ఓ మహిళా ఖైదీ రిమాండ్‌లో ఉన్న సమయంలో తోటి ఖైదీలు.. జైలులో తినే కంచంలో అధికంగా ఉప్పు కలిపి చుక్కలు చూపించారు. ఆమె చేసిన తప్పుకు తోటి ఖైదీలు సైతం అసహ్యించుకున్నారు. అందుకే ఆమె చేసిన తప్పు గుర్తుకు వచ్చేలా చేశారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని ఈస్ట్ ఉడ్ మహిళల కారాగారంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. ఎమ్మా టుస్టిన్ అనే 32 ఏళ్ల మహిళ.. 29ఏళ్ల థామస్ హ్యూస్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తన మొదటి భార్యతో థామస్ విడిపోయినప్పటికీ.. వారిద్దరికి జన్మించిన ఆర్థర్ పోషణ బాధ్యతను తానే తీసుకున్నాడు. ఇక తనకు, థామస్‌కు మధ్య బాలుడు ఆర్థర్ ఉండడం ఇష్టంలేని ఎమ్మా.. ఆర్థర్ తినే కంచంలో రోజూ మోతాదుకు మించి ఉప్పును కలపడం మొదలు పెట్టింది. దీంతో ఆర్థర్ ఆరోగ్యం క్షిణించి, రక్తంలో ఉప్పు శాతం పెరిగి మృతిచెందాడు.
ఈ ఘటనలో బాలుడి సవతి తల్లి ఎమ్మకు కోవెంట్రీ క్రౌన్ కోర్ట్ డిసెంబర్ 3న 29 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. అయితే ఎమ్మా రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో అదే జైలులో శిక్ష అనుభవించిన ఎలైన్ ప్రిచర్డ్(మాజీ ఖైదీ).. జైలులోని జరిగిన సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. ఆరేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న ఎమ్మాకు.. ఆర్థర్ పడిన బాధను చూపించాలని జైలులో ఉన్న మహిళా ఖైదీలమంతా నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఎమ్మా బాలుడిని హింసించి కంచంలో ఉప్పు కలిపినట్టుగానే తామంతా.. ఆమె తినే కంచంలో ఉప్పు కలిపేవాళ్లమని తెలిపారు. తామంతా కారాగారంలో ఉన్న సమయంలో ఎమ్మా పట్ల క్రూరంగా ప్రవర్తించామని కానీ, ఆర్థర్‌ను హింసించి చంపినందుకు మేము(ఖైదీలు) చేసిన హింసకు ఆమె శిక్షార్హురాలని ఎలైన్ చెప్పారు. తన భర్త థామస్.. బాలుడు ఆర్థర్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల తను జైలు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పేదని పేర్కొంది. ఆర్థర్ ఎలా చనిపోయాడనే విషయాన్ని చెప్పేది కాదని, అసలు బాలుడి ప్రస్తావన కూడా తీసుకురాలేదని ఎలైన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment