renjal
-
భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్ : రెంజల్ మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల భవనంపై నుంచి దూకి శ్వేత(13) అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. శ్వేతకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏడోతరగతి చదువుతున్న శ్వేత తన ఇంటికి వెళ్లేందుకు సెలవు అడిగింది. సంక్రాంతి సెలవులు మరో వారం రోజుల్లో వస్తున్నాయని అప్పుడు వెళ్లాలని సిబ్బంది చెప్పడంతో మనస్తాపానికి గురై భవనంపై నుంచి దూకింది. ఈ విషయాన్నిపాఠశాల సిబ్బంది, పోలీసులకు, తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెంజల్లో కార్డన్ సెర్చ్
రెంజల్(నిజామాబాద్): రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో గురువారం ఉదయం (నిర్బంధ తనిఖీ) కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. బోధన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోటగిరి, బోధన్, ఎడపల్లి, రెంజల్ ఎస్సైలతో పాటు పలువురు ప్రత్యేక సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎలాంటి లెసైన్స్‌లు లేని 12 బైక్‌లను, ఓ ట్రాక్టర్‌ను ఇప్పటి వరకూ సీజ్ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
అప్పుల బాధతోయువరైతు ఆత్మహత్య
రెంజల్ : అప్పుల బాధలు భరించలేక మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన ప్రవీణ్‌రెడ్డి(28) అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.మంగళవారం రాత్రి కుటుంబీకులు పక్క ఇళ్లల్లో టీవీ సీరియల్ చూసేందుకు వెళ్లిన సమయంలో ప్రవీణ్‌రెడ్డి ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య సుమలతతో పాటు కూతురు, కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పెట్టుబడులు దక్కక.. పంటలపై చేసిన అప్పులు తీర్చలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతీ యోటా పెరుగుతున్న పెట్టుబడులు, దీనికి తోడు ప్రకృతి వైపరిత్యాలు రైతన్నలను వెం టాడుతుండటంతో చిన్నకారు రైతన్నలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. గత సీజన్లో పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందన ప్రవీన్‌రెడ్డి (28) అనే రైతు మంగళవారం రాత్రి ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగున్నర ఎకరాల భూమి కలిగిన ప్రవీణ్‌రెడ్డికి ఇటీవల పంటల పై చేసిన అప్పులు పెరిగాయి. తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పొలాల్లో వేసిన బోర్లు పడకపోవడంతో అప్పులు రూ. 2.75 లక్షల వరకు పెరిగాయని స్థానికులు వివరించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీకి ఎదురుదెబ్బ
బోధన్, న్యూస్‌లైన్ : బోధన్ నియోజకవర్గంలోని నవీపేట, రెంజల్, బోధన్ పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్లలో చేరారు. బోధన్ మండలం సాలూరకు చెందిన జిల్లాస్థాయి ముఖ్యనేత పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడో, రేపో పార్టీని వీడి కాంగ్రెస్ లేదా, టీఆర్ఎస్లో చేరాలో అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు . మండలంలో పార్టీ పటిష్టంగా ఉన్న సాలూర ఈ ముఖ్యనేత పార్టీ వీడితే పార్టీ నష్టం తీవ్రంగా ఉంటుందని కార్యకర్తలే పేర్కొంటున్నారు. పార్టీ నాయకుల మధ్య గ్రూప్ విబేధాలు ఉండటం వల్లే 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఇక 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీఆర్ఎస్కు కేటాయించారు. దీంతో 15 ఏళ్లుగా తెలుగుదేశం నియోజకవర్గ ప్రాతినిథ్యానికి దూరంగా ఉంటోంది. నాయకుల మధ్య అనైక్యత కాంగ్రెస్ పార్టీ లబ్ధిని చేకూర్చుతోంది. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నవీపేట మినహా బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో సైకిల్ జోరు సాగింది. ఆవిర్భావం నుంచి ఆదరణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బోధన్ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. 1983లో పార్టీ అభ్యర్థి సాంబశివరావు చౌదరి, 1985లో బషీరుద్దీన్‌బాబుఖాన్, 1989లో కొత్త రమాకాంత్, 1994లో మళ్లీ బషీరుద్దీన్‌బాబుఖాన్ ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వరుసగా 20 ఏళ్లు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో, చంద్రబాబు మంత్రివర్గంలో బషీరుద్దీన్ బాబుఖాన్ క్యాబినెట్ మంత్రిగా పని చేశారు. సీనియర్లతో పరేషాన్ క్షేత్రస్థాయి కార్యకర్తలు ఐక్యతారాగం వినిపిస్తున్నా సీనియర్లు మాత్రం ఆధిపత్య పోరు సాగిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రతినిధులుగా ఉన్న మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, అమర్‌నాథ్‌బాబు, నవీపేటకు చెందిన జిల్లా ముఖ్యనేత వి.మోహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా దేశాయ్ బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆధిక్యత కోసం వీరి మ ధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు పార్టీ బలహీనపడటానికి కారణమవుతోంది. పార్టీని వీడిన నాయకులు రెంజల్ మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణంరెడ్డి అనుచరులతో సహా మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఎడపల్లి మండలంలోని జంలం మాజీ సర్పంచ్ మల్లిక, జైతాపూర్ సొసైటీ వైస్‌చైర్మన్ శ్రీనివాస్‌రావు తమ అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. నవీపేట మండలానికి చెందిన నిజాంసాగర్ ప్రాజెక్టు డి-50 చైర్మన్ రాంరెడ్డి, సారంగపూర్ ఎన్సీఎఫ్సీ సీడీసీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, నవీపేట మాజీ ఉప సర్పంచ్ నరేందర్‌రెడ్డి, మండల పరిషత్తు కో-ఆప్షన్ సభ్యుడు ముజీబ్ సైతం కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గంలో టీడీపీని వీడేవారి జాబితా ఇంకా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
సింగూరు నుంచి సాగర్‌కు నీరు
రెంజల్, న్యూస్‌లైన్ : సింగూరు ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీల నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేయనున్నట్లు భారీ నీటి పారుదల మంత్రి పి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. సాగర్ ఆయకట్టు కింద వేసిన పంటలకు చివరి వరకు సాగు నీరందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చివరి ఆయకట్టు గ్రామాలకు నీరందని పక్షంలో త్రీఫేస్ కరెంట్‌ను 7 గంటల పాటు నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామన్నారు. రెంజల్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాం జలి ఘటించారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడు తూ మార్చి వరకు పంటలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. రైతులు పంటల మార్పిడి విధానం పాటించాలని, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే ఆరుతడి పం టలను సాగుచేయాలని సూచించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందన్నారు. గతంలో టీడీపీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన సీమాంధ్రులు అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకించడంతో తెలంగాణపై నిర్ణయంలో జాప్యం జరిగిందన్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు, సీమాం ధ్రలో 25 పార్లమెంటు స్థానాలున్నా... ఓట్లు, సీట్ల కోసం కాకుండా ఇక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఇచ్చిందన్నారు. చదువుకునే రోజుల్లో తాను సైతం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెల్లినట్లు మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని పార్టీల నేతలను కలిసి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదన్నారు. ప్రజల మనిషినే ఎన్నుకోండి.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి వారి బాగోగులు పట్టించుకునే వారినే గుర్తించి ఎన్నుకునాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు వచ్చే దిగుమతిదారులను ప్రజలు నిరాకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా సమస్యలు పరిష్కరించలేదని భావిస్తే ఆలోచించి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సవిత, జావీద్, ఖలీంబేగ్, తెలంగాణ శంకర్, రమేష్, లక్ష్మణ్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం, విం డో చెర్మైన్లు సాయరెడ్డి, అహ్మద్‌బేగ్, నాయకులు మొబిన్‌ఖాన్, భూమన్న, మోహన్, ఎఖార్, హాజీఖాన్, రాములు తదితరులు పాల్గొన్నారు.