అప్పుల బాధతోయువరైతు ఆత్మహత్య
రెంజల్ : అప్పుల బాధలు భరించలేక మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన ప్రవీణ్‌రెడ్డి(28) అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.మంగళవారం రాత్రి కుటుంబీకులు పక్క ఇళ్లల్లో టీవీ సీరియల్ చూసేందుకు వెళ్లిన సమయంలో ప్రవీణ్‌రెడ్డి ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య సుమలతతో పాటు కూతురు, కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
పెట్టుబడులు దక్కక..
పంటలపై చేసిన అప్పులు తీర్చలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతీ యోటా పెరుగుతున్న పెట్టుబడులు, దీనికి తోడు ప్రకృతి వైపరిత్యాలు రైతన్నలను వెం టాడుతుండటంతో చిన్నకారు రైతన్నలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. గత సీజన్‌లో పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందన ప్రవీన్‌రెడ్డి (28) అనే రైతు మంగళవారం రాత్రి ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నాలుగున్నర ఎకరాల భూమి కలిగిన ప్రవీణ్‌రెడ్డికి ఇటీవల పంటల పై చేసిన అప్పులు పెరిగాయి. తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పొలాల్లో వేసిన బోర్లు పడకపోవడంతో అప్పులు రూ. 2.75 లక్షల వరకు పెరిగాయని స్థానికులు వివరించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.