లోకేష్ ర్యాలీలో నిబంధనల ఉల్లంఘన
Published Mon, Jan 25 2016 9:27 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM
హైదరాబాద్: ఏఎస్‌రావు నగర్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ర్యాలీలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగింది. పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి తరఫున లోకేష్ ఆదివారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నిబంధనలను ఉల్లంఘించినట్లు కుషాయిగూడ పోలీసులు గుర్తించారు. జెండాలు ఏర్పాటు, డీజే వాడటంతో పాటు ట్రాఫిక్ జామ్ కు కారణమైనందుకు గాను ఆ పార్టీ అభ్యర్థి తాతినేని స్వరాజ్యంపై సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement