child dead
-
దారుణం.. బాయ్‌ఫ్రెండ్ కూతురిని చంపిన యువతి
అమెరికాలోని పెన్సిల్వేనియాలో అలెసియా ఓవెన్స్ అనే యువతి మానవత్వాన్ని మరిచి తన బాయ్‌ఫ్రెండ్‌కు చెందిన 18నెలల చిన్నారిని పొట్టనబెట్టుకుంది. గతేడాది జూన్‌లోని జరిగిన ఈ ఘటనలో అలెసియాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అటార్నీ జనరల్ మిచెల్ హెన్రీ తెలిపిన వివరాల ప్రకారం.. 18 నెలల ఐరిస్ రీటా అల్ఫెరా మృతికి కారణం అలెసియా అని.. పాపకు జరిపిన శవపరీక్షలో నమ్మలేని నిజాలు భయటపడ్డాయని తెలిపారు. అసిటోన్ అనే రసాయనం, వ్యాచ్ బ్యాటరీలు, స్క్రూలను పాపకు తినిపించడం వల్ల మృతి చెందినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల అలెసియా ఓవెన్స్.. జూన్25, 2023న పాప ఐరిస్ రీటా అల్ఫెరా తండ్రి బెయిలీ జాకబ్ పక్కనే ఉన్న ఒక స్టోర్ వెళ్లాడు. అదే సమయంలో పాపలో ఇంట్లో ఉన్న అలెసియా ఐరిస్ రీటాలో ఉలుకుపలుకు లేదని గమనించారు. అయితే ఈ సమాచారాన్ని ఆమె బెయిలీ జాకబ్‌కు అందించింది. దీంతో బెయిలీ జాకబ్ పాపను పిట్స్‌బర్గ్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం పాప ఐరిస్ రీటా మృతి చెందింది. పాప అవయవాల వైఫల్యంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పాప ఐరిస్ తన తల్లి ఎమిలి అల్ఫెరాతో ఉంటోంది. అయితే తండ్రి బెయిలీ జాకబ్‌కు కేవలం సందర్శన హక్కులు మాత్రమే ఉండటం గమనార్హం. పాప మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు అలెసియా ఫోన్ పరిశీలించగా.. పలు నమ్మలేని నిజాలు భయటపడ్డాయి. పాప ఐరిస్ మృతికి ముందు.. అలెసియా పిల్లలకు హానీ చేసే వస్తువులు, పద్దతులకు సంబంధించి ఫోన్లో సమాచారాన్ని వెతికినట్లు బయటపడింది. పిల్లలకు హాని కలిగించే అసిటోన్ రసాయనం, బ్యాటరీలు, నెయిల్ పాలీష్, చిన్న వాటర్ బాల్స్, చిన్నపిల్లలకు విషపూరితంగా మారే బ్యూటీ ప్రాడక్టులను కూడా వెతికినట్లు పోలీసులు గుర్తించారు. శవ పరీక్షల నివేదికల్లో ఈ విషయం స్పష్టంగా తేలటంతో అలెసియాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆమె ఎందుకు చిన్నారిని చంపిందనే విషయంపై విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: గాల్లో ఉండగానే కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు! -
చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్‌తో చిన్నారి మృతి
నందిపేట్ (ఆర్మూర్): తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లిన చిన్నారి.. చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్‌ని తెరిచే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జరిగింది. నవీపేట మండల కేంద్రానికి చెందిన గూడూర్ రాజశేఖర్ భార్య, కూతురు రిషిత (4)తో కలిసి నందిపేటలో ఉండే అత్తగారింటికి ఆదివారం వచ్చాడు. సోమవారం ఉదయం వారు తిరిగి స్వగ్రామానికి వెళ్తూ.. నందిపేటలోని ఎన్ మార్ట్ షాపింగ్ మాల్‌లోకి సరుకులు కొనేందుకు వెళ్లారు. రాజశేఖర్ వస్తువులు తీసుకుంటుండగా పక్కనే ఐస్‌క్రీంలు ఉన్న ఫ్రిడ్జ్‌ని తెరిచేందుకు రిషిత ప్రయత్నించింది. ఫ్రిడ్జ్‌కి కరెంట్ సరఫరా కావడంతో చిన్నారి విద్యుదాఘాతానికి గురైంది. ఫ్రిడ్జికి అలాగే అంటుకుని కొన్ని సెకన్లపాటు వేలాడింది. గమనించిన తండ్రి పాపను తీసుకుని స్థానిక ఆస్పత్రికి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే పాప మృతి చెందింది. చిన్నారి మృతదేహంతో రాస్తారోకో..: షాపింగ్‌మాల్ యజమానుల నిర్లక్ష్యం వల్లే రిషిత మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో మాల్ ఎదురుగా రోడ్డుపై నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. వీరికి స్థానికులు మద్దతు తెలుపడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాహుల్, తహసీల్దార్ ఆనంద్‌కుమార్ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, మాల్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
కన్నతల్లి కర్కశత్వం! చిన్నారి మృతి!
విశాఖపట్నం: అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన చిన్నారిపై కన్నతల్లి కర్కశత్వం చూపింది. గోరుముద్దలు తినిపించాల్సిందిపోయి కోపంతో గరిటతో తలపై కొట్టి కడతేర్చింది. ఈ ఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీసీపీ కె.ఆనందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి గ్రామానికి చెందిన బంగారు స్నేహ (19) అదే గ్రామానికి చెందిన సాయిని ప్రేమించి 2021 వివాహం చేసుకొంది. అనంతరం వారు విజయవాడలో కాపురం పెట్టారు. వీరికి ఓ పాప సంతానం. ఆ పాప పేరు గీతశ్రీ. కొంతకాలం తర్వాత ఆ దంపతుల మధ్య మనస్పర్థలతో గొడవలు జరగడంతో యలమంచిలి గ్రామానికి చెందిన రమణతో స్నేహ తన కష్టాలు చెప్పుకుంది. అనంతరం ఆ పరిచయం ప్రేమగా మారడంతో మొదటి భర్త సాయిని విడిచి తన 15నెలల కూతురు గీతాశ్రీని తీసుకుని రమణతో వచ్చేసింది. వీరు దువ్వాడ సమీప మంగళపాలెం జేఎన్యూఆర్ఎం బ్లాక్ నంబర్ – 74 ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న మధ్యాహ్నం పాపకి స్నేహ అన్నం తినిపిస్తుండగా... పాప అల్లరి చేయడంతో కోపంతో గరిట తీసుకుని కుమార్తె తలపై స్నేహ బలంగా కొట్టింది. దీంతో పాపకి అధిక రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయి పడిపోయింది. తీరాచూస్తే చనిపోవడంతో రాత్రి అయ్యాక బ్లాక్ నంబర్ 74 వెనుక ఉన్న ముళ్లపొదల్లో స్నేహ పాతిపెట్టింది. అనంతరం భారీగా వర్షాలు కురవడంతో అక్కడి మట్టి కరిగిపోవడంతో పైకి తేలిన గీతశ్రీ మృతదేహాన్ని కుక్కలు బయటకు లాగడంతో ఈ హత్యోదంతం శనివారం ఉదయం 11 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. చిన్నారి గీతశ్రీ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు దువ్వాడ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలు స్నేహని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏసీపి త్రీనాథ్, దువ్వాడ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు కేసును పర్యవేక్షిస్తున్నారు. -
విషాదం: వీధి కుక్కల కారణంగా చిన్నారి మృతి
సాక్షి, హన్మకొండ: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కువైన విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడిలో ఇప్పటికే పలువురు మృతిచెందగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, తాజాగా హన్మకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతిచెందాడు. వివరాల ప్రకారం.. తెలంగాణ దశాబ్ది సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. 21రోజులపాటు జరిగే ఉత్సవాల్లో నేడు 19వరోజున విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో విద్యా దినోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కాగా, విద్యా దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ తీస్తుండగా విద్యార్థులపైకి వీధి కుక్కలు ఎగబడ్డాయి. ఈ సమయంలో కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి విద్యార్థి ఇనుగాల ధనుష్(12) మృతిచెందాడు. కాగా, ధనుష్ ఆరో తరగతి చదవుతున్నాడు. అయితే, ధనుష్ మృతితో గ్రామంలో విషాయఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. -
సికింద్రాబాద్: మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి
సాక్షి, సికింద్రాబాద్: భారీ వర్షం కురిసిన వేళ సికింద్రాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో పడి ఓ చిన్నారి మృతిచెందింది. దీంతో, జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్క్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వివరాల ప్రకారం.. నగరంలోని కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసం చిన్నారి మౌనిక బయటకు వెళ్లింది. ఈ క్రమంలో భారీ వర్షం కారణంగా మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండటంతో చిన్నారి అందులో పడిపోయింది. అనంతరం, పార్క్‌లైన్ దగ్గర మౌనిక మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. కాగా, చిన్నారి ఇలా చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అములుకున్నాయి. ఇక, మ్యాన్‌హోల్ తెరిచిపెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వర్షం కురుస్తుండగా మౌనిక తన అన్నతో కలిసి షాపునకు వెళ్లింది. ఈ క్రమంలో తన అన్న మ్యాన్‌హోల్‌లో పడిపోతుండగా ఆమె.. అతడిని కాపాడింది. ఈ క్రమంలో చిన్నారి మౌనిక పట్టుతప్పి మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని ఆమె.. సోదరుడు వివరిస్తూ కన్నీరుపెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్ట ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ వద్ద భారీగా వరద నీరు చేరుకుంది. తార్నాక చౌరస్తాలో భారీగా వరద నీరు చేరుకుంది. పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Thank you KTR for amazing drainage system. Commendable job done. Watersports are coming to Hyderabad soon. Awaiting Drone shots.#HappeningHyderabad #HyderabadRains pic.twitter.com/EvM4RUKbr6 — Gayathri Bandari (@GayathriBDevi) April 29, 2023 #Massive #Rains In #Hyderabad at 6am in Himayat Nagar... #HyderabadRains pic.twitter.com/qA2hqX8Zag — Sunil Veer (@sunilveer08) April 29, 2023 -
కారు చక్రం కింద నలిగిన చిరుప్రాయం
సాక్షి, సూర్యాపేట : కారు చక్రం కింద ఓ చిరుప్రాయం నలిగిపోయింది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన సంక్రాంతి విజయ్‌శేఖర్, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా, విజయ్‌శేఖర్ ఇంటికి మధ్యాహ్న సమయంలో బంధువులు కారులో వచ్చారు. వారు ఇంట్లోకి వెళ్లగానే డ్రైవర్ ఎదురుగా ఉన్న చెట్టుకింద కారును రివర్స్‌లో పార్క్ చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత పని నిమిత్తం శిరీష ఎదురింట్లోకి వెళ్లగా తల్లిని చిన్నకూతురు షణ్ముఖ (18నెలలు) కూడా అనుసరించింది. ఆ ఇంటి ఎదురుగానే నిలిపిన కారు వెనుక డోరు పక్కన షణ్ముక ఆడుకుంటోంది. గమనించని తల్లి శిరీష ఒక్కతే ఇంట్లోకి వెళ్లింది. ఇంతలోనే కారు డ్రైవర్ అక్కడకు వచ్చి చిన్నారిని గమనించకుండా వాహనాన్ని ముందుకు కదిలించాడు. అయితే, ఈ సమయంలో షణ్ముక వెనుక చక్రం వద్ద ఆడుకుంటూ దానికింద పడిపోయింది. దీంతో టైరు బాలిక తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. షణ్ముక కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వచ్చి కోదాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటగా ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. -
పాపకు ప్రాణమున్నా పోయిందన్నారు.. చివరి నిమిషంలో ట్విస్ట్
జగిత్యాల: ఐదు రోజుల శిశువు. అనారోగ్యంతో ఆస్పత్రిలోనే ఉంది. కాపాడుకోవడానికి రూ.లక్ష కుమ్మరించారు తల్లిదండ్రులు. అయినా ‘పాప ప్రాణం పోయింది.. తీసుకెళ్లండి’ అన్నారు డాక్టర్లు. దీంతో ఆశలొదులుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ప్రేమ ఆ పసిగుడ్డు గుండెను కరిగించిందేమో.. శ్మశానంలో ఉండగా కదలికలొచ్చాయి. ప్రాణంతోనే ఉందని గుర్తించి, ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వేణుకు సంగీతతో వివాహం జరిగింది. ప్రసవానికి సంగీత తల్లి ఊరైన కోరుట్లకు వెళ్లింది. అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏప్రిల్ 27న పాపకు జన్మనిచ్చింది. పాప ఉమ్మ నీరు తాగిందని, ఆరోగ్య సమస్యలున్నాయని అక్కడే చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో... కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రూ. లక్ష వరకు ఫీజు వేసిన ఆస్పత్రి, పాప బతికే పరిస్థితి లేదని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించింది. పాపలో చలనం లేకపోవడంతో చనిపోయిందని భావించి శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ పాప కదలడం గుర్తించిన తల్లిదండ్రులు.. వెంటనే జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పడంతో సంగీత–వేణు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బాలుడిని బలి తీసుకున్న కొబ్బరి ముక్క
చెన్నై: గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని మూడున్నరేళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పొన్నేరి సమీపంలోని పాక్కం గ్రామానికి చెందిన వసంత్‌కు మూడు న్నరేళ్ల కొడుకు సంజీశ్వరన్ ఉన్నాడు. ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని ముక్కలు చేసి ఉంచారు. అక్కడే ఆడుకుంటున్న సంజీశ్వరన్ ఆ కొబ్బరి ముక్కలను తిన్నాడు. అవి గొంతులో ఇరుక్కుపోవడంతో స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపాలైవనం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నాడు. -
దారుణం: ఆరు నెలల బిడ్డను బలి ఇచ్చిన అవ్వ
తిరువొత్తియూరు: యాభై ఏళ్ల వ్యక్తి ఆరోగ్యం కోసం మూఢనమ్మకంతో ఆరు నెలల బిడ్డను బలి ఇచ్చిన మంత్రవాది సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా పేరావూరని, మల్లిపట్టినం చెందిన అస్రుద్ధీన్ (32) కార్మికుడు. ఇతని భార్య షాలిషా (24). వీరికి రాజామహ్మద్ అనే ఆరు నెలల ఆడబిడ్డ ఉంది. ఈ క్రమంలో నస్రుద్ధీన్ పిన్ని షర్మిల బేగం (48) తన భర్త ఆరోగ్యం బాగుపడటానికి కేరళ మంత్రవాది మహ్మద్ సలీం (48) సలహా మేరకు నస్రుద్ధీన్ కుమార్తె అయిన చిన్నారిని బలి ఇచ్చినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు షర్మిళ బేగం, అస్రుద్ధీన్, మంత్రవాది మహ్మద్‌ను శనివారం అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
తినే కంచంలో ఉప్పు పోశారు.. ఆమె చేసిన ఘోరం అలాంటిది
ఓ మహిళా ఖైదీ రిమాండ్‌లో ఉన్న సమయంలో తోటి ఖైదీలు.. జైలులో తినే కంచంలో అధికంగా ఉప్పు కలిపి చుక్కలు చూపించారు. ఆమె చేసిన తప్పుకు తోటి ఖైదీలు సైతం అసహ్యించుకున్నారు. అందుకే ఆమె చేసిన తప్పు గుర్తుకు వచ్చేలా చేశారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని ఈస్ట్ ఉడ్ మహిళల కారాగారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఎమ్మా టుస్టిన్ అనే 32 ఏళ్ల మహిళ.. 29ఏళ్ల థామస్ హ్యూస్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తన మొదటి భార్యతో థామస్ విడిపోయినప్పటికీ.. వారిద్దరికి జన్మించిన ఆర్థర్ పోషణ బాధ్యతను తానే తీసుకున్నాడు. ఇక తనకు, థామస్‌కు మధ్య బాలుడు ఆర్థర్ ఉండడం ఇష్టంలేని ఎమ్మా.. ఆర్థర్ తినే కంచంలో రోజూ మోతాదుకు మించి ఉప్పును కలపడం మొదలు పెట్టింది. దీంతో ఆర్థర్ ఆరోగ్యం క్షిణించి, రక్తంలో ఉప్పు శాతం పెరిగి మృతిచెందాడు. ఈ ఘటనలో బాలుడి సవతి తల్లి ఎమ్మకు కోవెంట్రీ క్రౌన్ కోర్ట్ డిసెంబర్ 3న 29 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. అయితే ఎమ్మా రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో అదే జైలులో శిక్ష అనుభవించిన ఎలైన్ ప్రిచర్డ్(మాజీ ఖైదీ).. జైలులోని జరిగిన సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. ఆరేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న ఎమ్మాకు.. ఆర్థర్ పడిన బాధను చూపించాలని జైలులో ఉన్న మహిళా ఖైదీలమంతా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎమ్మా బాలుడిని హింసించి కంచంలో ఉప్పు కలిపినట్టుగానే తామంతా.. ఆమె తినే కంచంలో ఉప్పు కలిపేవాళ్లమని తెలిపారు. తామంతా కారాగారంలో ఉన్న సమయంలో ఎమ్మా పట్ల క్రూరంగా ప్రవర్తించామని కానీ, ఆర్థర్‌ను హింసించి చంపినందుకు మేము(ఖైదీలు) చేసిన హింసకు ఆమె శిక్షార్హురాలని ఎలైన్ చెప్పారు. తన భర్త థామస్.. బాలుడు ఆర్థర్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల తను జైలు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పేదని పేర్కొంది. ఆర్థర్ ఎలా చనిపోయాడనే విషయాన్ని చెప్పేది కాదని, అసలు బాలుడి ప్రస్తావన కూడా తీసుకురాలేదని ఎలైన్ పేర్కొంది. -
మాజీ పోర్న్ స్టార్ అరెస్ట్.. కొడుకును హత్య చేసిందని ఆరోపణలు
పెరుజియా: కన్న బిడ్డను హత్య చేసిందనే ఆరోపణలతో ఓ మాజీ పోర్న్ స్టార్ అరెస్ట్ అయింది. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కటాలిన్ ఎర్జ్‌బెట్ బ్రాడాక్స్ అనే మాజీ పోర్న్ స్టార్ ఓ సూపర్ మార్కెట్లో తీవ్రమైన కత్తి గాయాలతో ఉన్న తన రెండేళ్ల బాలుడు అలెక్స్ జుహాజ్తో కనిపించింది. తన కుమారుడిని కాపాడాలంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చదవండి: నిర్వహణలో లోపాలతోనే ఫేస్బుక్ డౌన్ అయితే అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. సూపర్ మార్కెట్ పక్కన ఉన్న ఓ భవనంలో అలెక్స్‌కు సంబంధించిన రక్తపు టీ షర్టు పోలీసులకు లభ్యమైంది. అలెక్స్ మృతదేహంపై 9 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే బాలుడిని తల్లి కటాలిన్ హత్య చేసినటట్లు ఆమె మాజీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కటాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులకు ఆమె పర్స్‌లో కత్తి కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. కటాలిన్ తన నుంచి విడాకులు తీసుకొని, అలెక్స్‌తో ఇటలీలో ఉంటుందని ఆమె మాజీ భర్త నార్బర్ట్ జుహాజ్ తెలిపారు. కటాలిన్‌తో విడిపోయిన నార్బర్ట్ హంగేరిలో ఉంటున్నాడు. కటాలిన్, నార్బర్ట్ విడిపోయి.. అలెక్స్ పెంపకంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. తన మీది ఉన్న కోపంతోనే అలెక్స్‌ను చంపి ఉంటుందని నార్బర్ట్ ఆరోపించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కటాలిన్ నార్బర్ట్ ఆరోపణలను ఖండించింది. -
సికింద్రాబాద్: బోయిన్‌పల్లిలో విషాదం
-
బోయిన్పల్లి: నాలాలో పడి ఏడేళ్ల బాలుడు మృతి
కంటోన్మెంట్: అప్పటివరకు తోటిపిల్లలతో కలసి ఆనందంగా ఆడుకుంటున్న ఓ బాలుడిని నాలా గుంత కబళించింది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. శనివారం బోయిన్‌పల్లిలోని ఆనంద్‌నగర్ ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజుల గ్రామానికి చెందిన ఆంజనేయులు, చంద్రకళ దంపతులు పదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని బోయిన్పల్లి ప్రాంతానికి వలసవచ్చారు. ఆంజనేయులు ప్రైవేటు డ్రైవర్ కాగా, చంద్రకళ ఇళ్లలో పనిచేస్తోంది. వీరికి చరణ్(9), ఆనంద్ సాయి(7) సంతానం. ఆనంద్‌నగర్ నాలా పక్కనే ఓ ఇంట్లో ఆంజనేయులు కుటుంబం అద్దెకుంటోంది. శనివారం ఉదయం ఆనంద్‌సాయి తోటి పిల్లలతో కలసి ఆడుకుంటున్నాడు. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న నాలా బ్రిడ్జి పునర్ నిర్మాణపనుల్లో భాగంగా తీసిన గుంతలో ఆనంద్‌సాయి ప్రమాదవశాత్తు పడిపోయాడు. నాలాలో పడిపోయిన బాలుడి కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. పోలీసులు వచ్చి అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బందితో కలసి రెండుగంటలు గాలించారు. గజ ఈతగాడు ట్యాంక్‌బండ్ శివ నాలా అడుగుభాగం వరకు వెళ్లి ఆనంద్‌సాయి మృతదేహాన్ని వెతికి వెలికితీశాడు. స్థానికుల ఆగ్రహం... బ్రిడ్జి పునర్ నిర్మాణపనుల్లో నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 నెలల క్రితం పనులు ప్రారంభించినా ఇంకా పూర్తికాలేదు. గతేడాది వర్షాకాలంలో సమీపంలోని హస్మత్‌పేట ప్రాంతంలో నాలా ఉప్పొంగి చుట్టుపక్కల కాలనీలు, బస్తీలను ముంచెత్తింది. అదే సమయంలో ఆంజనేయులు– చంద్రకళ దంపతులు వాచ్‌మన్‌గా పనిచేసే ఆనంద్‌నగర్‌లోని అపార్ట్మెంట్ సెల్లార్ కూడా నీట మునిగింది. దీంతో సమీపంలోని ఓ అద్దె ఇంట్లోకి ఆంజనేయులు కుటుంబం మారింది. కాగా, బ్రిడ్జి నిర్మాణ కాం ట్రాక్టర్ నిర్లక్ష్యమే తమ కుమారుడి మృతికి కారణమని బాలుడి తల్లి చంద్రకళ పోలీసులకు ఫిర్యా దు చేసింది. దీంతో కాంట్రాక్టర్ రాము, ఇతరులపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో బాలుడు నాలాలో పడి ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి కలిగించిం దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్యెల్యే కూన శ్రీశైలం గౌడ్ వేర్వేరు ప్రకటనల్లో విచారం వ్యక్తం చేశారు. చదవండి: పోలీసులపై టీఆర్ఎస్ జడ్పీటీసీ అనుచరుల దాడి -
ఎంజీబీఎస్‌లో డ్రైవర్ నిర్లక్ష్యం, చిన్నారి మృతి
అఫ్జల్‌గంజ్: అప్పటి వరకూ ఆ చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో పయనించాడు. ఆ పయనమే అతనికి మృత్యు గమనమైంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. కుటుంబ సభ్యుల్ని తీవ్ర శోకంలో ముంచివేసింది. ఈ విషాదకర ఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖలీల్‌కు కుమారుడు మహ్మద్ అహాన్ (3), ఓ కూతురు ఉన్నారు. మూడ్రోజుల క్రితం చిన్నారుల అమ్మమ్మ ఊరైన నిజామాబాద్‌కు కుటుంబ సభ్యులతో వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం నిజామాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో నగరానికి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫాం నంబర్ 74 వద్ద బస్సు దిగారు. కుటుంబ సభ్యులతో కలిసి మూడేళ్ల బాలుడు మహ్మద్ అహాన్ నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా వెనక్కు తిప్పాడు. బస్సు గమనాన్ని గమనించని అహాన్ దాని చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు తమ కళ్లముందే అసువులు బాయడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చదవండి: చెన్నైలో కిడ్నాప్.. ముంబైలో సజీవదహనం -
బిస్కెట్లా?.. విష ప్రయోగమా?
ఆళ్లగడ్డ: మండలంలోని చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం రాత్రి టీ తాగి, బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై హుస్సేన్‌బాష (6) అనే చిన్నారి మృతి చెందగా..మరో ఇద్దరు ఆసుపత్రులో చేరిన విషయం విదితమే. వీరిలో హుస్సేన్‌బీ (4) అనే చిన్నారి కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మరో చిన్నారి జమాల్‌మీ మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బిస్కెట్లు వికటించడం ఏంటన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఘటనపై పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టులో తయారైన బిస్కెట్ల ప్యాకెట్‌పై మరో 18 నెలల గడువు ఉంది. అందులో కల్తీ ఉంటే అస్వస్థతకు గురవడం తప్పా మరణాలు సంభవించే పరిస్థితి చాలా అరుదని అధికారులే అంటున్నారు. దీంతో బిస్కెట్లలోనే ఎవరైనా విషం కలిపారా? లేక పాలు / టీలో విష ప్రయోగం జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి : (చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు ) హోల్‌సేల్ దుకాణం సీజ్ చింతకొమ్ముదిన్నెలోని చిల్లర దుకాణానికి బిస్కెట్లు సరఫరా చేసిన ఆళ్లగడ్డ పట్టణంలోని సాయిరాం ఎంటర్ప్రైజెస్ హోల్‌సేల్ దుకాణాన్ని పోలీసుల సూచన మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఆహార భద్రత అధికారులు వచ్చి పరిశీలించే వరకు దుకాణాన్ని మూసేయడంతో పాటు అందులో ఉండే బిస్కెట్లు బయటకు వెళ్లకుండా సీజ్ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. చిన్నారుల మృతి ఘటనపై తహసీల్దార్ రవి, ఐసీడీఎస్ అధికారిణి సుశీల సోమవారం తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారులు బిస్కెట్లు కొనుగోలు చేసిన దుకాణం నిర్వాహకునితో పాటు గ్రామంలో పలువురితో మాట్లాడి వివరాలు సేకరించారు. చిన్నారుల మృతి ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ విషయంపై ఆహార భద్రత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి..దుకాణాన్ని సీజ్ చేయించాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశాం. పోస్టుమార్టం నివేదికలు వస్తే ఎలా మృతి చెందారన్న విషయం బయటకు వస్తుంది' అని ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు తెలిపారు -
చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు
సాక్షి, ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం బిస్కెట్లు తిని ఒక చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాబు వద్ద ఆయన మనవడు, మనవరాళ్లు హుస్సేన్‌బాష (6), జమాల్‌బీ, హుస్సేన్‌బీ డబ్బులు తీసుకుని బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నారు. అవి తిన్న కొద్దిసేపటికే కడుపునొప్పితో విలవిల్లాడారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆళ్లగడ్డలోని వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ హుస్సేన్‌బాష మృతి చెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నారులు కొన్న బిస్కెట్ల ప్యాకెట్‌పై ‘రోజ్ మ్యాంగో’ అనే పేరు ఉంది. -
వైద్యుల నిర్లక్ష్యం: బాలుడి మృతి
లక్నో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాణాలు కాపాడే వైద్యులే నిర్లక్ష్యం వహించడంతో ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కానౌజ్ నగరంలో చోటు చేసుకుంది. తీవ్రమైన జ్వరం, మెడ భాగంలో వాపు ఉన్న బాలుడుని కానౌజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం ఆ బాలుడి తల్లిదండ్రులు తరలించారు. కానీ అక్కడి వైద్యులు కనీసం బాలుడికి ఏం అయిందని తెలుసుకోకుండా ఇక్కడ చికిత్స అందించలేము కాన్పూర్‌లోకి ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. దీంతో దిక్కుతోచని బాలుడి తల్లిదండ్రులు ఆశాదేవి, ప్రేమ్ చంద్ తమ పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందించాలని పలుమార్లు వైద్యులను కోరారు. ఆస్పత్రిలోని ఉన్నకొంతమంది ఈ ఘటనను మోబైల్ ఫోన్లో చిత్రీకరించారు. దీంతో తమ పిల్లవాడికి ఏం అయిందని వైద్యులు చూశారని అంతకు ముందు కనీసం తాకడానికి కూడా ఇష్టపడలేదని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన 30 నిమిషాల తర్వాత వైద్యులు సరిగా పట్టించుకోకపోవటంతో బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేశారు. (ఇసుక వివాదం: తండ్రీ, కొడుకుల హత్య..) ‘నేను పేదవాడిని మా బాలుడిని కనీసం తాకకుండా కాన్పూర్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లండని వైద్యులు అన్నారు. నా దగ్గర డబ్బులేదు. నేను ఏం చేయాగలను. కేవలం ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం కారణంగా మా చిన్నారి మృతి చెందాడు’ అని తండ్రి ప్రేమ్‌చంద్ తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా దీనిపై కనౌజ్ ప్రభుత్వ అధికారి రాజేష్ కుమార్ మీశ్రా స్పందిస్తూ.. చిన్నారిని వైద్యులు అత్యవసర వార్డుకు చేర్చారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చైల్డ్ స్పెషలిస్ట్‌ను కూడా పిలిచారు. కానీ, తీసుకువచ్చిన 30 నిమిషాలల్లో బాలుడు మృతి చెందాడు. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ, బాలున్ని రక్షించలేకపోయారు. వైద్యులు ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదు’ అని తెలిపారు. (వీళ్లు మనుషులు కాదు రాక్షసులు) -
బాలుడి మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
ధర్మవరానికి చెందిన ఇంద్రనీల్‌వర్మ (5) డెంగీ జ్వరంతో బాధపడుతూ అనంతపురంలోని ‘శిశు కేర్’ ఆస్పత్రిలో ఆదివారం మృతి చెందగా. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి నిర్వాహకుడితో పాటు ఐఎంఏ నాయకుడిపై దాడి చేశారు. సాక్షి, అనంతపురం: అనంతపురం రామచంద్రనగర్ ‘శిశు కేర్’ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... ధర్మవరంకు చెందిన లోకేష్, దేవి దంపతుల కుమారుడు ఇంద్రనీల్‌వర్మ (5) జ్వరంతో బాధపడుతుండటంతో ఈ నెల 5న ‘శిశు కేర్’ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు డెంగీ, న్యుమోనియాతో బాధపడుతున్నట్లు చెప్పి చికిత్స ప్రారంభించారు. శనివారం అర్ధరాత్రి మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చిన బాలుడు.. కాసేపటికే కళ్లు తేలేయడంతో కుటుంబ సభ్యులు వైద్యుడికి సమాచారం అందించారు. రాత్రి 1:30 సమయంలో డాక్టర్ మౌలాలి అహ్మద్ బాషా వచ్చి బాలుడిని పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండటంతో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఈలోగానే బాలుడు మరణించాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్ అహ్మద్ బాషా, ఐఎంఏ ఉపాధ్యక్షుడు మనోరంజన్‌రెడ్డిపై దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. డాక్టర్ అహ్మద్ బాషా నిర్లక్ష్యం వహించారన్న కారణంతో డీఎంహెచ్‌వో డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్ షోకాజ్ జారీ చేశారు. కాగా, వైద్యులపై దాడిని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ వైద్య మండలి సభ్యుడు డాక్టర్ ఎస్వీకే ప్రసాద్‌రెడ్డి ఖండించారు. -
అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి
వాషింగ్టన్ : వడదెబ్బతో ఆరేళ్ల భారతీయ చిన్నారి మృతి చెందిన సంఘటన అందరిని కలచి వేస్తోంది. వివరాలు.. గురుప్రీత్ కౌర్ అనే బాలిక తన తల్లితో కలిసి మెక్సికో బార్డర్ ద్వారా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో స్మగ్లర్స్ తల్లీకూతుళ్లిద్దరితో పాటు మరో ఐదుగురు భారతీయ వలసదారులను మంగళవారం ఉదయం అమెరికా సరిహద్దులోని ల్యూక్‌విల్లే ప్రాంతంలోని అరిజోనా ఎడారి ప్రాంతంలో వదిలి వెళ్లారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత బాలిక తల్లి కూతుర్ని మిగతావారివద్ద వదిలి.. మరో మహిళతో కలిసి నీటి కోసం వెదుక్కుంటూ ముందుకు వెళ్లింది. అలా నీటి కోసం వెళ్లిన వారు మరి వెనక్కి తిరిగి రాలేదు. వడ దెబ్బ కొట్టడంతో వారు కూడా స్పృహ తప్పి పడిపోయారు. మరుసటి రోజు బార్డర్ పెట్రోల్ ఏజెంట్ వారి పాద ముద్రల ఆధారంగా నడుచుకుంటూ వెళ్లగా ఓ చోట ఇద్దరు మహిళలు పడి పోయి ఉండటం గమనించాడు. వారికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం వివరాలు సేకరించాడు. ఇద్దరు మహిళలకు ఇంగ్లీష్ రాకపోవడంతో వారితో మాట్లడటం చాలా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో గురుప్రీత్ సైగల ద్వార తన కూతురు గురించి అధికారులకు తెలియజేసింది. తాము నీటి కోసం వెదుకుతూ.. వచ్చామని.. తన కూతురు వేరే చోట ఉందని తెలియజేసింది. ఆమె చెప్పిన దాని ప్రకారం పోలీసులు గాలింపు చేపట్టగా.. ఓ మైలు దూరంలో వారికి గురుపీప్రత్ కౌర్ మృత దేహం కనిపించింది. కొన్ని గంటల పాటు నీరు లేక తీవ్రమైన ఎండలో ఉండటం మూలానా గురుప్రీత్ మృతి చెందింది. బాలిక మృతికి స్మగ్లర్స్నే నిందిస్తున్నారు అమెరికా సరిహద్దు భద్రత అధికారులు. అక్రమంగా తమ దేశంలో ప్రవేశించాలని చూశారని.. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా ల్యూక్విలే అరిజోనా ప్రసిద్ధికెక్కింది. ఇది పూర్తిగా ఎడారి ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంత వేడి వాతావరణం మూలానే సదరు బాలిక మృతి చెందిందని వైద్యులు భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది వడదెబ్బ వల్ల ఇద్దరు మృతి చెందగా వారిలో గురుప్రీత్ ఒకరు కావడం విచారం. మరి కొద్ది రోజుల్లోనే గురుప్రీత్ ఏడవ పుట్టిన రోజు జరుపుకోబోతుండగా.. ఈ విషాదం చోటు చేసుకుంది. -
అయ్యో.. పాపం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తండ్రి నడుపుతున్న ట్రాక్టరే ఆ ముద్దుల పాపకు మృత్యుశకటమైంది. ఇంటి ముందున్న ట్రాక్టర్‌ను వెనక్కు తీస్తున్న క్రమంలో ఆడుతూ అక్కడికి వచ్చిన చిన్నారి వెనుక చక్రాల కింద పడి అసువులు బాసింది. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. కరీంనగర్ మండలం చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన జక్కు ప్రసాద్ ఇంటి ముందున్న తన ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తున్న సమయంలో ఆయన మూడేళ్ల కుమార్తె రితిక ట్రాక్టర్ చక్రాల కింద పడి నలిగిపోయింది. తల్లి అన్నం తినిపిస్తుండగా రితిక ఇంటి ముందు ఆడుకుంటోంది. గిన్నెలో అన్నం పూర్తికాగా మరింత పెట్టుకొని వచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలోనే తండ్రి ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తుండగా, రితిక ఆ వైపుగా వెళ్లి ట్రాక్టర్ కింద పడింది. అరుపులు విని ప్రసాద్ ట్రాక్టర్ ఆపి పాపను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు విడిచింది. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంబులెన్సు లేక ఆగిన ప్రాణం
రత్లామ్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సు లేకపోవడంతో తల్లిదండ్రులు బైక్‌పై తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే ఆ చిన్నారి ప్రాణాలుకోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. నంద్లేటా గ్రామానికి చెందిన ఘన్‌శ్యామ్ నాథ్, దీనాబాయి దంపతుల కుమార్తె జీజా(4)న్యూమోనియాతో తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను సైలానాలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం రత్లామ్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దినసరి కూలీ అయిన ఘనశ్యామ్ తన కుమార్తెను రత్లామ్‌కు తీసుకెళ్లేందుకు అంబులెన్సును ఇవ్వాల్సిందిగా కోరగా ఆరోగ్యకేంద్రం సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో స్నేహితుడి బైక్‌ను తెచ్చారు. ఆ స్నేహితుడు బైక్ నడుపుతుంటే జీజాను ఘనశ్యామ్, చిన్నారి చేతికి అమర్చిన సెలైన్‌ను భార్య పట్టుకున్నారు. ఇలా బైక్‌పై 30 కి.మీ దూరంలో ఉన్న రత్లామ్ ప్రభుత్వాసుపత్రికి చిన్నారిని తీసుకెళ్లారు. అక్కడ జీజాను పరీక్షించిన వైద్యులు ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించారు. -
ఈ చిరునవ్వులు.. ఇక కనిపించవు..
హైదరాబాద్: అప్పటివరకు అక్కతో ఆడుకున్నాడు.. స్కూల్లో బాలల దినోత్సవం కావడంతో అమ్మ అందంగా ముస్తాబు చేసింది.. నాన్న తీసుకెళ్లి పాఠశాల వద్ద వదిలివెళ్లాడు. ఆ తర్వాత ఏంజరిగిందో ఏమో.. చివరికి స్కూల్ ఆవరణలోని సంప్‌లో ఆ చిన్నారి శవమై తేలాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరం కావడంలేదు. ఈ హృదయవిదారక ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆర్కేనగర్ వీణా అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న అనిల్ కుమార్ వ్యాపారి. అతనికి భార్య విశాల, ఎనిమిదేళ్ల కూతురు అనన్య, రెండున్నరేళ్ల కుమారుడు శివ్రచిత్ ఉన్నారు. అనన్య స్థానిక ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. శివ్‌రచిత్‌ను విష్ణుపురి కాలనీలోని బచ్పన్ ప్లేస్కూల్లో నర్సరీలో చేర్పించారు. రోజూలాగే మంగళవారం ఉదయం అనిల్.. శివ్‌రచిత్‌ను పాఠశాల వద్ద స్కూల్ యాజమాన్యానికి అప్పగించి వ్యాపా రం నిమిత్తం వెళ్లాడు. బాలల దినోత్సవం కావడంతో 11.30కే తీసుకెళ్లాలని చెప్పడంతో అనిల్ భార్యకు సమాచారం అందించాడు. సంప్‌లో పడిఉన్న చిన్నారి.. ఉదయం 11.20 సమయంలో పాఠశాలకు వచ్చిన విశాలకు అబ్బాయి స్కూల్‌కు రాలేదని యాజమాన్యం చెప్పడంతో భర్తకు ఫోన్ చేసింది. తానే రచిత్‌ను స్కూల్ వద్ద వదిలిపెట్టానని అనిల్ చెప్పాడు. అనిల్ తన స్నేహితులకు సమాచారం అందించాడు. విశాల, అనిల్ స్నేహితులు స్కూల్ యాజమా న్యాన్ని నిలదీసింది. అదే సమయంలో ఏడుస్తూ వచ్చిన ఆయా సంప్ వద్దకు తీసుకెళ్లి చూపించగా.. అందులో పడివున్న రచిత్‌ను గమనించారు. హుటాహుటిన తార్నాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తూ యాజమాన్యం దిష్టిబొమ్మ దహనం చేశారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు తన కొడుకు మృతి చెందడానికి స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304ఏ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి చెప్పారు. కాగా, స్కూల్ డైరెక్టర్ రాఘవేంద్రరావు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు సంప్‌లో పడి విద్యార్థి మృతి చెందడంతో బుధవారం మల్కాజిగిరి పరిధిలోని అన్ని పాఠశాలల బంద్‌కు టీఎన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, టీఆర్ఎస్వీ, ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చాయి. యాజమా న్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా? సోమవారం మంచినీరు రావడంతో మంచినీటి సంపు మూత తెరచి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, యాజమాన్యం నిర్లక్ష్యమే రచిత్‌ను బలిగొన్నదని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్ ఉన్న ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. సంప్ నిండిందా లేదా అని చూసిన వాచ్మెన్.. దాని మూత పూర్తిగా మూయలేదని, దానిమీద కాలు వేయడం వల్లే చిన్నారి సంప్‌లో పడిఉండొచ్చని భావి స్తున్నారు. యాజమాన్యం వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారిం చామని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలి పారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు పాఠశాల మూసివేయడానికి గల అవకాశాలపై నివేదిక అందజేస్తామన్నారు. -
చాక్లెట్ కొనుక్కుందామని వెళ్లి..
హైదరాబాద్: చాక్లెట్ కోసం దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తున్న ఓ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కాటేసింది. అటుగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో రెండేళ్ల బాలుడు దుర్మరణం పాలైన ఘటన సరూర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నల్లగొండ జిల్లా శివన్నగూడాని కి చెందిన నగేశ్, మమత దంపతులు కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి కర్మన్‌ఘాట్ మాధవనగర్‌లో నివసిస్తున్నారు. నగేశ్ ఓ ప్రైవేటు కళాశాల బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి కుమారుడు జశ్వంత్ ఉన్నాడు. గురువారం సాయంత్రం ఇంటికి వచ్చిన మేనమామ కృష్ణయ్యతో కలసి ఇంటి ఎదురుగా ఉన్న దుకాణానికి వెళ్లి చాక్లెట్ కొనుక్కున్నాడు. జశ్వంత్ వెంట వస్తున్నాడో లేదో చూసుకోకుండానే కృష్ణయ్య రోడ్డు దాటి ముందుకు వచ్చాడు. దుకాణం నుంచి నడుచుకుం టూ వస్తున్న జశ్వంత్‌ను అటుగా వచ్చిన ఇండికా కారు (టీఎస్–07యూఎఫ్ 1947) ఢీ కొట్టడంతో జశ్వంత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాలుడిని అదే కారు లో చికిత్స నిమిత్తం సంతోష్ నగర్ డీఆర్డీఎల్ ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు ప్రాథమిక చికిత్స అందించకుండానే నిలోఫర్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అనంతరం జశ్వంత్ కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో కారు డ్రైవర్ తిరుపతి అక్కడినుంచి పరారయ్యాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించి కేసును నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రెండేళ్ల క్రితం కూతురు.. ఇప్పుడు కొడుకు నగేశ్ మమతలకు ఒక కూతురు, ఒక కొడుకు ఉండేవారు. రెండేళ్ల క్రితం గుండెకు రంధ్రం పడి కూతురు మృతి చెందింది. ఉన్న ఒక్క కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గురువారం జరిగిన కారు ప్రమాదంలో బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగారు. -
మరుగుతున్న పాలలో పడి చిన్నారి మృతి
చెన్నై: బేకరీలో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ మరుగుతున్న పాల పాత్రలో పడి మృతి చెందాడు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. హోసూర్‌లోని చినఎలసగిరికి చెందిన మురుగేష్ (30) బేకరీ నిర్వహిస్తుంటాడు. అతని కుమారుడు భవుస్యాకు మూడేళ్లు. ఆగస్టు 30వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో బేకరీలో ఆడుకుంటూ ఉన్న సమయంలో ఆ బాలుడు అనుకోకుండా పక్కనే ఉన్న మరుగుతున్న పాల పాత్రలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన భవుస్యాని చికిత్స కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. తరువాత మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి భవుస్యా ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
వారి నిర్లక్ష్యమే ప్రాణం తీసింది
గోదావరిలో స్నానం చేస్తూ మహిళ, బాలిక మృతి బంధువుల ఇంట విషాదం గోదావరిలో స్నానం.. వారిపాలిట మృత్యువైంది. ఇతర జిల్లాల నుంచి ఎవరు రాజమహేంద్రవరం వచ్చినా.. ఒక్కసారి గోదావరిలో స్నానం చేయకుండా వెళ్లరు. ఇలా బంధువుల ఇంటి శుభకార్యానికి వచ్చి.. బొబ్బర్లంక కాటన్ బ్యారెజ్ వద్ద స్నానం చేస్తూ ఇద్దరు మృత్యువాతపడ్డారు. - ఆత్రేయపురం (కొత్తపేట) గోదావరిలో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లి బుధవారం ఇద్దరు మృత్యవాత పడ్డారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లకం వద్ద కాటన్ బ్యారెజీ వద్ద జరిగిన ఈ సంఘటనలో కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టాభిపురానికి చెందిన తిరుపతి నాగమణి (40), తిరుపతి మానస (12) మృత్యవాతపడ్డారు. హెడ్ వర్క్సు అధికారులు ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహనికి నాగమణి అక్కడిక్కడే మృతి చెందింది. కాగా మానసను వారి బందువులు ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. మృతులు నాగమణి, మానస రాజమహేంద్రవరం రూరల్ మండలం హకుంపేటలో తమ బందువుల ఇంట జరిగే శుభకార్యానికి ఈ నెల 21న వచ్చారు. ఈ నేపథ్యంలో తమ బందువులు 16 మందితో కలిసి బొబ్బర్లంక కాటన్ బ్యారేజీ వద్దకు గోదావరిలో స్నానం చేసేందుకు వచ్చారు. ముందుగా నాగమణి మానస స్నానం చేస్తుండగా బ్యారేజీ వద్ద 69, 70 గేట్లను హెడ్‌వర్క్సు అధికారులు ఒక్కసారిగా ఎత్తివేయడంతో వీరు నీట మునిగి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం బ్యారేజీకి దిగువ భాగంలో సుమారు 10 అడుగుల లోతు నీరు ఉండటంతో అనేక మంది స్నానం చేస్తుంటారు. అయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గోదావరి హెడ్‌వర్క్స్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో అనేక మంది మృత్యవాత పడుతున్నారు. 2001-2002 ఎటుంటి జాగ్రత్తులు తీసుకోకుండా, ముందస్తు సమాచారం లేకుండా గేట్లు ఎత్తివేయడంతో గోదావరిలో స్నానానికి వెళ్లిన 33 మంది మృతి చెందారు. అయినా అ«ధికారులు నిర్లక్ష్యం వీడలేదు. ఇటీవల ఇటువంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఇద్దరు మృత్యువాత పడ్డారంటే అధికారుల నిర్లక్ష్యమే కారణమని బందువులు ఆరోపిస్తున్నారు. బ్యారేజీపై నుంచి చూస్తే కనిపిస్తారు బ్యారేజీపై నుంచి చూస్తే సమీపంలో స్నానం చేసేవారు కనిపిస్తారు. ఎవరైనా విహర యాత్రకు వచ్చి గోదావరిలో స్నానం చేస్తున్నారా అజాగ్రత్తగా ఉన్నారా అనే విషయాన్ని కానీ హెడ్‌వర్క్సు అధికారులు పట్టించుకోకుండా గేట్లు ఎత్తివేయడాన్ని స్థానికులు, మృతుల బందువులు తప్పు పడుతున్నారు. గేట్లు ఎత్తివేసిన వెంటనే గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ నీటిలో కొట్టుకుపోయి ఇద్దరు మృత్యవాత పడారు. గేట్లు ఎత్తి వేయాల్సి వస్తే హెచ్చరికగా సైరన్ మోగించడం, లేదా టాంటాం వేయించడం చేయాలి. సమీపంలో ఎవరూ లేరని తెలుసుకుని లేదా రాత్రి గాని గేట్లు ఎత్తి వేయాలి. ఇవేమి పాటించకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.