GHMC elactions
-
మేయర్ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో సంశయాలు.. ఊహాగానాలు.. మరెన్నో అంచనాలను పటాపంచలు చేస్తూ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోటీ జరిగినప్పటికీ.. మేయర్ ఎన్నికకు 4, డిప్యూటీ మేయర్ ఎన్నికకు 4 నిమిషాలు చొప్పున 8 నిమిషాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ 20 నిమిషాల్లోనే ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, అది ముగిశాక 12.30 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నికలు పూర్తి చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకుంది. మేయర్‌గా రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ గద్వాల విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్‌గా టీఆర్ఎస్ నాయకుడు మోతె శోభన్‌రెడ్డి సతీమణి మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. ఎంఐఎం సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్కు 32 మంది ఎక్స్అఫీషియో సభ్యులున్నప్పటికీ అందరూ హాజరు కాలేదు. విప్‌కు అనుగుణంగానే అందరూ వ్యవహరించారని విప్ జారీ చేసిన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు తెలిపారు. టీఆర్ఎస్కు తగినంత బలమున్నందున ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విని యోగించుకునేందుకు వీలుగా పారీ్టయే వారిని రావద్దని సూచించినట్లు తెలిపారు. హాజరుకాని వారిలో లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బి.లక్ష్మీనారాయణ, ఫరీదుద్దీన్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులున్నారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌కు మాత్రం విప్ జారీ కాలేదని సమాచారం. ఆయన సమావేశానికి హాజరు కాలేదు. మేయర్‌గా ఎన్నికయ్యాక గద్వాల విజయలక్ష్మి సభలోనే ఉన్న తన తండ్రి కేశవరావుకు పాదాభివందనం చేశారు. అనంతరం సభ్యులందరికీ విడివిడిగా ధన్యవాదాలు తెలిపారు. సన్నిహితులను ఆలింగనం చేసుకున్నారు. చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులంతా ఓట్లు వేశారు. బీజేపీ అభ్యర్థులకు కేవలం బీజేపీ సభ్యులు మాత్రమే ఓట్లు వేశారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లుండగా, లింగోజిగూడ కార్పొరేటర్ మృతి చెందడంతో ప్రస్తుతం 149 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ఎన్నికలో పాల్గొనలేదు. మిగతా 147 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఓటున్న అయిదుగురు రాజ్యసభ సభ్యుల్లో డి.శ్రీనివాస్, వి.లక్ష్మీకాంతరావు హాజరు కాలేదు.15 మంది ఎమ్మెల్సీల్లో 10 మంది, 21 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది హాజరైనట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఎంపీలు కిషన్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ సైతం పోలింగ్‌లో పాల్గొనలేదు. ఎమ్మెల్సీ కవిత పలువురికి సూచనలిస్తూ కనిపించారు. మంత్రి తలసాని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టీఆర్ఎస్ సభ్యులకు సూచనలిచ్చారు. చదవండి: ‘మమ్మీ కంగ్రాట్చులేషన్, ఐ లవ్యూ’ మేయర్ పదవి ఆశించింది వాస్తవమే: మోతె శ్రీలతారెడ్డి తెలిసినా తగ్గలేదు సాక్షి, సిటీబ్యూరో: మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ తమవద్ద లేదని తెలుసు. అయినా బీజేపీ తమ అభ్యర్థులను మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బరిలోకి దించింది. అప్పటి వరకు పైకి చూసేందుకు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష మజ్లిస్‌లు తీరా ఓటింగ్ సమయం ఒక్కటవడంతో ఆ పారీ్టకి ఓటమి తప్పలేదు. ఎన్నికల సమయంలో ఆ రెండు పారీ్టలు పన్నిన కుట్రలను, కొనసాగిస్తూ వస్తున్న అంతర్గత సంబంధాలను బహిర్గతం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. కౌన్సిల్ వేదికగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష మజ్లిస్ల అపవిత్ర పొత్తులను బహిర్గతం చేసి ఆందోళనకు దిగింది. ఆ రెండు పార్టీలపై తీవ్రంగా మండిపడింది. సంఖ్యాబలం లేదని తెలిసీ.. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 48 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలను కైవసం చేసుకుంది. వీరిలో లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్‌గౌడ్ ప్రమాణ స్వీకారాణికి ముందే మృతి చెందారు. దీంతో బీజేపీ సీట్ల సంఖ్య 47కు చేరింది. ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో మేయర్ ఎన్నికకు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. అధికార టీఆర్ఎస్కు ఎక్స్‌అఫిíÙయో ఓట్లు 32 ఉండగా, బీజేపీకి 2, ఎంఐఎంకు 10 ఉన్నాయి. అయితే అధికార టీఆర్ఎస్కు కార్పొరేటర్ సహా ఎక్స్ అఫిషియో ఓట్లు ఎక్కువే. తీరా ఓటింగ్ సమయంలో ఎంఐఎం మ ద్దతు తెలుపడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఆ పార్టీ సునాయాసంగా దక్కించుకుంది. -
హైదరాబాద్‌ను ఏం చేద్దాం అనుకున్నారు..
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధికార టీఆర్ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు హిందువుల ఓట్లును ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అనుకూల ప్రాంతాల్లో హిందువుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. ప్రజలను నమ్మించడంలో ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడంలో టీఆర్ఎస్ నేతలు ఆరితేరిపోయారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఎలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయిని ప్రశ్నించారు. నగరాన్ని ఎంఐఎంకి అప్పగించి.. హైదరాబాద్‌ని ఏం చేద్దామని అనుకుంటున్నారని నిలదీశారు. ఎంఐఎం నేతలకు ప్రగతి భవన్లో ఎప్పుడు వెళ్లినా అపాయింట్ మెంట్ దొరుకుతుందని, తెలంగాణ మంత్రులకు మాత్రం అపాయింట్మెంట్ దొరకదని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో బండి సంజయ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో ఒక్కో డివిజన్లలో 45 నుంచి 50 వేల ఓట్లు ఉన్నాయి. బోలక్ పూర్ 79 నుంచి 93 పోలింగ్ బూతుల్లో 5 వేల ముస్లిం ఓట్లను పెంచారు. అంబర్ పేట 140 నుంచి 150 పోలింగ్ బూతుల్లో ముస్లిం ఓట్లు 4 వేలు పెంచారు. చాంద్రాయణగుట్ట ఉప్పుగూడాలో 50 శాతం హిందువులు ఉంటే.. 45 శాతానికి తగ్గించారు. 5 వేల హిందువుల ఓట్లు తొలగించారు. బోరాబండలో 26 వేల హిందువుల ఓట్లను తొలగించారు. గోశామహల్లో 52357 ఓట్లు ఉంటే.. 15 వేల ఓట్లు తొలగించారు. 62 డివిజన్లో ఇలాగే ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్ర పన్ని ఓట్లు తొలగించారు. నెల రోజుల నుంచి ఎన్నికల సంఘాన్ని కలవడానికి టైం అడిగితే టైం ఇవ్వడం లేదు. ఎన్నికల సంఘం చట్టానికి అతీతం కాదు. ప్రజలు తిరగబడతారు. బీజేపీ అభ్యంతరాలు పరిష్కారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దు. ఒక వర్గం ఓట్లతోనే అధికారంలోకి వచ్చారా ? అన్ని వర్గాలను సమానంగా ప్రభుత్వం చూడాలి. టీఆర్ఎస్., ఎంఐఎంకు ఎందుకు దాసోహం అయ్యింది. నాళాలు, చెరువులు ఆక్రమించింది టిఆర్ఎస్ నేతలే. కేంద్రం ఎక్కడి నుంచి డబ్బులు తెస్తుంది, పాకిస్తాన్ నుంచి ముద్రించి తేవాలా ?. పథకాల అమలుకు కేంద్రం నిధులు ఇస్తుంది. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారికి ఎన్నికల్లో పోటీచేయించడానికి కేసీఆర్ జీవో తెచ్చారు. ముఖ్యమంత్రి కుట్రలను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా. హైదరాబాద్‌లో పాదయాత్ర చేస్తాం. దుబ్బాకలో చుక్కలు చూపించాం. దుబ్బాకలో విజయం సాధించబోతున్నాం.’ అంటూ వ్యాఖ్యానించారు. -
అదే తీరు..మారని ఓటరు
బల్దియా ఎన్నికల్లో పెరగని ఓటింగ్ శాతం కొందరి ఓట్లు గల్లంతు ఓటరు స్లిప్పుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం విద్యావంతుల్లో నిర్లిప్తత సిటీబ్యూరో: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును వినియోగించుకోవడంపై గ్రేటర్‌లోని మెజార్టీ ఓటర్లు శ్రద్ధ చూపలేదు. బల్దియా ఎన్నికల్లో కొన్ని డివిజన్లలో పోలింగ్ 45 శాతం...మరికొన్ని చోట్ల 35శాతం మించకపోవడం ఇదే విషయాన్ని సుస్పష్టం చేస్తోంది. ఇది నాణేనికి ఒక పార్శ్వంకాగా.. ఓటర్ల నిర్లిప్తతకు ఇతర కారణాలూ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓటేయాలన్న కోరిక పౌరుల్లో బలంగా ఉన్నప్పటికీ... వివిధ రాజకీయ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు బాగాలేదని...ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం, డబ్బు, మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెట్టడం చూసి...విరక్తితో పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటేసినా తమ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులు, అధికారాలు బల్దియాకు లేవని.. అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయని ఓటర్లు అభిప్రాయపడుతున్నారని చెబుతున్నారు. ఓటేసినా.. వేయకున్నా ఒరిగేదేమీ లేదన్న నిస్పృహతోనే చాలామంది దూరంగా ఉన్నట్లు విశేషిస్తున్నారు. కారణాలెన్నో... మెహిదీపట్నం డివిజన్లో 34.28 శాతం, విజయనగర్ కాలనీలో 34.51 , అహ్మద్‌నగర్‌లో 37.11 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పాతనగరంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు అలజడి రేగడంతో పలువురు ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ డివిజన్లలో ఓటరు స్లిప్పులు సరిగా పంపిణీ చేయకపోవడం, భర్తకు ఓ డివిజన్లో.. భార్యకు మరో డివిజన్లో ఓటు హక్కు ఉండడం, మరికొందరి ఓట్లు గల్లంతవడం పోలింగ్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.సరూర్‌నగర్ డివిజన్లో 37.89 శాతమే ఓటింగ్ నమోదైంది. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లలోనే ఉండిపోవడం. చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు పనుల్లో నిమగ్నమవడంతో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. కొన్నిచోట్ల ఓటర్లకు స్లిప్పులు అందలేదు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు తమ ఐడీ కార్డులను మాత్రమే తీసుకొచ్చి అవస్థలు పడ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. వివేకానంద నగర్ డివిజన్లో అపార్ట్మెంట్ల వాసుల ఓట్లు కొన్ని గల్లంతయ్యాయి. గోషామహల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి.మరికొన్ని చోట్ల ఓటరు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు రెండు, మూడు ప్రాంతాల్లో ఉండడంతో ఎక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యారు.2011, 2014లలో గ్రేటర్ జనాభా, ఓటర్ల లెక్కకు పొంతన కుదరకపోవడం కూడా పోలింగ్ శాతం తగ్గేందుకు కారణమని భావిస్తున్నారు. గత అనుభవాలే కారణమా? గత బల్దియా ఎన్నికల్లో తాము ఎన్నుకున్న కార్పొరేటర్లు సమస్యల పరిష్కారం విషయంలో... అందుబాటులో ఉండే విషయంలో తమను నిరాశ పరచడంతో పలువురు ఓటుకు దూరంగా ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. ప్రామాణ్య స్ట్రాటజీ అనే రాజకీయ పరిశోధన సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో పలువురు ఓటర్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. గతంలో తాము ఎన్నుకున్న కార్పొరేటర్లు ఫిర్యాదులపై స్పందించారని 39.8 శాతం మంది తెలపగా.. అంతగా చొరవ చూపలేదని, ముభావంగా స్పందించారని, చూద్దాం..చేద్దాం అన్న ధోరణితో వ్యవహరించారని 25.3 శాతం మంది తెలిపారు. 34.8 శాతం మంది తాము ఎనుకున్న కార్పొరేటర్లు సమస్యల వైపు కన్నెత్తి చూడలేదని కుండబద్దలు కొట్టడం ప్రస్తావనార్హం. -
మా అమ్మ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర సీఎం భార్య గురించి అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం పార్టీ శ్రేణులు నిర్వహించిన బైక్‌ర్యాలీలో లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేష్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆద్యాంతం టీడీపీపై విమర్శల దాడిగా కొనసాగిందని, దీన్నిబట్టి తెలంగాణలో టీడీపీ ఎంత బలంగా ఉందో, ఆ పార్టీ అంటే టీఆర్ఎస్ కు ఎంత భయమో అర్థమవుతున్నాయన్నారు. 'కేసీఆర్‌లా అబద్ధాలు చెప్పడం దేశంలో ఎవరికీ సాధ్యం కాదు. నిన్నటి సభలో మరోసారి వేలాది మంది సాక్షిగా అదేపనిచేశారు. మా అమ్మ(భువనేశ్వరి) టీఆర్ఎస్కు ఓటేస్తుందని చెప్పడం దారుణం. ఆమె గురించి అబద్ధాలు ప్రచారం చేయడం ఘోరం.కేసీఆర్ మాటలకు అమ్మ వెంటనే స్పందించింది. ఆమె ఎవరికి ఓటేస్తారో అందరికీ తెలుసు. ఏది చెప్పినా జనం నమ్ముతారారనేది కేసీఆర్ ధోరణి. ఎవరెలాంటివాళ్లో ప్రజలకు తెలుసు' అని లోకేశ్ వ్యాఖ్యానించారు.