చంద్రగిరి (తిరుపతి జిల్లా)/సాక్షి, తిరుపతి: అబద్ధాలను పదేపదే చెప్పి వాటినే నిజమని ప్రజలను నమ్మించడంలో చంద్రబాబుకు మించిన వారు లేరనేది అందరికీ తెలిసిందే. ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో జైలు జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి సైతం చంద్రబాబు అబద్ధాల బాటలోనే పయనిస్తుండటం విస్మయం కలిగిస్తోంది.
చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఒక్కరు కూడా మృతి చెందకపోయినా రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి పైగా మరణించారని.. వారి కుటుంబాలను తాను పరామర్శిస్తానని భువనేశ్వరి బుధవారం నుంచి పరామర్శ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఆవులపల్లి ప్రవీణ్ రెడ్డి(33) కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
ఇంత నిస్సిగ్గుగా అబద్ధపు ప్రచారమా..
చంద్రగిరి పాతపేటకు చెందిన ప్రవీణ్ రెడ్డి రెండు నెలల క్రితం టీడీపీలో చేరాడు. అంతకముందు నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీకి పనిచేశాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం ఉదయం ఇంట్లో గుండెపోటు రావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టీడీపీ నేతలు అతడి మృతిని బాబు ఖాతాలో వేసేశారు.
వాస్తవానికి ప్రవీణ్ రెడ్డికి గతంలోనూ గుండెపోటు వచ్చిందని.. అప్పటి నుంచి అతడు తరచూ చికిత్స తీసుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇలాగే పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ నాయుడు(70) కుటుంబాన్ని కూడా భువనేశ్వరి పరామర్శించారు. గత నెల 25న చిన్నబ్బ నాయుడు వృద్ధాప్య సమస్యలతో మృతి చెందాడు. అయితే చంద్రబాబుని అరెస్టు చేసినందుకు మనస్తాపంతో మృతి చెందినట్లు టీడీపీ నేతలు ప్రచారానికి దిగారు. దీనిపైనా స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
మరణిస్తారని ముందే తెలుసా?
భువనేశ్వరి బుధవారం మృతుల కుటుంబాలకు పంపిణీ చేసిన చెక్కులు గందరగోళానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సంతకం చేసిన చెక్కులను మృతుని కుటుంబాలకు పంపిణీ చేశారు. భువనేశ్వరి తన పరామర్శ యాత్రలో ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ నాయుడు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించారు. అక్టోబర్‌లో మరణిస్తే.. సెపె్టంబర్‌లోనే సంతకం చేసినట్లు ఉంది. చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ కాగా, ఆ చెక్‌లు చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సెప్టెంబర్ 4న సంతకం చేసినవి.
Comments
Please login to add a commentAdd a comment