ ఉంది. ఇది కాకుండా బీజేపీ వారి పొత్తు కండిషన్లలో చంద్రబాబును ఏమైనా పార్లమెంటుకు పోటీచేయాలని కోరుతున్నారా? అనే ఊహాగానాలు ఉన్నాయి. పెనమలూరులో చంద్రబాబు పోటీచేసే అవకాశం ఉందని ఐదారు నెలల క్రితం నుంచే టీడీపీ వర్గాలు అంతర్గంగా చెప్పుకుంటున్నాయి. కుప్పంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగా ఫోకస్ పెట్టి అభివృద్ది పనులు చేయించడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టిగా పనిచేసి చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్న పరిస్థితిలో చంద్రబాబులో ఆందోళన ఉంటుంది. అంతేకాక ఆయన గతంలో ఎక్కువగా ఆధారపడ్డ దొంగ ఓట్లను చాలావరకు తొలగించారట. ఈ కారణాల రీత్యా తాను పోటీచేయకపోయినా, తన భార్యను పోటీలో దించితే ఏమైనా సానుభూతి వస్తుందా? లేక ఓడిపోయినా అంత నష్టం ఉండదులే అనుకునైనా ఉండాలి. ఏది ఏమైనా భువనేశ్వరి ప్రకటన టీడీపీ క్యాడర్‌ను ఆలోచించుకునేలా చేస్తుంది. టీడీపీ గ్రాఫ్ పడిపోయిందనుకుంటున్న తరుణంలో ఈమె ప్రకటన పెద్ద దెబ్బగా భావించాలి. గతంలో కొందరు నేతలు తమ బదులు తమ భార్యలను పోటీలో ఉంచిన సందర్భాలు లేకపోలేదు. ఉదాహరణకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి తాను ఎంపీగా పోటీచేసి, వెంకటగిరి సీటును తన భార్య రాజ్యలక్ష్మికి ఇచ్చారు. ఆమె రెండుసార్లు గెలిచి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. మరో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య భార్య ఎమ్మల్యే కాలేదు కానీ, ఎమ్మెల్సీ అయి కొద్దికాలం మంత్రిగా కూడా ఉన్నారు. ఇలా ఇంకో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక దశలో ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేయాలని ఎన్.టీ రామారావు అనుకున్నారని ప్రచారం జరిగింది. అతని మరణం తర్వాత ఆమె పాతపట్పం నుంచి పోటీచేసి ఉప ఎన్నికలో గెలిచారు. మరో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత ఆయన భార్య విజయమ్మ పులివెందుల నుంచి ఒకసారి ఏకగ్రీవంగాను, మరోసారి పోటీలోను నిలబడి గెలిచారు. బీహారులో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణంలో జైలుకు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసి బార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత కాలంలో ఆమె ప్రతిపక్షనేతగా కూడా ఉన్నారు. ఇలా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. ఏది ఏమైనా భువనేశ్వరి ప్రకటన మొత్తం రాజకీయవర్గాలలో ఆశ్చర్యం కలిగిస్తే, తెలుగుదేశం వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. అసలే పార్టీ గెలుస్తుందో, లేదో అని భయపడుతున్న తరుణంలో భువనేశ్వరి ఒక రకంగా రాజకీయ బాంబును పేల్చారని చెప్పవచ్చు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్
-
చంద్రబాబును ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదు?
తిరుపతి సిటీ/సాక్షి, తిరుపతి: తిరుపతిలోనే పుట్టి తిరుపతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన వ్యక్తిని ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రేణిగుంట రోడ్డులో గురువారం ‘నిజం గెలవాలి’పేరుతో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. తిరుపతి నేడు అభివృద్ధిలో ముందుకు సాగుతోందంటే దానికి చంద్రబాబు కృషే కారణమన్నారు. ఏపీకి రావాల్సిన ఫ్యాక్టరీలు ఈ ప్రభుత్వం దుశ్చర్యల వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆరోపించారు. అమర్‌రాజా, టీసీఎల్ వంటి అత్యున్నత సంస్థలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని చెప్పారు. అవినీతి ఆరోపణలు లేకున్నా.. ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా.. చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు నిత్యం ప్రజల కోసమే పనిచేస్తున్నారంటూ పలువురు కేంద్ర నేతలు ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో నిజమే గెలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. కాగా, తిరుపతిలో జరిగిన నిజం గెలవాలి సభకు జనసేన ప్రధాన నేతలు ముఖం చాటేశారు. కనీసం ఆ పార్టీ జెండాలు కూడా సభలో కనిపించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు మహిళలను సభకు తరలించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరికి రూ.300 చెల్లించి ఆటోలు, వ్యాన్లతో తరలించారు. భువనేశ్వరి ప్రసంగిస్తుండగా సభ నుంచి వారు నిష్క్రమించడం కనిపించింది. టీడీపీ ముఖ్యనేతలకు ఘోర అవమానం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర రెండో రోజే టీడీపీలో అసంతృప్తులు బయటపడ్డాయి. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం నడచుకున్న ఇన్‌చార్జ్‌లు.. జిల్లా నేతలను పూర్తిగా పక్కనపెట్టారు. వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడంతో అలిగి వెళ్లిపోయారు. తిరుపతి సభలో ముందు వరుసలో కూర్చున్న మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్లను లేపి వెనక్కు పంపేశారు. తీవ్ర అవమాన భారాన్ని తట్టుకోలేక వారు అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు, రాబిన్‌శర్మ టీం, ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీలు రాంభూపాల్‌రెడ్డి, అనూరాధలపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న తపనతో స్థానికులు రాకున్నా.. టీడీపీ నేతలు తమ సామాజిక వర్గానికి చెందిన మహిళలను సభకు రప్పించుకున్నారు. అయినా సభ విజయవంతం కాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. భువనేశ్వరి ప్రసంగించేటప్పుడు కన్నీరు పెట్టుకోవాలని చంద్రబాబు, రాబిన్ శర్మ టీం సూచించినట్టు తెలిసింది. అలాగే భువనేశ్వరి మాట్లాడేటప్పుడు సభలోని వారు సైతం కన్నీరు మున్నీరు కావాలని.. ఆ మేరకు పలువురుకి శిక్షణ కూడా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయినా ఎవరూ కన్నీరు పెట్టకపోవడం విశేషం. రెండో రోజైనా జనాన్ని మభ్యపెట్టాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు. ఎంపిక చేసిన వారితో మాట్లాడించారు. అయినా జనం వీరి ప్రసంగాలను నమ్మలేదు. -
నారా భువనేశ్వరి పిల్ల చేష్టల వల్లే చంద్రబాబుకు చిక్కులు..!
-
బాబు అరెస్ట్ విని కొందరు మృతి చెందారట..?
-
బాబే ఒక అబద్ధం.. ఇదే పచ్చి నిజం
-
చంద్రబాబు అబద్ధాల బాటలోనే భువనేశ్వరీ
-
నిజం గెలిచేదెలా భువనేశ్వరీ?
చంద్రగిరి (తిరుపతి జిల్లా)/సాక్షి, తిరుపతి: అబద్ధాలను పదేపదే చెప్పి వాటినే నిజమని ప్రజలను నమ్మించడంలో చంద్రబాబుకు మించిన వారు లేరనేది అందరికీ తెలిసిందే. ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో జైలు జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి సైతం చంద్రబాబు అబద్ధాల బాటలోనే పయనిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఒక్కరు కూడా మృతి చెందకపోయినా రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి పైగా మరణించారని.. వారి కుటుంబాలను తాను పరామర్శిస్తానని భువనేశ్వరి బుధవారం నుంచి పరామర్శ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఆవులపల్లి ప్రవీణ్ రెడ్డి(33) కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధపు ప్రచారమా.. చంద్రగిరి పాతపేటకు చెందిన ప్రవీణ్ రెడ్డి రెండు నెలల క్రితం టీడీపీలో చేరాడు. అంతకముందు నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీకి పనిచేశాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం ఉదయం ఇంట్లో గుండెపోటు రావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టీడీపీ నేతలు అతడి మృతిని బాబు ఖాతాలో వేసేశారు. వాస్తవానికి ప్రవీణ్ రెడ్డికి గతంలోనూ గుండెపోటు వచ్చిందని.. అప్పటి నుంచి అతడు తరచూ చికిత్స తీసుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇలాగే పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ నాయుడు(70) కుటుంబాన్ని కూడా భువనేశ్వరి పరామర్శించారు. గత నెల 25న చిన్నబ్బ నాయుడు వృద్ధాప్య సమస్యలతో మృతి చెందాడు. అయితే చంద్రబాబుని అరెస్టు చేసినందుకు మనస్తాపంతో మృతి చెందినట్లు టీడీపీ నేతలు ప్రచారానికి దిగారు. దీనిపైనా స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. మరణిస్తారని ముందే తెలుసా? భువనేశ్వరి బుధవారం మృతుల కుటుంబాలకు పంపిణీ చేసిన చెక్కులు గందరగోళానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సంతకం చేసిన చెక్కులను మృతుని కుటుంబాలకు పంపిణీ చేశారు. భువనేశ్వరి తన పరామర్శ యాత్రలో ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ నాయుడు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించారు. అక్టోబర్‌లో మరణిస్తే.. సెపె్టంబర్‌లోనే సంతకం చేసినట్లు ఉంది. చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ కాగా, ఆ చెక్‌లు చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సెప్టెంబర్ 4న సంతకం చేసినవి. -
నిజం గెలిస్తే.. చంద్రబాబు ఇక ఎప్పటికీ జైల్లోనే..
తాళ్లపూడి/పోలవరం రూరల్: నిజం గెలవాలని కాకుండా.. అబద్ధం గెలవాలంటూ చంద్రబాబు భార్య భువనేశ్వరి యాత్ర చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నిజం గెలిస్తే బాబు ఎప్పటికీ జైలు నుంచి బయటకు రారన్నారు. చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కక్షా లేదని మంత్రి పునరుద్ఘాటించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తాడిపూడిలో ప్రభుత్వ శాశ్వత భవనాలను హోం మంత్రి తానేటి వనితతో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబటి మాట్లాడుతూ చంద్రబాబు చేసిన తప్పులే ఆయనను జైలుకు పంపాయన్నారు. నేరాలున్నందునే బెయిల్ కూడా రాలేదని తెలిపారు. అంతేగానీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఎక్కడా వ్యహరించడం లేదని చెప్పారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని గత ప్రభుత్వం చేసిన తప్పులు, దోపిడీకి ఆయన కూడా బాధ్యత వహించాలన్నారు. నాడు పవన్ మద్దతు ఇవ్వకుంటే ఇన్ని తప్పులు జరిగేవి కాదని చెప్పారు. ‘కాపు ఉద్యమ సమయంలో ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ఇబ్బందులు పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నావు పవన్.., అసలు నీకు కాపులు ఎందుకు మద్దతివ్వాలి’? అని ప్రశ్నించారు. న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుబడుతున్నారని అలాంటి సొంత పుత్రుడు, దత్త పుత్రులను ఎలా నమ్మాలన్నారు. చంద్రబాబుకి స్కాంలో పాత్ర ఉందని తెలిసే సీబీఐ కోర్టులో, హైకోర్టులో, చివరకు సుప్రీం కోర్టులో కూడా రిలీఫ్ దొరకలేదని అంబటి చెప్పారు. జలశక్తి నిర్ణయాల మేరకు ప్రాజెక్టు నిర్మాణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణాలు కేంద్ర జలశక్తి సంఘం నిర్ణయాల మేరకు ఆధారపడి ఉంటాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం మంత్రి అంబటి.. ప్రాజెక్టు ఇంజనీర్లతో కలిసి పనులను పరిశీలించారు. పనుల వివరాలను ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి ఆయనకు వివరించారు. ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌ల మధ్య ఉన్న సీఫేజ్ నీటిని మళ్లించేందుకు నిర్మాణం చేస్తున్న కాలువ పనులను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. -
పేదలమైన మనం పెత్తందారుల కోటల్ని బద్దలు కొడదాం: జోగి రమేష్
-
అమ్మా.. మీరు కుప్పంతో సహా..జరగబోయే నిజం ఇదే
-
నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై రోజా సెటైర్లు
-
లోకేష్ ఆడే డ్రామాలు అమిత్ షాకు తెలుసు: పోసాని
-
'అవినీతిపరుడి కోసం దీక్ష.. గాంధీని అవమానించడమే..'
విశాఖపట్నం: భువనేశ్వరి దీక్ష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. అవినీతిపరుడి కోసం దీక్ష చేసి గాంధీని అవమానించారని మండిపడ్డారు. లంచాలు తిని కంచాలు కొడితే చేసిన తప్పులు పోతాయా..? అని ప్రశ్నించారు. భువనేశ్వరి చేసిన దీక్ష సత్యమేవ జయతే కాదు.. అసత్యమేవ జయతే అని ఎద్దేవా చేశారు. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా చంద్రబాబు.. ఆర్థిక ఉగ్రవాది అంటూ నిప్పులు చెరిగారు. 'చంద్రబాబు కడిగిన ముత్యం కాదు, అవినీతి ముత్యం. దీక్ష పేరుతో భువనేశ్వరి ఎస్సీ, ఎస్టీ మహిళా నేతలను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. చంద్రబాబు పెద్ద అవినీతి పరుడనీ ఎన్టీఆర్ చెప్పారు. అవినీతి చక్రవర్తికి అబద్ధాల భార్య అని పేరు పెడితే బాగుంటుంది. 30 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న బతుకు చంద్రబాబుది.' అని వరుదు కళ్యాణి దుయ్యబట్టారు. 'చంద్రబాబు అక్రమ ఆస్తులుపై భువనేశ్వరి దీక్షల చేయాలి. చంద్రబాబును మించిన అవినీతి సైకో మరొకరు లేరు. టిడిపి నేతలకు పళ్లు రాలగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి' అని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తోడు దొంగల ‘రింగ్’! -
నోరు జారీ అడ్డంగా బుక్కయిన నారా భువనేశ్వరి..
-
బాబును మానసిక క్షోభకు గురిచేస్తున్నారు
సాక్షి, రాజమహేంద్రవరం: తప్పుడు కేసులతో జైల్లో పెట్టి తన భర్త చంద్రబాబును ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోందని నారా భువనేశ్వరి ఆరోపించారు. బాబు భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా ఇవ్వడం లేదని, ప్రత్యేకంగా అనుమతులు తీసుకున్న అనంతరం ఇచ్చారని చెప్పారు. ఇలాంటి చిల్లర ఆలోచనలతో బాబును ఎవరూ బెదరించలేరన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిíÙయల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ములాఖత్ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జైలు నిబంధనల మేరకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉండటంతో ప్రత్తిపాటి పుల్లారావు బయటే ఉండిపోయారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘‘బాబు ధైర్యంగా, ఆత్మస్థయిర్యంతో ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు మా బిడ్డలు. పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లు. వాళ్లే లేకుంటే పార్టీలేదు. పోలీసులు ఏం చేసినా వారు బెదరరు. టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరం. అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. సీఐడీవి పనికిమాలిన ప్రశ్నలు: అచ్చెన్నాయుడు కస్టడీలో చంద్రబాబును సీఐడీ అడిగినవన్నీ పనికిమాలిన ప్రశ్నలేనని అచ్చెన్నాయుడు విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఆధారం లేని కేసుల్లో ఇరికించారన్నారు. రెండు రోజుల విచారణలో ఏమైనా ఆధారాలు దొరికాయా? అంటే సమాధానం చెప్పడం లేదన్నారు. కస్టడీలో 33 ప్రశ్నలు పనికిమాలిన, స్కామ్‌కు సంబంధం లేని ప్రశ్నలు అడిగారన్నారు. ఆ ప్రశ్నలను తీసుకున్నామని, న్యాయ నిపుణుల సలహా సైతం తీసుకున్నామని, ప్రతి ప్రశ్నకు జవాబును విపులంగా ప్రజల ముందు ఉంచుతామన్నారు. చంద్రబాబు జైల్లో ధైర్యంగా, ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఆయన భద్రతపై భయంగా ఉందన్నారు. దోమలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బాబుకు జైల్లో ఏమైనా జరిగితే అందుకు కర్త, కర్మ, క్రియ జగనేనన్నారు. యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించేందుకు అన్ని అనుమతులు తీసుకున్నామని, త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. 16వ రోజుకు చేరిన చంద్రబాబు జైలు జీవితం కాగా, సోమవారానికి చంద్రబాబు జైలు జీవితం 16వ రోజుకు చేరింది. మరో 10 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రిలోనే ఉండనున్నారు. -
చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి పెట్టుకున్న ములాఖత్ తిరస్కరణ
-
ప్రజల సొమ్ము దోచేసిన దొంగ చంద్రబాబు: మంత్రి రోజా
-
చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు. బాబును కలిసేందుకు జైలు అధికారులు ముగ్గురికి అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి తొలుత రాజమహేంద్రవరంవిద్యానగర్లో లోకేశ్ ఏర్పాటు చేసుకున్న క్యాంప్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి లోకేశ్‌తో కలిసి సాయంత్రం 4 గంటలకు సెంట్రల్ జైల్‌కు సొంత వాహనంలో చేరుకున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి 30నిమిషాలు బాబుతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, బెయిల్, కుటుంబ సభ్యుల యోగక్షేమాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది : భువనేశ్వరి చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, ధైర్యంగా ఉన్నారని ఆయన భార్య నారా భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కట్టించిన బ్లాక్‌లోనే ఆయన్ని కట్టిపడేశారని అన్నారు. ఆయనకు నంబర్ వన్ సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా, ఆ పరిస్థితి అక్కడ లేదన్నారు. బాబు భద్రతపై ఆందోళన కలిగిస్తోందన్నారు. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోందని చెప్పారు. ఆయన్ని విడిచి బయటకు వస్తుంటే తనలో ఏదో భాగం వదిలేసిన భావన కలుగుతోందని అన్నారు. ప్రజలు, రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉండాలని చంద్రబాబు నిరంతరం పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తిని జైల్లో చూసి బాధేసిందని, అక్కడ కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం ఆలోచించే బాబు కోసం పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని, తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలు, కేడర్ కోసం నిలడుతుందని అన్నారు. మీడియా సమావేశంలో భువనేశ్వరితో పాటు లోకేశ్, బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. చంద్రబాబుతో హైకోర్టు న్యాయవాది భేటీ చంద్రబాబును హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ మంగళవారం మధ్యాహ్నం సెంట్రల్ జైలులో కలిశారు. ఇద్దరూ కేసుకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ వేయడం, సీఐడీ కస్టడీ కోరిన నేపథ్యంలో న్యాయపరంగా ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై వారు చర్చించినట్లు తెలిసింది. రెండో రోజు జైలులో ఇలా.. చంద్రబాబు జైలు జీవితం మంగళవారం రెండో రోజుకు చేరింది. తొలి రోజులాగే రెండో రోజు సైతం వీఐపీ ఖైదీకి అందించే సదుపాయాలన్నీ అందించారు. చంద్రబాబు తొలి రోజు యోగా మాత్రమే చేశారు. మంగళవారం ఉదయం 4 గంటలకే నిద్ర లేచి యోగాతోపాటు వాకింగ్ కూడా చేసినట్లు సమాచారం. అనంతరం మూడు ప్రధాన పత్రికలు తెప్పించుకుని క్షుణ్ణంగా చదివారు. ఆ తర్వాత ఆల్పాహారం, టీ తాగారు. మధ్నాహ్నం, సాయంత్రం పుల్కా, కర్డ్ రైస్ తీసుకున్నట్లు తెలిసింది. స్నేహ బ్లాక్‌కు అదనపు సీసీ కెమెరాల నిఘా బాబుకు రాజమండ్రి కేంద్ర కారాగారంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయన ఉన్న స్నేహ బ్యారక్ వద్ద ప్రస్తుతం ఉన్న వాటితోపాటు అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. 1 + 4 భద్రత ఇస్తున్నారు. ఇతర ఖైదీలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జైలు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో అధికారులు అక్కడ వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు. స్నేహ బ్యారక్ ఎదురుగానే 24 గంటలూ వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు వైద్య సిబ్బందికి విధులు కేటాయించారు. జైలు లోపలే కాదు.. ఎలాంటి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు జరగకుండా జైలు బయట కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
అమ్మ చేతి పంట
విద్యార్థులు ఏటా పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతూ పై తరగతులకు ప్రమోట్ అవుతుంటారు. పట్టభద్రులైన తర్వాత ఇక పుస్తకాలుండవు, తరగతులుండవు, పరీక్షలూ ఉండవు. రైతుకి అలా కాదు. వ్యవసాయం అనే పరీక్షను ఏటా ఎదుర్కోవాల్సిందే. తన జీవితకాలమంతా ఏటా పరీక్ష కు సిద్ధం కావాల్సిందే. కాలం కలిసి వచ్చి ప్రకృతి కరుణిస్తేనే ఉత్తీర్ణత. ఎన్నేళ్లు ఎన్ని పరీక్షలు రాసినా ప్రమోషన్ ఉండదు. అదే పొలం, అదే పంట. భూమితో అనుబంధం తెంచుకోలేక, ఉత్తీర్ణత ప్రశ్నార్థకమవుతున్నా సరే మళ్లీ మళ్లీ పరీక్షకు సిద్ధం కావాల్సిందే. ఇన్ని పరీక్షలతో అలసిపోయిన రైతులు తర్వాతి తరాన్ని పొలానికి దూరంగా పెంచుతున్నారు. వ్యవసాయం మీద మమకారం పెంచుకుంటారేమోనని భయపడుతున్నారు కూడా. తమిళనాడులోని ఈ కుటుంబం కూడా అలాంటిదే. ఓ అమ్మ పిల్లల బాధ్యతలు పూర్తయిన తరవాత అదే పొలంలో అడుగుపెట్టి, ప్రయోగాల పంట పండించింది. కావేరి తీరం! భువనేశ్వరి పుట్టింది తమిళనాడు, తంజావూరు జిల్లాలోని కల్యాణోదయ్ గ్రామంలో. వాళ్ల ఇంటికి దగ్గరగా కావేరి నది ప్రవహిస్తుండేది. నీరు, మట్టి, చెట్టు, పండు అన్నీ స్వచ్ఛమే. కలుషితం కావడం అంటే ఏమిటో తెలియని ప్రకృతి ఒడిలో పెరిగిన బాల్యం ఆమెది. పెళ్లి తర్వాత మధురైకి దగ్గరలోని పుదుకొటై్టకి వెళ్లింది. అత్తవారిది కూడా వ్యవసాయ ప్రధానమైన కుటుంబమే. కానీ ఈ తరంలో అందరూ ఇతర వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. కౌలు రైతుల కెమికల్ ఫార్మింగ్ వల్ల పొలం బీడువారింది. అత్తగారింట్లో వాళ్లెవరూ తమకు పదెకరాల పొలం ఉందనే సంగతి కూడా పట్టించుకోవడం లేదు. భువనేశ్వరి మొక్కల హాబీ పెరటిసాగుకే పరిమితమైంది. పిల్లలు పెద్దయిన తర్వాత ఆమెకు ఖాళీ సమయం ఎక్కువైంది. ఇంట్లో వాళ్లను అడిగి ఒకటిన్నర ఎకరా పొలంలో సాగు చేయడానికి అనుమతి తీసుకుందామె. పొలానికి వెళ్లి సేద్యం చేయడానికి అనుమతి ఇస్తూ ఇంట్లో వాళ్లు ‘వ్యవసాయం అంటే పెరట్లో కూరగాయలు పండించినట్లు కాదు’ అని హెచ్చరించారు కూడా. సేద్యంలో మెళకువల కోసం కరూర్‌లోని ‘వనగమ్ నమ్మళ్వార్ ఎకలాజికల్ ఫౌండేషన్’లో శిక్షణ తీసుకుంది. అన్నింటికీ తలూపి సేంద్రియ పద్ధతిలో సేద్యం చేయడం మొదలుపెట్టిందామె. అలా ఆమె రైతుగా మారింది. ఇది 2013 నాటి మాట. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన సాగు మంచి ఫలితాలనిచ్చింది. సాగు విస్తీర్ణాన్ని విస్తరించింది. ఇప్పుడు పదెకరాల పొలాన్ని ఒంటి చేత్తో సాగు చేస్తోంది. నేలకు ఎప్పుడు ఏ సేవ చేయాలో, ఎప్పుడు ఏ పంట వేయాలో క్షుణ్నంగా వివరించగలుగుతోంది. కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే వాళ్లకు సలహాలిస్తోంది. వంట కోసమా! పంట కోసమా!! భువనేశ్వరి సేంద్రియ సేద్యంలో నేర్చుకున్న ఆవుపేడ, ఆవు మూత్రంతో కూడిన పంచగవ్యాన్ని ఉపయోగించడం వంటి మెళకువలకు తోడు తాను మరికొన్ని జోడించి చేసిన సొంత ప్రయోగాలు ఫలించాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా నూరి ఆ ముద్దను మజ్జిగలో కలిపి పంటల మీద చల్లేది. కీటకాలు మొక్కలోని సారాన్ని పీల్చేసి ఆకులు తెల్లగా మారిపోయినప్పుడు ఆమె ఈ పని చేసింది. కీటకాలు నశించి మొక్కలు ఆకుపచ్చదనం సంతరించుకున్నాయి. ఆమె ప్రయోగాలను చూసి ఆమె పిల్లలు ‘అమ్మా! వంట చేస్తున్నావా? పంట పండిస్తున్నావా’ అని చమత్కరించేవారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల మీద ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు అంతరించిపోతున్న ధాన్యాలను పరిరక్షించే పనిలో ఉందామె. అందరికీ ఉండేది రోజుకు ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయుక్తంగా మలుచుకునే వాళ్లు చరిత్ర సృష్టిస్తారు... అచ్చం భువనేశ్వరిలాగానే. -
బాలకృష్ణకు వాస్తవాలు తెలిసి ఉండకపోవచ్చు
కాకినాడ రూరల్: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అసెంబ్లీలో జరిగిన చర్చ, సభను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు ఆడిన నాటకానికి సంబంధించి వాస్తవాలు తెలిసి ఉండకపోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీలో ఎక్కడా మహిళల ప్రస్తావన గాని, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావన గాని రాలేదని స్పష్టం చేశారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వంగా గీతతో కలిసి శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సానుభూతి కోసం చంద్రబాబు ఏడుపు రాజకీయాలకు తెరతీశారన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు దిగజారి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. వ్యవసాయంపై చర్చ సందర్భంగా తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సభ్యులు మాటల దాడి ప్రారంభించారని చెప్పారు. చంద్రబాబు మాట్లాడేందుకు సభాపతి అనుమతి ఇవ్వగా బాబాయ్.. గొడ్డలి.. తల్లీ ఇవన్నీ మాట్లాడుకుందామని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. దానికి బదులుగా అచ్చెన్నాయుడు మాటలను గుర్తుచేస్తూ ‘పార్టీ లేదు బొక్కా లేదు’ అంటూ తమ పార్టీ సభ్యులు నినాదాలు చేశారని వివరించారు. రెండు నిమిషాల్లో ఇది సద్దుమణగగా.. సహకార డెయిరీల అంశంపై చర్చలో భాగంగా జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్‌తో ఒప్పందంపై వివరిస్తుండగా.. హెరిటేజ్ ప్రస్తావన వచ్చిందన్నారు. చర్చ జరుగుతుండగా 12.26 గంటలకు చంద్రబాబు సభనుంచి వాకౌట్ చేశారని చెప్పారు. బాబుది కన్నీరు పెట్టే తత్వం కాదు ఆ తరువాత మీడియా సమావేశంలో రెండు చేతులు ముఖానికి అడ్డుపెట్టుకుని ఏడుస్తూ భార్యను కించపర్చినట్టు చంద్రబాబు డ్రామాకు తెర తీశారని కన్నబాబు పేర్కొన్నారు. జరగని దానిని జరిగినట్టు చెప్పి ప్రజల్లో ఆయన సానుభూతిని కోరుకుంటున్నాడన్నారు. చంద్రబాబుది కన్నీరు పెట్టే తత్త్వం కాదని.. అందరినీ కన్నీరు పెట్టించే తత్త్వమని అన్నారు. ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్నారన్న కారణంగా లక్ష్మీపార్వతిని, టీడీపీ నాయకులతో తిట్టించి రోజాను కన్నీరు పెట్టించారన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని, ఎన్టీఆర్ కుమారులను దారుణంగా కించపర్చి కన్నీరుపెట్టించిన ఉదంతాలు రాష్ట్రమంతా చూసిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్డ్ అత్యుత్తమ పనితీరును కనబరిచే ముఖ్యమంత్రిగా దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నారని, తమ ప్రభుత్వం మహిళలను కించపరిచే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. మహిళల పట్ల జగన్మోహన్రెడ్డి గౌరవంగా ఉంటారని.. ఎవరినైనా అమ్మా అనే సంభోదిస్తారని చెప్పారు. రైతులను ఆదుకుంటాం అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి కన్నబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏ ఒక్క రైతు నష్టపోకూడదని చెప్పారన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇంకా వర్షాలు పడుతున్నాయని, తగ్గిన వెంటనే పంట నష్టం గుర్తింపు చేపడతామన్నారు. ప్రతి రైతును ఆదుకుంటామని, నీట మునిగిన ధాన్యం కొనుగోలు విషయమై ముఖ్యమంత్రితో చర్చించి నిబంధనలు సడలిస్తామని మంత్రి కన్నబాబు చెప్పారు. -
‘చంద్రబాబు సతీమణి గురించి సభలో ఎక్కడా ప్రస్తావన రాలేదు’
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిది బాధపెట్టించే తత్వమే కానీ బాధపడే మనస్తత్వం కాదని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు కన్నీళ్లు పెట్టిస్తారే తప్ప.. పెట్టుకోరని ధ్వజమెత్తారు. తన భార్యను ఎవరో ఏదో అన్నట్లు చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని, ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఒక్కరోజైనా చంద్రబాబు విలువతో కూడిన రాజకీయం చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పుడూ పదవి కావాలని, పదవి కోసం ఆయన ఎవరినైన వాడుకుంటారని దుయ్యబట్టారు. చదవండి: చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నాడు: మంత్రి బాలినేని ‘టీడీపీ సభ్యులే వ్యక్తిగతంగా విమర్శించడం ప్రారంభించారు. బాబాయ్ గొడ్డలి అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశాచారు. టీడీపీ కామెంట్లకు మావాళ్లు స్పందించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అసెంబ్లీలో ఎక్కడా చర్చలోకి రాలేదు. భువనేశ్వరి గురించి మాట్లాడినట్లు తప్పుడు చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టారు. భువనేశ్వరిపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోం’ అని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. చదవండి: ‘బాలకృష్ణ అమాయకుడు.. చంద్రబాబు ఏం చేప్తే అది నమ్ముతాడు’ -
యజమాని ప్రాణాలను కాపాడిన పిల్లి.. నాలుగడుగుల పాముతో..
భువనేశ్వర్: సాధారణంగా కొంత మంది మూగజీవాలను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే.. కుక్కలు, పిల్లులు.. తదితర జీవులను తమ ఇంట్లో పెంచుకొని కుటుంబంలో ఒకటిదానిలా చూసుకుంటారు. అవి మనుషుల కన్నా విశ్వాసంగా ఉంటాయని నమ్ముతుంటారు. అయితే, ఒక్కొసారి ఆ పెంపుడు జీవులు తమ యజమానికి ఏదైనా ఆపద సంభవిస్తే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని కపిలేశ్వర్కు చెందిన సంపద్ కుమార్ పరిడా ఒక పిల్లిని పెంచుకున్నారు. దాన్ని ప్రేమతో చినుఅని పిలుచుకునే వారు. దాన్ని తమ కుటుంబంలో ఒకదానిగా చూసుకునేవారు. ఒకటిన్నర సంవత్సరాలుగా పిల్లిని పెంచుకుంటున్నారు. అది ఇళ్లంతా తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు.. పెరడు నుంచి ఒక నాగుపాము ఇంట్లో ప్రవేశించడాన్ని చిను గమనించింది. వెంటనే అరుచుకుంటూ వెళ్లి పాముకు ఎదురుగా నిలబడింది. అంతటితో ఆగకుండా.. అరుస్తు పామును తన పంజాతో కొట్టసాగింది. పిల్లి అరుపులు విన్న సంపద్ కుమార్ అక్కడికి వెళ్లి చూశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అక్కడ నాలుగడుగుల పాముతో తమపిల్లి పోరాటం చేస్తుంది. అవి రెండు పరస్పరం దాడిచేసుకుంటున్నాయి. పాము ఎంత బుసలు కొడుతున్నా.. పిల్లి ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. పామును చూసి భయపడిపోయిన సంపద్ వెంటనే స్నేక్ హెల్ప్ సోసైటీ వారికి ఫోన్ చేశాడు. ఈ క్రమంలో, దాదాపు అరగంట పాముని ఇంట్లో ప్రవేశించకుండా.. చిను పోరాటం చేస్తునే ఉంది. సంపత్ కుమార్ పిల్లి, పాముల పోరాటాన్ని తన మొబైల్లో ఫోటోలు తీసుకున్నాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేక్ సొసైటీవారు పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. ఆ తర్వాత తన ఆ క్లిప్పింగ్‌లను తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ రోజు తాము ఉన్నామంటే దానికి తమ పెంపుడు పిల్లి చిను మాత్రమే కారణమని తెలిపాడు. దీంతో ఈ సంఘటన కాస్త వైరల్‌గా మారింది.