రెంజల్, న్యూస్‌లైన్ : సింగూరు ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీల నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేయనున్నట్లు భారీ నీటి పారుదల మంత్రి పి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. సాగర్ ఆయకట్టు కింద వేసిన పంటలకు చివరి వరకు సాగు నీరందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చివరి ఆయకట్టు గ్రామాలకు నీరందని పక్షంలో త్రీఫేస్ కరెంట్‌ను 7 గంటల పాటు నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామన్నారు. రెంజల్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాం జలి ఘటించారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు పనులను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడు తూ మార్చి వరకు పంటలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. రైతులు పంటల మార్పిడి విధానం పాటించాలని, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే ఆరుతడి పం టలను సాగుచేయాలని సూచించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందన్నారు. గతంలో టీడీపీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన సీమాంధ్రులు అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకించడంతో తెలంగాణపై నిర్ణయంలో జాప్యం జరిగిందన్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు, సీమాం ధ్రలో 25 పార్లమెంటు స్థానాలున్నా... ఓట్లు, సీట్ల కోసం కాకుండా ఇక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఇచ్చిందన్నారు. చదువుకునే రోజుల్లో తాను సైతం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెల్లినట్లు మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని పార్టీల నేతలను కలిసి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదన్నారు.
ప్రజల మనిషినే ఎన్నుకోండి..
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి వారి బాగోగులు పట్టించుకునే వారినే గుర్తించి ఎన్నుకునాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు వచ్చే దిగుమతిదారులను ప్రజలు నిరాకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా సమస్యలు పరిష్కరించలేదని భావిస్తే ఆలోచించి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సవిత, జావీద్, ఖలీంబేగ్, తెలంగాణ శంకర్, రమేష్, లక్ష్మణ్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం, విం డో చెర్మైన్‌లు సాయరెడ్డి, అహ్మద్‌బేగ్, నాయకులు మొబిన్‌ఖాన్, భూమన్న, మోహన్, ఎఖార్, హాజీఖాన్, రాములు తదితరులు పాల్గొన్నారు.
సింగూరు నుంచి సాగర్‌కు నీరు
Published Fri, Feb 28 2014 3:13 AM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement