మా అమ్మ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తారా? | Nara lokesh slams cm kcr coment on bhuvaneswari | Sakshi
Sakshi News home page

మా అమ్మ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తారా?

Published Sun, Jan 31 2016 7:29 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

మా అమ్మ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తారా? - Sakshi

మా అమ్మ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తారా?

సాక్షి, హైదరాబాద్: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర సీఎం భార్య గురించి అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం పార్టీ శ్రేణులు నిర్వహించిన బైక్‌ర్యాలీలో లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేష్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆద్యాంతం టీడీపీపై విమర్శల దాడిగా కొనసాగిందని, దీన్నిబట్టి తెలంగాణలో టీడీపీ ఎంత బలంగా ఉందో, ఆ పార్టీ అంటే టీఆర్ఎస్ కు ఎంత భయమో అర్థమవుతున్నాయన్నారు.

'కేసీఆర్‌లా అబద్ధాలు చెప్పడం దేశంలో ఎవరికీ సాధ్యం కాదు. నిన్నటి సభలో మరోసారి వేలాది మంది సాక్షిగా అదేపనిచేశారు. మా అమ్మ(భువనేశ్వరి) టీఆర్‌ఎస్‌కు ఓటేస్తుందని చెప్పడం దారుణం. ఆమె గురించి అబద్ధాలు ప్రచారం చేయడం ఘోరం.కేసీఆర్ మాటలకు అమ్మ వెంటనే స్పందించింది. ఆమె ఎవరికి ఓటేస్తారో అందరికీ తెలుసు. ఏది చెప్పినా జనం నమ్ముతారారనేది కేసీఆర్ ధోరణి. ఎవరెలాంటివాళ్లో ప్రజలకు తెలుసు' అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement