Singur Dam
-
కాళేశ్వరంతో సస్యశ్యామలం...
సాక్షి, కామారెడ్డి: ‘ఉమ్మడి రాష్ట్రంలో నిజాంసాగర్ ఆయకట్టు కోసం సింగూరు జలాలు వదలాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఎన్నో ఆందోళనలు జరిగేవి. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు రోజుల తరబడి దీక్షలు చేస్తేగానీ నీళ్లు వదిలే పరిస్థితి ఉండేది కాదు. ఆ దీక్షలు చూశా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సింగూరు సమస్య కూడా ఒక కారణమే. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా నిజాంసాగర్ నిండు కుండనే. నిరంతరం నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇది సాధ్యమైంది. రాష్ట్రం సాధించుకున్నాక కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్‌కు నీటిని తెచ్చుకుంటున్నాం..’అని సీఎం చంద్రశేఖర్‌రావు చెప్పారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ (తిమ్మాపూర్)లోని తెలంగాణ తిరుమల దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన కల్యాణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీఎం తన సతీమణి శోభతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలు, భక్తులు అందించిన రెండు కిలోల స్వర్ణకిరీటాన్ని స్వామివారికి ముఖ్యమంత్రి దంపతులు సమర్పించారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. నాడు పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. ‘తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నపుడు మంజీర నదిపై దేవునూరు వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక దాని సామర్థ్యాన్ని 30 టీఎంసీలకు కుదించి సింగూరు ప్రాజెక్టును కట్టారు. నాడు మెదక్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సింగూరు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ ప్రాజెక్టుతో తమకే ఎక్కువ లాభం జరుగుతుందనే ఉద్దేశంతో నిజామాబాద్ ప్రజలు ఎక్కువగా తరలివచ్చారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు అందించే పేరుతో నిజామాబాద్‌లో పంటలు ఎండుతున్నా సాగునీరు అందించలేదు. సింగూరు నీటి కోసం ఎమ్మెల్యేలు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. పంటలను కాపాడుకునేందుకు రోజుల తరబడి దీక్షలు చేసేవారు. సింగూరు మీదనే ఆధారపడిన ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టుకు కూడా నీళ్లివ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇలాంటి సమస్యలను చూసి చాలామంది పెద్దలతో చర్చించినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ముఖ్యమంత్రులతో మాట్లాడినా పట్టించుకోలేదు. పైగా తృణీకార భావంతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టడానికి నన్ను ప్రేరేపించిన ప్రధాన అంశాల్లో సింగూరు సమస్య ఒకటి..’అని సీఎం చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డి ఎన్నో దీక్షలు చేశారు.. ‘సింగూరు నీళ్ల కోసం పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నోసార్లు దీక్షలు చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అప్పట్లో బోధన్ సబ్ కలెక్టర్‌గా ఉన్నారు. ఆయన బాన్సువాడ మీదుగా వెళ్తుంటే బతికున్నపుడు మంచినీళ్లు ఇచ్చి, గంజి పోసైనా సరే బతకనియ్యండి గానీ, చచ్చిపోయాక బిర్యానీ పెట్టినా లాభం లేదు అని పోచారం చెప్పారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాతో కలిసి ఉద్యమంలోకి వచ్చాక, ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళుతుంటే రోడ్డు మీద కలిసిన లంబాడా బిడ్డలు పోచారం సార్ గెలుస్తాడని ముందే చెప్పారు. పోచారం అంటే ఈ ప్రాంత ప్రజలకు అంత అభిమానం. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఇక్కడి మంచి చెడులు తెలిసిన వ్యక్తిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ వయసులో హోదాను సైతం పక్కనబెట్టి నియోజకవర్గంలో చిన్న పిల్లవాడిలా తిరుగుతూ ప్రజల కష్ట సుఖాల్లో భాగమవుతున్నారు. బాన్సువాడ మెటర్నిటీ ఆస్పత్రికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే దానిపై పోచారం పర్యవేక్షణ ఎంత ఉందో అర్థమవుతోంది..’అని కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకున్నా.. బాన్సువాడ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందంటూ.. తన ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి నియోజకవర్గానికి రూ.50 కోట్లు, ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశారంటూ అభినందించారు. స్వామి కరుణ, దయ యావత్ తెలంగాణ ప్రజల మీద ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పచ్చని పంటలతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా.. ‘నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా. 69 ఏళ్లు వచ్చినయి. నా కన్నా వయస్సులో పెద్దవాడైనా నేనున్నన్ని రోజులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన మాటే బ్రహ్మాస్త్రం. శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ చేస్తే చీఫ్ సెక్రెటరీ అయినా, సీఎం అయినా మాట్లాడతారు. ఏ పని అయినా అవుతది..’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
సింగూరుకు జల గండం
సాక్షి, పుల్కల్/ మెదక్ : రెండు సంవత్సరాల కిందటి వరకు సింగూర్ నీటిని జంట నగరాల తాగునీటి అవసరాలకు వినియోగించేవారు. కానీ 2018 నుంచి సింగూర్ నీటిని పూర్తిగా సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాతం నుంచి చుక్క నీరు రావడం లేదు. ఫలితంగా నిజామాబాద్, కామారెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 960 గ్రామాలతో పాటు ఐదు మున్సిపాలిటీలు, రెండు గ్రేటర్ హైదరాబాద్‌లోని డివిజన్లకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేయడం కోసం పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టు ఎడుమ, కుడి వైపులా పంప్ హౌస్‌ల నిర్మాణం చేశారు. ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో గత మార్చి నుంచి అధికారులు నీటిని అదా చేస్తు వచ్చారు. జూన్, ఆగస్టు మాసం వరకు ప్రాజెక్టులోకి నీరు వస్తుందనే ధీమాతో ప్రతీ రోజు 100 మీలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 50 మిలియన్ లీటర్ల నీటిని మే మాసం వరకు సరఫరా చేస్తూ వచ్చారు. ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోవడంతో పంపింగ్‌ను సైతం నిలిపివేశారు. దాదాపుగా మూడు నెలలు కావస్తున్నా 960 గ్రామాలకు పూర్తిగా తాగునీటి సరాఫరా నిలిచిపోయింది. వర్షంపైనే ఆధారం.. ప్రస్తుత పరిస్థితిలో సింగూర్ ప్రాజెక్టులోకి నీరు వస్తే గాని తాగునీరు సరఫరా అయ్యేలా లేదు. ఇందుకు ప్రస్తుతం ప్రాజెక్టులో ఆర టీఎంసీ నీరు కూడా లేదు. 30 టీఎంసీల సామర్థ్యంగల ప్రాజెక్టులో కేవలం ఆర టీఎంసీ నీరు ఉంది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు భారీ వర్షాలు లేని కారణంగా చుక్క నీరు కూడా రాలేదు. ఫలితంగా సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా వర్షం వల్ల వచ్చే వరదపైనే అధారపడింది. నీరు వస్తుంది సింగూర్ ప్రాజెక్టులోకి ఈ సీజన్లో తప్పకుండా వరదలు వస్తాయి. ప్రతీ యేడు ఆగస్టు, సెప్టెంబర్‌లోనే అధికంగా వరదలు వచ్చి ప్రాజెక్టు నిండేది. ప్రాజెక్టులో 29.99 టీఎంసీలు నిల్వ చేసి దిగువకు మిగతా నీటిని వదలడం జరిగింది. ఈ సారి అలాగే వస్తుందనే నమ్మకం ఉంది. –బాలగణేష్, డిప్యూటీ ఇంజనీర్ సింగూరు తాగునీటి సమస్యకు పరిష్కారం సింగూర్ ప్రాజెక్టులో నీటిì లభ్యత లేని కాకరణంగా మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇందుకు గ్రామాలలో నెలకొన్నా నీటి సమస్యను అధికమించేందుకు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవాలని సర్పంచ్‌లకు సూచించాం. నెలకు రూ.4 వేలు బోర్‌కు ఇవ్వడంతో పాటు రవాణా చార్జీలు సైతం చెల్లిస్తున్నాం. –రఘువీర్, ఎస్ఈ, వాటర్ గ్రిడ్ -
సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తీవ్ర నీటి సమస్యతో సంగారెడ్డి పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. సంగారెడ్డితో పాటు హైదరాబాద్ జంట నగరాల నీటి అవసరాలను తీర్చే సింగూరు జలాశయం పూర్తిగా ఎండిపోవడంతో.. ఈ కొరత ఏర్పడిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను సింగూరు డ్యాంకు తరలించి నీటి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన రాసిన లేఖలో పూర్తి వివరాలను పొందుపరిచారు. కాగా మంజీర నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో దానిపై నిర్మించిన సింగూరు డ్యాం పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే. -
‘సింగూరు కోసం 18 నుంచి రిలే దీక్ష’
సాక్షి, హైదరాబాద్: సింగూరు జలాల కోసం ఈ నెల 18 నుంచి తాను, తన భార్య రిలే నిరాహార దీక్ష చేపడతామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. దీక్షను అడ్డుకుంటే తలెత్తే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో లేకుం డా సింగూరు జలాలను తరలించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరారు. సింగూరు జలాల తరలింపు వల్ల సంగారెడ్డికి తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. -
సింగూరుకు ఇక సెలవు..!
సాక్షి, హైదరాబాద్: గోదావరి రింగ్‌మెయిన్–3 పనుల పూర్తితో గ్రేటర్ హైదరాబాద్‌కు సింగూరు, మంజీరా జలాశయాల నీటితరలింపునకు శాశ్వతంగా సెలవు ప్రకటించాల్సిందేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర శివార్లలోని ఘన్పూర్ నుంచి పటాన్చెరు వరకు 43 కి.మీ. మార్గంలో రింగ్‌మెయిన్ పనులు పూర్తికావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మెదక్, నర్సాపూర్ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి కావడంతో అక్కడి తాగునీటి అవసరాలకు నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరమవుతుందని, గ్రేటర్ తాగునీటి అవసరాలకు సింగూరు, మంజీరా జలాలు మినహా ఇతర ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనని ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అధికారులు, రాజకీయ నేతల నుంచి ఒత్తిడులు తీవ్రం కావడంతో జలమండలి అప్రమత్తమైంది. ఇప్పటికే రూ.398 కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన గోదావరి రింగ్‌మెయిన్–3 పనుల్లో గౌడవెల్లి ప్రాంతంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ పైప్‌లైన్‌పై వాల్వ్‌ల ఏర్పాటు వంటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ఈ వారంలో ట్రయల్‌రన్ నిర్వహించేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. గ్రేటర్ దాహార్తిని తీర్చిన సింగూరు, మంజీరా జలాలు భాగ్యనగరానికి జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల తరవాత 70వ దశకం నుంచి సింగూరు, మంజీరా జలాల తరలింపు ప్రక్రియ మొదలైంది. నాటి నుంచి నేటి వరకు పటాన్చెరు, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలకు ఈ జలాలే దాహార్తిని తీర్చేవి. అయితే, గోదావరి మొదటిదశ పథకం పూర్తితో సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని నగరానికి తరలించినప్పటికీ ఇందులో సింహభాగం పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాలతోపాటు ఇక్కడున్న పలు ప్రతిష్టాత్మక సంస్థలు, కంపెనీలకు తాగునీటిని సరఫరా చేసేవారు. ఏడాదిగా నగర తాగునీటి అవసరాలకు నిత్యం సుమారు 10 మిలియన్ గ్యాలన్ల సింగూరు, మంజీరా జలాలను మాత్రమే సరఫరా చేసినట్లు జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి. రింగ్‌మెయిన్ పైప్‌లైన్–3 పూర్తితో ఇక నుంచి సింగూరు జలాలు నిలిచిపోయినప్పటికీ కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాలకు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని జలమండలి స్పష్టం చేసింది. ఈ వారంలో ట్రయల్‌రన్ పూర్తి చేసి ఫిబ్రవరి మొదటివారం నుంచి గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని తెలిపింది. కృష్ణా, గోదావరి జలాలే ఆధారం... జంట జలాశయాల నీటిని నగర తాగునీటి అవసరాలకు సేకరించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించడం, త్వరలో సింగూ రు, మంజీరా జలాల సరఫరా నిలిచిపోనుండటంతో భాగ్యనగరానికి కృష్ణా, గోదావరి జలాలే ఆధారం కానున్నా యి. ప్రస్తుతానికి కృష్ణా మూడు దశల ద్వారా నిత్యం 270 మిలియన్ గ్యాల న్లు, గోదావరి మొదటిదశ ద్వారా మరో 130 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. రింగ్‌మెయిన్–3 పనుల పూర్తితో అదనంగా మరో 60 ఎంజీడీల గోదావరి జలాలను సిటీకి తరలించనున్నారు. దీంతో నిత్యం నగరానికి 460 మిలియ న్ గ్యాలన్ల జలాలను సరఫరా చేయనున్నారు. ఈ నీటిని నగరంలోని 9.60 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫ రా చేయనున్నట్లు జలమండలి అధికా రులు చెబుతున్నారు. -
సింగూర్ సిగలో ఆందోల్
సాక్షి, జోగిపేట(అందోల్): రాష్ట్ర రాజకీయాల్లో ‘అందోల్’ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి గెలుపొందిన మెజార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాగా దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాజనర్సింహ కుటుంబ సభ్యులు అత్యధికంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 19?52లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజనర్సింహ మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గ చరిత్ర 1952లో అందోల్ నియోజకవర్గం ఏర్పడింది. 2009వ సంవత్సరం వరకు అందోల్, పుల్కల్, మునిపల్లి, సదాశివపేట, పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం మండలాలు మాత్రమే ఉన్నాయి. పునర్విభజన అనంతరం సదాశివపేట మండలం సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోకి వెళ్లగా, అందోల్ నియోజకవర్గం పరిధిలోకి కొత్తగా రాయికోడ్, టేక్మాల్ మండలాలు చేర్చారు. 1952 నుంచి 67వ సంవత్సరం వరకు జనరల్ క్యాటగిరీ కాగా, 1967 నుంచి ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 12 సార్లు జరిగిన ఎన్నికల్లో రాజనర్సింహ కుటుంబ సభ్యులే ఆరుసార్లు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టీడీపీల మధ్యే పోటీ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీల మధ్యే ఎక్కువసార్లు పోటీ జరిగింది. 1967, 1972, 1978లో స్వతంత్ర, జనతాపార్టీ అభ్యు›ర్థులు పోటీలో ఉండగా, 1983 నుంచి 2009 వరకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. 2014వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ తరఫున బాబూమోహన్ పోటీ చేసి గెలుపొందారు. నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి, నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు మాజీ మంత్రి గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి జనతాపార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జోగిపేట ఎమ్మెల్యేలు బస్వమాణయ్య, లక్ష్మారెడ్డి 1952లో ఏర్పడిన నియోజకవర్గంలో ఒక్కసారి మాత్రమే జోగిపేటకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓపెన్ క్యాటగిరీ ఉన్న సమయంలో వైశ్యుడైన బస్వమాణయ్య 1957వ సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోగిపేటకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భాలు లేవు. 1967 నుంచి రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడడంతో ఇక్కడ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో జోగిపేట పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శేరి లక్ష్మారెడ్డి మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రిజర్వుడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ప్రధాన పార్టీలు స్థానికులకు అవకాశం కల్పించలేదు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజనర్సింహ అందోల్ రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే రాజనర్సింహ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్‌లో కార్పొరేటర్‌గా ఉన్న రాజనర్సింహను కాంగ్రెస్ పార్టీ అందోల్‌లో పోటీ చేయించింది. 1967, 1972, 1978లలో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1983లో స్థానిక రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాజనర్సింహకు కాకుండా సంగారెడ్డికి చెందిన హెచ్.లక్ష్మణ్‌జీకి ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా రాజనర్సింహ ఓటమి చెందారు. ఇదే సంవత్సరంలో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఎన్నికైన లక్ష్మణ్‌జీ 1983లో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణానికి చెందిన హట్కర్ లక్ష్మణ్ జీ గెలుపొందడం సంచలనం కలిగించింది. అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందోల్‌లో టీడీపీ తరఫున పటాన్‌చెరుకు చెందిన డాక్టర్ యాదయ్య ఓటమి చెందారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా లక్ష్మణ్ గెలుపొంది ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రజల జీవన స్థితిగతులు ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. 80 శాతానికి పైగా వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలపై జీవిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని పుల్కల్ మండలం సింగూరులో ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా అందోలు, పుల్కల్ మండలాలకు 40వేల ఎకరాలకు సాగునీరును అందిస్తారు. కేవలం హైద్రాబాద్ జంట నగరాలకు త్రాగునీటిని, నిజాంసాగర్, ఘనపూర్ ఆయకట్టుకు సేద్యానికి నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కాలువల నిర్మాణం, భూసేకరణకు రూ.89.98 కోట్లు మంజూరు చేసి స్వయంగా పనులకు శంకుస్థాపన చేసారు. ఆ కళ 2016–17 సంవత్సరంలో సాకారమైంది. నియోజకవర్గంలో పెద్దగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లాల్సిన పరిస్థితి. ‘అందోల్’ రెడ్డిరాజుల కోట జోగిపేట(అందోల్): మెతుకు రాష్ట్రానికి అందోల్ ముఖ్య పట్టణంగా ఉండేది. రెడ్డిరాజుల కాలంలో శంకరమ్మ, సదాశివరెడ్డి, అల్లమరెడ్డి, సూర్యప్రతాపరెడ్డిలు పరిపాలించేవారు. వీరి రాజ్యంపై నిజాం దండయాత్రకు వచ్చినప్పుడు కప్పం కడతాం అన్న ఒప్పందాన్ని వారితో కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో రెడ్డిరాజులే స్వతంత్రంగా పరిపాలించుకునేందుకు వీలు కలిగింది. అప్పట్లో అందోలులో మూడు గౌనిలు, 36 బురుజులు, ఆరు చిన్న దొడ్డీలు, ఒక సొరంగమార్గం నిర్మించుకున్నారు. రెడ్డి రాజులు కలబ్‌గూరులో కాశీ విశ్వనాథ ఆలయం, అందోల్‌లో రంగనాథ ఆలయం, రంగంపేటలోనూ రంగనాథ ఆలయాలను నిర్మించి ఆస్థానాలు ఏర్పరచుకున్నారు. అందోల్‌లో ఇప్పటికి బురుజులు చెక్కు చెదరలేదు. శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా కోటల నిర్మాణం చేపట్టారు. అప్పట్లో రెడ్డిరాజుల వంశీయురాలైన శంకరమ్మకు శార్దూలం అనే బిరుదు కూడా అప్పట్లో నామకరణం చేశారు. మంజీర నది పరివాహక ప్రాంతం ఒడ్డున రెడ్డి రాజులు విహర యాత్రకు వెళుతున్న సమయంలో ఆ ప్రదేశం నచ్చి అక్కడే ఉండి పోవడానికి నిశ్చయించుకొని ‘అందోల్’ నుంచే తన పరిపాలనను సాగించారు. -
దుర్గమ్మా.. సింగూరు నీరు విడిపించమ్మా..
పాపన్నపేట(మెదక్): సింగూరు నీరు ఘనపురం ప్రాజెక్టుకు విడిపించేలా పాలకుల మనసు మార్చాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఏడుపాయల దుర్గమ్మకు శనివారం వినతిపత్రం సమర్పించారు. సాగునీటి సాధనే ధ్యేయంగా మెదక్ మాజీ ఎమ్మెలే శశిధర్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు ఘనపురం ఆనకట్టపై వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్లలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. 30 వేల ఎకరాల రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి 15టీఎంసీల సింగూరు నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వదిలి, ఈ రోజు ఘనపురం రైతుల పంటలు ఎండబెడుతున్నారని ఆరోపించారు. 1992లో ఘనపురం ప్రాజెక్టుకు ప్రతి యేటా 4.06 టీఎంసిల నీరు విడుదల చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ జారీ చేయించిందని తెలిపారు. ఖరీఫ్ పై ఆశతో వరితుకాలు వేసుకున్న రైతుల పొలం మడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ నాయకులు రైతుల బాధలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా 0.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పంచాయతీ రాజ్ సెల్ కన్వీనర్ మల్లప్ప మాట్లాడుతూ సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడిపించాల్సిన బాధ్యత ఎమ్మేల్యేదే నన్నారు. ఈ ధర్నాలో మండల కాంగ్రెస్ అ«ధ్యక్షుడు అమృత్‌రావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంతప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్లు గోపాల్‌రెడ్డి, నర్సింలుగౌడ్, కాంగ్రెస్ నాయకులు ఉపేందర్‌రెడ్డి, భూపతి, శ్యాంసుందర్అబ్లాపూర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. -
‘జల’ రాజకీయం
జిల్లాలో రాజకీయాలు అప్పుడే వేడిని పుట్టిస్తున్నాయి. దీంతో రేపో మాపో ఎన్నికలు ఉన్నాయా? అన్న అనుమానం సామాన్యుడికి కలుగుతోంది. నువ్వంటే నువ్వే అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేయాలని అధికార పక్షం తార స్థాయిలో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో ‘జల’ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుగానే దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. రాజకీయంగా ఉపయోగపడే చిన్న అవకాశాన్ని సైతం అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ‘సింగూరు’ జలాల అంశం తెరపైకి రావడంతో ప్రతిపక్ష పార్టీలు ఇదే అంశంపై పోరుకు సిద్ధం అవుతున్నాయి. సాక్షి, మెదక్: జిల్లాలో ఏకైక సాగునీటి ప్రాజెక్టు ఘనపురం. వర్షాభావం కారణంగా ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఎండిపోయింది. దీంతో ప్రాజెక్టు కింద వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు తక్షణం 0.5 టీఎంసీ జలాలు వదిలితే పంటలు బతికి రైతులకు మేలు జరుగుతుంది. అయితే ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టులో సైతం జలాలు నిండుకున్నాయి. సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.5 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. వర్షాభావానికి తోడు సింగూరు ప్రాజెక్టు ఎగువ నుంచి నీళ్లు రాకపోవటంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. దీని కారణంగా దిగువ ఉన్న ఘనపురం ప్రాజెక్టు ప్రస్తు తం నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని అధికారులు చె బుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 885 కూడా నీటి విడుదలకు అడ్డంకిగా మా రుతోంది. సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం 16.5 టీఎంసీ దాటినప్పుడే సాగునీరు వదలాలని ఈ జీఓ చెబుతుంది. సింగూరు ప్రాజెక్టు నీటి మ ట్టం 16.5 చేరుకోవాలంటే భారీ వర్షాలు, వరదలు వస్తే తప్ప నిండని పరిస్థితి. ఇదిలా ఉంటే ఘనపురం ప్రాజెక్టు కింద రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వర్షాలు లేక, ప్రాజెక్టులో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు తక్షణం సింగూరు నుంచి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గత ఏడాది సింగూరు ప్రాజెక్టు నుంచి ఎన్నడూ లేని విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సింగూరు నుం చి 7 టీఎంసీ నీటిని తరలించారు. ఆ ఏడు టీఎం సీల నీటిని ఎస్ఆర్ఎస్పీకి తరలించకపోయి ఉంటే ప్రస్తుతం సింగూరు నుంచి ఆ నీటిని ఘనపురం ప్రాజెక్టుకు విడుదల చేసే అవకాశం ఉండేదని త ద్వారా రైతులకు మేలు జరిగేదని పలు రాజకీయ పార్టీల వాదన. ఇదే విషయమై రైతుల పక్షాన ఆందోళనలు చేపట్టేందుకు సిద్దం అవుతున్నాయి. ప్రతిపక్షాల ‘పోరు’ బావుట ఎస్ఆర్ఎస్పీకి సింగూరు నీటిని తరలించడాన్ని నిరసిస్తూ, పంటల రక్షణ కోసం ప్రసుత్తం ఘనపురం ప్రాజెక్టుకు సింగూరు నుంచి 0.5 టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు పోరాటం చేసేందుక సిద్ధం అవుతున్నాయి. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ జూలై 30న ‘జలదీక్ష’ పేరిట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. త్వరలో ఘనపురం ప్రాజె క్టు పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టడంతోపాటు రైతులతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సన్నద్ధం అవుతోంది. స్థానికంగాను టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకుగాను త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరెడ్డి ఆధ్యర్యంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితో కలిసి పాదయ్రాత , మహాధర్నా నిర్వహించేందుకు ఎర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి రైతుల పక్షాన కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. జీవో 885ని రద్దు చేయడంతోపాటు ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్టు కింద ఉన్న పంటలను రక్షించుకునేందుకుగాను సింగూరు నుంచి 0.5 టీఎంసీ నీటిని విడుదల చేయించేలా కోర్టును కోరనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ సైతం సింగూరు జలాలపై ఆందోళన సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షులు డా.లక్ష్మణ్ ఇతర నాయకులను తీసుకువచ్చి ఘనపురం రైతులతో మాట్లాడించటంతోపాటు రైతుల పక్షాన ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీపీఎం సైతం రైతు సంఘాలతో కలిసి సోమవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితి పార్టీలు సైతం సింగూరు జలాల విషయమై ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాల ఎత్తులకు ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి. -
ఆ హక్కు కేసీఆర్, హరీష్‌కు ఎవరిచ్చారు
సాక్షి, సంగారెడ్డి జిల్లా : సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని శ్రీరాంసాగర్‌కు తీసుకుపోయే హక్కు కేసీఆర్‌కు, హరీష్‌కు ఎవరిచ్చారని శాసన మండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..వర్షాలు లేటైతే సింగూరు ఆయకట్టు కింద ఉన్న జిల్లాల రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సునామీ రాబోతుందని, కాంగ్రెస్ విజయం తథ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తు రూ.2 లక్షల రుణ మాఫీ తప్పక చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో ఇఫ్తార్, క్రిస్మస్ వేడుకలను రద్దు చేసుకోవాలన్న రాష్ట్రపతి నిర్ణయాన్ని షబ్బీర్ అలీ తప్పుపట్టారు. రాష్ట్రపతి నిర్ణయానికి నిరసనగా గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు తాను హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు, రీ నోటిఫికేషన్లు తప్ప రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చింది లేదని, రైతు బంధు పథకం ద్వారా సామాన్య రైతుల కంటే భూస్వాములకు మాత్రమే లబ్ది జరిగిందని తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. స్తోమత ఉన్న రైతులకు, సాగు చేయని భూస్వాములకు లబ్ది జరిగితే ఫలితం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్రానికి మంజూరైన నిధులను కూడా దారి మళ్లించారని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. -
మిషన్ లీకేజీ!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో లోపాలు బయటపడుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రధాన పైపులైన్లకు నీటిని సరఫరాచేస్తూ ట్రయల్‌రన్ చేస్తుండగా.. నిత్యం ఎక్కడోచోట పైపులైన్ల జాయింట్లు, ఎయిర్‌వాల్వ్‌లు ఊడిపోతున్నాయి. మిషన్ భగీరథ పనులతో పాటు, లీకేజీలతో రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, నిజాంసాగర్: మిషన్ భగీరథ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టునుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజవర్గాలకు ఇంటింటికి తాగునీటిని అందించడానికి పనులు చేపట్టారు. రెండేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. జూన్ నెలాఖరు నాటికి ఇంటింటికి తాగునీరందిస్తామని ముఖ్యమంత్రితో పా టు మంత్రులు పేర్కొంటున్నారు. ప్రధాన పైప్‌ౖ లెన్ పనులు పూర్తవడంతోపాటు బీపీటీ ట్యాం కు నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. దీంతో సింగూరు జలాశయం నుంచి ప్రధాన పైపుౖ లెన్లు, బీపీటీ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ట్రయల్‌రన్ చేస్తున్నారు. ఇరవై రోజుల నుంచి నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని మండలాల్లో ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. కాగా నాందేడ్– సంగారెడ్డి, బోధన్– హైదరాబాద్, నిజాంసాగర్ –ఎల్లారెడ్డి ప్రధాన రోడ్డు మార్గాల గుండా వేసిన పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్రధాన పైపులైన్ల ద్వారా మంజీరా జలాలు రోడ్లపైకి వస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పైపులైన్లకు లీకేజీలు మిషన్ భగీరథ ట్రయల్‌రన్ నిర్వహిస్తుండడంతో పైపులైన్ల పనుల్లో లోపాలు బట్టబయలు అవుతున్నాయి. పది రోజుల క్రితం నిజాంసాగర్ మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద ప్రధాన పైపులైన్ జాయింట్ ఊడిపోవడంతో సింగూరు జలాలు వృథా అయ్యాయి. వారం క్రి తం బాన్సువాడ మండలంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా మిషన్ భగీరథ నీటికి ట్రయల్‌రన్ నిర్వహించారు. రాత్రి వేళ మండలంలోని తున్కిపల్లి తండా వద్ద కట్వాల్ మూసుకుపోవడంతో వేలక్యూసెక్కుల నీరు రోడ్డుపైకి వచ్చింది. ప్రధాన పైపులైన్ ద్వారా నీరు బయటకు రావడంతో నీటి ప్రవాహ ఉధృతికి బోధన్– హైదరాబాద్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అర్థరాత్రి వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు 2 గం టల పాటు ట్రాఫిక్ స్తంభించింది. నీటి సరఫరా ను నిలిపివేసి, కోతకు గురైన రోడ్డుకు తాత్కా లిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారు. నీటి ఉధృతికి సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. పంటపొలాలు నీట మునిగి అన్న దాతలకు నష్టం వాటిల్లింది. ఈ సంఘటనను మరువకముందే తున్కిపల్లి తండా వద్ద మరో సారి గురువారం ఉదయం పైపులైన్ల ద్వారా నీరు రోడ్డుపైకి వచ్చింది. వందల క్యూసెక్కుల నీరు పైపులైన్ల ద్వారా రోడ్డుపైకి రావడంతో తండా వాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తండా వద్ద నిర్మిస్తున్న బీపీటీ ట్యాంకు పనులు పూర్తికాక పోవడంతో ప్రధాన పైపులైన్ కనెక్షన్ పూర్తి కాలేదు. దీంతో బాన్సువాడకు వెళ్లే ప్రధాన పైపులైన్ ద్వారా మంజీరా జలాలు వృథా అవుతూ, రోడ్డుపైనుం చి పారుతున్నాయి. తండా వద్ద కట్వాల్ ఆన్ఆఫ్ చేయడంతో నిర్లక్ష్యం వల్ల సింగూరు జలా లు వృథా అవుతున్నాయి. గుట్టపై నుంచి జలా లు పారడంతో మట్టి, మొరం రోడ్డుపైకి కొట్టుకు వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి వృథాను అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘సింగూరు’పై పెరుగుతున్న ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: జంట నగరాలు, ఉమ్మడి మెదక్ జిల్లా తాగు, సాగు అవసరాలను తీరుస్తున్న సింగూరుపై నీటి అవసరాల పరంగా ఒత్తిడి పెరుగుతోంది. ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న వాటాలకు మించి అవసరాలు పెరుగుతుండటం కొంత ఆందోళనను కలిగిస్తోంది. జంట నగరాలకు కృష్ణాజలాలు అందని సమయంలో సింగూరు వైపే చూడాల్సి వస్తున్న నేపథ్యంలో కొత్తగా జహీరాబాద్‌లో చేపట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు కొత్తగా 1.42 టీఎంసీల కేటాయింపులు కోరుతూ ప్రతిపాదనలు రావడం ఒత్తిడిని పెంచేలా ఉంది. నిజానికి సింగూరు ప్రాజెక్టు సామ ర్థ్యానికి అనుగుణంగా మొత్తంగా 29.91 టీఎంసీల మేర వాటాలున్నాయి. ఇందులో హైదరాబాద్ తాగునీటికి 6.96 టీఎంసీల కేటాయింపు ఉండగా, దిగువన ఉన్న ఘణపురం ఆయకట్టుకు 4, నిజాంసాగర్ ఆయకట్టుకు 8.35 టీఎంసీలు, సింగూరు కాల్వలకు 2 టీఎంసీలు కేటాయింపు ఉండ గా, మిగతా నీటిని ఆవిరి నష్టాలుగా లెక్కగట్టారు. అయితే ఇటీవల వాటా నీటిని పునఃసమీక్షించారు. దాన్ని బట్టి మిషన్ భగీరథకు 5.45 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటికి 2.80, ఘణపురం 4.06, నిజాంసాగర్ అవసరాలకు 6.35, సింగూరు కాల్వలకు 4, ఆవిరి నష్టాలు 7.24 టీఎం సీలు కేటాయించారు. వాటా మేరకు కేటాయింపులు పూర్తవగా ప్రస్తుతం భగీరథ అవసరాలను కొత్తగా 5.7 టీఎంసీలుగా లెక్కగట్టారు. దీనికి తోడు నిజాంసాగర్ కింద ఉన్న 2లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదలకై ప్రతిసారీ సింగూరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఏకంగా సింగూరు నుంచి ఎస్సారెస్పీకి నీటి తరలింపు జరిగింది. ఈ నేపథ్యంలో నిమ్జ్‌కు ఏటా 1.42 టీఎంసీల కేటాయించాలని ప్రతిపాదన వచ్చింది. ఇది ఓకే అయితే ఈ నీటిని ఎలా సర్దుతారన్నది ప్రశ్నగా ఉంది. -
విష ప్రచారం నమ్మొద్దు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేస్తూనే.. ఇతర ప్రాంతాలకు సింగూరు జలాలను విడుదల చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించుకుపోతున్నారనే కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంల విష ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై విపక్షాల విమర్శల నేపథ్యంలో హరీశ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగూరు, ఘణపురం ఆయకట్టు రైతాంగం సాగు నీటి అవసరాలతో పాటు, జంట నగరాల తాగునీటి అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరునిల్వ ఉంటుందని పేర్కొన్నారు. యాసంగిలో ఘణపురం ఆయకట్టు కోసం 4, సింగూరు ఆయకట్టుకు 2 టీఎంసీలతోపాటు తాగునీటి అవసరాలకు 2.50 టీఎంసీలు కేటా యించామని తెలిపారు. దీంతోపాటు ప్రాజెక్టులో మరో 7.50 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని మంత్రి పేర్కొ న్నారు. ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు పంటలకు సాగునీరందిం చిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సింగూరు కాలువలు, లిఫ్ట్ పనులు శరవేగంగా పూర్తి చేసి.. వరుసగా మూడో పంటకు 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. విపక్షాలకు విమర్శించే హక్కు లేదు.. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. గతంలో సింగూరు నుంచి నీటి విడుదల కోసం ఘణపురం ఆయకట్టు రైతులు హైదరాబాద్‌లో ఆందోళనలు చేసిన విషయా న్ని గుర్తు చేశారు. సింగూరు జలాలను ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేయాలని, లేదంటే పైపులైన్లు బద్దలు కొడతామంటూ ప్రకటించిన బీజేపీ ఆ తర్వాత ఎందుకు ఉద్యమించలేదని ప్రశ్నిం చారు. సింగూరుపై విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని, ప్రజలు ఆందోళనకు గురికా వద్దని హరీశ్ కోరారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఏనాడూ రైతుల ప్రయోజనాలు పట్టించుకోలేదని విమర్శించారు. -
సింగూరు జలాలపై రగడ
సంగారెడ్డి టౌన్: సింగూరు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదలను నిరసిస్తూ సోమవారం సంగారెడ్డి జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. కాంగ్రెస్, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా ‘చలో కలెక్టరేట్’కార్యక్రమం నిర్వహించగా.. బీజేపీ ఆధ్వర్యంలో సింగూరు ప్రాజెక్టు ముట్టడికి యత్నించారు. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది. కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా కమిటీ పిలుపు మేరకు ‘చలో కలెక్టరేట్’ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందో ళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయ త్నించడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు, కార్యకర్తలకు మధ్వ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సింగూరు జలాలను తరలించడం జల దోపిడీయేనని కాంగ్రెస్ ఉమ్మడి మెదక్ జిల్లా అ«ధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు రాజకీయ భిక్ష పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజ లే బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. మరోవైపు బీజేపీ ఆధ్వ ర్యంలో సింగూరు ముట్టడికి యత్నించారు. సీఎం కేసీఆర్, హరీశ్‌లపై ఎమ్మెల్యేలు, ఎంపీ లు ఒత్తిడి తేవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సింగూరు నీటి తరలింపుపై ఎంపీ లు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని సీపీఎం జిల్లా నేతలు నిలదీశారు. -
సింగూరు నుంచి ఎస్సారెస్పీకి 15 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్‌కు 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిగువన ఎస్సారెస్పీతోపాటు నిజాంసాగర్ కింద తాగు, సాగు అవసరాల కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని గురువారం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు వీలైనంత త్వరగా సింగూరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది యాసంగిలో సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీల కింద నీటి అవసరాలపై ప్రభుత్వం ఇప్పటికే లెక్కలు సిద్ధం చేసింది. మిషన్ భగీరథ అవసరాలు, నీటి సరఫరా, ఆవిరి నష్టాలు, కనీస మట్టాలకు పైన ఉండే లభ్యత నీటితో ఎంతమేర సాగుకు నీరు ఇవ్వవచ్చన్న అంశాలపై యాసంగి ప్రణాళిక ఖరారు చేశారు. ఎస్సారెస్పీలో లోటుతో.. ఎస్సారెస్పీ నీటినిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 54.36 టీఎంసీలు ఉన్నాయి. మిగతా 35.35 టీఎంసీల లోటు ఉంది. అయితే ఇక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగూరు నుంచి 15 టీఎంసీల మేర విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో ఐదు టీఎంసీల మేర నిజాంసాగర్‌లో నిల్వ చేసి.. మిగతా 10 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తారు. దీంతో ఎస్సారెస్పీలో లభ్యత జలాలు 64.36 టీఎంసీలకు చేరుతాయి. ఇక ఎస్సారెస్పీ నుంచి లోయర్‌మానేర్ డ్యామ్ (ఎల్ఎండీ)కు కాకతీయ కెనాల్ ద్వారా 15 టీఎంసీలు విడుదల చేయాలని, మిషన్ భగీరథ అవసరాలకు 12.6 టీఎంసీలను వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మొత్తంగా ఎస్సారెస్పీలో సుమారుగా 38.41 టీఎంసీల నీరు మిగులుతుంది. ఈ నీటినీ ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిన 5.60 లక్షల ఎకరాలకు అందిస్తారు. ఇందులో ఎల్ఎండీ ఎగువన 4 లక్షల ఎకరాలు, ఎల్ఎండీ దిగువన 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది. సింగూరు కింద 1.5 లక్షల ఎకరాలకు శ్రీరాంసాగర్‌కు తరలించే 15 టీఎంసీలుపోగా.. సింగూరులో సుమారు 14.5 టీఎంసీల నీరు ఉంటుంది. ఇందులో 5.7 టీఎంసీలను తాగు అవసరాలకు కేటాయించి, మరో టీఎంసీలతో ప్రాజెక్టు కింది 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశముంది. ఇక నిజాంసాగర్‌లో ప్రస్తుతం 12.93 టీఎంసీల నీరుండగా.. సింగూరు నుంచి వచ్చే 5 టీఎంసీలతో కలసి 18 టీఎంసీల లభ్యత ఉండనుంది. ఇందులో తాగునీటికి 3 టీఎంసీలు పక్కనపెట్టి.. మిగతా 15 టీఎంసీలతో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశముంది. -
సింగూరు నుంచి రెండో పంటకూ నీరు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సింగూరు ద్వారా రెండో పంటకు అవసరమైన నీరు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 29 టీఎంసీల నీటినిల్వ ఉంది. మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావు శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి ఈ నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేసి రెండో పంటకు నీరందించాలని కోరారు. సింగూరు నుంచి నీరు విడుదల చేయడం ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆందోల్ నియోజకవర్గాల పరిధిలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో రెండో పంట పండించుకునే అవకాశం ఉందని వీరు ముఖ్యమంత్రికి తెలిపారు. రెండో పంట పండించుకోవడం ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ కల నెరవేరే అవకాశం వచ్చిందని విన్నవించారు. కాల్వలు కూడా సిద్ధంగా ఉన్నందున సింగూరు నుంచి నిజాంసాగర్‌కు 9 టీఎంసీల నీరు వదిలితే, ఇప్పటికే నిజాంసాగర్‌లో ఉన్న 3 టీఎంసీలతో కలిపి నీటి నిల్వలు 12 టీఎంసీలకు చేరుకుంటాయని పోచారం చెప్పారు. ఆ నీటిని పొదుపుగా వాడుకుని నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న లక్షా 20వేల ఎకరాల్లో రెండో పంట సాగుచేసుకుంటారని ఆయన వివరించారు. అదే విధంగా సింగూరు నీటితో ఘణపురం ఆనకట్టను నింపుకుని 30వేల ఎకరాలకు, ఆందోల్ ఎత్తిపోతల పథకం ద్వారా మరో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని హరీశ్‌రావు తెలియజేశారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అవకాశం వదులుకోవద్దు.. సమైక్య రాష్ట్రంలో రైతులు మొదటి పంట పండించుకోవడానికే నీళ్లు లేక అవస్థలు పడ్డారని, ఇప్పుడు రెండో పంట పండించుకునే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోను వదులు కోవద్దని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సింగూరు నుంచి నిజాంసాగర్‌కు 9 టీఎంసీల నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, శనివారం సాయంత్రం నుంచే నీటిని విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈనీటిని విడుదల చేస్తున్న సందర్భంలోనే సింగూరు వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావును సీఎం ఆదేశించారు. సింగూరు వద్ద 15 మెగావాట్ల యూనిట్‌తో పూర్తి స్థాయి జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రభాకర్ రావు వెల్లడించారు. తెలంగాణ వస్తే రెండో పంటకు కూడా నీరు ఇచ్చుకునే విధంగా నీటి పారుదల వ్యవస్థను మార్చుకుంటామనే మాట నిజమవుతోందని, పాత నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని రైతుల చిరకాల వాంఛ అయిన రెండో పంటకు నీరందే స్వప్నం నెరవేరబోతోందని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. -
గ్రేటర్‌కు సింగూరు, మంజీరా నీళ్లు
వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సింగూరు, మంజీరా జలాలను తరలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచి నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు సమీక్ష జరిపారు. సింగూరు, మంజీరా జలాశయాల నుంచి హైదరాబాద్‌కు నిత్యం 90 మిలియన్ గ్యాలన్ల నీటిని వదలాలని, నాగార్జున సాగర్ నుంచి అక్కంపల్లి ద్వారా ఉదయ సముద్రానికి వారం రోజులపాటు 90 మిలియన్ గ్యాలన్ల చొప్పున నీరు వదిలి నల్లగొండ జిల్లాకు తాగునీరివ్వాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ మురళీధర్ రావును ఆదేశించారు. మంగళవారం రాత్రి నుంచే నీటి విడుదల జరగాలని సూచించారు. కృష్ణా నదిలో ఈసారి ఆశించిన స్థాయిలో వరద రాలేదని, నాగార్జున సాగర్‌లో నీరు డెడ్ స్టోరేజీ కంటే తక్కువగా ఉందని, ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కృష్ణా నది నీళ్లపై ఆధారపడిన హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచి నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. -
‘కాళేశ్వరం’లో మరో మార్పు!
సింగూరు నీటి తరలింపుపై తెరపైకి కొత్త ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరో భారీ మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. సింగూరు ప్రాజెక్టు నీటి తరలింపు మార్గాలపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే నిర్ణయించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి నేరుగా సింగూ రుకు నీటిని తరలించకుండా కొత్తగా సామ ర్థ్యం పెంచనున్న కొండపోచమ్మ రిజ ర్వాయర్ ద్వారా సింగూరుకు నీటిని తరలించేందుకు సాధ్యాసాధ్యాలపై అన్వేషణ సాగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు మంగళవారం ప్రగతి భవన్లో నీటిపారుద లశాఖ మంత్రి హరీశ్‌రావు, ఇంజనీర్లతో గూగుల్ మ్యాపుల ద్వారా సమీక్షించారు. ఏ మార్గంతో ఎంతెంత... స్థిరీకరణ కింద నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వాలంటే సింగూరు, నిజాం సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను సైతం కాళేశ్వరం నీటితో నింపేలా ప్రణాళిక వేశారు. మల్లన్నసాగర్‌కు వచ్చే నీటిని గ్రావిటీ పద్ధతిన సింగూరుకు తరలించి అటు నుంచి శ్రీరాంసా గర్ వరకు తరలించేలా ప్రణాళిక రచించారు. మల్లన్నసాగర్లో నీటిని తీసుకునే లెవల్ 557 మీటర్లు ఉండగా సింగూరు లెవల్ 530 మీట ర్లుగా ఉంది. అయితే పూర్తిగా గ్రావిటీ పద్ధతిన నీటిని తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో మధ్యన 30 మీటర్ల లిఫ్టును ఏర్పాటు చేసి నీటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపాలనేది ఉద్దేశం. దీనిపై వ్యాప్కోస్ నుంచి డీపీఆర్ నివేదిక అందాల్సి ఉంది. ఈలోగా ప్రభుత్వం కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 7 టీఎంసీల నుంచి 21 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించింది. దీంతో 627 మీటర్ల లెవల్ నుంచి 530 మీటర్ల లెవల్ ఉన్న సింగూరుకు పూర్తి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. ఈ విధానం ద్వారా మరింత ఆయక ట్టుకు నీరందించవచ్చని చెబుతున్నారు. గూగుల్ మ్యాప్‌ల ద్వారా సీఎం సమీక్ష సింగూరుకు కాళేశ్వరం జలాల తరలింపుపై సీఎం కేసీఆర్ మంగళవారం గూగుల్ మ్యాప్‌ల సాయంతో సుదీర్ఘంగా సమీక్షించారు. కొండపోచమ్మ నుంచి సింగూరుకు నీటిని తరలిస్తే ఎలాంటి లాభం ఉంటుంది, ఉన్న అడ్డంకులు ఏమిటన్న దానిపై చర్చించారు. ప్రాథ మికంగా తెలిసిన సమాచారం మేరకు ఈ డిజైన్ ద్వారా ఔటర్ రింగురోడ్డు మార్గం లో రెండు చోట్ల, ముంబై హైవేపై మరో రెండు చోట్ల క్రాసిం గ్లు ఉంటాయని, పటాన్చెరు వద్ద ఉన్న ఇక్రిశాట్ను సైతం దాటాల్సి ఉంటుందని అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై ముఖ్య మంత్రి ఎలాంటి సూచనలు చేశారన్నది తెలియ రాలేదు. -
నల్లరేగడి నవ్వింది!
సింగూరు కింద తొలిసారి ధాన్యం సిరులు - 30 వేల ఎకరాల్లో పసిడి పంటలు - యాసంగిలో ఊహించని స్థాయిలో దిగుబడి - ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు - పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి హరీశ్ - స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి సింగూరు కింద నీళ్లందినట్టు వెల్లడి - వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని స్పష్టీకరణ సింగూరు ప్రాంతం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆ భూములన్నీ ఇన్నాళ్లూ వట్టిపోయాయి.. నీళ్లు లేక నోళ్లెళ్లబెట్టాయి.. తుప్పలు, ముళ్ల పొదలతో నిండిపోయాయి.. మూడు దశాబ్దాలుగా చుక్కనీటికి నోచుకోలేక బీళ్లుగా పడి ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఆ భూముల్లో పసిడి పంట పండింది.. రైతుల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది! ఇన్నాళ్లూ కోటి జనాభా ఉన్న జంట నగరాల దాహార్తిని తీర్చిన సింగూరు.. చరిత్రలో తొలిసారి ప్రాజెక్టు కింది గ్రామాల పంటలకు ప్రాణం పోసింది. గతేడాది వర్షాలతో మంజీరా పరవళ్లు తొక్కడం, అప్పటికే సిద్ధం చేసిన సింగూరు కాల్వల ద్వారా నీటి విడుదల జరగడంతో తొలిసారి 30 వేల ఎకరాలకు నీటి పారుదల శాఖ నీళ్లందించింది. ఈ ప్రాజెక్టు పరిధిలో తొలిసారి సాగు చేసిన పంటలు కోతకు రావడంతో కాల్వల పరిధిలోని గ్రామాల్లో నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం పర్యటించారు. రైతులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు..? ఉమ్మడి మెదక్ జిల్లాలో 1976లో నిర్మించిన సింగూరు ప్రాజెక్టు తొలి నుంచి తాగునీటి ప్రాజెక్టుగానే ఉంది. 30 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని చేపట్టగా 11.59 టీఎంసీలను పూడిక, ఆవిరి నష్టాలకు కేటాయించి, మిగిలిన 18.41 టీఎంసీల్లో 8.35 టీఎంసీలు నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు, 4 టీఎంసీలు జంట నగరాల తాగునీటికి, మరో 4.06 టీఎంసీలను ఘణపూర్ ఆయకట్టు స్థిరీకరణకు కేటాయించారు. సింగూరు ప్రాజెక్టు కోసం 32,892 ఎకరాల భూమిచ్చి,. 68 గ్రామాలు ముంపులో పోయినా, ఏనాడూ పరీవాహక ప్రాంతాల పొలాలకు నీళ్లందలేదు. ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం దశాబ్దాలుగా ఆందోళనలు జరగడంతో 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 జూన్ 7న రూ.88.99 కోట్ల అంచనా వ్యయంతో కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆయన తదనంతరం ఆ నిర్మాణాలు ఆగిపోయాయి. మళ్లీ తెలంగాణ ఏర్పాటుతో ఆ నిర్మాణాలు మొదలయ్యాయి. కాల్వల నిర్మాణానికి రూ.88.99 కోట్లు, ఎత్తిపోతలకు రూ.32.68 కోట్లు.. మొత్తంగా 121.67 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాల్వలకు రూ.34.02 కోట్లు, లిఫ్ట్‌కు రూ.15.80 కోట్లు విడుదల చేశారు. దీంతో కాలువలకు సంబంధించి 80.6 శాతం, లిఫ్ట్ పనులు వంద శాతం పూర్తయ్యాయి. 2017–18 బడ్జెట్లో సింగూరు కాల్వల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.49.50 కోట్లు కేటాయించింది. నిధుల విడుదలతో పనుల్లో వేగం పెరిగి కాల్వల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. ఇకపై పూర్తి ఆయకట్టుకు నీళ్లు.. ప్రాజెక్టు కింద నాలుగు మండలాల్లోని 44 గ్రామాల పరిధిలో 40 వేల ఆయకట్టుకు నీరదించడం లక్ష్యం కాగా.. యాసంగిలో 30,116 ఎకరాలకు నీటిని విడుదల చేశారు. అలాగే 72 చెరువులను నింపి, 9,076 ఎకరాలను స్థిరీకరించారు. ఇకపై పూర్తి ఆయకట్టుకు నీరందించనున్నారు. బుధవారం కాల్వల పరిధిలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఆందోల్, ముదుమాణిక్యం, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో పంటల దిగుబడులు, ధాన్యం రాశులను పరిశీలించారు. రైతుల పొలాల వద్దే వారి అనుభవాలను తెలుసుకున్నారు. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పల వద్ద ఆగుతూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం దిగుబడులపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కోటి ఎకరాల కలలో భాగమే..: మంత్రి హరీశ్ రైతులతో ముఖాముఖీ సందర్భంగా మంత్రి వివిధ గ్రామాల్లో ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి మెదక్ జిల్లాలో సింగూరు కాల్వల కింది ఆయకట్టుకు నీరందించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాల కలలో భాగమే సింగూరు కింద కాల్వలకు నీళ్లని పేర్కొన్నారు. ‘‘పూర్వ మెదక్ జిల్లాలో నిజాం హయాం తర్వాత ఒక్క కొత్త ఎకరాకు నీళ్లు పారకపోగా.. ఉన్న ఘణపూర్ ఆయకట్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు తగ్గింది. కానీ తెలంగాణ ప్రభుత్వం సింగూరు కాల్వలకు రూ.60 కోట్ల మేర ఖర్చు చేసి ఈ ఏడాది 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చింది. మరో 10 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో నీళ్లివ్వనుంది. మరో 121 చెరువులను నింపి మరో 10 వేల ఎకరాలను స్థిరీకరించనుంది. గతంలో సింగూరు గ్రామాల్లో ఉన్న ముళ్ల పొదలన్నీ ఇప్పుడు పంట పొలాలయ్యాయి..’’ అని హరీశ్ అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్లో 40 శాతానికి పైగా నిధులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకి వెచ్చిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, కరెంట్ కోతలు లేవని, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పోయాయని అన్నారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా 60 లక్షల టన్నుల పంట దిగుబడి వచ్చిందని చెప్పారు. పత్తి మద్దతు ధర రూ.4,160 ఉంటే ప్రస్తుతం మార్కెట్లో రూ.5 వేలకు పైగా ఉందని, పల్లికాయ ధర సైతం రూ.4,220 నుంచి రూ.5 వేలు దాటిందని, మొక్కజొన్న, కందులకు అదే మాదిరి మద్దతు ధర లభిస్తోందన్నారు. వచ్చే ఏడాది మే నుంచి రైతులకు పట్నం, పరిశ్రమలకు ఇస్తున్న మాదిరే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ రానే రాదని, ఇప్పుడు మాత్రం పొమ్మన్నా పోదని అన్నారు. ఎకరాకు రూ.4 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీS వచ్చే ఏడాది మే నుంచి రూ.6 వేల కోట్ల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇంత పంట పుట్టినప్పట్నుంచీ చూడలేదు సింగూరు కింద ఇన్ని నీళ్లు ఎన్నడూ చూడలే. నేను పుట్టినప్పట్నుంచీ చూడనంత పంట పడింది. ఇంతకుముందు గొర్లు కాసేవాణ్ణి. ఇప్పుడు నాకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా. మంత్రి చెప్పి నట్లు పెట్టుబడికి సాయపడితే ఇక పట్నం దిక్కు చూసే గోసుండదు.. – చెన్నయ్య, రైతు, ఆందోల్ మళ్లీ వస్తే గొర్రె కూర పెడతా నాకు రెండెకరాలుంది. నాలుగేళ్లు పట్నంల కూరగాయలమ్మిన. నీళ్లు వచ్చినయని వచ్చి పంటల సాగు చేసిన. మంచి పంట వచ్చింది. వానాకాలానికి తయారుగా ఉన్నా. మంత్రి ముందస్తడని తెలిస్తే గొర్రె కోసెటొళ్లం. మళ్లొస్తే కచ్చితంగా గొర్రె కూర పెడతం.. – కొత్తగొల్ల శ్రీనివాస్, రైతు, ఆందోల్ ఇంత పంట జిందగీల చూస్తమనుకోలే.. నాకు 63 ఏళ్లు. ఇంతవరకు యాసంగిల ఇంత పంట చూడలే. జిందగీల చూస్తమనుకోలే. సింగూరు కాల్వలతో బంగారం లాంటి పంట పడింది. పెట్టుబడికి సైతం సాయం చేస్తామంటే ఇంకా పంటలు పండిస్తం. – బాల్‌రెడ్డి, రైతు, ముదుమాణిక్యం -
అవసరమైన సిబ్బంది వివరాలివ్వండి...
జూరాల, సింగూరు భద్రతపై కదిలిన నీటిపారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగు, తాగు నీటి ప్రాజెక్టులైన జూరాల, సింగూరు డ్యామ్‌ల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ ఫిబ్రవరి 20న ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ అధికారులు స్పందించారు. ఈ డ్యామ్‌ల భద్రతకు పెద్దపీట వేయాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు వాటి నిర్వహణ, అందుకు తీసుకోవా ల్సిన చర్యల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అంశంపై ఈఎన్సీ మురళీధర్ సోమవారం సంబంధిత వెకానికల్ అండ్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వివరణ కోరారు. ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం ఉన్న గేట్లు, క్రేన్స్, జనరేటర్ల వివరాలు అడిగారు. గ్రీజింగ్, వెల్డింగ్, గేట్ల నిర్వహణకు అవసరమైన సిబ్బంది గురించి కూడా వివరాలు కోరినట్లు నీటి పారుదల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కాగా జూరాల పరిధిలో వర్క్ ఇన్స్పెక్టర్, గేటు ఆపరేట్లర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్మెన్లు, ఆపరేటర్లు కలిపి మొత్తంగా 19మంది వరకు అవసరం ఉండగా.. ప్రస్తుతం ఒక్క ఉద్యోగి కూడా అక్కడ లేడు. సింగూరు పరిధిలోనూ 13 మంది సిబ్బంది అవసరం ఉండగా ఒక హెల్పర్, ఇద్దరు వాచ్మెన్లు మాత్రమే ఉన్నారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ నీటిపారుదల శాఖ దృష్టికి తెచ్చింది. -
వరదొస్తే వణుకే!
గాల్లో దీపంలా డ్యామ్‌ల భద్రత ⇒ అధ్వానంగా జూరాల, సింగూరు జలాశయాల నిర్వహణ ⇒ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు కనీస సిబ్బంది కరువు ⇒ ఆకస్మిక వరదొచ్చినా.. ఆపదొచ్చినా రిటైర్డ్ సిబ్బందే దిక్కు ⇒ మొన్నటి వరద సమయంలో నానా తిప్పలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన జలాశయాల భద్రత గాల్లో దీపంలా మారింది. సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న డ్యామ్‌ల భద్రతకు పెద్దపీట వేయాల్సిన నీటి పారుదల శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా జూరాల, సింగూరు డ్యామ్‌ల నిర్వహణ ప్రమాదకరంగా మారిందని, వీటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లకు తగిన సిబ్బందిని నియమించాలని పలు కమిటీలు సూచించినా.. అదేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో జూరాల, సింగూరు డ్యామ్‌లకు భారీగా వరద వచ్చిన సందర్భాల్లో వాటి నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. జూరాల.. స్పిల్‌వే రోడ్డుకు ప్రత్యామ్నాయమేది? జూరాల ప్రాజెక్టును 1995లో 1.04 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో నిర్మించారు. 12.50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యంతో 927 మీటర్ల పొడవుతో స్పిల్‌వేలు నిర్మించారు. 62 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నాయి. స్పిల్‌వే పై ఉన్న బ్రిడ్జి మీదుగా ఆత్మకూరు, గద్వాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. కార్లు, బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలు బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. 2012లో డ్యామ్ భద్రతను పర్యవేక్షించిన ప్రత్యేక బృందం.. వాహనాల రాకపోకలతో భవిష్యత్‌లో డ్యామ్ నిర్మాణానికి పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. డ్యామ్ గేట్లను తెరవడానికి, సరి చేయడానికి ఉపయోగించే క్రేన్ వ్యవస్థకు ఈ వాహనాల రాకపోకలతో ప్రమాదం ఉందని, క్రేన్ మార్గం దెబ్బతింటే దాన్ని ఆపరేట్ చేయడం సులువు కాదని తెలిపింది. ప్రాజెక్టుకు వరదలు సంభవించిన సమయంలో గేట్ల నిర్వహణ మరీ ప్రమాదకరంగా ఉంటోందని తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 25న ఏకంగా 19.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీన్ని కట్టడి చేసేందుకు అధికారాలు నానా తంటాలు పడాల్సి వచ్చింది. స్పిల్‌వే డ్యామ్‌పై వాహనాలు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా డౌన్ స్ట్రీమ్‌లో రోడ్డు బ్రిడ్జి కట్టాలని పలు కమిటీలు సూచనలు చేసినా అది సాధ్యం కాలేదు. ఇక స్పిల్‌వే ఓఅండ్ఎంల కోసం వర్క్ ఇన్స్పెక్టర్, గేటు ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రిషియన్లు, వాచ్మెన్లు, ఆపరేటర్లు కలిపి మొత్తంగా 19 మంది వరకు కావాల్సి ఉండగా... ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. గతేడాది వరద సమయంలో గేట్ల నిర్వహణ కోసం రిటైర్డ్ సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు. సమయానికి తెరుచుకోని సింగూరు గేట్లు సింగూరు ప్రాజెక్టు 1989లో 29.91 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ప్రాజెక్టు స్పిల్‌వే 327 మీటర్లు కాగా.. 17 క్రస్ట్ గేట్లున్నాయి. 8.19 లక్షల క్యూసెక్కుల వరదను డిశ్చార్జి చేసే సామర్థ్యం ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఇక్కడ 20 రోజుల్లోనే 75 టీఎంసీల మేర వరద వచ్చింది. ఈ సమయంలో ప్రాజెక్టు ప్రొటోకాల్ ప్రకారం మధ్య గేట్లు మొదట తెరవాల్సి ఉండగా.. అవి తెరుచుకోలేదు. దీంతో ఇతర గేట్లను తెరిచి నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. ప్రాజెక్టు గేట్ల ఓఅండ్ఎంను పూర్తిగా గాలికి వదిలే యడం.. రోప్ వైర్ల నిర్వహణను గాలికొదిలేయడమే దీనికి కారణమని తేల్చారు. ప్రాజెక్టు పరిధిలో 13 మంది సిబ్బంది కావాల్సి ఉండగా.. కేవలం ఒక హెల్పర్, ఇద్దరు వాచ్మెన్లతో నెట్టుకొస్తు న్నారు. నైపుణ్యం గల సిబ్బంది లేకుండా వరద, నీటి మట్టాల నిర్వహణ ఎలా చేపడతా రని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా అని నిపుణుల కమిటీ అప్పట్లోనే ప్రశ్నించింది. -
దొరకని యువకుల ఆచూకీ
సూరారం: సింగూరు జలాశయంలో గల్లంతైన ఇద్దరు యువకుల జాడ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో కుత్బుల్లాపూర్ సర్కిల్ నెహ్రునగర్‌లో విషాద చాయలు నెలకొన్నాయి. గల్లంతైన వారిలో అబ్దుల్ రజాక్, తస్లిమా బేగం కుమారుడు అబ్దుల్ ఆసిఫ్ (19) ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు, మహబూబ్, షమీమ్ బేగం కుమారుడు మోసిన్ (21) పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నారు. సమీప బంధువులైన వీరు గురువారం స్నేహితులతో కలిసి సింగూరు డ్యామ్‌కు వెళ్లారు.డ్యామ్‌లో ఈత కొట్టేందుకు వెళుతూ వెళుతూ ఆసిఫ్ కింద పడటంతో అతడి వెనకే వస్తున్న మోసిన్ అతన్ని పట్టుకునే క్రమంలో ఇద్దరు నీటిలో పడి గల్లంతయ్యారు. డ్యామ్ అధికారులు గజ ఈతగాళ్లను సహాయంతో శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా ఫలితం కనిపించలేదు. స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సింగూరు డ్యామ్ ఏరియా పోలీసులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
డ్యాంలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
సంగారెడ్డి: సింగూరు డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు గురువారం ఈత కొట్టడానికి సింగూరు డ్యాంకు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
సింగూరు వరదలో చిక్కుకున్న కార్మికులు
గేట్లు మూసి.. బయటకు తీసుకొచ్చిన అధికారులు పుల్కల్: పైప్‌లైన్ మరమ్మతుల కోసం వెళ్లి సింగూరు వరదల్లో ‘సత్యసాయి’ కార్మికులు చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారులు మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలం పోచారం శివారులో జరిగింది. సత్యసాయి నీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఎం.అంజయ్య, జి.లింగం, సురేశ్ మంగళవారం ఉదయం సింగూర్ వరదనీటి ప్రవాహం తగ్గడంతో పైప్హౌస్ (ఇన్ టేక్ వెల్) పరిశీలనకు వెళ్లారు. దెబ్బతిన్న పైపులకు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా సింగూర్ వరదనీరు పంప్‌హౌస్ చుట్టూ చేరింది. ఇది గమనించిన కార్మికులు తహసీల్దార్, ఎస్సైకు ఫోన్ ద్వారా తెలిపారు. తహసీల్దార్ శివరాం, వీఆర్వో, పోలీసులు అక్కడికి చేరుకొని కార్మికులను రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. నీటి విడుదలను కొంతసేపు నిలిపివేయాలని ప్రాజెక్టు ఏఈ రాములుతోపాటు వారు డీఈని కోరారు. అరుుతే ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి ఎక్కువున్నందున గేట్లు నిలిపివేస్తే ప్రమాదం జరగొచ్చని ప్రాజెక్టు అధికారులు తహసీల్దార్‌కు తెలిపారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలియడంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఫలితంగా మంగళవారం సాయంత్రానికి గేట్లు మూసివేసి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. కాగా, ఎగువ ప్రాంతం నుంచి అధికంగా వరదనీరు రావడంతో 15 రోజులుగా ప్రాజెక్టు నుంచి నిర్విరామంగా వరదనీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం 62 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అదే మట్టంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లుగా ఈఈ రాములు తెలిపారు. ముందే ఆదేశాలు జారీ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటిని 15 రోజులుగా వదలక తప్పదని ఈఈ రాములు తెలిపారు. ఈ విషయం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు గ్రామాల్లో దండోరా వేయించి మంజీరా నది నీటి ప్రవాహ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించామన్నారు. అయినప్పటికీ సత్యసాయి కార్మికులు మంగళవారం పంప్‌హౌస్ వద్దకు వెళ్లారని ఈఈ రాములు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం నుంచి ఆరు గేట్ల ద్వారా 63 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశామని, మధ్యాహ్నం తర్వాత కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు 4 గేట్లను మూసివేశామని ఈఈ రాములు తెలిపారు. -
సింగూరులో సందడే..సందడి
ప్రాజెక్టుకు పెరిగిన సందర్శకుల తాకిడి మూడు గేట్ల ద్వారా మంజీరలోకి నీరు జోగిపేట: సింగూరు ప్రాజెక్టులో వరదనీరు భారీగా చేరుతుండడంతో ఆ నీటి తాకిడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో ఇరిగేషన్ అధికారులు మంజీర నదిలోకి మూడు గేట్ల ద్వారా నీరు దిగువకు వదులుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది ప్రాజెక్టుకు తరలివచ్చారు. కార్లు, వ్యాన్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో సింగూరుకు తరలివస్తున్నారు. అన్ని దారులు సింగూరు వైపే మళ్లుతున్నాయి. ఆదివారం కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, జహీరాబాద్‌తో పాటు పుల్కల్ మండలం చుట్టు ప్రక్కల ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు కి.మీ దూరం నుండే పర్యాటకులు బారులు తీరి కనిపించారు. ప్రాజెక్టు పైకి వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. ప్రత్యేకంగా చెక్‌పోస్టును కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో పర్యాటకులు అసంతృప్తిని వ్యక్తం చేసారు. కొందరు గోల చేయడంతో వారిని ఆపడం పోలీసుల వశం కాకపోవడంతో చివరికి వదిలిపెట్టారు. సెల్ఫీల జోరు ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన పర్యాటకులు నీళ్లు కనిపించేలా ఫోటోలు దిగడంలో పోటీలు పడడం కనిపించింది. సెల్ఫీలకైతే అంతే లేకుండా పోయింది. కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి వీక్షిస్తున్నారు. పార్కు నిండా పర్యాటకులే.. ప్రాజెక్టు క్రింది భాగంలో ఉన్న చిల్ర్డన్స్‌పార్కు పర్యాటకులతో నిండిపోయింది. ప్రాజెక్టును చూడడానికి వచ్చిన వారంతా వెంట క్యారేజ్‌లు తెచ్చుకుంటున్నారు. పార్కులో కూర్చొని భోజనాలు చేసారు. -
ప్రమాదపు అంచుల్లో..
పుల్కల్: ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కొంతసేపైతే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ చివరి నిమిషంలో ట్రాక్టర్ ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఆ ప్రమాదం తప్పిపోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. సింగూర్ ప్రాజెక్టు 9 గేట్ల ద్వారా శనివారం మధ్యాహ్నం నీటిని విడుదల చేశారు. దీంతో ఉధృత్తగా ప్రవహిస్తున్న నీరు రోడ్డుపైకి వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సుమారు 15 నుంచి 20 మందిని తీసుకొని మలపాడ్ వైపు నుంచి సింగూర్ వైపు ఒక ట్రాక్టర్ వస్తోంది. రోడ్డు మధ్యలోకి రాగానే నీరు ట్రాక్టర్ ఇంజన్ మునిగిపోయే వరకు చేరింది. అప్పటికే పోలీసులు రావద్దు అని అరుస్తున్నా ట్రాక్టర్ డ్రైవర్ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ నీటి ఉధృతి పెరగడంతో వెనక్కి వెళ్లాడు.