
సాక్షి, తిరుపతి: చంద్రబాబు నాయుడుకు దళితులంటే మొదటి నుంచి చిన్నచూపేనని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. సాక్షి పత్రిక రిపోర్టర్ కరుణాకర్ పై దాడి ను నిరసిస్తూ ఎస్వీ యూని వర్సిటీ మెయిన్ గేట్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు చేపట్టాయి. నల్ల రిబ్బన్‌లతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు దళితులు అంటే మొదటి నుంచి చిన్న చూపే. చంద్రబాబు దళితులకు డిప్యూటీ సీఎం ఏనాడు ఇవ్వలేదు. చంద్రబాబు పాలనలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించినా, దళిత సంక్షేమం గాలికి వదిలేసిన ఈనాడు పత్రిక ఏనాడూ రాయలేదు.
ఈరోజు సీఎం జగన్ దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు, ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. ఈనాడు రామోజీ రావు అవసాన దశలో నైనా వాస్తవాలు తన పత్రికలో రాయాలి. ఎస్సీ ఎస్టీ, బీసీలకు రాజధాని లో పేదలకు ఇళ్ళ స్థలాలు వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళిన చంద్రబాబు గురించి ఈనాడు వార్తలు రాయలేదు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment