సాక్షి, హైదరాబాద్: సింగూరు జలాల కోసం ఈ నెల 18 నుంచి తాను, తన భార్య రిలే నిరాహార దీక్ష చేపడతామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. దీక్షను అడ్డుకుంటే తలెత్తే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో లేకుం డా సింగూరు జలాలను తరలించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరారు. సింగూరు జలాల తరలింపు వల్ల సంగారెడ్డికి తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment