nikhitha
-
భవనం పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లి చేసుకొని ఏడాదిన్నర తిరగక ముందే.. భర్త మానిసిక, శారీరక వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువతి నిఖిత(21)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తెరపై నిఖిత...అశ్శరభ శరభ
హీరోయిన్ నిఖిత తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. గతంలో పలు సినిమాల్లో నటించిన ఈ పంజాబీ బ్యూటీ ‘అవును-2’, ‘టై’ సినిమాలతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ పాత్రలతో పాటు ఐటమ్ సాంగులకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గత ఏడాది విశాల్ ‘జయసూర్య’లో ఐటమ్ గాళ్‌గా తళుక్కుమన్నారు. ‘కాళిదాసు’లోనూ ఐటమ్ సాంగ్ చేశారు. ఇప్పుడు మరోసారి ఐటమ్ గాళ్‌గా కనిపించనున్నారు. ప్రేక్షకులకు కొత్త ఊపుతేనున్నారు. ఆకాశ్ సహదేవ్, మిస్తీ చక్రవర్తి జంటగా ఎన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం ‘శరభ’. సోషియో - ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిత ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘కోటిగారు మాంచి మాస్ బీట్ కంపోజ్ చేశారు. బాబా భాస్కర్ నృత్యరీతులు సమకూరుస్తున్న ఈ సాంగ్‌లో యాభై మంది డ్యాన్సర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు’’ అన్నారు. జయప్రద, నెపోలియన్, నాజర్, శాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమేరా: రమణ సాల్వ, సంగీతం: కోటి, సహ నిర్మాత: సురేశ్ కపాడియా. -
అనంతపురం జిల్లాలో విషాదం
అనంతపురం : తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారుతున్నాయి. ఉదయం పది గంటలకే వడగాల్పులు పంజా విసురుతున్నాయి. చిన్నారులు, వృద్థులు వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో వడదెబ్బకు ఓ కోచింగ్ సెంటర్లో చిన్నారి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పరిగి మండలం కొడిగనహల్లిలో పద్మసాయి కోచింగ్ సెంటర్లో నిఖిత అనే విద్యార్థిని వడదెబ్బకు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే చిన్నారి నిఖితను ఆస్పత్రికి తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందింది. సమాచారం అందుకున్న ఆర్డీవో కోచింగ్ సెంటర్‌ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా కోచింగ్ సెంటర్‌ను మూసివేయించారు. వడదెబ్బ కారణంగా చిన్నారి మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. -
కలుషిత ఆహారం తిని విద్యార్థిని మృతి
కలుషిత భోజనం తిని ఆస్పత్రి పాలైన 12 మంది విద్యార్థుల్లో ఓ బాలిక మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగినహళ్లిలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న పద్మసాయి కోచింగ్ సెంటర్ ఏపీఆర్జేసీ పరీక్ష కోసం 85 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అందులో నిఖిత(8) అనే విద్యార్థిని మృతిచెందింది. కాగా.. నిర్వాహకులు మాత్రం వడ దెబ్బ వల్లే విద్యార్థిని మృతిచెందిందని అంటున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.