అనంతపురం : తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారుతున్నాయి. ఉదయం పది గంటలకే వడగాల్పులు పంజా విసురుతున్నాయి. చిన్నారులు, వృద్థులు వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు.
తాజాగా అనంతపురం జిల్లాలో వడదెబ్బకు ఓ కోచింగ్ సెంటర్లో చిన్నారి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పరిగి మండలం కొడిగనహల్లిలో పద్మసాయి కోచింగ్ సెంటర్లో నిఖిత అనే విద్యార్థిని వడదెబ్బకు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే చిన్నారి నిఖితను ఆస్పత్రికి తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందింది. సమాచారం అందుకున్న ఆర్డీవో కోచింగ్ సెంటర్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా కోచింగ్ సెంటర్ను మూసివేయించారు. వడదెబ్బ కారణంగా చిన్నారి మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో విషాదం
Published Thu, Mar 24 2016 5:58 PM | Last Updated on Fri, Jun 1 2018 9:20 PM
Advertisement
Advertisement