కలుషిత భోజనం తిని ఆస్పత్రి పాలైన 12 మంది విద్యార్థుల్లో ఓ బాలిక మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగినహళ్లిలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న పద్మసాయి కోచింగ్ సెంటర్ ఏపీఆర్జేసీ పరీక్ష కోసం 85 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అందులో నిఖిత(8) అనే విద్యార్థిని మృతిచెందింది. కాగా.. నిర్వాహకులు మాత్రం వడ దెబ్బ వల్లే విద్యార్థిని మృతిచెందిందని అంటున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
కలుషిత ఆహారం తిని విద్యార్థిని మృతి
Published Thu, Mar 24 2016 1:17 PM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM
Advertisement