చంద్రబాబు చరిత్ర అంతా వెన్నుపోటు, మోసాలే
ప్రజల ముందుకు మరో తప్పుడు హామీ
కలలకు రెక్కలంటూ ముందుకొచ్చిన భువనేశ్వరీ
కుప్పంలో పోటీ చేయాలన్న భువనేశ్వరీ కల ఎప్పుడు తీరేను?
కుప్పంలో పోటీ చేయాలని భువనేశ్వరీ కలగన్నారు. నేరుగా కుప్పానికే వెళ్లి చంద్రబాబుకు విశ్రాంతి ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇక్కడ నాకు పోటీ చేయాలని ఉందని, ఇది నా కల అని కూడా చెప్పుకొచ్చారు. ఆమె స్వప్నం ఎందుకు సాకారం కాలేదో.. అన్నది వేరే సంగతి కానీ.. ఇప్పుడు కలలకు రెక్కలంటూ మళ్లీ ప్రజల ముందుకొచ్చారు.
చంద్రబాబు కోసం భువనేశ్వరి ప్రకటనలు చేశారా.? లేక చంద్రబాబే చేయించారా అన్నది పక్కనబెడితే.. భువనేశ్వరీకి తెలియాల్సిన కొన్ని విషయాలున్నాయి. అమ్మాయిల కలలకు రెక్కలు అన్న కాన్సెప్ట్ ఎలా ఉన్నా.. ఇప్పటివరకు మీరు చూపించిన భ్రమరావతి మహిళలందరికి పీడ కలలు మిగిల్చాయి. ఒక సారి 2014 లో చంద్రబాబు మహిళలకు చేసిన వాగ్దానాలు చూడండి. ఇందులో ఏ ఒకటి అయినా తీర్చాడా? అన్నది భువనేశ్వరీనే చెప్పాలి.
చంద్రబాబు 2014-19లో మహిళలకు ఇచ్చిన హామీలు
- మహాలక్ష్మి పథకంలో భాగంగా పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 25 వేలు డిపాజిట్ చేస్తా
- గర్భిణులకు రూ.10 వేలు ఇస్తాం
- ప్రతి పేద మహిళకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తా
- ఏడాదికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు 100 సబ్సిడీతో ఇస్తా
- 14 వేళా కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ
ఇవేవీ అమలు చేయలేక మ్యానిఫెస్టోను మాయం చేసిన ఘనత చంద్రబాబుది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు భార్యగా మీది. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి మళ్లీ కాకమ్మ కథలు చెప్పడం బాగోలేదని ప్రజలంటున్నారు. ఏ పని చేయలేడనే చంద్రబాబును చిత్తుగా ఓడించిన ప్రజలు 23 సీట్లకు పరిమితం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ 58 నెలల్లో వివిధ పథకాల ద్వారా (డీబీటీ, నాన్ డీబీటీ ) కింద కేవలం మహిళలకు అందించిన లబ్ధి అక్షరాల రూ.2 .78 లక్షల కోట్లు అందించారు. సంక్షేమ పథకాల ద్వారా జగన్ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో 18.38 లక్షల మంది మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు.
అందుకే భువనేశ్వరీ గారు, మళ్లీ కలలకు రెక్కలంటూ కాకమ్మ కబుర్లు చెప్పొద్దని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో పోటీ చేయాలని కల గంటున్నారు కదా.. మీ కలలకు రెక్కలు తెచ్చుకోండి. ధైర్యంగా నామినేషన్ వేయండి, చంద్రబాబు తప్పుకుంటారు. కల సాకారం అవుతుందా లేదా పక్కనబెట్టి కనీసం ప్రయత్నం చేశారన్న గౌరవం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment