praveen reddy
-
టికెట్ ఎవరి చేతికో? అభయ ‘హస్తం’పై ఉత్కంఠ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ముందుగా అనుకున్న విధంగా అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు కాకుండా తెరపైకి మరో రెండు కొత్త పేర్లు రావడంతో కేడర్ అయోమయంలో పడింది. ఇప్పటికే కరీంనగర్లో లోకల్ నాన్ లో కల్ అంటూ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ మరో స్థానికేతరుడు తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తే తాము పనిచేసే పరిస్థితి ఉండదని స్థానికనేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన హస్తం అధిష్టానం తెలంగాణలో ఎంతో కీలకమైన కరీంనగర్ ఎంపీ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, స్థానికేతరులకు అవకాశం ఇస్తారన్న ఊహాగానాలు మొదలవడంతో కేడర్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రవీణ్‌రెడ్డి అభిమానుల గుస్సా అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును పార్టీ కోసం త్యాగం చేసిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి అదే సమయంలో ఎంపీ సీటు ఇస్తామని అధిష్టానం మాటిచ్చింది. ప్రవీణ్‌రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. పార్లమెంటు పరిధిలో ప్ర చార పోస్టర్లు వేసుకున్నారు. కానీ, అకస్మాత్తుగా తెరపైకి వెలి చాల రాజేందర్రావు పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తూ అధిష్టానాన్ని ఒప్పించే పనిలో పడ్డారు. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రవీణ్‌రెడ్డి వర్గం కిమ్మనడం లేదు. ఇది చాలదన్నట్లుగా అదనంగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పేరును తెరపైకి కాంగ్రెస్ నేతలు తీసుకువచ్చారు. దీంతో ప్రవీణ్‌రెడ్డి అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమకు హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, కరీంనగర్ నియోజవకర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉందని, తమను కాదని ఎక్కడి నుంచో నాయకులను తీసుకురావాల్సిన అగత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దూరమైన రోహిత్‌రావు పార్టీ టికెట్ కోసం కొన్నేళ్లుగా ఎమ్మెస్సార్ మనవడు మేనేని రోహిత్‌రావు కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన అధిష్టానం ఎంపీ ఎన్నికల సమయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. తనకు టికెట్ రాకున్నా.. ప్రవీణ్‌రెడ్డి కోసం పనిచేసేందుకు రోహిత్‌రావు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది. తీరా ప్రవీణ్‌రెడ్డిని కాదని ఇంకెవరికి ఇచ్చినా రోహిత్‌రావు వర్గం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, కనీసం పార్టీలో సభ్యత్వం లేనివారిని పోటీలోకి దింపడంపై జిల్లా కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. త్వరలో కాంగ్రెస్‌లోకి గులాబీ నేతలు బీఆర్ఎస్ అధిష్టానానికి వరుసషాకులు తగులుతున్న వేళ.. కరీంనగర్ జిల్లా మాత్రం కంచుకోటలా ఉంటూ వస్తోంది. కొంతకాలంగా హస్తం పార్టీ నేతల లాబీయింగ్ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జిల్లాకు చెందిన కీలక గులాబీ నేతలు ఈనెల 6న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగే రాహుల్‌గాంధీ సభలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చకోనున్నారని సమాచారం. తెరపైకి మరో వ్యక్తి.. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, వెలిచాల రాజేందర్రావులతోపాటు మరో ఆసక్తికర వ్యక్తి పేరు వినిపిస్తోంది. బీఆర్ఎస్లో ముఖ్యనేతగా ఉన్న ఓ వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోగానే అతన్నే ఎంపీగా పోటీ చేయిస్తారన్న ప్రచారం ఆసక్తిగా మారింది. ఒకవేళ అదే వాస్తవరూపం దాలిస్తే.. కరీంనగర్ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టికెట్ ప్రకటించిన పెద్దపల్లిలో అనిశ్చితే.. పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ టికెట్ ఖరారైనా అనిశ్చితే నెలకొంది. గడ్డం కుటుంబానికి చెందిన వినోద్‌కుమార్ బెల్లంపల్లికి, వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తాజాగా పెద్దపల్లి ఎంపీగా ఆదే కుటుంబానికి చెందిన గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో రచ్చ జరుగుతోంది. మాదిగలు ఎక్కువగా ఉండే పెద్దపల్లి స్థానానికి మాదిగ సామాజికవర్గం వారికే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా గడ్డం వంశీకి టిక్కెట్ కేటాయించారని, పునరాలోచన చేయకపోతే వచ్చే నెల 5న న్యాయ దీక్ష చేస్తానంటూ యువజన జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ అధిష్టానాన్ని హెచ్చరించారు. తాజాగా రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలతో టికెట్ మార్పుపై ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు రిజర్వ్డ్ స్థానాల్లోని పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌లో మాల సామాజికవర్గానికి టికెట్ కేటాయించింది. వరంగల్‌లో మాదిగ సామాజికవర్గంలోని ఉప కులానికి చెందిన కడియం శ్రీహరికే టిక్కెట్ కేటాయించనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి టికెట్ మార్పు చేస్తుందా? గడ్డం వంశీనే కొనసాగిస్తాందో వేచి చూడాల్సి ఉంది. కాగా.. టికెట్ ఖరారు చేసుకున్న గడ్డం వంశీ ప్రచారంలో దూసుకపోకపోయినా.. వివిధ పార్టీల్లో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుతూ బలాన్ని పెంచుకుంటున్నారు.. ఇవి చదవండి: ఆర్థికంగా దెబ్బతీసేందుకు మోదీ కుట్ర : ఎమ్మెల్యే కవ్వంపల్లి -
పొన్నం వర్సెస్ అల్గిరెడ్డి.. ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా?
సాక్షి, మెదక్: కాంగ్రెస్ అధిష్టానం టికెట్ల కేటాయింపులో మొదటి లిస్ట్‌లో హుస్నాబాద్‌కు చోటు ఇవ్వలేదు. రేపో మాపో రెండో లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. టికెట్ ఖరారు కాకముందే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. టికెట్ నాకే అంటే నాకే అని ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ పోతున్నారు. – హుస్నాబాద్ హైదరాబాద్‌లోని తక్కుగూడలో జరిగిన రాహుల్ గాంధీ, సోనియాగాంధీ విజయభేరికి ఎవరికి వారే వాహనాల్లో కార్యకర్తలను తరలించారు. పార్టీ కార్యాలయాలను సైతం ప్రారంభించారు. ‘తిరగబడుదాం..తరిమికొడదాం’ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వి. హన్మంతరావు పాల్గొనగా, పొన్నం ప్రభాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఇద్దరూ పాల్గొన్నారు. దీని తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేదుకు నిర్వహించి సమావేశానికి ఏఐసీసీ సభ్యుడు మోహన్ ప్రకాశ్ రాగా, రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా ఏర్పడడం కార్యకర్తల్లో అయోమయానికి గురి చేసింది. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా హుస్నాబాద్ టికెట్ తమకే కేటాయించాలని సీపీఐ పార్టీ ఒత్తిడి తెస్తోంది. ఈ రెండు మూడు రోజుల నుంచి సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుండడంతో, హుస్నాబాద్ సీటు కాంగ్రెస్‌కే కేటాయిస్తారనే భావనతో టికెట్ కోసం పొన్నం ప్రభాకర్, ప్రవీణ్‌రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చలో కాళేశ్వరం.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని, ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు చూపేందుకు పొన్నం ప్రభాకర్ చలో కాళేశ్వరం పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలానికి ఒక బస్సు చొప్పున రైతులు, కాంగ్రెస్ నాయకులతో కాశేశ్వరానికి తరలివెళ్లారు. అలాగే మార్నింగ్ వాక్ పేరిట ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రచారం చేస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇటీవలె కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రచార రథాలకు పూజలు చేయించి ప్రతి రోజూ ప్రచారం చేయిస్తున్నారు. చాపకింది నీరులా ప్రచారం.. మరో వైపు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి చాపకింద నీరులా ప్రచారం ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని దాదాపు 90 గ్రామాలను చుట్టిముట్టి కాంగ్రెస్ ఆరు గ్యా రెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఊరు ఊరునా పరామర్శల పేరిట ఇంటింటికీ వెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. టికె ట్ తనకే వస్తుందనే ధీమాతో కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో బుధవారం ప్రచ ార రథాలకు పూజలు నిర్వహించారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా? కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరి మద్దతు ఉంటుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరు నేతలు ఎందులోనూ తగ్గకుండా సీరియస్‌గా ఎవరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా చేస్తున్నారు. టికెట్ వచ్చిన తర్వాత ఇద్దరు చేతులు కలుపుతారా లేదా చేయి ఇస్తారా అనేది అంతుపట్టని పరిస్థితి నెలకొంది. -
నిజం గెలిచేదెలా భువనేశ్వరీ?
చంద్రగిరి (తిరుపతి జిల్లా)/సాక్షి, తిరుపతి: అబద్ధాలను పదేపదే చెప్పి వాటినే నిజమని ప్రజలను నమ్మించడంలో చంద్రబాబుకు మించిన వారు లేరనేది అందరికీ తెలిసిందే. ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో జైలు జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి సైతం చంద్రబాబు అబద్ధాల బాటలోనే పయనిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఒక్కరు కూడా మృతి చెందకపోయినా రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి పైగా మరణించారని.. వారి కుటుంబాలను తాను పరామర్శిస్తానని భువనేశ్వరి బుధవారం నుంచి పరామర్శ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఆవులపల్లి ప్రవీణ్ రెడ్డి(33) కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధపు ప్రచారమా.. చంద్రగిరి పాతపేటకు చెందిన ప్రవీణ్ రెడ్డి రెండు నెలల క్రితం టీడీపీలో చేరాడు. అంతకముందు నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీకి పనిచేశాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం ఉదయం ఇంట్లో గుండెపోటు రావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టీడీపీ నేతలు అతడి మృతిని బాబు ఖాతాలో వేసేశారు. వాస్తవానికి ప్రవీణ్ రెడ్డికి గతంలోనూ గుండెపోటు వచ్చిందని.. అప్పటి నుంచి అతడు తరచూ చికిత్స తీసుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇలాగే పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ నాయుడు(70) కుటుంబాన్ని కూడా భువనేశ్వరి పరామర్శించారు. గత నెల 25న చిన్నబ్బ నాయుడు వృద్ధాప్య సమస్యలతో మృతి చెందాడు. అయితే చంద్రబాబుని అరెస్టు చేసినందుకు మనస్తాపంతో మృతి చెందినట్లు టీడీపీ నేతలు ప్రచారానికి దిగారు. దీనిపైనా స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. మరణిస్తారని ముందే తెలుసా? భువనేశ్వరి బుధవారం మృతుల కుటుంబాలకు పంపిణీ చేసిన చెక్కులు గందరగోళానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సంతకం చేసిన చెక్కులను మృతుని కుటుంబాలకు పంపిణీ చేశారు. భువనేశ్వరి తన పరామర్శ యాత్రలో ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ నాయుడు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించారు. అక్టోబర్‌లో మరణిస్తే.. సెపె్టంబర్‌లోనే సంతకం చేసినట్లు ఉంది. చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ కాగా, ఆ చెక్‌లు చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సెప్టెంబర్ 4న సంతకం చేసినవి. -
యూనివర్సిటీలకు ఏం ఒరగబెట్టారు?
విశ్వవిద్యాలయాలు విశ్వ విద్యా వికాస కేంద్రాలు. విద్య వికాసానికి, ఆ వికాసంతో విశ్వ మానవాళి జీవితాలను కొత్త పుంతలు తొక్కించగలిగిన ఆవిష్కరణలు చేయడానికి అవి వేదికలని తెలిసిన సంగతే. అటువంటి యూనివర్సిటీలు ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతున్నాయి. తెలంగాణ ఉద్య మంలో ప్రజానీకాన్ని చైతన్యపరిచి, ఉద్యమ బాటలో నడిపిన యూనివర్సిటీ కేంద్రాలు ఇప్పుడు స్వరాష్ట్రంలో ప్రభుత్వ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లుతున్నాయి. కేవలం యూనివర్సిటీ సర్వీసులో ఉన్న కొద్దిమంది సీనియర్ అధ్యాపకులే యూనివర్సిటీల మనుగడకు ఊపిరిలూదుతున్నారు. కొత్త నియామకాలు ఎండమా వులుగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు యూనివర్సి టీలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసారని గొంత్తెత్తిన నాయకుడే నేడు రాష్ట్రాన్ని పాలిస్తూ.. వాటిని మరింత నిర్లక్ష్యం చేస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలియని అయోమయపరిస్థితిలో విద్యార్థిలోకం ఉంది. యూనివర్సిటీలకు బడ్జెట్ కేటాయించకుండా, అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు భర్తీ చేయకుండా, మౌలిక వసతుల కల్పనకు ఏ మాత్రం కృషి చేయ కుండా గాలికొదిలేసిన ప్రభుత్వం.. మరోవైపు యూని వర్సిటీలు ఫీజులు పెంచుకోవడానికి అనుమతించి, యూనివర్సిటీలను పేద విద్యార్థులకు దూరం చేసే కుట్ర చేస్తున్నది. ప్రభుత్వ అనుమతిని సాకుగా చూపి యూనివర్సిటీలు పేద విద్యార్థులకు చెల్లింపు సాధ్యం కాని విధంగా ఫీజులను పెంచేశారు. అధ్యాపకులను నియమించి విద్యాప్రమాణాలను పెంచాల్సిన కొత్త వైస్ ఛాన్స్లర్లు ఫీజుల పెంపుపైనే దృష్టిపెట్టడం కనిపి స్తుంది. ఉస్మానియా, జెఎన్‌టియుహెచ్, కాకతీయ, మహాత్మగాంధీ యూనివర్సిటీలలో ఇంజనీరింగ్, పార్మసీ, పీజీ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు భారీగా నిర్ణయించడం అధికారుల బాధ్యతారాహి త్యమే. వందేళ్ల ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎంఏ(ఆర్ట్స్, సోషల్ సైన్సెస్) రెగ్యులర్ కోర్సుల ఫీజు రూ. 2,260 నుంచి రూ. 14,000 వరకు; సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రూ. 5170 నుంచి రూ. 21,000లకు పెంచారు. ఎంకామ్‌కి రూ. 30,000, ఎంబీఏ రూ. 35,000, ఎమ్మెస్సీ సైన్స్ కోర్సులకు రూ. 2,260 నుంచి రూ.20,490; సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకి రూ. 35,000 పెంచారు. ఇంజనీరింగ్ కోర్స్ ఫీజులనయితే భారీగా పెంచారు. రూ.18,000 నుంచి రూ. 35,000 వరకు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ. 75,000 వరకు పెంచారు, ఈ ఏడాది ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – మిషన్ లెర్నింగ్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా పేర్కొని ఫీజు లక్ష ఇరవై వేల రూపాయలుగా నిర్ణయించారు. అలాగే మైనింగ్ ఇంజ నీరింగ్ కోర్సు ఫీజు రూ. 1,00,000. దీన్ని గమనిస్తే పేద విద్యార్థులను యూనివర్సిటీ విద్యకు దూరం చేసే కుట్ర బహిర్గతమవుతుంది. ఈ ఫీజుల పెంపుదలను నిరసిస్తూ.. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళనకు దిగితే పోలీసులతో పాశవిక దాడులు చేయించి కేసులు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సిబ్బందికి జీతభత్యాలు చెల్లించడానికే యూని వర్సిటీ అధికారులు సతమతమౌతున్న తీరు గమనిస్తే యూనివర్సిటీల దయనీయ ఆర్థిక పరిస్థితి అవగత మౌతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన పరిమా ణంలోనే యూనివర్సిటీలకు బడ్జెట్‌ని కేటాయించడం చూస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా యూనివర్సిటీలకు జరిగిన మేలేమీ లేదని అర్థమవుతుంది. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీగా ఉన్న ఉస్మానియా నేడు పాల కుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కలిపి 2,220 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో పేద విద్యార్థులు విద్యనభ్యసించడానికి ఉపకరిస్తున్న ఫీజు రీయంబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుంది. గత రెండేళ్లుగా రూ. 3,816 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు, ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి యూని వర్సిటీలను అద్భుత విజ్ఞాన కే్రందాలుగా విలసిల్లేలా చూడటం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత. ప్రవీణ్ రెడ్డి వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శి, ఏబీవీపీ, తెలంగాణ మొబైల్ : 90104 05476 -
`సూర్యాస్తమయం` చేయడం గర్వంగా ఉంది
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `సూర్యాస్తమయం`. శ్రీహార్‌సీన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ ‘పదేళ్ల ముందు నిర్మాతగా చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్తమయం` సినిమా చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, అలాగే శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ కి మంచి స్పందన వస్తుండటం చాలా ఆనందం గా వుంది, మా హీరో ప్రవీణ్ రెడ్డి కి నటన పరంగా మంచి ప్రశంసలు అందుతున్నాయి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’అన్నాడు. ఈ మూవీ లో అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు హీరో ప్రవీణ్ రెడ్డి. ప్రొడ్యూసర్ రఘు మాట్లాడుతూ.. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేది మరోసారి ‘సూర్యస్తమయం’తో నిజమైందని అన్నారు. -
ఆ రోజు... భయం... భయం!
అందమైన ప్రేమకథ నేపథ్యంలో, హారర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఫిబ్రవరి 14’. బేబీ ప్రేమ, క్రిష్, ఈషా ముఖ్యతారలుగా సత్యరావ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.ఎస్. ఫణీంద్ర దర్శకుడు. ప్రవీణ్‌రెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్ పాటలను ఆవిష్కరించారు. ‘‘గర్భంతో ఉన్న తన భార్యతో భర్త ఎలా ప్రవర్తించాడనే హారర్ కథాంశంతో సాగే సినిమా ఇది. ఫిబ్రవరి 14న ఏం జరిగింది? ఎలాంటి భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్రంలో ప్రధాన అంశం’’ అని దర్శకుడు తెలిపారు. హారర్ చిత్రాల హవా నడుస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమా మంచి విజయం సాధించాలని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ‘రోషం’ బాలు, దిలీప్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
కుమారుడి సర్టిఫికెట్ కోసం.. తండ్రి ఆత్మహత్యాయత్నం
♦ సర్టిఫికెట్ల జారీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణ ♦ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చెట్టుకు తాడుతో ఉరేసుకునేందుకు యత్నం ♦ స్థానికులు గమనించి.. వారించిన వైనం నిడమనూరు : కుమారుడికి ఆదాయ, స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ ఓ తండ్రి తహసీల్దార్ కార్యాలయం ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిడమనూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని నారమ్మగూడేనికి చెందిన బెరైడ్డి నాగార్జునరెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి ఎంసెట్ ఎంట్రన్స్ రాశాడు. ఎంసెట్ కౌన్సెలింగ్ గురువారం నుంచి మొదలవుతున్నది. నాగార్జునరెడ్డి రెండు రోజులుగా నిడమనూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా సర్గిఫికెట్లు మంజూరు చేయలేదు. ఇదే సమయంలో అధికారులంతా మిర్యాలగూడలో హరితహారంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఉన్నారు. విసిగిన ఆయన బుధవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టుకు తన వెంట తెచ్చుకున్న తాడుతో ఉరివేసుకునే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్నవారు చూసి వారించారు. తహసీల్దార్ సిబ్బంది స్పందించి మ్యాన్యువల్ సర్టిఫికెట్ ఇస్తామనగా, వాటిని కౌన్సెలింగ్‌లో అనుమతించరని నిరాకరించారు. కారణం ఏమిటంటే.. నిడమనూరు తహసీల్దార్ అంబేద్కర్ బదిలీ కావడం, బదిలీపై వచ్చిన తహసీల్దార్ బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఆన్లైన్ సర్టిఫికెట్ల జారీ జరగడం లేదు. దీంతో సర్గిఫికెట్ల కోసం వస్తున్న వారికి సిబ్బంది సమాధానం చెప్పలేకపోతున్నారు. చివరికి ఇన్చార్జ్ తహసీల్దార్ ఆనంద్‌కుమార్ మాన్యువల్ సర్టిఫికెట్లపై సంతకాలు పెట్టించారు. దీంతో కథ సుకాంతం అయ్యింది. -
అప్పుల బాధతోయువరైతు ఆత్మహత్య
రెంజల్ : అప్పుల బాధలు భరించలేక మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన ప్రవీణ్‌రెడ్డి(28) అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.మంగళవారం రాత్రి కుటుంబీకులు పక్క ఇళ్లల్లో టీవీ సీరియల్ చూసేందుకు వెళ్లిన సమయంలో ప్రవీణ్‌రెడ్డి ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య సుమలతతో పాటు కూతురు, కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పెట్టుబడులు దక్కక.. పంటలపై చేసిన అప్పులు తీర్చలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతీ యోటా పెరుగుతున్న పెట్టుబడులు, దీనికి తోడు ప్రకృతి వైపరిత్యాలు రైతన్నలను వెం టాడుతుండటంతో చిన్నకారు రైతన్నలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. గత సీజన్లో పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందన ప్రవీన్‌రెడ్డి (28) అనే రైతు మంగళవారం రాత్రి ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగున్నర ఎకరాల భూమి కలిగిన ప్రవీణ్‌రెడ్డికి ఇటీవల పంటల పై చేసిన అప్పులు పెరిగాయి. తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పొలాల్లో వేసిన బోర్లు పడకపోవడంతో అప్పులు రూ. 2.75 లక్షల వరకు పెరిగాయని స్థానికులు వివరించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ బలోపేతానికి ప్రణాళిక
వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే ఆర్కేరోజా పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డి తిరుపతి లోక్‌సభ పార్టీ పరిశీలకులుగా ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, చిత్తూరు లోక్‌సభకు పి.రవీంద్రనాథరెడ్డి, రాజంపేట పరిశీలకులుగా దేవగుడి నారాయణరెడ్డి నియామకం జిల్లా బాధ్యులుగా జంగా కృష్ణమూర్తి నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం, కర్నూలు జిల్లా పార్టీ బాధ్యతలు భూమనకు అప్పగింత హిందూపురం పార్లమెంటు పరిశీలకులుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని తిరుగులేని రాజకీయశక్తిగా బలోపేతం చేయడానికి ఆపార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు పెద్దపీట వేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి పటిష్ఠ ప్రణాళికను రూపొదించారు. ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ ఎనిమిది శాసనసభ స్థానాలను.. రెండు లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుని సత్తా చాటిన విషయం విదితమే. జిల్లాలో వైఎస్సార్సీపీని తిరుగులేని రాజకీయశక్తిగా మలిచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. నగరి శాసనసభ స్థానం నుంచి ఎన్నికైన ఆర్కే రోజాను వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా బాధ్యులుగా ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని నియమించారు. నెల్లూరు పార్లమెంట్ పరిశీ లకులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితుల య్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అనంతపురం, కర్నూలులో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించారు. తిరుపతి లోక్‌సభ స్థానం వైఎస్సార్సీపీ పరిశీలకులుగా ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, చిత్తూరు లోక్‌సభ స్థానం పరి శీలకులుగా పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రాజంపేట లోక్‌సభ స్థానం పరిశీలకులుగా దేవగుడి నారాయణరెడ్డిలను ని యమించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిలను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించా రు. హిందూపురం పార్లమెంటు పరిశీలకులుగా రాజం పేట ఎంపీ మిథున్‌రెడ్డిని నియమించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు పెద్దపీట వేశారు. -
అతిరథులొచ్చినా అంతే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అతిరథ నేతలు పర్యటించినా.. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు సమసిపోలేదు. ప్రచార పర్వం ముగుస్తున్నా.. నేతల మధ్య సఖ్యత ఆమడదూరంగానే ఉంది. తమలో విభేదాలు లేవని చెప్పేందుకు అవకాశం దొరికినప్పుడల్లా కలిసికట్టుగా ఫోజులిచ్చిన జిల్లాలోని ముఖ్య నేతలు తీరా ఎన్నికల సమయంలో ఎవరికివారుగా చెల్లాచెదురయ్యారు. పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రి శ్రీధర్‌బాబు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సహా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఎంపీ పొన్నం ప్రభాకర్, వివేక్ తమ సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు కలియదిరుగుతున్నారు. అంతకుమించి నేతలంద రూ ఏకతాటిపైకి వచ్చి.. అసమ్మతి వర్గీయులను.. పార్టీ అభ్యర్థులకు స్థానికంగా ఎదురవుతున్న చిక్కుముళ్లను విప్పేం దుకు ప్రయత్నం చేయటం లేదు. ఎక్కడివారక్కడే.. ఎవరికివారుగా గిరి గీసుకున్నట్లుగా ప్రచారంలో తలమునకలయ్యారు. జిల్లా లో ఆరు నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు అభ్యర్థుల ప్రచారానికి బ్రేకులు వేస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు మిగతా వారిని సముదాయించి.. సఖ్యతతో కలుపుకుపోవటం లో విఫలమయ్యారు. దీంతో టిక్కెట్ల రేసులో ఉన్న కలహాలు.. విభేదా లు ఇప్పటికీ అభ్యర్థులను వెంటాడుతున్నాయి. రామగుండం, కోరుట్ల నియోజకవర్గాలో పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు..రెబల్స్‌గా బరిలోకి దిగినా ముఖ్య నేతలు నచ్చజెప్పే ప్రయత్నం లేదు. అక్కడ తిరుగుబాటు జోరును తట్టుకోలేక పార్టీ అభ్యర్థులు చిక్కుల్లో పడ్డారు. హుజూరాబాద్, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో అసంతృప్తులు.. లోపాయకారీగా ఇతర పార్టీలతో చేతులు కలిపారు. సొంత పార్టీ అభ్యర్థుల పాలిట గుదిబండగా మారారు. కొందరు ఇప్పటికీ ప్రచారంలో పాలుపంచుకోవటం లేదు. రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి బాబర్ సలీంపాషాకు ఇంటిపోరు మొదలైంది. పార్టీ కేడర్ మొత్తం తన వెంట ఉన్నప్పటికీ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ కౌశిక హరినాథ్ పోటీలో ఉండటంతో ఇరకాటంలో పడ్డా రు. కోరుట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కొమొరెడ్డి రామ్‌లుకు తిరుగుబాటు సవాలుగా మారింది. పార్టీ టికె ట్ రాకపోవటంతో జువ్వాడి నర్సింగరావు ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచారు. పార్టీ కేడర్‌ను సగానికిపైగా తనవైపునకు తిప్పుకున్నారు. నువ్వా,నేనా అంటూ పార్టీ అభ్యర్థికి సవాలు విసురుతున్నారు. హుజూరాబాద్‌లో ఇప్పటికీ పార్టీ నేతలు నాలుగు గ్రూపులుగా చెల్లాచెదురుగానే ఉన్నారు. పార్టీ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డికి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తుమ్మేటి సమ్మిరెడ్డి సహకరించడం లేదు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్లుకు పార్టీ శ్రేణుల సహకారం అంతంత మాత్రంగానే ఉంది. టికెట్ ఆశించిన ఏనుగు మనోహర్‌రెడ్డి వర్గం మొత్తం టీఆర్ఎస్లో చేరిపోయింది. ఆయన సైతం ప్రచారంలో అంటీముట్టన్నట్లు ఉంటున్నారు. పెద్దపల్లిలో టిక్కెట్టు ఆశించిన నేత లు పార్టీ ప్రచారంలో కలిసి కదలటం లేదు. సిరిసిల్లలో కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి కొండూరి రవీందర్రావును అసమ్మతి బెడద వెంటాడుతోంది. టికెట్ దక్కని కేకే మహేందర్‌రెడ్డి లోపాయికారిగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం జోరందుకుం ది. పార్టీ మారి టిక్కెట్టు దక్కించుకోవటంతో చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుద్దాల దేవయ్యకు కాంగ్రెస్ నేతల సహకా రం కొత్త కొత్తగానే ఉంది. మంథనిలో శ్రీధర్‌బాబు, ధర్మపురి అభ్యర్థి మాజీ జెడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మన్కుమార్లకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి జి.వివేక్‌కు ఎన్నికలకు ముందు బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ప్రచారంలో కలిసి కదులుతున్నారు. -
కలిసేపోదాం ఎన్నియాలో..!
కాంగ్రెస్, సీపీఐ పొత్తు వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న సీపీఐ కార్యకర్తలను దారికి తెచ్చేందుకు అటు సీపీఐ, ఇటు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న కార్యకర్తలను బుజ్జగించేందుకు పాట్లు పడుతున్నారు. బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో సమావేశమై కార్యకర్తల్లో ఏకాభిప్రాయం కుదిర్చేందుకు యత్నించారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని ఇరుపార్టీల నేతలు కార్యకర్తలకు హితవు పలికారు. పొత్తులో హుస్నాబాద్ సీటు కాంగ్రెస్‌కు వచ్చింది కనుక సీపీఐ కార్యకర్తలు తమతో కలిసి రావాలని కాంగ్రెస్ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కోరారు. పార్టీ రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని గౌరవించాలని, కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ కార్యకర్తలకు నిధులు కేటాయిస్తూ, తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కూన శోభారాణి అన్నారు. సమావేశంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు కేడం లింగమూర్తి, మట్టా రాజిరెడ్డి, ముత్యాల సంజీవరెడ్డి, ఆకుల వెంకట్, కోమటి సత్యనారాయణ, హసన్, బొల్లి శ్రీనివాస్, నోముల శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ, పెండెల ఐలయ్య, రాంగోపాల్‌రెడ్డి, జాగీరు సత్యనారాయణ, సృజన్‌కుమార్, అందె స్వామి, గడిపె మల్లేశ్, బాలమల్లు, బందెల కిషన్ తదితరులు పాల్గొన్నారు. ‘చేతి’లో ఇమడని కార్యకర్తలు బలమున్న స్థానాన్ని కాంగ్రెస్‌కు కట్టబెట్టారని సీపీఐ కార్యకర్తలు మండిపడ్డారు. ఒంటరిగానైనా బరిలో నిలవాలనుకున్న నాయకత్వం వెనుకడుగు ఎందుకు వేసిందని ప్రశ్నించారు. పేదలను ఆదుకోని ఇక్కడి కాంగ్రెస్ నాయకత్వానికి ఓట్లేసేది లేదని తెగేసి చెప్పారు. బీడుపడిన భూములకు నీళ్లు మళ్లించిన వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీకే ఓట్లేసి, మహానేత రుణం తీర్చుకుంటామన్నారు. కార్యకర్తలపై కేసులు పెట్టించి, ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. గౌరవెళ్లి, గుడాటిపల్లి, రామవరం, అక్కన్నపేట తదితర గ్రామాలకు చెందిన సీపీఐ కార్యకర్తలు గంభీరపు వివేకానంద్, చిట్టాల కొముర య్య, మంద శ్రీనివాస్, కొమ్ముల పర్శరాములు, గుంటుపల్లి దుర్గేశం, మాటూరి సదానందం తదితరులు వచ్చి కార్యల యం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీకి గౌరవం దక్కేదన్నారు. ఎట్టి పరిస్థితిలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి ఓట్లు వేయబోమన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థికే ఓట్లు వేయిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు పెండెల అయిలయ్య, గడిపె మల్లేశ్, సృజన్‌కుమార్ తదితరులు వచ్చి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదని వెళ్లిపోయారు. -
చివరి చాన్స్..!
సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఎంపీలు, ఎమ్మెల్యేలంతా పల్లెబాట పట్టారు. ఐదేళ్ల తమ పదవీకాలం ముగుస్తుండడంతో ఉన్న కాస్త సమయంలో ప్రజలకు మరింత చేరువ కావడానికి అభివృద్ధి పనులను ఎత్తుకున్నారు. శరవేగంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ హడావుడి సృష్టిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు రేపో మాపో షెడ్యూల్ రానున్నందున కోడ్ అమలులోకి వస్తుందనే తొందరలో కేవలం నాలుగు రోజుల్లో జిల్లావ్యాప్తంగా సుమారు రూ.150 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈలోగా మున్సిపల్ ఎన్నికలు తెరమీదకు రావడం, సోమవారం షెడ్యూల్ వెలువడనుందనే సమాచారంతో ముందుగా పట్టణాలు, నగరాల్లో శంకుస్థాపనలపై దృష్టిసారించారు. మొత్తానికి ఆఖరి రీలులో ప్రజాప్రతినిధులంతా గ్రామాల్లో సందడి చేస్తున్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పశువుల ఆసుపత్రి ఆవరణ లో రూ.4 కోట్లతో నిర్మించనున్న వెటర్నరీ పాలి క్లినిక్ భవనానికి ఆదివారం ఎంపీ పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షలతో నిర్మించిన హజ్‌హౌస్ భవనాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. రూ.3 కోట్లతో నిర్మించిన కేంద్ర సహకార బ్యాంక్ నూతన భవనాన్ని ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ ప్రారంభించారు. నాగులమల్యాలలో రూ.1.10 కోట్లతో సీసీ రోడ్డు, బాహుపేటలో రూ.4 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమిపూజ నిర్వహించారు. నగరంలో రూ.80 లక్షలతో కాపువాడ చౌరస్తా నుంచి వరాహస్వామి దేవాల యం రోడ్డు నిర్మాణానికి, 37 డివిజన్లో రూ.13 లక్షలతో సీసీ రోడ్డు నిరా్మాణ పనులకు కమలాకర్ శంకుస్థాపన చేశారు. జగిత్యాల రూ.18 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల, వసతిభవన నిర్మాణ పనులకు ఎంపీ మధుయాష్కి, ఎమ్మెల్యే ఎల్.రమణ శంకుస్థాపన చేశారు. పొలాసలో రూ.6 కోట్లతో నిర్మించనున్న మంచినీటి పథకానికి, పొరండ్లలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కండ్లపల్లిలో నిర్మించిన మోడల్ స్కూల్ భవనం, రూ.1.50 కోట్లతో నిర్మించిన కస్తూరిబా భవనాన్ని ప్రారంభించారు. మొత్తంగా నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.30 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ సైదాపూర్‌లో రూ.2 కోట్లతో చేపట్టిన రోడ్లు, మంచినీటి పథకాలు, కమ్యునిటీ హాళ్లకు ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.కోటితో కోహెడ, చిగురుమామిడిల్లో ఆర్అండ్బీ, పీఆర్, ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. సోమవారం రూ.2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు భీమదేవరపల్లిలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారు. హుజూరాబాద్ హుజురాబాద్ పట్టణంలో రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు పనులను, రూ.50 లక్షలతో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి, జమ్మికుంటలో రూ.2.25 కోట్లతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేశారు. కోరుట్ల కోరుట్ల పట్టణంలో ఐలాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి ధర్మారం వరకు రూ.7 కోట్లతో బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు భూమిపూజ నిర్వహించారు. మండలంలోని మూడు గ్రామాల్లో వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి ఎంపీ నిధులు రూ.4 లక్షలతో చేపట్టిన రోడ్డుకు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జీ దాసరి మనోహర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మానకొండూర్ తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీలో రూ.3 కోట్లతో నిర్మించనున్న సమీకృత సంక్షేమ వసతిగృహ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ శంకుస్థాపన చేశారు. ఒక్కోటి రూ.6.50 లక్షల వ్యయంతో దాచారం, చొక్కారావుపల్లి, వడ్లూరులో నిర్మించనున్న అంగన్వాడి భవన నిర్మాణాలకు,ఖాసీంపేట, గన్నేరువరంలో రూ.4.70 లక్ష లు, రూ.2 లక్షలతో చేపట్టిన రోడ్లకు శంకుస్థాపన చేశారు. మానకొండూరు అన్నారంలో వాటర్‌ట్యాంక్, యాదవ కమ్యునిటి హాల్ భవనం, అంగన్వాడి భవనం, ఊటూరులో శుద్దజల ప్లాంట్, కొండపల్కల పంచాయతి భవనాన్ని, ముంజంపల్లిలో ఎస్సీ కమ్యునిటీ హాల్ ప్రారంభించారు. లలితాపూర్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి, వన్నారంలో తారురోడ్డుకు, గట్టుదుద్దెనపల్లి నుంచి వన్నారంకు తారురోడ్డు రెన్యువల్, మానకొండూరులో అంబేడ్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చొప్పదండి రుక్మాపూర్‌లో రూ.13 కోట్లతో హాస్టల్ భవన నిర్మాణానికి, రూ.3 కోట్లతో సమీకృత వసతి భవనానికి, రూ.కోటితో బహదూర్ఖాన్పేట నుంచి వెదురుగట్ట వరకు తారురోడ్డు నిర్మాణానికి ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యలు శంకుస్థాపన చేశారు. చివరలో కూడా రామగుండం, సిరిసిల్ల, వేములవాడ , ధర్మపరి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగకపోవడం విశేషం. వుంథని వుుత్తారంలో రూ.1 కోటితో నిర్మించిన కస్తూరిబా హాస్టల్ భవనాన్ని, రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే, వూజీ వుంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. వుంథనిలో రూ.8 లక్షలతో నిర్మించిన ఎస్సీ వూల కవుు్యనిటీ హాల్‌ను ప్రారంభించారు. కవూన్పూర్ వుండల కేంద్రంలో రూ.18 లక్షల నాలుగు సీసీ రోడ్లు, రూ.1.50 లక్షతో ఒక వుంచినీటి పథకానికి, వుహాదేవపూర్లో రూ.11 లక్షలతో చేపట్టిన వుూడు వుసీదుల నిర్మాణానికి, రూ.4 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డుకు శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. వేములవాడ చందుర్తి మండలంలో ఆదివారం ఒక్కరోజే రూ. 46.40 లక్షల అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మె ల్యే సిహెచ్.రమేష్‌బాబు భూమిపూజ నిర్వహించారు. రుద్రంగిలో రూ.5లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, రూ.6 లక్షలతో అంగన్వాడి భవనం, రూ.లక్షతో రజక కమ్యూనిటీ హాల్, మల్యాలలో సీసీ రోడ్డు, పెరక కమ్యునిటి భవన్, రూ.5 లక్షలతో రామారావుపల్లిలో సీసీ రోడ్డు, కిష్టంపేటలో రూ.1.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.4లక్ష లతో వాటర్‌ప్లాంట్, జోగాపూర్‌లో రూ.2లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. -
అల్గిరెడ్డి వర్సెస్ కేతిరి
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : హుస్నాబాద్ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పటికీ రగులుతూ నే ఉన్నాయి. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన సుదర్శన్‌రెడ్డి, బొమ్మ వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌రెడ్డి ఆశించగా.. అధిష్టానం ప్రవీణ్‌రెడ్డి వైపు మొగ్గుచూపడంతో ఇద్దరు నేతలు మనస్తాపానికి గురయ్యారు. అధిష్టానం కలుగజేసుకుని వారిని సముదాయించింది. దీం తో వారు ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డికి మద్దతుగా నిలవడంతో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిం చింది. టికెట్ విషయంలో జరిగిన అన్యాయం, ఎన్నికల అనంతరం జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ఇతర పరిణామాలు తమను కార్యకర్తల నుంచి దూరం చేస్తున్నారనే భావన వారిలో ఏర్పడింది. దీనికితోడు తాజాగా హుజూరాబాద్ మార్కెట్ చైర్మన్ నియామకం విషయంలో ప్రవీణ్‌రెడ్డి అడ్డుపడుతున్నాడంటూ సుదర్శన్‌రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. బహిరంగంగానే అసంతృప్తి పార్టీ కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యే తన ను, తమ వర్గాన్ని దూరం పెడుతున్నారంటూ పలు వేదికలపై సుదర్శన్‌రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీ నాయకులకు సైతం ఫిర్యాదు చేశారు. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరు నెలల క్రితం ప్రవీణ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిని సమన్వయపరిచి, హుజూరాబాద్ నియోజకవర్గంపై కేతిరి దృష్టి పెట్టేలా ఒప్పించినట్లు సమాచారం. హుజూరాబాద్ మార్కెట్ చైర్మన్‌గా సుదర్శన్రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చేలా నేతలు అంగీకారానికి రావడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి, శ్రీధర్‌బాబు, ఎంపీ, విప్, ఎమ్మెల్యేలతో సీఎంకు ఐదు నెలల క్రితమే సిఫారసు లేఖలు పంపారు. దీనిపై సీఎం ఆమోదం తెలిపే సందర్భంలో ప్రవీణ్‌రెడ్డి సీఎంతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి ఫైల్‌ను నిలిపివేయించారని సుదర్శన్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ మార్కెట్ పరిధిలోకి హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాలు కూడా వస్తున్నందున తమ నియోజకవర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే అడ్డుకోవడంతోనే కమిటీ నియామకం నిలిచిపోయిందని ప్రచారం జరుగుతోంది. టార్గెట్.. సహకార ఎన్నికలు మార్కెట్ చైర్మన్ పదవి రాకుండా అడ్డుపడుతున్నారనే భావనతో నేరుగా ప్రవీణ్రెడ్డితోనే తల పడేందుకు సుదర్శన్‌రెడ్డి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రవీణ్‌రెడ్డికి పట్టున్న ముల్కనూర్ సహకార గ్రామీణబ్యాంకు ఎన్నికలను ఎంచుకున్నారు. బ్యాంకు పరిధిలో ఐదు డెరైక్టర్ పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. ప్రవీణ్‌రెడ్డి ప్యానెల్‌ను ఎలాగైనా ఓడించాలని సుదర్శన్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారని ఆయన వర్గీయులు తెలిపారు. ఇటీవల తన వర్గీయులతో వరంగల్‌లో సమావేశం నిర్వహించిన సుదర్శన్‌రెడ్డి తాజాగా టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐతోపాటు జేఏసీలను ఒకతాటిపైకి తీసుకువచ్చేదిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేర కు కొత్తకొండలో శుక్రవారం సమావేశం నిర్వహి ంచనున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో దెబ్బతీస్తే ఆ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనా ఉం టుందని ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వీరికి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనాయకుడు సైతం మద్దతిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్‌రెడ్డి సైతం దీన్ని ఎదుర్కొనేందుకు ఒంట రిగానే సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం పార్టీ కార్యకర్తలను ఇరకాటంలో పడేస్తోంది. నాయకుల వర్గపోరుతో బ్యాంకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకే పార్టీ నాయకులు ప్రత్యర్థులుగా ప్రచారం సాగించడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. -
బంగారం కోసమే స్నేహితుడి హత్య
జిన్నారం/పటాన్చెరు టౌన్ న్యూస్‌లైన్ : ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరం కోసం తోటి స్నేహితుడి తలపై రాయితో మోది పాశవికంగా హత్య చేశాడో మిత్రుడు. మెదక్ జిల్లా జిన్నా రం మండలం బొల్లారం శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన గల దేవతలగుట్ట వద్ద జరిగిన హత్య కేసు మిస్టరీని పటన్‌చెరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వారి కథనం మే రకు.. పటాన్‌చెరులోని శాంతినగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్న మల్లేశం.. అమీన్పూర్ వీఆర్ఓగా పనిచేస్తున్నారు. మల్లేష్‌కు రెండో సంతానమైన అనిల్‌కుమార్ ఇం టర్లో ఓ సబ్జెక్టు తప్పి ఇంట్లోనే ఉంటున్నాడు. పటాన్చెరు మండలం ఇంద్రే శం గ్రామానికి చెందిన నరేందర్‌గౌడ్ పటాన్చెరు ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. ఇదిలా ఉండగా అనిల్, నరేందర్‌లు ఇ రువురూ స్నేహితులు. ఈ క్రమంలో వీరి ద్దరూ ఈ నెల 6న జిన్నారం మండలం బొల్లారం శివారులోని దేవతలగుట్ట వద్ద మద్యం సేవించారు. అయితే తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, ఎలాగైనా డబ్బును సర్దాలని నరేందర్‌గౌడ్ మిత్రుడైన అనిల్‌కుమార్‌ను కోరా డు. అయితే తన వద్ద డబ్బు లేదని స మాధానం ఇవ్వగా మెడలో ఉన్న గొలుసు, చేతికి ఉన్న ఉంగరాన్ని ఇవ్వాల ని నరేందర్ కోరాడు. ఇందుకు అనిల్‌కుమార్ నిరాకరించాడు. దీంతో స్నేహితుడి తీరును ఆగ్రహిస్తూ నరేందర్ వాదనకు దిగాడు. అంతలోనే పక్కనే ఉన్న రాయితో అనిల్‌కుమార్ తలపై మోదా డు నరేందర్‌గౌడ్. అనంతరం అతడి మె డలో ఉన్న గొలుసు, చేతికున్న ఉంగరా న్ని తీసుకుని అనిల్‌కుమార్ మృతదేహా న్ని రాళ్ల మధ్యలో పడేసి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. ఈ నెల 7న అని ల్‌కుమార్ కనిపించటం లేదని అతని సోదరుడు పటాన్చెరు పీఎస్‌లో ఫిర్యా దు చేశాడు. ఈ విషయమై అనిల్‌కుమార్ సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగాా వివరాలను పోలీసులు సేకరించారు. అనుమానంతో నరేందర్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెల్లైడె ంది. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. ఐదు రోజుల క్రితమే అనిల్‌ను హత్య చేయడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో హత్య జరిగిన స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రాపురం డీఎస్పీ మధుసూధన్‌రెడ్డి, పటాన్చెరు సీఐ శంకర్‌రెడ్డి, బొల్లారం ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి సందర్శించారు. -
సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు సీమాంధ్ర వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం
సాక్షి; హైదరాబాద్: హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగుల ప్రయోజనాలకు ఏ చిన్న నష్టం వాటిల్లినా సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంత నేతలు హెచ్చరించారు. ఉద్యోగుల రక్షణ, హక్కుల పరిరక్షణ విషయంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతామన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ సచివాలయంలో ఆందోళన కొనసాగిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను మంగళవారం పార్టీ నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులకు అండగా ఉంటామని, వారి ఉద్యమానికి తమవంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా ఏ ఒక్క వర్గంతోనూ చర్చించకుండా ఏకపక్షంగా తెలంగాణ నిర్ణయం ప్రకటించారని మేకపాటి వ్యాఖ్యానించారు. ‘ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ మాయావతి నేతృత్వంలోని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు నెగ్గి దాన్ని కేంద్రానికి ప్రతిపాదించినా ఇంతవరకూ పట్టించుకోలేదు. కానీ ఎవరూ కోరని ఆంధ్రప్రదేశ్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేయదలచారు. ఇది కాంగ్రెస్ రాజకీయ కుట్ర. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యల వంటి వాటిపై కనీస స్పష్టత ఇవ్వకుండా రాష్ట్ర విభజన ప్రకటించడం దుర్మార్గం. రాష్ట్ర రాజధానిని తెలంగాణకు ఇస్తే సీమాంధ్రలో సచివాలయం చెట్టు కింద, అసెంబ్లీని గుడిసెలో ఏర్పాటు చేసుకోవాలా? రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముక్కలు చేయదలచడం దారుణం’ అని అన్నారు. రాష్ట్రాలను విడదీస్తూ పోతే దేశానికి రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల మీద ఈగ వాలినా సహించబోమని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగుల మేలు కోరి అందరికంటే ముందుగా పదవులకు రాజీనామాలు చేసింది తామేనని గుర్తుచేశారు. రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఒకప్పటి ఉద్యోగిగా వారి ఆందోళన తనకు తెలుసని, ఉద్యోగుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కేంద్రం తొలుత స్పష్టం చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కేసులు పెట్టాలి: సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ వదిలిపోవాలని కొందరు పేర్కొనడం చాలా బాధ కలిగించిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ‘ఒకరు రాయల తెలంగాణ అంటున్నారు. మరొకరు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమంటున్నారు. ఇంకొకాయన ఆంధ్ర రాజధానికి లక్షల కోట్లిమ్మంటున్నాడు. ఇవన్నీ వృథా. సమైక్యాంధ్రప్రదేశే మా ధ్యేయం’ అని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రభుత్వం సుమోటో కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎలాంటి ఆపద వచ్చినా ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలంటూ తన ఫోన్ నంబరును అందజేశారు. రాష్ట్రం అడుగుతోంది తెలంగాణ వారైతే కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు కొత్త రాష్ట్రమిస్తోందని తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. అడిగినవారికి ఇవ్వకుండా అడగని వారికి అన్నీ ఇచ్చి వెళ్లిపోమంటున్నారని, ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ‘1956 తరవాత రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను ఎంచుకుని అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. నగర నిర్మాణంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చెమట బిందువులున్నాయి. గతంలో మద్రాసు, కర్నూలును వదులుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా పోగొట్టుకుంటే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు’ అని అన్నారు. విదేశీ శక్తుల వల్ల దేశానికి ముప్పుందని చెప్పిన ఇందిరాగాంధీ.. ఇంట్లోని విదేశీయురాలు సోనియాగాంధీని పసిగట్టలేక పోయిందని ప్రవీణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బైఠాయించిన ఉద్యోగులు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ ఆందోళనను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా విధులను బహిష్కరించి రోడ్లపై బైఠాయించారు. సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. యూపీఏ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సీమాంధ్ర ఉద్యోగుల ఉద్యోగ భద్రత, రక్షణపై కేంద్రం భరోసా కల్పించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ చెప్పారు.