తెరపై నిఖిత...అశ్శరభ శరభ | Nikhitha Item Song in Visual Wonder Sarabha | Sakshi
Sakshi News home page

తెరపై నిఖిత...అశ్శరభ శరభ

Published Tue, Aug 30 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

తెరపై నిఖిత...అశ్శరభ శరభ

తెరపై నిఖిత...అశ్శరభ శరభ

హీరోయిన్ నిఖిత తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. గతంలో పలు సినిమాల్లో నటించిన ఈ పంజాబీ బ్యూటీ ‘అవును-2’, ‘టై’ సినిమాలతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ పాత్రలతో పాటు ఐటమ్ సాంగులకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గత ఏడాది విశాల్ ‘జయసూర్య’లో ఐటమ్ గాళ్‌గా తళుక్కుమన్నారు. ‘కాళిదాసు’లోనూ ఐటమ్ సాంగ్ చేశారు.
 
ఇప్పుడు మరోసారి ఐటమ్ గాళ్‌గా కనిపించనున్నారు. ప్రేక్షకులకు కొత్త ఊపుతేనున్నారు. ఆకాశ్ సహదేవ్, మిస్తీ చక్రవర్తి జంటగా ఎన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం ‘శరభ’. సోషియో - ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిత ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘కోటిగారు మాంచి మాస్ బీట్ కంపోజ్ చేశారు.
 
  బాబా భాస్కర్ నృత్యరీతులు సమకూరుస్తున్న ఈ సాంగ్‌లో యాభై మంది డ్యాన్సర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు’’ అన్నారు. జయప్రద, నెపోలియన్, నాజర్, శాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమేరా: రమణ సాల్వ, సంగీతం: కోటి, సహ నిర్మాత: సురేశ్ కపాడియా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement